8 ఏళ్ల తర్వాత తీసేశాడు.. ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా? | KGF Actor Yash Clean Shave New Look Stuns Fans Ahead Of His Comeback Movie Toxic Release, Video Went Viral | Sakshi
Sakshi News home page

Guess The Actor: ఏఐ కాదు నిజంగానే లుక్ మారింది.. వీడియో వైరల్

Feb 23 2026 3:44 PM | Updated on Feb 23 2026 4:06 PM

Yash Clean Shave Look And Toxic Movie News

పాన్ ఇండియా ట్రెండ్ కలిసొచ్చిన హీరోల్లో ఇతడు ఒకడు. చేసింది రెండే సినిమాలు అయినా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇతడికి అభిమానులయ్యారు. 2022లో చివరగా పలకరించిన ఈ హీరో.. దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఓ మూవీతో థియేటర్లలోకి రాబోతున్నాడు. అయితే గత 8-9 ఏళ్లుగా ఒకే లుక్ మెంటైన్ చేస్తూ వచ్చిన ఇతడు.. ఎట్టకేలకు కొత్తగా కనిపించాడు. మరి ఇతడెవరో గుర్తుపట్టారా?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

పైన కనిపిస్తున్నది 'కేజీఎఫ్' ఫేమ్ యష్. సడన్‌గా చూస్తే మీరు గుర్తుపట్టలేకపోవచ్చు. ఎందుకంటే 'కేజీఎఫ్' సినిమాల కోసం చాలా గడ్డం పెంచేసిన ఇతడు.. దాన్ని అలానే ఉంచేశాడు. తర్వాత 'టాక్సిక్' మూవీ చేసినప్పటికీ అందులో గడ్డం లుక్‌తోనే ఓ పాత్ర ఉంది. ఇది కాకుండా మరో రోల్‌‌లో క్లీన్ షేవ్‌తో కనిపించాడు. కొన్నిరోజుల క్రితం వచ్చిన టీజర్ చివరలో కనిపించి కనిపించకుండా లుక్ చూపించారు. దాన్ని ఏఐతో క్రియేట్ చేశారని చాలామంది కామెంట్స్ చేశారు.

ఆ ట్రోల్స్‌పై క్లారిటీ ఇచ్చిన స్టైలిష్ట్.. యష్ క్లీన్ షేవ్ లుక్ వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. 'నమ్మకం నిజమైనది అయినప్పుడు.. పనే మాట్లాడుతుంది' అని సదరు హెయిర్ స్టైలిష్ట్ క్యాప్షన్ పెట్టాడు. అయితే ఇన్నాళ్లు గడ్డంతోనే యష్‌ని చూసిన ఫ్యాన్.. ఈ లుక్ చూసి గుర్తుపట్టలేకపోతున్నారు. వాళ్లకు ఈ యష్.. ఎవరో కొత్త వ్యక్తిలా కనిపిస్తుండటం విశేషం.

'టాక్సిక్' విషయానికొస్తే 1970ల్లో గోవా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దీన్ని తీసింది. నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, హ్యుమా ఖురేషి తదితరులు హీరోయిన్లుగా నటించారు. మార్చి 19న ఇది పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. టీజర్ రిలీజ్ తర్వాత యష్ సొంత భాషలో పెద్దగా సౌండ్ లేదు. తెలుగులోనే కాస్తంత ఎక్కువ హడావుడి కనిపిస్తోంది. దానికి తోడు.. మార్చి 19నే 'ధురంధర్ 2' రిలీజ్ కానుంది. యష్ మూవీతో పోలిస్తే దీనిపైనే ఎక్కువ హైప్ ఉంది.

(ఇదీ చదవండి: అన్న అని పిలవను.. రాజీవ్ కనకాల నాకు బావ!: గాయత్రి భార్గవి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement