మలయాళ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సౌబిన్ షాహిర్.. గతేడాది వచ్చిన 'కూలీ'తో మిగతా దక్షిణాది ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక మూవీ చేస్తూనే ఉంటాడు. అలా ఇతడి పోలీస్ కానిస్టేబుల్‌గా చేసిన ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. దాదాపు నాలుగు నెలల తర్వాత స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి వస్తుంది?
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)
2000-10 మధ్య హీరోయిన్‌గా ఫేమస్ అయిన నవ్య నాయర్ తర్వాత అప్పుడో ఇప్పుడో అన్నట్లు ఒకటి రెండు సినిమాలు చేస్తూ వస్తోంది. ఈమె, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలు చేసిన మలయాళ సినిమా 'పాతిరాత్రి'. ఈ టైటిల్‌కి అర్థరాత్రి అని అర్థం. గతేడాది అక్టోబరు 17న థియేటర్లలో రిలీజైంది. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం చాన్నాళ్ల తర్వాత అంటే ఈ శుక్రవారం(ఫిబ్రవరి 20) నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.
'పాతిరాత్రి' విషయానికొస్తే.. ఝాన్సీ కురియన్(నవ్వ నాయర్) ఎస్సై. హరీష్(సౌబిన్ షాహిర్) ఓ కానిస్టేబుల్. ఓ రోజు రాత్రి గస్తీలో ఉన్నప్పుడు ఓ అనుమానాస్పద వ్యక్తిని వెంబడిస్తారు. తర్వాత అతడు అదృశ్యమవుతాడు. తర్వాత రోజు అతడి మృతదేహం దొరుకుతుంది. దీంతో పోలీసులిద్దరూ నిందితులు అవుతారు. తర్వాత ఏమైంది? ఇంతకీ ఆ వ్యక్తిని హత్య చేసింది ఎవరు? అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)


