హరిత వైద్యుడు
ప్రాణాపాయంలో ఉన్న వారికి పునర్జన్మ ఇస్తారు వారి ఆత్మీయ పలకరింపే సగం జబ్బును నయం చేస్తుంది నేడు జాతీయ వైద్యుల దినోత్సవం
క్రిటికల్ కేర్‌లో దిట్ట
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి గుమ్మంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ ముందుగా కనిపించేది తెల్లకోట్లులో ఉన్న వైద్యుడే. ఆ క్షణంలో ఆయన ప్రాణాలను నిలబెట్టే ఆశాకిరణం. గుండెపోటు నుంచి ప్రమాదాల వరకు, అత్యవసర పరిస్థితుల్లో క్షణాల వ్యవధిలో తీసుకునే నిర్ణయాలతో ఎన్నో జీవితాలను కాపాడుతున్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే మానవీయ స్పర్వను కోల్పోకుండా, ఆప్యాయతతో కూడిన వైద్య సేవలు అందిస్తూ వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. బుధవారం జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా సేవే శ్వాసగా భావిస్తూ సమాజ ఆరోగ్యానికి అహర్నిశలు శ్రమిస్తున్న విజయవాడ వైద్యుల సేవలకు సలాం అంటున్నారు.
వ్యక్తిగత సమస్యలు అధిగమిస్తూనే..
రోగులకు సేవలు అందించడమే పరమావధిగా భావిస్తూ 24 గంటలూ రోగుల సేవలోనే వైద్యులు మమేకమవుతుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయాన్ని కూడా కోల్పోతుంటారు. రోగులకు సేవలు అందించే క్రమంలో వైద్యులు ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడుతుంటారు. రేడియేషన్ ప్రభావంతో కొందరు కార్డియాలజిస్టులు క్యాన్సర్ బారిన పడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వారి వద్దకు వచ్చిన రోగిని చిరునవ్వుతో ఆత్మీయ పలకరింపే సగం టానిక్‌లా పనిచేస్తుంది. అందుకే వారిని దైవంతో కొలుస్తారు.
పర్యావరణాన్ని ప్రేమిస్తే.. అది మనల్ని రక్షిస్తుందనే భావనతో మొక్కలు నాటడాన్ని డాక్టర్ కొండా వేణుగోపాలరెడ్డి(వీజీఆర్) పదేళ్ల క్రితం ప్రారంభించారు. ఏటా వర్షాకాలంలో వేలాది మొక్కలను తమ ఆస్పత్రికి తీసుకు వచ్చి ప్రతిరోజూ వచ్చే రోగులకు ఇవ్వడమే కాకుండా, రెడ్‌క్రాస్ వంటి సంస్థలకు ఇస్తుంటారు. అలా ఇప్పటి వరకూ 60 వేలకు పైగా మొక్కలను పంపిణీ చేశారు. మధుమేహ వైద్యుడిగా సైతం తనదైన ముద్ర వేశారు. మధుమేహానికి అవగాహనే మందు అని డాక్టర్ వీజీఆర్ అంటున్నారు.
కె.వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణులు


