విశాఖపట్నం : కార్తీకమాసం.. అందులోనూ ఆదివారం..ఇంకేముంది విశాఖ నగరం నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాలతోపాటు, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన పర్యాటకులు కూడా సందర్శనీయ ప్రాంతాలకు పోటెత్తారు.
సాగరతీర అందాలను కనుల ముందుంచే కైలాసగిరిని ముంచెత్తారు. కుటుంబాలతో వచ్చి,సందడి చేశారు.
రోప్‌వే, రోప్ సైక్లింగ్, మోటారు వాహనాల్లో కైలాసగిరి అందాలను వీక్షించి,పరవశించిపోయారు.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


