ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. అధికారిక ప్రకటన | Om Shanti Shanti Shantihi Movie OTT Streaming Update | Sakshi
Sakshi News home page

OTT: మలయాళ హిట్ మూవీ తెలుగు రీమేక్.. ఓటీటీ స్ట్రీమింగ్ అప్‌డేట్

Feb 23 2026 5:34 PM | Updated on Feb 23 2026 5:44 PM

Om Shanti Shanti Shantihi Movie OTT Streaming Update

ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. దాదాపు ప్రతి భాషకు చెందిన సినిమాలని డబ్బింగ్ రూపంలో తెలుగులో రిలీజ్ చేసేస్తున్నారు. అలాంటిది ఈ కాలంలోనూ రీమేక్ చేస్తున్నారంటే సాహసమనే చెప్పొచ్చు. ఆ సాహసం చేసి తీసిన చిత్రమే 'ఓం శాంతి శాంతి శాంతిః'. థియేటర్లలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. పోస్టర్ కూడా వదిలారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

దర్శకుడు తరుణ్ భాస్కర్ అప్పుడప్పుడు నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. అలా హీరోగా చేసిన మూవీ 'ఓం శాంతి శాంతి శాంతిః'. ఈషా రెబ్బా హీరోయిన్. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. 2022లో మలయాళంలో వచ్చిన 'జయ జయ జయహే' చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ చిత్రాన్నే తెలుగు డబ్బింగ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. అయినా సరే ఈ సినిమా నిర్మాతలు సాహసం చేశారు. కానీ అది బెడిసికొట్టింది.

ఒరిజినల్ సినిమా నుంచి సీన్ టూ సీన్ దింపేశారు. కాస్త నేటివిటీ మార్చినప్పటికీ మరీ స్టార్ కాస్టింగ్ లేకపోవడంతో జనాలు దీన్ని చూసేందుకు పెద్దగా థియేటర్లలోకి రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు మార్చి 4 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ కోసం ఒకరోజు ముందే అందుబాటులోకి రానుంది.

'ఓం శాంతి శాంతి శాంతిః' విషయానికొస్తే.. మంచిగా చదువుకుని ఉద్యోగం చేయాలనుకునే మధ్యతరగతి అమ్మాయి ప్రశాంతి(ఈషా రెబ్బా). కాలేజీలో జరిగిన ఓ సంఘటన వల్ల చదువు ఆపేసి ఈమెని ఓంకార్ నాయుడు(తరుణ్ భాస్కర్) అనే చేపల వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వివాహం తర్వాత కూడా చదువుకోవచ్చనే ఆలోచనతో కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కానీ అత్తారింట్లో ఊహించనివి జరుగుతాయి. భర్త తన అహంకారాన్ని, కోపాన్ని ఈమెపై చూపిస్తుంటాడు. ప్రతిసారీ చెంపపగలగొట్టేస్తుంటాడు. ఓ రోజు కోపం పట్టలేక ప్రశాంతి, భర్తకు ఎదురుతిరుగుతుంది. భర్తని కుక్కని కొట్టినట్లు కొడుతుంది. తర్వాత ఏమైంది? భార్యభర్తలిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 8 ఏళ్ల తర్వాత గడ్డం తీసేసిన 'కేజీఎఫ్' యష్.. ఇలా ఉన్నాడేంటి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement