breaking news
tariffs
-
‘రష్యా చమురు కొంటే సుంకాలు’..‘జీ 7’పై అమెరికా ఒత్తిడి
న్యూఢిల్లీ: రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలను తప్పనిసరిగా విధించాలని యునైటెడ్ స్టేట్స్ తాజాగా గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) భాగస్వాములను కోరింది. భారత్, చైనాలు ఉక్రెయిన్‌లో.. మాస్కో యుద్ధ ప్రయత్నాలకు కీలక సహాయకులుగా అమెరికా ఆరోపించింది. శుక్రవారం జీ7 ఆర్థిక మంత్రులతో జరిగిన ఫోను సంభాషణలో యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్, వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్లు వాషింగ్టన్ సుంకాల నిర్ణయాలకు అనుగుణంగా మెలగాలని మిత్రదేశాలను ఒత్తిడి చేశారు. రష్యా ఇంధన ఆదాయాలను తగ్గించడమనే ఏకీకృత విధానం ద్వారా మాత్రమే యుద్ధానికి ముగింపు పలకగలమని వారు పేర్కొన్నారు.రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ యంత్రాంగానికి నిధులు సమకూర్చే ఆదాయాలను మూలం నుంచే తగ్గించే ఏకీకృత ప్రయత్నంలో భాగంగానే మేము ఆయా దేశాలపై ఆర్థిక ఒత్తిడిని తెస్తున్నామన్నారు. ఈ సందర్బంగా బెసెంట్, గ్రీర్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్-ఫిలిప్ షాంపైన్ అధ్యక్షతన జరిగిన ఈ వర్చువల్ చర్చలు.. ఉక్రెయిన్ రక్షణకు మద్దతుగా నిలుస్తూ, రష్యన్ ఆస్తులను దెబ్బతీసే అవకాశంపై దృష్టి సారించాయి. జీ 7లోని భాగస్వామ్యమైన ఉక్రెయిన్ దీర్ఘకాలిక ఆర్థిక పునరుద్ధరణను కాపాడుతూ, మాస్కోపై ఒత్తిడిని కఠినతరం చేయడంలో సభ్య దేశాలు ఐక్యంగా ఉండాలని వారు స్పష్టం చేశారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే భారత దిగుమతులపై సుంకాలను అదనంగా 25 శాతం మేరకు పెంచారు. మాస్కోతో న్యూఢిల్లీ చమురు వాణిజ్యాన్ని అణిచివేసే ప్రయత్నంలో భాగంగా శిక్షాత్మక సుంకాలను 50 శాతానికి తీసుకువచ్చారు. ఈ చర్య అమెరికా-భారత్ సంబంధాలను, సంక్లిష్టమైన వాణిజ్య చర్చలను దెబ్బతీసింది. అయితే బీజింగ్‌తో సున్నితమైన వాణిజ్య సంధిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ ట్రంప్ చైనా దిగుమతులపై కొత్తగా సుంకాలను విధించలేదు. -
ట్రేడ్ వార్తో భారత్‌కు సవాళ్లు: మారిషస్ ప్రధాని
ప్రతీకార సుంకాలు, వాణిజ్య వివాదాలతో భారత్‌కు భారీ సవాళ్లు ఎదురవుతున్నట్లు మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులామ్ పేర్కొన్నారు. రక్షణాత్మక విధానాలు పెరిగిపోవడం, ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య ఉధృతమవుతున్న ఆందోళనలు, వాతావరణ సంబంధ విఘాతాలు పలురకాల రిస్కులకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు.విదేశీ వ్యవహారాల శాఖ, ఇతర పారిశ్రామిక సమాఖ్యలతో కలసి ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన మారిషన్ ఇండియా వ్యాపార సదస్సు(బిజినెస్ కాంక్లేవ్)లో నవీన్‌చంద్ర ప్రసంగించారు. సామాజిక, ఆర్థికాభివృద్ధిలో దీర్ఘకాలంగా మారిషస్‌కు భారత్ నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.అన్ని సమయాలలోనూ మారిషస్‌కు మద్దతివ్వడంలో ధృడంగా నిలుస్తున్నట్లు ప్రశంసించారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, విధానాలు అస్థిరంగా, అంచనాలకు అందని విధంగా మారినట్లు వ్యాఖ్యానించారు. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, అదుపుతప్పుతున్న రవాణా వ్యయాలు, వాతావరణ సంబంధ విఘాతాలు విభిన్న రిస్కులకు దారి చూపుతున్నట్లు వివరించారు. -
అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఇదిగో ఇంతే..
అమెరికా టారిఫ్‌ల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీపై నికరంగా పడే ప్రభావం 0.2–0.3 శాతం వరకు ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. అయితే జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశీ డిమాండ్‌ను పెంచడం ద్వారా ఈ ప్రభావాన్ని భర్తీ చేస్తాయని అభిప్రాయపడ్డారు.ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద అమెరికాకు చేసిన ఎగుమతుల్లో సగం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లోనే నమోదైనట్టు గుర్తు చేశారు.సుంకాలు స్వల్పకాలమే గానీ, దీర్ఘకాలం పాటు కొనసాగకపోవచ్చన్నారు. ఒకవేళ దీర్ఘకాలం పాటు కొనసాగితే అప్పుడు ద్వితీయ, తృతీయ అంచ ప్రభావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయంటూ.. పెట్టుబడులు, మూలధన వ్యయాలు, ఆర్థిక వ్యవస్థ సెంటిమెంట్‌పై దీని తాలూకూ అనిశ్చితి ఉంటుందని చెప్పారు.అయితే, జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశీయంగా బలమైన వినియోగ సృష్టి ద్వారా టారిఫ్‌ల తాలూకూ ద్వితీయ, తృతీయ అంచ ప్రభావాలను అధిగమించేందుకు సాయపడతాయన్నారు. కనుక మొత్తం మీద జీడీపీపై పడే ప్రభావం 0.3 శాతం మించి ఉండదన్నారు. 2025–26 సంవత్సరానికి 6.3–6.8% మధ్య జీడీపీ వృద్ధి నమోదు కావొచ్చన్న తమ అంచనాలను గుర్తు చేశారు.సాగులో సంస్కరణలు.. వ్యవసాయ రంగం జీడీపీకి మరో 0.5–0.70 శాతం వరకు తోడ్పాటునివ్వగలదని నాగేశ్వరన్ తెలిపారు. ఇందుకు గాను రైతులు వారు కోరుకున్న చోట విక్రయించే హక్కు అవసరమన్నారు. ప్రకృతి విపత్తులపై సాగు దిగుబడులు ఆధారపడి ఉన్నందున వారికి బీమా రూపంలోనూ దన్నుగా నిలవాలన్నారు. ప్రపంచ వాణిజ్యం విషయంలో అంతర్జాతీయ కరెన్సీగా ఉన్న డాలర్ స్థానాన్ని భర్తీ చేసే ఎలాంటి ప్రతిపాదన లేదని సీఈఏ అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు.అటువంటి చర్యలో భారత్ పాలుపంచుకోదని ఓ ప్రశ్నకు సమాధనంగా చెప్పారు. డాలర్‌కు మెరుగైన ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదంటూ.. ఇందుకు చాలా కాలం పట్టొచ్చన్నారు. గతేడాది జరిగిన బ్రిక్స్ సదస్సులో భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యానికి స్థానిక కరెన్సీల్లో చెల్లింపులకు, ప్రత్యేకంగా బ్రిక్స్ కరెన్సీ ఏర్పాటుకు అంగీకారం కుదరడం గమనార్హం. -
రొయ్యల ఎగుమతులకు టారిఫ్ ఎఫెక్ట్..
రొయ్యల ఎగుమతిదార్లపై అమెరికా టారిఫ్‌ల ప్రభావం భారీగానే ఉండనుంది. దీని వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) పరిశ్రమ ఆదాయం 12 శాతం క్షీణించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) ఒక నివేదికలో తెలిపింది. భారత ఫ్రోజెన్ రొయ్యలకు అమెరికా కీలక మార్కెట్‌గా ఉంటోంది. ఎగుమతుల పరిమాణంలో 41 శాతం, విలువపరంగా 48 శాతం వాటా అమెరికాదే ఉంటోంది. 50 శాతం ప్రతీకార సుంకాల (అదనంగా యాంటీ–డంపింగ్ డ్యూటీ మొదలైనవి కూడా కలిపితే 58 శాతం) వల్ల వాణిజ్యం గణనీయంగా దెబ్బతింటుందని నివేదిక పేర్కొంది. దీనితో ఈక్వెడార్, వియత్నాం, ఇండొనేషియాలాంటి దేశాలతో భారత్ పోటీపడలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఫలితంగా ఎగుమతుల పరిమాణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించింది.ప్రధాన రొయ్యల కంపెనీల ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ ప్రకారం 2025–26లో ఆదాయాలు 12 శాతం మేర, మార్జిన్లు సుమారు 150 బేసిస్ పాయింట్ల (దాదాపు ఒకటిన్నర శాతం) మేర తగ్గే అవకాశం ఉందని ఇండ్–రా తెలిపింది. నిర్వహణ మూలధనంపరంగా కూడా కొంత ఒత్తిడి నెలకొనవచ్చని వివరించింది. అధిక టారిఫ్‌లను అమెరికా కొనసాగిస్తే మధ్యకాలికంగా రొయ్యల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం తప్పదని పేర్కొంది. ఎగుమతుల పరిమాణం, మార్జిన్లపై ఒత్తిళ్ల వల్ల ఆర్థికంగా అంత పటిష్టంగా లేని మధ్య స్థాయి సంస్థల రుణపరపతి దెబ్బతినే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఇతర దేశాల వైపు చూపు ..భారతీయ రొయ్యల ప్రాసెసింగ్ సంస్థలు దేశీ మార్కెట్‌తో పాటు అమెరికాయేతర మార్కెట్లలోకి (చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, బ్రిటన్) కూడా మరింతగా విస్తరించే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు ఇండ్–రా అసోసియేట్ డైరెక్టర్ ఆదర్శ్ గుత్తా తెలిపారు. అయితే, ఈ ప్రాంతాల్లో అంతగా అధిక ధర లభించదని, పైగా పరిమిత స్థాయిలోనే ఎగుమతి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. వ్యూహాత్మక డైవర్సిఫికేషన్, ఉత్పత్తులకు మరింత విలువను జోడించడంపై పెట్టుబడులు పెట్టడం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంలాంటివి పోటీతత్వాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని నిలబెట్టుకునేందుకు కీలకంగా ఉంటాయని ఆదర్శ్ చెప్పారు.ఇదీ చదవండి: లంచం కేసు సెటిల్మెంట్ చేసుకున్న సంస్థ -
భారత ఐటీ సర్వీసులపై యూఎస్ ‘హైర్’ బిల్లు ప్రతిపాదన
భారతదేశం అందిస్తోన్న ఐటీ సేవల పరిశ్రమను దెబ్బ తీసేలా ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘హైర్’ బిల్లు అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ప్రతిపాదిత బిల్లుకు అమెరికాలోని ప్రముఖ కంపెనీల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో భారత సంస్థలు ఎలాంటి విధానాలు పాటించాలో ఐటీ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.హైర్ బిల్లుగ్లోబల్ అవుట్ సోర్సింగ్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఇండియా వంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని విదేశీ ఐటీ సర్వీసులపై 25% సుంకాన్ని హాల్ట్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ (HIRE) బిల్లు ప్రతిపాదించింది. ఇది శాసనపరంగా విఫలమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, రాజకీయ ఒత్తిడి మాత్రం పెరుగుతోంది. ముఖ్యంగా లారా లూమర్ వంటి వ్యక్తులు భారత కంపెనీలు అందించే కాల్ సెంటర్ సర్వీస్ ఉద్యోగాలను యూఎస్‌కు తిరిగి ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే భారత్ దిగమతులపై 50 శాతం సుంకాలు విధించిన అమెరికాకు తలొగ్గని కేంద్ర ప్రభుత్వంపై ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించేందుకు ఇది తోడ్పడుతుంది. అయితే ఈ ప్రతిపాదనను అమెరికా కంపెనీలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు అమల్లోకి వచ్చి భారత్ ఐటీ సర్వీసులపై ప్రభావం పడితే.. స్థానికంగా యూఎస్ తమ ఉద్యోగులకు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే భారత్‌లో అక్కడితో పోలిస్తే తక్కువ ఖర్చు అవుతుంది. దాంతో ఈ బిల్లుకు వ్యతిరేకత మొదలైంది.ఎక్కువగా ఆధారపడటం..హైర్ బిల్లు ప్రతిపాదనలో ఉన్న నేపథ్యంలో దేశీయ ఐటీ ఎగుమతులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్ నుంచి 60% ఐటీ సర్వీసులు ఉత్తర అమెరికాకు వెళ్తున్నాయి. అందులో టీసీఎస్- 48.2%, ఇన్ఫోసిస్- 57.9%, విప్రో- సుమారు 60% ఎగుమతులు యూఎస్‌కు చేస్తున్నాయి. అతిగా అమెరికాపై ఆధారపడటంతో భారతదేశ ఐటీ రంగాన్ని యూఎస్ విధాన మార్పుల ద్వారా ప్రభావితం చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి.చేయాల్సింది ఇదే..భారతదేశం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించాలి. యూరప్, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలో మరింత దూకుడుగా విస్తరించాలి. ఏఐ ఆధారిత వ్యవస్థలను నిర్వహించగల అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులపై దృష్టి పెట్టాలి. స్థానికంగా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి పెట్టాలి. వీటిని పెంచాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఐటీ సేవలకు డిమాండ్ నెలకొంటుండడంతో వీటిపై మరింత దృష్టి సారించాలి.ఇదీ చదవండి: పాత స్టాక్‌పై ఎంఆర్పీ మార్చవచ్చు: కేంద్రం -
సముద్ర మార్గంలో కార్గో తగ్గలేదు..
ట్యుటికోరిన్: భారతీయ ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్‌ల ప్రభావాలపై ఆందోళన నెలకొన్నప్పటికీ.. సముద్ర మార్గంలో సరుకు రవాణా తగ్గలేదని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. భారతీయ మారిటైమ్ రంగం అసాధారణ స్థాయిలో పురోగమిస్తోందని పేర్కొన్నారు.తమిళనాడులో వీవోసీ పోర్టులో గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభంతో పాటు ఇతరత్రా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఆగస్టు 27 నుంచి భారత ఎగుమతులపై సుంకాలను అమెరికా 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దీనితో ఎగుమతులపై ప్రభావం పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఏప్రిల్–జూలై మధ్యకాలంలో అమెరికాకు భారత ఎగుమతులు 22 శాతం పెరిగి 33.53 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 12 శాతం పెరిగి 17.41 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ వ్యవధిలో భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిల్చింది. -
డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!
'డొనాల్డ్ ట్రంప్' శుక్రవారం.. సుంకాల నుంచి గ్రాఫైట్, టంగ్స్టన్, యురేనియం, బంగారు కడ్డీలు, ఇతర లోహాలను మినహాయించాలని, సిలికాన్ ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త మార్పు సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికా అధికారుల సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడి ఉత్తర్వులో పేర్కొన్నారు.ఈ ప్రకటన తరువాత విమాన భాగాలు, జెనరిక్ ఔషధాలు, దేశీయంగా పండించలేని, తవ్వలేని లేదా సహజంగా ఉత్పత్తి చేయలేని కొన్ని ఉత్పత్తులు, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలు, కాఫీ వంటి వాటికి కూడా భవిష్యత్తులో సుంకాల నుంచి విముక్తి కలిగించే అవకాశం ఉంటుందని సమాచారం.కొన్ని రోజుల క్రితం యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ తీర్పు వ్యాపారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. బులియన్ దిగుమతి పన్నులకు లోబడి ఉంటుందని సూచించడం కొంత గందరగోళానికి గురిచేసింది. ఆ తరువాత బంగారు కడ్డీలను సుంకాల నుంచి మినహాయించాలనే ఆలోచన తెరమీదకు వచ్చింది.ఇదీ చదవండి: టిమ్.. యాపిల్ పెట్టుబడి ఎంత?: సీఈఓల మధ్య ట్రంప్ ప్రశ్నసుంకాలు మాత్రమే కాకుండా.. కొన్ని ఒప్పందాల విషయంలో కూడా ట్రంప్ సంచనలం సృష్టించారు. ఇవి దేశంలోని కీలకమైన మార్కెట్లకు అంతరాయం కలిగించవచ్చని, అమెరికాలో పండించలేని లేదా ఉత్పత్తి చేయలేని వస్తువుల ధరలను పెంచుతాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ట్రంప్.. అంతరిక్షం, కొన్ని ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంలో ఉపయోగించే కీలకమైన పదార్థాలతో సహా అనేక ఖనిజాలపై పరస్పర సుంకాలను ఎత్తివేయడం మొదలుపెట్టారు.సూడోఎఫెడ్రిన్, యాంటీబయాటిక్స్, ఇతర ఔషధాల వంటి ఫార్మాస్యూటికల్స్ వంటివన్నీ.. ఇప్పటికే వాణిజ్య శాఖ దర్యాప్తుకు లోబడి ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా సుంకాల నుంచి ఉపసమయం పొందుతున్నాయి. అయితే.. సిలికాన్ ఉత్పత్తులతో పాటు, రెసిన్, అల్యూమినియం హైడ్రాక్సైడ్లపై సుంకాలను విధిస్తున్నారు. -
‘చమురు కొనుగోళ్లు వెంటనే ఆపేయాలి’
రష్యా చమురు కొనుగోళ్లను తక్షణమే నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ నేతలను కోరారు. రష్యాతో ఇంధన వాణిజ్యాన్ని కొనసాగించడం ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని వాదించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆతిథ్యమిచ్చిన పారిస్ సదస్సు అనంతరం ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న మిత్రదేశాల కూటమి ‘కొలిషన్ ఆఫ్ ది విల్లింగ్’తో వీడియో కాల్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.భారత్‌పై సుంకాలు, యూరప్‌పై ఒత్తిడిట్రంప్ ప్రభుత్వం ఇటీవల భారత ఎగుమతులపై అదనంగా 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో సుంకాల భారం 50%కు రెట్టింపు అయింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకే ఈమేరకు సుంకాలు విధించినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో యూరప్ కూడా భారీగానే రష్యా చమురు దిగుమతి చేసుకుంటుందని ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆ దేశపు చమురు కొంటూ యూరోపియన్ దేశాలు నిధులు సమకూరుస్తున్నాయన్నారు.యూరప్ తీరుపై అసహనంయూరప్ ఓ వైపు యుద్ధం ఆపాలంటూ, మరో వైపు చమురు కొనుగోళ్ల రూపంలో రష్యాకు నిధులు సమకూర్చడం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో గత ఏడాది కాలంలో ఇంధన అమ్మకాల ద్వారా ఈయూ 1.1 బిలియన్ యూరోలను రష్యాకు ముట్టజెప్పిందని అంతర్గత డేటాను ట్రంప్ ఉదహరించారు. అయితే కొన్ని ఈయూ దేశాలు 2022లో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను, 2023 నాటికి శుద్ధి చేసిన ఇంధనాన్ని నిలిపివేయగా హంగేరి, స్లొవేకియా పరిమిత దిగుమతులను కొనసాగిస్తున్నాయి.ఇదీ చదవండి: వైట్‌హౌజ్‌లో టెక్ సీఈఓలకు ట్రంప్ విందు -
అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) అమెరికాతో ఇంకా చర్చలు జరుగుతున్నట్లు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. అలాగే చైనాతో కూడా సంబంధాలు తిరిగి సాధారణ స్థాయి దిశగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. సరిహద్దు సమస్యలు పరిష్కారమయ్యే కొద్దీ, సహజంగానే ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని పరిశ్రమల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, యూఏఈ, మారిషస్, బ్రిటన్, ఈఎఫ్‌టీఏతో (యూరప్‌లోని నాలుగు దేశాల కూటమి) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి చెప్పారు. భారత్ మా వెంటే...: బెసెంట్అగ్రరాజ్యం మన ఎగుమతులపై భారీగా సుంకాలు ప్రకటించిన నేపథ్యంలో అమెరికా–భారత్‌ల మధ్య మార్చి నుంచి ఇప్పటివరకు అయిదు విడతలు చర్చలు జరిగాయి. ఆరో విడత సంప్రదింపుల కోసం ఆగస్టు 25న అమెరికా బృందం భారత్ రావాల్సి ఉన్నప్పటికీ, ఆగస్టు 27 నుంచి సుంకాలను 50 శాతానికి పెంచేయడంతో, ఆ పర్యటన రద్దైంది. తదుపరి విడత చర్చలకు ఇంకా తేదీలు ఖరారు కాలేదు. మరోవైపు, ఏది ఏమైనప్పటికీ భారత్ తమ వెంటే ఉంటుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ధీమా వ్యక్తం చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ పాటించే విలువలు రష్యా కన్నా అమెరికా, చైనాకి చాలా దగ్గరగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. గొప్ప దేశాలైన భారత్, అమెరికా ఈ వివాదాన్ని (సుంకాలు) పరిష్కరించుకుంటాయని బెసెంట్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: టాటా క్యాపిటల్ రోడ్‌షోలు షురూ -
స్నేహబంధం బలోపేతం
బీజింగ్: అమెరికా విసిరిన టారిఫ్‌ల సవాళ్లతో ఇక్కట్లు ఎదురవుతున్న వేళ చైనా, రష్యా తమ చిరకాల స్నేహబంధాన్ని మరింత బలపరుచుకుంటు న్నాయి. చైనాలోని తియాంజిన్‌లో సోమవారం షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు జరిగిన మర్నాడే ఇరు దేశాలు మంగళవారం మరోసారి సమావేశమై ద్వైపాక్షిక చర్చలు చేపట్టాయి. పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. చర్చల కోసం రాజధాని బీజింగ్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సాదర స్వాగతం పలికారు.పుతిన్‌ను ‘చిరకాల మిత్రుని’గా అభివర్ణించారు. పుతిన్ సైతం తన ప్రసంగంలో జిన్‌పింగ్‌ను ప్రియ స్నేహితునిగా సంబోధించారు. ‘నాడు మేము కలిసే ఉన్నాం.. ఇప్పుడు కూడా కలిసే ఉంటాం’అని పుతిన్ చెప్పుకొచ్చారు. ఇరు దేశాధినేతల లాంఛన సమావేశం అనంతరం చైనా అధికార కేంద్ర స్థానమైన ఝోంగన్హాయ్లో ఇరుపక్షాల ఉన్నతాధికారుల మధ్య తేనీటి విందు భేటీ జరిగింది.రష్యా పర్యాటకులకు ఈ నెల నుంచి 30 రోజులపాటు వీసారహిత సదుపాయం కల్పించనున్నట్లు చైనా ప్రకటించింది. అలాగే చైనాకు మరో సహజవాయు పైప్‌లైన్‌ను నిర్మించేందుకు ఆ దేశంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు రష్యా ప్రభుత్వరంగ చమురు సంస్థ గాజ్ప్రోం సీఈఓ అలెక్సీ మిల్లర్ తెలిపారు. ప్రస్తుత పైప్‌లైన్ మార్గాల ద్వారా సహజవాయు సరఫరాను మరింత పెంచేందుకు కూడా ఒప్పందాలు చేసుకున్నాయి. -
Tariff Effect: ప్రతి దిగుమతి వస్తువుపై 10 నుంచి 20 శాతం అదనపు భారం
-
టారిఫ్‌ల ప్రభావం.. ఎదుర్కొనేందుకు పరిష్కారం
అమెరికా విధించిన 50% టారిఫ్‌ల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధ ఠాకూర్ తెలిపారు. ‘అధిక ఉపాధి కల్పిస్తున్న కొన్ని పరిశ్రమలు అమెరికాపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అలాంటి పరిశ్రమలపై ఎక్కువ ప్రభావం పడొచ్చు. ఈ ప్రభావం ఎంతన్నది ప్రభుత్వం మదిస్తోంది. తగిన పరిష్కారాల కోసం కృషి చేస్తోంది’ అని చెప్పారు. -
భారత్ మూడంచెల ప్లాన్..
భారతీయ ఎగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయానికి వ్యూహాత్మక ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టారిఫ్‌ల వల్ల కలిగే ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక ఉపశమనం కోసం దేశ ఎగుమతి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి మూడంచెల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తున్నందుకు భారత్‌పై అమెరికా తీసుకున్న ఈ టారిఫ్ చర్య 60 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, లెదర్, రసాయనాలు వంటి కార్మిక ఆధారిత రంగాలపై ప్రభావం చూపుతుంది. వీటిలో చాలా వరకు ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్) పరిధిలోకి రానివే ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.స్వల్పకాలిక చర్యలు..చాలా సంస్థలకు వడ్డీ రాయితీ పథకాలు అందించాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు పూచీకత్తు లేని రుణాలను సులభతరం చేయాలని యోచిస్తోంది. సెజ్ యూనిట్ల ఆర్డర్ వాల్యూమ్లను నిర్వహించడానికి, ఉద్యోగాలను రక్షించడంలో సహాయపడటానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బ్రాండింగ్, ప్యాకేజింగ్, వేర్‌హౌజింగ్, లాజిస్టిక్స్‌పై పట్టుసాధించేందుకు సాయం అందించాలని చూస్తోంది. టెక్స్టైల్స్, హస్తకళల్లో చిన్న ఎగుమతిదారులకు లిక్విడిటీ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా ఉంది. ఈ సమస్య పరిష్కరించేందుకు స్వల్పకాలిక చర్యలు కీలకం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.మీడియం స్ట్రాటజీరాబోయే 12-24 నెలల్లో అమెరికాకు చేసే ఎగుమతులను వైవిధ్య పరచాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను పొందేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఇప్పటికే చర్చలు వేగవంతం చేసింది. ఎగుమతి వ్యాపారాన్ని సులభతరం చేయడానికి పన్ను రిఫండ్లను క్రమబద్ధీకరించడం, ఖర్చులను తగ్గించేలా చర్యలు తీసుకుంటోంది. యూరప్, ఆఫ్రికా వంటి కొత్త భాగస్వామ్యాలను ఏర్పరుచుకోవడానికి ట్రేడ్ ఫెయిర్లను ఏర్పాటు చేస్తుంది.దీర్ఘకాలిక దృష్టిఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌ను ప్రారంభించింది. దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లను వైవిధ్య పరిచేందుకు చర్యలు తీసుకుంటుంది. సరళీకృత లాజిస్టిక్స్, కస్టమ్స్ క్లియరెన్స్, జీఎస్టీ రిఫండ్ విధానాలతో డిజిటల్ వాణిజ్యంలో ఎంఎస్ఎంఈలకు మరింత అవకాశాన్ని కల్పించాలని చూస్తుంది. భారతీయ ఎగుమతులకు గ్లోబల్ బ్రాండ్ విశ్వసనీయతను పెంచడానికి స్కిల్లింగ్, ఆర్ అండ్ డీ, క్వాలిటీ సర్టిఫికేషన్‌లో పెట్టుబడులు పెంచాలని చూస్తుంది.ఇదీ చదవండి: రూ.50 లక్షలు ఆదాయం ఉన్నా స్కూల్ ఫీజు భారం! -
ఏనుగుపై తొడగొట్టిన ఎలుక!
భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న దశ అనూహ్యంగా మొదలైంది. ఏనుగు కుంభస్థలంపై ఎలుక పిల్ల ఓ మొట్టికాయ వేసిందట! రెండు దేశాలను ఉద్దేశించి ఓ ఆర్థిక నిపుణుడు చేసిన వ్యాఖ్యానం ఇది. అయితే ఇందులో ఏనుగెవరు? ఎలుకెవరు? గత పాతికేళ్లుగా డాలర్ డ్రీమ్స్‌ను పలవరిస్తూ వస్తున్న మన మిడిల్ క్లాస్ కుటుంబ రావులు ఈ ప్రశ్నకు ఠకీమని సమాధానం చెప్పగలరు. అపారమైన ఆర్థిక – సైనిక బలం, అగ్రరాజ్య హోదా ఉన్న అమెరికా ఎలుకెట్లా అవుతుంది? లక్షల సంఖ్యలో మన వంశోద్ధారకుల్ని కూడా ఉద్ధరిస్తున్న అమెరికా దేశం ఏనుగు కాకుండా ఎలుకవుతుందా అనే సందేహం వారికి ఉంటుంది. మరి నూటా నలభై కోట్ల జనాభా, అందులో 90 కోట్ల మంది యువత ఉన్న భారత దేశాన్ని కూడా ఎలుకతో పోల్చడం సాధ్యంకాదు కదా!వాణిజ్య ట్యారిఫ్లను ఆయుధాలుగా మార్చుకొని కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలకు పాల్పడటం, తదనంతర ప్రపంచ పరిణామాల నేపథ్యంలో రిచర్డ్ ఓల్ఫ్ అనే అమెరికన్ ఆర్థికవేత్త చేసిన విశ్లేషణ సంచలనంగా మారింది. భారతదేశంపై ట్రంప్ చేసిన 50 శాతం సుంకాల ‘యుద్ధ ప్రకటన’పై ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఈ వ్యాఖ్యానాన్ని విస్తారమైన అర్థంలో చేశార నుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కలిగే దీని పర్యవసానాలను దృష్టిలో పెట్టుకొని ఏనుగుపై ఎలుక మొట్టికాయ వేసినట్టేనని అన్నారు. ప్రపంచ జనాభాలో నాలుగున్నర శాతం లేని దేశం 95 శాతం ప్రజలను ఆజ్ఞాపించాలని చూసే పెత్తందారీతనం బెడిసి కొడుతుందని ఆయన జోస్యం చెప్పారు.అమెరికా ట్యారిఫ్ కొరడా ప్రయోగం భారత్‌పై ప్రభావం చూపబోదని దాని అర్థం కాదు. తక్షణ ఫలితంగా భారత్ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. మొత్తం అంత ర్జాతీయ వాణిజ్యంలో 90 బిలియన్ డాలర్ల పైచిలుకు లోటును భారత్ ఎదుర్కొంటున్నది. ఈ లోటులో సింహభాగం చైనా వాణిజ్యంలోనే! ‘మేకిన్ ఇండియా’ సత్ఫలితాలిస్తే తప్ప ఈ లోటును అధిగమించడం సాధ్యం కాదు. ఒక్క అమెరికా వాణిజ్యంలోనే భారత్ మిగులు భాగస్వామిగా ఉంటున్నది. అమెరికాకు 87 బిలియన్ డాలర్ల సరుకుల్ని ఎగుమతి చేస్తున్న మన దేశం అక్కడి నుంచి 45 బిలియన్ డాలర్ల కిమ్మత్తు చేసే సరుకుల్ని దిగుమతి చేసుకుంటున్నది. 50 శాతం ట్యారిఫ్ ప్రభావం 70 శాతం వ్యాపారంపై పడుతుందని, ఫలితంగా వెనువెంటనే 20 బిలియన్ డాలర్ల మేరకు నష్టపోతామని ఎగుమతిదార్ల సంస్థలు చెబుతున్నాయి. వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. తిరుపూర్, నోయిడా, సూరత్ వంటి పట్టణాల్లో అప్పుడే ఉద్యోగాల కోత, ఫ్యాక్టరీల మూత మొదలైంది.అమెరికా కొరడా ఝుళిపిస్తుంటే భారత్ చేతులు ముడుచు కొని కూర్చుంటుందా? కూర్చోలేదు కూడా! ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకూ భారత నాయకత్వం పరిణతితో, ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించిందనే చెప్పాలి. భారత్ – పాక్‌ల మధ్య ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తతల సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. యుద్ధం మొదలుకావడం, రెండు రోజుల్లోనే పాక్‌ను భారత్ దారుణంగా దెబ్బతీయడం, ఆ వెనువెంటనే కాల్పుల విరమణ ప్రకటన రావడం జరిగింది. భారత్ – పాక్‌లు ప్రకటించకముందే తన వల్లనే యుద్ధం ఆగిపోయిందని ట్రంప్ ప్రకటించుకున్నారు. దీన్ని భారత్ అధికారికంగా ఖండించ లేదు. ట్రంప్‌కు మోదీ భయపడ్డారని, ఆయన ఆదేశించగానే కాల్పుల విరమణ అమలు చేశారనే ప్రచారం జరిగింది. చాలా మంది నమ్మారు. తదనంతర పరిణామాలను గమనిస్తే అప్పటి అభిప్రాయం కేవలం అపోహ మాత్రమే కావచ్చనిపిస్తున్నది. గతంలో విధించిన 25 శాతం ట్యారిఫ్‌కు అదనంగా మరో 25 శాతం విధించడానికి కారణం తాము ఆంక్షలు విధించిన రష్యా నుంచి భారీఎత్తున చమురు కొనుగోలు చేయడమేనని ఇప్పుడు అమెరికా చెబుతున్నది. అసలు కారణం అది కాదన్న సంగతి అందరికీ తెలుసు.అమెరికాలోని వ్యవసాయ, పాల ఉత్పత్తి రంగాలను చిరకాలంగా భారత మార్కెట్ ఊరిస్తున్నది. అవి భారత్‌లో ప్రవేశించగలిగితే ఇబ్బడిముబ్బడిగా అమెరికా విత్తన కంపెనీలు, పాల ఉత్పత్తుల కంపెనీలు లాభాలు పోగేసుకోగలుగుతాయి. జన్యుమార్పిడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్నలను దిగు మతి చేసుకోవాలని అమెరికా భారత్‌ను డిమాండ్ చేస్తున్నది. వ్యవసాయ రంగాన్ని పరాధీనం చేయగలిగే జీఎమ్ పంటలను ఒక విధానంగా భారత ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. అట్లానే పాల ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని అమెరికా షరతు పెట్టింది. ఈ షరతు అంగీకరిస్తే దేశవాళీ పాడి పరిశ్రమ లక్ష కోట్లకు పైగా నష్టపోతుందని ఒక అంచనా. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న దేశం పాల ఉత్పత్తులను చౌక సుంకాలకు దిగుమతి చేసుకోవడం ఏమిటి? ఇప్పటికీ 40 శాతం మంది ప్రజలు వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆధారపడిన దేశం విషతుల్యమైన జీఎమ్ పంటలను దిగుమతి చేసుకో వలసిన అవసరమేమిటి? ట్రంప్ సర్కార్ కోరిన ఈ హిరణ్యాక్ష వరాలకు భారత్ తలాడించలేదు.ఆయన నోబెల్ బహుమతి పిచ్చికి భారత ప్రభుత్వం సహకరించలేదన్న దుగ్ధ కూడా అమెరికా అధ్యక్షుడిని వేధిస్తున్న దట! ట్రంప్ మధ్యవర్తిత్వం వల్లనే కాల్పుల విరమణకు ఒప్పు కున్నామని భారత్ ఒక మాట అధికారికంగా చెబితే తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందని ట్రంప్ ఆశ. భారత్ – పాక్ వ్యవహారాల్లో మూడో దేశం జోక్యాన్ని చాలాకాలంగా భారత్ అంగీరించడం లేదు. ఒక దేశాధినేత నోబెల్ పిచ్చిని తీర్చడం కోసం తన దేశ సార్వభౌమాధికారంతో రాజీపడడానికి భారత్ అంగీకరించలేదు. ఇటువంటి రాజీ పట్ల పాక్‌కు ఎటు వంటి అభ్యంతరమూ లేదు. ట్రంప్ కోరుకుంటున్న ప్రకటనను పాక్ మిలిటరీ చీఫ్ అసీఫ్ మునీర్ చేశారు. దాంతో మునీర్‌ను పొగడ్తల్లో ముంచడమే గాక ఆయన్ను వైట్‌హౌస్‌లో భోజనానికి ప్రత్యేకంగా ట్రంప్ ఆహ్వానించారు.ఏకధ్రువ ప్రపంచం నుండి బహుధ్రువ ప్రపంచం వైపు మానవాళి అడుగులు వేస్తున్న కీలకమైన మలుపులో భారతదేశం తన ప్రయోజనాల కోసం అనుసరించవలసిన విదేశీ విధానంపై కేంద్ర సర్కార్‌కు ఇప్పటికే ఒక స్పష్టత ఉన్నది. అంతర్జాతీయ సంబంధాల్లో సిద్ధాంతాల పాత్ర ప్రచ్ఛన్న యుద్ధంతోపాటే కరిగిపోయింది. భౌగోళిక రాజకీయ అవరోధాలున్న సందర్భా ల్లోనూ ఉభయతారకంగా నెగ్గుకురావడానికి అవసరమైన వ్యూహాలకు మన విదేశాంగ విధానం పెద్దపీట వేస్తున్నది. విదేశాంగ మంత్రిగా ఉన్న జైశంకర్ దీర్ఘకాలం పాటు దౌత్యవేత్తగా పనిచేశారు. ఆ అనుభవ సారాన్ని రంగరించి, ప్రభుత్వ ఆలోచనల్ని కూడా కలబోసి ‘ది ఇండియా వే’ (భారత్ మార్గం : అనిశ్చిత ప్రపంచంలో అనుసరణీయ వ్యూహాలు) అనే పుస్తకాన్ని రాశారు. మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో అనుసరించదగిన వ్యూహాలపై అందులో చర్చించారు. భారత విదేశాంగ విధానం ఇప్పుడీ తాజా పంథాలోనే కొనసాగు తున్నట్టు కనిపిస్తున్నది.ఇంకెంతోకాలం అగ్రరాజ్యంగా అమెరికా మనలేదని, డాలర్ పెత్తనానికి కూడా రోజులు దగ్గరపడినట్టేనని పలువురు ఆర్థిక నిపుణులు జోస్యం చెబుతున్నారు. ట్రంప్ చర్యలు ఈ పరిణామాన్ని వేగవంతం చేయగలవని అంచనా వేస్తున్నారు. అమెరికా నాయకత్వంలోని ‘జీ–7’ దేశాల పాశ్చాత్య కూటమిని ఆర్థిక రంగంలో ‘బ్రిక్స్’ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) ఇప్పటికే అధిగమించడాన్ని ఇందుకు రుజువుగా వారు చూపెడుతున్నారు. వచ్చే ఏడాది ‘బ్రిక్స్’ కూటమికి భారత్ నాయకత్వం వహించబోతున్నది. భౌగోళిక రాజకీయాలతోపాటు పలు అంశాలపై వైరుద్ధ్యాలున్న రెండు అతిపెద్ద దేశాలను (భారత్ – చైనా) వ్యూహాత్మక స్నేహం వైపు నడిపించిన ఘనత ట్రంప్‌దేనని అమెరికన్ నిపుణులే విమర్శి స్తున్నారు. ఇండో – పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తర ణను అడ్డుకోవడానికి అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా లతో కలిసి ఏర్పడిన ‘క్వాడ్’ కూటమి తాజా పరిణామాలతో నిర్వీర్యమైనట్టే! గల్వాన్ ఘర్షణ అనంతరం రెండు దేశాల మధ్యన ఏర్పడిన ఉద్రిక్తతలను ఉపశమింపజేయడానికి అవసరమైన కొన్ని చర్య లను రెండు దేశాలూ ఇప్పటికే తీసుకోవడం ఆరంభించాయి. మన విదేశాంగ మంత్రి జైశంకర్ జిన్‌పింగ్‌ను కలిశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఢిల్లీకి వచ్చి మంతనాలు జరి పారు. భారత యాత్రికుల కోసం మానస సరోవరం మార్గాన్ని చైనా తెరిచింది. చైనాకు విమానయానాలను భారత్ పునరు ద్ధరించింది. చైనాలోని తియాంజిన్‌లో ప్రారంభమైన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. శనివారం నాడాయనకు చైనాలో ఆత్మీయ స్వాగతం లభించింది. భారతదేశపు శాస్త్రీయ సంగీత నృత్యా లతో చైనా యువతీ యువకులు ఆయన్ను అలరించారు. అమె రికా పెత్తందారీతనానికి వ్యతిరేక వేదికను ఈ సదస్సు బలో పేతం చేసే అవకాశం ఉన్నది.ఆదివారం నాడు చైనా అధ్యక్షుడు షీ–జిన్‌పింగ్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ద్వైపాక్షిక సమస్యలు, సంబంధాలపై వారి మధ్య చర్చలు జరగవచ్చు. ఎస్సీఓ శిఖ రాగ్ర సభకు అమెరికా బద్ధ శత్రువైన రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా హాజరవు తున్నారు. ఈ నేతలతో కూడా మోదీ చర్చలు జరిపే అవకాశం ఉన్నది. రష్యాతో మనది చెక్కుచెదరని దశాబ్దాల స్నేహబంధం. ఇరాన్‌తో మనకున్న అనుబంధానికి శతాబ్దాల చరిత్ర ఉన్నది. ట్రంప్ ట్యారిఫ్ల నేపథ్యంలో భారత్ కొత్త మార్కెట్లకు విస్తరించడం కోసం అందివచ్చిన వేదికలన్నిటినీ ఉపయోగించుకుంటుంది. ఈ ప్రయాణంలో భారత్ వైఖరి వేగిర పడిన చందంగా కాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. ఎస్సీఓ సమావేశం ముగిసిన తర్వాత బుధవారం నాడు బీజింగ్‌లో మరో భారీ ర్యాలీని చైనా నిర్వహిస్తున్నది. రెండో ప్రపంచ యుద్ధంలో సామ్రాజ్యవాద శక్తులను (ముఖ్యంగా జపాన్ సామ్రాజ్యవాదం) ఓడించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చైనా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఎస్సీఓ సభకు హాజరయ్యే దేశాలన్నీ ఈ ర్యాలీకి హాజరవుతున్నా భారత్ మాత్రం జపాన్ పట్ల స్నేహభావంతో హాజరు కావడం లేదు. పైగా తియాంజిన్ సదస్సుకు ముందు రెండు రోజులపాటు ప్రధాని మోదీ జపాన్‌లో పర్యటించారు. రెండు దేశాల మధ్య టెక్నాలజీ రంగంలో పలు ఒప్పందాలు కుదిరాయి. జపాన్ కూడా భారత ప్రధానికి ఘనమైన స్వాగతాన్నే ఏర్పాటు చేసింది. జపనీయులు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ ఆయనకు ఆహ్వానం పలికి ఆకట్టుకున్నారు.ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి, ఒక అభివృద్ధి చెందిన దేశం హోదా వైపు అడుగులు వేయడానికి ఆచరణా త్మకమైన, వివేకవంతమైన విదేశాంగ విధానం ఒక్కటే సరి పోతుందా? దేశీయంగా అందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామా? అనే విషయాలను సమీక్షించుకోవలసిన సమయమిది. జీఎస్టీ శ్లాబుల కుదింపు, స్వదేశీ వాడకం ఉద్యమానికి ప్రధాని పిలుపు నివ్వడం ట్రంప్ ట్యారిఫ్ల నేపథ్యంలో తీసుకున్న చర్యలే కావచ్చు. వాటివల్లనే స్వదేశీ మార్కెట్ బలపడుతుందా? మన దేశ ప్రజల కొనుగోలు శక్తి బలంగా ఉంటే అమెరికా, ఐరోపా దేశాల ఉమ్మడి బలంతో సమానంగా ఉంటుంది. అటువంటి వ్యవస్థను సృష్టించుకోగలగడమే చైనా విజయ రహస్యంగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. చైనా ఆర్థికాభివృద్ధి పంథా ఒక హైబ్రిడ్ మోడల్. అది పూర్తిస్థాయి పెట్టుబడిదారీ విధానం కాదు. సోషలిస్టు విధానమూ కాదు. ప్రభుత్వ నియంత్రణకు లోబడిన పెట్టుబడి పూర్తి లాభాపేక్షతో కాకుండా సామాజిక వృద్ధికి కట్టుబడి ఉంటుంది. ఈ ఆర్థిక విధానం ఫలితంగా కోట్లాది మంది పేదరికం సంకెళ్ళను తెంచుకొని ఒక బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోగలిగారు. మనం మాత్రం సమాజంలో తీవ్ర అసమానతలకూ,పేదరికానికీ ఒక ముఖ్య కారణ మైన ప్రైవేటీకరణ బాట వెంటనే ఇంకా పరుగులు తీస్తున్నాము. ఈ బాట ఇంకెంతమాత్రమూ పేదరికాన్ని నిర్మూలించలేదనీ, అసమానతల్ని పోగొట్టలేదనీ ఇప్పటికే రుజువైంది. దేశీయంగా బలమైన మార్కెట్‌ను నిర్మించుకోగలిగినప్పుడే రాచవీధిలో పట్టపుటేనుగు నడిచినంత ఠీవిగా అంతర్జాతీయ సంబంధాల్లో నడవగలం. ఎలుకల మొట్టికాయలు అప్పుడు ఏమీ చేయలేవు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
SCO శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ
-
ఏనుగును ఎలుక ఢీకొడుతున్నట్టుగా ఉంది
వాషింగ్టన్: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌ను శిక్షించాలనే ప్రయత్నంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు ఆ దేశానికే ఎసరు తెస్తున్నాయి. భారత్ పట్ల అమెరికా వైఖరిపై ట్రంప్ ప్రభుత్వం సొంత ఆర్థిక వేత్తలనుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. భారత్‌పై అమెరికా సుంకాల చర్యలు ఏనుగును ఎలుక పిడికిలితో ఢీకొట్టినట్టుగా ఉందని అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వ్యక్తిలా అమెరికా వ్యవహరిస్తోందని, కానీ తనను తానే దహించుకుంటోందని విచారం వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలు బ్రిక్స్ కూటమిని పోషిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. బ్రిక్స్‌ను విజయవంతమైన ఆర్థిక ప్రత్యామ్నాయంగా అమెరికా అభివృద్ధి చేస్తోందని గుర్తు చేశారు. కాగా, భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై రష్యా టుడేకు ఇచి్చన ఇంటర్వ్యూలో వోల్ఫ్ మాట్లాడారు. బ్రిక్స్ దేశాలను బలోపేతం చేస్తోంది.. ‘భూమిపై అతిపెద్ద దేశం భారత్. సోవియట్ యూనియన్ కాలం నుంచే అమెరికాతో భారత్‌కు బలమైన సంబంధాలున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ మర్చిపోతున్నారు. భారత్‌కు అమెరికా మార్కెట్ గేట్లు మూసేస్తే.. ఆ దేశం తన ఎగుమతులను విక్రయించడానికి ఇతర దేశాలను వెదుక్కుంటుంది. చమురును అమ్ముకునేందుకు రష్యా ఇతరత్రా మార్కెట్లను సిద్ధం చేసుకున్నట్లే.. భారత్ కూడా ఇతరత్రా మార్కెట్లను తయారు చేసుకోగలదు. ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ కూటమిలోని చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాల వాటా 35 శాతం దాకా ఉంది. జీ7 దేశాల జీడీపీ వాటా 28 శాతమే. ఈ నేపథ్యంలో అమెరికా చర్యలు బ్రిక్స్ దేశాలను బలోపేతం చేస్తాయి. పశ్చిమ దేశాలకు ఆర్థిక ప్రత్యామ్నాయంగా మారుస్తాయి’అని వోల్ఫ్ వ్యాఖ్యానించారు. అమెరికా దిగుమతిదారులకూ ప్రమాదం.. ‘ప్రస్తుతం భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో వస్తువులు, సేవలను చౌకగా పొందుతున్న కంపెనీలు అమెరికాకు తరలే అవకాశమే లేదు. అందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించవు. ఇప్పటికే అమెరికాలో కొత్త ఉద్యోగాలు లేవు. సుంకాల వల్ల అమెరికన్ ఎగుమతిదారులూ రిస్‌్కను ఎదుర్కొంటున్నారు. వాళ్లు విదేశీ మార్కెట్లను కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాకు ట్రిలియన్ డాలర్ల అప్పులున్నాయి. విదేశీ అప్పులపై అమెరికా ఇంకా ఎంతకాలం నిలువగలదనేది పెద్ద ప్రశ్న. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికా అప్పులపై వడ్డీల భారం పెరిగిపోతుంది. తద్వారా అమెరికా బలహీనపడుతుంది’అని వోల్ఫ్ విశ్లేషించారు. బ్రిక్స్ దేశాలకు బెదిరింపులు.. బ్రిక్స్ పది దేశాలతో కూడిన సమూహం. ఇందులో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్యుదేశాలుగా ఉన్నాయి. ఈ కూటమి పాశ్చాత్య ఆర్థిక ఆధిపత్యాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. అయితే.. ట్రంప్ అనేక సందర్భాల్లో బ్రిక్స్‌ను వేగంగా అంతరించిపోతున్న ఒక చిన్న సమూహంగా తోసిపుచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఫిబ్రవరిలో ఏకంగా బ్రిక్స్ చచి్చపోయిందన్నారు. డాలర్‌ను కాదని ఉమ్మడి కరెన్సీని సృష్టించడానికి ప్రయతి్నస్తే.. సభ్య దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని బెదిరించారు. -
కనెక్ట్.. యూకే
భారత్‌పై అమెరికా అనూహ్యమైన సుంకాలు విధిస్తోంది. ఇప్పటికే కొన్ని అమల్లోకి వచ్చాయి. మరి ప్రత్యామ్నాయం? అమెరికాతో దౌత్యపరమైన చర్చలు కొనసాగిస్తూనే.. భారత్ కొత్త మార్కెట్లను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల యూకేతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) ఒక మైలురాయిగా చెప్పాలి. ఎందుకంటే భారత్ నుంచి ఈ దేశానికి జరుగుతున్న ఎగుమతుల్లో 99 శాతం ఎఫ్‌టీఏ పరిధిలోకి రాబోతున్నాయి. బ్రిటన్ నుంచి వస్తున్న దిగుమతుల్లో 94 శాతాన్ని ఎఫ్టీఏలోకి తెస్తామని భారత్ హామీ ఇచ్చింది. మరి ఈ ఎఫ్టీఏతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఏమైనా లాభం ఉంటుందా? ఏయే రంగాలకు లాభం? యూకే నుంచి ఏ రంగాల్లోకి పెట్టుబడులొచ్చే అవకాశం ఉంది? వాటన్నిటిపై యూకే డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్‌తో ‘సాక్షి’ ప్రతినిధి మంథా రమణమూర్తి ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...ఎఫ్టీఏతో తెలుగు రాష్ట్రాలకు లాభమేంటి? యూకేతో విద్య, వ్యాపార, సాంస్కృతిక సంబంధాల్లో పెరుగుతున్న సానుకూలతను మూడేళ్లుగా చూస్తున్నా. ఈ దేశాల ప్రధానులు ఇటీవలే కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఈ పరిధి రక్షణ, టెక్నాలజీ, విద్య, వాతావరణ మార్పులన్నిటికీ విస్తరించనుంది. టెక్నాలజీ, ఫార్మా రంగంలో గట్టి పునాదులున్న హైదరాబాద్‌కు ఎఫ్టీఏతో చాలా లాభాలుంటాయి. ఏపీలో కొన్నేళ్లుగా పోర్టులు అభివృద్ధి చేస్తున్నారు. లాజిస్టిక్స్, వ్యవసాయ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ ఎప్పట్నుంచో ఐటీ, ఫార్మా రంగాల్లో అగ్రగామిగా ఉంది కదా. మరి ఎఫ్టీఏతో కొత్తగా ఏం జరుగుతుంది? నిజమే. రాష్ట్రాన్ని బట్టి అవకాశాలు మారుతాయి. ఏపీ విషయానికొస్తే ఎగుమతులపై దృష్టి పెట్టాలి. ఈ మధ్యే నేను విశాఖలో సీఐఐ సదస్సుకు వెళ్లా. సీఫుడ్, టెక్స్టైల్స్, కాఫీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని పెంచడంపై చర్చించాం. ఎఫ్టీఏతో టారిఫ్‌లు తగ్గుతాయి. సర్టిఫికేషన్ ప్రక్రియ తేలికవుతుంది. దీనివల్ల ఏపీ ఉత్పత్తులు యూకే మార్కెట్లోకి ప్రవేశించడం సులువవుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ కీలకంగా మారనుంది. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించాల్సి ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే కంపెనీలకు ఎఫ్‌టీఏ బాసటగా నిలుస్తుంది. ఇది ఏపీ వ్యవసాయ ఎకానమీని మారుస్తుంది. తెలంగాణ విషయానికొస్తే ఎఫ్‌టీఏ వల్ల సర్టిఫికేషన్ ప్రాసెస్ సులువవుతుంది. టారిఫ్‌లు తగ్గుతాయి. ఇది ఫార్మా, టెక్నాలజీ రంగాలకు కీలకం. టెక్నాలజీ నిపుణుల రాకపోకలు తేలికవుతాయి. ఈ ఒప్పందం దీర్ఘకాలంలో తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించొచ్చు? దీర్ఘకాలంలో ప్రత్యేకించి ఫార్మా, టెక్నాలజీ రంగాల్లో వాణిజ్య పరిమాణం పెరుగుతుంది. యూకే ఫార్మా మార్కెట్ ప్రస్తుతం 30 బిలియన్ డాలర్లు. కానీ అందులో భారత్ వాటా 3 శాతమే. దీన్ని పెంచే అవకాశం తెలంగాణకు ఎక్కువ. ఒప్పందం వల్ల ఆర్ అండ్ డీతోపాటు ఏఐ వంటి కొత్త రంగాల్లో భాగస్వామ్యాలు ఏర్పడతాయి. ఏపీకి సంబంధించినంత వరకూ ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులదే అగ్రస్థానమవుతుంది. నిపుణుల రాకపోకలకు నిబంధనలు సడలిస్తున్నారా? అవును. స్వల్ప కాలానికి సంబంధించి ప్రత్యేకంగా కంపెనీల మధ్య రాకపోకలు తేలికవుతాయి. ఎందుకంటే ఇరుదేశాల్లోనూ సోషల్ సెక్యూరిటీ చెల్లించాలనే నిబంధనను ఉండదు. కంపెనీలకిది చాలా పెద్ద ఊరట. యూకే నిపుణుల్ని ఇక్కడికి రప్పించాలన్నా, ఇక్కడి వారిని అక్కడికి పంపాలన్నా ఆయా కంపెనీలకు ఖర్చు తగ్గుతుంది. కాబట్టి రాకపోకలు పెరుగుతాయి.మరి యూకే నుంచి చౌక ఉత్పత్తులొచ్చి ముంచేయకుండా ఇక్కడి వ్యాపారాలను ప్రత్యేకించి ఎంఎస్ఎంఈలను దెబ్బతీయకుండా ఒప్పందంలో తగిన జాగ్రత్తలుంటాయా?భారత్‌కే కాదు. యూకేకు కూడా ఎంఎస్ఎంఈ రంగమే వెన్నెముక. ఏ ఒప్పందంలోనైనా సున్నితమైన రంగాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా ఉంటాయి. డెయిరీ, చేనేత లాంటి రంగాలకు భద్రత ఉంటుంది. ఉదాహరణకు యూకే నుంచి డెయిరీ ఉత్పత్తులను తీసుకుంటే భారత్‌లో తయారుకాని స్పెషాలిటీ చీజ్ (పనీర్) వంటి వాటికే అనుమతి ఉంటుంది. చేనేతకు యూకే నుంచి పోటీ ఉండదు. ఎందుకంటే యూకేలో చేనేత లేదు. ఈ ఒప్పందంతో భారత చేనేతకు యూకే ఫ్యాషన్ మార్కెట్లో అవకాశాలు పెరుగుతాయి. మరి ఫుడ్ ప్రాసెసింగ్‌లో కొత్త టెక్నాలజీలు కావాలి కదా? యూకే కంపెనీలు అందిస్తాయా? కచ్చితంగా. యంత్రాలు, టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టడం తప్పనిసరి. ఇక్కడి కంపెనీలు ఇప్పటికే ఈ మార్గాలను అన్వేషిస్తున్నాయి. అలాంటి పెట్టుబడుల్ని ప్రోత్సహించే వేదికను ఎఫ్‌టీఏ అందిస్తుంది. దీనివల్ల భారత కంపెనీలు యూకేతోపాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. ఒప్పందం వల్ల ద్వైపాక్షిక వాణిజ్యం 25% పెరుగుతుందని యూకే అంచనా వేస్తోంది. వాటిలో తెలుగు రాష్ట్రాల వాటా ఎంత ఉండొచ్చు?రాష్ట్రాలవారీగా చెప్పడం కష్టం. కానీ బాగా లబ్ధి పొందే రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ఉంటాయి. ఉదాహరణకు ప్రస్తుతం భారత్ నుంచి యూకేకు ఎగుమతవుతున్న సీఫుడ్‌లో ఏపీ వాటా 2.25 శాతమే. ఎఫ్‌టీఏ వల్ల సర్టిఫికేషన్ ప్రక్రియ తేలికవుతుంది కనుక ఏపీకి విస్తృత అవకాశాలుంటాయి. నిజానికి ఎఫ్‌టీఏ వల్ల సుంకాలు తగ్గటమే కాదు. సరి్టఫికేషన్ కూడా తేలికవుతుంది. త్వరగా పాడైపోయే సీఫుడ్ లాంటి వాటికిది ఆక్సిజన్. అందుకే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) కూడా చాలా ఆశాభావంతో ఉంది.ఫుడ్ ప్రాసెసింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లున్నారు? ఇది కీలక రంగం. ఎందుకంటే భారత్ ప్రస్తుతం తన ఆహార దిగుబడిలో 10 శాతాన్నే ప్రాసెస్ చేస్తోంది. తగినన్ని పెట్టుబడులతో విలువను జోడిస్తే కాఫీ, సీఫుడ్తోపాటు పలు వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేయొచ్చు. యూకేతోపాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఏపీ ఇప్పటికే యూఎస్, చైనాకు ఎగుమతి చేస్తోంది. సర్టిఫికేషన్ ప్రక్రియను సరళం చేయడం ద్వారా యూకే మార్కెట్‌ను వేగంగా అందుకోవచ్చు.సంప్రదాయేతర ఇంధనాలు, ఏరోస్పేస్, హైదరాబాద్ స్టార్టప్‌లలోకి ఎక్కువ పెట్టుబడులొస్తాయా? గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుతోపాటు ఏరోస్పేస్, ఇంజనీరింగ్ రంగాల్లో భాగస్వామ్యాలను ఇప్పటికే చాలా యూకే కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ఎఫ్టీఏతో భాగస్వామ్యాలు పెరుగుతాయి. యూకే ఎక్స్పోర్ట్ ఫైనాన్స్ అనేది యూకే–ఇండియా ప్రాజెక్టులకు మద్దతిచ్చే ప్రధాన వనరుగా ఉంటుంది. మరి కార్మికులు, పర్యావరణం, ప్రజారోగ్యానికి సంబంధించి ప్రతికూలతలేమైనా ఉంటాయా? ఈ ఒప్పందంలో అవినీతి నిరోధక, వినియోగదారుల రక్షణ, పర్యావరణం, లింగబేధంపై ప్రత్యేక చాప్టర్లున్నాయి. వాటన్నిటినీ చేర్చి భారత్ చేసుకున్న తొలి ఎఫ్‌టీఏ ఇది. కార్మికుల్ని, పర్యారణాన్ని పణంగాపెట్టి వాణిజ్య విస్తరణ జరగదనడానికి ఇదే నిదర్శనం. మరి ఈ ఒప్పందంతో రానున్న అవకాశాలపై చిన్నచిన్న వ్యాపారవేత్తలకు అవగాహన ఎలా? భారత ఎగుమతిదారులకు బాసటగా డీజీఎఫ్టీతోపాటు సీఐఐ, ఎఫ్‌టీసీసీఐ, కామర్స్ చాంబర్ వంటి పారిశ్రామిక సమాఖ్యలు సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఇరుదేశాల వ్యాపార బృందాలు అవకాశాలపై అవగాహన కల్పిస్తాయి. ఇది పూర్తిగా అమల్లోకి రావడానికి ఒక ఏడాది పడుతుంది. -
టారిఫ్‌లతో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు
భారత ఎగుమతులపై అమెరికా టారిఫ్‌ల కారణంగా తక్షణం పడే ప్రభావం పరిమితంగానే ఉన్నప్పటికీ.. వీటి తాలూకూ ప్రభావాలు భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. వీటిని తప్పకుండా పరిష్కరించాల్సి ఉందని పేర్కొంది. ఈ సమస్యల పరిష్కారానికి భారత్–యూఎస్ మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు కీలకమని తన నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదికలో పేర్కొంది. అమెరికా 50 శాతం టారిఫ్‌లు 48 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం చూపించనున్నట్టు అంచనా. అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా ఎగుమతుల్లో వైవిధ్యంపై దృష్టి సారించినట్టు ఆర్థిక శాఖ తెలిపింది.ఇటీవలే యూకే, ఈఎఫ్టీతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్ఏటీ)పై చర్చలను ముగించినట్టు, యూఎస్, ఈయూ, న్యూజిలాండ్, చిలీ, పెరూతో చర్చలు కొనసాగుతున్నట్టు పేర్కొంది. ‘ఈ చర్యల ఫలితాలు కనిపించేందుకు కొంత సమయం పడుతుంది. అధిక టారిఫ్‌ల కారణంగా అమెరికాకు తగ్గే ఎగుమతులను ఇవి పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవచ్చు’ అని ఆర్థిక శాఖ నివేదిక వివరించింది. బలమైన ఆర్థిక పనితీరు, విధానపరమైన స్థిరత్వం, మౌలిక సదుపాయాలపై అధిక పెట్టుబడులు, భారత సావరీన్ రేటింగ్‌ను బీబీబీ మైనస్ నుంచి బీబీబీకి ఎస్అండ్పీ అప్‌గ్రేడ్ చేయడాన్ని సానుకూలంగా పేర్కొంది. దీనివల్ల రుణ వ్యయాలు తగ్గుతాయని, విదేశీ పెట్టుబడులు మరిన్ని ఆకర్షించొచ్చని అభిప్రాయపడింది. దేశీయంగా సాధారణం కంటే అధిక వర్షపాతం, ఖరీఫ్ సాగు మెరుగ్గా ఉండడం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని సమీప కాలంలో నియంత్రణలోనే ఉంచుతాయని అంచనా వేసింది. జీఎస్టీ సంస్కరణలు, పన్నుల తగ్గింపు వంటివి వినియోగాన్ని పెంచుతాయని, వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందని పేర్కొంది.జీడీపీపై అర శాతం ప్రభావంఅమెరికా టారిఫ్‌ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం స్వల్పమేనని వాణిజ్య శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై అభిప్రాయపడ్డారు. ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను గుర్తించలేకపోతే అప్పుడు జీడీపీ వృద్ధి రేటుపై 0.50 శాతం మేర ప్రభావం ఉంటుందన్నారు. ఫలితంగా టెక్స్టైల్స్, రత్నాభరణాలు, సముద్ర ఆహార ఉత్పత్తులు, కెమికల్స్ రంగాలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చన్నారు. రష్యా చమురును యూరప్ దేశాలు, చైనా దిగుమతి చేసుకుంటున్నప్పటికీ భారత్‌పైనే అధిక టారిఫ్‌లు విధించడం వివక్ష చూపించడమేనన్నారు. ప్రభుత్వం ఈ ప్రభావాన్ని పరిమితం చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమస్యలను గట్టెక్కి, కొత్త మార్కెట్లలో అవకాశాలను సొంతం చేసుకునే దిశగా దేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలన్నారు.ఇదీ చదవండి: వైద్య రంగంలో కృత్రిమ మేధ విస్తరణ -
రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్!
కొనుగోలు శక్తి రీత్యా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించే వీలున్నట్లు ఈవై నివేదిక అంచనా వేసింది. వెరసి 2038కల్లా దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 34.2 లక్షల కోట్ల డాలర్లకు చేరనున్నట్లు ఎకానమీ వాచ్ పేరుతో ఆగస్టు నెలకు విడుదల చేసిన నివేదికలో అభిప్రాయపడింది. ఈ బాటలో 2030కల్లా దేశ జీడీపీ 20.7 ట్రిలియన్ డాలర్లను తాకనున్నట్లు పేర్కొంది. తగిన చర్యలు చేపట్టడం ద్వారా ఎంపిక చేసిన దిగుమతులపై యూఎస్ విధించిన అధిక టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించుకోగలదని తెలియజేసింది.ఇదీ చదవండి: నెట్వర్క్ విస్తరణలో అమెజాన్వాస్తవిక జీడీపీ వృద్ధిపై 0.1 శాతానికి పరిమితం చేసుకోగలదని వివరించింది. ప్రపంచంలోని 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్ అత్యంత శక్తివంతంగా మారుతున్నట్లు పేర్కొంది. పటిష్ట ఆర్థిక మూలాలు, గరిష్ట పొదుపు, పెట్టుబడుల రేటు, సానుకూల జనాభా, ద్రవ్య పరిస్థితుల్లో నిలకడ వంటి అంశాలు ఇందుకు తోడ్పాటునివ్వనున్నట్లు వివరించింది. టారిఫ్ ఒత్తిళ్లు, వాణిజ్య మందగమనం వంటి అంతర్జాతీయ అనిశ్చితులున్నప్పటికీ దేశీ డిమాండ్, ఆధునిక టెక్నాలజీలలో సామర్థ్యాల పెంపు తదితరాలు మద్దతివ్వనున్నట్లు తెలియజేసింది. -
సుంకాలపై ‘సమష్టి’ పోరు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. మన దేశంపై ఉన్న అదనపు సుంకాల భారాన్ని 50 శాతానికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకాలకూ బుధ వారం నుంచి మరో 25 శాతం చేరింది. క్షణానికో రకంగా, రోజుకో విధంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటంలో సిద్ధహస్తుడైన ట్రంప్ చివరికి ఏం చేస్తారోనన్న ఉత్కంఠ అందరిలో ఉండేది. మూర్ఖత్వం విచక్షణను ఎరుగదు. తన ఆదేశాలను ధిక్క రిస్తూ రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయటం వల్లే ఈ చర్య తీసుకున్నట్టు అమెరికా చెప్పుకొంటోంది. మనల్ని మించి ముడిచమురు కొంటున్న చైనాకు ఆ తర్కం ఎందుకు వర్తించదో ఇంతవరకూ అది సంజాయిషీ ఇవ్వలేకపోయింది. అసలు రష్యా– ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే శక్తి అమెరికాకు తప్ప మరెవరికీ లేదు. ఎందుకంటే తెరవెనకుండి యూరప్ దేశాల ద్వారా ఉక్రెయిన్ను రష్యాపై ఉసిగొల్పిందీ, ఆ యుద్ధానికి అంకు రార్పణ చేసిందీ తానే. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించటం ద్వారా... లేక ఇక వెనక్కు తగ్గాలని ఉక్రెయిన్ను కోరటం ద్వారా శాంతికి దోహదపడాల్సింది కూడా తానే. కానీ ఆ పని చేయకపోగా ఆ యుద్ధం కొనసాగటానికి మనమే బాధ్యులమంటూ దబాయిస్తోంది. దాన్ని ‘మోదీ యుద్ధం’గా అభివర్ణిస్తూ వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో నోరు పారేసుకున్నారు. మనం చమురు కొనటం వల్లే రష్యా యుద్ధం కొనసాగుతోందని తప్పుడు భాష్యానికి దిగారు. ఏ రకంగా చూసినా ప్రపంచంలో సకల అవలక్షణాలకూ బాధ్యత వహించక తప్పని అమెరికాయే రష్యా– ఉక్రెయిన్ యుద్ధానికి కూడా కర్త, కర్మ, క్రియ. ఏకకాలంలో భిన్న సూచనల్ని పంపి అవతలి పక్షాన్ని గందరగోళపరచటం అమెరికాకు అలవాటైన విద్య. ఈ దబాయింపులకు ముందురోజే ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ‘చివరకు రెండు దేశాలూ ఒక్కటవుతాయి’ అని మాట్లాడారు. అందరికన్నా ముందు ఏప్రిల్‌లోనే వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు మొదలెట్టిన భారత్... మే 1 లేదా జూన్ 1 కల్లా దానిపై సంతకాలు చేయాల్సిందని ఆయన చెబుతున్నారు. చర్చించు కుని ఒప్పందంపై సంతకాలు చేస్తారు తప్ప, తమకు నచ్చినట్టు రాసుకుని, ఒప్పందం పూర్తయినట్టేనని చెబితే అంగీకరించేదెవరు? ఇలాంటివి మాఫియా సామ్రాజ్యాల్లో చెల్లుబాటవుతాయి. నాగరిక ప్రపంచంలో సాధ్యపడదు. భారత్–అమెరికా సంబంధాలు ఆదినుంచీ సంక్లిష్టమైనవే. ఇందుకు అమెరికా తనను తానే నిందించుకోవాలి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాకిస్తాన్‌కు సాయపడుతూ, మనల్ని చీకాకు పరిచేందుకు నిరంతరం ప్రయత్నించేది. ఆ దశ దాటి ఇరు దేశాల మధ్యా స్నేహం చిగురించి, దృఢమైన బంధంగా మారి దశాబ్దాలు దాటుతోంది. కానీ పాకిస్తాన్‌ను దువ్వటం ఆపలేదు. ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడల్లా మన దేశం డిమాండ్ చేస్తే తాత్కాలికంగా ఆర్థిక సాయం ఆపటం లేదా ఆయుధ సామగ్రి ఎగుమతి నిలిపినట్టు కనబడటం, ఆ తర్వాత పునరుద్ధరించటం అమెరికా దురలవాటు. మొన్నటికి మొన్న పెహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యపై ఒక్క మాట మాట్లాడటానికి నోరు పెగలని ట్రంప్, భారత్–పాక్ ఘర్షణల్ని ఆపానని స్వోత్కర్షకు పోవటం ఇప్పటికీ ఆపలేదు. సరిగదా పాక్ ఆర్మీ చీఫ్‌కు ఘన ంగా మర్యాదలు చేశారు. కెనడాలో జరిగిన జీ–7 శిఖరాగ్ర సదస్సు నుంచి రావాలన్న ఆహ్వానాన్ని మోదీ తిరస్కరించటం, తమ డెయిరీ ఉత్పత్తులనూ, జన్యుమార్పిడి ఆహార ఉత్పత్తులనూ అనుమతించాలన్న ఒత్తిడికి అంగీకరించకపోవటం ట్రంప్ కడుపుమంటకు కారణం. కానీ ముడిచమురు సాకు చెబుతున్నారు. భారత్‌లో 46 శాతం మంది సాగు రంగంపై ఆధారపడతారు. అమెరికాలో ఇది ఒక్క శాతమే. ఆ ఒక్కశాతం కోసం దేశ జనాభాలో సగంమంది ఆధారపడే రంగాన్ని ధ్వంసం చేయాలట! ఏమైతేనేం తాజా సుంకాల భారం మన దేశంనుంచి పోయే 66 శాతం ఎగుమతులపై తీవ్ర ప్రభావమే చూపగలదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందువల్ల ఈ ఏడాది, వచ్చే ఏడాది మన వృద్ధిపై 0.8 శాతం కోత పడవచ్చంటున్నారు. రత్నాభర ణాలు, దుస్తులు, వాహనాల విడిభాగాలు, స్టీల్, రొయ్యలు, తోలు ఉత్పత్తులు వగైరాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందనీ, ఈ రంగాల్లో అనిశ్చితి ఏర్పడుతుందనీ అంచనా. లక్షలాదిమంది కార్మికుల ఉద్యోగాలకు ముప్పు కలగవచ్చు కూడా. ఈ ఎగుమతుల్ని వేరే దేశాలకు మళ్లించగలిగితే నష్టాన్ని తగ్గించుకోగలం. అదృష్టవశాత్తూ మనది ఎగుమతుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదు. అందుకే దేశ ప్రజానీకమంతా ఒక్కటై పట్టుదలగా ఇక్కడి ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తే ఈ గండాన్ని గట్టెక్కడం కష్టం కాదు. -
భారత్‌కు పరీక్షా సమయం
భారత ప్రభుత్వం పలు దేశాలతో సంబంధాల అభివృద్ధికి శీఘ్రగతిన చేస్తున్న ప్రయత్నాలు, చూపుతున్న స్వతంత్ర ధోరణి అమెరికాతో తలెత్తిన సమస్యల వల్ల తాత్కాలికమా? లేక దీర్ఘ కాలంలో ‘బ్రిక్స్’ వేదికగా బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థే సరైన ప్రత్యామ్నాయమనే గుర్తింపు మౌలికమైన రీతిలో కలిగి నందువలనా? ఈ కీలకమైన ప్రశ్నపై స్పష్టత అవసరం. ఎన్నెన్ని లోపాలు ఉన్నా వర్ధమాన ప్రపంచంలోని అగ్ర దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచం ఆర్థికంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా కూడా ఒక చౌరస్తా వంటి పరిస్థితిలోకి వచ్చి చేరింది. ప్రపంచాన్ని అన్ని విధాలుగా కొన్ని శతాబ్దాల పాటు శాసించిన పాశ్చాత్య దేశాలు బలహీనపడు తుండటం ఒకవైపు కనిపిస్తున్నది. నెమ్మదిగా బలపడుతూ, స్వతంత్ర ధోరణిలో ముందుకు పోజూస్తున్న వర్ధమాన దేశాల ధోరణి మరో వైపు ఆవిష్కృతమవుతున్నది. అటువంటపుడు భారతదేశం ఎక్కడ నిలిచి ఏ పాత్ర వహించగలదన్నది చరిత్రాత్మక నిర్ణయం కానున్నది.తాత్కాలికమా? దీర్ఘ కాలికమా?భారతదేశం వివిధ కారణాల వల్ల గత పాతిక సంవత్సరాలుగా అమెరికన్ శిబిరానికి సన్నిహితంగా ఉంటూ వచ్చింది. ఇటీవలి కాలంలో బలహీనపడుతున్న అమెరికాకు తన పట్ల, ప్రపంచం పట్ల దృష్టి మారి గతం కన్నా భిన్నమైన విధానాలను రూపొందించుకుంటున్నది. ఈ కొత్త పరిస్థితి భారతదేశానికి ఒక పరీక్షగా మారిందన్నది గుర్తించవలసిన విషయం. అమెరికా విధానాలలోని మార్పుల వల్ల వాణిజ్య సుంకాల రూపంలో, వాణిజ్య ఒప్పందపు చర్చల రూపంలో, ఇతరత్రా కూడా ఎదురవుతున్న ఆర్థిక రంగ సమస్యలు కనిపిస్తున్నవే! ఇవి గాక, ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ప్రభావాలు భారతదేశంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉండ బోతున్నాయి. ఉదాహరణకు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ), ఐసీజే, ఐసీసీ, యూఎన్ఓ, డబ్ల్యూహెచ్ఓ, యునిసెఫ్ మొదలైన సంస్థలను బలహీనపరచటమో, వాటి నుంచి ఉపసంహరించుకోవ టమో అమెరికాకు నిత్యకృత్యంగా మారింది. అటువంటపుడు ప్రభుత్వం అమెరికాతో ఏర్పడిన సమస్యలు తాత్కాలికమని, క్రమంగా వెనుకటి స్థితి ఏర్పడగలదనే అవగాహ నతో ముందుకు పోతుందా అన్నది ఒక ప్రశ్న. దీని అర్థం అమెరికాతో మైత్రికి బదులు వైరం ఏర్పడాలని ఎంతమాత్రమూ కాదు. కానీ, తగిన స్పృహ, జాగ్రత్తలు లేని మైత్రికీ, అవి ఉండే మైత్రికీ తేడా ఉంటుంది. అదే సమయంలో రెండు దేశాల మధ్య ఇటీవల తలెత్తిన సమస్యలు పరిష్కారం కావటం అవసరం. అందువల్ల కలిగే మేలు చాలానే ఉంటుంది. అందులో వ్యూహాత్మకమైనవి, దేశ రక్షణకు సంబంధించినవి కూడా ఉంటాయి. అయితే, స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రయోజనాల కోసం అమె రికా వైపు చూడవలసి రావటం ఎంత అవసరమో, దీర్ఘకాలిక దృష్టితో ‘బ్రిక్స్’ వంటి ప్రత్యామ్నాయాలు, బహుళ ధ్రువ ప్రపంచా లను లక్ష్యంగా పెట్టుకోవటం కూడా అంతే అవసరం. ఏక కాలంలో ఈ రెండింటితో ఎట్లా వ్యవహరిస్తారన్నది దౌత్యనీతిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి అటువంటి సంతులనం అవసరమని జైశంకర్ విదేశాంగ మంత్రి అయిన కొత్తలోనే ‘ది ఇండియా వే’ పుస్తకంలో సూచించారు. కానీ, అప్పటికన్నా పాశ్చాత్య ప్రపంచపు బలహీనతలు పెరిగాయి. ముఖ్యంగా ట్రంప్ విధానాలతో పరి స్థితులు గణనీయంగా మారుతున్నాయి. అందువల్ల, ప్రత్యామ్నా యాల వైపు లోగడకన్నా మరింత ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం ఏర్పడుతున్నది. బ్రిక్స్ కరెన్సీ అనకుండానే...పోతే, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కొన్నింటిని చూద్దాము. అవి – ట్రంప్ సుంకాలు, జిన్‌పింగ్‌తో జైశంకర్ సమా వేశం, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఢిల్లీకి రావడం, ఈ నెలాఖరున బీజింగ్‌లో జరిగే ‘షాంఘై సహకార సంస్థ’ శిఖరాగ్ర సమావేశానికి మోదీ వెళ్లనున్నట్లు ప్రకటన, ట్యారిఫ్‌లకు జంకబోమంటూ దేశ స్వావలంబనకు పిలుపునిచ్చి జీఎస్టీ స్లాబ్‌లను నాలుగు నుంచి రెండింటికి ప్రభుత్వం తగ్గించటం వంటివి. ఇవన్నీ జాబితా వలె రాసుకోవటం ఎందుకంటే, ఈ పరిణామాలు కొద్ది కాలంలోనే అమెరికా చర్యలకు స్పందనగా జరిగినటువంటివి. వాటన్నిటికి తగు ప్రాముఖ్యం ఉంది.వీటిమధ్య చాలా ముఖ్యమైనది ఒకటి జరిగింది. అది – అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి మారకపు చెల్లింపులకు సంబంధించిన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సడలించటం. ప్రైవేట్ కంపెనీలు ఇతర దేశాలతో జరిపే లావాదేవీలలో రూపాయి కరెన్సీ వినియో గానికి ప్రత్యేకంగా వోస్ట్రో అకౌంట్లు తెరవాలి. అందుకు స్థానిక బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి అవసరమయేది. ఆ నిబంధనను రిజర్వ్ బ్యాంక్ ఇపుడు ఎత్తివేసింది. అందువల్ల వాణిజ్యం సులభతరం అవుతుందనేది సరేసరి. కానీ, అంతకుమించిన విశేషం ఉంది. ఇంతకుముందు వలె డాలర్‌పై ఆధారపడనక్కర లేక పోవటం! డాలర్‌కు బదులు ‘బ్రిక్స్’ దేశాలు పరస్పరం గానీ, ఇతర దేశాలతో గానీ తమ సొంత కరెన్సీలలో చెల్లింపులు చేసుకోవాలని, ఆ విధంగా డాలర్ బలహీన పడుతుందన్నది ఆ సంస్థ తీర్మానం. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ‘బ్రిక్స్’ కరెన్సీ అనకుండానే వారు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఇండియా కూడా అటువంటి చెల్లింపులు కొన్ని చేస్తున్నా, డాలర్‌కు తాము వ్యతిరేకం కాదంటూ వచ్చింది. ధోరణి ఇదే విధంగా కొనసాగితే, కొందరు విమర్శకులు ఎత్తి చూపుతున్నట్లు బ్రెజిల్, చైనాల వలె భారత్ కూడా అమెరికాపై ఎదురు సుంకాలు విధించటం, డబ్ల్యూటీఓకు ఫిర్యాదు చేయటం వంటి చర్యలు తీసుకోగలదేమో చూడవలసి ఉంటుంది.వచ్చే సంవత్సరం ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకో నుంది. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం 2026లో ఢిల్లీలో జరిగి, ఆ సంస్థకు భారతదేశం అధ్యక్షత వహించనుంది. అందువల్ల ఈ దేశంపై ఎటువంటి బాధ్యతలు ఏర్పడతాయో ఊహించవచ్చు. ఇప్పటికే ఒక కొత్త ధోరణిలో ముందుకు వెళ్లవలసి వస్తున్న భారత ప్రభుత్వం ఆ మార్పును స్వల్పకాలికానికి పరిమితం చేయగలదా, లేక దీర్ఘకాలికం, మౌలికం చేయవచ్చునా అన్నది పెద్ద ప్రశ్న అవు తున్నది. ఈ పరిణామాలకు కొసమెరుపు 23వ తేదీ నాటి జైశంకర్ వ్యాఖ్యలు. తన జీవితంలో ట్రంప్ వంటి అధ్యక్షుడిని చూడలేదని, ఇండియా ఉత్పత్తులను వారికి కావాలంటే కొనవచ్చు, లేదా మాన వచ్చునని, మాకు వేరే మార్కెట్లు ఉన్నాయని అన్నారాయన. ఆత్మ విశ్వాసం కలిగి స్వతంత్రంగా వ్యవహరిస్తే ఇట్లాగే ఉంటుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అమెరికా టారిఫ్ బెదిరింపులకు లొంగకూడదు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల బెదిరింపులకు భారత్ తలొగ్గరాదని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ చెప్పారు. ఇలాంటి వాటికి ప్రజలంతా ఐక్యంగా ఎదురు నిలవాలని, దేశ గౌరవాన్ని కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. కంపెనీ 44వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా భార్గవ ఈ విషయాలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరమైన అంశాల్లో తొలిసారిగా టారిఫ్‌లను ప్రయోగించడం ద్వారా సంప్రదాయ విధానాలు, సంబంధాల విషయంలో దేశాలను పునరాలోచనలో పడేశారన్నారు.ఇలాంటి తరుణంలో ప్రభుత్వానికి మద్దతుగా నిల్చి, దేశ పరువు ప్రతిష్టలను కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయులపై ఉందని భార్గవ తెలిపారు. అమెరికా మార్కెట్లో మన ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయేలా, ట్రంప్ సర్కారు భారత ఎగుమతులపై సుంకాలను ఏకంగా 50 శాతానికి పెంచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, దేశీయంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో సంస్కరణలు వేగవంతమైన వృద్ధికి, ఉద్యోగాల కల్పనకి దోహదపడుతుందని భార్గవ తెలిపారు. సంస్కరణలతో చిన్న కార్లపై జీఎస్టీ 18%కి తగ్గుతుందని ఆశిస్తున్నామని, అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదే జరిగితే చిన్న కార్ల మార్కెట్ మళ్లీ పుంజుకోగలదని భార్గవ చెప్పారు. స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా చిన్న కార్లు.. దేశ జనాభాలో సింహభాగం ప్రజలు వ్యక్తిగత అవసరాల కోసం అత్యంత రిసు్కలతో కూడుకున్న ద్విచక్ర వాహనాలపైనే ఆధారపడుతుంటారని భార్గవ చెప్పారు. ఈ నేపథ్యంలో స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా ఉండే చిన్న కార్లను ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. 1950లలో ’కీయి’ కార్లను ప్రవేశపెట్టడం ద్వారా జపాన్ ఇలాంటి సమస్యను పరిష్కరించిందని తెలిపారు. -
టెక్స్‌టైల్స్‌కు కష్టకాలం..!
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల కారణంగా అధిక ప్రభావం పడే టెక్స్టైల్స్, వజ్రాల పాలిషింగ్, టైర్ల పరిశ్రమలు ప్రభుత్వం నుంచి విధానపరమైన సాయం కోరుతున్నాయి. ముఖ్యంగా అమెరికా 50 శాతం టారిఫ్‌లు దేశీ టెక్స్టైల్స్ పరిశ్రమపై అధిక ప్రభావం చూపించనుంది. మొత్తం టెక్స్టైల్స్ ఎగుమతుల్లో పావు శాతంపై వచ్చే ఆరు నెలల పాటు టారిఫ్‌ల ప్రభావం ఉంటుందని పరిశ్రమ పేర్కొంది. దేశ వస్త్ర ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. టారిఫ్‌ల కారణంగా ఆర్డర్లు రద్దు అవుతున్నట్టు తెలిపింది.వచ్చే డిసెంబర్ 31 వరకు సుంకాల్లేకుండా కాటన్ దిగుమతులకు ప్రభుత్వం అనుమతించడం, దేశీ టెక్స్టైల్స్ పరిశ్రమకు ఉపశమనం ఇవ్వనున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ (సీఐటీఐ) సెక్రటరీ జనరల్ చంద్రిమా ఛటర్జీ చెప్పారు. దీనివల్ల వ్యయాలు తగ్గి కొంత పోటీతత్వం లభిస్తుందన్నారు. ‘వచ్చే 6 నెలలు 20–25% టెక్స్టైల్స్ ఎగుమతులపై ప్రభావం పడొచ్చు’ అని చెప్పారు. 50% టారిఫ్‌లు టెక్స్టైల్స్, వస్త్ర పరిశ్రమకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అప్పారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) చైర్మన్ సుదీర్ శక్రి తెలిపారు. 2024–25లో టెక్స్టైల్స్, అప్పారెల్ పరిశ్రమ ఆదా యం 179 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఇందులో ఎగుమతులు 37 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 30 శాతం వ్యాపారంపై ప్రభావం: అమెరికా టారిఫ్‌ల కారణంగా సహజ వజ్రాల పాలిషింగ్ పరిశ్రమ 28–30% మేర (12.5 బిలియన్ డాలర్లు) ఆదాయం కోల్పోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. 2024–25లో దేశ సహజ వజ్రాల పాలిషింగ్ పరిశ్రమ ఆదాయం 16 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. అమెరికా, చైనాలో డిమాండ్ బలహీనపడడం, ల్యాబ్‌లో తయారైన కృత్రిమ వజ్రాల నుంచి పోటీతో గత మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి దేశీ సహజ వజ్రాల పాలిషింగ్ పరిశ్రమ ఆదాయం 40% మేర తగ్గినట్టు క్రిసిల్ రేటింగ్స్ వివరించింది. పాలిపౌడ వజ్రాల పరిశ్రమకు 80 శాతం ఆదాయం ఎగుమతుల నుంచే వస్తోందని.. భారత ఎగుమతుల్లో 35 శాతం వాటాతో అమెరికా కీలక మార్కెట్‌గా ఉన్నట్టు గుర్తు చేసింది.టైరు... బేజారు!భారత టైర్ల పరిశ్రమకు అమెరికా భారీ టారిఫ్‌లు పెద్ద ప్రతికూలమని ఆటోమొబైల్ టైర్ల తయారీదారుల సంఘం (ఏటీఎంఏ) పేర్కొంది. ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు కోసం డిమాండ్ చేసింది. అధిక శాతం టైర్ల ఎగుమతులపై 50 శాతం టరిఫ్లు అమలు కానుండగా, కొన్నింటికి 25 శాతం టారిఫ్ వర్తించనుంది. భారత టైర్ల ఎగుమతుల్లో ఒక్క అమెరికా వాటాయే 17% ఉండడం గమనార్హం. 2024–25లో మొత్తం టైర్ల ఎగుమతుల విలువ రూ.25,000 కోట్లుగా ఉంది. -
ఎగుమతిదారులకు అండ!
న్యూఢిల్లీ: భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించడంతో దేశీ ఎగుమతిదారులకు మద్దతుగా నిలించేందుకు కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. రుణాలపై మారటోరియం (చెల్లింపులపై తాత్కాలిక విరామం), ఎగుమతి ప్రోత్సాహకాలను అందించడంపై దృష్టి సారించినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. తమకు తక్కువ రేట్లపై రుణసాయం అందించాలని ఎగుమతిదారులు ఎప్పటి నుంచో కోరుతుండగా, వారి డిమాండ్లను పరిశీలిస్తున్నట్టు చెప్పా రు.ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించిందంటూ.. ఈ దిశగా సానుకూల నిర్ణయాలు వెలువడనున్నట్టు ఆ అధికారి చెప్పారు. ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం, మరిన్ని దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక పరమైన మద్దతు చర్యలకుతోడు దేశీ మార్కెట్ విస్తరణ ద్వారా యూఎస్ టారిఫ్‌ల ప్రభావం అధిగమించేలా చూడనున్నట్టు వివరించారు. ముఖ్యంగా అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉండే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)ల ఉద్యోగులకు ప్రత్యక్ష నగదు సాయాన్ని సైతం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ‘ప్రోత్సాహకాలను ఎలా అందించాలన్నది పరిశీలించాల్సి ఉంది. ఇందుకు ఎంత మొత్తం కేటాయించాలి. రుణ హామీ, తనఖా లేని రుణ పరిమితి పెంపును తొలుత ప్రకటించొచ్చు’ అని ఆ అధికారి తెలిపారు. 2025–26 బడ్జెట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.25,000 కోట్లను ఎగుమతి ప్రోత్సాహకాల కింద ప్రకటించింది.రాయితీ రుణాలు..రుణాలపై వడ్డీ రాయితీని తిరిగి ఐదేళ్ల కాలానికి తీసుకురావాలని ఎగుమతిదారులు కోరుతుండడం గమనార్హం. మూలధన అవసరాలకు వీలుగా రుణాల లభ్యతను పెంచడం, ఏడాది పాటు రుణాల అసలు, వడ్డీ చెల్లింపులపై మారటోరియం తదితర సాయాన్ని అందించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, టారిఫ్‌ల కారణంగా ఏర్పడే నష్టం తాత్కాలికమేనని ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.ముఖ్యంగా అమెరికా ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడిన రొయ్యలు, టెక్స్టైల్స్, తోలు, రత్నాభరణాల పరిశ్రమల నుంచి ఎక్కువ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ, తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు 21 శాతం పెరిగి 33.53 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.2024–25లో ఎగుమతులు 86.5 బిలిన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం వస్తు ఎగుమతులు 437 బిలియన్ డాలర్లలో 20% అమెరికాకే వెళ్లాయి. మరోవైపు సవాళ్లతో కూడిన ఈ తరుణంలో ఎగుమతిదారుల ఆందోళనలను పరిష్కరిస్తామంటూ కేంద్ర ఆర్థిక శాఖ హామీ ఇచి్చనట్టు భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రకటించింది. -
అమెరికా సుంకాలు భారత్‌కు మేల్కొలుపు
భారత ఎగుమతులపై అమెరికా విధించిన భారీ సుంకాలు బాధాకరమని, ఏ ఒక్క వాణిజ్య భాగస్వామిపైనా ఎక్కువగా ఆధారపడకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. భారత్‌కు ఇదో స్పష్టమైన మేల్కొలుపు అని హెచ్చరించారు. భారత వస్తువులపై యూఎస్ 50 శాతం సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రాజన్ మాట్లాడారు.వాణిజ్య సంబంధాలకు ఎదురుదెబ్బ‘ప్రతీకార సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలను దెబ్బతీసింది. భారతదేశం కఠినమైన ఆర్థిక శిక్షలను ఎదుర్కొన్నప్పటికీ చైనా, యూరప్ వంటి రష్యా ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాలపై యూఎస్ ఇలాంటి విధానాన్ని అనుసరించలేదు. ఇది యూఎస్ విదేశీ వాణిజ్య విధానంలో ద్వంద్వ ప్రమాణాల ఆరోపణలను రేకెత్తిస్తోంది. అమెరికా భౌగోళిక రాజకీయం, వాణిజ్యం, పెట్టుబడులు, ఫైనాన్స్ అన్నీ ఆయుధంగా మలుచుకుంటోంది’ అన్నారు.రష్యా చమురు విధానం‘భారత్ తన రష్యా ముడిచమురు దిగుమతులను కొనసాగించాలి. వాస్తవంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం జరుగుతుందో స్పష్టంగా తెలియజేయాలి. రిఫైనరీలు అధిక లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ ఎగుమతిదారులు పెరిగిన టారిఫ్ ధరలు చెల్లించాల్సిందే. అందులో ప్రయోజనం పెద్దగా లేకపోతే ఈ కొనుగోళ్లను కొనసాగించాలా వద్దా అనేది ఆలోచించాలి’ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా మద్దతు ఇస్తూ రష్యా చమురు నుంచి భారత్ లాభపడుతోందని యూఎస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో సహా అమెరికా అధికారులు ఆరోపించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రత్యామ్నాయాలు అవసరం..‘అమెరికా, చైనా సహా ఏదైనా ఒక దేశంపై భారత్ అతిగా ఆధారపడకూడదు. చైనా, జపాన్, అమెరికా లేదా ఎవరితోనైనా కలిసి పనిచేయాలి కానీ, వాటిపై పూర్తిగా ఆధారపడకూడదు. ప్రత్యామ్నాయాలు ఉండేలా చూసుకోవాలి. సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి నిర్మాణాత్మక సంస్కరణలను వేగవంతం చేయాలి. ప్రపంచ సరఫరా గొలుసులకు అనుగుణంగా దేశీయ పోటీతత్వాన్ని పెంచాలి. ఆచరణాత్మకంగా ఉన్న విభాగాల్లో స్వావలంబన సాధించాలి’ అని రాజన్ అన్నారు.ఇదీ చదవండి: పిల్లల ఆధార్ అప్డేట్.. యూఐడీఏఐ లేఖ -
అమెరికా సుంకాలకు ఇండియన్ యూనివర్సిటీ ఝలక్
అమెరికా విధించిన 50% దిగుమతి సుంకాలపై నిరసనగా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) తన క్యాంపస్‌లో అమెరికా బ్రాండ్ల పానీయాలపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. కోకా-కోలా, పెప్సీ వంటి ప్రముఖ బ్రాండ్లు ఇకపై విద్యార్థులకు అందుబాటులో ఉండవు.ఈ నిర్ణయాన్ని విశ్వవిద్యాలయ ఛాన్సలర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు అశోక్ కుమార్ మిట్టల్ ప్రకటించారు. “భారతదేశం అమెరికా ఆర్ధిక బలాయింపు ముందు తలవంచదు. ఇది స్వదేశీ 2.0 ఉద్యమం,” అని ఆయన పేర్కొన్నారు.నిషేధానికి కారణంఅమెరికా ఇటీవల భారత దిగుమతులపై సుంకాలను 50%కి పెంచింది. భారతీయ ఉత్పత్తులపై ఈ చర్యను “ఆర్ధిక దౌర్జన్యం”గా అభివర్ణిస్తూ, మిట్టల్ ఈ నిషేధాన్ని ప్రతిస్పందనగా ప్రకటించారు. “అమెరికా కంపెనీలు భారత మార్కెట్ నుండి సంవత్సరానికి రూ.6.5 లక్షల కోట్లకు పైగా ఆదాయం సంపాదిస్తున్నాయి. ఇది ఒకవైపు లాభాలు, మరోవైపు ఆంక్షలు” అని ఆయన ఓ బహిరంగ లేఖలో అమెరికా అధ్యక్షుడికి రాశారు.ఆందోళలో వ్యాపార వర్గాలుయూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సామాజిక మాధ్యమాల్లో స్వదేశీ2.0 ( #Swadeshi2.0 ) అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ చర్య పంజాబ్‌లోని విద్యా సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వ్యాపార వర్గాలు, ముఖ్యంగా బాటిల్డ్ డ్రింక్ డిస్ట్రిబ్యూటర్లు, ఈ నిషేధాన్ని ఆందోళనతో చూస్తున్నారు.If the US goes ahead and imposes 50% tariffs on Indian exports, Lovely Professional University will not sit quietly.Let me remind the US once again - we will ban all American soft drinks on campus, if the US doesn’t withdraw the unfair tariffs by 27th August.I urge every… pic.twitter.com/PhBsVNSJHe— Ashok Kumar Mittal (@DrAshokKMittal) August 24, 2025 -
అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై మరో 25 శాతం టారిఫ్‌లు నేటి నుంచే అమల్లోకి..
-
సుంకాల ప్రభావం.. ఎదురయ్యే సవాళ్లు: ఆర్బీఐ గవర్నర్
ముంబై: టారిఫ్ పరమైన అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక సవాళ్లను విసురుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ఈ తరుణంలో పెట్టుబడులను ఇతోధికం చేసేందుకు బ్యాంక్‌లు, కార్పొరేట్లు కలసి రావాలని పిలుపునిచ్చారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు.అమెరికా - భారత్ వాణిజ్య ప్రతినిధుల మధ్య కొనసాగుతున్న సంప్రదింపులు అంతిమంగా ఒక నిర్ణయానికి దారితీస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు టారిఫ్‌ల కారణంగా దేశీ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం పరిమితం అవుతుందన్నారు. భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం టారిఫ్‌లు విధించగా, ఈ నెల 27 నుంచి మరో 25 శాతం టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో టెక్స్టైల్స్, రొయ్యలపై అధిక ప్రభావం పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో అవసరమైతే రంగాల వారీ ఆర్థిక చేయూతకు అవకాశం ఉంటుందని మల్హోత్రా సంకేతం ఇచ్చారు.పరపతి విధానంలో భాంగా ద్రవ్యోల్బణంతోపాటు వృద్ధి క్రమాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు. ‘‘క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. భౌగోళిక రాజకీయ, టారిఫ్ పరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. కనుక ఆర్థిక విస్తరణ మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. బ్యాంక్‌లు, కార్పొరేట్ బ్యాలన్స్ షీట్లు మెరుగ్గా ఉన్నాయి. కనుక అవి పరస్పర సహకారంతో పెట్టుబడుల సైకిల్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ కీలక తరుణంలో ఇది ఎంతో అవసరం’’అని పేర్కొన్నారు. రుణ వృద్ధికి చర్యలు..ధరల స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం వృద్ధికి అడ్డుకావని మల్హోత్రా అభిప్రాయపడ్డారు. బ్యాంకుల రుణ వృద్ధి మూడేళ్ల కనిష్టానికి తగ్గిన తరుణంలో.. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఆర్బీఐ నియత్రణలోని సంస్థల వ్యాపార సులభతర నిర్వహణను పెంచడంపైనా దృష్టి పెట్టినట్టు చెబుతూ, దీనివల్ల వ్యయాలు తగ్గుతాయన్నారు. ఆర్బీఐ ఎన్నో వివరాలు కోరుతుందన్న అభిప్రాయాలు నెలకొన్నాయని చెబుతూ.. అడిగిన సమాచారం విషయంలో భాగస్వాములు సహకరించాలని కోరారు. దీనివల్ల మెరుగైన నియంత్రణలకు అవకాశం ఉంటుందన్నారు. త్వరలోనే బాసెల్-3 నిబంధనలను అమల్లోకి తెస్తామని చెప్పారు. అందరికీ ఆర్థిక సేవలను మరింత విస్తృతం చేయడం, చిన్న వ్యాపారులకూ రుణ సాయం చేరువ చేయడం, కస్టమర్ సేవల నాణ్యతను పెంచడం తమ ప్రాధాన్యతలుగా చెప్పారు. -
టారిఫ్‌ల మోత వేళ.. కీలక భేటీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాను ఏమాత్రం నిలువరించట్లేదని ఆరోపిస్తూ భారత్‌పై పన్నుల మోత మోగించిన ట్రంప్ సర్కార్ విధించిన ఆగస్ట్ 27 గడువు ముగుస్తుండటంతో ప్రధానమంత్రి కార్యాలయం నేడు కీలక సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ప్రధానమంత్రి ప్రధానకార్యదర్శి సారథ్యంలో ఈ సమీక్ష సమావేశం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత్‌పై అమెరికా ప్రభుత్వం తాజాగా విధించిన 50 శాతం దిగుమతి టారిఫ్ ఆగస్ట్ 27వ తేదీ నుంచి అమల్లోకిరానుంది. ఈ నేపథ్యంలో ఆయా ఎగుమతి సంస్థల లాభాల్లో కోత పడడం, ఆక్వారంగం, లెదర్, వజ్రాభరణాల ఉత్పత్తుల ఎగుమతిపై టారిఫ్ ప్రతికూల ప్రభావం వంటి కీలక అంశాలపై ఆయా రంగాల ప్రతినిధులు, సంస్థలతో ప్రధాని కార్యాలయం సమాలోచనలు జరపనుందని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతిచేసే సంస్థలతో, ఎగుమతి రంగ నిపుణులతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సంప్రదింపులు మొదలెట్టింది. అమల్లోకి వచ్చిన 25 శాతం టారిఫ్ కారణంగా తమ లాభాలు పూర్తిగా తగ్గిపోయాయని, నష్టభయాలను ఎదుర్కొంటున్నామని పలువురు కేంద్ర మంత్రిత్వశాఖ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. 50 శాతం టారిఫ్ అమల్లోకి రావడంతో తక్షణం ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే వర్గాలను ఆదుకోవాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ఎగుమతిదారులు మాత్రం అత్యయిక రుణపరపతి పథకం ద్వారా మూలధనాన్ని అందించాలని, తద్వారా తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపినట్లు తెలుస్తోంది. అయితే రంగాలవారీగా ఆదుకుంటేనే దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కుతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
రష్యాకు రెండు వారాల గడువిస్తున్నా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు రెండు వారాల అల్టిమేటం ఇచ్చారు. అప్పటి వరకు తగు రీతిలో స్పందించకుంటే రష్యాపై ఆంక్షలు విధించాలా లేదా సుంకాలతో బాదాలా అనేది నిర్ణయిస్తామని తెలిపారు. ఉక్రెయిన్‌లోని అమెరికాకు చెందిన ఎల్రక్టానిక్ ఫ్యాక్టరీపై రష్యా క్షిపణి దాడి నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. ఇటీవల అమెరికాలోని అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయంటూ ప్రకటించిన ట్రంప్ తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రష్యా దాడితో తాను సంతోషంగా లేనని, పరిస్థితిని మరోసారి సమీక్షిస్తానని ట్రంప్ అన్నారు. తదుపరి చర్యలను రెండు వారాల్లో ప్రకటిస్తానని పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్ మధ్య సంక్షోభం తెలివితక్కువైంది. వారానికి 7 వేల మంది, అంతకంటే ఎక్కువ మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ పోరాటాన్ని ఆపాలనుకుంటున్నా, అయితే, ఇప్పుడది కష్టతరంగా మారింది’అని ట్రంప్ అన్నారు. -
భారత ఉత్పత్తులకు స్వాగతం.. ఆందోళన అనవసరం
అమెరికా టారిఫ్ వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత ఉత్పత్తులను యూఎస్ దిగుమతి చేసుకోకపోతే రష్యా అండగా ఉంటుందని ఇండియాలోని రష్యా రాయబార కార్యాలయానికి చెందిన చార్గే డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ తెలిపారు. భారత వస్తువులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే, రష్యా భారత దిగుమతులను సాధ్యమైనంత వరకు స్వాగతిస్తుందని, దాని గురించి ఆందోళన చెందకండంటూ భరోసానిచ్చారు. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల విస్తరణకు ఈ సందర్భంగా సంకేతాలిచ్చారు.రష్యాతో భారత ఎగుమతులు, దిగుమతుల్లో వ్యాత్యాసం ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య అసమతుల్యత 59 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది రష్యా మరిన్ని భారతీయ వస్తువులను దిగుమతి చేసుకోవాలనే సంకేతాలను హైలైట్ చేస్తుంది. బాబుష్కిన్ చేసిన ప్రకటన ప్రత్యామ్నాయ మార్కెట్లను కోరుకునే భారతీయ ఎగుమతిదారులకు కలిసొచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు.పెరుగుతున్న వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలుభారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కో పర్యటన సానుకూలంగా సాగిందని, ఆచరణాత్మక సహకారానికి భారత్-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ (ఐఆర్ఐజీసీ) కీలక వేదికగా పనిచేస్తుందని బాబుష్కిన్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ఇరుదేశాల నేతలు ఢిల్లీలో సమావేశమవుతారని సమాచారం. అధికారికంగా తేదీని ధ్రువీకరించనప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం గురించి ఊహాగానాలు పెరుగుతున్నాయి.చమురు సరఫరాకు అంతరాయం లేదుభారత్తో చమురు వాణిజ్యానికి సంబంధించి అంతర్జాతీయ ఆంక్షల ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా ముడి చమురు ఎగుమతులను కొనసాగిస్తుందని బాబుష్కిన్ పునరుద్ఘాటించారు. భారత్ రష్యా చమురుకు అతిపెద్ద వినియోగదారని, రష్యా అతిపెద్ద చమురు ఉత్పత్తిదారని చెప్పారు. ఏకపక్ష చర్యలు సరఫరా గొలుసులకు విఘాతం కలిగిస్తాయని, ప్రపంచ మార్కెట్లను అస్థిరపరుస్తాయన్నారు.ఆంక్షలు ఉన్నప్పటికీ..రష్యాపై పాశ్చాత్య దేశాలు ఏళ్ల తరబడి ఆంక్షలు విధించినప్పటికీ భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం విపరీతంగా పెరిగిందని బాబుష్కిన్ పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఇరు దేశాల వాణిజ్యం ఏడు రెట్లు అయిందన్నారు. పరస్పర చర్చల ద్వారా వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన అన్నారు. భారత్-రష్యా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే టాప్ 10 చమురు కంపెనీలు -
భారత్‌పై టారిఫ్‌ల ప్రభావం అంతంతే!
యూఎస్ టారిఫ్‌లతో భారత కార్పొరేట్ కంపెనీలకు ప్రత్యక్ష సంబంధం తక్కువేనని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. కాకపోతే ప్రస్తుతం మినహాయింపు పరిధిలో ఉన్న ఫార్మాస్యూటికల్స్, తదితర రంగాలపై భవిష్యత్తులో ఆ వెసులుబాటు తొలగిస్తే ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. భారత ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌లను ప్రస్తుతం యూఎస్ అమలు చేస్తోంది. ఈ నెల 27 నుంచి మరో 25 శాతం టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి.ఫార్మా, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు మాత్రం వీటి నుంచి మినహాయింపులు ఉన్నాయి. 50 శాతంతో ఆసియాలో భారత్‌పైనే అధిక టారిఫ్‌లు అమలు కానున్నట్టు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ రిస్క్‌లు తగ్గుతాయని పేర్కొంది. రష్యా చమురును భారత ఆయిల్ కంపెనీలు 30–40 శాతం తక్కువ రేటుకు దిగుమతి చేసుకుంటుండడం వాటి లాభాలకు మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించింది. భారత ఐటీ కంపెనీలపై టారిఫ్‌ల కారణంగా ప్రత్యక్ష ప్రభావం తక్కువేనని తేల్చింది. అలాగే, దేశీ మార్కెట్‌పై ప్రధానంగా ఆధారపడే ఆయిల్, గ్యాస్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇంజినీరింగ్, నిర్మాణ రంగం, టెలికం, యుటిలిటీలపై ప్రభావం ఉండదని తెలిపింది. అమెరికా అధిక టారిఫ్‌లు అలాగే కొనసాగితే భారత వృద్ధి రేటు 2025–26లో 6.5 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది. దీర్ఘకాలిక వృద్ధిని టారిఫ్‌లు అడ్డుకోవుభారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై యూఎస్ టారిఫ్‌లు ప్రభావం చూపించకపోవచ్చని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ మరోసారి పునరుద్ఘాటించింది. కొన్ని రోజుల క్రితం కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. భారత రేటింగ్‌ను సైతం బీబీబీ మైనస్ నుంచి బీబీబీ స్టెబుల్‌కు అప్‌గ్రేడ్ కూడా చేసింది. ‘రానున్న కాలంలో వృద్ది అవకాశాలు బలోపేతం అవుతాయి. వృద్ధి సగటు 6.8 శాతానికి చేరుతుంది. మౌలిక సదుపాయాలు, అనుసంధానత పెరిగితే, దీర్ఘకాలిక వృద్ది అవకాశాలకు ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. దీంతో భారత్ దీర్ఘకాలిక వృద్ధి మరింత బలపడుతుంది’ అని ఎస్అండ్పీ తన తాజా నివేదికలో వివరించింది.స్వీయ వినియోగం సానుకూల అంశంభారత్ ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు చూపిస్తున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటని పేర్కొంది. గత 3–4 ఏళ్లలో ప్రాంతీయంగా ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ మెరుగైన వృద్ధిని నమోదు చేసినట్టు గుర్తు చేసింది. భారత వృద్ధిలో 85 శాతం దేశీయ అంశాలపైనే ఆధారపడి ఉంటుందని, ఎగుమతుల రూపంలో సమకూరేది 15 శాతమేనని తెలిపింది. స్వీయ వినియోగంపై అధికంగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కావడం సానుకూల అంశంగా పేర్కొంది. స్వల్పకాలంలో వ్యాపార విశ్వాసంపై ప్రభావం పడినప్పటికీ సానుకూల వృద్ది పథం, సానుకూల వ్యాపార వాతావరణం అన్నవి.. మధ్య కాలం, దీర్ఘకాలంలో వృద్ధిని నిర్ణయిస్తాయని అభిప్రాయపడింది. ‘భారత జీడీపీలో అమెరికా ఎగుమతుల పాత్ర ఒక శాతమే. టారిఫ్‌లు అధికంగా విధించినప్పటికీ దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలను ప్రభావితం చేస్తాయని అనుకోవడం లేదు’అని వివరించింది.ఇదీ చదవండి: ‘నా భార్య నన్ను పిచ్చోడిలా చూసింది’ -
పత్తి దిగుమతులపై సుంకాల ఊరట
న్యూఢిల్లీ: దేశీయంగా టెక్స్టైల్స్ పరిశ్రమకు కీలక వనరైన ముడి పత్తి దిగుమతులకు సంబంధించి సెప్టెంబర్ 30 వరకు సుంకాల నుంచి మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దీనిపై 11 శాతం సుంకాలతో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్సు కూడా వర్తిస్తోంది. ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఈ మినహాయింపు ఆగస్టు 19 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.దీనితో భారత్‌కి పత్తిని ఎగుమతి చేసే రెండో అతిపెద్ద సరఫరాదారైన అమెరికాకు ప్రయోజనం చేకూరనుంది. ధరలను స్థిరీకరించడానికి, ముడి సరుకు లభ్యతను మెరుగుపర్చడానికి సుంకాల మినహాయింపు ఉపయోగపడుతుందని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. దేశీయంగా పత్తి ధరలు తగ్గిపోయి, రైతులపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో మినహాయింపులను ప్రభుత్వం 40 రోజులకే పరిమితం చేసినట్లు చెప్పారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 579.2 మిలియన్ డాలర్లుగా ఉన్న పత్తి దిగుమతులు 2025 ఆర్థిక సంవత్సరంలో 107 శాతం ఎగిసి 1.20 బిలియన్ డాలర్లకు చేరాయి. -
‘అమెరికా’ బాయ్‌కాట్ ప్రచారం
ఎగుమతిదారులను కలవరపెట్టి, న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య సంబంధాలను దెబ్బతీస్తూ డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుంచి వచ్చే వస్తువులపై 50 శాతం సుంకం విధించిన తర్వాత, దీనిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ మొదలైంది. అది అమెరికన్ ఉత్పత్తులను వదిలివేయాలంటూ డిమాండ్ చేసే దాకా వెళ్లింది. మెక్‌డొనాల్డ్స్ కోకా–కోలా అమెజాన్, ఆపిల్.. ఇలా అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థలు భారతదేశంలో బహిష్కరణ డిమాండ్స్ ఎదుర్కుంటున్నాయి.మన భారతం.. మహా మార్కెట్..ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం, సంపన్న వినియోగదారుల పెరుగుతున్న స్థావరంగా కూడా మారుతోంది. దీన్ని లక్ష్యంగా చేసుకుని వేగంగా విస్తరించిన అమెరికన్ బ్రాండ్లకు మన దేశం కీలకమైన మార్కెట్‌గా అవతరించింది. భారతీయ సంపన్నులు, అధికాదాయ వర్గాలు జీవితంలో ఉన్నతికి చిహ్నాలుగా భావిస్తూ అమెరికన్ అంతర్జాతీయ లేబుల్స్ పట్ల ఆకర్షితులయ్యారు. ఉదాహరణకు, భారతదేశం మెటా, వాట్సాప్‌కు వినియోగదారుల పరంగా అతిపెద్ద మార్కెట్ అలాగే ఏ ఇతర బ్రాండ్ కంటే డొమినోస్వే దేశంలో ఎక్కువ రెస్టారెంట్లు ఉన్నాయి. పెప్సి కోకా–కోలా వంటి పానీయాలు మన సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ఇక కొత్త ఆపిల్ స్టోర్ తెరిచినప్పుడు లేదా స్టార్‌బక్స్ కేఫ్ లో డిస్కౌంట్లను ఇచ్చినప్పుడు మన వాళ్లంతా పొలోమంటూ క్యూలో నిలబడడం కనిపిస్తుందిపోటీ ఇస్తున్నాం.. విస్తరించలేకున్నాం...నిజం చెప్పాలంటే, భారతీయ రిటైల్ కంపెనీలు స్టార్‌బక్స్ వంటి విదేశీ బ్రాండ్లకు దేశీయ మార్కెట్లో గట్టి పోటీని ఇస్తున్నాయి, కానీ అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం ఒక సవాలుగా ఉంది. అయితే, భారతీయ ఐటి సేవల సంస్థలు మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరపడ్డాయి, టిసిఎస్ , ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లకు సాఫ్ట్వేర్ పరిష్కారాలను అందిస్తున్నాయి. తరచు మన ప్రధాని స్వావలంబన కోసం పిలుపునిస్తూనే ఉన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ టెక్నాలజీ కంపెనీలు ప్రపంచానికి ఉత్పత్తులను తయారు చేస్తాయి, కానీ ‘ఇప్పుడు మనం భారతదేశ అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది’ అని అన్నారు.నిరసనల వెల్లువ..అమ్మకాలు దెబ్బతింటున్నాయనే తక్షణ సూచనలు లేనప్పటికీ, అమెరికా పన్నులపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ పెరుగుతున్న డిమాండ్స్‌కు స్వదేశీ సంస్థల గొంతులు కూడా జత కలుస్తున్నాయి. వావ్ స్కిన్ సైన్స్ సహ వ్యవస్థాపకుడు మనీష్ చౌదరి లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసిన తన వీడియో సందేశంలో ఈ విషయంపై స్పందించారు. ‘మేడ్ ఇన్ ఇండియా‘ని ‘గ్లోబల్ అబ్సెషన్‘గా మార్చడానికి వీలుగా మన రైతులకు, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా ఆహార, సౌందర్య ఉత్పత్తుల విజయాల నుంచి మనం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ‘మనం వేల మైళ్ల దూరంలో నుంచి వచ్చే ఉత్పత్తుల కోసం క్యూ కడుతున్నాం. తమ స్వదేశంలో నిలదొక్కుకోవాలని ఓ వైపు మన తయారీదారులు పోరాడుతుంటే, మరోవైపు మనవి కాని బ్రాండ్లపై మనం గర్వంగా ఖర్చు చేస్తున్నాం‘ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘చైనా మాదిరిగానే భారతదేశానికి కూడా స్వదేశంలో వృద్ధి చెందిన ఎక్స్(గతంలో ట్విట్టర్)/ గూగుల్/ యూట్యూబ్/ వాట్సాప్/ ఎఫ్బీ ఉండాలి’ అని కారు డ్రైవర్‌ను కాల్ సర్వీస్ ద్వారా సరఫరా చేసే భారతదేశ సంస్థ ‘డ్రైవ్యూ’ సీఈఓ రహ్మ్ శాస్త్రి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.భారతీయ జనతా పార్టీకి అనుసంధానంగా పనిచేసే స్వదేశీ జాగరణ్ మంచ్ గ్రూప్ భారతదేశం అంతటా బహిరంగ ర్యాలీలు నిర్వహించి, అమెరికన్ బ్రాండ్లను బహిష్కరించాలని ప్రజలను కోరుతోంది. ‘ప్రజలు ఇప్పుడు భారతీయ ఉత్పత్తుల వైపు చూస్తున్నారు. అయితే ఇది విజయవంతం కావడానికి మరి కొంత సమయం పడుతుంది‘ అని గ్రూప్ సహ–కన్వీనర్ అశ్వని మహాజన్ అంటున్నారు. ‘ఇది జాతీయవాదం, దేశభక్తికి పిలుపు‘ అని అన్నారాయన. విదేశీ ఉత్పత్తుల స్థానంలో వాటి కంటే మంచివి, ప్రజలు ఎంచుకోగల భారతీయ బ్రాండ్ల స్నానపు సబ్బులు, టూత్‌పేస్ట్ శీతల పానీయాల జాబితాను ఈ సంస్థ సోషల్ మీడియాలో, షేర్ చేస్తోంది. జాబితా చేశారు. అలాగే ‘విదేశీ ఆహార సంస్థలను బహిష్కరించండి‘ అంటూ మెక్‌డొనాల్డ్స్ అనేక ఇతర రెస్టారెంట్ బ్రాండ్ల లోగోలతో ప్రచారం చేస్తున్నారు.ఇదీ చదవండి: కబ్జాసురుల పాపం పండేలా..కొన్ని చిట్కాలుఓ వైపు అమెరికా వ్యతిరేక నిరసనలు ఊపందుకుంటున్నా అమెరికన్ కంపెనీ టెస్లా భారతదేశంలో తన రెండవ షోరూమ్‌ను న్యూఢిల్లీలో ప్రారంభించింది, ఈ ప్రారంభోత్సవానికి భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు అమెరికా రాయబార కార్యాలయ అధికారులు హాజరయ్యారు- సత్య బాబు -
చర్చలు విఫలమైతే మరిన్ని టారిఫ్‌లు
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్, పుతిన్ మధ్య అలస్కాలో శుక్రవారం జరిగే చర్చలు విఫలమైతే భారత్‌పై అదనపు టారిఫ్‌లు విధించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ తేల్చిచెప్పారు. ట్రంప్, పుతిన్ చర్చల ద్వారా ఫలితంపైనే టారిఫ్‌లపై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ సానుకూల ఫలితాలు రాకపోతే భారత్‌పై సుంకాల మోత తప్పదని వెల్లడించారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు ఇండియాపై సెకండరీ టారిఫ్‌లు విధిస్తామన్నారు. అప్పటికీ రష్యా దారికి రాకపోతే సెకెంటరీ టారిఫ్‌లు మరింత పెరుగు తాయని స్పష్టంచేశారు. భారత్ గనుక ముడి చమురు కొనడం ఆపేస్తే రష్యాపై ఒత్తిడి పెరుగు తుందని అమెరికా అంచనా వేస్తోంది. భారత్ ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. -
ట్రంప్.. సంప్రదింపులా? అధికార ప్రయోగమా?
భారత్, బ్రెజిల్ దేశాలపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు ఆచరణ సాధ్యం కాదని, రాజకీయంగా ప్రమాదకరమని ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ అమెరికా వాణిజ్య విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. బ్రెజిల్ ఫైనాన్షియల్ పబ్లికేషన్ వాలర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ మాట్లాడారు. యూఎస్ అనుసరిస్తున్న ఈ చర్య దీర్ఘకాలిక దౌత్య, ఆర్థిక సంబంధాలను దెబ్బతీసేలా ఉందని చెప్పారు.అమెరికా వ్యతిరేకిగా ముద్రరష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను కొనసాగిస్తున్నందుకు శిక్షగా పేర్కొంటూ ట్రంప్ ఇటీవల భారీ సుంకాలను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో బ్రిక్స్ సభ్యదేశమైన బ్రెజిల్‌పై ట్రంప్ ‘అమెరికా వ్యతిరేకి’గా ముద్ర వేసి ఇలాంటి సుంకాలు విధించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్, ప్రస్తుతం చికాగో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రఘురామ్ రాజన్ ఈ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు.యూఎస్‌కు భారత్ భయపడితే..‘తలకు తుపాకీ గురిపెట్టి వాణిజ్య సంప్రదింపులు జరపడం కష్టం. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇవి వాణిజ్య సంప్రదింపులు కావు. అధికార ప్రయోగం. ఇండియా ఈ విషయంలో సుదీర్ఘ చర్చలు కోరుకుంది. అందుకు భిన్నంగా అకస్మాత్తుగా దాడి చేయడం సరికాదు. రష్యా నుంచి భారత్ చేసే చమురు కొనుగోళ్లపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఇలా సుంకాలతో బయపెట్టాలనుకోవడం తగదు. ఈ తీరు రాజకీయ ప్రతిఘటనను సృష్టిస్తుంది. రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేయాలని భారత్ నిర్ణయం తీసుకుంటే అమెరికా ఒత్తిడికి తలొగ్గినట్లు అవుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో చెడు సంకేతాలకు దారితీస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర!యూఎస్‌కు కూడా నష్టమే..‘అమెరికా అనుసరిస్తున్న దూకుడు సుంకాల వల్ల ఆర్థిక పతనం ఏకపక్షంగా ఉండదు. అమెరికాకు 80 బిలియన్ డాలర్ల వరకు భారత ఎగుమతులు లాభసాటిగా ఉండవు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యాపిల్ వంటి సంస్థల ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 50 శాతం సుంకాలు భరించడం భారత్‌కు మాత్రమే కాదు, వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని భావిస్తున్న అమెరికాకు కూడా సాధ్యం కాదు. ఈ విషయాలను ప్రజలు చాలా కాలం గుర్తుంచుకుంటారు. యూఎస్ నేడు ఒక దేశంపై, రేపు మరో దేశంపై 50 శాతం సుంకాలు విధిస్తూపోతే అనిశ్చితి వాణిజ్యం, పెట్టుబడులకు విఘాతం కలుగుతుంది’ అని రాజన్ హెచ్చరించారు. -
టారిఫ్ ఒడిదుడుకులు ఇంకెన్ని రోజులు!
అమెరికా టారిఫ్‌ల వల్ల నెలకొన్న ఒడిదుడుకుల ప్రభావం మనపై స్వల్పకాలికంగానే ఉంటుందని యూనియన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ మధు నాయర్ చెప్పారు. దీర్ఘకాలికంగా చూసినప్పుడు, భారీ రుణభారం ఉన్న అమెరికా, ప్రస్తుతంతో పోలిస్తే కాస్త బలహీనపడొచ్చని ఆయన చెప్పారు. పరిస్థితులు క్రమంగా స్థిరపడి భారత్‌లాంటి దేశాలకు మేలు జరుగుతుందని ఆయన వెల్లడించారు. మన మార్కెట్లలో తీవ్ర స్థాయిలో కరెక్షన్ రాకపోవచ్చన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల సంగతి అలా ఉంచితే, భారత ఆర్థిక మూలాలు మెరుగ్గా ఉన్న నేపథ్యంలో దేశీయంగా మార్కెట్లలోకి పెట్టుబడుల ప్రవాహం పటిష్టంగా ఉంటోందని నాయర్ చెప్పారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు, ఈపీఎఫ్ నిధులు, రిటైల్ ఇన్వెస్టర్లు, యులిప్స్ వంటి మార్గాల్లో ప్రతి నెలా రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు. రూ.లక్ష కోట్ల ఏయూఎం లక్ష్యంరాబోయే అయిదేళ్లలో రూ. లక్ష కోట్ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) స్థాయిని సాధించాలని నిర్దేశించుకున్నట్లు నాయర్ చెప్పారు. ప్రస్తుతం ఇది సుమారు రూ. 23,000 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. అధిక వృద్ధి సాధన దిశగా ప్రస్తుత పథకాలపై మరింతగా దృష్టి పెట్టడంతో పాటు కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నట్లు నాయర్ తెలిపారు. సెప్టెంబర్ 1న డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: టెలికాం టారిఫ్‌లు పెంపు?అర్థయ పేరిట స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఎస్ఐఎఫ్)ను నవంబర్‌లో అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ప్రస్తుతం కన్జూమర్ డిస్క్రిషనరీ, టెలికం, క్యాపిటల్ గూడ్స్/ఇండస్ట్రియల్స్ రంగాలు పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉండగా ఇంధన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయని నాయర్ చెప్పారు. -
ఆక్వా రైతు పోరుబాట
సాక్షి, అమరావతి: ట్రంప్ టారీఫ్‌ల నేపథ్యంలో సంక్షోభంలో కూరుకుపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఇందుకోసం దశల వారీగా ఆందోళనలు చేపట్టడం ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నులు–ఆక్వా రంగం ప్రభావంపై విజయవాడ బాలోత్సవ భవన్లో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సంక్షోభం నుంచి ఆక్వా రైతులను ఆదుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు. దీనిపై మత్స్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రిలకు వినతిపత్రాలు ఇవ్వాలని, ఆక్వా సాగు ఉన్న అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు, బహిరంగ నిరసనలు తెలియజేయాలని నిర్ణయించారు. సమావేశంలో తొలుత ఏపీ రైతుసంఘం పూర్వ రాష్ట్ర అధ్యక్షులు బి.బలరాం మాట్లాడుతూ రాష్ట్రంలో 8 తీరప్రాంత జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు పైగా సాగవుతున్న ఆక్వా రంగంపై లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు.ఏటా రాష్ట్రం నుంచి 7.16 లక్షల టన్నులు ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాలను 50 శాతానికి పెంచడంతో టన్నుకు రూ.లక్ష నుంచి రూ.50 వేలు అదనంగా చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల ధరలు పతనం ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ ట్రంప్ సుంకాల ప్రభావంతో ఇప్పటికే రొయ్యల ధరలు పతనమయ్యాయని, ఇతర దేశాలకు ఎగుమతి చేసే రొయ్యలు, కౌంట్ ధరలను కూడా తగ్గించేశారని విమర్శించారు. రైతులు సుమారు టన్నుకు రూ.40వేల వరకు నష్టపోతున్నారని వివరించారు. రైతు సంఘం నేత వై. కేశవరావు మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎంపెడా ద్వారా ధరలు తగ్గకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు ప్రవేశపెట్టిన తీర్మానాలను రౌండ్ టేబుల్‌సమావేశం ఆమోదించింది. రౌండ్ టేబుల్ సమావేశంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. రమాదేవి, ఆక్వా టెక్ ఎడిటర్ కోనా జోసెఫ్, ఆక్వా రంగం నిపుణులు షేక్ అలీ హుస్సేన్, ఆక్వా రైతుల సంఘం పశి్చమగోదావరి జిల్లా కనీ్వనర్ ఆర్.సూర్యనారాయణ రాజు (యువరాజు), సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి.నాగేశ్వరరావు, వ్యవసాయ కారి్మక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి పాల్గొన్నారు. తీర్మానాలివీ.. » కేంద్ర ప్రభుత్వం ఎంపెడా కౌంటర్ గ్యారెంటీ ఇచ్చి ఆక్వా ఉత్పత్తుల ధరలకు భరోసా ఇవ్వాలి. » కేంద్ర ఎక్స్‌పోర్టర్స్ ధర తగ్గించి కొనుగోలు చేయకుండా తగు చర్యలు తీసుకోవాలి. » అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. » ఆక్వా రంగాన్ని వ్యవసాయంగా గుర్తించాలి. దేశంలో అంతర్గత (డొమెస్టిక్) వినియోగానికి చర్యలు తీసుకోవాలి. » నాణ్యమైన సీడ్, ఫీడ్ అందేలా చూడాలి. ధరలు నియంత్రించాలి. విద్యుత్ రాయితీ అమలు చేయాలి. -
టారిఫ్‌లకు మరో 90 రోజుల విరామం
వాషింగ్టన్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలకు కొంత విరామం దొరికింది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి చైనాపై అమల్లోకి రావాల్సిన భారీ టారిఫ్‌లను 90 రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేశానని సొంత ట్రూత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చైనా వాణిజ్య శాఖ కూడా ఇదే రకమైన ప్రకటన చేసింది. అమెరికా ఉత్పత్తులపై అదనంగా విధించిన టారిఫ్‌లకు 90 రోజుల పాటు విరామమిస్తున్నట్లు తెలిపింది.ఈ పరిణా మంతో రెండు దేశాలు తమ మధ్య విభేదా లను చర్చల ద్వారా పరిష్కరించుకునే వెసు లుబాటు లభించినట్లయింది. అంతేకాదు, ఈ ఏడాది చివర్లో జరగాల్సిన ట్రంప్– జిన్‌పింగ్‌ల శిఖరాగ్రానికి మార్గం సులువైనట్లేనని భావిస్తున్నారు. తాజా పరిణామాన్ని చైనాతో వాణిజ్యం చేసే అమెరికా కంపెనీలు స్వాగతించాయి. ప్రమాదకర డ్రగ్ ఫెంటానిల్‌పై ఒప్పందం కుదిరితే, అమెరికా టారిఫ్‌లు తగ్గుతాయి, చైనా ప్రతీకార చర్యలను ఉపసంహరించుకుంటుందని అమెరికా–చైనా బిజి నెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సీన్ స్టెయిన్ అభి ప్రాయపడ్డారు.దాదాపు అన్ని దేశాలపైనా అత్యధికంగా టారిఫ్‌లు, పన్నులు విధించడం ద్వారా ప్రపంచ వాణిజ్య వ్యవస్థను కకావికలం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా విషయంలో మాత్రం తాత్సారం చేస్తు న్నారు. కీలక ఖనిజాలు, ఎలక్ట్రిక్ వాహ నాలు మొదలు జెట్ విమానాల ఇంజన్ల వరకు వాడే మాగ్నెట్లపై చైనా ఆధిపత్యం ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ ఏడాది మేలో చైనా ఉత్పత్తులపై 145 శాతం టారిఫ్‌లను ట్రంప్ ప్రకటించగా, అమెరికా ఉత్పత్తులపై డ్రాగన్ దేశం 125శాతం టారిఫ్ లను విధించింది. అనంతరం, రెండు దేశాలు వెనక్కి తగ్గి, జెనీవాలో చర్చలు మొదలుపెట్టాయి. -
ఇళ్ల విక్రయాలపై టారిఫ్ ప్రభావం!
భారత ఎగుమతులపై అమెరికా విధించిన అధిక టారిఫ్‌లు దేశీయ మార్కెట్లో అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలను ప్రభావితం చేయొచ్చని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. అధిక టారిఫ్‌లు చిన్న వ్యాపారాలకు విఘాతం కలిగించొచ్చంటూ.. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులే రూ.45 లక్షల్లోపు ధరల ఇళ్ల కొనుగోలుదారుల్లో ఎక్కువగా ఉన్నట్టు గుర్తు చేసింది.‘యూఎస్‌కు వస్తు ఎగుమతుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) అధిక వాటా కలిగి ఉన్నాయి. అధిక టారిఫ్‌లతో వీటి ఉత్పత్తులకు ఉన్న పోటీ తగ్గిపోతుంది. దీంతో వాటికి ఆర్డర్లు తగ్గుతాయి. ఆయా సంస్థల ఉద్యోగులపై ప్రభావం పడుతుంది’అని అనరాక్ వివరించింది. అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం అన్నవి కనిష్ట స్థాయికి పడిపోయినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 2025 మొదటి ఆరు నెలల్లో 1.9 లక్షల యూనిట్ల ఇళ్లు అమ్ముడవగా.. ఇందులో అందుబాటు ధరల విభాగంలో విక్రయాలు 34,565 యూనిట్లుగానే ఉన్నట్టు పేర్కొంది.కోలుకోవడానికి ఇబ్బందులు..‘రూ.45 లక్షలు లేదా అంతకంటే తక్కువ ధరల్లోని ఇళ్లు ఈ విభాగం కిందకు వస్తాయి. ఈ విభాగంపై కరోనా విపత్తు పెద్ద ప్రభావాన్నే చూపించింది. కోలుకునేందుకు ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ విభాగం పట్ల ఉన్న కొద్దో గొప్ప ఆశలను ట్రంప్ అధిక టారిఫ్‌లు ఆవిరి చేస్తున్నాయి’ అని అనరాక్ రీసెర్చ్ ఈడీ ప్రశాంత్ ఠాకూర్ వివరించారు.ఇదీ చదవండి: నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే?భారత జీడీపీలో ఎంఎస్ఎంఈలు 30 శాతం వాటా కలిగి ఉన్నాయన్న ప్రభుత్వ గణాంకాలను అనరాక్ ప్రస్తావించింది. అలాగే ఎగుమతుల్లో 45 శాతం వాటా ఆక్రమిస్తున్నట్టు తెలిపింది. అమెరికా 50 శాతం టారిఫ్‌లతో ఎంఎస్ఎంఈలు, వాటి సిబ్బందిపై గణనీయమైన ప్రభావం పడుతుందని అంచనా వేసింది. ఎంఎస్ఎంఈలు, ఎస్ఎంఈల్లో పనిచేసే సిబ్బంది అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో ప్రధాన వినియోగదారులుగా ఉన్నట్టు తెలిపింది. దీంతో ఈ విభాగంలో డిమాండ్‌పై ప్రభావం పడుతుందని పేర్కొంది. ఇది కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణపైనా ప్రభావం చూపిస్తుందని వివరించింది. -
బంగారంపై సుంకం లేదు: డొనాల్డ్ ట్రంప్
బంగారం దిగుమతులపై అదనపు సుంకాలు ఉండవని అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' పేర్కొన్నారు. ఇటీవల ఆయన విధించిన సుంకాల పెంపు బంగారు కడ్డీలకు వర్తిస్తుందా?, లేదా?.. అనే దానిపై గందరగోళం చెలరేగిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్ట్ చేశారు.బంగారం మీద సుంకాలు విధించడం వల్ల.. వీటి ధరలు మరింత ఎక్కువవుతాయి. ఇది ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి బంగారంపై సుంకాల విషయంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగా ట్రంప్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తరువాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.ట్రంప్ పోస్ట్ తర్వాత.. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ రేటు ఔన్సుకు 2.4 శాతం తగ్గి 3,407 డాలర్లకు చేరుకుంది. దీంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర 1.2 శాతం మేర తగ్గి 3,357 డాలర్ల వద్ద నిలిచింది. గోల్డ్ మైనింగ్ కంపెనీల షేర్స్ కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.BREAKING: President Trump just declared that gold will not be tariffed!HUGE! pic.twitter.com/0JdVT9cXIs— Gunther Eagleman™ (@GuntherEagleman) August 11, 2025భారతదేశంలో బంగారం ధరలుబంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం గోల్డ్ రేటు తగ్గుముఖం పడుతోంది. ఈ రోజు కూడా పసిడి ధరలు గరిష్టంగా రూ. 880 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 101400 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ. 800 తగ్గి.. రూ. 92950 (10 గ్రామ్స్) వద్ద నిలిచింది.ఇదీ చదవండి: కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం: అమల్లోకి ఎప్పుడంటే? -
టెలికాం టారిఫ్‌లు పెంపు?
ఈ ఏడాది చివరికల్లా టెలికాం ఆపరేటర్లు కొత్త టారిఫ్ పెంపును ప్రకటిస్తారని పరిశ్రమ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దాంతో మళ్లీ అధిక రీఛార్జ్ బిల్లులు చెల్లించాల్సి వస్తుందని భారతీయ మొబైల్ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య ఈ పెరుగుదల ఉండొచ్చని ఇక్రా ప్రతినిధి అంకిత్ జైన్ తెలిపారు. అయితే ఈ పెంపు టెలికాం కంపెనీని అనుసరించి మొత్తం టారిఫ్‌లో 15-20% కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని, ఇది 2024లోని పెంపు కంటే తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు.‘టెలికాం కంపెనీల టారిఫ్ పెంపు తప్పదు. మొత్తం టారిఫ్‌లో ఇది 15-20 శాతం కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. 2025 ఆర్థిక సంవత్సరంలో ఒక వినియోగదారుడి నుంచి కంపెనీలకు సమకూరే సగటు ఆదాయం(ఆర్పూ) రూ.200గా ఉంది. ఇది 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.220కు పెరుగుతుంది’ అని అంకిత్ అన్నారు.గతంలో ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలు టారిఫ్‌లను 19-21 శాతం పెంచాయని, దీంతో కొంతమంది వినియోగదారులు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపారని నిపుణులు చెబుతున్నారు. ఈసారి ప్లాన్ వ్యాలిడిటీ పీరియడ్స్ మార్చకుండా ధరల పెంపుపై ఆపరేటర్లు దృష్టి సారిస్తారని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఐసీఐసీఐ పేదల బ్యాంకు కాదా? మినిమం బ్యాలెన్స్ రూల్స్‌లో మార్పుభారతీ ఎయిర్టెల్ ఇప్పటికే డేటా టారిఫ్‌లను పెంచే సూచనలు చేసింది. ‘భారత్‌లో మొబైల్ టారిఫ్ డిజైన్ తారుమారుగా ఉంది. సంపన్నులు తక్కువ చెల్లిస్తున్నారు. పేదలు కూడా వారితో సమానంగా పే చేస్తున్నారు. ఇది మారాల్సి ఉంది’ అని భారతీ ఎయిర్టెల్ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ కంపెనీ ఇటీవల తెలిపారు. రిలయన్స్ జియో ప్రతినిధులు ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుత 5జీ పెట్టుబడులకు మద్దతు ఇవ్వడానికి టారిఫ్ దిద్దుబాట్లు అవసరమని చెప్పారు. -
పెరుగుతున్న బంగారం ధరలు: ప్రధాన కారణాలు
బంగారం ధరలు గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గోల్డ్ రేటు మరింత పెరిగి పసిడి ప్రియులను అవాక్కయ్యాలా చేసింది. ఈ స్థాయిలో కనకం ధరలు పెరగడానికి కారణం ఏమిటనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత పెంచిన సుంకాలు చాలామంది పెట్టుబడిదారుల్లో భయాన్ని రేకెత్తించింది. స్టాక్ మార్కెట్లు కుప్ప కూలుతుంటే.. బంగారం రేటు మాత్రం ఆకాశాన్నంటుతోంది. దీనికి ప్రధాన కారణం పెట్టుబడిదారులు.. గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడమే అని నిపుణులు భావిస్తున్నారు.2025 ఆగస్టు 01న గరిష్టంగా రూ. 210 తగ్గి రూ.99,820 (10 గ్రా 24 క్యారెట్స్) వద్ద నిలిచిన గోల్డ్ రేటు.. ఆ తరువాత ఆగస్టు 08 నాటికి రూ. 1,03,310 కు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర ఈ మధ్య కాలంలోనే రూ. 3490 పెరిగింది. ఇది బంగారం ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి తెలుపడానికి నిదర్శనం.బంగారు కడ్డీలపై అమెరికా సుంకాలు, బలహీనమైన అమెరికా డాలర్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపుపై మార్కెట్ అంచనాలు, ఆర్థిక అనిశ్చితి మధ్య పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ వంటివన్నీ గోల్డ్ రేటు పెరగడానికి కారణమవుతున్నాయి.ఇదీ చదవండి: ప్రపంచాన్ని వణికించిన '1929 మహా మాంద్యం': ప్రధాన కారణాలు ఇవే..అస్థిర ఆర్థిక పరిస్థితుల్లో బంగారం సురక్షితమైన ఆస్తి. కాబట్టి గోల్డ్ కొనుగోలు చేసే పెట్టుబడిదారుల సంఖ్య కూడా పెరిగింది. ఓ వైపు శ్రావణమాసం.. మరోవైపు వస్తున్న పండుగ సీజన్. ఇవన్నీ కూడా బంగారం ధరలను మరింత పెంచే అవకాశం ఉంది. 2005లో రూ. 7000 వద్ద ఉన్న గోల్డ్ రేటు.. 2025లో రూ. 100000 దాటేసింది. దీన్నిబట్టి చూస్తే దశాబ్దంలో రేటు ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. -
‘మా ట్రంప్ అతి పెద్ద తప్పిదం చేశారు’
వాషింగ్టన్: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాల నిర్ణయం ఎంతమాత్రం సరైన నిర్ణయం కాదని అంటున్నారు ఆ దేశ జాతీయ సెక్యూరిటీ మాజీ సలహాదారు జాన్ బాటమ్. భారత్ వస్తువులపై ట్రంప్ విధించిన సుంకాల తీరును తీవ్రంగా తప్పబట్టారాయన. కచ్చితంగా ఇది ట్రంప్ చేసిన అతి పెద్ద తప్పిదంగా అభివర్ణించారు. ఎన్నో దశాబ్దాల నంచి భారత్‌తో ఉన్న మిత్రత్వం ట్రంప్ సుంకాల దెబ్బతో అది కాస్తా బెడిసి కొట్టే ప్రమాదం అధికంగా ఉందన్నారు. చైనా కంటే అత్యధిక సుంకాలు విధించడం భారత్ పట్ల వివక్ష ధోరణికి నిదర్శమన్నారు. చైనాకు సుంకాలు పెంచి ఉపశమన కల్పించిన ట్రంప్.. భారత్‌పై 50 శాతం సుంకాలంటూ బెదిరింపు చర్యలకు దిగడం అమెరికా-భారత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. చైనాపై ఉదాసీనత కనబరిచిన ట్రంప్.. భారత్‌ను రష్యా, చైనాలను దూరం చేయడానికి దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ప్రమాదంలో పడేస్తాయన్నారు. భారత్‌ను రష్యా, చైనాల నుంచి వేరు చేయడానికి చేసిన ట్రంప్ వ్యూహం కచ్చితంగా అతి పెద్ద తప్పిదమేనని నొక్కి మరీ చెప్పారు. సీఎన్ఎన్తో మాట్లాడిన ఆయన ట్రంప్ విధించే సుంకాలపై గురించి, ప్రత్యేకంగా భారత్‌పై విధించిన సుంకాలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరొకవైపు అమెరికా విదేశాంగ విధాన నిపుణుడు, ఆ దేశ మాజీ వాణిజ్య అధికారి క్రిస్టోఫర్ పాడిల్లా కూడా భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సుంకాలు ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలకు దీర్ఖకాలిక నష్టం కల్గించే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. ఇక్కడ అమెరికా నమ్మకమైన భాగస్వామి కాదు అనేది తలెత్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఫార్మాపైనా.. టారిఫ్ పిడుగు
భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నామని ప్రకటించిన అమెరికా... రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొంటున్నదన్న కారణంతో మరో 25 శాతం పెనాల్టీ సుంకాలు కూడా విధించింది. వెరసి ఈ 50 శాతం సుంకాలూ ఈ నెల్లోనే అమల్లోకి రానున్నాయి. దీనివల్ల చాలా భారత కంపెనీలు తమ ఉత్పత్తుల ధరల్ని పెంచాలి. ఇలా పెంచితే మిగతా దేశాల నుంచి ఎదురయ్యే పోటీలో వెనకబడిపోవచ్చు. ఇవన్నీ పలు కంపెనీల ఆదాయాలకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. సెక్షన్ 232 ప్రకారం దిగుమతి సుంకాల నుంచి ఫార్మా సహా కొన్ని ఉత్పత్తులకు మినహాయింపు ఉండటంతో ఫార్మా కంపెనీలు ప్రస్తుతానికి ధీమాగానే ఉన్నాయి. కానీ ఫార్మాను కూడా సుంకాల్లో చేరుస్తామని, 250 శాతం టారిఫ్‌లు వేస్తామని ట్రంప్ వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇదే జరిగితే అమెరికాయే ప్రధాన ఆదాయ వనరుగా సాగుతున్న పలు భారత ఫార్మా కంపెనీలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అమెరికా జనరిక్ డ్రగ్ మార్కెట్లో భారత్‌ది ఏకంగా 33 శాతం వాటా. టారిఫ్‌లు గనక వర్తిస్తే మన కంపెనీలకు ఎదురయ్యే ఇబ్బందులపై ‘సాక్షి బిజినెస్’ ప్రత్యేక కథనమిది... – సాక్షి బిజినెస్ డెస్క్ఇవీ.. మన సానుకూలతలు» మన దేశంలో కార్మికుల వ్యయాలు తక్కువ. నిపుణుల లభ్యత ఎక్కువ. టెక్నాలజీ కూడా ఉంది. అందుకనే యూఎస్ ఎఫ్‌డీఏ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులను భారత ఫార్మా సంస్థలు తయారు చేయగలుగుతున్నాయి. అమెరికా మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మన కంపెనీలు గట్టి పోటీనివ్వగలుగుతున్నాయి.» అమెరికా మార్కెట్లో అమ్ముడుపోయే ప్రతి మూడు జనరిక్ ఔషధాల్లో ఒకటి భారత కంపెనీలు సరఫరా చేస్తున్నదేనంటే... కారణమిదే » మన ఫార్మా రంగం గనక 25– 50 శాతం టారిఫ్‌లను ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు మన ఔషధాలు అమెరికా మార్కెట్లో ప్రియమవుతాయి. ధరల పరంగా ఉన్న వెసులుబాటు తగ్గిపోతుంది. » తక్కువ ధరలకే ఉత్పత్తులు విక్రయించే అవకాశం పోయినట్లయితే... పోటీలో వెనకబడే ప్రమాదం ఉంటుంది. తక్కువ మార్జిన్ ఉండే జనరిక్స్‌లో ఇది మరింత సుస్పష్టం.ఆదాయం, లాభాలకు గండి» చాలా ఫార్మా సంస్థల ఆదాయాల్లో అమెరికా మార్కెట్ వాటా 30–55 శాతం వరకు ఉంటోంది. » అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా, లుపిన్, సిప్లా, గ్లాండ్ ఫార్మా తదితర సంస్థలపై అధిక ప్రభావం పడుతుంది.» కనీసం 17 శాతం వరకు ఆదాయాలు తగ్గిపోతాయన్నది విశ్లేషకుల అంచనా.ఏ దేశం నుంచి పోటీ ఉండొచ్చు?చైనా» యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియెంట్స్ (ఏపీఐ) మార్కెట్లో బలంగా ఉంది. » భారత ఫార్మా సంస్థలు ఫార్ములేషన్లపై ప్రధానంగా దృష్టి సారించడంతో ఏపీఐ మార్కెట్లో చైనా వాటా పెరిగింది.» చైనా మందులపై అమెరికాలో నమ్మకం తక్కువ. కోవిడ్ తరవాత ఇది మరింత పెరిగింది కూడా.» నాణ్యత, నమ్మకం, నియంత్రణల పరమైన అంశాల కారణంగా ఫార్మా విషయంలో భారత్ స్థానాన్ని చైనా భర్తీ చేయలేదు. మెక్సికో» అమెరికా మార్కెట్లోకి పన్నుల్లేకుండా వెళ్లగలగటం మెక్సికోకు ఉన్న సానుకూలత.» మెక్సికోలో జనరిక్స్ తయారీ సదుపాయాలు తక్కువే. గణనీయంగా ఎగుమతులు చేసే స్థాయిలో లేదు. దగ్గర్లో ఉండడం వల్ల, వాణిజ్య ఒప్పందాల వల్ల భవిష్యత్తులో మార్కెట్‌ను పెంచుకోగలదు.పోలాండ్, తూర్పు యూరప్» కాంట్రాక్టు తయారీ పరంగా పోటీనిస్తున్నాయి. ఈయూ నియంత్రణపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి.» భారత్‌తో పోల్చి చూస్తే తయారీ వ్యయాలు బాగా ఎక్కువ. కాకపోతే భౌగోళికంగా చూస్తే అమెరికా, ఈయూకు దగ్గర.» డిమాండ్‌లో మార్పులతో కొంత లాభపడొచ్చు.బంగ్లాదేశ్» తక్కువ ఖర్చుకే జనరిక్స్ ఔషధాలు తయారు చేయడంలో బంగ్లాదేశ్ ముందుంది.» వెనకబడిన దేశాలకు కల్పించిన ‘ట్రిప్స్ వైవర్’ కారణంగా ప్రయోజనం పొందగలదు.» అయితే భారత్‌లో మాదిరి ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ప్లాంట్లు ఇక్కడ చెప్పుకోతగ్గ స్థాయిలో లేవు.» కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేసి ఎఫ్‌డీఏ ప్రమాణాలను అందుకోవటం అంత తేలిక కాదు. బ్రెజిల్» ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఫార్మా మార్కెట్. ఎగుమతి సదుపాయాలు తక్కువే. దేశీయంగా ఉన్న డిమాండ్‌ను అందుకోవటమే ఇక్కడి కంపెనీలకు కష్టం. కనుక భారత ఎగుమతులకు ముప్పు కాదు.వ్యూహాత్మక అడుగులు» ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తే... అమెరికాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయటం.. అక్కడి కంపెనీలను కొనుగోలు చేయటం వంటి ప్రత్యామ్నాయాలను మన కంపెనీలు పరిశీలించే అవకాశం ఉంటుందన్నది నిపుణుల మాట. అరబిందో ఫార్మా ఇటీవలే యూఎస్‌కు చెందిన లానెట్ ఫార్మాను 250 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడాన్ని ఈ కోణంలో చూడొచ్చు. » ప్రత్యామ్నాయ మార్కెట్లలో... అంటే యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్లో అవకాశాలపై ఫార్మా కంపెనీలు దృష్టి పెట్టొచ్చు. » అమెరికా మార్కెట్‌పై ఆధారపడడాన్ని తగ్గించేందుకు కొత్త ఆవిష్కరణలు, బయోసిమిలర్స్, స్పెషాలిటీ డ్రగ్స్ దిశగా కంపెనీలు అడుగులు వేయొచ్చు. » ప్రభుత్వాల మధ్య ఫార్మా డీల్స్ కోసం లాబీయింగ్ చేయొచ్చు.అమెరికా వినియోగదారులపైనే భారం..భారత ఫార్మా రంగంపై టారిఫ్‌లు విధించడం ప్రతికూల పరిణామాలకు దారి తీస్తుంది. అంతిమంగా అమెరికా వినియోగదారులపైనే భారం పడుతుంది. భారతీయ కంపెనీలు ఎక్కువగా మార్జిన్ లభించని అత్యంత చౌకైన జనరిక్స్‌ను తయారు చేస్తాయి. కాబట్టి, టారిఫ్‌లపరంగా భారం మోపితే అది అమెరికన్ వినియోగదారుల మీదే పడుతుంది. ఉత్పత్తి పరిమాణం, ఖరీదు తదితర అంశాలపరంగా భారత్ తరహా సామర్థ్యాలను సాధించాలంటే కనీసం 3–5 ఏళ్లు పట్టేస్తుంది. దేశీ సంస్థలకు 700 పైగా అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ప్లాంట్లు ఉండగా, 12 శాతం ఆదాయాలను నిబంధనలను పాటించడంపై వెచ్చిస్తున్నాయి. –నమిత్ జోషి, చైర్మన్, ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్టారిఫ్లు తీవ్రంగా ఉండకపోవచ్చు..గత నాలుగు దశాబ్దాలుగా, భారత ఫార్మా రంగం బాగా పెరిగి అంతర్జాతీయ హెల్త్‌కేర్ సరఫరా వ్యవస్థల్లో కీలకంగా మారింది. మన సంస్థలు ఏపీఐలు, ఇంటర్మీడియట్స్, స్పెషలైజ్డ్ ఫార్ములేషన్లను విస్తృత స్థాయిలో తయారు చేస్తాయి. విశేషమైన నైపుణ్యాలు, తక్కువ ధరకే అందించగలిగే సామర్థ్యాలతో పాటు అమెరికా హెల్త్‌కేర్ వ్యవస్థతో గణనీయంగా అనుసంధానమయ్యాయి. ఒకరిపై ఒకరు ఆధారపడటం వల్లే ప్రస్తుత టారిఫ్ వ్యవస్థలో ఫార్మాకు మినహాయిపు ఉంటోంది. ఈ నేపథ్యంలో మన ఫార్మా మీద మిగతా పరిశ్రమల్లాగా అమెరికా తీవ్ర స్థాయి టారిఫ్‌లు వేయకపోవచ్చు. – డి. శ్రీనివాస రెడ్డి, చైర్మన్, ఆప్టిమస్ ఫార్మామన బలాన్ని మనమూ ఉపయోగించుకోవాలి..మన ఫార్మాపై టారిఫ్‌లు విధిస్తే ఇవి అమెరికా ప్రయోజనాలకే విఘాతం కలిగిస్తాయి. 2013– 2022 మధ్య పదేళ్లలో మన జనరిక్స్ కారణంగా అమెరికా ఎకానమీకి 1.3 లక్షల కోట్ల డాలర్లు ఆదా అయ్యాయి. 200–250 శాతం స్థాయిలో టారిఫ్‌లు వేయకపోవచ్చు కానీ, మిగతా వాటిలా 50 శాతం వేసినా మన ఫార్మాకు ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది. ప్రస్తుతానికైతే జనరిక్స్‌కి సంబంధించి భారత్‌కి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి మనం కూడా మన బలాన్ని ఉపయోగించుకుని, గట్టిగా మాట్లాడాలి. – రావి ఉదయ భాస్కర్, డైరెక్టర్ జనరల్, అఖిల భారత ఔషధ నియంత్రణ అధికారుల సమాఖ్య (ఏఐడీసీవోసీ)సింహ భాగం అమెరికా నుంచే..2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మా మొత్తం ఎగుమతులు 30.47 బిలియన్ డాలర్లయితే... అందులో 9.8 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు అమెరికాకే వెళ్లాయి. అంటే.. మూడో వంతు ఔషధాలు అమెరికాకే వెళ్లాయి. ఈ సమయంలో అమెరికా మార్కెట్ నుంచే అత్యధిక ఆదాయాన్ని పొందిన కొన్ని భారత ఫార్మా కంపెనీలను చూస్తే...ఫార్మా ఉత్పత్తులపైనా టారిఫ్‌లు బాదేస్తే.. అమెరికా మార్కెట్లో కీలకంగా పనిచేస్తున్న ఈ కంపెనీల ఆదాయాలపై గణనీయమైన ప్రభావం పడనుంది. సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, బయోకాన్ సంస్థలకు 17 శాతం వరకు ఆదాయం తగ్గొచ్చన్నది విశ్లేషకుల మాట. దివీస్ ల్యాబొరేటరీస్ ఇటీవలే ప్రకటించిన జూన్ త్రైమాసికం ఫలితాలు నిరుత్సాహకరంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లో తలెత్తిన ధరలపరమైన ఒత్తిళ్ల వల్లే ఇలా జరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. -
మరో బాంబ్ పేల్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
-
విచక్షణ మరిచిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తన మాట వినని దేశాలపై తోచిన మోతాదులో సుంకాలు వేయటం నిత్యకృత్యమైంది. ఈ క్రమంలో న్యాయం, ధర్మం, విచక్షణ, హేతుబద్ధత వగైరాలు లేవు. రెండోసారి దేశాధ్యక్షుడైనా తమ దేశం ఎవరెవరితో ఏ స్థాయి వాణిజ్యం నెరపుతున్నదో తెలియని ట్రంప్... వేరే దేశాలు ఎవరితో ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకోవాలో, వద్దో నిర్ణయించటానికి తగుదునమ్మా అంటూ తయారయ్యారు. ఈనెల 1 నుంచి మన దేశంపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు లోగడ ప్రకటించిన ట్రంప్, వారం తిరగకుండానే మరో 25 శాతం మేర సుంకాలుంటాయని తాజాగా నిర్ణయించారు. ఇవిగాక పరోక్ష సుంకాలు మొదలవు తాయట. ఇవన్నీ 250 శాతం దాటినా దాటొచ్చని లోగడే ఆయన సెలవిచ్చారు. తన మాట నెగ్గటానికి కనిపించిందల్లా విసిరికొట్టే అల్లరిపిల్లల మొండిధోరణికీ, ట్రంప్ చేష్టలకూ తేడా ఉందా? తనకు రష్యా నచ్చలేదు గనుక ఆ దేశం నుంచి ముడి చమురు కొనరాదని ఆయన శాసిస్తున్నారు. ఉక్రెయిన్‌తో జగడం ఆపేయాలని పదే పదే కోరుతున్నా వినని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అక్కసుతో ఇవన్నీ చేస్తున్నట్టు అందరికీ కనబడుతోంది. కానీ అసలు కారణాలు వేరు. నిజానికి రష్యా చమురు కొని ప్రపంచమార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడమని గతంలో చెప్పింది అమెరికాయే!ప్రేమాభిమానాలను అపాత్రదానం చేయకూడదు. ట్రంప్ వ్యవహారశైలి చూచాయగా తెలుస్తున్నా, తొలి దఫాలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారు. దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలకు సానుకూలత అవసరమే. కానీ దానికి కూడా అవధులుంటాయి. 2019 సెప్టెంబర్‌లో అమెరికాలోని టెక్సాస్‌లో ‘హౌడీ మోదీ’ కార్యక్రమమైనా,ఆ మరుసటేడాది ట్రంప్ భారత్ సందర్శించినప్పుడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ‘నమస్తే ట్రంప్’ అయినా దౌత్య పరిమితులు దాటాయన్న విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం సంగతి సరే... పౌరులు కూడా ఆ మాదిరే ఉన్నారు. అమెరికాలోని కొందరు ఎన్నారైలు ఆయన దేశాధ్యక్షుడు కావాలని యజ్ఞయాగాదులు చేశారు. అంతేకాదు... ప్యూ రీసెర్చ్ సంస్థ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రపంచ వ్యవహారాల్లో ట్రంప్ వ్యవహారశైలిపై 24 దేశాల్లో 28,333 మందిని సర్వే చేస్తే సగం మంది భారతీయులు ఆయనపై విశ్వాసం వ్యక్తపరిచారట. ఆ సంగతి అప్పట్లో ఆ సంస్థ ప్రకటించింది. టర్కీ, జర్మనీ, మెక్సికో లాంటి దేశాల్లో మాత్రం అత్యధికులు (80 శాతం పైగా) ట్రంప్‌పై నమ్మకం లేదని తెలిపారు. ఈ ఫలితాల్లో మనం హంగేరి, ఇజ్రాయెల్, నైజీరియా, కెన్యాల సరసన చేరాం.అయితే ట్రంప్ వికృత విన్యాసాలు గమనించాక మోదీ ఆయన విషయంలో దృఢవైఖరి ప్రదర్శిస్తున్నారు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి అన్నదాతల, మత్స్యకారుల ప్రయోజనాలను విస్మరించే ప్రశ్నే లేదని గురువారం ఆయన మరోసారి కుండబద్దలు కొట్టారు. ఇందుకు వ్యక్తిగతంగా మూల్యం చెల్లించాల్సి వచ్చినా సిద్ధమేనన్నారు. మోదీ, ట్రంప్‌ల మైత్రి గురించి ఉన్న అభిప్రాయంతో సుంకాల ఒప్పందంలో అమెరికాదే పైచేయి అవుతుందనుకున్న మన విపక్షాలకు ఇది నిరాశ కలిగించే పరిణామమే. దేశంలో 70 కోట్లమంది ప్రజానీకం ఆధారపడి బతికే రంగాలను విదేశాలకు గంపగుత్తగా అప్పగించే దుస్సాహసం ఎవరైనా చేయగలుగుతారా? పైగా అవి జన్యుమార్పిడి చేసినవి. ఆ చెత్త మన మార్కెట్లను ముంచెత్తితే కలిగే దుష్పరిణామాల గురించి చాన్నాళ్లుగా పర్యావరణవాదులు చెబుతూ వచ్చారు. తమ సాగు, పాడి ఉత్పత్తులపై అసలు సుంకాలే విధించరాదన్నది ట్రంప్ ఆంతర్యం. ఆశపడటం సహజం... కానీ అది దురాశగా మార రాదని ఆయన గారికి చెప్పేదెవరు? ‘జీరో’ సుంకాల సంగతి బహిరంగంగా చెబితే నలుగురూ నోళ్లు నొక్కుకుంటారని ట్రంప్ భయపడి రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ, రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు ఆపాలన్న రాగం అందుకున్నారు. ఏ సరుకు ధరైనా మార్కెట్ శక్తులు నిర్ణయించే వర్తమానంలో రష్యా నుంచి చవగ్గా కొనరాదని, దాన్ని హెచ్చు ధరకు అమ్మ రాదని ఆంక్షలు విధించాలని చూడటం ట్రంప్ తెలివితక్కువతనం. అమెరికా ఇన్నాళ్లూ ప్రవచించిన ప్రపంచీకరణకు వ్యతిరేకం. పైగా చైనాతో పోలిస్తే మన ముడిచమురు కొనుగోళ్లు తక్కువ. అయినా ఆ దేశంపై ట్రంప్ సానుకూలంగా ఉన్నారు.ట్రంప్ పాత, కొత్త సుంకాలు అమలైతే భారత్ జీడీపీపై 0.6 శాతం ప్రభావం పడుతుందని ప్రముఖ మదుపు సంస్థ గోల్డ్‌మాన్ శాక్స్ ప్రకటించింది. ఇదిగాక వాణిజ్య అనిశ్చితి వల్ల పరోక్ష ప్రభావం ఉండొచ్చని ఆ సంస్థ చెబుతోంది. మొత్తానికి ట్రంప్ ఇదే మంకుపట్టుతో ఉంటే మనకు ఏదోమేర సమస్యలుండక తప్పదు. ఈ వైరం మనం కోరుకున్నది కాదు. అయినా వచ్చి పడింది. కనుక కలిసికట్టుగా ఉండి ఎదుర్కొనటమే ఏకైక మార్గం. -
ఈ అణు దూకుడుతో మళ్లీ అనర్థం
హిరోషిమా, నాగసాకీలపై అణ్వస్త్ర ప్రయోగాలు జరిగిన 80 సంవత్సరాలకు తిరిగి అణ్వస్త్రాల ప్రస్తావనలు వస్తుండటం ప్రపంచాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నది. కాకతాళీయంగా ఈసారి కూడా ఆ ప్రస్తావనలు చేస్తున్న అమెరికా... రష్యా సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర జలా లలోకి రెండు అణ్వస్త్ర జలాంతర్గాములను తరలించింది. ఈ విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్ది రోజుల క్రితం స్వయంగా ప్రకటించారు. అక్కడి నుంచి దక్షిణాన అవే సముద్ర జలాలలో జపాన్ ఎంతో దూరంలో లేదు. ట్రంప్ చర్యలకు ప్రతిగా రష్యన్లు తమవద్ద గల ‘డెడ్ హ్యాండ్’ అణ్వస్త్ర వ్యవస్థ గురించి గుర్తు చేశారు. 1987 నుంచి గల అణ్వాయుధ క్షిపణుల నిరోధక ఒప్పందం నుంచి ఉపసంహరించుకున్నారు. ఇది ఈ 5వ తేదీ నాటి పరిణామం. ఇవన్నీ వెంటవెంటనే వారం రోజులలోపే జరిగిపోయాయి.ఏమిటీ ‘డెడ్ హ్యాండ్’ వ్యవస్థ?అమెరికా, రష్యాల మధ్య అణు యుద్ధం రాగల అవకాశం సాధారణ దృష్టికైతే కనిపించటం లేదు. ట్రంప్ ఒకవైపు అణు జలాంతర్గాముల మోహరింపునకు ఆదేశాలిస్తూనే, ‘డెడ్ హ్యాండ్’ ప్రస్తావ నలు చేస్తున్న రష్యా అటువంటి చర్యలకు పాల్పడగలదని భావించటం లేదనీ, అయినా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ అన్నారు. మరొకవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఈ తరహాలో అణు ప్రస్తావనలు ఎవరికీ మంచిది కాదన్నారు. ఆ విధంగా చూసినపుడు ఎవరికి వారు ఎంతో కొంత జాగ్రత్తలలోనే ఉన్నట్లు భావించాలి. అసలు విషయం ఇంత దూరం ఎందుకు వచ్చింది?చర్చను ఒక తక్షణ విషయంతో ఆరంభిద్దాము. రష్యా తన ఉక్రెయిన్ యుద్ధాన్ని 10 రోజులలో ఆపివేసి శాంతి ఒప్పందంపై సంతకాలు చేసి తీరాలని అమెరికా అధ్యక్షుడు తనంతట తానే ఒక గడువు విధించారు. ఆ గడువు ఈనెల 9వ తేదీతో ముగుస్తుంది. కొన్ని రోజుల క్రితం ఇలాగే 50 రోజుల గడువు ప్రకటించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా అన్నట్లు ప్రపంచానికి అన్ని విధాలా ఒక చక్రవర్తి వలె వ్యవహరిస్తున్న ట్రంప్, అందరికీ ఆదేశాలు, హెచ్చరికలను ఎడాపెడా జారీ చేస్తున్న తీరును చూస్తూనే ఉన్నాము. ట్రంప్ నుంచి ఇటువంటి ధోరణిని సహించలేని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు, మాజీ దేశాధ్యక్షుడు అయిన మెద్వెదేవ్ ఆయనకు తమ అణ్వస్త్ర శక్తిని, ‘డెడ్ హ్యాండ్’ పేరుతో గల అణు వ్యవస్థను గుర్తు చేశారు. సాధారణ ప్రచారంలో లేని ‘డెడ్ హ్యాండ్’ వ్యవస్థ ఏమంటే, ఒకవేళ అమెరికా మొదటగా అణ్వస్త్రాలు ప్రయో గించి రష్యా రాజకీయ నాయకత్వాన్ని, సైనిక నాయకత్వాన్ని పూర్తిగా తుడిచి పెట్టినట్లయితే, తదనంతర చర్యలకు వారి నుంచి ఆదేశాలు అందని స్థితిలో, మొదటినుంచే మోహరించి ఉన్న అణ్వ స్త్రాలు అన్నీ వెంటనే తమంతట తాము అమెరికా, యూరప్‌లలోని తమ లక్ష్యాల వైపు క్షణాలలో దూసుకుపోతాయి. నాయకత్వాల నుంచి ఆదేశాలు ఆగిపోయాయనే సంగతి అల్ట్రా లో ఫ్రీకెన్సీ రేడియో తరంగాల ద్వారా తెలుస్తుంది. ఆ తరంగాలను అమెరికా సహా ఎవరూ పసిగట్టలేరు, విశ్లేషించలేరు, హైజాక్ చేయలేరు, నిరోధించ లేరు. ట్రంప్‌కు మెద్వెదేవ్ ఇచ్చిన సందేశమది. అంతిమార్థం ఏమంటే, ట్రంప్ చర్యలు వినాశనానికి దారితీయవచ్చునని.ప్రపంచం మొత్తానికీ యుద్ధమే!అణుయుద్ధం అమెరికా, రష్యాల మధ్య అయితే తక్కిన ప్రపంచానికి సమస్య ఏమిటనే సందేహం కలగవచ్చు. 1945కూ, ఇప్పటికీ తేడాలున్నాయి. అపుడు అమెరికా ఏకైక అణుశక్తి. తర్వాత నాలు గేళ్లకు 1949లో రష్యా అణుశక్తి పరీక్షతో పరిస్థితులు మారసాగాయి. అమెరికా, రష్యాలు పరస్పరం పోటీపడి అణ్వస్త్రాల సంఖ్యను వేలకు వేలుగా పెంచటంతో పాటు అందులో కొత్త రకాలపై పరిశోధనలు నేటికీ జరుపుతున్నాయి. అందులో, మొదటి విడత విధ్వంసం, దానిని తట్టుకుని రెండవ విడత విధ్వంసం, పరస్పర విధ్వంస శక్తి, యుద్ధ విమానాలు, సముద్ర జలాల నుంచి ప్రయోగాలు (ట్రయాడ్ వ్యవస్థ) అంటూ రెచ్చి పోయారు. ఈమధ్యలో మరొక అర డజన్ అణ్వస్త్ర దేశాలు తయారయ్యాయి. అటువంటి ఆయుధాలు అర డజను ఉన్నా చాలు విధ్వంసానికి అనే వివేకం కలగటంతో అణ్వస్త్ర పరిమితి ఒప్పందాలు, వాటి మోహరింపుల పరిమితిపై ఒప్పందాలు దశలు దశలుగా జరిగాయి.వాటిలోని లోపాలను అట్లుంచితే, ప్రపంచం కొన్ని దశాబ్దా లుగా ఇతర యుద్ధాలు ఎట్లున్నా అణ్వస్త్ర ప్రయోగాలు లేక ప్రశాంతంగా ఉంది. అందుకు కారణం పరస్పర విధ్వంస శక్తి (మ్యూచు వల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, లేదా మ్యాడ్) అని, ఆ విధంగా ‘బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్’ అనే స్థితి ఏర్పడిందని అంతా భావించారు. ఆ పరిస్థితు లలోనూ గమనించదగ్గవి కొన్ని జరిగాయి. ఎవరిపైనా అణ్వస్త్ర ప్రయోగపు ఆలోచనలు రష్యా చేయలేదు గానీ, వియత్నాం, ఉత్తర కొరియా, అఫ్గానిస్తాన్‌లు కొరకరాని కొయ్యలుగా మారటంతో అమె రికా అందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి మళ్లీ వెనుకకు తగ్గింది.అప్రమత్తత కలిగేనా?ఇటువంటి చరిత్ర ఉన్నందువల్లనే ఇపుడు తిరిగి అమెరికా,అందులోనూ ట్రంప్ వంటి అనాలోచితుడు, చంచలచిత్తుడు, విపరీ తమైన అహంభావి ఆదేశాలతో అణుజలాంతర్గాములను ఇప్పటికే రష్యా సమీపానికి తరలించిందంటే, ప్రపంచవ్యాప్తంగా భయాందో ళనలు కలగటం సహజం. అణుయుద్ధం జరిగితే అది అమెరికా, రష్యాలకు పరిమితం కాదు. అమెరికా మిత్ర దేశాలను, రష్యా మిత్ర దేశాలను అనివార్యంగా అందులోకి లాగుతాయి. భయంకరమైన స్థాయిలో వెలువడే అణుధార్మిక శక్తి ఇండియా సహా అన్ని దేశాలకూ వ్యాపిస్తుంది. దాని ప్రభావం అన్ని సముద్ర జలాలతో పాటు మొత్తం వాతావరణాన్ని ఎంతకాలంపాటు కలుషితం చేస్తుందో బహుశా నిపుణులు కూడా అంచనా వేయలేరు. 80 ఏళ్ల క్రితం నాటి హిరో షిమా ప్రభావాలు జపాన్‌లో నేటికీ ఉన్నాయి.ఈ ప్రమాదకర పరిస్థితికి మూల కారణం, అమెరికా నాయ కత్వాన ‘నాటో’ దేశాలు ప్రత్యక్షంగా రష్యాను, పరోక్షంగా చైనాను లొంగదీసుకోవాలని భావించటంలో ఉంది. అందుకోసం చేస్తున్న రకరకాల ప్రయత్నాలలో భాగంగా ఉక్రెయిన్ను ఒక పావుగా ఉప యోగించుకుంటున్నారు. అది ఒక తప్పు కాగా, ఆ యుద్ధ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించలేకపోవటం ఒక వైఫల్యం. రష్యాను ఎన్ని ఆంక్షలు విధించినా బలహీనపరచలేకపోవటం ఇంకొక వైఫల్యం అవుతుండగా, ట్యారిఫ్ల పేరిట రష్యా, ఇండియా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వగైరాలను బెదిరించజూడటం అసమర్థ దుర్జనత్వమవుతున్నది. చివరకు అంతిమ ఆయుధంగా 50 రోజులు, 10 రోజుల గడువులు, అణు జలాంతర్గాముల స్థాయికి పతన మవుతూ యావత్ ప్రపంచాన్నే ప్రమాదంలోకి నెడుతున్నారు.విచారకరం ఏమంటే, మన దేశంలో ఒకప్పుడు ఉన్నత స్థాయిలో ఉండిన ఈ అప్రమత్తత ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుతున్నది. వారు మళ్లీ అప్రమత్తులు కావటం 80 ఏళ్ల హిరోషిమా విషాదానికి తగిన నివాళి అవుతుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ట్రంప్ టారిఫ్‌లపై ప్రధాని మోదీ స్ట్రాంగ్ కౌంటర్
-
భారత్ సుంకాల మోతపై పునరాలోచన! ట్రంప్ ఏమన్నారంటే..
భారత్‌పై పెనాల్టీగా మరో 25 శాతం టారిఫ్ విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యాతో చమురు వాణిజ్యం కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతుండగా.. ఇదే పని చేస్తున్న ఈయూ, చైనాలాంటి దేశాల విషయంలో ట్రంప్ ఉదాసీనతపై భారత్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో.. భారత్‌పై అదనపు సుంకాల నిర్ణయంపై ట్రంప్ వెనక్కి తగ్గుతారా?.. ఆయన ఏమన్నారంటే.. స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం(భారత కాలమానం ప్రకారం గురువారం వేకువజామున) వైట్‌హౌజ్‌లోని తన ఓవెల్ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారాయన. ఈ సందర్భంలో రష్యాతో చమురు వాణిజ్యం ఇంకా కొనసాగితే భారత్‌పై ద్వితీయ శ్రేణి ఆంక్షలు (Secondary Sanctions) తప్పవంటూ హెచ్చరించారు. అయితే.. రష్యా నుంచి చైనా కూడా చమురును కొనుగోలు చేస్తోంది కదా.. కేవలం భారత్‌ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా సుంకాల మోత మోగిస్తున్నారు? అని కొందరు మీడియా ప్రతినిధులు ట్రంప్‌నుప్రశ్నించారు. ‘‘ఇప్పటికి 8 గంటలకేగా గడిచింది. చూద్దాం ఏం జరుగుతుందో అంటూ సమాధానం ఇచ్చారాయన. మరిన్ని సుంకాలను మీరు చూడబోతున్నారు’’ అంటూ బదులిచ్చారు.ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంతో.. అమెరికా రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రష్యాతో చమురు కొనుగోలు చేసే ఇతర దేశాలపై కూడా secondary sanctions విధించే అవకాశాలు ఉన్నాయి. తాను వద్దన్నా కూడా రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోళ్లు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే.. రెండు విడతలుగా భారత్‌పై 50 టారిఫ్ విధించారు. ఇప్పుడు ఆంక్షల హెచ్చరికలూ జారీ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: ఉల్టా చోర్.. అమెరికా సహా పెద్ద దేశాల దొంగ నాటకంఅయితే ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చల్లో భాగంగా అతిత్వరలో ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీలను కలవనున్నట్లు వైట్‌హౌజ్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఒకవేళ ఉద్రిక్తతలు చల్లారితే భారత్‌పై అదనపు సుంకాల నిర్ణయాన్ని తొలగిస్తారా? అనే ప్రశ్న ట్రంప్‌కు ఎదురైంది. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. ఆ అంశాన్ని తర్వాత పరిశీలిస్తాం అని పేర్కొన్నారు. ఇక రష్యాతో ఆయిల్ కొనుగోలు జరుపుతున్న చైనాపైనా సుంకాల మోత తప్పదా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘ఇప్పుడే ఏం చెప్పలేను.. బహుశా అది జరగొచ్చు. భారత్ విషయంలో అది జరిగింది. అలాగే మరికొన్ని దేశాలకూ అది తప్పకపోవచ్చు. అందులో చైనా కూడా ఉండొచ్చు’’ అని అన్నారాయన. ఉక్రెయిన్ దురాక్రమణకు ప్రయత్నిస్తున్న రష్యాతో వాణిజ్య ఒప్పందాలు చేసే దేశాలను ఉపేక్షించబోనంటూ ట్రంప్ మొదటి నుంచి చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌పై తొలుత 25 శాతం, తాజాగా మరో 25 శాతం టారిఫ్‌లను ప్రకటించారు. దీంతో.. భారత్‌పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. -
ఎగుమతులపై ఎఫెక్ట్
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ మన ఎగుమతులను టార్గెట్ చేసుకున్నారు. ఇటీవలే వేసిన పాతిక శాతం సుంకాలను రెట్టింపు చేసి 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో అగ్రరాజ్యం 50 శాతం టారిఫ్‌లతో మనల్ని బ్రెజిల్ సరసన చేర్చినట్లయింది. మొదటి విడత టారిఫ్‌లు ఆగస్టు 7 నుంచి, కొత్తగా వేసిన మరో పాతిక శాతం సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పటికే మొదటి విడత పాతిక శాతం సుంకాల దెబ్బతోనే సతమతమవుతున్న మన ఎగుమతి పరిశ్రమలకు ఇవి మరింత భారంగా మారనున్నాయి. తాజా వడ్డింపుతో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లాంటి చిన్న పొరుగు దేశాలపై సుంకాలు మనతో పోలిస్తే సగానికన్నా తక్కువగా ఉండటంతో వాటి నుంచి పోటీ మరింత పెరిగితే మన ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయే ముప్పు పొంచి ఉంది. దీంతో ఎగుమతుల కోసం అగ్రరాజ్యంపై ఎక్కువగా ఆధారపడుతున్న వస్త్రాలు, రత్నాభరణాలు, సీఫుడ్ మొదలైన రంగాల సంస్థల్లో ఈ విపత్తును ఎలా ఎదుర్కొనాలనే ఆందోళన నెలకొంది. దీని వల్ల అమెరికాకు ఎగుమతులు 40–50 శాతం పడిపోయే ముప్పు ఉందని మేధావుల సంఘం జీటీఆర్ఐ అంచనా వేస్తోంది.షాకింగ్ నిర్ణయం..ట్రంప్ డబుల్ టారిఫ్‌లు తీవ్ర షాక్‌కి గురి చేశాయని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ వ్యాఖ్యానించారు. దీని వల్ల అమెరికాకు 55 శాతం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. ఇప్పటికే పలు సంస్థలు ఆర్డర్లను ఆపి ఉంచాయని తెలిపారు. టారిఫ్‌ల భారం వల్ల పోటీ దేశాలతో పోలిస్తే ధరల విషయంలో 30–35 శాతం మేర మన ఎగుమతిదారులు వెనుకబడతారని సహాయ్ వివరించారు. చిన్న, మధ్య తరహా సంస్థలపై పెను భారం పడుతుందని, మార్జిన్లు మరింత తగ్గిపోవడంతో పాటు క్లయింట్లను కోల్పోయే ముప్పు నెలకొందన్నారు. ప్రభుత్వానికి పరిశ్రమ వినతికీలకమైన అమెరికా మార్కెట్లో టారిఫ్‌ల మోత వల్ల నుంచి ఉపశమనం కల్పించేందుకు తగు తోడ్పాటు అందించాలని కేంద్రానికి ఎగుమతిదారులు విజ్ఞప్తి చేశారు. వడ్డీ రాయితీలు ఇవ్వాలని, ఆర్వోడీటీఈపీ స్కీమ్ (ఎగుమతి చేసే ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల రెమిషన్), రాష్ట్ర, కేంద్ర ట్యాక్సులు, లెవీల్లో రిబేటుకు సంబంధించిన ఆర్‌వోఎస్‌సీటీఎల్ మొదలైన వాటిని పొడిగించాలని పరిశ్రమ వర్గాలు కోరాయి.30 బిలియన్ డాలర్ల ఎగుమతులకు మినహాయింపుప్రస్తుతం అమెరికాకు 86 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు ఉండగా, అందులో 48 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులపై సుంకాల ఎఫెక్ట్ పడుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫార్మా, స్మార్ట్ఫోన్లు, సెమీకండక్టర్లు లాంటి 30 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు ప్రస్తుతం మినహాయింపుల జాబితాలో ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరం అమెరికాకు భారత్ నుంచి 10.5 బిలియన్ డాలర్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు (చాలా మటుకు స్మార్ట్ఫోన్లు) ఎగుమతులు 14.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, విదేశీ ఔషధాలపై 250 శాతం వరకు సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ బెదిరిస్తున్న నేపథ్యంలో ఫార్మాకు కూడా రిస్కులు ఉండొచ్చని భావిస్తున్నారు.అవకాశంగా మల్చుకోవాలి: ఆనంద్ మహీంద్రాటారిఫ్ల గురించి ఆందోళన చెందకుండా దీన్ని అవకాశంగా మల్చుకోవడం ఎలా అనే అంశంపై దృష్టి సారించే ప్రయత్నాలు చేయాలని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. 1991 నాటి ఫారెక్స్ సంక్షోభం ఎలాగైతే ఆర్థిక సరళీకరణకు దారి తీసిందో.. అదే విధంగా ఈ టారిఫ్‌ల సాగర మథనం నుంచి భారత్‌కు అమృతం లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇందుకోసం వ్యాపారాల నిర్వహణను మరింత వేగంగా సులభతరం చేయాలని, విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చే ఇంజిన్‌గా టూరిజంను మార్చుకోవాలని ఆనంద్ మహీంద్రా సూచించారు. ఇందులో భాగంగా వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్‌గ్రేడ్ చేయడంలాంటి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రత్నాభరణాలు .. 12 బిలియన్ డాలర్లుమన రత్నాభరణాల ఎగుమతులకు అగ్రరాజ్యం పెద్ద మార్కెట్‌గా ఉంటోంది. అక్కడికి ఎగుమతులు సుమారు 12 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటున్నాయి. మొత్తం ఎగుమతుల్లో 30 శాతం వాటా అమెరికాదే ఉన్న నేపథ్యంలో టారిఫ్‌లను రెట్టింపు చేయడం వల్ల చిన్న వ్యాపారుల నుంచి బడా కంపెనీల వరకు అందరిపైనా ప్రభావం పడనుంది. పోటీ దేశాల నుంచి చౌకగా ఉత్పత్తులు లభిస్తాయి కాబట్టి కొనుగోలుదారులు మరింతగా బేరసారాలకు దిగొచ్చని, మార్జిన్లు తగ్గిపోవచ్చని, ఆర్డర్లు రద్దు కావచ్చని పరిశ్రమలో ఆందోళన నెలకొంది. ఇంజనీరింగ్ ఉత్పత్తులు..అమెరికాకు ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 18.3 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. ఇవి ఖరీదుగా మారితే మెక్సికోలాంటి దేశాలవైపు అమెరికా మళ్లే అవకాశం ఉంది. రసాయనాలు.. వ్యవసాయోత్పత్తులు..అగ్రరాజ్యానికి మన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు సుమారు 5.6 బిలియన్ డాలర్లుగా, ఉక్కు..రసాయనాలు.. పెట్రోలియం ఉత్పత్తులు మొదలైన వాటి ఎగుమతులు 8 బిలియన్ డాలర్ల పైగా ఉంటున్నాయి. డబుల్ సుంకాల వల్ల భారత ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి, అమెరికా దిగుమతులను తగ్గించుకునే అవకాశం ఉంది. కొన్ని రంగాల్లో బ్రెజిల్, వియత్నాంలాటి దేశాలతో పోటీపడలేక మన దగ్గర పలు కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. టెక్స్టైల్స్ ..దేశీయంగా టెక్స్టైల్స్, అపారెల్ పరిశ్రమ దాదాపు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. 5.6 బిలియన్ డాలర్ల విలువ చేసే రెడీమేడ్ దుస్తులు అమెరికాకు ఎగుమతవుతు న్నాయి. లెదర్ ఉత్పత్తులు, దుస్తు ల్లాంటి రంగాల ఎగుమతుల్లో అమె రికా వాటా 30 శాతం పైగా ఉంటోంది. వియత్నాం, ఇండొనేషియాలాంటి దేశాల్లో తక్కువ సుంకాల వల్ల మనం పోటీపడే పరిస్థితి లేకుండా పోతుందని, ఈ రంగంలో ఉపాధి అవకాశాలూ దెబ్బతింటాయని పరి శ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
పేలిన ట్రంప్ టారిఫ్ బాంబు
న్యూయార్క్/న్యూఢిల్లీ: మెరుపువేగంతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. 24 గంటల్లో మళ్లీ భారత్‌పై దిగుమతి టారిఫ్ విధిస్తానని చెప్పినట్టే బుధవారం అదనంగా 25 శాతం సుంకాన్ని మోపారు. వద్దని ఎంతగా వారించినా వైరి దేశం రష్యా నుంచి విపరీతంగా ముడి చమురును కొని, బహిరంగ మార్కెట్లో అమ్ముకుని లాభాల పంట పండిస్తున్నారని ఆరోపిస్తూ భారత్‌పై 25 శాతం టారిఫ్ విధిస్తూ బుధవారం ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై శ్వేతసౌధంలో ఆయన సంతకం చేశారు. ఇప్పటికే ప్రకటించిన 25 శాతం టారిఫ్ నేటి నుంచి అంటే ఆగస్ట్ ఏడో తేదీ నుంచి అమల్లోకి రానుంది. బుధవారం ప్రకటించిన అదనపు 25 శాతం టారిఫ్‌ను 21 రోజుల తర్వాత అంటే ఆగస్ట్ 27వ తేదీ తర్వాత వర్తింపజేయనున్నారు. ‘‘రష్యా ముడిచమురును ప్రత్యక్షంగా, పరోక్షంగా భారత్ విచ్చలవిడిగా దిగుమతి చేసుకుంటోంది. అందుకే మా చట్టాల ప్రకారం అమెరికా కస్టమ్స్ సుంకాల పరిధిలోకి వచ్చే భారతీయ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌ను మరోసారి పెంచాలని నిర్ణయించాం’’అని కార్యనిర్వాహఖ ఉత్తర్వులో ట్రంప్ పేర్కొన్నారు. అదనపు టారిఫ్‌లకు స్పందనగా భారత్ ప్రతీకార నిర్ణయాలు తీసుకుంటే వైట్‌హౌస్ అందుకు తగ్గ టారిఫ్‌ల సవరణకు సిద్ధపడుతుందని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. మిత్రదేశమని కూడా చూడకుండా మితిమీరిన ఆవేశంతో భారత్ వీపు మీద పన్నుల వాత పెట్టి ట్రంప్ తన అగ్రరాజ్య అధిపత్యధోరణిని మరోసారి నిస్సుగ్గుగా ప్రదర్శించారు. స్నేహహస్తమందిస్తూనే సుంకాల సుత్తితో మోదడంపై భారత్ సైతం ధీటుగా, ఘాటుగా స్పందించింది. 140 కోట్ల జనాభా చమురు నిత్యావసరాలు, దేశ ఇంధన భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడబోమని మోదీ సర్కార్ స్పష్టంచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘అదనం’అమలుకు మినహాయింపులు భారత్‌పై అమెరికా బుధవారం ప్రకటించిన ఈ అదనపు 25 శాతం టారిఫ్‌ను వెంటనే వర్తింపజేయబోమని ట్రంప్ సర్కార్ స్పష్టంచేసింది. ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చిన 21 రోజుల తర్వాత ఈ అదనపు 25 శాతాన్ని భారతీయ ఉత్పత్తులపై వర్తింపజేస్తారు. ఇప్పటికే నౌకల్లోకి ఎక్కించిన సరకుపై ఈ అదనపు 25 శాతం సుంకాన్ని విధించబోరు. అలాగే బుధవారం అర్ధరాత్రిలోపు అమెరికా చేరుకునే ఉత్పత్తులపైనా ఈ అదనపు భారం మోపబోరు. సెప్టెంబర్ 17వ తేదీ అర్ధరాత్రిలోపు అమెరికాలో మార్కెట్లోకి వచ్చేసిన భారతీయ ఉత్పత్తులపై ఈ అదనపు వడ్డింపు ఉండదు. తాము నష్టపోకుండా ముందుజాగ్రత్త భారత్‌పై రెట్టింపు పన్నులతో రెచ్చిపోయిన ట్రంప్.. ఈ అదనపు సుంకాలు అమెరికా ఖజానాకు నష్టదాయకంగా మారకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రంగాలవారీగా టారిఫ్ వసూలుచేస్తున్న ఉక్కు, అల్యూమినియంతోపాటు అత్యంత కీలకమైన ఫార్మాస్యూటికల్స్‌పై ఈ అదనపు భారం ఉండబోదని తెలుస్తోంది. తద్వారా అమెరికాలో ధరల పెరగకుండా జాగ్రత్తపడుతున్నారు. ట్రంప్ విధించిన అదనపు టారిఫ్ కారణంగా భారత్‌లో సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతి సంక్షోభంలో పడనుంది. టెక్స్టైల్స్, సముద్ర ఉత్పత్తులు, తోలు, సానబట్టిన వజ్రాలు, రత్నాభరణాల ఎగుమతులపై అదనపు టారిఫ్ భారం పడొచ్చు. దీంతో అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తూత్పత్తుల పరిమాణం సగానికి సగం తగ్గిపోవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్ఐఈఓ) ఆందోళన వ్యక్తంచేసింది. అత్యంత విచారకరమన్న భారత్ అదనంగా 25 శాతం టారిఫ్‌ల గుదిబండ పడేయడంపై భారత్ తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తంచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ బుధవారం రాత్రి ఒక అధికారిక ప్రకటన విడుదలచేసింది. ‘‘రష్యా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న ముడి చమురునిల్వలను చూసి అమెరికా కళ్లలో నిప్పులు పోసుకుంటోంది. ఈ అంశంలో భారత్ తన వైఖరిని ఇప్పటికే సుస్పష్టంచేసింది. ముడిచమురు వంటి ఇంధన దిగుమతులు అనేవి పూర్తిగా మార్కెట్ ఒడిదుడుకులను అనుసరించి జరుగుతాయి. దేశ ఇంధన భద్రతే ఏకైక లక్ష్యంగా భారత్ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. భారత్‌పై అదనపు టారిఫ్ విధించడం ద్వారా ఎక్కువ సొమ్ములు కళ్లజూడాలని అమెరికా ఆశపడటం అత్యంత విచారకరం. ఇలాంటి చర్యలు ఏమాత్రం సబబుగా లేవు. ఇవన్నీ సహేతుకంకాని అన్యాయమైన నిర్ణయాలు. 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలు మా తక్షణ కర్తవ్యం. ఇంతటి అత్యంత కీలకమైన బాధ్యతల నుంచి భారత్ ఏనాడూ పక్కకు తొలగిపోదు. దేశ ప్రయోజనాలు, ఇంధన సంక్షోభ నివారణ చర్యల విషయంలో భారత్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. విదేశాలు తీసుకునే భారతవ్యతిరేక నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వం తగు కఠిన చర్యలు తప్పక తీసుకుంటుంది. జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటుంది. స్వప్రయోజనాల కోసం ప్రతిదేశం స్వీయ నిర్ణయాలు తీసుకుంటుందని అమెరికా స్ఫురణకు తెచ్చుకుంటే మంచిది’’అని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. గత మూడ్రోజుల్లో ట్రంప్ ప్రభుత్వానికి దీటుగా భారతప్రభుత్వం ఘాటైన జవాబివ్వడం ఇది రెండోసారి. బ్రెజిల్.. భారత్ ఒక్కటే అమెరికా దృష్టిలో బ్రెజిల్, భారత్ ఒక్కటేనని తాజా పన్నుల పెంపు పర్వంతో తేలిపోయింది. బ్రెజిల్‌పై అమెరికా ఇప్పటికే 50 శాతం టారిఫ్ విధిస్తుండగా భారత్‌పై తాజా పెంపుతో భారతీయ ఉత్పత్తుల దిగుమతి టారిఫ్ సైతం 50 శాతానికి చేరింది. మయన్మార్ ఉత్పత్తులపై 40 శాతం, థాయిలాండ్ కాంబోడియాలపై 36 శాతం, బంగ్లాదేశ్‌పై 35 శాతం, ఇండోసేసియాపై 32 శాతం, చైనా, శ్రీలంకలపై 30 శాతం, మలేసియాపై 25 శాతం, ఫిలిప్పీన్స్, వియత్నాంలపై 20 శాతం టారిఫ్‌ను అమెరికా విధించిన విషయం విదితమే. -
ఇది అన్యాయం.. మా దేశంపైనే ఎందుకిలా?: ట్రంప్ 50 శాతం సుంకాలపై భారత్ రియాక్షన్
అమెరికా అదనపు సుంకాల నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనంగా 25% టారిఫ్ విధించడంతో.. మొత్తం సుంకాలు 50 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది అన్యాయం, అసమంజసం, అసంబద్ధమైందంటూ బుధవారం రాత్రి భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే.. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు భారత్ తీసుకుంటుందంటూ అందులో స్పష్టం చేసింది. ‘‘భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశాం. .. మా దేశంలోని 140 కోట్ల ప్రజల ఎనర్జీ సెక్యూరిటీ కోసం తీసుకునే నిర్ణయాలను మార్కెట్ ఫ్యాక్టర్ల ఆధారంగా చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాం. ఇలా చాలా దేశాలు తమ ప్రయోజనాల కోసం చేస్తున్నదే. అయినప్పటికీ అమెరికా భారత్‌పై మాత్రమే టారిఫ్ విధించింది. ఇది దురదృష్టకరం. ఈ నిర్ణయం.. అన్యాయం, అసమంజసం, అసంబద్ధమైనవిగా భారత్ ఖండిస్తోంది. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది’’ అని ఆ ప్రకటనలో విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే.. రష్యాతో ఇంకా చమురు వాణిజ్యం కొనసాగిస్తుందన్న కారణంగా ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో 25 శాతం సుంకాన్ని విధించింది. దీంతో గత టారిఫ్‌తో కలిపి సుంకాలు 50 శాతానికి చేరాయి. తాజా పెంపు ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలు ఇండో-అమెరికన్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఈ సంక్షోభాన్ని దాటేదెలా?
రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు ఆపాలంటూ వరస బెదిరింపులతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌ను లొంగదీసుకోవాలని చూస్తున్న తరుణంలో మన విదేశాంగ శాఖ తొలిసారి నేరుగా బదులీయటం కీలక పరిణామం. దీనికి రెండురోజుల ముందు స్థానిక తయారీ ఉత్పత్తుల్ని, సరుకుల్ని కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. అమెరికాలో గత కొన్ని దశాబ్దాలుగా అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తూ వచ్చిన అస్తవ్యస్త విధానాల పర్యవసానంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి ట్రంప్ అమలుచేసిన తప్పుడు నిర్ణయాలు తోడై ఆర్థికవ్యవస్థను ఊపిరాడకుండా చేస్తున్నాయి. వాటి నుంచి బయటపడటం కోసం ఆయన ప్రపంచ దేశాలపై ఆర్థిక దండయాత్ర మొదలుపెట్టారు. చైనాపై 145 శాతం సుంకాల మోత మోగించటంతో మొదలుపెట్టి తన సన్నిహిత దేశాలపై సైతం దాదాపు 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించి, అనంతరకాలంలో వెనక్కితగ్గారు. ఈ దశలో ఆయన మన జోలికి రాలేదు. మోదీతో 2016 నుంచీ ఉన్న సాన్నిహిత్యంతో ఆయన తాను చెప్పినట్టు వింటా రని ట్రంప్ భ్రమపడ్డారు. తీరా కథ అడ్డం తిరిగేసరికి ఆగ్రహోదగ్రుడవుతున్నారు. అందుకే కావొచ్చు... జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, బంగ్లాదేశ్, ఇండొనేసియాలపై 15–20 శాతంమధ్య సుంకాలు విధించిన పెద్ద మనిషి మన దగ్గరకొచ్చేసరికి ఇప్పటికే విధించిన 25 శాతం సుంకాలతోపాటు రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు ఆపకపోతే మరిన్ని రెట్లు పెంచుతానని హెచ్చరించారు. స్వదేశంలో సంపన్నులకూ, పారిశ్రామికవేత్తలకూ లక్షల కోట్ల డాలర్ల పన్ను రాయితీలు ప్రకటించి, ప్రపంచ దేశాలపై అదనపు సుంకాలు విధించటం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవాలన్నది ఆయన పథకం. దీన్ని చూసీచూడనట్టు వూరుకుంటే ఈ బాణీయే కొనసాగిస్తారు. అమెరికా పాటించే ద్వంద్వ ప్రమాణాలు ఎవరికీ తెలియనివి కాదు. కానీ ట్రంప్ మరింత నిస్సిగ్గుగా వాటిని ఆచరిస్తున్నారు. ఒకపక్క తమ అణు పరిశ్రమలకు కావాల్సిన యురేనియం హెక్సాఫ్లోరైడ్ అయినా, విద్యుత్ వాహనాల తయారీలో అవసరమైన ప్లాటినం రకానికి చెందిన రసాయన మూలకం పలాడియం, ఎరువులు, రసాయనాలు వంటివి రష్యా నుంచి ఇప్పటికీ దిగుమతి చేసుకుంటూ... మనం మాత్రం ముడి చమురు కొనకూడదని శాసిస్తున్నారు. అందుకే మోదీ స్వదేశీ ఉత్పత్తుల్నీ, సరుకులనూ కొనటం అత్యవసరమని ప్రజలకు పిలుపునిచ్చారు. వర్తమాన తరుణంలో స్వదేశీ నినాదం సరైనది. అయిదేళ్లక్రితమే మోదీ ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా చేసిందేం లేదు. అంతక్రితం ఉన్న యూపీఏ ప్రభుత్వం గురించి చెప్పనవసరం లేదు. గతంలో ప్రణాళికా సంఘం, ఇప్పుడు నీతి ఆయోగ్... అలాగే సాంకేతిక నిపుణుల మాట చెల్లుబాటవుతూ వచ్చింది. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ ఈ విషయంలో ప్రభుత్వాన్ని గతంలో పలుమార్లు తీవ్రంగా తప్పుబట్టింది. కానీ మారిందేమీ లేదు.ట్రంప్ ఒక్కరే కాదు...బ్రిటన్, ఈయూలు సైతం తమ వినియోగవస్తువులపై, యంత్ర పరిక రాలపై సుంకాలు తగ్గించమంటున్నాయి. అందుకు తలొగ్గితే మన సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) దెబ్బతింటాయి. అమెరికా ఒత్తిళ్లకు లొంగితే మన సాగు రంగం, పాడి పరిశ్రమ రంగం ఇబ్బందుల్లో పడతాయి. ఆ రెండు రంగాలపైనా 70 కోట్లమంది ప్రజానీకం ఆధారపడతారు. ఇవిగాక జన్యుమార్పిడి చేసిన మొక్కజొన్న, సోయాబీన్స్ దిగుమతి చేసు కోవాలని అమెరికా కోరుకుంటోంది. ఇది ప్రమాదకరం. వాటి సంగతలావుంచి వర్తమాన అనిశ్చిత వాతావరణంలో మనమే కాదు...దేశాలన్నీ ఆత్మరక్షణ బాటపట్టాయి. తమ దేశానికొచ్చే విదేశీ సరుకుపై అధిక సుంకాలు విధించటం, విదేశాలకు ఎగుమతయ్యే తమ సరుకుకు తక్కువ సుంకాల కోసం ఒత్తిళ్లు తీసుకురావటం రివాజైంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, సెమీకండ క్టర్లు, రక్షణ, సౌరశక్తి రంగాలకు పెద్దయెత్తున ప్రోత్సాహకాలు ఇవ్వాల్సివుంది. పెంచిన సుంకాల పరిధిలో ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు వగైరాలను ట్రంప్ మినహాయించారు. ‘జాతీయ ప్రయోజనాల రీత్యా’ ఈ నిర్ణయం తీసుకున్నారట. కానీ ఆ ఉత్పత్తుల ధరల్ని పెంచటం ద్వారా అదనపు రాబడికి వ్యూహరచన చేస్తే అమెరికా సృష్టించదల్చుకున్న సంక్షోభంనుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే వాటికి మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తేనే ఇదంతా సాధ్యం. ఇప్పటికే స్వావలంబన దిశగా అడుగులేసివుంటే వేరుగా వుండేది. ఇప్పటికిప్పుడు తీసుకునే చర్యల నుంచి వెంటనే ఫలితాన్ని ఆశించలేం. ఈలోగా అమెరికా కోరుతున్నదేమిటో, మన తిరస్కరణకు కారణమేమిటో పార్లమెంటు వేదికగా తేటతెల్లం చేయాలి. అది జరిగితేనే ప్రజలు మరింత దృఢంగా మద్దతిస్తారు. -
ఎవరిని ఉద్ధరించడానికి ఈ ఒప్పందం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళం సృష్టించాయి. ట్రంప్ రోజుకో మాదిరిగా మార్చివేస్తున్న ఈ సుంకాలు ఎంతోకాలం మనలేవు. అయితే, వీటిని భౌగోళిక రాజకీయ ఆయు ధాలుగా ప్రయోగిస్తున్న తీరు మాత్రం రానున్న సంవత్సరాల్లో అంతర్జాతీయ వాణిజ్య రూపురేఖలను మార్చేస్తుంది.ఇతర దేశాలు తమ వస్తువుల మీద అధిక సుంకాలు విధిస్తు న్నాయని అదేపనిగా చెబుతూ అమెరికా ప్రపంచ ప్రజల దృష్టి మళ్లిస్తోంది. నిజానికి సుంకాల ముసుగులో అగ్రరాజ్యం అల్పా దాయ దేశాల అభివృద్ధిని బలిచేస్తూ, తమ కంపెనీలకు ప్రపంచ మార్కెట్లలో పెద్ద పీట వేయించడమే ఎజెండాగా పెట్టుకుంది. టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టకుండా చైనాను నిలువరించాలన్న వ్యూహాత్మక లక్ష్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. పేటెంట్లు, కాపీరైట్లు, పారిశ్రామిక డిజైన్లతో కూడిన మే«ధాసంపత్తి వర్ధమాన దేశాలకు అందకుండా నిరోధించడం అమెరికా ధ్యేయం. ఇండోనేషియాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇందుకు ఒక ఉదాహరణ.ఇండోనేషియాకు జరిగినట్టే...అమెరికా పారిశ్రామిక, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై ఇండో నేషియా 99 శాతం సుంకాలను ఎత్తివేసింది. ఇక ఆ దేశ ఎగు మతులపై అమెరికా 19 శాతం సుంకం విధిస్తుంది. ఈ ఒప్పంద ఫలితంగా ఇండోనేషియా రైతులు ప్రభుత్వ భారీ సబ్సిడీల ఫలితంగా చౌకగా లభించే అమెరికా వ్యవసాయోత్పత్తులతో పోటీ పడాల్సి ఉంటుంది. అమెరికా సంస్థలు అత్యధిక ప్రయోజనాలు పొందుతాయి. యూఎస్ తయారీ వస్తువులపై పరిమాణపరంగా ఎలాంటి నిబంధనలూ ఉండవు. అమెరికా వెహికల్ సేఫ్టీ నిబంధ నలను, ఉద్గార ప్రమాణాలను ఇండోనేషియా యథాతథంగా ఆమో దించింది. వైద్య పరికరాలు, ఔషధాల విషయంలోనూ అమెరికా ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతులను అంగీకరిస్తుంది. యూఎస్ ఆహార, వ్యవసాయ ఉత్పత్తులకు స్థానిక లైసెన్సింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. మరింత సమస్యాత్మకంగా మేధాసంపత్తి నిబంధనలు ఉన్నాయి. సాంప్రదాయిక విజ్ఞానం, జన్యు వనరులు, నిర్బంధ లైసెన్సులు వంటి అంశాల్లో ఇప్పటికే ఉన్న అన్ని వివాదాలనూ పరిష్కరించుకోవాలని ఈ ఒప్పందం ఒత్తిడి చేస్తోంది. దీంతో, అమెరికా కంపెనీలు ఎలాంటి సమ్మతి పొందాల్సిన, పరిహారం చెల్లించాల్సిన అవసరం లేకుండానే అక్కడి సాంప్రదాయిక విజ్ఞా నాన్ని కొల్లగొడతాయి.ఇండియాకు ఏం లాభం?ఇలాంటి ఎజెండాతో ముందుకు పోతున్న దేశం అమెరికా ఒక్కటే కాదు. యూకేతో ఇటీవలే ఇండియా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇండోనేషియా ఒప్పందం కంటే ఎక్కువగా ప్రశ్నలు రేకెత్తిస్తోంది. చెప్పాలంటే ఈ ఒప్పందానికి వాణిజ్యపరంగా ఎలాంటి ప్రాధాన్యతా లేదు. కారణం, ఈ రెండు దేశాలు ప్రపంచ వ్యాప్తంగా చేసే ఎగుమతుల విలువలో వీటి ద్వైపాక్షిక వాణిజ్యం 2.5 శాతం కంటే కూడా తక్కువే. యూకే–ఇండియా తాజా ఒప్పందం పర్యవసానంగా, 92 శాతం యూకే ఎగుమతులకు ఇండియా పూర్తిగానో పాక్షికంగానో సుంకాల మినహాయింపు ఇచ్చింది. అలాగే యూకేకు ఇండియా చేసే 99 శాతం ఎగుమతులు ‘ట్యాక్స్ ఫ్రీ’గా ఉంటాయి. వాటిపై ఆ దేశం ఎలాంటి సుంకాలూ విధించదు. అయితే, యూఎస్–ఇండోనేషియా ఒప్పందంలో వలే ఈ ఒప్పందంలోనూ మేధాసంపత్తి నిబంధనలు కీలకమైనవి. ఇవి పశ్చిమ దేశాల పేటెంట్ దారులకు అనుకూల రీతిలో ఉన్నాయి. ఔషధాల విషయంలో భారత పౌరులు, దేశీయ ఉత్పత్తి సంస్థల కంటే యూకే ‘బిగ్ ఫార్మా’ ప్రయోజనాలకే ప్రాధాన్యం లభించింది. ఉదాహరణకు, నిర్బంధ లైసెన్సులకు బదులు ‘స్వచ్ఛంద లైసెన్సు’లను ఈ ఒప్పందం ప్రోత్సహిస్తోంది. భవిష్యత్తులో ధరల తగ్గింపు అవకాశాలను ఈ నిబంధన నీరుగార్చుతుంది. పేటెంటు ప్రమాణాల సమన్వయీకరణ క్లాజుకూ ఇండియా అంగీకారం తెలిపింది. దీంతో ప్రస్తుత ఔషధాలకు చిన్నా చితకా మార్పులు చేసి వాటి పేటెంట్ హక్కులు పొడిగించుకునే దొడ్డిదారికి ద్వారాలు పూర్తిగా తెరచినట్లయింది.ఇండియాలో పేటెంటెడ్ డ్రగ్ వాడకం వివరాలు వెల్లడించాల్సిన గడువును ఏడాది నుంచి మూడేళ్లకు పొడిగించే నిబంధన వినాశ కరమైంది. గిరాకీకి తగినంత సరఫరా లేదని (అన్ మెట్ డిమాండ్) నిరూపించడం ఆ ఔషధం ఉత్పత్తి చేయదలచిన కొత్త దరఖాస్తు దారుకు కష్టతరంగా మారుతుంది. ఇవి ఫార్మా పరిశ్రమ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయి. అంతే కాకుండా, అందుబాటు ధర లకు మందులు లభ్యం కాని పరిస్థితి ఉత్పన్నమవుతుంది.బలహీన పడిన ఒక మాజీ వలసవాద దేశానికి, అదీ ప్రధాన వాణిజ్య భాగస్వామి కూడా కానటువంటి దేశానికి ఇండియా ఇలా రాయితీలు ఇవ్వడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ), యూఎస్‌లతో జరుపుతున్న వాణిజ్య చర్చల మీదా ఈ ఒప్పందం వల్ల మరింత ఆందోళనకరమైన ప్రభావం పడుతుంది. ప్రొ‘‘ జయతీ ఘోష్వ్యాసకర్త యూనివర్సిటీ ఆఫ్ మసాచూసెట్స్లో ఎకనామిక్స్ ప్రొఫెసర్ -
తలతిక్క సుంకాల తలనొప్పి!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన బృందంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై భారత్ నాలుగు నెలలు చర్చలు జరిపినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నవాటిపై 26 శాతం సుంకం విధిస్తామని ఏప్రిల్ 2న బెదిరించిన ట్రంప్ ఆగస్టు 30న 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.చర్చలు మొదలైనప్పటి నాటికన్నా పరిస్థితి ఇపుడు మరింత దారుణంగా తయారైంది. రష్యా నుంచి చమురు, రక్షణ సామగ్రి కొనుగోళ్ళను నిలిపివేయకపోతే జరిమానా కింద మరికొంత సుంకాన్ని విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఆ సుంకం శాతాన్ని నిర్దిష్టంగా ప్రకటించలేదు. భారత్ సుంకాలు ప్రపంచం మొత్తంమీద చాలా ఎక్కువగా ఉన్నాయని, ద్రవ్యేతర వాణిజ్య చర్యలు ‘‘అత్యంత శ్రమ పెట్టేవిగా, అప్రియమైనవిగా’’ ఉన్నాయని ఆయన అన్నారు.ట్రంప్ కోరుతున్నదేమిటి?అమెరికాతో వాణిజ్యం విషయంలో, ట్రంప్ కుయుక్తులను, మనం ఎలా అర్థం చేసుకోవాలి? అన్ని రకాల చర్చలనూ విరమించుకోవాలా లేక లొంగిపోవాలా? ద్వైపాక్షిక వాణిజ్య లోటును నిర్మూలించే పేరుతో ట్రంప్ మొదలెట్టిన జూదం దాని భాగస్వామ్య దేశాలకు ఎంత రుచించని దైనా, ఆయన లక్ష్యాలు మాత్రం స్పష్టం. అమెరికాతో వాణిజ్యంలో మిగులులో ఉన్న దేశాలు, ఆ వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు నాలుగు చర్యలు తీసుకోవాలని ట్రంప్ కోరుతున్నారు. 1. సుంకం పైసా కూడా లేకుండా అన్ని అమెరికా ఉత్పత్తులకూ సంపూర్ణ మార్కెట్ సౌలభ్యం కల్పించడం; 2. అమెరికాకు ఎగుమతి చేసే వాటిపై 15–25 శాతం సుంకం విధించడానికి అంగీకరించడం; 3. వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు వీలుగా అమెరికా నుంచి ఇపుడు కొంటున్నవాటికి తోడుగా విమానాలు, ఇంధనం వంటివాటిని కొనడం; 4. అమెరికాలో వస్తూత్పత్తికి పెట్టుబడులు పెట్టడం.చాలా దేశాలు రెండు కారణాలతో అమెరికాకు ఎగుమతులు ఇష్టపడతాయి. ఒకటి– అది చాలా పెద్ద మార్కెట్ (మొత్తం ప్రపంచం ఎగుమతుల్లో సుమారుగా 15 శాతం దానికే వెళుతున్నాయి), రెండు – ఎగుమతిదారులకు లాభాలు సమకూరుతాయి. కానీ అద నపు సుంకాల భారాన్ని నెత్తికెత్తుకుని అనిష్టంగానైనా ఎగుమతులు చేస్తే వారికొచ్చే లాభాలు ఏమీ ఉండవు. అదనపు సుంకాల భారాన్ని భరించినా ఎంతో కొంత లాభాన్ని మిగుల్చుకోగలిగిన అవకాశం భారతీయ ఎగుమతిదారులకు లేదు. కనుక, అదనపు 25 శాతం సుంకానికీ, జరిమానా సుంకానికీ భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు.తీర్చలేని డిమాండ్లుజన్యుపరంగా సవరించిన గింజలతో తీసిన వంటనూనె దిగు మతులను (జీఎం నూనె మనుషుల ఆరోగ్యానికి మంచిది కాదని నిరూపించే శాస్త్రీయ అధ్యయనాలు ఏవీ జరగలేదు), పాడి పరిశ్రమ ఉత్పత్తులను, పౌల్ట్రీ ఉత్పత్తులను (అమెరికన్ చికెన్ లెగ్స్ వినియోగదారుల సంక్షేమాన్ని మెరుగుపరుస్తాయి) అనుమతించడం అంటే... వ్యావసాయిక వాణిజ్యాన్ని భారత్ సరళీకృతం చేయడం. ఇది వివేకవంతమైన చర్యగానే తోస్తుంది. కానీ, దేశీయ రైతులను సంరక్షించవలసిన బాధ్యత వల్ల, ఈ విషయంలో భారత దేశం పాలుపోని స్థితిలో ఉంది. వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికాకు ఎలాంటి రాయితీలూ ఇవ్వగలిగిన స్థితిలో ఇండియా లేదు. భారతదేశ రక్షణ అవసరాలకు ఒదగని లేదా మరీ ఖరీదుతో కూడిన ఎఫ్–35 విమానాలను లేదా ముడి చమురును కొనాలని అమెరికా బలవంతపెట్టడం బ్లాక్ మెయిల్ చేయడమే! దానికి లొంగి పోతే భారత్ బలహీనమైనదనే ముద్రపడుతుంది. ఇక భారత్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వీకరించడమేకానీ, ఇవ్వడం చాలా అరుదు. విదేశాల్లో భారత్ పెట్టుబడులు కొద్దిగానే ఉన్నాయి. రానున్న 5–10 ఏళ్ళలో, అమెరికాలో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడం కూడా మనకు కష్టమే. ట్రంప్ అడుగుతున్న నాలుగింటిలో దేన్నీ తీర్చగల స్థితిలో ఇండియా లేదు.ట్రంప్ నాలుగు డిమాండ్లకూ వియత్నాం, జపాన్, ఇండో నేషియా, యూరోపియన్ యూనియన్ మాత్రమే అంగీకరించాయి. అమెరికా అదనపు సుంకాలను దిగమింగుకుని ఈ దేశాల ఎగుమతిదారులు తమ వస్తువుల ధరలను తగ్గిస్తారా లేక అమెరికా వినియోగదారులకు ఆ భారాన్ని బదలీ చేస్తారా? లేక రెండింటి మిశ్రమంతో ముందుకు సాగుతారా? ఆ యా ఎగుమతి దేశాలు అదనపు సుంకాలను తామే భరించడంలో లేదా అమెరికా వినియోగ దారులకు బదిలీ చేయడంలో విఫలమైతే నష్టపోయేది అమెరికా, దాని వినియోగదారులే! ఇచ్చిన వాగ్దానం మేరకు, ఆ యా దేశాలు, నిజంగా చెప్పినంత సంఖ్యలో విమానాలను, ఇంధన ఉత్పత్తులను, రక్షణ పరికరాలను కొనుగోలు చేయగలుగుతాయా? దానికి చాలా కాలం పడుతుంది. పైగా, వాటి ధరలు తగ్గించాలని అవి అమెరికాను డిమాండ్ చేయవచ్చు. తాము దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ఇలా ఉండాలి, అలా ఉండాలని చర్చలతో సుదీర్ఘ కాలయాపన చేయ వచ్చు. ఈ తతంగం ద్వారా ట్రంప్ ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారో అది నెరవేరకపోవచ్చు. లేదా ఆశించింది కొండంత, లభించింది ఆవగింజంతగా పరిణమించవచ్చు. ఇండియా ముందున్న మార్గంభారత్ ఎదుట రెండు అవకాశాలున్నాయి. ఒకటి– జపాన్, వియత్నాం, ఇండోనేషియా, యూరోపియన్ యూనియన్ల మాదిరిగా తలొగ్గి ఒప్పందం కుదుర్చుకోవడం. తర్వాత, భారత్ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎగువ పేర్కొన్న ఎత్తుగడలను అనుసరించడం. రెండు– ట్రంప్ వాణిజ్య బృందంతో అన్ని చర్చలకూ స్వస్తి పలికి, ఏ సుంకాలు విధించుకుంటావో విధించుకో అనడం. అదనపు సుంకాల భారాన్ని నెత్తిన రుద్దుకోకుండా, వస్తువులను వాటి సాధారణ ధరలకే విక్రయించవలసిందని ఎగుమతిదారులకు నచ్చజెప్పడం. అమెరికాలోని దిగుమతిదారులు కొంటే మంచిదే. లేదంటే, ఆ వస్తువులను, అటువంటి అసంబద్ధ సుంకాలు లేని ఇతర దేశాలకు విక్రయిచడం. దేశీయ మార్కెట్ లోనూ అమ్ముకునేటట్లు చూసుకోవడం. కొన్ని ఎంపిక చేసుకున్న వాటికి అంగీకరించి, మధ్యే మార్గాన్ని అనుసరించడం వల్ల భారత దేశానికి పెద్దగా ఒనగూడేది ఏమీ ఉండదు. అంతకంటే, రెండవ దారిని ఎంచుకుని ముందుకు సాగడమే మంచిది. ట్రంప్ పాలనా యంత్రాంగం తలతిక్కతో తీసుకుంటున్న సుంకాల చర్యల ప్రతికూల పర్యవసానాలను త్వరలోనే (మహా అయితే 3–6 నెలల్లో) చవిచూడవలసి రావచ్చు. అమెరికా దిగు మతులు మందగిస్తాయి (ఏప్రిల్–జూన్ త్రైమాసిక గణాంక వివ రాలు దాన్ని ధ్రువపరుస్తున్నాయి). సుంకాల రాబడి కింద అమెరికాకు కొద్ది వందల బిలియన్ల డాలర్లు లభించవచ్చు. కానీ, దానిలో చాలా భాగాన్ని అమెరికాలోని దిగుమతిదారులు, వినియోగదారులే చెల్లించవలసి ఉంటుంది. ధరలు మంట పుట్టించడంతో వినియోగ దారుల తిరుగుబాటుకు ఎంతో కాలం పట్టదు. పరిస్థితులు తేటతెల్లమవుతున్నకొద్దీ, ట్రంప్ తాను విధించిన చాలా సుంకాలను వెనక్కి తీసుకోక తప్పదు. అందుకే ఇండియా వేచి చూడటమే మంచిది. దానివల్ల పెద్దగా ఖర్చయ్యేదేమీ ఉండదు.సుభాష్ చంద్ర గర్గ్ వ్యాసకర్త ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
టారిఫ్‌ల భారం.. సగమే!
న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధించాలన్న అమెరికా నిర్ణయం వల్ల దాదాపు సగం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమెరికాకు 86 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు ఉండగా, అందులో 48 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎక్స్‌పోర్ట్స్‌పై సుంకాల ఎఫెక్ట్ ఉంటుందని పేర్కొన్నాయి. టెక్స్టైల్స్/క్లోతింగ్ (10.3 బిలియన్ డాలర్లు), రత్నాభరణాలు (12 బి.డా.), రొయ్యలు (2.24 బి.డా.), లెదర్.. ఫుట్‌వేర్ (1.18 బి.డా.), రసాయనాలు (2.3 బి.డా.), ఎలక్ట్రికల్.. మెకానికల్ మెషినరీ (9 బిలియన్ డాలర్లు) రంగాలపై ఎక్కువగా ప్రభావం పడుతుందని వివరించాయి. అమెరికాకు 5.33 బిలియన్ డాలర్ల విలువైన అపారెల్ ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఒక ఎగుమతిదారు తెలిపారు. ఫార్మా, ఎల్రక్టానిక్స్ గూడ్స్‌లాంటి సుమారు సగం పైగా పరిశ్రమలు మినహాయింపు కేటగిరీలో ఉన్నందున మిగతా సగం కేటగిరీలపై ఎఫెక్ట్ పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2024–25లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్లుగా (86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 45.3 బిలియన్ డాలర్ల దిగుమతులు) నమోదైంది. ఏపీఐలు, సర్క్యూట్లకు మినహాయింపులు.. ఫినిష్డ్ ఫార్మా ఉత్పత్తులు, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐలు), అలాగే ముడిచమురు, నేచురల్ గ్యాస్, రిఫైన్డ్ ఇంధనాలు, బొగ్గు, విద్యుత్‌లాంటి ఎనర్జీ ఉత్పత్తులు, కీలకమైన లోహాలు, ఎల్రక్టానిక్స్.. సెమీకండక్టర్లు మొదలైన వాటికి 25 శాతం టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉంటుందని జీటీఆర్ఐ తెలిపింది. కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్, ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు లాంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే రవాణాలో ఉన్నవి, ఆగస్టు 7 నాటికల్లా అమెరికాకు చేరేలా ఇప్పటికే నౌకల్లో లోడ్ చేసిన ఉత్పత్తులకు మినహాయింపు ఉంటుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈవో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.. టారిఫ్‌ల వల్ల ఫ్యాక్టరీలు మూతబడకుండా నడిపించడానికి, ఉద్యోగులను తీసివేయకుండా ఉండటానికి ఎగుమతిదారులు.. ఉత్పత్తి వ్యయానికన్నా తక్కువకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఏఈపీసీ చైర్మన్ సు«దీర్ సెఖ్రీ తెలిపారు. ఈ నేపథ్యంలో సుంకాలపరమైన ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎగుమతిదారులు కూడా ఇతరత్రా మరిన్ని మార్కెట్లకు విస్తరించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
సుంకాలు... శాపనార్థాలు!
రాక తప్పదనుకుంటున్న ముప్పు ముంగిట్లోకొచ్చింది. అమెరికా అధ్యక్షపీఠం అధిష్ఠించింది మొదలు నిలకడలేనితనంతో, పొంతనలేని వ్యాఖ్యలతో మిత్రుల్ని, వ్యతిరేకుల్ని కూడా సమానంగా ఇరకాటంలో పడేస్తున్న డోనాల్డ్ ట్రంప్... గతంలో హెచ్చరించినట్టే సుంకాల మోత మోగించారు. శుక్రవారం నుంచి భారత్ నుంచి వచ్చే సరుకులపై 25 శాతం సుంకాలు విధిస్తామని, ఇవిగాక రష్యా నుంచి ముడిచమురు, రక్షణ సామగ్రి కొంటున్నందుకు అదనంగా జరి మానా ఉంటుందని ప్రకటించారు. అది ఎంత శాతమో చెప్పకపోయినా రష్యాతో వాణిజ్యం సాగించే భారత్, చైనాలపై 500 శాతం వరకూ అదనపు సుంకాలుంటాయని ఆయన లోగడ ప్రకటించారు. కనుక ఈ సుంకాల కన్నా జరిమానా వాటాయే ఎక్కువుంటుందని అంచనా వేయొచ్చు. తన ఆదేశాలను ఔదలదాల్చనందుకు మన ఆర్థిక వ్యవస్థను ‘మృత ఆర్థిక వ్యవస్థ’గా దూషించారు. అనాల్సిన వన్నీ అన్నాక ‘ఇంకా భారత్‌తో చర్చలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం’ అని ముక్తాయించారు. ఆయన హుకుం అమలైతే వస్త్రాలు, రొయ్యలు, ఆభర ణాలు, వజ్రాలు, తోలు ఉత్పత్తులు వగైరాలపై తీవ్ర ప్రభావం పడుతుందనీ, ఆ రంగాల్లో ఉపాధి దెబ్బతింటుందనీ నిపుణుల అంచనా. ఈ రంగాల్లో 8,700 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులుంటున్నాయి. ఈ ఏడాది జీడీపీ 6.5 శాతానికి మించి వుండొచ్చని అంచనాలున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అది బాగా తగ్గవచ్చంటున్నారు. ట్రంప్‌కు దౌత్య మర్యాదల సంగతి అటుంచి వ్యక్తిగా ఎలా మెలగాలో కూడా తెలియదు. బహిరంగ బెదిరింపులకు దిగటం, అన్యాయమని అందరికీ తెలిసేలా ప్రవర్తించటం ఆయన నైజం. బ్రెజిల్ సంగతే తీసుకుంటే అక్కడ ఆ మధ్య అధికారం కోల్పోయిన బోల్సొనారో ఆయ నకు ఇష్టుడు. కనుక అతనిపైవున్న నేరారోపణలు ఉపసంహరించి వదిలేయమని తాఖీదు పంపారు. అంగీకరించనందుకు అదనపు సుంకాలు విధించారు. దేశాలకు సార్వభౌమత్వం ఉంటుందనీ, దానికి లోబడి సంబంధాలు నెరపాలనీ ఆయన భావించరు. వాణిజ్య ఒప్పందాలు సాకారం కావాలంటే వాటిని కుదుర్చుకోదల్చుకున్న రెండు పక్షాలకూ పరస్పర విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఓపిగ్గా చర్చించాలి. బ్రిటన్‌తో మనకు ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే ఇందుకు ఉదాహరణ. దాదాపు మూడేళ్లపాటు ఆ ఒప్పందంపై చర్చలు సాగాయి. ఒప్పందం అన్నాక ఇచ్చిపుచ్చుకోవడాలుంటాయి. ‘మేం పుచ్చుకుంటాం... ఇవ్వం’ అంటున్నారు. ‘మాతో ఒప్పందానికి భారత్ సుముఖంగా వుంది... ఇక సంతకాలే తరువాయి’ అంటూ చాన్నాళ్ల క్రితమే మన ప్రభుత్వం తరఫున తానే ప్రకటించారు. ట్రంప్ ఆగ్రహావేశాలకు వేరే కారణాలున్నాయి. మన సాగు, పాడి రంగాలను పరిరక్షించేందుకు అమెరికా నుంచి వచ్చే ఆ ఉత్పత్తులపై మన దేశం అధిక సుంకాలు విధిస్తోంది. ఇందులో సహేతుకత ఉంది. అమెరికాలో ఆ రంగాలకు భారీ సబ్సిడీలుంటాయి. దాంతో తమ ఉత్పత్తుల్ని వేరే దేశాల్లో కారుచౌకగా అమ్ముకోవటానికి వీలుంటుంది. అమెరికాతో పోలిస్తే మన సబ్సిడీలు చాలా తక్కువ. అవి రైతులకు లాభదాయకం కాకపోగా, ఆ రెండు రంగాల్లోనూ వ్యయం విపరీ తంగా పెరిగింది. రైతులు అధిక వడ్డీకి బయట అప్పులు చే యాల్సి వస్తోంది. తీరా గిట్టుబాటు ధర లభించక, అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ట్రంప్ ఒత్తిడి చేస్తున్నట్టు అధిక సుంకాలు తొలగిస్తే ఈ సంక్షోభం మరింత పెరుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆసరాగా ఉన్న ఆ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నిజానికి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో చేరినప్పుడే మన పాలకులు నిక్కచ్చిగా ఉండాల్సింది. కానీ దాటవేత ధోరణి ప్రదర్శించారు. రష్యాతో వాణిజ్యంపైనా ఇంతే. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలన్నట్టు ఉంటే వేరుగా ఉండేది. కానీ మన దేశం వారి ఆదేశాలు పాటించింది. 2009–13 మధ్య మన ఆయుధ కొనుగోళ్లలో రష్యా వాటా 76 శాతం. అదిప్పుడు 36 శాతానికి పడిపోయింది. దీన్ని ఆపేయాలని, తన ఎఫ్–35 యుద్ధ విమానాలు, ఎంక్యూ–9బి డ్రోన్లు, పీ–81 సాగర ప్రాంత గస్తీ విమానాలు కొనితీరాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. నిజానికి భారత్‌కు ఆయుధ అమ్మకాలపై 1960 ప్రాంతాల్లో అమెరికా నిషేధం విధించబట్టే రష్యాపై ఆధారపడటం పెరిగింది. ముడి చమురు విషయానికొస్తే మొన్న ఫిబ్రవరికి రష్యా నుంచి కొనుగోళ్లు 25 శాతం మేర పడిపోయాయి. అదే సమయంలో అమెరికా నుంచి కొనుగోళ్లు వంద శాతం పెరిగాయి. తన అంధభక్త గణాన్ని సంతృప్తిపరచటం కోసం, ఓటుబ్యాంకు పెంచుకోవటం కోసం ట్రంప్ దశాబ్దాల తరబడి ఎంతో ఓపిగ్గా నిర్మించుకుంటూ వచ్చిన ఇరు దేశాల సంబంధాలపైనా గొడ్డలి వేటు వేశారు. దీని పర్యవ సానాలు మనపై ఉన్నట్టే, అమెరికాపైనా ఉంటాయి. ఆయన ధోరణి మారకపోతే మన ఆర్థిక వ్యవస్థ మాటేమోగానీ... అమెరికా ఆర్థిక వ్యవస్థ ‘మృతప్రాయం’ కావటం ఖాయం. -
ఎగుమతులకు టారిఫ్‌ల సెగ
భారత ఎగుమతులపై అమెరికా ఎకాయెకిన 25 శాతం టారిఫ్‌లు ప్రకటించడం దేశీ పరిశ్రమలకు శరాఘాతంగా తగిలింది. దీనితో అమెరికన్ మార్కెట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్న రత్నాభరణాలు, టెక్స్టైల్స్, ఫార్మా తదితర పలు పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలు నెలకొన్నాయి. అలాగే పలు రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలకు కూడా కోత పడొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాకు కనీసం 25 శాతం ఎగుమతులు తగ్గినా, వాణిజ్య ఆదాయాలపరంగా ఏటా 21.75 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతుందని అంచనా. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు తగ్గడం వల్ల మన రూపాయి మారకం విలువ కూడా క్షీణించే అవకాశం ఉంది. అటు స్టాక్ మార్కెట్లపరంగా చూస్తే ఎగుమతుల ఆధారిత రంగాలకు చెందిన (టెక్స్టైల్స్, జ్యుయలరీ మొదలైనవి) సంస్థల షేర్లు తగ్గొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాతో మన వాణిజ్యం, టారిఫ్‌లపై వివిధ రంగాలపై పడే ప్రభావాలపై ఈ ప్రత్యేక కథనం. – బిజినెస్ డెస్క్రత్నాభరణాలు: రత్నాభరణాల పరిశ్రమ మొత్తం ఎగుమతుల్లో 30 శాతం వాటా అమెరికాదే ఉంటోంది. అగ్రరాజ్యానికి ఎగుమతులు సుమారు 10 బిలియన్ డాలర్లుగా ఉంటున్నాయని రత్నాభరణాల ఎగుమతుల మండలి జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు. భారీ స్థాయిలో టారిఫ్‌లు విధించడం వల్ల వ్యయా పెరిగిపోవడానికి, ఎగుమతుల్లో జాప్యానికి దారి తీస్తుందని, చిన్న స్థాయి వ్యాపారుల నుంచి భారీ తయారీ సంస్థల వరకు అందరిపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఎగుమతులు పడిపోవడం, ఆర్డర్లు రద్దు కావడం, ఎగుమతిదారుల మార్జిన్లు తగ్గిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని రిద్ధిసిద్ధి బులియన్స్ (ఆర్‌ఎస్‌బీఎల్) ఎండీ పృథ్వీ రాజ్ కొఠారీ చెప్పారు.గత ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 2.3 బిలియన్ డాలర్ల విలువ చేసే రొయ్యలను అమెరికా మార్కెట్‌కు ఎగుమతి చేసింది. అమెరికాకు మొత్తం సీఫుడ్ ఎగుమతుల్లో ఇది 90 శాతం కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎగుమతులు ఉంటుండటంతో తెలుగువారిపైనా ఈ ప్రభావం పడొచ్చని అంచనా. ఈ విభాగంలో మనతో పోలిస్తే టారిఫ్‌లు తక్కువగా ఉన్న ఈక్విడార్తో పోటీ తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అయితే, బ్రిట న్‌తో ఇటీవలే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో అమెరికా టారిఫ్‌ల ప్రభావం కాస్త తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఫార్మా.. మెడికల్ డివైజ్‌లు.. చౌక జనరిక్స్ ఔష ధాలకు సంబంధించి అమెరికా అవసరాల్లో దాదాపు 47 శాతాన్ని భారత్ తీరుస్తోంది. టారిఫ్‌లతో ఎగుమతులపై ప్రభావం పడితే భారత ఫార్మా సంస్థల లాభాలు తగ్గుతాయి. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నెమ్మదిస్తాయని, కొత్త ఔషధాలకు అనుమతులు నిలిచిపోతాయని, అలాగే కొత్త ఆవిష్కరణలపై ఎఫెక్ట్ పడుతుందని భారతీయ మెడికల్ డివైజ్‌ల పరిశ్రమ సమాఖ్య ఏఐఎంఈడీ ఫోరం కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ తెలిపారు. అయితే, టారిఫ్‌లపరంగా చైనా, భారత్ మధ్య 15–20 శాతం మేర వ్యత్యాసం కొనసాగినంత కాలం మెడికల్ డివైజ్‌ల పరిశ్రమకు కాస్త సానుకూలంగానే ఉంటుందని పేర్కొన్నారు.ఇంజినీరింగ్ ఉత్పత్తులు.. » గణాంకాల ప్రకారం అమెరికాకు ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 18.3 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి. మన ఉత్పత్తులు ఖరీదుగా మారితే అమెరికన్లు మెక్సికోలాంటి దేశాలవైపు మళ్లొచ్చు. దీనితో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మేకిన్ ఇండియా కార్యక్రమానికి విఘాతం కలగవచ్చు.వ్యవసాయ ఉత్పత్తులు.. » అమెరికాకు మన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు 5.6 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. సుంకాలతో భారత్ నుంచి ఆహార పదార్థాల ధరలు పెరిగిపోయి, అమెరికన్లు దిగుమతులను తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు మళ్లొచ్చు. దీనితో రైతులు, ఎగుమతిదార్లపై ప్రభావం పడొచ్చు. ఉక్కు, రసాయనాలు, పెట్రోలియం ఉత్పత్తులు.. అమెరికాకు ఈ ఉత్పత్తుల ఎగుమతులు 8 బిలియన్ డాలర్ల పైగా ఉన్నాయి. టారిఫ్‌లతో వల్ల వియత్నాం, బ్రెజిల్‌లాంటి దేశాలు పోటీకి రావడం వల్ల మన దగ్గర ఈ రంగంలోని బడా కంపెనీలతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలపైనా ప్రభావం పడుతుంది. మొత్తం ఎగుమతుల్లో అయిదో వంతు వాటాతో భారత్‌కు అమెరికా కీలకంగా ఉంటోంది. » భారీగా ఉపాధి కల్పించే టెక్స్టైల్స్, వ్యవసాయం, లెదర్, రత్నాభరణాల్లాంటి పరిశ్రమల నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లో అమెరికా వాటా ఏకంగా 35 శాతంగా నమోదైంది. టారిఫ్‌లతో ఈ పరిశ్రమలు దెబ్బతింటే, ఉపాధి అవకాశాలపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంది. రత్నాభరణాల పరిశ్రమలో 1 లక్ష పైగా ఉద్యోగాలపై ప్రభావం పడొచ్చని అంచనా. » గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ 87 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను ఎగుమతి చేయగా, 46 బిలియన్ డాలర్ల మేర దిగుమతులు చేసుకుంది. అమెరికాతో వాణిజ్యంలో భారత్‌కు సుమారు 41 బిలియన్ డాలర్ల మేర మిగులు ఉంది. అటు సర్వీసులపరంగా చూసినా అమెరికాకు 2023లో 36.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేయగా, 34 బిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంది. భారత్ పక్షాన సుమారు 2.4 బిలియన్ డాలర్ల మిగులు నమోదైంది. అమెరికన్లకూ ’చేదు’ మాత్రే .. అమెరికా టారిఫ్‌లు భారత్‌కి కొంత సమస్యాత్మకమే అయినప్పటికీ, దీర్ఘకాలంలో వాటి ప్రభావం అమెరికన్లపైనే ఎక్కువగా ఉంటుందని నిపుణులు, పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై సుంకాలు విధించడం వల్ల, అక్కడ వాటి ధరలు పెరిగిపోయి స్థానికులు మరింతగా వెచ్చించాల్సి వస్తుందని ఫార్మా ఎగుమతి సంస్థల సమాఖ్య ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి తెలిపారు. భారీ ఎత్తున, నాణ్యమైన ఔషధాలను చౌకగా అందించే ప్రత్యామ్నాయాలను ఇప్పటికిప్పుడు దొరకపుచ్చుకోవడం పెద్ద సవాలుగానే ఉంటుందని చెప్పారు.ఏయే పరిశ్రమలకు ప్రతికూలం.. టెక్స్టైల్స్/దుస్తులు రత్నాభరణాలు ఫార్మా వాహనాలు, ఆటో విడిభాగాలు ఎల్రక్టానిక్స్/మొబైల్ డివైజ్‌లు ఇంజనీరింగ్ ఉత్పత్తులు/మెటల్స్ సీఫుడ్/అగ్రి ఎగుమతులుటెక్స్టైల్స్..టారిఫ్‌ల వల్ల భారతీయ టెక్స్టైల్స్ ఎగుమతిదారులపై గణనీయంగానే ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషకులు తెలిపారు. మనతో పోలి స్తే వియత్నాం, ఇండొనేషియాలాంటి దేశాలపై తక్కువ సుంకాలు ఉండటం వల్ల వాటి నుంచి మరింత పోటీని ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొన్నా రు. ఆర్డర్లు రద్దు కావడం, ధర లు తగ్గించాలంటూ ఒత్తిడి పెరగడంలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చని ట్రేడ్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబెక్స్ ఎగ్జిమ్ సొల్యూషన్స్ తెలిపింది. బంగ్లాదేశ్, వియత్నాంలాంటి దేశా ల నుంచి పోటీ పెరిగి, చిన్న తయారీ సంస్థలపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో బ్రిటన్, యూరోపియన్ యూనియన్, జపాన్‌లాంటి ఇతర మార్కెట్లపై కూడా మరింతగా దృష్టి పెట్టాలని భారతీయ టెక్స్టైల్ పరిశ్రమ సమాఖ్య (సీఐటీఐ) సెక్రటరీ జనరల్ చంద్రిమా చటర్జీ చెప్పారు. భారత టెక్స్టైల్స్, దుస్తులకు అమెరికా అతి పెద్ద మార్కెట్‌గా ఉంటోంది. 17 బిలియన్ డాలర్ల రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో 5.6 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు అమెరికాకే ఎగుమతవుతున్నాయి. టెక్స్టైల్స్, అపారెల్ పరిశ్రమ ద్వారా దాదాపు 4.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమ దెబ్బతింటే వీరి ఉపాధిపైనా ప్రభావం పడుతుంది.ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరికరాలు.. టెలికం పరికరాలు, మొబైల్ ఫోన్స్, సర్క్యూట్ బోర్డుల్లాంటి ఉత్పత్తుల ఎగుమతులు 12 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటున్నాయి. టారిఫ్‌ల వల్ల చౌకగా లభించే ఎలక్ట్రానిక్స్ విషయంలో మిగతా దేశాలతో భారత్ పోటీ పడే సామర్థ్యం తగ్గుతుంది. దీనితో ఎల్రక్టానిక్స్ ఎగుమతులు నెమ్మదించవచ్చు. -
టారిఫ్‌లతో జీడీపీపై ఎఫెక్ట్
న్యూఢిల్లీ: ఊహించిన దానికన్నా అధిక స్థాయిలో టారిఫ్‌లు విధించడంతో పాటు పెనాల్టిలు కూడా వేయాలన్న అమెరికా నిర్ణయంతో భారత స్థూల దేశీయోత్పత్తిపై (జీడీపీ) ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు తెలిపారు. పరస్పరం ప్రయోజనకరంగా ఉండే డీల్‌ను కుదుర్చుకోవడం ద్వారా భారత్ దీన్ని అధిగమించగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ టారిఫ్‌ల వల్ల ఇరు దేశాల మధ్య అత్యధిక వాణిజ్యం జరిగే ఫార్మా, టెక్స్టైల్స్, లెదర్, ఆటోమొబైల్స్, మెరైన్ ఉత్పత్తుల్లాంటి కీలక రంగాలపై నేరుగా ప్రభావం పడుతుందని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. ప్రాథమికంగా టారిఫ్‌లను ప్రకటించినప్పుడే 2025–26 జీడీపీ వృద్ధి అంచనాలను 6.2 శాతానికి కుదించగా, తాజాగా పెనాల్టిల పరిమాణాన్ని బట్టి మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, 25% టారిఫ్‌ల విధింపు దురదృష్టకరమని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. దీని వల్ల ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఫిక్కీ ప్రెసిడెంట్ హర్ష వర్ధన్ అగర్వాల్ తెలిపారు. టెక్స్టైల్స్ రంగానికి టారిఫ్‌లు పెను సవాలుగా మారతాయని టెక్స్టైల్ పరిశ్రమ సమాఖ్య సీఐటీఐ ఆందోళన వ్యక్తం చేసింది. -
రూపాయి మూడేళ్లలో అతిపెద్ద పతనం
ముంబై: భారత్‌పై ఆగస్టు 1 నుంచి జరిమానాతో సహా 25% సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో దేశీయ కరెన్సీ రూపాయి మూడేళ్లలో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. డాలర్ మారకంలో ఏకంగా 89 పైసలు బలహీనపడి 87.80 వద్ద ముగిసింది.2022, డిసెంబర్ 24 (99 పైసలు క్షీణత) తర్వాత రూపాయి ఒకే రోజు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. నెలాఖరున దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సైతం దేశీయ కరెన్సీ కోతకు కారణమయ్యాయి. -
25 శాతం సుంకాలు
ప్రభావాన్ని సమీక్షిస్తున్నాం: కేంద్రం భారత్‌పై 25 శాతం సుంకాల విధింపు, రష్యాతో వర్తకం చేస్తున్నందుకు జరిమానా ప్రకటన తాలూకు ప్రభావాన్ని మదింపు చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇరు దేశాలకూ ఆమోదనీయ, లాభదాయక రీతిలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు కట్టుబడి ఉన్నాం. కొద్ది నెలలుగా ఆ దిశగాఅత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి’’అని గుర్తు చేసింది. వీటిలో భాగంగా ఆరో రౌండ్ చర్చల నిమిత్తం అమెరికా బృందం ఆగస్టు 25న భారత్ రానుంది.వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అనూహ్యంగా భారీ టారిఫ్ బాంబు విసిరారు. భారత దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాలు బాదారు. అంతేగాక వీటికి అదనంగా రష్యాతో వర్తకం చేస్తున్నందుకు భారత్‌పై ప్రత్యేకంగా జరిమానా కూడా విధించనున్నట్టు పేర్కొన్నారు. ఆ మొత్తం ఎంత న్నది పేర్కొనలేదు. ఈ నిర్ణయాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ట్రూత్ సోషల్’లో బుధవారం ఈ మేరకు ఆయన పలు పోస్టులు పెట్టారు. అమెరికాతో భారత వర్తక విధానాలు, నిబంధనలను అత్యంత దారుణమైనవిగా అభివర్ణించారు.‘‘భారత్ మా మిత్ర దేశమే. కానీ వర్తక, వాణిజ్య సంబంధాల విషయంలో ఆ దేశంతో అంతా సజావుగా లేదు. అమెరికాపై ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. అందుకే ఆ దేశంతో మేం భారీ స్థాయిలో వ్యాపారం చేయడం లేదు’’అని రాసుకొచ్చారు. భారత్‌తో అమెరికాకు భారీ వర్తక లోటు ఉందని గుర్తు చేశారు. రష్యా నుంచి భారీగా చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకే అదనంగా జరిమానా విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. ‘‘ఉక్రెయిన్‌లో జనహననం ఆగాలని ప్రపంచమంతా ఆకాంక్షిస్తోంది. ఇలాంటి సమయంలో అందుకు పాల్పడుతున్న రష్యాతో భారత్ భారీ వాణిజ్య సంబంధాలు నెరుపుతోంది’’అంటూ ఆక్షేపించారు.అదే జరిగితే రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు అమెరికా నుంచి జరిమానా ఎదుర్కోనున్న తొలి దేశం భారతే అవుతుంది. భారత్‌తో వర్తక ఒప్పందం నిమిత్తం అమెరికా బృందం ఆగస్టు 25 నుంచి భారత్‌లో పర్యటించనుందని కేంద్రం ప్రకటించిన మర్నాడే ట్రంప్ నుంచి అనూహ్యంగా సుంకాల పోటు నిర్ణయం వెలువడటం గమనార్హం. ఈ దెబ్బకు రూపాయి విలువ గత మూడేళ్లలో అత్యధికంగా బుధవారం ఏకంగా 89 పైసలు పతనమైంది. అమెరికా డిమాండ్లకు తలొగ్గేలా భారత్‌పై ఒత్తిడి పెంచడమే ట్రంప్ ప్రకటన ఉద్దేశమని భావిస్తున్నారు.ఇటీవలి కాలంలో జపాన్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌పై కూడా ట్రంప్ ఇలాంటి ఒత్తిళ్లే తెచ్చి అమెరికాకు అనుకూలంగా ఒప్పందాలు కుదుర్చుకుందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. గతంలో చైనాపై కూడా ఇలాగే ట్రంప్ అడ్డగోలుగా టారిఫ్‌లను ప్రకటించడం, చివరికి వెనక్కు తగ్గడం తెలిసిందే. భారత చమురు దిగుమతుల్లో కేవలం 0.2 శాతంగా ఉన్న రష్యా వాటా ఉక్రెయిన్‌తో ఆ దేశం యుద్ధానికి దిగిన అనంతరం ఏకంగా 35 నుంచి 40 శాతానికి పెరిగింది. అయితే ఇప్పటికీ రష్యా నుంచి అతి పెద్ద చమురు దిగుమతిదారుగా చైనాయే నిలుస్తోంది. ఆ దేశంపై మాత్రం ట్రంప్ ఎలాంటి జరిమానాలు విధించలేదు. ట్రంప్ సుంకాల నిర్ణయంపై భారత పరిశ్రమల రంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.ట్రంప్ ప్రకటించిన 25 శాతం సుంకాలు ఇప్పటికే అన్ని దేశాలతో పాటు భారత్‌పైనా అమల్లో ఉన్న 10 శాతం బేస్‌లైన్ టారిఫ్‌లకు అదనమా, కాదా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అన్ని దేశాలపై 10 శాతం టారిఫ్ ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచి్చంది. దీనికి అదనంగా స్టీల్, అల్యుమినియం దిగుమతులపై 50 శాతం, ఆటో రంగంపై 25 శాతం అదనపు సుంకాలను కూడా ట్రంప్ విధించారు. ట్రంప్ ప్రకటన వెలువడ్డ కాసేపటికే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భేటీ జరిపి పరిస్థితిని సమీక్షించారు. ఏప్రిల్‌లో 26 శాతం సుంకాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని మంగళవారమే ట్రంప్ మీడియాకు చెప్పడం తెలిసిందే. 25 శాతం టారిఫ్ విధించనున్నట్టు అప్పుడే ఆయన సంకేతాలిచ్చారు. 20 నుంచి 25 శాతం దాకా టారిఫ్‌లు విధిస్తారా అని మీడియా ప్రశ్నించగా, అలాగే భావిస్తున్నట్టు బదులిచ్చారు. గత ఏప్రిల్ 2న భారత్‌పై 26 శాతం టారిఫ్‌లను ట్రంప్ ప్రకటించారు. కొద్ది రోజులకే ఆ నిర్ణయం అమలును 90 రోజుల పాటు, అంటే జూలై 9 దాకా, అనంతరం ఆగస్టు 1 దాకా వాయిదా వేశారు. అమెరికా, భారత్ నడుమ వాణిజ్య ఒప్పందం నిమిత్తం అత్యున్నత స్థాయి బృందాల నడుమ ఇప్పటికే ఐదు రౌండ్ల పాటు చర్చలు జరిగాయి. అతి పెద్ద వాణిజ్య భాగస్వామి 2021–25 నడుమ భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. భారత మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతం. అమెరికాతో భారత్‌కు 2022–23లో 27.7 బిలియన్లు, 2023–24లో 35.32 బిలియన్లు, 2024–25లో 41 బిలియన్ డాలర్ల మేరకు వాణిజ్య మిగులు నమోదైంది. 2024–25లో భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 186 బిలియన్ డాలర్ల మేర నమోదైంది. వీటిలో భారత్ 86.5 బిలియన్ డాలర్ల మేర వస్తువులను ఎగుమతి చేయగా, 45.3 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. సేవల రంగంలో అమెరికాకు 28.7 బిలియన్ డాలర్ల మేరకు ఎగుమతులు జరిపింది. 25.5 బిలియన్ డాలర్ల మేరకు దిగుమతులు చేసుకుంది.మొత్తమ్మీద అమెరికాతో వాణిజ్యంలో భారత్ 44.4 బిలియన్ డాలర్ల మిగులు నమోదు చేసింది. ఇది ట్రంప్‌కు కంటగింపుగా మారింది. అందుకే ఇలా పదేపదే టారిఫ్‌ల కత్తి దూస్తున్నారు. 2024లో అమెరికాకు భారత ఎగుమతుల్లో డ్రగ్ ఫార్మూలాలు–బయోలాజికల్స్ (8.1 బిలియన్లు), టెలికాం పరికరాలు (6.5 బిలియన్లు), అరుదైన రాళ్లు (5.3 బిలియన్లు) పెట్రోలియం ఉత్పత్తులు (4.1 బిలియన్లు), వాహనాలు–ఆటో పరికరాలు (2.8 బిలియన్లు), బంగారం–ఇతర లోహాలు (3.2 బిలియన్లు) రెడీమేడ్ దుస్తులు, కాటన్ తదితరాలు (2.8 బిలియన్లు) ఇనుము, స్టీల్ ఉత్పత్తులు (2.7 బిలియన్లు) ప్రధానమైనవి. అమెరికా నుంచి దిగుమతుల్లో ప్రధానంగా చమురు (4.5 బిలియన్లు), పెట్రో ఉత్పత్తులు (3.6 బిలియన్లు), బొగ్గు, కోక్ (3.4 బిలియన్లు), వజ్రాలు (2.6 బిలియన్లు), ఎలక్ట్రిక్ యంత్రాలు (1.4 బిలియన్లు), విమాన, రాకెట్ల విడిభాగాలు (1.3 బిలియన్లు), బంగారం (1.3 బిలియన్లు) ఉన్నాయి. మోదీతో ట్రంప్ స్నేహానికి ఇదీ ఫలం!: విపక్షాల ధ్వజం భారత్‌పై 25 శాతం టారిఫ్‌ల విధింపు మోదీ ప్రభుత్వ ఘోర వైఫల్యమేనంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. మోదీతో స్నేహానికి ట్రంప్ ఏ మాత్రమూ విలువ ఇవ్వడం లేదనేందుకు ఇది తాజా నిదర్శనమని ఎద్దేవా చేశాయి. మోదీపై ట్రంప్ తారీఫ్ (పొగడ్తలు), హౌడీ మోడీ వంటి నినాదాలు ఎందుకూ కొరగానివని తేలిపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు.భారత్–పాక్ యుద్ధాన్ని ఆపానని ట్రంప్ 30సార్లకు పైగా చెప్పుకున్నారు. పాక్ ఆర్మీ చీఫ్‌కు వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందు ఇచ్చారు. ఐఎంఎఫ్ నుంచి భారీ ఆర్థిక సహాయ ప్యాకేజీ ఇప్పించారు. ఇన్ని చేస్తున్నా మౌనంగా భరిస్తే బహుశా ట్రంప్ నుంచి స్పెషల్ ట్రీట్మెంట్ లభిస్తుందని మోదీ ఆశపడ్డారు. కానీ అలా జరగలేదు’’అన్నారు. కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నుంచి స్ఫూర్తి పొంది అమెరికా అధ్యక్షుని నిర్ణయాలను దీటుగా ఎదిరించాలని మోదీకి సూచించారు. టీఎంసీ, డీఎంకే, ఆర్జేడీ, వామపక్షాలు తదితరాలు కూడా మోదీ ప్రభుత్వానిది ఘోర వైఫల్యమంటూ నిందించాయి. ఇది భారత్‌కు తీవ్ర అవమానమని అభిప్రాయపడ్డాయి. -
ఈయూతో ట్రంప్ భారీ వాణిజ్య ఒప్పందం.. దిగుమతులపై 15శాతం సుంకాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్‌తో భారీ వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. ఇకపై ఈయూ దిగుమతులపై అమెరికా 15 శాతం సుంకాలను విధించనున్నదని వెల్లడించారు. యునైటెడ్ స్టేట్స్ దీనిని మునుపెన్నడూ లేని భారీ వాణిజ్య ఒప్పందంగా అభివర్ణించింది.యూరోపియన్ వస్తువులపై 30శాతం అమెరికా సుంకాలను నివారించేందుకు ఆగస్టు ఒకటితో గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ ఒప్పందం కుదిరింది. స్కాట్లాండ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌ల మధ్య జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈయూతో తాము ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇది ఇరు దేశాలకు లబ్ధి చేకూర్చే ఒప్పందం అని, బహుశా ఇది ఆ దేశంతో కుదిరిన పెద్ద ఒప్పందం అని ట్రంప్ వార్తాసంస్థ ఎఎఫ్పీకి తెలిపారు. Today, President Trump secured a HUGE, POWERFUL TRADE DEAL between the U.S. and EU 🇺🇸 The EU will: 💰 Invest $600 Billion in U.S.⚡️ Purchase $750 Billion in American Energy💸 Open Markets to U.S. pic.twitter.com/PWNtlhpH5b— The White House (@WhiteHouse) July 28, 2025ఈ 15శాతం సుంకాలు యూరప్‌లోని కీలకమైన ఆటోమొబైల్ రంగం, ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లతో సహా అన్ని రంగాలకు వర్తిస్తాయని ట్రంప్ తెలిపారు. ఈ ఒప్పందం కారణంగా 27 దేశాల ఈయూ కూటమి యునైటెడ్ స్టేట్స్ నుండి 750 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనశక్తిని కొనుగోలు చేస్తుందని, ఈయూ 600 బిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడులను అందిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుండి ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా, రాబోయే మూడు సంవత్సరాలలో యూరోపియన్ యూనియన్ అమెరికా నుంచి ద్రవీకృత సహజ వాయువు, చమురు అణు ఇంధనాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుందని వాన్ డెర్ లేయన్ తెలిపారు.విమానాలు, కొన్ని రసాయనాలు, పలు వ్యవసాయ వస్తువులు, కీలక ముడి పదార్థాలు తరహా ఉత్పత్తులపై సుంకాలను తొలగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని ఆమె పేర్కొన్నారు. జనవరిలో ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఈయూ పలు సుంకాల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంది. కార్లపై 25శాతం పన్ను, ఉక్కు, అల్యూమినియంపై 50శాతం సుంకాన్ని ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడు ఒప్పందం కుదరకపోతే ఈ 10శాతం సుంకాల రేటు 30శాతం వరకు పెరుగుతుందని అమెరికా హెచ్చరించింది. -
నాటో మొరటు భాష!
ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. కానీ ఆర్నెల్ల నిరీక్షణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో కొద్దో గొప్పో సయోధ్య కుదిరేసరికి నాటో కూటమి ఆయన లక్షణాలు పుణికి పుచ్చుకున్నట్టు కనబడుతోంది. రష్యాతో వాణిజ్యం సాగిస్తే వంద శాతం సుంకాలు విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ భారత్, చైనా, బ్రెజిల్ దేశాలకు చేసిన హెచ్చరిక దీన్నే చాటు తోంది. ట్రంప్‌తో నాలుగు రోజులక్రితం భేటీ అయ్యేవరకూ తన భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో నాటో దిగాలుగా, అయోమయంగా వుంది. ఎందుకంటే నాటో ఖర్చులో సింహభాగం అమెరికాదే. అది తప్పుకున్న మరుక్షణం సంస్థ కుప్పకూలుతుంది. ట్రంప్ ప్రసన్న వదనంతో పలక రించేసరికి పులకరించి తన స్థాయి ఏమిటన్నది నాటో మరిచిందని రూట్ మాటలు చెబుతున్నాయి. ఈ మూడు దేశాలూ యుద్ధం వద్దని రష్యాకు నచ్చజెప్పాలట. లేనట్టయితే ఆ పర్యవసానాలు ఈ దేశాలూ ఎదుర్కొనాల్సి వస్తుందట. ఇంకా వలస పాలన మాటున దోపిడీ సాగించిన నాటి రోజులే వున్నాయని రూట్ భ్రమపడుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ఎవరూ సమర్థించరు. అలాగే గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం, ఇటీవల ఆ దేశమే ఇరాన్‌పై చేసిన దాడి, దానికి వత్తాసుగా అమెరికా సాగించిన దాడులు అంగీకరించరు. నాటో దన్నుతో ఉక్రె యిన్ కావాలని రష్యాతో గిల్లికజ్జాలకు దిగిన వైనం అందరికీ తెలుసు. తమ చేతికి మట్టి అంటకుండా రష్యాను దెబ్బతీసి, దాన్ని సర్వనాశనం చేయగలమన్న భ్రమలో యూరప్ దేశాలు ఉక్రె యిన్‌ను ఉసిగొల్పాయి. కానీ మూడేళ్లయినా ఆ యుద్ధం ఆగకపోవటంతో యూరప్ దేశాలకు దిక్కు తోచటం లేదు. ఆ నిరాశా నిస్పృహల పర్యవసానంగానే నాటో కూటమి అతిగా మాట్లాడుతోంది. అటువంటి బెదిరింపులకు దిగేందుకు తనకున్న అర్హతేమిటో నాటో గమనించుకోలేదు. 1949లో ఆవిర్భావం మొదలుకొని దాని చరిత్రంతా దురాక్రమణలు, యుద్ధాలే. నిక్షేపంగా వున్న లిబియాపై చమురు, సహజవాయు నిక్షేపాల్ని కొల్లగొట్టడానికి దండెత్తి, రసాయన ఆయుధాలున్నా యంటూ ఆరోపించి, పాలకుడు గడాఫీని దారికి తెచ్చుకుని, ఆయన నిరాయుధుడు కాగానే సాయుధ ముఠాలను ఎగతోసింది నాటోయే. ఆ ముఠాలతో ఆయన్ను అత్యంత అమానుషంగా హత్య చేయించింది కూడా నాటోయే. 2011 మొదలుకొని ఇప్పటివరకూ ఆ దేశం అంతర్యుద్ధంతో సతమతమవుతోంది. బోస్నియా, హెర్జ్‌గోవినా, కొసావో, అఫ్గాన్, ఇరాక్, సోమాలియా తదితర చోట్ల అమెరికాతో కలిసి, విడిగా నాటో సృష్టించిన కల్లోలం సామాన్యమైంది కాదు. ఈ యుద్ధాల్లో లక్షలాది మంది పౌరులు మరణించారు. రష్యా–ఉక్రెయిన్ లడాయిలోఉక్రెయిన్కు సైనిక, ఆర్థిక సాయాన్నందిస్తూ ఈ యుద్ధం ఆరకుండా కాపాడుతున్నది కూడా నాటోయే. అలాంటి సంస్థ ఏ అర్హతతో మననూ, వేరే దేశాలనూ బెదిరిస్తుంది? నాటో అనేది పుట్టుకనుంచీ అమెరికా కోసం, దాని ప్రయోజనాల పరిరక్షణ కోసం పనిచేస్తున్న పెద్ద పోలీస్. ఒక సైనిక కూటమిగా వుంటూ ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధించటం సాధ్యమనే నాటో అనుకుంటున్నదా? ఆ పని యూరప్ దేశాలది. కానీ వాటికి హెచ్చరించటం సంగతలా వుంచి అడిగే ధైర్యం కూడా లేదు. ఒకనాడు సంపన్న రాజ్యాలుగా చలామణి అయిన యూరప్ దేశాలు ఇప్పుడు ఉత్పాదకతను పెంచటం ఎలాగో... అరకొర ఆర్థిక వ్యవస్థలతో ప్రజానీకంలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చటం ఎలాగో అర్థంకాక తలలు పట్టుకుంటున్నాయి. ఈ దేశాలతో కూడిన నాటో మాత్రం పెద్ద మాటలు మాట్లాడుతోంది. ఇన్నేళ్ల అమెరికా సాహచర్యంతో ఇష్టాను సారం బడుగు దేశాలపై బలప్రయోగం చేయటం అలవాటైన నాటోకు ఈ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి, భద్రతామండలి వంటి అంతర్జాతీయ వేదికలున్నాయని కూడా గుర్తున్నట్టు లేదు. ఆంక్ష లైనా, విధినిషేధాలైనా వాటిద్వారా అమలు కావాలి. అదనంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వంటివి వున్నాయి. రష్యాతో వ్యాపారం చేయాలో లేదో అమెరికా, యూరప్సొంతంగా నిర్ణయించుకోవచ్చు. అందులో ఎవరూ జోక్యం చేసుకోలేరు. కానీ మేమే కాదు... ఎవరూ వ్యాపారం చేయకూడదంటే చెల్లదు. తన ఇంధన అవసరాలేమిటో, దాన్ని నెరవేర్చుకోవటానికి అనుసరించాల్సిన వ్యూహమేమిటో భారత్ ఆలోచించుకుంటుంది. రష్యాపై అమెరికా ఆంక్షలు విధించినా మన దేశం బేఖాతరుచేసింది. రష్యా చవగ్గా అమ్మజూపిన ముడి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసింది.క్రితంతో పోలిస్తే 2023లో రష్యా నుంచి చమురు, సహజవాయు దిగుమతులు 1,500 శాతం పెరగటానికి ఇదే కారణం. చైనా, బ్రెజిల్ కూడా ఈ దోవనే వెళ్లాయి. రష్యాను ఏకాకిని చేయాలన్న పాశ్చాత్య ప్రపంచం కలల్ని బద్దలుకొట్టాయి. మన విదేశాంగ శాఖ నాటో ద్వంద్వ ప్రమాణాలను సరిగానే ఎత్తిచూపింది. ప్రజల ఇంధనావసరాలు మినహా తమకేదీ ప్రాముఖ్యంగల అంశం కాదని జవాబిచ్చింది. ఒకప్పుడు 27 దేశాల నుంచి ముడి చమురు కొనుగోలు చేసిన మన దేశం, ఇప్పుడు 40 దేశాలనుంచి కొంటున్నది. రష్యాపై తీసుకొచ్చిన అభిశంసనపై ఓటింగ్ జరిగినప్పుడల్లా ఐక్యరాజ్యసమితిలో మన దేశం గైర్హాజరైంది. అదే సమయంలో యుద్ధాన్ని విరమించాలని రష్యా అధినేత పుతిన్‌కు నచ్చజెప్పింది. అదే సలహా ఉక్రెయిన్‌కు కూడా ఇచ్చింది. ఇవి తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడటం, హెచ్చరికలు జారీ చేయటం తగదని నాటో గుర్తించాలి. తెలిసీ తెలియ కుండా తగుదునమ్మా అని జోక్యం చేసుకుంటే వున్న పరువు కాస్తా పోతుందని గుర్తెరగాలి. -
జాతీయ ప్రయోజనాలే ముఖ్యం
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే, వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే 100 శాతం టారిఫ్‌లు విధిస్తామంటూ ‘నాటో’ సెక్రెటరీ జనరల్ మార్క్ రుట్టే చేసిన హెచ్చరికలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తిప్పికొట్టారు. జాతీయ ప్రయోజనాలు, మార్క్ అవసరాల ఆధారంగానే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. తమకు దేశ ప్రయోజనాలు, అవసరాలే ముఖ్యమని తేల్చిచెప్పారు. రష్యా చమురు విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించొద్దని నాటోకు సూచించారు. రణధీర్ జైశ్వాల్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మార్క్ రుట్టే హెచ్చరికలను నిశితంగా గమనిస్తున్నా మని చెప్పారు. భారత ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు ప్రజా ప్రయోజన కోణంలోనే ఉంటాయన్నారు. సుస్థిరమైన ఇంధన భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మార్కెట్లో తక్కువ ధరకు చమురు లభించినప్పుడు కొనడం సాధారణమేనని వివరించారు. రష్యా నుంచి యూరప్ దేశాలు చమురు కొనుగోలు చేస్తున్నారని రణధీర్ జైశ్వాల్ పరోక్షంగా ప్రస్తావించారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపాలని, ఉక్రెయిన్‌పై యుద్ధం విరమించేలా రష్యాపై ఒత్తిడి పెంచాలని ఇండియా, చైనా, బ్రెజిల్‌కు మార్క్ రుట్టే సూచించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి ఈ మూడు దేశాలే అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్నాయి. -
ట్రంప్ కొత్త రాగం!
చాలా తరచుగా మాటలు మార్చే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై కత్తిగట్టారు. 50 రోజుల్లోగా ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి రాకపోతే ‘కఠినాతి కఠినమైన’ సుంకాలు విధించటంతోపాటు, తీవ్రమైన ఆంక్షలు మొదలుపెడతానని హెచ్చరించారు. అంతేకాదు... ఉక్రెయిన్ కోసం నాటో దేశాలకు పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థనూ, ఇతరేతర ఆయుధాలనూ విక్రయిస్తారట. మూడేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగినప్పుడు రిపబ్లికన్ పార్టీ వైఖరికీ, ట్రంప్ అప్పట్లో చేసిన ప్రకటనలకూ తాజా హెచ్చరికలు పూర్తి విరుద్ధం. ఉక్రెయిన్ విషయంలో బైడెన్ ప్రభుత్వానికి మద్దతునిచ్చారంటూ తమ పార్టీకి చెందిన అప్పటి స్పీకర్ కెవిన్ మెకార్తీకి ఉద్వాసన పలికింది రిపబ్లికన్లే. అటు తర్వాత వచ్చిన మైక్ జాన్సన్‌ను సైతం ఇబ్బంది పెట్టారు. చిత్రమేమంటే అప్పట్లో ఉక్రెయిన్‌కు సాయం అందించటాన్ని గట్టిగా వ్యతిరేకించినవారంతా ఇప్పుడు ట్రంప్ మాదిరే అభిప్రాయాలు మార్చుకుని ఆయనకు మద్దతునిస్తున్నారు. ట్రంప్ విధానం అద్భుతమైనదంటూ పొగుడుతున్నారు. ఉక్రె యిన్‌కు అందించదల్చుకున్న ఆయుధాలను ట్రంప్ నాటోకు విక్రయిస్తున్నారని, అందువల్ల అమె రికా నష్టపోయేదేమీ వుండదని వీరి వాదన. యూరప్ దేశాలు ఇటీవల రక్షణ బడ్జెట్లను విపరీతంగా పెంచాయి. ఆ డబ్బంతా అమెరికా ఖజానాకు చేరుతుందన్నది రిపబ్లికన్ల అంచనా. ట్రంప్ అన్నంత పనీ చేస్తారని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇప్పుడున్న వైఖరి సెప్టెంబర్ నాటికి వుంటుందనటానికి లేదు. తాను అధ్యక్షుడయ్యాక కలవటానికొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వైట్‌హౌస్‌లో తీవ్రంగా అవమానించి, యుద్ధోన్మాదిగా చిత్రించిన ట్రంప్ ఆర్నెల్లయ్యేసరికి ఆ పాత్ర తానే పోషించటానికి సిద్ధపడ్డారు. ట్రంప్ చెబుతున్న ప్రకారం రష్యా దారికి రాకపోతే ఆ దేశంతో వాణిజ్యం నెరపే దేశాలపై కూడా వంద శాతం సుంకాలు విధించాలి. అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న మన దేశంతోపాటు ఏటా 25,000 కోట్ల డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటున్న చైనాపై కూడా చర్యలుండాలి. మన మాటెలావున్నా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానంలో వున్న చైనాతో నేరుగా యుద్ధానికి దిగటంతో సమానం. పిపీలక ప్రాయమైన ఉక్రెయిన్ కోసం ట్రంప్ ఇంత వివాదానికి దిగుతారా అన్నది ప్రశ్నార్థకం. పైగా అమెరికా మిత్ర దేశాలైన ఈయూ, జపాన్ సైతం రష్యాతో ఇప్పటికీ గణనీయంగా వాణిజ్య లావాదేవీలు సాగిస్తున్నాయి. లక్ష్మణ రేఖల్ని గీయటంలో ట్రంప్‌ను మించినవారు లేరు. అధికసుంకాల విధింపు హెచ్చరిక ఏమైందో కనబడుతూనే వుంది. దాన్ని వరసగా పొడిగించుకుంటూ పోతున్నారు. ప్రస్తుతానికి వచ్చే నెల 1వ తేదీ తాజా డెడ్‌లైన్. అసలు పదవిలోకి వచ్చేముందే ‘నేను అధ్యక్షుడినైన రెండు వారాలకల్లా రష్యా–ఉక్రెయిన్ లడాయి ఆగితీరాలి’ అని హెచ్చరించిన విషయం ఎవరూ మరిచిపోరు. ఉక్రెయిన్ను అడ్డుపెట్టుకుని ఏదోవిధంగా రష్యాను అదుపు చేయటానికి శ్రమిస్తున్న నాటో కూటమి ఎలాగైతేనేం ట్రంప్ అంతరంగాన్ని పట్టుకుని, ఆయన అభిప్రాయాన్ని మార్చగలిగింది. మొన్నటివరకూ తిట్టిన నోరే మెచ్చుకునేలా చేసింది. కానీ ఇదెంత కాలం? నిజానికి ‘వేల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు నాటోకు అందిస్తాం. మొండికేస్తున్న రష్యాను దారికి తెస్తాం’ అంటూ ట్రంప్ సోమవారం చేసిన ప్రకటన నాటోను లోలోన వణికిస్తోంది. కొత్తగా తాము పెంచుకున్న రక్షణ కేటాయింపులన్నీ అమెరికా ఆవిరి చేస్తుందన్న భయం వాటిని వేధిస్తోంది. పైగా అవసరమైన ఆయుధాలు అందించటం రోజుల్లో, నెలల్లో పూర్తయ్యేది కాదు. అమెరికా, యూరప్ దేశాల దగ్గ రున్న ఆయుధాలన్నిటినీ వినియోగించినా రష్యాపై తక్షణ ఆధిక్యత అసాధ్యం. కొత్తగా ఆయుధాల ఉత్పత్తి మొదలై నాటో కూటమికి చేరటానికి సంవత్సరాలు పట్టొచ్చు. యూరప్ దేశాల్లో వున్న ఆయుధ పరిశ్రమ పరిమాణం చిన్నది. అమెరికా ఒక్కటే లక్ష్యాన్ని పూర్తి చేయటం అంత సులభం కాదు. వాణిజ్యం వరకూ చూస్తే రష్యా నుంచి అమెరికా దిగుమతులు ఎక్కువేమీ కాదు. అవి 300 కోట్ల డాలర్లు మించవని నిపుణులు చెబుతున్నారు. వాటిలో అమెరికాకు ఎంతో అవసరమైన ఎరు వులు, ఇనుము, ఉక్కు, యురేనియంలున్నాయి. ఇప్పటికే మూడేళ్లుగా ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా కొత్తగా నష్టపోయేది కూడా వుండదు. కానీ రష్యాతో వాణిజ్య లావాదేవీలున్న దేశాలను గణనీయంగా దెబ్బతీసేందుకు అవకాశం వుంటుంది. కానీ అది ఆచరణ సాధ్యమేనా? ఈ చర్యలన్నీ అమలైతే రష్యా స్పందన గురించి ట్రంప్ ఆలోచించినట్టు లేరు. ఆ పర్యవసానా లను ఎదుర్కొనగలిగే శక్తిసామర్థ్యాలు అమెరికాకు లేవు. ఇప్పటికే పీకల్లోతు రుణ భారంతో కుంగు తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ యుద్ధంలో వేలుపెడితే మరింత దిగజారుతుంది. ఏరికోరి ఈ విపత్తు తెచ్చుకోవటానికి ట్రంప్ సిద్ధపడకపోవచ్చు. అయితే రష్యాకు ఆయన విధించిన గడువులో ఒక మతలబుంది. మరో యాభై రోజులకల్లా వేసవి ముగిసి, హిమ పాతం మొదలై రష్యాకు ఇబ్బందులెదురవుతాయి. ఇప్పటికే స్వాధీనమైన తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు నిలబెట్టుకోవటం మినహా అది చేయగలిగేది వుండదు. ఎటూ యుద్ధం జోరు తగ్గుతుంది గనుక దాన్ని తన ఘనతగా చెప్పు కోవటమే ట్రంప్ ఆంతర్యమని నిపుణులంటున్న మాట కొట్టివేయదగ్గది కాదు. యుద్ధాన్ని అంతం చేయటానికి దాన్ని మరింత తీవ్రతరం చేస్తామనటం తెలివితక్కువైనా కావాలి... మూర్ఖత్వమైనా కావాలి. ట్రంప్ వ్యవహార శైలి దేనికి దగ్గరగా వున్నదో త్వరలో తేలిపోతుంది. -
అమెరికాపై టారిఫ్‌లు నిలిపేసిన ఈయూ
బ్రస్సెల్స్: అమెరికా వస్తువులపై నేటి నుంచి అమల్లోకి రానున్న ప్రతీకార సుంకాలను యూరోపియన్ యూనియన్(ఈయూ) నిలిపివేసింది. ఆగస్టు ఒకటి నుంచి ఈయూ, మెక్సికోపై 30% కొత్త సుంకాలను ట్రంప్ ప్రకటించడంతో ఈయూ వెనుకడుగు వేసింది. ఈ నెలాఖరు నాటికి ట్రంప్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే ఆశతో ఉంది. ఇది చర్చలకు సమయమని యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లేయన్ అన్నారు. చర్చలు జరపడానికి ఆగస్టు మొదటి తేదీ వరకు తమకు సమయం ఉందన్నారు. ఒప్పందానికి రాలేకపోతే, ప్రతీకారానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. -
ఈయూ, మెక్సికోపై 30% టారిఫ్‌లు
వాషింగ్టన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ), మెక్సికో దేశాల ఉత్పత్తులపై 30 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. సుంకాలపై ఆయా దేశాలకు రాసిన లేఖలను సోషల్ మీడియాలో శనివారం పోస్టుచేశారు. అక్రమ వలసదారులు, మత్తు పదార్థాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మెక్సికో ప్రభుత్వం తమకు చక్కగా సహకరిస్తోందని మెక్సికోకు రాసిన లేఖలో ట్రంప్ ప్రశంసించారు. మత్తు పదార్థాల నియంత్రణకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని మెక్సికో ప్రభుత్వానికి సూచించారు. అలాగే ఈయూతో అమెరికాకు వాణిజ్య లోటు ఉందని, ఇది తమ జాతీయ భద్రతకు ముప్పేనని తేల్చిచెప్పారు. ఈ లోటును పూడ్చడానికి కలిసికట్టుగా పనిచేద్దామని ఈయూకు రాసిన లేఖలో పిలుపునిచ్చారు. అమెరికా ఉత్పత్తులపై ఈయూ దేశాలు అధికంగా టారిఫ్‌లు విధిస్తున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన ఇప్పటిదాకా 24 దేశాలతోపాటు 27 దేశాలతో కూడిన ఈయూపై టారిఫ్‌లను ప్రకటించారు. మరికొన్ని దేశాలపై సుంకాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఏ రెండు దేశాల మధ్యనైనా సరే టారిఫ్‌లు ఒకేరకంగా ఉండాలని ట్రంప్ వాదిస్తున్నారు. ఒక దేశం నుంచి వచ్చే ఉత్పత్తులపై అధికంగా సుంకాలు వసూలు చేస్తూ.. అదే దేశానికి ఎగుమతయ్యే మన ఉత్పత్తులపై సుంకాలు తక్కువగా ఉండాలని కోరుకోవడం న్యాయం కాదని అంటున్నారు. -
కీలక ఉత్పత్తిపై ట్రంప్ 50 శాతం సుంకం
ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికాలు, పవర్ గ్రిడ్లలో విరివిగా ఉపయోగించే కాపర్ దేశీయ ఉత్పత్తిని పెంచేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ దిగుమతి చేసుకునే కాపర్‌పై 50 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ కేబినెట్ సమావేశంలో వివరాలు వెల్లడించారు. టారిఫ్ రేటును ప్రకటించినప్పటికీ, ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారో మాత్రం తెలియజేయలేదు.ఉక్కు, అల్యూమినియం, ఆటో విడిభాగాలపై ఇదే విధమైన సుంకాలను ఇప్పటికే విధించారు. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత కాపర్ ధరలు రికార్డు గరిష్టాలకు పెరిగాయి. కమోడిటీ ఎక్స్చేంజీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ పౌండ్‌కు 10% పైగా పెరిగి 5.8955 డాలర్లకు చేరుకుంది. దిగుమతి సుంకం వల్ల యూఎస్‌లోని చిన్న పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయనే అంచనాలతో యూఎస్ కాపర్ ఉత్పత్తిదారు ఫ్రీపోర్ట్ మెక్మోరాన్ షేర్లు 5% పెరిగాయి.ఫార్మాపై కూడా..అమెరికా ప్రస్తుతం తన కాపర్ వినియోగంలో దాదాపు సగం దిగుమతి చేసుకుంటుంది. వీటిలో ఎక్కువ భాగం చిలీ నుంచే సమకూరుతుంది. దాంతో రాబోయే రోజుల్లో ఈ దేశంలో తయారయ్యే కాపర్‌పై ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. కేబినెట్ సమావేశంలో ట్రంప్ అదనంగా మరిన్ని సుంకాల గురించి కూడా సంకేతాలు ఇచ్చారు. ఫార్మాస్యూటికల్ దిగుమతులపై 200% సుంకం రావచ్చని, అయితే కంపెనీలు తమ ఉత్పత్తిని తిరిగి అమెరికాకు తరలించడానికి 18 నెలల వరకు సమయం ఉండవచ్చని ఆయన సూచించారు.ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్కార్పెట్కాపర్పై సుంకాలతో కీలక రంగాలపై ప్రభావంఎలక్ట్రిక్ వాహనాలు: బ్యాటరీలు, మోటార్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు రాగి అవసరం.నిర్మాణం, విద్యుత్ రంగం: పవర్ గ్రిడ్, నిర్మాణ రంగం రాగి వైరింగ్, ట్యూబ్‌లపై ఎక్కువగా ఆధారపడుతాయి. ఇది భవన ఖర్చులను పెంచుతుంది.ఎలక్ట్రానిక్స్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్: ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాల్లో గణనీయంగా రాగిని ఉపయోగిస్తారు.డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్: సైనిక పరికరాల్లో వైరింగ్, ఎలక్ట్రానిక్స్ కోసం రాగిని ఎక్కువగా వాడుతారు. -
అమెరికా కొంప ముంచుతున్న ట్రంప్!
సాక్షి, హైదరాబాద్: ‘‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్’’ ఎన్నికల సందర్భంగా ట్రంప్ వాడిన నినాదమిది. అయితే అగ్రరాజ్యానికి పూర్వవైభవం తెప్పిస్తానని ధీమాగా చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశానికి ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు. చైనాతో మొదలుపెట్టి.. అన్ని దేశాలపై పన్నులు విధించుకుంటూ పోవడంతో అమెరికా చాలా రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది. ఒక్క పర్యాటక రంగంలోనే ఈ ఏడాది వంద బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోవచ్చునని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తూండగా.. కొన్ని కంపెనీలు టారిఫ్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఇతర దేశాల్లో కర్మాగారాలను ఏర్పాటు చేసుకుంటునానయి. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి.అమెరికా అధ్యక్షుడైన నాటి నుంచి ట్రంప్ వైఖరి వివాదాస్పదంగానే ఉంది. మాట వినని దేశాలపై పన్నులతో విరుచుకుపడుతున్నాడు. చైనా విషయంలోనైతే ఏకంగా 155 శాతం పన్నులకు సిద్ధపడ్డాడు కూడా. పన్నుల విషయంలో భారతీయులకు కొంత ఉపశమనం లభించినప్పటికీ హెచ్1-బీ వీసాలపై నిబంధనలు, గ్రీన్‌కార్డులున్నా హద్దుమీరితే పంపేస్తామన్న హెచ్చరికలు, స్వదేశానికి పంపే డబ్బులపై ఐదు శాతం వరకూ పన్నులు వంటి చర్యలు భారతీయులు, భారతీయ సంతతి అమెరికన్లకు ఇబ్బందికరంగానే మారాయి. అయితే ఈ వైఖరి ట్రంప్‌కు... అమెరికాకు లాభాలేమీ తెచ్చిపెట్టడం లేదు. పైగా నష్టమే కలగజేస్తున్నాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి.టూరిజం విషయాన్ని చూద్దాం... ట్రంప్ అధ్యక్షుడు కాకమునుపు అంటే 2024లో అమెరికా సుమారు ఏడు కోట్ల మంది పర్యాటకులను ఆకర్శించింది. రవాణా, షాపింగ్, ఆహార పానీయాల వంటి వాటికి వీరు ఖర్చు పెట్టిన మొత్తం ఎకాఎకి 155 బిలియన్ డాలర్లు. హోటళ్లు, దుకాణాలు కళకళలాడుతూండేవి. కానీ.. అధ్యక్షడైన తరువాత ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లు, చేస్తున్న ప్రకటనల పుణ్యమా అని ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.మార్చి నాటికి ఈ తగ్గుదల 14 శాతం వరకూ ఉందని అంచనా. వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో పొరుగున ఉన్న కెనెడా నుంచి వచ్చే వారి సంఖ్య కూడా ఐదో వంతు పడిపోయిందట. ఫలితంగా ఇప్పటివరకూ పర్యాటకులు పెట్టే ఖర్చు 900 కోట్ల డాలర్ల వరకూ తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని ప్రభావం కాస్తా హోటళ్లు, దుకాణాల్లో స్పష్టంగా కనిపిస్తోందని వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది.వెనకడుగు వేస్తున్న కంపెనీలు..అమెరికాలో వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తున్న చాలా కంపెనీలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. టారిఫ్‌ల బెడద ఒకపక్కన.. ఆర్థిక అసందిగ్ధత ఇంకో పక్కన వెంటాడుతూండటంతో ఈ కంపెనీలు తమ ప్రణాళికలను సవరించుకుంటున్నాయి. టారిఫ్ భయాలు, పర్యాటకుల తగ్గుదలల నేపథ్యంలో తాము ఇప్పటికే జారీ చేసిన ముందస్తు ఆర్థిక అంచనాలను వెనక్కు తీసుకుంటున్నట్లు డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రకటించగా... వైద్య పరికరాల తయారీ సంస్థ బెల్లూస్కూరా కూడా దిగుమతి సుంకాల పెరిగిపోయిన నేపథ్యంలో తమ భవిష్యత్తు అంచనాలను సవరించుకుంటోంది.బ్రిటన్ బొమ్మల కంపెనీ క్యారెక్టర్ గ్రూప్, మద్యం తయారీ దిగ్గజం డియాగోలు కూడా మెక్సికో, కెనెడాలపై అమెరికా విధించిన పన్నుల నేపథ్యంలో తమ వ్యాపారల ప్రణాళికలను సవరించుకుంటున్నాయి. ఫలితంగా ఒక్క డియాగో సంస్థకు 200 కోట్ల డాలర్ల వరకూ నష్టం వాటిల్లవచ్చునని అంచనా.భారత్‌లో తయారీ చేపడితే భారీ సుంకాలు తప్పవన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను ఐఫోన్ సీఈవో టిమ్ కుక్ పట్టించుకోని విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అమెరికాలో వినియోగించే ఐఫోన్లో అత్యధికం భారత్‌లోనే తయారవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇదే విధంగా అమెరికాలో బాగా పాపులర్ అయిన ట్రాక్టర్ తయారీ సంస్థ ‘జాన్ డీర్’ కూడా టారిఫ్‌ల హెచ్చరికలను తోసిరాజంటూ... తయారీ రంగాన్ని కెనెడాకు తరలించే ఆలోచనలో ఉంది. ఏతావాతా... ట్రంప్ ధోరణి కాస్తా అమెరికాకు చేటు చేసేట్టే కనిపిస్తోంది!- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
మార్కెట్లపై జీడీపీ ఎఫెక్ట్
గత వారాంతాన వెలువడిన జీడీపీ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. మరోవైపు ఆర్బీఐ పాలసీ సమీక్షపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎఫ్‌పీఐ పెట్టుబడులు, యూఎస్ టారిఫ్ పరిస్థితులు తదితర అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం బలపడింది. చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 7.4 శాతం వృద్ధి చూపింది. జీడీపీ విలువ 3.9 లక్షల కోట్ల డాలర్లకు చేరడం సానుకూల అంశమని విశ్లేషకులు పేర్కొన్నారు. గత వారాంతాన వెలువడిన జీడీపీ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నట్లు తెలియజేశారు. ఇక మరోపక్క ఆర్బీఐ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) మూడు రోజుల సమావేశం బుధవారం(4న) ప్రారంభంకానుంది. శుక్రవారం(6న) పాలసీ సమీక్షా నిర్ణయాలు వెలువడనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల నిర్ణయాలపై దృష్టిపెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు. ఈ వారం మే నెల తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. ఆర్బీఐ గత(ఏప్రిల్) సమీక్షలో రెపో రేటును 0.25 శాతం తగ్గించి 6 శాతానికి దించిన సంగతి తెలిసిందే.గణాంకాలు కీలకం మే నెలకు ఆటో అమ్మకాల గణాంకాలు వెలువడుతున్నాయి. వీటికితోడు జీఎస్టీ వసూళ్లు తదితర అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. ఇటీవల ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్ డాలరు ఆటుపోట్లను చవిచూడటం, 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ క్షీణించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. దేశీయంగా ఆర్బీఐ రెపో రేటులో 0.25 శాతం కోత పెట్టవచ్చన్న అంచనాలున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకులు యాక్టివ్‌గా కదిలే వీలున్నట్లు ఖేమ్కా అభిప్రాయపడ్డారు. జీఎస్టీ వసూళ్లు, ఆటో విక్రయాలు, జీడీపీ తదితర ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చే వీలున్నట్లు అధిక శాతంమంది నిపుణులు అంచనా వేశారు. ఇతర అంశాలు గత నెల(మే)లో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపడం సానుకూల అంశమని విశ్లేషకులు పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ నుంచి మార్చివరకూ అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిచ్చిన ఎఫ్‌పీఐలు ఇటీవల నికర పెట్టుబడిదారులుగా నిలుస్తుండటం సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. డాలరుతో మారకంలో రూపాయి బలపడటం, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, ముడిచమురు ధరలు దిగిరావడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థకు దన్నునివ్వగలవని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ గతేడాదికి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ ప్రభుత్వానికి భారీ డివిడెండ్ చెల్లించడం ప్రభుత్వ పెట్టుబడులకు దన్నునిస్తుందని తెలియజేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్‌ల విధింపునకు యూఎస్ ఫెడరల్ కోర్టు చెక్ పెట్టిన నేపథ్యంలో విదే శీ పెట్టుబడులు పుంజుకోవచ్చని అంచనా వేశారు.పెట్టుబడులకే ఎఫ్‌పీఐల మొగ్గు మే నెలలో రూ. 19,860 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత నెలలో పెట్టుబడులకే ఆసక్తి చూపా రు. వెరసి మే నెలలో నికరంగా రూ. 19,860 కోట్ల విలువైన దేశీ స్టాక్స్ కొనుగోలు చేశారు. అంతకుముందు ఏప్రిల్‌లో అమ్మకాలు, కొను గోళ్ల మధ్య నికరంగా రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 2024 అక్టోబర్‌లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చిన ఎఫ్‌పీఐలు ఈ ఏడాది (2025) జనవరిలో రూ. 78,027 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, మార్చిలో రూ. 3,973 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. అయితే ఆపై ఏప్రిల్ చివరి నుంచి కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడం గమనార్హం! -
ఇకపై ఆలా కుదరదు: శాంసంగ్‌కు ట్రంప్ వార్నింగ్
అమెరికాలో ఐఫోన్లను తయారు చేయకపోతే యాపిల్ కంపెనీపై 25 శాతం సుంకాలను విధిస్తామని యూఎస్ ప్రెసిడెంట్ 'డొనాల్డ్ ట్రంప్' పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రూల్ శాంసంగ్ సహా ఇతర అన్ని స్మార్ట్‌ఫోన్ సంస్థలకు వర్తిస్తుందని ట్రంప్ వైట్ హౌస్ వద్ద మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.అమెరికా విధించే సుంకాల ప్రభావం ఉండకూడదు అనుకుంటే.. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఇక్కడే (అమెరికాలో) ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకుండా భారతదేశంలో లేదా ఇతర ఏ దేశంలోనో తయారు చేసిన ఫోన్లను అమెరికాకు దిగుమతి చేసుకుంటే.. 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.సౌత్ కొరియా దిగ్గజమైన 'శాంసంగ్' అమెరికా మార్కెట్లో అత్యధిక అమ్మకాలు చేపడుతున్న రెండో మొబైల్ కంపెనీగా ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఈ సంస్థ ప్రతి సంవత్సరం 220 మిలియన్ ఫోన్స్ విక్రయిస్తోంది. ఇందులో సుమారు 60 శాతం ఫోన్స్.. వియత్నాంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడి నుంచే ప్రపంచంలోనే చాలా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇకపై ఈ విధానంతో అమెరికాకు శాంసంగ్ ఫోన్స్ తీసుకుని వస్తే.. సుంకాలు చెల్లించక తప్పదు. -
సుంకాలు విధించినా మరేం ఫర్వాలేదు
భారత్‌లో తయారయ్యే ఐఫోన్లపై అమెరికా 25 శాతం సుంకం విధించినా ఆ దేశంలో తయారీతో పోలిస్తే మొత్తం ఉత్పత్తి వ్యయం ఇండియాలో చాలా తక్కువగా ఉంటుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక తెలిపింది. యాపిల్ ఉత్పత్తులను ఇండియాలో తయారు చేయాలని నిర్ణయించుకుంటే ఐఫోన్లపై 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ మేరకు జీటీఆర్ఐ వివరాలు వెల్లడించింది.ఇండియాలో ఎందుకంత చౌక..?అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఐఫోన్ తయారీ వ్యయాలు గణనీయంగా తక్కువగా ఉన్నాయని, ప్రధానంగా కార్మికులకు అయ్యే ఖర్చుల వ్యత్యాసాలు భారీగా ఉండడమే ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది. భారతదేశంలో ఐఫోన్లను అసెంబ్లింగ్ చేసే కార్మికులకు నెలకు సుమారు 230 అమెరికన్ డాలర్లు(సుమారు రూ.20,000) ఖర్చు అవుతుంది. అయితే కాలిఫోర్నియా వంటి యూఎస్ రాష్ట్రాల్లో కార్మికుల ఖర్చులు నెలకు 2,900 అమెరికన్ డాలర్లు(రూ.2,44,760)కు పెరుగుతాయి. భారత్‌తో పోలిస్తే ఇది 13 రెట్లు అధికంగా ఉండడం గమనార్హం.ప్రస్తుతం సుమారు 1,000 డాలర్ల(రూ.85,000)గా ఉన్న ఐఫోన్ తయారీలో యాపిల్ తన బ్రాండ్, సాఫ్ట్వేర్ ద్వారా అధికంగా 450 డాలర్ల వాటాను సమకూరుస్తుంది. మిగతాది ఇతర దేశాల నుంచి సమీకరిస్తున్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్‌కు వెచ్చిస్తుంది.యూఎస్ కాంపోనెంట్ మేకర్స్ (క్వాల్కామ్, బ్రాడ్‌కామ్): 80 డాలర్లుతైవాన్ (చిప్ తయారీ): 150 డాలర్లుదక్షిణ కొరియా (ఓఎల్ఈడీ స్క్రీన్లు, మెమొరీ చిప్స్): 90 డాలర్లుజపాన్ (కెమెరా): 85 డాలర్లుజర్మనీ, వియత్నాం, మలేషియా (ఇతర భాగాలు): 45 డాలర్లుచైనా, ఇండియా (అసెంబ్లింగ్): 30 డాలర్లుఇదీ చదవండి: యూనియన్ బ్యాంక్‌తోపాటు మరో సంస్థపై ఆర్బీఐ జరిమానాఐఫోన్ అసెంబ్లింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న భారతదేశం, చైనా మొత్తం రిటైల్ ధరలో 3% కంటే తక్కువే సంపాదిస్తుండడం గమనార్హం. భారత్‌లో ఐఫోన్లు తయారు చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్ విధించినప్పటికీ దేశంలో ఐఫోన్ల తయారీ ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని నివేదిక తెలుపుతుంది. ప్రభుత్వం నుంచి యాపిల్ భారత్‌లో ఐఫోన్ తయారీపై ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) ప్రయోజనాన్ని సైతం పొందుతుంది. -
టారిఫ్‌లు, వలస విధానాల ఎఫెక్ట్
న్యూఢిల్లీ: టారిఫ్‌లు, యూఎస్ వలస విధానాలు ఆదాయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశమున్నట్లు ఐటీ సేవల దిగ్గజం విప్రో తాజాగా అంచనా వేసింది. భారీ ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల టారిఫ్‌లు, వాణిజ్య విధానాలు కంపెనీ ఆదాయం, బిజినెస్‌లను దెబ్బతీయవచ్చని పేర్కొంది. ప్రస్తుతం నెలకొన్న ప్రపంచ వాణిజ్య ఆందోళనలు, నియంత్రణల వాతావరణం కంపెనీ కార్యకలాపాలకు ప్రస్తావించదగ్గ స్థాయిలో రిస్క్ లను కల్చించే వీలున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఆదాయంలో వృద్ధికి అంతర్జాతీయ మార్కెట్లపై అధికంగా ఆధారపడే ఐటీ సేవల దిగ్గజం విప్రో 2024–25 వార్షిక నివేదికలో ఈ అంశాలను వివరించింది. అమెరికా, యూరప్ దేశాలలో క్లయింట్లు అధికంగా కలిగిన కంపెనీ కొన్ని రంగాల క్లయింట్ల నుంచి అధికంగా బిజినెస్ లభిస్తుందని పేర్కొంది. అయితే ఆర్థిక మందగమనం, యూఎస్ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు ప్రతికూల పరిస్థితులకు కారణంకావచ్చని అభిప్రాయపడింది. కంపెనీ ఆదాయంలో 62 శాతం యూఎస్, 27 శాతం యూరప్ నుంచి లభించే సంగతి తెలిసిందే. కంపెనీ సిబ్బంది సంఖ్య 2,33,346 కాగా.. గతేడాది (2024–25)లో రూ. 89,088 కోట్ల ఆదాయం అందుకుంది. నికర లాభం 19 శాతం ఎగసి రూ. 13,135 కోట్లను దాటింది. ఈ ఏడాది (2025–26) క్యూ1(ఏప్రిల్– జూన్)లో త్రైమాసికవారీగా 250.5–255.7 కోట్ల డాలర్ల ఆదాయం అంచనా వేస్తోంది. బీఎస్ఈలో విప్రో షేరు 0.6 శాతం బలపడి రూ. 247 వద్ద ముగిసింది. -
టారిఫ్ ప్రభావాలను భారత్ తట్టుకోగలదు
న్యూఢిల్లీ: యూఎస్ టారిఫ్‌లు, అంతర్జాతీయంగా వాణిజ్య ప్రతికూలతలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. భారత్ ఎగుమతులపై తక్కువ ఆధారపడడం.. అదే సమయంలో బలమైన సేవల రంగం అండతో అమెరికా టారిఫ్‌లను అధిగమించగలదని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనికితోడు దేశీ వృద్ధి చోదకాలు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. మరే వర్ధమాన దేశంతో పోల్చుకున్నా భారత్ మెరుగైన స్థితిలో ఉందని పేర్కొంది. ప్రైవేటు వినియోగం పెంపు, తయారీ సామర్థ్యాల విస్తరణ, మౌలిక సదుపాయలపై వ్యయాలు పెంచడం వంటివి.. అంతర్జాతీయ డిమాండ్ బలహీనతలను అధిగమించేందుకు సాయపడతాయని తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో వడ్డీ రేట్ల తగ్గింపునకు అవకాశాలున్నాయని.. ఇది ఆర్థిక వ్యవస్థకు మరింత మద్దతుగా నిలుస్తుందని వివరించింది. వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పెంపు డిమాండ్‌కు ఊతమిస్తుందని అంచనా వేసింది. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు భారత్ కంటే పాక్‌కే ఎక్కువ నష్టం చేస్తాయని పేర్కొంది. ఆ దేశంతో భారత్‌కు పెద్దగా వాణిజ్య సంబంధాలు లేకపోవడాన్ని ప్రస్తావించింది. పైగా భారత్‌లో అధిక వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి అంతా ఘర్షణ ప్రాంతాలకు దూరంగా ఉన్నట్టు తెలిపింది. కానీ, రక్షణ రంగంపై అధికంగా వెచి్చంచాల్సి వస్తే అది భారత్ ద్రవ్య పరిస్థితులపై ప్రభావం చూపిస్తుందని.. ద్రవ్య స్థిరీకరణ ఆలస్యం కావొచ్చని అభిప్రాయపడింది. భారత ఆటో రంగం మాత్రం అంతర్జాతీయంగా నెలకొన్న సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొంది. అమెరికా టారిఫ్‌ల కారణంగా ఏర్పడిన అనిశి్చతులతో 2025 సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను మూడీస్ 6.7 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గిస్తున్నట్టు ఈ నెల మొదట్లో ప్రకటించడం తెలిసిందే. -
ప్రపంచ పరిణామాలే దిక్సూచి
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆర్థిక, రాజకీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం ఈ వారంలో మన స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికా సుంకాల నుంచి తప్పించుకునేందుకు వివిధ దేశాలు కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పందాలపై తాజా సమాచారం, ప్రపంచ మార్కెట్లపై అది చూపే ప్రభావాన్ని ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. ’భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతలు, తెరవెనుక భౌగోళిక–రాజకీయ సంఘటనలు ప్రస్తుతం శాంతించిన నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు ఇప్పుడు క్యూ4 ఆర్థిక ఫలితాల సీజన్లో మిగిలిన కంపెనీల పనితీరుపై దృష్టిసారించే అవకాశం ఉంది. అంతేకాకుండా, భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అనుకున్నదాని కంటే ముందుగానే కుదరవచ్చన్న ఆశాభావం నెలకొంది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌పై మరింత సానుకూల ప్రభావం చూపవచ్చు’ అని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా అభిప్రాయపడ్డారు. దేశీ పరిణామాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వెలువడే కీలక ఆర్థిక గణాంకాలు కూడా మన మార్కెట్‌కు దిక్సూచిగా నిలుస్తాయని ఆయన తెలిపారు. అమెరికా వస్తువులపై టారిఫ్‌లను పూర్తిగా ఎత్తివేసేందుకు భారత్ సుముఖంగా ఉందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొనడం తెలిసిందే. ఇరు దేశాల మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరనుందని కూడా ఆయన తాజాగా చెప్పారు.కీలక ఫలితాలు... ఈ వారంలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ తదితర కీలక కంపెనీలు క్యూ4 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. స్వల్పకాలానికి మన మార్కెట్ ట్రెండ్‌ను ఇవి నిర్దేశించే అవకాశం ఉంది. ‘ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగిన ప్రధాన ఈవెంట్లు ఏవీ లేనందున ఇన్వెస్టర్ల దృష్టి మళ్లీ దేశీ కంపెనీల ఫలితాలపై ఉంటుంది. అలాగే కీలక ఆర్థిక గణాంకాలను కూడా నిశితంగా ట్రాక్ చేస్తారు. ప్రపంచ ట్రేడ్ డీల్స్‌పై అప్డేట్లు, ప్రపంచ మార్కెట్లు వాటికి ఎలా స్పందిస్తాయనేది కూడా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారు’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుత ర్యాలీకి దన్నుగా నిలుస్తున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి ధోరణి కూడా మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతుంది’ అని మిశ్రా వ్యాఖ్యానించారు. ‘అమెరికా–చైనా మధ్య ట్రేడ్ డీల్, ఇండో–పాక్ ఉద్రిక్తతలు సద్దుమణగడంతో ప్రపంచ వాణిజ్య రంగంలో సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పుంజుకోవడానికి ఇది దోహదం చేస్తుంది’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. గతవారం ఇలా.. విదేశీ ఇన్వెస్టర్ల జోరు నేపథ్యంలో స్టాక్ మార్కెట్ తాజా ర్యాలీ గత వారంలో కూడా కొనసాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2,876 పాయింట్లు (3.61 శాతం) దూసుకెళ్లి 82,331 వద్ద స్థిరపడింది. ఇకఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1,012 పాయింట్లు (4.21 శాతం) జంప్ చేసి 25,020 వద్ద ముగిసింది.విదేశీ ఇన్వెస్టర్ల క్యూ... ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలఉ శాంతిస్తుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడుల బాట పడుతున్నారు. దేశీయంగా కూడా ఆర్థిక వ్యవస్థ మూలాలు మెరుగుపడుతుండటం కూడా ఇందుకు దోహదం చేస్తోంది. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) తాజా ర్యాలీ కొనసాగుతోంది. మే నెలలో ఇప్పటిదాకా (16 నాటికి) దేశీ ఈక్విటీ మార్కెట్లో నికరంగా రూ.18,620 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో భారీగా అమ్మకాలకు దిగిన ఎఫ్‌పీఐలు ఏప్రిల్‌లో తొలిసారి మళ్లీ నికర పెట్టుబడులు (రూ.4,223 కోట్లు) పెట్టడం తెలిసిందే. జనవరిలో ఏకంగా రూ.78,027 కోట్లు, మార్చిలో రూ.34,574 కోట్లు, మార్చిలో రూ.3,973 కోట్ల చొప్పున విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం. ఏప్రిల్ మధ్య నుంచి మళ్లీ పెట్టుబడుల రూట్లోకి వచ్చిన ఎఫ్‌పీఐల దన్నుతో మార్కెట్లు కూడా యూ టర్న్ తీసుకుని దూసుకెళ్తున్నాయి. మొత్తంమీద మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసం తిరిగి పుంజుకోవడానికి ఇది దారితీస్తోంది. -
వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఉండరు: జిన్‌పింగ్
అమెరికా - చైనా ప్రతీకార సుంకాల విషయంలో ఒక డీల్ కుదుర్చుకున్న తరువాత.. బీజింగ్‌లో బ్రెజిల్, కొలంబియా, చిలీ అధ్యక్షులతో సహా లాటిన్ అమెరికా, కరేబియన్ అధికారుల శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు 'జిన్‌పింగ్' మాట్లాడారు. బెదిరింపులు, ఆధిపత్య ధోరణి వల్ల ఎదురుదెబ్బలు తగులుతాయని, ఒంటరిని చేస్తాయని అన్నారు.ప్రతీకార సుంకాలు లేదా వాణిజ్య యుద్ధాలలో విజేతలు ఉండరు. వివిధ దేశాలు కలిసి పనిచేస్తేనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని జిన్‌పింగ్ అన్నారు. ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఒక దేశం ఇంకో దేశానికి సహకరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.టారిఫ్‌లకు 90 రోజులు బ్రేక్అమెరికా దిగుమతులపైన చైనా రెండు దేశాలు ఇప్పటికి విధించిన సుంకాలలో 115 శాతం తగ్గించుకున్నాయి. అంటే చైనా.. అమెరికాపై విధించిన 125 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేయగా.. అమెరికా, చైనాపై విధించిన సుంకాన్ని 145 శాతం నుంచి 30 శాతానికి పరిమితం చేసింది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది. -
అమెరికా, చైనా డీల్: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు
అమెరికా ప్రతీకగా సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి, బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. దేశంలో గోల్డ్ రేటు ఏకంగా లక్ష మార్కును దాటేసింది. అయితే తాజాగా జరిగిన అమెరికా - చైనా దేశాలను టారిఫ్స్ కొంత తగ్గిస్తున్నట్లు.. ఇవి 90 రోజులు అమల్లో ఉంటాయని ప్రకటించాయి. దీంతో పసిడి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్లో 3400 డాలర్ల కంటే ఎగువన ట్రేడ్ అయిన ఔన్స్ బంగారం ధర.. ఏకంగా 3218 డాలర్లకు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగానే భారతదేశంలో కూడా గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. వెండి ధరలు కూడా బంగారం బాటలో పయనించిందా అన్నట్లు.. తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం మొత్తం మీద బంగారం, వెండి ధరలు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.చైనా.. అమెరికాపై విధించిన 125 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేయగా.. అమెరికా, చైనాపై విధించిన సుంకాన్ని 145 శాతం నుంచి 30 శాతానికి పరిమితం చేసింది. ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?ఇరు దేశాలు (చైనా, అమెరికా) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సుంకాల తగ్గింపు 90 రోజులు మాత్రమే అమలులో ఉంటాయని తెలుస్తోంది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది. -
90 రోజుల పాటు కొత్త సుంకాలు: అమెరికా, చైనా మధ్య డీల్
నువ్వా నేనా అంటూ ప్రతీకార సుంకాలను అంతకంతకూ పెంచుకుంటూ పోయిన అమెరికా, చైనా దేశాలు టారిఫ్‌ల విషయంలో ఓ డీల్ కుదుర్చుకున్నాయి. తాజా ఒప్పందం ప్రకారం.. చైనా.. అమెరికాపై విధించిన 125 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేయగా.. అమెరికా, చైనాపై విధించిన సుంకాన్ని 145 శాతం నుంచి 30 శాతానికి పరిమితం చేసింది. ఇరు దేశాలు (చైనా, అమెరికా) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సుంకాల తగ్గింపు 90 రోజులు మాత్రమే అమలులో ఉంటాయని తెలుస్తోంది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?అమెరికా ప్రపంచ దేశాల మీద ప్రతీకార సుంకాలను విధించిన సమయంలో.. చైనా కూడా అమెరికాకు ధీటుగా సుంకాలను పెంచింది. దీంతో వాణిజ్య యుద్ధం మొదలైంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద విపరీతమైన ప్రభావం చూపింది. దిగ్గజ పారిశ్రామిక వేత్తలు కూడా భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అయితే తాజాగా.. ఇరుదేశాల మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా ఈ సుంకాలను తగ్గించుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. -
టారిఫ్‌లకు రెండు వైపులా పదును
న్యూఢిల్లీ: టారిఫ్‌లనేవి రెండువైపులా పదునున్న కత్తిలాంటివని హెచ్‌సీఎల్ గ్రూప్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా వ్యాఖ్యానించారు. అమెరికాలాంటి పెద్ద మార్కెట్లలో టారిఫ్ ప్రభావిత పరిశ్రమలు నెమ్మదించినా వాటికి సేవలు కొనసాగించాల్సి రావడం ఒకెత్తైతే, టారిఫ్‌లవల్ల వ్యయాలు పెరగకుండా చూసుకోవడం మరో ఎత్తవుతుందని ఆమె పేర్కొన్నారు. అయితే, ఇవన్నీ కూడా భారతీయ ఐటీ కంపెనీలు కొత్త వ్యాపారావకాశాలను దక్కించుకునేందుకు కూడా తోడ్పడవచ్చని, ఇందుకు టెక్నాలజీ ఉపయోగపడగలదని ఆమె తెలిపారు. అమెరికా టారిఫ్‌ల ప్రభావం నేరుగా ఐటీ సంస్థలపై పడకపోయినా, అవి సేవలందించే మార్కెట్లలో పరిశ్రమలు మందగించడం వల్ల పరోక్షంగా దెబ్బతినొచ్చనే అంచనాలు ఉన్న నేపథ్యంలో రోష్ని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టారిఫ్‌లు, డీగ్లోబలైజేషన్లాంటి భౌగోళికరాజకీయాంశాలు ఐటీ సేవలపై ప్రభావం చూపొచ్చని ఇటీవలే ఆరి్థక ఫలితాలు ప్రకటించిన సందర్భంగా హెచ్‌సీఎల్ టెక్ సీఈవో సి. విజయకుమార్ కూడా తెలిపారు. -
భారత్–అమెరికా మధ్య డీల్..?
ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి (బీటీఏ) సంబంధించి చర్చించాల్సిన అంశాలు (టరమ్స్ ఆఫ్ రెఫరెన్స్) ఖరారైనట్లు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) జేమీసన్ గ్రీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో సమతౌల్యం సాధించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని పేర్కొన్నారు.భారత్ నిర్మాణాత్మకంగా వ్యవహరించడాన్ని స్వాగతిస్తున్నామని, ఇరు దేశాల వర్కర్లు, రైతులు, ఆంత్రప్రెన్యూర్లకు కొత్తగా అవకాశాలను కల్పించడంపై ఆసక్తిగా ఉన్నామని గ్రీర్ వివరించారు. బీటీఏపై చర్చలు జరపనున్నట్లు ఫిబ్రవరి 13న ఇరు దేశాలు ప్రకటించాయి. తొలి దశను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాయి. భారత్‌లో తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు మరింతగా అవకాశమివ్వాలని, టారిఫ్‌లను తగ్గించాలని, టారిఫ్యేతర అవరోధాలను తొలగించాలని అమెరికా కోరుతోంది. తద్వారా భారత్‌తో గణనీయంగా ఉన్న వాణిజ్య లోటును భర్తీ చేసుకోవాలని భావిస్తోంది.ఇదీ చదవండి: చిన్న సంస్థలపై తీవ్ర ఒత్తిడిఅమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) భారత ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ప్రపంచ టారిఫ్ అనిశ్చితుల మధ్య గేమ్ ఛేంజర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇది ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ఎలా ప్రభావితం చేస్తుందో నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 191 బిలియన్ డాలర్ల నుంచి 500 బిలియన్ డాలర్లకు పెంచాలని ఈ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణ ప్రపంచ సరఫరా గొలుసులలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తుంది.రంగాలవారీ ప్రయోజనాలుటెక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్స్, బొమ్మల తయారీలో భారతదేశం టారిఫ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. కానీ రత్నాలు, ఆభరణాలు, వ్యవసాయం, చేపల పెంపకంలో సవాళ్లను ఎదుర్కొంటుందని అంచనా. అమెరికా-చైనా వాణిజ్య వివాదం తీవ్రతరం కావడంతో భారతదేశం అమెరికాకు నమ్మకమైన వాణిజ్య భాగస్వామిగా ఎదుగుతోంది. ఇది యూరోపియన్ యూనియన్, యూకేతో ఒప్పందాలు జరుపుకునేందుకు కారణమవుతుంది. తయారీ, క్లీన్ ఎనర్జీ, రక్షణ రంగాల్లో అమెరికా పెట్టుబడులను ఆకర్షించడం, టెక్నాలజీ బదిలీ, ఉద్యోగాల కల్పనను వేగవంతం చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని భావిస్తున్నారు. -
చిన్న సంస్థలపై తీవ్ర ఒత్తిడి
ప్రతీకార టారిఫ్‌లతో చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్ఎంఈ) ఒత్తిడి మరింత పెరిగిపోవచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) ఒక నివేదికలో తెలిపింది. అయితే, మధ్య స్థాయి కార్పొరేట్లకు (ఎంసీ) మాత్రం అనూహ్య ఆర్థిక షాక్‌ల నుంచి కాస్తంత రక్షణ ఉంటుందని పేర్కొంది. టారిఫ్‌ల ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉండే సెగ్మెంట్లకు చెందిన ఎంఎస్ఎంఈల నిర్వహణ పరిస్థితులు దిగజారవచ్చని వివరించింది. 2024 మార్చి 31 నాటి గణాంకాల ప్రకారం ఒత్తిడిలో ఉన్న ఎంసీల సంఖ్య 11 శాతమే ఉండగా, ఎంఎస్ఎంఈలు మాత్రం 23 శాతంగా ఉన్నాయి. కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే ఎంసీలు వ్యాపార పరిస్థితులను మెరుగ్గా నిర్వహించుకోగలిగే స్థితిలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 1,898 లిస్టెడ్, అన్‌లిస్టెడ్ ఎంఎస్ఎంఈలు, 1,055 ఎంసీలపై ఈ అధ్యయనం నిర్వహించారు.‘సాధారణంగా ఎంసీలతో పోలిస్తే ఎంఎస్ఎంఈలు నిర్వహణ మూలధనం విషయంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లపై వాటికి తగినంత స్థాయిలో రుణాలు అవసరమవుతాయి. ఎంసీల్లాగా కాకుండా చాలా మటుకు ఎంఎస్ఎంఈలు ప్రమోటర్ల సారథ్యంలో ఉంటాయి. రుణదాతలు / సరఫరాదారులు / కస్టమర్లతో బేరమాడే పరిజ్ఞానం, నైపుణ్యాలు ఉన్నవారు రెండో అంచె మేనేజ్మెంట్లో అంతగా ఉండరు’ అని ఇండ్–రా అసోసియేట్ డైరెక్టర్ నిర్మయ్ షా తెలిపారు. రూ.250 కోట్ల లోపు సంస్థలపై ప్రభావం..రూ.250 కోట్ల లోపు ఆదాయం ఉండి, ప్లాంటు..మెషినరీపై రూ.5 కోట్ల లోపు పెట్టుబడులు ఉన్న ఎంఎస్ఎంఈలపై ప్రతీకార టారిఫ్‌ల ప్రభావం ఒక మోస్తరు నుంచి తీవ్ర స్థాయి వరకు ఉంటుందని ఇండ్–రా తెలిపింది. డిమాండ్ ఏమాత్రం మందగించినా ఎంసీలకన్నా ఎంఎస్ఎంఈలపైనే ఎక్కువగా ప్రభావం ఉండొచ్చని పేర్కొంది. అయితే, వడ్డీ రేట్ల తగ్గుదల, వ్యవస్థలో లిక్విడిటీ మెరుగుపడటం వంటి అంశాలు కాస్త సానుకూలంగా ఉండొచ్చని వివరించింది.ఇదీ చదవండి: మూడు రోజుల్లో స్కైప్ కనుమరుగుఎస్ఎంఈల పెట్టుబడి వ్యయాలు కోవిడ్ తర్వాత కాస్త పుంజుకున్నప్పటికీ చారితక్ర స్థాయులతో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉన్నాయని నివేదిక వివరించింది. సుంకాలపరంగా అసమానతలున్న దేశాలపై ఏప్రిల్ 2న అమెరికా ప్రతీకార టారిఫ్‌లు ప్రకటించడం, ఆ తర్వాత వాటిని 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయడం తెలిసిందే. -
టారిఫ్‌ల ఎఫెక్ట్.. టాప్ కార్ల తయారీ కంపెనీ ఔట్!
యూరప్‌లోని అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరున్న వోక్స్ వ్యాగన్ పునర్నిర్మాణ ప్రయత్నంలో భాగంగా 7,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీకి అనుబంధ సంస్థగా ఉన్న కారియాడ్ సాఫ్ట్వేర్ విభాగంలో అధికంగా ఈ లేఆఫ్స్ ప్రభావం పడనుంది. దిగుమతి చేసుకున్న వాహనాలపై అమెరికా సుంకాలు, యూరోపియన్ యూనియన్ కర్బన ఉద్గారాల లక్ష్యాలకు సంబంధించిన జరిమానాల కారణంగా 2025 క్యూ1లో కంపెనీ నికర లాభం 40 శాతం తగ్గిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.వోక్స్ వ్యాగన్ నష్టాలకు కారణాలు..అమెరికా సుంకాల ప్రభావందిగుమతి చేసుకున్న ఆటోమొబైల్స్‌పై అమెరికా 25% సుంకం విధించింది. ఇది వోక్స్ వ్యాగన్ మెక్సికో యూనిట్లో తయారవుతున్న వాహనాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇది దాని యూఎస్ అమ్మకాలలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉంది. సుంకాలు పెరగడంతో ఖర్చులు అధికమయ్యాయి. డిమాండ్ తగ్గిపోయింది. ఇది లాభాల మార్జిన్లపై ప్రభావం చూపింది.ఈయూ కార్బన్ ఉద్గార జరిమానాలువోక్స్ వ్యాగన్ కఠినమైన యూరోపియన్ యూనియన్ కర్బన ఉద్గారాల లక్ష్యాలను చేరుకోవడం సవాలుగా మారుతుంది. నిబంధనలు పాటించనందుకు విధించే జరిమానాల కోసం కంపెనీ 600 మిలియన్ యూరోలను కేటాయించింది. ఇది దాని ఆర్థిక దృక్పథాన్ని మరింత దెబ్బతీసింది.ఇదీ చదవండి: పూర్తి కోడింగ్ పనంతా ఏఐదే!కారియాడ్ సాఫ్ట్వేర్ విభాగంఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) సాఫ్ట్వేర్ అభివృద్ధిలో కంపెనీ అనుబంధ సంస్థ కారియాడ్ నిరంతరం జాప్యం చేస్తోంది. ఇది వోక్స్ వ్యాగన్ ఈవీ లక్ష్యాలను ప్రభావితం చేసింది. ఈ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించడానికి కంపెనీ 200 మిలియన్ యూరోలను కేటాయించింది. ఇది ఉద్యోగాల కోతకు, కార్యాచరణ మార్పులకు దారితీసింది. -
నష్టం కలిగిస్తే ప్రతీకారం తప్పదు
బీజింగ్: టారిఫ్‌ల నుంచి తప్పించుకునే క్రమంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలకు చైనా హెచ్చరికలు చేసింది. ఆ ఒప్పందాలతో తమకు నష్టం వాటిల్లే పక్షంలో ప్రతీకార చర్యలు తప్పవని ఆయా దేశాలకు తేల్చి చెప్పింది. ఇటువంటి ఒప్పందాలకు తాము పూర్తిగా వ్యతిరేకమని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. అత్యధిక సుంకాల నుంచి మినహాయించినందుకు ప్రతిఫలంగా చైనాతో వాణిజ్య సంబంధాలను పరిమితం చేయాలంటూ ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో వాణిజ్య శాఖ ప్రతినిధి ఈ ప్రకటన చేశారని అధికార జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. ‘ఒక వేళ అటువంటి పరిస్థితే ఏర్పడితే చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. తీవ్ర ప్రతీకార చర్యలు తీసుకుంటుంది. తాత్కాలిక లాభం కోసం ఇతరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టాలని చూడటం పులి చర్మం కోసం దానితో బేరమాడటం వంటిదే. ఎదురుదెబ్బ తప్పదు’అని ఆ ప్రతినిధి వ్యాఖ్యానించారు. తమతో లాభదాయకమైన వ్యాపార సంబంధాలు కలిగిన పలు దేశాలు సుంకాల మినహాయింపులు పొందడానికి అమెరికాతో ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోకుండా నిరోధించడానికే చైనా ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. జపాన్, ఈయూ, ఆసియాన్‌లోని పలు దేశాలు అమెరికాతోపాటు చైనాతోనూ విస్తృత వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాయి. భారత్ కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయతి్నస్తోంది. చైనా వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 245 శాతం టారిఫ్‌లు ప్రకటించగా, చైనా సైతం అమెరికా వస్తువులపై 125 శాతం టారిఫ్‌లు విధించింది. ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడిన చైనా ఆర్థిక వ్యవస్థపై అమెరికాతో ఆసియాన్ లాంటి భాగస్వాములు కుదుర్చుకునే ఒప్పందాలతో ప్రతికూల ప్రభావం చూపుతుంది. -
ఇండియా విధానం సరైనదేనా?
భారత ప్రభుత్వం సుంకాల విషయమై అమెరికాతో చర్చిస్తున్న పద్ధతిని కొందరు సమర్థిస్తుండగా, కొందరు విమర్శిస్తున్నారు. విలువైన అంశాలు రెండింటిలోనూ ఉన్నాయి. కానీ ఈ చర్చలన్నీ తక్షణ అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. అవి అవసరమే. అదే సమయంలో మరికొంత లోతుకు వెళ్లటం, దీర్ఘకాలిక దృష్టి తీసుకోవటం కూడా చేస్తే తప్ప ఇంత ముఖ్యమైన విషయమై సమగ్రమైన అవగాహన ఏర్పడదు. ఇతర దేశాల నుంచి దిగుమతులపై తాము స్వల్పమైన సుంకాలు విధిస్తున్నామనీ, తమ ఎగుమతులపై మాత్రం వారు భారీ సుంకాలు వేస్తున్నారనీ, ఆ విధంగా తాము రెండు విధాలుగానూ నష్టపోతున్నామన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నమాట. కేవలం గణాంకాలకు పరిమితమైతే అది నిజమే. కానీ, అందులో అనేక మతలబులున్నాయి. అమెరికాలో ఒకప్పుడు విస్తారంగా ఉండిన ఉత్పత్తుల రంగాన్ని కుదించి, పరిశ్రమలను ఇతర దేశాలకు తరలించింది అక్కడి ప్రభుత్వమే గదా? అసలు వివిధ అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య సంస్థలను ఉనికిలోకి తెచ్చి స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించిందే అమెరికా. ఒకవేళ 90 రోజుల వాయిదా కాలంలో చర్చల ద్వారా కొన్ని సర్దుబాట్లు జరిగినా కొంత నష్టం మిగిలే ఉంటుంది. ఈ పరిణామాలన్నింటి ప్రభావంతో అమెరికా పట్ల ప్రపంచానికి ఇంత కాలం ఉండిన విశ్వాసం తగ్గుతుందనే సందేహం ఉంది. అది జరిగినపుడు ఇప్పటికే గల బహుళ ధ్రువ ప్రపంచ ధోరణులు మరింత బలపడగలవనే అభిప్రాయాలు ఎక్కువవుతున్నాయి.నాలుగు ధోరణులుఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 2024–25లో 41.18 బిలి యన్ డాలర్లు. మన దిగుమతులపై అమెరికా సుంకాల రేటు సగటున 2.7 శాతం. అమెరికా నుంచి దిగుమతులపై మన సుంకాల రేటు సగ టున 12 శాతం కాగా, కొన్ని సరుకులపై 48 శాతం వరకు ఉంది. ఈ లెక్కలను బట్టి అమెరికా అధ్యక్షుడు అన్ని దేశాలతో గల వాణిజ్య లోటులో 50 శాతం మేర సుంకాలు పెంచిన ప్రకారం భారత ఎగుమతులపై రేటును 26 శాతంగా ప్రకటించారు. ఏప్రిల్ 2న ఈ కొత్త రేట్లు ప్రకటించటానికి ముందే చేసిన హెచ్చరికలను బట్టి భారత ప్రభుత్వం అమెరికన్ మోటార్ సైకిళ్లు వగైరాపై సుంకాలు తగ్గించటం తెలిసిందే. అయినప్పటికీ కొత్త రేట్లు యథావిధిగా పెరిగాయి.ఈ పరిస్థితుల దృష్ట్యా భారత్ ఏమి చేయాలన్నది ప్రశ్న. ప్రపంచ దేశాలు చేస్తున్నదేమిటని చూడగా నాలుగు ధోరణులు కనిపిస్తు న్నాయి. కొన్ని చిన్న ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా లొంగి పోతున్నాయి. అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలు నూరు శాతం రద్దు చేస్తు న్నాయి. ఇందుకు ఒక ఉదాహరణ జింబాబ్వే. కొన్ని సామరస్య ధోర ణితో ఇచ్చిపుచ్చుకునే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. జపాన్ అందు కొక ఉదాహరణ. కొన్ని ఎదురు సుంకాలతో ప్రతిఘటిస్తూ అమెరికా తగ్గితే తాము తగ్గుతామంటున్నాయి. కెనడా, యూరోపియన్ దేశాలు ఈ కోవలోకి వస్తాయి. చైనా ఒక్కటి భిన్నంగా కనిపిస్తున్నది. పోరాడు తాము తప్ప లొంగే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నది.ఈ నాలుగింటిలో ఇండియా ప్రయోజనాలకు ఉపయోగపడ గలది ఏది? చైనా వలె పూర్తిగా ధిక్కరించటమన్నది అభిలషణీయం కాదు, కావాలనుకున్నా సాధ్యమయ్యేదీ కాదు. వారిది రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత దేశం కన్నా అయిదు రెట్లు పెద్దది.క్రమంగా అమెరికాను మించిపోయి అగ్రస్థానానికి చేరాలన్నది చైనా లక్ష్యం. మన స్థితిగతులుగానీ, లక్ష్యాలుగానీ వీలైనంత అభివృద్ధి చెందటమే తప్ప చైనా వంటివి కావు. కనుక ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అటువంటి వైఖరి తీసుకోవటమన్న ఆలోచనే అసందర్భం. ఇదంతా అర్థమయ్యో, కాకనో కొందరు భారత ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తున్నారు. జపాన్ మార్గంఇక మిగిలినవి జపాన్, కెనడా ప్లస్ యూరోపియన్ మార్గాలు. ఈ రెండింటిలో రెండవది కూడా ఇండియాకు అనుకూలించగలది కాదు. అందుకు ఒక కారణం యూరోపియన్ దేశాలన్నీ ఒక బృందం వలె నిలిచి ఉన్నాయి. అది గాక సైనికంగా, భౌగోళిక వ్యూహాల రీత్యా అమెరికా, కెనడా, యూరప్‌ల సాన్నిహిత్యం భిన్నమైనది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నందువల్లనే అమెరికా ట్యారిఫ్లను వారు బలంగా ఎదుర్కొంటూ, ఆ దేశం దిగి రావలసిందేనని స్పష్టం చేస్తు న్నారు. ఇదంతా భారతదేశానికి సాధ్యమయ్యేది కాదు.అందువల్ల స్థూలంగా జపాన్ నమూనా ఒక్కటే మిగులుతున్నది. దక్షిణ కొరియా, మెక్సికో మొదలైన వాటి వైఖరి కూడా ఇంచుమించు ఇదే విధంగా కనిపిస్తున్నది. ఈ పద్ధతి ఇంకా ఇదమిత్థంగా రూపు తీసుకోలేదు. చర్చలు జరిగే కొద్దీ ఇందుకొక రూపం రాగలదని భావించవచ్చు. భారత్ స్థూలంగా జపాన్ తరహా వైఖరిని తీసుకుంటున్నట్లు కని పిస్తున్నది. ఇందులోనూ ఒక ఆకు తక్కువే. అమెరికాతో జపాన్‌కు గల వ్యూహాత్మక భాగస్వామ్యం వేరు. అందుకే ‘స్థూలంగా’ అనే మాటను ఉపయోగించటం. ఇవన్నీ చెప్పుకున్న తర్వాత, భారతదేశం గురించి మాట్లాడుకోవలసిన మౌలికమైన విషయాలు రెండున్నాయి. భారత అభివృద్ధి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? కొత్త అభివృద్ధి లక్ష్యాల సాధనకు అనుసరించవలసిన మార్గం ఏమిటని ప్రభుత్వం భావిస్తున్నది? సుంకాల యుద్ధంపై తీసుకోగల వైఖరికి ఈ ప్రశ్నలతో సంబంధం ఉంటుంది.దేశ ప్రయోజనాలే ముఖ్యం!ఆర్థికాభివృద్ధి రీత్యా ఇండియా ఇంకా వర్ధమాన దేశమే. అభివృద్ధి చెందుతున్నా, ఆ వేగం ఉండవలసినంతగా లేదు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే అంతర్గతంగా జరగవలసింది చాలా ఉండటంతో పాటు, అభివృద్ధి చెందిన దేశాల నుంచి, ఇంచు మించు తన స్థాయిలో గల వర్ధమాన దేశాల నుంచి, అవసరమైన వనరులు గల దేశాల నుంచి సహకారం అవసరం. అందుకోసం ఈ కూటమి, ఆ కూటమి అనే ఒకప్పటి రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వైపుల నుంచి సహకారం కోసం సమ సంబంధాలు పాటించాలి. దేశ ప్రయోజనాలే దేనికైనా గీటురాయి కావాలి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులంటూ ఉండరు. పరిస్థితులు, ఫిలాసఫీ రెండూ ఇవే. ఇదంతా ఇప్పుడు మనం సుంకాల సమస్యల సందర్భంలో కొత్తగా సూత్రీకరిస్తున్నది కాదు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ‘ది ఇండియా వే, స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్సర్టెన్ వరల్డ్’ (2020) పేరిట రాసిన పుస్తకంలో ఈ సూత్రీ కరణలన్నీ కనిపిస్తాయి. శీర్షిక దానికదే ఎంతో అర్థవంతమైనది. ‘మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా జీవించటమే వివేకం’ అనే తిరు వళ్ళువర్ బోధనతో ఆయన తన పుస్తకాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ పాలకులు వచ్చిపడుతుండగా చదరంగంలో మునిగి రాజ్యం పోగొట్టుకున్న బెంగాల్ నవాబుల ఉదంతంతో ‘షతరంజ్ కే ఖిలాడీ’ సినిమా తీసిన సత్యజిత్ రే హెచ్చరిక, అమెరికా బలహీనపడుతుండగా ముందుకు దూసుకుపోతున్న చైనాల గురించి చర్చిస్తూ, ‘ఇప్పుడు భారతదేశం తనను తాను నిర్వచించుకుంటుందా? లేక ఇంకో ప్రపంచమే నిర్వచిస్తుంటుందా?’ అని ప్రశ్నిస్తారు. స్వయంగా అమెరికా, చైనాలలో రాయబారిగా పనిచేసిన జైశంకర్ సూత్రీకర ణలు, రూపొందిస్తున్న విదేశాంగ విధానాలు ప్రస్తుత క్లిష్ట పరిణా మాలకు తగినవే.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
క్యూ4 ఫలితాలే దిక్సూచి
గత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసిక(క్యూ4) ఫలితాలే ప్రధానంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. వీటికితోడు యూఎస్ టారిఫ్ వార్తలు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వారాంతాన వెలువడిన వర్షపాత అంచనాలు సెంటిమెంటుకు జోష్‌నివ్వనున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం..ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ దిగ్గజాల క్యూ4(జనవరి–మార్చి) ఫలితాల ఆధారంగా కదలనున్నాయి. క్యూ4తోపాటు మార్చితో ముగిసిన పూర్తి ఏడాది పనితీరును సైతం వెల్లడించనున్నాయి. కొన్ని రంగాల కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ప్రభావిత అంశాలు, పనితీరుపై అంచనాలు సైతం వెలువరించనున్నాయి. ఈ జాబితాలో కార్ల దిగ్గజం మారుతీసహా.. ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎఫ్ఎంసీజీ బ్లూచిప్ హిందుస్తాన్ యూనిలీవర్, ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తదితరాలున్నాయి. ఐటీ బ్లూచిప్ ఇన్ఫోసిస్‌తోపాటు వారాంతాన(19న) ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐసహా యస్ బ్యాంక్ ఫలితాలు విడుదల చేశాయి. దీంతో నేడు(21న) ఈ కౌంటర్లపై ఫలితాల ప్రభావం కనిపించనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఇతర అంశాలు ప్రపంచ ప్రధాన(ఆరు) కరెన్సీలతో మారంకలో ఇటీవల డాలరు బలహీనపడుతుండటంతో దేశీ కరెన్సీ బలపడుతోంది. డాలరు ఇండెక్స్ కొద్ది రోజులుగా 104 స్థాయి నుంచి 99కు నీరసించడం రూపాయికి జోష్‌నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు దేశీ స్టాక్స్‌లో తిరిగి విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీగా పెట్టుబడులు చేపడుతుండటం మరింత మద్దతిస్తున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. కాగా.. ముడిచమురు ధరలు బ్యారల్ 65–60 డాలర్ల స్థాయికి దిగిరావడం దేశీయంగా సానుకూల అంశమని, ఇది ద్రవ్యోల్బణం తగ్గేందుకు దోహదపడుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. గత వారమిలా కేవలం మూడు రోజులు జరిగిన గత వారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 4 శాతంపైగా జంప్‌చేయడం విశేషం! ఇందుకు ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడం తోడ్పాటునిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత వారం సెన్సెక్స్ నికరంగా 3,396 పాయింట్లు(4.5 శాతం)దూసుకెళ్లగా, నిఫ్టీ సైతం 1,023 పాయింట్లు(4.5 శాతం) ఎగసింది. వెరసి సెన్సెక్స్ 78,553 వద్ద, నిఫ్టీ 23,852 వద్ద ముగిశాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ ఇదేస్థాయిలో ర్యాలీ చేయడం గమనార్హం! సాంకేతికంగా గత వారం సెలవుల నేపథ్యంలో సాంకేతికంగా మార్కెట్లు మూడు ట్రేడింగ్ సెషన్లలోనే భారీగా బలపడ్డాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 23,600 పాయింట్ల స్థాయిలో బలమైన మద్దతును కూడగట్టుకుంటున్నట్లు సాంకేతిక నిపుణులు తెలియజేశారు. దీంతో మరోసారి నిఫ్టీకి ఈ స్థాయి సపోర్ట్‌గా నిలిచే వీలున్నట్లు అంచనా వేశారు. ఇదేవిధంగా 24,550 పాయింట్ల వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని పేర్కొన్నారు. వెరసి సమీప భవిష్యత్‌లో సపోర్ట్ లేదా రెసిస్టెన్స్‌లను అధిగమిస్తే మార్కెట్ల తీరు వెల్లడికావచ్చని అభిప్రాయపడ్డారు.రుతుపవనాల ఎఫెక్ట్ ఈ ఏడాది సాధారణానికంటే అధిక వర్షపాతానికి వీలున్నట్లు దేశీ వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసిన అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. ఇది ధరల(ద్రవ్యోల్బణ) క్షీణతకు దారి చూపవచ్చని పేర్కొన్నారు. అయితే యూఎస్ టారిఫ్ వార్తలు మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకావచ్చని విశ్లేషించారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగల యూఎస్, చైనా సుంకాల విధింపులో పోటాపోటీగా వ్యవహరిస్తుండటం ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతున్నట్లు పలువురు నిపుణులు తెలియజేశారు. ఇకపై టారిఫ్‌ల యుద్ధం మరింత వేడెక్కడం లేదా చల్లబడటం అనే అంశాలపై మార్కెట్లు దృష్టిపెట్టనున్నట్లు వివరించారు.ఎఫ్‌పీఐల దన్ను 3 రోజుల్లో రూ. 8,500 కోట్లు గత వారం మూడు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 8,472 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. నిజానికి ఈ నెల మొదట్లో సైతం ఎఫ్‌పీఐలు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. ఈ బాటలో గత వారం తొలి రోజు రూ. 2,352 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. తదుపరి రెండు సెషన్లలో ఏకంగా రూ. 10,824 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. దీంతో ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్ నుంచి రూ. 23,103 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అంటే 2025 జనవరి నుంచి రూ. 1.4 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించారు. -
చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్‌కు గోల్డెన్ ఛాన్స్!
చైనా వస్తువులపై అమెరికా అధిక సుంకాలను విధించడంతో.. బొమ్మల ఎగుమతి క్షీణించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారతీయ బొమ్మల ఎగుమతిదారులు చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది అమెరికన్ కొనుగోలుదారులు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం వెతుకుతున్నారు.అమెరికాకు ఎక్కువగా బొమ్మలను ఎగుమతి చేసే దేశాల్లో చైనా అగ్రగామిగా ఉండేది. అయితే ఇప్పుడు అధిక సుంకాల కారణంగా చైనా ఎగుమతులు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ అవకాశాన్ని భారతదేశం సద్వినియోగం చేసుకోవచ్చని టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు 'అజయ్ అగర్వాల్' ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.ప్రస్తుతం, దాదాపు 20 సంస్థలు అమెరికన్ మార్కెట్‌కు పెద్ద ఎత్తున బొమ్మల ఎగుమతుల్లో నిమగ్నమై ఉన్నాయని అగర్వాల్ అన్నారు. గత నెలలో యుఎస్ బేస్డ్ బొమ్మల కొనుగోలుదారుల నుంచి మాకు మరిన్ని విచారణలు వస్తున్నాయి. యూఎస్ నియమాలు, నిబంధనల ప్రకారం బొమ్మ ఉత్పత్తులను తయారు చేయగల తయారీదారుల జాబితాను కోరుతూ కొన్ని భారతీయ ఎగుమతి సంస్థలు కూడా మమ్మల్ని సంప్రదించాయి ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?2024లో యూఎస్ బొమ్మల మార్కెట్ 42.8 బిలియన్ డాలర్లకు చేరుకుందని జీఎమ్ఐ రీసర్చ్ వెల్లడించింది. 2032 నాటికి ఈ వృద్ధి 56.9 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. బొమ్మల రంగంలో భారతదేశం నుంచి ఇప్పటికే దాదాపు 20 కంపెనీలు పెద్దమొత్తంలో అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి.ఇతర దేశాల కంటే తక్కువ రేట్లు ఉండటం వల్ల మనకు సుంకాల ప్రయోజనం లభిస్తే.. అమెరికా మార్కెట్లో భారతీయ బొమ్మల ఉనికిని తప్పకుండా పెంచుకోవచ్చని.. టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అన్నారు. అంతే కాకుండా త్వరలోనే తయారీదారులతో ఒక సెమినార్ నిర్వహించాలని అసోసియేషన్ యోచిస్తోందని ఆయన అన్నారు. -
ఎగుమతులు పెరిగినా తీరని ఆక్వా రైతుల వెతలు
-
త్వరలో ఆర్థిక మాంద్యం!
అమెరికా సుంకాలు ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని ప్రేరేపిస్తే కెనడాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, దేశం తీవ్ర మాంద్యంలోకి వెళ్తుందని బ్యాంక్ ఆఫ్ కెనడా తెలిపింది. తీవ్ర అనిశ్చితి కారణంగా సెంట్రల్ బ్యాంక్ తన సాధారణ త్రైమాసిక ఆర్థిక అంచనాలను విడుదల చేయలేదు. దానికి బదులుగా భవిష్యత్తులో యూఎస్ ఆర్థిక వైఖరి కెనడాపై ఎలా ప్రభావం చూపుతుందో అంచనా వేసింది.బ్యాంక్ ఆఫ్ కెనడా తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి సందర్భంలో, చాలా సుంకాలు రద్దు చేస్తారు. కెనడాతోపాటు ప్రపంచ వృద్ధి తాత్కాలికంగా బలహీనపడుతుంది. కెనడా ద్రవ్యోల్బణం సంవత్సరానికి 1.5%కు పడిపోతుంది. తరువాత 2%కు చేరుతుంది. రెండో సందర్భంలో, సుంకాలు దీర్ఘకాలిక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయి. కెనడా భారీ మాంద్యంలోకి ప్రవేశిస్తుంది. ద్రవ్యోల్బణం 2026 మధ్యలో 3% కంటే ఎక్కువ పెరిగి 2% కు తిరిగి వస్తుంది. ఇంకా ఇతర పరిస్థితులు సాధ్యమేనని నొక్కిచెప్పిన బ్యాంక్ వార్షిక మొదటి త్రైమాసిక జీడీపీ 1.8%గా అంచనా వేసింది. ఇది జనవరి చివరిలో అంచనా వేసిన 2.0% కంటే తక్కువ.ఇదీ చదవండి: ‘చౌకైన కార్లు కనుమరుగయ్యే ప్రమాదం’ద్వితీయార్ధంలో ఆర్థిక మాంద్యం..?వాణిజ్య ఉద్రిక్తతలు, ద్రవ్య సర్దుబాట్ల పర్యవసానాలతో ఇన్వెస్టర్లు, విధాన నిర్ణేతలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో రానున్న రోజుల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఆర్థిక మాంద్యం ప్రమాదాలు పెరగవచ్చని చెబుతున్నారు. అందుకోసం ప్రభుత్వ వ్యూహాత్మక ఆర్థిక జోక్యాలు అవసరమని సూచిస్తున్నారు. -
‘చౌకైన కార్లు కనుమరుగయ్యే ప్రమాదం’
అమెరికా టారిఫ్‌లు వాహన ధరలను పెంచుతాయని నిస్సాన్ అమెరికా ఛైర్మన్ క్రిస్టియన్ మ్యూనియర్ ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాల వల్ల మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు కారు కొనలేని పరిస్థితులు నెలకొంటున్నట్లు తెలిపారు. మెక్సికో నుంచి ఎగుమతయ్యే వాహనాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలు ఆటోమొబైల్ కంపెనీలను కుదిపేస్తాయని చెప్పారు.‘20,000 డాలర్ల(రూ.16 లక్షలు) సగటు ధర కలిగిన నిస్సాన్ వెర్సా మెక్సికోలో తయారవుతుంది. టారిఫ్ అమల్లోకి రావడంతో అమెరికాకు దీని ఎగుమతులు కష్టంగా మారుతున్నాయి. యూఎస్‌లో చౌకగా లభించే కారు ఇకపై కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. మెక్సికోకు బదులుగా అమెరికాలోనూ నిస్సాన్ చౌక వాహనాలను తయారు చేయడం సాధ్యమే అయినప్పటికీ, మెక్సికో నుంచి కొన్ని విడిభాగాలను దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వకపోతే సవాళ్లు ఎదురవుతాయి’ అని మ్యూనియర్ అన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?కాక్స్ ఆటోమోటివ్ విశ్లేషణ ప్రకారం.. యూఎస్‌లో కారు సగటు ధర 48,000 డాలర్లు(సుమారు రూ.40 లక్షలు). ప్రభావిత మోడళ్ల ధరలకు టారిఫ్‌లు 10% నుండి 15% వరకు అదనంగా పెరుగుతాయి. లెవీ పరిధిలో లేని వాహనాల ధరలు మొత్తంగా 5% పెరుగుతాయని సంస్థ అంచనా వేస్తోంది. టారిఫ్‌ల వల్ల ఎక్కువగా ప్రభావితమైన మోడళ్లలో 30,000 డాలర్ల(రూ.25 లక్షలు) కంటే తక్కువ ధర కలిగినవే ఉన్నాయి. వీటిలో దాదాపు అన్నీ యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉత్పత్తి అవుతున్నవే కావడం గమనార్హం. -
చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలు
చైనా దిగుమతులపై 245 శాతం వరకు కొత్త సుంకాలను విధిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధాన్ని మరింత పెంచినట్లయింది. ఇప్పటివరకు అమెరికా చైనాపై 145 శాతం సుంకాలు అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. కానీ ఇటీవల ఆ టారిఫ్‌లకు ప్రతిస్పందనగా 125 శాతం సుంకాలతో చైనా పావులు కదపడంతో అమెరికా తీవ్రంగా స్పందించింది. దాంతోపాటు చైనా ఎగుమతి చేసే అరుదైనా ఖనిజాలు, ఇతర వస్తువులపై ఆంక్షలు విధించడం యూఎస్ జీర్ణించుకోలేకపోతుంది. బీజింగ్ ఎగుమతి ఆంక్షలు, ప్రతీకార సుంకాలకు సమాధానం చెబుతూ వైట్‌హౌజ్ తాజాగా విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్లో 245 శాతం సుంకాలు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది.చైనా తాజా చర్యలు..చైనా నుంచి అమెరికా వెళ్లే అరుదైన ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. దాంతో అమెరికాను చైనా నేరుగా కుంభస్థలంపైనే కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. దీని ప్రభావం అమెరికా రక్షణ శాఖపై భారీగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైటర్ జెట్లు తదితరాల తయారీని ఇది తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం అరుదైన ఖనిజాల్లో ఏకంగా 70 శాతం వాటా చైనాదే! అమెరికా వాటా 11.4 శాతమే ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో పసిడిఆర్థిక పరిణామాలుఅమెరికా సుంకాలు చైనా ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. లాభాల మార్జిన్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపేశాయి. టెక్స్టైల్ కంపెనీలు యూఎస్‌కు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. సుంకాల ప్రభావం వల్ల లాభాలు భారీగా క్షీణించాయని పేర్కొన్నాయి. మరోవైపు వియత్నాం వంటి దేశాలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన తయారీ రంగాన్ని బలహీనపరుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో కుదేలైన పారిశ్రామికోత్పత్తి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్డర్లు తగ్గడంతో కొన్ని కర్మాగారాలు పరికరాలను విక్రయిస్తున్నాయి. -
యూఎస్‌తో వాణిజ్య ఒప్పందానికి చాన్స్
యూఎస్ టారిఫ్‌లతో తలెత్తే సంక్షోభాలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి పేర్కొన్నారు. త్వరలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు వేగంగా చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల భారత్‌సహా పలు దేశాలపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లకు తెరతీసిన నేపథ్యంలో పురి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది.చైనా మినహా మిగిలిన దేశాలపై విధించిన టారిఫ్‌లను ట్రంప్ 90 రోజులపాటు నిలిపివేసేందుకు నిర్ణయించిన విషయం విదితమే. చైనాపై 145 శాతం సుంకాలు ప్రకటించినప్పటికీ కంప్యూటర్ చిప్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్ తదితర కొన్ని ఎల్రక్టానిక్ ప్రొడక్టులను మినహాయించారు. ప్రతీకార టారిఫ్‌ల అమలు జులై 9 వరకూ వాయిదా పడినప్పటికీ యూఎస్ ఎగుమతులపై 10 శాతం అదనపు సుంకాలు అమలుకానున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ పరిశ్రమపై టారిఫ్‌ల ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయడం కష్టమని పురి పేర్కొన్నారు. అయితే భారత్ వీటిని పటిష్టస్థాయిలో ఎదుర్కోగలదని అంచనా వేశారు. పలు దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టీఏలు) కుదుర్చుకునేందుకు అవకాశాలున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాదిలోనే ఈయూ, యూకేతోపాటు యూఎస్‌తోనూ ఒప్పందాలపై సంతకాలకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.మార్చిలోనే చర్చలు మొదలుయూఎస్, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి(బీటీఏ) మార్చిలోనే చర్చలు మొదలయ్యాయి. ఒప్పందం తొలి దశను సెప్టెంబర్–అక్టోబర్‌కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2030కల్లా 500 బిలియన్ డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించే లక్ష్యంతో ఇందుకు శ్రీకారం చుట్టాయి. అంతర్జాతీయంగా చూస్తే ఎఫ్‌టీఏ, సమీకృత ఆర్థిక సహకార ఒప్పందం(సీఈసీఏ), సమీకృత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ), బీటీఏలుగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. తద్వారా భాగస్వామ్య దేశాలు గరిష్ట సంఖ్యలో వస్తుసంబంధ వాణిజ్యంపై దిగుమతి సుంకాలు భారీగా తగ్గించుకోవడం లేదా ఎత్తివేయడం చేస్తాయి.ఇదీ చదవండి: ప్రతి నెలా కొత్త బీమా ప్లాన్స్వల్ప కాలానికి అనిశ్చితులువినియోగ ఆధారిత దేశ ఆర్థిక వ్యవస్థ స్వల్ప కాలానికి అనిశ్చితులను ఎదుర్కోవలసి ఉంటుందని పురి తెలియజేశారు. అయితే పోటీతత్వం, డిజిటైజేషన్, ఫ్యూచర్ రెడీ పోర్ట్‌ఫోలియో తదితరాల ద్వారా భారత్ నిలదొక్కుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. స్వల్పకాల అనిశ్చితి, అంచనాలకు అందని పరిస్థితులు ప్రపంచ వృద్ధిపై ప్రభావాన్ని చూపవచ్చునని, దీంతో భారత్‌పై కొంతమేర ప్రతికూల ప్రభావానికి చాన్స్ ఉందని విశ్లేషించారు. -
సెన్సెక్స్‌ప్రెస్!
