breaking news
Krishna District Latest News
-
జిల్లా కారాగారంలో ‘ఖైదీల సంక్షేమ దినోత్సవం’
మధురానగర్(విజయవాడసెంట్రల్): జైలులో ఉన్న కాలంలోనే ఖైదీలు పూర్తి సత్ప్రవర్తన కలిగి పరిపూర్ణ వ్యక్తులుగా మారాలని 2వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎం.సునీల్‌కుమార్ సూచించారు. జిల్లా కారాగారంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ‘ఖైదీల సంక్షేమ దినోత్సవం’ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో సునీల్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరివర్తన కోసం ఖైదీలు గాంధీ సిద్ధాంతాలను అలవర్చుకోవాలని సూచించారు. ఆయన సూచించిన సత్యం, అహింసలను అలవర్చుకుని పయనించాలన్నారు. ఖైదీలందరూ సత్ప్రవర్తనతో మెలిగి ఉండాలన్నారు. అనంతరం ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా జైలు పర్యవేక్షణాధికారి మహమ్మద్ ఇర్ఫాన్, జైలర్ ఎన్.గణేష్ జిల్లా కారాగార వైద్యాధికారి రోషన్ మియాన్, జైలర్ ఎన్.గణేష్, సీహెచ్ వేణుౖ, డెప్యూటీ జైలర్స్ గోపయ్య నాయక్ జైలు సిబ్బంది పాల్గొన్నారు. -
గల్లంతయిన యువకుడి మృతదేహం లభ్యం
పెడన: మండల పరిధిలోని కూడూరు గ్రామం వద్ద గురువారం సాయంత్రం లజ్జబండ డ్రయిన్‌లో ప్రమాదవశాత్తు పడి గల్లంతైన యువకుడు శుక్రవారం మధ్యాహ్నం శవమై తేలాడు. పెడన పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కూడూరు పంచాయతీ కొత్తూరు హరిజనవాడకు చెందిన వ్యవసాయ కూలి బళ్ల మధుసూదనరావు(34) గురువారం సాయంత్రం లజ్జబండ వద్ద కాళ్లు చేతులు శుభ్రం చేసుకోవడానికి దిగాడు. ప్రమాదవశాత్తు పడిపోవడంతో నీటి ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. విషయం తెలిసిన పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.నాగేంద్రప్రసాద్, ఎస్ఐ సత్యనారాయణలు పర్యవేక్షణలో స్టేషన్ సిబ్బంది గ్రామస్థులతో కలిసి గాలింపు చేపట్టారు. గురువారం రాత్రి ఆర్ధరాత్రి కావడంతో తిరిగి శుక్రవారం వేకువ జామునే గాలింపు చేపట్టారు. డ్రోన్ కెమెరాలు వినియోగించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 300 మీటర్లు దూరంలో శుక్రవారం మధ్యాహ్నం అదే డ్రయిన్‌లో మధుసూదనరావు మృతదేహం కనిపించింది. గట్టుకు చేర్చిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
స్వచ్ఛత ప్రజల జీవన విధానంగా మారాలి
● గాంధీజీ జీవితం సేవా భావానికి నిదర్శనం ● స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): స్వచ్ఛతను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల జీవన విధానంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశపు హాలులో కృష్ణా జిల్లా స్వచ్ఛాంధ్ర అవార్డు – 2026 ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎంపికై న అవార్డు గ్రహీతలకు అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ చూపిన మార్గంలో నడుస్తూ పరిశుభ్రత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆయన జీవితం ఒక పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలో చూపించే నిలువెత్తు నిదర్శనమన్నారు. స్వచ్ఛత పట్ల నిబద్ధతను గాంధీజీని చూసి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లాలో పరిశుభ్రత, పారిశుధ్య పరిరక్షణకు కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, స్థానిక సంస్థల గుర్తించి అవార్డులతో సత్కరించటం ద్వారా మరింత మంది స్పూర్తి పొందుతారన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోలెం నాగమణి, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్‌కుమార్, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, పర్యాటకశాఖాధికారి రామలక్ష్మణరావు, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వార్డుల విభజనలో గందరగోళం
భార్యాభర్తలు వేర్వేరు వార్డుల్లో.. పెడన: పెడన మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన అనంతరం విడుదలైన కొత్త ఓటరు జాబితాలు ఇబ్బందికరంగా మారాయి. వాటిలో కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోయేలా పేర్లు నమోదయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలను వేర్వేరు వార్డుల్లో చేర్చడం, తల్లిదండ్రులను ఒక వార్డులో.. పిల్లలను మరో వార్డులో చూపించడం వంటి తప్పులు చోటుచేసుకున్నాయని పురప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా వార్డుల పునర్విభజన అనంతరం ఆయా ప్రాంతాల భౌగోళిక పరిధికి అనుగుణంగా ఓటర్లను కేటాయిస్తారు. అయితే పెడనలో విడుదలైన కొత్త జాబితాల్లో ఓటర్ల కేటాయింపుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు వార్డుల్లో కనిపించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఉదాహరణలు పదుల సంఖ్యలో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఓటు వేసే సమయంలో ఇబ్బందులే.. ప్రస్తుతం తాము ఏ వార్డులో ఉన్నామనే విషయంపై చాలామంది ఓటర్లకు స్పష్టత లేదని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు వెళ్లినప్పుడు అసలు సమస్య బయటపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబంలోని సభ్యులు వేర్వేరు వార్డుల్లో ఉండటంతో ఓటర్లలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని అంటున్నారు. అధికార పార్టీ నేతలపై విమర్శలు ఓటరు జాబితాల్లో ఇంతటి గందరగోళం కనిపిస్తున్నా అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయించేందుకు చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలపై రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. కొత్త 11వ వార్డులో సీరియల్ నంబర్లు 902, 903లో అబ్దుల్‌ఖాదర్, ఆయన భార్య మెహెరున్నీసా పేర్లు నమోదయ్యాయి. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే పిల్లలైన షేక్ ఇబ్రహీం, షేక్ ఇమ్రాన్, జరీనాబేగం, షేక్ తశ్లీం పేర్లు కొత్త 27వ వార్డులో సీరియల్ నంబర్లు 47 నుంచి 50 వరకు నమోదయ్యాయి. దీంతో తల్లిదండ్రులు ఒక వార్డులో.. నలుగురు పిల్లలు మరో వార్డులో ఉన్నట్లుగా జాబితాలో కనిపిస్తోంది. అదేవిధంగా 27వ వార్డులో అబ్దుల్ ఆసీఫ్, ఆయన కుమారుడు అబ్దుల్ నయీమ్, భార్య సగేరాబేగం పేర్లు నమోదయ్యాయి. అయితే ఆయన కుమార్తె సుహాన పేరు మాత్రం కొత్త 11వ వార్డులో సీరియల్ నంబరు 791లో ఉంది. ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల పేర్లు ఇలా వేర్వేరు వార్డుల్లో ఉండటంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ ఎండీ ఖాజా తల్లి మెహెరున్నీసా పేరు కూడా వేరే వార్డులో నమోదైనట్లు పేర్కొంటున్నారు. ఖాజా ఓటు 11వ వార్డులో ఉండగా, ఆయనతోనే ఉంటున్న తల్లి మెహెరున్నీసా ఓటు 27వ వార్డులో ఉన్నట్లు జాబితాలో నమోదైంది. ఇక 27వ వార్డులో సీరియల్ నంబరు 802లో ఉన్న అబ్దుల్ లతీఫ్ భార్య హాబీబున్నీసా పేరు 11వ వార్డులో 106వ సీరియల్ నంబరులో ఉంది. అలాగే అబ్దుల్‌గనీ పేరు 27వ వార్డులో 98వ సీరియల్ నంబరులో ఉండగా, ఆయన భార్య నూరున్నీసా పేరు 11వ వార్డులో 800వ సీరియల్ నంబరులో నమోదైంది. కరీమున్నీసా పేరు 27వ వార్డులో 107వ సీరియల్ నంబరులో ఉండగా, ఆమె భర్త అబ్దుల్ హామీద్ పేరు 11వ వార్డులో 803వ సీరియల్ నంబరులో ఉంది. ఓటరు జాబితాలు పారదర్శకంగా, తప్పుల్లేకుండా ఉండాలి. ఒకే కుటుంబంలోని సభ్యులంతా ఒకే ప్రాంతంలో ఉండేలా జాబితాలు రూపొందించాల్సి ఉండగా, భర్త ఒక వార్డులో.. భార్య మరో వార్డులో, తల్లిదండ్రులు ఒకచోట.. పిల్లలు మరోచోట ఉండేలా జాబితాలు రూపొందించడం సరికాదు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి తప్పులను సరిచేయాలి. –మెహరాజున్నీసా, పట్టణ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ, పెడన నిబంధనల మేరకు ఆన్లైన్ విధానంలో కొత్త వార్డుల ఓటరు జాబితాలను రూపొందించాం. డోర్ నంబర్ల నమోదులో చిన్నపాటి పొరపాట్లు జరిగినా ఓటర్ల కేటాయింపులో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. జాబితాల్లోని తప్పులను సరిచేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తే వాటిని సరిచేస్తాం. అవకాశం లేకపోతే ప్రస్తుతం విడుదల చేసిన జాబితాల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. –ఎం. సాంబశివరావు, టీపీవో, పెడన మున్సిపాలిటీ -
పింఛను ఆశ.. అడియాస!
● గత నెలలో దరఖాస్తు చేసిన పెన్షన్ దరఖాస్తుదారులకు మొండిచేయి ● ఈ నెలే కొత్త పెన్షన్‌లిస్తామంటూ ఊదరగొట్టిన కూటమి నేతలు ● కొత్త పెన్షన్ వస్తుందని ఆశగా ఎదురు చూసిన వృద్ధులు, వికలాంగులు వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఒకటో తేదీన తమకు కొత్తగా పింఛను సొమ్ము వస్తుందని ఎదురు చూసిన అవ్వాతాత్తల ఆశలు అడియాసలయ్యాయి. ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులందరికీ పింఛన్లిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఆ ఊసే ఎత్తటం లేదు. వైఎస్సార్ సీపీతో పాటుగా ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతో గత నెలలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవటానికి కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల నుంచి పెన్షన్లు వచ్చేస్తాయంటూ కూటమి నేతలు ఊదరగొట్టారు. కానీ ఒకటో తేదీన కొత్త వాటి ఊసు లేకపోవటంతో వారంతా ఊసూరుమంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,10,903 మంది దరఖాస్తు.. కూటమి ప్రభుత్వం గత మాసంలో ఆన్లైన్ ద్వారా కొత్త పెన్షన్ల కోసం పోర్ట్‌ల్‌ను ఓపెన్ చేసింది. ఆ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1,10,903 మంది వివిధ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో కృష్ణా జిల్లాకు 52,181 మంది, ఎన్టీఆర్ జిల్లాకు 58722 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క విజయవాడ నగరంలోనే సుమారు 18 వేల మంది, మచిలీపట్నంలో తొమ్మిది వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. వారంతా అక్టోబర్ నెల నుంచి కొత్తగా పెన్షన్ తీసుకోవచ్చనే ఆశతో ఎదురు చూశారు. ఉమ్మడి జిల్లాలో వృద్ధులు 24 వేల మంది, వితంతు పెన్షన్ల కోసం 14 వేల దరఖాస్తు చేసుకున్నారు. దివ్యాంగులు, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, గీత కార్మికులు, చర్మకారులు తదితర వర్గాలకు చెందిన వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ప్రజలను మభ్య పెట్టడానికి కొత్త పింఛన్ల పేరుతో కూటమి ప్రభుత్వం హడావుడి చేసినట్లు భావిస్తున్నారు. పెన్షన్ ఇచ్చే ఉద్దేశం ఉంటే ఆన్లైన్ ద్వారా ఎంపిక వెంటనే జరుగుతుందని, రోజుల తరబడి చేసే అవకాశం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని సూపర్ సిక్స్‌లో కలిపేస్తారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఎప్పటి నుంచో పెన్షన్లు తీసుకుంటున్న పెన్షన్‌దారులు సైతం చంద్రబాబు అధికారం చేపట్టన నాటి నుంచి తమ పెన్షన్ల విషయంలో అనేక భయాందోళనలతో గడుపుతున్నారు. చంద్రబాబు పాలనలో పాతవి తీసివేసి కొత్తవారికి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయనే ప్రచారం వారి ఆందోళనకు కారణమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులనవారందరికీ పెన్షన్‌లిస్తామంటూ మభ్య పెట్టారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తరువాత దరఖాస్తు చేసుకోమని, వచ్చే మొదటి తేదీన పెన్షన్‌లిస్తామంటూ కూటమి నేతలు ఊదరగొట్టారు. కానీ అక్టోబర్ మొదటి తేదీన ఎంతో ఆశతో ఎదురు చూసిన వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు చంద్రబాబు ప్రభుత్వం మరోసారి మొండిచెయ్యి చూపించింది. ఇప్పటికై నా ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయాలి. – కామరాజ్ హరీష్‌కుమార్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి -
జిల్లా పరిషత్‌కు ‘స్వచ్ఛ’ అవార్డు
చిలకలపూడి(మచిలీపట్నం)/చల్లపల్లి: కృష్ణా జిల్లా పరిషత్‌కు పలు అంశాల్లో అవార్డు లభించింది. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛత అవార్డును జెడ్పీ సీఈఓ డాక్టర్ జె.అరుణ సీఎం చంద్రబాబు నుంచి అందుకున్నారు. పారిశుధ్య కార్మికురాలికి అవార్డు చల్లపల్లి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న సాంతల జయలక్ష్మికి స్వచ్ఛాంధ్ర రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రీన్ అంబాసిడర్‌గా అవార్డు అందుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావుఅవార్డు అందుకున్నారు. -
గాంధీ, శాస్త్రి మార్గదర్శకులు
చిలకలపూడి(మచిలీపట్నం): దేశభక్తికి ప్రతీక మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి అని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్లోని సమావేశం హాలులో జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ బాలాజీ.. గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ సత్యం, అహింస, శాంతి మార్గాలను పాటిస్తూ దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించారన్నారు. గాంధీజీ ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకమన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, నిజాయతీ, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని, ప్రధాన మంత్రిగా దేశానికి విశిష్ట సేవలందించారని కొనియాడారు. ఆయన ఇచ్చిన జై జవాన్, జై కిసాన్ నినాదం దేశ రక్షణ, వ్యవసాయ రంగాల ప్రాధాన్యతను చాటి చెప్పిందన్నారు. ప్రజాసేవలో ఉన్న అధికారులు, సిబ్బంది గాంధీజీ సత్యం, అహింస, సేవా భావనతో పాటు శాస్త్రి నిరాడంబరత, క్రమశిక్షణ, అంకిత భావాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో కేఆర్ఆర్సీ ఎస్డీసీ పి. నీలకంఠేశ్వరరెడ్డి, కలెక్టరేట్ ఏవో ఏఎస్ఎన్ రాధిక, సూపరింటెండెంట్ నెల్సన్‌పాల్‌బాబు, డెప్యూటీ తహసీల్దార్ సుభాష్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజంలో ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించాలని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ అన్నారు. మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఏపీ పేపర్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ భాగస్వామ్యంతో శుక్రవారం గాంధీనగర్‌లోని ఏపీ ఎన్జీజీవోస్ హోమ్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. దీన్ని విద్యాసాగర్ ప్రాంభించారు. ఈ సందర్భంగా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యాసాగర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడి ప్రాణదాతలుగా నిలుస్తారన్నారు ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడం చేసి సమాజానికి విలువైన సేవ అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పేపర్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.లక్ష్మీ కాంతరావు కార్యదర్శి మఫత్ లాల్ జైన్, ఉపాధ్యక్షుడు కె. నాగేశ్వరరావు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి ఇ.చిట్టిబాబు, వైస్ చైర్మన్ వెలగా జోషి పాల్గొన్నారు. బిల్లుల సబ్మిట్కు ‘నిధి’లో అవకాశమివ్వాలి యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ కృష్ణలంక(విజయవాడతూర్పు): పెండింగ్ డీఏ ఎరియర్స్ బిల్లులు సబ్మిట్ చేసేందుకు నిధి పోర్టల్‌లో అవకాశం ఇవ్వాలని ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్లో శుక్రవారం యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 జూలై నుంచి 2026 వరకు విడుదల చేసిన డీఏల ఎరియర్ బిల్లులు పెట్టుకోవడానికి సీఎఫ్ఎంఎస్లో టైల్స్ ఓపెన్ చేయకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు, ముఖ్యంగా సీపీఎస్ ఉద్యోగులు, రిటైరైనవారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సీఎఫ్ఎంఎస్ టైల్స్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఎన్‌క్యాష్‌మెంట్ ఎర్న్ లీవు, గ్రాట్యుటీ బకాయిలు చెల్లింపునకు కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు, కె.సురేష్‌కుమార్, ఎ.ఎస్.కుసుమ కుమారి, కోశాధికారి రెడ్డి మోహనరావు, రాష్ట్ర కార్యదర్శులు బి.లక్ష్మిరాజా, ఎస్.మురళీమోహనరావు, మనోహర్, ఎస్.ఎస్.నాయుడు తదితరులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల్లో బస్సుల నిర్వహణకు విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో అమ్మవారి భక్తుల కోసం అవసరమైన బస్సుల నిర్వహణకు విజయవాడకు చెందిన భక్తులు రూ. 2.50 లక్షల విరాళాన్ని అందజేశారు. విజయవాడ గాయత్రీనగర్‌కు చెందిన అట్లూరి పల్లవి కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి ఉత్సవాల్లో దేవస్థాన బస్సులు తిరిగేందుకు అవసరమైన మరమ్మతులను చేయాలని కోరుతూ రూ. 2.50 లక్షలు విరాళంగా అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. -
ఉత్కంఠగా బాస్కెట్‌బాల్ పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో 51వ సబ్–జూనియర్ నేషనల్ బాస్కెట్‌బాల్ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. 6వ రోజు శుక్రవారం జరిగిన నాకౌట్ రౌండ్ మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి. శనివారం సెమీ ఫైనల్స్, ఆదివారం ఫైనల్స్ పోటీలు జరుగుతాయి. బాలికల క్వార్టర్–ఫైనల్స్ ఫలితాలు.. కర్ణాటక జట్టు 62–49 తేడాతో కేరళను ఓడించింది. ఇందులో ఆరుషి ఆనంద్ 17 పాయింట్లతో అద్భుత ప్రదర్శన చేసి అందరిని ఆకట్టుకుంది. ఉత్తరప్రదేశ్ జట్టు 68–57 తేడాతో మధ్యప్రదేశ్ జట్టుపై విజయం సాధించింది. తేజస్వి కర్హానా 21 పాయింట్లు సాధించి తమ జట్టును సెమీ–ఫైనల్స్‌కు చేర్చింది. బాలుర క్వార్టర్–ఫైనల్స్ ఫలితాలు.. ఉత్తరప్రదేశ్ జట్టు 65–40 తేడాతో కర్ణాటకను చిత్తు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. హర్యానా జట్టు 70–65 తేడాతో ఢిల్లీ జట్టుతో పోటీ పడిన తీరు అందరిలో ఉత్కంఠను రేపింది. చివరకు హర్యానా జట్టు విజయాన్ని వరిచింది. భవానీపురం(విజయవాడపశ్చిమ): హైదరాబాద్ జాతీయ రహదారిపై నిలిచి ఉన్న ట్రాలీ లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. భవానీపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన దేవిశెట్టి అనిల్ కుమార్ హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతని మేనత్త కొడుకు నీరుకొండ చంటి హైదరాబాద్‌లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ సొంత పనులపై పది రోజుల క్రితం రామచంద్రాపురం వచ్చి పనులు ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు ఈ నెల ఒకటవ తేదీ పల్సర్ బైక్ రాత్రి 7 గంటలకు బయలుదేరారు. అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో గొల్లపూడి వెస్ట్ బైపాస్ రోడ్ నుంచి ఫీడర్ రోడ్లోకి వచ్చేసరికి ముందు ట్రాలీ లారీ చీకట్లో నిలిపి ఉంది. బైక్ డ్రైవ్ చేస్తున్న చంటి చీకట్లో ఉన్న ట్రాలీ లారీని గమనించకపోవడంతో ఢీకొట్టాడు. దీంతో చంటి కుడి కంటి కింద భాగాన బలమైన గాయం తగిలింది. స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేయగా వారు వచ్చి చంటిని ఎక్కించుకుని విజయవాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిల్లో చేర్పించారు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులకు బాధిత యువకులు జరిగింది వివరించగా కేసు నమోదు చేశారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తి ప్రమాదవశాత్తు డ్రెయిన్లోపడి చనిపోయిన ఘటన విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు నడుపుతూ జీవనం సాగిస్తున్న నూతక్కి క్రాంతి కుమార్ గిల్లపూడి మైలురాయి సెంటర్లో ఆర్సీఎమ్ చర్చి దగ్గర నివసిస్తున్నాడు. అతని సోదరుడు నూతక్కి కోటేశ్వరరావు (48) అవివాహితుడు. ఆరోగ్యం బాగుండకపోవడంతో మానసిక వైద్యుడికి చూపించగా మందులు వాడుతున్నప్పుడు బాగానే ఉంటుంది. మందులు వాడటం మానేస్తే మానసిక స్థితి సరిగా ఉండదు. క్రాంతికుమార్ ఇంటి దగ్గర ఉండే టీడీపీ ఆఫీస్ వద్ద ఉంటూ అక్కడే పడుకుంటున్నాడు. ఈ క్రమంలో వారం రోజుల నుంచి అతని ఆరోగ్యం క్షీణించగా ఒక ప్రయివేట్ హాస్పటల్‌కి తీసుకెళ్లి మందులిప్పించారు. మర్నాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ నెల ఒకటిన ఉదయం 6 గంటలకు క్రాంతికుమార్ స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో కోయపేట వెళ్లి వెతికినా కనిపించలేదు. శుక్రవారం తెల్లవారు జామున 5.45 గంటలకు పంటకాలువ రోడ్లో కోయపేట వద్దగల డ్రెయినేజిలో పడిపోయి ఉండటాన్ని క్రాంతికుమార్ గమనించాడు. మానసిక పరిస్థితి బాగోలేక కోటేశ్వరరావు డ్రెయిన్‌లో పడిపోయి చనిపోయి ఉంటాడని క్రాంతికుమార్ పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హామీ ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విశేష సేవలందించి, ఇంటింటికీ సంక్షేమాన్ని పంచిన గ్రామ/వార్డు సచివాలయ వలంటీర్లను దారుణంగా అవమానించారు.. వైఎస్సార్ సీపీ ఏజెంట్లుగా ముద్రవేశారు.. వారికి ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే వారిని అవస్థల పాల్జేసి.. ఆ వ్యవస్థనే లేకుండా చేశారు. సీన్ కట్ చేస్తే.. అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట కొత్త వ్యవస్థను తీసుకొచ్చి భారీగా పంపకాలకు పూనుకుంది. ప్రజాసేవకు ఏమాత్రం ఉపయోగపడని ఒక భజన బృందానికి జనం డబ్బును వాడేందుకు సిద్ధమైంది. కేవలం సర్కారుకు డప్పు కొట్టేందుకే వారికి భారీ నజరానాలు ప్రకటించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో వలంటీర్లుగా పనిచేసిన వారు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. – సాక్షి నెట్వర్క్ గండేపల్లి గ్రామంలో ఐదేళ్లు వలంటీర్‌గా సేవా దృక్పథంతో పని చేశాను. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేరువ చేయడంలో కీలకంగా వ్యవహరించాను. కొందరు వలంటీర్లను నోటికొచ్చినట్లు విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా గౌరవ వేతనం రూ.10వేలు చేసి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్లను మోసగించారు. యాదాల వర్ధన్, మాజీ వలంటీర్, గండేపల్లి, కంచికచర్ల అన్ని వర్గాల ప్రజలకూ అండగా నిలిచాం. ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి ఇంటికీ సుమారు 1500 రకాల సేవలను అందజేశాం. కరోనా వంటి కష్ట కాలంలో, ప్రకృతి విపత్తుల్లో అధికారులు సైతం అందించలేని సేవలను వలంటీర్లుగా మేం అందించాం. ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడకుండా ప్రజలకు సేవలను అందించామని గర్వంగా చెబుతాం. అలాంటి మాకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.5 వేలు కాదు, రూ.10 వేలు ఇస్తామని నమ్మబలికారు. అధికారంలోకి రాగానే వలంటీరు వ్యవస్థను తొలగించేశారు. బుడమేరు వరదల్లోనూ వలంటీర్ల సేవలను వినియోగించుకున్న సర్కారు వలంటీర్లకు ద్రోహం చేసింది. –సయ్యద్ రెహ్మతుల్లా, మాజీ వలంటీర్, కంకిపాడు -
గాంధీ చూపిన శాంతి మార్గం అనుసరణీయం
కోనేరుసెంటర్: గాంధీజీ ఆశయాలు, విలువలు అందరికీ ఆదర్శప్రాయమని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు పేర్కొన్నారు. మహనీయుల జీవితాలు, వారి నైతిక విలువలను సిబ్బంది మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించారు. జాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొని మహాత్మగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎస్పీ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మగాంధీ సూక్తులు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన చూపిన శాంతి మార్గాన్ని అందరూ అనుసరించాలన్నారు. అలాగే భారత రెండో ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): వర్కింగ్ జర్నలిస్టుల భద్రత కోసం ఒక ప్రత్యేక చట్టం చేయాలని.. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని పునరుద్ధరించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ సెక్రటరీ జనరల్ డి.సోమసుందర్ డిమాండ్ చేశారు. గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా కోర్కెల దినం పాటించాలన్న ఐజేయూ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కొత్త వంతెన సెంటర్లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జర్నలిస్టుల కోర్కెలు పరిష్కారం చేయాలని కోరుతూ వివిధ డిమాండ్లపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సోమసుందర్ మాట్లాడుతూ దేశంలో మీడియా స్థితిగతులపై అధ్యయనం చేయడం కోసం మీడియా కమిషన్ నియమించాలని, జర్నలిస్టుల, మీడియా సంస్థల భద్రత కోసం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల వేతన సవరణ కోసం వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి గృహనిర్మాణం చేపడతామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీపై కదలిక లేదన్నారు. దేశంలో 15 రాష్ట్రాల్లో రిటైరైన జర్నలిస్టులకు పింఛను ఇస్తున్నారని, ఇక్కడ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీయుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కంచల జయరాజ్, విజయవాడ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు, ఐజేయూ కార్యవర్గ సభ్యులు కూన అజయ్ బాబు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. రమణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్. విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ డి.సోమసుందర్ డిమాండ్ -
కరువులో వ్యవసాయమేది!
చిలకలపూడి(మచిలీపట్నం): ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. కృష్ణా జిల్లాలోని 25 మండలాలకు ఎనిమిదింటిని తీవ్ర కరువు మండలాలుగా, మరో తొమ్మిదింటిని మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించింది. అయితే కరువు తీవ్రత ఉన్న ప్రాంతాలను రెండు కేటగిరీలుగా విభజించడంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మిగిలిన మండలాల్లో వర్షాభావం, సాగునీటి కొరత ఉండటంతో వాటిని కూడా కరువు జాబితాలో చేర్చాలని రైతులు కోరుతున్నారు. అయితే సాయంపై స్పష్టత లేదు. ఇన్నాళ్లకు ప్రకటన జూన్ నుంచే వర్షపాతం లోటుతో పంటల పరిస్థితిపై రైతులు ఆందోళన చెందుతున్నా.. కరువు మండలాల ప్రకటన అక్టోబరు వరకు సాగడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభంలో ప్రభుత్వం ఏరువాక కార్యక్రమాలు నిర్వహించి సాగుకు సన్నద్ధం కావాలని సూచించడంతో పెట్టుబడులు లేకపోయినా అప్పులు చేసి సాగు చేపట్టామని రైతులు చెబుతున్నారు. అనంతరం సాగునీటి లభ్యతపై అనిశ్చితి నెలకొనడంతో పెట్టుబడులు పెట్టిన పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సింది పోయి రైతులను నిర్లక్ష్యంగా వదిలేసిందనే విమర్శలు ఎదురవుతున్నాయి. శివారు భూములకు సాగునీటి కష్టాలు శివారు ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని పాలకులు ఇచ్చిన హామీలతో సాగుకు సిద్ధమైన రైతులకు చివరకు నీటి కొరత ఎదురైందని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేసిన తర్వాత కూడా సాగునీరు అందక పంటలు దెబ్బతిన్నాయని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన తీవ్ర కరువు మండలాల్లో కృత్తివెన్ను, బంటుమిల్లి, చల్లపల్లి, నాగాయలంక, కోడూరు, పెడన, గూడూరు, మచిలీపట్నం నార్త్ ఉన్నాయి. మధ్యస్థ కరువు మండలాలుగా బాపులపాడు, ఉంగుటూరు, నందివాడ, పెనమలూరు, పమిడిముక్కల, గుడ్లవల్లేరు, మోపిదేవి, అవనిగడ్డ, తోట్లవల్లూరు మండలాలను ప్రకటించారు. జిల్లాలోని మిగిలిన మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలతో సరి పెడుతోంది కానీ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కరువు మండలాల్లోని రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం తక్షణమే అందించాలి. నాట్లు వేసి సాగునీరు అందక పంటలు ఎండిపోయిన రైతులకు కూడా పరిహారం ఇవ్వాలి. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు అవసరమైన సాగునీటిని వెంటనే విడుదల చేసి రైతులకు అండగా నిలవాలని కోరుతున్నాం. –గౌరిశెట్టి నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కరువు మండలాల ప్రకటన వెలువడినా.. రైతులకు అందించే నష్టపరిహారం, ఇతర ఉపశమన చర్యలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళన నెలకొంది. కరువు ప్రకటించిన మండలాల్లోనే కాకుండా సాగునీరు అందక పంటలు దెబ్బతిన్న ఇతర ప్రాంతాల రైతులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కరువు మండలాల ప్రకటనతో సరిపెట్టకుండా రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. పంట రుణాలను రీషెడ్యూల్ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు బీమా పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలి. మచిలీపట్నం సౌత్ మండలంలోని సాగునీరు అందని గ్రామాలను కూడా కరువు ప్రభావిత ప్రాంతాలుగా పరిగణించాలి. –జన్ను రాఘవరావు, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డు మాజీ చైర్మన్ -
అనుయాయులకు అక్రమంగా భూములు కట్టబెట్టారు
● లిస్టులో లేని వారికి పట్టాలు ఏవిధంగా ఇచ్చారు? ● నిజమైన రైతులకు న్యాయం చేయాలి ● లంకపల్లి గ్రామ రైతుల ఆవేదన పామర్రు: అసలైన రైతులకు లంక భూములు కేటాయించకుండా అనుయాయులకు అక్రమంగా భూములు కట్టబెట్టడంపై పునః పరిశీలన చేయాలని పమిడిముక్కల మండలం లంకపల్లికి చెందిన రైతులు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. నిజమైన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ లంక భూముల రైతులు మాజీ శాసన సభ్యులు కై లే అనిల్‌కుమార్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1952లో జమీందారీ కుటుంబీకులు తమకు ఇచ్చిన భూములను అప్పటి నుంచి మా ఆధీనంలో ఉండి సాగు చేసుకుంటున్నామని తెలిపారు. లంకపల్లి లంక ప్రభుత్వ లంక భూమిలో సర్వే నం.13లో 106.35 ఎకరాలు, సర్వే నం.14లో 265.25 ఎకరాలు మొత్తం 371.60 ఎకరాల భూమిని అప్పటి నుంచి సాగు చేస్తున్నామని వివరించారు. ఆయా ప్రాంతంలో రీ సర్వే నిర్వహించగా మొత్తం 600 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించారని అన్నారు. లంకపల్లి లంకలో 250 ఎకరాలకు పాస్ పుస్తకాలు ఉండగా, రికార్డులలో లేని వారి పేరుతో వీలునామాలు సృష్టించి అధికారులు పట్టాలు మంజూరు చేశారని ఆరోపించారు. అదేవిధంగా నిరుపేదలైన వారికి చెందాల్సిన భూములను నిషేధిత జాబితాలో చూపిస్తూ, ప్రభుత్వ భూములుగా గుర్తించి వాటిలో ఇసుక తవ్వకాలను అనుమతులను ఇచ్చేశారని అన్నారు. భూ రీసర్వే జరిపి వారి భూములు వారికి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారని అన్నారు. రికార్డులు తారుమారు.. ఈ రీ సర్వే పేరుతో అధికారులు కుమ్మకై ్క రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. గతంలో వివిధ కారణాలతో నదీగర్భంలో కలిసి పోయిన భూములను ఎలా సర్వే చేసి హద్దులు గుర్తించారని ప్రశ్నించారు. ఇదే గ్రామానికి చెందిన ఒక్క ఎకరం భూమి లేని కోగంటి పూర్ణచంద్రరరావుకు 30 ఎకరాలు ఏవిధంగా కేటాయించారని ప్రశ్నించారు. మన్నె కోటేశ్వరరావుకు 12.5 ఎకరాలు, మన్నె శ్రీనివాసరావుకు 25 ఎకరాలు కేటాయించారన్నారు. గ్రామంలో మానసిక పరిస్ధితి సరిగాలేని కృష్ణ చైతన్య పేరుతో ఏకంగా 16.77 ఎకరాలు కేటాయించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అనుయాయులు సుమారు 10 మందికి 30 ఎకరాల వరకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఏవిధంగా ఇచ్చారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే బినామీగా ఉండే గంటా సురేష్‌తో కుమ్మకై తహసీల్దార్ కేటాయించినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ నేతృత్వంలో ఉయ్యూరు ఆర్డీవో, కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేసినట్టు గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా కలిసి ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వ నేతలు స్పందించి నిజమైన లబ్దిదారులకు భూములను అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నడకుదిటి రాజేంద్ర, జిల్లా ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తాడిశెట్టి శ్రీనివాసరావు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి శ్రీనివాసరావులు రైతులకు న్యాయం చేయాలని కోరిన వారిలో ఉన్నారు. -
కపటధారి!
పటమట(విజయవాడతూర్పు)/చిలకలపూడి (మచిలీపట్నం): రాష్ట్ర జనాభాలో అధికంగా ఉండే వెనుకబడిన తరగతులు(బీసీ)పై ప్రభుత్వం మరోమారు తమ కపట వైఖరిని ప్రదర్శించింది. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వారికి గుర్తుకువచ్చే బీసీ రిజర్వేషన్ పెంపుదల అంశంలో చిత్తశుద్ధి బహిర్గతమైంది. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్‌ను పెంచి సీట్లు కేటాయిస్తామని గత ఆగస్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా రెండు జీవోలను కూడా తీసుకువచ్చారు. అయితే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దీనిపై గురువారం కీలకతీర్పు వెల్లడించింది. బీసీలకు గ్రామీణ ప్రాంతాల్లో 34శాతం, పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలకు 33.33శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని తీసుకువచ్చిన జీవోలను కొట్టివేసింది. సమాచారం సేకరించటంలో విఫలం.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ పెంపుదల, ఖరారుకు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్‌రంజన్ ఆధ్వర్యంలో బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీసీల వెనుకబాటు తనంపై అనుభవపూర్వక విచారణ, వారి రిజర్వేషన్ పెంచే ప్రక్రియ చేయటమే ఈ కమిషన్ ఉద్దేశం. ఇది సెప్టెంబర్ 30 వరకు పనిచేసింది. అయితే కమిషన్ పూర్తిస్థాయిలో నివేదికలు ఇవ్వలేదని, సరైన సమాచారం సేకరించటంలో విఫలమైందని, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ప్రభుత్వం సమర్పించిన నివేదికలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని నివేదికను సిద్ధం చేసిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఆ నివేదిక కూడా తప్పుల తడకగా ఉందని, ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా నివేదిక హడావుడిగా ప్రభుత్వానికి సమర్పించారని ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టులో సాధించగలరా? బీసీ రిజర్వేషన్ పెంపుదల అంశంపై హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందని సమాచారం. అయితే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కనుక రిజర్వేషన్ 50 శాతానికి మించి పెంచే అవకాశంపై చట్ట సవరణ చేయాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడి తీసుకు వచ్చి బీసీల కోసం చట్ట సవరణ చేయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 17.35 లక్షల మంది ఉండగా వీరిలో సుమారు 15 లక్షల వరకు వెనుకబడిన వర్గాల వారు ఉన్నారు. 139 ఉపకులాల వారిని బీసీలుగా ప్రస్తుతం పరిగణిస్తున్నారు. ప్రముఖంగా బీసీ సామాజికవర్గంలో యాదవ, గౌడతో పాటు ఇతర ఉపకులాల వారు ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న వీరికి ప్రభుత్వాలు ఎంతో చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ ఉపకులాల వారికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఓసీ సామాజిక వర్గానికి కేటాయించినప్పటికీ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పదవిని ఉప్పాల హారికకు ఇచ్చి బీసీలపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. 2021లో వీఎంసీకి జరిగిన ఎన్నికల్లో మేయర్ పదవి జనరల్ మహిళా కేటగిరీకి కేటాయించారు. వైఎస్సార్ సీపీ మేయర్‌గా బీసీ సామాజికవర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మిని నియమించారు. ఇంకా కార్పొరేటర్ల కేటాయింపులో కూడా జనాభా దామాషా ప్రకారం 64 డివిజన్లకు 23 మంది బీసీలకు సీట్లు కేటాయించింది. కోఆప్షన్ సభ్యురాలిగా జమలపూర్ణమ్మకు పదవిని ఇచ్చింది. బీసీలకు రిజర్వేషన్ కల్పించే ప్రక్రియలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సంప్రదించి పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా రిజర్వేషన్లు కల్పిస్తామని హడావుడిగా జీవోలు ఇవ్వటం బీసీలను మభ్య పెట్టడమే. అంతేకాకుండా చంద్రబాబు బీసీలకు మంచి చేశారని క్షీరాభిషేకాలు చేయించుకోవటం తప్ప ఏ విధమైన మంచి జరగలేదు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు హక్కులు కల్పించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. – శేకుబోయిన సుబ్రహ్మణ్యం, బీసీ సంక్షేమ సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షుడు -
పింఛన్ల పంపిణీలో కలెక్టర్ బాలాజీ
గుడ్లవల్లేరు: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అర్హులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు జరుగుతాయని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ‘పేదల సేవలో 2.’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని డోకిపర్రులో గురువారం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన పేదలకు నేరుగా అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పని చేస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పింఛను లబ్ధిదారు సారమ్మతో మాట్లాడి ఆమె కుటుంబ పరిస్థితులు, పింఛన్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలు సకాలంలో అందుతున్నాయా లేదా అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల సమాచారం చేరేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు. -
హంసలదీవి బీచ్‌లో ‘స్వచ్ఛతాహి సేవా’
కోడూరు: సామాజిక బాధ్యతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్(ఏపీజీబీ) ఆధ్వర్యంలో హంసలదీవి బీచ్‌లో స్వచ్ఛతాహి సేవా, విజిలెన్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గుడివాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో, కోడూరు శాఖ మార్గదర్శకత్వంలో అటవీ శాఖ సహకారంతో చేపట్టిన కార్యక్రమంలో 50 మంది బ్యాంకు సిబ్బంది పాల్గొని బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రాంతీయ మేనేజర్ కె.ఆంజనేయులు, మచిలీపట్నం మేనేజర్ సీహెచ్. అశోక్ సాయి, ప్రాంతీయ విజిలెన్స్ అధికారి ఆర్.జగదీశ్ కుమార్, కోడూరు శాఖ మేనేజర్ వినయ్ పాల్గొని బీచ్ పరిసరాలను శుభ్రపర్చారు. అటవీ అధికారులు వీరిని అభినందించారు. -
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి
మచిలీపట్నంఅర్బన్: రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరత్నం డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా కమిటీలు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడుతూ వీఆర్ఏలుగా 30 ఏళ్లకు పైగా పనిచేస్తున్నప్పటికీ పలువురికి ఉద్యోగోన్నతులు లభించడం లేదన్నారు. పాత నిబంధనల ప్రకారం వీఆర్ఏల నుంచి వీఆర్వోలుగా కల్పిస్తున్న 30 శాతం ఉద్యోగోన్నతి కోటాను 75 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి చాట్ల రమేష్, ఉపాధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కవిరాజు త్రిపురనేని భావాలతో ప్రజా చైతన్యం
● ఆయన భావి తరాలకు ఆదర్శనీయుడు ● చైతన్య యాత్ర ప్రారంభోత్సవ సభలో వక్తలు గుడ్లవల్లేరు: పాశ్చాత్య మోజులో పడిన నేటి తరం కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి అనే ఆణిముత్యాన్ని రాయిలా పక్కన పడేసి, ఆయన భావాలను తుంగలో తొక్కుతున్నారని సెంట్రల్ విజిలెన్స్ మాజీ కమిషనర్ కొసరాజు వీరయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. తన భావాల రచనలతో కవిరాజు ప్రజా చైతన్యం తీసుకువచ్చారని చెప్పారు. కవిరాజు కోసం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు నుంచి తెనాలి వరకు నిర్వహించిన చైతన్య యాత్రను గురువారం ఆయన ప్రారంభించారు. స్వాతంత్రం రాకముందే కాలం చేసిన కవిరాజు సిద్ధాంతాలు ఈ రోజుల్లో యువతకు తెలియాల్సి ఉందన్నారు. ఇలాంటి యాత్రలో విద్యార్థులు అత్యధికంగా పాల్గొనటం మంచి మార్పుకు శ్రీకరమని పేర్కొన్నారు. కవిరాజు భావజాలాన్ని ఈనాటి తరానికి అందించేందుకు చేస్తున్న చైతన్య యాత్ర సఫలీకృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కవిరాజు రచనలతో సీనియర్ ఎన్టీఆర్ ఎంతో చైతన్యం పొందారని మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ నటించిన పలు పౌరాణిక సినిమాలు కవిరాజు కలం నుంచి జాలువారిన రచనల్లోనివేనన్నారు. భావితరాలకు కవిరాజు ఆదర్శనీయులని పేర్కొన్నారు. కవిరాజు పుట్టిన గడ్డలో మట్టి వాసన.... కవిరాజు పుట్టిన అంగలూరు తాను వస్తే ఆ మట్టి వాసనలో ఆయనతో పాటు ఆయన రచించిన చైతన్యవంతమైన రచనలు ఇమిడి ఉంటాయని సినీ నటుడు త్రిపురనేని సాయిచంద్ పేర్కొన్నారు. ఇదే గ్రామంలో అష్టావధానం శతావదానానికి కవిరాజు శ్రీకారం చుట్టారని తెలిపారు. 1919లో జంభూకవధ రచన ఇక్కడే పుట్టి సంచలనం సృష్టించిందన్నారు. ఈ నాటకాన్ని ఆనాడు రంగూన్, సౌత్ ఆఫ్రికాలో ప్రదర్శిస్తే అప్పటి ప్రజల్లో అనేక మార్పులు వచ్చి చైతన్యవంతులుగా మారారని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘ అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, రచయితలు గుమ్మా సాంబశివరావు, గోపీచంద్, గ్రామ మాజీ సర్పంచ్ మేడేపల్లి రవికుమార్, మాజీ ఉప సర్పంచ్ త్రిపురనేని సురేష్ బాబు, చిలుముల ఫణి తదితరులు పాల్గొన్నారు. -
మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు
గుడివాడరూరల్: ౖమెనర్ బాలికను కిడ్నాప్ వ్యవహారంలో ఆరుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుడివాడ తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని శేరీగొల్వేపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అక్రమంగా నిర్భంధించి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్లతో పాటు ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులు మొగడటి రోహిత్, మొగడటి ఆనంద్, సునీత, బాలశౌరి, దుర్గ, బెర్నాడ్‌లు మైనర్‌కు సంబంధించిన వ్యవహారంలో జోక్యం చేసుకుని ఆమెను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత నెల 28న మధ్యాహ్నం బాలిక ఇంటి నుంచి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈక్రమంలో బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద విచారణ చేసినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈనెల 29 రాత్రి 11 గంటల సమయంలో బాలశౌరి బాలికను ఆటోలో తీసుకెళ్లినట్లు ఆమె కుటుంబసభ్యులకు సమాచారం తెలిసింది. దీంతో వెంటనే వారు తాలూకా పోలీసులను ఆశ్రయించారు. బాలికకు మాయ మాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లిన నిందితులు ఆమెను వారి ఇంట్లో రెండు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి, అనంతరం ఆటోలో తరలించారు. ఫిర్యాదు అందిన వెంటనే తాలూకా ఎస్ఐ ఎన్.చంటిబాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. గుడివాడ మండలం శేరిగొల్వేపల్లికి చెందిన, ప్రస్తుతం గుంటూరు జిల్లా మంగళగిరిలో నివాసం ఉంటున్న ఎ1 నిందితుడు మొగదాటి రోహిత్ (20)ను గురువారం మధ్యాహ్నం గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించినట్టు తెలిపారు. పూసపాటిరేగ: విజయనగరం జిల్లా భోగాపురం మండలం లింగాలవలస వద్ద వ్యాన్, లారీ ఢీకొన్న ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ వైపు నుంచి శ్రీకాకుళం వెళ్తున్న లారీని అదే దిశలో వేగంగా ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న వ్యాన్ భోగాపురం మండలం లింగాలవలస సమీపంలో జాతీయ రహదారిపై అదుపుతప్పి బలంగా ఢీకొంది. వ్యాన్ డ్రైవ్ చేస్తున్న కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని పెదపట్నం గ్రామానికి చెందిన తోకల నవీన్ (32) వ్యాన్‌లో ఇరుక్కోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని క్రేన్ సహాయంతో బయటకు తీసి చికిత్స నిమిత్తం విజయనగరం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహానికి పంచనామా చేసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు భోగాపురం పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లక్ష్యాల మేరకు పనులు వేగవంతం
చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, వ్యక్తిగత మరుగుదొడ్లు, పారిశుద్ధ్య, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణం తదితర పనులను నిర్దేశించిన లక్ష్యాల మేరకు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో ఆర్డబ్ల్యూఎస్, ఐసీడీఎస్, పంచాయతీ తదితర శాఖల అధికారులతో గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలన్నారు. 2025–26 సంవత్సరానికి మంజూరైన 950 వ్యక్తిగత మరుగుదొడ్లలో 345 పూర్తయ్యాయని మిగిలిన పనులను వేగవంతం చేయాలన్నారు. 2026–27 సంవత్సరానికి గానూ 727 మంజూరయ్యాయని వాటి నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వనరుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నీటి వనరుల పరీక్షలను నిరంతరం నిర్వహించి సురక్షిత తాగునీరు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, డీఎల్పీవో రజావుల్లా తదితరులు పాల్గొన్నారు. -
స్మారక నిధి.. గాంధీగిరి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): భారతీయ స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ. కేవలం భారతీయులకే కాకుండా ప్రపంచంలోని నెల్సన్మండేలా, చార్లీచాప్లిన్ వంటి ఎందరో సుప్రసిద్ధ వ్యక్తులను తన బోధనలతో ప్రభావితం చేసిన స్ఫూర్తి ప్రధాత గాంధీ. అటువంటి మహాత్మునికి సంబందించిన వివరాలు నేటి తరానికి అందించేందుకు గొప్ప స్ఫూర్తి శిఖరంగా విజయవాడ నడిబొడ్డున ‘గాంధీహిల్’ వెలుగొందుతోంది. విజయవాడ రైల్వేస్టేషన్‌కు పశ్చిమాన సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండపై స్మారక కేంద్రంగా ఈ గాంధీహిల్ ఏర్పాటైంది. కొండపైన స్మారక స్థూపం కొండ పైభాగంలో 52 అడుగుల ఎత్తయిన స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్థూపం కోసం అప్పటి గుంటూరుజిల్లా రెంటచింతల నుంచి ఎర్ర మార్బుల్ రాయిని తెప్పించారు. స్థూపంపై నడుస్తున్న బాపూజీని చిత్రీకరించారు. స్థూపం దిగువన చుట్టూ గాంధీజీ బోధనలను లిఖించారు. ఈ కొండపై నుంచి నగరం మొత్తం అత్యద్భుతంగా దర్శనమిస్తుంది. విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయం.. గాంధీ స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఏడాదే గ్రంథాలయాన్ని సైతం స్థాపించారు. ఇక్కడ గాంధీజీకి సంబంధించిన ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. గాంధీజీ జీవితాన్ని ఈ గ్రంథాలయం చాలా చక్కగా ఆవిష్కరిస్తుంది. అలాగే గాంధీజీ జీవితంలోని అనేక ఛాయచిత్రాలు (ఫొటోలు) ఉండేవి. ప్రస్తుతం ఆ ఫొటోలు అందుబాటులో లేవు. ఎప్పుడూ మరమ్మతుల్లోనే.. గాంధీహిల్‌పై అందరినీ అలరించే మరో గొప్ప ఆకర్షణ పిల్లల రైలు (టాయ్ ట్రైన్) భూమికి రెండు వందల అడుగుల ఎత్తులో కొండ చుట్టూ తిరిగేలా దీనిని ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్‌ను 1969లో అందుబాటులోకి తెచ్చారు. దీనిని భారతీయ రైల్వే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అందించిందని చెబుతున్నారు. దీనిపై ప్రయాణం చేస్తూ విజయవాడ నగర అందాలను తిలకించవచ్చు. అయితే ఇది సైతం ప్రస్తుతం మరమ్మతుల్లో ఉంది. సందర్శించిన గాంధీజీ వారసులు.. గతంలో గాంధీజీ మనుమడు, చిత్రకారుడు ఆచార్య రాజమోహన్‌గాంధీ దంపతులు గాంధీహిల్‌ను సందర్శించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే గాంధీజీ మునిమనమడు ఆనంద్గోఖనీ సైతం గాంధీహిల్‌ను సందర్శించి గాంధీ మహాత్మునికి నివాళులర్పించారు. మరిన్ని సదుపాయాలు.. గాంధీహిల్‌కు నూతనంగా వచ్చిన పాలకవర్గం మరిన్ని సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తోంది. కొండపైన ఉన్న పరిసరాలను ఆహ్లాదంగా తీర్చిదిద్దటంతో పాటుగా స్థూపం వద్దకు వెళ్లేందుకు వీలుగా లిఫ్ట్ సదుపాయాన్ని ఇటీవలే ప్రారంభించారు. మూలకు చేరిన టాయ్ ట్రైన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్, ర్యాంప్ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో యుద్ద వాతావరణం కొనసాగుతోంది. చాలా దేశాల్లో భయంకరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీజీ బోధనలు ఈ సమాజానికి చాలా అవసరం. ఆయన అందించిన శాంతి సందేశాన్ని నేటి తరం అందిపుచ్చుకోవాలి. గాంధీజీ బోధనలను మరింత విస్తృతం చేసేందుకు గాంధీహిల్ ద్వారా పలు కార్యక్రమాలను చేపట్టనున్నాం. ప్రతి ఒక్కరూ గాంధీహిల్‌ను సందర్శించాలి. – డాక్టర్ గాంధీ పీసీ కాజా, చైర్మన్, గాంధీ ఫౌండేషన్ విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా పని చేసిన సుప్రసిద్ధ ఇంజినీర్ కేఎల్‌రావు కృషి ఫలితంగా గాంధీకొండపై ఖగోళ విజ్ఞానాన్ని అందించే నక్షత్ర ప్రదర్శన శాలను ఏర్పాటు చేశారు. 1971 జూన్ 19న అప్పటి ఉపరాష్ట్రపతి గోపాల్ స్వరూప్ పాఠక్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో తొలిగా ఏర్పాటు చేసిన నక్షత్ర ప్రదర్శన శాల ఇదే. మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా శుక్రవారం గాంధీ పర్వతాన్ని అందరూ ఉచితంగా సందర్శించవచ్చని గాంధీ హిల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పిసికే గాంధీ తెలిపారు. ఉదయం 10 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మాత్రమే ఉచిత సందర్శనకు అనుమతి ఇస్తామని తెలిపారు. మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1921లో విజయవాడకు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఆ క్రమంలో కొండ దిగువన నుంచి ఆయన ప్రసంగించారని చెబుతారు. విజయవాడలో జరిగిన ఆలిండియా మహాసభల్లో ఈ జిల్లావాసి పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాక నమూనాను గాంధీజీకి చూపించారు. అదే విధంగా విజయవాడతో గాంధీజీకి ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకొని 1962 నవంబర్‌లో గాంధీహిల్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం 1968 అక్టోబర్ ఆరో తేదీన అప్పటి రాష్ట్రపతి జాకీర్‌హుస్సేన్ దీనిని ఆవిష్కరించారు. -
జిల్లా పరిషత్‌కు స్వచ్ఛతా అవార్డు
చిలకలపూడి(మచిలీపట్నం): స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా పరిషత్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకున్నట్లు జెడ్పీ సీఈవో జె. అరుణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో సమూల మార్పులు చేపట్టామని.. మహిళా సిబ్బందికి విశ్రాంతి భవనం, ఉద్యోగుల పిల్లలకు ఏసీ చైల్డ్ కేర్ సెంటరు ఏర్పాటు చేయటం తదితర సౌకర్యాలు కల్పించటంలో జిల్లా పరిషత్‌కు ఈ అవార్డు దక్కిందన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో వచ్చిన ఈ అవార్డును శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా స్వీకరిస్తామని ఆమె తెలిపారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో శీరా చంద్రకళ రజత పతకం పొంది మహిళల్లో క్రీడా స్ఫూర్తిని కలిగిచిందని పలువురు క్రీడాకారులు, ఎకై ్సజ్ సిబ్బంది కొనియాడారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం చంద్రకళను సత్కరించారు. ఎకై ్సజ్ శాఖకు చెందిన సిబ్బంది, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఎకై ్సజ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న విజయవాడకు చెందిన చంద్రకళ రజత పతకాన్ని పొందడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. రజత పతక విజేత చంద్రకళ మాట్లాడుతూ తన కోచ్ కంది అప్పారావు ప్రోత్సాహంతో పాటు, కెనడా వెళ్లడానికి అవసరమైన స్పాన్సర్‌షిప్‌ను, సహకారాన్ని అందించిన ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రకళ కుటుంబ సభ్యులు లక్ష్మి, రాము, సాయి దుర్గా తదితరులు పాల్గొని ఆమెకు సత్కరించి అభినందించారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు చూపిస్తున్న ఆదరాభిమానాలు మరువలేనివని.. వారికి మరింత మెరుగైన సేవలు అందించటానికి బీఎస్ఎన్ఎల్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. శేషాచలం అన్నారు. స్థానిక బీఆర్టీఎస్ రోడ్డులో గురువారం బీఎస్ఎన్ఎల్ 26వ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల 5కే రన్ కార్యక్రమం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల అవసరాలు ఆకాంక్షలకు అనుగుణంగా తాము పనిచేస్తున్నామన్నారు. అనంతరం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు బీఎస్ఎన్ఎల్ సేవలను వివరిస్తూ ప్లకార్డులను చేతబూని ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 5కే రన్లో ప్రిన్సిపల్ మేనేజర్ వై. రవీంద్రనాథ్, ఎల్. శ్రీను, జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గన్నవరం: బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్గా నియమితులైన డాక్టర్ అరవింద్‌సింగ్ బదోనియాకు గన్నవరం విమానాశ్రయంలో గురువారం ఆ పార్టీ నేతలు స్వాగతం పలికారు. విజయవాడలో జరగనున్న పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి విచ్చేశారు. విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ సీఎం రమేష్, బీజేపీ నేతలు చిగురుపాటి కుమారస్వామి, పాతూరి నాగభూషణం తదితరులు స్వాగతం పలికారు. అనంతరం కేసరపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన మన ఊరు–మన జెండా కార్యక్రమంలో డాక్టర్ అరవింద్‌సింగ్ బదోనియా పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆయన ఎగురవేశారు. వచ్చే స్థానిక సంస్ధల ఎన్నికల్లో కూడా సత్తాచాటేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ నేతలు నాదెండ్ల మోహన్, నీలం అశోక్, ఫణికుమార్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటికీ పథకాలు ఇచ్చాం..
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విశేష సేవలందించి, ఇంటింటికీ సంక్షేమాన్ని పంచిన గ్రామ/వార్డు సచివాలయ వలంటీర్లను దారుణంగా అవమానించారు.. వైఎస్సార్ సీపీ ఏజెంట్లుగా ముద్రవేశారు.. వారికి ఇచ్చే రూ.5వేల గౌరవ వేతనం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే వారిని అవస్థల పాల్జేసి.. ఆ వ్యవస్థనే లేకుండా చేశారు. సీన్ కట్ చేస్తే.. అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట కొత్త వ్యవస్థను తీసుకొచ్చి భారీగా పంపకాలకు పూనుకుంది. ప్రజాసేవకు ఏమాత్రం ఉపయోగపడని ఒక భజన బృందానికి జనం డబ్బును వాడేందుకు సిద్ధమైంది. కేవలం సర్కారుకు డప్పు కొట్టేందుకే వారికి భారీ నజరానాలు ప్రకటించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో వలంటీర్లుగా పనిచేసిన వారు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. – సాక్షి నెట్వర్క్ కులమత వర్గ విబేధాలకు తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్న నాటి ప్రభుత్వ లక్ష్యం కారణంగా నిష్పక్షపాతంగా ఇంటింటికీ పథకాలు మేం అందించాం. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తల జేబులు నింపటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. వలంటీర్ల కడుపు కొట్టడం అన్యాయం. – యానకి నరేంద్ర, మాజీ వలంటీర్, అనుమంచిపల్లి, జగ్గయ్యపేట కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఇంటికీ వెళ్లి వారికి కావాల్సిన పథకాలను అందించాం. ప్రాణాలను పణంగా పెట్టి రూ. 5వేల గౌరవ వేతనంతో వలంటీర్‌గా ఉద్యోగాలు చేశాం. మాకు ఇచ్చింది ప్రజాధనం దుర్వినియోగమని.. నేడేమో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు లక్షలాది రూపాయలు దోచిపెట్టడం ఎంత వరకూ సమంజసం. ప్రభుత్వం పునరాలోచించాలి. – కె. స్వప్న, మాజీ వలంటీర్, నాగులూరు, రెడ్డిగూడెం కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ వలంటీర్లుగా తాము ఇంటింటికీ వెళ్లి సేవలు అందించాం. వేకువ జామునే గడపగడపకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశాం. వలంటీర్లకు ఇచ్చిన హామీని టీడీపీ ప్రభుత్వం మరిచింది. రూ.5వేలు గౌరవ వేతనంతో ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని విమర్శించిన ఈ పాలకులు ఇప్పుడు వారి డబ్బా కొట్టుకునేందుకు రూ.లక్షలు చెల్లిస్తామని జీవోను విడుదల చేశారు. ఇది కదా దుర్వినియోగమంటే? – సీహెచ్ నందిని, వలంటరీ, దండిగానపూడి -
రెడీమేడ్ చపాతీల్లో పురుగులు
బంటుమిల్లి: రెడీమేడ్ చపాతీ పాకెట్లలో పురుగులు రావడం వినియోగదారుల్లో ఆందోళనకు కారణమైంది. ఇటీవల జనం ఇళ్లలో చపాతీలు, పూరీలు, పరోటాలు తయారు చేసుకోవడం ప్రయాసగా భావించి, మార్కెట్లో అమ్ముతున్న ప్యాకెట్లకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో మండలంలోని జానకీరామపురానికి చెందిన ఒక వినియోగదారుడు స్థానికంగా ఓ వ్యాపారి వద్ద బుధవారం రాత్రి రెడీమేడ్ చపాతీ ప్యాకెట్ కొన్నాడు. గురువారం ఉదయం చపాతీలు కాల్చుకుందామని ప్యాకెట్టు విప్పి చూడగా వాటిపై ముక్క పురుగులు, తోక పురుగులు అతుక్కొని ఉండటం చూసి గతుక్కుమన్నాడు. బిల్లు కోసం వ్యాపారిని అడిగితే తయారీదారు బిల్లు ఇవ్వనందున తాము కూడా ఇవ్వలేమని బదులిచ్చినట్టు వినియోగదారుడు చెప్పాడు. దుకాణాలకు సరఫరా అవుతున్న సరుకులు, తినుబండారాలపై క్వాలిటీ, ఫుడ్ ఇన్సెక్టర్లు, సేల్స్‌టాక్స్ అధికారులు తనిఖీలు చేసి ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పద్మావతి ఘాట్ సమీపంలో కృష్ణానదిలో నీటిలో ఒక మగ వ్యక్తి మృతదేహం తేలుతున్నట్లు గురువారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీసి పరిశీలించారు. మృతుని వద్ద పేరు, ఏ ప్రాంతానికి సంబంధించి ఎటువంటి వివరాలు లభించలేదు. మృతుని వయస్సు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండవచ్చని, ఛాతీపై లవ్ సింబల్, బీ, ఏ అని పచ్చబొట్లు, అదేవిధంగా కుడి చేతిపై పచ్చబొట్లు ఉన్నాయని తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. హనుమాన్‌జంక్షన్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానిక విజయవాడ రోడ్డులోని పోస్టాఫీసు సమీపంలో జరిగిన ఈ ఘటన చూపరులను కలచివేసింది. వివరాల్లోకి వెళ్లితే.. నూజివీడు రోడ్డులోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఉన్న ఇనుప పనిముట్ల తయారీ కొలిమిలో పని చేస్తున్న ఓరుగంటి కిరణ్ (25) బొగ్గులు తీసుకుని ద్విచక్ర వాహనంపై జంక్షన్ సెంటర్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి పోస్టాఫీసు వద్ద రహదారి మధ్యలోని డివైడర్‌పై ఢీకొట్టింది. దీంతో కిరణ్ తలకు డివైడర్‌పై ఉన్న ఇనుప గ్రిల్స్ పదునుగా తెలగటంతో తీవ్ర రక్తస్రావంతో విగతజీవిగా పడిపోయారు. కిరణ్ కింద పడిపోయినప్పటికీ ద్విచక్ర వాహనం మాత్రం దాదాపు 100 మీటర్లు మేర వేగంగా రోడ్డు దూసుకుపోయింది. ఈ ప్రమాదం గూర్చి సమాచారం అందుకున్న హనుమాన్‌జంక్షన్ ఎస్ఐ ఎం.శ్రీనివాస్ ఘటనాస్థలికి చేరుకుని మృతుని వివరాలు ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పటమట(విజయవాడతూర్పు): విజయవాడ ఆటోనగర్‌లో సెప్టెంబర్ 29న జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోనగర్ వంద అడుగుల రోడ్డులో సిమెంట్ రాయితో తలపై మోది వ్యక్తి హత్య జరిగిందని స్థానికులు పటమట పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్, పటమట సీఐ పవన్ కిషోర్ కేసు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు అయ్యప్పనగర్‌కు చెందిన అప్పారావు కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో కృష్ణాజిల్లా నాగాయలంక ప్రాంతానికి చెందిన హరిబాబుతో పరిచయం ఏర్పడింది. సోమవారం రాత్రి సన్‌లైట్ సెంటర్ సమీపంలోని షెడ్డు వద్ద ఇద్దరూ మద్యం తాగుతుండగా హరిబాబు ఫోన్ కనిపించకపోవడంతో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అప్పారావుపై హరిబాబు దాడి చేసి, అనంతరం సిమెంట్ రాయితో తలపై మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం పరారైన హరిబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.ఈ కేసులో నిందితుడు హరిబాబును పటమట పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టు రిమాండ్ విధించడంతో హరిబాబును గన్నవరం జైలుకు తరలించారు. -
కాంట్రాక్టు ఉద్యోగుల క్యాండిల్ ర్యాలీ
మచిలీపట్నంఅర్బన్: వైద్య, ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారిని క్రమబద్ధీకరించాలని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేశ్‌బాబు డిమాండ్ చేశారు. ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీ ఎంహెచ్సీజేఏసీ) ఆధ్వర్యంలో గురువారం రాత్రి మచిలీపట్నంలో కాంట్రాక్టు వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ డిమాండ్లకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సురేశ్‌బాబు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారం, క్రమబద్ధీకరణ, గ్రాస్ శాలరీ చెల్లింపు తదితర డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత పోరాటం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బి. సౌమ్యరేఖ మాట్లాడుతూ ‘దశాబ్దాల సేవకు గుర్తింపు కావాలి.. కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరణ కావాలి’ అనే నినాదంతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, క్రమబద్ధీకరణ సాధ్యం కాని పరిస్థితిలో తక్షణమే 100 శాతం వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆకూరి శ్రీనివాస్ కాంట్రాక్టు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులతో కలిసి పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం, జేఏసీ కన్వీనర్ బాలు, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాల సుబ్రహ్మణ్యం, జిల్లా జేఏసీ కోఆర్డినేటర్ లోకేష్ కుమార్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కన్వీనర్ చంద్రపాల్, వెద్య, ఆరోగ్యశాఖకు చెందిన కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. -
తల్లికి తల కొరివి పెట్టిన కూతుళ్లు
ఆటోనగర్(విజయవాడతూర్పు): వృద్ధురాలైన తన తల్లి తుది శ్వాస విడవడంతో కూతుళ్లే తల కొరివి పెట్టిన ఘటన పెనమలూరు మండలం కానూరులో బుధవారం జరిగింది. వివరాలు ఇవి.. కానూరు గ్రామానికి చెందిన ముదిగొండ అమ్మ (86) అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలికి కొడుకులు లేరు. నలుగురు కుమార్తెలు. ఒక కుమార్తె గతంలోనే చనిపోయింది. దీంతో తల్లి అంత్యక్రియలను మిగిలిన కుమార్తెల్లో ఇద్దరు కుమార్తెలు భీమవరపు లలితకుమారి, ధర్మవరపు లక్ష్మిరాణి చేతుల మీదుగా జరిగించారు. భీమవరపు లలితకుమారి తల కొరివి పెట్టగా.. మరొక కూతురు ధర్మవరపు లక్ష్మిరాణి పాడె మోశారు. -
మోపెడ్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు
చల్లపల్లి: కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలపాలైన ఘటన 216 జాతీయ రహదారిపై మండల పరిధిలోని రామానగరం అడ్డరోడ్డు వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపిదేవి మండలం మోపిదేవిలంక గ్రామానికి చెందిన దేవనబోయిన సాంబశివరావు(65) తన మోపెడ్‌పై బుధవారం ఉదయం ఘంటసాల వెళ్లి పెయింటర్ అవనిగడ్డ బాలశ్రీనివాసరావును ఎక్కించుకుని తిరుగు పయనమయ్యాడు. రామానగరం క్లబ్ రోడ్డు నుంచి చైతన్య స్కూల్ మీదుగా హైవే ఎక్కే క్రమంలో మోపిదేవి వైపు నుంచి మచిలీపట్నం వైపునకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో మోపెడ్ నుంచి సాంబశివరావు, బాలశ్రీనివాసరావు ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. తీవ్రగాయాలపాలైన ఇద్దరినీ 108లో మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే క్రమంలో సాంబశివరావు మార్గమధ్యలోనే మృతి చెందారు. బాలశ్రీనివాసరావును మచిలీపట్నం తీసుకువెళ్లి అటు నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. కేసు నమోదు చేసి ఎస్ఐ డి.దుర్గాంజనేయులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
3, 4 తేదీల్లో రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీలు
తిరువూరు: రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు అక్టోబర్ 3, 4వ తేదీల్లో తిరువూరులో జరుగుతాయని ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు నాగుబండి విశ్వేశ్వరరావు బుధవారం తెలిపారు. తిరువూరు బైపాస్‌రోడ్డు సెంటర్లోని నాగుబండి రామారావు మెమోరియల్ కన్వెన్షన్‌లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగాల్లో సీ్త్ర పురుషులకు వేర్వేరుగా ఈ పోటీలు జరుగుతాయని, వివరాలకు 9490333249 నంబరులో సంప్రదించాలని కోరారు. ఇబ్రహీంపట్నం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అండర్–19 క్రికెట్ జట్టు ఎంపికలు ఇబ్రహీంపట్నంలోని జాకీర్ హుస్సేన్ కళాశాల క్రికెట్ మైదానంలో నిర్వహించారు. క్రికెట్ సెలెక్షన్స్‌ను కళాశాల ప్రిన్సిపాల్ జాఫర్ సాధిక్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన 200మంది బాల బాలికలు ఈ పోటీలో పాల్గొని తమ సత్తాచాటారన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వి .రవికాంత్ మాట్లాడుతూ ఇక్కడ ఎంపికై న జట్లు త్వరలో తిరుపతిలో జరగనున్న 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 స్టేట్ మీట్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. సెలెక్టర్లుగా సుందర్, అవినాష్, రఘురాం, కె.వి నారాయణ, శివలక్ష్మి వ్యవహరించారు. పెనమలూరు: ప్రతిష్టాత్మకమైన జాతీయ ప్లేస్మెంట్ అవార్డు–2026 సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో పని చేస్తున్న డీన్ ఇండస్ట్రీయల్ రిలేషన్ అండ్ ప్లేస్‌మెంట్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ డి.రాజేశ్వరరావుకు వచ్చింది. ఇటీవల జైపూర్‌లో జరిగిన ఎడ్యూస్కిల్స్ కనెక్ట్–2026లో జాతీయ స్థాయి పురస్కారాన్ని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేతుల మీదగా అందుకున్నారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించటం, పరిశ్రమలతో విద్యా సంస్థలను అనుసంధానం చేయటం, ప్లేస్మెంట్ కార్యక్రమం సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించటంతో రాజేశ్వరరావు చేసిన కృషికి అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా వర్సిటీ యాజమాన్యం, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ (కేడీసీఏ) ఆధ్వర్యంలో అండర్–14 బాలుర జట్టు ఎంపికలను నిర్వహిస్తున్నామని కేడీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం. రవీంద్ర చౌదరి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2022, సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత 2014, ఆగస్టు 30వ తేదీకి ముందు జన్మించిన వారు ఈ ఎంపికల్లో పాల్గొనడానికి అర్హులని వివరించారు. ఈ నెల 3వ తేదీ (శనివారం) ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.00గంటల లోపు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణ లోని కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని క్రికెట్ మైదానంలో ఆదివారం ఉదయం 8.00గంటల నుంచి ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యుత్ తీగలు తెగిపడి పాల వ్యాన్ దగ్ధం అబ్దుల్లాపూర్‌మెట్(హైదరాబాద్): నిలిపి ఉన్న పాల వ్యాన్‌పై విద్యుత్ తీగ తెగి పడడంతో మంటలు అంటుకుని దగ్ధమైన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లాకు చెందిన చింతకుంట జయరాజ్ విజయా మిల్క్స్లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నిత్యం విజయవాడ నుంచి ఎల్బీనగర్కు వ్యాన్‌లో పాలు తీసుకుని వస్తాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరిన జయరాజ్ బుధవారం ఉదయం ఎల్బీనగర్లో పాలను అన్లోడ్ చేసి మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడకు వెళ్తుండగా బాటసింగారం పండ్ల మార్కెట్ సమీపంలో టీ తాగేందుకు ఆగాడు. జయరాజ్ టీ తాగి వచ్చేసరికి మిల్క్ వ్యాన్‌కు మంటలు అంటు కున్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. విద్యుత్ తీగ తెగి పడటంతోనే వ్యాన్ కాలిపోయిందని గుర్తించారు. జయరాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మా మధ్య ప్రభుత్వం చిచ్చు పెడుతోంది
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ‘సచివాలయ సిబ్బంది, పోలీసుల మధ్య ప్రభుత్వం చిచ్చు పెడుతోంది. మేము, పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులమే. మాకు వారంతా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు. అటువంటి మా మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది’ అంటూ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇటీవల చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న తమపై పోలీసులు కేసులు నమోదు చేయటం, తమ వివరాలను సేకరించడంపై సచివాలయ సిబ్బంది విస్మయం వ్యక్తంచేస్తున్నారు. తమకు న్యాయంగా రావాల్సిన హక్కుల గురించి వివరించి, ప్రభుత్వానికి తమ ఆవేదనను వ్యక్తం చేయటానికి చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టామని స్పష్టంచేశారు. అయితే ప్రభుత్వ పెద్దలు తమ ఆందోళనను మరో రకంగా తీసుకొని తమపై కక్షకట్టే ప్రయత్నం చేయటం దారుణమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేదనటం కుట్రలో భాగమే.. సచివాలయ సిబ్బంది అనేక మాసాలుగా వారి సమస్యల గురించి ప్రభుత్వానికి వివిధ రూపాల్లో విన్నవిస్తున్నారు. మంత్రులు, ఇతర ప్రభుత్వ పెద్దలను కలిసి తమకు రావాల్సిన హక్కుల గురించి విజ్ఞ ప్తులు చేస్తున్నారు. దానికి తోడు గడిచిన ఎన్నికల్లోనూ సచివాలయ సిబ్బందికి అనేక వాగ్దానాలు చేసినట్లు గుర్తు చేస్తున్నారు. వాటి సాధన కోసం చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి మరో సారి ప్రభుత్వానికి తమ సమస్యలను గురించి వివరించా లని నిర్ణయించామని, అనుమతి కోసం పోలీసు శాఖకు దరఖాస్తు చేశామని తెలిపారు. అందరూ విజయవాడకు బయలుదేరిన తరువాత ముందు రోజు రాత్రి అనుమతి లేదంటూ ప్రకటించటం, ఎక్కడికక్కడ నిర్బంధించటం కుట్రలో భాగమేనని సచివాలయ ఉద్యోగ నేతలు విమర్శిస్తున్నారు. మేం సంఘ విద్రోహ శక్తులం కాదు.. తమ సిబ్బంది నిబద్ధతతో ఉద్యోగాలు చేస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘ నేతలు స్పష్టంచేస్తున్నారు. విజయవాడలో ఎక్కడికక్కడ తమను నర్బంధించి, మహిళలను సైతం పోలీసుస్టేషన్లకు తరలించటం, రాత్రి వరకూ స్టేషన్లలోనే ఉంచ టంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. తమపై కేసులు అంటూ రాష్ట్ర వ్యాపితంగా భయకంపితు లను చేస్తున్నారని వాపోతున్నారు. తాము సంఘ విద్రోహ శక్తులం కాదని, ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఉద్యోగులమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షా 30 వేల మందికి పైగా ఉన్న తమపై ప్రభుత్వం ఈ విధమైన నిర్బంధాలు విధించి ఇబ్బందులు పెట్టడం ఏమిటో అర్థం కావటం లేదంటూ ఉద్యోగ సంఘ నేతలు వాపోతున్నారు. అత్యధిక విద్యార్హతలు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక విద్యార్హతలు ఉన్నవారు సచివాలయ సిబ్బందేనని వారు చెబుతున్నారు. డిగ్రీలే కాకుండా పీజీలు, ఎంఫీల్, పీహెచ్డీ చేసిన వారు సైతం సచివాలయ ఉద్యోగుల్లో ఉన్నారంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ధర్నా చేసిన తరువాత రెండు గంటలకు అందరూ వెళ్లిపోయేవారమేనని, అందరూ తమ గమ్యస్థానాలకు వెళ్లటానికి మూడు గంటల నుంచే రైలు, బస్సు టిక్కెట్లు బుక్ చేసుకున్నారని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. అయితే తమను ఎక్కడికక్కడ నిలిపివేసి రాత్రి వరకూ అందరినీ విజయవాడలో ఉండేలా పోలీసు శాఖ నిర్బంధించటం వల్ల తాము చాలా ఇబ్బందు లెదుర్కొన్నామని ఉద్యోగులు చెబుతున్నారు. -
సాహితీ విప్లవ సేనాని.. త్రిపురనేని
గుడ్లవల్లేరు: హేతువాద శిఖరం.. కలమే కరవాలమైన భావ విప్లవకారుడు.. తెలుగు సాహితీ ధ్రువతార, కుల వివక్ష, మూఢనమ్మకాలు, సామాజిక అసమానతలను తన రచనల ద్వారా ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం రగిలించిన సంఘ సంస్కర్త, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి. ప్రశ్నకు పట్టం కట్టిన ఆయన రచనలను, ఆయన భావజాలాన్ని నేటి తరానికి పరిచయం చేయడమే లక్ష్యంగా అక్టోబర్ మూడో తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో యువజన సదస్సును నిర్వహిస్తున్నారు. రామస్వామి తెనాలి మునిసిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాగా దీనికి అనుసంధానంగా ఆయన జన్మస్థలమైన కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు నుంచి తెనాలి వరకు చైతన్యయాత్రకు గురువారం శ్రీకారం చుడుతున్నారు. డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నేతృత్వంలో కవిరాజు మనుమలు, విశిష్ట రచయిత గోపీచంద్ తనయుడు సినీ నటులు త్రిపురనేని సాయిచంద్ ఈ చైతన్య యాత్ర నిర్వహించనున్నారు. సంఘ సంస్కర్త కవిరాజు.. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరులో 1887 జనవరి 15న జన్మించారు. ‘జంబుక వథ’, ‘సూత పురాణం’, ‘ఖూనీ’ వంటి రచనలతో సంప్రదాయ భావజాలంపై తనదైన తర్కబద్ధమైన కవిరాజు కలం సమాజ మార్పు కోసం విమర్శను వ్యక్తం చేశారు. మచిలీపట్నం హిందూ కాలేజీలో ప్లీడర్‌గా చదువుతున్న కవిరాజును నీవు శూద్రుడవంటూ.. మరొక విద్యార్థి బయటకు నెట్టారు. అప్పుడాయన కలం నుంచి జాలువారిన ‘జంబుక వథ’ తెలుగులో సాంస్కృతిక విప్లవానికి నాంది పలికింది. అనంతరం స్వాతంత్రోద్యమానికి ఊపిరులు ఊదుతూ.. ’వీరగంధము తెచ్చినారము’ అంటూ తన రచనలతో పోరాటానికి కొత్త ఊపు తెచ్చారు. పత్రికా సంపాదకుడిగా.. ‘రైతు’ దినపత్రికకు సంపాదకుడిగా 1922లో తెనాలికి చేరారు. మరో వైపు న్యాయవాదిగా కొనసాగుతూనే సంస్కరణోద్యమాన్ని తలకెత్తుకున్నారు. తెనాలిలోని తన ఇంటిని ‘సూతాశ్రమం’గా మార్చారు. హేతువాద సమరానికది కార్యక్షేత్రమైంది. రెండుసార్లు తెనాలి మున్సిపల్ చైర్మన్‌గా త్రిపురనేని ఎన్నికయ్యారు. కవిరాజుగా సత్కారం.. 1929లో చైన్నెలోని ఆంధ్ర మహాసభ రామస్వామిని ‘కవిరాజు’గా సత్కరించింది. క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలి ప్రజలపై సామూహిక జరిమానా విధించారు. ఆ వేధింపులపై 1943 జనవరిలో తెనాలి సభలో కవిరాజు మాట్లాడారు. తర్వాత అనారోగ్యానికి గురై అదే నెల 16న కన్నుమూశారు. భారత ప్రభుత్వం 1987లో తపాల స్టాంప్ విడుదల చేసింది. తాత కవిరాజు రాసిన వీరగంధం తెచ్చినారము పద్యాన్ని గాంధీజీ ప్రశంసించారు. ఆనాటి ఉద్యమ సభల్లో ఆ పద్యాన్ని చదివి పోరాటాన్ని చైతన్య పరిచాలని బాపూజీనే నాయకులకు సూచించారు. సీనియర్ ఎన్టీఆర్ కూడా తాత రచనల్ని కొండవీటి వెంకట కవి ద్వారా ఆచరించి దానవీరశూర కర్ణ, సీతారామ కల్యాణం వంటి సినిమాలు తాత రచనల ప్రభావంతో వెలువడినవే. – త్రిపురనేని సాయిచంద్, సినీ నటుడు, కవిరాజు మనవడు -
గురువారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, విజయవాడ: లంకపల్లి లంక భూముల విషయంలో భారీ స్కామ్‌కు అధికారపార్టీ తెరలేపింది. రెవెన్యూ అధికారుల సహకారంతో రీసర్వే పేరుతో 350 ఎకరాలను అసలు భూములే లేనివారికి అదనంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడం ద్వారా వచ్చే మూడేళ్లలో మూడు వందల కోట్ల రూపాయల మేర దండుకునేందుకు రంగం సిద్ధం చేసింది. లంకపల్లి లంకలో 250 ఎకరాలకు పాస్‌పుస్తకాలు ఉండగా, రికార్డుల్లో లేని వాళ్ల పేర్లతో వీలునామా సృష్టించిన అధికారులు పట్టాలు మంజూరు చేశారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు తీసుకున్నారని సమాచారం. మరోవైపు పేదలకు చెందిన భూములను నిషేధిత జాబితాలో చూపిస్తూ, ప్రభుత్వ భూములుగా గుర్తించి వాటిలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చేశారు. సాగుభూమి కంటే ఎక్కువ భూములు ఉన్నట్లు చూపించి భారీగా కొల్లగొట్టారు. గతంలో ఉన్న వీలునామా ఆధారంగా ఈ భూములు కేటాయించినట్లు తహసీల్దార్ చెబుతున్నారు. కోర్టు వివాదాలను విస్మరించి.. పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం లంకపల్లి లంకలో రెవెన్యూ అధికారులు అవకతవకలకు పాల్పడి సుమారు 600 ఎకరాలకు అనధికారికంగా రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ చేసేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ భూముల యాజమాన్యంపై వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత తహసీల్దార్ నవీన్‌కుమార్ హడావిడిగా తనకు అనుకూలంగా ఉండే వారికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేశారు. గతంలో ఈ రైతులు ఎప్పుడూ భూముల కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. ఈ భూముల కేటాయింపునకు ఆ రైతులకు సంబంధించిన డాక్యుమెంట్లు, లింకు దస్తావేజులు ఇతర అర్హత పత్రాలు కూడా పరిశీలించలేదు. వీఆర్ఓ గానీ ఆర్ఐ గానీ తమ రిమార్కులు పంపకుండానే తహసీల్దార్ పట్టాలు ఇచ్చేశారు. రికార్డులు తారుమారు భూ రీసర్వే సందర్భంగా సర్వే జరిపి వారి భూములు వారికి ఇచ్చినట్టు తహసీల్దారు చెబుతున్నారు. ఈ రీసర్వే పేరుతో తహసీల్దారు, సర్వేయర్లు కుమ్మకై ్క రికార్డులు తారుమారు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో వివిధ కారణాలతో నదీగర్భంలో కలిసి పోయిన భూములను ఏవి ధంగా సర్వేచేసి హద్దులు గుర్తించారన్న విషయం చెప్పడం లేదు. ఇదే గ్రామానికి చెందిన కోగంటి పూర్ణచంద్రరావుకు ఒక్క ఎకరం భూమి లేకపోయినా 30 ఎకరాలు కేటాయించేశారు. మన్నె కోటేశ్వరరావుకు 12.5 ఎకరాలు, మన్నె శ్రీనివాస రావుకు 25 ఎకరాలు కేటాయించగా, మానసిక పరిస్థితి సరిగాలేని కృష్ణచైతన్య పేరుతో ఏకంగా 16.77 ఎకరాలు కేటాయించారు. వీరిలో కొందరికి భూమి కేటాయించినట్లు కూడా తెలియదు. పది మందికి సుమారు పది నుంచి 30 ఎకరాల వరకూ పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేశారు. ఇవన్నీ స్థానిక ఎమ్మెల్యే బినామీగా ఉండే గంటా సురేష్‌తో కుమ్మకై ్క తహసీల్దార్ కేటాయించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. యలమర్రు ఎస్టేటు జమీందారుల నుంచి లంకపల్లి లంకలో అప్పటి సర్వే నంబర్లు 13,14లో 371.60 ఎకరాలను ఎకరాకు రూ.250 చొప్పున 1952లో కొనుగోలు చేశారు. రూ.8 వేల అగ్రిమెంటు మొత్తం చెల్లించి స్వాధీనం చేసుకొని అప్పటి నుంచి అనుభవిస్తున్న ఎస్సీ భూములను కూడా ప్రభుత్వ భూములుగా చూపిస్తూ నిషేధిత జాబితాలో చేర్చారు. ఇదే భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. మైనింగ్ కోసం తహసీల్దారు టెండర్లు పిలిచిన భూమి 22ఏలో ఉంది. దీన్ని ప్రభుత్వ భూమిగా తేల్చి పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇసుక కాంట్రాక్టర్లకు కేటాయించి అక్రమాలకు తెరలేపారు. అసైన్డ్ ల్యాండ్ చట్టం ప్రకారం ఈ భూములను వాణిజ్య అవసరాలకు వాడకూడదని ఉన్నప్పటికీ నిబంధనలు తుంగలో తొక్కారు. సెక్షన్ 22–ఏ అసైన్డ్ భూములను కలెక్టరు అనుమతి లేకుండా డీనోటిఫైడ్ చేయకుండా ఇసుక మైనింగుకు ఇవ్వకూడదు. గ్రామ సభల తీర్మానం లేకుండా లంక భూములు, నదీగర్భంలో ఇసుక మైనింగ్‌కు అనుమతి లేదు. లంకపల్లిలో 150 మంది ఎస్సీ/ఎస్టీ కుటుంబాలు పదేళ్ల నుంచి డీకేటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటిని పక్కన పెట్టి ఆదాయం కోసం రెవెన్యూ అధికారులు అడ్డదారులు తొక్కడం వివాదాస్పదంగా మారింది. దీనిపై మాజీ ఎమ్మెల్యే కై లే అనీల్‌కుమార్ నేతృత్వంలో ఉయ్యూరు ఆర్డీఓ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పామర్రు నుంచి ఒక ప్రతినిధి బృందం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం కలిసి ఫిర్యాదు చేసింది. అవసరమైతే ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే కై లే అనీల్‌కుమార్ వెల్లడించారు. -
గుర్తుతెలియని మృతదేహాలు లభ్యం
కంకిపాడు: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. ఎస్ఐ కేవైదాసు తెలిపిన కథనం మేరకు.. మండలంలోని పునాదిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఎదురుగా ఉన్న గ్యాస్ గోదాము సమీపంలోని పంట బోదెలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మేరకు వీఆర్ఓ అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి వయస్సు 45–50ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి ఆచూకీ, మృతికి గల కారణాలు నిర్ధారించేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దాసు తెలిపారు. చికిత్స పొందుతూ మరొకరు.. మైలవరం: మైలవరం పరిసర ప్రాంతాల్లో సుమారు నెల రోజులుగా సంచరిస్తూ కనిపించిన సుమారు 60 నుంచి 70ఏళ్ల మధ్య వయస్సు గల గుర్తు తెలియని మగ వ్యక్తి మైలవరం ఎల్బీఆర్సీఈ సమీపంలోని దర్గా వద్ద అనారోగ్యంతో ఉన్నట్లు తెలిసిందని పోలీసులు బుధవారం తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈ వ్యక్తిని ఈ నెల 24న మైలవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించగా.. ఈ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుని వద్ద గుర్తించడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని, తెలిసిన వారు 94407 96447కు సమాచారం ఇవ్వాల్సిందిగా ఎస్ఐ సుధాకర్ కోరారు. -
బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): బయో మెడికల్ వ్యర్థాలను ఎలా వేరు చేయాలనే అంశంపై బుధవారం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్, డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులకు అవగాహన సదస్సు జరిగింది. గవర్నర్‌పేటలోని ఐఎంఏ హాలులో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వ ర్యంలో జరిగిన ఈ సదస్సులో పీసీబీ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పి.శ్రీనివాస్ ఆస్పత్రి పరిసరాల్లో బయో మెడికల్ వ్యర్థాలపై అవగాహన కల్పించారు. ఏవిధంగా బయో మెడికల్ వ్యర్థాలను వర్గీకరణ చేయాలి, వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను వివరించారు. నిబంధనలు పాటించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగా హన కలిగించారు. బయో మెడికల్ వ్యర్థాలు, మునిసిపల్ కార్పొరేషన్ తరలించే సాధారణ వ్యర్థాలతో కలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్‌లో చెప్పిన నియమ నిబంధనలు కచ్చితంగా పాటించా లని సూచించారు. లేనిపక్షంలో సంబంధిత హాస్పిటళ్లు, ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సదస్సులో వీఎంసీ ఏఎంఓహెచ్ డాక్టర్ గోపాల్‌నాయక్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ వి.ఎన్.వరప్రసాద్, డాక్టర్ అనురూప్, బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్రతినిధి వి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
పట్టాలపై ఎన్నిసార్లు హక్కులు కల్పిస్తారు బాబూ?
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్నికల వేళ పేదలకు ఇళ్ల పట్టాభిషేకం పేరుతో విజయవాడలో నిర్వహించిన ఆర్భాటపు సభలో చంద్రబాబు చెప్పినవన్నీ భూటకపు మాటలేనని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రస్తుతం పంపిణీ చేస్తానన్న 24,042 పట్టాల్లో 21,456 పట్టాలు గత ప్రభుత్వంలో ఇచ్చినవేనని ఆయన పేర్కొన్నారు. కేవలం 2,586 మాత్రమే కూటమి పట్టాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. వాటికే పెద్ద ఎత్తున సభ పెట్టి, ప్రజా ధనంతో బస్సుల్లో ప్రజలను తరలించడం అవసరమా అని దేవినేని అవినాష్ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు, ఇప్పటి వరకూ చంద్ర బాబు 16 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఎప్పుడైనా పేదలకు ఇళ్లస్థలాల కోసం సెంటు భూమి ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలనే తాము ఇస్తున్నట్లు అబద్దాలు వల్లె వేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలో లక్ష మంది పేదలు అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నారని, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా పట్టాభిషేకం అంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. అంతేకాదు తనకు తానే వాటర్ మ్యాన్ అనే బిరుదు ఇచ్చుకున్నారని, రాష్ట్రంలో ఆయన కట్టిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా అని అవినాష్ ప్రశ్నించారు. ఆయన వాటర్ మ్యాన్ కాదు, కరువు మ్యాన్ అన్నారు. -
దుర్గమ్మ నిత్యాన్నదానానికి రూ.3.04 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఏలూరుకు చెందిన భక్తులు బుధవారం రూ.3.04 లక్షల విరాళం సమర్పించారు. ఏలూరు శాంతినగర్‌కు చెందిన కాపర్ల శ్రీరామ్ కుటుంబం అమ్మ వారి దర్శనానికి విచ్చేసింది. శ్రవణ్, సాన్వి, స్వర్ణ పేరిట రూ.3.04 లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఛైర్మన్ రాధా కృష్ణ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సినీ నటుడు నాని బుధవారం దర్శించుకున్నారు. అమ్మ వారి దర్శనానికి విచ్చేసిన నానికి ఆలయ అధి కారులు సాదరంగా స్వాగతం పలికారు. ప్యారడైజ్ సినిమా విజయవంతం కావడంతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరి పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు నానికి వేద ఆశీర్వచనం, ఆలయ అధికారులు ప్రసాదాలను అందించారు. నానితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు, ఆలయ సిబ్బంది పోటీ పడ్డారు. ఆటోనగర్(విజయవాడతూర్పు): మార్కెట్లో పెద్ద ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కిలో రూ.35కే రైతు బజార్ల ద్వారా విక్రయిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలి పారు. విజయవాడ ఏపీఐఐసీ కాలనీ రైతుబజారులో ఉల్లి పంపిణీ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్లో హోల్‌సేల్‌గా కిలో ఉల్లిని రూ.70 చొప్పున విక్రయిస్తున్నారని, దీంతో పేద, మధ్యతరగతి వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా రైతుబజారుల్లో సబ్సిడీపై ఉల్లిని పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్, సివిల్ సప్లయీస్ కమిషనర్ కె.కన్నబాబు, డైరెక్టర్ నుపుర్ అజయ్ శ్రీనివాసర్, డీఎం సతీష్ పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: స్థానిక రుస్తుంబాద్ బాయ్స్ మునిసిపల్ హై స్కూల్‌ను కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావు బుధవారం సందర్శించారు. విద్య, పరిపాలన అంశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, నోట్‌బుక్‌ల కరెక్షన్, ఉపాధ్యాయుల సిలబస్ స్థాయి, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్లను పరిశీలించడంతో పాటు బియ్యం, గుడ్ల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులు వినియోగిస్తున్న స్పోర్ట్స్ కిట్లు, అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యత పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి అభ్యసన స్థాయిని తెలుసుకు న్నారు. మిషన్ మార్చి–2027లో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు స్ఫూర్తి బుక్స్‌ను పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠశాల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలుపై సంబంధిత సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. -
దసరా ఉత్సవాలకు ప్లాన్–బీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలకు ఆలయ అధికారులు ప్లాన్–బీ సిద్ధం చేస్తున్నారు. ఏటా ఉత్సవాల్లో భక్తులు కొండపైకి చేరుకునేందుకు ఘాట్ రోడ్డు మీదగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది కూడా అదే తరహాలో క్యూలైన్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే కొద్ది రోజుల కిందట తుపాను నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు ఘాట్‌రోడ్డులోని రెండో మలుపు వద్ద భారీగా కొండ చరియలు విరిగి పడ్డాయి. ఘాట్ రోడ్డులో మరమ్మతుల కారణంగా రాకపోకలను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఉత్సవాల తరుణంలో అనుకోకుండా వర్షాలు కురిస్తే ఘాట్ రోడ్డును మూసివేసే అవకాశాలు ఉన్నాయి. 24వ తేదీ కొండ చరియలు విరిగిన ప్రదేశంలో మరి కొన్ని చరియలు ప్రమాదకరంగా ఉన్నాయని ఆలయ అధికారులకు ఇటీవల ఇంజినీరింగ్ నిపుణులు సూచించారు. దీంతో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని దేవస్థాన అధికారులు భావిస్తూ ప్లాన్–బీకి రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్లను రథం సెంటర్ నుంచి మహా మండపం వైపు మళ్లించేందుకు వీలుగా కూడా పనులు చేస్తున్నట్లు సమాచారం. క్యూలైన్లు కనకదుర్గనగర్, మహా మండపం మెట్ల మార్గం ద్వారా ఆలయ ప్రాంగణానికి చేరుకుంటాయి. అమ్మవారి దర్శనం పూర్తయిన వారు మల్లేశ్వర స్వామి ఆలయం మెట్ల మార్గం ద్వారా కిందకు దిగేలా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని సెప్టెంబర్ 28వ తేదీన జిల్లా ఇన్చార్జి మంత్రితో జరిగిన సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ ప్రస్తావించారు. అనుకొని పరిస్థితులు ఎదురయితే ముందస్తుగా మరో ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని సూచన ప్రాయంగా మీడియాకు వివరించారు. దసరా ఉత్సవాలకు విద్యుత్ దీపాల అలంకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. -
ప్రజా సమస్యలు పట్టని కూటమి సర్కారు
గన్నవరం: విమానాశ్రయ విస్తరణలో భూములు కోల్పోయిన బాధితులు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరి తగదని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విమర్శించారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని అల్లాపురంలో ఎయిర్పోర్ట్ విస్తరణలో ప్లాట్లు కోల్పోయిన నిర్వాసితులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని మంగళవారం సందర్శించిన ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఏబీ మాట్లాడుతూ 2014–19 మధ్య విమానాశ్రయ విస్తరణ కోసం రైతుల నుంచి పంట పొలాలు, లే అవుట్లలోని ప్లాట్లను, పేదల ఇళ్లను అప్పటి టీడీపీ ప్రభుత్వం సమీకరించిందన్నారు. అమరావతి రైతులకు ఇచ్చినట్లుగా పరిహార ప్యాకేజీ, ప్లాట్లు ఇస్తామనే హామీలను నెరవేర్చకుండానే అప్పటి ప్రభుత్వం దిగిపోయిందన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అజ్జంపూడిలో ప్లాట్ల అభివృద్ధికి రూ. 120కోట్లు కేటాయించినప్పటికీ నిధులు విడుదల చేయలేదన్నారు. 2024లో ప్రభుత్వం మారిన తర్వాత కూడా విమానాశ్రయ నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో ఎలాంటి పురోగతి లేకపోవడం శోచనీయమన్నారు. ఈ ప్రభుత్వానికి వ్యాపార ప్రయోజనాలు తప్ప, ప్రజా సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయకుండా, ఉన్న విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకుండా, అమరావతిలో మళ్లీ కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఐదు వేల ఎకరాల్లో కార్పొరేట్ సంస్థలకు దొచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్లాట్ల యాజమానుల సంఘ ప్రతినిధి వేదవతి పాల్గొన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు -
సీపీ ప్రకటనపై బార్ అసోసియేషన్ ఆగ్రహం
విజయవాడలీగల్: విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న న్యాయవాదులపై పోలీసులు లాఠీచార్జ్ చేయలేదని, పోలీసుల వద్ద లాఠీలే లేవంటూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ విడుదల చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమని బార్ అసోసియేషన్ ఖండించింది. బుధవారం కోర్టు కాంప్లెక్స్‌లో బెజవాడ బార్ అసోసియేషన్(బీబీఏ) హాలులో న్యాయవాదులు నిరాహారదీక్షలు చేపట్టారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బీబీఏ అధ్యక్షుడు విష్ణుభట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పోలీసుల చేతుల్లో నాలుగు అడుగుల లాఠీలు ఉన్న దృశ్యాలతో కూడిన దాదాపు 20 ఫొటోల ఆధారా లు తమ వద్ద స్పష్టంగా ఉన్నాయని వెల్లడించారు. పోలీసుల దుశ్చర్యలు.. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పోలీసు అధికారులతో ముందుగా చర్చించి, వారి సూచనల మేరకే సమయం మార్చుకుని న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ప్రశాంతంగా బయలుదేరిన తమపై పోలీసులు దౌర్జన్యానికి దిగారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏళ్ల సీనియర్ న్యాయవాది గౌతంరెడ్డిపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారని, చికిత్స కోసం ఐసీయూలో చేర్చాల్సి వచ్చిందని తెలిపారు. ఘటనలో మహిళా న్యాయవాది పసుపులేటి శ్రీదేవిపై చేయి చేసుకుని, జడ పీకేసి దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సంఘటనా స్థలంలో కనీసం ఒక్క మహిళా పోలీసు కూడా లేకపోవడం నిబంధనలకు విరుద్ధమని మండిపడ్డారు. లాయర్లపై జరిగిన దాడులను సమర్థించుకుంటూ, పత్రికల్లో వచ్చిన నిజాలను కప్పిపుచ్చేందుకు పోలీస్ కమిషనరేట్ అభూతకల్పనలతో ప్రకటనలు ఇస్తున్నారని బార్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా.. విజయవాడ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న 142 బార్ అసోసియేషన్లు సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తూ విధులను బహిష్కరించారని చెప్పారు. గురు, శుక్రవారాలలో కూడా శాంతియుత నిరసనలు తెలుపుతూ రాష్ట్రంవ్యాప్తంగా విధులను బహిష్కరించనున్నట్లు లక్ష్మీనారాయణ ప్రకటించారు. నిరాహార దీక్షలో సీనియర్ న్యాయవాది, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి, ఒగ్గు గవాస్కర్, అబ్దుల్ రజాక్, ఆదాంకుమార్, బూదాల సౌమ్య, పొట్లూరి ప్రశాంతి, బుర్రా దయామణి, యడ్ల సుజాత, నరహరిశెట్టి జ్యోతి, ఓగిరాల సునీత, కొత్త మహేశ్వరి, సుభాని, ప్రతాప్, కంతేటి విజయ్‌కుమార్, గడ్డం రవికుమార్ పాల్గొన్నారు. న్యాయవాదులకే రక్షణ లేకపోతే.. సీనియర్ న్యాయవాది పూనూరు గౌతమ్‌రెడ్డి రిలే నిరాహారదీక్షలో పాల్గొని, ప్రసంగిస్తూ ప్రజల పక్షాన నిలబడి న్యాయం చేసే న్యాయవాదులకే రాష్ట్రంలో రక్షణ లేకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఒగ్గు గవాస్కర్‌పై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దురుసు ప్రవర్తన చేయలేదు.. లబ్బీపేట(విజయవాడతూర్పు): న్యాయవాదులంటే తమకు ఎంతో గౌరవం ఉందని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొంత మంది న్యాయవాదులు తమ డిమాండ్స్‌పై నిరసన తెలిపే సమయంలో, అదే రూట్లో ముఖ్యమంత్రి జెడ్‌ప్లస్ కాన్వాయ్ పర్యటన ఉండటం, ఆ సమయంలో వీఐపీ భద్రత, సాధారణ ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా కేవలం రెండు నిమిషాలు ఆగాలని కోరినట్లు తెలిపారు. అయినప్పటికీ న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించడంతో ఆ సమయంలో పోలీసులు వారికి నచ్చచెప్పి, అంబేడ్కర్ స్మారక ద్వారం వద్దకు పంపగా, వారు వినతి పత్రం సమర్పించారని తెలిపారు. న్యాయవాదుల పట్ల ఎలాంటి దురుసు ప్రవర్తన చేయలేదని, పోలీసుల చేతిలో లాఠీలు సైతం లేవని ఆ ప్రకటనలో తెలిపారు. -
వలంటీర్ల పొట్టకొట్టడం న్యాయమేనా?
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విశేష సేవలందించి, ఇంటింటికీ సంక్షేమాన్ని పంచిన గ్రామ/వార్డు సచివాలయ వలంటీర్లను దారుణంగా అవమానించారు.. వైఎస్సార్ సీపీ ఏజెంట్లుగా ముద్రవేశారు.. వారికి ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే వారిని అవస్థల పాల్జేసి.. ఆ వ్యవస్థనే లేకుండా చేశారు. సీన్ కట్ చేస్తే.. అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట కొత్త వ్యవస్థను తీసుకొచ్చి భారీగా పంపకాలకు పూనుకుంది. ప్రజాసేవకు ఏమాత్రం ఉపయోగపడని ఒక భజన బృందానికి జనం డబ్బును వాడేందుకు సిద్ధమైంది. కేవలం సర్కారుకు డప్పు కొట్టేందుకే వారికి భారీ నజరానాలు ప్రకటించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో వలంటీర్లుగా పనిచేసిన వారు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. – సాక్షి నెట్వర్క్ కులం, మతం, పార్టీలకు అతీతంగా అందరికీ సేవలు అందించాం. ఎన్నికల ముందు చంద్రబాబు పలు సభల్లో అధికారంలోకి వస్తే వంలంటీర్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే తొలగించారు. రూ.5 వేలు ఇవ్వడం భారమని చెప్పి నేడు ఇన్ఫ్లుయెన్సర్లకు రూ.వేలకు వేలు ఎలా ఇస్తారు? వలంటీర్ల పొట్టకొట్టడం న్యాయమేనా? 2.61 లక్షల మంది వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి. – కంభపు లక్ష్మయ్య, మాజీ వలంటీర్, మంటాడ, పమిడిముక్కల మండలం, కృష్ణాజిల్లా కూటమి ప్రభుత్వం వలంటీర్లను పూర్తిగా మోసగించింది. ఎన్నికల వేళ అధికారంలోకి రాగానే రూ.10 వేల వేతనం ఇస్తామని ఆశచూపింది. తీరా అధికారంలోకి వచ్చాక రూ.10 వేల మాట అటుంచి ఏకంగా వలంటీర్ వ్యవస్థనే తొలగించింది. రూ.5 వేల గౌరవ వేతనంతో ఇంటింటికీ తిరిగి పారదర్శకంగా సేవలు అందించాం. కూటమి ప్రభుత్వం వలంటీర్లను తొలగించి ఇన్ఫ్లూయన్సర్లకు రూ.లక్షలు కట్టబెడుతోంది. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలి. – కస్తాల అనిల్‌కుమార్, మాజీ వలంటీర్, చందర్లపాడు, ఎన్టీఆర్ జిల్లా -
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పటమట(విజయవాడతూర్పు): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కార్మికుల ఉన్నతి కోసం ఉండాలని, పథకాల అమలు కోసం కాదని, పాత పద్ధతిలో సంక్షేమ బోర్డును పునఃప్రారంభించాలని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక బోర్డు డెప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయ ఏఎల్వో రాజేష్‌కు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పిల్లి నరసింహారావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్రంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. కార్మికుల సమస్యలను ఇప్పటి వరకు కార్మిక శాఖమంత్రి పట్టించుకోకపోవటం శోచనీయమని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం అక్టోబర్ 8న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పట్టణ మండల ప్రభుత్వ కార్యాలయాలు వద్ద ధర్నాన్ని నిర్వహిస్తున్నామని ప్రకటించారు. విజయవాడ సెంట్రల్ ఈస్ట్, మూడు పట్టణ నాయకులు నాగేశ్వరరావు, గురుమూర్తి, వీబీ రాజు, గోవిందు, బాబూరావు, సుబ్బారెడ్డి, రణస్థలం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు -
మేం ఎవరికీ వ్యతిరేకం కాదు
మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. పోటీ పరీక్షల్లో ఉద్యోగాన్ని సంపాదించి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారు అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరవేస్తున్నాం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తలుగా పని చేస్తున్నాం. ధర్నా రోజు రెండు గంటల పాటు అనుమతి ఇస్తే ప్రశాంతంగా ఆందోళన నిర్వహించి వెళ్లిపోయేవాళ్లం. కావాలనే ఇబ్బంది పెట్టి కక్ష సాధింపుగా వ్యవహరించారు. ఇది చాలా బాధాకరం. అసలు ధర్నానే జరగకుండా కేసులు పెట్టడం ఏమిటి? – గుజ్జల రాజ్యలక్ష్మి, అధ్యక్షురాలు, యునైటెడ్ వెల్ఫేర్ జీఎస్డీడబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ -
కొడుకును చంపిన తల్లికి యావజ్జీవ కారాగార శిక్ష
పెనుగంచిప్రోలు: మండలంలోని ముండ్లపాడు గ్రామంలో బాలుడి హత్య కేసులో నిందితురాలైన అతని తల్లి నెల్లూరు సుజాతకు బుధవారం నందిగామ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు ఎస్ఐ అర్జున్ తెలిపారు. ప్రాసిక్యూషన్ ఆధారాల ప్రకారం.. 2017, మే 22న గ్రామానికి చెందిన నిందితురాలి మూడు సంవత్సరాల కుమారుడు అశోక్‌ను చంపి.. అనంతరం మృతదేహాన్ని సమీపంలో కాలువలో పడవేసి నేరాన్ని కప్పి పుచ్చేందుకు ప్రయత్నించింది. అయితే ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం విషప్రయోగం కారణంగానే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారణ అయ్యింది. ఆస్తి కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. దర్యాప్తు అధికారులుగా అప్పటి ఎస్ఐ అవినాష్, సీఐ వైవీఎల్ నాయుడు సాక్షమిచ్చారు. సమర్పించిన మౌఖిక, డాక్యుమెంటరీ, వైద్య, శాసీ్త్రయ ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితురాలు సుజాతను దోషిగా నిర్ధారించి, శిక్షలు విధించింది. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష, రూ.5000 జరిమానా, జరిమానా చెల్లించకపోతే 6 నెలల సాధారణ కారాగార శిక్ష, ఐపీసీ 201 ప్రకారం 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2000 జరిమానా, జరిమానా చెల్లించకపోతే 6 నెలల సాధారణ కారాగార శిక్ష.. రెండు శిక్షలు ఏకకాలంలో అమలు కావాలని కోర్టు ఆదేశించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మచిలీపట్నంఅర్బన్: బందరు సర్వజన ప్రభుత్వ వైద్యశాల (జీజీహెచ్)లో కార్నియా (నల్లగుడ్డు) మార్పిడి శస్త్రచికిత్సలను ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ జి. భానుమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రత్యేక శిక్షణ కోసం జీజీహెచ్ నేత్ర విభాగాధిపతి డాక్టర్ మురళీకృష్ణకు బెంగళూరులోని మింటో నేత్ర వైద్యశాలలో ఈనెల ఒకటి నుంచి నవంబర్ 30వ తేదీ వరకు శిక్షణ పొందేందుకు అనుమతి లభించిందన్నారు. శిక్షణ అనంతరం జీజీహెచ్‌లో కార్నియా మార్పిడి శస్త్ర చికిత్సలు ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలో అంధత్వ నివారణ కార్యక్రమాలను విస్తృతం చేయడంతోపాటు కేటరాక్ట్ ఆపరేషన్లలో రాష్ట్ర స్థాయిలో 8వ స్థానం, స్కూల్ ఐ స్క్రీనింగ్‌లో 3వ స్థానం సాధించినట్లు భానుమూర్తి తెలిపారు. నేత్రదానంలో 510 శాతం ప్రగతితో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. మచిలీపట్నం జీజీహెచ్‌లో జిల్లాలో తొలిసారిగా ఐ డొనేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, ఆరు నెలల్లో 500కు పైగా నేత్రాలను సేకరించినట్లు తెలిపారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డు సెక్రటరీగా బి. సుమైల మరో రెండేళ్లు కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఆమె గతంలో సిద్ధార్థ వైద్య కళాశాలలో అడ్మినిష్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ ఫారిన్ సర్వీసుపై రెండేళ్ల కాల పరిమితితో 2024 అక్టోబరులో పారామెడికల్ బోర్డు సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ ఏడాది అక్టోబరుతో కాలపరిమితి ముగియనుంది. ఈ తరుణంలో మరో రెండేళ్లు ఆ పదవిలో కొనసాగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జి. వీరపాండ్యన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు. -
గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అనటం దారుణం
మా న్యాయమైన సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే లక్ష్యంతో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టాం. దాని గురించి మీడియాలో కొంత మంది బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని వ్యాఖ్యానించడం చాలా దారుణం. మేం ప్రజల్లో భాగమే. అలాగే ప్రభుత్వంలోనూ ఉద్యోగాలుగా భాగస్తులమే. మమ్మలను ఆ విధంగా దూషించి మాట్లాడటం చాలా బాధ కలిగించిం. ఇప్పటికై నా మా సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. – వి.శ్రీనివాసులు, సచివాలయ ఉద్యోగి -
కరోనా వేళ సేవలు అందించాం
వలంటీర్లకు నెలకు రూ.5 వేలు ఇస్తేనే ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని డప్పు కొట్టిన కూటమి పెద్దలు ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు రూ.లక్షలు దోచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. రూ.5 వేల జీతం కోసం కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ప్రజల సమస్యలను పరిష్కరించాం. ప్రతి గడపకు వెళ్లి రేషన్‌కార్డులతో పాటు ప్రతి దరఖాస్తులను పూర్తి చేసి వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నాం. – చాట్ల కిషోర్, మాజీ వలంటీర్, రెడ్డిగూడెం, ఎన్టీఆర్ జిల్లా -
అంతా పచ్చ మేనేజ్మెంట్!
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలో మంగళవారం జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలన్నీ పచ్చ నేతల సారధ్యంలోనే కొనసాగాయి. జిల్లాలోని ఆయా మండలాల్లో సగానికి పైగా ప్రభుత్వ బడుల కమిటీలకు సంబంధించి తెలుగు తమ్ముళ్లు హడావుడి చేస్తూ కనిపించారు. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలలో రాజకీయ జోక్యం ఉండకూడదనే స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఉన్న చోట నేతలు తమ ప్రాభల్యాన్ని చాటుకోవటానికి నానా తంటాలు పడ్డారు. మాది ప్రభుత్వం మేమే ఉండాలంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికలలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. జిల్లాలో 905 ప్రభుత్వ బడులు.. ఎన్టీఆర్ జిల్లాలో 20 మండలాలు కొనసాగుతున్నాయి. ఆయా మండలాల్లో ప్రభుత్వ నివేదికల ప్రకారం 905 సర్కార్ బడులు పని చేస్తున్నాయి. అందులో మంగళవారం 892 పాఠశాలలకు స్కూల్ మేనేజమెంట్ కమిటీల ఎన్నికలను పూర్తి చేసినట్లుగా ఆయా విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖాధికారులకు నివేదికలను అందించారు. వారి నుంచి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి సమాచారాన్ని చేరవేశారు. జిల్లాలో సుమారుగా 13 పాఠశాలలకు సరైన కోరం లేకపోవటంతో వాయిదా పడినట్లు అధికారులు చెబుతున్నారు. కమిటీల సంఖ్య గరిష్టంగా 25 మంది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో సభ్యుల సంఖ్య విద్యార్థుల సంఖ్యను బట్టి నిర్ణయించారు. విద్యార్థుల సంఖ్య వంద వరకూ ఉన్న విద్యాసంస్థలకు 12 నుంచి 15 మంది, వంద నుంచి 500 మంది వరకూ ఉన్న విద్యాసంస్థలకు 15 నుంచి 20 మంది, అంతకన్నా అధికంగా ఉన్న విద్యాసంస్థలకు 20 నుంచి 25 మంది కమిటీ సభ్యులు ఉండవచ్చని మార్గదర్శకాలు చెబుతున్నాయి. కమిటీల్లో 75 శాతం సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
లబ్బీపేట: సింగ్‌నగర్‌లోని బసవపున్నయ్య స్టేడియంలో బుధవారం సీఎం చంద్రబాబు కార్యక్రమం ఉండటంతో మంగళవారం రాత్రి సీపీ రాజశేఖరబాబు ఏర్పాట్లు పరిశీలించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విశేష సేవలందించి, ఇంటింటికీ సంక్షేమాన్ని పంచిన గ్రామ/వార్డు సచివాలయ వలంటీర్లను దారుణంగా అవమానించారు.. వైఎస్సార్ సీపీ ఏజెంట్లుగా ముద్రవేశారు.. వారికి ఇచ్చే రూ. 5వేలు గౌరవ వేతనం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే వారిని అవస్థల పాల్జేసి.. ఆ వ్యవస్థనే లేకుండా చేశారు. సీన్ కట్ చేస్తే.. అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట కొత్త వ్యవస్థను తీసుకొచ్చి భారీగా పంపకాలకు పూనుకుంది. ప్రజాసేవకు ఏమాత్రం ఉపయోగపడని ఒక భజన బృందానికి జనం డబ్బును వాడేందుకు సిద్ధమైంది. కేవలం సర్కారుకు డప్పు కొట్టేందుకే వారికి భారీ నజరానాలు ప్రకటించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో వలంటీర్లుగా పనిచేసిన వారు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. – సాక్షి నెట్వర్క్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ ను తెలంగాణ పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం దర్శించుకున్నారు. -
దేశీయంగా ఆక్వా వినియోగాన్ని పెంచాలి
ఎన్ఎఫ్డీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ విజయ్‌కుమార్ బెహరా లబ్బీపేట(విజయవాడ తూర్పు): అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు, అమెరికా విధిస్తున్న పన్నులు, ఆంక్షల వల్ల తీవ్ర ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్న ఆక్వా రంగానికి దేశీయ మార్కెట్ ఒక్కటే రక్ష అని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్ఎఫ్డీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ విజయ్‌కుమార్ బెహరా పేర్కొన్నారు. ఎగుమతులపైనే పూర్తిగా ఆధారపడకుండా, దేశంలో రొయ్యలు, చేపల వినియోగాన్ని పెంచి, రైతులకు, ప్రాసెసింగ్ రంగానికి మద్దతు ఇవ్వాలన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో మంగళవారం ‘శ్రింప్ రిటైల్–2026‘ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆక్వా పోస్ట్ జర్నల్ను అతిథుల ఆవిష్కరించారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన ఆక్వా రైతులు, ప్రాసెసర్లు, రిటైలర్లు పరిశోధకులు రాబోయే రోజుల్లో దేశీయ ఆక్వా రంగాన్ని స్థిరమైన అభివృద్ధి దిశగా మార్చేందుకు అవసరమైన పలు కీలక ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఐసీఏఆర్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జేకే జేనా, శ్రింప్ రిటైల్ కన్వీనర్ ప్రభాస్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. -
సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): విద్యా ఒత్తిడి, పరీక్షలు, వృత్తిపరమైన బాధ్యతలు ఇలా దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలని ప్రముఖ బౌద్ధ గురువు సింగ్హా రిన్పోచే అన్నారు. ప్రశాంతమైన, సానుకూలమైన, సమతుల్యమైన మనస్సును ఎలా పెంపొందించుకోవాలో ఆయన వివరించారు. విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కాలేజీని మంగళవారం ప్రముఖ బౌద్ధ గురువు సింగ్హా రిన్పోచే సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బందితో నిర్వహించిన కార్యక్రమంలో ‘విద్య, దైనందిన జీవితంలో సమతుల్యమైన మనస్సును అభివృద్ధి చేసుకోవడం’ అనే అంశంపై సదస్సు జరిగింది. విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని రిన్‌పోచేతో పరస్పర చర్చలో పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు మాట్లాడుతూ వైద్య విద్యార్థులు భవిష్యత్తులో రోగులకు సేవలందించే వైద్యులుగా ఎదగాలంటే, ఇతరుల ఆరోగ్యంతో పాటు తమ మానసిక ప్రశాంతతను, సమతుల్యతను కాపాడుకోవడం ఎంతో అవసరం అన్నారు.బందరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా పద్మశ్రీ లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జనరల్ సర్జరీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ జి. పద్మశ్రీ మచిలీపట్నం జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా 9 మందికి అడిషనల్ డైరెక్టర్లుగా ఉద్యోగోన్నతులు కల్పించి, రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లోని ఆస్పత్రి సూపరింటెండెంట్లుగా, వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్‌గా నియామకాలకు సంబంధించి దస్త్రం ముఖ్యమంత్రి ఆమోదం పొందినట్లు తెలిసింది. ఈ మేరకు మచిలీపట్నం జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ జి. పద్మశ్రీ బాధ్యతలు చేపట్టనున్నారు. గుంటూరులో సుదీర్ఘకాలం పనిచేసిన ఆమె, అక్కడ డెప్యూటీ సూపరింటెండెంట్‌గా సేవలు అందించారు. ప్రస్తుతం రెండేళ్లుగా విజయవాడలో సర్జరీ విభాగాధిపతిగా ఉన్నారు. విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు కృషి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతోపాటు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి చెప్పారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని నగరంలోని గవర్నరుపేట, ఆర్ఆర్ పేటల్లో జరుగుతున్న విద్యుత్ ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంతో పాటు, నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవికిషోర్‌తో పాటు ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. ఎ.కొండూరు తండాలో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం ఎ.కొండూరు: మండలంలోని విద్యుత్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మండల పరిధిలోని ఎ.కొండూరు తండాలో రూ.94.97కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 220/132/33కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాఽథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు ఎలాంటి లో–వోల్టేజీ, విద్యుత్ అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతోనే కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సబ్‌స్టేషన్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. -
ఎన్నికల వేళ.. పట్టాల ఎర!
పాత పట్టాలతో కొత్త ‘పండుగ’ అందుకేనా?సాక్షి ప్రతినిధి, విజయవాడ: మునిసిపల్ ఎన్నికల వేళ విజయవాడ నగర ప్రజలను మభ్యపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదలకు పట్టాభిషేకం పేరుతో పట్టాల పంపిణీ అంటూ హడావుడి మొదలు పెట్టారు. అందుకోసం సింగ్‌నగర్ మాకి నేని బసవపున్నయ్య స్టేడియంలో కార్యక్రమం ఏర్పా టు చేశారు. దీని కోసం ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. వాస్తవానికి ఇందులో ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదు. కొత్తగా 24,042 పట్టాలు ఇస్తామని ప్రకటించగా అందులో గతంలో పంపిణీ చేసిన పట్టాలు 21,456 ఉండగా, కొత్తగా ఇస్తున్నవి 2,586 మాత్రమే ఉన్నాయి. పచ్చి మోసం.. ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడలో లక్ష మందికి పైగా పేదలకు ఇళ్లు లేవు. అద్దె ఇళ్లల్లో కాపురం ఉంటున్నారు. వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కేవలం పేదలకు పట్టాభిషేకం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో విజయవాడ నగరంలో సుమారు 30వేల మంది వరకూ రాజధానిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఅవుట్లు వేసి స్థలాలు కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసింది. మళ్లీ వారికి సొంత ప్రాంతాల్లోనే పట్టాలు ఇస్తామని ప్రచారం చేసుకున్నా ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. గత రెండున్నర సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రెండు, మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. గతంలో వివిధ ప్రభుత్వాలు ఇచ్చిన 12,710 మందికి మళ్లీ నేడు తాజాగా పట్టాలిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో పట్టాలిచ్చిన 8,746 మందిలో కొందరు చనిపోతే వారి వారసులకు పట్టాలో పేరు మార్చి, కొంతమంది కొనుక్కున్న వారి పేర్లు నేడు మార్చి, ప్రస్తుత లబ్ధిదారులకు కొత్తగా పట్టాలిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. మరి వీరి సంగతేంటి? అదే సమయంలో అభ్యంతరకర ఆక్రమణల పేరుతో నగరంలోనూ, జిల్లాలోనూ, కృష్ణానది కరకట్టపైన, ఏలూరు, రైవస్, బందర్ కాల్వ గట్లు, బుడమేరు గట్టు, రైల్వే శాఖ భూములు, చెరువు భూములు ఇతర ఇరిగేషన్, దేవదాయ శాఖ భూముల్లో దశాబ్దాల నుంచి నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వలేదు. ఇరిగేషన్ స్థలాల్లో స్టార్ హోటళ్లకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం పేదలకు మాత్రం ఇవ్వకపోవడం దారుణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాల్వగట్లపై ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నప్పుడు పేదల ఇళ్లు ఉంటే అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కృష్ణలంకలోని కళానగర్, భూపేష్ గుప్తా నగర్, తారకరామ నగర్ ప్రాంత వాసులు తమకు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ సీపీఎం నేతృత్వంలో గీతానగర్ కరకట్ట వద్ద నిరసనకు దిగారు. కరకట్టకు పక్కన రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత వరదలు వచ్చే పరిస్థితి లేనప్పుడు పట్టాలు ఇవ్వడానికి ఏం ఇబ్బంది వచ్చిందని ఆ ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల కనీసం 50 వేల మంది ఆక్రమణ స్థలాల్లో నివసిస్తున్న వారికి పట్టాలు రాలేదు. దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం 50వేల నుంచి లక్ష రూపాయలు వరకు డిపాజిట్లు వసూలు చేసినా ఇప్పటికీ టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. లబ్ధిదారులకు కేటాయించలేదు. వారిని అప్పులపాలు చేశారు. పదేళ్ల క్రితం విజయవాడ నగరంలో నిర్మించిన జేఎన్ఎన్యుఆర్ఎం పథకంలో నిర్మించిన ఇళ్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. వాటిని పేదలకు ఇవ్వకుండా నేతలు పంచుకుని అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తామని చెబుతున్న పట్టాలు 24,042 వీటిల్లో ఇప్పటికే పంపిణీ చేసినవి 21,456 కొత్తగా కూటమి ఇస్తున్న పట్టాలు 2,586 కొత్తగా ఇస్తున్న పట్టాలు కూడా షరతులతో ఇస్తున్నారు. రెండేళ్ల తర్వాతే పూర్తి హక్కులు కల్పిస్తామని చెబుతున్నారు. దీనివల్ల ఈ పట్టా లు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకోవాలంటే బ్యాంకు రుణాలు కూడా రాని పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికై నా ఎన్నికల ప్రచారం కోసం కాకుండా పేదలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. -
నిండా మునిగిన బొప్పాయి రైతు
100 ఎకరాల్లో పంట నష్టం ఎ.కొండూరు: మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో వాయుగుండం ప్రభావంతో కురిసిన రెండు రోజుల వర్షానికి బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందే సమయంలో వర్షం కురవడంతో సుమారు 100 ఎకరాల్లో సాగు చేసిన బొబ్బాయి తోటలు, కాయలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ .70వేల వరకు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు నష్టాల పాలయ్యామని వాపోయారు. సోమవారం ఉద్యాన శాఖ అధికారి వాసవి సౌజన్య దెబ్బతిన్న పంటను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఉద్యాన శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంటనష్టాన్ని అంచనావేసి నివేదిక పంపుతామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తగిన పరిహారం అందించి తమను ఆదుకోవాలని, కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని రామచంద్రాపురం రైతులు విజ్ఞప్తి చేశారు. తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఆధవ్ అర్జున్ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): గెలుస్తామనే పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో క్రీడాకారులు మైదానంలో అడుగుపెట్టాలని.. అప్పుడే విజయాలు సొంతం చేసుకోగలరని బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, తమిళనాడు రాష్ట్ర పీడబ్ల్యూడీ, క్రీడా శాఖ మంత్రి ఆధవ్ అర్జున్ చెప్పారు. స్థానిక పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం ఆవరణలో 51వ సబ్ జూనియర్(అండర్–13) నేషనల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్–2026 సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అర్జున్ ముఖ్య అతిథిగా హాజరై చాంపియన్‌షిప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. యువత క్రీడలను తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పారు. క్రీడల్లోనూ ఆసక్తి చూపాలి... విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ యువత చదువుతో పాటుగా క్రీడలపై కూడా ఆసక్తి చూపాలన్నారు. బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ టి.చెంగల్రాయుడు, ప్రధాన కార్యదర్శి చక్రవర్తి మాట్లాడుతూ అక్టోబర్ 4వ తేదీ వరకు ఈ చాంపియన్‌షిప్ జరుగుతుందని, వివిధ రాష్ట్రాల నుంచి 54 బాల బాలికల జట్లు పోటీ పడనున్నాయని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జీఎస్సీ బోస్ మాట్లాడుతూ పటమటలోని స్టెల్లా కళాశాల ఆడిటోరియం, చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం, కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో పాటుగా సంఘం సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని భవానీపురం పున్నమీ ఘాట్‌లో అక్టోబర్ 8 నుంచి నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్, సరస్ మేళా కార్యక్రమాల ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అఽధికారులు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించి వారికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ కార్యక్రమాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు పటిష్టమైన కార్యాచరణతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ ఇంజినీర్ పి. సత్యకుమారి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ నిర్మల గ్లోరి తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ సభ్యులకు తల్లి, పిల్లలు అప్పగింత
లక్ష్మీపురం: భర్త వేధింపులు తాళలేక పిల్లలతో సహా ఇంటి వెళ్లిపోయిన భార్యను తిరిగి కుటుంబ సభ్యులకు పోలీసులు సోమవారం అప్పగించారు. వివరాలు ఇవి.. విజయవాడకు చెందిన వేముల కుమారి పెద్ద కుమార్తె రమాదేవిని గుంటూరులోని తుఫాన్ నగర్‌కు చెందిన శ్రీనుతో 2020లో ప్రత్తిపాడు చర్చిలో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. గత కొంత కాలంగా భర్త శ్రీను చెడు వ్యసనాలకు బానిసై, ప్రతి రోజు మద్యం తాగి భార్యను మానసికంగా, శారీ రకంగా వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 20న శ్రీను పూటుగా మద్యం తాగి భార్యను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని బెదిరించడంతో అదే రోజు రాత్రి పిల్లల్ని తీసుకుని పొన్నూరులో ఉంటున్న అత్త మల్లేశ్వరి దగ్గరికి వెళ్లిపోయింది. ఈ విషయమై రమాదేవి తల్లి పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అత్త మల్లేశ్వరి రమాదేవి తల్లికి ఫోన్ చేసి భయపడాల్సిన అవసరం లేదని పొన్నూరులో ఉందని చెప్పి రమాదేవిని, పిల్లల్ని సోమవారం మధ్యాహ్నం పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చింది. పోలీసులు వారిని తల్లి కుమారికి అప్పగించారు. పటమట(విజయవాడతూర్పు): ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వీఎంసీ ప్రజారోగ్య విభాగం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సోమవారం సీతారామపురంలోని లాల్ బహదూర్ వీధిలో వీధి కుక్కలు, పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీఏఎస్ డాక్టర్ హరీష్ కుక్కలకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా సెప్టెంబర్ 28న ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారని, రేబిస్ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన లూయిస్ పాశ్చర్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని పాటిస్తారని తెలిపారు. ఈ ఏడాది ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా ‘వన్ హెల్త్’ విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 86 కుక్కలకు టీకాలు వేయగా, నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సంబంధిత 62 మంది సిబ్బందికి యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ చేసినట్లు పేర్కొన్నారు. వీరులపాడు: మహిళపై లైంగికదాడికి పాల్పడిన రౌడీషీటర్‌పై కేసు నమోదు చేసినట్లు నందిగామ రూరల్ సీఐ వైవీఎల్ నాయుడు పేర్కొన్నారు. మండలంలోని జుజ్జూరు గ్రామానికి చెందిన వివాహిత(35) కడుపు నొప్పి వస్తుండటంతో ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మందులు తెచ్చుకునేందుకు బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఎస్సీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమీపంలోని అదే గ్రామానికి చెందిన మందా శ్రీకాంత్ అనే రౌడీషీటర్ ఆమెను బలవంతంగా తన నివాసంలోకి లాక్కెళ్లి లైంగికదాడికి ఒడిగట్టాడు. విషయాన్ని ఎవరికై నా చెబితే చంపుతానని మహిళను బెదిరించాడు. కుటుంబ సభ్యుల సహాయంతో బాధిత మహిళ సోమవారం మధ్యాహ్నం వీరులపాడు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. సంఘటనా ప్రాంతాలను పరిశీలించి వివరాలు సేకరించామని, ప్రస్తుతం శ్రీకాంత్ పరారీలో ఉన్నాడన్నారు. అతనిపై ఇప్పటికే 10 కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. సీఐ వెంట ఎస్ఐ అభిమన్యు ఉన్నారు. విజయవాడలీగల్: ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో లభ్యమైన మహిళ మొండేనికి సంబంధించిన కేసులో నిందితులకు వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ 5వ అదనపు జ్యుడీషియల్ ఫస్టుక్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ పంప్‌హౌస్ వద్ద కూలింగ్ కెనాల్లో మహిళ మొండెం తేలుతున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు ఆదేశాల మేరకు పశ్చిమ జోన్ డీసీపీ గుణ్ణం రామకృష్ణ, పశ్చిమ డివిజన్ ఏసీపీ ఎన్ఎస్వీకే దుర్గారావు ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఎ. సుబ్రహ్మణ్యం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డ్రోన్లు, ఎస్డీఆర్ఎఫ్ సాయంతో కెనాల్‌లోని శరీర భాగాలను వెలికితీశారు. టాటూ ఆధారంగా.. అనంతరం మృతదేహం చేతిపై ఉన్న నెమలి పించెం టాటూ ఆధారంగా మీడియా, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో ప్రచారం చేయగా, మృతురాలు ఏలూరు జిల్లా కలిదిండి మండలం చిన్న తాడినాడకు చెందిన కర్రి దుర్గా కల్యాణి (29)గా గుర్తించారు. ఆమె ప్రస్తుతం మంగళగిరిలో నివసిస్తోంది. విచారణలో దుర్గ కల్యాణి ఒక హోటల్ యజమానితో సహజీవనం చేయగా బాబుకు జన్మనిచ్చి, ఆ బాబును భవానీపురం హెచ్.బి.కాలనీకి చెందిన మాంసం వ్యాపారి షేక్ షఫీ (46)కి దత్తత ఇచ్చింది. ప్రతిసారి డబ్బులు కావాలని వేధించడంతోపాటు బాబు విషయంలో గొడవలతో షఫీ ఈనెల 17న ఆమెను ఇంటికి పిలిచి, మటన్ కత్తితో హత్య చేశాడు. దీనికి అతని స్నేహితుడు షేక్ అబ్దుల్లా అలియాస్ దుర్గారావు సహాయం తీసుకొని, మృతదేహాన్ని ముక్కలు చేసి తుమ్మలపాలెం, గొల్లపూడి కూలింగ్ కెనాల్లో పడేశాడు. పోలీసులు ఇరువురిని అరెస్టు చేసి సోమవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. -
జాతీయ రహదారిపై కారు దగ్ధం
హనుమాన్‌జంక్షన్‌రూరల్: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద ఓ కారు అగ్నిప్రమాదానికి గురై దగ్ధమైన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్‌హెచ్–16 రహదారిపై కోడూరుపాడు ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో గుంటూరు నుంచి తణుకు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా అగ్నిజ్వాలలు, దట్టమైన మంటలు, పొగలతో కారు దగ్ధం కావటంతో హైవేపై ప్రయాణిస్తున్న వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. క్షణాల వ్యవధిలోనే కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. అగ్ని ప్రమాదాన్ని ముందుగా పనికట్టిన ఆ కారు డ్రైవర్ చోడవరపు మోహన్ వరుణ్, ప్రయాణికులు చిట్టూరి గణేష్, అతని భార్య పూజిత హుటాహుటిన కిందకు దిగటంతో వారికి ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు, హనుమాన్‌జంక్షన్ అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసి, రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. -
2 నుంచి రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్
పెనమలూరు: కానూరులో ఆదివారం రాత్రి గణేశుడి లడ్డూని ఓ భక్తుడు రూ. 11.75లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. గ్రామంలో పెద్ద బావి సెంటర్లో ఏర్పాటు చేపిన శ్రీవర సిద్ధి వినాయక మహోత్సవం సందర్భంగా 40 కేజీల స్వామివారి లడ్డూ వేలం నిర్వహించారు. రాయల్ ఆంధ్ర కిచెన్‌కు చెందిన మాదు రమేష్ లడ్డూని ఏకంగా రూ. 11.75లక్షలకు దక్కించుకున్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 500కోట్లు నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గురజాడ ఆనంద్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్‌కు అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గంలోని పంచ వృత్తుల వారికి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. ఐదు వృత్తులు (మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ) ద్వారా సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి పెద్ద పీటవేయాలన్నారు. సంఘం పునర్వ్యవస్థీకరణ – ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంఘాన్ని పటిష్టం చేస్తామన్నారు. గన్నవరం రూరల్: మండలంలోని వీరపనేనిగూడెం గ్రామంలో సోమవారం కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు మేనేజర్ కె.పార్థసారథిరావు ఆధ్వర్యంలో మామిడి పంటలో విత్తన గుళికలతో వేసిన పీఎండీఎస్ పొలాన్ని, డ్రోన్‌తో విత్తన గుళికలు వేసిన పొలాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరించాలని, దీంతో భూమి ఆరోగ్యంగా ఉండటంతో పాటు నాణ్యమైన దిగుబడులు వస్తాయని కలెక్టర్ చెప్పారు. చిన అవుటపల్లిలో కౌలు రైతు బత్తుల ప్రతాప్ మినుములో అంతర పంటగా నువ్వులు, వేరుశనగ, బొబ్బర్లు, బెండ, మొక్కజొన్న వేసిన పొలాన్ని అధికారులు సందర్శించారు. రబీ కాలంలో ప్రకృతి వ్యవసాయాన్ని ముమ్మరం చేయాలన్నారు. గన్నవరం ఏడీఏ ఎం.సునీల్, ఎంఏవో కె.శివ ప్రసాద్, హార్టికల్చర్ అధికారి హరిచంద్, వీఏఏలు, సిబ్బంది పాల్గొన్నారు. -
విజయవాడ వెల్ఫేర్ యూనిట్ల సందర్శన
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ చారు మాథుర్ సోమవారం విజయవాడ డివిజన్లోని వెల్ఫేర్ యూనిట్లను సందర్శించారు. ముందుగా విజయవాడ డివిజన్ వర్షా సొనాకియాతో కలసి ఈ–వరల్డ్ యూనిట్‌ను సందర్శించారు. అక్కడ నుంచి ప్రత్యేక అవసరాల పిల్లలు ఉండే ‘ఆశా కిరణ్’ను సందర్శించి అక్కడి వారితో ముచ్చటించారు. పిల్లల్లో నైపుణ్యాలు, ఆత్మ విశ్వాసం, స్వయం సమృద్ధిని పెంపొందించే దిశగా చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన టీషర్ట్లను ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడి పిల్లల సంక్షేమం, అభివృద్ధి కోసం విజయవాడ డివిజన్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. -
ప్రయాణికులతో ఆర్టీఛీ ఆటలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల సహనంతో ఆటలు ఆడుతున్నాయి. బస్సు సర్వీసులను అర్ధంతరంగా రద్దు చేసి సీఎం సభలకు తరలిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ మూలన ముఖ్యమంత్రి సభ పెట్టినా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి అక్కడికి ఒక రోజు ముందు గానే బస్సులను తరలిస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులు రెండు రోజుల పాటు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు రద్దయిన విషయం తెలియని ప్రయాణికులు బస్టాండ్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రోజు ముందుగానే తరలిన బస్సులు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో మంగళ వారం పల్లెపండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రభుత్వం తలపెట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లాలోని ఆరు డిపోల నుంచి బస్సులను తరలించారు. విజయవాడ గవర్నర్ పేట –1, 2 డిపోల నుంచి 60 చొప్పున 120 బస్సులు, ఇబ్రహీంపట్నం డిపో నుంచి 50 బస్సులు, తిరువూరు డిపో నుంచి 25, జగ్గయ్యపేట డిపో నుంచి 18, విజయవాడ డిపో నుంచి ఐదు సూపర్ లగ్జరీ బస్సులు తరలించారు. కృష్ణా జిల్లాలోని ఐదు డిపోల నుంచి మొత్తం 130 బస్సులు తరలివెళ్లాయి. మచిలీపట్నం డిపో నుంచి 24, అవనిగడ్డ నుంచి 26, ఉయ్యూరు 35, గన్నవరం 30, గుడివాడ 15 బస్సులను నెల్లూరు జిల్లాకు మళ్లించారు. ప్రయాణికుల పడిగాపులు విజయవాడ గవర్నర్‌పేట రెండు డిపోల నుంచి ఆటోనగర్, నున్న, సింగ్‌నగర్, కాలేశ్వరరావు మార్కెట్, చిట్టినగర్, భవానీపురం, కబేళ, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడుస్తాయి. ప్రధానంగా ఆటోనగర్‌కు ఉపాధి నిమిత్తం ఫ్యాక్టరీల్లో పని చేసేందుకు వెళ్లే వేల మంది బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు బస్సులు రావన్న విషయం తెలియక గంటల పాటు బస్టాండ్లు, బస్టాప్‌ల వద్ద పడిగాపులు పడి, చేసేదేమీ లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదునుగా కొందరు ఆటోవాలాలు అధిక చార్జీలు వసూలు చేశారు. ఇబ్రహీం పట్నం, తిరువూరు నుంచి విజయవాడకు ఉపాధి నిమిత్తం వచ్చేవారు సైతం తీవ్ర ఇబ్బంది పడ్డారు. సిటీ టెర్మినల్‌లో నరకం ముఖ్యమంత్రి హాజరయ్యే ఏ కార్యక్రమం, ఎక్కడ జరిగినా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బస్సులను తరలిస్తున్నారని, ఫలితంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళా ప్రయాణికులు వాపోయారు. సోమవారం విజయవాడ బస్టాండ్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులు లేవన్న సంగతి తెలియక మహిళలు, చంటి పిల్లలు ఉన్న మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సిటీ టెర్మినల్‌కు బస్సులు రావన్న సంగతి తెలియక ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉన్నారు. చంటిబిడ్డల తల్లులు, వృద్ధులు, విద్యార్థులు, మహిళలు ఎండవేడికి, షెల్టర్ కింద నిలబడలేక నరకం చూశారు. రెండురోజుల పాటు పని దినాల్లో బస్సులు లేకుండా చేయడం ఏమిటని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు ఆర్టీసీ డిపోలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. మరో వైపు ఇరాన్ – అమెరికా దేశాల మధ్య యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడిందని, ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు పాటించాలని పాలకులు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏ విషయమైనా సరే ప్రజలకు సలహాలు ఇస్తుందే కానీ పాటించదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీ్త్ర శక్తి పథకం ద్వారా వరుస నష్టాలు వాటిల్లుతున్నా, నెట్టుకొస్తున్న ఆర్టీసీని మరింత బలహీన పరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఈ కార్యక్రమం జరిగినా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బస్సులు తరలిస్తున్నారు. దీంతో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లడానికి.. అక్కడ జనాలను తరలించి.. మళ్లీ విజయవాడకు రావడానికి 348 బస్సులకు వేల లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది. ప్రభుత్వ ఆర్భాటాల కోసం ఈ భారం అంతా ప్రజలపై మోపుతున్నారు. -
