ట్రంప్‌కు ‘మధ్యంతర’ భయం.. కెనడా సుంకాలపై యూటర్న్‌! | Trump revises Canada tariffs as Susan Collins faces tight re election race in Maine | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు ‘మధ్యంతర’ భయం.. కెనడా సుంకాలపై యూటర్న్‌!

Oct 24 2026 7:44 AM | Updated on Oct 24 2026 7:44 AM

Trump revises Canada tariffs as Susan Collins faces tight re election race in Maine

వాషింగ్టన్‌: అమెరికాలో మధ్యంతర ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగానే కెనడా దిగుమతులపై ట్రంప్ యంత్రాంగం విధించిన సుంకాల విధానంలో కీలక మార్పులు చేసింది. మైన్ రాష్ట్ర రిపబ్లికన్ సెనేటర్ సూసన్ కాలిన్స్ పునరేన్నిక పోరులో గట్టి పోటీని ఎదుర్కొంటున్న నేపథ్యంలో అక్కడి రైతులు, స్థానిక వ్యాపారులకు ఊరటనిచ్చేలా ఈ నిర్ణయం వెలువడింది.

ఈ పరిణామం అమెరికా రాజకీయాల్లోనూ, వాణిజ్య వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. కెనడా నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల వస్తువులపై గత జూలైలో ట్రంప్ ప్రభుత్వం ఏకంగా 50 శాతం మేర భారీ సుంకాలు విధించింది. అయితే, తాజాగా వైట్‌హౌస్ ప్రకటించిన సవరించిన నిబంధనల ప్రకారం.. మైన్ రాష్ట్రంలోని రైతులు, సాగుదారులు ఎక్కువగా ఉపయోగించే శీతలీకరణ పరికరాలు, ప్లైవుడ్, ప్యాకింగ్ యంత్రాలపై సుంకాలను పూర్తిగా ఎత్తివేశారు. మైన్ రాష్ట్రంలోని బ్లూబెర్రీ, బంగాళాదుంప, ఆపిల్, సీవీడ్ ఉత్పత్తిదారులకు ఈ మినహాయింపుల ద్వారా ఉపశమనం కలిగింది.

అమెరికన్ మార్కెట్లో సులభంగా లభించని ప్రత్యేక పరికరాలు, ప్యాకింగ్ సామాగ్రి కోసం స్థానిక రైతులు కెనడాపైనే ఆధారపడాల్సి వస్తోందని, ఈ దిగుమతి సుంకాలు వారిపై పెను భారంగా మారుతున్నాయని సెనేటర్ సూసన్ కాలిన్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆమె చేసిన ఈ విన్నపం ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చి ఈ మినహాయింపులు ప్రకటించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కోకో పౌడర్, వినైల్ ఫ్లోరింగ్, షాంపూ, కేనావులు, చెక్కతో చేసిన శవపేటికలు, కార్పెట్లు వంటి ఇతర కెనడియన్ ఎగుమతులపై మాత్రం కొత్త సుంకాలు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 30వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.

డోనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన నాటికి అమెరికా-కెనడా మధ్య వాణిజ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. కెనడా వైపు నుంచి అమెరికాలోకి ఫెంటానిల్ రవాణా అవుతోందని ఆరోపిస్తూ ట్రంప్ ఈ సుంకాల యుద్ధానికి తెరలేపారు. అంతేకాకుండా కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా అభివర్ణించడం, రక్షణ నిబంధనలను ఉపసంహరించుకుంటామంటూ ఆయన చేసిన హెచ్చరికలు కెనడియన్లలో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి.

ఇదీ చదవండి: భారత్‌లో అస్థిరతకు కుట్ర?.. ఎవరీ నెవిల్ రాయ్ సింఘమ్?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement