తొలి ఫ్లైట్‌ సర్జన్‌ ఎయిర్‌ మార్షల్‌ | Padmavati Bandopadhyay Woman Air Force | Sakshi
Sakshi News home page

తొలి ఫ్లైట్‌ సర్జన్‌ ఎయిర్‌ మార్షల్‌

Nov 23 2026 8:20 AM | Updated on Nov 23 2026 8:20 AM

Padmavati Bandopadhyay Woman Air Force

పద్మావతి బందోపాధ్యాయ్‌

వైజ్ఞానిక వేగుచుక్కలు–52

విమానయాన వైద్య నిపుణురాలైన తొలి మహిళ పద్మావతి బందోపాధ్యాయ్‌ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఫ్లైట్‌ సర్జన్‌గా పరమ విశిష్ట సేవ మెడల్, అతి విశిష్ట సేవ మెడల్‌ వంటి అపురూ పమైన గౌరవాలు పొందారు. ఆమె ఇండియన్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో త్రీ–స్టార్‌ ర్యాంక్‌ పొందిన రెండవ మహిళ కూడా.

1944 నవంబర్‌ 4న తిరుపతిలో జన్మించారు. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు తరచూ వినబడిన ‘అయే మేరే వతన్‌ కే లోగో’ పాట ఆమెను భారత సైన్యంలో చేరమని ప్రేరే పించింది. 1963లో పూనాలోని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీలో చేరి ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. 1968 జనవరి 22న ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో చేరారు.

అయితే చూపు సమస్య కొంత ఉండటంతో ఈ లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. 1968లోనే ఎయిర్‌ ఫోర్సులోని వింగ్‌ కమాండర్‌ ఎస్‌.ఎన్‌. బందోపాధ్యా య్‌ను వివాహం చేసుకున్నారు. అప్పటికి చాలా కొత్తదైన ఏవియేషన్‌ మెడిసిన్‌ (విమానయాన వైద్య శాస్త్రం)లో ఆమె బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి 1975లో కోర్సు చేశారు. ఆర్మీ మెడికల్‌ కాప్స్‌లో 1978లో డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీ కోర్సును పూర్తి చేసిన తొలి మహిళ కూడా పద్మావతే. అలాగే ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌కు అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ అయ్యారు.

తొలుత ఎయిర్‌ ఫోర్స్‌లోని మగ అధికారులు తమ ఆరోగ్య సమస్య లను పద్మావతికి చెప్పుకోవడానికి కొంత జంకేవారు. దీనికి పరిష్కార మార్గంగా పద్మావతి భర్త ఆ అధికారులతో పాటు యుద్ధ విమానాలలో పర్య టించమని కోరారు. 1971లో మన దేశం పాకిస్తాన్‌తో యుద్ధం చేసినప్పుడు ఈ దంపతులిద్దరూ చేసిన సేవలకు విశిష్ట సేవా మెడల్స్‌ అదే సంవత్సరం లభించాయి. ఇలా దంపతులిద్దరూ కలిసి రాష్ట్రపతి చేత ఒకేసారి గౌరవం పొందడమనేది అదే తొలిసారి.

అలాగే 2002లో ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ అయిన తొలి మహిళ కూడా అయ్యారు. పిమ్మట 2004లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్, నేవీ, కోస్ట్‌ గార్డ్‌తో పాటు సివిలియన్‌ పైలెట్స్‌కు విమాన యానంలో ఔషధాలు, వైద్య చికిత్స లందించే మొత్తం సిబ్బందికి నేతృత్వం వహిస్తూ ఆమె ఎయిర్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు సంబంధించిన మెడికల్‌ సర్వీసెస్‌కు డైరెక్టర్‌ జనరలయ్యారు.  2005లో పదవీ విరమణ పొందారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా 2021లో పద్మశ్రీ పురస్కారం పొందారు.
– డా. నాగసూరి వేణుగోపాల్‌, ఆకాశవాణి విశ్రాంత ఉన్నతాధికారి

ఇదీ చదవండి: మరణ శిక్ష కొనసాగించాలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement