రాధిక శరత్‌కుమార్‌ డిఫరెంట్‌ రోల్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్ | Radhika Latest Movie Thaai Kizhavi Official Trailer Out now | Sakshi
Sakshi News home page

Thaai Kizhavi Official Trailer: రాధిక శరత్‌కుమార్‌ తాయ్ కిజవి.. ఆసక్తిగా ట్రైలర్

Feb 23 2026 6:55 PM | Updated on Feb 23 2026 7:17 PM

Radhika Latest Movie Thaai Kizhavi Official Trailer Out now

సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం తాయ్ కిజవి. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడు కనిపించని లుక్‌లో రాధికా కనిపించనుంది. ఈ సినిమాకు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని హీరో శివ కార్తికేయన్‌ నిర్మించారు. 

ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్ వృద్ధురాలిగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ప్రస్తుతానికి కేవలం తమిళంలోనే రిలీజ్ కానుంది. తెలుగులోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేసే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రంలో సింగమ్‌ పులి, అరుళ్‌ దాస్‌, బాల శరవణన్‌, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement