Shikhar&Sophie టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, ప్రియురాలు సోఫీ షైన్ (Sophie Shine) పెళ్లి సందడి మొదలైంది. అయేషా ముఖర్జీతో విడాకుల తరువాత ధావన్ తన జీవితంలో మరో కీలక అడుగు వేయబోత్తున్నాడు.
భారత క్రికెట్ జట్టులో తనదైన శైలిలోబ్యాటింగ్ చేస్తూ ‘గబ్బర్’గా పాపులర్ శిఖర్ ధావన్, వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు.
తన ప్రేయసి సోఫీ షైన్ (ఐరిష్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్)తో కలిసి ఏడడుగులు వేసేందుకు ఆయన సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 19 గురువారం ధావన్ తన సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
దీంతో ఇవి నెట్టింట సందడిగా మారాయి. అభినందనల వెల్లువ కురుస్తోంది.


