సమంత ప్రెగ్నెన్సీపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నా శోభారాజు యువతకు వైవాహక బంధం పలు సూచనలు చేశారు. కెరీర్‌లో ఏమాత్రం శక్తి వంచన లేకుండా..ఎక్కడ తగ్గకుండా కృషి చేయాల్సిందేనని అనారు. అదే బంధంలో తగ్గడం అనేది చాలా ప్రదానమని అన్నారు. రిలేషిన్‌షిప్స్ బాగుండాలంటే ఎక్కడ తగ్గాలో తెలియాలి, రాజీ పడటం నేర్చుకోవాలని అప్పుడే బాంధవ్యం బలోపేతం అవుతుందంటూ నేటి యువతకు వైవాహిక బంధానికి సంబంధించిన కొన్ని విలువైన సూచనలిచ్చారు. అవేంటంటే.
భార్యభర్తల మధ్య అహంకారం ఉండకూడదని, ఎక్కడ తగ్గాలో తెలియాలని అప్పుడే బంధం కలకాలం నిలుస్తుందని అన్నారు. ప్రేమ గెలవాలి కానీ అహంకారం కాదని సూచించారు.
అలాగే నేటి జీవితంలో విజయం సాధించాలంటే 'క్రమశిక్షణ' (Discipline) అత్యంత ముఖ్యమని, ఏ సందర్భంలోనూ అవకాశాల కోసం తమ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టవద్దని హితవు పలికారు.
చివరగా ఆమె తన మెడలో ఎప్పుడూ కనిపించే ప్రత్యేక హారం వెనుక ఉన్న కథను కూడా చెప్పారు. అది తన శిష్యురాలు లలిత రామన్ కోరిక మేరకు తానే స్వయంగా ఆ డిజైన్ గీశానని,తన అక్కచెల్లెళ్లందరూ కలిసి దానిని చేయించి ఇచ్చారని తెలిపారు . అన్నమాచార్యులు, వెంకటేశ్వర స్వామి రూపాలు ఉన్న ఆ హారం తనకు ఎల్లప్పుడూ ఒక రక్షలా ఉంటుందని శోభరాజు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సమంత వ్యక్తిత్వంపై ప్రశంసలు..బాబుకి ఆ పేరే ఎందుకంటే..!: శోభరాజు


