పప్పన్నం లేకుండా రోజు గడవదు!  | Sonia Gandhi shares her love for India cuisines | Sakshi
Sakshi News home page

పప్పన్నం లేకుండా రోజు గడవదు! 

Nov 12 2026 6:01 AM | Updated on Nov 12 2026 6:01 AM

Sonia Gandhi shares her love for India cuisines

ఫుడ్‌ వెతుకులాటలోనే రాజీవ్‌తో పరిచయం 

భారతీయ వంటకాలంటే ఇష్టం 

సోషల్‌ మీడియాలో సోనియా వెల్లడి

న్యూఢిల్లీ: ‘‘నా కథలో ఆహారానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే... రుచికరమైన ఆహారం కోసం వెతుకుతూండగానే రాజీవ్‌ను కలిశాను. ప్రేమలో పడ్డాను’’అన్నారు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాం«దీ. ఇప్పుడు పప్పన్నం (దాల్‌ చావల్‌) లేకుండా రోజు గడవడం లేదని తెలిపారు. 

దీపావళికి ముందు కూతురు ప్రియాంక గాంధీ వాద్రా, మనవరాలు మిరాయా వాద్రాలతో ‘1, సఫ్దర్‌జంగ్‌ రోడ్డు’ఇంటిలో తీసిన వీడియో ఒకదాన్ని సోనియా బుధవారం సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా సోనియా ఈ ఇంట్లోనే ఉండేవారు. ఈ పోస్టులో సోనియా తన చవులూరించే ఆహారం గురించి వివరిస్తూ.. గుజరాతీ ఫుడ్‌ను ప్రస్తావించారు. 

బెంగాలీల ఆహారం, కశ్మీరీ కోఫ్తా, కబాబ్‌లు, చికెన్‌ టిక్కా, చికెన్‌ తందూరి, దాల్‌ మఖనీలు తనకు ఇష్టమైన వంటకాలని చెప్పారు.. ‘‘భారతీయ వంటకాలంటే నాకెంతో ఇష్టం. బెంగాలీ ఫుడ్‌ అంటే ప్రాణం. నమ్మండి నమ్మకపోండి.. సూరత్‌లోని గుజరాతీ ఫుడ్‌ అంటే బాగా ఇష్టం’’అని ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చేసిన పోస్టులో వివరించారు. అయితే.. భారతీయ వంటకాలకు సర్దుకుపోయేందుకు మొదట్లో కొంత సమయం పట్టిందని, మొదటన్నుంచే ఆస్వాదించడం కష్టమైన పనేనని, వండటం ఎలాగో కూడా అప్పుడు తెలియదని చెప్పారు. నెమ్మదిగా వంట నేర్చుకున్నానని చెప్పారు. సోనియా గాంధీ ఇంట్లో ప్రతిరోజూ పప్పన్నం వండుతారని ప్రియాంక కూడా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement