Krishna
-
అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రధాని మోదీ కృషి
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ పేర్కొన్నారు. బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని దళితుల ఆత్మగౌరవ గుండె చప్పుడు పేరుతో డప్పు కళాకారులు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆదివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద మంత్రి సత్యకుమార్ యాదవ్, మాధవ్ లాంఛనంగా ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఎంజీ రోడ్డులో పీవీపీ మాల్ వరకూ వచ్చి, తిరిగి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్, పి.వి.ఎన్.మాధవ్ మీడియాతో మాట్లాడుతూ దళిత యువతలో ఆత్మవిశ్వాసం, సాంస్కృతిక చైతన్యం నింపేందుకే ఈ ప్రదర్శన నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 17 వేల గ్రామాల్లో చాటింపు పోస్ట్‌లు భర్తీ చేయాలని, దేవాలయాల్లో, లలిత కళాశాలల్లో డప్పు కళాకారుల పోస్ట్‌లు భర్తీ చేయాలన్నారు. బీజేపీ నేతలు పాల్గొన్నారు. ‘దళితుల ఆత్మగౌరవ గుండెచప్పుడు’లో మంత్రి సత్యకుమార్ యాదవ్ -
నేడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 18న సోమవారం ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు బాపూ మ్యూజియంలో ఏర్పాట్లు చేశారు. చరిత్ర, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ ప్రాధాన్యతను నేటి తరానికి తెలియజేసేలా వివిధ కార్యక్రమాలను రూపొందించారు. పురాతన కళాఖండాలు, చారిత్రక వస్తువులు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. బాపూ మ్యూజియంలో ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. బాపూ మ్యూజియం వేదికగా కార్యక్రమాలు -
ఇంధన పొదుపు అందరి బాధ్యత
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఇందన పొదుపు అందరి బాధ్యతని దీనికి ఈవీ వాహనాలు వినియోగించాలని ఏపీసీడీసీఎల్ ఎన్టీఆర్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఉప్పలపాటి హనుమయ్య సూచించారు. ఏపీసీడీసీఎల్ సీఎండీ ఆదేశాల ప్రకారం ఇంధన పొదుపులో భాగంగా హనుమయ్య, డివిజన్ ఈఈ కావేటి కొండలరావు, డెప్యూటీ ఈఈ పుప్పాల శ్రీధర్, సూర్యారావుపేట సెక్షన్ ఏఈ బొడ్డపాటి వెంకట్రావుతో కలసి ఈవీ ద్విచక్రవాహనాలు, సైకిల్‌పై వచ్చి మాచవరం విద్యుత్ సబ్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పొదుపు చేయడంతో పాటు వాడకం తగ్గించడానికి సూర్యఘర్ పథకం కింద విద్యుత్ వినియోగదారులు సోలార్ కనెక్షన్స్ తీసుకోవాలని సూచించారు. సూర్యఘర్‌తో ప్రభుత్వం రూ. 78 వేలు రాయితీ ఇస్తుందని..ఎస్సీ, ఎస్టీలకు సోలార్ కనెక్షన్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని ఈ సదుపాయంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మాచవరం విద్యుత్ సబ్‌స్టేషన్ సిబ్బందికి సూచనలు చేశారు. ఇన్స్పెక్షన్ అనంతరం తిరిగి సర్కిల్ కార్యాలయానికి ఈవీ ద్విచక్రవాహనాలు, సైకిల్ మీద వెళ్లారు. -
కంటి సంరక్షణపై అవగాహన పెంచుకోవాలి
ఏపీ డప్పు కళాకారుల సంఘం నేతలు మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): డప్పు కళాకారులు, చర్మకారుల గురించి మాట్లాడే నైతికత బీజేపీకి లేదని డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ ఆనంద్ బాబు, ప్రధాన కార్యదర్శి గుండిమెడ క్రాంతి కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం డప్పు కళాకారుల న్యాయమైన డిమాండ్ల పరిష్కరించకుండా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి ఉత్సవాల పేరుతో డప్పుల కళాకారులతో ప్రదర్శన చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. డప్పు కళాకారులకు కొత్త పెన్షన్ల నమోదు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని, పింఛన్‌ను రూ.7 వేలకు పెంచి అర్హులైన వారందరికీ పింఛన్ ఇవ్వాలని కోరారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంలో డప్పు కళాకారులకు భాగస్వామ్యం కల్పించాలని, అన్ని జిల్లాల్లో డప్పు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ, రైల్వే రవాణా చార్జీల్లో రాయితీ, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని బీజేపీ నాయకులను కోరారు. ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ తాడేపల్లి రూరల్: యువతలో క్రీడా స్ఫూర్తి పెరగాలని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. ఆదివారం తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బ్రో–క్రికెట్ ముద్దు బ్రో అనే నినాదంతో క్రీడలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో సుమారు 40 వేల ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఒత్తిడిని అధిగమించడానికి, విజయాలను సాధించడానికి క్రీడలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు. టోర్నమెంట్లో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ కె.నగేష్‌బాబు, డీఎస్పీ ఏపీ పోలీస్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎ.శాంతిరాజు, శ్వాస ఆర్గనైజేషన్ ప్రతినిధి డాక్టర్ అనిత జ్యోతి పాల్గొన్నారు. -
క్యూలైన్లు కిటకిట
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్ర కీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఎండల తీవ్రత రోజు రోజుకు అధికం కావడంతో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో రద్దీ అధికంగా కనిపిస్తోంది. ఘాట్‌రోడ్డుతో పాటు, మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా విచ్చేసిన భక్తులు రూ.300, రూ.100 టికెట్లతో పాటు సర్వ దర్శనం క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రూ.500 టికెట్ల విక్రయాలు నిలిపివేయడం ద్వారా దేవస్థాన అంతరాలయ దర్శనం నిలిపివేసి బంగారు వాకిలి ద్వారా దర్శనానికి అనుమతించారు. దుర్గమ్మ సన్నిధికి కొనసాగుతున్న రద్దీ -
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2026చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) ను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. మీకోసం కాల్ సెంటర్(1100)కు కాల్ చేసి కూడా అర్జీ నమోదుతో పాటు దాని స్థితిని తెలుసుకోవచ్చన్నారు. 7పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారిని ఆదివారం తెలంగాణ ఎంపీ, బీఆర్ఎస్ పార్ల మెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వడ్డిరాజు రవిచంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.పెనుగంచిప్రోలు: స్థానిక తిరుపతమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
తోడేళ్లు!
పామర్రు మండలం బోయినవారిపాలెంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు కృత్తివెన్ను మండలం జాతీయ రహదారిపై ట్రాక్టర్ల ద్వారా తరలిపోతున్న మట్టి సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చెరువులను ఇష్టారాజ్యంగా చెరపడుతోంది. నియోజకవర్గాల్లోని టీడీపీ నేతల అండతో ఎటువంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతూ కోట్ల రూపాయలను దండుకుంటోంది. ముఖ్యంగా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో దందా మూడు పొక్లయిన్లు.. ఆరు లారీలు అన్న చందంగా సాగిపోతోంది. పామర్రులో యథేచ్ఛగా.. స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఇక్కడి చెరువులపై ‘పచ్చ’గద్దలు వాలిపోయాయి. రూ.10కోట్లపైగా ఇప్పటికే మట్టి దోపిడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ దందా అంతా నియోజకవర్గంలోని ఓ లంబోదర నేత, మట్టి తోలకాల్లో ‘ప్రావీణ్యం’ కలిగిన మరో నేత, సురేష్ అనే వ్యక్తుల కనుసన్నల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక ప్రజా ప్రతినిధి, దోపిడీలో ఆరితేరిన ఈ ముగ్గురు నేతల ఒత్తిడితో రెవెన్యూ, పోలీసులు సైతం తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా మామూళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రజా అవసరాల పేరుతో.. ● ప్రజా అవసరాలు, పూడికతీత పేరుతో చెరువులను చెరబడుతున్నారు. కనుమూరు నేషనల్ హైవే పక్కన చెరువులో ఆరు రోజుల నుంచి యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. ● రోజుకు 1500కు పైగా ట్రాక్టర్లు, లారీల్లో మట్టి తరలించి, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇటుక రాయి, పరిశ్రమకు తరలిస్తున్నారు. ● ఈ ముగ్గురు నేతల త్రయంతో పాటు, స్థానిక నేతలు కలిసి ఇక్కడ ట్రాక్టర్లు మట్టికి రూ.1000, లారీకి రూ.3000 వసూలు చేస్తున్నారు. ● పసుమర్రు గ్రామం బోగిరెడ్డిపల్లె, రిమ్మనపూడి చెరువుల్లో మూడు రోజులుగా జరుగుతున్న మట్టి తవ్వకాల్లో 1000కి పైగా ట్రాక్టర్ల మట్టిని బయటికి తరలించి, జేబులు నింపుకున్నారు. ● పామర్రు–గుడ్లవల్లేరు రహదారిలో ఉన్న బోయినవారిపాలెంలోని 12 ఎకరాల చెరువులో గ్రామ అవసరాల పేరుతో అనుమతులు తీసుకొని, పొక్లయిన్లు ఏర్పాటు చేసి, పెద్ద పెద్ద లారీలతో రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. ఈ చెరువులో మట్టి తవ్వుకొనేందుకు రూ.3కోట్లు తీసుకొని ఓ వ్యక్తికి కాంట్రాక్టు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ● పామర్రు, బోగిరెడ్డిపల్లె, దేవానందపురంలలో పంట బోదులను సైతం అక్రమార్కు లు వదలకుండా మట్టి తవ్వి ఇసుక రాయి, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ మండలంలో కాలువ గట్లను సైతం వదలటం లేదు. క్రోసూరులో కాలువ గట్లను తవ్వుతున్నారని సాక్షాత్తూ నీటి పారుదల శాఖ ఏఈ రమేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వరద వస్తే ఐనపూడి చానల్‌పైన వేలాది ఎకరాల పంట పొలాలు మునుగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు చిన్న ముత్తేవిలో సైతం అక్రమ మట్టి తవ్వకాల దందా సాగుతోంది. పమిడిముక్కల మండలం మేడూరు, మంటా డ, హైవే పక్కన గురజాల చెరువుల్లో అక్రమంగా మట్టిని తవ్వి, పచ్చ తోడేళ్లు మేస్తున్నాయి. పెదపారుపూడి మండలంలో ఈదర మద్దాళి, వెంటాప్రగడ, మోపూరులో అక్రమ మట్టి తవ్వకాలతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తోట్లవల్లూరు మండలంలోని గరికపర్రులో పాఠశాల పక్కన ఉన్న చెరువును శ్మశానం కోసం మట్టి పేరుతో తవ్వుతూ, బయటికి తరలిస్తూ దర్జాగా దోపిడీ చేస్తున్నారు. దీంతో పలు చోట్ల చెరువుల్లో మట్టి తవ్వి ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. మొత్తం మీద పామర్రు నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రింపగళ్లు అక్రమ మట్టి తవ్వకాలు చేస్తూ, కోట్ల రూపాయలు దండుకొంటున్నారు. పామర్రు నియోజకవర్గంలో అడ్డూఅదుపూ లేకుండా దందా కోట్ల రూపాయలు చేతులు మారుతున్న వైనం కన్నెత్తి చూడని అధికారులు పెడన నియోజకవర్గంలోనూ అదే పంథా వ్యవహారాన్ని దగ్గరుండి నడిపిస్తున్న టీడీపీ నేతలు పెడన మండలంలో చెన్నూరు, పెనుమల్లి, జింజేరు, నడుపూరు గ్రామాల పరిసరాలలో అక్రమంగా చెరువులను, మట్టి దిబ్బలను తవ్వేస్తున్నారు. పంట బోదెలను సైతం మాయం చేస్తున్నారు. పెడన నుంచి మచిలీపట్నంకు నిత్యం టిప్పర్లు ద్వారా మట్టి తరలిపోతుంది. మచిలీపట్నంలోని కృష్ణాజిల్లా టీడీపీ కార్యాలయం, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో మెరక పనులకు మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కృత్తివెన్ను మండలం మునిపెడ, ఇంతేరు, చినగొల్లపాలెం ప్రాంతా ల్లో సైతం చెరువులను తవ్వేస్తూ మట్టిని పక్కనే ఉన్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి టిప్పర్లు ద్వారా తరలించేస్తున్నారు. బంటుమిల్లి, గూడూరు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి. గూడూరు మండలంలో పర్ణశాల, ఆర్వీపల్లిలో టీడీపీ నాయకులు మట్టిని తవ్వున్నారని జనసేన నాయకులు కలెక్టర్‌కు స్వయంగా ఫిర్యాదులు చేస్తున్నా ఎటువంటి స్పందన ఉండటం లేదు. -
ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షను నిర్వహించారు. ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకూ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకూ పరీక్ష జరిగింది. గంట ముందుగా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. అభ్యర్థులను క్షుణంగా పరిశీలించి అనంతరం అనుమతించారు. ఈ సందర్భంగా ఆయా పరీక్ష కేంద్రాల వద్ద తల్లిదండ్రుల సందడి నెలకొంది. నేటి నుంచి 24వ తేదీ వరకు సూచనలు, అభ్యంతరాల స్వీకరణ పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ల పునర్విభజనపై ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం విడుదల చేశారు. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో ఇప్పటి వరకు ఉన్న 64 డివిజన్లను 86 డివిజన్లకు పెంచుతున్నామని, ఈ మేరకు డివిజన్ల సరిహద్దులపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించామన్నారు. డివిజన్ల సరిహద్దులపై అభ్యంతరాలను ఈ నెల 18నుంచి 24వ తేదీ వరకు వీఎంసీ ప్రధాన కార్యాలయంలో, చిట్టినగర్‌లోని సర్కిల్–1 కార్యాలయంలో, సత్యనారాయణపురంలోని సర్కిల్–2 కార్యాలయంలో, పటమట లోని సర్కిల్–3 కార్యాలయంతోపాటు నగర పరిధిలోని ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ నెల 24వ తేదీలోపు ప్రజలు, రాజకీయ పార్టీలు సూచనలు, అభ్యంతరాలంటే వీఎంసీ ప్రధాన కార్యాలయంలో రాత పూర్వకంగా అందించాలని సూచించారు. -
భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య భగవానుడికి సూర్యోపాసన సేవ, సూర్య నమస్కారాలను నిర్వహించారు. సేవలో పాల్గొనడం వల్ల భక్తులకు ఆరోగ్య ప్రాప్తితో పాటు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. సేవలో పలువురు ఉభయదాతలు పాల్గొనగా, వారికి ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. గన్నవరం: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిని గన్నవరం ప్రాంతంలో సుందరంగా తీర్చిదిద్దాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. స్థానిక విమానాశ్రయం నుంచి చిన్నఆవుటపల్లిలోని పశ్చిమ బైపాస్ వరకు జాతీయ రహదారిని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విమానాశ్రయానికి ముఖద్వారంలో ఉన్న గన్నవరం ప్రాంతంలో జాతీయ రహదారి బ్యూటిఫికేషన్‌పై అధికారులు దృష్టి సారించాలని చెప్పారు. ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చదనం పెంపొందించడంతో పాటు గోడలకు ఆకర్షణీయమైన రంగులు వేయాలని సూచించారు. దెబ్బతిన్న పుట్‌పాత్‌లకు వెంటనే మరమ్మతులు చేయాలని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి డి. ధనలక్ష్మి, గుడివాడ డీఎల్పీఓ సంపత్‌కుమారి, తహసీల్దార్ కె. వెంకట శివయ్య, ఎంపీడీఓ టి. స్వర్ణలత, పంచాయతీ కార్యదర్శులు ప్రసాద్, చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పోరంకిలోని విజ్ఞాన్ భారత్ స్కూల్ ఆవరణలో కృష్ణాజిల్లా జిల్లా టీమ్ ఓపెన్ అండ్ ఉమెన్ చెస్ టోర్నమెంట్ ఉత్సాహపూరిత వాతావరణంలో ఆదివారం జరిగింది. ఈ టోర్నమెంట్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 32 మంది చెస్ క్రీడాకారులు పాల్గొని వారిలోని ప్రతిభను చూపారు. బాలుర విభాగంలో రుషీల్, కార్తికేయ, సాకేత్, విగ్నేష్ గుప్తా, బాలికల విభాగంలో జాహ్నవి, అవిష్క, గీతా మాధురి, హర్షిత విజేతలుగా నిలిచారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి విజ్ఞాన్ భారత్ స్కూల్ డైరెక్టర్ శేషాద్రిరావు, కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ ఎం.దివ్వ హాజరై విజేతలకు జ్ఞాపికలు, మెడల్స్, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎం.దివ్య మాట్లాడుతూ ఈ టోర్నీలో విజేతలైన బాలురు జూలై 18,19 తేదీల్లో నంద్యాలలో జరిగే ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో, బాలికలు జూలై 4,5 తేదీల్లో రాజమండ్రిలో జరిగే ఏపీ స్టేట్ సీనియర్ ఉమెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో కృష్ణాజిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. చీఫ్ ఆర్బిటర్స్ ఏ.మణి రత్నం, పి.రవీంద్రతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి వివిధ సేవా టికెట్లు ద్వారా ఆదివారం ఆదాయం రూ. 6,90,951 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. సేవా టికెట్లతో రూ. 3,78,352, లడ్డూ ప్రసాదం ద్వారా రూ. 1,15,665, విరాళాల రూపేణా రూ. 1,30,064, స్వామివారి కల్యాణ కట్ట టికెట్లు విక్రయించగా రూ. 25,440, స్వామివారి దర్శనం టికెట్ల రూ. 38,800 తదితరాలు కలిపి మొత్తం రూ. 6,90,951 ఆదాయం సమకూరినట్లు ఆలయ డీసీ వివరించారు. -
రాంగ్ రూట్లో దూసుకొచ్చిన మృత్యువు
బంటుమిల్లి: కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలోని బంటుమిల్లి–గుడివాడ రోడ్డులో పెదతుమ్మిడి మీడియం డ్రెయిన్ వంతెన వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మండలంలోని చినతుమ్మిడి గ్రామానికి చెందిన అక్కచెల్లెళ్ల కొడుకులు వేముల శివయ్య(30), కాగిత అమలేశ్వరరావు(30) ద్విచక్రవాహనంపై వేకువజామున ఆదివారం మార్కెట్‌కు బయలుదేరారు. బంటుమిల్లి వైపు వంతెన దాటిన కొద్ది అడుగుల దూరంలోనే ఎదురుగా వేగంగా వస్తున్న వ్యాన్ వీరి బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో బైక్‌పై ఉన్న శివయ్య, అమలేశ్వరరావు డ్రెయిన్‌లో పడిపోయారు.బైక్ పూర్తిగా ధ్వంసం కాగా, వ్యాన్ కూడా డ్రెయిన్‌లో పడిపోయింది. ప్రమాదంలో శివయ్య అక్కడికక్కడే మరణించగా, అమలేశ్వరరావును ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దిశమర్రులో చెరువుల వద్ద మేత కట్టలు దించి హనుమాన్ జంక్షన్ వెళ్తున్న వ్యాన్ డ్రైవరు బాలిన సుబ్బారావు మద్యం, నిద్రమత్తులో రాంగ్ రూట్లో వచ్చి బైక్‌ను ఢీకొట్టాడని స్థానికులు తెలిపారు. అక్కడే ఉన్న కొందరు ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు శివయ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది. చినతుమ్మిడిలో విషాదం ఈ ఘటన చినతుమ్మిడిలో విషాదం నింపింది. మృతులిద్దరూ అక్కాచెల్లెళ్ల కుమారులు కావడంతో రెండు కుటుంబాల వారి రోదనలు మిన్నంటాయి. డ్రెయిన్ వంతెన వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దీనికి ఆర్అండ్బీ అధికారులే బాధ్యత వహించాలని స్థానికులు ఆరోపించారు. -
పవన్ కల్యాణ్‌పై పేర్ని నాని సెటైర్లు
కృష్ణా జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని అన్నారు. పవన్ రాజకీయ జీవితమంతా పొంతనలేని మాటలేనని ఎద్దేవా చేశారు. పవన్ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాడనుకుంటున్నారని చెప్పారు.కృష్ణా జిల్లాలో పేర్నినాని ఆదివారం మాట్లాడుతూ.. ‘‘పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలను కల్లబొల్లి కబుర్లతో నమ్మించాలని చూస్తున్నాడు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారనే భావనలోనే పవన్ మీటింగ్ సాగింది. పవన్ మాటలకు పొంతన లేదు. 2019-24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఎన్ని అసత్యాలు మాట్లాడారో మర్చిపోయారా? అప్పట్లో 175 చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవలేని మీకు జగన్ గురించి మాట్లాడే అర్హత ఉందా? పవన్ రాజకీయ జీవితమంతా పొంతనలేని మాటలే. రాష్ట్రం బాగు కోసం కూటమిలో చేరానంటాడు.జనసేన కార్యకర్తల బాధలను చూస్తూ సహించనంటాడు. బందరులో లంచాలు ఇవ్వలేదని జనసేన కార్యకర్త ఇల్లు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లారు పవన్? కనీసం కొల్లు రవీంద్రకు ఫోన్ చేసి బుద్దిలేదా అని అడిగారా? ఎంతమంది జనసేన కార్యకర్తలను తంతున్నారో మీకు తెలుసా? జనసేన కార్యకర్తల బాధలు పగోడికి కూడా వద్దు. మహారాష్ట్ర వెళ్లి ప్రచారం చేసొస్తే 95 శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందంటున్నారు. ఏపీలో మీరు వంద శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. వంద శాతం స్ట్రైక్ రేట్ వచ్చినోళ్లలో గెలిచిన వారు ఎవరు... ఏరోజైనా మీ పార్టీ జెండా మోశారా? చంద్రబాబు జనసేన అని మెడలో వేసిన వాళ్లకే కదా మీరు సీట్లిచ్చింది? సీజ్ ద షిప్ అని నాలుగైదు రోజులు కూడా ఆపలేకపోయారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో సీజ్ ద షిప్ అని నాలుగు రోజులు కూడా ఆపలేకపోయామని మీరే ఒప్పు కుంటున్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటికి రాగానే రోడ్డు మ్యాప్ వచ్చిందన్నారు. 2020లోనే ఇప్పటం సభలో ఓట్లు చీలనివ్వనని చెప్పింది మీరే’’ అని చెప్పారు. -
బాబూ.. ఏపీని ఏం చేయదలచుకున్నావ్..?: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీని ఉద్దరిస్తామంటూ చంద్రబాబు మోసపూరిత మాటలు చెప్పారు.. ఇప్పుడు ప్రజలపై భారీ అప్పుల భారం మోపారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేవలం 24 నెలల్లోనే ప్రజల నెత్తిన చంద్రబాబు అప్పుల బండ పెట్టారు. 3 లక్షల 50 వేల కోట్ల అప్పులు చేశారు. రాబోయే మూడేళ్లలో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఏం చేయదలచుకున్నారు’’ అంటూ నిలదీశారు.‘‘అప్పుల్లో, నేరాల్లో నిరుద్యోగంలో దేశంలో ఏపీనే ముందు ఉంది. ఇప్పుడు ఆర్టీసీని అమ్మకానికి పెట్టారు. ఆర్టీసీని అమ్మేయడానికి మహిళలపై నెపం పెడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆర్టీసీ ఇబ్బందుల్లోకి వచ్చిందంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజల ఆస్తులకు ప్రమాదం పొంచి ఉంది. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యుండకపోతే అప్పుడే చంద్రబాబు ఆర్టీసీని అమ్మేసేవారు. 2014 నుంచి 2019 వరకూ జయము జయము చంద్రన్న అని ఆర్టీసీని వాడుకున్నారు. ఆర్టీసీ టిడిపి సొత్తులాగా.. ఖర్జూర నాయుడు సంపాదించిన సొత్తులాగా అప్పనంగా వాడేశారు..నయా పైసా ఆర్టీసీకి చంద్రబాబు జమ చేయలేదు. 2018లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరితే చంద్రబాబు కుదరదన్నారు. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. 54 వేల మందిని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించారు. చంద్రబాబు దిగిపోయే నాటికి ఆర్టీసీ ఆపరేషనల్ అప్పులు 6300 కోట్లు, ఎక్యుమలేటెడ్ అప్పు 3350 కోట్లు. 2020 జనవరిలో ఆర్టీసీని జగన్ ప్రభుత్వంలో విలీనం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ఏడాదికి రూ.3600 కోట్లు జీతాలుగా చెల్లించారు..వైఎస్ జగన్ దిగిపోయేనాటికి ఆర్టీసీ అప్పుల భారం 2,500 కోట్లకు తగ్గింది. వైఎస్ జగన్ చొరవతో 9 వేల కోట్ల నుంచి 2500 కోట్లకు అప్పులు తగ్గాయి. ఆర్టీసీ అప్పులు తగ్గించిన ఘనత వైఎస్ జగన్‌ది. ఎలక్ట్రికల్ బస్సులు కొనడం ఆర్టీసీ వల్ల కాదని ఇప్పుడు కథలు చెబుతున్నారు. ప్రజారవాణాలో ఎలక్ట్రికల్ బస్సులు కొంటే కేంద్రం 40 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. 2014-19 లో చంద్రబాబు ఒక్క ఎలక్ట్రికల్ బస్సైనా కొన్నాడా?. 2019-24 లో వైఎస్ జగన్ ప్రభుత్వం 100 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసింది. తిరుపతిలో ఆ బస్సులను అందుబాటులోకి తెచ్చింది...తిరుపతిలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపేది ఆర్టీసీ డ్రైవర్లే. ఆర్టీసీ డ్రైవర్లకు వైఎస్ జగన్ ట్రైనింగ్ ఇప్పించారు. వైఎస్ జగన్ అప్పులు తీర్చి.. ఉద్యోగులకు జీతాలు చెల్లించినప్పుడు మీరెందుకు చేయలేరు?. ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. మీరు ఆర్టీసీని దోచుకుతినడానికి రాష్ట్ర ప్రజలకు వేసిన ఎర మహిళలకు ఉచిత బస్సు స్కీమ్. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం వల్లే ఆర్టీసీ కుదేలైపోయిందని చంద్రబాబు చెప్పించాడు. స్త్రీ శక్తి హామీ ఎవరిది?. ఆర్టీసీకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది. ఉచిత మహిళ పథకం ఇస్తున్నప్పుడు ఆర్టీసీకి ప్రభుత్వం ఎందుకు డబ్బులు కట్టడం లేదు? ..ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులను ప్రైవేట్ పరం చేసేస్తామంటున్నారు. మీ మనుషులు , మీ బ్రోకర్లకు ఆర్టీసీని కట్టబెట్టడమేనా మీ సంపద సృష్టి. ఆర్టీసీని సర్వనాశనం చేసి.. మహిళలపై నెపం వేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలకు పంగనామాలు పెట్టారు. వైఎస్ జగన్ మహిళలకు రూ.24 వేల కోట్లు ఇచ్చారు. సచివాలయ ఉద్యోగాల్లో సగం మహిళలకు ఇచ్చారు. ఎలక్ట్రికల్ బస్సు కిలోమీటర్‌కు 7 రూపాయలే భారం అని చెప్పడం పచ్చిమోసం. ఎలక్ట్రికల్ బస్సుల కాంట్రాక్ట్ పినాకిల్ అనే కంపెనీకి ఇచ్చారు. పినాకిల్ సంస్థ ఎలక్ట్రికల్ బస్సులు నడిపితే కిలోమీటర్‌కు 71 రూపాయలు బిల్ వేస్తారట. 71 రూపాయల బిల్లులో 21 మోదీ ఇస్తే మిగిలిన 50 రూపాయలు మీ బాబు ఇస్తాడా?..కరెంట్ బస్సుకు కిలోమీటర్ కు 7 రూపాయలని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. పీఎంఈబస్ స్కీమ్ కింద రాబోయే రోజుల్లో బస్సులు వస్తే పేదలు, సామాన్యులు బస్సులు ఎక్కగలరా?. ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులు పీఎంఈబస్ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ బస్సులు మార్చేస్తామనడం కరెక్ట్ కాదు. పీఎంఈబస్ స్కీమ్ ప్రకారం 3 లక్షల పైబడి 40 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో మాత్రమే కరెంట్ బస్సులు తిప్పాలి. రాబోయే 750 కరెంట్ బస్సులన్నీ రాజధానిలోని 29 గ్రామాల్లో తిప్పుతారా?..కోటి 70 లక్షల చొప్పున వైఎస్ జగన్ 100 బస్సులు కొన్నాడు కదా. ఒక్క ప్రైవేట్ వ్యక్తిని కూడా రాకుండా ఆర్టీసీ డ్రైవర్లతోనే నడిపిస్తున్నారు కదా.. ఈరోజుకీ ఆహా ఓహో అంటూ ఆ బస్సులపై వస్తున్న డబ్బులను మీరు తీసుకుంటున్నారు కదా. ఆడపిల్ల కనిపిస్తే చాలు సీటీపాట పాడినట్లు ఓట్లు అడుక్కున్నారు. మహిళలను మీ ప్రభుత్వం వచ్చాక ఏం ఉద్ధరించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. ఆర్టీసీని అమ్మకానికి పెట్టారు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఏమైపోవాలి? రాష్ట్రంలోని సంపద అంతా చంద్రబాబు, లోకేష్, పవన్, ఎమ్మెల్యేలకే.. ఇప్పటికే ఆర్టీసీలో రిక్రూట్ మెంట్ నిలిపేశారు. ఆర్టీసీ జోలికొస్తే చూస్తూ ఊరుకోం’’ అని చంద్రబాబును పేర్ని నాని హెచ్చరించారు. -
గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్టు
హనుమాన్‌జంక్షన్ రూరల్: అక్రమంగా గంజాయి రవణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శనివారం పట్టుకున్నారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి –కొమ్మూరు రహాదారిలో గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందటంతో హనుమాన్‌జంక్షన్ సీఐ ఎల్.రమేష్, వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్ పథకం ప్రకారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మల్లవల్లి –కొమ్మూరు రోడ్డులోని ఎన్ఎస్పీ కాలువ వాహన తనిఖీలు చేపట్టగా బైక్‌లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారు. మోటార్ సైకిల్‌ను తనిఖీ చేయగా 2.5 కిలోల గంజాయి లభించటంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితులు నిమ్మకూరి త్రినాథ్ (నూజివీడు), దండగల వెంకట ప్రసాద్ (మల్లవల్లి)లను అరెస్ట్ చేసి నూజివీడు కోర్టుకు హాజరు పర్చారు. -
ఫార్మసీ బంద్‌కు సంపూర్ణ మద్దతు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి మెట్ల పూజలు నిర్వహించే మార్గాన్ని ఆలయ అధికారులు శనివారం మూసివేశారు. మెట్ల పూజ మార్గంలో శుక్రవారం శ్లాబ్ పెచ్చులు ఊడి పడి చిన్నారికి గాయమైన సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము నుంచి మెట్ల పూజ మార్గాన్ని మూసివేసి మరమ్మతు పనులు ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రమే మెట్ల మార్గంలో మరమ్మతులు నిర్వహించాలని నిర్ణయించిన దేవస్థాన అధికారులు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారాంతాల్లో అమ్మవారి మెట్ల పూజను చేసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. శనివారం కూడా భక్తులు మెట్ల పూజ చేసేందుకు మహామండపం వద్దకు చేరుకోగా, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది మెట్ల మార్గాన్ని మూసివేసి మరమ్మతులు నిర్వహిస్తున్నారని చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక రోజు ముందుగానైనా భక్తులకు సమాచారం తెలిసేలా ప్రకటన విడుదల చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మెట్ల మార్గాన్ని ఎన్ని రోజులు మూసివేస్తారనే సమాచారం కూడా తెలియడం లేదని సిబ్బంది పేర్కొనడం గమనార్హం. కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ పరిటాల(కంచికచర్ల): జనగణన – 2027 ప్రక్రియకు సంబంధించి దశల వారీగా ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో జరుగుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, సెన్సస్ జేడీ జి.ప్రసన్నకుమార్ తెలిపారు. కంచికచర్లలో జరుగుతున్న ఇళ్ల జాబితా, ఇళ్ల గణన ప్రక్రియను శనివారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికీ వచ్చే సిబ్బందికి సరైన పూర్తి వివరాలను తప్పనిసరిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. అత్యంత కచ్చితత్వంతో దోష రహితంగా డేటాను నమోదు చేయాలని, మార్గదర్శకాల ప్రకారం జనగణన నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. జనగణన అనేది దేశ ప్రగతి, ప్రణాళికా రూపకల్పనకు అత్యంత కీలకమైన ప్రక్రియ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి, గృహ నిర్మాణం వంటి రంగాల్లో భవిష్యత్ కార్యాచరణకు జనగణన గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. సెన్సస్ జేడీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ప్రతి సమాచారం విలువైందని, ప్రజల సహకారంతోనే సమగ్ర గణాంకాలు సిద్ధమవుతాయని ఫీల్డ్ స్థాయిలో సిబ్బంది నిబద్ధతతో పనిచేసే నాణ్యమైన డేటా సేకరణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వీఎంసీ సెన్సస్ ఇన్చార్జి వెంకట రమణ, రూరల్ ఇన్చార్జి స్వాతి, డెప్యూటీ తహసీల్దార్ వి.మానస, వీఆర్వోలు, జన గణన సిబ్బంది పాల్గొన్నారు. -
బీపీ.. అప్రమత్తతతో హ్యాపీ!
సైలెంట్ కిల్లర్‌గా... బీపీని ఇలా తెలుసుకుందాం.. బీపీకి కారణాలివే.. C జన్యుపరమైన కారణాల్లో తల్లిదండ్రులకు బీపీ ఉన్నా, గురక, కిడ్నీ వ్యాధులు, థైరాయిడ్ వంటివి C జీవనశైలి అంటే ఆహారపు అలవాట్లు, వత్తిళ్లు, వ్యాయామం లేక పోవడం, స్మోకింగ్, ఆల్కాహాల్, ఒబెసిటీ, ఎయిర్ పొల్యూషన్ వంటివి C అధిక ఉప్పు తీసుకోవడం. ప్రతిరోజూ ఒక వ్యక్తి 1.5 గ్రాముల ఉప్పు తీసుకోవాలి C పోటాషియం తక్కువుగా ఉండటం కూడా కారణమే. అదుపులో ఉంచుకునే మార్గాలు.. ● ఆహారపు అలవాట్లలో మార్పులు ● క్రమబద్దమైన వ్యాయామం ● ఆహారంలో సాల్ట్ తగ్గించుకోవడం, ● కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడం ● ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండటం, ● వత్తిడిలు తగ్గించుకోవడం ● స్మోకింగ్, ఆల్కాహాల్ అలవాట్లకు దూరంగా ఉండటం చేయాలి. -
వ్యాపారవేత్తల అవగాహన సదస్సుకు మంచి స్పందన
మచిలీపట్నంఅర్బన్: మధ్య పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ ప్రభావం భారత్‌పై పడకుండా ఉండేందుకు ప్రజలు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్, విద్యుత్ వంటి ఇంధనాల వినియోగంలో పొదుపు పాటించాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం మంత్రి.. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి సైకిల్‌పై మచిలీపట్నం బస్‌స్టాండ్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ గృహావసరాలకు సౌరశక్తి వినియోగాన్ని అలవాటు చేసుకోవడంతో సంప్రదాయ ఇంధనాలపై భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రజలు సైకిళ్లు, విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు. రైతుబజార్ సందర్శన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఉదయం మచిలీపట్నంలోని రైతు బజార్‌ను సందర్శించారు. మంత్రి అక్కడి విక్రయదారులతో నేరుగా మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణరావుతో కలిసి పలు రకాల కూరగాయలను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పీవీ ఫణికుమార్, తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో డ్రిల్ మాస్టర్ దుర్మరణం మధురానగర్(విజయవాడసెంట్రల్): బంధువుల ఇంట్లో బర్త్‌డే ఫంక్షన్ కోసం సోదరునితో కలిసి ద్విచక్ర వాహనంపై నగరానికి వచ్చిన డ్రిల్ మాస్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన విజయవాడ గుణదల పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన గోసాల శివరామకృష్ణకు ఇద్దరు సోదరులు ఉన్నారు. శివరామకృష్ణ అన్నయ్య గోసాల వెంకట కృష్ణ, తమ్ముడు గోసాల సుబ్బరామకృష్ణ గుడివాడలో నివాసం ఉంటున్నారు. వీరు శనివారం విజయవాడలో బంధువుల ఇంట్లో బర్త్‌డే ఫంక్షన్ కోసం యూనీకార్న్ బైక్‌పై వచ్చారు. ఫంక్షన్ చూసుకుని తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి గుడివాడ ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఏలూరు రోడ్డు గుణదల విద్యుత్ సౌధ సమీపంలో డివైడర్‌ను ఢీ కొట్టారు. దీంతో గోసాల సుబ్బరామకృష్ణ (38) అక్కడికక్కడే మృతి చెందగా గోసాల వెంకట కృష్ణ గాయపడ్డారు. దీంతో ఇరువురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గోసాల శివరామకృష్ణ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చూసేసరికి తమ్ముడు సుబ్బరామకృష్ణ మృతి చెందగా అన్నయ్య వెంకట కృష్ణ గాయాలతో ఉన్నారు. మృతుడు సుబ్బరామకృష్ణ ప్రైవేట్ పాఠశాలలో డ్రిల్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు భార్య కుమార్తె ఉన్నారు. గోసాల శివరామకృష్ణ ఫిర్యాదు మేరకు గుణదల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ కలిగి ఉన్న ఇద్దరు అరెస్ట్ వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): డ్రగ్స్ కలిగి ఉన్న ఇద్దరు యువకులను విజయవాడ వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ శేషయ్యవీధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మంగీలాల్ (26), శైతన్ (23)ను పోలీసులు గమనించారు. వారిని పరిశీలించగా వారి వద్ద ఆరు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ లభించింది. వారిని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ చేశారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యత
అవనిగడ్డ: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన అవనిగడ్డలోని పోస్టాఫీస్ రోడ్డులో చెత్తను తొలగించి కార్య క్రమాన్ని ప్రారంభించారు. తరచూ చెత్త వేస్తున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్‌గా గుర్తించి అక్కడ ఎర్రమట్టితో చదును చేసి సుందరంగా రంగులు వేసి మూడు రోజుల్లో గ్రీన్ స్పాట్‌గా మార్చాలని సూచించారు. అనంతరం కలెక్టర్ పలు ప్రాంతాల్లో పర్యటించి చెత్త వేసే ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ చెత్త వేయకుండా చూడాలని స్థానికులకు సూచించారు. సరుకులు, కూరగాయల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ గుడ్డ సంచిలను తీసుకెళ్లాలని, ఆహార పదార్ధాల కోసం హోటళ్లు, టిఫిన్స్ సెంటర్లకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ బాక్సులు తీసుకెళ్లాలని సూచించారు. డ్రైన్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నాం డ్రైనేజీలు సరిగా లేకపోవడం వల్ల మురుగునీరు పోవడం లేదని, దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని కొంతమంది స్థానికులు కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. దీనికి స్పందించిన కలెక్టర్ వెంటనే డ్రైన్లను బాగుచేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శాశ్వతంగా మురుగునీరు వ్యవస్థకు ఎంత ఖర్చవుతుందో అంచనాలు వేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. స్వచ్ఛ రథం ద్వారా పాతపుస్తకాలు, సామగ్రిని తీసుకుని కందిపప్పును అందించారు. చెత్తను ఇచ్చి విలువైన సరుకులు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా వైద్యశాల కూడలిలో ప్రజలు, అధికారులతో కలసి మానవహారం నిర్వహించారు. ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ప్రత్యేకంగా గుడ్డతో తయారు చేసిన స్వచ్ఛ ఆంధ్ర బ్యానర్లను వినియోగించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి ప్లాస్టిక్ బేలింగ్ యంత్రాన్ని పరిశీలించి పనితీరును తెలుసుకున్నారు. వర్మికంపోస్ట్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు. స్వచ్ఛరథం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ అనంతరం హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించిన కలెక్టర్ బాలాజీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోతే జరిగే అనర్ధాలను వివరించారు. కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోలెం నాగమణి, డీపీవో ధనలక్ష్మి, జెడ్పీసీఈవో ఆరుణ, డీఎస్పీ అభిషేక్, సీఐ యువకుమార్, ఇన్చార్జి తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీపీ తుంగల సుమతీదేవి, ఎల్ఐసీ మేనేజర్ హరిప్రసాద్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.కలెక్టర్ డీకే బాలాజీ -
డెంగీపై అప్రమత్తత అవసరం
డీఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్ మచిలీపట్నంఅర్బన్: డెంగీ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.యుగంధర్ సూచించారు. 11వ జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో డెంగీ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ముఖ్యమన్నారు. నీటి నిల్వలను తరచూ పరిశీలించడం, శుభ్రపరచడం, మూతపెట్టడం వంటి చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ బి.అరుణ్ కుమార్ మాట్లాడుతూ దోమలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి వారం ఒకరోజు శ్ఙ్రీడ్రై డేశ్రీశ్రీగా పాటిస్తూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయ అధికారులు, సిబ్బంది కార్యాలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ యుగంధర్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని, జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు వంటి పర్యావరణ హిత వస్తువులను ఉపయోగించాలని సూచించారు. -
నకిలీ హాల్ మార్క్ దందా
వినియోగదారులు బంగారం కొనేటప్పుడు బీఐఎస్ లోగో, 6 అంకెల హెచ్‌యూఐడీ నంబర్, స్వచ్ఛత 916 ఈ మూడు గమనించి కొనుగోలు చేయాలి. బిల్లు తప్పనిసరి తీసుకోవాలి. బీఐఎస్ కేర్ యాప్ ద్వారా నాణ్యతను పరీక్షించుకోవచ్చు. నకిలీలను అరికట్టేందుకు నిరంతరం తనిఖీలు చేస్తున్నాం. హాల్ మార్క్ లేకుండా విక్రయించే దుకాణాలపై దాడి చేసి వస్తువులు సీజ్ చేశాం. నకిలీ హాల్‌మార్క్ వేసే లేజర్ మిషన్లు సీజ్ చేశాం. వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. – వివేక్ రెడ్డి, డెప్యూటీ డైరెక్టర్, బీఐఎస్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నకిలీ హాల్ మార్క్ కేంద్రాలకు విజయవాడ అడ్డాగా మారింది. నకిలీ దందా కొనసాగిస్తూ వినియోగదారులను అడ్డంగా దోచుకుంటున్నారు. బంగారు ఆభరణాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఆభరణాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి. ఓ వైపు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. అంతే స్థాయిలో నకిలీ హాల్ మార్క్ దందా కొనసాగుతోంది. కొన్ని దుకాణాలు హాల్ మార్క్ లేకుండా విక్రయాలు చేస్తుండగా, మరికొన్ని నకిలీ మార్క్ వేసి మోసం చేస్తున్నాయి. నగరంలో ఉన్నవి మొత్తం 14 హాల్‌మార్క్ కేంద్రాలే ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లైసెన్స్ పొందిన బంగారు ఆభరణాల దుకాణాలు 909 ఉన్నాయి. ఇవి కాక అక్కడక్కడా కొన్ని లైసెన్స్ లేని దుకాణాలు కూడా ఉన్నాయి. బంగారు ఆభరణాల నాణ్యతను పరీక్షించి హాల్ మార్క్ వేసేందుకు అధికారికంగా 14 హాల్ మార్క్ కేంద్రాలు పని చేస్తున్నాయి. హాల్ మార్క్ కేంద్రాలు బంగారు ఆభరణాలను పరీక్షించి వాటిపై బీఐఎస్ త్రిభుజాకార లోగో, స్వచ్ఛత– 22 క్యారెట్ల బంగారానికి 22కె916, ఆరంకెల హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్(హెచ్‌యూఐడీ) నంబరు వేస్తారు. ప్రతి నగకు ఈ హెచ్‌యూఐడీ నంబర్ ప్రత్యేకంగా ఉంటుంది. తయారైన నగకు హాల్ మార్క్ వేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. హాల్ మార్క్ వేసిన వస్తువు వివరాలు బీఐఎస్ యాప్‌లో నమోదు చేస్తారు. వస్తువు నాణ్యతపై వినియోగదారుకు అనుమానం వస్తే ఈ హెచ్‌యూఐడీ నంబర్ ద్వారా అధికారిక హాల్ మార్క్ సెంటర్లో ఎక్కడైనా పరీక్షించుకునే అవకాశం ఉంది. నకిలీ మార్క్ దందా ... విజయవాడ నగరంలో వందలాది జ్యూయలరీ షాపులు ఉన్నాయి. వీటిలో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. హాల్‌మార్క్ కేంద్రాలు కేవలం 14 మాత్రమే ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం రెండు కేంద్రాలు పనిచేయడం లేదు. దుకాణాల్లో విక్రయించే ప్రతి ఆభరణాన్ని నాణ్యత పరీక్షలు చేసి హెచ్‌యూఐడీ నంబర్ వేయాల్సి ఉంటుంది. దీనికి గంటల సమయం పడుతుంది. అయితే కొందరు నకిలీలు వస్తువు వివరాలు నమోదు చేయకుండా, పరీక్షలు నిర్వహించకుండా సెకన్ల వ్యధిలో హాల్ మార్క్ వేసి మోసం చేస్తున్నారు. ఈ మోసానికి వన్‌టౌన్, టూటౌన్లో ఒక కాంప్లెక్స్ అడ్డాగా మారాయి. హాల్‌మార్క్ వేసేందుకు కేవలం రూ.100 లోపే ఖర్చవుతోంది. కానీ నాణ్యత బండారం బయటపడకుండా కొందరు వ్యాపారులు నకిలీ ముద్రలు వేసి మోసం చేస్తున్నారు. అచ్చం బీఐఎస్ లోగోను పోలి ఉన్న ముద్ర, 916 అని ముద్రిస్తున్నారు. తర్వాత కాలంలో వినియోగదారునికి అనుమానం వచ్చి పరీక్ష చేయించినా వాటి వివరాలు ఎక్కడా లభించవు. టూటౌన్‌లోని ఓ కాంప్లెక్స్‌లో నకిలీ దందాకు పాల్పడుతున్న ఓ దుకాణంపై ఇటీవల బీఐఎస్ అధికారులు దాడి చేశారు. హాల్ మార్క్ లేకుండా విక్రయిస్తున్న నగలను గుర్తించి 2 కేజీల బంగారు నగలు సీజ్ చేశారు. నకిలీ హాల్‌మార్క్ కేంద్రాలను గుర్తించి దాడులు చేశారు. అయినప్పటికీ నకిలీ దందాకు చెక్ పెట్టలేకపోతున్నారు. ఒక చోట దాడి చేసి పట్టుకుంటే మరో చోట వేరే పేరుతో హాల్‌మార్క్ సెంటర్ ఏర్పాటు చేసి దందా కొనసాగిస్తున్నారు. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు చెందిన వినియోగదారులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి నకిలీలతో భారీ మొత్తాల్లో నష్టపోతున్నారు. బీఐఎస్ అధికారులు దాడులు చేస్తున్నా నకిలీగాళ్లు జంకుబొంకు లేకుండా దందా సాగిస్తున్నారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ
ఏలూరు రేంజి ఐజీ అశోక్‌కుమార్ పామర్రు: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా పోలీస్ శాఖ నేరాలను నియంత్రించడమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతోందని ఏలూరు రేంజి ఐజీ జి.అశోక్‌కుమార్ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా శనివారం ఆయన పామర్రు పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రోడ్ సేఫ్టీ అధికారులతో పాటు జాతీయ రహదారుల శాఖ అధికారుల సమన్వయంతో తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. రాత్రి సమయాలలో వెహికల్ డ్రైవర్లకు ఉపశమనం కోసం జాతీయరహ దారిలో అక్కడక్కడ వాష్ రూమ్‌లను ఏర్పాటు చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా ప్రమాదాల నివారణకు దోహద పడుతున్నాయని అన్నారు. కృష్ణా జిల్లాలో జాతీయ రహదారుల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఎస్పీ బ్లాక్ స్పాటు్ల్ గుర్తించి హైవే అధికారులతో వాటి నివారణకు తీసుకున్న చర్యలను ఐజీ వివరించారు. మహిళా రక్షణకు కృష్ణాజిల్లా పోలీస్ శాఖ తీసుకున్న చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కితాబు అందించారని అన్నారు. ఇదే విధంగా ఏలూరు రేంజ్‌లోని మిగిలిన జిల్లాలలో కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. తొలుత స్టేషన్ ఆవరణలో పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా ఎస్పీ విద్యా సాగర్ నాయుడుతో కలిసి ఐజీ మొక్కలను నాటారు. అనంతరం సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించే ముందు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారికి గ్రామాల్లో జరిగే నేరాల నియంత్రణపై పలు సూచనలు, సలహాలను అందించారు. కార్యక్రమంలో గుడివాడ డీఎస్పీ పాల శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ వై.సత్య కిషోర్, పామర్రు సీఐ నాగ ప్రసాద్, ఎంపీడీవో కె.జ్యోతి, ఎస్ఐ శ్రీనివాస్, గుడివాడ డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
మాట్లాడుకుందామని పిలిచి హత్య?
మధిర/గంపలగూడెంః భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళకు ఇద్దరితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య మొదలైన వివాదం.. మహిళ హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మండలంలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు... ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరుకు చెందిన గోపిశెట్టి కల్పన(27) – మైలవరం మండలం బొర్రగూడెంకు చెందిన డేరంగుల నాగరాజు 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు జన్మించాక మనస్పర్థలతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆపై కల్పన కొంతకాలం తిరువూరులో, ప్రస్తుతం మధిరలోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోంది. ఈక్రమంలో వాయిద్యకారుడు విజయభాస్కర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడ్డాక, కొన్నాళ్లకు తిరువూరులోని ద్విచక్ర వాహనాల షోరూమ్‌లో పనిచేసే గంపలగూడెం మండలం కనుమూరుకు చెందిన యార్లగడ్డ చెన్నారావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై విజయభాస్కర్, చెన్నారావు మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ప్రస్తుతం మేడూరులోని పుట్టింట్లో ఉంటూ మధిర వచ్చివెళ్లే కల్పనరోజులాగే శనివారంకూడా బయలుదేరింది. ఇద్దరం కలిసి మాట్లాడుదాం.. కల్పన విషయమై మాట్లాడే పని ఉందని, ఆమె కూడా వస్తున్నందున రావాలని చెన్నారావు.. విజయభాస్కర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. తొలుత చెన్నారావు, కల్పన ద్విచక్ర వాహనంపై మధిర మండలం కృష్ణాపురం సమీపాన వెంచర్లోకి వెళ్లారు. ఆ లొకేషన్‌ను విజయభాస్కర్‌కు షేర్ చేయడంతో ఆయన కాసేపయ్యాక బయలుదేరాడు. అయితే, తొలుత వెళ్లిన చెన్నారావు, కల్పన మధ్య జరిగిన వాగ్వాదంతో ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆపై చెన్నారావు వెళ్లిపోగా, కాసేపటికి లొకేషన్ ఆధారంగా చేరుకున్న విజయభాస్కర్‌కు ఇద్దరూ కనిపించకపోవడంతో వెనుదిరిగాడు. కొద్దిసేపయ్యాక కల్పన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మధిర సీఐ మధు, సిబ్బంది చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతురాలి భర్త నాగరాజు, ఆమెతో పరిచయం ఉన్న విజయభాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, హత్య అనంతరం పరారైన చెన్నారావు... కల్పన సోదరుడి సెల్‌ఫోన్‌కు వివిధ అంశాలపై వాట్సప్ మెసేజ్‌లు చేసినట్లు తెలిసింది. ఈమేరకు మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని సీఐ వెల్లడించారు. -
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని వివేకానందనగర్ వాసి మల్లెల శ్రీనివాసరావు గృహంలో మే పుష్పం విరబూసింది. చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది.ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై నిత్యాన్నదానానికి బెంగళూరుకు చెందిన సిద్ధిరెడ్డి మునిరెడ్డి, జాహ్నవిరెడ్డి కుటుంబం శనివారం రూ.లక్ష విరాళాన్ని అందజేసింది.7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 32.3790 టీఎంసీలు. -
ప్రేమ పేరుతో నర్సును గర్భవతిని చేసిన డాక్టర్
లబ్బీపేట(విజయవాడతూర్పు): మాయమాటలు చెప్పి, శారీరకంగా లొంగదీసుకుని తనను మోసగించాడని ఓ యువతి చేసిన ఫిర్యాదు మేరకు నగరానికి చెందిన వైద్యుడిపై మహిళా పోలీసు స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. వివరాల ప్రకారం నూజివీడు ప్రాంతానికి చెందిన యువతి తొమ్మిదేళ్లుగా నగరంలోని వేర్వేరు హాస్పిటల్స్‌లో నర్సుగా పనిచేస్తోంది. 2018లో ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసే సమయంలో అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ పామర్తి భాస్కర్ ప్రకాష్ పరిచయం అయ్యారు. ఈ క్రమంలో ఆ యువతిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలవగా రెండుసార్లు గర్భం దాల్చింది. ప్రకాష్ తనకు బలవంతంగా గర్భస్రావం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని నిలదీయగా 2024 ఏప్రిల్‌లో ఓ ఇంట్లో తన మెడలో తాళి కట్టి దండలు మార్చుకున్నట్లు పేర్కొంది. అప్పటి నుంచి ఇద్దరం కలిసే ఉంటున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తాను మూడవ నెల గర్భిణీ అని, కొన్ని రోజులుగా ప్రకాష్ తన వద్దకు రాకపోవడంతో విచారణ చేయగా, అతనికి ముందే పెళ్లి అయిందని, పిల్లలు కూడా ఉన్నారని తెలిసినట్లు పేర్కొంది. ఈ విషయమై డాక్టర్ భాస్కర్ ప్రకాష్‌ను నిలదీయగా, అతని భార్య, తల్లి తనను బెదిరించారని తెలిపింది. బాధితురాలు ఎస్సీ కావడంతో డాక్టర్ భాస్కర్ ప్రకాష్ అతని భార్య, తల్లిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు, పలు సెక్షన్లపై మహిళా పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదు చేశారు. -
వెతలే.. వేతనాల్లేవ్!
– ఓఎల్ రావు, జిల్లా జాయింట్ సెక్రటరీ, ఏఐటీయూసీ – లింగం ఫిలిప్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సమస్యపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని, ఆప్కోస్ అధికారులను, మంత్రి కొలుసు పార్థసారథిని పలుమార్లు కలిసి వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేకపోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. కొత్తగా నియమితులైన ఉద్యోగులను జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని ఆప్కోస్ అధికారులు చెబుతున్నారని తెలిపారు. -
ప్రతి శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో పీజీఆర్ఎస్
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోనోవిజన్లో ఎల్జీ ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్లు గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మార్కెట్లోకి సరికొత్త ఎల్జీ ఫ్రెంచ్ డోర్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ విడుదలైంది. శుక్రవారం ఏలూరు రోడ్డులోని ‘విజయవాడ విజయ టాకీస్ సెంటర్ సోనోవిజన్లో మేనేజింగ్ డైరెక్టర్ పి.భాస్కరమూర్తి, ఏపీ రీజనల్ బిజినెస్ హెడ్ కె.వి.కృష్ణాజీ, విజయవాడ బ్రాంచ్ మేనేజర్ పి.కిషోర్ బాబు తదితరుల చేతుల మీదుగా దీనిని ఆవిష్కరించారు. ఇది ఆటో ఐస్ మేకర్‌తో వచ్చిన భారతదేశపు మొట్టమొదటి ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్ అని భాస్కరమూర్తి చెప్పారు. 610 లీటర్ల వరకు వివిధ సామర్థ్యాలతో లభించే ఈ శ్రేణిలో ఇన్‌స్టా వ్యూ డోర్ ఎన్ డోర్, వాటర్ డిస్పెన్సర్, ఫ్రెష్ కన్వర్టర్, డోర్ కూలింగ్, హైజీన్ ఫ్రెష్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఫ్రెంచ్ డోర్ శ్రేణి ధరలు రూ.1.18 లక్షల నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. దీంతో పాటు 674, 790 లీటర్ల సామర్థ్యం గల అతి పెద్ద డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లను కూడా ఎల్జీ ఎల క్ట్రానిక్స్ ఇండియా లాంచ్ చేసినట్లు భాస్కరమూర్తి వివరించారు. -
‘టిడ్కో’ పనులు వేగం పుంజుకోవాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయ వాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామంలోని టిడ్కో గృహాల సముదాయాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ శుక్రవారం పరిశీలించారు. అక్కడ పని చేస్తున్న కార్మికుల సంఖ్య నిర్మాణ పనుల పురోగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. అనంతరం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) ప్రాంతాన్ని కూడా సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి జక్కంపూడి గృహ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్‌కు వివరించారు. జక్కంపూడిలో మొత్తం 6,576 గృహాల నిర్మాణం చేపట్టగా 2026 మార్చి నెలలో 2,256 గృహాలను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. మిగిలిన 4,320 గృహాల నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రంక్ ఇన్ఫ్రా, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, గొల్లపూడి వద్ద నిర్మిస్తున్న ఇన్‌టేక్‌వెల్ పనుల పురోగతిని కూడా కలెక్టర్ లక్ష్మీశ సమీక్షించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఫీల్డ్ సిబ్బంది, ఏజెన్సీల సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
ట్రాఫిక్.. టార్చర్!
విజయవాడను పట్టి పీడిస్తున్న సమస్య సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగర ప్రజలను ట్రాఫిక్ సమస్య పట్టిపీడిస్తోంది. ఏ రోడ్డులో చూసిన బారులు తీరిన వాహనాలే దర్శనమిస్తున్నాయి. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించి గమ్యస్థానాలకు చేరుకునేందుకు వాహనచోదకులు సతమతం అవుతున్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లలో ఆక్రమణలు పెరిగిపోవడం, దుకాణాలు రోడ్లపైకి చొచ్చుకురావడంతో సమస్య మరింత జటిలమైంది. ప్రధానంగా రద్దీ ప్రాంతాలైన వన్‌టౌన్ వీధులు, బీసెంట్ రోడ్డు, గాంధీ రోడ్డులో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ఈ ప్రాంతాల్లో కనీసం నడిచేందుకు కూడా వీలు లేనంతగా రోడ్లు ఆక్రమణలకు గురయ్యాయి. దీనికితోడు ఆటో డ్రైవర్లు తమ వాహనాలను ఇష్టారాజ్యంగా రోడ్లపై అడ్డదిడ్డంగా నిలుపుతున్నారు. ఫలితంగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. నిమిషాల్లో చేరాల్సిన దూరాలకు సైతం గంటల సమయం పడుతోంది. ప్రధాన కూడళ్లలో సిగ్నల్ పడిన సమయాల్లో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కే మార్గాలు కనిపించడం లేదని నగరవాసులు వాపోతున్నారు. పార్కింగ్ ప్రాంతాలేవీ.. టాక్టికల్ ఆర్సినిజంలో భాగంగా రోడ్లకు రెండు వైపులా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న వివిధ షాపుల యజమానులు రోడ్లపై ఉంచిన వస్తువులను పోలీసులు తొలగిస్తున్నారు. ఆయా షాపుల యజమానులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చిరు వ్యాపారులకు సంబంధించిన షాపులను తొలగిస్తున్నా మార్పు మాత్రం రావటం లేదు. బందరు రోడ్డు, పీవీపీ మాల్ రోడ్డు వంటి ప్రాంతాల్లో ఉన్న ప్రధాన వర్తక సంస్థలకు పార్కింగ్ సౌకర్యం లేదు. దీంతో ఆయా సంస్థలకు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను రోడ్లపైనే ఇష్టారాజ్యంగా నిలుపుతున్నారు. వీటి వల్లా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంలేదు. స్కూళ్లు, కాలేజీలను వదిలే సమయంలో ఆయా విద్యా సంస్థల బస్సులను రోడ్లపైనే నిలపడం, విద్యార్థులు భారీగా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎన్టీఆర్ సర్కిల్లో ప్రైవేటు ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సులను అడ్డదిడ్డంగా నిలపడం కూడా ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతోంది. పట్టించుకోని ప్రభుత్వం నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా భావిస్తున్న ఏటీసీఎస్ (అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్) సంబంధించిన పనులు 2023లో ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ పనులను పట్టించుకోవటం లేదు. అప్పట్లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు రూ.5 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 17 కూడళ్లలో సిగ్నళ్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. సిగ్నల్ స్తంభాలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ బోర్డులు, వాయు కాలుష్యాన్ని గుర్తించే సెన్సార్లను అమర్చాల్సిన పనులు పూర్తి కాలేదు. నగరంలో 52 కూడళ్లలో సిగ్నళ్లు ఏర్పాటు చేశాక, వాటిని అనుసంధానించాలి. ప్రధానంగా కూడళ్లలో వాహనాల లెక్కింపు కోసం సీసీ కెమెరాలు బిగించి, వాటి నుంచి ఇచ్చే ఇన్పుట్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి చేరేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకు రూ.5 కోట్ల ఖర్చవుతుందని పోలీసులు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు ప్రతిపాదించినా ఫలితం లేకుండా పోయింది. నగరంలో మూడు జోన్లు.. నగరంలో వీధి వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా రెడ్, గ్రీన్, అంబర్ జోన్లను గుర్తించారు. ఇప్పటికే స్ట్రీట్ వెండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. వీధి వ్యాపారస్తులు, ప్రజా ప్రతినిధులు, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. నగరంలో 1200 వీధుల్లో వ్యాపారం సాగుతున్నట్లు సర్వేలో గుర్తించారు. వీరిలో పలువురికి లైసన్సుతో పాటు గుర్తింపు కార్డులు కూడా లేవు. బీసెంట్ రోడ్డులో 257 మంది వీధి వ్యాపారం చేస్తుండగా, లైసెన్స్ కలిగిన వారు 57 మంది మాత్రమే. మిగిలిన వారంతా అనధికారికంగా వ్యాపారం సాగిస్తున్నారు. కార్పొరేషన్ లైసెన్స్ పొందిన వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి కట్టడి చేస్తే, కొంత మేర ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. -
జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ
పెనమలూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందటంతో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా చాట్రాయి మండలం గుడిపాడు గ్రామానికి చెందిన నల్లంటి హర్షవర్థనరావు(19) నారాయణ కాలేజీ బెంజిసర్కిల్ వద్ద మెటీరియల్ ఇన్చార్జిగా పని చేస్తున్నాడు. అతను కానూరులో హాస్టల్లో ఉంటాడు. ఈ నెల 8వ తేదీ రాత్రి హర్షవర్థన్‌రావు తన సహద్యోగి ప్రవీణ్‌కుమార్‌తో కలిసి బైక్ పై కానూరుకు బయలుదేరారు. ప్రవీణ్‌కుమార్ నిర్లక్ష్యంగా బైక్ నడపటంతో కానూరు పెట్రోల్‌బంక్ వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న హర్షవర్థన్‌రావు రోడ్డుపై పడిపోవటంతో తలకు తీవ్ర గాయమైంది. అపస్మారకస్థితిలో ఉన్న అతడిని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర చికిత్స నిమిత్తం చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హర్షవర్థన్‌రావు గురువారం మృతి చెందాడు. మృతుడి బాబాయి బాబూరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రోడ్లపై అడ్డదిడ్డంగా..
ప్రధానంగా వన్‌టౌన్ ప్రాంతంలో భావన్నారాయణ వీధి, చిట్టూరి కాంప్లెక్స్ మీదుగా బీఆర్పీ రోడ్డు ప్రాంతాల్లో రోడ్లకు రెండు వైపులా ఆక్రమణలతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. బ్రాహ్మణ వీధి, శివాలయం వీధి, వన్‌టౌన్ మెయిన్ బజారు, రాంగోపాల్ వీధి, పులిపాటి వారి వీధిలో దుకాణాలు రోడ్లపైకి చొచ్చుకొస్తున్నాయి. వీటి వల్ల ద్విచక్రవాహనాలు ప్రయాణించడమే కాదు పాదచారులు నడిచేందుకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. బీసెంట్ రోడ్డు మొత్తం ఆక్రమణలతో నిండిపోతోంది. రోడ్డుకు రెండు వైపులా బండ్లతోనే నిండి ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించడంతో కనీసం రోడ్డుపై నడవాలన్న ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. దుకాణాల నిర్వాహకులు, చిరు వ్యాపారులకు ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా, రోడ్లపైన పెట్టిన వస్తువులను తొలగిస్తున్నా మార్పు రావటం లేదు. -
నిత్యాన్నదానానికి పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శుక్రవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. గూడవల్లికి చెందిన జి. రామ్మోహనరావు దంపతులు రూ. లక్ష, ముమ్మిడివరానికి చెందిన సీహెచ్ నటరాజు, సత్య అమర తులసీ రూ. 1,41,200 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ అధికారి నాగేశ్వరరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను బహూకరించారు. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి జి.కొండూరు: బడి ఈడు పిల్లలను తప్పక పాఠశాలల్లో చేర్పించే విధంగా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. జి.కొండూరు మండల పరిధి కుంటముక్కల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీశ హాజరయ్యారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, డీఈఓ ఎల్. చంద్రకళతో కలిసి బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా చేరిన చిన్నారులతో ముచ్చటించారు. స్థానిక ఎంపీయూపీ, జెడ్పీ హై స్కూలును సందర్శించారు. పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.రమేష్‌బాబు, ఎంఈఓలు రాజు, వీరాస్వామి పాల్గొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితో చదువులో రాణించాలి హనుమాన్‌జంక్షన్ రూరల్: విద్య ద్వారానే సమాజంలోని అసమానతలను తొలగించగలమని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో చదువులో రాణించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమతి జగడం అన్నారు. బాపులపాడు మండలం వీరవల్లిలో విశ్రాంత ఉపాధ్యాయుడు దారం శామ్యూల్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని గురువారం రాత్రి ఆమె ఆవిష్కరించారు. సభాధ్యక్షుడిగా అంబేడ్కర్ వాది పంతగాని రమేష్ మాట్లాడుతూ పాలకులు రాజ్యాంగ హక్కులను నిర్లక్ష్యం చేయవద్దని, రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ప్రజలు చైతన్యవంతులు కావాలని చెప్పారు. రిటైర్డ్ ఆర్డీవో సీహెచ్ రంగయ్య, రిటైర్డ్ డీఎస్పీ ఎస్.శుభాకర్, రిటైర్డ్ ఎంపీడీవో వేమూరి ఎంజల్ విజయకుమార్, ఏపీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు పాల్గొన్నారు. పక్కాగా జనగణన పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న జనగణన ప్రక్రియను జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ప్రసన్న కుమార్ పరిశీలించారు. వీఎంసీ సెన్సెస్ ఇన్చార్జ్ వెంకటరమణ, సిటీ సెన్సెస్ ఆఫీసర్, అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు ఆధ్వర్యంలో శుక్రవారం మధురానగర్, ఊర్మిళా నగర్ ప్రాంతాలలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని సందర్శించి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల పనితీరును సమీక్షించారు. ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించిన అదనపు కమిషనర్ ప్రజల వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా జనగణన నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను సమగ్రంగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్ ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను ఆదేశించారు. -
విద్యుత్ చౌర్యం సామాజిక నేరం
నాగాయలంక: విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని, చౌర్యానికి పాల్పడిన వారిపై చట్టపరమైన తీసుకుంటామని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ రవీంద్రబాబు హెచ్చరించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ వాసు, ఉయ్యూరు ఆపరేషన్స్ ఇంజినీర్ సుధాకర్ ఆధ్వర్యంలో అధికారులు 50బృందాలుగా ఏర్పడి మండలంలోని గ్రామాల్లో సోమవారం విస్త్రృత తనిఖీలు నిర్వహించారు. అనంతరం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో సోమవారం రాత్రి ఈ బృందాలతో సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ 3,816 గృహ, వాణిజ్య, ఆక్వా, ఇతర సర్వీసులను తనిఖీ చేసినట్లు వెల్లడించారు. వీటిలో 437సర్వీసులకు సంబంధించి 581కేడబ్ల్యూ అదనపులోడు కింద రూ.11,38,000 అపరాధ రుసుము విధించినట్లు వివరించారు. సమాచారం ఇవ్వండి.. విద్యుత్ మీటర్లకు తప్పనిసరిగా సీల్ ఉండాలని లేనిచో సంబంధిత అధికారికి తక్షణం సమాచారం ఇవ్వాలని రవీంద్రబాబు సూచించారు. తమ తనిఖీలలో సీలు లేకపోవడం, గాట్లు పడటం, మీటర్లు మార్చడం వంటి చర్యలు గుర్తిస్తే వాటిని విద్యుత్ చౌర్యంగా పరిగణించి విద్యుత్ చట్టం135కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మొదటి తప్పునకు కాంపౌండింగ్ పద్ధతిలో మినహాయింపు ఇచ్చినప్పటికీ, రెండోసారి అదే తప్పు చేస్తే అరెస్ట్ చేయించి రిమాండ్‌కు పంపిస్తామని పేర్కొన్నారు. ఎక్కడైనా విద్యుత్ చౌర్యం గుర్తిస్తే 94408 12091, 94408 12362, 94408 12363 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యుత్ విజిలెన్స్ తనిఖీలలో అవనిగడ్డ డీఈఈ ఎన్.సుబ్రహ్మణ్యేశ్వరరావు, నాగాయలంక ఏఈ జి.వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ రవీంద్రబాబు -
దుర్గ గుడిలో ప్రమాదం.. పెచ్చులూడి బాలిక తలకు తీవ్ర గాయాలు
విజయవాడ: కనక దుర్గమ్మ ఆలయంలో ప్రమాదం చోటు చేసుకుంది. మెట్ల పూజ చేస్తుండగా భక్తులపై స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. బాలిక తలకు తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. ప్రమాదం సమయంలో దుర్గగుడి వైద్యులు అందుబాటులో లేరు. దీంతో అధికారుల నిర్లక్క్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. -
దుర్గమ్మ సేవలో హోం మంత్రి అనిత
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర హోం మంత్రి అనిత గురువారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన హోం మంత్రి అనితకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం హోంమంత్రికి వేద పండి తులు ఆశీర్వచనం, ఆలయ ఏఈఓ వెంకట రెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లా అండర్–19 ఉమెన్ క్రికెట్ జట్టు ఎంపిక ప్రక్రియను గురువారం పూర్తిచేశామని కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్ర చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. కెప్టెన్‌గా మహమ్మద్ మెహాక్, సభ్యులుగా వి.అక్షయ, సీహెచ్.ధనశ్రీ, బి.స్రవంతి, టి.గుణచంద్రిక, పి.లక్ష్మీఅపర్ణ, బి.తమిళిక, ఆర్.చేతన ప్రియ, ఎం.సృజన, జె.ఎన్.ఎస్.ఎస్.యశశ్విని, జి.హరిణి, కె.హరిక, ఆర్.మానస యశోధ, కె.కీర్తి, ఆర్.ఇష్క్మయి, స్టాండ్‌బైగా సీహెచ్.గీతికాకృష్ణ, వి.దివ్యప్రియ, పి.సుమశ్రీ, పి.ఆనంద్ దీప్తి, కె.సిసిర, కె.మేఘనాసాయి, ఎస్.ఎస్. శ్రీకరిని ఎంపిక చేశారు. పామర్రు: జూన్ పదో తేదీ నాటికి సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పనులను పూర్తి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు లావణ్యవేణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా పామర్రులో నిర్మాణంలో ఉన్న హాస్టల్‌ను ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా లావణ్యవేణి మాట్లాడుతూ.. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం పనులు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో హాస్టళ్ల అభివృద్ధికి రూ.2.3 కోట్లు అదనంగా, డీఎంఎఫ్ నుంచి రూ.4.5 కోట్లు వెచ్చిస్తున్నామని వివరించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు దుప్పట్లు, కార్పెట్లు, ఇతర నిత్యావసర సామగ్రి పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్‌బాబు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): మునిసిపల్ కమిషనర్లు వారంలో ఒక రోజు అన్న క్యాంటీన్లలో భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ కృష్ణలంకలోని రాణిగారితోట సాయిబాబా గుడి సమీపంలోని అన్న క్యాంటీన్‌ను ఆయన గురువారం మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్లో ఉన్న సదుపాయాలు, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, తాగు నీటి ఏర్పాట్లను పరిశీలించారు. క్యాంటీన్లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్, కూలర్లు, దోమ తెరలు, ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం వారిద్దరూ రూ.5 చొప్పున చెల్లించి టోకెన్లు తీసుకుని అందరితో కలిసి భోజనం చేశారు. ప్రజలతో మాట్లాడి వారికి అందుతున్న ఆహారం నాణ్యతపై అభిప్రాయాలని అడిగి తెలుసుకున్నారు. -
ఎరువుల ధరలు తగ్గించాలని ధర్నా
ఆటోనగర్(విజయవాడతూర్పు): పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కోరుతూ సీపీఎం, ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం కృష్ణంలకలోని ఫ్యాక్ట్ ఎరువుల రాష్ట్ర కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. కృష్ణయ్య, పలువురు నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ఫలితంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రెండేళ్లుగా యూరియా, డీఏపీ ఎరువులు అందక పంటలు సాగు చేయలేకపోయారని పేర్కొన్నారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టిన ఎరువుల బిల్లును ఉపసంహరించుకోవాలని సూచించారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఎరువుల సబ్సిడీలను భరించాలన్నారు. రైతులు, కౌలు రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించాలన్నారు. కాంప్లెక్స్ ఎరువుల బస్తా ధరను రూ.150 నుంచి రూ.300 వరకు కేంద్రం పెంచి రైతులపై వందల కోట్ల రూపాయల భారం మోపిందని దుయ్యబట్టారు. ఉచిత సలహాలతో సరి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్పత్తి ఖర్చులు తగ్గించాలని ఉచిత సలహాలు ఇవ్వడం మినహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునే ప్రయత్నాలు చేయడం లేదని కృష్ణయ్య విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల ధరలపై నోరు మెదపడంలేదని మండిపడ్డారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్యుడి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర వీడి ఎరువు ధరలను తగ్గించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తొలుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు కౌలు సంఘం కార్యదర్శి ఎం.హరిబాబు, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.బలరాం, వై.కేశవరావు, వై.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పాత ధరలకే ఎరువులను అందించాలి సకాలంలో అవసరమైన ఎరువులు అందకపో వడం వల్ల రెండేళ్లు తీవ్రంగా నష్టపోయామని ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులు పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొన్ని రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుందని, అయితే అవసరమైన ఎరువులు అందుబాటులో లేవని ఆందో ళన వ్యక్తంచేశారు. పాత ధరలకే ఎరువులు అందించి తమను ఆదుకోవాలని రైతులు కోరారు. ఆయా పంటలకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తిచేశారు. -
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
మోపిదేవి: కృష్ణాజిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి చెందిన నూతన షాపింగ్ కాంప్లెక్స్‌లో షాపుల బహిరంగ వేలం ఆలయ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. రెండేళ్ల కాలపరిమితికి ఈ వేలం పాట నిర్వహించగా మొత్తం పది షాపులకు గాను రూ. 6,61,000 ఆదాయం సమకూరినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. మొత్తం పది షాపులగానూ ఈ ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. మచిలీ పట్నం డివిజన్ తనిఖీ అధికారి కె. శ్రీనివాసరావు, ఆలయ సూపరిటెండెంట్ అచ్యుత మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు గురువారం మంగళగిరి పరిధిలోని సీకే కన్వెన్షన్‌లో సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై 65 మంది విద్యార్థులకు రూ. 5 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం, లెదర్ బ్యాగ్, పెన్నులతోపాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా జిల్లాలో మొదటి పది స్థానాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. లిడ్‌క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు, ఆర్జేడీ నాగమణి, డీఈవోలు సలీంబాషా, శ్రీనివాసరావు, రామారావు, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాల మీదకు తెచ్చిన చేపల వేట
చెరువులో పడి యువకుడు మృతి షేర్‌మహ్మద్‌పేట(జగ్గయ్యపేట): చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన షేర్‌మహ్మద్‌పేటలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అడ్డరోడ్డుకు చెందిన బాణావత్ ఛత్రపతి నాయక్ (22) చేపలు పట్టే కూలీ పనికి వెళ్తుంటారు. గ్రామంలో చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి చెరువులోని చేపల వలను పైకి తీసుకువస్తుండగా బరువుకు చెరువులో పడి మునిగిపోయాడు. సమీపంలోని వారు గమనించి బయటకు తీసేలోగా అప్పటికే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిలకల్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ తెలిపారు. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఆర్టీసీ బస్సు కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఘటనపై బాలుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలివి.. కొత్తపేట కుమ్మరి వీధికి చెందిన మజ్జి ఇంద్రకుమార్ కుటుంబం నివాసం ఉంటోంది. ఇంద్రకుమార్ మెడికల్ షాపులో పని చేస్తుంటాడు. ఇంద్రకుమార్‌కు ఇద్దరు కుమారులు కాగా రెండో కుమారుడు అంకిత్ గిరిధర్(12) ఏడో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో గురువారం మధ్యాహ్నం గిరిధర్ తన అన్నతో కలిసి తండ్రి వద్దకు వెళ్లి భోజనం ఇచ్చాడు. అదే సమయంలో తల్లి అక్కడికి రావడంతో పెద్ద కుమారుడు తల్లితో కలిసి మోపెడ్‌పై ఇంటికి వచ్చేశారు. ఇక గిరిధర్ సైకిల్ తీసుకుని గణపతిరావు రోడ్డుపైకి వచ్చాడు. బస్సు చక్రాల కింద పడి.. గణపతిరావు రోడ్డులో కృష్ణవేణి కాంప్లెక్స్ బస్టాప్ వద్ద రోడ్డు మలుపు తిరుగుతుండగా, పంజా సెంటర్ వైపు నుంచి నెహ్రూబొమ్మ సెంటర్ వైపు వెళ్తున్న ఇబ్రహీంపట్నంకు చెందిన సర్వీసు నంబర్ 3ఏ బస్సు బాలుడిని గమనించలేదు. ఇంతలో బస్సు గిరిధర్‌ను ఢీ కొట్టగా రోడ్డుపై పడ్డాడు. బస్సు చక్రాల కింద బాలుడు నలిగిపోవడంతో తీవ్ర గాయాలై చాతి నుంచి భుజం వరకు, ముక్కు, మూతి నుంచి రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. ఇంతలో బస్సులో ఉన్న వారు ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలంలో గుమిగూడి వెంటనే బాలుడిని షేక్ రాజా హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. అప్పటి వరకు తన కళ్ల ముందు కనిపించిన చిన్న కుమారుడు కొన్ని నిమిషాల లోపే విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణాతీతం. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి
రాష్ట్రంలో స్వర్ణకార వృత్తిదారులు పనులు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితి నెల కొంది. ధరలు పెరిగి వ్యాపారాలు పూర్తిగా దిగజారి అల్లాడుతున్న నేపథ్యంలో సాక్షాత్తూ ప్రధానే బంగారు ఆభరణాలు కొనవద్దని చెబితే ఆ రంగంపై ఆధారపడిన వారి పరిస్థితి ఏమిటి? మరో వైపు బంగారం దిగుమతి సుంకం అమాంతం పెంచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వివిధ సంక్షేమ పథ కాలు కార్మికులకు అండగా ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు లేక కార్మికులు అల్లాడుతున్నారు. వృత్తిదారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. – తోలేటి శ్రీకాంత్, రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ చేతివృత్తుల విభాగం -
పనులు ప్రారంభించని పరిశ్రమలను రద్దు చేయండి
పరిశ్రమల శాఖాధికారులతో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ మచిలీపట్నం(చిలకలపూడి): కృష్ణా జిల్లాలో అనుమతులు పొందిన పరిశ్రమలను వెంటనే నెలకొల్పేందుకు లబ్ధిదారులు ముందుకు రావాలని, లేనిపక్షంలో వాటిని రద్దు చేస్తామని కలెక్టర్ డి.కె.బాలాజీ హెచ్చరించారు. తన చాంబర్లో పరిశ్రమల స్థాపనపై సంబంధిత అధికారులతో గురువారం ఉదయం సమావేశం నిర్వహించారు. పలువురు లబ్ధిదారులతో కలెక్టర్ స్వయంగా ఫోన్లో మాట్లాడి పరిశ్రమలను ఎందుకు ప్రారంభించడం లేదన్న వివరాలు తెలుసుకున్నారు. వెంటనే నిర్మాణం మొదలు పెట్టాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మల్లవల్లి, వీరపునేనిగూడెం పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల స్థాపనకు 370 అనుమతులు ఇచ్చామన్నారు. అనుమతులిచ్చి ఏదాదిన్నర దాటినా నిర్మాణం చేపట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొద్ది రోజుల్లో పనులు చేపట్టకపోతే మంజూరు చేసిన స్థలంతో పాటు అన్ని రకాల అనుమతులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కొంతమంది భవన నిర్మాణం ఆమోదం కోసం దరఖాస్తు చేయకపోవడం విచారకరమన్నారు. అనుమతులు మంజూరై ఇప్పటి వరకు పనులు ప్రారంభించని లబ్ధిదారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరి శ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్.వెంకటరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ బాబ్జి, ప్రత్యేక అధికారులు జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి ఎస్.వెంకటరావు, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం, డీటీడబ్ల్యూఓ ఫణి దూర్జటి, మార్క్‌ఫెడ్ డీఎం మురళీ కిషోర్, డీసీఓ చంద్రశేఖర్, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి నరేష్, జిల్లా ఉపాధి కల్పనాధికారి బ్రహ్మం, డీఎల్డీఓ సునీతశర్మ తదితరులు పాల్గొన్నారు. -
అతిథిలా చేరి.. పెళ్లింట చోరీలు
కోనేరుసెంటర్: జిల్లాలోని అనేక ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటంతో పాటు గంజాయి అమ్మకాలు జరుపుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను పెనమలూరు పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వారి నుంచి పెద్దమొత్తంలో నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన అనికేష్ కుమార్ సాన్సి, రితేష్ పలు రాష్ట్రాల్లో దొంగతనాలతో పాటు గంజాయి అమ్మకాలు జరుపుతుంటారు. గురువారం పెనమలూరు సీఐ వెంకటనారాయణకు కానూరు తులసీనగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించారు. దీంతో సీఐ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారించగా వారు కానూరుతో పాటు విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల్లో జరిగిన అనేక వివాహ వేడుకల్లో చోరీలకు పాల్పడి సుమారు రూ.10 లక్షల ఖరీదు చేసే 55 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ. 3,10,000 నగదును అపహరించినట్లుగా అంగీకరించారు. గంజాయి అమ్మకాలు కూడా.. అలాగే వీరువురు గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు ఒప్పుకోవటంతో వారి వద్ద నుంచి 3.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, గన్నవరం ఇన్చార్జ్ డీఎస్పీ, పి. శ్రీనివాస్, స్పెషల్‌బ్రాంచ్ సీఐ సత్యకిషోర్, పెనమలూరు సీఐ వెంకటరమణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్ ఘాట్ ధ్వంసంపై విమర్శలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రజా ప్రయోజనార్థం కృష్ణానదీ తీరాన ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామంలో వైఎస్సార్ ఘాట్‌ను నిర్మించారు. అయితే దీనిని ఇన్‌టేక్ వెల్ నిర్మాణం పేరుతో ధ్వంసం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2022లో రూ.26 లక్షలతో పంచాయతీ, మండల నిధులతో పంచాయతీ రాజ్ శాఖ వైఎస్సార్ ఘాట్‌ను నిర్మించింది. అప్పటి నుంచి అహ్లాదకర వాతావరణంలో ఈ ఘాట్ ప్రజలతో కళకళలాడుతోంది. ప్రస్తుతం ఇన్‌టేక్ వెల్ కోసం ర్యాంప్ ఏర్పాటుకు భారీ ఎత్తున ఇసుక డంప్ చేయడంతో ఘాట్ కళావిహీనంగా మారింది. ఇన్‌టేక్ వెల్ కోసం లోతుగా గోతులు తీయాల్సి ఉంటుంది. వెల్ చుట్టూ సుడులు మాదిరిగా ఖాళీ వలయం ఏర్పడుతుంది. ఇన్‌టేక్ వెల్ నిర్మాణం పూర్తయిన తరువాత నదీ స్నానానికి, ఈత కొట్టేందుకు వచ్చేవారు ఇన్‌టేక్‌వెల్ కోసం తీసిన గోతుల కారణంగా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఈ ప్రమాదాల సాకుగా ఘాట్‌ను మూసివేసే ప్రమాదం ఉందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. జక్కంపూడిలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు తాగు నీటి సరఫరా నిమిత్తం వైఎస్సార్ ఘాట్‌లో ఇన్‌టేక్ వెల్ నిర్మించాలన్న కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పనులు చేపట్టామని టిడ్కో ఇంజినీరింగ్ అధికారి తెలిపారు. ఘాట్‌లో పనులు మొదలుపెట్టి వారం రోజులు అవుతుండగా, రెండు రోజుల క్రితమే తనకు సమాచారం ఇచ్చారని గొల్లపూడి ఈఓ చింతలమ్మ తెలిపారు. మొత్తం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చూసుకుంటున్నారని పేర్కొన్నారు. దీనిపై వీఆర్ఓ పవన్‌ను వివరణ కోరగా కలెక్టర్ ఆదేశాలను పాటించడమే తమ విధి అని స్పష్టం చేశారు. -
అనగనగా..
● పెరిగిన ధరలకు తోడు బంగారం దిగుమతిపై పది శాతం సుంకం విధింపుతో బెంబేలు వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ‘బంగారం కొనవద్దంటే ఎలా? మా ఉపాధి మాటేమిటి? మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు?’ అంటూ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని స్వర్ణకారులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన మంత్రి మోదీ స్వయంగా బంగారు నగలు కొన వద్దని పిలుపు ఇచ్చిన నేపథ్యంలో నగల తయారీ వృత్తి కనుమరుగు అవ్వాల్సిందేనా అని వాపోతున్నారు. బంగారం ధర చుక్కలనంటడంతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరి ణామాల నేపథ్యంలో మారిన దేశీయ పరిస్థితులు స్వర్ణకారుల పరిస్థితిని పూర్తిగా దిగజార్చాయి. కేవలం స్వర్ణకారులే కాకుండా బంగారు నగల వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలన్నింటిని తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వేలాదిగా ఈ రంగంపై ఆధారపడిన కార్మికులు, నగల వ్యాపారులు తమ భవిష్యత్ ఏమిటి అన్న భయంతో తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారు. పెరిగిన ధర.. ఆపై పన్నుపోటు ములిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది. స్వర్ణకార వృత్తిదారుల పరిస్థితి. ఇరాన్, అమెరికా యుద్ధ్యం నేపథ్యంలో బంగారం ధర చుక్కలనంటుతోంది. ఇది ఉమ్మడి జిల్లాలో బంగారం విక్రయాలు, నగల తయారీపై తీవ్ర ప్రభావం చూపించింది. ధర పెరిగి, నగలు తయారు చేయించేవారు తగ్గి వృత్తిదారులు అల్లాడుతున్న నేపథ్యంలో ఏడాది పాటు ప్రజలంతా బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని నరేంద్రమోదీ పిలుపు ఇచ్చారు. అంతేకాకుండా బంగారం దిగుమతి సుంకాన్ని పదిశాతం పెంచారు. దీంతో బంగార ధర మరింత పెరిగింది. దీంతో స్వర్ణకార వృత్తిదారుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఉపాధిపై భయాందోళనలు ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారుగా 50 వేల మంది స్వర్ణకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరు కాకుండా బంగారు నగల వ్యాపారం చేసేవారు సైతం వేల మంది ఉన్నారు. విజయవాడతో పాటుగా మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, నూజివీడు తది తర ప్రాంతాల్లో స్వర్ణకార వృత్తిదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒక్క విజయవాడలోనే 30 వేల నుంచి 35 వేలకు పైగా కుటుంబాలు బంగారు నగల తయారీపై ఆధారపడి జీవిస్తున్నాయి. విజయవాడ పాతబస్తీలోనే 25 వేల మంది జీవిస్తున్నారని ఆయా సంఘాల నేతలు చెబుతున్నారు. వీరిలో కేవలం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వృత్తిదారులు ఆరేడు వేల మంది ఉన్నారని అంచనా. నగరంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు సైతం స్వర్ణాభరణాల తయారీపై ఆధారపడి జీవిస్తున్నారు. బంగారు ఆభరణాల రంగం కార్పొరేట్ సంస్థల చేతిలోకి వెళ్లిన నేపథ్యంలో స్వర్ణకార వృత్తిదారులు చాలా మంది పనులు లేక అల్లాడుతున్నారు. ఉపాధి కోసం ఇతర రంగాలను ఆశ్రయిస్తున్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో వృత్తిదారుల కుటుంబాలన్నీ ఉపాధి కోల్పోతామని ఆందోళన చెందుతున్నాయి. బంగారు ఆభరణాల తయారీ పనులు పూర్తిగా దిగజారిపోయాయి. గతంలో ఆభరణాల తయారీ అంటే స్వర్ణకార వృత్తి దారుల వద్దకే ప్రజలు వచ్చేవారు. కార్పొరేట్ సంస్థల ప్రచారంతో మా వద్దకు వచ్చే వారి సంఖ్య పడిపోయింది. ఇప్పుడేమో ఏకంగా ప్రధాని బంగారం కొనవద్దని చెప్పి, పన్నులు పెంచితే మా వృత్తిదారుల పరిస్థితి ఏమిటి? మా కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలి. – చిట్టూరి రాజేష్, స్వర్ణకార వృత్తిదారుడు, విజయవాడ బంగారు నగల విక్రయాలను కేంద్ర ప్రభుత్వమే నీరు గారుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వర్ణకార వృత్తిదారులను ఆదు కోవాలి. కొనేవాళ్లు లేక నగల వ్యాపారులు, పనులు లేక వృత్తిదారులం అల్లాడిపోతున్నాం. ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా నగలు కొనవద్దంటే మా లాంటి వారు ఏమి కావాలి? స్వర్ణకార వృత్తిదారులను ఆదుకునేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలి. – అవ్వారు జోజిబాబు, స్వర్ణకార వృత్తిదారుడు, విజయవాడ -
చెక్ డ్యామ్ నిర్మాణానికి త్వరలో చర్యలు
జి.కొండూరు: చిన్ననందిగామ వద్ద కోతుల వాగుపై చెక్ డ్యామ్ పునర్నిర్మాణానికి త్వరలో చర్యలు చేపడతామని ఇరిగేషన్ ఏఈ టి.రాజేష్ తెలిపారు. కోతులవాగుపై చెక్ డ్యామ్ ధ్వంసమై రైతులు సాగునీటి కోసం నరకయాతన పడుతున్న క్రమంలో ‘చెక్ ఢాం.. నీరుగారిన లక్ష్యం’ శీర్షికన సాక్షిలో గురువారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు చెక్ డ్యామ్ నిర్మాణానికి త్వరలో చర్యలు చేపడతా మని ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. చెక్ డ్యామ్ శిథిలావస్థకు చేరడంతో 2018లో పునర్నిర్మాణానికి రూ.315 లక్షలు మంజూరవగా సాంకేతిక సమస్యల వల్ల కాంట్రాక్టరు పనులను ప్రారంభించలేదన్నారు. 2024, 2025 సంవత్సరాల్లో కోతులవా గుకు వచ్చిన వరదతో చెక్‌డ్యామ్ ధ్వంసమైందన్నారు. ఈ క్రమంలో నూతన చెక్ డ్యామ్ నిర్మాణం కోసం నీటి సంఘం నాయకులు, రైతులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఇదే విషయాన్ని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఎమ్మెల్యే విన్నవించారని తెలిపారు. ఆ వెంటనే చెక్ డ్యామ్‌ని పరిశీలించి నూతన నిర్మాణం కోసం చర్యలు చేప ట్టాలని మంత్రి సైతం జలవనరుల శాఖ అధికా రులను ఆదేశించారన్నారు. ఈ క్రమంలో చెక్ డ్యామ్ నిర్మాణానికి సంబంధిత అధికారుల నుంచి డిజైన్, డ్రాయింగ్ తీసుకొని, ప్రతిపాదనలు పంపి, నూతన నిర్మాణానికి చర్యలు చేపడతా మని ఏఈ వివరించారు. -
కచ్చితత్వంతో జనగణన ప్రక్రియను పూర్తిచేయాలి
గన్నవరం: మండలంలోని కేసరపల్లి గ్రామంలో జరుగుతున్న జనగణన ప్రక్రియను కృష్ణా జిల్లా పరిషత్ సీఈఓ, జనగణన గన్నవరం నియోజకవర్గ ప్రత్యేకాధికారి జె.అరుణ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామంలోని ఐటీ పార్కు సమీపంలోని ఇళ్లను ఆమె స్వయంగా సందర్శించి ఎన్యూమరేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఇంటి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం నమోదును పరిశీలించిన ఆమె ఎన్యూమరేట్లు, సూపర్వైజర్లు, చార్జ్ ఆఫీసర్లకు సలహాలు, సూచనలు ఇచ్చారు. గన్నవరం మండలంలో ఇప్పటి వరకు 67.9 శాతం జనగణనను పూర్తిచేసి జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో ఎన్యూమరేట్లు, సూపర్వైజర్లు, చార్జ్ ఆఫీసర్లు పనిచేసి నిర్ణీత గడువులోపు కచ్చితత్వంతో జనగణనను పూర్తిచేయాలని సూచించారు. మండలంలో ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి సమగ్ర సమాచారంతో జనగణన నమోదు చేయాలని స్పష్టంచేశారు. తహసీల్దారు కె.వెంకటశివయ్య, ఎంపీడీఓ టి.స్వర్ణలత, పంచాయతీ కార్యదర్శి సి.వి.ఎల్.ఎస్.ఆర్.వి.ప్రసాద్, ఎన్యూమరేటర్ తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా సోలార్ రూఫ్‌టాప్ అమలు
మచిలీపట్నంటౌన్: నగరంలోని ఏపీసీపీడీసీఎల్ కృష్ణా సర్కిల్ కార్యాలయంలో సీఎండీ పి.పుల్లారెడ్డి గురువారం సర్కిల్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటు, పీఎం సూర్య ఘర్ పథకం అమలు, రెవెన్యూ కలెక్షన్లు, లో ఓల్టేజీ సమస్యల పరిష్కారంపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ పుల్లారెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించాలని, రెవెన్యూ కలెక్షన్లు వంద శాతం సాధించాలని, లో ఓల్టేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫీడర్లను నిరంతరం పర్యవేక్షిస్తూ బ్రేక్డౌన్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లక్ష్యాన్ని అందుకోవాలి.. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సోలార్ రూఫ్‌టాప్ కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. సీపీడీసీఎల్ పరిధిలో ఆగస్టు నెలాఖరు లోపు 1.91లక్షల సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్ల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైందన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇప్పటి వరకు సీపీడీసీఎల్ పరిధిలో దాదాపు 40 వేల కనెక్షన్లు ఇచ్చామన్నారు. కృష్ణా జిల్లాలోని కొన్ని మండలాల్లో పురోగతి తక్కువగా ఉండటంపై సమీక్ష నిర్వహించి, అన్ని గ్రామాల్లో కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల పెండింగ్ దరఖాస్తులను మూడు నెలల్లోపు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణ యాదవ్, డైరెక్టర్ ఫైనాన్స్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్ఈ పి.రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
18న బాపూ మ్యూజియంలో ప్రత్యేక కార్యక్రమాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. పర్యాటక, ఆర్కియాలజీ శాఖతో పాటు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ కమిటీ భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. కలెక్టరేట్లో మ్యూజియం దినోత్సవ కార్యక్రమాలపై కలెక్టర్ లక్ష్మీశ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘మ్యూజియమ్స్ యునైటింగ్ ఏ డివైడెడ్ వరల్డ్ థీమ్’తో ఈ ఏడాది అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుగుతుందన్నారు. 1887లో పునాది పడిన మన నగరంలోని బాపూ మ్యూజియాన్ని ఈ నెల 18న ఉచితంగా సందర్శించొచ్చని సూచించారు. బాపూ మ్యూజియంలో రోజంతా ప్రత్యేకం: 18న ఉదయం బాపూ మ్యూజియంలో కల్చరల్ ఓపెనింగ్‌తో ప్రారంభమై మ్యూజియమ్స్ ఇన్ ది మోడర్న్ డేపై ప్రత్యేక చర్చలు, గైడెడ్ మ్యూజియం టూర్, విజయవాడ హెరిటేజ్ క్విజ్, దేశభక్తిని పెంపొందించేలా మ్యూజియం విశిష్టత చాటేలా లేజర్ షో వంటి కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తామన్నారు. సాయంత్రం ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో జరిగే రూట్స్ రీలోడెడ్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గాయని గీతామాధురి బృందంతో పాటు బ్యాండ్ సెహారీ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యక్రమాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఆర్కియాలజీ డీడీ ఎం.రామసుబ్బారెడ్డి, ఏడీలు వెంకటరావు, నరసింహనాయుడు, ఉత్సవ కమిటీ ప్రతినిధి వి.ఎంజసుధర్మ పాల్గొన్నారు. -
పాఠశాలల పునఃప్రారంభం రోజు విద్యాకిట్ల పంపిణీ
డీఈవో వైవీ సుబ్బారావు పెడన: ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ముగిసిన వెంటనే పాఠశాలలు పునఃప్రారంభం రోజున విద్యాకిట్లను పంపిణీ చేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి వైవీ సుబ్బారావు తెలిపారు. పెడనలోని భట్టా జ్ఞానకోటయ్య జెడ్పీహెచ్ఎస్లో బుధవారం ఆయన పెడన మండలానికి సంబంధించిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల స్టాక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి మూడు జతల యూనిఫామ్ క్లాత్, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులు, షూస్, బెల్ట్, డిక్షనరీ ఇస్తామన్నారు. పెడన మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో 3,538 మంది విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కిట్లను రిసీవ్ చేసుకోవడం, జాగ్రత్తగా భద్రపరచడం, ప్రతి ఒక్క విద్యార్థికి సజావుగా కిట్లను అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. కిట్ల నాణ్యతను పరిశీలించి యాప్‌లో నమోదు చేసిన పిమ్మట విద్యార్థులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. -
వైన్‌షాపు భాగస్వామిపై టీడీపీ నేత దాడి
పెడన: తెలుగు తమ్ముళ్ల రౌడీయిజం వెర్రితలలు వేస్తోంది. తమ పార్టీకి చెందిన వారిపైనే... అదీ పోలీసుల సమక్షంలోనే దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సేకరించిన, బాధితులు తెలిపిన వివరాల మేరకు పెడన నియోజకవర్గం గూడూరులోని పెట్రోల్‌బంకు సమీపంలో రాయల్వైన్స్ షాపు పామర్రుకు చెందిన వారికి లాటరీలో దక్కింది. నలుగురు భాగస్వాములతో నడుస్తోంది. ఈ నలుగురిలో ఒకరైన చిలంకుర్తి అశోక్‌పై మంగళవారం రాత్రి తెలుగు తమ్ముళ్లు దాడి చేశారు. తొలుత గూడూరు మండలం డీసీ చైర్మన్, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు పోతన స్వామి నాయుడు చేయిచేసుకోగా పక్కనే ఉన్న స్వామినాయుడు అనుచరులు మూకుమ్మడిగా దాడి చేసి అశోక్‌ను పిడిగుద్దులతో, కాళ్లతో తన్నారు. ఈ తంతు అంతా అక్కడే వైన్‌షాపు ముందు ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. పోలీసుల సమక్షంలోనే స్వామినాయుడు, ఆయన అనుచరులు దాడి చేయడం స్పష్టంగా రికార్డు అయింది. గూడూరులో బెల్టు దుకాణానికి తాను సిఫార్లు చేసిన వ్యక్తికి కాకుండా మరో వ్యక్తికి సరుకును పంపించాడని, అంతేకాకుండా నెలవారీ కమిషన్ 30 శాతం వాటా కూడా సక్రమగా ఇవ్వడం లేదని కక్ష పెట్టుకున్న స్వామి నాయుడు తన అనుచరులతో వచ్చి దాడి చేశారని బాధితుడు అశోక్ ఆరోపిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఏం జరిగిందంటే... బెల్టు దుకాణానికి సరుకు కావాలని స్వామినాయుడు అనుచరుడు వచ్చి అడగ్గా అప్పు ఇవ్వడం కుదరదని అశోక్ చెప్పి పంపించేశాడు. అనంతరం ఆ వ్యక్తి నలుగురితో వచ్చి గొడవకు దిగి బీరుసీసాతో దాడికి యత్నించాడు. అశోక్ 100కు కాల్ చేయగా గూడూరు పోలీసులు వైన్ షాపు వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో వైన్‌షాపు వద్దకు చేరుకున్న స్వామినాయుడు ఏం జరిగిందని అశోక్‌ను ప్రశ్నించగా, మీకు తెలియకుండా జరుగుతుందా అంటూ అశోక్ ఎదురు ప్రశ్నించాడు. దాంతో స్వామినాయుడు రెచ్చిపోయి అశోక్‌పై చేయి చేసుకున్నాడు. ఆ వెనువెంటనే స్వామినాయుడు అనుచరులు ఒక్కసారిగా అశోక్‌పై మూకుమ్మడిగా దాడి చేసి కాళ్లతో చేతులతో కుమ్మేశారు. అశోక్ బావమరిది సహాయంతో గూడూరు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా బాధితుడు అశోక్ మాట్లాడుతూ తాను కూడా టీడీపీకి చెందిన వాడినేనని, తనపై దాడి చేయడం దారుణమని వాపోయాడు. కేసు నమోదు చేశాం : సీఐ రాయల్ వైన్స్ వద్ద జరిగిన సంఘటనపై బాధితుడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పెడన సీఐ కె.నాగేంద్రప్రసాద్ తెలిపారు. గూడూరు ఎస్ఐ సెలవులో ఉండటంతో ఇన్చార్జి పెడన ఎస్ఐ–2 షేక్ బషీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. -
కృష్ణాజిల్లా
పులిచింతల ప్రాజెక్టు సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు. 7సాక్షి విజయవాడ: వేసవి సెలవుల నేపథ్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చిన్నారులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరం ఉత్సాహంగా సాగుతోంది. పెడన: కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం మధ్యాహ్నం పెడన ఆర్టీసీ బస్టాండును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. -
ఆక్వా రైతులు కుదేలు
పెడన: రొయ్యలు, చేపల మేతలతో పాటు పౌల్ట్రీ ఫాంలకు సంబంధించిన మేతలను ఇష్టానుసారంగా కంపెనీలు ఒకరిని చూసి ఒకరు పెంచేశారని, పెంచిన ధరలను తగ్గించకపోతే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఉద్యమబాట పట్టాల్సి ఉంటుందని పెడన ఆక్వా రైతు, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి గరికపాటి వెంకట రామానాయుడు స్పష్టం చేశారు. పెడన వైఎస్సార్ సీపీ కార్యాలయంలో రైతు విభాగం నాయకులతో కలిసి బుధవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ అప్సడా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఇష్టానుసారంగా ధరలను పెంచడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడం వల్లే ఈ ధరలు పెంచారన్నారు. పెంచిన ధరల విషయంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ జూమ్మీటింగ్ ఏర్పాటు చేసి పెంచిన ధరలను నిలుపుదల చేయాలని చెప్పామని అన్నట్లు మీడియాలలో వార్తలు వచ్చాయని, ఆయన ఆదేశాలను ఆయా కంపెనీలు పెడచెవిన పెట్టి పెంచిన ధరలకే రొయ్యల మేతలను విక్రయించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి పెంచిన ధరలను తగ్గించకపోతే ఆక్వా రైతాంగం ఉద్యమబాట పట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. మత్స్యకారుల సామాజిక వర్గానికి చెందిన జిల్లా మంత్రి కూడా స్పందించి తక్షణం పెంచిన ధరల విషయంలో సానుకూలంగా స్పందించి వాటిని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు తిరుమాని శ్రీనివాసరావు మాట్లాడుతూ టన్నుకు రూ.8వేలు నుంచి రూ.10,500 వరకు పెంచడం వల్ల ఆక్వా రైతు మరింత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఆక్వా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని చంద్రబాబునాయుడు సర్కారు తీసుకువస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఆక్వా రైతు, వైఎస్సార్ సీపీ బంటుమిల్లి మండల అధ్యక్షుడు ముత్యాల నాగేశ్వరరావు, బొమ్మిడి నాగార్జున, వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల నాయకులు లోయ ఆంజనేయులు, పటమట జగన్మోహనరావు, వీణం భాను తదితరులు పాల్గొన్నారు. -
బెజవాడలో దారుణ హత్య
అజిత్ సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): భార్యతో గొడవపడిన తనకు తలదాచుకునే చోటిస్తాడని బంధువు ఇంటికి వెళ్తే.. ఆ బంధువే తనను హతమారుస్తాడని తలచలేకపోయాడు. రోజంతా తన వెన్నంటి ఉన్న వ్యక్తే తన పాలిట యముడిగా మారతాడని ఊహించలేకపోయాడు.. మద్యం మత్తులో చేసిన అధిక ప్రేలాపన అతని ప్రాణం తీసింది. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మీసాల కుమార్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో బుధవారం సాయంత్రం ఏడీసీపీ జి.రామకృష్ణ, నార్త్‌జోన్ ఏసీపీ పి.సత్యానందం ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. తల్లిని దూషించాడనే కక్షతో హత్య అజిత్‌సింగ్‌నగర్ న్యూరాజరాజేశ్వరీపేట ప్రాంతానికి చెందిన మీసాల కుమార్ అలియాస్ గంజి కుమార్ అలియాస్ కృపారావు(36)కు మౌనిక అనే మహిళతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు. కుమార్ మద్యానికి బానిసగా మారడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నెల 11న కూడా భార్యతో గొడవపడి కుమార్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. తనకు కొడుకు వరుస అయ్యే న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన పంది ప్రసాద్ వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పి ఆ రోజు వారింటి వద్దే తలదాచుకున్నాడు. 12వ తేదీన కూడా కుమార్, ప్రసాద్ ఇద్దరూ వాంబేకాలనీకి వెళ్లే దారిలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పూటుగా మద్యం తాగారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో తిరిగి మళ్లీ ప్రసాద్ ఇంటికి వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న కుమార్ ప్రసాద్ తల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ప్రసాద్ పక్కనే ఉన్న నాపరాయితో కుమార్ తలపై ఇష్టం వచ్చినట్లుగా కొట్టడంతో తలపగిలి తీవ్ర రక్తస్రావమై కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుల అరెస్టు కుమార్‌ను హత్యచేసిన ప్రసాద్ తన ఆటోలో అక్కడి నుంచి పరారై న్యూఆర్‌ఆర్‌పేటకు చెందిన తన స్నేహితుడు మిండల ఏసు అలియాస్ చిన్నకొత్తెం, విద్యాధరపురం ఆర్టీసీ వర్క్షాప్రోడ్డు ప్రాంతానికి చెందిన మరో స్నేహితుడు గద్దల ప్రశాంత్‌కుమార్‌కు జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో వారు ముగ్గురూ ఆటోలో గాంధీనగర్‌కు చేరుకొని రక్తపు మరకలు అంటిన ప్రసాద్ దుస్తులను తీసివేసి మిండల ఏసు తన దుస్తులను ప్రసాద్‌కు ఇచ్చాడు. రక్తపు మరకలు అంటిన ప్రసాద్ దుస్తులను ఎవరికీ కనిపించకుండా దాచివేశారు. ఆటోలో రక్తపు మరకలు లేకుండా నీళ్లతో ముగ్గురూ కలిసి శుభ్రం చేశారు. కుమార్ హత్య విషయాన్ని తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడిని, అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేసి న్యాయ స్థానం ఎదుట హాజరుపరిచారు. సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో బుధవారం సాయంత్రం పోలీసులు ముగ్గురు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఏడీసీపీ జి.రామకృష్ణ, నార్త్‌జోన్ ఏసీపీ పి.సత్యానందం హత్య వివరాలను వెల్లడించారు. సింగ్‌నగర్ సీఐ డి.చంద్రశేఖర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
17న విజయవాడలో బీసీల మేధోమథన సదస్సు
పటమట(విజయవాడతూర్పు): అనాదిగా అన్ని రంగాలలో వెనుకకు నెట్టబడ్డ బీసీలకు సమస్త రంగాలలో జనాభా దామాషా మేరకు రాయితీలు రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు. లబ్బీపేటలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నింటా వాటా, కోటాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా పంచి సామాజిక న్యాయం అందించాలని, బీసీల ప్రధాన డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 17న నగరంలోని బెంజి సర్కిల్ వద్ద నున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో బీసీల మేధో మథన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ చట్టసభలలో–మహిళా రిజర్వేషన్లలో– స్థానిక సంస్థలలో జనాభా దామాషా మేరకు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, ఓబీసీ సబ్ ప్లాన్ మేరకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల వాగ్దానాలైన బీసీల రక్షణ చట్టం, 50 ఏళ్లకే సామాజిక పెన్షన్లు వెంటనే అమలు జరపాలన్నారు. బీసీ ఉద్యోగుల బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. బీసీ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ఎన్ మూర్తి, ఎంప్లాయిస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు. ఉపాధ్యక్షుడు మల్కాపురం కనకారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మరీదు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో అభివృద్ధి పనులకు గ్రహణం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేకత సంతరించుకొంది. గతంలో పోల్చితే అమ్మవారి దర్శించుకొనే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం సాధారణ రోజుల్లో రోజుకు 30వేల–40వేలు, శుక్ర, శని, ఆదివారాల్లో రోజుకు 70వేల–80వేల మంది భక్తులు అమ్మవారి దర్శించుకొంటున్నారు. ఏపీ, తెలంగాణతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గతంలో 15 రోజులకు రూ.కోటి నుంచి రూ.1.25 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుతం 15 రోజులకు రూ.2.5 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. అయితే అమ్మవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తుల కనీస సౌకర్యాలు మాత్రం మెరుగుపడలేదు. చంద్రబాబు సర్కారు అభివృద్ధి పనులపై దృష్టి సారించటం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం డిసెంబర్ 7, 2023లో దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ.216.05 కోట్ల పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించింది. ఆ పనులు సైతం ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. ఎప్పటికి పూర్తవుతాయి? దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా మహా మండపం ఎదురుగా రూ.26కోట్లతో అన్నప్రసాద భవనం, గోశాల వద్ద రూ.27 కోట్లతో లడ్డూ పోటు భవన నిర్మాణం పనులు సాగుతున్నాయి. గత ఏడాది దసరా ఉత్సవాల సమయంలో ఈ రెండు భవనాలలో ఆలయ అధికారులు పూజలు నిర్వహించి తాత్కాలికంగా అన్నదానం, లడ్డూ తయారీలను చేపట్టారు. డిసెంబర్లో నిర్వహించిన భవానీ దీక్ష విరమణల సమయంలోనూ వీటిని తాత్కాలికంగా వినియోగించారు. అయితే ఈ రెండు భవనాల నిర్మాణాలను పూర్తి స్థాయిలో మే నాటికి పూర్తి చేసి ఆషాఢం నాటికి అందుబాటులోకి తేస్తామని, అధికారులు చెప్పినా.. ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవటం లేదు. లడ్డూ పోటు.. ఇంకెన్నాళ్లో? ప్రస్తుతం బుద్దా వారి గుడి వెనుక భాగంలోని దేవస్థాన షెడ్డులో దేవస్థానం లడ్డూ తయారవుతోంది. దసరా, భవానీ దీక్ష విరమణల సమయంలో దీనికి అదనంగా కనక దుర్గానగర్‌లోని ఏనుగుల షెడ్డుతో పాటు నూతన భవనంలో లడ్డూ తయారీ చేస్తున్నారు. నూతన లడ్డూ పోటు అందుబాటులోకి వస్తే బుద్దా వారి గుడి సమీపంలోని లడ్డూ పోటును తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్సవాలలో ఆయా ప్రాంతాల్లో తయారు చేసిన లడ్డూలను కనకదుర్గానగర్‌లోకి ప్రసాదాల కౌంటర్లకు తరలించడం పెద్ద సమస్యగా మారుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో రవాణా సమస్య ఉత్పన్నమవుతోంది. కొత్త భవనం పూర్తిస్థాయిలో అందుబాటులో వస్తే ఇది కొంత వరకూ పరిష్కారమవుతుంది. సమీక్షలతోనే సరి! దుర్గగుడిలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ పనులపై దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఇటు దేవస్థాన ఈవో శీనానాయక్‌తో పాటు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అన్నదాన భవనం, లడ్డూ పోటులో అత్యాధునికమైన మిషనరీ ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది జనవరి 28న దుర్గగుడి ఈవో శీనానాయక్ పర్యవేక్షణలో ఆలయ ఈఈలు, ఏఈవోలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సైతం వెళ్లి అక్కడ వినియోగిస్తున్న టెక్నాలజీని పరిశీలించారు. ప్రతి వారం జరిగే దేవదాయ శాఖ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం అభివృద్ధి పనులపై సమీక్ష తప్పని సరి. అయితే ఇంత పెద్ద ఎత్తున సమీక్షలు జరుగుతున్నా అభివృద్ధి పనులు మాత్రం వేగం పుంజుకోవడం లేదు. పూర్తి కాని అన్నదాన, లడ్డూ పోటు భవన నిర్మాణాలు పెరిగిన భక్తుల సంఖ్య వసతులు అంతంత మాత్రమే భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించని చంద్రబాబు సర్కారు సమీక్షలతోనే సరిపెడుతున్న వైనం ప్రస్తుతానికి అన్నదాన భవనం గ్రౌండ్ ఫ్లోర్లో అన్న ప్రసాద తయారీ నిమిత్తం కుకింగ్ పాయింట్, స్టోర్ రూమ్, కోల్డ్ స్టోరేజీ వంటి పనులు జరుగుతున్నాయి. మొదటి అంతస్తులో ఎక్కడి పనులు అక్కడే మిగిలి ఉన్నాయి. అన్నదానం భవనం బయట వైపున ఎలివేషన్ పనులు మాత్రం జరుగుతున్నాయి. మిగిలిన పనులు మందకొడిగా సాగుతున్నాయి. -
శుభ శకునానికని ఎదురొస్తే...
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ఇంటికొచ్చిన బంధువులను తిరిగి పంపించేందుకు కారుకు ఎదురు వచ్చిన మహిళ ప్రాణాలు వెనుక వైపు నుంచి దూసుకొచ్చిన మరోకారు రూపంలో గాలిలో కలిసిపోయాయి. ఇంటి ముందు కుటుంబ సభ్యుల కళ్లెదుట జరిగిన ఈ దుర్ఘటనలో ఆమె కుమారుడుకి సైతం తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని కిలేశపురంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. సేకరించిన వివరాల మేరకు కిలేశపురం గ్రామానికి చెందిన గుంటుపల్లి రమేష్, గంగాభవాని దంపతుల కుమార్తెకు ఇటీవల వివాహం జరిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి కుమార్తెను పుట్టింటికి కారులో తీసుకొచ్చిన బంధువులను తిరుగు ప్రయాణంలో పంపించేందుకు తన కుమారుడు వెంకట జితేంద్రతో కలిసి శుభశకునం కోసం కారుకు డ్రైవర్ వైపు ఎదురు వచ్చింది. కారు ముందుకు సాగిన మరుక్షణం హైదరాబాద్ వైపు నుంచి దూసుకొచ్చిన మరో కారు వీరిద్దరినీ ఢీకొట్టింది. గంగాభవాని (44) అక్కడికక్కడే మృత్యువాత పడగా, ఆమె కుమారుడు వెంకట జితేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జితేంద్రను హుటాహుటిన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుభశకునం కోసం ఎదురు వచ్చిన మహిళ ప్రాణాలు కళ్లెదుటే గాలిలో కలసిపోతే ఆ కుటుంబసభ్యులు, బంధువుల వేదన వర్ణనాతీతం. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన వారిని నిశ్చేష్టులను చేసింది. తమ ప్రయాణం క్షేమంగా జరగాలని ఎదురువచ్చిన ఆమె మరుక్షణంలో విగతజీవురాలై పడి ఉండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వెనుక నుంచి దూసుకొచ్చిన మరో కారు ఆమె పాలిట యమపాశమైంది. -
నిర్లక్ష్యం వహించే ఎఫ్ఏలపై చర్యలు
– డ్వామా ఏపీడీ జె.రామనాధం ఘంటసాల: ఉపాధి హామీ పథకం పనుల్లో నిర్లక్ష్యం వహించే ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తప్పవని డ్వామా ఏపీడీ జె.రామనాథం అన్నారు. ఘంటసాల మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులతో ఏపీడీ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఘంటసాల మండలానికి 7300 పనిదినాలకు గాను ఇప్పటి వరకు 4600 మాత్రమే చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. పని దినాల్లో వెనుకబడి ఉన్న మల్లంపల్లి, చిట్టూర్పు, పాపవినాశనం, కొత్తపల్లి, దేవరకోట, అచ్చెంపాలెం, దాలిపర్రు ఎఫ్‌ఏలను ప్రశ్నించడంతో పాటు సకాలంలో ఎఫ్ఏల పని దినాల టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా పని ప్రదేశంలో కూలీలకు నీడనిచ్చేలా టెంట్లు ఏర్పాటు చేయాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పంచాయతీల్లో చెరువులను గుర్తించి ఎండగట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. స్వచ్ఛరథం, స్వచ్ఛ పథం, ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణపై పంచాయతీ కార్యదర్శులతో చర్చించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఘంటసాల మండలానికి విచ్చేసిన డ్వామా ఏపీడీ, ఇన్చార్జి డీఎల్డీవో జె.రామనాథంను ఎంపీడీవో డి.సుబ్బారావు ఆధ్వర్యంలో సిబ్బంది సత్కరించారు. కార్యక్రమంలో డెప్యూటీ ఎంపీడీవోలు కె.వెంకటేశ్వరరావు, వై.శివరామ ప్రసాద్, ఏపీవో రాజ్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్‌ఏలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నగర సమితి డిమాండ్ చేసింది. హనుమాన్‌పేటలోని దాసరి భవన్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు ఓర్సు భారతి, పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ బండి సంజయ్ తనయుడు భగీరథ్ మైనర్ బాలికపై లైంగిక దాడికి, వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనంగా మారిందన్నారు. నిందితుడు భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8వ తేదీన కేసు నమోదు చేసినప్పటికీ నిందితుడి అరెస్ట్‌లో జాప్యం జరుగుతోందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చట్టం నుంచి తప్పించుకునేందుకు బాధితురాలిపైనే తిరిగి కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కేసును త్వరితగతిన విచారించి నిందితుడికి శిక్ష పడేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి బంక ఝాన్సీ, దుర్గాసి రమణమ్మ, నాగూర్ బి.అనిత, మురళి తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా విశాఖపట్నం–నిజాముద్దిన్ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–నిజాముద్దిన్ (08513) ప్రత్యేక రైలు ఈ నెల 21వ తేదీ గురువారం సాయంత్రం 5.40 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, శనివారం ఉదయం 11.40 గంటలకు నిజాముద్దిన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08514) ఈ నెల 24న ఆదివారం రాత్రి 11.55 గంటలకు నిజాముద్దిన్‌లో బయలుదేరి, మంగళవారం రాత్రి 10.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, రాజమండ్రి, విజయవాడ, బల్హార్ష, నాగ్‌పూర్, రాణికమలాపాటి, ఝాన్సీ, ఆగ్రా తదితర స్టేషన్లలో ఆగుతుంది. -
కూచిపూడిని సందర్శించిన కలెక్టర్ బాలాజీ
పామర్రు: కూచిపూడి కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేసుకోవడం వలన భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని కళాక్షేత్రం అభివృద్ధి పనులకు బుధవారం స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి కలెక్టర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో ఎంతో ప్రాశస్త్యం కల్గిన కూచిపూడి నాట్య కళ అభివృద్ధి పరిచే కార్యక్రమంలో భాగంగా కూచిపూడి కళా క్షేత్రంలోని నర్తకులకు వసతులు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమాల నిర్వహణ సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అన్ని రకాల వసతులు కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాక్షేత్రం నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ జనరల్, ఒకేషనల్ థియరీ పరీక్షలు ఈ నెల 21 నుంచి జూన్ 4 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి (ఇన్చార్జ్) పోతురాజు తెలిపారు. కలెక్టరేట్లోని డీఆర్వో చాంబర్లో బుధవారం ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం జరిగింది. పదకొండు లైన్ విభాగాల అధికారులతో పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. థియరీ పరీక్షల కోసం జిల్లాలో 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫస్ట్ ఇయర్‌కు చెందిన 13,245 మంది, సెకండ్ ఇయర్‌కు చెందిన 6,609 మంది విద్యార్థులు కలిపి మొత్తం 19,854 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. అన్ని పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి/కన్వీనర్ ఎస్.సరళకుమారి, అదనపు ఎస్పీ, పి.ఎస్.జి.ఎన్.లక్ష్మి, డి.సత్యనారాయణ, జి.సందీప్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) కృష్ణా జిల్లా శాఖ నూతన జనరల్ కౌన్సిల్ సమావేశం కె.శేషగిరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా నడకుదిటి రామబ్రహ్మం (మచిలీపట్నం), అధ్యక్షుడిగా బి.లంకేశ్వరరావు (ఉయ్యూరు), ఉపాధ్యక్షులుగా కె.శేషగిరి (బంటుమిల్లి), పి.భాను ప్రకాశరావు (ఉయ్యూరు), వి.శివరామకష్ణ (పెడన), జె.రూబెన్ (గూడూరు), జె.శ్రీనివాసరావు (మచిలీపట్నం) ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాతా రేణుకారావు (పెడన), అదనపు కార్యదర్శిగా కె.శ్రీనివాసరావు (కృత్తివెన్ను), కార్యదర్శులుగా వి.నాగమల్లేశ్వరరావు, సి.సంతోష్ కుమార్, పి.రవిబాబు, డి.జయప్రకాశ్, వి.వెంకటేశ్వరరావు, వి.ఎస్.వి. సుబ్బారావు, కె.శ్రీను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి మేకల సుబ్బారావు వ్యవహరించారు. సమావేశంలో పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తీర్మానాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నెం.57ను రాష్ట్రంలో అమలు చేసి 11 వేల మందికి పాత పెన్షన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.దస్తగిరి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శుభాకరరావు, ఎన్. రామబ్రహ్మం పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడుబి.లంకేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి తాతా రేణుకారావు -
విదేశీ ఉపాధి అవకాశాలకు ప్రత్యేక నియామక కార్యక్రమాలు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని నిరుద్యోగ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక నియామక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దుబాయ్‌లో ట్యాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు, ఇజ్రాయిల్ దేశంలో హోం బేస్డ్ కేర్ యువర్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. దుబాయ్‌లో ట్యాక్సీ డ్రైవర్ ఉద్యోగాలకు 25 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని, కనీసం పదో తరగతి విద్యార్హతతో పాటు భారతీయ డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిరామ్స్ నెలకు 4,000 నుంచి 5,000 వరకు ఆదాయం పొందవచ్చునన్నారు. ఇజ్రాయిల్ దేశంలో హోం బేస్డ్ కేర్ యువర్ ఉద్యోగాలకు పురుషులు, మహిళలు అర్హులన్నారు. జీడీఏ, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంగ్లిషు కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరమని, ఎంపికై న వారికి నెలకు రూ.1,99,770 వరకు ఆదాయం పొందవచ్చునన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నైపుణ్యాభివృద్ధి సంస్థ పోర్టల్‌లో నమోదు చేసుకుని ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 96767 08041 నంబరును సంప్రదించాలన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ -
నీరుగారిన లక్ష్యం!
చెక్ఢాం..పునర్ నిర్మాణానికి రైతుల ఎదురుచూపులుజి.కొండూరు: ఇరవై నెలలు గడిచినా బుడమేరు వరదల కష్టాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. వరదల గాయాలకు మందు వేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం కావడంతో బాధిత ప్రజలు నరకయాతన పడుతున్నారు. నాటి వరదలకు చిన్ననందిగామ వద్ద కోతులవాగులో చెక్‌డ్యామ్ పూర్తిగా ధ్వంసమైపోయి చెరువులకు సాగునీరందక రైతులు లబోదిబో మంటున్నారు. ఇరవై నెలలు గడిచినా చెక్‌డ్యామ్ నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం పట్ల రైతులను నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోతుల వాగులో వరద పోటెత్తిన సమయంలో వరదనీరు చిన్ననందిగామ గ్రామంలోని పెద్ద చెరువుకు చేరేలా 1964లో వాగుకి అడ్డంగా చెక్‌డ్యామ్‌ను నిర్మించారు. ఈ చెక్‌డ్యామ్ నుంచి పెద్ద చెరువు వరకు 1600మీటర్లు మేర సప్లయ్ చానల్‌ను సైతం తవ్వారు. ఈ విధంగా కోతుల వాగు నుంచి నీరు పెద్ద చెరువుకు చేరి చెరువు నిండిన తర్వాత కళింగ పొర్లి పక్కనే ఉన్న మర్ల చెరువుకు నీరు చేరుతుంది. అయితే దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ చెక్‌డ్యామ్ శిథిలావస్థకు చేరడంతో 2017కు ముందే నూతన చెక్‌డ్యామ్ నిర్మాణానికి ప్రయత్నాలు జరిగి నిలిచిపోయాయి. ఈ క్రమంలో 2024, ఆగస్టు నెలలో బుడమేరుకు వరద పోటెత్తిన సమయంలో కోతులవాగు కూడా ఉగ్రరూపం దాల్చడంతో ఈ చెక్‌డ్యామ్ పూర్తిగా ధ్వంసమైపోయింది. అప్పటి నుంచి రైతులే తాత్కాలికంగా అడ్డుకట్టు ఏర్పాటు చేసుకొని చెరువును నింపుకొంటున్నారు. ఈ చెక్‌డ్యామ్‌ను పునర్నిర్మాణం చేపట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంతో గత ఇరవై నెలలుగా చిన్ననందిగామ రైతులు నరకయాతన పడుతున్నారు. ఈ చెక్‌డ్యామ్ శిథిలావస్థకు చేరిందని పునర్ నిర్మాణం కోసం 2017లో రూ.3.75కోట్లకు టెండర్‌ను దక్కించుకున్న కాంట్రాక్టరు పలు కారణాలతో నిర్మాణ పనులను ప్రారంభించలేదు. ఆ తర్వాత ఈ చెక్‌డ్యామ్ ద్వారానే సాగునీరు సరఫరా అయ్యింది. అయితే 2024, ఆగస్టులో వచ్చిన వరదలకు పూర్తిగా కొట్టుకుపోయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ చెక్‌డ్యామ్ ఉన్న ప్రదేశంలో భారీ వరదకు కోతకు గురై వాగు వెడల్పు 80మీటర్ల వరకు పెరిగింది. దీనితో ప్రస్తుతం ఈ చెక్‌డ్యామ్ నిర్మాణానికి రూ.6కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చిన్ననందిగామ వద్ద కోతులవాగులో పూర్తిగా ధ్వంసమైన చెక్ డ్యామ్ ప్రశ్నార్థకంగా మారిన చిన్ననందిగామ పెద్ద చెరువు, మర్ల చెరువు ఆయకట్టు చెక్‌డ్యామ్ నిర్మాణంపై సర్కారు మీనమేషాలు నిర్లక్ష్యం వీడకపోతే 1700 ఎకరాల సాగు భూమి బీడే చిన్న నందిగామ పెద్ద చెరువు లోతట్టు విస్తీర్ణం 166.22ఎకరాలు కాగా ఈ చెరువు కింద 388.02ఎకరాలు ఆయకట్టుగా సాగు భూమి ఉంది. అదేవిధంగా మర్ల చెరువు లోతట్టు విస్తీర్ణం 71.04ఎకరాలు కాగా 130.77ఎకరాలు ఆయకట్టు సాగు భూమి ఉంది. ఇదే కాకుండా ఈ రెండు చెరువుల పరిధిలో మరో 1200ఎకరాల వరకు సాగు భూమి ఉంది. కాగా ఈ రెండు చెరువులకు నీటిని అందించే చెక్‌డ్యామ్ పూర్తిగా ధ్వంసమై పోవడంతో సాగుపై ఆందోళన వ్యక్తమవుతోంది. రైతులే ఇసుక బస్తాలతో తాత్కాలికంగా అడ్డుకట్ట ఏర్పాటు చేసుకున్నప్పటికీ వరద ఉద్ధృతికి తెగిపోవడం, మరలా కట్ట ఏర్పాటు చేయాల్సి రావడం తలనొప్పిగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి చెక్‌డ్యామ్ నిర్మాణం చేయకపోతే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదలొచ్చిపోయి రెండేళ్లు కావస్తున్నా చెక్‌డ్యామ్ నిర్మాణం చేయకపోవడం దారుణం. ఈ చెక్‌డ్యామ్ నిర్మాణం చేపట్టకపోతే గ్రామంలో 1700ఎకరాల సాగు భూమి అంతా బీడుగా మారుతుంది. గ్రామంలో రైతులతో పాటు వ్యవసాయంపై ఆధారపడిన కూలీలు కూడా పనుల్లేక ఇబ్బంది పడతారు. – పెండెం రాజేంద్రప్రసాద్, గ్రామస్తుడు, చిన్ననందిగామ గ్రామం చిన్ననందిగామ వద్ద కోతుల వాగులో చెక్‌డ్యామ్ నిర్మాణానికి రైతుల నుంచి వినతులు వచ్చాయి. త్వరలో ధ్వంసమైన చెక్‌డ్యామ్‌ను పరిశీలిస్తాం. వాగు వెడ ల్పు ఎక్కువగా ఉండడం వల్ల నిర్మాణ ఖర్చు పెరిగే అవకాశం ఉంది. అంచనాలను తయా రు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. – టి.రాజేష్, ఇరిగేషన్ ఏఈఈ, జి.కొండూరు కోతులవాగులో చెక్‌డ్యామ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి. లేదంటే వాగులో నీరంతా దిగువకు పోవడమే తప్ప పెద్ద చెరువు, మర్ల చెరువుకు చుక్కనీరు రాదు. ఈ రెండు చెరువుల్లో నీరు లేకపోతే ఆయకట్టు భూమి సాగు చేయడం కూడా కష్టమే. వందల ఎకరాలు బీడు భూమిగా మారుతుంది. –మైలవరపు నాగేంద్రప్రసాద్, రైతు, చిన్ననందిగామ గ్రామం -
చంద్రబాబుకు షాక్.. సీఎం ఆఫీసు ముట్టడికి ఉద్యోగుల పిలుపు
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. సమగ్ర శిక్ష, కేజీబీవీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నేడు చలో సీఎం క్యాంపు కార్యాలయానికి పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా భారీ సంఖ్యలో ఉద్యోగులు తరలి వచ్చారు. దీంతో, క్యాంపు ఆఫీసు వద్ద పోలీసులు భారీగా మోహరించారు.కాగా, సమగ్ర శిక్ష, కేజీబీవీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మె సందర్బంగా రాసుకున్న మినిట్స్ అమలు చర్యలని కూడా నినాదాలు చేస్తున్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28000 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండగా.. 10 డిమాండ్లతో క్యాంపు ఆఫీసు ముట్టడికి కదిలారు. ఈ సందర్భంగా వీఎంసీ నుంచి చంద్రబాబు ఇంటి వరకు ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే, వీరి ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, వీఎంసీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. -
స్కూల్, కాలేజీ బస్సుల తనిఖీ
చిలకలపూడి(మచిలీపట్నం): దేశవ్యాప్తంగా వివాదాల సామరస్యత, సమాధాన్, సమరోహ్ అనే పేరుతో సుప్రీంకోర్టులో నిర్వహించే ప్రత్యేక లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ ప్రత్యేక లోక్‌అదాలత్ ఆగస్టు 23వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉన్న అంశాలు సామరస్యమైన పరిష్కారం చేయటమే లక్ష్యమన్నారు. న్యాయవాదులు, కక్షిదారులు చురుకుగా పాల్గొనాలని, వివాదాల పరిష్కారానికి సహకరించాలని కోరారు. కక్షిదారులు లేక న్యాయవాదులు ఈ నెల 31వ తేదీలోగా https://forms. gle/jqxefqF4BCWzukoP6 గూగుల్ ఫామ్‌లో కేసు వివరాలను పంపాలన్నారు. మంగళగిరి టౌన్: నేషనల్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ (మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన లిఖిత, విజయశ్రీ, కౌశిక్ ఎంపికయ్యారని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ భాస్కరరావు తెలిపారు. మంగళగిరిలోని అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం క్రీడాకారుల వివరాలు వెల్లడించారు. ఈనెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కోనసీమ జిల్లా, అమలాపురంలో పోటీలు జరుగుతాయని తెలిపారు. -
పిల్లల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చిన్నారుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న 50 సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంపులకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ జి.లక్ష్మీశ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. మే నెలాఖరు వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 27 క్రీడా విభాగాల్లో ఈ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 8గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు, డీఈవో ఎల్.చంద్రకళ, జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్‌జంక్షన్ రూరల్: ఆర్టీసీ బస్స్టేషన్లలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు కృష్ణా జిల్లా ప్రజారవాణాధికారి కె.వెంకటేశ్వర్లు అన్నారు. హనుమాన్‌జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ప్రయాణికుల కోసం ప్రతి బస్‌స్టేషన్‌లో రక్షిత మంచినీరు, శుభ్రమైన టాయిలెట్లు, కూర్చునేందుకు బెంచీలు, ఫ్యాన్లు, తడి, పొడి చెత్త వేయడానికి వేరుగా డస్ట్బిన్లు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులతో మాట్లాడారు. ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని సూచించారు. ప్రతి స్టేజీ వద్ద బస్సు ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని, అలాగే వారి కోరిన చోట దింపాలని చెప్పారు. ప్రయాణికులతో మర్యాదగా మాట్లాడి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా చూపాలని సూచించారు. ఆయన వెంట గన్నవరం ఆర్టీసీ డిపో మేనేజర్ శివాజీ, ట్రాఫిక్ సూపర్వైజర్ మధు ఉన్నారు. -
విజయకీలాద్రి క్షేత్రంలో ఆస్ట్రేలియన్ కౌన్సిల్ జనరల్
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రాన్ని ఆస్ట్రేలియన్ కౌన్సిల్ జనరల్ హెచ్.ఇ.సిలాయ్జాకీ, ఆస్ట్రేలియన్ హై కమిషనర్ హెచ్.ఇ.ఫిలిప్ బుధవారం సందర్శించారు. వారు విజయ కీలాద్రిపై ఉన్న అన్ని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 27 అడుగుల ఏకశిలా విగ్రహం విఘ్నవిమోచక హనుమాన్ను దర్శించుకున్నారు. అనంతరం వారికి చిత్రపటాన్ని, స్వామి వారి శేషవస్త్రాన్ని బహూకరించారు. వారికి ఆలయ విశిష్టతను జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు వివరించారు. -
శాశ్వతంగా రద్దు చేయాలి
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్షను శాశ్వ తంగా రద్దు చేయాలి. వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ అసమర్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మూసివేయాలి. పేపర్ లీకేజీలను అరికట్టడంలో, పారదర్శకంగా పరీక్ష నిర్వహించడంలో ఎన్టీఏ ఘోరంగా విఫల మైంది. ఒక దేశం – ఒకే పరీక్ష పేరుతో కేంద్రం తీసుకొచ్చిన ఈ విధానం వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. విద్యా వ్యవస్థ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తోంది. – ఎం.సాయికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏఐఎస్ఎఫ్ -
బాడీబిల్డింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
పెనమలూరు: రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశామని ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి తాళ్లూరి అశోక్ తెలిపారు. ఆయన కానూ రులో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఈ నెల 17వ తేదీన జరగనున్న రెండో మిస్టర్ రాష్ట్ర స్థాయి క్లాసిక్ బాడీబిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీలకు విజయవాడ సింగ్‌నగర్ మనోహర్ జిమ్‌లో క్రీడాకారులకు ఎంపిక చేశామన్నారు. 55–60 కిలోల విభాగంలో జి.వాసుదేవ్, 60–65 కిలోల విభాగంలో టి. రవితేజ, బి.దయాకర్, పి.రామకృష్ణ, ఎం. అవినాష్, జి.నీరజ్, 65–70 కిలోల విభాగంలో పి.శ్రీధర్, పి.సాయికుమార్, బి.అశోక్, 70–75 కిలోల విభాగంలో ఆర్.దుర్గా ఆంజనేయులు, జి.అనురాగ్ముఖేష్, కె.శ్రీరామ్, కె.హరికృష్ణ, 80–85 కిలోల విభాగంలో ఎస్కె.ఇబ్రహీం, 85 కిలోలపై విభాగంలో ఎస్కే రెహన్, సీహెచ్. గోపీకృష్ణ, ఫిజిక్ స్పోర్ట్స్ విభాగంలో వై.ప్రణయ్‌తేజ్, టి.రవితేజ, ఎం.అవినాష్, పి.సాయి కుమార్, వి.సురేష్, జి.అనురాగ్, ముఖేష్ ఎంపికయ్యారని వివరించారు. టీమ్ మేనేజర్‌గా అల్లూరి శ్రీనివాస్‌రెడ్డి, కోచ్‌గా ఎస్కే ఖాదర్, ఇన్చార్జ్గా బాషా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రగతి సూచికల్లో ఏ– ప్లస్‌ను నిలబెట్టుకోవాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర విజన్– 2047కు సంబంధించిన కీలక ప్రగతి సూచికల్లో ఏ ప్లస్ స్థాయిని నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర విజన్ – కేపీఐల లక్ష్యాలను ఆయన మంగళవారం సమీక్షించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాస్థాయి స్కోరు 90గా ఉందని.. దీనిని మరింత మెరుగుపరిచి ప్రగతి పథంలో పయనించేలా చూడాలన్నారు. కంచికచర్ల, వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం తదితర ఏ గ్రేడు మండలాలు ఏ ప్లస్ గ్రేడ్ సాధించేందుకు కృషి చేయాలన్నారు. గణాంక అధికారి డి.వి.ఎస్. ఆర్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాల్య వికాసంపై స్క్రీనింగ్ పరీక్షలు పెనమలూరు: బాల్య వికాసంపై స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టామని శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ బి.సుజాతరాణి తెలిపారు. పెనమలూరులో మంగళవారం ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్మెంట్(ఈసీడీ) కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. మూడేళ్ల లోపు చిన్నారుల అభివృద్ధి అవరోధాలు నివారించటానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఈసీడీ పరీ క్షలు నిర్వహిస్తామన్నారు. తల్లితండ్రులు అంగన్వాడీ కేంద్రాలలో జరిగే స్క్రీనింగ్ చిన్నారులకు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు శ్రీలత, రెహనాబేగం, బేబీ, సచివాలయ కార్యదర్శులు మౌనిక, ఎస్.విజయలక్ష్మి, అంగన్వాడీ కర్యకర్తలు పాల్గొన్నారు. నవచేతన అమలు పరిశీలన లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణలంక భ్రమరాంబపురంలోని అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం సందర్శించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతున్న నవచేతన కార్యక్రమం అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత మొబైల్, డిజిటల్ టూల్స్ ద్వారా పిల్లల అభివృద్ధి స్థాయిని అంచనా వేయొచ్చ సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల ప్రవర్తన, మాట, కదలికలు, సామాజిక నైపుణ్యాలను పరిశీలించి స్క్రీనింగ్ డేటాను నమోదు చేస్తు న్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళాశిశు సంక్షేమ అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం పాల్గొన్నారు. -
గంజాయిపై ఉక్కుపాదం మోపాలి
నార్కో కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): డ్రగ్స్ వినియోగం, అమ్మకం, రవాణాపై ఉక్కుపాదం మోపి గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశపు హాలులో నార్కో కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం యాంటీ నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల్లో ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో నిఘా పెంచాలని పోలీస్ అధికారులకు సూచించారు. మాదకద్రవ్యాలకు బానిసైన బాధితులను డి–ఎడిక్షన్ సెంటర్లకు తరలించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో డీఈవో యూవీ సుబ్బారావు, వ్యవసాయ, మత్స్యశాఖ అధికారులు ఎన్. పద్మావతి, ఎ. నాగరాజు, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదినిసింగ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ వై. సత్యకిషోర్ పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 524.50 అడుగులకు చేరింది. ఇది 157.6100 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పరిశ్రమలకు అనుగుణంగా అవసరమైన నైపుణ్యాలు యువతలో పెంపొందించేందుకు సాంకేతికతను తీర్చిదిద్దాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి సేతు పథకం ద్వారా రూ.200కోట్లతో పారిశ్రామిక శిక్షణ సంస్థలను పటిష్ట పరిచేందుకు సంకల్పించిందన్నారు. అందులో 50శాతం కేంద్ర ప్రభుత్వం, 33శాతం రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 17శాతం పరిశ్రమ నెలకొల్పే భాగస్వామి భరించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 18వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కౌశలం పథకం ద్వారా 60 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో దశలవారీగా 10వేల మంది పరీక్షలు రాశారని వారిలో 1,480 మందికి వివిధ కంపెనీల నుంచి ఇంటర్వ్యూలకు పిలిచారన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ ఆర్. వెంకట్రావు, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా సమన్వయకర్త రవికాంత్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి నరేష్కుమార్ పాల్గొన్నారు. -
విధ్వంసం నుంచి వేడుక
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): అభివృద్ధి పేరుతో ఆలయాలను ధ్వంసం చేసి చెత్త బండిలో విగ్రహాలను తరలించిన హిందూ ద్రోహులు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సీతమ్మవారి పాదాల వద్ద గల శ్రీ దక్షిణ ఆంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించిన వెలంపల్లి శ్రీనివాసరావు, ఆ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి మల్లాది విష్ణుతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గత చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ దక్షిణ ముఖ ఆంజనేయస్వామి దేవాలయం ఇక్కడ దశాబ్దాలుగా వెలిసి ఉందన్నారు. కానీ 2014–2019 మధ్య అధికారంలో ఉన్న నాటి కూటమి ప్రభుత్వం కృష్ణా పుష్కరాల వంకతో ఈ దేవాలయాన్ని అత్యంత దుర్మార్గంగా కూల్చివేసిందన్నారు. కనీ సం శాస్త్రోక్తంగా వైదిక పనులు చేయకుండా, స్వామి వారి విగ్రహాన్ని మునిసిపల్ కార్పొరేషన్ చెత్తబండిలో వేసి తరలించిన తీరు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందన్నారు. అప్పట్లో స్థానిక హిందువులందరం కలిసి అడ్డుకున్నప్పటికీ, పోలీసులతో నిర్బంధించారని, ఈ ఆలయంతో పాటు సీతమ్మ వారి పాదాలు, శనీశ్వర స్వామి, రాహు కేతువుల ఆలయాలను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ చొరవతోనే.. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి మారిందన్నారు. చంద్రబాబు హయాంలో కూల్చివేతకు గురైన ఆలయాలన్నింటినీ పునర్నిర్మించాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పించి, నిర్మాణం పూర్తి చేశారన్నారు. ఆయన చొరవతోనే ఈరోజు ఈ దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం మళ్లీ నిర్మితమైందన్నారు. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఇంతమంది భక్తులు ఇక్కడ స్వామి వారిని కొలుచుకుంటున్నారంటే అది కేవలం జగన్మోహన్రెడ్డి భక్తిశ్రద్ధలు, హిందూ ధర్మంపై ఆయనకున్న గౌరవం వల్లనే సాధ్యమైందన్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఇబ్రహీంపట్నం: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఇబ్రహీంపట్నంలో పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు స్థానిక విజయవాడ బస్‌స్టాప్ వెనక ఖాళీ స్థలంలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు మృతుడి శరీరంగా స్వల్పంగా గాయాలున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94406 27084, 94939 82040 నంబర్లకు ఫోన్ ద్వారా తెలియజేయాలని కోరారు. -
ప్రారంభమైన ఏపీ ఈఏపీ సెట్
ఉమ్మడి కృష్ణాజిల్లాలో 16 కేంద్రాలు వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంజినీరింగ్, అగ్రికల్చల్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్– పరీక్ష(ఏపీఈఏపీసెట్)–2026 మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకూ జరిగే ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత(ఆన్లైన్) విధానంలో రాస్తున్నారు. ఈ పరీక్షలో భాగంగా ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకూ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు సంబంధించిన విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు. ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ పరీక్ష జరిగింది. గంట ముందుగా విద్యార్థులను పరీక్ష జరిగే ప్రాంగణంలోకి అనుమతించారు. -
నైటింగేల్ స్ఫూర్తితో సేవలందించాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ లబ్బీపేట(విజయవాడతూర్పు): నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ రోగులకు సేవలు అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన నైటింగేల్ విగ్రహాన్ని మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌లతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్‌లో 95శాతానికి పైగా సంతృప్తి స్థాయి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. రోగులు త్వరగా కోలుకోవడంలో నర్సుల సంరక్షణ, మానసిక ధైర్యం ఎంతో ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కోశాధికారి కె. శివలీల, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఆర్ఎంఓ డాక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. నాలుగు వెంటిలేటర్ల ఏర్పాటు.. జీజీహెచ్ వెంటిలేటర్ల కొరత ఉండటంతో పార్లమెంటు సభ్యుని అభివృద్ధి నిధుల నుంచి ఒక్కొక్కటీ రూ.15 లక్షలు విలువగల నాలుగు వెంటిలేటర్లను అందజేశారు. వాటిని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను సైతం ప్రారంభించారు. -
పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలి
చిలకలపూడి(మచిలీపట్నం): పోక్సో చట్టం పటిష్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుతో కలిసి సీ్త్ర, శిశు సంక్షేమ, ఇతర సంక్షేమాధికారులతో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. గర్భధారణ, లింగ నిష్పత్తి, పోక్సో చట్టం అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ.. జిల్లా లింగ నిష్పత్తిలో వెనుకబడి ఉందని, ముఖ్యంగా ప్రతి వెయ్యి మందికి మగ వారికి 921 మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. 101 పిల్లలు తప్పిపోయారని వారిని వెతికి పట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. యుక్తవయసులో గర్భధారణ అధికంగా ఉంటోందని దీనిపై తల్లిదండ్రులు, పెళ్లయిన యువతీయువకులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయో, లేదో మండల ప్రత్యేకాధికారులను పంపించి పరిశీలించే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, డీఐఓ డాక్టర్ ప్రేమచంద్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ షేక్ షాహెద్‌బాబు, గిరిజన సంక్షేమాధికారి ఎం.ఫణిదూర్జటి, డీఈఓ సుబ్బారావు పాల్గొన్నారు. -
ఏసీపీ నివాసంలో అగ్ని ప్రమాదం
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ పటమట ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏసీపీ సత్యానందం (1991 బ్యాచ్) డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం ఆయన వీఆర్‌లో ఉన్నారు. ఆయన పటమటలంక నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని ప్రత్యుష అపార్టుమెంట్లో 302 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వేసవి నేపథ్యంలో ఆయన ప్రస్తుతం విదేశాలకు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన నివాసం ఉంటున్న అపార్టుమెంట్ ఫ్లాట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో వంటగదిలోని గ్యాస్ సిలిండర్ పేలి ఎదురు అపార్ట్మెంట్లో ఉంటున్న వ్యక్తి తలకు గోడ శిథిలాలు తగిలాయి. విజయవాడ సిద్ధార్థ స్కూల్లో విధులు నిర్వహిస్తున్న గొట్టిపాటి శ్రీనివాసరావుకు తలకు బ్లాస్టింగ్ శిథిలాలు తగిలి తీవ్ర గాయాల య్యాయి. ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన గురించి తెలుసుకున్న పటమట అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇంటిలోని సీలింగ్, సామాన్లు కాలిపోయాయి. ఈ ప్రమాదకారణంగా సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని అంచనా ఫైర్ సిబ్బంది అంచనా వేశారు. ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి పటమట ప్రత్యూష అపార్ట్మెంట్ ప్రమాద ఘటనను వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ పరిశీలించారు. పొరుగున ఉన్న అపార్ట్మెంట్ వాసు లతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరు దురదృష్టకరమని, ప్రమాదం సమయంలో అపార్ట్ మెంట్లో ఎవరూ లేరని, మంటలు వస్తుండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు అందరినీ అప్రమత్తం చేసే సమయంలో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగిందన్నారు. ఇలాంటి ప్రమాదాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వేసవి కారణంగా నమోదవుతున్న ఉష్ణోగ్రత తీవ్రత దృష్ట్యా ప్రమాదం జరిగిందని ప్రాఽథమిక అంచనాకు వచ్చాం. అయితే ప్రమాదం జరిగిన కారణాలను అన్వేషిస్తున్నాం. ఈ ప్రమాదానికి రెండు కారణాలుగా తెలుస్తున్నాయి. విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణమా లేక గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనా అనే కోణంలో విచారణ చేపట్టాం. పోర్టుకోలో ఉన్న ఏసీ అవుట్లెట్ నుంచి జరిగిన షార్టు సర్క్యూటా లేక ముందే వంటగదిలో సిలిండర్ పేలిందా అనే కోణంలో విచారణ చేపట్టాం. – కె.దామోదర్, సెంట్రల్ జోన్ ఏసీపీ -
గురుకులాలు, వసతి గృహ విద్యార్థులకు అభినందన
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలను సాధించిన ఎంజేపీ గురుకులాలు, బీసీ వసతి గృహాల విద్యార్థులకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం అభినందన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎస్. సవిత పాల్గొని మాట్లాడారు. విద్యతోపాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలన్న ఉద్దేశంతో త్వరలో స్పోర్ట్స్ మెటీరియల్ అందజేయనున్నామని ఆమె తెలిపారు. ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ప్రస్తుతం ఒక్కో విద్యార్థిపై ఎంజేపీ గురుకులాల్లో రూ.1.50లక్షలు, బీసీ హాస్టళ్లలో రూ.75వేలు వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల సంఖ్యను 42 నుంచి 109కి పెంచామని చెప్పారు. ఆరు ఎంజేపీ గురుకుల పాఠశాలలను కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. వార్డెన్లు మార్గదర్శకత్వం చేయాలి.. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, వార్డెన్లు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. హాస్టళ్లు గురుకులాల్లో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని తెలిపారు. విద్యార్థులు మారుతున్న ప్రపంచ పోటీని ఎదుర్కొనేందుకు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. డైరెక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ టెన్త్, ఇంటర్లో బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల విద్యార్థులు ఈ ఏడాది గణనీయమైన ఫలితాలను సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.10వేలు, రూ.5వేలు చొప్పున నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంజేపీ కార్యదర్శి మాధవీ లత, అడిషనల్ డైరెకటర్ చంద్రశేఖరరాజు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పేరేపి ఈశ్వర్, వీరంకి వెంకట గురుమూర్తి, మల్లె ఈశ్వరరావు పాల్గొన్నారు. పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -
పదేపదే పునరావృతం
దేశంలో నీట్ పరీక్ష పేరుతో స్కామ్‌లు పదేపదే పునరా వృతం అవుతున్నాయి. విద్యార్థుల శ్రమను రూ.లక్షలకు అమ్ముకోవటం దుర్మార్గం. ఈ స్కామ్‌ల వల్ల రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారు. వైద్య విద్యకు దూరమవుతున్నారు. రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో గెస్ పేపర్ పేరుతో సోషల్ మీడియాలో తిరిగిన ప్రశ్నపత్రం అసలు ప్రశ్నపత్రంతో సరిపోలింది. దీనికి బాధ్యత వహిస్తున్న కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. నీట్‌ను పూర్తిగా రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించాలి. – ఎ.సురేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్ఓ -
పుట్టి నాగలక్ష్మికి ‘అపురూప’ అవార్డు
పెడన: విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు, కవయిత్రి, రచయిత్రి, స్టాంపుల సేకర్త పుట్టి నాగలక్ష్మికి అమృతలత అపురూప అవార్డు–2026 లభించింది. పెడన మండలం దావోజిపాలెంకు చెందిన ఈమె వృత్తిరీత్యా గుడివాడలో స్థిరపడ్డారు. హైదరాబాద్ నాంపల్లి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలోని నందమూరి తారకరామారావు కళానిలయంలో ‘అమృతలత–అపురూప అవార్డును పోస్టల్ స్టాంపుల సేకరణ విభాగంలో నాగలక్ష్మికి మంగళవారం అందించారు. తెలంగాణ రాష్ట్ర కన్జ్యూమర్స్ డిస్ప్యూట్స్ రిడ్రెసెల్ కమిషన్ తొలి మహిళా అధ్యక్షురాలు జస్టిస్ డాక్టర్ జి. రాధారాణి, ప్రముఖ సినీనటి, ప్రఖ్యాత నృత్య కళాకారిణి మంజుభార్గవి కలిసి అవార్డును నాగలక్ష్మికి అందజేశారు. నాగాయలంక: మండలంలోని గుల్లలమోద ప్రధాన మార్గంలో ఏటిమొగ నుంచి నాగాయలంక వైపు కారులో వస్తుండగా మంగళవారం తెల్లవారు జామున 3.30గంటల సమయంలో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఆ కారు పంట కాలువలోకి దూసుకువెళ్లినట్లు ఎస్ఐ కలిదిండి రాజేష్ తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు బొమ్మిడి చంద్రబాబు(23), షేక్ ఫాతిమున్నీసా(19)లకు స్వల్ప గాయాలు కాగా డ్రైవర్ తమ్ము చైతన్య క్షేమంగా బయటపడ్డాడని ఆయన చెప్పారు. ఎస్ఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కారు బలంగా చెట్టుకు ఢీకొట్టిన తర్వాతే కాలువలోకి దూసుకు పోయుంటుందని స్థానికులు చెబుతున్నారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆటోడ్రైవర్ ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గుణదల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మధురానగర్ సాయిబాబా కాలనీకి చెందిన చందల కిషోర్ బాబు ఇంట్లో అతని మామయ్య కొడుకు గంటల వరుణ్ కుమార్(23) నివసిస్తున్నాడు. వరుణ్ కుమార్‌కు తల్లిదండ్రులు లేకపోవడంతో కిషోర్ దగ్గర పెరుగుతూ వచ్చాడు. వరుణ్ ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ మద్యం ఎక్కువగా తాగుతున్నాడు. ఈనెల 9న కిషోర్ బాబు ఏలూరులో బంధువుల ఇంటికి కుటుంబంతో వెళ్తూ వరుణ్ని ఇంట్లోనే ఉండమని చెప్పాడు. ఉదయం అతనికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. ఒకసారి వాళ్ల మామయ్యను ఇంటికి పంపించి చూడగా బెడ్రూంలో ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఉన్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోర్టుకు విద్యుత్ సరఫరాపై సమీక్ష
పెడన: మండల పరిధిలోని కూడూరు గ్రామంలో 133/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి మచిలీపట్నం పోర్టుకు విద్యుత్ సరఫరా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు పెడన తహసీల్దారు కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రాంతాలను ఎంపిక చేసి స్థల సేకరణపై ఇన్ చార్జి తహసీల్దారు కె.అనిల్‌కుమార్‌తో సమీక్షించారు. నడుపూరు, కూడూరు, నందిగామ, కొంకేపూడి, పెడన, శింగరాయపాలెం గ్రామాలు మీదుగా మొత్తం 32 టవర్లను నిర్మించడానికి స్థల సేకరణ, సంబంధిత రైతుల భూములకు పరిహారం చెల్లింపు, రెవెన్యూ, పోరంబోకు, గ్రామ కంఠాలు తదితర వివరాలను చర్చించారు. ఈ సమావేశంలో మారిటైమ్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఇన్చార్జి ఆర్ఐ విజయలక్ష్మి, సర్వే సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్సాహంగా చెస్ టోర్నీ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చెస్ ఆడటం వల్ల ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెరుగుతాయని ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్ పాషా చెప్పారు. స్థానిక గణదలలోని నెక్ట్స్‌జెన్ సీబీఎస్ఈ స్కూల్ ఆవరణలో ఎన్టీఆర్ జిల్లా అండర్–15 బాల బాలికల చెస్ టోర్నమెంట్ మంగళవారం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 46 మంది బాలబాలికలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. మొత్తం ఆరు రౌండ్లలో జరిగిన పోటీల్లో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలుర విభాగంలో వి.హేమంత్‌కుమార్, ఏ.శశాంక్, డి. రోషన్, అమోల్ దాస్, బాలికల విభాగంలో ఎస్.శ్రీమహి, కె.ఆధ్య, కె.సాయివీక్షణ, సౌమిక చౌదరి విజేతలుగా నిలిచారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి అక్బర్ పాషా హాజరై విజేతలకు బహుమతులు, ప్రశంశాపత్రాలను అందజేశారు. ఆ టోర్నీలో ప్రతిభ చూపిన క్రీడాకారులు జూన్ 13, 14 తేదీల్లో కృష్ణాజిల్లాలోని గుడివాడలో జరిగే ఆంధ్రప్రదేశ్ అండర్–15 చెస్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో ఎన్టీఆర్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలియజేశారు. నెక్ట్స్‌జెన్ సీబీఎస్ఈ స్కూల్ ప్రతినిధులు గౌతమి, ఎం.సుధా, ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి పి. రేణుక, చీఫ్ ఆర్బిటర్స్ పి.రవీంధ్ర, ఏ.మణి రత్నంతో పాటుగా క్రీడాకారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆశలు మెడికిల్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు ఈ నెల మూడో తేదీన నిర్వహించిన ‘నీట్ – 2026’ను రద్దు చేయటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరీక్షకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 12,087 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఏకంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించటంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ‘నెలల తరబడి నిద్రాహారాలు మానుకుని కష్టపడి చదివి నీట్ పరీక్ష రాశాం. ఇప్పుడు పేపరు లీకై ంది, రద్దు చేశాం. మళ్లీ పరీక్ష నిర్వహిస్తాం’ అంటే తమ పరిస్థితి ఏమిటని విద్యార్థులు వాపోతున్నారు. పరీక్ష నిర్వహించిన ప్రభుత్వ ఏజెన్సీతో పాటు కేంద్ర ప్రభుత్వ తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 34 కేంద్రాల్లో పరీక్ష ఈ నెల మూడో తేదీన నిర్వహించిన నీట్ పరీక్షకు ఉమ్మడి జిల్లాలో 34 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి 12,259 మంది విద్యార్థులను కేటాయించారు. వారిలో 12,087 మంది పరీక్షకు హాజరయ్యారు. 2025లో 13,625 మంది విద్యార్థులను కేటాయించగా 13,455 మంది హాజరయ్యారు. 2024లో సుమారు 15 వేల మంది పరీక్ష రాశారు. కలెక్టర్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ పరీక్ష నిర్వహణలో తలమునకలయ్యారు. రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో గెస్ పేపర్ పేరుతో సోషల్ మీడియాలో తిరిగిన ప్రశ్నాపత్రం అసలు ప్రశ్నాపత్రంతో సరిపోలినట్లు తేలింది. దీంతో ఈ నెల మూడో తేదీ జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. తరచూ గందరగోళం నీట్ పరీక్షకు సంబంధించి తరచూ గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. గతంలోనూ నీట్ పరీక్ష పేపర్ ముందుగానే బయటకు రావటంతో కోర్టు వరకు వివాదం చేరింది. కొన్ని వందల మందితో మళ్లీ పరీక్ష రాయించారు. తాజాగా నీట్ పేపర్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావటం, అది నిజమైనదిగా స్పష్టం కావటంతో ఏకంగా పరీక్షను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ గందరగోళ పరిస్థితులు విద్యార్థులను మరింత కుంగదీస్తున్నాయని విద్యార్థి సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఎంతో కష్టపడి నీట్ పరీక్ష రాశాను. చాలా నెలలుగా ఇంటర్మీడియెట్ కోర్సుతో పాటుగా నీట్ పరీక్ష కోసం కష్టపడ్డాను. మా అమ్మ, నాన్న సైతం నాతో పాటుగా ఎంతో కష్టపడ్డారు. ఫీజులు కట్టి ప్రోత్సహించారు. అంతా సజావుగా జరిగిన తరువాత ఇప్పుడు నీట్ పరీక్ష రద్దు చేస్తున్నామని ప్రకటిస్తే ఎలా? ఇన్నాళ్ల కష్టం వృథయేనా? నాకే కాదు పరీక్ష రాసిన మా ఫ్రెండ్స్ అందరం బాధపడుతున్నాం. మళ్లీ పరీక్ష రాయాలంటే చాలా కష్టం. – సీహెచ్ ధేనుక, విద్యార్థిని, విజయవాడ నెలల తరబడి కష్టపడి చదివి రాసిన నీట్ పరీక్షను ఒక్కసారిగా రద్దు చేసినట్లు ప్రకటించటంతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉమ్మడి కృష్ణాజిల్లాలో శిక్షణ తీసుకుని నీట్ పరీక్షకు హాజరవుతారు. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అంటూ కుటుంబాలకు దూరంగా హాస్టళ్లలో ఉండి, వేకువ జాము నుంచి అర్ధరాత్రి వరకూ పుస్తకాలే లోకంగా చదువుతారు. అంతటి కష్టం బుడిదలో పోసిన పన్నీరుగా మారిందని విద్యార్థులు వాపోయారు. ఈ పరీక్షను చాలా బాగా రాశామని, సీటు వస్తుందన్న నమ్మకం ఉందని, మళ్లీ పరీక్ష రాయాలంటే తమకు నష్టమేనని పేర్కొన్నారు. ఇన్నాళ్లు తాము పడిన కష్టానికి ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. -
ఎన్హెచ్ఎం ఉద్యోగుల ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రేషనలైజేషన్ పేరుతో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులకు నష్టం చేసే నిర్ణయాలు మానుకోవాలని ఏపీ ఎన్హెచ్ఎం జేఏసీ డిమాండ్ చేసింది. సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు ఏపీ నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి ఎన్హెచ్ఎం ఉద్యోగులు ధర్నాకు తరలివచ్చారు. ధర్నా నుద్దేశించి జేఏసీ చైర్మన్ దయామణి మాట్లాడుతూ ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల పెండింగ్ వార్షిక ఇంక్రిమెంట్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్లియర్ వేకెన్సీలు, పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని, రిటైర్మెంట్ వయసు 62ఏళ్లకు పెంచాలని, బెనిఫిట్స్ అమలు చేయాలన్నారు. ధర్నాలో కన్వీనర్ ప్రభాకరరెడ్డి, కోశాధికారి జే సింహాచలం, ఎన్హెచ్ఎం ఉద్యోగులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు
హనుమాన్‌జంక్షన్ రూరల్: ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు ఐదో రోజైన సోమవారం ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థానాన్ని, స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు. ప్రధాన అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు, అర్చకు లు గొట్టిపాళ్ల శ్రీనివాసాచార్యులు, శృంగారం వెంకట శేషారామాచార్యులు అంజనీపుత్రునికి ప్రభాత సేవ, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నవకలశ స్నపన, శాంతి హోమం, సిందూర అర్చన జరిగాయి. ఆధ్యాత్మిక వేదికపై భక్తి సంకీర్తన చేశారు. సాయంత్రం హనుమంతునికి బంగారు, వెండి పుష్పాలతో ప్రత్యేక పూజలు, నక్షత్ర హారతి వైభవంగా నిర్వహించారు. అనంతరం కళావేదికపై ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను అబ్బురపర్చాయి. జూపూడి(ఇబ్రహీంపట్నం): కళాశాలలు, పాఠశాలల బస్సుల ఫిట్నెస్, వాహన రికార్డులు సక్రమంగా లేకుండా రోడ్లపైకి వస్తే భారీ జరిమానా విధిస్తామని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం స్థానిక నిమ్రా కళాశాల ప్రాంగణంలో రవాణా శాఖ అధికారులు ఉదయ్ సాయిప్రసాద్, ఎండీ ఆలీ సోమవారం బస్సుల తనిఖీ చేపట్టారు. -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4623 టీఎంసీలు. 718న దుర్గమ్మ హుండీ కానుకల లెక్కింపు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, మొక్కులు, ముడుపులను 18వ తేదీన లెక్కించనున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో ఆరోజు ఉదయం ఏడు గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. కానుకల లెక్కింపులో ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొనున్నారని తెలిపారు. కానుకల లెక్కింపు నేపథ్యంలో ప్రత్యేక తనిఖీలు, పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శ్రీ హనుమత్ దీక్షా పీఠంలో శ్రీ వీరాంజ నేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. చిలకలపూడి: కృష్ణాజిల్లా రవాణా అధికారిగా నియమితులైన షేక్ సలాం యాకూబ్ కలెక్టర్ డీకే బాలాజీని కలెక్టరేట్లో సోమ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఓ మంత్రితో ఎమ్మెల్యేలకు కొరవడిన సఖ్యత పార్లమెంటు ముఖ్యనేతతోనూ అదేతీరు కృష్ణాజిల్లా ప్రజా ప్రతినిధులపై చంద్రబాబు ఆగ్రహం సీటు మార్చడానికైనా వెనకాడనని లీకులు -
బడి పిలుస్తోంది.. ప్రచార రథం ప్రారంభం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘బడి పిలుస్తోంది’ పేరిట విద్యాశాఖ రూపొందించిన ప్రచార చైతన్య రథాన్ని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ప్రారంభించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ చైతన్య రథం ద్వారా జిల్లాలో ఈనెల 30వరకు ఒక్కో మండలంలో ఒక్కో రోజు చొప్పున బడి పిలుస్తోంది కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. బడి ఈడు పిల్లలు పాఠశాలలో చేరేలా చూడాలన్నారు. డీఈవో ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.రమేష్‌బాబు, సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక కృషి
● రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ● కృష్ణాజిల్లా కంకిపాడు, ఆత్కూరు పోలీసుస్టేషన్ భవనాల ప్రారంభం కంకిపాడు/గన్నవరం: శాంతి భద్రతల పరిరక్షణకు, మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కృష్ణాజిల్లా కంకిపాడులో రూ.2.75 కోట్లతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని, ఉంగుటూరు మండలం ఆత్కూరులో రూ.1.40 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను, ఆత్కూరులో రూ.1.20 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డు, కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 25 ఐపీ ఆధారిత కెమెరాలను సోమవారం మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ప్రారంభించారు. ఆయా చోట్ల జరిగిన సభల్లో హోం మంత్రి మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. మహిళల రక్షణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం.. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పటిష్టంగా పోలీసింగ్ వ్యవస్థను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం కంకిపాడు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణంలో కీలక పాత్ర వహించిన కోఆర్డినేటర్ తుమ్మలపల్లి హరికృష్ణను హోం మంత్రి ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఐజీపీ అశోక్‌కుమార్, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా అభయాంజనేయుడి రజత కవచ మహోత్సవం
రేమాలవారిపాలెం(నాగాయలంక): స్థానిక వంతెన సెంటర్లోని శ్రీఅభయాంజనేయ దేవస్థానంలో స్వామివారికి సోమ వారం రజత కవచ మహోత్సవం వైభవంగా జరిగింది. రేమాలవారిపాలెంనకు చెందిన గుడి కోటేశ్వరరావు – రత్నమంజుల, రాంబాబు – కృష్ణకుమారి స్వామికి 20 కిలోల వెండితో ఏడు అడుగుల కవచం సమర్పించిన నేపథ్యంలో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా దాతల నేతృత్వంలో తొలుత వంతెన సెంటర్ నుంచి కవచ మహోత్సవ ఊరేగింపు నిర్వహించారు. కేరళ సంప్రదాయ చండీ మేళ తాళాలు, ఆధ్యాత్మిక కోలాట బృందాలతో భక్తులు నాగాయలంక ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం జరిపించారు. అనంతరం స్వామి విగ్రహానికి రజత కవచం సమర్పించి విశేషపూజ చేశారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. -
కొత్త ఆవిష్కరణలకు ముందుకు రావాలి
రామవరప్పాడు: సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు యువత, విద్యార్థులు ముందుకు రావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా సోమ వారం ప్రాజెక్ట్ ఎక్స్పో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీశ విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రతి ప్రాజెక్ట్ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారి ప్రతిభ, పరిశోధనా దృక్పథం, సృజనాత్మక ఆలోచనలను అభినందించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. విద్యార్థులు పరిశోధనాత్మక దృష్టి అలవరుచుకుని దేశాభివృద్ధికి ఉపయోగపడేలా నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, స్మార్ట్ టెక్నాలజీస్, స్మార్ట్ హోమ్ సిస్టమ్స్, ఆటో మేటిక్ కంట్రోల్ మోడల్స్ వంటి ఆధునిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బి.ఎస్.అప్పారావు, సెక్రటరి శ్రీకృష్ణ, ప్రిన్సిపాల్ చైతన్య, జిల్లా యువజన సర్వీసుల అధికారి కొల్లెటి రమేష్, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. చెస్ క్రీడాకారిణి రేణుకకు అభినందన మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని స్కౌట్ స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గత నెల 24, 25, 26 తేదీల్లో జరిగిన ఫిడే అర్బిటర్ ఎగ్జామ్‌లో ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్న పోలదాస్ రేణుక క్వాలిఫై అయ్యి ఫిడే అర్బిటర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. స్థానిక ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో రేణుకను సోమ వారం అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అక్బర్ పాషా మాట్లాడుతూ.. దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 19 మంది ఈ పరీక్షకు హాజరవగా తొమ్మిది మంది మాత్రమే ఆర్బిటర్ టైటిల్‌కు అర్హత సాధించారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గోలి వేణు, కృష్ణా జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ ఎం.దివ్యతో పాటు పలువురు చెస్ క్రీడాకారులు పి.రేణుకను అభినందించారు. -
పదిలో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
చిలకలపూడి(మచిలీపట్నం): పదో తరగతిలో 2026–27 విద్యా సంవత్సరంలో నూరుశాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని విద్యాశాఖాధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. సోమ వారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో విద్యాశాఖాధికారులతో వచ్చే విద్యాసంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లా డుతూ.. విద్యాశాఖాధికారులు సమన్వయంతో ఇప్పటి నుంచే ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక రూపొందించుకుని విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తూ సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి, వారిని మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు. కచ్చితంగా ఉత్తీర్ణుతలు కారు అనుకునే విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. పరీ క్షల్లో విద్యార్థుల మార్కులను గమనించేందుకు వీలుగా ఒక యాప్‌ను సిద్ధం చేయాలన్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పునఃశ్చరణ తరగతులు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులతో కూడా సమావేశాలు నిర్వహించి ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యేలా పర్యవేక్షించాలన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రధానోపాధ్యాయులతో కూడా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పాఠశాలలకు సరిగా హాజరు కాని విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి అవగాహన కలిగించాలన్నారు. ఈ ఏడాది తెలుగులో 340 మంది విద్యార్థులు ఉత్తీర్ణత కాకపోవటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఇలా ఎందుకు జరిగిందని ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ఆరు పాఠశాలల్లో 50 శాతం కంటే తక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావటం సరికాదన్నారు. తప్పులను సరిదిద్దుకుని ఇప్పటి నుంచి నూరుశాతం ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో సమగ్రశిక్షా ఏపీసీ కుముదిని సింగ్, డీవైఈఓలు శేఖర్‌సింగ్, రవికుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
వైభవంగా వీరాంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): హనుమాన్ దీక్షను ఆచరించడంతో పాటు హనుమాన్ చాలీసా పఠనం ద్వారా శక్తి, యుక్తి, కార్యసామర్థ్యాలను పెంపొందించుకుని దేశం, ధర్మం కోసం పని చేయాలని త్రిదండి చినజీయర్ స్వామిజీ సూచించారు. పాలప్రాజెక్టు ఎదుట ఉన్న శ్రీ హనుమత్ దీక్షా పీఠంలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ, విగ్రహ ప్రతిస్ఠ, కుంభాభిషేకం మహోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పీఠాధి పతి దుర్గాప్రసాద్ స్వామిజీ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ మహోత్సవాలకు ముఖ్య అతిథులుగా త్రిదండి చినజీయర్ స్వామిజీ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు, తెలంగాణ మాజీ మంత్రి హరీష్‌రావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, బీజీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు. తొలుత పీఠంలోని ప్రధాన ఆలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠను త్రిదండి చినజీయర్ స్వామి, దుర్గాప్రసాద్ స్వామిజీ నిర్వహించారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆలయం సమీపంలోని సయ్యద్ అప్పలస్వామి కళాశాల ఆవరణలో ప్రత్యేక హోమాలు, యాగాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాన ఆలయంపై భాగంలో కలశస్థాపన, కుంభాషేకం జరిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్రిదండి చిన జీయర్ స్వామి భక్తలకు అనుగ్రహ భాషణం చేశారు. హనుమంతుడి ఆవిర్భావం, విశిష్టతతో పాటు ఆయన మహిమలు, రామాయణంలో ధర్మరక్షణ కోసం హనుమంతుడు చూపిన శక్తి, యుక్తులు, కార్యసిద్ధిని త్రిదండి చినజీయర్ స్వామిజీ భక్తులకు వివరించారు. దుర్గాప్రసాద్ స్వామిజీ మాట్లాడుతూ.. 1912లో ప్రారంభమైన హనుమత్ దీక్ష పీఠం 2026 నాటికి వైభవంగా అభివృద్ధి చెందిందన్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ దేవనాథ జీయర్, కమలానంద భారతీ స్వామి, హైదరాబాద్‌కు చెందిన సాయికుమార్ బాబాజీతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి హనుమత్ దీక్షను స్వీకరించిన పలువురు భక్తులు, ఉభయ దాతలు విశేషంగా పాల్గొన్నారు. -
మచిలీపట్నంలో గంజాయి ముఠా అరెస్టు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లాకేంద్రమైన మచిలీపట్నంలో గంజాయి ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఇన్చార్జ్ డీఎస్పీ జి.శ్రీనివాస్ ఈ కేసు వివరాలను విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు.. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గుంజా అజయ్‌బాబు, తురక ప్రవీణ్, కుంబా సాయిప్రసాద్, జవ్వాది తేజరామ్చరణ్, గట్టి సింహాద్రి, వాకా నిశాంత్, కందుల సుబ్రహ్మణ్యం, పయ్యావుల అజయ్‌యాదవ్‌తో పాటు బందరు మండలంలోని అరిశేపల్లికి చెందిన కాట్రగడ్డ జగదీష్‌సాయి, ఎస్.ఎన్.గొల్లపాలెంనకు చెందిన గురువిందపల్లి సుందర్, సత్రపాలెంనకు చెందిన వల్లభాపురం చందుప్రకాష్ పరిచయస్థులు. వీరు కొంత కాలంగా రెండు బృందాలుగా మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో గంజాయి తాగడంతోపాటు, విక్రయిస్తున్నారు. వారిపై గతంలో అనేక కేసులు నమోదయ్యాయి. సోమవారం నగరానికి సమీపంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన నిర్మానుష్య ప్రాంతంలో వారు గంజాయి తాగుతూ విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ బందరు ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీనివాసర్ పర్యవేక్షణలో ఆర్‌పేట సీఐ ఏసుబాబు ఆధ్వర్యంలో దాడులు చేయించారు. ఈ దాడుల్లో మచిలీపట్నం ఎస్ఐతో పాటు ఆర్‌పేట ఎస్ఐలు పాల్గొనగా 11 మంది యువకులు గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. వారి నుంచి పది కిలోల గంజాయి, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఆర్‌పేట సీఐ ఏసుబాబు, మచిలీపట్నం, ఆర్‌పేట ఎస్ఐలు జగదీష్‌కుమార్, కె.సూర్యప్రకాష్, ఎకై ్సజ్ సీఐ వరస వెంకటేశ్వరమ్మ, ఈగల్ టీం సభ్యులు పాల్గొన్నారు. -
ఎంఎల్ఎస్ పాయింట్లలో చౌకబారు దందా
పెడన: రేషన్ డీలర్లకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే బియ్యం తూకంలో అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. మచిలీపట్నం ఎంఎల్ఎస్ (మండల లెవెల్ స్టాక్) పాయింట్ల నుంచి రేషన్ డీలర్లకు సరఫరా అయ్యే చౌకబియ్యం బస్తాల్లో తూకం తగ్గిపోతోంది. 50 కిలోల కట్టకు కిలోన్నర నుంచి రెండు కిలోలకు పైగా బియ్యం తగ్గిపోతోంది. ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చే బియ్యం కట్టల విష యంలో వెయిటేజీ ప్రకారం తూకం తగ్గితే అదనపు కట్టలు (బియ్యం బస్తాలు) తీసుకుని అధికారులు కచ్చితత్వం పాటిస్తారు. రేషన్ డీలర్లకు మాత్రం వెయిటేజ్ ప్రకారం కాకుండా కట్టలు ప్రకారం పంపిణీ చేస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తగ్గిన బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ ఇదే పరిస్థితి.. గతంలో అంటే సుమారు ఆరేడు నెలలు కింద కూడా బియ్యం కట్టల్లో తూకం తేడా రావడంతో డీలర్లు వాటిని తిరిగి పంపించేశారు. పరిస్థితి దారుణంగా మారుతోందని గ్రహించిన ఉన్నతాధికారులు సైతం తప్పును సరిదిద్దుకుని సక్రమంగా బియ్యం సరఫరా చేశారు. మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చిందని డీలర్లు వాపోతున్నారు. ఎంపిక చేసిన డీలర్లకు మాత్రమే.. డీలర్లు అందరికీ ఒకే సారి తూకం తగ్గిస్తే అనుమానాలు వస్తున్నాయని గుర్తించిన అక్రమార్కులు మండలంలో ఒక్కొక్క సారి ఇద్దరు లేదా ముగ్గురు డీలర్లను ఎంపిక చేసుకుని వారికి మాత్రమే బియ్యం తగ్గించి పంపించేలా చూస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కన వారికి కచ్చితంగా వచ్చినప్పుడు మీకు ఎందుకు రావనే వాద నను తీసుకువచ్చి డబాయిస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. తూకంలో తేడాలను కొందరు సర్దుకుపోతుండగా మరికొందరు తమ వల్ల కాదంటూ తిప్పి పంపించేలా ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అల్లరి కాకుండా వారి నోళ్లను భయపెట్టి, అధికారాన్ని అడ్డం పెట్టి లేదా తగ్గిన బియ్యాన్ని పంపించి అక్రమ దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చే బియ్యం బస్తాల్లో కచ్చితమైన తూకం డీలర్లకు పంపిణీ చేస్తున్న బస్తాల్లో మాత్రం తగ్గిపోతున్న బరువు 50 కిలోల కట్టకు 2 నుంచి 1.5 కిలోలు తగ్గుతున్న వైనం తూకంపై నోరు విప్పితే ఇబ్బందిపెడతారని డీలర్ల ఆందోళన ఒక్కొక్క చౌక దుకాణాల డీలరు తన పరిధిలోని కార్డు దారులకు బియ్యం పంపిణీ చేయడానికి ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి సుమారు 200 నుంచి 250 కట్టలు వరకు దిగుమతి చేసుకుంటారు. ఒక్కొక్క కట్ట నుంచి కిలోన్నర నుంచి రెండు కిలోల వరకు తరుగు ఉంటోంది. మొత్తంగా అన్ని కట్టల్లో కలిపి 200 నుంచి 250 కిలోల వరకు తరుగు ఉంటోంది. అంటే నాలుగైదు బస్తాలు తరుగు కింద వస్తుండటంతో డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని అధికారుల దృష్టికి తీసువెళ్తున్న ఫలితం ఉండటం లేదని వాపోతున్నారు. రేషన్ డీలర్లను స్వయంగా వచ్చి కాటా పెట్టి బియ్యం తీసుకువెళ్లాలని స్పష్టం చేశాం. డీలర్లకు ఇచ్చే బియ్యం కట్టలు సరైన తూకం ఉండేలా చూసి పంపిస్తున్నాం. డీలర్లు రాకపోతే మేమే కాటా పెట్టించి పంపిస్తున్నాం. వారికి బియ్యం అందిన వెంటనే కాటా పెట్టుకుని, ఒకవెళ తగ్గితే మా దృష్టికి తీసుకురావాలని చెప్పాం. ప్రతి నెలా 22, 23వ తేదీల్లో బియ్యం సరఫరా జరుగుతుంది. మాకు వెయిటేజ్ ప్రకారం వచ్చే బియ్యాన్ని, మేము కూడా కచ్చితమైన తూకం పెట్టి డీలర్లకు పంపిణీ చేస్తున్నాం. – కె.లావణ్య, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి, మచిలీపట్నం -
ఒకే కుటుంబంలో ముగ్గురికి గిన్నిస్ రికార్డు
పెనమలూరు: మండలంలోని కానూరుకు చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు గిన్నిస్వరల్డ్ రికార్డు సాధించారు. గత ఫిబ్రవరి రెండో తేదీన హైదరాబాద్‌లో 22 దేశాల నుంచి రెండు వేల మంది కీబోర్డ్ వాయిద్యకారులు గంటపాటు కీబోర్డు ప్లే చేశారు. విజయవాడలోని హెల్లెల్ మ్యూజిక్ స్కూల్లో శిక్షణ పొందిన కానూరుకు చెందిన దంపతులు పాతూరి సురేష్‌బాబు, స్వర్ణలత తమ కుమార్తె షయాఫేత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ముగ్గురు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు ఎంపికయ్యారు. హెల్లెల్ మ్యూజికల్ స్కూల్లో రెండు రోజుల క్రితం జరిగిన కార్యక్రమంలో వారికి గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరికి గాయాలు చల్లపల్లి: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడిన ఘటన మండలంలోని వక్కలగడ్డ ఐదో నంబర్ కాలువ వద్ద చల్లపల్లి–పామర్రు ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం జరిగింది. చల్లపల్లి నారాయణరావునగర్‌కు చెందిన 70 ఏళ్ల పాస్టర్ కె.రాజేంద్ర ప్రసాద్ ద్విచక్రవాహనంపై దళితవాడ నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా చల్లపల్లి మండలం యార్లగడ్డ గ్రామానికి చెందిన యువకుడు అనిల్ బైక్‌పై చల్లపల్లి నుంచి వక్కలగడ్డ వైపు వెళ్తున్న క్రమంలో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి. రాజేంద్రప్రసాద్‌కు కాలు విరిగి తలకు బలమైన గాయమైంది. అనిల్‌కు కూడా గాయాలయ్యాయి. చల్లపల్లి 108 ఈఎంటీ దాసి బసవరాజు, పైలెట్ రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన చల్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాస్టర్ రాజేంద్రప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. కొంతసేపటి తరువాత అనిల్‌ను కూడా మరొక అంబులెన్స్‌లో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మహాటీవీకి చంద్రబాబు ప్రభుత్వం భారీగా లబ్ధి
సాక్షి,విజయవాడ: మహాటీవీకి చంద్రబాబు ప్రభుత్వం రూ.56.64లక్షలు లబ్ధి పొందేలా నిర్ణయం తీసుకుంది. పబ్లిసిటీ వీడియోలను రూపొందించినందుకు నిధులను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్, దీపం, ఉచిత ఇసుక పథకం వంటి కార్యక్రమాల ప్రచారం కోసం రూ.56.64లక్షల నిధుల్ని కేటాయించారు. తద్వారా చంద్రబాబు తన అనుకూల మీడియాకు భారీగా లబ్ధి చేకూరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అక్రమాల వాణిజ్యం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖకు విజయవాడ రైల్వేస్టేషన్ కల్పతరువైంది. ఆ శాఖ సిబ్బంది అవినీతికి అడ్డాగా మారింది. దేశంలోనే కీలక రైల్వేస్టేషన్ ‘విజయవాడ’లో సరుకుల దిగుమతి ఎగుమతులు భారీగా జరుగుతుంటాయి. వాటిలో అనధికార లావాదేవీలే అధికంగా ఉంటాయి. వాటి రాకపోకలు వాణిజ్య పన్నుల శాఖ సిబ్బందికి వరంగా మారుతున్నాయి. నిత్యం కోట్లాది రూపాయల సరుకు ఇక్కడ దిగుమతి కావటంతో పాటుగా ఎగుమతి సైతం జరుగుతుంటాయి. ఆ సరుకుపై కన్నేసి అందినకాడికి దండుకోవడం వాణిజ్య పన్నుల శాఖ సిబ్బందికి అలవాటుగా మారిందనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఇక్కడ అనధికార విధులు నిర్వహించే సిబ్బంది ద్వారా మొత్తం ఆ శాఖకు సంబంధించిన వారందరికీ వాటాలు అందుతాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సిబ్బందికి కల్పతరువు వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి గవర్నరుపేట సర్కిల్ కార్యాలయం పరిధిలో రైల్వేస్టేషన్ ప్రాంతం ఉంటుంది. ఈ సర్కిల్లో బాధ్యతలు నిర్వహించే అందరికీ ఈ రైల్వేస్టేషన్‌పై మంచి పట్టు ఉంటుందని ఆ శాఖ సిబ్బంది చెబుతుంటారు. ఏ సమయంలో ఏఏ రైలులో సరుకులు వస్తుంటాయనేది వారికి బాగా తెలిసి ఉంటుందని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్త్రాలు అధికంగా వస్తుంటాయి. ఆయా సమయాల్లో రైల్వేస్టేషన్లో కాపు కాసి అందినకాడికి దండుకోవటం పరిపాటైందని వన్‌టౌన్‌కు చెందిన వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. జరుగుతున్నా పట్టించుకునేవారే లేరు ఇటీవల ఏసీబీ దాడుల్లో చిక్కిన గవర్నరుపేట సర్కిల్లో పని చేసే కొండపల్లి శ్రీనివాసరావుకు రైల్వే స్టేషన్, దాని పరిసర ప్రాంతాలే అడ్డాగా ఉన్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అతని ఇల్లు రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉండటంతో నిత్యం అనధికారక విధులు నిర్వహించి భారీగా దోపిడీకి పాల్పడుతుంటాడని వ్యాపార వర్గాలు వివరిస్తున్నాయి. కొండపల్లికి అండగా ఇతర అధికారులు పని చేస్తుంటారని దీంతో ధైర్యంగా వాహనాలను నిలిపి అనధికారిక తనిఖీలు నిర్వహిస్తున్నా పట్టించుకునే వారు లేరని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నెల రోజులు డ్యూటీలు వేసినా ఆ శాఖకు రూపాయి ఆదాయం రాని వైనం ఏటా సంక్రాంతి పర్వదినానికి ముందు నెల రోజుల పాటు రైల్వేస్టేషన్ ద్వారా నగరానికి భారీగా వస్త్ర వ్యాపారానికి సంబంధించిన సరుకు వస్తుంటుంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి సరుకు అధికంగా వస్తుంటుంది. వన్‌టౌన్‌లో సుమారు వెయ్యికి పైగా ఉన్న వివిధ వస్త్ర దుకాణాలకు చాలా సరుకు స్టేషన్ ద్వారా చేరుతుంటుంది. అధికారులు కాపలా ఒకవైపు ఉంటే మరోవైపు సరుకు బయటకు వెళ్లిపోతుంటుంది. దీనిపై వార్తలు వస్తుండటంతో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు గడిచిన రెండేళ్లుగా అక్కడ ఆ నెల రోజులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఒక్క రూపాయి సైతం పట్టుకున్న దాఖలాలు లేవు. కానీ సిబ్బంది జేబులు భారీగా నిండాయనే ఆరోపణలు మాత్రం బలంగా ఉన్నాయి. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహించే వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రైల్వేస్టేషన్ పరిసరాల్లో తనిఖీలు చేసేందుకు రైల్వే అధికారులు అంగీకరించడం లేదనే సాకుతో ప్రభు త్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఉన్నతాధికారులు రైల్వేశాఖ అధికారులకు లేఖ రాయడం, రైల్వే సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తున్నారు. కానీ స్టేషన్ ప్రాంగణం నుంచి బయటకు వచ్చే సరుకును మాత్రం ఇప్పటి వరకూ పెద్దగా చూపించిన దాఖలాలు లేవని తెలిసింది. రైల్వేస్టేషన్ ద్వారా బయటకు వస్తున్న సరుకును గుర్తించి సకాలంలో తనిఖీలు నిర్వహిస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ దిశగా సిబ్బంది తీరును మార్చడానికి ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం, అవినీతి వసూళ్లలో వాటాలు అందడంతో ఇటీవల అవినీతి సిబ్బంది పుట్టుకొస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దీనికి పటిష్ట చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. దాతలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.చిలకలపూడి(మచిలీపట్నం): ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేస్తూ ఇద్దరు ఉద్యోగులు జోరుగా వసూళ్లు చేస్తున్నారు. ఏళ్లుగా అక్కడే తిష్ట వేసి అవినీతి బాగోతం నడుపుతున్నారు. అదెక్కడంటే బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలో అవనిగడ్డ పంచాయతీ. దానిలో ఇద్దరు ఉద్యోగులు వసూల్ రాజాలుగా మారారు. పంచాయతీ పరిధిలో సుమారు 10 వేల మందికి పైగా జనాభా ఉన్నారు. వారికి ఎంతో కొంత ముట్టచెప్పనిదే పని జరగదని అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నేళ్లయినా ఇక్కడే విధులు నిర్వహించడం చూస్తుంటే వీరి వసూళ్ల పర్వం ఎంత మేర జరుగుతోందో అని ప్రజలు బాహాటంగా చెప్పుకుంటున్నారు. జలజీవన్ మిషన్ ద్వారా అధిక వసూళ్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ పథకానికి జిల్లాలో అవనిగడ్డ పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇది పంచాయతీలోని ఇద్దరు కీలక ఉద్యోగులకు పాడికుండలా మారింది. జలజీవన్‌మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమైతే వీరికి మాత్రం వసూళ్ల పర్వానికి ఉపయోగపడింది. కుళాయి కనెక్షన్ కోసం ఒక్కొక్క ఇంటికి రూ. 20 వేలు వసూలు చేసినట్లు ప్రజలు బాహాటంగా చెబుతున్నారు. ఇలా పంచాయతీ పరిధిలో 1,465 కనెక్షన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగా భారీ మొత్తంలో వసూలు చేసినట్లు సమాచారం. షాపుల కేటాయింపులోనూ చేతివాటం అవనిగడ్డ పంచాయతీ పరిధిలో 40 షాపులు ఉన్నాయి. మూడేళ్లకొకసారి వాటికి బహిరంగ వేలం నిర్వహించి అధిక మొత్తంలో పాడుకున్న వారికి షాపును అప్పగించాలనే నిబంధన ఉంది. వీరు చేతివాటం చూపి ఒక్కొక్క షాపు నుంచి రూ. 50 వేలు వసూలు చేసి బహిరంగ వేలం నిర్వహించినట్లుగా రికార్డులు చూపి తిరిగి వారికే షాపులు కేటాయిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఇద్దరు షాపు యజమానులు రూ. 9 లక్షల పాత బకాయిలు ఉండగా వారికి పంచాయతీ నుంచి లీగల్ నోటీసులు పంపి వెంటనే బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ ఆదేశాల్లో కూడా కార్యదర్శి తన చేతివాటాన్ని ప్రదర్శించి వారి నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసి ఎటువంటి బాకీ లేదని ధ్రువీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. పంచాయతీ ముఖ్యఅధికారి అయిన అతను విధి నిర్వహణలో ప్రతిభ కనపరచకపోయినా ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోవడంలో తనదైనశైలి చూపుతారనేది అక్కడి ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు. 2019 నుంచి ఇక్కడే పనిచేస్తున్న ఈ అధికారి ఇటీవల నడకుదురు పంచాయతీకి బదిలీ అయినా ఉన్నతాధికారుల సహకారంతో డెప్యూటేషన్ వేయించుకుని ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారంటే ఏ మేరకు వసూళ్ల పర్వం జరుగుతుందోనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏటా ఉన్నతాధికారులకు డబ్బులు ముట్టజెప్పడంతో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధి కుమారుడికి కూడా నెలసరి వాటాలు ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పంచాయతీ పరిధిలో ఎవరైనా ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే ప్లాన్ అప్రూవల్ కోసం రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు వీరికి చెల్లించకుండా అనుమతులు రావనేది అక్కడి ప్రజల వాదన. పంచాయతీలో ఎవరైనా ముందుగా జూనియర్ అసిస్టెంట్‌ను కలిసి వారు అడిగిన సొమ్ము ముట్టజెప్పనిదే అక్కడ పని పూర్తికాదనేది అవనిగడ్డ ప్రజల వాదనగా వినపడుతోంది. ఈ జూనియర్ అసిస్టెంట్‌కు రెండేళ్ల క్రితం పదోన్నతి వచ్చినప్పటికీ వద్దని లేఖ కూడా అధికారులకు రాసి ఇచ్చారంటే ఏ విధంగా ఇక్కడకు విధులకు, వసూళ్ల పర్వానికి అంకితమైపోయారో తెలుస్తోంది. ఏదైనా ధ్రువీకరణ పత్రాల కోసం వెళితే ఉచితంగా ఇవ్వాల్సింది పోయి రూ. 500 ఇవ్వనిదే ఇచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా వసూళ్ల పర్వాన్ని పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ వీరిని తరచూ ప్రశ్నిస్తున్నారని అడ్డుతొలగించేందుకు కావాలనే ఇటీవల ఏసీబీ దాడి కూడా చేయించినట్లు తెలుస్తోంది. 20 వార్డులు ఉన్న అతి పెద్ద ఈ పంచాయతీలో వీరిద్దరూ చేస్తున్న వసూళ్ల పర్వానికి ఉన్నతాధికారులు ఇప్పటికై నా విచారణ చేసి వారికి అడ్డుకట్ట వేయాలని అవనిగడ్డ ప్రజలు కోరుతున్నారు. -
ఆగివున్న లారీని ఢీకొని టిప్పర్ డ్రైవర్ దుర్మరణం
గన్నవరం: మండలంలోని చిన్న ఆవుటపల్లి వద్ద వెస్ట్ బైపాస్‌పై ఆదివారం తెల్లవారుజామున ప్రమాదంలో టిప్పర్ లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఆత్కూరు పోలీసుల కథనం మేరకు.. జి.కొండూరులోని వైఎస్సార్ కాలనీకి చెందిన నాగకృష్ణారావు (34) టిప్పర్ లారీ డ్రైవర్‌గా జీవిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో టిప్పర్‌పై ఏలూరు నుంచి విజయవాడ వైపు బయలుదేరాడు. చిన్న ఆవుటపల్లి వెస్ట్ బైపాస్ వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ప్రమాదవశాత్తు టిప్పరు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ ముందు భాగం నుజునుజ్జయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ నాగకృష్ణారావు క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. హైవే పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ నాగకృష్ణారావును అతికష్టం మీద బయటకు తీసి అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే నాగకృష్ణారావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఆందోళనకరంగా శ్వాసకోశ వ్యాధులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వాయు కాలుష్యం, వాతావరణ మార్పులతో అలెర్జీ కారకాలు, ఓజోన్‌లో మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ వంటివి దీర్ఘకాలిక ఊపిరి తిత్తుల వ్యాధులకు దారితీస్తున్నట్లు పలువురు పల్మోనాలజిస్టులు పేర్కొన్నారు. వ్యాధులను నిర్ధారించడంలో జాప్యం జరగడంతో ముఖ్యంగా సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డీసీజ్) ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఓ హోటల్లో ఆదివారం ఏరోఫోర్స్ సంస్థ ఆధ్వర్యాన ఏరోకాన్ పేరుతో పల్మోనాలజిస్టుల సదస్సు జరిగింది. 250 మంది వరకు స్పెషాలిటీ వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై శాసీ్త్రయమైన చర్చలు జరిగాయి. ఏరోకాన్ కోర్స్ డైరెక్టర్ డాక్టర్ కె.అనీల్‌కుమార్ మాట్లాడుతూ వ్యాధిని ముందుగానే గుర్తించడానికి, నిర్వహణకు పలు సూచనలు చేశారు. రోగులు ప్రతిరోజూ మెరుగ్గా శ్వాస తీసుకోవడానికి అవగాహన, నిరంతర వైద్య విద్య ప్రాముఖ్యాన్ని వివరించారు. సదస్సులో నూతన పరిశోధనలు, చికిత్స ఫలితాలు వంటి వాటిని విశ్లేషించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోక కల్యాణార్థం దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజలు చేశారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవను నిర్వహించారు. ఉభయదాతలను ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. కోనేరుసెంటర్: కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యాన ప్రతి సోమవారం నిర్వ హించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని ఈ నెల 11వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ప్రజలు సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందజేయవచ్చని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో జరుగుతుందని పేర్కొన్నారు. మీ కోసంలో అందిన ప్రతి అర్జీని చట్ట పరిధిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు. గుడ్లవల్లేరు: భూ సమేత శ్రీ వేంకటేశ్వరాలయంలో స్వామివార్ల ఉత్సవ మూర్తులకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వేంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ పండితులు కనులపండువగా ఊంజల సేవను చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి పల్లకీ సేవను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు కె.బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
పెనుగంచిప్రోలు: మండల పరిధిలోని తోటచర్ల వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో వెనక వస్తున్న ఆర్టీసీ బస్సు వేగాన్ని నియంత్రించుకోలేక లారీని వెనుకగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సు వెనుకగా వస్తున్న ఓ కారు కూడా అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అయితే కారులో ఉన్న వారు క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదం వల్ల రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు -
ఆరోగ్యంతో సెల్‌గాటం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జీవితంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. గడిచిన సమయంలో ఒక్క సెకను కూడా తిరిగిరాదు. నేడు విద్యార్థులు, యువత, పెద్దలు, ఉద్యోగులు ఇలా ఒక్కరేంటి అందరూ ఎక్కువ సేపు సెల్ఫోన్లు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. ఇలా తమకు తెలియకుండానే జీవితంలో విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అంతే కాదు అనేక రకాల శారీరక, మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగ్గుతున్న అన్యోన్యత స్మార్ట్ ఫోన్ల దెబ్బకి మనుషుల మధ్య అన్యోన్యత తగ్గుతోంది. ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఇంట్లో ఉండి స్మార్ట్ ఫోన్లు, టీవీ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. పిల్లలే కాదు పెద్దవాళ్లు, భార్యాభర్తలు ఇద్దరూ చేరోవైపు కూర్చుని ఖాళీ దొరికితే చాలు ఫోన్ తీసుకుని రీల్స్, యూట్యూబ్ వీడియోలు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో తల్లిదండ్రులు, పిల్లల మధ్య అన్యోన్యత దెబ్బతింటోందని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మానసిక సమస్యలు ఇలా.. అనారోగ్య సమస్యలు ఇలా.. .. -
స్వరరాగ గంగా ప్రవాహం
విజయవాడ కల్చరల్: ఆకాశవాణి (ప్రసార భారతి) 90 వసంతాల వేడుకలను తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వృత్తిరిత్యా వైద్యరంగంలో ఉన్నా కర్నాటక సంగీతంలో విశేష కీర్తిని సొంతం చేసుకున్న సర్వేపల్లి సోదరీమణులు శ్రేయ, రాజ్యలక్ష్మి నిర్వహించిన గాత్ర కచేరి శృతి లయ సమ్మేళనంగా సాగింది. కొలువుమరేగద, బ్రహ్మమొక్కటే, సిద్ధి వినాయకం, రామచంద్రం భావయామి, కీర్తనలను ఆలపించారు. వీరికి రమ్యకిరణ్మయి వయోలిన్‌పై, అరవింద్ మృదంగంపై, జి.వెంకటేష్ మోర్సింగ్ పై సహకరించారు. జానపద కళారూపమైన గరగ నృత్యాలను పసుపులేటి అయ్యప్ప బృందం ప్రదర్శించింది. ఆకాశవాణి కేంద్రం నిర్వహించిన సంగీత, సాహిత్య, నృత్య, వ్యాస రచనల పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు ఆకాశవాణి అధికారులు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ముఖ్య అతిథి ఆకాశవాణి డీడీ సోమేశ్వరరావు మాట్లాడుతూ ఆకాశవాణి కేంద్రం 90 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై పనిచేస్తోందన్నారు. సంగీత, సాహిత్యం, నాటకాలతో ప్రతిభ కలిగిన వారికి అవకాశం కల్పిస్తోందన్నారు. ప్రోగ్రామ్ హెడ్ దివ్య గుడిపూడి ఆకాశవాణి భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షుడు శరత్‌శ్చంద్ర, ఆకాశవాణి అధికారులు పలువురు పాల్గొన్నారు. లాకాశవాణిలో పనిచేస్తున్న వివిధ విభాగాల అధిపతులు, కార్యక్రమాల నిర్వాహకులు పాల్గొన్నారు. చింతా వెంకట్ బృందం పలు సంప్రదాయ కీర్తనలకు నృత్యాలను అభినయించారు. అంగరంగ వైభవంగా ఆకాశవాణి 90 వసంతాల వేడుకలు -
ముగ్గురు యువకులకు కత్తిపోట్లు
పెనమలూరు: మండలంలోని ణుకూరు గ్రామంలో ముగ్గురు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. వణుకూరు గ్రామంలో శనివారం రాత్రి కుంతీమాత ఆలయం వద్ద కొక్కిలిగడ్డ అభిషేక్(19) తన స్నేహితులు పెనుమూడి పవన్‌కుమార్(19), కోవలి అభిషేక్(19)తో కలిసి బైక్‌పై గోసాలకు బయలుదేరారు. అదే గ్రామానికి చెందిన మంజిత్‌కుమార్ పాతకక్షల కారణంగా వారిని అడ్డుకున్నాడు. దీంతో వీరి మధ్య గొడవ మొదలయింది. మంజిత్‌కుమార్ కత్తితో కొక్కిలిగడ్డ అభిషేక్, పవన్‌కుమార్, కోవలి అభిషేక్‌పై దాడి చేశాడు. విచక్షణా రహితంగా కత్తితో వారిని పొడిచాడు. స్థానికులు అడ్డుకోవటంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. మంజిత్కుమార్కు నేర చరిత్ర ఉంది. గాయపడిన ముగ్గురిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గన్నవరం: మండలంలోని చిన్నఅవుటపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. విజయ వాడ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ఆటో చినఅవుటపల్లిలోని పిన్నమనేసి సిద్ధార్థ వైద్య కళాశాల వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై ఆత్కూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. అవనిగడ్డ: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రపురం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తి విజయవాడలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మరణించాడు. పోలీసుల కథనం మేరకు.. మోపిదేవి మండలం చిర్లపాలెంనకు చెందిన వంగలపాటి వెంకటేశ్వరరావు(37) కోడూరు శివారు ఐబీపేటలో శనివారం వంట చేసేందుకు వెళ్లాడు. అనంతరం రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా, రామచంద్రపురం దివిసీమ పాలిటెక్నిక్ కళాశాల వద్ద మతిస్థిమితం లేని ఓ వ్యక్తి అడ్డు వచ్చాడు. అతడిని తప్పించబోయి అదుపు తప్పి బైక్ పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వెంకటేశ్వరరావు తలకు బలమైన గాయాల య్యాయి. అతడిని హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. అక్కడి నుంచి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దుర్గమ్మకు పలువురి విరాళాలు
విజయవాడ కల్చరల్: అన్నమయ్య సంక్తీనా గాన ప్రచార భక్త బృందం ఆధ్వర్యంలో 15 రోజులుగా నిర్వహిస్తున్న అన్నమయ్య 619 జయంతి వేడకలు వీనుల విందుగా సాగుతున్నాయి. సంకీర్తనా స్రవంతి కార్యక్రమాలను సత్యనారాయణ పురంలోని సీతారామా కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నారు. ఆదివారం నాటి కార్యక్రమంలో ఆచార్య పప్పు సదాశివశాస్త్రి, కర్నాటక సంగీత విద్వాంసుడు కస్తూరి గోపాలరావు నిర్వహించిన గాత్రయుగళం ప్రేక్షకులను భక్తపారవశ్యంలో ఓలలాడించింది. పలు అన్నమయ్య సంకీర్తనలను మధురంగా ఆలపించారు. అన్ని మంత్రములు, చాటెనిదియే, దేవ దేవం భజే, నారాయణతే నమోనమో, నానాటి బ్రతుకు నాటకము వంటి సంకీర్తనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు సదాశివశాస్త్రి మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా అన్నమయ్య సంకీర్తనలు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. -
చాత్తాద శ్రీ వైష్ణవులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణగాంధీనగర్(విజయవాడసెంట్రల్): చాత్తాద శ్రీ వైష్ణవుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.సత్యనారాయణ డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ విధమైన ప్రగతిలేని చాత్తాద శ్రీ వైష్ణవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో నాలుగు లక్షలకు పై చిలుకు జనాభా ఉన్న చాత్తాద శ్రీవైష్ణవులు కుల వృత్తులు దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లల పైచదువులు భారంగా మారాయన్నారు. బీసీ రిజర్వేషన్లు పెద్ద కులాల మాత్రమే అందిపుచ్చుకుంటున్నారన్నారు. ప్రభుత్వం తమను విస్మరించిందన్న భావన కలుగుతోందన్నారు. ప్రభుత్వం స్పందించి విజయవాడ పరిసరాల్లో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, దేవాలయాల పాలకవర్గంలో, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సమావేశంలో శ్రీరంగనాయక వేద విద్యాపీఠం గురువు టి.ఎం.సూరి, వైస్ ప్రెసిడెంట్ టి.వి.రమణ, జనరల్ సెక్రటరీ ఎం.రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎస్.నమ్మయ్య, టి.నారాయణమూర్తి, కృష్ణాజిల్లా ప్రెసిడెంట్ టి.శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ ఎం.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
వంట ఏజెన్సీలపై స్మార్ట్ పిడుగు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం వేడివేడి భోజనం వడ్డించి విద్యార్థుల ఆకలి తీరుస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై ప్రభుత్వం స్మార్ట్‌గా వేటువేస్తోంది. స్మార్ట్ కిచెన్ల పేరుతో వారి ఉపాధికి గండికొట్టే చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సుమారు మూడు వేల మంది వంట కార్మికులు, సహాయకులు పని చేస్తున్నారు. సుమారుగా 21 సంవత్సరాలుగా అమలవుతున్న ఈ పథకంలో అప్పటి నుంచి వంట ఏజెన్సీల పేరుతో వంట కార్మికులు, సహాయ కులు సేవలు అందిస్తున్నారు. నామమాత్రం ఆదాయం తోనే వారంతా ఈ భోజన పథకంలో భాగస్వాములు అవుతున్నారు. గతంలో కుక్‌లకు కేవలం వెయ్యి రూపాయల గౌరవ వేతనం అందేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వారి వేతనాన్ని అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.3 వేలకు పెంచి ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమను రోడ్డుపాలు చేయడానికి కంకణం కట్టుకుందని వంట ఏజెన్సీల కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 48 స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు చర్యలు జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో 883 ప్రభుత్వ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. ఆయా విద్యాసంస్థల్లో సుమారుగా 81,821 మంది విద్యా ర్థులు చదువుతున్నారని ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విద్యార్థులు అందరికీ ప్రస్తుతం వంట ఏజెన్సీలు మధ్యాహ్న భోజనాన్ని వండి వేడివేడిగా సకాలంలో వడ్డిస్తున్నాయి. అయితే స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 48 స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. జిల్లాలో 20 మండలాలు ఉండగా, ఒకొక్క మండలానికి రెండు స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యను బట్టి ఐదు మండలాల్లో మూడు చొప్పున, రెండు మండలాల్లో ఒకొక్కటి చొప్పున స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసేందుకు ఆ ప్రతిపాదనల్లో పేర్కొనట్లు సమాచారం. ఈ స్మార్ట్ కిచెన్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వేడి భోజనం దూరమే.. జిల్లాలోని వందలాది ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రస్తుతం రోజూ వేడివేడి భోజనం అందుతోంది. రానున్న విద్యా సంవత్సరం నుంచి చల్లారిన భోజనాన్ని పంపిణీ చేయటానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘ నేతలు వ్యాఖ్యానిస్తు న్నారు. మండలంలో ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పాటు చేసే స్మార్ట్ కిచెన్ల ద్వారా మండలంలోని అన్ని పాఠశాలలకు భోజనం పంపిణీచేయాలి. ఫలితంగా పాఠశాలకు భోజనం చేరేసరికి చల్లారుతుంది. ఫలితంగా విద్యార్థులకు వేడి భోజనం దూరమవు తుంది. రాష్ట్రంలో విద్యారంగంపై కూటమి ప్రభుత్వం కక్ష్య కట్టిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రక్షాళన చేసిన విషయం తెలిసిందే. గోరుముద్ద పేరుతో ఆరు రోజులు అన్ని పోషకాలతో కూడిన భోజనం వేడివేడిగా వడ్డించేలా ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డొక్కా సీతమ్మ పేరు పెట్టినా ఆ పథకాన్ని నీరు గారుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. -
ప్రతిపాదనలు పంపించాం
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుపై ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు చేసింది. అందులో భాగంగా మార్గదర్శకా లను అనుగుణంగా జిల్లాలో ఎన్ని సార్ట్ కిచెన్లు కావాలో ఆ మేర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించాం. మండలానికి రెండు స్మార్ట్ కిచెన్లు అవసరమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అవి ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభమవుతాయా అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వ ఆదేశానుసారం మేం చర్యలు తీసుకుంటాం. –ఎల్ చంద్రకళ, డీఈఓ, ఎన్టీఆర్ జిల్లా -
మహిళ హత్య కేసు నిందితులకు రిమాండ్
చందర్లపాడు(నందిగామ టౌన్): తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మహిళ హత్య కేసు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చినట్లు నందిగామ రూరల్ సీఐ చవాన్ పేర్కొన్నారు. చందర్లపాడు పోలీస్ స్టేషన్లో శనివారం ఆయన ఎస్ఐ ధర్మరాజుతో కలిసి హత్య కేసు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామానికి చెందిన బాడిశ నాగలక్ష్మి కనిపించటం లేదని భర్త నరసింహారావు గత నెల 24న ఫిర్యాదు చేయటంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి పలు కోణాలలో దర్యాప్తు చేసినట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన పారెల్లి గోవిందయ్య భార్య మహాలక్ష్మిలు పథకం ప్రకారం నాగలక్ష్మిని హత్య చేసినట్లు సీఐ పేర్కొన్నారు. మృతురాలితో గోవిందయ్యకు అక్రమ సంబంధంతో పాటు కుటుంబ వివాదాలు తలెత్తటంతో కోనాయపాలెం నుంచి నాగలక్ష్మిని పిలిపించి మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్‌ప్లాజా సమీపంలోని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి రాయితో మోది చంపారని వెల్లడించారు. ఆ తరువాత మృతదేహాన్ని, అందుకు సంబంధించిన సాక్ష్యాలను శ్రీశైలం అటవీ ప్రాంతంలో దహనం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు చెప్పారు. నిందితుల వాంగ్మూలం ప్రకారం మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి మహిళ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసినట్లు చెప్పారు. హత్యకు పాల్పడిన భార్యభర్తలను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. రోజుల వ్యవధిలోనే హత్య కేసును చేధించిన ఎస్ఐ ధర్మరాజు, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
జీవితం దయనీయం
కృష్ణాజిల్లాఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026బకాయిల భారం.. గ్రంథాలయ ఉద్యోగులకు వేతన కష్టాలు విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 524.80 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. పుట్టగొడుగుల పెంపకంతో స్వయం ఉపాధి పొందొచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. శనివారం పుట్ట గొడుగులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ బాలాజీనగర్‌కు చెందిన పడాల సింహాచలం, సుజాత దంపతులు శనివారం రూ.1,01,116 విరాళం సమర్పించారు. పీఆర్సీ, మధ్యంతర భృతి, పెండింగ్ డీఏలు, నెలనెలా వేతనాలపై హామీసాక్షి టాస్క్‌ఫోర్స్: ‘పీఆర్సీ లేదు. ఐఆర్ ప్రకటించనే లేదు. పెండింగ్ డీఏలు అతీ గతి లేవు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల ఊసు అంత కన్నా లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది. ఎన్నికల సమయంలో ఉద్యో గులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. నెలనెలా క్రమం తప్పకుండా చెల్లించాల్సిన జీతాల కోసం కూడా ఉద్యోగులు నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి’.. ఇదీ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్న పౌర గ్రంథాలయాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న దుస్థితి. గ్రంథాలయ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. పెన్షనర్ల పరిస్థితీ అంతే. డిసెంబర్ జీతం ఫిబ్రవరిలో ఇచ్చారు. జనవరి నెల జీతం మే నెలలో చెల్లించారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల జీతాలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. నెలల తరబడి జీతాల బకాయిలు పేరుకుపోవడంతో ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తున్న మంత్రి లోకేష్ తన శాఖ పరిధిలో ఉన్న తమ అవస్థలను పట్టించుకోవడం లేదని గ్రంథాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ఓ వైపు ఖజానా ఖాళీ అంటూనే మంత్రులు మాత్రం విదేశీ పర్యటనలు చేస్తున్నారని, తాము ఏ పాపం చేశామని జీతాలు చెల్లించడం లేదని ప్రశ్నిస్తున్నారు. పేరుకుపోయిన సెస్ బకాయిలు గ్రంథాలయాలకు సెస్ రూపంలో, ప్రభుత్వ గ్రాంట్ రూపంలో నిధులు సమకూరుతాయి. స్థానిక సంస్థల నుంచి సెస్ రూపంలో వచ్చే ఆదాయంతో గ్రంథా లయ నిర్వహణ, కరెంట్, వాటర్ బిల్లులు, పుస్తకాలు, పేపర్ల కొనుగోలుకు వాడాల్సి ఉంటుంది. ఉద్యోగులు, సిబ్బంది జీతాలకు ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేస్తుంది. సెస్ వసూలు కాక గ్రంథాలయాల నిర్వహణ కష్టంగా మారింది. సకాలంలో ప్రభుత్వం నుంచి గ్రాంట్ రాకపోవడంతో ఉద్యోగుల జీతాలు అందడం లేదు. మొత్తం రూ.80 కోట్ల పై చిలుకు సెస్ బకాయిలు పేరుకుపోయాయి. కొన్ని నెలలుగా కరెంట్ బిల్లులు, వాటర్ బిల్లులు, పేపర్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్ప డింది. గ్రాంట్ విడుదల చేస్తే తమ జీతాలు వస్తాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఇక పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. గ్రంథాలయాల్లో పనిచేసే కింది స్థాయి సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెస్ వసూళ్ల కోసం కాళ్లరిగేలా.. సెస్ వసూళ్లకు జీతాలతో లంకె పెట్టడంతో గ్రంథాలయ సిబ్బంది సెస్ వసూళ్ల కోసం పంచాయతీలు, మునిసిపల్ కార్యాలయాలు, కార్పొరేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. సెస్ వసూలు చేసుకోండి .. జీతాలు తీసుకోండి అన్న పద్ధతిలో ప్రభుత్వ తీరు ఉందని ఉద్యోగులు మండిపడుతున్నారు. జీతాలు సర్దుబాటు చేస్తోందే తప్ప పూర్తిగా ఇవ్వడం లేదంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలకు రూ.1.20 లక్షలు, ఔట్‌సోర్సింగ్‌కు రూ.13 లక్షల గ్రాంట్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇది ఒక నెల జీతాలకు కూడా సరిపోదని ఉద్యోగులు అంటున్నారు. బకాయి ఉన్న మూడు నెలల జీతాలు ఏక కాలంలో చెల్లించాలని కోరుతున్నారు. 7నేరాల నియంత్రణలో కృష్ణాజిల్లాకు అభినందనలు కోనేరుసెంటర్(మచిలీపట్నం): నేరాల నియంత్రణలో కృష్ణాజిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందనలు అందాయి. మహిళలపై జరిగే నేరాల నియంత్రణను అరికట్టడంతో పాటు శారీరక దాడులను నియంత్రించటంలో రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా ప్రథమస్థానం నిలిచింది. సమగ్ర నేర నియంత్రణలో సైతం నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం జిల్లా ఎస్పీలతో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఏడో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో కృష్ణా జిల్లా పోలీసు శాఖను అభినందించినట్లు ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా, నేరాల నియంత్రణకు జిల్లా పోలీసుశాఖ చేపట్టిన చర్యలు కారణంగా ఈ ఘనత దక్కిందని పేర్కొన్నారు. నిరంతర పర్యవేక్షణ, సమర్థమైన బీట్ వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి అంశాలతో విధులు నిర్వర్తించటం కారణంగా మంచి ఫలితాలు సాధించగలిగామని అన్నారు. వీటితో పాటు ప్రజల సహకారం అందుకు తోడ్పడిందన్నారు. కృష్ణాజిల్లాకు ఇంతటి ఘనత వచ్చేందుకు కృషి చేసిన జిల్లా పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్పూర్తితో సిబ్బంది తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలతో పాటు ప్రభుత్వ మన్ననలు పొందేందుకు పాటుపడాలని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 109 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో గ్రేడ్ 1– 8, గ్రేడ్ 2 – 18, గ్రేడ్ 3 – 33 ఉన్నాయి. ఇవి కాక రికార్డ్ అసిస్టెంట్ కేడర్‌లో 50 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది మొత్తం 200 మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి ప్రభుత్వం అందించే గ్రాంట్ ద్వారా నెల నెలా జీతాలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు డిసెంబర్ నెల వరకు జీతాలు చెల్లించారు. డిసెంబర్ నెల జీతాలు ఫిబ్రవరిలో పడ్డాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మూడు నెలల జీతాల బకాయి పడ్డాయి. ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందో ళన మొదలైంది. మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో గ్రంథాలయ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లల చదువులు, వివిధ రుణాలకు చెల్లించాల్సిన ఈఎంఐలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి వైద్య ఖర్చులు, పెన్షనర్లకు మందులు, ఇతర ఖర్చుల కోసం డబ్బులు లేక అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నాలుగేసి నెలలు జీతాలు చెల్లించకపోతే తాము జీవనం సాగించేది ఎలా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మేం జీతాల్లేక అవస్థలు పడుతుంటే... తమ శాఖను నిర్వహిస్తున్న నారా లోకేష్ మాత్రం ప్రత్యేక విమానాల్లో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ జల్సాలు చేస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. -
స్టార్టప్‌లు పరిశ్రమల స్థాయికి ఎదగాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో యువత, స్వయం సహాయక సంఘాల మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుని, సమర్థవంతమైన ప్రణాళిక, నాణ్యత, మార్కెటింగ్ విధానాలతో పెద్ద పరిశ్రమల స్థాయికి ఎదగాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. కలెక్టరేట్లోని ఎ.వి.ఎస్.రెడ్డి హాల్లో అర్బన్ జిల్లా సమాఖ్య, ఫౌండర్స్ రూఫ్, వివిధ స్టార్టప్‌ల ప్రతినిధులతో కలెక్టర్ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మహిళల భద్రత, స్మార్ట్ వెహికల్ మేనేజ్మెంట్, ప్రొటీన్ ఇన్ఫ్యూజ్డ్ కాఫీ, డీహైడ్రేషన్, ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ వంటి వివిధ భాగాల్లో స్టార్టప్‌లు ప్రారంభించిన యువతతో సమాలోచనలు చేశారు. జిల్లాలో స్టార్టప్‌ల ద్వారా ఆర్థికంగా ఎదగడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని సూచించారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన వ్యాపారాలు సమర్థవంతమైన ప్రణాళిక, నాణ్యత, మార్కెటింగ్ విధానాలతో ముందుకు సాగితే పెద్ద పరిశ్రమల స్థాయికి ఎదుగుతాయని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని వినూత్న ఆలోచనలతో వ్యాపార రంగంలో ముందుకు సాగాలని యువతకు సూచించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో మార్కెటింగ్ విధానాలు వేగంగా మారుతున్నాయని, సోషల్ మీడియా, ఈ –కామర్స్ వేదికలను ఉపయోగించుకోవడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ లభిస్తుందని వివరించారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లవచ్చని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ప్రభుత్వం అందిస్తున్న శిక్షణలు, ఆర్థిక సహాయం, ప్రోత్సాహక పథకాలను వినియోగించుకుని స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడ కుండా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అర్బన్ సమాఖ్య ప్రెసిడెంట్ కె.మీనాక్షి, ఎస్‌హెచ్‌జీ పారిశ్రామికవేత్తలు వాణి, మాధురి, కృష్ణవేణి, ఫౌండర్స్ రూఫ్ సారథులు విష్ణు, జగదీష్, వివిధ స్టార్టప్‌ల స్థాపకులు ఉజ్వల్ బొర్రా, విఠల్, సతీష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
అండర్–15 బాలికల క్రికెట్ టీమ్ ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలో అండర్–15 బాలికల టీమ్ జట్టు ఎంపికలను శనివారం నిర్వహించామని కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి తెలిపారు. టీమ్ కెప్టెన్‌గా టి.సౌమ్య, సభ్యులుగా బి.కార్తిక, డి.షాలీనీచౌదరి, కె.అక్షయ, కె.మేఘన, ఆర్. లక్ష్మీప్రసన్న, పి.మోక్షశ్రీ, పి.లక్ష్మి లోహిత, ఆర్. తేజస్విని, కె.రుత్విక ఆరాధ్య, సీహెచ్.నిహారిక, ఆర్.వర్షిణి, కె.లాస్య, ఎన్.హరి ప్రియ, ఎం. ఆరాధ్య, స్టాడ్బైగా టి.సీహెచ్.దేవీచరణ్య, బి.గీతావర్షిణి, పి.హసీనా, ఎస్కే.ముస్కానా, డి.రిషిత, వి.కీర్తన, కోచ్‌గా ఎస్.రామ్‌కుమార్‌ను ఎంపిక చేశారు. యువ స్టార్టప్‌లకు ఆహ్వానం మధురానగర్(విజయవాడసెంట్రల్): జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా యువజన సంక్షేమ శాఖ సౌజన్యంతో స్టార్టప్స్ ఎగ్జిబిషన్ స్టాల్స్ సహా ఎక్స్‌పోలో పాల్గొనడానికి యువ స్టార్టప్‌లను ఆహ్వానిస్తున్నామని జిల్లా యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తమ స్టార్టప్ అవార్డులను కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ప్రైజ్ మనీ ద్వారా ప్రోత్సహిస్తారని పేర్కొన్నారు. ఉత్తమ స్టార్టప్‌కు ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.20 వేలు, తృతీయ బహుమతిగా రూ.15 వేలు అందజేస్తామని వివరించారు. విజయవాడ జోన్‌లోని అన్ని స్టార్టప్‌లు ఈ నెల 11వ తేదీ ఉదయం పది గంటలకు ఎనికెపాడులో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో పాల్గొనవలసిందిగా కోరారు. ఈ సదవకాశాన్ని యువ స్టార్టప్‌లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మానవ అక్రమ రవాణా కట్టడే లక్ష్యం లబ్బీపేట(విజయవాడతూర్పు): మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరీకి సంబంధించిన కారణాలు, మార్గాలు, దర్యాప్తులో అనుసరించాల్సిన నిర్దేశిత విధి విధానాలపై ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో శనివారం శిక్షణ కార్యక్రమం జరిగింది. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఐజీ బి.రాజకుమారి, ఐజేఎం ప్రతినిధులు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణలో ఆయా నేరాలకు పాల్పడే వారికి శిక్ష పడేలా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గెడ్డం రాజేశ్వరరావు పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. సాంకేతికత ఆధారాలను గుర్తించడం, సంరక్షించడం, విశ్లేషించడం, వడాక్యుమెంట్ చేయడం వంటి వాటిని వివరించారు. ఆ సంఘటనలను పునర్నిర్మించడానికి, ప్రాసిక్యూషన్‌కు మద్దతు ఇవ్వడానికి చైన్ ఆఫ్ కస్టడీ, దర్యాప్తులో అనుసరించాల్సిన నిర్దేశిత విధివిధానాలపై అవగాహన కలిగించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ మిస్సింగ్ కేసులతో ప్రారంభం అవుతుందని, మిస్సింగ్ కేసులను ఉపేక్షించరాదని, వాటిని కట్టడి చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవా లని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత, పలువురు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, యాంటీ ట్రాఫికింగ్, శక్తి బృందాల బాధ్యులు పాల్గొన్నారు. ఫోన్ల రికవరీలో ద్వితీయ స్థానం లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజలు పోగొ ట్టుకున్న మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు శనివారం డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అధికారులు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబుకు బహుమతి అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఫోన్ల రికవరీలో విశేష కృషి చేసి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిపిన సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్నను సీపీ రాజశేఖరబాబు అభినందించారు. -
వడదెబ్బ.. తస్మాత్ జాగ్రత్త!
లబ్బీపేట(విజయవాడతూర్పు): వేసవి ఎండల తీవ్రతకు ప్రస్తుతం విజయవాడ నగరంలో అనేక మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. శరీరంపై దురదలతో పాటు, తీవ్రమైన తలనొప్పి, ఎండలో ఎక్కువగా తిరిగిన వారికి రాత్రి వేళల్లో నిద్ర పట్టక పోవడం వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అలాంటి వారిలో కొందరు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నగరంలో ఇప్పటి వరకూ అత్యధికంగా ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ దాటకున్నా, దాని తీవ్రత(ఫీల్స్)46 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటున్నట్లు వాతావరణ నిపుణులు చెపుతున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటున్నట్లు పేర్కొంటున్నారు. ఆ సమయంలో అతి నీలలోహిత కిరణాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలపై ప్రభావం చూపుతున్నారు. ఆ సమయంలో బయట తిరిగినప్పుడు తమకు తెలియకుండానే శరీరంలో నీరు ఆవిరై డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాకుండా సాయంత్రం వేళ ఉక్కపోత సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వీరిపై ప్రభావం ఎక్కువ.. ఎండల తీవ్రత.. దీర్ఘకాలిక రోగులపై త్వరగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, క్యాన్సర్ రోగులపై ప్రభావం ఉంటుందంటున్నారు. వారితో పాటు గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులపై ఎండల తీవ్రత ప్రభావం చూపుతుందని డాక్టర్లు అంటున్నారు. అలాంటి వారు ఎండల్లోకి రాకుండా ఉండటమే మంచిదంటున్నారు. వృద్ధులు కూడా త్వరగా డీ హైడ్రేషన్ ప్రభావానికి గురవుతారని పేర్కొంటున్నారు. విజయవాడ మధురానగర్‌కు చెందిన 40 ఏళ్ల సురేష్ ఓ కార్పొరేట్ ఆస్పత్రి మార్కెటింగ్ విభాగంలో పని చేస్తుంటారు. నిత్యం ద్విచక్ర వాహనంపై గ్రామాలకు వెళ్తుంటారు. వారం రోజుల క్రితం ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడ్డారు. విరేచనాలతో పాటు, తీవ్రమైన నీరసంతో వారం రోజులు ఇంటికే పరిమితమయ్యారు.పటమట ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల అఖిల్ చిరు వ్యాపారి. వ్యాపార పనులపై నిత్యం నగరంలో బైక్‌పై తిరుగుతుంటారు. ఐదు రోజుల క్రితం తీవ్రమైన తలనొప్పి, నీరసంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరి ఫ్లూయిడ్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిపై ఎండ ప్రభావం త్వరగా చూపుతుంది. వారు త్వరగా డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తీవ్రతకు గురకాకుండా చూసుకోవాలి. మంచినీరు అధికంగా తాగడం, నీటి శాతం ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి. ఎండతీవ్రతకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లాలి. –డాక్టర్ టి.వి.మురళీకృష్ణ, జనరల్ ఫిజీషియన్ -
అభయాంజనేయునికి విశేష పూజలు
హనుమాన్‌జంక్షన్ రూరల్: కృష్ణాజిల్లా హనుమాన్‌జంక్షన్‌లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్ధానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మూడో రోజు శనివారం దేవస్థానాన్ని, స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు. ప్రధాన అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు, అర్చకులు గొట్టిపాళ్ల శ్రీనివాసాచార్యులు, వెంకట శేషారామాచార్యులు అంజనీపుత్రునికి ప్రభాత సేవ, 1008 లిల్లీ పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. అధ్యాత్మిక వేదికపై రాధాకృష్ణ భజన మండలి (కొయ్యూరు) భక్త బృందం సభ్యులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. విజయదుర్గ కోలాట బృందం (శేరినరసన్నపాలెం) మహిళలు ఆలయం వద్ద ప్రదర్శించిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. సాయంత్రం హనుమంతునికి బంగారు, వెండి పుష్పాలతో ప్రత్యేక పూజలు, నక్షత్ర హారతి వైభవంగా నిర్వహించారు. అనంతరం కళావేదికపై చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అలరించింది. నవజ్యోతి కళామందిర్ (గోపన్నపాలెం) ఆధ్వర్యంలో ‘పంచ రత్నాలు’ పేరిట ప్రదర్శించిన పౌరాణిక నాటక సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి పితాని తారకేశ్వరరావు, ఆలయ పాలకమండలి చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అప్రమత్తంగా ఉండాలి
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండలో తిరిగితే డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు, బాలింతలు ఎండకు ఫోకస్ కాకుండా ఉండాలి. ఐదేళ్లలోపు పిల్లల్ని బయటకు పంపొద్దు. మంచినీరు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, మసాలా ఆహారం తగ్గించడం ఉత్తమం. ఎండలో వేళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. –డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్ -
ఉపాధిని దూరం చేస్తే సహించం
రాష్ట్రంలో సుమారు 21 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అప్పటి నుంచి జిల్లాలో సుమారు మూడు వేల మంది వంట కార్మికులం పని చేస్తున్నాం. సకాలంలో బిల్లులు రాకున్నా అప్పులు తెచ్చి వంట చేసి విద్యార్థుల ఆకలి తీరుస్తున్నాం. ఇప్పుడు స్మార్ట్ కిచెన్ల పేరుతో మమ్మల్ని రోడ్డుపాలు చేయటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వేలాది మంది పని చేస్తున్న ఈ వ్యవస్థను మార్చేస్తే ఎలా? దీనిపై వేలాది మందితో పోరాటం చేస్తాం. – ఎన్.సీహెచ్.సుప్రజ, ప్రధాన కార్యదర్శి, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం, ఎన్టీఆర్ జిల్లా -
నేడు సబ్ జూనియర్స్ బాస్కెట్ బాల్ జిల్లా జట్ల ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం (ఐజీఎంసీ) ఆవరణలో ఆదివారం ఉమ్మడి కృష్ణాజిల్లా సబ్ జూనియర్స్ బాస్కెట్‌బాల్ బాల బాలికల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నామని కృష్ణాజిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.సుభాష్‌చంద్రబోస్ ప్రకటనలో తెలిపారు. జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ సంఘానికి అనుబంధంగా ఉన్న క్లబ్లో సభ్యులై ఉండి, 2013వ సంవత్సరం తర్వాత పుట్టిన బాలబాలికలు ఈ ఎంపికలు పాల్గొనవచ్చన్నారు. ఎంపికై న బాలబాలికలు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు చిత్తూరు జిల్లాలోని పీఈఎస్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగే 11వ రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలియజేశారు. ఆసక్తి ఉన్న వారు ఒరిజినల్ ఆధార్‌కార్డుతో నేడు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఐజీఎంసీ స్టేడియంలో బాస్కెట్‌బాల్ కోర్డు దగ్గర హాజరు కావాలని తెలియజేశారు. గుణదల (విజయవాడ తూర్పు): నివాసాల మధ్య గంజాయి విక్రయిస్తున్న యువకులను మాచవరం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ అజిత్ సింగ్‌నగర్‌కు చెందిన గోసంగి లోహిత్, గుణదలకు చెందిన అలిమిల్లి సంపత్, మొగల్రాజపురానికి చెందిన చెల్లూరి దినేష్, అదే ప్రాంతానికి చెందిన కొరడ చరణ్, విశాఖపట్నం భీమిలికి చెందిన డోకర దుర్గారావు, లు విలాసాల కోసం అక్రమార్జనకు అలవాటు పడ్డారు. ఉన్నత వర్గాల యువతను టార్గెట్ చేసి కొంత కాలంగా గంజాయి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో క్రీస్తురాజపురం ఆర్ఎస్డీ హోటల్ సమీపంలో గంజాయిని విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తులను దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి వారి నుంచి కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళగిరి టౌన్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పలువురు అధికారులతో కలసి పరిశీలించారు. ముఖ్యమంత్రి వచ్చే మార్గం, ప్రజలు వచ్చే మార్గాలను వీక్షించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఉన్నారు. -
పుట్ట గొడుగుల పెంపకం.. లాభదాయకం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): పుట్టగొడుగుల పెంపకం లాభదాయకమైన స్వయం ఉపాధి అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. స్వయ సహాయక సంఘాల సభ్యులు రైజ్ కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గొల్లపూడిలోని డీఆర్డీఏ కార్యాలయంలో శనివారం స్వయం సహాయక సంఘాల మహిళలకు పుట్ట గొడుగుల పెంపకం, డిజైనింగ్ వస్త్రాల తయారీపై అవగహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన లక్ష్మీశ మహిళలనుద్దేశించి ప్రసంగించారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం అందించే పుట్ట గొడుగుల పెంపకం మంచి ఆదాయ మార్గమని పేర్కొన్నారు. ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారంపై అవగహన పెరుగుతున్న క్రమంలో పుట్ట గొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, మార్గదర్శకత్వాన్ని వినియోగించుకుని ఆర్ధికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. పుట్టగొడుగుల పెంపకం, అవసరమైన ముడి సరుకులు, మార్కెటింగ్ అవకాశాలపై నిపుణులు నాగరాజు మహిళలకు వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ. నాంచారరావు తదితరులు పాల్గొన్నారు. -
గ్రంథాలయ గోడు!
లైబ్రరీలకు పెండింగ్‌లో ఉన్న ‘గ్రంథాలయ సెస్’ బకాయిల సమస్యను ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లిన కలెక్టర్ డీకే బాలాజీకి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం నిర్వహించిన కలెక్టర్ల సమీక్ష సమావేశంలో ఈ అంశాన్ని కలెక్టర్ ప్రస్తావించారని తెలిపారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, చట్టరీత్యా సెస్ బకాయిల చెల్లింపునకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను గుర్తించి, వాటి ఆర్థిక పురోభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపడం అభినందనీయమన్నారు. జిల్లాలో ఆధునిక సౌకర్యాలతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి కలెక్టర్ బాలాజీ ప్రత్యేక కృషి చేస్తున్నారని, ఇందుకు గ్రంథాలయ సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు బేగ్ పేర్కొన్నారు. మచిలీపట్నంఅర్బన్: విజ్ఞాన భాండాగారాలను నిధుల కొరత వేధిస్తోంది. నిధుల కోసం నిరీక్షణతో లైబ్రరీల్లో వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రజల నుంచి గ్రంథాలయ సెస్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నా, అవి లైబ్రరీలకు చేరక ఉమ్మడి కృష్ణాలోని గ్రంథాలయాలు వెలవెలబోతున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఆస్తి పన్ను, ఇంటి పన్నులపై లైబ్రరీ సెస్ వసూలు చేసి గ్రంథాలయ నిధికి జమ చేయాల్సి ఉంది. నిధుల విడుదలలో జాప్యం చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా 2024 నుంచి 2026 వరకు వసూలైన రూ.27 కోట్ల లైబ్రరీ సెస్ గ్రంథాలయాల ఖాతాలకు విడుదల కాలేదు. దీంతో ఇవి దయనీయ స్థితిలో కనిపిస్తున్నాయి. బకాయిల భారం ఉమ్మడి జిల్లాలో లైబ్రరీల బకాయిలు మొత్తం రూ.82 కోట్లకు చేరాయి. ఇందులో ఎన్టీఆర్ జిల్లా నుంచి రూ.68 కోట్లు, ప్రస్తుత కృష్ణా జిల్లా నుంచి రూ.14 కోట్లు. నిధుల కొరతతో కొత్త పుస్తకాల కొనుగోలు, భవనాల మరమ్మతులు, ఆధునికీకరణ పనులు కుంటుపడ్డాయి. సిబ్బందికి జీతాలు చెల్లించడమే భారంగా మారింది. కనీస నిర్వహణకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 110 గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలో గ్రంథాలయాల విస్తరణ ఉన్నా సిబ్బంది కొరత, భారీ బకాయిల సమస్యలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 మండలాల్లో మొత్తం 110 గ్రంథాలయాలు పని చేస్తున్నాయి. వీటిలో 1 గ్రామీణ గ్రంథాలయం, 8 గ్రేడ్–1, 18 గ్రేడ్–2, 83 గ్రేడ్–3, గ్రంథాలయాలు ఉన్నాయి. అన్నింటిలో సుమారు 15,60,597 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. నాడు వైఎస్సార్ హయాంలో నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో సెస్ వసూళ్లు నేరుగా గ్రంథాలయాల ఖాతాలకు జమయ్యేవి. వాటితో గ్రంథాలయాల అభివృద్ధి, భవనాల నిర్మాణం, పుస్తకాల కొనుగోలు వంటి కార్యక్రమాలు చేపట్టారు. పాత బకాయిలు విడుదలయ్యేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేశారు. ఖాళీ పోస్టులతో ఇబ్బందులు జిల్లాలో అవసరమైన 43 రికార్డు అసిస్టెంట్లకు కేవలం 27 మంది మాత్రమే పని చేస్తున్నారు. 67 మంది ఆఫీస్ సబార్డినేట్ల స్థానాల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. గ్రేడ్–1 పోస్టుల్లో 18 స్థానాలకు 7మంది, గ్రేడ్–2 పోస్టుల్లో 57 స్థానాలకు 19 మంది మాత్రమే ఉన్నారు. 61 లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్ అవసరముండగా, కేవలం ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గ్రంథాలయాలకు 2024–25, 26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి స్థానిక సంస్థల నుంచి భారీ మొత్తంలో బకాయిలు రావాల్సి ఉంది. విజయవాడ కార్పొరేషన్ నుంచి సుమారు రూ.15 కోట్లు, మచిలీపట్నం కార్పొరేషన్ నుంచి రూ.కోటి, గ్రామ పంచాయతీల నుంచి రూ.8.5 కోట్లు, మున్సిపాలిటీల నుంచి రూ.3 కోట్లు వసూలైన లైబ్రరీ సెస్ జిల్లా గ్రంథాలయ సంస్థకు విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే రెగ్యులర్‌గా పని చేస్తున్న సిబ్బందికి మూడు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి.స్థానిక సంస్థల నుంచి వసూలు చేసిన సెస్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విజ్ఞాన దీపాలు వెలిగించే గ్రంథాలయాలకు చీకట్లు కమ్ముతున్నాయి. చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గ్రంథాలయాలు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేయడానికి, ఇతర సౌకరాల్య కల్పనకు, సిబ్బంది జీతాలు చెల్లించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో బకాయిల భారం అధికమవుతోంది. దీంతో పాటు సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇప్పటికై నా సర్కార్ స్పందించాల్సి ఉంది. -
‘కౌలు రైతుల’ హామీని ఎందుకు అమలుచేయరు
ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ చల్లపల్లి: రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబునాయుడు కౌలురైతు చట్ట సవరణ చేస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు అమలు చేయటంలేదని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్ ప్రశ్నించారు. స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఏపీ రైతుసంఘం రాష్ట్ర సమితి సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కౌలురైతుల రక్షణకు, సంక్షేమానికి నూతన కౌలు చట్టం తీసుకురావాలని, 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, రెండు లక్షల వరకూ ష్యూరిటీలేని రుణాలు ఇవ్వాలని డిమాండు చేశారు. కౌలురైతులకు ఇచ్చే గుర్తింపు కార్డులు గ్రామ సభల ద్వారా అందజేయాలని కోరారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ రైతు సంఘాల్లో యువతకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు. రాష్ట్ర సమితి సమావేశాలు ముగింపు సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. సమావేశాల్లో రైతుసంఘం రాష్ట్ర నాయకులు మలినీడు యలమందరావు, హనుమానుల సురేంద్రనాథ్ బెనర్జీ, కాటమయ్య, పి.జమలయ్య, గుత్తికొండ రామారావు తదితరులు ప్రసంగించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్‌బాబు, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మల్లుపెద్ది రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. -
మద్యం షాపు వాటాల్లో వివాదం
జి.కొండూరు: మద్యం సిండికేట్ సొమ్ము వ్యవహారంలో వివాదం తలెత్తడంతో ఎన్టీఆర్ జిల్లాలోని ఓ వైన్ షాపు వద్ద శుక్రవారం ర్షణ వాతావరణం నెలకొంది. వివరాలలోకి వెళ్తే... ప్రభుత్వం మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించిన సమయంలో 51 మంది సిండికేట్‌గా ఏర్పడి జి.కొండూరు మండల పరిధి కట్టుబడిపాలెం విజయ దుర్గ వైన్‌షాపును దక్కించుకున్నారు. ఈ క్రమంలో విక్రయాలు జరుగుతుండగా సిండికేట్ సొమ్ము పంపకాల వ్యవహారంలో సభ్యుల మద్య వివాదం తలెత్తింది. దీనితో సిండికేట్‌లో కొందరు వ్యక్తులు సొమ్మును స్వాహా చేసి తనకు అన్యాయం చేశారని సిండికేట్ సభ్యుడు ఇబ్రహీంపట్నంకు చెందిన వెల్లంకి సురేష్ అనే వ్యక్తి శుక్రవారం కట్టుబడిపాలెం వైన్ షాపు వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. విక్రయాలు జరపకుండా అడ్డుకొని షాపును క్లోజ్ చేశారు. దీనితో సమాచారం అందుకున్న ఎకై ్సజ్‌శాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని షాపును తెరిపించేందుకు ప్రయత్నింగా తీవ్ర మనస్థాపానికి గురైన సిండికేట్ సభ్యుడు వెల్లంకి సురేష్ పెట్రోలు మీద పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనితో అప్రమత్తమైన ఎకై ్సజ్‌శాఖ అధికారులు బాధితుడు సురేష్‌పై నీళ్లు పోసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడ్డుకున్నారు. బాధితుడు సురేష్‌కు నచ్చజెప్పి సిండికేట్ సభ్యలతో మాట్లాడి సెటిల్మెంట్ చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత షాపును తెరిపించారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు శుక్రవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. నగరంలోని పటమటకు చెందిన పాలకొండ తులసి రాంబాబు, రమాదేవి దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు తీసుకెళ్లే బస్సుల్లో తనిఖీలు చేసి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నామని విజయవాడ డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం.పురేంద్ర తెలిపారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని స్కూల్స్, కాలేజీ బస్సులను ప్రత్యేక తనిఖీలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 1,571 విద్యాసంస్థలకు చెందిన బస్సులు నడుస్తున్నాయని, వాటిపై ఈ నెల 1 నుంచి ప్రత్యేక తనిఖీలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రతి బృందానికి సుమారు 130 బస్సుల చొప్పున తనిఖీ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 250 బస్సులను తనిఖీ చేయగా, ఈ నెల 20 లోపు తాము గుర్తించిన లోపాలు సరిచేయాలని ఆదేశించామన్నారు. తనిఖీల సందర్భంగా బస్సుల్లో అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించే విధానంపై ఎవాక్యువేషన్ డెమో నిర్వహించడంతో పాటు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ల వినియోగంపై డ్రైవర్లు, అటెండర్లు, విద్యాసంస్థల సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు పురేంద్ర తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సులను పూర్తి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసి, నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని పురేంద్ర విజ్ఞప్తి చేశారు. నాగాయలంక: బేస్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ నెల 5, 6, 7 తేదీల్లో కర్నూలు జిల్లా గోనిగండ్లలో రాష్ట్ర స్థాయిలో జరిగిన బేస్‌బాల్ బాలికల సబ్ జూనియర్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టు ద్వితీయ స్థానం పొందింది. ఈ జట్టులో నాగాయలంక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్ బాలికలు 10మంది ఉన్నారని హెచ్.ఎం పద్యాల రఘురామయ్య, పి.డి గాజుల లక్ష్మీ ప్రసాద్ శుక్రవారం విలేకరులకు చెప్పారు. వీరిలో అత్యుత్తమ క్రీడా ప్రతిభ చాటిన బాలికలు సబ్బినేని ఉష్మిత, పూషడపు వల్లిశ్రీ, పురమ లీలశ్రీ నేషనల్ జట్టులో స్థానం పొందారన్నారు. మే 22న భువనేశ్వర్‌లో జరగనున్న జాతీయ బేస్‌బాల్ పోటీల్లో అత్యుత్తమ క్రీడా ప్రతిభతో రాణించిన ముగ్గురు బాలికలు జాతీయ స్థాయికి ఎంపి కై న రాష్ట్ర జట్టులో ప్రాతినిధ్యం వహిస్తారు. నేషనల్స్‌కు ఎంపికై న ముగ్గురు బాలికలను పాఠశాల విద్యాకుటుంబం అభినందించింది. -
గజపతి చెరువు ఆక్రమణలపై హైకోర్టు సీరియస్
ఆయుర్వేద హాస్పటల్ నిర్మాణానికి బ్రేక్ కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి ఆర్ఎస్ నంబర్ 433 గజపతి చెరువులో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువు స్థలంలో ఇటీవల కాలంలో ఆయుర్వే వైద్యశాల నిర్మాణంకు అధికారులు పూనుకున్నారు. ఆ స్థలం చెరువుది కావడంతో పట్టణానికి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విస్తీర్ణంపై హైకోర్టు ఆరా తీయగా 42.33 ఎకరాలకు ప్రస్తుతం 14 ఎకరాలు మాత్రమే మిగిలి ఉందని రెవెన్యూ అఽధికారులు కోర్టుకు తెలిపారు. ఆగ్రహించిన హైకోర్టు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం చెరువులో ఎటువంటి కట్టడాలు చేయడానికి వెళ్లేదని అది కోర్టు భవనమైనా కూల్చేయాల్సిందే అని గౌరవ న్యాయమూర్తి తెలిపారు. వెంటనే ఆక్రమణలో ఉన్న చెరువు స్థలంపై కౌంటర్ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఆస్థలంలో ఎన్టీటీపీఎస్ క్వార్టర్స్‌తో పాటు పట్టణ సచివాలయం, ఈఎస్ఐ వైద్యశాల, పలువురు పేదలు నిర్మించున్న గృహాలు, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. హత్య కేసులో రౌడీషీటర్‌కు జీవితకాల కారాగార శిక్ష పమిడిముక్కల: హత్య కేసులో ముద్దాయి అయిన రౌడీషీటర్‌కు జీవితకాల కారాగార శిక్ష, 500 రూపాయల జరిమానా విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు మెజిస్ట్రేట్ రాజేశ్వరి విధించినట్లు పమిడిముక్కల సీఐ చిట్టిబాబు శుక్రవారం విలేకరులకు తెలిపారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి... 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ తేదీన గుమ్మడి రమణ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కృష్ణాజిల్లా పమిడిముక్కలకు చెందిన మహిళ పైడికొండలపాలెంకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తిని వివాహం చేసుకొంది. వీరికి కుమారుడు జన్మించాడు. మనస్పర్దలు రావడంతో సుబ్బారావుతో వివాహ జీవితాన్ని వదులుకొని, గుమ్మడి ప్రకాశరావును రెండో వివాహం చేసుకొని జీవనం సాగిస్తోంది. ప్రకాశరావుతో కూడా విబేధాలు రావడంతో అతని నుంచి విడిపోయి కుమారునితో కలిసి జీవిస్తుంది. ప్రకాశరావు మద్యానికి బానిసై అదే గ్రామానికి చెందిన కుంపటి ఆదిశేషు, మేడూరు గ్రామానికి చెందిన చందవోలు రాజశేఖర్‌తో పరిచయాలు పెంచుకొని ముగ్గురూ కలిసి మద్యం తాగుతూ ఉండేవారు. ఈ క్రమంలో 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీన అర్దరాత్రి 12 గంటల సమయంలో చందవోలు రాజశేఖర్ ప్రకాశరావుతో గొడవపడి నిన్ను ఎలాగైనా చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. 8వ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో ప్రకాశరావు బస్‌షెల్టర్‌లో నిద్రిస్తుండగా చందవోలు రాజశేఖర్ అక్కడకు వచ్చి నాపరాయి ముక్కతో ప్రకాశరావు తలపై పలుమార్లు కొట్టగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ సమయంలో ప్రకాశరావు పక్కనే బస్‌షెల్టర్‌లో ఉన్న ఆదిశేషు గుమ్మడి రమణకు చెప్పగా ఆయన స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ బి.శ్రీను కేసు నమోదు చేశారు. విచారణాధికారి అయిన పమిడిముక్కల సీఐ వై చిట్టిబాబు నేరస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న ముద్దాయి చందవోలు రాజశేఖర్‌ను అరెస్ట్ చేసి కోర్గుకు హాజరు పరచగా రిమాండ్‌కు పంపారు. రాజశేఖర్ పది కేసులలో ముద్దాయిగా సీఐ దర్యాప్తును త్వరిగతిన పూర్తిచేసి ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితునిపై నేరం రుజువు కావడంతో జీవితకాల కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధించినట్లు తెలిపారు. త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితునికి తక్కువ సమయంలోనే శిక్షపడేలా కృషి చేసిన డీఎస్పీ, సీఐ చిట్టిబాబు, ఎస్ఐ శ్రీను, సిబ్బందిని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు అభినందించారు. -
కామన్వెల్త్ చెస్ చాంప్‌నకు అర్బిట్రేటర్‌గా ఫణికుమార్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): శ్రీలంకలో ఈ నెల 16 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్–2026కు తమ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, చెస్ క్రీడాకారుడు ఎన్ఎం ఫణికుమార్ అర్బిట్రేటర్‌గా ఎంపికయ్యారని ఆంధ్ర చెస్ అసోసియేషన్ సెక్రటరీ కె.జగదీష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చెస్ చాంపియన్ షిప్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇండియా, కెన్యా, మలేషియా, మాల్దీవులు, న్యూజి లాండ్, పాకిస్తాన్, స్కాట్లాండ్, సింగ్‌పూర్, మారిషస్, శ్రీలంక దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు. ఎంపికై న ఫణి కుమార్‌ను ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవీ శర్మ, ప్రెసిడెంట్ అడుసుమిల్లి సురేష్, ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అక్బర్ పాషా, చెస్ క్రీడాకారులు అభినందించారు. కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన పీజీ, ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్ ఫలితాలతో పాటు బీఫార్మసీ మొదటి, ఎనిమిదవ సెమిస్టర్, యూజీ మొదటి సెమిస్టర్, రీవాల్యూయేషన్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య కూన రాంజీ శుక్రవారం విడుదల చేశారు. వీటిని విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చని వీసీ తెలిపారు. ఉత్తీర్ణత శాతంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలని ఆకాంక్షించారు. లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. పీజీ, ఎంబీఏ, ఎంసీఏ మొదటి సెమిస్టర్, బీఫార్మసీ మొదటి సెమిస్టర్ రీ వాల్యూయేషన్ ఫీజును ఈ నెల 20వ తేదీలోగా ఆసక్తి గల విద్యార్థులు చెల్లించాలని పరీక్షల నియంత్రణాఽధికారి వీరబ్రహ్మచారి తెలిపారు. -
ఈ ఏడాదైనా అమలయ్యేనా?
ఏక్‌సాల్ కౌలు వేలం తాడిగడప, పెదపులిపాక గ్రామాల్లో ఉన్న కొండపల్లి ఖాజీ సర్వీస్ వక్ఫ్ భూముల ఏక్‌సాల్ కౌలు వేలం ఈ ఏడాదన్నా అమలు చేస్తారా లేక ప్రైవేటు వ్యక్తులకు అన్యాక్రాంతం చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం ఖాజీ సర్వీస్ భూములపై జోక్యం చేసుకుని చర్యలు తీసుకోకపోతే ఈ ఏడాది కూడా వక్ఫ్ ఆదాయానికి భారీగా గండి పడే ప్రమాదం ఉంది.వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ రూ.24 లక్షలతో కౌలు వేలం సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం ఈ ఏడాదైనా న్యాయం జరుగుతుందా..? -
మృత్యుపాశాలు!