సమన్వయంతో దసరా ఉత్సవాల నిర్వహణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరిగే దసరా ఉత్సవాల్లో భక్తులకు సౌకర్యాల కల్పనకే ప్రాధాన్యం ఇస్తామని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై మహా మండపం నాల్గో అంతస్తులోని నూతన సమావేశ మందిరంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, జాయింట్ కలెక్టర్ జి.ఇలక్కియ పాల్గొన్నారు. 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఉత్స వాలకు సుమారు 25 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఘాట్‌రోడ్డులో క్యూలైన్లు, పార్కింగ్ ప్రదేశాలు, హోల్డింగ్ పాయింట్లు, దర్శన మార్గాల్లో వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు క్యూలైన్లలో మంచినీటి వసతి, సేద తీరేందుకు సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ ఏడాది హోల్డింగ్ పాయింట్లలో ఉన్న భక్తులకు ఏ సమయానికి దర్శనం అవుతుందనే విషయాన్ని ఏఐ టెక్నాలజీతో ఎల్ఈడీ స్కీన్లపై డిస్ప్లే చేస్తామని ప్రకటించారు. భక్తులకు విశాల అన్నదాన భవనం అందుబాటులోకి వచ్చిందని, 60 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తామని వివరించారు. దసరా ఉత్సవాల్లో ఇప్పటికే పరోక్ష సేవల టికెట్లు అందుబాటులోకి వచ్చాయని, త్వరలోనే ప్రత్యేక్ష సేవలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. నూతన పూజా మండ పంలో ఖడ్గమాలార్చన, కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చన, చండీహోమం, ప్రత్యేక ఆకర్షణగా ఆది దంపతుల నగరోత్సవం జరుగుతాయని వివరించారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ రహితంగా ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ.. ఉత్సవాల్లో శానిటేషన్ కోసం సిబ్బంది 24 గంటలూ విధులు నిర్వహిస్తారని, కీలక ప్రాంతాల్లో టాయిలెట్లను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసేలా విధులు కేటాయిస్తామన్నారు. ఘాట్‌రోడ్డు, క్యూలైన్లతో పాటు ఆలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఆలయ ప్రాంగణంలో కీలక మార్పులు దసరా ఉత్సవాల్లో కొన్ని కీలక మార్పులు చేయా లని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ పోలీసు, రెవెన్యూ అధికారులను కోరారు. ఉత్సవాల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరిగినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంబంధం లేని శాఖల సిబ్బంది కొండపైకి వచ్చి పదే పదే లోపలకు, బయటకు తిరగడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని ఈ ఏడాది అధిగమించాలని సూచించారు. ఈ సమావేశంలో దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్, ఏడీసీపీ రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, కార్పొరేషన్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. – – ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ -
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
ఎయిర్పోర్ట్ బాధితుల సమస్యలను పరిష్కరించాలి గన్నవరం: విమానాశ్రయ విస్తరణ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్లు కోల్పోయిన యజమానుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరి తగదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. ఎయిర్పోర్ట్ విస్తరణలో భూములు కోల్పోయిన బాధితులతో మండలంలోని అల్లాపురంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. చిరు ఉద్యోగులు, వ్యాపారులు కూడబెట్టుకున్న డబ్బు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ప్లాట్లను కొనుగోలు చేశారని పేర్కొన్నారు. విమానాశ్రయ విస్తరణ కోసం 11 ఏళ్ల క్రితం 550 మంది నుంచి ప్లాట్లు తీసుకున్న ప్రభుత్వం ఇంతవరకు న్యాయం చేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్లాట్లు కోల్పోయిన బాధితులకు సీఆర్ డీఏ అనుమతితో కూడిన పూర్తి మౌలిక సదుపాయాలతో ప్లాట్లు కేటాయిస్తామన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి.హరిబాబు మాట్లాడుతూ.. ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ విమానాశ్రయ అభివృద్ధికి తమ స్థలాలను ఇచ్చిన యజమానులకు ప్రభుత్వం న్యాయం చేయకుండా మానసిక క్షోభకు గురిచేయడం సరికాదన్నారు. బాధితులు న్యాయం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం స్పందించి ప్లాట్ల యజమానులతో సమవేశమై వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్లాట్ల యజమానుల సంఘం ప్రతినిధి వేదవతి అధ్యక్షతన సామాజిక కార్యకర్త డాక్టర్ వసుంధర తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. జేసీతో పాటు డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, మెప్మా పీడీ సాయిబాబు, బందరు డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ నవీన్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. సమస్య స్వభావాన్ని బట్టి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అవసరమైన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించి నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలన్నారు. సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జేసీ అధికారులకు సూచించారు. 142 అర్జీలను అధికారులు స్వీకరించారు. ముఖ్యమైన అర్జీలు ఇవీ.. ● జిల్లాలో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు అందుబాటులో లేకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా వికలాంగ హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి ఎన్.సత్యనారాయణ పేర్కొన్నారు. సంక కర్రలు, హియరింగ్ ఎయిడ్స్, ఎంఆర్ కిట్లు తదితర ఉపకరణాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చి అర్హులకు అందజేయాలని జేసీకి అర్జీ ఇచ్చారు. ● తన కుటుంబం నివసిస్తున్న పూరిగుడిసైపె మూడు నెలల క్రితం పంచాయతీకి చెందిన తాటిచెట్టు విరిగి పడటంతో ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైందని, పంచాయతీ అధికారులు స్థలాన్ని పరిశీలించి నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంత వరకు అందలేదని చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన కర్ర వెంకటరత్నం ఫిర్యాదు చేశారు. త్వరితగతిన నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
లంక భూములను కై ంకర్యం చేస్తున్నారు
చిలకలపూడి(మచిలీపట్నం): పామర్రు నియోజక వర్గం పమిడిముక్కల మండలం లంకపల్లిలోని లంక భూములను అధికార పార్టీ నాయకులు కైంకర్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ విమ ర్శించారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నియోజకవర్గ సమస్యలపై జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. భూముల రీ–సర్వేలో అవకతవకలు జరిగాయన్నారు. సుమారు 300 ఎకరాలను అధికార పార్టీకి చెందిన వారిని బినామీలుగా పెట్టి పట్టాదారు పాస్‌పుస్తకాలు మంజూరు చేయించారని, ఆ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. సొసైటీ భూములను నదీ గర్భంగా చూపించి వాటిని పేదలకు చెందకుండా చూస్తున్నారని విమర్శించారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా నేతృత్వంలో అధికార పార్టీకి చెందిన కోగంటి పూర్ణచంద్రరావు, ఘంటా సురేష్, ఘంటా కృష్ణచైతన్య ఇప్పటి వరకు రూ.200 కోట్ల ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారని దుయ్యబట్టారు. ఎఫ్‌ఎల్‌ఆర్ నుంచి దొంగ వీలునామాలు సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఉన్నతాధికారులు పాస్‌పుస్తకాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఫిర్యాదు చేశాం గతంలో ఈ భూముల వ్యవహారంపై కలెక్టర్ డి.కె.బాలాజీకి ఫిర్యాదు చేయగా పరిశీలిస్తానని చెప్పినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదని అనిల్‌కుమార్ పేర్కొన్నారు. అధికారులే పాలకులకు సహాయ సహకారాలు అందిస్తూ, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా రోజుకు 300 నుంచి 400 లారీల ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శించారు. బహి రంగ ఇసుక దోపిడీపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. జిలా ఎమ్మెల్యేలందరూ అవినీతిలో రాజ్యమేలుతున్నారని, అధికారుల తీరు చూస్తే కలెక్టరేట్‌కు వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం పోతోందని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మాజీ సర్పంచ్ కనుమూరి వెంకటేశ్వరరావు, కొడాలి రాంబాబు, ముళ్లపూడి సోమయ్య, చొప్పరపు నాగేశ్వరరావు, ముళ్లపూడి రాజారత్నం, ముళ్లపూడి రుక్మిణి, పోతార్లంక కోటేశ్వరరావు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ -
జాషువాకు ఘన నివాళి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సమానత్వం, మానవ హక్కుల కోసం కలంతో పోరాడిన మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతిని సోమ వారం నిర్వహించారు. జాషువా చిత్రపటానికి ముఖ్య అతిథి, మంత్రి దుర్గేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంటరానితనాన్ని ఎదు ర్కోవడానికి అక్షరాన్ని ఆయుధంగా మలచుకున్న ధీశాలి జాషువా అని కొనియాడారు. కవిత్వంతో మూఢాచారాలపై తిరగబడ్డారని గుర్తుచేశారు. అనంతరం తెలుగు సాహిత్య వికాసానికి విశేష కృషి చేసిన సాహితీవేత్తలు షేక్ కరీముల్లా, డాక్టర్ జాలాది విజయకుమారి, విల్సన్ రావు కొమ్మవరపు, గడ్డం ఈశ్వరమ్మకు గుర్రం జాషువా సాహితీ పురస్కారం కింద రూ.50 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్ పర్సన్ తేజస్వీ పొడపాటి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. దుర్గమ్మ భక్తుల కోసం మరో బ్యాటరీ వాహనంఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ భక్తుల కోసం ఏపీ గ్రామీణ బ్యాంక్ బ్యాటరీ వాహనాన్ని అందజేసింది. అమ్మవారి ఆలయ ప్రాంగణం మహామండపం దిగువన సోమ వారం బ్యాటరీ వాహనానికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించగా, చైర్మన్ రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్ ప్రారంభించారు. 14 మంది భక్తులు ప్రయాణించేలా పెద్ద బ్యాటరీ వాహనాన్ని బ్యాంక్ అందజేయడం అభినందనీయ మని పేర్కొన్నారు. అనంతరం బ్యాంక్ అధికా రులతో కలిసి ఈఓ శీనానాయక్ బ్యాటరీ వాహనంపై ప్రయాణించారు. సబ్‌జైలు సందర్శనగన్నవరం: స్థానిక సబ్‌జైలును సోమవారం కృష్ణా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సామాల వరలక్ష్మి సందర్శించారు. మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్ డాక్టర్ ఎస్.అరుణశ్రీతో కలిసి ఖైదీలకు అందిస్తున్న సదుపాయలను పరిశీలించారు. తొలుత స్టోర్‌రూమ్, వంటగదిని పరిశీలించిన ఆమె ఖైదీలకు మెనూ ప్రకారం ఆహారం సరఫరాపై సమీక్షించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడిన వరలక్ష్మి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. క్షణికావే శంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా మంచి వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోవాలని, న్యాయ పరమైన సహకారం కోసం స్థానిక న్యాయ సేవాధికార సంస్థలను ఆశ్రయించా లని సూచించారు. జైలు విజిటింగ్ న్యాయ వాది రామకూరి ప్రకాశరావు, జైలు సూపరింటెండెంట్ బి.రాంబాబు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి సదస్సులో పీజీ విద్యార్థిని ప్రతిభ లబ్బీపేట(విజయవాడతూర్పు): తిరుపతిలో ఇటీవల జరిగిన జనరల్ సర్జరీ (శస్త్ర చికిత్స) నిపుణుల రాష్ట్ర వైద్య విజ్ఞాన సదస్సులో ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల జనరల్ సర్జరీ విభాగం పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థిని డాక్టర్ దువ్వూరు హిమవర్ష సత్తాచాటారు. ఈ సదస్సులో అరుదైన ‘పెద్ద ఉదర శ్రోణి ద్రవ్య రాశిగా వ్యక్తమైన గ్యాస్ట్రోబ్లాస్టోమా’ కేసుపై చేసిన పోస్టర్ ప్రజెంటేషన్‌కు ‘బెస్ట్ పోస్టర్’ బహుమతి లభించింది. ఈ సందర్భంగా పీజీ విద్యార్థిని హిమవర్షను సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో శస్త్ర చికిత్స వైద్యవిభాగ అధిపతి డాక్టర్ జి.పద్మశ్రీ, ప్రొఫెసర్లు కె.బి.ఎన్.ప్రభాకర్, జ్వలిత, అసో సియేట్ ప్రొఫెసర్లు సుఫియా, విజేత, అసిస్టెంట్లు చంద్రకాంత్, బి.ఎస్.పి.యాదవ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ధ్రువపత్రం.. జారీలో జాప్యం
పటమట(విజయవాడతూర్పు): జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందడం విజయవాడ నగరంలో పెద్ద ప్రహసనంగా మారింది. నెల రోజుల నుంచి సర్వర్ మొరాయించడంతో ఆయా పత్రాల కోసం ప్రజలు వార్డు సచివాలయాలు, మీ–సేవ కేంద్రాలు, నగర పాలక సంస్థ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం, ఇతర కోర్సుల్లో చేరిన విద్యార్థులు కచ్చితంగా జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని విద్యా శాఖ నుంచి సర్క్యులర్ జారీ అయ్యింది. సమయానికి ధ్రువీకరణ పత్రం సమర్పించకపోతే విద్యార్థుల భవిష్యత్ ఆ ప్రభావం పడుతుంది. సర్టిఫికెట్ల జారీలో జాప్యంపై మునిసిపల్ శాఖ సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్) ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో విజయవాడ నగర వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నెలరోజుల నుంచి సర్వర్ డౌన్ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సీడీఎంఏ విభాగం నుంచి యూబీడీ (యూనిఫైడ్ బర్త్ అండ్ డెత్) పోర్టల్ అనుసంధానంగా ఉంది. యూబీడీ నుంచి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్)ద్వారా రాష్ట్రంలోని నగర పాలక, పురపాలక సంస్థల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను వార్డు సచివాలయం, మీ–సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో జారీ అవు తాయి. ప్రజలు ఆయా కేంద్రాల్లో కనీస రుసుం చెల్లించి సర్టిఫికెట్లు పొందుతారు. అయితే నెల రోజుల నుంచి సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ఆగింది. ఇందుకు కారణం సర్వర్ డౌన్ అవ్వడమేనని, ఈ సమస్య పరిష్కారంలో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవటంలో విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. విజయవాడ నగరంలో సగటున రోజుకు 70 నుంచి 100 వరకు జనన, మరణ ధ్రువపత్రాలు, ఆయా సర్టిఫికెట్లలో పేరు, తేదీ, చిరునామా మార్పు, లేదా ఇతర తప్పొప్పులను సరిచేసి సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ నిలిచిపోయింది. శాఖల మధ్య సమన్వయ లోపం కేంద్ర ప్రభుత్వ ఎన్ఐసీ, రాష్ట్ర ప్రభుత్వ మునిసిపల్ శాఖ, వార్డు సచివాలయ విభాగం మధ్య సరైన సమన్వయం లేకపోవటంతో సమస్య పరిష్కారం కావటంలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ఐసీ ఆధీనంలో ఉన్న సర్వర్ నిర్వహణపై ఆయా శాఖలు తమ పరిధి కాదంటే తమది కాదంటూ గాలికొదిలేశాయి. దీంతో ఇప్పుడు సర్వర్ మొరాయించటంతో ఆ ప్రభావం నగరవాసులపై పడింది. నెల రోజుల నుంచి సమస్య నెలకొన్న పరిష్కారం కోసం ఏ శాఖాధికారులు కూడా సక్రమంగా స్పందించకపోవటం శోచనీయం 1940 నుంచి 2016 డిసెంబర్ వరకు జనన, మరణ వివరాల డేటా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఐసీకి అప్పగించింది. అప్పట్లో విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించి 16 లక్షల డేటా అప్లోడ్ చేశారు. అయితే అందులో కేవలం 50 వేల డేటా మాత్రమే వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ఆయా డేటాకు సంబంధించి తప్పొప్పులను సరి చేసుకునేందుకు మీ –సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే నగర పాలక సంస్థ స్టాటిస్టికల్ అధికారి వివరాలు పరిశీలించి అనుమతిస్తారు. నగర పాలక సంస్థలో అనుమతి పొందాలకు తిరిగి మీ–సేవ కేంద్రాల్లో ప్రింట్ తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రాసెస్ ప్రస్తుతం ఆగిపోయింది. దీని వల్ల ఇటు ప్రభుత్వాదాయానికి గండి పడటంతోపాటు దరఖాస్తుదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2017 నుంచి నగరపాలక సంస్థ స్వయంగా డేటా సమీకరించ టంతో ఆయా వివరాలు సర్వర్‌లో కనిపిస్తున్నాయని, అయితే ప్రింట్ మాత్రం రావటంలేదని సిబ్బంది తెలిపారు. -
గతంలో కూడా ఇలాగే..
2014 – 2019 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా సీఎం చంద్రబాబు ఇలాగే ఆర్టీసీకి నష్టం వాటిల్లే చర్యలు చేపట్టారు. ప్రతి సోమవారం పోలవరం అంటూ ప్రజలను ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లేవారు. ప్రచార ఆర్భాటాల కోసం జనాలను రాష్ట్రం నలుమూలల నుంచి బలవంతంగా జనాలను పోలవరం తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారు. తద్వారా ఆర్టీసీకి డీజిల్ ఖర్చు ఖర్చు మినహా ఒనగూరిన ప్రయోజనం శూన్య మన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు తన ప్రచార ఆర్భాటాల కోసం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుండడంతో అటు ప్రజలకు, ఇటు వ్యవస్థలపై అధిక భారం తప్పడంలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
దాములూరు(ఇబ్రహీంపట్నం): విద్యుతాఘాతంతో ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కార్మికుడు మృతి చెందిన ఘటన మండలం పరిధిలోని దాములూరులో ఆదివారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కొంతమంది కార్మికులు దాములూరులో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు పనుల కోసం ఓ కాంట్రాక్టర్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో విద్యుత్ లైన్‌మన్ విద్యుత్ తీగల పనులు చేయిస్తుండగా డుంబి సింకు (33) అనే కార్మికుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే అతడిని 108 వాహనంలో నిమ్రా వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యుత్ లైన్‌మన్ నిర్లక్ష్యం కారణంగానే కార్మికుడు మరణించాడని తోటి కార్మికులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని తోటి కార్మికులు డిమాండ్ చేశారు. గ్రామం వెలుపల ఉన్న విద్యుత్ లైన్లు ఒకదానికి ఒకటి కలుసుకోవడంతో ప్రమాదం జరిగిందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతి ఎర్రుపాలెం/గంపలగూడెం: అతివేగానికి తోడు హెల్మెట్ ధరించకపోవడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామ సమీపాన ఆదివారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొత్తపల్లికి చెందిన కొరకొప్పుల ప్రేమ్‌కుమార్(32) మధిరలోని ఓ షోరూమ్‌లో వాషింగ్ మెషీన్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఎన్టీఆర్ జిల్లాకే చెందిన మైలవరం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన సగ్గుర్తి రాంబాబు ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు క్లీనర్‌గా పని చేస్తున్నాడు. ఇందులో ప్రేమ్‌కుమార్ తన భార్య సౌజన్య, కుమార్తె ఆరాధ్య, కోడలు పూజితతో కలిసి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందిన పెద్దమ్మ ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఇదే సమయంలో సగ్గురి రాంబాబు(40) స్వగ్రామం నుంచి ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులోని తన చెల్లి ఇంటికి మోపెడ్‌పై వస్తున్నాడు. రోడ్డు మలుపులో.. బనిగండ్లపాడు – బుచ్చిరెడ్డిపాలెం గ్రామాల మధ్య శ్రీఆంజనేయస్వామి గుడి రోడ్డు మలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆ బైక్‌లు వేగంగా రావడంతో ఘటనాస్థలిలోనే సగ్గుర్తి రాంబాబు మృతి చెందగా, ప్రేమ్‌కుమార్‌ను మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనలో ప్రేమ్ బైక్‌పై ఉన్న ఆరాధ్యకు సైతం గాయాలు కావడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో రాంబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈమేరకు ఎస్ఐ ఎం.రమేష్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించగా.. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
హత్య కేసు ఛేదించిన పోలీసులు
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్ల్లో శరీర అవయవాలు తొలగించి.. లభించిన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో భవానీపురానికి చెందిన నిందితుడు షేక్ షఫీని అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా వెస్ట్‌జోన్ ఏసీపీ దుర్గారావు హత్యకు కారణాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 18న కాలువలో మహిళ మృత దేహం స్వాధీనం చేసుకున్న క్రమంలో సీపీ రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారన్నారు. ఆసుపత్రులు, టాటూ సెంటర్లు, టోల్గేట్ల వద్ద సీసీ కెమేరాల పుటేజీలు, పత్రికలు, సోషల్ మీడియా వేదికగా మృతురాలి శరీరంపై దుస్తులు, చేతిపై నెమలి పించం టాటూ ప్రచారం చేసి మృతురాలిని గుర్తించినట్లు చెప్పారు. సోదరుడు ఇచ్చిన సమాచారంతో.. ఆ ఆధారాలతో ఆమె సోదరుడు తన అక్కగా పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆమె మంగళగిరి ప్రాంతానికి చెందిన కర్రి దుర్గ ఆలియాస్ కళ్యాణిగా గుర్తించినట్లు తెలిపారు. సమగ్ర విచారణలో ఆమె స్వస్థలం ఏలూరు జిల్లా కలిదిండి మండలం తాటినాడ గ్రామంగా గుర్తించారు. ఆమె మంగళగిరిలోని ఓ హోటల్లో పనిచేస్తూ గౌస్ మొహిద్దీన్‌తో సహజీవనం చేసి ఒక బాబుకి జన్మనిచ్చినట్లు ఏసీపీ స్పష్టం చేశారు. గౌస్ మొహిద్దీన్‌కు ముందుగానే వివాహం అవడంతో అతనికి దూరమై భవానీపురం హెచ్‌బీ కాలనీకి చెందిన మటన్ దుకాణం యజమాని షేక్ షఫీతో పరిచయం పెంచుకుంది. ఆమె కుమారుడిని కూడా అతని వద్దే ఉంచి సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 17 షఫీతో డబ్బులు వ్యవహారంలో వివాదం రావడంతో ఆమెను వదిలించుకోవాలనే పక్కా ప్రణాళికతో కుటుంబ సభ్యులను ఊరికి పంపించి కళ్యాణిని ఇంటికి పిలిపించాడు. మటన్ కొట్టే కత్తితో.. మటన్ కొట్టే కత్తితో దారుణంగా హత్య చేసినట్లు వెల్లడించారు. తన మిత్రుడు షేక్ అబ్దుల్లా(దుర్గారావు)తో కలిసి ఆమె తల, కాళ్లు, చేతులు వేరు చేసి సంచిలో వేసుకుని బైక్‌పై వెళ్లి ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో పడేశారు. సమగ్ర విచారణలో భాగంగా సీఐ సుబ్రహ్మణ్యం భవానీపురంలో ఉన్న నిందితుడు షేక్ షఫీని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ దుర్గారావు తెలిపారు. మరో నిందితుడు షేక్ అబ్దుల్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. మరో నిందితుడు అబ్దులా కోసం గాలిపు చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన సీఐ సుబ్రహ్మణ్యం, క్రైం ఎస్ఐ సేనాపతి శ్రీనివాసరావు, ఎస్ఐలు రవివర్మ, సత్యవతి, చక్రధర్, సన్యాసి నాయుడిని సీపీ రాజశేఖర్‌బాబు అభినందించినట్లు ఏసీపీ దుర్గారావు పేర్కొన్నారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు -
కూటమి క్రౌర్యం..
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులపై దమనకాండ● ఎక్కడికక్కడ అక్రమ అరెస్ట్‌లు ● అనుమతి లేదనే సాకుతో ఇష్టారాజ్యం ● మహిళలని కూడా చూడకుండా స్టేషన్లలో రాత్రి వరకూ నిర్బంధం లబ్బీపేట(విజయవాడతూర్పు): సచివాలయ ఉద్యోగుల ఉద్యమాన్ని అణచివేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు రెచ్చిపోయారు. వారి పట్ల కర్కశంగా వ్యవహరించారు. ఎక్కడ దొరికితే అక్కడ తమ వాహనాలు ఎక్కించి తరలించారు. మహిళలు అని కూడా చూడకుండా దుర్మార్గంగా వ్యవహరించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా నగరం చుట్టూ తిప్పుతూ చివరికి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు జిల్లా లోని పోలీస్స్టేషన్లకు తరలించారు. అక్కడ వారిని ఇరుకు గదుల్లో పెట్టి, మంచినీళ్లు, ఆహారం కూడా ఇవ్వలేదు. సచివాలయ ఉద్యోగుల పట్ల పోలీసులు ఉగ్రవాదులతో వ్యవహరించినట్లు ప్రవర్తించారు. ప్రభుత్వ ఆదేశాలతోనే.. నగరంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొనేందుకు ప్రభుత్వ ఆదేశాలే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లో విజయవాడలో నిరసన తెలపకూడదనే ఆదేశాలతో పోలీసులు శనివారం రాత్రి నుంచే ఆ పనిలో నిమగ్నమయ్యారు. నిద్రాహారాలు లేకుండా సచివాలయ ఉద్యోగులు బస్టాండ్, రైల్వేస్టేషన్, హోటళ్లు, లాడ్జీలు, డార్మెటరీలు ఇలా అక్కడ దొరికితే అక్కడ పట్టుకుని స్టేషన్లకు తరలించారు. ఒకవైపు ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు, మరోవైపు ఉద్రిక్తతతో పలువురు సచివాలయ ఉద్యోగులతో పాటు పోలీసులూ సొమ్మసిల్లారు. అంతేకాదు ఒక సీఐ గుండెపోటుతో మరణించేందుకు ప్రభుత్వ ఒత్తిడే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీళ్లు, ఆహారం ఇవ్వకుండా.. ఆదివారం వేకువ జాము నుంచే సచివాలయ ఉద్యోగులకు అరెస్టు చేస్తున్న పోలీసులు వారిని స్టేషన్లలో గదుల్లో బంధించారు. వారికి నీరు ఆహారం కూడా ఇవ్వలేదు. ఉక్కపోత, మరోవైపు దాహంతో అల్లాడిపోయారు. అంతేకాదు మహిళా ఉద్యోగులు టాయిలెట్స్‌కి వెళ్లేందుకు కూడా అవకాశం ఇవ్వలేదంటే ఎంతగా వేధించారో అర్థం చేసుకోవచ్చు. అనుమతి నిరాకరణతోనే.. ఏ ఉద్యమం అయినా, నిరసన అయినా అనుమతి ఇస్తే శాంతియుతంగా జరుగుతుంది. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా వివాదాలు సృష్టించేలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వైఎస్సార్ సీపీ డీఎస్సీ అక్రమాలపై చేపట్టిన నిరసన అయినా, ఇప్పుడు సచివాలయ ఉద్యోగులది అయినా అనుమతి కోరితే, ఇవ్వకుండా ఉద్రిక్తతలకు దారితీసేలా ప్రభుత్వమే వ్యవహరించినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. మాచవరం పీఎస్‌లో దారుణం గుణదల(విజయవాడ తూర్పు): మాచవరం పోలీస్ స్టేషన్లో ఉన్న నిరసనకారులకు ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామి రెడ్డి భోజన ప్యాకెట్లు అందించే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంట్రామిరెడ్డిని అడ్డుకుని తాను తెచ్చిన భోజనాన్ని సైతం అనుమతించలేదు. దీంతో ఉద్యోగులు, సంఘ నాయకులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. -
పెను ముప్పుగా ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు
కృష్ణలంక(విజయవాడతూర్పు): కేంద్ర ప్రభుత్వం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ)లో తీసుకొచ్చిన సవరణలు పేదలకు, సామాజిక సేవా సంస్థలకు పెను ముప్పుగా మారాయని డీఎంకే రాజ్యసభ సభ్యుడు, జేపీసీ సభ్యుడు పి.విల్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో నేషనల్ అలయన్స్ ఆఫ్ సివిల్ సొసైటీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డీబీఎఫ్ వ్యవస్థాపకుడు కొరివి వినయ్‌కుమార్ అధ్యక్షతన ఆదివారం సమాలోచన సమావేశం జరిగింది. ముఖ్య అతిథి విల్సన్ మాట్లాడుతూ.. ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ లేదా సర్టిఫికెట్ రద్దయితే ఆయా సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పబ్లిక్ వేలం ద్వారా విక్రయించడం లేదా ప్రభుత్వ విభాగాలకు బదిలీ చేసేలా నిబంధనలు తీసుకురావడం దారుణమన్నారు. సేవా కార్యక్రమాలకు విఘాతం విదేశీ నిధులతో ఏర్పాటైన ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వాటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని విల్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో నడుస్తున్న ఉచిత సేవా కార్యక్రమాలకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ఆదికిరణ్, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, అంబటి రామకృష్ణ, అంగడాల పూర్ణచంద్రరావు, సామ్యూల్ పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు విల్సన్ -
కార్తికేయుని ఆలయం.. భక్తజన సందోహం
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. 1100 నంబరుకు కాల్ చేస్తే అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల సమీక్ష సమావేశం సోమవారం మహామండపం నాల్గో అంతస్తులో జరగనుంది. సమీక్ష సమావేశానికి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి వై. సత్యకుమార్ యాదవ్, ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు పలువురు అధికారులు హాజరు కానున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఉత్సవ ఏర్పాట్లపై చర్చించనున్నారు. అలాగే ఉత్సవాల ప్రత్యేక ఆహ్వాన పత్రికను మంత్రులు ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రభుత్వ పెద్దలకు, ముఖ్యులకు అందజేసే అవకాశం ఉంది. అలాగే ఉత్సవాలలో కీలకమైన ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్లను కూడా విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ ఆదివారం రాయనపాడు వర్క్‌షాపులో విస్తృత తనిఖీలు చేపట్టారు. విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా, ప్రిన్సిపల్ చీఫ్ వర్క్‌షాప్ ఇంజినీర్ డాక్టర్ అమిత్ గుప్తా, రాయనపాడు చీఫ్ వర్క్‌షాపు మేనేజర్ ఎం.త్రినాథ్కుమార్లతో కలసి వర్కుషాపులోని నిర్వహణ బేలు, ఓవర్‌హాల్ లైన్లు, అసెంబ్లీ విభాగాలు, వీల్ అండ్ బోగి షాపులను తనిఖీ చేసి భద్రతా చర్యలు, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. నిర్ధేశించిన లక్ష్యాలు, ప్రస్తుత గణంకాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా నూతన సాంతికేక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన సీటీఆర్బీ (కాట్రిడ్జ్ టేపర్డ్ రోలర్ బేరింగ్) ఓవర్హాలలింగ్ విభాగం, సీఎన్సీ ఎయిర్ ప్లాస్మా కటింగ్ మిషన్‌ను జీఎం ప్రారంభించారు. అదే విధంగా ‘స్వచ్ఛతా హీ సేవా పక్వాడ’ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించే దిశగా అధికారులతో కలసి వర్క్‌షాపు ప్రాంగణంలో మొక్కలు నాటారు. -
డ్రెయిన్ పనుల్లో డొల్లతనం!
పెనమలూరు: తాడిగడప మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీడీపీ అవినీతి దందా బట్టబయలైంది. కానూరులో ఇటీవల నిర్మించిన డ్రైనేజీ కొద్దిరోజులకే కుప్పకూలడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.24.50 లక్షల వ్యయ అంచనాతో చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 25 మీటర్ల మేర కూలిన డ్రైన్ కానూరులోని పంటకాలువ రోడ్డులో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇంటి సమీపంలోని రహదారి పక్కన డ్రైనేజీ నిర్మాణానికి తాడిగడప మున్సిపాలిటీ నిర్ణయించింది. ఇందుకు గత ఏప్రిల్‌లో టెండర్లు పిలిచారు. జూలైలో పనులు ప్రారంభించి, రహదారికి ఒకవైపు డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. మరోవైపు పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే నిర్మించిన డ్రైనేజీలో సుమారు 25 మీటర్ల మేర భాగం రెండు రోజుల క్రితం కూలిపోయి కాలువలో పడింది. నిర్మాణం పూర్తయిన కొద్దిరోజులకే డ్రైన్ కూలిపోవడంతో స్థానికులు పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలను అధికారులు పరిశీలించారా? లేదా అన్నదానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పని చేసిన కాంట్రాక్టర్.. నేతకు ముఖ్య అనుచరుడు కావటంతో మౌనంగా ఉండిపోయారని తెలుస్తోంది. ఇనుప చువ్వలపై ప్రశ్నలు కూలిన డ్రైన్ నిర్మాణాన్ని పరిశీలించిన స్థానికులు ఇనుప చువ్వల వినియోగంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ నిర్మాణంలో అవసరమైన మేరకు రాడ్లు, కాంక్రీట్ వంటి నిర్మాణ సామగ్రిని ఉపయోగించారా? అనే అంశంపై సాంకేతికంగా పరిశీలన జరపాలని కోరుతున్నారు. కూలిన భాగంలో ఇనుప చువ్వలు కనిపించకపోవడంపై కూడా వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్మాణంలో ఏ మేరకు నిబంధనలు పాటించారనే విషయం సాంకేతిక పరిశీలనతోనే తేలాల్సి ఉంది. మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు డ్రైన్ కూలిన కారణాలను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ డ్రైనేజీ పనులలో కాంట్రాక్టర్‌కు ఒక అఽధికారి పార్ట్నర్గా ఉండి పెట్టుబడి పెట్టాడని గుసగుసలు వినబడుతున్నాయి. విచారణ జరపాలని డిమాండ్ రూ.24.50 లక్షలతో చేపట్టిన పనులు కొద్దిరోజులకే దెబ్బతినడంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. డ్రైనేజీ నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి నాణ్యత, నిర్మాణ పద్ధతులు, అధికారుల పర్యవేక్షణ తదితర అంశాలను పరిశీలించాలని కోరుతున్నారు. అవసరమైతే విజిలెన్స్ లేదా సంబంధిత సాంకేతిక విభాగం ద్వారా తనిఖీలు నిర్వహించి, లోపాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనులు నాణ్యతతో ఉండేలా అధికారులు కఠినంగా పర్యవేక్షించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కొద్దిరోజులకే కూలిన వైనం -
ఉదయం నుంచి రాత్రి వరకూ నిరసనలు..
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): జెన్ జీ ఉద్యమ ప్రేరణో.. కూటమి ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలతో కడుపు మండిందో ఏమో.. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు విజయవాడలో కదం తొక్కారు. రాష్ట్ర నలుమూలల నుంచి విజయవాడ ధర్నా చౌక్‌కు వేలాదిగా తరలివచ్చారు. ఒక దశలో అరెస్ట్ చేయాలని ఊగిన పోలీసులు.. వీరిని తరలించేందుకు తెచ్చిన పదుల సంఖ్యలో బస్సులు అక్కడే పెట్టి చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 600 మంది సచివాలయ ఉద్యోగులు కళ్లెదుటే చనిపోతే ప్రభుత్వం స్పందించలేదు. మంత్రి దిగివచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ధర్నా చౌక్.. విజయవాడ విడిచి పెట్టేది లేదంటూ సచివాలయ ఉద్యోగులు భీష్మించుకు కూర్చున్నారు. తొమ్మిది గంటల పాటు నిరసన.. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం ఉదయం 6 గంటల నుంచే ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. ఉదయం 9 గంటల కల్లా విజయవాడ ధర్నా చౌక్, లెనిన్‌సెంటర్, బీఆర్టీఎస్ రోడ్డులోకి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అప్పటి నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన కొనసాగుతూనే ఉంది. ధర్నా చౌక్‌లో అడుగు పెట్టనీయకుండా పోలీసులు చేసే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ధర్నా చౌక్‌కు చేరుకున్న ఉద్యోగులు ఎండలో మగ్గిపోతుంటే, పోలీసులు అరెస్ట్ చేసిన వారు స్టేషన్లలో మగ్గిపోయారు. ధర్నా చౌక్‌కు చేరుకున్న వారిలో కొందరిని అరెస్ట్‌లు చేయడంతో తోపులాట జరిగింది. -
నిధులు మంజూరు కాకపోతే రాజీనామా
పెనుగంచిప్రోలు: మునేరుపై పోలంపల్లి వద్ద ఆనకట్ట ఆధునికీకరణకు ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయకపోతే పదవికి రాజీనామా చేస్తానని మునేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పొన్నం బాలాజీ అన్నారు. ఆదివారం పెనుగంచిప్రోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలంపల్లి వద్ద మునేరు ఆనకట్ట వద్ద నుంచి సుమారుగా 30 వేల ఎకరాలు సాగు అవుతోందన్నారు. వరదలకు పాత ఆనకట్ట పాడవటం, కొత్త ఆనకట్ట పక్క గండ్లు పడి నీరు నిల్వ ఉండే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇప్పటి వరకు తాత్కాలిక మరమ్మతుల కోసం తాను సొంతగా రూ.15 లక్షల వరకు ఖర్చు చేశానని తెలిపారు. పోలంపల్లి డ్యాం తాత్కాలిక మరమ్మతులతో పాటు శాశ్వత పరిష్కారం కోసం మొత్తం రూ.30 కోట్లు అవసరం ఉందన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. తక్షణం నిధులు మంజూరు చేసి ఆదుకోకపోతే ఆయకట్టున 30 వేల ఎకరాల్లో సాగు నీరు పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందన్నారు. గండ్లు పడి తెలంగాణ ప్రాంత రైతుల పొలాలు సుమారుగా 45 ఎకరాలు కోతకు గురి కావటంతో ప్రతి ఏడాది వారికి కౌలు కట్టాల్సి ఉందన్నారు. ప్రభుత్వం శాశ్వత పరిష్కారం దిశగా తక్షణం నిధులు మంజూరు చేసి రైతాంగాన్ని అదుకోవాలన్నారు. రెండు నెలల్లో నిధులు మంజూరు కాకపోతే తనతో పాటు మునేరు ప్రాజెక్టు నీటి సంఘాల అధ్యక్షులు అందరూ పదవులకు రాజీనామా చేస్తారన్నారు. సమావేశంలో ముచ్చింతాల నీటిసంఘం చైర్మన్ పద్మాల వెంకటేశ్వరరావు, కొండూరు నీటి సంఘం అధ్యక్షులు దేవినేని శ్రీనివాసరావు, రైతు నాయకులు తోట నాగమల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. మునేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పొన్నం బాలాజీ -
నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు ఆదివారం విరాళాలను సమర్పించారు. విశాఖకు చెందిన కేవీ సత్యనారాయణమూర్తి కుటుంబం రూ. లక్ష, విజయవాడ గుణదలకు చెందిన మండవ హనుమంతరావు కుటుంబ సభ్యులు రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఏఈవో ఎన్.రమేష్‌బాబు, ఆలయ పర్యవేక్షకులు చెన్నకేశవరావులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
ఆదివారం బ్యాంకింగ్ సేవలకు విశేష స్పందన
ఎన్టీఆర్ జిల్లా ఎల్డీఎం వెంకట సుబ్బయ్య వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలోని బ్యాంకులు ఆదివారం రోజు సైతం సమర్థంగా పనిచేసి ప్రజలకు అవసరమైన బ్యాంకింగ్ సేవలను అందించాయని జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ పి. వెంకట సుబ్బయ్య తెలిపారు. ఆదివారం అయినా బ్యాంకుల్లో లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయని, ప్రజలు బ్యాంకింగ్ సేవలను విస్తృతంగా వినియోగించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించిన బ్యాంకు అధికారులు, సిబ్బంది కృషిని ఆయన అభినందించారు. చల్లపల్లి: నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న వేళ నిమ్మకాయ ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. అకాల వర్షాలకు పూత రాలిపోవడం, అనంతరం ఎండల తీవ్రతతో దిగుబడి తగ్గిపోవడంతో సరఫరా తగ్గింది. దీంతో గతంలో రూ.3 నుంచి 5కు లభించిన నిమ్మకాయ ప్రస్తుతం సైజును బట్టి రూ.10 నుంచి రూ.15 వరకు ధర పలుకుతోంది. ధరల పెరుగుదలతో హోటళ్లు, జ్యూస్ సెంటర్లు, సోడా వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క సోడా రూ.20కు విక్రయిస్తే అందులో నిమ్మకాయ ఖర్చే గణనీయంగా ఉంటోందని వ్యాపారులు వాపోతున్నారు. ఎండల కారణంగా డిమాండ్ కొనసాగుతుండగా, సరఫరా తగ్గడంతో ధరలు మరింత పెరుగుతున్నాయని చెబుతున్నారు. నిమ్మ ధరలను నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 60 అడుగుల ఎత్తు నుంచి జారిపడి మృతి రైల్వేస్టేషన్/చిట్టినగర్ (విజయవాడపశ్చిమ): నగరంలో చనుమోలు వెంకట్రావు ఫ్లై ఓవర్ సమీపంలోని ఈఎల్ఎస్ (ఎలక్ట్రికల్ లోకో షెడ్)లో ఆదివారం మధ్యాహ్నం 60 అడుగుల ఎత్తు ఉన్న క్రేన్‌కు ఓవర్ ఆయిలింగ్ చేస్తూ టెక్నీ షియన్ ప్రమాదవశాత్తు జారి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల ప్రకారం ఈఎల్ఎస్లో రైలు ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతులు జరుగుతుంటాయి. ఆదివారం సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండటంతో క్రేన్‌కు ఓవర్ ఆయిలింగ్ పనులు చేయాల్సిందిగా అధికారులు ఆదేశించడంతో నగరంలోని కంసాలిపేటకు చెందిన టెక్నీషియన్ అమల కంటి ధర్మజ్యోతి బాబు మరో టెక్నిషియన్‌తో కలసి షెడ్డు పైభాగంలో పని చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సహచరులు అతన్ని రైల్వే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రత ఏర్పాట్లు లేకపోవడమే కారణం! ఆదివారం లోకోషెడ్డులో కార్మికులు ఉండకపోవడంతో ఓవర్ ఆయిలింగ్ పనులను అధికారులు కేటాయించారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేయాల్సినప్పుడు కార్మికుల భధ్రత కోసం చేపట్టాల్సిన కనీస చర్యలను మాత్రం వారు విస్మరించారు. దీని కారణంగానే పనిచేస్తూ ప్రమాదవశాత్తు 60 అడుగుల ఎత్తు నుంచి కార్మికుడు పడి మృత్యువాత పడ్డాడు. గంపలగూడెం: స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట శనివారం రాత్రి ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. గంపలగూడెం ఎస్సీ కాలనీకి చెందిన కోట నాగేశ్వరరావు(60) నడచి వెళుతుండగా తిరువూరు నుంచి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న తరిగొప్పుల సాయికుమార్ ఢీకొట్టాడు. ఘటనలో నాగేశ్వరరావు తలకు బలమైన గాయమవ్వగా ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. కుమారుడు వెంకయ్య ఫిర్యాదుపై గంపలగూడెం ఎస్ఐ అనిల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాడు ఆవిష్కరణలకు వరం.. నేడు నిర్లక్ష్యంతో దూరం
● వైఎస్సార్ సీపీ ప్రభుత్వ చొరవతో అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 ప్రయోగశాలలు ● సర్కార్ బడుల్లో 18, ప్రైవేట్ విద్యాసంస్థల్లో 16 ల్యాబ్‌లు ● వాడకం లేక పనికిరాకుండా పోతున్న పరికరాలు వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూలనపెట్టారు. విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే విజ్ఞాన శాస్త్రంలో అత్యుత్తమంగా తీర్చిదిద్ది తద్వారా నూతన ఆవిష్కరణల దిశగా వారిని నడపించాలని అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, అధికారుల నిర్లక్ష్యం వెరసి అత్యున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్రయోగశాలలు కొన్ని విద్యాసంస్థల ప్రాంగణాల్లో ఎందుకు పనికిరాని శాలలుగా మారిపోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాల శాస్త్రవేత్తలే లక్ష్యంగా.. కేంద్ర ప్రభుత్వం పాఠశాల స్థాయిలో విద్యార్థులను విజ్ఞాన శాస్త్రాలలో ఉన్నతులుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. పాఠశాల విద్యార్థులను ఆ స్థాయిలోనే శాస్త్రవేత్తలుగా అడుగులు వేయించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ మిషన్ కింద 2017లో దేశంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ పేరుతో ప్రయోగశాలల ఏర్పాటకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పదో తరగతి ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న పాఠశాలలను, నాణ్యమైన విద్యను అందిస్తున్న బడులను ఎంపిక చేసి ఆయా విద్యాసంస్థల ప్రాంగణాల్లో ఈ ప్రయోగశాలల ఏర్పాటుకు నాంది పలికింది. దీనికి నీతి ఆయోగ్ వంటి సంస్థ మార్గదర్శకం చేసింది. 1500 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన గదిలో దీనిని ఏర్పాటు చేసి.. దీనికి ఆ విద్యాసంస్థ ప్రధానోపాధ్యాయుడు చైర్మన్‌గా, సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సభ్యులుగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. రూ.4కోట్లతో 34 ప్రయోగశాలలు.. ● కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ప్రయోగశాలకు రూ.12 లక్షల చొప్పున ఖర్చు చేసి పరికరాల కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు చేసింది. ● తొలుత కేవలం ప్రభుత్వ బడుల్లోనే వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ● ఆ తరువాత దేశ వ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తుల మేరకు మంచిగా నడిచే ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ వీటిని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ● ఆ క్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 34 విద్యాసంస్థల్లో 2019 నుంచి 2024 వరకూ ఏటేటా వీటిని ఏర్పాటు చేసింది. ● ఎన్టీఆర్ జిల్లాలో తొమ్మిది ప్రభుత్వ బడుల్లో దశలవారీగా వీటిని ఏర్పాటు చేశారు. అలాగే ఎనిమిది ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ ఐదు సంవత్సరాల్లో ఏర్పాటు చేశారు. ● కృష్ణాజిల్లాలోనూ తొమ్మిది ప్రభుత్వ విద్యా సంస్థల్లో, మిగిలినవి ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఏర్పాటు చేశారు. ● మొత్తం మీద ఎన్టీఆర్ జిల్లాకు రూ.2.36 కోట్లు, కృష్ణాజిల్లాకు రూ.1.64 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. తుప్పు పడుతున్న పరికరాలు.. విద్యార్థుల వినియోగం లేకపోవటంతో ప్రయోగశాలలో ఉన్న కొన్ని పరికరాలు పనికిరాకుండా పోతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా ఈ ల్యాబ్‌ల ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు చేపట్టాల్సిన ప్రాజెక్ట్‌ల విషయంలో శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన ప్రాజెక్ట్‌లు సంఖ్య, వాటి నాణ్యతను పరిశీలిస్తే ఈ ప్రయోగశాలలు ఎంతమేర వినియోగించారో తెలుస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రధానోపాధ్యాయులు చైర్మన్‌గా పని చేస్తున్న ప్రయోగశాల కమిటీ ఎన్ని సార్లు సమావేశమైంది. ఎన్నిసార్లు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయోగశాలలను పరిశీలించారు. కనీసం ఆ కమిటీలు ఏర్పాటు జరిగిందా అని పరిశీలిస్తే వాటి పరిస్థితి అర్థమవతుందని పలువురు సీనియర్ ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధ్యాయులపై ఒత్తిడి మరింత పెరిగింది. బోధనా విధులేకాక అనేక పనులకు ఉపాధ్యాయులను వినియోగిస్తుండటంతో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను విద్యార్థులకు పరిచయం చేసే పని లేకుండా పోయింది. ముఖ్యంగా అటల్ టింకరింగ్ ప్రయోగశాలలు ఉన్న విద్యాసంస్థల్లో చాలా మంది విద్యార్ధులకు తమ విద్యాసంస్థలో ఆ విధమైన ల్యాబ్ ఉన్న విషయం సైతం తెలియలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ బడుల్లో ఉన్న ప్రయోగశాలల పరిస్థితి ఇలా ఉంటే ప్రైవేట్ విద్యాసంస్థల్లో కొన్ని వాటిని పూర్తిగా మూలన పెట్టారని ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. -
నిరంతర పోరాటంతోనే బీసీలకు రాజ్యాధికారం
కృష్ణలంక (విజయవాడ తూర్పు): నిరంతర ఐక్య పోరాటాల ద్వారానే బీసీలకు రాజ్యాధికారం, హక్కుల సాధన సాధ్యమవుతాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. విజయవాడలో బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం 2027 జనాభా లెక్కల్లో ఓబీసీ యూనిక్ కోడ్‌ను తప్పనిసరిగా చేర్చాలనే అంశంపై జాతీయ సెమినార్ జరిగింది. 1871 నుంచి 1931 వరకు సాగిన జనగణనలో ఓబీసీ వివరాలు సేకరించారని, స్వాతంత్య్రం వచ్చాక ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీస్తున్నప్పటికీ ఓబీసీల వివరాలు సేకరించడం లేదని మండిపడ్డారు. ఇప్పటికీ 1931 జనాభా లెక్కల ఆధారంగానే ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తుండటం సరికాదన్నారు. రాబోయే 2027 జనాభా లెక్కల్లో ఓబీసీలకు యూనిక్ కోడ్‌ను తప్పనిసరిగా పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అక్టోబర్ 15న మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిరసనలు తెలిపి ప్రభుత్వాలకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పి.విల్సన్, మాజీ డీజీపీ జె.పూర్ణచందర్రావు, మాజీ ఐఏఎస్ విజయ్‌కుమార్, ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్ యాదవ్, డాక్టర్ అలా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
శతాధిక వృద్ధులకు ఘన సత్కారం
మధురానగర్(విజయవాడ సెంట్రల్): శతాధిక వృద్ధులను సత్కరించడం అభినందనీయమని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) ఈగల్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. విజయవాడలో వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఆదివారం దాత మంగీలాల్ సోలంకి సహకారంతో శతాధిక వృద్ధుల సత్కారం జరిగింది. ముఖ్యఅతిథి ఈగల్ ఐజీ రవికృష్ణ ట్రస్టీలు, దాతలతో కలిసి శతాధిక వృద్ధులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు అధికంగా సైబర్ నేరాలకు గురవుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం శతాధిక వృద్ధులు అన్నవరపు రామస్వామితో పాటు మరో 13 మందిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, వైస్ చైర్మన్ తేజ్‌రాజ్ సోలంకి తదితరులు పాల్గొన్నారు. -
బధిరులకు ఉపకరణాల పంపిణీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బధిరులకు రూ. 50 వేలు విలువ చేసే వినికిడి యంత్రాలు, టచ్ ఫోన్లను జేసీ ఎస్. ఇలక్కియ అందజేశారు. జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బధిరుల దినోత్సవం, సంజ్ఞల భాషా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా స్థాయి కార్యక్రమాన్ని శనివారం విజయవాడలోని ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ బధిరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బధిరులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఎటువంటి సంకోచం చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వాడ్రేవు కామరాజు, జిల్లా అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, పాఠశాలల సిబ్బంది, బధిరుల సంఘాల ప్రతినిధులు, ఇన్సైట్ ఇండియా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఎఫ్ఎస్ఏఐ బ్యాడ్మింటన్ టోర్నీ
లబ్బీపేట/మొగల్రాజపురం(విజయవాడతూర్పు): క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని, నిరంతరం బిజీగా ఉండే వృత్తి నిపుణులు ఆటలకు సమయం కేటాయించడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు అన్నారు. నగరంలోని సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఏఐ) అమరావతి చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నీ సీజన్ –2 పోటీలను ఆయన శనివారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి ప్రసంగించారు. అగ్నిప్రమాదాలు, సెక్యూరిటీ అంశాలపై ప్రజల్లో చైతన్యం తెస్తూ ఎఫ్ఎస్ఏఐ అందిస్తున్న సేవలు కొనియాడారు. ఎఫ్ఎస్ఏఐ అమరావతి చాప్టర్ అధ్యక్షుడు కాంతారావు, కార్యదర్శి వై.వి.దుర్గారావు మాట్లాడుతూ.. ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, ఫైర్ విభాగం అధికారులు, భద్రతా పరికరాల సంస్థలను ఒకే వేదికపైకి తెస్తూ సభ్యుల మధ్య స్ఫూర్తిని పెంచేందుకు ఈ టోర్నీ దోహదపడుతుందన్నారు. మొత్తం 150 మంది సభ్యులతో కూడిన నాలుగు జట్లు తలపడుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ మాజీ సంయుక్త కార్యదర్శి షేక్ నాగుల్ మీరా, కోర్ కమిటీ సభ్యులు షేక్ పాదుషా, ప్రశాంత్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
బుసకను బొక్కేస్తున్నారు!
అధికారుల ఉచిత సలహాలు! పెడన: బీడు పంట పొలాలను ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వి బుసకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు పెడనలో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వానికి ఎలాంటి దరఖాస్తు చేయకుండా, నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించకుండానే మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మమ్మల్ని ఎవడ్రా ఆపేదంటూ చిందులు తొక్కుతూ నంబర్లు లేని ట్రాక్టర్ల ద్వారా మట్టి దందాను సృష్టిస్తూ అడ్డు వచ్చిన వారిని బెదిరిస్తూ స్థానిక ప్రజాప్రతినిధి తాలుకా అంటూ రెచ్చిపోతున్న తమ్ముళ్లను అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తుండటం విశేషం. వీరి చర్యలను చూస్తున్న పురప్రజలు విస్తుపోతున్నారు. సర్వత్రా విమర్శలు అభివృద్ధి పనులంటూ దొంగతనంగా బుసకను తరలించాల్సిన దుస్థితిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పనుల్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఎటువంటి పన్నులు కట్టకుండా చేస్తున్నారా, ప్రైవేటు పరంగా చేసే అభి వృద్ధి పనులకు తీసుకువెళ్లి ప్రభుత్వానికి అంటకట్టడం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఆయా ప్రైవేటు అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తే అవి ప్రభుత్వం చేసిన పనులు కింద జమ ఎలా అవుతాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎటువంటి పన్ను చెల్లించని బుసకను ప్రైవేటు అభివృద్ధి పనులకు తరలించడంపై ఇటు అధికారులు, అటు పాలకులు కూడా వత్తాసు పలుకుతుండటంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చూసీ చూడనట్లుగా అధికారుల ధోరణి నంబరు ప్లేట్లు లేని ట్రాక్టర్ల ద్వారా విచ్చల విడిగా బుసకను తరలించడంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెళ్తున్నా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. వాటిని అడ్డుకుని సీజ్ చేసి పన్నులు వేయాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ మట్టిని తోలడానికి వీల్లేదని కేకలు వేయడం పరిపాటిగా మారింది. ఆ తర్వాత షరా మాములుగానే మట్టి తోలకం పనులు మొదలు. అధికారులు ఇలా నడుచుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పల్లోటి స్కూలు పక్క రోడ్డు నుంచి పట్టణంలోకి మట్టి వస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. అక్కడకు సిబ్బందిని పంపించి వాహనాలు రాకుండా అడ్డుకున్నాం. వాహనాలు తిరిగితే మాత్రం ఫైన్ వేస్తామని వారికి తెలియజేశాం. వాహనాలు తిరగకుండా వీఆర్వోలను పర్యవేక్షించాలని ఆదేశించాం. వీఆర్వోలు ఏమాత్రం నిర్లక్ష్యంగా నడుచుకున్నా వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – షేక్ వజీదా రహెమాన్, తహసీల్దార్, పెడన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాత్రి సమయంలో మట్టిని తోలుకోవాలని, నంబర్ ప్లేట్లను ఎవరైనా ఫొటోలు తీసి పెడితే వాటి ఆధారంగా మిమ్మల్ని పిలవాల్సి వస్తోందని, అందుకే నంబర్లు లేకుండా బుసకను తరలించుకోవాలనే సలహాలు తీసుకుని యథేచ్చగా తవ్వేసి తీసుకుపోతున్నారు. బుసకను సొమ్ము చేసుకోవడం పట్టణంలోని కొందరు తమ్ముళ్లుపై పలువురు చర్చించుకోవడం, ఆ సొమ్ములు కాస్తా మున్సిపల్ ఎన్నికలకు వెచ్చించడానికే అన్నట్లుగా చెప్పకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
తప్పుడు కేసులపై ఆగ్రహం
కృష్ణాజిల్లాఆదివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ పోలీసుల తీరుపై వైఎస్సార్ సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 21న శాప్ కార్యాలయం వద్ద జరిగిన శాంతియుత నిరసనలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఒక సంఘటనపై వేర్వేరు స్టేషన్లలో ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం, అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి వేధిస్తున్నారు. అసలు కేసులో ఎంత మంది ఉన్నారో పోలీసులు చెప్పకపోవడం, పార్టీలో కీలకంగా ఉన్న వారిని వేధిస్తుండటంతో వైఎస్సార్ సీపీ దీన్ని ఎదుర్కోవాలని నిర్ణయిం చింది. దీనిలో భాగంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్ సీపీ నేతలు పెద్ద ఎత్తున విజయవాడ చేరుకుని పోలీసు కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సీపీ అందుబాటులో లేకపోవడంతో డీసీపీ సరితకు వినతిపత్రం ఇచ్చారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో జరిగిన అక్రమాలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా.. ప్రశ్నిస్తున్న వారిని కేసులు, అరెస్టులతో గొంతు నొక్కాలని చూస్తోందని వారు ఆక్షేపించారు. వెన్నుపోటు పార్టీ కనుసన్నల్లోనే పోలీస్ యంత్రాంగం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, అర్ధరాత్రి పూట ఇళ్లలోకి వెళ్లి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. టీచర్ల ముసుగులో గూండాలకు ఎలా అనుమతిచ్చారు తమ పార్టీ నిర్వహించే శాంతియుత నిరసనలకు అనుమతి నిరాకరించి, టీచర్ల ముసుగులో వచ్చిన గూండాలకు ఎలా అనుమతించారని పోలీసులను ప్రశ్నించారు. ఎంజీ రోడ్డులో పర్మిషన్ లేదంటూనే టీడీపీ, జనసేన పార్టీ ర్యాలీలకు అనుమతులివ్వడంపై నిలదీశారు. తమ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు, దివ్యాంగులపై దాడులు జరిగా యని, వాటిపై చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరారు. మరోవైపు తమ పార్టీ వారిపై సెక్షన్ 307తో పాటు, అట్రాసిటీ కేసుల నమోదుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి అరెస్టులు, పోలీస్ స్టేషన్లలో తీసుకుంటున్న చర్యలు ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధమని గుర్తు చేశారు. అధికార పార్టీ అండతో శాంతిభద్రతలను కాలరాస్తున్న పోలీసుల వైఖరిని ప్రజల ఎదుటే నిలదీస్తామని, చట్టాన్ని ఉల్లంఘించే అధికారులకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కేసుల విషయంలో పునరాలోచన చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తామని, కేసుల్లో ఎవరున్నారో చెబితే వారంతా పోలీసు స్టేషన్‌కు వచ్చేందుకు సిద్ధమని వారు ప్రకటించారు. -
నూతన రైల్వే లైన్‌తో రైతులకు నష్టం
చిలుకూరు(ఇబ్రహీంపట్నం): ఎర్రుపాలెం నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి నూతన రైల్వే లైన్ ఏర్పాటుతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని మండలంలోని చిలుకూరు, దాములూరు గ్రామాల రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. రైల్వే అధికారుల ఒంటెత్తు పోకడలతో సుమారు 11 గ్రామాలు, ఆయా గ్రామాల పరీవా హక ప్రాంతంలోని 25 వేల ఎకరాల భూములు నీటి ముంపునకు గురై వ్యవసాయం ప్రశ్నార్థకం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైల్వే అధికారులు సుమారు 25 అడుగుల ఎత్తులో మట్టికట్ట పోసి దానిపై రైల్వే లైన్ నిర్మిస్తామని చెప్పారన్నారు. ఈ పరిణామాలతో రైల్వేలైన్ భూ సేకరణలో 70 మంది రైతులకు చెందిన సుమారు 100 ఎకరాల భూములు కోల్పోతున్నామన్నారు. ఈ ప్రాతంలో ఉన్న ఏడు వాగులు ప్రతి ఏడాది వర్షాకాలంలో పొంగి ప్రవహిస్తాయని, వాటితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైల్వేలైన్ కింద కేవలం ఐదు కల్వర్టులు నిర్మిస్తే కట్టకు రెండు వైపులా నీటి ముంపునకు గురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. 11 గ్రామాలతో పాటు 25 వేల ఎకరాల పంట పొలాలు నీటి ముంపునకు గురవుతాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఎకరం బయట మార్కెట్ విలువ రూ.17లక్షలు ఉందని, 2019–24 మధ్య సుమారు రూ.కోటి విలువ ఉందన్నారు. అప్పటి రేట్ల ప్రకారం ఎకరాకు రెండున్నర రెట్ల పరిహారం అందించాలని రైల్వే అధికారులను కోరారు. ఆందోళనలో రైతులు పూర్ణచంద్రరావు, వంశీకృష్ణ, కృష్ణారావు, కాటేపల్లి సుబ్బారావు, ఎర్రగుంట్ల నరేష్, మహిళా రైతులు పాల్గొన్నారు. -
పంటకాలువలో పల్టీకొట్టిన టిప్పర్
ఇబ్రహీంపట్నం: మండలంలోని కొండపల్లి శాంతినగర్ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఓటిప్పర్ శనివారం అదుపుతప్పి పంట కాలువలో పల్టీ కొట్టింది. కొండపల్లి నుంచి కవులూరు వైపు ప్రయాణిస్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి కాలువ లోకి దూసుకెళ్లింది. రెండు రోజులగా కురిసిన వర్షాలతో రోడ్డు పక్కన మార్జిన్ చిత్తడిగా మారడంతో కాలువలోకి పల్టీకొ ట్టింది. ఈ ప్రమాదంలో ఇందిరమ్మ కాలనీ లోని ఓ ఇంటి గోడ పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మైలవరం: మోటార్ సైకిళ్ల చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, వారి నుంచి ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ సుధాకర్ ఈ కేసు వివరాలను శనివారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మైలవరం మండలం పొందుగల తండాకు చెందిన బాణావతు హనుమంతు, వెల్వడం గ్రామానికి చెందిన వేముల మణికంఠ ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్నారు. మైలవరం, మధిర టౌన్, ఎర్రుపాలెం, నూజి వీడు రూరల్ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఐదు మోటార్ సైకిళ్ల చోరీ కేసులను పోలీసులు ఛేదించి, వాహనాలు రికవరీ చేశారు. కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ హరిబాబును అభినందించి, నగదు రివార్డు అందజేశారు. గుంటూరు రూరల్: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక స్కోచ్ గోల్డ్ అవార్డును కై వసం చేసుకుంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన స్కోచ్ సమ్మిట్ కార్యక్రమంలో అవార్డును విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ, డీన్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు అందుకున్నారు. 2022లో స్కోచ్ గోల్డ్ అందుకున్న విశ్వవిద్యాలయం మరలా 2026లో సాధించడం విశ్వవిద్యాలయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ రంగాల్లో విశ్వవిద్యాలయం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, వాటి ద్వారా రైతులకు అందు తున్న ప్రయోజనాలు, కార్యక్రమాల ప్రభావం సమాజంపై చూపుతున్న సానుకూల ఫలితాలను గుర్తిస్తూ ఈ జాతీయ స్థాయి పురస్కారం లభించింది. వీసీ మాట్లాడుతూ అవార్డును పొందటం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని అన్నారు. ఇది ఒక అవార్డు మాత్రమే కాదని, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు రైతులతో కలిసి చేపడుతున్న కార్యక్రమాలకు లభించిన జాతీయ స్థాయి గుర్తింపని చెప్పారు. డీన్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధ్యాపకులు శాస్త్రవేత్తల సమష్టి కృషితో వ్యవసాయ విద్యను మరింత ఆధునికంగా, పరిశోధనలను మరింత ప్రయోజనకరంగా, వాటి ఫలితాలను రైతులకు మరింత వేగంగా చేరేలా చేపడుతున్న నిరంతర కృషికి గుర్తింపుగా అవార్డు లభించటం ఎంతో ఆనందదాయకమని అన్నారు. -
నకిలీ డాక్యుమెంట్ల కేసులో ఐదుగురు అరెస్టు
పెనమలూరు: మండల పరిధిలోని కానూరులో రూ.2 కోట్లకు పైగా విలువ చేసే స్థలంపై కన్నేసి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కాజేయాలని యత్నించిన ఐదుగురి పోలీసులు అరెస్టు చేశారు. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు వివరాలను డీఎస్పీ కోసూరి ధర్మేంద్ర శనివారం విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు.. విజయవాడ కేదారేశ్వరపేటకు చెందిన బిక్కిన సుబ్బారావు దంపతులకు వంశీ, వల్లభనేని హిమబిందు సంతానం. కుమార్తె వివాహం అనంతరం అమెరికాలో ఉంటోంది. సుబ్బారావుకు కానూరులో ఆర్ఎస్ నంబర్ 36లో 1,600 గజాల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంపై రియల్ ముఠా సభ్యులైన విజయవాడ మాచవరానికి చెందిన మందాడి ఆదిరెడ్డి (స్వస్థలం ప్రకాశం జిల్లా చిన్నకండ్లగుంట), దేవీ నగర్‌కు చెందిన మైనంపాటి వెంకటరమణ మణికుమార్, గుణదల కమ్మరవీధికి చెందిన ఆర్ఎంపీ రావెళ్ల శివాంజనేయులు, కానూరు పంటకాలువ ఫార్చూన్ రెసిడెన్సీకి చెందిన ఉప్పల సాంబశివ ఉదయ భాస్కర్‌రావు, ఉయ్యూరుకు చెందిన కాసాని అమలేశ్వరరావు కన్నుపడింది. 1,600 గజాల స్థలంలో హిమబిందు పేరున ఉన్న 800 గజాలను నకిలీ పత్రాలతో కాజేయాలని కుట్ర పన్నారు. సుబ్బారావు దంపతులు మరణించినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. అమెరికాలో ఉన్న హిమబిందు స్థానంలో ప్రకాశం జిల్లాకు చెందిన మహిళను ఆ పత్రాల్లో చేర్చారు. ఆమె ఆధార్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలతో ముఠాలో ఒకడైన మందాడి ఆదిరెడ్డి పేరుతో జీపీఏ చేశారు. అనంతరం ఫిబ్రవరిలో ఈ ముఠాలో మరో వ్యక్తి పేరున స్థలం రిజిస్ట్రేషన్ చేసి విక్రయానికి పెట్టారు. బాఽధితుడి ఫిర్యాదుతో కదిలిన డొంక తమకు తెలియకుండానే స్థలాన్ని విక్రయానికి పెట్టిన విషయం సుబ్బారావుకు తెలిసింది. ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణచేపట్టడంతో ముఠా గుట్టురట్టయింది. నిందితులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మరో నలుగురి పాత్ర ఉందని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో పెనమలూరు సీఐ వెంకటనారాయణ, ఎస్ఐలు సుధకర్, సందీప్, సిబ్బంది పాల్గొన్నారు. -
సుబ్రహ్మణ్యేశ్వరుడి సన్నిధిలో..
మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని రాష్ట్ర బీసీ వెల్పేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ శనివారం దర్శించుకున్నారు. ఉదయం గుడికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలు పోసిమొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందించి సత్కరించారు. సూపరింటెండెంట్ అచ్యుత మదుసూదనరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జగ్గయ్యపేట అర్బన్: ఎన్టీఆర్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో ఈ నెల 28, 29, 30 తేదీల్లో జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 28వ తేదీ నందిగామ గాంధీ సెంటర్లోని ఏపీ ఎన్జీవోస్ బిల్డింగ్‌లో, 29న ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ డిగ్రీ కళాశాల, 30న జగ్గయ్యపేటలోని ఎస్ఏవీ అండ్ ఎన్వీజేఆర్ డిగ్రీ కళాశాలలో ఉదయం తొమ్మిది గంటలకు జాబ్ మేళాలు జరుగుతాయని పేర్కొన్నారు. సుమారు పది ప్రముఖ కంపెనీల ప్రతినిధులు వచ్చి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని వివరించారు. టెన్త్, ఇంట ర్మీడియెట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 ఏళ్ల లోపు యువత అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు జగ్గయ్యపేట జాబ్ మేళాకు 96668 15987, 96765 83213, నందిగామ 89199 51682, 72072 08075, ఇబ్రహీంపట్నం జాబ్‌మేళాకు 95027 757755, 80083 76100 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
ఎన్సీసీకి విద్యార్థుల ఎంపిక
గుడివాడ టౌన్: విద్యార్థులు విద్యతో పాటు దేశ భక్తిపై కూడా శ్రద్ధ చూపాలని 16 ఆంధ్ర బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ చందన్ ఠాకూర్ సూచించారు. కాలేజీ ప్రాంగణంలో ఎన్సీసీ ఎంపికలు శనివారం జరిగాయి. 26 మంది బాలురు, 13 మంది బాలికలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా లెఫ్ట్‌నెంట్ కల్నల్ చందన్ ఠాకూర్ మాట్లాడుతూ.. విద్యతో పాటు నేషన్ బిల్డింగ్, క్రమ శిక్షణ, జాతీయ ఇంటిగ్రేషన్ పెంపొందించాలన్నారు. మూడేళ్లపాటు వివిధ అంశాలపై వీరికి శిక్షణ ఇస్తామని, ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి.జె.ఎస్.కుమార్, పాలక మండలి ప్రసిడెంట్ ఎల్.ఆర్.కె.ప్రసాదు, ఎన్సీసీ అధికారి మహ్మద్ సలీమ్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గగుడిలో ఏర్పాట్ల పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా మహోత్సవాల్లో భక్తుల భద్రతే ప్రథమ ప్రాధాన్యమని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖరబాబు అన్నారు. దుర్గగుడిలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. ఆలయ ఈఓ శీనానాయక్, పోలీసు అధికారులు, ఆలయ అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు కొండపైకి చేరుకునే క్యూలైన్లు, ఆలయ ప్రాంగ ణంలో దర్శన ఏర్పాట్లు, నూతన పూజా మండపం, మహా మండపం నుంచి కొండ దిగువకు చేరుకునే మార్గాలను పరిశీలించారు. ఉత్సవాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఆలయ పరిసరాలను 24 గంటలూ సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామని, ఏఐతో నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా చేస్తామని వివరించారుర. వెస్ట్ ఏసీపీ దుర్గారావు, వన్‌టౌన్ సీఐ గుణరామ్, దుర్గగుడి ఈఈ ఎల్. రమాదేవి, ఆలయ వైదిక కమిటీ సభ్యుడు వి.శ్రీధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. -
మహిళ హత్య కేసులో వీడుతున్న మిస్టరీ
ఇబ్రహీంపట్నం: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో ఈ నెల 18న లభించిన గుర్తుతెలియని మహిళ మృతదేహం మిస్టరీ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతదేహానికి తల, కాళ్లు, చేతులు వేరుచేసి ఉండటంతో హత్యగా భావించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హతురాలి చేతిపై ఉన్న ఈక టాటూ, చెవి దిద్దులు, కాళ్ల పట్టీలు, దుస్తులు ప్రచార మాధ్యమాల్లో ప్రసారం కావడంతో మృతురాలిని ఆమె సోదరుడు నాగరాజు గుర్తించి ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ పరిణామాలతో మృతురాలిని గుంటూరు జిల్లా మంగళగిరిలోని హుస్సేన్ కట్ట ప్రాంతానికి చెందిన కర్రి దుర్గ ఆలియాస్ కల్యాణి (30)గా గుర్తించామని ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం శనివారం విలేకరులకు తెలిపారు. విజయవాడ భవానీపురానికి చెందిన మటన్‌షాపు యజమాని షఫీతో కల్యాణికి వివాహేతర సంబంధం ఏర్పడింది. కల్యాణి కుమారుడు షఫీ వద్ద ఉంటున్నాడు. ఈ నెల 17వ తేదీన రూ.20 వేలు ఇవ్వాలని కల్యాణి ఒత్తిడి చేయడంతో ఆమెను భవానీపురంలోని తన ఇంటికి తీసుకెళ్లి షఫీ హత్య చేశాడు. తన స్నేహితుడు గురువులుతో కలసి హత్యచేసిన అనంతరం కల్యాణి శరీర భాగాలను బ్యాగ్‌లో నింపి ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో గొల్లపూడి వద్ద పడేసినట్లు తేల్చారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం చినతాడినాడకు చెందిన కల్యాణి తల్లి చిన్నతనంలోనే మృతి చెందడంతో ఆమె సోదరుడు నాగరాజుతో కలసి కొన్నాళ్లు గన్నవరం సమీపంలో బుద్దవరం అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. మేజర్లు అయిన తర్వాత మంగళగిరి హుస్సేన్ కట్ట ప్రాంతంలోని ఓ అద్దె భవనంలో నివసించారు. కల్యాణికి వివాహం అయిన తర్వాత మంగళగిరిలోనే నివసిస్తుండగా సోదరుడు విజయవాడలో సెటిలయ్యాడు. వివిధ కారణాలతో భర్త నుంచి విడిపోయిన కల్యాణి అక్కడే ఉంటూ వివిధ హోటళ్లలో సప్లయర్‌గా పనిచేస్తోంది. ఆమె సోదరుడి ద్వారా వివరాలు తెలుసుకున్న ఏసీపీ దుర్గారావు, సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ సత్యవతి మంగళగిరిలోని మృతురాలి ఇంటికెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత విలువైన సమాచారం సేకరించారు. కల్యాణికి సన్నిహితంగా ఉన్న బంగారం షాపు దామోదర్, వివిధ హోటళ్లలో పనిచేసే గౌస్, ఆదానీ ఆలీ పాత్రలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. కల్యాణి ఫోన్ కాల్‌డేటా, చివరి కాల్ ఎవరికి వెళ్లింది, ఎక్కువ సేపు ఎవరితో మాట్లాడింది అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. -
‘మౌలిక’ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
కలెక్టర్ డీకే బాలాజీచిలకలపూడి(మచిలీపట్నం): మౌలిక వసతుల ప్రాజెక్టుల అమలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో శనివారం జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ నమ్రతా అగర్వాల్‌తో కలిసి మౌలిక వసతుల ప్రాజెక్టులపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష చేశారు. ఆయన మాట్లాడుతూ స్పష్టమైన విధానాలు, కాలపరిమితితో ప్రక్రియలను రూపొందించాలన్నారు. ప్రాజెక్టుల అమలులో జాప్యానికి కారణాలను గుర్తించి వాటి పరిష్కారానికి శాఖల వారీగా సమగ్ర సిఫార్సులు రూపొందించాలన్నారు. ప్రాజెక్టుల అమలులో ప్రధానంగా భూసేకరణ, అటవీ, వన్యప్రాణి, పర్యావరణ అనుమతులు, యుటిలిటీ షిఫ్టింగ్, రాష్ట్రస్థాయి పరిపాలన అనుమతులు వంటి కీలక అంశాలపై ఆయన చర్చించారు. అనంతరం భూసేకరణలో పరిహార నిర్ణయం, చెల్లింపు, భూమి స్వాధీనం, మ్యుటేషన్ తదితర ప్రక్రియల్లో అనవసర జాప్యాన్ని నివారించాలన్నారు. ఎల్ఏఆర్ఆర్ చట్టం – 2013, జాతీయ రహదారుల చట్టం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, పరిహారం నిర్ణయం విధానాలపై స్పష్టత తీసుకురావాలన్నారు. చట్టపరమైన అంశాలపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుని భవిష్యత్తులో వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడకుండా ఒకే విధానం ఉండేలా సిఫార్సులు రూపొందించాలన్నారు. సమావేశంలో గుడివాడ ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, జిల్లా అటవీశాఖ అధికారి సునీత, బీఎస్ఎన్ఎల్ జీఎం శ్రీను, మెయిల్ కంపెనీ జనరల్ మేనేజర్ తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. -
శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఘాట్ రోడ్డులో కొండ చరియలు పడే ప్రాంతంలో శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సిబ్బందిని ఆదేశించారు. కొండ చరియలు విరిగి పడిన ప్రాంతాన్ని కమిషనర్ రామచంద్రమోహన్, సాంకేతిక నిపుణుల బృందం శనివారం పరిశీలించింది. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఘాట్‌రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న దేవ దాయ శాఖ కమిషనర్, ఎన్ఐఆర్ఎం(బెంగుళూరు)సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి పర్యటించారు. అనంతరం మహా మండపం నాలుగో అంతస్తులోని ఈవో చాంబర్లో ఈవో శీనానాయక్, నిపుణుల బృందం, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. వర్షం నీటి ఊట కారణంగానే కొండ చరియలు జారిపడుతున్నాయని నిపుణుల బృందం పేర్కొంది. కొండ వాలును పటిష్టం చేసేందుకు అవసరమైన రాక్‌బోల్టింగ్ పనులు చేపట్టాలన్నారు. దసరా నాటికి ఘాట్‌రోడ్డును పూర్తిగా సురక్షితంగా ఉండేలా సాంకేతిక, ఇంజినీరింగ్ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఈవో శీనానాయక్, ఎన్ఐఆర్ఎం శాస్త్రవేత్త జైన్, సాంకేతిక సలహాదారు సుబ్బారావు, సీఈ శేఖర్, దుర్గగుడి ఈఈ రమ పాల్గొన్నారు. -
అంతర్ రాష్ట్ర నేరస్తుడు అరెస్టు
ఉయ్యూరు: అంతర్రాష్ట్ర నేరస్తుడిని ఉయ్యూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని శుక్రవారం ఉయ్యూరు సర్కిల్ కార్యాలయంలో సీఐ రామారావు మీడియా ఎదుట హాజరు పరిచారు. సీఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి రహిత ఉయ్యూరు లక్ష్యంగా పోలీసులు దాడులు చేపట్టారు. గత కొన్ని రోజులుగా చేస్తున్న దాడుల్లో 12 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రాబట్టిన సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు చెందిన బండారి శివను రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలో అనాసపురకు చెందిన వాడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. శివ హైదరాబాద్ నుంచి ఏఓబీ ఏరియాకు గంజాయి కోసం వెళుతూ మార్గంమధ్యలో మూడు బైక్‌లు దొంగిలించాడు. ఆ బైక్‌లను ఒడిశాలో అమ్మేసి ఆ డబ్బులతో గంజాయి కొని అమ్మకాలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందం శివను అదుపులోకి తీసుకుని ఉయ్యూరుకు తరలించారు. 20 కేసుల్లో శివ నిందితుడిగా ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. శివను అరెస్టు చేసి శుక్రవారం న్యాయస్థానంలో హాజరు పర్చటంతో న్యాయమూర్తి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించారని సీఐ తెలిపారు. నిందితుడిని గన్నవరం సబ్‌జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. ఎస్ఐలు ప్రతాప్‌రెడ్డి, మల్లికాసులు పాల్గొన్నారు. -
దండోపాయం!
విజయవాడ పోలీసుల పంట పండిస్తున్న సెటిల్మెంట్స్!ఇలా పోలీసుల వేధింపులను బయటకు వచ్చి చెప్పలేని బాధితులెందరో ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ సెటిల్మెంట్స్ డెన్‌గా మారింది. సివిల్ వివాదాల్లో సైతం జోక్యం చేసుకుని బెదిరింపులకు పాల్పడుతూ, అమాయకుల్ని నిలువునా దోపిడీ చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకే కాక, ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ప్రజలు అంటున్నారు. గతంలో పటమట సివిల్ సెటిల్మెంట్ల డెన్‌గా మారిందని హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయినా ఆ అధికారుల తీరు మారలేదు. మరోవైపు ప్రభుత్వమూ చర్యలు తీసుకోలేదు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకొని దండుకుంటున్న కొందరు పోలీసులు కోర్టు ఆదేశాలు ఉన్నా పట్టని వైనం అడిగినంత ఇవ్వకుంటే స్టేషన్లకు పిలిపించి వేధింపులు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు బెజవాడలో భద్రత లేదని హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన సౌజన్య హైదరాబాద్‌తో పాటు, విజయవాడలో రెండున్నరేళ్ల కిందట ఫ్లయింగ్ బోర్డర్స్ పేరుతో కన్సల్టెన్సీ పెట్టింది. నాలుగు దేశాల్లోని యూనివర్సిటీలకు విద్యార్థులను పంపిస్తుంటానని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో వెల్లడించారు. ఈ తరుణంలో ఒక మహిళ వచ్చి అడ్మిషన్ కావాలని, అడిగిందని, ప్రాసె సింగ్ దశలో ఉన్న సమయంలో బ్లాక్ మెయిలింగ్ చేయడం ప్రారంభించినట్లు సౌజన్య వెల్లడించింది. అదే సమయంలో విజయవాడలో ఓ కీలక విభాగంలో పనిచేసే ఏసీపీ ఫోన్ చేసి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇవ్వకుంటే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. విజయవాడలో అయితే భద్రత ఉండదని హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టానని, తనను మరో సాయికృష్ణలా కాకుండా చూడాలని ఆమె వేడుకుంది. సాక్షి టాస్క్‌ఫోర్స్, విజయవాడ: కంచే చేను మేసిందన్న చందంగా.. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులుగా మారుతున్నారు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ, తమకు నచ్చిన విధంగా వ్యవహరిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా వారు చెప్పినట్లు వినక పోయినా, అడిగినంత ఇచ్చుకోలేక పోయినా వారి వేధింపులకు అంతే లేకుండా పోతోంది. కోర్టుల నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ, వాటిని లెక్కచేయకుండా, ఇది ‘మా అడ్డా.. మేము చెప్పిందే లెక్క’ అనే రీతిలో వ్యవహరించడంతో బాధితులు లబోదిబో మంటున్నారు. కొన్ని గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్స్ అవుతుండగా.. మరికొందరు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి వారిని వేధిస్తున్న వైనాన్ని వివరిస్తున్నారు. పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సామాజికవేత్త కొల్లూరు వెంకటేశ్వరరావు ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ పటమట ప్రాంతంలోని ఓ జోనల్ స్థాయి అధికారి అవినీతిని వివరించారు. రామలింగేశ్వరనగర్లో చీట్లు వేసి ఎగవేసిన వారి నుంచి.. ఒక కేసు మాఫీ చేసేందుకు లాయర్ నుంచి, అపోలో ఫార్మశీపై ఎఫ్ఐఆర్ చేసేందుకు, పటమటలో రజకుడు మర్డర్ కేసును మాఫీ చేసేందుకు.. ఇలా అనేక సివిల్, క్రిమినల్ కేసుల్లో ఎన్ని లక్షలు వసూలు చేశారో ఆ ప్రెస్మీట్లో కూలంకషంగా వివరించారు. ప్రైవేట్ ఆస్తి వివాదంలో జోక్యం చేసుకుంటూ పోలీసు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఏసీపీ దామోదర్‌పై న్యాయవాది సత్యశ్రీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని అక్రమ కేసులు పెడుతున్నారని, డెహ్రాడూన్ నుంచి ఫోన్లో ఫిర్యాదు ఇచ్చారని కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. విజయవాడలో తమ కుటుంబానికి సంబంధించిన ఆస్తికి సంబంధించి, ప్రహరీ మరమ్మతుల సందర్భంగా పొరుగువారితో వివాదం తలెత్తిందని, ఆ సమయంలో పోలీసులకు తమ టైటిల్ డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు సమర్పించినప్పటికీ వారి జోక్యం కొనసాగిందన్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించగా, 21 నవంబర్ 2025న ‘పోలీసులు జోక్యం చేసుకోవద్దు’ అని కోర్టు ఆదేశించినా వారి వేధింపులు ఆగలేదని వివరించారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జోక్యం చేసుకుని పోలీసు కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. విశాఖపట్నంకు చెందిన ఇడుపులపాటి మాధవి.. తాము 2014లో విశాఖపట్నం జిల్లాలోనే 50 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశామని, దానికి 2021–22 మధ్య రైతులు అందరూ రిజిస్ట్రేషన్ కూడా చేశారన్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో హైదరాబాద్‌కు చెందిన కొన్ని కంపె నీలతో ఆర్థిక లావాదేవీలు జరిగాయన్నారు. అయితే ఈ భూమికి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తితో కేసు పెట్టించి.. మహిళ అని కూడా చూడకుండా పటమట పోలీసులు అరెస్టు చేయాలని చూశారన్నారు. అది డెప్యూటీ సీఎం బినామీ భూమి అని, 15 రోజుల్లో అప్పగించకుంటే ‘మీ అంతు చూస్తాం’ అంటూ ఏసీపీ స్థాయి అధికారి బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. దీనిపై తాము హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నప్పటికీ వేధింపులు ఆగలేదన్నారు. ‘మా ఇద్దరు ఆడపిల్లలతో కలిపి లాక్కొని పోతాం. ఎవడొస్తాడో చూస్తామంటూ బెదిరించారు’ అని ఆ మహిళ సాక్షాత్తూ రాష్ట్ర డెప్యూటీ సీఎంకు లేఖ రాసింది. హైదరాబాద్‌లో చిట్టీల వ్యాపారం చేసి నష్టపోయిన నెల్లూరు వాసు, విజయవాడ వచ్చి జీవనం సాగిస్తూ, తమ వ్యాపార భాగస్వామికి ఇవ్వాల్సిన అప్పునకు గాను, కొన్ని స్థిరాస్తులు రాసిచ్చారు. అయినప్పటికీ బలవంతంగా వాసు భార్య గీత నగదులను ప్రైవేటు సంస్థలో పృథ్వీ తాకట్టు పెట్టించగా, అప్పట్లో పోలీసులు వాటిని రికవరీ చేసి ఇప్పించారు. కాగా అలా ఇప్పించిన బంగారాన్ని మళ్లీ తిరిగి ఇవ్వాలంటూ ఏసీపీ దామోదర్ ఒత్తిడి చేస్తున్నారంటూ ఈ నెల 18న పటమట పోలీస్‌స్టేషన్ ఎదుట దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. -
బందరులో ‘ధన’నాథుడు
మచిలీపట్నంటౌన్: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో విఘ్నేశ్వరుడు ధననాథుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్టీసీ కాలనీలోని శ్రీ విజయ గణపతి దేవాల యం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో గణనాథుడిని కమిటీ సభ్యులు శుక్రవారం రూ.1.11 కోట్ల నగదుతో అ లంకరించారు. రూ. 500, రూ. 200, రూ. 100, రూ. 50 నోట్లతో దండలు తయారు చేసి అలంకరించారు. శుక్రవారం కావడంతో ఆ పందిరి వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు కుంకుమ పూజలు నిర్వహించారు. గుడివాడరూరల్: లైంగిక వేధింపులపై బాధితురాలి ఫిర్యాదు మేరకు గుడివాడ తాలూకా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. ఆరేళ్ల క్రితం భర్త వదిలి వెళ్లడంతో వివాహిత తన 18 ఏళ్ల కుమార్తె, కుమారుడితో కలసి జీవిస్తోంది. ఈ క్రమంలో 2023లో ఆమెకు చిదెపూడి సాయికిరణ్ అనే వ్యక్తి పరిచయమై వారితోనే నివసించడం ప్రారంభించాడు. 2024 ఫిబ్రవరిలో వారు టిడ్కో కాలనీకి నివాసం మారారు. అప్పటి నుంచి ఇంట్లో ఆమె, తన కుమారుడు లేని సమయంలో 18 ఏళ్ల యువతిపై సాయికిరణ్ లైంగిక దాడులకు పాల్పడుతూ బలవంతంగా నిర్బంధించేవాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే తల్లిని చంపేస్తానని బెదిరింపులకు గురి చేసేవాడు. వేధింపులు ఎక్కువ కావడంతో యువతి ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. తల్లి సాయంలో శుక్రవారం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు నిందితుడు సాయి కిరణ్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. -
యానాం మద్యం పట్టివేత
ఐ.పోలవరం: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని యానాం నుంచి కృష్ణా జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఎంవీవీ రవీంద్రబాబు కథనం ప్రకారం.. ఐ.పోలవరం మండలంలోని పాత ఇంజరం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో యానాం వైపు నుంచి వస్తున్న ఏపీ 39 టీయూ 1898 నంబర్ కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఏడు బాక్సుల్లో ఉన్న వివిధ రకాల 36 మద్యం బాటిళ్లను గుర్తించారు. కారులో ఉన్న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని, మద్యం, కారును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పట్టివేత వెనుక మరో కోణం! ఈ మద్యం పట్టివేత వెనుక మరో కోణం ఉందని స్థానికులు అంటున్నారు. ఓవర్టేక్ విషయంలో మద్యం తరలిస్తున్న కారును మరో కారు యజమాని అడ్డుకుని మురమళ్ల సమీపంలో వాగ్వాదానికి దిగినట్లు వారు చెబుతున్నారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో మద్యం తరలిస్తున్న కారు అద్దాలు పగిలాయి. అదే సమయంలో అటుగా వెళుతున్న ముమ్మిడివరం సీఐ మోహన్ కుమార్ వారి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఆ కారులో మద్యం బాటిళ్లున్న విషయం గుర్తించారని, దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఆ మద్యం స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. అసలు ఏం జరిగిందనే విషయం పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. -
పరీక్ష కేంద్రంలో ఫోన్‌తో పట్టుబడిన అభ్యర్థి
పటమట(విజయవాడతూర్పు): పోటీ పరీక్షలో సెల్ఫోన్లో చూసి సమాధానాలు రాస్తున్న ఓ అభ్యర్థి శుక్రవారం ఇన్విజిలేటర్‌కు పట్టుబడ్డాడు. దీనిపై విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనికేపాడులోని శ్రీ విజయ దుర్గా ఐటీ ఎగ్జామ్ సెంటర్లో ఏపీ స్టేట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఓ అభ్యర్థి సెల్ఫోన్లో చూస్తూ పరీక్ష రాస్తుండటాన్ని ఇన్విజిలేటర్ గుర్తించారు. వెంటనే అతడిని నిలువరించి, అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఘటనపై పటమట పోలీసులకు సమాచారం అందించారు. అభ్యర్థితో పాటు సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లి నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష రాసిన వ్యవహారంపై అధికారులు కూడా తదుపరి చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ●సెల్ ఫోన్ స్వాధీనం ●ఎనికేపాడు కేంద్రంలో ఘటన -
మునిసిపల్ ఉద్యోగుల సొసైటీ చైర్మన్, డైరెక్టర్‌కు జైలు శిక్ష జరిమానా
చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం మునిసిపల్ ఎంప్లాయీస్ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ నాలి నాగభూషణం, డైరెక్టర్ రామిరెడ్డి కృష్ణారెడ్డి లకు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని తీర్పు చెప్పారు. సొసైటీ ద్వారా 2013లో ఖాతాదారుల నుంచి సొసైటీ పాలకవర్గ సభ్యులు డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్ల కాల పరిమితి పూర్తయిన తరువాత తిరిగి డిపాజిటర్లకు సొమ్ము చెల్లించలేదు. ఈ విషయంపై మచిలీపట్నానికి చెందిన ఎ.శ్రీశైలనాధ్, పెనుబోతు సురేంద్రబాబు, పెనుబోతు వెంకట్, పెనుబోతు సందీప్, పెనుబోతు లక్ష్మీఅన్నపూర్ణలు స్థానిక ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను, ఆధారాలను విచారించిన అనంతరం న్యాయమూర్తి శుక్రవారం పై విధంగా తీర్పు చెప్పారు. గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): విజయవాడలో తొలిసారిగా జాతీయ సరస్ అజీవిక మేళా–2026నను నిర్వహిస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పున్నమి ఘాట్ వేదికగా వచ్చేనెల 8 నుంచి 22 వరకు ఈ మేళా జరుగుతుందన్నారు. ఈ మేళా దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ కళాకారులు, మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించుకునే మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని తెలిపారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మేళా నిర్వహణపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గతేడాది గుంటూరులో 300 స్టాళ్లతో జరిగిన ఈ మేళాలో సుమారు రూ.30 కోట్ల మేర వ్యాపారం జరిగిందని.. ఈసారి విజయవాడలో 600 స్టాళ్లతో నిర్వహిస్తున్నామన్నారు. మేళాలో హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్, నేచురల్ ఫుడ్, లైవ్ ఫుడ్ తదితర విభాగాలతో పాటు నాబార్డ్, ఎంఎస్ఎంఈ, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా స్టాళ్లు ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు సరస్ మేళా గొప్ప అవకాశంగా నిలుస్తుందన్నారు. ఈ సమీక్షలో కలెక్టర లక్ష్మీశా, పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిన చరిత్ర బాబుకు లేదు
●ఆయనకు తాపం ఎక్కువ.. తపన తక్కువ ●మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడటౌన్: తనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఒక్కసారి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిన చరిత్ర లేదని గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పేర్కొన్నారు. ఆయనకు తాపం ఎక్కువ.. తపన తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. గుడివాడలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధ సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఒక పక్కన ఎన్నికలు జరుగుతాయంటూనే మరో పక్క ఎన్నికలు ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పాచిపోయిన టీవీ చానళ్లలో సూటు, బూటు వేసుకున్న గొట్టంగాళ్లు ఎన్నికల విషయంలో అబద్ద ప్రచారాలు చేయడంలో సిద్ధహస్తులన్నారు. 2021లో చంద్రబాబు ఎన్నికల్లో గెలిస్తే బూట్లు తుడుస్తానని నేను అన్న మాటలను ఇప్పుడు ఈ దద్దమ్మలు వాడుతున్నారు. రాష్ట్రం కోసం తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టిన నాయకుడు జగన్మోహన్రెడ్డి అని అన్నారు. తన సత్తా చాటేందుకు గతంలో తాను రాజీనామా చేసి మాతో కూడా రాజీనామాలు చేయించి ఎన్నికల్లో గెలిచిన మగాడు జగన్మోహన్రెడ్డి అన్నారు. జగన్ మతం మానవత్వం.. మెడలో శిలువ వేసుకుంటే పదవులొస్తాయని జగన్మోహన్రెడ్డి అన్నట్లు పాచిపోయిన టీవీ చానళ్లు ప్రచారం చేస్తున్నాయని కొడాలి విమర్శించారు. వారికి ఒక్కటే చెపుతున్నా.. కులం, మతం అడ్డు పెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడుకి అలవాటని, తన మతం మానవత్వం అంటూ అన్ని వర్గాల వారిని ఆదరిస్తూ పేదలకు తండ్రి స్థానంలో నిలబడి ప్రజలకు ఉన్నత విద్య, వైద్యం అందించిన మహా నాయకులు వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఆయన స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ జగన్ కుటుంబ సభ్యులందరూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి కూటమి నాయకులను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని), మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, మచిలీపట్నం, పెడన నియోజకవర్గ సమన్వయకర్తలు పేర్ని కిట్టు, ఉప్పాల రాము తదితరులు పాల్గొన్నారు. -
దంచికొట్టి.. వణికించి..
సాక్షి, విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు రోజుల పాటు కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. బుడమేరుకు వరద ఉద్ధృతి పెరిగింది. మునేరు పొంగిపొర్లగా.. పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇక ఎప్పటిలాగే విజయవాడ నగరం రోడ్లు వర్షపునీటితో పొంగిపొర్లాయి. మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం మరోసారి డ్రెయిన్ల నిర్వహణ విషయంలో వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపించింది. మొగల్రాజపురం, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, ఆటోనగర్, ఎన్టీఆర్ కూడలి, బెంజిసర్కిల్, నిర్మలా కాన్వెంట్ రోడ్లపై భారీగా నీరు చేరి నదులను తలపించాయి. ముఖ్యంగా ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ కాలనీలో పలు ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెరిగిన వరద ప్రవాహం.. కృష్ణా నదికి వరద ప్రవాహం పెరగడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద 12 అడుగులకు నీటిమట్టం చేరింది. అలాగే కృష్ణా డెల్టా తూర్పు కాలువకు 5,026 క్యూసెక్కుల నీటిని, పశ్చిమ కాలువకు 2,519 క్యూసెక్కులు, గుంటూరు చానల్‌కు 259 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సముద్రంలోకి 47,125 క్యూసెక్కుల మిగులు జలాలను వదిలారు. పంటల నష్టం ఇలా.. ● కృష్ణాజిల్లాలో గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, పెదపారుపూడి, నందివాడ, మొవ్వ మండలాల్లో వరిసాగు 2,500 హెక్టార్లలో నష్టం జరిగింది. బాపులపాడు, గన్నవరం మండలాల్లో 135 హెక్టార్ల మేర సాగు చేసిన మినుము పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. ● గుడ్లవల్లేరు మండలంలోని వడ్లమన్నాడు డ్రెయిన్ డోకిపర్రులోని పల్లపు చేల రైతులను నట్టేట ముంచింది. ఈ డ్రెయిన్ కింద గ్రామంలో 1,500 ఎకరాల పల్లపు పొలాలు ఉండగా అందులో 500ఎకరాల పైబడి వరి చేలు నీట మునిగింది. ● గన్నవరం మండలంలోని ముస్తాబాదలో 600ఎకరాలకు పైగా వరి పంట నీట మునిగిందని, బాధిత రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని సీపీఎం కౌలురైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. ● ఎన్టీఆర్ జిల్లాలో పత్తి, మొక్కజొన్న వరి పంటలు మొత్తం 300 హెక్టార్లలో మాత్రమే నీటిలో ఉందని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. జారిపడిన కొండ చరియలు భారీ వర్షాలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని మూడో మలుపు వద్ద కొండపై నుంచి ఒకసారిగా మట్టి, చరియలు విరిగి పడ్డాయి. గతంలో మెస్ ఏర్పాటు చేయగా ఈ వర్షాలకు మెస్‌పై పడి, రోడ్డుపై చరియలు పడ్డాయి. కొండ చరియలు విరిగి పడిన ప్రదేశాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఆలయ ఈవో శీనానాయక్, ఈఈ రమా శుక్రవారం ఉదయం పరిశీలించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దుర్గగుడి ఈవోను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాంతించిన వరుణుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు మూడు వేల హెక్టార్లలో నీటమునిగిన పంట దుర్గగుడి ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగులకు చేరిన నీటి మట్టం జలమయమైన విజయవాడ రోడ్లు, పొంగిపొర్లిన డ్రెయిన్లు -
దేవుడి హుండీ.. నేతల గండి!
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవదాయశాఖ ఆలయాలను ప్రయివేటుకు ధారదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సనాతన ధర్మ పరిరక్షణ అంటూ ప్రచారార్భాటాలు చేస్తూ ఆలయాల ఆస్తులను ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలను కాపాడాల్సిన ప్రభుత్వం నేతల సిఫారస్‌లతో మినహాయింపులు కల్పిస్తూ జీవోలు జారీ చేయటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిదానంగా దేవదాయ ధర్మదాయ శాఖ పరిధిలోని ఆలయాలను వాటి ఆధీనంలో ఉన్న ఆస్తులను ఒకొక్కటిగా దోచుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడ్డగోలుగా జీవోలు... రాష్ట్రంలో పాలక పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సిఫార్సులతో అక్రమార్కులు ఆలయాల వ్యవహారాల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. దేవదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల పరిరక్షణకు చర్యలు చేపట్టేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన కూటమి నేతలు వాటికి భిన్నమైన నిర్ణయాలను అమలు చేయాలంటూ ఆ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో కొందరు అధికారులు సైతం అందినకాడిని పుచ్చుకొని ఉత్తర్వులు జారీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా కూటమి నేతల సిఫారస్లో ఒక ఆలయానికి మినహాయింపులు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అలాగే ఆలయాల ట్రస్ట్ బోర్డులకు పాలకమండళ్లను నియమించే సమయంలోనూ అర్హతలు లేకున్నా సిఫారస్‌లతో కమిటీలను నియమిస్తున్నారు. వాటిపై విమర్శలు రావటంతో వాటిని రద్దు చేసి మళ్లీ కమిటీలను వేస్తున్నారు. తాజాగా విజయవాడ పాతబస్తీలోని ఆలయాలకు కమిటీల నియామక ఉత్తర్వులు జారీ చేసి మళ్లీ రద్దు చేసిన ఘటనలు ఉన్నాయి. కోర్టు కేసులు ఉన్నా జీవో జారీ.. కృష్ణాజిల్లాలో తోట్లవల్లూరు మండలంలో శ్రీ భ్రమరాంబ చెన్న మల్లేశ్వరస్వామి ఆలయం దేవదాయ ధర్మదాయ శాఖ పరిధిలో ఉంది. దానికి 90 ఎకరాలు ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వాటి ద్వారా సుమారు రూ.12 లక్షల ఆదాయం ఆలయానికి సమకూరుతోంది. దానికి దేవదాయ శాఖ చట్టం 1987 సెక్షన్ 15, 29 కింద (ట్రస్ట్‌బోర్డు, ఈవో లేకుండా) ఉన్న నిబంధనల కార్యకలాపాల నుంచి ఐదేళ్ల పాటు మినహాయింపు ఇస్తూ రెవెన్యూ ఎండోమెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ కన్నబాబు పేరిట ఈ నెల 22వ తేదీన ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని వెనుక కూటమి నేతల సిఫార్సులున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఆలయ వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ నెల 28వ తేదీన విచారణ ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికీ అడ్డగోలుగా దీనికి మినహాయింపు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. లీజు వ్యవహారాల్లోనూ చక్రం తిప్పుతున్న నేతలు.. ఉమ్మడి జిల్లాలో వివిధ ఆలయాలు, సత్రాలకు సంబంధించిన దుకాణాల లీజు వ్యవహారాల్లోనూ కూటమి నేతలు తమ సిఫారస్‌లతో చక్రం తిప్పుతున్నారు. ప్రధానంగా ఆలయాల దుకాణాలు లీజుకిచ్చే క్రమంలో తప్పనిసరిగా బహిరంగ వేలం పాటను నిర్వహించి అత్యధికంగా లీజు చెల్లించేందుకు ముందుకు వచ్చిన వారికి ఆయా దుకాణాలను అప్పగించటం పరిపాటి. ఇది లీజు కాల పరిమితి పూర్తవ్వగానే నిర్వహించాలి. కాల పరిమితి ముగిసిన దుకాణాలకు ఆ శాఖలో ఉన్న నిబంధనల మేరకు లీజు మొత్తంలో సగం కన్నా అధికంగా చెల్లించేందుకు ఆ లీజుదారుడు ముందుకు వస్తే దానిని పరిశీలించి కమిషనర్ అనుమతితో రెన్యువల్ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. కానీ కూటమి నేతల అండదండలతో కేవలం పది శాతం పెంపుతో రెన్యువల్ చేస్తున్నారనే పలువురు ఆరోపిస్తున్నారు. సనాతనం అంటూనే ఆదాయం లూటీ.. కూటమి నేతలు ఒకవైపు సనాతనం అంటూనే మరోవైపు ఆదాయాలను కొల్లగొడుతున్నారని ధార్మిక సంఘాలు, వ్యక్తులు విమర్శిస్తున్నారు. సనాతన ధర్మం పేరుతో విష ప్రచారాలను వ్యాప్తి చేస్తున్న కూటమి నేతలు అదే తరహాలో ఆలయాలకు వచ్చే ఆదాయాలకు గండి కొడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షాత్ కమిషనర్ కార్యాలయం అడ్డాగా పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఇటీవల అక్కడ పని చేసే ఉద్యోగులే బహిరంగంగా చెప్పడం, తోటి ఉద్యోగులు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు సైతం చేస్తుస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రయివేట్‌కు దేవదాయ శాఖ వత్తాసు కూటమి ఒత్తిళ్లతో దిగజారుతున్న జిల్లాలో దేవాలయాల పరిస్థితి ఆలయాల ఆదాయానికి గండి కొడుతున్న నేతల తీరు తోట్లవల్లూరులోని ఒక ఆలయాన్ని ప్రయివేటుకు మినహాయింపిస్తూ జీవో కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా జీవో ఎలా ఇస్తారని భక్తుల ప్రశ్న దుకాణాల లీజు వ్యవహారాల్లోనూ చక్రం తిప్పుతున్న కూటమి నేతలు -
ఘాట్‌రోడ్డులో జారిపడిన కొండ చరియలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడలోని దుర్గగుడి ఘాట్‌రోడ్డులో కొండ చరియలు విరిగి పడ్డాయి. గురువారం రాత్రి 10 గంటల తర్వాత భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో ఘాట్‌రోడ్డులోని మూడో మలుపు వద్ద కొండపై నుంచి ఒక సారిగా మట్టి, చరియలు విరిగి పడ్డాయి. ఐదేళ్ల కిందట కొండకు ఇనుప మెస్ ఏర్పాటు చేయగా, విరిగిపడిన కొండ రాళ్లు ఆ మెస్‌ను ధ్వంసం చేసుకుంటూ రోడ్డుపై పడ్డాయి. గత ఐదారు రోజులుగా ఘాట్‌రోడ్డు మరమ్మతుల నేపధ్యంలో రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఘాట్‌రోడ్డుపై ఎటువంటి వాహనాలు, భక్తుల రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగి పడిన ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఈవో శీనానాయక్, ఈఈ రమాలు శుక్రవారం ఉదయం పరిశీలించారు. కొండ రాళ్లు, మట్టిని వెంనటే తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రక్షణ గోడ, ఐరన్ ఫెన్సింగ్ రాక్–ఫాల్నెట్లను మరంత పటిష్టంగా పునరుద్దరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఘాట్‌రోడ్డును క్షేత్రస్థాయిలో భద్రతా తనిఖీలు పూర్తయ్యే వరకు ఎవరిని అనుమతించవద్దని ఆదేశించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారికి అమ్మవారి దర్శనం కల్పించాలని సూచించారు. కాగా ఘాట్‌రోడ్డులో కొండ చరియలు విరిగి పడిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆలయ ఈవోను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేటి గిరి ప్రదక్షిణ రద్దు వర్షాలు, తుఫా ను వాతావరణం నేపధ్యంలో శనివారం జరగాల్సిన గిరి ప్రదక్షిణను రద్దు చేస్తున్న ఆలయ ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున 5.55 గంటలకు ప్రారంభం కావాల్సిన గిరి ప్రదక్షిణ తీవ్ర వర్షాలు, వాతావరణం, గిరిప్రదక్షిణ మార్గంలో డ్రైయిన్లు పొంగి కలుషిత నీరు ప్రవహించడంతో ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకు వచ్చే అవకాశం లేదని వైదిక కమిటీ తేల్చి చెప్పింది. దీంతో వైదిక కమిటీ సూచన మేరకు గిరిప్రదక్షిణ ను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. -
కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై కొండచిలువ కలకలం
కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలోని కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై కొండ చిలువ ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం రేపింది. రాజీవ్‌గాంధీ పార్కు సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఫ్లై ఓవర్‌పై శుక్రవారం ఉదయం హఠాత్తుగా సుమారు 8అడుగుల పొడవు గల ఒక కొండచిలువ కనిపించింది. అది నెమ్మదిగా వెళ్తుండటాన్ని గమనించిన వాహనదారులు, బాటసారులు భయందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కొద్ది నిమిషాల్లో స్నేక్ కాచర్ మణికంఠ ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా వ్యవహరించి దానిని సురక్షితంగా పట్టుకుని సంచిలో బంధించాడు. అయితే గుర్తు తెలియని వాహనం దాని పై నుంచి వెళ్లడంతో గాయాలపాలైన ఆ కొండ చిలువ నుంచి రక్తం కారుతోంది. దీంతో పట్టుకున్న కొద్దిసేపటికే మృతి చెందిందని మణికంఠ తెలిపాడు. కృష్ణానదికి వరద రావడంతో వరదలో కొట్టుకొచ్చి ఫ్లై ఓవర్ పైకి చేరి ఉండవచ్చని అందరూ చర్చించుకున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): తమకు న్యాయపరంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో పాటు, పలు సమస్యలపై ప్రభుత్వ వైద్యులు చేపట్టిన నిరసన శుక్రవారం 25వ రోజు కొనసాగింది. ప్రభుత్వ వైద్యుల సంఘం – ఆంధ్రప్రదేశ్(జీడీఏ–ఏపీ) ఆధ్వర్యంలో గత 25 రోజులుగా వైద్యులు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 9.30 వరకూ విధు లు బహిష్కరించి నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే 2016 యూజీసీ పీఆర్సీ బకాయిలు టీచింగ్ వైద్యులకు చెల్లించాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే 30 సార్లు విన్నపాలు చేసినా, ప్రభుత్వం నుంచి స్పందన కొరవడిందన్నారు. అంతేకాక తాము పనిచేసిన కాలానికి అనుగుణంగా పీఆర్సీ బకాయిలు ఇవ్వ మని వినతి అందజేస్తే ఇవ్వడం కుదరదని ప్రభు త్వం చెప్పడం బాధాకరమైన విషయమని అసోసి యేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఐ.బాబ్జి శ్యామ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): భారతీయ విజ్ఞాన మండలి, అప్కాస్ట్, విజ్ఞాన భారతి సంయుక్తంగా నిర్వహించే కౌశల్ క్విజ్ ట్యాలెంట్ టెస్ట్–2026 పోటీల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో కౌశల్ క్విజ్ – 2026 రాష్ట్ర స్థాయిలో జరిగే సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీకి సంబంధించిన పోస్టర్‌ను చంద్రకళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పోటీలకు ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అర్హులన్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులు 28న, తొమ్మిదో తరగతికి 29న, పదో తరగతి విద్యార్థులకు 30న పోటీలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ 15న జిల్లా స్థాయిలో పోటీ నిర్వహించి, మొదటి, రెండు స్థానాలు రాష్ట్రస్థాయి క్విజ్ పోటీకి ఎంపికవుతాయని వివరించారు. వివిధ విభాగాల నిర్వాహకులు అరుణ, సీహెచ్బీవీ పద్మావతి, సతీ్‌ష్, ఓ.పిచ్చేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల: ఘంటసాల కేవీకే పరిధిలోని గ్రామాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీటి మునిగిన వరి పంటను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ వరిలో దుబ్బు చేసే దశ నుంచి పిలకలు వేసే దశలో ఉన్నట్లయితే ముంపు నీటిని వీలైనంత త్వరగా తీసేయాలన్నారు. నీరు పూర్తిగా బయటకు తీసి బూస్టర్ డోస్ కింద 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను ఎకరానికి వేసుకోవాలన్నారు. పొడ తెగులు వ్యాప్తి నివారణకు హక్సాకొనజోల్ 400 మి.లీ. లేదా వాలిడామైసిన్ 400 మి.లీ. లేదా అజాక్సిస్ట్రోబిన్ 200 మి.లీ. చొప్పున కలుపుకుని ఎకరానికి పిచికారీ చేసుకోవాలని సూచించారు. -
నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల సంఖ్య తక్కువ చేసి నోటిఫికేషన్ జారీ చేసిందని, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) ఆరోపించింది. శుక్రవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో డీవైఎఫ్ఐ ఆధ్వర్యాన పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల పోరుబాట పేరుతో చలో విజయవాడ కార్యక్రమం జరిగింది. డీవైఎఫ్ఐ కార్యకర్తలు, నిరుద్యోగులు ధర్నా చేశారు. అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరిన డీఐఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులు, డీవైఎఫ్ఐ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య తక్కువగా చూపిందన్నారు. కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచి సవరణ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులపై వేధింపులు, నిర్బంధం ఆపాలని డిమాండ్ చేశారు. పోలీసు కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య 11,639లకు పెంచాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారి అబ్దుల్లా, రాష్ట్ర నేతలు వీరేష్, అంజనేయరాజు, గణేష్, శివ, సురేంద్ర బాబు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించిన డీవైఎఫ్ఐ -
మునేరుకు పోటెత్తిన వరద..
మునేటికి ఎగువ ప్రాంతాలైన తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాలో వర్షాలు పడుతుండడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు మునేటిపై పోలంపల్లి ఆనకట్ట వద్ద ఆరున్నర అడుగుల మేర వరదనీరు వస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. పెనుగంచిప్రోలు నుంచి లింగగూడెం వెళ్లే రోడ్డులో గండివాగు, అనిగండ్లపాడు వెళ్లే రోడ్డులో కూచివాగు వద్ద చప్టాలపై నీరు ప్రవహించటంతో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఈ వర్షాలకు వరి, మిర్చి పంటలకు ఉపయోగపడినా.. పత్తికి నష్టం కలిగించిందని రైతులు చెబుతున్నారు. శ్రీతిరుపతమ్మ వారి ఆలయం వద్ద మునేరులోకి భక్తులు దిగకుండా గేటు మూసేశారు. -
ఇన్ఫ్లుయెన్స్ చేసే కుట్ర
సాక్షి, విజయవాడ: ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు అంటూ చంద్రబాబు సహా కూటమి నాయకులు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీల్లో ఏ ఒక్కదానినీ పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. ఆ హామీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులతో భయపెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేసినా కేసులు పెట్టి వేధిస్తున్నారు. అయితే ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట ప్రజలను మాయ చేసే కుట్రలకు తెరలేపారు. ప్రకృతి వనరులైన ఇసుక, మట్టి, గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి తరలిస్తూ కూటమి నేతలు రూ.కోట్లు గడిస్తున్నారు. నిన్నటి వరకు ఐటీడీపీ కార్యకర్తలకు పరోక్షంగా ఆర్థిక లబ్ధి చేకూర్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తలంటూ ఇన్ఫ్లుయెన్సర్ల జేబులు నింపే చర్యలకు తెగబడింది. ఇన్ఫ్లుయెన్సర్ల ఎంప్యానెల్మెంట్ పాలసీకి బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపింది. ఏ పథకాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయని ప్రభుత్వం, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రజాధనం చెల్లించాలన్న నిర్ణయంపై ప్రజాసంఘాలు, మేధావులు, నిరుద్యోగ యువత, మహిళలు భగ్గుమంటున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా ఇన్ఫ్లుయెన్సర్లను నాలుగు కేటగిరీలుగా విభజించి ఒక్కో వీడియోకు కొంత మొత్తం చెల్లించేలా విధివిధానాలు రూపొందించారు. ప్రచారానికి ఇంత ప్రాధాన్యమా? ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం అవసరమే. అందు కోసం ప్రజాధనాన్ని ఇలా ఖర్చు చేస్తారా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఏమీ చేయని ప్రభుత్వానికి ప్రత్యేక ప్రచార వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని నిలదీస్తున్నారు. నిజంగా ప్రభుత్వం మంచి చేస్తుంటే, సక్రమంగా పథకాలు అందిస్తే, లబ్ధిదారుల అనుభవాలే చాలని పేర్కొంటున్నారు. ప్రజలకు ఏమీ చేయకుండానే, ప్రజల సొమ్ముతో ప్రచారం చేయించేకోవడం ఏమిటని ఎద్దేవాచేస్తున్నారు. హామీల అమలు ఎక్కడ? కొత్త పాలసీ అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో 2024 ఎన్నికల నాటి కూటమి హామీలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్‌లో భాగంగా నిరుద్యోగ యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అంత వరకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి చెల్లిస్తామని, 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం, 50 ఏళ్లు దాటిన మహిళలకు పింఛన్ పథకాలు ఏమయ్యాయి బాబూ అంటూ ప్రశ్నిస్తున్నారు. మరో వైపు హామీల అమలుపై ఎవరైనా ప్రశ్నిస్తే కూటమి పెద్దలు కేసులు పెట్టి వేధిస్తున్నారు. తమ అభిప్రాయం చెప్పినా సంక్షేమ పథకాలు నిలిపివేయడం, వారి ఇళ్లకు వెళ్లి భయపెట్టడం వంటి చర్యలకు తెగబడుతున్నారు. -
టెర్మినల్ పనులను వేగవంతం చేయాలి
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీవిమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని నిర్ణీత గడువులోపు పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన గురువారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, మౌలిక వసతుల కల్పనపై ఎయిర్పోర్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ టెర్మినల్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ జనరల్ మేనేజర్ రామాచారి, డైరెక్టర్ ఎ. లక్ష్మీకాంత్‌రెడ్డి, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, గన్నవరం తహసీల్దారు కె.వి.శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముసురుకున్న కష్టాలు
వాయుగుండం ప్రభావంతో కుండపోత వర్షం బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు 110.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గన్నవరం మండలంలో 168.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఉంగు టూరు 164.6, గుడివాడ 143.2, అవనిగడ్డ 126.2, బాపులపాడు 125.6, నందివాడ 124.6, పామర్రు 116.8, గూడూరు 114, కంకిపాడు 110.4, కోడూరు 108.6, పెడన 99.6, ఉయ్యూరు 99.4, పెనమలూరు, పమిడిముక్కలు 96.8, గుడ్లవల్లేరు 95.8, ఘంట సాల 95.2, కృత్తివెన్ను 90.2, బంటుమిల్లి 88.8, చల్లపల్లి 88.4, మచిలీపట్నం సౌత్, నార్త్ 85.2, తోట్లవల్లూరు 83.2, మొవ్వ, మోపిదేవి 82.6, పెదపారుపూడి 81.8, నాగాయలంకలో 58.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిలకలపూడి(మచిలీపట్నం): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కృష్ణా జిల్లాలో గురువారం కూడా కుండపోతగా వర్షం కురిసింది. రెండు రోజులుగా తెరిపివ్వని భారీ వర్షాలకు పలు చోట్ల పల్లపుప్రాంతాలు, రోడ్లు నీటమునిగాయి. పంట పొలాలు ముంపుబారిన పడ్డాయి. గన్నవరం, అవనిగడ్డ, గుడివాడ నియోజకవర్గాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. రెండో రోజు భారీ వర్షసూచన ఉండటంతో కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశాల మేరకు విద్యాశాఖాధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కలెక్టర్ బాలాజీ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. వర్షాలతో ఇబ్బందులు గురువారం కుండపోతగా వర్షం కురవటంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాలకు వెళ్లే సిబ్బంది వర్షంలో తడవాల్సి వచ్చింది. అవనిగడ్డ గ్రామం ఒకటో వార్డులోని లంక మాన్యం, సింహాద్రి కాలనీ మురుగు కాలువలు పొంగిపొర్లాయి. ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో కూడా డ్రెయిన్లు పొంగి ప్రవహించాయి. మోపిదేవి గ్రామంలో ఈదురుగాలుల వల్ల చెట్టుకొమ్మ విరిగి విద్యుత్ వైరుపై పడింది. వైర్లను చేతితో పట్టుకుని పైకి లేపుతుండగా విద్యుదాఘానికి గురై దారపురెడ్డి విజయసామ్రాజ్యం (52) మృతి చెందింది. గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలంలోని వెన్ననపూడి, దండిగనపూడి, పోలుకొండ, ఇలపర్రు గ్రామాలతో పాటు గుడివాడ మండలంలోని గుంటకోడూరు, గొల్వెపల్లి, సిరిచింతల గ్రామాల్లో నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెడన నియోజకవర్గంలో పెడన – గుడివాడ రహదారిపై ఈదురుగాలులకు వృక్షం విరిగి రోడ్డుపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆలస్యంగా సాగు చేసిన పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. గన్నవరం నియోజకవర్గంలో ఉంగుటూరు, లంకపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనపై బుడమేరు నీటి ప్రవాహం ఉండటంతో అధికారులు ముందస్తు చర్యగా రాకపోకలు నిలిపివేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ నిర్వహణకు నియమించిన సిబ్బందిని అప్రమత్తం చేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలి రెండు రోజులుగా భారీ వర్షాలు కురవటంతో ఆలస్యంగా సాగు ప్రారంభించిన పంట పొలాలు ముంపునకు గురైతే నీరు తోడుకునే విధంగా రైతులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. ఇప్పటికే సాగు చేసిన పంట పొలాలకు వర్షం ఊరటనిస్తుందని పేర్కొ న్నారు. ఉద్యాన పంటలకు సంబంధించి అరటి, పసుపు, కూరగాయల పంటలకు ఎటువంటి నష్టం లేదని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. నిలిచిన వేట కోడూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో మత్స్యకారులు తమ వేట పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో గంగపుత్రులు వేటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. నేడు విద్యా సంస్థలకు సెలవు భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు శుక్రవారం కూడా సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఈ ఆదేశాలను అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు అమలు చేయాలని స్పష్టంచేశారు. కోడూరు: తీవ్ర వాయుగుండం ప్రభావంతో మండలంలోని పాలకాయతిప్ప వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలోని రాకాసి అలలు సుమారు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడుతూ భయందోళన కలిగించాయి. బీచ్ పరిస రాలు మొత్తం సముద్రపు పోటుతో నిండిపోయాయి. సముద్రం నీరు సుమారు కిలో మీటరు మేర ముందుకు చొచ్చుకొచ్చింది. డాల్ఫిన్ భవనంతో పాటు అటవీ అధికారులు నిర్మించిన గుడారాలు చుట్టూ కూడా సముద్రం నీరు చేరింది. పవిత్ర కృష్ణా సాగర సంగమం వద్ద ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. సముద్రం నుంచి సంగమం వరకు ఇసుక తిన్నెలు భారీస్థాయిలో కోతకు గురయ్యాయి. సముద్ర హోరుతో తీరప్రాంత భీకరంగా మారింది. అటవీ అధికారులు తీరం గేట్లను మూసి వేశారు. కరకట్ట వద్ద గేట్లకు తాళాలు వేసి పర్యాటకుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. మరో రెండు రోజులు బీచ్ గేట్లు మూసే ఉంటాయని, పర్యాటకులు తీరానికి రావద్దని స్పష్టం చేశారు. గేటు వద్ద మైరెన్, అటవీ అధికారులు గస్తీ నిర్వహిస్తున్నారు. -
నులిపురుగుల నివారణకు చర్యలు
సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దసరా, దీపావళి, ఛత్ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఓ ప్రటకలో తెలిపారు. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07039) అక్టోబర్ ఏడు నుంచి నవంబర్ 25వ తేదీ వరకు ప్రతి బుధవారం రాత్రి 7.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07040) అక్టోబర్ ఎనిమిది నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ప్రతి గురువారం రాత్రి తొమ్మిది గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. రెండు మర్గాల్లో ఈ రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, విష్ణుపురం, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. రూ.25 లక్షలు పలికిన గణపతి లడ్డూ ప్రసాదంకోనేరుసెంటర్(మచిలీపట్నం): మంగినపూడి బీచ్ సాగరతీరంలో ఏర్పాటుచేసిన 63 అడుగుల మహాగణపతి విగ్రహం వద్ద లడ్డూ ప్రసాదం వేలంలో రూ.25 లక్షలు పలికింది. తుపాను నేపథ్యంలో కమిటీ నిర్వాహకులు 630 కిలోల లడ్డూ ప్రసాదానికి గురువారం ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో వేలం నిర్వహించారు. ఆఫ్‌లైన్‌లో మచిలీపట్నం నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, ఇతర ప్రాంతాలకు చెందిన అనేక మంది భక్తులు ఆన్లైన్లో పాల్గొని పోటీపడ్డారు. మచిలీపట్నానికి చెందిన ఎఫ్‌సీఎస్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గుమ్మడి భవానీశంకర్ రూ.25 లక్షలకు ఆన్లైన్ వేలంలో స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. భవానీశంకర్ దంపతులకు శుక్రవారం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని మంత్రోచ్చరణ నడుమ వేదపండితుల సమక్షంలో అందజేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. -
రాష్ట్రంలో తొలిసారిగా లడ్డూ ఏటీఎం
దుర్గగుడిలో ప్రారంభించిన దేవదాయ శాఖ కమిషనర్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో తొలి సారిగా ఏటీఎం మిషన్ ద్వారా భక్తులకు దుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్నామని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ పేర్కొన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గనగర్ సెంట్రల్ సమాచార కేంద్రం వద్ద బుధవారం ప్రసాదాల ఏటీఎం మిషన్‌ను దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, దుర్గగుడి ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ ప్రారంభించారు. తొలుత ప్రసాదాల ఏటీఎంవద్ద అమ్మవారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కమిషనర్ స్వయంగా తన మొబైల్ ద్వారా ఆరు లడ్డూల బ్యాక్స్‌ను రూ. 100కు కొనుగోలు చేశారు. పైలెట్ ప్రాజెక్టుగా.. రామచంద్రమోహన్ మాట్లాడుతూ ప్రసాదం కోసం అధిక సమయం కౌంటర్ల వద్ద వేచి ఉండకుండా త్వరతిగతిన అందించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా దుర్గగుడిలో డిజిటల్ చెల్లింపుల ద్వారా లడ్డూలను కొనుగోలు చేసేందుకు ఈ మిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. సిబ్బంది ప్రమేయం లేకుండా భక్తులు స్వయంగా ఈ మిషన్‌ను ఆపరేట్ చేసుకునే వీలు ఉందన్నారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద ఈ మిష న్ ఏర్పాటు చేసి పనితీరును పరిశీలిస్తున్నామన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎయిర్ పోర్టులలో మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దు.. దేవాలయాల్లో దర్శనాలు, సేవా టికెట్ల పేరిట దళారుల ప్రమేయాన్ని ఉపేక్షించేది లేదని రామచంద్రమోహన్ సృష్టం చేశారు. దుర్గగుడిలో ఆర్జిత సేవా టికెట్ పేరిట నకిలీ టికెట్ విక్రయించిన వ్యవహారం తన దృష్టికి వచ్చిందన్నారు. అపరిచిత వ్యక్తులు, మధ్యవర్తులను ఆశ్రయించి పూజా టికెట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని హెచ్చరించారు. -
లయోల విద్యాసంస్థల రెక్టార్‌గా ఫాదర్ రాయప్ప
గుణదల(విజయవాడ తూర్పు): ఆంధ్ర లయోల విద్యా సంస్థల నూతన రెక్టార్‌గా ఫాదర్ రాయప్పను నియమించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ మెల్కియోర్ తెలిపారు. కళాశాల సమావేశ మందిరంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఫాదర్ రాయప్పను అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పాదర్ మెల్కియోర్ మాట్లాడుతూ... 1997వ సంవత్సరంలో ఆంధ్రాప్రావిన్స్లోని సోసైటీ ఆఫ్ జీసస్ సంఘంలో ఆయన చేరారని, 2012లో గురువుగా అభిషేకం పొందారని తెలిపారు. అప్పటి నుంచీ లయోల సంస్థలో వైస్ ప్రిన్సిపాల్‌గా, విజువల్ కమ్యూనికేషన్ విభాగాధిపతిగా సేవలందించారని వివరించారు. ఫాదర్ రాయప్ప నిబద్ధతకు నిదర్శనంగా లయోల యాజమాన్యం నూతన రెక్టార్‌గా నియమించినట్లు తెలిపారు. పటమట(విజయవాడతూర్పు): నగరంలోని గిరిపురం ప్రాంతంలో నగరపాలక సంస్థ కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీటి శాంపిళ్లను బుధవారం సేకరించారు. నగరపాలక సంస్థ సరఫరా చేసే తాగునీరు కలుషితమవుతోందని, గిరిపురంలో డ్రెయినేజీ పక్కనే తాగునీటి పైపులైను ఉండటం వల్ల డయేరియా ప్రబలుతోందని పేర్కొంటూ ‘సాక్షి’లో ఈ నెల 21వ తేదీన ‘తాగునీరు సురక్షితమేనా’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన మునిసిపల్ ప్రిన్సిపల్ కార్యదర్శి సురేష్‌కుమార్ వీఎంసీ అధికారుల నుంచి నివేదిక కోరారు. ఈ మేరకు మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, వీఎంసీ చీఫ్ ఇంజినీర్ పి.సత్యకుమారి ఆధ్వర్యంలో ప్రజారోగ్యం, ఇంజినీరింగ్ సిబ్బంది గిరిపురంలోని ప్రతి ఇంటి నుంచి నీటి శాంపిళ్లు సేకరించారు. స్థానికంగా ఉన్న పలు ఆర్వోప్లాంట్లను తనిఖీ చేశారు. నాటిని పరీక్షించి అనంతరం ప్రభు త్వానికి నివేదిక సమర్పిస్తామని అధికారులు ప్రకటించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): తన కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు పొందొచ్చంటూ రిటైర్డ్ రైల్వే ఉద్యోగిని రూ.13 లక్షలకు మోసగించిన ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. భవానీపురంలో నివ శించే జి.కృష్ణప్రకాష్ రైల్వేలో స్టేషన్ సూపరింటెండెంట్‌గా పనిచేసి 2019లో ఉద్యోగ విర మణ చేశారు. ఫేస్‌బుక్‌లోని ఓ పేజీలో నిర్మలా సీతారామన్, అనీల్ అంబానీ, ఇన్ఫోసిస్ నారా యణమూర్తి మేసేజ్‌లు చూసి ఆసక్తి పెంచుకున్నారు. ఆ గ్రూపులో రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నం చేయగా రూ.20 వేలు చెల్లించాలని మెస్సేజ్ రాగా అకౌంట్ నుంచి ఆ మొత్తం జమచేశారు. అనంతరం వేర్వేరు వ్యక్తులు ఫోన్లు చేసి తమ కంపెనీల్లో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు పొందొచ్చంటూ నమ్మబలికారు. అలా తొలుత రూ.40 వేలు, రూ.50 వేలు పెట్టుబడి పెట్టగా, కొంత మొత్తం లాభం పేరుతో ఆయన ఖాతాకు చెల్లిస్తూ నమ్మించారు. అనంతరం ఆరు నెలల వ్యవధిలో వృద్ధుడి నుంచి విడతల వారీగా రూ.13 లక్షలు పెట్టుబడి పెట్టించారు. అనంతరం తనకు రావాల్సిన లాభం గురించి కృష్ణప్రకాష్ ప్రశ్నించారు. లభం ఏమీ రాదని బ్యాలెన్స్ జీరో అని చెప్పడంతో తాను మోసపోయిట్లు గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీతానగరం: పార్వతీ పురం – మన్యం జిల్లా సీతానగరం మండలంలోని ఏగోటివలస వద్ద తోటపల్లి కాలువలో గల్లంతైన కృష్ణా జిల్లా లెంక గ్రామానికి చెందిన మధుకోటి హేమంత్ కృష్ణ (39) మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..హేమంత్ కృష్ణ ఓ శుభకార్యం నిమిత్తం మండ లంలోని ఏగోటివలస బంధువుల ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లేందుకు స్నేహితులు ఎస్.పోలినాయుడు తదితరులతో కలిసి కాలువ వద్దకు వచ్చిన హేమంత్ కృష్ణ ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. స్థానికుల ద్వారా సమచారం అందుకున్న తహసీల్దార్ కె.ప్రసన్న కుమార్ పోలీసులు, అగ్నిమాపక, ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఆయా శాఖల పర్యవేక్షణలో గాలింపు చర్యలు చేప ట్టారు. ఈదురు గాలులతో కూడిన వర్షం కుర వడంతో పాటు చీకటి పడడంతో గాలింపు కష్టమైంది. బుధవారం ఉదయం మళ్లీ గాలింపు చేపట్టగా.. బురదలో కూరుకుపోయిన హేమంత్ కృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు. విజయవాడ నుంచి వచ్చిన బంధువుల సమక్షంలో హేమంత్‌కృష్ణ శవ పంచనామా చేపట్టి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రా స్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎం.హేమలత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బకాయిలు ఇప్పించాలని ట్రావెల్స్ యజమాని వినతి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వంలో లీజుకు కార్లు పెట్టగా, ఓ అధికారి నిర్లక్ష్యం కార ణంగా తనకు బిల్లులు రాకుండా నిలిచిపోయా యని విజయవాడకు చెందిన ట్రావెల్స్ యజమాని కొల్లూరువెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అధికారి నుంచి తనకు దాదాపు రూ.35 లక్షలు వరకూ రావాలని తెలిపారు. నగరంలోని తన నివాసంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. 2016లో అప్పటి కాపు కార్పొరేషన్ అధికారికి కారును నెలకు రూ.60 వేల చొప్పున అద్దెకు పెట్టినట్లు తెలిపారు. ఆయన సిఫార్సుతో మరికొన్ని కార్లు పెట్టానన్నారు. తనకు 11 నెలల పాటు బిల్లులు ఇవ్వకుండా, అదేమని ప్రశ్నించినందుకు కార్లు లీజునుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన బంధువుకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5 లక్షలు తీసు కున్నాడని పేర్కొన్నారు. ఉద్యోగం ఇవ్వకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. ఈ విషయమై ఇప్పటికే పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. ఆ అధి కారి అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుందని, ఇటీవలే మరో కీలక బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి అవినీతి అధికారిపై చర్యలు తీసుకుని, తనకు బకాయిలు ఇప్పించాలని కోరారు. ఈ సమావేశంలో వెంకటేశ్వరరావు కుమారుడు వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2.08కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, మొక్కుబడులు, ముడుపులను బుధవారం లెక్కించారు. 14 రోజులకు గాను మొత్తం రూ. 2.08కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరో అంతస్తులో జరిగిన లెక్కింపులో మొత్తం రూ. 2,08,91,285 మేర ఆదాయంతో పాటు 203 గ్రాముల బంగారం, 2.674కిలోల వెండి లభ్యమైనట్లు అధికారులు చెప్పారు. ఇక వివిధ దేశాలకు చెందిన కరెన్సీ యూఎస్ఏ డాలర్లు 192, యూఏఈ దిర్హమ్స్ 400, ఒమన్ బైంసాలు 300, కెనడా డాలర్లు 115, ఇంగ్లాండ్ పౌండ్లు 80 లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. లెక్కింపును ఈవో శీనానాయక్, డీఈవో కిషోర్‌కుమార్, ఏసీ రంగారావు, ఏఈవో రమేష్‌బాబు పర్యవేక్షించగా, దేవస్థాన సిబ్బంది, సేవా సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): స్వర్ణాంధ్రప్రదేశ్ – 2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో బుధవారం సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై శాఖల వారీగా వర్క్‌షాప్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అవసరాలు, వనరులు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి అంశాలపై సమగ్రంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. జిల్లాలో ఉన్న పోర్టు, ఫిషింగ్ హార్బర్, ఇమిటేషన్ జ్యూవెలరీతో పాటు మల్లవల్లిలోని పారిశ్రామికవాడను సందర్శించి సమాచారం సేకరించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి జ్యోతిరమణి, ఉద్యానశాఖ అధికారి జ్యోతి, మత్స్యశాఖ అధికారి ఎ. నాగరాజు, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆత్కూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌ను బుధవారం ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్‌బాబు సందర్శించారు. అక్కడ యువతకు శిక్షణ ఇస్తున్న కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ స్వర్ణభారత్ ట్రస్ట్‌లో నిరుద్యోగ యువతి, యువకులకు వృత్తి విద్య కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణ్యాలను కూడా మెరుగు పరుచుకోవాలని సూచించారు. అనంతరం ట్రస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరదేశిని కలిశారు. విజయవాడలీగల్: విజయవాడ సిటీ సివిల్ కోర్టులలో న్యాయవాదులుగా నమోదై, ప్రాక్టీస్ చేస్తున్న బానావతు వెంకట సాయి నాయక్, వన్నపూస సుప్రియ జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికయ్యారు. వీరిరువురు విజయవాడ కోర్టులో ప్రాక్టీస్ చేసి, న్యాయమూర్తులుగా ఎంపికవ్వడంపై బెజవాడ బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. బుధవారం ఇరువురిని బీబీఏ అధ్యక్షుడు విష్ణు భొట్ల లక్ష్మీనారాయణ, బార్ కౌన్సిల్ సభ్యురాలు రాగి గంగాభవాని, జనరల్ సెక్రటరీ వి.కిరణ్‌కుమార్, ఇందిర తదితర న్యాయవాదులు సన్మానించారు. -
ఉరిమిన వరుణుడు
జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు జలమయమైన హనుమాన్‌జంక్షన్ ప్రధాన కూడలిచిలకలపూడి(మచిలీపట్నం): బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారడంతో మంగళవారం రాత్రి నుంచి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. కాగా బుధవారం జిల్లా అంతటా ఎడతెరిపి లేని వర్షం కురవటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో స్వయంగా మాట్లాడి అప్రమత్తం చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. జనాల అవస్థలు తీవ్రవాయుగుండం ప్రభావంతో బుధవారం ఎడతెరిపి లేని వర్షం కురవటంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బయటకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వానలో తడిసి వెళ్లాల్సి వచ్చింది. ఉదయం నుంచి భారీ వర్షం కురవటంతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కలెక్టర్ డీకే బాలాజీ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గురువారం కూడా అదే పరిస్థితులు ఉండనున్న నేపథ్యంలో అన్ని యాజమాన్యాల పరిధిలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రైతులకు కాస్త ఊరట.. రెండు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో రైతులకు కాసింత ఊరట కలిగింది. జిల్లాలో 1,60,655 హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉండగా 1,47,379 హెక్టార్లలో వరిసాగు జరిగింది. అయితే గత రెండు నెలలుగా సాగునీరు రైతులకు అందకపోవటంతో ప్రత్యామ్నాయ వనరులు ఉపయోగించి సాగు చేస్తున్నారు. అయితే ఈ వర్షం పంటలు ఎండి పోకుండా ఉపయోగపడుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో ఆలస్యంగా సాగు చేస్తుంటారని అలా నాట్లు వేసే రైతులకు ఈ వర్షాలు ఉపయోగపడతాయని అంటున్నారు. ఉద్యానపంటలకు సంబంధించి జిల్లాలో అరటి, పసుపు, కూరగాయల పంటలు ఈ వర్షం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని ఇదే వర్షం మరో రెండు, మూడు రోజులు పాటు కురిస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. గుడివాడలో అత్యధిక వర్షపాతం జిల్లాలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు 22.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గుడివాడ మండలంలో 48.5 మిల్లీమీటర్లు, అత్యల్పంగా నాగాయలంక మండలంలో 10.6 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. గుడ్లవల్లేరు మండలంలో 37.5 మిల్లీమీటర్లు, మచిలీపట్నం నార్త్ 33.1, పెదపారుపూడి 31.0, తోట్లవల్లూరు 30.8, నందివాడ 28.3, పెడన 26.8, మచిలీపట్నంసౌత్ 26.7, బాపులపాడు 26.2, ఉయ్యూరు 25.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బంటుమిల్లి మండలంలో 24.2 మిల్లీమీటర్లు, కృత్తివెన్ను 24.1, ఘంటసాల 21.7, ఉంగుటూరు 20.6, పామర్రు 20.4, గూడూరు 18.7, కంకిపాడు 18.0, చల్లపల్లి 17.5, పమిడిముక్కల 16.7, పెనమలూరు 16.4, మొవ్వ 15.4, మోపిదేవి 14.2, కోడూరు 14.1, గన్నవరం 13.3, అవనిగడ్డ 12.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు తక్షణ సహాయం, సమాచారం అందించేందుకు మచిలీపట్నంలోని కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ ప్రకటించారు. కంట్రోల్ రూమ్ నంబరు 08672–252399కు ఫోన్ చేయవచ్చన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమాచారం అత్యవసర పరిస్థితులను స్వీకరించి సంబంధిత అధికారులకు తెలిపేందుకు సిబ్బందిని నియమించామన్నారు. -
దండయాత్ర!
సామాన్యుడిపై ధరలఏం కొనాలి.. ఏం తినాలి? సాక్షి, విజయవాడ: రోజంతా కష్టపడితే వచ్చే కూలి.. నెలంతా కష్టపడితే వచ్చే జీతంతో కుటుంబ పోషణ కష్టతరమవుతోంది.. ఇంటి బాడుగ, నిత్యావసరాలకే వచ్చిన అరకొర వేతనం సరిపోతే.. ఇక పిల్లల చదువులు, ఇతరత్రా వాటికి ప్రతి నెలా అప్పు చేయాలి. మరోవైపు ధరలు.. రోజు రోజుకూ మరింత పెరగడమే తప్పా.. తగ్గడమే లేదు. ఉప్పు నుంచి పప్పు వరకు, నూనెలు, బియ్యం, కూరగాయలు, ఉల్లి, వెల్లుల్లి.. ఏది కొనాలన్నా నెలవారీ కుటుంబ బడ్జెట్ అంచనాకు మించుతోంది. ఈ ధరల దండయాత్రతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబే లెత్తుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమవుతోంది. ప్రతి నెలా భారం తప్పట్లేదు.. రెండు, మూడు నెలల క్రితం వరకు మేలు రకం సన్నబియ్యం కిలో రూ.50 నుంచి రూ.55 మధ్య ఉండేది. గత నాలుగైదురోజుల్లోనే కొన్ని రకాల బియ్యం ధర కేజీ రూ.70 దాటింది. ఈ లెక్కన గమనిస్తే కిలోపై రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగింది. నెలకు 20 నుంచి 25 కిలోల బస్తా కొనుగోలు చేసే సామాన్యులపై రూ.400 నుంచి రూ.550 వరకూ అదనపు భారం పడుతోంది. దీనికి తోడు మిల్లర్లు, వ్యాపారులతో కుమ్మకై ్క ధరలు పెంచేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రైతు బజార్లలో సన్నబియ్యం అందిస్తున్నామని చెబుతున్నా.. వాస్తవంగా రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యమే విక్రయిస్తుండటంతో ప్రజలు కొనుగోలు చేయట్లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బియ్యం నిల్వలన్నీ కూడా గతేడాదివే. బియ్యం ధరలు పెరగకుండా నియంత్రిస్తున్నామని తరచూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. వీరి వెనుక కూడా ఎన్టీఆర్ జిల్లాలో బియ్యం మాఫియా నడుస్తోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పంచదార, బెల్లం మరింత ప్రియం.. రెండు నెలల కిందట కిలో పంచదార రూ.40 నుంచి రూ.45 మధ్య ఉండేది. ప్రస్తుతం రూ.70 నుంచి రూ.75 వరకు చేరడంతో సామాన్యులు కొనలేక ఆలోచించాల్సిన పరిస్థితి. కొందరు వ్యాపారులు చక్కెరను గౌడౌన్లలో నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని పలువురు జనరల్ స్టోర్లు, బేకరీ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు రేషన్ దుకాణాల్లో రాయితీపై అందించే పంచదారను డీలర్లే బొక్కేస్తున్నారని, యంత్రంలో శబ్దం రాకుండా సెట్టింగ్స్ మార్చుకుని, కార్డుదారుల వేలిముద్రలు వేసుకుని, పంచదార ఇవ్వకుండానే, ఇచ్చినట్లు చూపుతూ కాజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు బెల్లం ధర కూడా పెరిగింది. కొద్దిరోజుల క్రితం కిలో రూ.55 నుంచి రూ.60 మధ్య ఉన్న బెల్లం ప్రస్తుతం రూ.70 నుంచి రూ.80 వరకు ఉంది. ప్యాకింగ్ చేసిన బెల్లం అయితే పలు సూపర్ మార్కెట్లలో, కొన్ని పేరున్న మార్ట్‌లలో కిలో రూ.90కు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అన్నింటి కంటే ఉల్లి, వెల్లుల్లి ధరలు గత నాలుగైదురోజుల్లోనే కిలోపై రూ.10 నుంచి రూ.15 వరకు పెరిగాయి. మహారాష్ట్ర లోని నాసిక్, కర్నూలులో ఉల్లి దిగుమతి ఉంటుంది. అయితే ఈసారి తీవ్ర వర్షాభావం కారణంగా దిగుమతి లేదు. ఈ ఏడాది జూలైలో కిలో రూ.20–25 మధ్య ఉన్న ఉల్లి ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో, తోపుడు బండ్ల మీద ఏకంగా రూ.80 నుంచి రూ.90 వరకు ఉంటోందని గాంధీనగర్ రైతు బజారులో కూరగాయ లు కొనడానికి వచ్చిన పలువురు మహిళలు వాపోయారు. మరోవైపు ప్రభుత్వ పెద్దలు, అధికారులు రైతుబజార్ల ద్వారా రూ.32కే కిలో ఉల్లి అందుబాటులోకి తెస్తామని చెబుతున్నా.. వాస్తవానికి రైతుబజార్లలో ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం తెప్పిస్తున్న ఉల్లి కుళ్లిపోయిన, నాసిరకంగా ఉంటోందని వాపోతున్నారు. నాణ్యమైన ఉల్లిని బ్లాక్‌లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిలో ఉల్లి కొంటే 20 శాతం కుళ్లిన గడ్డలే ఉంటున్నాయని మహిళలు వాపోయారు. రెండు నెలల క్రితం కిలో వెల్లుల్లి సుమారు రూ.140 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.300 దాటింది. నాణ్యత, గ్రేడింగ్ ఆధారంగా కొన్ని దుకాణాల్లో రూ.300కు పైగా కూడా విక్రయిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. అలాగే కిలో ఎండు మిర్చి ధర రూ.300కు చేరింది. ఇక వంట నూనెల ఽ దరల్లోనూ భారీ పెరుగుదల కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం బ్రాండెడ్ వంట నూనె కిలో రూ.160 నుంచి రూ.170 మధ్య లభించగా.. ప్రస్తుతం రూ.185 నుంచి రూ.210 వరకు చేరింది. -
విద్యుత్ అంతరాయాలను పరిష్కరించేందుకు చర్యలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీపీ డీసీఎల్ ఎన్టీఆర్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీరు యు.హనుమయ్య తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని తన కార్యాల యంలో అధికారులతో జిల్లాలోని పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లాలోని విద్యుత్ సబ్స్టేషన్లు, ఫీడర్లు, విద్యుత్ లైన్ల పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హనుమయ్య మాట్లాడుతూ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలపై దృష్టి పెట్టామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు అదనపు సిబ్బంది, అవసరమైన విద్యుత్ సామగ్రి, వాహనాలను సిద్ధంచేశామన్నారు. వర్షాలు, ఈదురుగాలుల కారణంగా చెట్లు లేదా కొమ్మలు విద్యుత్ తీగలపై పడటం, స్తంభాలు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తిన వెంటనే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పరిస్థితిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో తెగిపడిన విద్యుత్ తీగలు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, తడిసిన విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. విద్యుత్ తీగలు తెగిపడినట్లు గుర్తిస్తే వెంటనే సమీప విద్యుత్ అధికారులకు లేదా 1912 విద్యుత్ కస్టమర్ కేర్ నెంబరుకు సమాచారం అందించాలని కోరారు. జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఏడుకొండలరావు, విశ్వేశరప్రసాద్, శ్రీనివాసరావు ఇతర ఇంజినీరింగ్ సిబ్బంది పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్‌శాఖ ఎన్టీఆర్ జిల్లా ఎస్ఈ హనుమయ్య -
మండలాలకు ప్రత్యేకాధికారుల నియామకం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో మండల ప్రజా పరిషత్‌లకు సంబంధించి ఎంపీపీల పదవీ కాలం గురువారంతో ముగియనుండటంతో ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. లేబర్ అసిస్టెంట్ కమిషనర్ (అవనిగడ్డ), జిల్లా సహకార అధికారి (బంటుమిల్లి), ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ (బాపులపాడు), గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (చల్లపల్లి), జిల్లా పరిశ్రమల అధికారి (గన్నవరం), ఎస్సీ కార్పొరేషన్ ఈడీ (ఘంటసాల), ఇంటర్మిడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (గుడివాడ), బీసీ సంక్షేమాధికారి (గుడ్లవల్లేరు), ఔళిశాఖ అధికారి (గూడూరు), పంచాయతీరాజ్ ఈఈ (కంకిపాడు), జిల్లా ఎకై ్సజ్ అధికారి (కోడూరు), జిల్లా ఉపాధి కల్పనశాఖాధికారి (కృత్తివెన్ను), డ్వామా పీడీ (మచిలీపట్నం), వయోజన విద్య డెప్యూటీ డైరెక్టర్ (మోపిదేవి), సమగ్ర శిక్ష ఏపీపీ (మొవ్వ), జిల్లా మత్స్యశాఖ అధికారి (నాగాయలంక), జిల్లా అగ్నిమాపక అధికారి (నందివాడ), జిల్లా గిరిజన సంక్షేమాధికారి (పామర్రు), ఐసీడీఎస్ పీడీ (పమిడిముక్కల), దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ (పెడన), జిల్లా విద్యాశాఖాధికారి (పెదపారుపూడి), వ్యవసాయశాఖ అధికారి(పెనమలూరు), జిల్లా భూగర్భవనరుల శాఖా ధికారి (తోట్లవల్లూరు), జిల్లా ఫ్యాక్టరీల అధికారి (ఉంగుటూరు), జిల్లా ఉద్యానశాఖాధికారి (ఉయ్యూరు)లను నియమించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): తిరుపతి తిరుమలలోని చారిత్రక శ్రీ స్వామి హాథిరాం బావాజీ మఠం పరిరక్షణ కోసం బంజారా ప్రతినిధుల బృందం బుధవారం దేవదాయ శాఖ కార్యదర్శి కన్నబాబును ఆయన చాంబర్లో కలిసి వినతి పత్రం అందజేసింది. తమ ఆరాధ్య దైవమైన హాథిరాం బావాజీకి శ్రీవారితో ఉన్న అనుబంధాన్ని, బంజారా సంప్రదాయాలను కాపాడాలని, మఠం ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. గతంలో వచ్చిన ఆరోపణలు, పత్రికా కథనాలను అందజేసి, వాటిని ప్రభుత్వ రికార్డులతో పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాం నాయక్, సంఘ రాష్ట్ర సెక్రటరీ జాటావత్ రాంబాబు పాల్గొన్నారు. నెట్వర్క్: గణాధిపతుల విగ్రహ నిమజ్జనాలు జిల్లాలో కొనసాగుతున్నాయి. బుధవారం జోరువానలోనూ గ్రామోత్సవాల నడుమ గణనాథులు నిమజ్జనానికి తరలివెళ్లారు. -
ప్రాణాలు ‘జారిపోతున్నాయ్’!
కొండ ప్రాంతంలో బిక్కుబిక్కు వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేవి నగరానికి అన్ని వైపులా కనిపించే కొండలే. తాజాగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజానీకం బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఉన్న కొండ ప్రాంతవాసులు వర్షం పడితే ఎక్కడ ఏ ప్రమాదం వినాల్సి వస్తుందోననే ఆందోళనతో కాలం గడపాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొండ ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యమవుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. బెంబేలెత్తుతున్న ప్రజానీకం వాతావరణ శాఖ బంగాళాఖాతంలో వాయు గుండం ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలని ప్రకటించడంతో కొండ ప్రాంత నివాసితులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ఆయా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు భయంతో నిద్ర లేకుండా పోయింది. కొండలన్నీ నానుతుండటంతో ఎక్కడ ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయోనని ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలన్నీ మీడియాలో పదేపదే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరింతగా భయపడుతున్నారు. రెండున్నర లక్షలకుపైగా జనం విజయవాడ నగరపాలకసంస్థ పరిధిలో మొన్నటి వరకూ 64 డివిజన్లు కొనసాగాయి. తాజాగా అవి 86కు పెరిగాయి. అయితే పాత డివిజన్లలో సుమారు 20 డివిజన్లో పూర్తిగా కొండ ప్రాంతాలను కలుపుకొని ఉన్నాయి. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గంతో పాటుగా సెంట్రల్ నియోజకవర్గంలోని ఆయా కొండ ప్రాంతాల్లో సుమారుగా రెండున్నర లక్షలకుపైగా ప్రజలు నివాసాలను ఏర్పరచుకొని జీవిస్తున్నారు. అందులో అత్యధికంగా పశ్చిమ నియోజకవర్గంలోని మల్లికార్జునపేట, కొత్తపేట, ఆంజనేయవాగు, చిట్టినగర్, లంబాడీపేట, పాలప్రాజెక్ట్, కబేళా, రామరాజ్యనగర్, విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్ తదితర ప్రాంతాలకు సమీ పంలో ఉన్న కొండలపై అత్యధికంగా నివాసాలు ఉన్నాయి. తరచూ ప్రమాదాలు నగరంలోని మూడు నియోజకవర్గ పరిధుల్లో ఉన్న కొండ ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రధానంగా గత ఏడాది మొంథా తుపాను నేపథ్యంలో ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే గొల్లపాలెంగట్టు, విద్యాధరపురం తదితర ప్రాంతాల్లో కొండ చరియలు జారిపడ్డాయి. రిటైనింగ్ వాల్స్ దెబ్బతిని కిందకుజారాయి. అలాగే తూర్పు నియోజకవర్గంలోనూ కొండపైన రిటైనింగ్ వాల్స్ జారాయి. గడిచిన ఆరు మాసాలుగా ప్రతి నెలలోనూ ఒకటి రెండు ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వినాయకచవితి పర్వదినానికి ముందు రోజు 45వ డివిజన్లో కొండబడి సమీపంలో కొండచరియలు జారిపడ్డాయి. అదే రోజు 49వ డివిజన్‌లోనూ కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ రెండు సంఘటనలలో ప్రాణనష్టం జరగకపోయినా వారు పూర్తిగా రోడ్డుపాలైన పరిస్థితి. ప్రాణాలు పోతున్నా పట్టని ప్రభుత్వం నగరంలోని కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి పలువురు ప్రాణాలు పోతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని స్థానిక నివాసితులు వాపోతున్నారు. ప్రధానంగా మూడు నియోజకవర్గాల్లోనూ ఉన్న కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ జారిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు స్థానిక ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంతో పాటుగా మొఘల్రాజుపురంలోని పలు ప్రమాదాల్లో అనేక మంది మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. ఆయా కుటుంబాల్లో వ్యక్తులను కోల్పోయి తీరని వ్యథను అనుభవిస్తున్నారు. అయినప్పటికీ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంపై స్థానికులు మండి పడుతున్నారు. కౌన్సిల్ ఆమోదం పొందినా.. నగరంలోని పలు కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి నగరపాలకసంస్థ కౌన్సిల్లో పలు అంశాలు ఆమోదం పొందినప్పటికీ అధికారులు వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు మాజీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా పనులు ప్రారంభించినా వాటిని మధ్యలో నిలిపివేశారని ఒకరిద్దరు మాజీ కార్పొరేటర్లు చెబుతున్నారు. ప్రభుత్వ విధానాలతో అధికారులు ఏ పనులూ చేపట్టడం లేదు. నగరంలో చాలా డివిజన్లలోని కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి ఆమోదం ఉన్నప్పటికీ పనులు ప్రారంభం కావటం లేదు. టెండర్లు పిల వటం లేదు. ఎప్పుడు వర్షం పడినా అప్పుడు బిక్కుబిక్కుమంటూ కొండ ప్రాంత ప్రజానీకం వణికిపోతున్నారు. – షేక్ హాయత్, రాష్ట్ర సహాయ కార్యదర్శి వైఎస్సార్ సీపీ -
30న పట్టాల పంపిణీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ నెల 30వ తేదీన పట్టాల పంపిణీ జరగనుందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. తొలిదశలో జిల్లా వ్యాప్తంగా 24,042 మందికి ఈ పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు. 1970, 1980, ఆ తదుపరి సంవత్సరాల్లో జారీచేసిన ఎన్టీఆర్ పట్టాలు, ఇతర పట్టాలకు సంబంధించి 12,710 మంది లబ్ధిదారులకు 306 జీఓ ద్వారా మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వ భూముల్లో నివసి స్తున్న 2,586 మంది లబ్ధిదారుల కేసులను జీఓ నంబర్ 30 ద్వారా పరిష్కరించి, క్రమబద్ధీకరించామన్నారు. 8,746 మంది ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ (పీఓటీ) ఉల్లంఘనదారుల సమస్య కూడా పరిష్కారమైందన్నారు. విజయవాడ పశ్చిమ, తూర్పు, సెంట్రల్, గన్నవరం, మైల వరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో 24,042 మంది లబ్ధిదారులకు చెందిన 616.56 ఎకరాల భూమికి సంబంధించి ప్రైవేటు ఆస్తికి సమానంగా అన్ని హక్కులతో పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో విజయవాడ ఆర్డీఓ వెన్నెల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఏఎన్ఎంలపై పనిభారం తగ్గించాలని ధర్నా
లబ్బీపేట(విజయవాడతూర్పు): మొబైల్ ఓటీపీ సేకరణ విధానం ద్వారా జరిగే అన్ని ఆరోగ్య సర్వేలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యలో డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత నాలుగు రోజులుగా జరుగుతున్న వరుస ఉద్యమాలలో భాగంగా ఈ రోజు మంగళవారం పాత గవర్నమెంట్ ఆస్పత్రి ఆవరణలోని డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాల్లో పెద్ద సంఖ్యలో ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలపై పని భారాన్ని తగ్గించాలని, ఓటీపీ రహిత సర్వేలను మాత్రమే ప్రభుత్వం తమకు అప్పగించాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానం నుంచి మినహాయింపును ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. ఆస్కారరావు మట్లాడుతూ అధికారులు తక్షణమే స్పందించి లెప్రసీ సర్వేలో పబ్లిక్ నుంచి ఇంటింటికీ, మనిషి మనిషికి ఓటీపీ సేకరించి సర్వే పూర్తి చేయాలన్న షరతును ఉపసంహరించాలని ప్రభుత్వా న్ని హెచ్చరించారు. యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు టీడీకే సాగర్, జిల్లా నాయకులు కొండపల్లి శ్రీనివాసరావు, ఎ. దుర్గాప్రసాద్, ఎంవీవీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
కిడ్నీ వ్యాధితో మహిళ మృతి
ఎ.కొండూరు: మండలంలో కిడ్నీ వ్యాధి మృత్యుఘోష కొనసాగుతోంది. తాజాగా ఎ.కొండూరు తండాకు చెందిన భూక్యా కోమటి(55) కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మంగళవారం మృతి చెందింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె కూలి పని చేసుకుంటూ జీవనం సాగించే వారు. గత ఐదేళ్లగా ఆమె కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఏడాదిగా క్రియాటిన్ పెరగటంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.2 లక్షలు ఖర్చు చేశారు. అయినా ఆమె ప్రాణాలు దక్కలేదని, క్రియాటిన్ అమాంతం పెరగడంతో మంగళవారం మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిల్లకల్లు(జగ్గయ్యపేట): ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన షేక్ సైదా(50) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. 25 ఏళ్ల క్రితం ఖమ్మంకు చెందిన ఖాదర్బీతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. ప్రస్తుతం ఇద్దరు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. ఆరు నెలల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో కొంతకాలంగా భార్య, పిల్లలు దూరంగా ఉండటంతో మనస్తాపం చెందిన ఆయన సోమవారం అర్ధరాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి సోదరుడు నాగుల్‌మీరా ఇంటికి వచ్చి పిలవగా తలుపులు తీయలేదు. అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉండటంటంతో భార్య, కుమారులకు సమాచారం అందించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
3 నుంచి బీబీఏ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్
విజయవాడ లీగల్: పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో బీబీఏ ఆధ్వర్యంలో వచ్చే నెల 3, 4 తేదీల్లో ఎన్ఆర్ఐ కప్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్–2026 నిర్వహించనున్నట్లు బీబీఏ అధ్యక్షుడు విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ చెప్పారు. బెజవాడ బార్ అసోసియేషన్ ప్రాంగణంలో షటిల్ టోర్నమెంట్లో పాల్గొనే న్యాయవాదుల పేర్ల నమోదు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మొత్తం మూడు కేటగిరీల్లో పోటీలు జరుగుతాయన్నారు. పోటీల్లో గెలిచిన వారికి రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు అత్యుత్తమ క్రీడా నైపుణ్య ప్రదర్శించిన న్యాయవాదులకు ప్రత్యేక బహుమతులు అందిస్తామని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే పోటీల్లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే న్యాయవాదులకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు. పోటీల్లో న్యాయవాదులందరూ పాల్గొనవచ్చన్నారు. న్యాయవాదులు తమ దైనందిన జీవితంలో వృత్తిపరమైన ఒత్తిడి నుంచి ఆటవిడుపు పొందుటకు క్రీడలు దోహదపడతాయని చెప్పారు. న్యాయవాదుల్లో ఉన్న సృజనాత్మకత క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవటానికి పోటీలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ చలసాని అజయ్‌కుమార్, జనరల్ సెక్రటరీ వలిబోయిన కిరణ్‌కుమార్, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు నిర్మల్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న నిందితుడి అరెస్ట్
ఉయ్యూరు: వినియోగదారుడిలా సెల్‌ఫోన్ దుకాణానికి వెళ్లి ఫోన్లు చోరీ చేస్తున్న నిందితుడిని ఉయ్యూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ టీవీవీ రామారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ...ఉయ్యూరు మండలం చిన ఓగిరాలకు చెందిన దండుగుల నాగదుర్గారావు సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నాడు. సెల్‌ఫోన్ దుకాణాలకు కొనుగోలుదారుడిలా వెళ్లి వివిధ మోడల్స్ ఫోన్లు పరిశీలిస్తున్నట్లు నటిస్తూ ఫోన్లు చోరీ చేస్తున్నాడు. పట్టణంలోని ఓ సెల్‌ఫోన్ దుకాణానికి పలుమార్లు కస్టమర్లా వెళ్లి సెల్ఫోన్లు చోరీకి పాల్పడటంతో ఘటనపై ఎస్ఐ ప్రతాప్‌రెడ్డి దర్యాప్తు చేపట్టి నిందితుడు నాగదుర్గారావును మంగళవారం అరెస్టు చేసి రూ.లక్ష విలువ చేసే ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో తోట్లవల్లూరు పోలీసుస్టేషన్ పరిధిలో ఓ దేవాలయంలో చోరీ ఘటన కేసు ఉంది. నిందితుడిని ఉయ్యూరు జూనియర్ సివిల్‌కోర్టులో హాజరుపర్చటంతో 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ రామారావు తెలిపారు. నాగదుర్గారావును గన్నవరం సబ్‌జైలుకు తరలించామన్నారు. -
చవితి వేడుకల్లో జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి
ఘంటసాల: ముస్లిం సోదరుడు షేక్ బాషా వినాయ చవితి వేడుకలు నిర్వహించడం ఆదర్శనీయమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఘంటసాల గ్రామంలో శ్రీజలధీశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల్లో ఆయన కుటుంబ సమేతంగా మంగళవారం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ముస్లిం అయ్యిండి రెండేళ్లుగా వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్న షేక్ బాషా(షామియానా) ఆదర్శంగా నిలిచాడని అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, దోనేపూడి బుజ్జి, మొవ్వ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. తొలుత ఘంటసాల గ్రామంలో వేం చేసి ఉన్న శ్రీ బాలపార్వతీ సమేత శ్రీజలధీశ్వర స్వామిని జస్టిస్ ఎ.వెంకటేశ్వర రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మ వారికి అర్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చావలి కృష్ణ కిషోర్ ఆశీర్వచనాలు అందించారు. భక్తులకు అన్నదానం.. బాషా, గ్రామస్తులు, కమిటీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన భారీ అన్నసమారాధనను మంగళవారం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు ప్రారంభించారు. అన్న సమారాధనలో 3 వేలకు పైగా భక్తులు పాల్గొన్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. -
గౌతమ్‌రెడ్డిపై లాఠీచార్జికి న్యాయవాదుల నిరసన
విజయవాడలీగల్: సీనియర్ న్యాయవాది, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా చేపట్టిన కార్యక్రమంలో సోమవారం పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీంతో గౌతమ్‌రెడ్డికి గాయాలై, స్పృహ తప్పి పడిపోవడంతో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి, వైద్యసేవలు అందిస్తున్నారు. ఆయనపై జరిగిన లాఠీ చార్జిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయ వాదులు విధులు బహిష్కరించారు. న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని, వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్టును అమలు చేయా లని నినాదాలు చేశారు. వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒగ్గు గవాస్కర్, బీబీఏ ఉపాధ్యక్షులు బండారుపల్లి లెనిన్‌బాబు, రాష్ట్ర జాయింటు సెక్రటరీ నారాయణరెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, జిల్లా లీగల్‌సెల్ అధ్యక్షులు సాయిరాం, న్యాయవాదులు యక్కంటి పుల్లారెడ్డి, నిర్మల్ రాజేష్, తంగిరాల సౌమ్య, ఆదాంకుమార్, వెంకట ప్రతాప్‌కుమార్, గంజి ఉదయ్‌కిరణ్, జిల్లా జనరల్ సెక్రటరీ చంటిబాబు పాల్గొన్నారు. పనులు వేగవంతం చేయాలి ఎ.కొండూరు: జాతీయ రహదారి–30 విస్తరణ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. మంగళవారం తిరువూరు శాసన సభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావుతో కలసి ఎ.కొండూరు మండలం రామచంద్రాపురంలో ఆయన రహదారి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విస్తరణలో ఇళ్ల స్థలాలు కోల్పోతున్న నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కిలోమీటరు మేర పనులు నిలిచిపోవడం వల్ల వాహనదారులు, స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నిలిచిపోయిన పనులను త్వరితగతిన పునఃప్రారంభించి పూర్తి చేయడానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీవో ఎ.కుమార్, తహసీల్దార్ ఉదయభాస్కరరావు పాల్గొన్నారు. నేడు లడ్డూ ఏటీఎం ప్రారంభం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ లడ్డూ ప్రసాదం ఇకపై ఏటీఎం మిషన్ ద్వారా భక్తులకు అందుబాటులోకి రానుంది. దేవస్థానంలో తొలి సారిగా లడ్డూ ఏటీఎం మిషన్‌ను కనకదుర్గనగర్‌లోని సెంట్రల్ సమాచార కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ లడ్డూ ఏటీఎం మిషన్‌ను దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ బుధవారం ప్రారంభించనున్నారు. ఈ ఏటీఎం మిషన్ భక్తులకు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. భక్తులు లడ్డూలను ఈ మిషన్‌లో వచ్చే క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసిన తర్వాత లడ్డూలను పొందొచ్చు. 26న విజయవాడలో జాబ్ మేళా గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 9.00 గంటలకు విజయవాడ కేబీఎన్ కాలేజ్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ జాబ్ మేళాలో సుమారు 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు యువతీ యువకులు అర్హులని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.12వేల నుంచి రూ.50వేల వరకు వేతనం, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 9700092606, 9700025833, 8712495530లో సంప్రదించాలని కలెక్టర్ కోరారు. -
16న విజయవాడలో అమరావతి ప్రాంతీయ సదస్సు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర– 2047 ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనున్న నేపథ్యంలో దీనికి ముందు విశాఖపట్నం, కాకినాడ, అమరావతి అనంతపురం, తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు జరగనున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. అక్టోబర్ 16వ తేదీన విజయవాడలో అమరావతి ప్రాంతీయ సదస్సు జరుగుతుందన్నారు. అమరావతి ప్రాంతీయ సదస్సు సన్నద్ధత సమావేశం వర్చువల్‌గా మంగళవారం జరిగింది. సమావేశానికి కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్ నుంచి హాజరయ్యారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అమరావతి ప్రాంతీయ సదస్సుకు ఆయా జిల్లాల నుంచి చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. జిల్లాల ప్రత్యేకతలు, విశిష్ట వనరులు, అవకాశాలకు అనుగుణంగా పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం, స్థానిక పరిశ్రమల ప్రోత్సాహం, విద్యా–పరిశ్రమల అనుసంధానంపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. విజయవాడలో అమరావతి ప్రాంతీయ సదస్సును పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వివరాలకు 91549 70454 (కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రం/ఇన్వెస్టర్స్ డెస్క్) నంబరులో సంప్రదించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, ఎనిమిది జిల్లాల పరిశ్రమలు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
గన్నవరం (హనుమాన్‌జంక్షన్‌రూరల్): స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సత్తా చాటాలని ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చెప్పారు. గన్నవరంలో మంగళవారం జరిగిన నియోజకవర్గ వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కడికి వెళ్లినా వైఎస్సార్ సీపీకి మెజార్టీ ఓటింగ్ స్పష్టంగా కనిిపిస్తోందన్నారు. ఆ ఓట్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుగా మలచుకునేందుకు కార్యకర్తలు వ్యూహాత్మకంగా కృషి చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021 నాటి ఫలితాలు పునరావృతం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామ, వార్డు స్థాయిలోకి కార్యకర్తలు వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చాటి చెప్పాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అమలు కానీ, ఆచరణయోగ్యం కానీ హామీలతో చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని, గడిచిన రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వ మోసాన్ని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.. ఎన్టీఆర్‌కు మనవడినని పదేపదే చెప్పుకునే నారా లోకేష్ నిజంగా ఆయన మనవడైతే డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ ఎంకై ్వరీ జరిపించాలని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సవాల్ విసిరారు. టీచర్ల ఉద్యోగాలు అమ్ముకున్నారని సాక్ష్యాధారాలతో సహా వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటపెడితే, ఇంకా నాతో చర్చకు రావాలంటూ నారా లోకేష్ ప్రకటించటం అర్థరహితమన్నారు. గడిచిన రెండున్నర ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో లోకేష్ ఎన్ని సార్లు విదేశాలకు వెళ్లాడు ? ఎక్కడెక్కడికి వెళ్లాడు ? ఎవరికి కలుస్తున్నాడు ? ఏ అకౌంట్ నుంచి విమాన టికెట్లు కొనుగోలు చేస్తున్నారో బహిర్గతం చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. గొడ్డలి పార్టీ అంటూ పదేపదే వ్యంగ్యంగా మాట్లాడుతున్న నారా లోకేష్ ఆసలు ఆ గొడ్డలి ఇప్పుడు ఎక్కడ తిరుగుతోందో, ఎవరితో సావాసం చేస్తుందో గుర్తించాలని, ఆ గొడ్డలి వేటుకు కూడా పోయేది కూడా మీరేనని పేర్ని నాని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎరువుల ధరలు గడిచినా రెండేళ్లలో రెట్టింపు అయ్యాయని, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో ఒక వైపు ఏలూరు కాలువ, మరో వైపు పొలవరం కాలువ ప్రవహిస్తున్నా ప్రజలకు సాగు, తాగునీరు ఇవ్వటం లేదని, కానీ గ్రామగ్రామాన బెల్ట్‌షాపులు పెట్టి మద్యం మాత్రం ఎరులై పారిస్తున్నారని వైఎస్సార్ సీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథం, గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు షేక్ సిలార్ దాదా, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
తోటపల్లి కాలువలో వ్యక్తి గల్లంతు
సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని ఏగోటివలసలో గల తోటపల్లి కాలువలో పడి కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రాంతానికి చెందిన మధుకోటి హేమంత్ కృష్ణ మంగళవారం గల్లంతయ్యాడు. దీనిపై స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. ఏగోటివలస గ్రామానికి చెందిన ఎస్.పోలినాయుడు, గల్లంతైన హేమంత్ కృష్ణ స్నేహితులు. వారిద్దరూ ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ విభాగంలో పని చేస్తున్నారు. మంగళవారం పోలినాయుడు ఇంట్లో కుమార్తె బాలసారె కార్యక్రమానికి హేమంత్ కృష్ణను ఆహ్వానించాడు. సోమవారం రాత్రి ఏగోటివలస గ్రామానికి చేరుకున్న హేమంత్ కృష్ణ మంగళవారం ఉదయం బహిర్భూమితో పాటు స్నానం కోసం గ్రామాన్ని ఆనుకుని ఉన్న తోటపల్లి కాలువ దగ్గరకు వచ్చాడు. అక్కడ కాలకృత్యాలు తీర్చుకుంటుండగా హేమంత్ కృష్ణ(39) ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి గల్లంతయ్యాడు. వెంటనే గ్రామస్తులు కాలువలో దిగి గల్లంతైన వ్యక్తిని వెతకడం ప్రారంభించారు. అప్పటికే ఎడతెరిపి లేని వర్షం పడుతుండడంతో వెతకడం కష్టంగా మారింది. అనంతరం పోలీసులు, ఫైర్ సిబ్బంది కాలువలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలానికి తహసీల్దార్ ఎం.ప్రసన్నకుమార్, ఎంపీడీఓ ఎంఎల్ఎన్ ప్రసాద్, ఎస్సై ఎం.హేమలత చేరుకుని వివరాలు అడిగి తెలుసుకుని గల్లంతైన వ్యక్తిని గుర్తించడానికి చర్యలు చేపట్టారు. గాలింపు కొనసాగుతోంది. కార్యక్రమంలో డెప్యూటీ ఎంపీడీఓ కె.కుమారవర్మ, ఆర్ఐ ఎన్.శ్రీనివాసరావు వీఆర్వో ఆనందరావు పాల్గొన్నారు. -
జలవిల
ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు డ్రెయిన్లు శుభ్రం చేయకపోవడం వల్లే..విజయవాడ బస్టాండ్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద ఏరులై పారుతున్న వర్షం నీరు(ఫైల్)సాక్షి, విజయవాడ: రాజధాని ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న విజయవాడ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం శీతకన్ను వేసింది. ప్రతి అంశంపై సమీక్షిస్తున్నా అని ప్రచారం చేసుకునే సీఎం.. చిన్నపాటి వర్షానికి చెరువులను తలపించేలా మారుతున్న విజయవాడ రోడ్ల దుస్థితిపై కనీస పర్యవేక్షించడం లేదు. విజయవాడలో మోస్తరు వర్షం కురిసిన నిమిషాల వ్యవధిలోనే డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు నదులు, చెరువులను తలపిస్తున్నాయి. పాలీక్లినిక్ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డు వరకు.. బందర్ రోడ్డు నుంచి పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ పరిసరాల వరకు ఎక్కడ చూసినా నీటిముంపు తప్పట్లేదు. ఈ ప్రాంతాల్లో.. ముఖ్యంగా నగరంలోని బస్టాండ్ వద్ద, ఎంజీరోడ్డు, బందరురోడ్డు, బీమా జ్యూవెలరీ రోడ్డు, వరమహాలక్ష్మి రోడ్డు, విశాలాంధ్రరోడ్డు, జమ్మిచెట్టురోడ్డు, బెంజిసర్కిల్, నిర్మలాకాన్వెంట్, సత్యనారాయణపురం, గాంధీనగర్‌లో రోడ్లలో వర్షపునీరు నిలుస్తోంది. ఎంజీరోడ్డులో కొద్దిపాటి వర్షానికే ట్రాఫిక్ జామ్ అవుతోంది. అలాగే పలు అపార్ట్మెంట్ సెల్లార్లలోకి వర్షపునీరు చేరుతోంది. సాయంత్రం స్కూళ్లు వదిలే సమయాల్లో పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటోంది. సత్యనారాయణపురంలోని నర్రవారి వీధిలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ ముందు కొద్దిపాటి వర్షానికే నీరు నిలుస్తుండటంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లడానికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. వరమహాలక్ష్మి రోడ్డులో ఇటీవల కురిసిన వర్షాలకు ద్విచక్రవాహనాల్లోకి వర్షపు నీరు చేరి పాడయ్యాయి. ఇటీవల భారీ వర్షాల సమయంలో రైల్వేస్టేషన్ సమీపంలోని సబ్వేలో ఆర్టీసీ బస్సు నీటిలో చిక్కుకుపోవడం, ప్రయాణికులను, క్రేన్‌తో బస్సును బయటకు తరలించాల్సి వచ్చింది. డ్యాష్‌బోర్డులో వరద కనిపించదా? రాష్ట్రంలోని మారుమూల పల్లెల్లో పగటివేళ బల్బులు వెలిగినా డ్యాష్‌బోర్డులో తనకు కనిపిస్తుందని, ఏ మూలన ఏమి జరిగినా తనకు ఇట్టే తెలిసిపోతుందని చెప్పుకునే సీఎం చంద్రబాబుకు విజయవాడలో వర్షం పడితే రోడ్లు మునిగిపోతున్న దృశ్యాలు డ్యాష్‌బోర్డులో కనిపించవా? అని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు.రాజధాని అమరావతి మీదే ప్రభుత్వం దృష్టి పెడుతోంది తప్పా రాజధానికి అత్యంత కీలకమైన విజయవాడలో సమస్యలను పరిష్కరించలేకపోతుందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. విజయవాడ సిటీ పరిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరూ నగరంలో దీన పరిస్థితులపై నోరెత్తిన పాపాన పోవడం లేదు. అలాగే విజయవాడకు నిత్యం మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల తాకిడి ఉంటుంది. అయితే చిన్న వర్షం వస్తే మునిగే రోడ్లు, పొంగే డ్రెయిన్లు, నిలిచిపోయే ట్రాఫిక్ మాత్రం వారికి పట్టడం లేదు. తాత్కాలిక చర్యలతో సరిపెట్టి మమ అనిపించడం కాకుండా, శాశ్వత డ్రెయినేజీ పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. వర్షపునీరు రోడ్లపై చేరడం.. అధికారులు రంగంలోకి దిగడం.. యంత్రాలతో నీటిని తోడేయడం.. వర్షం తగ్గగానే సమస్య ముగిసినట్లు భావించడం వల్ల సమస్య పునరావృతమవుతోంది. ఇటీవల కూడా అధికారులు పాలీక్లినిక్, బందర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో నీటిని తొలగించేందుకు ఎయిర్‌టెక్ యంత్రాలను వినియోగించారు. కానీ వర్షపు నీరు నిలవకుండా డ్రెయినేజీ వ్యవస్థను శాశ్వతంగా పటిష్టం చేయడంపై దృష్టి సారించడం లేదు. భారీ వర్షాల సమయంలో డ్రెయిన్లు, కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు సమస్యను మరింత తీవ్రం చేస్తోందనే విషయం అధికారుల పరిశీలనలో వెల్లడైంది. కార్పొరేషన్ అధికారులు సైతం పదే పదే ఈ సమస్య తలెత్తతున్నా నిర్లక్ష్యం వీడడం లేదు. రెండేళ్ల కిందటి వరదల సమయంలో నగరవాసులు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పటికీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. -
వేదాద్రి లడ్డూ నాణ్యతపై ఆగ్రహం
ముక్త్యాల(జగ్గయ్యపేట): రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన వేదాద్రి గ్రామంలోని యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి లడ్డూ ప్రసాదం నాణ్యత అధ్వానంగా ఉందని దేవదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని భవానీ ముక్తేశ్వర స్వామి వారి ఆలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం జగ్గయ్యపేటకు చెందిన భక్తుడు వేదాద్రిలోని యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ లడ్డూ ప్రసాదం అధ్వానంగా ఉందని కమిషనర్ దృష్టికి తీసుకురావటమే కాకుండా లడ్డూ ప్రసాదాన్ని చూపించాడు. రుచి చూసి ఈవో సురేష్‌బాబును లడ్డూ నాణ్యంగా లేదన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2028లో జరిగే కృష్ణా పుష్కరాలకు ఇప్పటి నుంచే కృష్ణానది పుష్కర ఘాట్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముక్త్యాల కోటను సందర్శించారు. జిల్లా ఏసీ లక్ష్మీనారాయణ శెట్టి, పెనుగంచిప్రోలు, తిరుమలగిరి ఆలయాల ఈవోలు లీలాకుమార్, సాంబశివరావు, కేసీపీ సంస్థ ప్రతినిధి రాంప్రసాద్ పాల్గొన్నారు. -
నిబద్ధతే నిలబెట్టింది
అవకాశం ఇచ్చిన జగనన్నకు రుణపడి ఉంటా చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటానని జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం జెడ్పీ సమావేశ హాలులో నిర్వహించారు. ఈ నెల 24వ తేదీతో జిల్లా పరిషత్ చైర్పర్సన్, పాలకవర్గ కాలపరిమితి ముగియనుండటంతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ 1960లో ఏర్పడిన జిల్లా పరిషత్‌కు మొదటి చైర్మన్‌గా యార్లగడ్డ శివరామప్రసాద్ పనిచేశారని అనంతరం మాగంటి అంకినీడు, పిన్నమనేని కోటేశ్వరరావు లాంటి ఎంతో మంది ఉద్దండులు ఈ పదవిని అలంకరించారన్నారు. తనతో పాటు పది మంది జిల్లా పరిషత్ చైర్మన్లు పనిచేశారని.. వారి ఆశయాలు స్ఫూర్తిగా తీసుకుని, దీటుగా జిల్లా పరిషత్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగామన్నారు. జిల్లా పరిషత్ 25 మండలాలతో పునర్విభజన జరిగిన నేపథ్యంలో ముందుగానే గ్రహించి రూ. 98లక్షలతో సమావేశ హాలును సుందరీకరించి ఆగస్టులో ప్రారంభించామన్నారు. అలాగే 16 మండలాలతో ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాలో రూ. 65లక్షలతో సమావేశ మందిరం, చైర్మన్, సీఈవోల చాంబర్లతో ఆధునికీకరించి రానున్న పాలకవర్గ సభ్యులకు భవనాలను అందించగలిగామన్నారు. రూ. 360 కోట్లతో అభివృద్ధి పనులు.. తన పదవీ కాలంలో సీపీడబ్ల్యూఎస్ స్కీం, 15వ ఆర్థిక సంఘం, జిల్లా పరిషత్ సాధారణ నిధులతో సుమారు రూ. 360కోట్లతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని హారిక చెప్పారు. మహిళా సాధికారత కోసం మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లలో శిక్షణ ఇప్పించి వారికి మిషన్లు పంపిణీ చేశామన్నారు. అలాగే ఏటాలానే పదో తరగతి ఫలితాల్లో కృష్ణాజిల్లా ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా స్ఫూర్తి స్టడీ మెటీరియల్‌ను అందజేయటంతో పాటు పరీక్ష సమయంలో వారికి స్టడీ అవర్స్ నిర్వహించినప్పుడు స్నాక్స్ అందించామన్నారు. ఉద్యోగోన్నతులు, నియామకాలు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు 120 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు సుమారు 200 మందికి వివిధ కేటగిరీల్లో ఉద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగోన్నతులు కల్పించామని జెడ్పీ చైర్ పర్సన్ వివరించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జిల్లా పరిషత్ నిధులను సమర్థంగా వినియోగించినందుకు న్యూఢిల్లీలో ఐసీఏఐ ప్రతినిధులు బెస్ట్ జిల్లా పరిషత్గా కృష్ణా జిల్లాను ఎంపిక చేయటంతో ఆ అవార్డును తాను స్వీకరించటం గర్వంగా భావిస్తున్నానన్నారు. జెడ్పీ ఆదాయాల పెంపునకు కృషి.. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న ఆస్తుల ద్వారా ఆదాయ వనరులు పెంపొందించేందుకు ప్రత్యేక కృషి చేశామన్నారు. మచిలీ పట్నం, అవనిగడ్డ జెడ్పీ స్థలాల్లో రూ. 3కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి ప్రారంభించామని హారిక చెప్పారు. అలాగే జెడ్పీ కన్వెన్షన్ హాలు ద్వారా సంవత్సరానికి రూ.1.20కోట్లు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. అలాగే ఆదాయాన్ని పెంచేందుకు జెడ్పీ స్థలాల్లో పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నుంచి అనుమతి పొందామన్నారు. ఈ ఐదేళ్లలో తనకు అభివృద్ధికి సహకరించిన అధికార యంత్రాంగం, జిల్లా పరిషత్ సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
జెడ్పీకి వన్నె తెచ్చిన పాలకవర్గం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్‌కు ప్రస్తుత పాలకవర్గం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వన్నె తెచ్చారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో మంగళవారం జెడ్పీటీసీ, ఎంపీపీలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఐదేళ్లుగా సభ్యులు చేసిన పనులు వారి అనుభవాలు, సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఉప్పాల హారిక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకడుగు వేయకుండా ప్రజాసమస్యలు, రైతుల సమస్యలను సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చి గళం విప్పారన్నారు. ఏకై క మంత్రికి బాధ్యత లేదు.. ఉమ్మడి కృష్ణాజిల్లాకు ఏకై క మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర రెండు సంవత్సరాల్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఒక్కసారి మాత్రమే వచ్చారని, వారు రాకపోతే సమస్యలు ఎలా చెప్పుకుంటామని ఓ సభ్యుడు చెప్పిన మాట వాస్తవమేనని పేర్ని నాని అన్నారు. వైఎస్ జగన్ అసెంబ్లీకి రారని మాట్లాడే కూటమి నాయకులు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎందుకు హాజరుకావటం లేదని అనటం వాస్తవం అనిపించిందన్నారు. మంత్రిగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే సమావేశాలకు హాజరుకాలేదని పేర్ని నాని దుయ్యబట్టారు. చైర్పర్సన్, పాలకవర్గానికి రెండు సంవత్సరాలుగా ఎన్నో అడ్డంకులు సృష్టించారన్నారు. ఒక్క రూపాయి రాకున్నా.. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాకుండా జెడ్పీ నిధులను వారే తెచ్చినట్లుగా అధికారులను బెదిరించి పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేశారని పేర్ని అన్నారు. అయినప్పటికీ సభ్యులు భయపడకుండా వారికి కేటాయించిన నిధులను పనులు పూర్తి చేయటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్, పెడన నియోజకవర్గ ఇన్చార్జ్ ఉప్పాల రాము, జెడ్పీ వైస్ చైర్మన్లు గరికపాటి శ్రీదేవి, గుదిమళ్ల కృష్ణంరాజు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పరిషత్ పాలకవర్గ సభ్యుల పదవీకాలం గురువారంతో ముగియనుండటంతో చైర్ పర్సన్ దంపతులతో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీలను పేర్ని నాని ఘనంగా సత్కరించారు. -
చట్టబద్ధంగా ఇద్దరు బాలికల దత్తత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ప్రత్యేక దత్తత సంస్థ శిశు గృహం సంరక్షణలో ఉన్న ఇద్దరు బాలికలకు సోమవారం కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆధ్వర్యంలో చట్టబద్ధమైన దత్తత ప్రక్రియను చేపట్టారు. ఇందులో భాగంగా బాలికల గుర్తింపు వివరాలు, దత్తత తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, సంబంధిత ధ్రువపత్రాలు, పత్రికా ప్రకటన, ఇతర అవసరమైన రికార్డులను పరిశీలించారు. దత్తత ప్రక్రియలో అన్ని చట్టపరమైన నిబంధనలు, నిర్దేశిత విధానాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. బాలికల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, నిర్వహించిన వైద్య పరీక్షలు, ఆరోగ్య రికార్డులపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాలికల ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను దత్తత తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. బాలికలను ప్రేమతో, బాధ్యతతో పెంచాలి దత్తత పొందిన తల్లిదండ్రులతో మాట్లాడిన కలెక్టర్ బాలికలను ప్రేమతో, బాధ్యతతో పెంచాలని వారికి సూచించారు. వారి ఆరోగ్యం, పోషణ, విద్య, భద్రత, సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాలికలకు సురక్షితమైన, ప్రేమపూర్వకమైన కుటుంబ వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. దత్తత అనంతరం బాలికలకు కన్నబిడ్డతో సమానంగా హక్కులు, బాధ్యతలు, కుటుంబ సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తానా బేగం, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎం.రాజేశ్వరరావు, లీగల్ ఆఫీసర్ కిరణ్ కుమార్, శిశు గృహ మేనేజర్ దీపిక, సోషల్ వర్కర్ అరుణ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 10 నుంచి ప్రారంభమయ్యే దసరా మహోత్సవాలను గతంలో కంటే ఘనంగా, అన్ని శాఖల సమన్వయంతో భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు తెలిపారు. ఏఐ సాంకేతికతను అనుసంధానం చేసి భక్తుల భద్రతకు మరింత భరోసా కల్పించడంతో పాటు, ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి దర్శనం త్వరగా, సౌకర్యవంతంగా లభించేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో కె.కన్నబాబు, కలెక్టర్ జి.లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్, దుర్గగుడి ఈవో వీకే శీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ చేస్తున్న ఏర్పాట్లపై చర్చించారు. ఏఐ ఆధారిత ప్రత్యేక మొబైల్ అప్లికేషన్, అందుబాటులో ఉన్న సేవలను పరిశీలించారు. క్యూలో భక్తులకు అమ్మవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఎప్పటికప్పుడు తెలియజేసేలా ప్రతి 200 మీటర్లకు చేస్తున్న ఏర్పాట్లతో పాటు డిజిటల్ స్క్రీన్లు, ఏఐ కెమెరాలు, డ్రోన్ల సేవలు తదితరాలపై చర్చించారు. 22 పార్కింగ్ ప్రాంతాలతో మూడు హోల్డింగ్ ఏరియాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా చేస్తున్న ఏర్పాట్లతో పాటు స్మార్ట్ లడ్డూ వెండింగ్ మెషీన్ల ఏర్పాటుపైనా చర్చించారు. వసతులపై ప్రత్యేక దృష్టి ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలు, దర్శన మార్గాలు, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, రవాణా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఉచిత దర్శనాల విషయంలో భక్తులకు ఇబ్బంది కలగ కుండా ఏర్పాట్లు చేయడంతో పాటు, భక్తులకు ప్రసాదాల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. భక్తుల భద్రత, సౌకర్యాల విషయంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. దుర్గాఘాట్ సమీపంలో 24 గంటలు పనిచేసే కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి.. క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారాన్ని సమన్వయం చేస్తూ, తక్షణమే స్పందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాలు, జనరల్ పబ్లిక్కు ప్రత్యేక దర్శనాలకు చేస్తున్న ఏర్పాట్లు, వివిధ రకాల పాస్‌ల జారీ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు బ్యాటరీ వాహనాల ఏర్పాటు, అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం పంపిణీ తదితరాలకు చేస్తున్న ఏర్పాట్లను ఆలయ అధికారులు వివరించారు. ఇతర ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. మొత్తంమీద 20 లక్షల వరకు భక్తులు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో వైదిక కమిటీ సభ్యులు ఎల్.దుర్గా ప్రసాద్, కె.రవికుమార్, ఆలయ ఈఈలు ఎల్.రమాదేవి, బి.రాంబాబు, డీవీ భాస్కర్, ఏఈవో ఎన్.రమేష్ బాబు, డా. కె.గంగాధర్, పి.చంద్రశేఖర్, వీఎంసీ చీఫ్‌ఇంజినీర్ పి.సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఎండుతున్న పొలాలు... మండిపడ్డ రైతులు
● ఆగ్రహం వ్యక్తం చేసిన రామనపూడి గ్రామ రైతులు గుడివాడరూరల్: చంద్రబాబునాయుడు ప్రభుత్వం తమను చులకనగా చూస్తోందని, తమ గురించి పట్టించుకోవటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని రామనపూడి గ్రామంలో సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని సోమవారం సాయంత్రం గ్రామంలోని పంట పొలాల వద్ద రైతులు ఆందోళన చేశారు. ఎండి పోతున్న పంట పొలాలను చూపించి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేలకు పైగా ఖర్చు పెట్టి వరిసాగు చేశామని వాపోయారు. గ్రామానికి చెందిన రైతులు మసిముక్కు సత్యనారాయణ యాదవ్, గొరిపర్తి నానీబాలాజీ మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం ప్రకటించాలని, లేనిపక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ నియంత్రణకు సమగ్ర చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ విక్రయాలను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడుతో కలిసి ఈగల్, పోలీస్, విద్య, వైద్య తదితర శాఖల అధికారులతో నార్కోటిక్ కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించి డ్రగ్స్ నియంత్రణ చర్యలపై సమీక్ష చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు సాధారణ తనిఖీలతో పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు, తరగతులకు గైర్హాజరు, అనుమానాస్పద స్నేహ సంబంధాలు వంటి అంశాలను గమనించాలన్నారు. విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన ప్రాథమిక లక్షణాలను గుర్తించిన వెంటనే వారిపై క్రిమినల్ చర్యలకు బదులుగా అవసరమైన సందర్భాల్లో కౌన్సెలింగ్, డీ–అడిక్షన్ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. మాదకద్రవ్యాలతో కలిగే దుష్పరిణామాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ప్రభావవంతమైన లఘు వీడియోలను రూపొందించి పాఠశాలలు, కళాశాలల్లో ప్రదర్శించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డెప్యూటీ డైరెక్టర్ బడేటి సత్య ప్రకాష్, అదనపు ఎస్పీ వి.వి.నాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ సత్యకిషోర్, వ్యవసాయ శాఖ జేడీ జ్యోతి రమణి, విద్య, వైద్య, పోలీస్, ఈగల్ బృందాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
మిల్లీ కౌన్సిల్ ఏపీ నూతన కమిటీ ఎన్నిక
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతిష్టాత్మక సంస్థ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఈ నెల 19, 20 తేదీల్లో కర్నూలులో జరిగిన సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కర్నూలుకు చెందిన మౌలాలా అబ్దుల్ ఖదీర్ షుయబి, ప్రధాన కార్యదర్శిగా విజయవాడకు చెందిన మునీర్ అహ్మద్ షేక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం మునీర్ అహ్మద్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కర్నూలులో జరిగిన సమావేశంలో మిల్లీ కౌన్సిల్ జాతీయ సహాయ కార్యదర్శులు షేక్ నిజాముద్దీన్, మొహమ్మద్ ఆలం ఎన్నికల అధికారులుగా వ్యవహరించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పలువురు సభ్యులు హాజరు కాగా, 2026–29 సంవత్సరాలకు గాను నూతన కమిటీని నియమించినట్లు తెలిపారు. దేశంలో హిందూ, ముస్లింల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించటం, విద్యా రంగాన్ని బలోపేతం చేయటం, నూరు శాతం అక్షరాస్యత సాధించటమే తమ ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నామని మునీర్‌అహ్మద్ షేక్ తెలిపారు. యువతలో రాజకీయ చైతన్యం పెంపొందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్ట ర్ జె.అరుణ సోమవారం తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని, ఉమ్మడి కృష్ణాజిల్లా కు సంబంధించిన అధికారులు, జిల్లా పరిషత్ సభ్యులు తప్పక హాజరుకావాలని ఆమె కోరారు. అబ్దుల్ ఖదీర్ షుయబి మునీర్ అహ్మద్ షేక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టండి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వస్తున్న సమస్యలు, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశం హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ నవీన్, డీఆర్వో శ్రీధర్‌రెడ్డి, కేఆర్ఆర్సీ ఎస్డీసీ నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించడానికి సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపించడమే లక్ష్యంగా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అధికారులు 192 అర్జీలను స్వీకరించారు. అర్జీల్లో కొన్ని -
ప్రతి సమస్యకు పరిష్కారం
కోనేరుసెంటర్: మీకోసంలో ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి 56 అర్జీలు స్వీకరించారు. అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమైన అర్జీలు ● వాడగొయ్యి గ్రామానికి చెందిన పద్మ అనే వివాహిత భర్తతో పాటు అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకుంది. ● తోట్లవల్లూరుకు చెందిన బ్రహ్మాజీ తన వ్యవసాయ భూమిని బంధువులు ఆక్రమించుకుని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, పైగా తనపై భౌతిక దాడికి పాల్పడుతున్నారని వాపోయాడు. వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు. ● కూచిపూడికి చెందిన మురళి అనే నిరుద్యోగి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన స్నేహితుడు తన వద్ద నగదు తీసుకున్నాడని, ఏడాది గడిచినా ఉద్యోగం ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని వాపోయాడు. తన డబ్బు తిరిగిమ్మని అడిగినందుకు బెదిరిస్తున్నాడని, విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరాడు. -
25న పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న జిల్లాలోని 18 ఏళ్లలోపు చిన్నారులందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.శ్రావణ్‌బాబు తెలిపారు. కార్యక్రమ పోస్టర్‌ను సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎ.శ్రావణ్‌బాబు మాట్లాడుతూ జిల్లాలోని 3,125 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 5,05,473 మంది చిన్నారులకు నులిపురుగుల మాత్రలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 25న మాత్రలు ఇవ్వని చిన్నారులకు అక్టోబరు 5న మ్యాప్ అండ్ డే నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ మాధవి, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందమతీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కార్యాలయమా.. పార్టీ ఆఫీసా?
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) కార్యాలయం సోమవారం టీడీపీ కార్యాలయంగా మారింది. డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలను శాప్ అధికారులకు వివరించి వారి నుంచి సమాధానం రాబట్టేందుకు వైఎస్సార్ సీపీ చేపట్టిన శాంతియుత ర్యాలీ, అనంతరం శాప్ అధికారులకు వినతిపత్రం అందజేసే కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి శాప్ చైర్మన్ రవినాయుడు ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చివేశారు. శాప్ కార్యాలయం ఆవరణలోనే షామియానాలు, కుర్చీలు వేసి యువగళం సభ్యులను, అదేవిధంగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయులను మోహరించారు. శాప్ చైర్మన్ అనుసరించిన తీరుతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. కుట్ర జరిగిన తీరుతెన్నులిలా... విద్యాశాఖా మంత్రి లోకేష్ మెప్పు పొందేందుకు శాప్ చైర్మన్ రవినాయుడు డీఎస్సీ–2025లో ఉద్యోగాలు పొందిన వారితో నగరంలో ఆదివారం ప్రత్యేకంగా రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం వారికి భోజనాలు, రాత్రికి బస ఏర్పాటు చేసి నగరంలోనే ఉంచారు. సోమవారం ఉదయం వారందరినీ బస్సులు, కారుల్లో వారు బస చేసిన హోటల్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలోని శాప్ కార్యాలయానికి తీసుకువచ్చారు. కార్యాలయ ఆవరణలోనే షామియానాలు, కుర్చీ లు, డీజే స్థాయిలో మైక్‌సెట్ ఏర్పాటు చేశారు. నగరంలో సెక్షన్ 30 అమలులో ఉందని అందు వల్ల వైఎస్సార్ సీపీ నాయకులు చేపట్టిన శాంతియుత ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని ప్రకటించిన పోలీస్ శాఖకు శాప్ కార్యాలయం ఆవరణలో జరుగుతున్న ఈ వ్యవహారం పాపం... వారి కంటికి కనిపించలేదో... లేదా టీడీపీ వారికి పోలీస్ శాఖ విధించిన సెక్షన్ 30 నుంచి మినహాయింపు ఉందా అనే సందేహం కలుగుతోంది. ‘శాప్’ పరువును క్లీన్‌బౌల్డ్ చేసిన చైర్మన్ రవినాయుడు తీరు క్రీడాకారులకు, క్రీడా సంఘాలకు అందుబాటులో ఉండాల్సిన శాప్ కార్యాలయాన్ని టీడీపీ కార్యాలయంగా మార్చి శాప్ పరువును చైర్మన్ రవి నాయుడు రోడ్డున పడేశాడనే (క్లీన్ బౌల్డ్) అభిప్రాయం ఇప్పటికే క్రీడాకారుల్లో వినిపిస్తోంది. శాప్ కార్యాలయం ఆవరణలో సోమవారం జరిగిన పరిణామాలు ఈ అభిప్రాయానికి మరింత బలాన్ని చేకూర్చాయి. శాప్ కార్యాలయం ఆవరణలో డీఎస్సీ అభ్యర్థులతో ఆందోళన చేయించడమే కాకుండా వైఎస్సార్ సీపీ శాంతియుతంగా చేపట్టిన కార్యక్రమంపైకి టీడీపీ యువగళం సభ్యులను పంపి దాడి చేయించడం ఇందుకు నిదర్శనం. టీడీపీ యువత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్లగూర సాయి చరణ్, తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సొంగా సంజయ్, శాప్ డైరెక్టర్ సంతోష్‌తో పాటుగా యువగళం ప్రతినిధులు శాప్ కార్యాలయం ఆవరణలోనే ఉండి డీఎస్సీ–2025 టీచర్లకు డైరెక్షన్ ఇవ్వడం గమనార్హం. వెనక్కు తగ్గని వైఎస్సార్ సీపీ శ్రేణులు డీఎస్సీ–2025 ఉపాధ్యాయుల ముసుగులో టీడీపీ గూండాలు బందరు రోడ్డుపై శాంతి యుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులపై కర్రలతో దాడులు, వాటర్ బాటిల్స్ విసురుతూ, జగన్‌ను విమర్శిస్తూ నినాదాలు ఇస్తున్నా వైఎస్సార్ సీపీ శ్రేణులు మాత్రం శాంతియుతంగానే సమాధానం చెప్పారు. ఉదయం 10 గంటలకు మొదలైన నిరసన కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ఒక్క వైఎస్సార్ సీపీ నాయకుడు, కార్యకర్త టీడీపీ గూండాల దాడులకు వెనక్కు తగ్గకుండా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు అక్కడే ఉన్నారు. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆ నాలుగు ఎల్లో చానల్స్‌కే అనుమతి శాప్ కార్యాలయం ఆవరణలో డీఎస్సీ ఉపాధ్యాయులతో మాట్లాడేందుకు ఎవరినీ వారి దగ్గరకు అనుమతించలేదు. కేవలం ఎల్లో చానల్స్‌గా పేరు పొందిన ఆ నాలుగు చానల్స్ ప్రతినిధులను మాత్రమే పోలీసులు లోపలకు అనుమతించారు. మిగిలిన చానల్స్ ప్రతినిధులు రోడ్డుపైనే నిలబడాల్సిన పరిస్థితి. డీఎస్సీ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా బ్యాడ్జీలను తయారు చేయించారు. ఆ బ్యాడ్జీలు ఉన్న వారిని మాత్రమే లోపలకు అనుమతించారు. శాప్ కార్యాలయం గేటు లోపల డీఎస్సీ ఉపాధ్యాయులు, గేటు బయట వైఎస్సార్ సీపీ శ్రేణులు ర్యాలీగా వస్తున్న వైఎస్సార్ సీపీ వికలాంగ విభాగం నాయకులు -
అరాచకం
మంగళవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ఖాకీల అండతోనిరసన.. విజయవాడలో శాప్ కార్యాలయం వద్ద బస్ పైకి ఎక్కి నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ నేతలు దేవినేని అవినాష్, జక్కంపూడి రాజా తదితరులుసాక్షి ప్రతినిధి, విజయవాడ/ వన్‌టౌన్: రౌడీయిజాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే రౌడీలకు కాపలా కాస్తే.. అది కచ్చితంగా విజయవాడ అవుతుంది. సోమవారం శాప్ కార్యాలయం వద్ద యువగళం ప్రతినిధుల పేరుతో గంజాయి, రౌడీ బ్యాచ్‌లు అరాచకం చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారు. ఏకంగా పోలీసుల వద్ద లాఠీలు తీసుకుని వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తెగబడితే వారు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడంతో విజయవాడ పోలీసులు ప్రభుత్వం చేతిలో ఎలా కీలుబొమ్మలుగా మారారో అర్ధమవుతుంది. శాంతియుత నిరసనకు పిలుపు కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అడుగడుగున జరిగిన అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా వైఎస్సార్ సీపీ ఇటీవల బయటపెట్టింది. క్రీడా కోటాలో కేటాయించిన ఉద్యోగాలు పూర్తిగా అవినీతిమయంగా మారిన వైనాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి సాక్ష్యాలతో మీడియాకు వివరించిన విషయం తెలిసిందే. క్రీడా కోటాలో జరిగిన నియామకాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ సోమవారం రెడ్‌సర్కిల్ నుంచి విజయవాడ ఎంజీ రోడ్డులోని ఏపీ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) కార్యాలయం వద్ద శాంతియుత నిరసనకు వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా యువత, విద్యార్థులు, క్రీడాకారులు విజయవాడలోని శాప్ కార్యాలయానికి పోటెత్తారు. నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించింది. నిరసనకు అనుమతి లేదంటూ బెదిరింపులకు పాల్పడింది. వివిధ ప్రాంతాల్లో పార్టీ నేతలను అనేక మందిని పోలీసు స్టేషన్లకు తరలించారు. రౌడీలకు రక్షణగా పోలీసులు ఎక్కడైనా పోలీసులను చూస్తే రౌడీలు, గంజాయిబ్యాచ్లు వంద అడుగులు దూరంలోనే పరుగులు తీస్తుంటారు. కానీ ఇందిరాగాంధీ స్టేడియం వద్ద వైఎస్సార్ సీపీపై దాడి చేయటానికి టీడీపీ ప్రత్యేకంగా కొంతమంది రౌడీలను, గంజాయి బ్యాచ్‌ను, యువగళం నేతలపేరిట కొందరిని తీసుకొచ్చి దాడులు చేయిస్తున్న క్రమంలో పోలీసులు వారికి రక్షణగా నిలబడ్డారు. టీడీపీ కార్యకర్తలకు ఎలా అనుమతిచ్చారో.. ప్రదర్శనలకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు అక్కడ టీడీపీ కార్యకర్తలను ఎలా అనుమతించారో చెప్పాల్సి ఉంటుంది. డీఎస్సీ టీచర్లు కూర్చోవడానికి టెంట్లు, డీజేలకు అనుమతివ్వడం ప్రశ్నార్థకంగా మారింది. బస్‌పైకి ఎక్కి నిరసన స్టేడియం వద్ద పార్టీ శ్రేణులను తరలించటానికి పోలీసులు బస్సులను ఏర్పాటు చేశారు. పోలీసులు పార్టీ నేతలపై లాఠీచార్జ్‌కు ఉపక్రమించటంతో నేతలు జక్కంపూడి రాజా, దేవినేని అవినాష్, నాగార్జునయాదవ్, పేర్ని కిట్టు, అంజిరెడ్డి తదితరులు బస్సుపైకెక్కి తమ నిరసనను తెలియజేశారు. బస్సును, పైన ఉన్న నేతలను కృష్ణలంక పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా..! ఎన్ని అడ్డంకులు కల్పించినా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకరబాబు ఒక్కసారిగా తన అనుచరులతో ఎంజీ రోడ్డు మీదకు చేరుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. .ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి, నేతలు విశ్వనాథ రవి తదితరులు ఎంజీరోడ్డుకు చేరుకొని కలెక్టర్ కార్యాలయం నుంచి ఊరేగింపుగా స్టేడియం వద్దకు చేరుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్, తిరువూరు ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు, జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, నందిగామ ఇన్ చార్జి మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీలు ఎండీ రుహుల్లా, అరుణకుమార్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి నాగేంద్రపుణ్యశీల, పోతిన మహేష్, విద్యార్థ్ధి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.రౌడీలు, పోలీసుల దాడుల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువకులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల లాఠీచార్జ్ కారణంగా కొందరు నాయకులు సైతం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి పోలీసుల తీరుతో తీవ్ర ఒత్తిడికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆయనను హుటాహుటిన రమేష్ హాస్పటల్‌కు తరలించారు. భవానీపురానికి చెందిన పార్టీ నేత కరీం సైతం తీవ్ర గాయాలపాలు కావటంతో ఆయనను ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. పార్టీ శ్రేణులను అక్కడి నుంచి పంపించివేయడానికి లాఠీచార్జి చేయాలంటూ ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ మైక్ తీసుకుని ఆదేశించారు. ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలను అరుస్తూ ఇష్టానుసారం పార్టీ నేతలపై దాడులకు తెగబడ్డారు. వికలాంగులను సైతం పక్కకు తోసివేయడంతో వారు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. శాప్ కార్యాలయం వద్దకు చేరుకున్న వైఎస్సార్ సీపీ నేతలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ఒక్కసారిగా టీడీపీ రౌడీమూకలు వారిపై తెగబడ్డారు. విచక్షణారహితంగా చేతులతో కుమ్ముతూ భయకంపితులను చేశారు. అంతేకాకుండా పోలీసుల చేతుల్లో ఉన్న లాఠీలను తీసుకొని ఇష్టమొచ్చినట్లుగా పార్టీ నేతలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతే కాకుండా వైఎస్సార్ సీపీకి చెందిన వికలాంగుడి వద్ద చేతికర్రలను తీసుకొని వాటితోనూ దాడులకు తెగించారు. అయితే ఇదంతా పోలీసుల సమక్షంలోనే వారి ఆధ్వర్యంలోనే జరిగింది. డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను కొంతమంది టీడీపీ నేతలు ఒక రోజు ముందుగానే నగరానికి తీసుకువచ్చారు. ఆ ముసుగులో వైఎస్సార్ సీపీపై తెగబడే విధంగా వ్యవహరించాలంటూ ఆదివారం ఒక ఫంక్షన్ హాల్లో దిశానిర్దేశం చేశారు. వారితో పాటు పలువురు రౌడీమూకలను సైతం టీడీపీ రంగంలోకి దించింది. -
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి
మచిలీపట్నంఅర్బన్: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, తమకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరత్నం కోరారు. ఈ మేరకు వీఆర్ఏలు సోమవారం ‘మీకోసం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. వెంకటరత్నం మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో గ్రామస్థాయిలో భూమిశిస్తు వసూళ్లు, రీ–సర్వేలో భూముల కొలతలు, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు మండల, డివిజన్ కార్యాలయాల్లో ఆన్లైన్ పనులు, నైట్ వాచ్మెన్ విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి చాట్ల రమేష్ మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని, అర్హులైన వారందరికీ ఓటీఎస్ విధానంలో ఉద్యోగోన్నతులు కల్పించాలని కోరారు. నామినీలుగా పనిచేస్తున్న వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, విధుల్లో ఉండగా మృతి చెందిన వీఆర్ఏల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి కారుణ్య నియామకం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వీఆర్ఏల నుంచి వీఆర్ఓలుగా ఉద్యోగోన్నతులు కల్పించే కోటాను ప్రస్తుతం 30 శాతం నుంచి 80 శాతానికి పెంచాలని కోరారు. జీఓ 13, సీనియారిటీ ప్రకారం ఇంటర్ విద్యార్హత కలిగిన అర్హులైన వీఆర్ఏలకు వీఆర్ఓలుగా ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. నైట్ వాచ్మెన్, అటెండర్ పోస్టులకు ప్రస్తుతం అమలవుతున్న 20 శాతం ఉద్యోగోన్నతి కోటాను 80 శాతానికి పెంచాలని కోరారు. 40 ఏళ్లుగా సేవలందిస్తున్న వీఆర్ఏలకు సైతం ఉద్యోగోన్నతులు లభించని పరిస్థితి ఉందని తెలిపారు. వీఆర్ఏలకు కనీస వేతనం రూ.21 వేలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
నకిలీ సేవా టికెట్ కేసులో నిందితుడి అరెస్ట్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ప్రత్యేక సేవా టికెట్ల పేరిట నకిలీ టికెట్‌ను రూపొందించి విక్రయించిన సైబర్ నేరస్తుడిని అరెస్టు చేసినట్లు సైబర్ క్రైం డీసీపీ కృష్ణప్రసన్న తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుడి వివరాలను డీసీపీ కృష్ణప్రసన్న మీడియాకు వివరించారు. గుంటూరుకు చెందిన వంగల రాజేష్ నకిలీ పత్రాలు తయారు చేసి విక్రయిస్తుంటాడు. హైదరాబాద్‌లో రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని తెలిసిన వారి నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో రాజేష్ నిందితుడు. గతంలో ఇతనిపై హైదరాబాద్‌లో కేసు నమోదయింది. దసరా ఉత్సవాల ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్ కావాలని కావలికి చెందిన భక్తురాలు రాజేష్‌తో రూ.3500కు ఒప్పందం కుదుర్చు కుంది. నిందితుడు ఆన్లైన్లో నమూనా టికెట్ ను డౌన్లోడ్ చేసి, మొబైల్ ఎడిటింగ్ యాప్‌ను ఉపయోగించి భక్తురాలి పేరు, తేదీలతో నకిలీ టికెట్ తయారు చేసి ఆమెకు పంపాడు. అయితే టికెట్‌పై దేవస్థాన ధ్రువీకరణ క్యూఆర్ కోడ్, అధికారి సంతకం లేకపోవడాన్ని గుర్తించి వెంటనే దేవస్థాన అధికారులకు టికెట్‌ను పంపారు. ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమై సీపీ రాజశేఖరబాబుకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడి జాడను టెక్నికల్ ఎనాలసిస్ ద్వారా తెలుసుకుని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు అతని వద్ద నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఇతర నకిలీ గుర్తింపు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భక్తులు దసరా ఉత్సవాల సేవా, దర్శన టికెట్లను దేవస్థాన అధికారిక కౌంటర్లు, వెబ్సైట్ ద్వారానే కొనుగోలు చేయాలని సూచించారు. వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ అయిన టికెట్లు, అనధికార వ్యక్తుల నుంచి టికెట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు. అనుమానాస్పద టికెట్లు, ఆఫర్లు కనిపిస్తే వెంటనే దేవస్థాన అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. సమావేశంలో ఏసీపీ భానుప్రకాష్‌రెడ్డి, ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు. -
30న ‘దళిత ఘోష – సామాజిక శంఖారావం’
కృష్ణలంక(విజయవాడతూర్పు): సమాజంలో నేటికీ కొనసాగుతున్న కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలకు నిరసనగా, దళిత కాలనీల సమగ్ర అభివృద్ధి కోసం ఈ నెల 30న విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటలకు దళిత ఘోష – సామాజిక శంఖారావం మహాధర్నా నిర్వహించనున్నట్లు కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కె.ఆంజనేయులు తెలిపారు. గవర్నర్ పేటలోని బాలోత్సవ్ భవన్లో సోమవారం మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలని, కుల వివక్ష, అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలించి రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న విజయవాడలో జరిగే ఈ మహాధర్నాకు దళిత, వ్యవసాయ, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలతో పాటు ప్రజాస్వామికవాదులు, మేధావులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.సుబ్బరావమ్మ, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు, వత్తిదారుల సంఘం రాష్ట్ర కో–కన్వీనర్ పి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటికి వస్తున్నానని చెప్పి అనంత లోకాలకు
మైలవరం: హాస్టల్లో చదువుతున్న కుమారులు ఇంటికి రావడంతో వారికి మాంసం తీసుకువస్తానని చెప్పి వెళ్లిన కొద్దిసేపటిలోనే ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు తోడవడంతో అనంత లోకాలకు వెళ్లాడు తండ్రి. ఆ తండ్రిని చూసి కుమారులు, భార్య రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ విషాదకర సంఘటన మైలవరం మండలం విజయవాడ – భద్రాచలం జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం మైలవరం మండలం పుల్లూరు పంచాయతీ శివారు దాసుళ్లపాలెం గ్రామానికి చెందిన గవలపల్లి వెంకటేశ్వరరావు(35) రమణ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లోకేష్ మైలవరంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. చిన్న కుమారుడు ఆదిశేషు విసన్నపేట మండలం చాట్రాయి ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో కుమారులు ఇంటికి వచ్చారు. సంఘటనా స్థలంలోనే మృతి.. కుమారులకు మాంసం తీసుకువచ్చేందుకు పుల్లూరు సెంటర్‌కు వెంకటేశ్వరరావు వచ్చాడు. సెంటర్లో స్నేహితుని ద్విచక్ర వాహనం తీసుకుని కొత్తగూడెం సెంటర్ సమీపంలోని చికెన్ షాపులో చికెన్ తీసుకుని ఇంటికి వస్తున్నాడు కొంత దూరం వచ్చిన తరువాత చికెన్ సరిపోతుందో లేదోనని మరల వెనుతిరిగాడు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిలోని హరీష్ హోటల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వెంకటేశ్వరరావు రహదారిపై కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయమై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కొంత సేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎస్ఐ సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విధ్వంస పాలనకు చరమగీతం పాడాలి
ఉయ్యూరు: రాష్ట్రంలో విధ్వంసకర అవినీతి పాలనకు చరమగీతం పాడాలని వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పిలుపునిచ్చారు. ఉయ్యూరు మండలంలోని చిన ఓగిరాలలోని ఓ కన్వెన్షన్‌లో పెనమలూరు నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు దాసే రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పేర్ని నాని మాట్లాడుతూ కూటమి శ్రేణులే ఛీ అనుకునేలా రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఉందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌ల దమనకాండను చూసి కమ్మ సామాజిక వర్గం రానున్న ఎన్నికల్లో తిరస్కరించేందుకు సిద్ధపడుతున్నారన్నారు. జిల్లాలో బందరు, పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల్లో నీళ్లు లేక నాట్లు వేసుకోలేని దుస్థితిలో రైతాంగం ఉందన్నారు. దేవుడి దయ, భూమాత అనుగ్రహంతో జిల్లాలో కొన్ని చోట్ల బోర్లు ద్వారా సాగు చేస్తున్న దుస్థితి ఉందన్నారు. రైతాంగానికి నీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం అని మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు పెంచేసి, ఎరువులను అందకుండా చేస్తూ అన్నదాతలను, సామాన్య ప్రజానీకాన్ని చంద్రబాబు కాల్చుకు తింటున్నాడని ధ్వజమెత్తారు. రైస్మిల్లర్లదే రాజ్యంగా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ధరలకు, చంద్రబాబు పాలనలో ధరలకు బేరీజు వేసుకోవచ్చని సవాల్ చేశారు. మత విష ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలి.. ఎల్లో మీడియా మతం అనే విషాన్ని చిమ్ముతూ వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోవాలనే కుట్రలపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి తగిన గుణపాఠం నేర్పాలని పేర్ని నాని సూచించారు. ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌పై చేస్తున్న తప్పుడు విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ధనబలంతో ఓటర్లను ప్రలోభపెట్టి స్థానిక ఎన్నికల్లో గెలవాలనే కుతంత్రాలతోనే చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే యత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు చేరువగా, సేవాభావం కలిగిన వ్యక్తులను ఎన్నికల్లో పోటీకి సిద్ధం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలపై వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు. దమ్ముంటే చర్చకు రావాలి : దేవభక్తుని నియోజకవర్గంలో అభివృద్ధిపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్ దమ్ముంటే చర్చకు రావాలని వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి సవాల్ విసిరారు. సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్ల కాలంలో నియోజకవర్గంలో ఒక్క ఎకరం భూమైనా పేదలకు పంచారా? అని ప్రశ్నించారు. ఎంత మందికి కొత్త పింఛన్లు ఇచ్చారో ? చెప్పాలన్నారు. ఉయ్యూరులో అతిసారకు ప్రభుత్వ చేతకానితనమే కారణం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బోడెకు ప్రజల సంక్షేమం కంటే కమీషన్లు, సొంత ఆదాయమే ముఖ్యమని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో పెడన సమన్వయకర్త ఉప్పాల రాము, పెనమలూరు పరిశీలకులు మీర్ హుస్సేన్, రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, జెడ్పీటీసీ బాకీ బాబు, ముఖ్య నాయకులు జంపాన కొండలరావు, వల్లభనేని వెంకటేశ్వరరావు, మాదు శ్రీహరిరాణి, కె.వెంకటేశ్వరరావు (రాజకీయం), గోన మదన్, నక్కా శ్రీనివాసరావు, సోలే సురేష్‌బాబు, వెంట్రప్రగడ బాబ్జీ, అబ్దుల్లా, పార్టీశ్రేణులు పాల్గొన్నారు. -
అదుపు తప్పిన ట్రావెల్స్ బస్సు
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. విజయవాడ నుంచి రాజాం వెళ్తున్న కనకదుర్గ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకెళ్లింది. విజయవాడలో ప్రయాణికులను ఎక్కించుకుని రాజాం వెళ్తుండగా మార్గమధ్యంలో నిడమానూరు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణం చేస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని పటమట పోలీసులు పేర్కొన్నారు. గుడివాడ రూరల్: మద్యం మత్తులో చోటుచేసుకున్న ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. టూ టౌన్ పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం స్థానిక శోభన కాంప్లెక్స్ వద్ద ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పట్టణంలోని గుడ్‌మెన్‌పేటకు చెందిన వేసపోగు నాగరాజు (40) మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద నాగరాజు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దాడికి పాల్పడి హత్య చేసిన వ్యక్తి పట్టణంలోని కొమరగుండ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడివాడ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ హనీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గంపలగూడెం: కారును బస్సు ఢీ కొనడంతో పెను ప్రమాదం తప్పిన ఘటన ఊటుకూరులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గంపలగూడెం నుంచి నెమలి వెళ్తోంది. ఊటుకూరు పొట్టి శ్రీరాములు విగ్రహానికి సమీపాన(మలుపు వద్ద) నిలిపి ఉన్న కారును ఆర్టీసి బస్సు ఢీ కొట్టింది. దీంతో కారు ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఘటనలో హైటెన్షన్ విద్యుత్ స్తంభం అక్కడికక్కడే విరిగి పడిపోయింది. దీనితో విద్యుత్ వైర్లు తెగి బస్సుపై పడ్డాయి. అదే సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. రహదారిపై కార్ పార్కింగ్ చేయడంతో పాటు రహదారి గుంతలమయంగా ఉండటంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. విద్యుత్ ఏఈ సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు విరిగిన స్తంభాన్ని, వైర్లను తొలగించి విద్యుత్ పునరుద్ధరణ పనులను ఆ శాఖ సిబ్బంది పూర్తి చేశారు. గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఆదివారం యూట్యూబర్ ప్రశ్న రావణ్(బచ్చలకూరి జోసఫ్) విచారణ కొనసాగింది. దర్యాప్తు అధికారి డీఎస్పీ కె.ధర్మేంద్ర నేతృత్వంలో రావణ్‌ను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణ ప్రక్రియలో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు కూడా పాల్గొన్నారు. ఉపా కేసుకు సంబంధించి అదనపు సమాచారాన్ని రావణ్ నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నిషేధిత మావోయిస్టులకు మద్దతుగా వీడియో చేయడంపై వెనుక కారణాలు, ప్రశ్న యూట్యూబ్ చానల్ నిర్వహణ, రాజకీయ పార్టీలతో సంబంధాలు గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ స్టూడియోలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సాంకేతిక పరికరాలు ఆధారంగా అధికారులు వివరాలను సేకరించే ప్రయత్నం చేశారు. గన్నవరం సీఐ బి.వి.శివప్రసాద్ పాల్గొన్నారు. -
అదును దాటి.. ఆశలు ఎండి
అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో 87,785 ఎకరాల్లో వరిసాగు భూములున్నాయి. ఏటా ఆగస్టు నెల ఆఖరికి నాట్లు పూర్తయ్యేవి. ఈ ఏడాది సెప్టెంబర్ 20 దాటినా.. కేవలం 57,375 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. ఇంకా 30,410 ఎకరాల్లో వరినాట్లు వేయలేదు. వీటిలో నాట్లు వేసే పరిస్థితి కనబడటం లేదు. అదును దాటిపోయింది.. దివిసీమలోని రైతులు రెండో పంటయిన అపరాల (మినుము, పెసర, మొక్కజొన్న) సాగుపై ఎక్కువ ఆధార పడతారు. రెండో పంట ద్వారానే రైతులకు కొంత ఆదాయం మిగులుతుంది. కౌలు రైతులు ఈ పంటను దృష్టిలో పెట్టుకునే పొలాలు సాగు చేస్తుంటారు. ఆగస్టు నెలాఖరుకు నాట్లు పడితే రెండో పంట మినుము దిగుబడులు వస్తాయి. లేదంటే మినుము పంట పూత, కాయకు వచ్చే సమయానికి మంచు ఎక్కువ పట్టడం వల్ల మినుము దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే ఆలస్యంగా సాగుచేసే కంటే ఈ పంటకు విరామం ఇచ్చి రెండో పంట అయిన మినుము ద్వారా ఆదాయం వస్తుందని రైతుల నమ్మకం అందుకే ఇప్పటి వరకూ సాగుచేయని పొలాల్లో సాగుచేసేందుకు రైతులు ఇష్టపడటం లేదు. దీంతో 30వేల ఎకరాల్లో నాట్లుకు విరామం ఇచ్చినట్టే. పంటకాలువ ద్వారా వచ్చే నీటితో సాగు చేసిన రైతుల్లోనూ తీవ్ర నిరాశే ఉంది. ఆయిల్ ఇంజిన్లు లేకుండా సాగుచేసే పరిస్థితి లేదు. కాలువ నుంచి వచ్చే సాగునీటిని ప్రతిరోజూ ఆయిల్ ఇంజిన్ ద్వారానే పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఎకరాకు నీరు తోడాలంటే పదిరోజులకు ఏడు నుంచి పది లీటర్లు ఆయిల్ ఖర్చు అవుతోంది. అంటే ఎకరాకు ఏడు వందల నుంచి రూ.1,100 వరకూ ఖర్చవుతోంది. ఉదయం తోడితే సాయంత్రానికి నీరుండటం లేదని.. ఆయిల్ కోసమే ఇప్పటి వరకూ ఎకరాకు పదివేలకు పైగా ఖర్చులు అయ్యాయని కొంతమంది రైతులు వాపోతున్నారు. అంటే పంట చేతికి రావాలంటే ఆయిల్ ఖర్చులే రూ.20వేల వరకూ అవుతాయని పిట్టల్లంకకు చెందిన రావి సుబ్బారావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పంటను వదిలేసుకుంటున్న అన్నదాతలు అవనిగడ్డ నియోజకవర్గంలో 30వేల ఎకరాల్లో పడని నాట్లు అదును తప్పడంతో వరిసాగుకు విరామం పంటకాలువలకు అందని సాగునీరు -
అక్కినేని నటన, ఘంటసాల గానం అజరామరం
ఘంటసాల: అక్కినేని నాగేశ్వరరావు నటన, గాయక ఘంటసాల వెంకటేశ్వరరావు గానం అజరామరం అని ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం అన్నారు. ఘంటసాల కళాసమితి ఆధ్వర్యంలో ఆదివారం ఘంటసాలలోని శ్రీజలధీశ్వర స్వామి ఆలయంలో అక్కినేని నాగేశ్వరరావు 102వ జయంతి వేడుకలను డీఆర్వో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘంటసాల వంశ జన్మశాలైన ఘంటసాల గ్రామంలో అక్కినేని నాగేశ్వరరావు జయంతిని నిర్వహిస్తూ ఆయనకు ఘంటసాల వారు పాడిన పాటలతో నీరాజనం అర్పించడం హర్షదాయకమన్నారు. మహానటుడు అక్కినేని, గాయక ఘంటసాల కారణజన్ములన్నారు. అక్కినేని తన 40 ఏళ్ల వయస్సులోనే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విద్యనందించాలనే లక్ష్యంతో గుడివాడలో ఏఎన్నార్ కాలేజీ స్థాపించారన్నారు. నేటికి వేలాది మంది విద్యార్థులను తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న గాయకులను సమీకరించి ఇంతచక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఘంటసాల కళాసమితి సభ్యులను అభినందించారు. అనంతరం డీఆర్వో దంపతులను కళాసమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, ఘంటసాల, ఎన్టీఆర్ కళాపీఠం వ్యవస్థాపకులు కాటూరి మురళీకృష్ణ, ఘంటసాల కళాసమితి అధ్యక్షులు ఘంటసాల కృష్ణమోహన్, రాజ్యలక్ష్మి గాయకులను సన్మానించారు. అలరించిన పాటలు.. అక్కినేని జయంతి సందర్భంగా అక్కినేని, గాయక ఘంటసాల కాంబినేషన్లోని పాటలను తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి గాయకులు కె.రామకృష్ణ, ఎన్.లోక్‌నాథ్, యు.మోహనరావు, సీహెచ్.యజ్ఞ ప్రసాద్, డి.రాంబాబు, కొడాలి కోదండ రామశర్మ, శాయిన హరిప్రసాద్, తుర్లపాటి రామ్మోహనరావు, ఘంటసాల కృష్ణమోహన్ – రాజ్యలక్ష్మి దంపతులు అక్కినేని నాగేశ్వరరావుకు ఘంటసాల వారు పాడిన పాటలతో అలరించారు. అక్కినేని నాగేశ్వరరావు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండి అఖిల భారత ఏఎన్నార్ సంఘ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఘంటసాల గ్రామానికి చెందిన స్వర్గీయ తాతినేని జవహర్ తమ్ముడు రవిని కళా సమితి వారు సత్కరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బండి పరాత్పరరావు, ఆర్ఐ కె.శ్రీనివాస్, కొండపల్లి శ్రీకాంత్, ఆలయ అర్చకులు చావలి కృష్ణకిషోర్, దాలిపర్తి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. అక్కినేని జయంతి వేడుకల్లో డీఆర్వో లక్ష్మీ నరసింహం -
చిన్నారికెంత కష్టమొచ్చిందో!
● ప్రభుత్వ స్థలం ఆక్రమణపై ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం ● ఒక వర్గం దాడిలో స్పృహ తప్పి పడిపోయిన మరో వర్గం మహిళ ● ‘అమ్మా లే’ అంటూ విలపించిన చిన్నారి ● ఆక్రమణలను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నాయకులు మైలవరం(జి.కొండూరు): ‘అమ్మా లే అమ్మా.. ఇంటికి వెళదాం.. నాకు భయమేస్తోంది’ అంటూ స్పృహతప్పి పడిపోయిన తల్లి వద్ద కూర్చొని చిన్నారి విలపించిన ఘటన చూపరులను కలిచివేసింది. స్థలం వివాదంలో మహిళపై మరో వర్గం దాడి చేసిన ఘటనలో ఆమె సంఘటనా స్థలంలోనే స్పృహ తప్పి పడిపోవడంతో లోకజ్ఞానం తెలియని ఆ చిన్నారి రోదనలు మిన్నంటాయి. వివరాలు ఇవి.. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్‌ను ఆనుకుని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయానికి సమీపంలో ప్రభుత్వ స్థలం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండు వర్గాల టీడీపీ నాయకుల అండదండలతో కొందరు ఈ స్థలాన్ని ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేశారు. వారిలో కొందరు వ్యాపారాలు చేస్తుండగా కొందరు నెలకు రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు అద్దెలకు ఇస్తూ ఆదాయం పొందుతున్నారు. రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన అజ్మీరా జ్యోతి, నాగేశ్వరరావు దంపతులు మైలవరంలో నివసిస్తూ.. ఆ ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన ఓ దుకాణాన్ని నెలకు రూ.4వేలకు అద్దెకు తీసుకొని టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలేనికి చెందిన షేక్ షకీల అదే ప్రభుత్వ స్థలంలో కొంత ఆక్రమించి దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఈ దుకాణం పక్కన ఖాళీగా ఉన్న స్థలంలో టైలరింగ్ చేస్తున్న అజ్మీరా జ్యోతి తాను కూడా సొంత షాపు ఏర్పాటు చేసుకునేందుకు ఆదివారం పాత బడ్డీకొట్టును అక్క డకు చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న షకీల, ఆమె కుటుంబ సభ్యులు నలుగురు కలిసి అక్కడికి చేరుకొని ఆ స్థలం తమదంటూ బడ్డీకొట్టును తొలగించి అజ్మీరా జ్యోతితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో అజ్మీరా జ్యోతి స్పృహ తప్పి పడిపోయింది. తల్లి ఒక్కసారిగా కుప్పకూలి స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడే ఉన్న ఆమె కుమారులు ఏడేళ్ల శ్రీధర్, 15 ఏళ్ల సిద్ధార్థ రోదించడం ప్రారంభించారు. దీంతో స్థానికులు క్షతగాత్రురాలు జ్యోతిని 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న మైలవరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడమేంటని స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. టీడీపీ నాయకులు రెండు వర్గాలు విడిపోయి ఈ ఆక్రమణలను ప్రోత్సహిండం వల్లనే వివాదాలు తలెత్తి దాడులు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. -
గేదెలు, పొట్టేళ్లను తరలిస్తున్న దొంగలను అడ్డుకున్న యజమానులు
యజమానుల బైక్‌ను ఢీకొట్టి వ్యాన్‌లో పారిపోయిన దొంగలు పెనమలూరు: పెదపులిపాకలో పశువులు దొంగతనం చేయటానికి వచ్చిన ముఠాపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదపులిపాక శివారు తాడిగడప రోడ్డులో కోగంటి రాజేష్, కోగంటి రాజేంద్ర పశువుల పెంపకానికి షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు. షెడ్డులో గేదెలు, గొర్రె పోతులు, కోళ్లు పెంచుతున్నారు. అయితే శనివారం రాజేష్, రాజేంద్ర షెడ్డుకు తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. వారు అర్ధరాత్రి తిరిగి వచ్చే సరికి పశువులు దొంగతనం చేసే ముఠా ఎదురుగా ఉన్న వెంచర్లో ఏపీ 39యూ 2716 నంబర్ కలిగిన వ్యాన్ నిలిపి షెడ్డు తాళాలు పగులకొట్టి గేదె, గొర్రె పొట్టేళ్లను వ్యాన్‌లోకి ఎక్కించారు. ఇది గమనించిన షెడ్డు యజమానులు కేకలు వేస్తూ వ్యాన్ వద్దకు వెళ్లారు. తమ బైక్‌ను వ్యాన్‌కు అడ్డుగా నిలుపగా దొంగల ముఠా బైక్‌ను వ్యాన్‌తో ఢీ కొట్టి ఆగకుండా పారిపోయారు. ఈ గందరగోళంలో వ్యాన్‌లో ఉన్న గేదె, గొర్రె పొట్టేళ్లు వ్యాన్ నుంచి కిందకు దూకాయి. పశువులను సురక్షితంగా షెడ్డుకు తరలించి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వ్యాన్ నంబర్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. -
హోల్డింగ్ పాయింట్ల పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా హోల్డింగ్ పాయింట్లలో అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని దుర్గగుడి ఈవో శీనా నాయక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఈవో శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులు ఆదివారం పరిశీలించారు. తొలుత సీతమ్మ వారి పాదాల వద్ద ఏర్పాటు చేస్తున్న కేశఖండనశాల, భక్తులు వేచి ఉండే హోల్డింగ్ పాయింట్లను పరిశీలించారు. ఈ ఏడాది నాలుగు హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామని, అత్యవసరమయితే అదనంగా మరో పాయింట్‌ను ఏర్పాటు చేసేలా ఆలయ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అనంతరం కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి వద్ద జరుగుతున్న క్యూలైన్ పనులను పరిశీలించారు. ఈవో వెంట ఈఈ ఎల్.రమాదేవి, ఇతర ఇంజినీరింగ్ అధికారులు రవీంద్ర, మస్తాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


