భారతీయ వంటకాల ఖ్యాతి మరోసారి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ప్రపంచంలోని అత్యుత్తమ 50 రెస్టారెంట్ల జాబితాలో భారత్‌కు చెందిన రెండు రెస్టారెంట్లు చోటు సంపాదించాయి. 2026 సంవత్సరానికి ప్రకటించిన ఈ జాబితాలో ముంబైకి చెందిన ‘మాస్క్’ 26వ స్థానంలో నిలవగా.. హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలీలో ఉన్న ‘నార్’ 49వ స్థానాన్ని దక్కించుకుంది.
అంతేకాదు.. పర్యావరణహిత వంట విధానాలకు నార్ రెస్టారెంట్ ‘సస్టెయినబుల్ రెస్టారెంట్’ అవార్డును కూడా అందుకుంది. 2004లో ఢిల్లీలోని బుఖారా రెస్టారెంట్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత ఒకేసారి రెండు భారతీయ రెస్టారెంట్లు ప్రపంచ టాప్ 50లో నిలవడం విశేషం. స్పెయిన్‌కు చెందిన ‘అసడోర్ ఎట్క్సెబారి’ మొదటి స్థానాన్ని
కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి: డోంట్‌వర్రీ..మళ్లీ హెల్దీగా ప్రారంభిద్దాం ఇలా..!