ఆక్వా చెరువుల వద్ద నాలుగు రోజుల్లో ముగ్గురు మృతి.. దింటిమెరక–హంసలదీవి రహదారిని ఆనుకొని రొయ్యల చెరువుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, హైటెన్షన్ విద్యుత్‌లైన్ కోడూరు: ఆక్వా చెరువుల సాగులో యజమానులు నిబంధలకు పాతరేస్తున్నారు. ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్లు చెరువుల వద్ద పని చేసే కూలీల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. కృష్ణాజిల్లా కోడూరు మండలంలో రెండు రోజుల వ్యవధిలో చెరువుల వద్ద ముగ్గురు కూలీలు విద్యుత్ఘాతానికి గురై ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో విద్యుత్ నిర్వాహణ తీరుపై అనేక సందేశాలు వ్యక్తమవుతున్నాయి. కోడూరు మండలం సముద్ర తీరానికి అతీ సమీపంలో ఉండడంతో కృష్ణానది పరివాహాక రైతులు, సముద్ర తీరప్రాంత రైతులు ఆక్వా సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో భాగంగానే వి.కొత్తపాలెం, విశ్వనాథపల్లి, సాలెంపాలెం, వేణుగోపాలపురం, పిట్టల్లంక, ఉల్లిపాలెం, హంసలదీవి, పాలకాయతిప్ప, ఇరాలి, ఊటగుండం, రామకృష్ణాపురం, మందపాకల, పోటుమీద, చింతకోళ్ల ప్రాంతాల్లో సుమారు 8వేల ఎకరాల్లో రొయ్యలు, చేపల చెరువుల తవ్వకాలు చేపట్టి ఆక్వా సాగు నిర్వహిస్తున్నారు. చెరువులను లీజుకు తీసుకున్న బడాబాబులు తీర ప్రాంత గ్రామాల్లో రైతులు చెరువుల సాగుకు అయితే ఖర్చులు భరించే పరిస్థితి లేదు. దీంతో ఈ ప్రాంత రైతులు లీజు పద్ధతిలో ఇతర వ్యక్తులకు చెరువుల సాగుకు ఇస్తున్నారు. భీమవరం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, హైదరాబాద్, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన బడాబాబులు ఈ చెరువులను లీజుకు తీసుకుని ఆక్వా సాగు చేస్తున్నారు. ఒక్కొ బడాబాబు సుమారు 200 నుంచి 300 ఎకరాల చెరువులను లీజుకు తీసుకొని వాటికి సంబంధించిన మరమ్మతులతో పాటు వీటికి అవసరమైన విద్యుత్ సౌకర్యానికి కూడా సమకూర్చుకుంటున్నారు. చెరువుల వద్ద పని చేసేందుకు ఒడిశా, బీహార్, అస్సాంతో పాటు స్థానిక వ్యక్తుల కూడా పెట్టుకుంటున్నారు. చెరువుల సాగుకు విద్యుత్ సౌకర్యం తప్పనిసరిగా కావాలి. చెరువుల్లోని రొయ్యలకు ఆక్సిజన్ కోసం ఏర్పాటు చేసే ఫ్యాన్లు తిరగడానికి, రాత్రి వేళ లైటింగ్, మోటర్లు తిరగడానికి విద్యుత్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆక్వా చెరవుల వద్ద విద్యుత్ నిర్వాహణ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. ట్రాన్స్‌ఫార్మర్లును సరైన పద్ధతిలో పెట్టకుండా చేతికందే ఎత్తులో ఉంచడం, ఫ్యూజ్ బాక్స్‌లను కర్రలకు కట్టి చెరువుల అంచన పెట్టడం వంటి చెరువులు యజమానులు చేస్తున్నారు. విద్యుత్ స్తంభాల నుంచి వెళ్లే హైటెన్షన్ విద్యుత్ వైర్లు కూడా కిందకు వేలాడుతూ కనిపిస్తున్నారు. అనేక చెరువుల వద్ద మోటర్ల ఏర్పాటులో నిబంధనలు పాటించకపోవడంతో ఇవి కూడా ప్రమాదకరంగా మారాయి. కొన్నిచోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రధాన రహదారుల అంచన కూడా ఏర్పాటు చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. ఆక్వా చెరువుల వద్ద బడాబాబులు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా కూడా మత్స్యశాఖ, విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ప్యూజు బాక్స్‌లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసే సమయంలో బడాబాబులకు అనుకూలంగా వ్యవహరించడంతోనే ఇలాంటి తరహా ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు బహాటంగానే విమర్శిస్తున్నారు. ఇంటికి మీటర్లు ఇచ్చేందుకు సవాలక్ష ఆంక్షలు విధించే అధికారులు చెరువులకు మాత్రం విద్యుత్ సరఫరా చేసేందుకు ఏవిధమైన నిబంధనలు పాటించడం లేదని వాపోతున్నారు. మత్స్యశాఖ అధికారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వుతున్నా కూడా వాటిని సాగు చేసేందుకు అనుమతులు ఇవ్వడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఆక్వా చెరువుల వద్ద విద్యుత్ వ్యవస్థపై సరైన పర్యవేక్షణ చూపాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలు
జి.కొండూరు: ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే సహించేదిలేదని జి.కొండూరు మండల ఇన్చార్జ్ తహసీల్దార్ విజయ్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని మునగపాడు, సున్నంపాడు గ్రామాల పరిధిలో జగనన్న కాలనీ ఏర్పాటు కోసం విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ నిధులతో రైతుల నుంచి కొనుగోలు చేసిన భూమిని అక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్రభుత్వ భూమిపై పచ్చనేతల కన్ను’ కథనాన్ని సాక్షి శుక్రవారం ప్రచురించింది. ఈ కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఇన్చార్జ్ తహసీల్దార్ విజయ్‌కుమార్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు బృందం ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ కంప చెట్లను తొలగించి నేలను చదును చేస్తున్న జేసీబీలను అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమిలో ఎటువంటి కార్యకలాపాలు చేయడానికి వీల్లేదని, అక్కడి నుంచి వెళ్లకపోతే జేసీబీలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరిక బోర్డును సైతం ఏర్పాటు చేశారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ పొగాకు పుల్లారెడ్డి ఇబ్రహీంపట్నం: వేసవి కాలంలో వినియోగదారులకు ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్, ఏపీజెన్కో ఇన్చార్జ్ డైరెక్టర్ పోగాకు పుల్లారెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని విజయవాడ రూరల్ డివిజన్ కార్యాలయం, విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. రూరల్ డివిజన్ కార్యాలయం, విద్యుత్ ఉద్యోగుల విధుల నిర్వహణపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల గృహాలకు సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేయడంలో లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు. హెచ్‌టీ, ఎల్టీ లైన్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు కృషి చేయాలని సూచించారు. పశ్చిమ ఇబ్రహీంపట్నం, అంబారుపేట, మక్కపేట ఏరియాలో మూడు నూతన సబ్ స్టేషన్లను సుమారు రూ.14 కోట్లతో అనుమతులు మంజూరు చేశారు. టెక్నికల్ డైరెక్టర్ ఎ.మురళీకృష్ణ యాదవ్, ఎస్ఈ యు.అన్నమయ్య, పలువురు ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. కంటెయినర్ లారీ ఢీకొని కూలీ దుర్మరణం కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కొండపల్లి ఆప్మెల్ సెంటర్లో 30వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. ఆప్మెల్ సెంటర్‌కు చెందిన వేముల వెంకటేశ్వరరావు (37) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. కూలి పనికి వెళ్లి తిరిగి రాత్రి 11.30 గంటల సమయంలో తన టీవీఎస్ మోపెడ్‌పై ఇంటికి వస్తున్నాడు. ఆ సమయంలో హైవేపై మలుపు తిరుగుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వెంకటేశ్వరరావును కుటుంబ సభ్యులు విజయవాడ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేశ్వరరావు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు ఢీకొని మరో కారు డ్రైవర్ దుర్మరణం కంచికచర్ల : రోడ్డు ప్రమాదంలో ఓ కారు డ్రైవర్ మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్ఐ పి.విశ్వనాధ్ కథనం మేరకు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నెల్లూరి సుజన తన కుటుంబసభ్యులతో కలిసి నిడమానూరులో వివాహ కార్యక్రమానికి గురువారం వచ్చారు. అదేరాత్రి తిరిగి ప్రయాణం అయ్యారు. కంచికచర్ల సమీపంలో మిశ్రా డాబా వద్దకు రాగానే శుక్రవారం తెల్లవారుజామున కారు రోడ్డు పక్కన ఆపి కారు డ్రైవర్ కొంగర ప్రశాంత్ కుమార్ మూత్ర విసర్జన కోసం వెళ్లాడు. తిరిగి కారు ఎక్కుతున్న సమయంలో వేగంగా వెనుకనుంచి వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ తలకు తీవ్రగాయమయింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్దలానికి చేరుకుని బాధితుడిని వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రశాంత్‌కుమార్ మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. -
ఏపీఈసెట్‌లో కృష్ణా విద్యార్థుల ప్రతిభ
మచిలీపట్నంఅర్బన్: ఏపీఈసెట్–2026 ఫలితాల్లో కృష్ణా జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. గత నెల 23న జేఎన్టీయూ అనంతపురం, ఏపీ ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీఎచ్ఈ) తరఫున నిర్వహించిన పరీక్షలో డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కోర్సుల రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీతో ప్రవేశాలు పొందనున్నారు. జిల్లా నుంచి మొత్తం 1,050 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 1,002 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 95.49గా నమోదైంది. పరీక్షకు 674 మంది బాలురు, 376 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో 640 మంది బాలురు, 362 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 94.36గా ఉండగా, బాలికల ఉత్తీర్ణత శాతం 96.28గా నమోదైంది. ఏపీఈసెట్ ఎఫ్‌డీహెచ్ అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ పరీక్షలో గుడివాడ సమీపంలోని మోటూరుకు చెందిన బొడ్డు రామచందు 160 మార్కులతో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో రాష్ట్ర స్థాయి 8వ ర్యాంకు దక్కించుకున్నారు. ఉయ్యూరుకు చెందిన పట్టపు వైష్ణవి 128 మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్‌లో రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు సాధించింది. వీరిని విద్యార్థులు, అధ్యాపకులు అభినందించారు. -
బైక్ అదుపుతప్పి భార్య మృతి.. భర్తకు గాయాలు
రెడ్డిగూడెం: రోడ్డుపై గేదెలు అడ్డురావడంతో బైక్ అదుపు తప్పిన ఘటనలో భార్య ఘటనా స్థలంలోనే మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చిన్నపల్లి సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. మండలంలోని చండ్రుపట్ల గ్రామానికి చెందిన భార్యభర్తలు బాణావాత్ రంగమ్మ(50), శ్రీను రెడ్డిగూడెం మండలంలోని రుద్రవరం గ్రామంలో శుభాకార్యానికి బైక్ మీద వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి సమీపంలోని రహదారిపైకి గేదెలు ఒక్కసారిగా మీదకు రావడంతో శ్రీను సడన్ బ్రైక్ వేశాడు. దీంతో దంపతులిద్దరూ ఒక్కసారిగా కింద పడిపోయారు. రంగమ్మ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందింది. భర్త శ్రీనుకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో విస్సన్నపేట ఆసుపత్రికి తరలించారు. -
సిద్ధార్థ యూనివర్సిటీ ఫలితాలు విడుదల
పెనమలూరు: మండలంలోని కానూరులో ఉన్న సిద్ధార్థ డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ ఫలితాలను గురువారం విడుదల చేశారు. వర్సీటీ క్యాంపస్‌లో సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు ఎం.రాజయ్య, పాలడుగు లక్ష్మణరావు ఫలితాలను విడుదల చేసి వివరాలు వెల్లడించారు. 2026–2027 విద్యా సంవత్సరంలో అడ్మి షన్ల కోసం ప్రవేశ పరీక్ష (ఎస్ఈఈఈ) నిర్వహించామన్నారు. ఉత్తమ ప్రతిభ చాటిన ఆరుగురు విద్యార్థులకు నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సును పూర్తి ఫీజు రాయితీతో అడ్మిషన్ ఇస్తామన్నారు. ఎంట్రన్స్‌లో మొదటి ర్యాంక్ డి.భవదీప్, రెండో ర్యాంక్ సీహెచ్.హర్ష, మూడో ర్యాంక్ వి.నాగవెంకటరాకేశ్వర్ సాధించారని పేర్కొన్నారు. జేఈఈలో ఉత్తమ మార్కులు సాధించిన బి.శరన్, వి.నరసింహశ్రీనివాస్, జి.సమీర్రాజ్కు వంద శాతం ఫీజు రాయతీ వర్తిస్తుందన్నారు. ఈ నెల 13 నుంచి అడ్మిషన్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ఉపకులపతి ప్రొఫెసర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో ఉప కులపతి డాక్టర్ ఎ.వి.రత్నప్రసాద్, డైరెక్టర్ ప్రొఫెసర్ బి.పాండురంగారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.రవిచంద్, డీన్ వెంకట్రావు, డీన్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ జి.ఎన్.స్వామి పాల్గొన్నారు. ఆత్కూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ, యూనియన్ బ్యాంక్ సంయుక్త సౌజన్యంతో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు పలు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్ఈఎస్టీఐ ప్రతినిధులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నెల రోజుల వస్త్ర చిత్ర కళ (మగ్గం) శిక్షణ ఈ నెల 11 నుంచి ప్రారంభ మవుతుందన్నారు. 14 రోజుల కాస్ట్యూమ్ జువె లరీ శిక్షణ, పదిరోజుల పుట్టగొడుగుల పెంపకం, 12 రోజుల కొవ్వొత్తుల తయారీలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై 19 నుండి 50 ఏళ్లలోపు గ్రామీణ మహిళలు, యువతులు శిక్షణ పొందేందుకు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్తో పాటు టూల్ కిట్లు అంద జేస్తామని తెలిపారు. అసక్తి కలిగిన వారు ఈ నెల పదో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర సమాచారం కోసం 63042 54730, 94900 11081 నంబర్లను సంప్రదించాలని కోరారు. చిలకలపూడి(మచిలీపట్నం): అల్లూరి సీతారామరాజు గిరిజనుల కోసం ఎన్నో పోరా టాలు చేశారని కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని వీడియోకాన్ఫరెన్స్ హాలులో గురువారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీఆర్వో మాట్లాడుతూ.. సీతారామ రాజు మన్యం వీరుడిగా పేరుగడించారన్నారు. ఆయన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, కలెక్టరేట్ ఏఓ ఎ.ఎస్.ఎన్.రాధిక, సూపరింటెండెంట్ నెల్సన్‌పాల్‌బాబు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ గుర్తింపు, అనుమతి లేకుండా అడ్మిషన్లు చేపట్టొద్దని ప్రైవేట్ పాఠశాలలను కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. గూడూరు మండలంలో ‘ఢిల్లీ వరల్డ్ స్కూల్’ పేరుతో నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలకు సంబంధిత శాఖల నుంచి సరైన గుర్తింపు, అనుమతులు లేవని స్పష్టంచేశారు. ఆ విద్యా సంస్థ 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తమ దష్టికి వచ్చిందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించొద్దని సూచిం చారు. ఆ పాఠశాలల్లో చేరిస్తే విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గుర్తింపు లేకుండా 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహిస్తున్న సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ పాఠశాలలు, వాటి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ సుబ్బారావు హెచ్చరించారు. -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.8440 టీఎంసీలు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ నిత్యా న్నదానానికి విజయవాడ గొల్లపూడికి చెందిన బుర్లే శ్రీనివాసరావు, భ్రమరాంబ దంపతులు గురువారం రూ.1,01,116 విరాళం సమర్పించారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న హోంగార్డుల పిల్లలు 21 మందిని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభ చూపిన చిన్నారులను కమిషనరేట్‌లో గురువారం శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్‌లోని హోంగార్డుల పిల్లలు 21 మంది 500 కంటే ఎక్కువ మార్కులు సాధించారని తెలిపారు. రేయింబవళ్లు ప్రజల సేవలో నిమగ్నమయ్యే హోంగార్డులు, తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అభినందనీయమని కొనియాడారు. తమ పిల్లల ప్రతిభను గుర్తించి, స్వయంగా పోలీస్ కమిషనర్ సత్కరించడంతో హోంగార్డులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత, హోంగార్డు కమాండెంట్ ఆనందబాబు, ఏఆర్ ఏడీసీపీ కె.కోటేశ్వరరావు, హోంగార్డు డీఎస్పీ ఎన్.వి.రమణ, ఆర్ఐ సుధాకరరెడ్డి, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు విజయవాడ, గుంటూరు మీదుగా విశాఖపట్నం – కొల్లం మధ్య రెగ్యులర్ వారాంతపు రైలుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం – కొల్లం (18501) రైలు ఈ నెల 12 నుంచి ప్రతి మంగళవారం, కొల్లం– విశాఖపట్నం (18502) రైలు ఈ నెల 13 నుంచి ప్రతి బుధవారం నడవనున్నాయి. రెండు మార్గాల్లో ఈ రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, గుంటూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్ పట్టాయ్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోదనూరు, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, యర్నాకుళం, కొట్టాయం, చెంగనూరు, కాయంకుళం స్టేషన్లలో ఆగుతుంది. కొండపల్లిలో ఉయ్యాల శ్రీను డెన్‌గా ఉన్న ప్రాంతంలో నిల్వ చేసిన సుమారు 40 బస్తాలు బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇతని ప్రాంతానికి వెళ్లేందుకు ఏ అఽధికారీ సాహసం చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం గోడౌన్ ప్రాంతాన్ని మార్పు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నాడు. కొండపల్లి శాంతినగర్ వద్ద డేరంగుల గోపీకి చెందిన 550 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఈలప్రోలులో నిల్వ చేసిన సుమారు 15 బస్తాలు, గుంటుపల్లిలో సుమారు 20 బస్తాల కోటా బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఇవి కాకుండా యథేచ్ఛగా రవాణా జరుగుతూ లెక్కల్లోకి రాని బియ్యం వందల టన్నుల్లో ఉంటుందని అంచనా ఉంది. పేదల రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రజాసంఘాలు, ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఇబ్రహీంపట్నం: పేదలకు ఉచితంగా అందించే కోటా (రేషన్) బియ్యాన్ని కొందరు అక్రమార్కులు అడ్డదారుల్లో దోచుకుంటున్నారు. ఆపై బహిరంగ మార్కెట్లో యథేచ్ఛగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో పౌరసరఫరాల శాఖ అధికారులు కొండపల్లిలో జరిపిన దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. రేషన్ మాఫియా ముఠా కొండపల్లి కేంద్రంగా సాగిస్తున్న దందాను చూసి అధికారులను సైతం విస్మయం చెందారు. దశాబ్దకాలంగా రేషన్ డాన్‌గా కొనసాగుతున్న ఉయ్యాల శ్రీను నిల్వ చేసిన సుమారు 40 బస్తాలు రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం డేరంగుల గోపీ నిల్వ చేసిన 550 క్వింటాళ్ల రేషన్ బియ్యంపై అఽధికారులు దాడిచేశారు. గతంలో షాదీఖానలో నిల్వచేసిన టన్నున్నర బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ లెక్కన కొండపల్లి కేంద్రంగా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తేటతెల్లమవుతోంది. ప్రతినెలా రూ.కోటికి పైగా వ్యాపారం కొండపల్లి మునిసిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండల పరిధి గ్రామాల్లో కోటా బియ్యంతో ప్రతి నెలా రూ.కోటికి పైగా వ్యాపారం జరుగుతోందని సమాచారం. ఈ రెండు ప్రాంతాల నుంచి అక్రమంగా రేషన్ బియ్యం వేల క్వింటాళ్లు తరలిపోతోందని అంచనాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికార పార్టీ నాయకులే సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ వ్యాపారం యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ సంబంధిత వాహనాలు, వ్యక్తులపై పౌర సరఫరాల శాఖ అధికారులు నిఘా ఏర్పాటు చేయక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కుబడిగా రేషన్ దుకాణాలు తనిఖీ చేస్తున్నప్పటికీ బియ్యం నిల్వలపై తేడాలు ఉన్నా కేసులు నమోదు చేయ డంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రేషన్ డాన్ల మధ్య ఆధిపత్య పోరు కొండపల్లి ప్రాంతంలో రేషన్ బియ్యం దందా మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లడంతో రేషన్ బియ్యం డాన్ల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఒకరు నిల్వ చేసిన బియ్యాన్ని మరొకరు పట్టిం చడం, ప్రాంతాల వారీగా ఆధిపత్యం చెలాయించడం, ఒకరిపై మరొకరు దాడి చేయించడం వంటి ఘటనలు మండలంలో వెలుగు చూస్తున్నాయి. గతంలో పవిత్ర సంగమంనకు వెళ్లే రోడ్డులో అర్ధరాత్రి వేళ రేషన్ డాన్లు ఒకరిపై ఒకరు దాడిచేసుకుని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఘటనలు ఉన్నాయి. మూడు రోజుల క్రితం కొండపల్లిలో లభించిన 550 బస్తాల బియ్యం కూడా కావాలని పట్టించినట్లు తేలింది. ఈ ఘటనలో డేరంగుల శ్రీను, దుర్గారావుతో పాటు ఓ రైస్ మిల్లు యజమానిపై కూడా అధికారులు కేసు నమోదు చేశారు. రేషన్ డాన్లు తమ వ్యాపారం సక్రమంగా సాగేందుకు ఒక్కొరు రూ.50 వేల వరకు అఽధికారులకు ప్రతినెలా ముట్టజెబుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 7 -
స్కూల్ బస్.. ఫిట్‌లెస్
లబ్బీపేట(విజయవాడతూర్పు): పిల్లలను పాఠశాలలు, కళాశాలలకు తీసుకెళ్లే పలు బస్సుల్లో అనేక లోపాలు ఉంటున్నాయి. రవాణాశాఖ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో అవి బయటపడుతున్నాయి. ఈ లోపాలను గుర్తించిన అధికారులు, వాటిని సరిచేయాలంటూ ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నారు. పదిహేను రోజుల్లో ఆ లోపాలను సరిచేస్తేనే మళ్లీ తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రెండువేలకు పైగా స్కూల్, కళాశాల బస్సులు ఉండగా, ఇప్పటి వరకూ 250 బస్సులను రవాణాశాఖ అధికారుల బృందాలు తనిఖీలు చేశాయి. పలు బస్సుల్లో లోపాలు గుర్తించి యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చాయి. గుర్తిస్తున్న లోపాలు ఇవీ.. రవాణా శాఖ తనిఖీల్లో వీఎల్టీడీ డివైజ్‌లు లేక పోవడం, ప్రమాదాలు జరిగినప్పుడు పిల్లలు బయటకు వచ్చే అత్యవసర ద్వారాలు సరిగా పనిచేయక పోవడం, అత్యవసర ద్వారాల వద్ద సీట్లు అమర్చడం వంటి లోపాలు అధికారులు గుర్తించి నోటీసులు ఇస్తున్నారు. వాటితో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హ్యామర్లు బస్సులో అందుబాటులో లేక పోవడం, మంటలను ఆర్పే ఫైర్ ఎక్విప్మెంట్ లేక పోవడం, ఎక్స్పైరీ డేట్‌తో ఉండటం వంటి వాటిని రవాణా శాఖ అధికారులు గుర్తిస్తున్నారు. పిల్లలను తీసుకెళ్లే స్కూల్, కళాశాల బస్సులు నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. వీటిపైనే దృష్టి.. రవాణాశాఖ అధికారులు వారి తనిఖీల్లో ముఖ్యంగా టైర్లు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎక్కే డోర్ మెట్లు సక్రమంగా ఉన్నాయా, గ్రిల్స్, సీట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ కిట్, వైఫర్స్, ఇండికేటర్స్, హెడ్ లైట్స్, గ్లాస్, బస్సు కండీషన్, రూఫ్ వంటి అంశాలపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు విద్యార్థులు బయటకు వచ్చేందుకు ఎమర్జెన్సీ డోర్ సరిగాయ ఉన్నాయా లేవా అని తనిఖీ చేస్తున్నారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో స్కూల్స్, కళాశాలల బస్సులను తనిఖీ చేస్తున్నాం. భద్రతా ప్రమాణా లయిన ఏఐఎస్–63, ఏఐఎస్ –52, ఏఐఎస్ –135, ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ రూల్స్‌లోని 185(జీ), 125(హెచ్) ప్రకారం పరిశీలన చేస్తున్నాం. తనిఖీల్లో నిబంధనల ప్రకారం లేని బస్సులకు సంబంధించి యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చి, 15 రోజుల్లో సరిదిద్దుకోవాలని ఆదేశిస్తున్నాం. వాటిని సరిదిద్దిన తర్వాత మరో సారి తనిఖీ చేసి అన్నీ బాగుంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తాం. ఇప్పటి వరకూ 200 బస్సుల వరకూ తనిఖీలు చేశాం. – ఆర్.ప్రవీణ్, ఆర్టీఓ, విజయవాడ గత ఏడాది డిసెంబరులో స్కూల్, కళాశాలల బస్సులకు సంబంధించి రవాణాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాదాపు పది ప్రత్యేక బృందాలతో రెండు రోజుల పాటు 125 బస్సుల వరకూ తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో స్కూల్ బస్సు డ్రైవర్ వయస్సు, అనుభవం, లైసెన్స్, అత్యవసర ద్వారం ఇతర అంశాలను తనిఖీ చేశారు. రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో స్కూలు బస్సుల డొల్లతనం బయటపడింది. ఏకంగా 28 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇప్పుడు అలాంటివి చోటుచేసుకోకుండా ముందస్తుగానే తనిఖీలు చేస్తున్నారు. -
చెత్త రాజకీయాలకు కేరాఫ్ కొల్లు
చిలకలపూడి(మచిలీపట్నం): చెత్త రాజకీయాలకు కేరాఫ్‌గా మంత్రి కొల్లు రవీంద్ర వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) మండిపడ్డారు. బందరులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మచిలీపట్నం మార్కెట్ యార్డులో హౌసింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఇతర జిల్లాలకు స్టీలును తరలించడాన్ని ప్రశ్నించినందుకు అధికారులను బెదిరిస్తున్నానంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకు పడ్డారు. హౌసింగ్ అధికారుల అకృత్యాలపై ప్రతిపక్ష పార్టీ నాయకునిగా తాను ప్రశ్నిస్తే మంత్రికి ఉలికిపాటు ఎందుకో అర్ధం కావటం లేదన్నారు. ప్రభుత్వంలోని లోపాలను అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామంటూ చెబుతున్న మంత్రి ఎంయుడీఏకు సంబంధించి సేకరించిన భూమిలో ఆరు నుంచి 10 అడుగుల లోటు తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదు ఇస్తే ఇంత వరకు ఏం విచారణ చేపట్టారని ప్రశ్నించారు. స్పందించకపోగా ఎంయుడీఏ చైర్మన్‌గా ఉన్న వ్యక్తిని ఒత్తిడి తెచ్చి పదవి నుంచి దిగిపోయేలా చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. విచారణ చేస్తామని చెప్పే మంత్రి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలో చేసిన పాపాలపై ఏం విచారణ చేశారో కూడా చెప్పాలని సవాల్ విసిరారు. స్టీలు తరలింపుపై ఆదేశాలు చూపగలరా.. మచిలీపట్నం నుంచి హౌసింగ్ అధికారులు ఇతర జిల్లాలకు స్టీలును తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే జీవో లేదా హౌసింగ్ ఎండీ ఆర్డర్ ఉండకుండా ఎలా తరలిస్తారన్నారు. లారీ వెళ్లిపోయాక అర్ధాంతరంగా హౌసింగ్ పీడీ ఆర్డరు ఇవ్వటం చూస్తుంటే ప్రజలకే అర్ధమవుతోందన్నారు. సుమారు రూ. 25 లక్షల విలువ గల 25 టన్నులు స్టీలు దోచుకోవటం కాదా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రశ్నిస్తే బెదిరింపులు అంటావా అని నిలదీశారు. అసలు బందరుకోటలో కట్టే మీ ఇంటికి, కాంప్లెక్స్‌లకు ప్లాన్ ఉందా, లేదా సమాధానం చెప్పాలని అడిగితే దానిపై మాట్లాడకుండా బురదజల్లుతారా అని ప్రశ్నించారు. నిజాలు నిగ్గు తేల్చగలరా..? మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి నిజాయితీగా వ్యవహరించిన నాపై ఆరోపణలు చేస్తున్నారని నిజాలు నిగ్గు తేల్చగలరా అని రవీంద్రను పేర్ని నాని ప్రశ్నించారు. తాను నిర్మించుకున్న గోడౌన్‌కు సంబంధించిన భూములు రైతులను బెదిరించి లాక్కున్నానని అంటున్నావని నువ్వు ఏ ఒక్క రైతుతో అయినా సాక్ష్యం చెప్పించగలావా అని ప్రశ్నించారు. దొంగ పట్టాలు ఇచ్చానని ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టారని ఇంత వరకు దానిని ఎందుకు రుజువు చేయలేకపోయారని అన్నారు. మూడు శాఖలకు మంత్రిగా పనిచేస్తున్న రవీంద్ర పట్టణ సుందరీకరణ పేరుతో పేదల బడ్డీ కొట్లు కూలగొట్టారని ఆరోపించారు. కుమ్మరిగూడెం ఇటుక బట్టీలు తొలగించేందుకు మునిసిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని వారికి అండగా తాము రాజీ లేని పోరాటం చేస్తుంటామన్నారు. విజయవాడ కేంద్రంగా మంత్రి కొల్లు రవీంద్ర వైకేనల్ ఏర్పాటు చేసి నెలకు రూ. 85 లక్షలు జీతభత్యాలను చెల్లిస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కొల్లు నివాస ప్రాంతానికి సమీపంలో ఉన్న గుమ్మటాల చెరువు అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రహదారులు, తాగునీటి పైపులు ఏర్పాటు చేయటం కోర్టు ధిక్కారం కాదా అన్నారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. -
అన్నదాతల ఆత్మహత్యలు నివారించే చర్యలేవి?
చల్లపల్లి: అన్నదాతల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయటం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమని అంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. ఇప్పటి వరకూ అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 160 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అసెంబ్లీలో వ్యవసాయాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసలు ఆత్మహత్యలే జరగలేదని చెప్పటం దుర్మార్గమన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి సమావేశాలను స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో గురువారం ప్రారంభమయ్యాయి. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఈశ్వరయ్య మాట్లాడుతూ అసలు వ్యవసాయమేలేని సింగపూరులో వ్యవసాయంపై పరిశోధన చేసేందుకు ఆ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు అక్కడికి వెళ్ళటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓవైపు మొక్కజొన్న రైతులు తమ పంటను మద్దతు ధరకు అమ్ముకోలేక కష్టనష్టాలు ఎదుర్కొంటుంటే ఆశాఖ మంత్రి మాత్రం సింగపూర్ వెళ్ళి జల్సాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్ని ఇంకెంత కాలంమోసగిస్తారు..? 1996లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టులు నేటికీ పూర్తికాకుండా అలాగే ఉన్నాయని ఇంకెంతకాలం రైతులను మోసం చేస్తారని ఈశ్వరయ్య దుయ్యబట్టారు. రాష్ట్రంలో 43 వేల పైచిలుకు చెరువులు ఉన్నాయని వాటి ద్వారా లక్షల ఎకరాలు సాగువుతున్నాయని గుర్తుచేశారు. మొదట ఆ చెరువులను నింపే ప్రయత్నం చేయాలని కోరారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మూడుసార్లు పోటీచేసి గెలిచిన హిందూపురంలో ప్రజలు తాగటానికి కనీసం గుక్కెడు నీళ్ళు కూడా దొరకటంలేదని ఆయన సినిమాల్లో మాత్రం నీరు ఏరులై పారుతుందని ఎద్దేవా చేశారు. మే 15వ తారీఖున ఒక నెల రోజుల ముందుగానే కృష్ణాడెల్టాకు నీరు అందిస్తామని నాయకులు చెప్పారని మే 15కు ఇంకా వారం రోజులు మాత్రమే ఉందని కానీ సాగునీరు వచ్చే జాడ మాత్రం ఎక్కడా కనిపించటంలేదని అన్నారు. కాలువలన్నీ పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో పూడుకుపోయాయని వారం రోజుల్లో కాలువల్లో ఎప్పుడు పూడికతీత తీస్తారు..? ఎప్పుడు నీళ్ళు వదులుతారని ప్రశ్నించారు. రైతుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పోరాటాలు చేయటానికి సమాయత్తం కావాలని ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. ముందుగా రైతు నాయకులు కొమ్మన నాగేశ్వరరావు రైతు సంఘ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ శాసన సభ్యులు సింహాద్రి రమేష్‌బాబు, విక్కుర్తి శ్రీనివాసరావు, సాగునీటి రంగ నిపుణులు అక్కినేని భవానీప్రసాద్, ఏపీ ఆయిల్ ఫామ్ రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొబ్బా వీరరాఘవరావు, కార్యవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. -
పల్నాడు జిల్లా ఎడ్లకు ప్రథమ స్థానం
ముగిసిన ఎడ్ల బండ లాగుడు పోటీలు నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు విజయవంతంగా ముగిశాయి.. బుధవారం రాత్రి జరిగిన ఒంగోలు జాతి సీనియర్ విభాగం ఎడ్ల బండ లాగుడు పోటీలలో విజేతల ఎడ్ల జత యజమానులకు రైతు కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు. బుధవారం రాత్రి సీనియర్ విభాగంలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నం గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ సత్తార్ ఎడ్ల జత 3,030 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లా రెడ్డిపాలేనికి చెందిన కాఠసాని హేమచంద్రారెడ్డి, జాన్వికారెడ్డి, కాకుమాను మండలం కొండబాలవారిపాలెంకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షిత చౌదరి ఎడ్ల జత 3000 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. గుంటూరు జిల్లా రెడ్డిపాలేనికి చెందిన కాఠసాని హేమచంద్రారెడ్డి, జాన్వికారెడ్డి, కాకుమాను మండలం కొండబాలవారిపాలెంకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షిత చౌదరి ఎడ్ల జత 2,778 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం వీరాయపాలెంకు చెందిన దూదేకుల పెద్ద చాంద్‌బాషా ఎడ్ల జత 2,585 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానంలో నిలిచినట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. విజేతల ఎడ్ల జత యజమానులకు వరుసగా రూ.లక్ష, 80 వేలు, 70 వేలు, 60 వేల నగదు బహుమతులతోపాటు, జ్ఞాపికలను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు కమిటీ సభ్యులతోపాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
బ్యారేజీలతోనే రైతు సంక్షేమం
చల్లపల్లి: కృష్ణానది దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలకు ఏర్పడే నీటి సమస్యను బ్యారేజీల నిర్మాణంతోనే అధిగమించగలమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్‌బాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి సమావేశాలు చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో గురువారం ప్రారంభమయ్యాయి. ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన సభలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సింహాద్రి రమేష్‌బాబు రైతు సమస్యలు, వాటి పరిష్కారాలపై మాట్లాడారు. అవనిగడ్డ నియోజకవర్గం భౌగోళి కంగా కృష్ణానదికి చిట్టచివరన ఉండటంతో భారీ వర్షాలు పడినా, తుపానులు వచ్చినా పంటలు మునిగిపోతాయని, వర్షాలు పడకపోతే పొలాలు ఎండిపోతాయని తెలిపారు. ఏటా రెండు విపత్తుల్లో ఏదో ఒకదానితో రైతులు పంట నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద బ్యారేజీల ఫైల్ సాగునీటి సమస్య నుంచి రైతులకు శాశ్వతంగా విముక్తి కల్గించేందుకు, కృష్ణానదిలో వృథాగా సముద్రంలో కలిసిపోతున్న వందల టీఎంసీల నీటిని ఒడిసి పట్టేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రయత్నాలు ప్రారంభించా మని సింహాద్రి రమేష్‌బాబు గుర్తుచేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువున కృష్ణానదిపై చోడవరం వద్ద ఒకటి, మోపిదేవి మండలం బొబ్బర్లంక వద్ద మరొక డ్యాము ఏర్పాటు ఆవశ్యకతను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టిలో పెట్టామని పేర్కొన్నారు. తాము కోరిందే తడవుగా అదే రోజు ఇరిగేషన్ అధికారులు, మంత్రులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్చించారని తెలిపారు. చెక్ డ్యాములు కడితే కట్టలు తెగిపోయే ప్రమాదం ఉన్నందున బ్యారేజీలు నిర్మించాలని అధికారులు సూచించారని పేర్కొన్నారు. బ్యారేజీల నిర్మాణం కోసం మట్టి నమూనాల సేకరణ, బొబ్బర్లంక వద్ద బ్యారేజీ నిర్మాణానికి రూ.2200 కోట్ల ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారని వివరించారు. ప్రస్తుతం ఆ ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంటు వద్ద ఉందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా రైతు నాయకులు పూనుకుని స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఆ ఫైల్‌ను కదిలించి బ్యారేజీల నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. బ్యారేజీల నిర్మాణం జరిగితే బొబ్బర్లంక వద్ద 5.57 టీఎంసీలు, చోడవరం వద్ద 3.5 టీఎంసీలను నిల్వ చేసుకోవచ్చన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే డెల్టా, దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలకు నీటి కొరత ఉండదని వివరించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ఏమిలాభం? పక్కనున్న తెలంగాణలో డబుల్ ఇంజిన్ గవర్న మెంటు లేకపోయినా ఆ రాష్ట్ర ప్రభుత్వం మొక్క జొన్నను మద్దతు ధరకు కొంటోందని, ఏపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎందుకు కొనలేకపోతోందని సింహాద్రి రమేష్‌బాబు ప్రశ్నించారు. మద్దతు ధర, కొనుగోలు ధర మధ్య వ్యత్యాసాన్ని చెల్లించా లని కేంద్రానికి సీఎం చంద్రబాబు 40 రోజుల వ్యవధిలో రెండు సార్లు లేఖ రాశారని, వాటి వల్ల లాభం ఏమిటని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు -
దుర్గమ్మ భక్తుల కోసం వాటర్ ప్లాంట్ వితరణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తుల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకర్‌బాబు, శ్రీదేవి దంపతులు దేవస్థానానికి అందచేశారు. ఘాట్‌రోడ్డులో సుమారు రూ.లక్ష వ్యయంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను దాత వెలగపూడి శంకర్‌బాబు దంపతులు గురువారం పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. సుమారు 300 లీటర్ల సామర్ధం కలిగిన ఈ వాటర్‌ప్లాంట్ ద్వారా భక్తులకు స్వచ్చమైన తాగునీరు అందుబాటులోకి రానున్నదని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు సేవ చేసే భాగ్యం తన కుటుంబానికి కలిగినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కోడూరు: రొయ్యల చెరువుల వద్ద పని చేసే వ్యక్తి విద్యుత్‌ఘాతంలో మృతి చెందిన ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ చాణిక్య తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని రామకష్ణాపురం శివారు ఇరాలి గ్రామ సమీపంలోని రొయ్యల చెరువుల వద్ద అదే గ్రామానికి చెందిన పేరుబోయిన బాలరామమూర్తి (39) పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే గురువారం కూడా చెరువు వద్ద పని వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అకాలవర్షం కారణంగా వీచిన గాలులకు విద్యుత్‌తీగలు గట్టుపై పడడంతో ఆ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు భార్య నాగలక్ష్మి ఫిర్యాధు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
తల్లిదండ్రుల చెంతకు చిన్నారి
త్రినేత్రిగా చిన్నారికి నామకరణం కృష్ణలంక(విజయవాడతూర్పు): మానవత్వంతో పసికందును రక్షించిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు బుధవారం తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. చిన్నారికి త్రినేత్రి అని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు నామకరణం చేశారు. గత నెల 11వ తేదీన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణలంక రైతుబజార్ వెనుకవైపు జాతీయ రహదారి పక్కనే ఉన్న బాత్రూంలో పాలకొల్లు ప్రాంతానికి చెందిన ఒక మహిళ పసికందును ప్రసవించి అక్కడే వదిలి వెళ్లిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు వెంటనే స్పందించి చిన్నారిని రక్షించి సంరక్షణ కేంద్రానికి తరలించారు. సీసీ పుటేజీ ఆధారంగా పాప తల్లిదండ్రులను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం చిన్నారిని వారి చెంతకు సురక్షితంగా చేర్చారు. పోలీసుల స్పందనను అభినందిస్తూ పాలకొల్లుకు చెందిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ పోలీస్ కమిషనర్‌ను కలిశారు. ఈ సంద ర్భంగా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లా డుతూ.. మూడో కన్నులా పనిచేసిన సీసీ కెమెరాల సహాయంతో కుటుంబ సభ్యులను గుర్తించిన నేపథ్యంలో చిన్నారికి త్రినేత్రి అని పేరు పెట్టినట్లు తెలిపారు. సాంకేతికత కేవలం నేరస్థులను పట్టుకోవడానికే కాకుండా ప్రాణాలను కాపాడటానికీ ఉపయోగపడుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సామాజిక బాధ్యతగా తమ ఇళ్లు, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కృష్ణకాంత్ పటేల్, కృష్ణలంక ఇన్స్పెక్టర్ నాగరాజు, నల్లి రాజేష్, చిన్నారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి
పామర్రు: ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్ కుమార్ అన్నారు. పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం చోరగుడి, కూడేరు శివారు సమితగుంట గ్రామంలో మద్దతు ధర లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న మొక్కజొన్న రైతులను పార్టీ నాయకులతో కలిసి బుధవారం పరామర్శించారు. ఆరబోసిన మొక్కజొన్నను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హామీల అమలేది? అనంతరం అనిల్‌కుమార్ మాట్లాడుతూ కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు రైతులు, ప్రజలకు హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక రైతులను పట్టించుకోకపోవడం ఏమిటని నిలదీశారు. ఎన్నికల ముందు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారని, ఇది నెరవేరిన దాఖలాలు లేవని చెప్పారు. గత ఖరీఫ్ సీజన్లో ధాన్యం బస్తా మద్దతు ధర రూ.1,775 ఉండగా.. రైతులు మాత్రం రూ.1000 నుంచి రూ.1,300లకే తెగనమ్ముకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు మొక్కజొన్న పంటకు మద్దతు ధర రూ.2,300 ఉండగా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులు రూ.1,200 నుంచి రూ.1,300 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని తద్వారా రైతులు నష్టపోతున్నారన్నారు. పార్టీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి మందా శ్రీనివాస్‌రెడ్డి, పామర్రు నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు మర్రి బాబూరావు, పమిడిముక్కల మండల పార్టీ అధ్యక్షుడు యలమంచిలి గణేష్, వలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోలిమెట్ల కృష్ణ, వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్, మండల కోఆప్షన్ సభ్యులు అలీ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ -
హోరాహోరీగా ఎడ్లబండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి జరిగిన ఒంగోలు జాతి సీనియర్ విభాగం ఎడ్ల బండ లాగుడు పోటీలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. మంగళవారం రాత్రి నిర్వహించిన న్యూ కేటగిరీ విభాగం ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీల్లో 20 నిమిషాల వ్యవధిలో 1.450 టన్నుల బరువును పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన మంగు రమాదేవి ఎడ్ల జత 4,050 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానం, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండబాలవారిపాలెంనకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షిత, పోతిన లక్షిత్కి చెందిన ఎడ్ల జత 4,006 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలకు చెందిన పిన్నెబోయిన సతీష్ కుమార్ యాదవ్, పల్నాడు జిల్లా రేపల్లెకు చెందిన సుఖవాసి సతీష్‌బాబు ఎడ్ల జత 3,947 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురానికి చెందిన కొప్పుల హేమలతారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత 3,750 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలిచినట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. విజేతల ఎడ్ల జత యజమానులకు వరుసగా రూ.50 వేలు, రూ.45 వేలు, రూ.40 వేలు, రూ.35 వేల నగదు బహుమతి, జ్ఞాపికను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు అందజేశారు. -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయండి
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వేసవి నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి చెప్పారు. స్థానిక ఏపీసీపీడీిసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ పరిధిలోని జిల్లాల ఎస్ఈలు, ఈఈలతో సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు, పీఎం సూర్య ఘర్ పథకం అమలు తీరు గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ మురళీ కృష్ణ యాదవ్, డైరెక్టర్(ప్రాజెక్టు) డైరెక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. రవాణా శాఖ ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు లబ్బీపేట(విజయవాడతూర్పు): రవాణాశాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న పలువురికి సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. ఈ మేరకు బుధవారం ప్రాంతీయ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వడ్డే సుందర్ ఉద్యోగోన్నతి పత్రాలు అందజేశారు. కాగా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉండటంతో సిబ్బందిపై పనిభారం పెరిగిందని, అర్హతగల జూనియర్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు కల్పించాలని ఇటీవల రవాణాశాఖ ఉద్యోగులు సంఘం ప్రతినిధులు కలిసి విన్నవించారు. వారి వినతి మేరకు అర్హత గత జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. దీంతో అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. రాజబాబు తదితరులు ఆర్‌జేటీసీ సుందర్‌ను కలిసి అభినందించారు. -
నిలిపి ఉంచిన ఆటోలో మృతదేహం
చల్లపల్లి: నిలిపి ఉంచిన ఆటోలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రెండు రోజుల తరువాత బుధ వారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. చల్లపల్లి ప్రధాన సెంటర్లో బందర్ రోడ్డులోని పెట్రోల్ బంక్ పక్కన వీధిలో మరమ్మతులకు గురైన ఆటో ఒకటి కొద్దిరోజులుగా నిలిపి ఉంది. బుధవారం ఉదయం ఆ ఆటోలో ఈగలు ముసురుతుండటంతో కొందరు దగ్గరకు వెళ్లి చూడగా ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ దంపనబోయిన దుర్గాంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడిని చల్ల పల్లి మండలం పురిటిగడ్డ కాలనీకి చెందిన ప్రయివేటు ఎలక్ట్రీషియన్ మత్తి శోభనాద్రి(45)గా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శోభనాద్రి తాగుడుకు బానిస కావటంతో అతని భార్య కొంత కాలంగా దూరంగా ఉంటోంది. ఈ నెల నాలుగో తేదీ రాత్రి 11 గంటల సమయంలో శోభనాద్రి పెట్రోల్ బంకు వద్ద రోడ్డుపై అటూ ఇటూ తిరగడం, ఆటోలోకి వెళ్లిన తరువాత బయటకు రాకపోవడం సమీపంలోని సీసీటీవీ పుటేజీలో రికార్డయింది. ఎస్ఐ దుర్గాంజనేయులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహం ఉన్న ఆటో ఆటోలో శోభనాద్రి మృతదేహం -
గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎం.ఎస్.బేగ్ అధ్యక్షతన కేంద్ర గ్రంథాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 మండలాల్లో గ్రంథాలయాల అభివృద్ధి, ఆధునికీరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను సభ్యులు ఆమోదించారు. జిల్లాలోని అనేక శాఖా గ్రంథాలయ భవనాలకు భవనాలకు రంగులు వేయడానికి నిధులు కేటాయించాలని నిర్ణయించారు. బంటుమిల్లిలో కొత్త శాఖా గ్రంథాలయ భవన నిర్మాణానికి కొమ్మారెడ్డి బ్రదర్స్ 406.5 చదరపు గజాల భూమిని దానం చేయడానికి అంగీకరించగా, ఆ భూమిని గ్రంథాలయ సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడానికి సుమారు రూ.1.50 లక్షలు ఖర్చు చేయడానికి కమిటీ ఆమోదం తెలిపింది. డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం ఉమ్మడి జిల్లా పరిధిలోని 109 శాఖ గ్రంథాలయాల కోసం ప్రతి గ్రంథాలయానికి రెండు సీసీ కెమెరాలు, ఒక కంప్యూటర్ సమకూర్చాలని నిర్ణయించారు. ఇప్పటికే 70 గ్రంథాలయాలకు కంప్యూటర్లు ఉండగా, మిగిలిన గ్రంథాలయాల కోసం 60 కంప్యూటర్లు కొనుగోలు చేయాలని, వాటి నిర్వహణ కోసం ఆపరేటర్లను నియమించాలని నిర్ణయించారు. గ్రంథాలయాల ఆధునికీకరణకు సంబంధిం రూ.5 లక్షల లోపు పనులను జిల్లా స్థాయిలోనే నామినేషన్ పద్ధతిలో చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. గ్రంథాలయాలను ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తున్న విద్యాసంస్థలుగా పరిగణించి, ప్రాపర్టీ టాక్స్‌ను సెక్షన్ 80సీ ప్రకారం రద్దు చేయాలని, ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరాలని నిర్ణయించారు. పాతబడిన, ఉపయోగం లేని పుస్తకాలను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడంతో పాటు, దెబ్బతిన్న ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలను తొలగించేందుకు అనుమతి కోరాలని నిర్ణయించారు. పాఠకుల అభ్యర్థన మేరకు ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచాలని ఈ సంద ర్భంగా తీర్మానించారు. భవనాల మార్పులు, సౌకర్యాలు.. ఎలమరు శాఖ గ్రంథాలయ భవనం నిర్మాణ పనుల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న పుస్తకాలను తాత్కాలికంగా వేరే భవనానికి తరలించేందుకు సభ్యులు ఆమోదం తెలిపారు. శిథిలావస్థలో ఉన్న మధురానగర్ శాఖ గ్రంథాలయాన్ని వేరే భవనానికి మార్చా లని నిర్ణయించారు. అవసరమైన గ్రంథాలయాల్లో ఎయిర్ కండీషనర్లు ఏర్పాటు చేయడానికీ కమిటీ ఆమోదం తెలిపింది. అజెండాలోని పలు అంశాలను అధ్యక్షుల అనుమతితో సభ్యులు సమగ్రంగా చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రవికుమార్ వయోజన విద్య డీడీ హాజీబేగ్, సమాచార పౌర సంబంధాలశాఖ డీడీ ఎం.వెంకటేశ్వర ప్రసాద్, విద్యాశాఖ ఏడీ విద్యాలత, ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ డీసీఆర్బీ అధికారి ఉమర్ అలీ, డీఎల్పీఓ రజావుల్లా, ఎన్టీఆర్ డీపీఓ కార్యాలయం ఏఓ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కమ్మేస్తున్న కాలుష్యం!
పెరుగుతున్న వాహనాలు.. తగ్గుతున్న పచ్చదనం లబ్బీపేట(విజయవాడతూర్పు): పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందా.. అకాల వర్షాలకు కారణం అదేనా అంటే అవుననే అంటున్నారు పర్యావరణ నిపుణులు. రెండేళ్ల కిందట వచ్చిన కుండపోత వర్షాలకు బెజవాడ సగం మునిగింది. ఇప్పుడు కూడా కాలంతో పరిమితం లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అందుకు కారణంగా అధిక కాలుష్య ప్రభావమేనని చెబుతున్నారు. ఢిల్లీ, చైన్నె, ముంబయి, హైదరాబాద్ నగరాల తర్వాత బెజవాడలోనే వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని.. దీంతో భూమిపై నుంచి 15 మీటర్ల వరకూ గాలిలో వాస్తవంగా ఉండాల్సిన ఆక్సిజన్ కంటే తక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. దీంతో మనిషికి సరిపడా ఆక్సిజన్ అందక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలా పీల్చినప్పుడు విషవాయువులు అధికంగా శరీరంలోకి చేరి వ్యాధులు వ్యాపిస్తాయని.. ఊపిరితిత్తులు, గుండె, న్యూరోలాజికల్, నేత్ర సంబంధ వ్యాధులతో పాటు క్యాన్సర్‌కు ఇవి మూలకారణంగా మారుతున్నాయని హెచ్చరిస్తున్నారు. 600 రెట్లు పెరిగిన వాహనాలు.. ఆరోగ్యకరమైన నగరంలో ప్రతి లక్ష మంది జనాభాకు 5వేల వాహనాలు ఉండాలి. అంతకు మించి ఉంటే గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలి. ఈ లెక్కన విజయవాడ జనాభా 12లక్షలు కాగా, వాహనాలు 60వేలే ఉండాలి. కానీ ప్రస్తుతం 7 లక్షల వాహనాలు ఉన్నట్లు అంచనా. వీటిలో ట్రాన్స్‌పోర్టు వాహనాలు 97వేలు, మోటారు సైకిళ్లు అత్యధికంగా 5.21లక్షలు. నగరం మీదుగా జాతీయ రహదారిపై రోజుకు 40వేల వరకూ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నగరంలో సిటీ బస్సుల్లో అధికశాతం 10 లక్షలకు పైగా కిలోమీటర్లు తిరిగినవే ఉన్నాయి. ఇలా కాలం చెల్లిన బస్సులు, ఇతర వాహనాల నుంచి సల్ఫర్ డై ఆకై ్సడ్, నైట్రిక్ ఆకై ్సడ్, కార్బన్ మోనాకై ్సడ్, కార్బన్ డై ఆకై ్సడ్ వెలువడుతోంది. వ్యర్థం.. అనర్థం.. విజయవాడలో రోజుకు 600 మెట్రిక్ టన్నుల తడి–పొడి చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను రీ సైక్లింగ్ చేసేందుకు సైంటిఫిక్ డంపింగ్ యార్డులు లేవు. ప్రస్తుతం చెత్త సేకరణ కూడా సరిగ్గా జరగడం లేదు. ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్వగట్లు వెంబడి పడేసి ఒకేసారి కాల్చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మిథేన్, బొగ్గు వాయువులు, కార్బన్ డై ఆకై ్సడ్ వంటివి గాలిలో కలుస్తున్నాయి. దీంతో గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గి ఇతర వాయువులు పెరుగుతున్నాయి. బాబోయ్ హాట్ ఐల్యాండ్.. విజయవాడ రానున్న రోజుల్లో హాట్ ఐల్యాండ్‌గా మారే ప్రమాదం ఉన్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. కొద్దికాలంగా నగరంలో ఎక్కడా భారీ వృక్షాలు కనిపించడం లేదు. విశాలమైన పార్కులు కుచించుకుపోయి పూల మొక్కలకే పరిమితం అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. వాతావరణ సమతుల్యత దెబ్బతిని ఆకస్మికంగా భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. విజయవాడలో 20 కిలోమీటర్ల పరిధిలో బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో దాదాపు వృక్షాలన్నీ కూల్చేశారు. ఎండ తీవ్రతకు వచ్చే ఉష్ణాన్ని ఇంటి శ్లాబ్, సీసీ రోడ్లు పీల్చుకుని, రాత్రిళ్లు వేడిని తిరిగి విడుదల (రీ రేడియేషన్) చేస్తున్నాయి. దీంతో రాత్రి ఉష్ణోగ్రత సాధారణంగా 28 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, 32 నుంచి 34 డిగ్రీల స్థాయిలో ఉంటోంది. జనసాంధ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో విజయవాడ ఒకటి. కానీ హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్ తరహాలో హరిత వనాలు ఇక్కడ లేవు. కాలువల సుందరీకరణ జరగలేదు. ఇక్కడ పబ్లిక్ వాహనాల కంటే వ్యక్తిగత వాహనాల వినియోగం ఎక్కువగా ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. దీంతో కాలుష్యం కోరలు చాస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 60 శాతం దాటకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. డిస్నీల్యాండ్ లాంటి ప్రాంతంలో హరిత వనాలు అభివృద్ధి చేయాలి. కొండలపై గ్రీనరీ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. – డాక్టర్ తుమ్మల శ్రీకుమార్, పర్యావరణ నిపుణుడు, విజయవాడవాయు కాలుష్యం కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు, పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో పాటు, ఎక్కువ కాలం కాలుష్య ప్రభావానికి గురైన వారిలో జన్యుపరమైన లోపాలు తలెత్త వచ్చు. బ్రెయిన్ స్ట్రోక్‌తో పాటు, మెదడుపై ప్రభావం చూపి ఇతర సమస్యలు వస్తాయి. చర్మ వ్యాధులతో పాటు లంగ్స్ దెబ్బతినడం, హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చు. కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మాస్కులు ధరించడం ఉత్తమం. – డాక్టర్ దేవనబోయిన అనిల్‌కుమార్, న్యూరాలజిస్ట్, విజయవాడ -
పెరిగిన గ్యాస్ ధరలతో చిరు వ్యాపారులు కుదేలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పెంచిన గ్యాస్ ధరలతో చిరు వ్యాపారులు కుదేలయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య అన్నారు. గ్యాస్ ధర పెంపునకు నిరసనగా సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో కాళేశ్వరరావు మార్కెట్, పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం ఆందోళన చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో నెలవారీ బడ్జెట్ పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అప్పులు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర పెంపుతో పరోక్షంగా పేద మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే, ఏమాత్రం కనికరం లేకుండా గ్యాస్ ధరలు అమాంతం పెంచడం ప్రజలను వంచించడమేనని కేంద్రాన్ని దుయ్యబట్టారు. ప్రస్తుతం విజయవాడలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,251.50కి చేర్చారన్నారు. దీనివల్ల హోటళ్లు, ఇతర చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ‘అచ్చే దిన్’ అని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ సామాన్యుడికి ‘చచ్చే రోజులు’ తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శివర్గ సభ్యులు పంచదార్ల దుర్గాంబ, కొట్టు రమణారావు, కార్యవర్గ సభ్యులు ఇ.రమణబాబు, తూనం వీరయ్య, ఓర్సు భారతి, నజీర్, నాయకులు బండల రాజు, కంచర్ల నాగేశ్వరరావు, కరోతి వెంకటేశ్వరరావు, బెవర శ్రీనివాసరావు, బుర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కౌలు రైతు భార్య ఆత్మహత్యాయత్నం
పెడన: మండలం పరిధిలోని చెన్నూరు గ్రామానికి చెందిన కౌలు రైతు యర్రంశెట్టి నాగరాజు భార్య యర్రంశెట్టి వెంకటలక్ష్మి మంగళవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. గ్రామస్తుల కథనం మేరకు.. భీమవరానికి చెందిన కె.వరలక్ష్మికి చెందిన సుమారు 23 ఎకరాలను నాగరాజు కొన్ని సంవత్సరాలుగా కౌలుకు సాగుచేస్తున్నాడు. ఈ పొలాలు పక్కనే చేపల చెరువులు చేస్తున్నారు. దీంతో వరలక్ష్మి తన 23 ఎకరాలను కూడా చేపల చెరువులకు ఇచ్చేందుకు ఆసక్తి చూపించారు. పక్కనే చేపల చెరువులు వస్తే వరి పొలాలను బీడు పెట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో నాగరాజును సంప్రదించి పరిస్థితి వివరించినట్లు సమాచారం. అయితే తాను ఈ ఏడాది కూడా కౌలుకు చేస్తానని, వచ్చే ఏడాది నుంచి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవాలని ఆమెను నాగరాజు కోరాడు. ఈ విషయమై పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరుగుతున్నాయని సమా చారం. ఈ క్రమంలో తనకు పొలం అప్పగించ కుండా చెరువులుగా చేయడానికి వెళ్లిన వారిపై నాగరాజు దాడికి దిగుతున్నాడని, తనకు కౌలు డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని మూడు రోజుల క్రితం పెడన పోలీస్‌స్టేషన్‌లో నాగురాజుపై వరలక్ష్మి కేసు పెట్టింది. కేసు విచారణ నిమిత్తం నాగరాజును మంగళవారం సాయంత్రం పెడన పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. గ్రామపెద్దలతో కలిసి నాగ రాజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఈ విషయం తెలిసిన అతని భార్య వెంకటలక్ష్మి ఇంటి వద్ద పురుగుముందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం. -
రైతులు సంఘటితమైతే అద్భుత ఫలితాలు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ తోట్లవల్లూరు: రైతులు సంఘటితంగా ముందుకు సాగి దళారీ వ్యవస్థను అధిగమించగలిగితే అద్భుత ఫలితాలు సాధించొచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పేర్కొన్నారు. మండలంలోని చాగంటిపాడులో ఉద్యానశాఖ సహకారంతో శ్రీవిఘ్నేశ్వర రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యాన రూ.62 లక్షలతో ఏర్పాటు చేసిన పసుపు, కారం, కారప్పొడుల ప్రాసెసింగ్ యూనిట్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యాన, వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ బాలాజీ సందర్శించారు. అరటి మార్కెట్లో విక్రయాల తీరును తెలుసుకున్నారు. రైతులు ఐకమత్యంగా ఉంటూ తాము పండించిన పంట ఉత్పత్తులను మధ్యవర్తులు లేకుండా అమ్ముకోగలిగితే మంచి లాభాలు వస్తాయని, దీనికి గుజరాత్‌లోని అమూల్ సంస్థను ఉదాహరణగా తీసుకోవచ్చని సూచించారు. శ్రీవిఘ్నేశ్వర రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ నిర్వహణ, అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు తమ పంట ఉత్పత్తుల అమ్మకాల కోసం ఎఫ్పీఓలు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వ పరంగా తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులకు డివిడెండ్లు పంపిణీ చేశారు. నాబార్డు ఏజీఎం మిలేన్, జిల్లా వ్యవసాయశాఖాధికారి పద్మావతి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సీహెచ్.నరసింహులు, జిల్లా ఉద్యాన శాఖాధికారి జె.జ్యోతి, డీఆర్ డీఏ పీడీ హరిహరనాథ్, మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజు, తహసీల్దార్ కుసుమకుమారి, ఎంపీడీఓ రవికాంత్, నేస్తం ఎన్జీఓ సంస్థ సీఈఓ సురేష్, శ్రీవిఘ్నేశ్వర ఎఫ్‌పీఓ సీఈఓ కొల్లి స్వర్ణపూజిత, డైరెక్టర్లు కొల్లి కేశవచంద్రమోహన్రెడ్డి, జొన్నల రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయాల సందర్శన చాగంటిపాడు, పెనమకూరు గ్రామ సచివాలయాలను కలెక్టర్ బాలాజీ సందర్శించారు. ఆయా సచివాలయాలను పరిశీలించి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. చాగంటిపాడు మండల పరిషత్ పాఠశాలను బాలాజీ సందర్శించారు. అక్కడ గ్యారంటరీ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (జీఎఫ్ఎల్ఎన్) కార్యక్రమం అమలుపై ఆరా తీశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, వలంటీర్లతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. స్ట్రీమ్‌లైన్ విద్యార్థుల అభ్యాసన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పెనమకూరులో డ్రోన్ ద్వారా విత్తనాలు చల్లే విధానాన్ని కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. ఎంఈఓలు వెంకటేశ్వరరావు, సురేష్, డెప్యూటీ ఎంపీడీఓ శాంసన్బాబు, ఈఓపీ ఆర్డీ వెంకటేశ్వరమ్మ, ఏఓ గూడపాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్లీ వ్యథ!
చెదిరిన కల.. విజయవాడలోని 27వేల కుటుంబాల ఆశలు గల్లంతు గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో మాకు ఇంటి స్థలం కేటాయించడంతో ఎంతో సంతోషించాం. కానీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో మాకిచ్చిన స్థలాలు రద్దు చేశారు. వాటి స్థానంలో మరోచోట ఇస్తామంటూ అప్పట్లో హామీ ఇచ్చారు. రెండేళ్లు గడుస్తున్నా నేటికీ ఆ హామీ నెరవేరలేదు. మాకు సొంతిళ్లు కలగానే మిలిలేలా ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం స్పందించాలి. లబ్ధిదారులకు స్థలాలతో పాటు ఇల్లు కట్టుకునేందుకు సహకరించాలి. – జె. కోటేశ్వరి, కృష్ణలంక సాక్షి ప్రతినిధి, విజయవాడ: పేదలపై చంద్రబాబు సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల సమయంలో పేదలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని ఊదరగొట్టి.. అధికారంలోకి రాగానే.. రాజధానిలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై కత్తి కట్టింది. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని సరికొత్త భాష్యం చెప్పింది. అమరావతిలో పేదలు ఉండకూడదనే పంతాన్ని నెగ్గించుకొంది. గత నెలలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పేదలకు కేటాయించిన భూములను రెవెన్యూ శాఖ నుంచి తిరిగి సీఆర్డీఏకు అప్పగించాలని నిర్ణయించింది. దీంతో పేదల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. పైగా ఈ లబ్ధిదారులకు టిడ్కో గృహాలు నిర్మించి ఇస్తామని హామీనిచ్చి వారిని మభ్యపెడుతోంది. అధికారం చేపట్టి రెండేళ్లు గడిచినా ఈ అంశం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు మారింది. విజయవాడ నగరంలోని 27,031 మంది పేదలతో పాటు గుంటూరు జిల్లాలోని కొంతమంది లబ్ధిదారులకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను 2023 మే నెలలో మంజూరు చేసింది. సీఆర్డీఏ పరిధిలోని అనంతవరం, కురగల్లు, మందడం, నిడమర్రు, పిచ్చుకలపాలెం గ్రామాల పరిధిలో మొత్తం 737 ఎకరాల విస్తీర్ణంలో ఆర్–5 జోన్ పేరిట 14 లేఅవుట్లను సిద్ధం చేసి, జియో ట్యాగింగ్ పూర్తి చేసింది. ఆ లేఅవుట్లను చదును చేసి, అంతర్గత రోడ్లు వేయడంతోపాటు మౌలిక వసతులకు సంబంధించిన పనులను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి గృహ నిర్మాణాలకు అనుమతులు తీసుకొచ్చి, ఇళ్లకు శంకుస్థాపన సైతం చేసింది. అయితే రాజధాని రైతులు కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు ఫుల్ బెంచ్ స్టే ఇవ్వడంతో నిర్మాణాలకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. దానిని తొలగించాలని గత ప్రభుత్వం పేదల తరఫున సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ దశలో ప్రభుత్వం మారడంతో.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరావడంతోనే పేదలపైన కక్షపూరితంగా వ్యవహరించింది. సీఆర్డీఏ పరిధిలో ఇచ్చిన ఇంటి స్థలాల పట్టాలు రద్దు చేసింది. పేదల కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించింది. మాకు కూడా స్థలం వచ్చింది. దీంతో సొంత ఇల్లు నిర్మించుకోవచ్చని చాలా సంబరపడ్డాం. కానీ మా ఆశలు అడియాశలే అయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం మాకిచ్చిన స్థలాలను రద్దు చేసింది. మరో ప్రాంతంలో ఇస్తామని హామీ ఇచ్చారే కానీ, ఇప్పటి వరకూ వాటి ఊసే లేదు. ఎప్పుడిస్తారో తెలియడం లేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. మాలాంటి వారి సొంతింటి కలను నిజం చేయాలి. – పంతాల విజయకుమారి, కృష్ణలంక గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాల స్థానంలో ఎక్కడి వారికి అక్కడే పేరుతో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని లబ్ధిదారులకు టిడ్కో గృహాలు నిర్మించి ఇస్తామని కూటమి ప్రభుత్వం పేదలను మభ్య పెట్టింది. ఎన్టీఆర్ జిల్లాలో 260, గుంటూరు జిల్లాలో 210 ఎకరాలు టిడ్కో గృహా నిర్మాణాల కోసం స్థలం అవసరం అవుతోందని, స్థలాన్వేషణ చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది. అయితే వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. గత ప్రభుత్వం ఆరు దశల్లో జల్లెడ పట్టి, అర్హులైన పేదలను గుర్తించింది. చంద్రబాబు సర్కారు ఇంటి పట్టాలు మంజూరైన జాబితాలను పరిశీలించి, అర్హులను గుర్తిస్తామంటూ చెప్పినప్పటికీ ఆ దిశగా ఏ మాత్రం అడుగులు పడకపోవటంతో, ఇళ్ల స్థలాలు మంజూరైన పేదలు చంద్రబాబు సర్కారు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్ సందర్శన
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లిలోని బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఎన్టీఆర్ కలెక్టర్ జి.లక్ష్మీశ బుధవారం సందర్శించారు. ఇటీవల నిర్వహించిన కొండపల్లి బొమ్మల ఉత్సవం విజయవంతమైన నేపథ్యంలో హస్తకళాకారులు సరికొత్త ఉత్సాహం, వినూత్న డిజైన్లతో కళాత్మక వైభవాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన కొనియాడారు. కొండపల్లి బొమ్మల ఉత్సవంపై కళాకారులతో ముచ్చటించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. హస్తకళాకారుల ప్రగతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మార్కెట్ విస్తరణ, సాంకేతిక సహాయం, ప్రోత్సాహం అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు. కొండపల్లి బొమ్మలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడంలో అందరూ సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. మురుగునీటి శుద్ధీకరణకు చర్యలు పటమట(విజయవాడతూర్పు): విజయవాడలోని మురుగునీటిని శుద్ధి చేసేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు యూనిడో ప్రతినిధులకు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర వివరించారు. బుధవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్‌లోని సమావేశపు గదిలో యూనిడో ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనిడో నిధులతో చేపట్టిన రామలింగేశ్వర నగర్లో 20ఎంఎల్డీ సామర్థ్యం గల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, సింగ్‌నగర్, జక్కంపూడి, రామలింగేశ్వర నగర్లో గల గ్యాస్ జనరేషన్ ప్లాంట్ గురించి సమీక్షించారు. జరుగుతున్న పనులను త్వరగా పూర్తిచేసి, త్వరగా నగరంలోని వాడుక నీరు మొత్తం శుద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చీఫ్ ఇంజినీర్ ఇన్చార్జ్ పి.సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సురేఖ, యూనిడో ప్రతినిధులు డాక్టర్ ఎంపీ సింగ్, దీపిక, ఎన్యూ గౌరవ వర్మ, ఇంజినీరింగ్ సిబ్బంది ాల్గొన్నారు. కొత్త ఆర్డీవోల ప్రమాణ స్వీకారం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నూతన రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీవో)గా వెన్నెల శ్రీను బుధవారం నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్డీవోకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. నందిగామ ఆర్డీవోగా అనిల్‌కుమార్ నందిగామ రూరల్: డివిజన్లోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఆర్డీవో అనిల్‌కుమార్ పేర్కొన్నారు. నందిగామ ఆర్డీవో కార్యాలయంలో బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆర్డీవోగా బాధ్యతలు నిర్వహించిన పోసిబాబు అటవీశాఖకు బదిలీపై వెళ్లగా.. ఆయన స్థానంలో స్కిల్ డెవలప్మెంట్లో పని చేస్తున్న అనిల్ కుమార్ ఇక్కడకు వచ్చారు. హనుమజ్జయంతికి ఏర్పాట్లు తాడేపల్లి రూరల్: హనుమజ్జయంతి వేడుకలను ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు బుధవారం పేర్కొన్నారు. తాడేపల్లి పట్టణ పరిధి సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మూడు రోజులు కైంకర్యాలు జరుగుతాయని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. -
భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి
కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు కోనేరుసెంటర్(మచిలీపట్నం): పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లలు భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు ఆకాంక్షించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం ఎస్పీ తన కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి చదివితే విజయాలు దరి చేరతాయన్నారు. ప్రజల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు నిమగ్నమైన ఉండే సిబ్బంది కుటుంబాల్లోని పిల్లలు ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధించటం ఎంతో గర్వంగా ఉందన్నారు. అందుకు పిల్లల తల్లిదండ్రులందరినీ జిల్లా పోలీసు శాఖ తరపున అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లితండ్రులతో పాటు జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ సత్యకిషోర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
భార్య వివాహేతర సంబంధం.. కిరాతకంగా హత్య చేసిన భర్త!
కృష్ణా జిల్లా: భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని తెలుసుకుని ఆమెను అతి కిరాతకంగా ఇనుప రాడ్డుతో మోది హతమార్చిన ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని గుడివాడ డీఎస్సీ పి.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం డీఎస్పీ నిందితుల వివరాలను వెల్లడించారు. దిమ్మిటి ప్రసన్నకుమారి(30) తన భర్త మురళీ కృష్ణతో వివాదాల కారణంగా భర్తను వదిలేసి మరో వ్యక్తితో పామర్రులో సహజీవనం చేస్తోంది. తనతో కాపురం చేయకుండా కుటుంబ పరువు తీస్తున్నట్లుగా భావించిన మురళీకృష్ణ తన అన్నదమ్ములను వెంట బెట్టుకుని ఈనెల 4వ తేదీ ఉదయం రెండు బైక్‌లపై పామర్రు వచ్చాడు. ప్రసన్నకుమారి ఉంటున్న ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి ఆమెను ఇనుప రాడ్డుతో మోది చంపాడు.అనంతరం నిందితులు అక్కడ నుంచి పారిపోతూ దుస్తులు, ఆమెను చంపడానికి ఉపయోగించిన ఇనుపరాడ్డును గుడివాడ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన పోదలలో పడవేసి వెళ్లి పోయారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి గోళ్ల రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మీప్రసన్న కుమారిని తన అల్లుడు మురళీ కృష్ణ, అన్నయ్య రాంబాబు, మరో తమ్ముడు నాగేశ్వరరావు అలియాస్ చంటి తన అన్నయ్య రాంబాబు కుమారుడు మైనర్ అయిన మరో వ్యక్తితో కలిసి తన కుమార్తెను ఇనుప రాడ్డుతో కొట్టి చంపినట్లుగా ఆ రిపోర్టులో పేర్కొన్నారు.దీనిపై అప్పటి పామర్రు ఇన్‌ఛార్జి గుడివాడ టూ టౌన్ సీఐ హనీష్ కొంది మంది సాక్షులను విచారించగా తదుపరి పామర్రు సీఐగా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్ నాగ ప్రసాద్ విచారణను కొనసాగిస్తూ మరి కొందరు సాక్షులను విచారించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పామర్రు నుంచి గుడివాడ వెళ్లే రోడ్డులో కొత్తూరు దాటిన తర్వాత కొడాలి రామేశ్వరరావు మునగతోట పక్కన నిందితులు వారు దాచిన ఇనుప రాడ్డు బట్టలు వెతుకుతుండగా, పామర్రు సీఐ సీహెచ్ నాగప్రసాద్, ఎస్ఐ కె.శ్రీనివాస్ సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకున్నారు. ఇనుపరాడ్డు, దుస్తులు, వారు వాడిన ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నిందితులను తదుపరి విచారణ కోసం కోర్టులో హాజరు పరుస్తామన్నారు. నిందితులపై రౌడీ షీట్ తెరుస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పామర్రు సీఐ, ఎస్ఐలను ఆయన అభినందించారు. -
వివాహేతర సంబంధానికి చిన్నారి బలి
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): వివాహేతర సంబంధం ముక్కుపచ్చలారని చిన్నారి హత్యకు కారణమైంది. వివాహితతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమె 18 నెలల కుమార్తెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి నిదితున్ని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరం, కోనయ్య చెరువు సమీపంలో నివాసం ఉండే తరుణ్ తాపీ పని చేసుకుంటూ భార్య ఆశాజ్వోతి, ఆరేళ్ల కొడుకు, 18 నెలల కూతురు హర్షితతో కలసి నివాసముంటున్నారు. ఈ క్రమంలో భర్త స్నేహితుడైన కనిజం వంశీతో ఆశాజ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. నెల రోజుల క్రితం ఈ విషయం తెలియడంతో దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆశాజ్వోతి హర్షితను తీసుకుని వెళ్లిపోయింది. నగరంలోని వాంబేకాలనీలోని తన పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి వంశీతో కలసి విజయవాడ, బీఆరీ్టఎస్ రోడ్డు, రామకోటి మైదానం దగ్గరలోని ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుంది. భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన పుట్టింట్లో ఉన్నట్లు చెబుతూ వస్తోంది. గత నెల 24న ఆమె గన్నవరంలోని భర్త ఇంటికి వెళ్ళి తన కొడుకుని కూడా తీసుకు వెళ్లిపోయింది. ఏప్రిల్ 29న పనికి వెళ్లే విషయంలో ఆశాజ్యోతికి వంశీకి మధ్య గొడవ జరిగింది. తీవ్ర కోపానికి గురైన వంశీ ఆడుకుంటున్న చిన్నారి హర్షితను తీవ్రంగా కొట్టాడు. పైకి ఎత్తి బలంగా గోడకేసి కొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం వంశీ అక్కడ నుంచి పరారయ్యాడు. ఆశాజ్వోతి తన భర్తకు ఫోన్ చేసి హర్షిత ఆరోగ్యం బాగోలేదని, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందని చెప్పింది. అనంతరం వీడియో కాల్ చేసి హర్షిత కదలటం లేదని చెప్పింది. దీంతో తరుణ్ తన సోదరుడిని పంపి వారిని తీసుకురమ్మన్నాడు. అప్పటికే ఆశాజ్యోతి ఆటోలో చిన్నారిని తీసుకుని గన్నవరంలోని ఇంటికి వెళ్ళింది. చిన్నారి ఒంటిపై రక్తపు గాయాలు కనిపించడంతో తరుణ్ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో వంశీ తన చెల్లిని కొట్టి హత్య చేసినట్లు కుమారుడు తెలిపాడు. దీంతో పోలీసులు ఆమెను నిలదీయగా అసలు విషయం చెప్పింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎస్‌ఎన్‌పురం పోలీసులకు బదిలీ చేశారు. మంగళవారం వంశీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా...
విద్యార్థుల భవిష్యత్తుతో విద్యాశాఖ ఆడుకుంటోంది. బ్రిడ్జ్ కోర్సు పేరిట ముందస్తు ప్రణాళిక లేకుండా పాఠ్యపుస్తకాలను తీసుకుని పదో తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు చేతిలో పాఠ్యపుస్తకాలు లేకుండా చేశారు. మ్యాపింగ్ పేరుతో విద్యార్థులను దూర ప్రాంతాలకు పంపించడం, పుస్తకాలు లేకుండా చదవమని చెప్పడం వంటి నిర్ణయాలు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనాలు. – అంబటిపూడి సుబ్రహ్మణ్యం, ఫ్యాప్టో జిల్లా చైర్మన్ -
భార్యను హత్య చేసిన భర్త అరెస్టు
పామర్రు: భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని తెలుసుకుని ఆమెను అతి కిరాతకంగా ఇనుప రాడ్డుతో మోది హతమార్చిన ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని గుడివాడ డీఎస్సీ పి.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం డీఎస్పీ నిందితుల వివరాలను వెల్లడించారు. దిమ్మిటి ప్రసన్నకుమారి(30) తన భర్త మురళీ కృష్ణతో వివాదాల కారణంగా భర్తను వదిలేసి మరో వ్యక్తితో పామర్రులో సహజీవనం చేస్తోంది. తనతో కాపురం చేయకుండా కుటుంబ పరువు తీస్తున్నట్లుగా భావించిన మురళీకృష్ణ తన అన్నదమ్ములను వెంట బెట్టుకుని ఈనెల 4వ తేదీ ఉదయం రెండు బైక్‌లపై పామర్రు వచ్చాడు. ప్రసన్నకుమారి ఉంటున్న ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి ఆమెను ఇనుప రాడ్డుతో మోది చంపాడు. అనంతరం నిందితులు అక్కడ నుంచి పారిపోతూ దుస్తులు, ఆమెను చంపడానికి ఉపయోగించిన ఇనుపరాడ్డును గుడివాడ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన పోదలలో పడవేసి వెళ్లి పోయారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి గోళ్ల రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మీప్రసన్న కుమారిని తన అల్లుడు మురళీ కృష్ణ, అన్నయ్య రాంబాబు, మరో తమ్ముడు నాగేశ్వరరావు అలియాస్ చంటి తన అన్నయ్య రాంబాబు కుమారుడు మైనర్ అయిన మరో వ్యక్తితో కలిసి తన కుమార్తెను ఇనుప రాడ్డుతో కొట్టి చంపినట్లుగా ఆ రిపోర్టులో పేర్కొన్నారు. దీనిపై అప్పటి పామర్రు ఇన్‌ఛార్జి గుడివాడ టూ టౌన్ సీఐ హనీష్ కొంది మంది సాక్షులను విచారించగా తదుపరి పామర్రు సీఐగా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్ నాగ ప్రసాద్ విచారణను కొనసాగిస్తూ మరి కొందరు సాక్షులను విచారించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పామర్రు నుంచి గుడివాడ వెళ్లే రోడ్డులో కొత్తూరు దాటిన తర్వాత కొడాలి రామేశ్వరరావు మునగతోట పక్కన నిందితులు వారు దాచిన ఇనుప రాడ్డు బట్టలు వెతుకుతుండగా, పామర్రు సీఐ సీహెచ్ నాగప్రసాద్, ఎస్ఐ కె.శ్రీనివాస్ సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకున్నారు. ఇనుపరాడ్డు, దుస్తులు, వారు వాడిన ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నిందితులను తదుపరి విచారణ కోసం కోర్టులో హాజరు పరుస్తామన్నారు. నిందితులపై రౌడీ షీట్ తెరుస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పామర్రు సీఐ, ఎస్ఐలను ఆయన అభినందించారు. -
రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై అధికారుల దాడి
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన ప్రభుత్వ రేషన్ బియ్యంపై రెవెన్యూ, పోలీస్, పౌరసరఫరాల శాఖ అధికారులు మంగళవారం సంయుక్తంగా దాడి చేశారు. స్థానిక శాంతినగర్‌లోని అభినందన రియల్ ఎస్టేట్ ప్లాట్లులో అక్రమ రేషన్ బియ్యం నిల్వ చేశారనే సమాచారం అందుకున్న పీడీఎస్ డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, ఎస్ఐ ఎస్ఐ చక్రధర్, సిబ్బందితో కలిసి బియ్యం నిల్వ చేసిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నిల్వ ఉన్న పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వాటిని 550 బస్తాలుగా లెక్క తేల్చారు. అక్కడికి కూతవేటు దూరంలో ఓ రైస్‌మిల్ ఉండటంతో అక్కడ పాలిష్ పట్టి సన్నబియ్యంగా మార్చేందుకు ఇక్కడ నిల్వ చేసినట్లు అనుమానిస్తున్నారు. పేదల వద్ద కేజీల లెక్కన క్వింటా రూ.1000 నుంచి రూ.1200కు కొనుగోలు చేసి పాలిష్ బియ్యాన్ని మార్కెట్లో క్వింటా రూ.5 వేల నుంచి 6వేల వరకు విక్రయిస్తారు. అక్రమంగా 550 బస్తాల బియ్యం నిల్వ చేసిన డేరంగుల గోపిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బియ్యాన్ని గోడౌన్‌కు చేర్చారు. డేరంగుల గోపిపై స్థానిక పోలీస్ స్టేషన్‌తో పాటు జేసీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు డీటీ తెలిపారు. -
పేదల స్థలాలను కబ్జా చేస్తున్నారు!
● జగనన్న కాలనీల లబ్ధిదారులకు అన్యాయం జరిగితే సహించం ● గృహనిర్మాణశాఖ అధికారులపై మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని చిలకలపూడి(మచిలీపట్నం): జగనన్న కాలనీలకు సంబంధించిన లబ్ధిదారులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సుమారు 25వేల మందికి ఇళ్లస్థలాలు ఇచ్చిందన్నారు. అలాగే జిల్లాలో లక్షకు పైగా ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి వారికి అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేసే పాలకులు మారినా వారి హక్కులు మాత్రం మారవన్నారు. కావాలనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేస్తూ, పలు అడ్డంకులు సృష్టించి.. లబ్ధిదారుల్లో ఉత్సాహం లేదని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. కావాలనే జగనన్న కాలనీలను నిర్వీర్యం చేయటంతో పాటు ఆ కాలనీలను అధికార పార్టీ కార్యకర్తలు కబ్జా చేసే విధంగా చూస్తున్నారన్నారు. 2 వేల టన్నుల స్టీల్ తరలించేస్తున్నారు.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం కోసం జిల్లాకు 2 వేల టన్నుల స్టీలు కేటాయించారని, ప్రస్తుత పాలకులు అధికారులతో కుమ్మకై ్క అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఉన్నతాధికారుల ఆర్డర్లు లేకపోయినా హౌసింగ్ పీడీ కావాలనే అప్పటికప్పుడు ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతో తరలిస్తున్నారని.. అప్పటికప్పుడు ఆర్డరు తయారుచేయడానికి ఆయనకు అధికారం ఉందా అని ఆయన ప్రశ్నించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు తరలిస్తున్నామని హౌసింగ్ పీడీ చెబుతున్నారని, అక్కడ గృహాలు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఇక్కడ ఎందుకు నిర్మించుకోవటం లేదన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాలన్నారు. జిల్లాలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం కోసం నిల్వ చేసిన ఇసుక, సిమెంటు, స్టీలు నిల్వలు ఏమయ్యాయో, ఎలా మాయమయ్యాయో నిగ్గు తేలుస్తామని పేర్ని నాని అన్నారు. ప్రతి బాగోతాన్ని బయటకు తీస్తామన్నారు. గుడివాడలో స్టీలు దొంగతనం జరిగిందని అధికారులు చెబుతున్నారని అవి నిజంగానే దొంగతనం జరిగిందా, లేక అమ్ముకున్నారో తేలుస్తామన్నారు. వీటన్నింటిపై తాను త్వరలో ఏసీబీ డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు. ఒక వేళ ఏసీబీ అధికారుల విచారణను కూడా పాలకులు అడ్డుకుంటే నిజాలు నిగ్గు తేల్చేలా హైకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు మట్టా మోహననాంచారయ్య, కేశన నాని, మాచవరపు రాంప్రసాద్, చీలి చక్రపాణి, బొల్లా చక్రవర్తి తదితరులు ఉన్నారు.


