బెంగళూరు: స్పైడర్‌మ్యాన్ శక్తి గురించి తెలిసిందే. కానీ బెంగళూరులో కేబుళ్ల ముందు అతడు బలాదూరే. సిలికాన్ సిటీలో రోడ్లు, మౌలిక వసతుల సమస్యలపై తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బయోకాన్ అధ్యక్షురాలు కిరణ్ మంజుదార్ షా ఇప్పుడు మరో సమస్యను ప్రస్తావించారు. బెంగళూరులోని వీధుల్లో పద్మవ్యూహాన్ని తలపించేలా ఉండే కేబుల్ వైర్లను ప్రస్తావించారు.
స్పైడర్ మ్యాన్ వచ్చి ఆ తీగల్లో ఇరుక్కున్నట్లు గ్రాఫిక్ చిత్రాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు. ‘స్పైడర్ మ్యాన్.. నీవు బెంగళూరుకు రావద్దు’ అని వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఏ రోడ్డుపై చూసినా గజిబిజి సాలీడు గూళ్లలా పలు రకాల వైర్లు కనిపిస్తాయి. వీటి వల్ల ప్రమాదాలు జరిగి కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మంజుదార్ షా చేసిన పోస్టు లక్ష మందికి పైగా వీక్షించారు. అయితే చాలామంది కన్నడలో రాసి ఉన్న ఫొటోలు పోస్టు చేయాలని సూచించారు.
Spider-Man was warned not to come to Bengaluru! pic.twitter.com/3L5WFSHnDN
— Kiran Mazumdar-Shaw (@kiranshaw) August 15, 2026


