పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో నవంబరు 19, 2026న సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకల్లో భాగంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
సినీ నటి రష్మిక మందాన, కర్ణాటక మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితా శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థినులు బ్రాస్ బ్యాండ్, బ్యాండ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.
అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. సత్యసాయి నామంతో ప్రశాంతి నిలయం ప్రతిధ్వనించింది.


