చిల్లిగవ్వ లేక తిండి లేక.. ప్రతిరోజూ ఏడ్చేవాడిని: నటుడు | FIR Actor Aamir Ali Opens Up About His Struggles Fro Financial Hardships To TV Fame, Reveals How He Cried In His Van Every Day | Sakshi
Sakshi News home page

ఆగిపోయిన సినిమాలు.. తినడానికి తిండి లేక టీవీ..: నటుడు

Feb 23 2026 3:09 PM | Updated on Feb 23 2026 3:46 PM

FIR Actor Aamir Ali reveals He Cried in his Van Every Day

ఒకప్పుడు తినడానికి తిండి లేక ఎన్నో కష్టాలు చూశానంటున్నాడు బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ అలీ. ఎఫ్‌ఐఆర్‌ అనే టీవీ సీరియల్‌ ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న అతడు నాలుగైదు హిందీ సినిమాల్లోనూ తళుక్కుమని మెరిశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువు పెట్టాడు.

నా పని అయిపోయిందనుకున్నా
అతడు మాట్లాడుతూ.. నేను టీవీలో ఫస్ట్‌ సీరియల్‌ చేసినప్పుడు అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే నాకు బుల్లితెరపై కనిపించాలని లేదు. టీవీలో కనిపిస్తే సినిమా యాక్టర్‌గా నా పనైపోయినట్లేనని నా అభిప్రాయం. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికే కొన్ని సినిమాలు చేశాను.. కానీ, అవి రిలీజ్‌ కాకుండానే ఆగిపోయాయి. దాంతో నాకివ్వాల్సిన డబ్బులు కూడా పూర్తిగా రాలేవు. 

చేతిలో చిల్లిగవ్వ లేక..
ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తినడానికి తిండి లేక, ఫుడ్‌ కొనుక్కోవడానికి సరిగా డబ్బు కూడా ఉండేది కాదు. ఇంటి బాధ్యత మొత్తం నాపైనే ఉంది. అప్పటికే నేను రెండు మూడు సినిమాలు చేయడంతో ఇక్కడ కెరీర్‌ సెట్టయిందన్న భావనతో ఉన్న ఉద్యోగం కూడా వదిలేశాను. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో అయిష్టంగా టీవీ ఇండస్ట్రీకి వెళ్లాల్సి వచ్చింది. 

సీరియల్స్‌ ఎందుకు అనగానే..
అప్పుడు ప్రతిరోజు నేను నా వ్యాన్‌లో కూర్చుని ఏడ్చేవాడిని. నాతో సినిమాలు చేసినవారందరూ ఎందుకు సీరియల్స్‌ చేస్తున్నావని అడగ్గానే దుఃఖం తన్నుకొచ్చేది. అరగంటపాటు ఆపకుండా ఏడ్చేవాడిని. 2019లో చాలామంది దర్శకనిర్మాతలను కలిశాను. నువ్వు హీరోవి, నిన్ను సైడ్‌ క్యారెక్టర్స్‌లో ఎలా చూస్తారు? 

ఇప్పటికీ ఇబ్బందులే..
ఒకవేళ అలాంటి పాత్ర ఏదైనా ఉంటే చెప్తాం అంటూ మాట దాటేసేవారు. 2017లో టీవీ ఇండస్ట్రీని వదిలేసినప్పటికీ నాపై బుల్లితెర నటుడు అనే ముద్ర అలాగే ఉండిపోయింది. అంత ఈజీగా నాకెవరూ అవకాశాలివ్వరు అని ఆమిర్‌ అలీ చెప్పుకొచ్చాడు. ఆమిర్‌ అలీ.. ఐ హేట్‌ లవ్‌ స్టోరీస్‌, ఫరాజ్‌ వంటి చిత్రాల్లో నటించాడు.

చదవండి: బుల్బుల్‌ తర్వాతే క్రేజ్‌.. యానిమల్‌తో సెన్సేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement