కంటి సంరక్షణపై అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కంటి సంరక్షణపై అవగాహన పెంచుకోవాలి

May 18 2026 9:55 AM | Updated on May 18 2026 9:55 AM

కంటి సంరక్షణపై అవగాహన పెంచుకోవాలి పెనమలూరు: కంటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి ఆధ్వర్యాన ఆదివారం తాడి గడప వందడుగుల రోడ్డులో వైటథాన్‌ రన్‌ నిర్వహించారు. కలెక్టర్‌ బాలాజీ తన పేరు నమోదు చేసుకొని స్వయంగా రన్‌లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ కంటి క్యాన్సర్‌ (రెటీనోబ్లాస్టోమా) వ్యాధిపై అవగాహన కల్పించడానికే వైటథాన్‌ రన్‌ నిర్వహించామని తెలిపారు. దీన్ని సరైన సమయంలో గుర్తించక పోతే చిన్నారులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కంటి క్యాన్సర్‌ కణితి ప్రారంభ దశలో గుర్తించి చికిత్స చేయించుకుంటే ప్రమాదం తప్పుతుందని వివరించారు. రన్‌లో పాల్గొన్న 600 మందితో కంటి క్యాన్సర్‌తో ఏ బిడ్డ మరణించకుండా ఉండటానికి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి హెడ్‌ డాక్టర్‌ అనసూయ గంగూలీ, నెట్‌వర్క్‌ డైరెక్టర్‌ వెంకటకిరణ్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎండీ.జానీ, టీడీపీ నాయకుడు అనుమోలు ప్రభాకరరావు, విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. డప్పు కళాకారులపై మాట్లాడే నైతికత బీజేపీకి లేదు ఉయ్యూరులో భార్యపై భర్త దాడి ఉయ్యూరు: భార్యపై భర్త అమానుషంగా దాడి చేసిన ఘటన ఉయ్యూరులో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కాటూరు రోడ్డులో బొర్రా సాంబయ్య, పుష్ప నివసిస్తున్నారు. కుటుంబ వివాదం నేపథ్యంలో కొంతకాలంగా విడివిడిగా జీవిస్తున్నారు. సాంబయ్య లారీ క్లీనరుగా, పుష్ప ఇళ్లల్లో పని చేసుకుంటున్నారు. ఆదివారం ఉదయం కాటూరు రోడ్డులోని ఓ హోటల్‌ సమీపంలో ఇళ్లల్లో పనిచేసేందుకు వెళ్తున్న పుష్పపై రాయితో, కర్రతో సాంబయ్య దాడి చేయగా తీవ్రంగా గాయపడింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పుష్పను ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రామారావు తెలిపారు. యువతలో క్రీడా స్ఫూర్తి పెరగాలి

ఏపీ డప్పు కళాకారుల సంఘం నేతలు

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): డప్పు కళాకారులు, చర్మకారుల గురించి మాట్లాడే నైతికత బీజేపీకి లేదని డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ ఆనంద్‌ బాబు, ప్రధాన కార్యదర్శి గుండిమెడ క్రాంతి కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం డప్పు కళాకారుల న్యాయమైన డిమాండ్ల పరిష్కరించకుండా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 135వ జయంతి ఉత్సవాల పేరుతో డప్పుల కళాకారులతో ప్రదర్శన చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. డప్పు కళాకారులకు కొత్త పెన్షన్ల నమోదు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని, పింఛన్‌ను రూ.7 వేలకు పెంచి అర్హులైన వారందరికీ పింఛన్‌ ఇవ్వాలని కోరారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంలో డప్పు కళాకారులకు భాగస్వామ్యం కల్పించాలని, అన్ని జిల్లాల్లో డప్పు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ, రైల్వే రవాణా చార్జీల్లో రాయితీ, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని బీజేపీ నాయకులను కోరారు.

ఈగల్‌ ఐజీపీ ఆకే రవికృష్ణ

తాడేపల్లి రూరల్‌: యువతలో క్రీడా స్ఫూర్తి పెరగాలని ఈగల్‌ ఐజీపీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. ఆదివారం తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో ఫ్యాక్టరీ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌–2 క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ డ్రగ్స్‌ వద్దు బ్రో–క్రికెట్‌ ముద్దు బ్రో అనే నినాదంతో క్రీడలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో సుమారు 40 వేల ఈగల్‌ క్లబ్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఒత్తిడిని అధిగమించడానికి, విజయాలను సాధించడానికి క్రీడలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు. టోర్నమెంట్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఈగల్‌ ఎస్పీ కె.నగేష్‌బాబు, డీఎస్పీ ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ ఎ.శాంతిరాజు, శ్వాస ఆర్గనైజేషన్‌ ప్రతినిధి డాక్టర్‌ అనిత జ్యోతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement