స్నేహ, ప్రసన్నల మైండ్‌ఫుల్‌ పేరెంటింగ్‌ మంత్ర! | Actors Sneha And Prasanna Said Raising Grounded Kids With Love Balance, Shares Their Mindful Parenting Approach | Sakshi
Sakshi News home page

Actress Sneha and Prasanna: మైండ్‌ఫుల్‌ పేరెంటింగ్‌ మంత్ర!

Feb 20 2026 1:46 PM | Updated on Feb 20 2026 1:54 PM

Actors Sneha And Prasanna Said Raising Grounded Kids wiht love balance

టాలీవుడ్‌ నటి స్నేహ, తమిళ నటుడు ప్రసన్న వేంకటేశన్‌ దంపతులు 2012లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వారికి కుమారుడు విహాన్‌, కూతురు ఆధ్యంత అనే ఇద్దరు పిల్లలు. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే ఈ ఇద్దరు పిల్లలు పెంపక విషయంలో అత్యంత కేరింగ్‌ తీసుకుంటారు. 

ఎంత బిజీగా ఉన్నా..కుటుంబానికే మొదటి ప్రాధాన్యత అని, తల్లిదండ్రులుగా వాళ్లతో గడిపేందుకే ఇష్టపడతామని ఈ దంపతులు పలు ఇంటర్వ్యూల్లో తరుచుగా చెబుతుంటారు. అయితే ఈ జంట పిల్లల పెంపకం విషయంలో మైండ్‌ఫుల్‌ పేరెంటింగ్‌కే ప్రాధాన్యత ఇస్తారట. సెలబ్రిటీ పిల్లలు అనే భావన దరిచేరనీకుండా.. సాధారణ పిల్లలు మాదిరిగానే పెంచుతాం గానీ..అది అత్యంత మైండ్‌ఫుల్‌గా ఉండాలంటున్నారు ఈ దంపతులు. అదెలాగంటే..

పిల్లలకు తమ తల్లిదండ్రులు సంరక్షణలోనే ఉన్నాం అనే ఫీల్‌ కలిగేలా పెంచాలి. అంటే తల్లిదండ్రలుకు పిల్లలకు మధ్య దూరం రాకూడదు. అంటే బాధ్యతలు, ఉద్యోగాల పరంగానైనా సరే, తల్లిదండ్రుల సాన్నిహిత్యం దూరం కాకుడదట. కలిసి భోజనం చేయడం, వారితో కలిసి ఆడుకోవడం, కథలు చెప్పడం వంటివి అన్ని కూడా ఉండాలి. అలాగే మనపిల్లలు అన్నివేళలా ప్రతిదాంట్లో టాలెంటెడ్‌గా ఉండాలని ఆశించొద్దంటున్నారు ఈ దంపతులు. 

వారి సామర్థ్యాలకు అనుగుణంగా సాధ్యమైనది చేయనివ్వండి. అభినందిస్తూ..మరింత ుముందుకు లక్ష్యం చేరుకోవడం ఎలాగో మార్గనిర్దేశం ఇచ్చేలా ప్రోత్సహించండి. ఒకవేళ్ల సక్సెస్‌ కాకపోతే..దాన్ని అధిగమించడం ఎలాగో వివరించండి తప్ప..భయపెట్టొద్దు. ఆందోళన, ఒత్తిడిలను హ్యాండిల్‌ చేయగలిగేలా చేయండి. ముఖ్యంగా వారితో స్నేహపూర్వకంగా మెలగండి. 

ఏ విషయమైన నిర్భయంగా చెప్పగలిగే స్వేచ్ఛను ఇవ్వండంటున్నారు. ఎప్పటికీ పిల్లలు దృష్టిలో తల్లిదండ్రులే తమ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అనేలా బాండింగ్‌ ఉంటే..కుటుంబ వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో విలువలు నేర్పించాల్సిన బాధ్యత కూడా మనదేనని నొక్కి చెప్పారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement