కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్ | Tamil Director K Bhagyaraj Last Letter Went Viral | Sakshi
Sakshi News home page

Bhagyaraj Last Letter: నా కళ్లు జాగ్రత్త.. నా కొడుకుని ఆదరించండి

Jul 1 2026 1:39 PM | Updated on Jul 1 2026 2:41 PM

Tamil Director K Bhagyaraj Last Letter Went Viral

తమిళ ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె.భాగ్యరాజ్ రీసెంట్‌గా గుండెపోటుతో చనిపోయారు. అయితే మరణానంతరం ఈయన రాసినట్లు చెబుతున్న ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇందులో తన కళ్లు దానం చేయాలనే చివరి కోరికతోపాటు తన కొడుకు శాంతనుకి అండగా నిలవాలని అభిమానులని ఆయన వేడుకుంటున్నట్లు ఉంది.

(ఇదీ చదవండి: పదే పదే ఇబ్బంది పెట్టాడు.. రాయితో తల పగలగొట్టా: కాయదు లోహర్)

లెటర్ లో ఏముందంటే?
'మన చుట్టూ ఉన్నవాళ్లని సంతోషపెట్టడంలో నిజమైన ఆనందముంది. నాపై అపారమైన ప్రేమ చూపించిన అభిమానులకు, నన్ను ప్రోత్సాహించిన తల్లులకు, ఇండస్ట్రీలోని సహచరులకు కృతజ్ఞతలు. మీ ప్రేమతో నిండిన చూపుల కోసం నా కళ్లని సజీవంగా ఉంచాను. దయచేసి వాటిని జాగ్రత్తగా చూసుకోండి'

కొడుకు, నటుడు శాంతను భాగ్యరాజ్ గురించి ప్రస్తావిస్తూ.. 'నా కోసం కొట్టిన చప్పట్లే నా కొడుకుకి కూడా ఆశీర్వాదంగా మారాలని కోరుకుంటున్నా. జీవితంతం నాకు అందించిన ప్రేమ, ఆదరణ ఇకపై శాంతనుకు కూడా అందించండి. నేను శారీరకంగా లేకపోయినప్పటికీ దానం చేసిన కళ్ల ద్వారా అభిమానులని చూస్తూనే ఉంటాను. ఈ శరీరం శాశ్వతం కాదు. ఒకరోజు భూమిలో కలిసిపోతుంది లేదా అగ్నికి ఆహుతి అవుతుంది. చివరకు మిగిలేది బూడిద కాదు. మనం పంచిన ప్రేమే అసలైన సంపద. నా జీవిత ప్రయాణంలో నన్ను ప్రేమించిన, నా కోసం కన్నీళ్లు పెట్టుకున్న ప్రతిఒక్కరికీ నేను రుణపడి ఉంటాను. మంచి సినిమాలు, కథలు, డైలాగ్స్, మానవత్వం ద్వారా చిరస్థాయిగా జీవిస్తాను' అని లెటర్‌లో రాసుకొచ్చారు.

తమిళ చిత్రసీమలో భాగ్యరాజ్.. అత్యుత్తమ కథా రచయిత, దర్శకుడిగా గుర్తింపు పొందారు. 25కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు 75కి పైగా సినిమాల్లో నటించారు. ఈయనకు భార్య పూర్ణిమ, కొడుకు శాంతను, కుమార్తె శరణ్య ఉన్నారు.

(ఇదీ చదవండి: స్టార్ హీరోలు గమనిస్తున్నారా? 95 శాతం ఫ్లాపులు, డిజాస్టర్లే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement