విజయవాడ : భవానీ ద్వీపంలో ‘కార్తిక’ సందడి మొదలైంది. కార్తిక మాసం తొలి ఆదివారం కావడంతో ద్వీపం పర్యాటకులతో కళకళలాడింది.
కృష్ణానది అందాలను తిలకిస్తూ.. బంధుమిత్రుల సపరివారంతో వచ్చిన ప్రజలు ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడిపారు.
సహపంక్తి భోజనాలు చేశారు. కొందరు యువకులు స్పీడ్ బోట్లను డ్రైవ్ చేశారు. మహిళలు, చిన్నారులు ఉయ్యాలలూగుతూ సంతోషంగా గడిపారు.
అయితే ద్వీపంలో సౌకర్యాల లేమి పర్యాటకులకు ఇబ్బందులు కలుగజేసింది. గతంలో ఉన్న పరిస్థితులు ద్వీపంలో లేకపోవడంతో పెదవి విరిచారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ