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల నుంచి ఎల్రక్టానిక్స్ ఉత్పత్తులను మినహాయించడంతో పాటు ఆటోమొబైల్స్‌పై సుంకాలు సవరించే వీలుందని సంకేతాలివ్వడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అక్కడి నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం 2% ర్యాలీ చేశాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 65 డాలర్లకు దిగిరావడం, డాలర్ ఇండెక్స్ బలహీనత అంశాలూ కలిసొచ్చాయి.ఫలితంగా సెన్సెక్స్ 1,578 పాయింట్లు పెరిగి 76,735 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 500 పాయింట్లు బలపడి 23,329 వద్ద ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 1,695 పాయింట్ల లాభంతో 76,852 వద్ద, నిఫ్టీ 539 పాయింట్లు పెరిగి 23,368 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. విస్తృత స్థాయిలో అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ లాభాలు నిలుపుకోలిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 76,907 వద్ద, నిఫ్టీ 23,368 వద్ద గరిష్టాలు నమోదు చేశాయి. రంగాల వారీగా సూచీలు రియల్టీ 6%, ఇండ్రస్టియల్, క్యాపిటల్ గూడ్స్ 4%, ఆటో, కన్జూమర్ డిస్క్రిషనరీ, ఫైనాన్సియల్ సర్విసెస్, మెటల్ షేర్లు మూడుశాతం లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు 3% ర్యాలీ చేశాయి. లాభాల బాటలో అంతర్జాతీయ మార్కెట్లు ఆసియాలో సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్, తైవాన్ వెయిటెడ్ 2%, జపాన్ నికాయ్, కొరియా కోస్పీ, ఇండోనేషియా జకార్తా ఒకశాతం పెరిగాయి. హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్, చైనా షాంఘై అరశాతం రాణించాయి. యూరప్‌లో ఫ్రాన్స్ సీఏసీ 1%, జర్మనీ డాక్స్ 1.50%, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ 1.5% ర్యాలీ చేశాయి. అమెరికా స్టాక్ సూచీలు అరశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్ షేర్ల దన్ను: ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు కస్టమర్లకు బదిలీలో భాగంగా పలు బ్యాంకులు డిపాజిట్ల రేట్లు తగ్గిస్తున్నాయి. ఈ ప్రక్రియతో బ్యాంకుల నికర వడ్డీరేట్ల మార్జిన్ల ఒత్తిళ్లు తగ్గొచ్చని బ్రోకరేజ్ సంస్థ జెఫ్ఫారీస్ అంచనా వేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 3%, ఇండస్ఇండ్ బ్యాంకు 7%, యాక్సిస్ బ్యాంక్ 4 శాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం పాయింట్ల ఈ నాలుగు షేర్ల వాటాయే 750 పాయింట్లు కావడం విశేషం.ఆటో షేర్ల పరుగులు: ఆటో మొబైల్స్ పరిశ్రమపై గతంలో విధించిన సుంకాలు సవరించే వీలుందని ట్రంప్ సంకేతాలతో ఆటో షేర్లు పరుగులు పెట్టాయి. సంవర్ధన మదర్శన్‌సుమీ 8%, భారత్ ఫోర్జ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 7%, టాటా మోటార్స్, ఎంఆర్ఎఫ్ 4.50% ర్యాలీ చేశాయి. హీరో మోటోకార్ప్ 4%, ఐషర్ మోటార్స్ 3.50%, టీవీఎస్ మోటార్, అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో 3% లాభపడ్డాయి. ఎంఅండ్ఎం, మారుతీ 2% పెరిగాయి.రూపాయి రెండోరోజూ ర్యాలీ దేశీయ ఈక్విటీ మార్కెట్ అనూహ్య ర్యాలీ, అమెరికా కరెన్సీ బలోపేతంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 30 పైసలు బలపడి 85.50 వద్ద స్థిరపడింది. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు తగ్గట్లు నమోదుకావడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు భారత కరెన్సీ బలపడేందుకు తోడ్పడ్డాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 85.85 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 85.59 స్థాయి వద్ద గరిష్టాన్ని తాకింది. 2 రోజుల్లో రూ.18.42 లక్షల కోట్లు దలాల్ స్ట్రీట్‌లో రెండు ట్రేడింగ్ సెషన్లలో రూ.18.42 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.412.24 లక్షల కోట్ల(4.81 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే రూ.10.8 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది. -
ఇలా చేస్తే టారిఫ్ ఎఫెక్ట్ ఉండదు!
ఓ వైపు అమెరికా.. మరోవైపు చైనా.. నువ్వా నేనా అన్నట్లుగా సుంకాలను పెంచుకుంటూ పోతున్నాయి. ఈ విషయం ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు, రెండు దేశాలు ప్రవర్తిస్తున్నాయి. చైనా వస్తువులపై అమెరికా 145 శాతం వరకు సుంకాలు విధించడంతో.. చైనా కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా అమెరికాపై విధిస్తున్న సుంకాలను 125 శాతానికి పెంచింది.అమెరికా విధిస్తున్న సుంకాల భారీ నుంచి తప్పించుకోవడం ఎలా అని చాలామంది తలలు పట్టుకుంటున్నారు. దీనికి ఓ మార్గం కూడా ఉంది. సుంకాల భారీ నుంచి తప్పించుకోవాలంటే.. ఇక స్మగ్లింగ్ చేయాలేమో అనే మీకు రావొచ్చు. అలాంటి సాహసాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎలా తప్పించుకోవాలో క్లారిటీగా వెల్లడించే ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.చైనా వస్తువులను అమెరికాకు ఎగుమతి చేస్తే 145 శాతం సుంకాలను కట్టాల్సి ఉంటుంది. ఎగుమతి అంటేనే భారీ మొత్తం. కానీ చైనాలో వస్తువు కొని మనవెంట అమెరికాకు తెచ్చుకుంటే.. దానికి ప్రత్యేకంగా టారిఫ్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ టాప్ సీక్రెట్: నెట్టింట్లో వైరల్ఉదాహరణకు ఒక అమెరికన్.. చైనాలో పర్యటించేటప్పుడు తనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వాటిని తనతో పాటు అతని దేశానికి కూడా తీసుకెళ్లవచ్చు. ఇది పూర్తిగా లీగల్.. పర్సనల్ షాపింగ్ సర్వీస్ కిందికి వస్తుంది. అయితే ఎన్ని వస్తువులు కొనాలి?, ఎన్ని వస్తువులను తనతో పాటు తీసుకెళ్లవచ్చు అనే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని పాటిస్తే.. మీపై టారిఫ్స్ ప్రభావం ఉండదు. ఇది ఒక్క అమెరికన్ ప్రజలకు మాత్రమే కాదు.. ఈ ఫార్ములాతో మీరు ఏ దేశీయులైన.. ఇతర దేశాల్లో వస్తువులను సుంకాలతో పనిలేకుండా హ్యాపీగా కొనేయొచ్చు.China is now providing tariff advice. 🤣 pic.twitter.com/esNxGshMe6— James Wood 武杰士 (@commiepommie) April 13, 2025 -
2000 కంటైనర్లలో రొయ్యలు.. ఎక్కడకు వెళ్తున్నాయంటే..
అమెరికాకు రొయ్యలు సరఫరా చేసేందుకు భారత సీఫుడ్ ఎగుమతిదారులు సిద్ధమవుతున్నారు. అమెరికా ప్రతీకార సుంకాల విధింపునకు బ్రేక్ పడడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టారిఫ్‌లను 90 రోజులపాటు నిలిపేస్తున్నట్ల ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎగుమతిదారులకు ఉపశమనం కలిగించినట్లయింది. దాంతో సుమారు రెండు వేల కంటైనర్ల రొయ్యలు ఎగుమతికి సిద్ధంగా ఉన్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన పరస్పర సుంకాలను కొంతకాలంపాటు నిలిపేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. భారత్‌పై విధించిన 26 శాతం పరస్పర సుంకాన్ని నిలిపివేసి గతంలో ఉన్న 10 శాతాన్ని అమలు చేస్తుండడంతో ఎగుమతులు ఊపందుకున్నాయి. ప్రధానంగా భారత సీఫుడ్ ఎగుమతిదారులు 35,000-40,000 టన్నుల రొయ్యలను అమెరికాకు ఎగుమతి చేయడానికి సిద్ధమవుతున్నారని పరిశ్రమ అధికారులు సోమవారం తెలిపారు. సుంకాల భయాలతో నిలిపివేసిన ఎగుమతులను ప్రాసెస్ చేస్తున్నట్లు సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ కేఎన్ రాఘవన్ తెలిపారు. సుమారు 2,000 కంటైనర్ల రొయ్యలు ఇప్పుడు ఎగుమతికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.ఇదీ చదవండి: సుంకాల యుద్ధంలో విజేతలుండరుఅమెరికా దాటికి 145 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న చైనా మినహా అన్ని దేశాలపై ప్రతీకార టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపేశారు. దాంతో భారత్‌పై 10 శాతం సుంకాలు అమలవుతుండడంతో ప్రస్తుతం ఎగమతులు ఊపందుకున్నాయి. అమెరికాకు భారత రొయ్యల ఎగుమతులపై 17.7 శాతం కస్టమ్స్ సుంకం ఉండగా, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ 5.7 శాతం, యాంటీ డంపింగ్ డ్యూటీ 1.8 శాతంగా ఉంది. పరిమాణం, విలువ రెండింటిలోనూ యూఎస్‌కు భారతదేశం అతిపెద్ద రొయ్యల మార్కెట్‌గా ఉంది. సుంకాల భయాలున్నా ఆర్డర్లు తగ్గలేదని అసోసియేషన్ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 2.7 బిలియన్ డాలర్ల విలువైన రొయ్యలను అమెరికాకు ఎగుమతి చేసింది. -
విజేతలుండని యుద్ధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల చర్యలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇతర దేశాల సహకారం కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగ్నేయాసియాలో పర్యటనలో భాగంగా సోమవారం వియత్నాం వెళ్లిన ఆయన వాణిజ్య, సుంకాల యుద్ధంలో విజేతలుండరని వ్యాఖ్యానించారు.ప్రపంచంలోనే భారీగా ఎగుమతులు చేస్తున్న దేశాల సరసన ఉన్న చైనాకు ట్రంప్ సుంకాల ప్రభావం అధికంగా ఉంటుంది. తాజాగా ట్రంప్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి కొన్ని వస్తువులను సుంకాల నుంచి మినహాయించినప్పటికీ, రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాపై సుంకాలు తీవ్ర పరిణామాలను చూపుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. యూఎస్ చైనాపై 145% సుంకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో చైనా కూడా వెనక్కి తగ్గకుండా యూఎస్‌పై 125 శాతం సుంకాలు ప్రకటించింది.సూపర్ పవర్‌గా చైనాఈ నేపథ్యంలో ఆగ్నేయాసియాలోని వియత్నాంలో షీ జిన్‌పింగ్ పర్యటన ఆసక్తికరంగా మారింది. వియత్నాంపై కూడా యూఎస్ అధిక సుంకాలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ‘ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రపంచంపై అమలు చేస్తున్న విధానానికి విరుద్ధంగా బాధ్యతాయుతమైన సూపర్ పవర్‌గా చైనా అవతరిస్తుంది’ అని సింగపూర్‌కు చెందిన ఐఎస్ఈఏఎస్-యూసోఫ్ ఇషాక్ ఇన్స్టిట్యూట్ విజిటింగ్ ఫెలో గుయెన్ ఖాక్ గియాంగ్ అన్నారు.వాణిజ్య విధానాలు కాపాడుకోవాలి..ఎగుమతులపై అమెరికా వాణిజ్య విధానాల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసుకోవడానికి చైనా ఇతర దేశాల సహకారాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. వియత్నాం, చైనా అధికారిక మీడియాలో సంయుక్తంగా ప్రచురితమైన సంపాదకీయంలో షీ జిన్‌పింగ్ ‘వాణిజ్య యుద్ధం లేదా సుంకాల యుద్ధంలో విజేతలు ఉండరు’ అని రాశారు. ఇరు దేశాలు బహుళ వాణిజ్య వ్యవస్థను, స్థిరమైన ప్రపంచ పారిశ్రామిక, సరఫరా గొలుసులను కాపాడుకోవాలని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజుల పాటు వియత్నాంలోనే జిన్‌పింగ్ ఉండనున్నారు.ఇదీ చదవండి: మా దగ్గర ఉంది.. మీకు ఇస్తామండి..ఎలా తప్పించుకోవాలి..జిన్‌పింగ్ పర్యటనను టారిఫ్‌ల ప్రకటన కంటే ముందుగానే ప్లాన్ చేసినప్పటికీ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, అమెరికా మధ్య సుంకాల పోరు కారణంగా ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. జిన్‌పింగ్ వియత్నాం, మలేషియా, కంబోడియా పర్యటన ట్రంప్ నుంచి చైనా ఎలా తప్పించుకోగలుగుతుందనే అంశంపైనే సాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2013లో జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వియత్నాంలో కేవలం రెండుసార్లు మాత్రమే పర్యటించారు. 2023 డిసెంబర్లో చివరిసారిగా సందర్శించిన ఆయన వియత్నాంకు వెళ్లడం ఇది మూడోసారి. -
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
2025 ప్రారంభం నుంచి బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు గోల్డ్ రేటు 23 శాతం పెరిగింది. ఏప్రిల్ నెలలో మాత్రమే పసిడి ధర 5 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. శనివారం నాటికి బంగారం ధరలు గరిష్టంగా రూ. 95,670 వద్ద నిలిచాయి.అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి. ట్రాయ్ ఔన్సుకు $3,263 రికార్డు గరిష్ట స్థాయిని తాకిన తర్వాత కామెక్స్ గోల్డ్ 2.44 శాతం పెరిగి $3,254.90 వద్ద ముగిసింది. ఇప్పటి వరకు బంగారం ధరలు పెరుగుదల ఆల్ టైమ్ రికార్డ్ అని తెలుస్తోంది.బంగారం రేటు ఎందుకు పెరుగుతోందిఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్స్.. బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అనేక దేశాలపై విధించిన పరస్పర సుంకాలకు 90 రోజుల విరామం ప్రకటించగా.. చైనాపై సుంకాలను మాత్రం 125 శాతానికి పెంచారు. చైనా కూడా ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా.. అమెరికా వస్తువులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వృద్ధి చుట్టూ అనిశ్చితిని పెంచాయి. దీంతో బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.స్టాక్ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులకు గ్యారెంటీ లేదు. కాబట్టి బంగారం మీద పెట్టుబడి పెడితే.. అది సురక్షితమైన ఆస్తిగా భావించేవారు సంఖ్య గణనీయంగా పెరగడంతో.. ఎక్కువమంది బంగారం కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఇది గోల్డ్ రేటు పెరగడానికి దోహదపడుతున్నాయి.ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. 200 మంది ఉద్యోగులు బయటకుబంగారం ధరలు తగ్గుతాయా?వాణిజ్య యుద్ధం, డాలర్ విలువ తగ్గడం, వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ట్రాయ్ ఔన్సుకు $3,300 నుంచి $3,500 వరకు పెరుగుతాయని చెబుతున్నారు.భారతదేశంలో 2025 చివరి నాటికి 10 గ్రాముల బంగారం రూ. 97,000 కు చేరుకుంటుందని HDFC సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ 'అనుజ్ గుప్తా' అన్నారు. ధరలు పెరుగుదల ఇలాగె కొనసాగే అవకాశం ఉందని.. ఎల్కేపీ సెక్యూరిటీస్ , కమోడిటీ అండ్ కరెన్సీ, వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది కూడా వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే గోల్డ్ రేటు ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలు లేదని స్పష్టంగా అర్థమవుతోంది. -
టారిఫ్‌లకు బ్రేక్‌తో భారీ ఊరట
న్యూఢిల్లీ: ప్రతీకార టారిఫ్‌లను 90 రోజుల పాటు వాయిదా వేయాలన్న అమెరికా నిర్ణయంతో దేశీ ఎగుమతిదార్లకు భారీగా ఊరట లభించింది. దీనితో భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) చర్చల పురోగతికి మరికాస్త వెసులుబాటు లభిస్తుందని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. ఒప్పందంపై దౌత్యపరంగా సంప్రదింపులు జరపడం, చర్చలను వేగవంతం చేయడం ద్వారా టారిఫ్‌లను ఎదుర్కొనేందుకు భారత్‌కు వీలవుతుందని వివరించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకునే దిశగా ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తొలి విడత చర్చలు ఈ ఏడాది సెపె్టంబర్–అక్టోబర్‌లో ముగిసే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికాతో సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో దేశీ పరిశ్రమలకు రిసు్కలు ఉన్నందున దీన్ని కుదుర్చుకునే విషయంలో భారత్ పునరాలోచన చేయాలని భారత్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) సూచించింది. ఒప్పందం ప్రకారం భారత్‌లో రైతులకు కనీస మద్దతు ధరను తొలగించడం, జన్యుపరమైన మార్పులు చేసిన ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవడం, వ్యవసాయ టారిఫ్‌లను తగ్గించడం మొదలైన గొంతెమ్మ కోర్కెలన్నీ అమెరికా కోరుతోందని పేర్కొంది. ఇలాంటివి అమలు చేస్తే రైతుల ఆదాయాలకు, ఆ హార భద్రతకు, జీవవైవిధ్యానికి, చిన్న రిటైలర్ల మనుగడకు రిస్కులు తప్పవని అభిప్రాయపడింది. కార్లులాంటివి మినహాయించి 90% దిగుమతులపై ఇరువైపులా సున్నా స్థాయి టారిఫ్‌లతో డీల్‌ను భారత్ ప్రతిపాదించవచ్చని పేర్కొంది. -
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రపంచ వాణిజ్య డైనమిక్స్ వేగంగా మారుతున్నాయని హెచ్చరించారు. ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద ఎగుమతిదారుల ఇన్ఫోగ్రాఫిక్ ర్యాంకింగ్స్‌ను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. దాంతోపాటు బాబ్ డైలాన్ రాసిన పాటలోని సారాంశాన్ని కూడా పోస్ట్ చేశారు. ప్రపంచంలోని విభిన్న దేశాల ఎగుమతుల ఆధిపత్యం ఎక్కువ కాలం ఉండకపోవచ్చని సూచించారు.‘ఈ చార్ట్ చూడండి. ఎందుకంటే ఈ క్రమం మీరు ఊహించిన దానికంటే వేగంగా మారబోతోంది. ఇప్పుడు ఎగుమతుల్లో ముందువరుసలో ఉన్న కొన్ని దేశాలు కొంతకాలానికి తర్వాతి స్థానాలకు పడిపోతాయి’ అని తెలియజేస్తూ బాబ్డైలాన్ గీతాన్ని కోట్ చేశారు. ఆయన షేర్ చేసిన ఛార్ట్‌లో ఎగుమతుల పరంగా చైనా (3.51 ట్రిలియన్ డాలర్లు), యునైటెడ్ స్టేట్స్ (3.05 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (2.10 ట్రిలియన్ డాలర్లు) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. తరువాత జపాన్, యూకే, ఫ్రాన్స్, భారతదేశం వంటి దేశాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సాహసోపేతమైన టారిఫ్ నిర్ణయాల కారణంగా ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమదైన రీతిలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: అమెరికా దెబ్బకు చైనా ఔట్?Take a good look at this chart. Because the order is going to change faster than you may imagine. “The line it is drawnThe curse it is castThe slow one nowWill later be fastAs the present nowWill later be pastThe order is rapidly fadin'And the first one nowWill later… pic.twitter.com/FhO8r0vlZ5— anand mahindra (@anandmahindra) April 11, 2025ప్రపంచ ఎగుమతులకు సంబంధించి మెకానికల్ ఇంజినీరింగ్ వరల్డ్ రూపొందించిన ఛార్ట్‌ను మహీంద్రా షేర్ చేసిన క్రమంలో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ప్రపంచంలోని టాప్ 10 ఎగుమతిదారులను ప్రదర్శించే జాబితాలో భారతదేశం ఉనికి పట్ల కొందరు ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది దేశం కొన్ని సంవత్సరాలలో రెండో లేదా మూడో స్థానానికి చేరుకోవచ్చని సూచించారు. -
అమెరికా దెబ్బకు చైనా ఔట్?
అమెరికా, చైనాల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, వరుస ప్రతీకార సుంకాలు ప్రపంచ వాణిజ్య ముఖచిత్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా వస్తువులపై అమెరికా 145 శాతం వరకు సుంకాలు విధించడంతో ఆ దేశ ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సుంకాలు చైనా ఎగుమతులను ఎలా ప్రభావితం చేస్తాయో, అక్కడి ఎగుమతిదారులు అనుసరిస్తున్న వ్యూహాలేమిటో తెలుసుకుందాం.145 శాతం వరకు సుంకాలుచైనా ఆర్థిక వ్యవస్థ చాలా కాలంగా ఎగుమతులపై ఆధారపడి ఉంది. చైనా అతిపెద్ద మార్కెట్ల్లో యూఎస్ కీలకం. 2024లో యూఎస్‌కు చైనా సుమారు 440 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. ఇది ఆ దేశం మొత్తం ఎగుమతుల్లో 14%, జీడీపీలో సుమారు 3%గా ఉంది. చైనా దిగుమతులను కట్టడి చేయడమే లక్ష్యంగా ఇటీవల వివిధ వస్తువులపై 10 శాతం నుంచి 145 శాతానికి అమెరికా సుంకాలు పెంచింది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, మెషినరీ సహా పలు రకాల ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకుంది.ఎగుమతులపై తీవ్ర ప్రభావంసుంకాల తక్షణ ప్రభావం కింద చైనా వస్తువులకు అమెరికాలో డిమాండ్ గణనీయంగా తగ్గింది. టారిఫ్‌ల పెంపు వల్ల వచ్చే రెండేళ్లలో అమెరికాకు చైనా ఎగుమతులు 80 శాతం వరకు పడిపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు, చైనా నుంచి యూఎస్ దిగుమతుల్లో 9% ఉన్న స్మార్ట్ఫోన్లు వంటి ఉత్పత్తులు తీవ్రమైన ధరల పెరుగుదలను ఎదుర్కొంటాయి. దాంతో వాటిని మార్కెట్ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. దాంతోపాటు మిలియన్ల మంది చైనా కార్మికుల జీవనోపాధికి ముప్పు కలిగిస్తుంది. చైనాలో సుమారు రెండు కోట్ల ఉద్యోగాలు యూఎస్ సంబంధిత ఎగుమతులపై ఆధారపడి ఉన్నాయి.ఆర్థిక పరిణామాలుఅమెరికా సుంకాలు చైనా ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. లాభాల మార్జిన్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపేశాయి. టెక్స్టైల్ కంపెనీలు యూఎస్‌కు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. సుంకాల ప్రభావం వల్ల లాభాలు భారీగా క్షీణించాయని పేర్కొన్నాయి. మరోవైపు వియత్నాం వంటి దేశాలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన తయారీ రంగాన్ని బలహీనపరుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో కుదేలైన పారిశ్రామికోత్పత్తి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్డర్లు తగ్గడంతో కొన్ని కర్మాగారాలు పరికరాలను విక్రయిస్తున్నాయి.తగ్గిన జీడీపీ అంచనాఅమెరికా సుంకాలు పెంపు, అంతర్జాతీయంగా డిమాండ్ మందగించడం వంటి కారణాలతో గోల్డ్ మన్ శాక్స్ 2025లో చైనా జీడీపీ వృద్ధి అంచనాను 4 శాతానికి సవరించింది. చైనా జీడీపీలో అమెరికాకు చేసే ఎగుమతుల వాటా తక్కువే అయినప్పటికీ, తగ్గిన పెట్టుబడులు, వినియోగదారుల సామర్థ్యం వల్ల మరింత ఆర్థిక ఒత్తిడి ఎందురవుతుంది.చైనా ప్రతిస్పందనచైనా యూఎస్ సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి చైనా బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఆగ్నేయాసియా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఎగుమతిదారులు అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. 2019 నుంచి ఆగ్నేయాసియా చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. తాజా సుంకాలతో ఈ వాణిజ్య పరిమాణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు, టెక్స్టైల్ సంస్థలు తక్కువ వాణిజ్య అవరోధాలు ఉన్న మార్కెట్లకు తమ ఎగుమతులను మళ్లిస్తున్నాయి. అయినప్పటికీ ఈ మార్కెట్లు తరచుగా తక్కువ మార్జిన్లను అందిస్తాయి.ఇదీ చదవండి: థియేటర్ల పంట పండుతుందిలా..యూఎస్‌పై చైనా రివర్స్ సుంకాలుఅమెరికా వస్తువులపై చైనా సుంకాలను 125 శాతానికి పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇది సోయాబీన్స్, పంది మాంసం వంటి వాటితోపాటు ఇంధనాలు, యంత్రాలు లక్ష్యంగా చేసుకుంది. యూఎస్ ఉత్పత్తిదారులపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్దేశంతో ఈమేరకు చైనా ప్రతీకార సుంకాలను విధించింది. -
టారిఫ్‌ల ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం
అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో రక్షణాత్మక పెట్టుబడి సాధనం బంగారానికి భారీ డిమాండ్ నెలకొంది. కామెక్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం 100 డాలర్లు (3.5%) పైగా పెరిగి 3,180 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లలో దూకుడు కారణంగా దేశీయంగా నేడు స్పాట్ మార్కెట్లో పసిడి పరుగులు పెట్టే వీలుందని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎంసీఎక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న కాంట్రాక్ట్ ధర గురువారం రాత్రి రూ. 2,356 ఎగసి రూ.92,160 వద్ద కదలాడుతోంది. -
ధ్వంసరచన
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూసిన వాణిజ్య సుంకాల కత్తి పోట్లకు ఇండియా సహా ప్రపంచ స్టాక్ మార్కెట్స్ నెత్తురోడాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అకస్మాత్తుగా అనిశ్చితి ఊబిలో కూరుకుపోయింది. చైనా, కెనడా వెంటవెంటనే తొలివిడత ప్రతీకార సుంకాలను ప్రకటించాయి. దీంతో ట్రేడ్ వార్ అనివార్యం అనిపిస్తోంది. ఈ యుద్ధరంగంలో దూకేందుకు తామూ సిద్ధమేనంటూ యూరోపియన్ యూనియన్ హెచ్చరిక జారీ చేసింది. ఇతర దేశాలు అమెరికా నూతన విధానం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. ఈ వాణిజ్య ఉద్రిక్తతల తక్షణ ప్రభావంతో నాస్డాక్ ఇండెక్స్ కుప్పకూలింది. ఇతర ఏషియన్ సూచీలూ పతనమయ్యాయి. చమురు ధర బ్యారెల్ 64 డాలర్లకు దిగివచ్చింది.ఆభరణాలకు దెబ్బ – వస్త్రాలకు మేలుఇండియా ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. దీనిక్కారణం, ఇప్పటికే ద్వైపా క్షిక వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు ప్రారంభమై ఉండటమే. గతంలో ప్రపంచ వాణిజ్యసంస్థ (డబ్ల్యూటీవో) వేదికపై ధనిక దేశాల ఒత్తి ళ్లను అధిగమించి ఇండియా వ్యవసాయ రంగం కోసం రాయితీలను సాధించింది. ఇప్పుడూ అమె రికాతో విజయవంతంగా ఒప్పందం కుదురుతుందని నిపుణుల అంచనా. అలాగే, ఇక్కడ తయారు కాని వస్తువులపై విధించే నిర్హేతుకమైన అధిక సుంకాలకు ఒప్పందంలో అంగీకరించవచ్చు. బదులుగా, ప్రాసెస్డ్ ఫుడ్స్, సాగర ఉత్పత్తుల ఎగు మతిపై నాన్–ట్యారిఫ్ ఆంక్షలు సరళీకరించాలని కోరుతుంది. స్థానిక సర్వర్లలో డేటా నిల్వ (డేటా లోకలైజేషన్), మేధాసంపత్తి హక్కులు వంటి అంశాలు అంత తేలిగ్గా పరిష్కారం కావు. రాజీ ఫార్ములాలే శరణ్యం అవుతాయి. ఇండియా వాణిజ్యపరంగా తన పరిశ్రమ లను, వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు స్వీయ రక్షణ విధానాలను అవలంబిస్తోందని ట్రంప్ పదే పదే విమర్శిస్తున్నప్పటికీ, ఆయన హయాంలో ఉభయ దేశాల నడుమ వ్యూహాత్మక సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. రక్షణ బంధం బలపరచుకోడానికి రెండు దేశాలూ సిద్ధంగా ఉన్నాయి. ఏమైనప్పటికీ, కొత్త సుంకాలు కొన్ని భారతీయ పరిశ్రమలకు స్వల్ప కాలంలో అశని పాతంగా పరిణమిస్తాయి. వజ్రాలు – ఆభ రణాల పరిశ్రమనే తీసుకుందాం. ఇది 2023–24 ఆర్థిక సంవత్సరంలో 33 బిలియన్ డాలర్ల ఎగు మతులు చేయగా, అందులో మూడో వంతు ఒక్క అమెరికాకే సరఫరా అయ్యాయి. ఈ పరిశ్రమ ప్రధానంగా చిన్న, మధ్య తరహా సంస్థలతో కూడుకుని ఉంది. దాదాపు 50 లక్షల మంది (పూర్తి నైపుణ్యం ఉన్న, ఒకమాదిరి నైపుణ్యం ఉన్న) కార్మి కులు జీవనోపాధి కోసం వీటిపై ఆధారపడు తున్నారు. కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన సంక్షోభ కాలంలో వీరు ఉపాధి కోల్పోయి గ్రామా లకు తరలి పోయారు. ఇప్పుడు మళ్ళీ అమెరికా ఆర్డర్లు తగ్గిపోయి అలాంటి దుఃస్థితి పునరావృతం అవుతుందన్న భయాలు వ్యాపిస్తున్నాయి.అయితే, అమెరికా వాణిజ్య సుంకాల పెంపు వల్ల ఇండియాకు అంతా ప్రతికూలమే అనుకో నక్కర్లేదు. మారిన పరిస్థితుల్లో ఇండియా దుస్తుల ఎగుమతి ధరలు పోటీ దేశాల్లో కంటే తక్కువగా ఉంటాయని వస్త్ర ఉత్పత్తుల కేంద్రమైన తిరుప్పూరు (తమిళనాడు) నుంచి వార్తలు వస్తున్నాయి. దీంతో కొనుగోలు దారులు ఇప్పటికే ఇండియా మీద దృష్టి సారించారు. కాబట్టి, భారతీయ వస్త్ర ఉత్పత్తులకు ఆర్డర్లు భారీగా పెరిగే వీలుంది. అమెరికాకే నష్టంసుంకాల పెంపు సంక్షోభం ఫలితంగా ఇతర ప్రపంచ దేశాల కంటే యూఎస్ ఆర్థిక వ్యవస్థే అధికంగా నష్టపోతుంది. అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన తీరు రానున్న దుర్భర స్థితికి సంకేతం. అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందని ఇంతకు ముందునుంచే అంటున్నారు. సుంకాల పెంపు వల్ల ఈ రిస్కు అనూహ్యంగా పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. జేపీ మోర్గాన్ ప్రకారం, ‘అమెరికా విచ్ఛిన్నకర రాజకీయాల’ ఫలితంగా అక్కడ ఆర్థిక మాంద్యం రిస్కు 40 నుంచి 60 శాతానికి పెరిగింది. కొత్త సుంకాల వల్ల యూఎస్ ఆర్థిక వ్యవస్థపై 700 బిలియన్ డాలర్ల భారం పడుతుంది. ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ లెక్కలు చైనా 34 శాతం ప్రతీకార సుంకాలు విధించక ముందు వేసినవి! ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కూరుకుపోతే అది ఇండియా సహా అన్ని దేశా లకూ దుర్వార్తే! దీంతో, దేశం గడచిన సంవత్సరాల్లో సాధించిన వృద్ధి తగ్గిపోతుంది. 2025–26కి ఇండియా వృద్ధిరేటు 6.3 నుంచి 6.1కి క్షీణిస్తుందని ‘గోల్డ్‌మన్ సాక్స్’ ఇప్పటికే అంచనాలు సవరించింది.అంతర్జాతీయంగా వాణిజ్య సుంకాలను హేతుబద్ధీకరించడానికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసి నప్పటి నుంచీ ప్రయత్నాలు మొదలై, దశాబ్దాల పాటు సంప్రతింపులు, చర్చలు జరిగి ఎట్టకేలకు ఒక బహుళ పక్ష వేదిక ఏర్పడింది. ఈ ప్రపంచ ఆర్థిక పాలనలో పేద దేశాల మాటకు విలువ కల్పించిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఇప్పుడు విధ్వంసమైపోతోంది. ట్రేడ్ వార్ ప్రభావం ఇండియాపై అనుకున్న దానికంటే తీవ్రంగానే ఉంటుంది. మరి దీనికి పరి ష్కారం ఏమిటి? యూరోపియన్ యూనియన్ వంటి బడా వాణిజ్య భాగస్వాములతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అదే సమయంలో, ప్రతీకార సుంకాల నేపథ్యంలో ఏ దేశాలు ఎగుమతులకు అనువైనవో గుర్తించాలి. ఈ ప్రపంచ వాణిజ్య యుద్ధాల్లో అంతిమంగా ఇండియా నష్టపోతుందా, ప్రయోజనం పొందుతుందా అనేది ఇప్పుడప్పుడే తేలదు. రానున్న రోజుల్లో ఈ గొడవ సద్దుమణిగిన తర్వాతే వాస్తవిక అంచనా సాధ్యమవుతుంది.సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్ ‘ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఫార్మాకు ట్రంప్ భయం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయాలు రాష్ట్రంలో ఫార్మా పరిశ్రమను వణికిస్తున్నాయి. ఫార్మా ఉత్పత్తులపైనా భారీగా సుంకాలు విధిస్తామన్న ట్రంప్ ప్రకటనతో ఈ పరిశ్రమ వర్గాల్లో కలకలం రేగింది. రాష్ట్రంలో అత్యధికంగా ఫార్మా కంపెనీలు సంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలకు చెందిన యూనిట్లు ఇక్కడ ఉత్పత్తులు కొనసాగిస్తున్నాయి. బల్క్ డ్రగ్ పరిశ్రమలు కూడా జిల్లాలో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోనే సుమారు 350 పైచిలుకు ఫార్మా, బల్‌్కడ్రగ్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల ఉత్పత్తులు వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. సుమారు 80 శాతం ఉత్పత్తులను అమెరికానే దిగుమతి చేసుకుంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఫార్మా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించడంతో ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని, తద్వారా పరిశ్రమల్లో పనిచేసే సుమారు 20 వేల మంది కార్మికులు, ఉద్యోగుల ఉపాధి దెబ్బ తింటుందని అంచనా వేస్తున్నారు. అయితే చైనా వంటి దేశాలతో పోల్చితే మనదేశ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు తక్కువేననే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సుంకాలు పెరిగితే లాభాలు తగ్గుతాయని ఓ కంపెనీలోని హెచ్ఆర్ విభాగం ఉన్నతాధికారి తెలిపారు. మల్టీనేషనల్ కంపెనీల యూనిట్లు సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మల్టీనేషనల్ కంపెనీల యూనిట్లు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా పాశమైలారం, ఖాజీపల్లి వంటి పారిశ్రామిక వాడల్లో ఎక్కువగా ఈ పరిశ్రమలు ఉన్నాయి. హానర్, గ్లెన్‌మార్క్, గ్రాన్యూల్, న్యూలాండ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెటిరో, ఎంఎస్ఎన్, దివీస్, సాయిల్యాబ్ సైన్సెస్, జీవీకే వంటి కంపెనీల యూనిట్లు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో ప్రధానంగా బీపీ, డయాబెటిక్, గుండె జబ్బులు, గ్యాస్ట్రో, మైగ్రేన్, క్యాన్సర్, హెచ్ఐవీ రోగాలకు సంబంధించిన ఔషధాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ మందులను దిగుమతి చేసుకునే దేశాల్లో అమెరికానే ముందు వరుసలో ఉంది. రూ.22 వేల కోట్ల ఎగుమతులు ఒక్క సంగారెడ్డి జిల్లా నుంచే వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్న ఫార్మా వస్తు, సేవల విలువ సుమారు రూ.22 వేల కోట్లు ఉంటుందని అంచనా. 2023–24లో రూ.21,934 కోట్ల విలువైన ఎగుమతులు జరిపినట్లు రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 87 శాతం ఫార్మా ఉత్పత్తులే. ఈ ఫార్మా ఉత్పత్తులను 70 శాతానికి పైగా అమెరికానే దిగుమతి చేసుకుంటుందని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. సంగారెడ్డి తర్వాత మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో ఫార్మా పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఈ జిల్లా నుంచి 2023–24లో వివిధ దేశాలకు రూ.25,444 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇందులో 60 శాతం ఫార్మా ఉత్పత్తులే. అవి కూడా అమెరికానే ఎక్కువగా దిగుమతి చేసుకుందని సమాచారం. -
టారిఫ్ ‘రిలీఫ్’ ర్యాలీ..!
న్యూఢిల్లీ: చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాలు 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. బుధవారం రాత్రి అమెరికా నాస్డాక్ ఇండెక్స్ 12.16%, ఎస్అండ్పీ సూచీ 9.52%, డోజోన్స్ ఇండెక్స్ 8% లాభపడ్డాయి. యూఎస్ నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా, యూరప్ మార్కెట్లు గురువారం రాణించాయి. జపాన్ నికాయ్ 9%, దక్షిణ కొరియా కోస్పీ 7%, సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్ 5%, హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్ 2%, చైనా షాంఘై ఒకశాతం పెరిగాయి. యూరప్‌లో జర్మనీ డాక్స్ 5%, ఫ్రాన్స్ సీఏసీ 5%, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ నాలుగు శాతం పెరిగాయి. కాగా బుధవారం భారీగా ర్యాలీ చేసిన అమెరికా మార్కెట్లో గురువారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో అమెరికా మార్కెట్లు మళ్లీ భారీ గా పడ్డాయి. నాస్డాక్ 5% క్షీణించి 16,292 వద్ద, డోజోన్స్ 3% పడి 39,184 వద్ద, ఎస్అండ్పీ 4% నష్టంతో 5,243 వద్ద ట్రేడవుతోంది. భారత మార్కెట్ భారీ గ్యాప్‌అప్..? అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతల కారణంగా శుక్రవారం దేశీయ మార్కెట్ భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభం కావచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నాయి. ఇందుకు సంకేతంగా దలాల్ స్ట్రీట్‌ను ప్రతిబింబించే గిఫ్ట్ నిఫ్టీ 3% (680 పాయింట్లు) పెరిగింది. శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా భారత మార్కెట్ గురువారం పనిచేయలేదు. భారత్‌తో సహా 60 దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ భారీగా పన్నులు వడ్డించారు. దీంతో అంతర్జాతీయంగా ప్రపంచ వాణిజ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. నాటి (ఏప్రిల్ 2)నుంచి సెన్సెక్స్ 2,770 పాయింట్లు(3.61%), నిఫ్టీ 933 పాయింట్లు(4%) క్షీణించాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.19.15 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయి రూ.393.82 లక్షల కోట్లకు దిగివచి్చంది.మన మార్కెట్లోనూ దూకుడు...! నిఫ్టీ సుమారు 700 పాయింట్లు లాభంతో ట్రేడింగ్ ప్రారంభించవచ్చు. షార్ట్ కవరింగ్‌తో మార్కెట్ భారీగా పెరిగే అవకాశం ఉంది. విస్తృత స్థాయిలో కొనుగోళ్ల పర్వం కొనసాగొచ్చు. ఐటీ షేర్లు బౌన్స్‌బ్యాక్ అయ్యే వీలుంది. ఫార్మా షేర్లు డిమాండ్ లభించవచ్చు. లార్జ్ క్యాప్ బ్యాంకులు, ఫైనాన్షియల్స్ షేర్లు ర్యాలీ చేయొచ్చు. అమెరికా–చైనా ట్రేడ్ వార్ ముదరడంతో విదేశీ ఇన్వెస్టర్లు త్వరలో భారత ఈక్విటీల కొనుగోళ్లకు ఆసక్తి చూపొచ్చు. – వీకే విజయ్‌కుమార్, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ స్ట్రాటజిస్ట్ -
మూర్ఖత్వం
1. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ మద్దతుదారులలో చాలామంది, బహుశా ట్రంప్ కూడా, అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలే అధిక సుంకాలను చెల్లిస్తాయని నమ్ముతున్నట్లుంది. వాస్తవం ఏమిటంటే, సుంకాలను దిగుమతి దారులు చెల్లిస్తారు. వారు ఆ ఖర్చును వినియోగదారులకు, ఈ సందర్భంలో, అమెరికన్ ప్రజలకు బదిలీ చేస్తారు.2. సుంకాల విధింపు అనేది చర్చల వ్యూహంలో భాగమా? ట్రంప్ మొదటి పదవీకాలం విషయంలో అది నిజమే కావచ్చు. ఇప్పుడు అలా చేయడం కష్ట తరమైన ఆలోచన. కొన్ని దేశాలు తమ సుంకాలను తగ్గించుకోవచ్చు. కానీ చాలా దేశాలు ప్రతీకార సుంకాలను విధిస్తున్నాయి. తన మద్దతుదారులకు తాను బలంగా కనిపించాలని ట్రంప్ అనుకుంటున్నట్లుగానే, ఇతర దేశాల నాయకులు కూడా బలహీనంగా కనిపించడానికి ఇష్టపడకపోవచ్చు.3. ట్రంప్ మాంద్యాన్ని పెంచి పోషించడానికీ, తద్వారా అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ను వడ్డీ రేట్లను తగ్గించమని బలవంతం చేయడానికీ ప్రయత్నిస్తు న్నారని కూడా చెబుతున్నారు. తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వృద్ధిని నడిపిస్తాయి. అలాగే 2026 మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీకి సహాయపడ తాయి. అయితే, ఆర్థిక వ్యవస్థ కారు లాంటిది కాదు. కారు వేగాన్ని యాక్సిలరేటర్తోనూ, బ్రేక్ తోనూ సులభంగా నియంత్రించవచ్చు. ఇది సంక్లి ష్టమైన వ్యవస్థ. అమెరికా సుంకాలు అలాగే ఉంటే, అక్కడ రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుంది, వడ్డీ రేటు కోత అవకాశాలను తగ్గిస్తుంది. ఇంకొకటి: ప్రజలు పేదరికాన్ని అనుభూతి చెందుతూ సాధా రణంగా వారు చేసే దానికంటే తక్కువ ఖర్చు చేయడం వల్ల, వినియోగదారుల వ్యయం, ఆర్థిక వృద్ధి మందగిస్తాయి.4. దేశాలేవీ గతంలో సుంకాలను వేయలేదని దీని అర్థం కాదు. అవి వాటిని అస్త్రాలుగా వాడాయి. కానీ సార్వత్రిక సుంకాలు సాధారణంగా బలహీనంగా ఉండే ఆర్థిక ఫలితాలకు దారితీస్తాయి. 1930 జూన్‌లో అమెరికా ఆమోదించిన ట్యారిఫ్ చట్టం (లేదా స్మూట్–హాలీ చట్టం), 1929లో ప్రారంభ మైన మహా మాంద్యం తర్వాత దాని ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ఉద్దేశించబడింది. రక్షణ వాద ప్రభంజన కాలంలో ఈ చట్టం 20,000 పారి శ్రామిక, వ్యవసాయ వస్తువులపై సుంకాలను రికార్డు స్థాయికి పెంచింది. ఇతర దేశాలు తమ సొంత సుంకాలతో స్పందించాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీసి, మాంద్యాన్ని పొడిగించింది. దేశాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ఖర్చులతో సిద్ధమై, పోరాడటం ప్రారంభించిన తర్వాత పరిస్థితి మారింది. నాటి ఈ పాఠాన్ని అమెరికా పాలనాయంత్రాంగం మరచిపోయింది. 5. పరస్పర సుంకాల రేట్లను చాలా మోటు సూత్రాన్ని ఉపయోగించి నిర్ణయించినట్లు అనిపి స్తుంది. భారతదేశం విషయంలో, ఈ సుంకం 26 శాతం వేశారు. 2024లో, అమెరికా భారతదేశంతో 45.7 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య లోటును కలిగి ఉంది. అంటే భారతదేశం నుండి అమెరికా వస్తువుల దిగుమతులు భారతదేశానికి దాని వస్తువుల ఎగుమతుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఇది సూచిస్తుంది. భారతదేశం నుండి అమెరికా సరుకుల దిగుమతులు 87.4 బిలియన్ డాలర్లు. ఈ 87.4 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతుల్లో 45.7 బిలియన్ డాలర్ల అమెరికా లోటు 52 శాతానికి వస్తుంది. ఈ రేటును సగానికి తగ్గించినప్పుడు, 26 శాతం అవుతుంది.ఇక్కడ బహుళ సమస్యలు ఉన్నాయి. సేవల వాణిజ్యాన్ని పరిగణించలేదు. కరెన్సీ తారుమారు, వాణిజ్యేతర అడ్డంకులను పరిగణనలోకి తీసుకోలేదు. ఒక దేశం దాని సుంకాలను తగ్గించాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆ దేశంతో అమెరికా వాణిజ్య లోటు తగ్గకపోవచ్చు. ఎందుకంటే ఆ దేశానికి అమెరికా మరిన్ని ఎగుమతి చేయవలసి ఉంటుంది. మరిన్ని ఎగుమతి చేయడం అంటే తక్కువ సుంకాల రేటు గురించి మాత్రమే కాదు. అమెరికా ముందుగా వస్తువులను ఉత్పత్తి చేయాలి. అది కూడా ఇతర దేశాలకు ఆసక్తి కలిగించే ధరకు ఉత్పత్తి చేయాలి.తనకు తెలియదని తెలియదు!6. ట్రంప్ ఇలా సుంకాలు వేస్తున్నారంటే, తాను దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించే ఉంటారని నమ్మే ఒక ఆలోచనా విధానం కూడా ఉంది. ఇది మన ముందున్న అతిపెద్ద ప్రమాదాన్ని వెల్లడిస్తుంది: ట్రంప్‌కు తనకు తెలియనిది తెలియదని తెలీకపోవచ్చు. ఆయన అందరి దృష్టీ తన వైపు ఉండటాన్ని ఇష్టపడు తున్నట్లు, తనను తాను నిర్ణయాత్మక వ్యక్తిగా చూపించుకుంటున్నట్లు అనిపిస్తుంది.7. విధించిన ఈ సుంకాలు దేశీయ మార్కెట్ కోసం అమెరికాలోనే ఉత్పత్తి చేయమని కంపెనీలపై ఒత్తిడి తెస్తాయనే నమ్మకాన్ని ట్రంప్ మాటలు సూచిస్తున్నాయి. కానీ అది అంత సులభం కాదు.ఎందుకంటే అమెరికాలో ఉత్పత్తి చేయడం ఖరీదైన ప్రతిపాదన కావచ్చు. అసలు అందుకే కంపెనీలు మొదటగా బయటకు వెళ్లాయి. ఇప్పుడు కంపెనీల సరఫరా గొలుసులు చాలా పరిణామం చెందాయి. ఒక ఉత్పత్తి దాని తయారీ ప్రక్రియలో అనేకసార్లు అమెరికా సరిహద్దులను దాటవచ్చు. అందుకే కంపె నీలు ట్రంప్ రెండవ పదవీ కాలం ముగిసేదాకా వేచి ఉండాలని నిర్ణయించుకునే అవకాశం కూడా ఉంది.8. ట్రంప్ ఈ సుంకాల విధింపు వ్యూహాన్ని ద్విగిణీకృతం చేసినట్లయితే, అది దేశాలను అమెరికా నుండి మరింత దూరం చేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికన్ డాలర్ కేంద్రంగా ఉద్భవించిన ప్రపంచ క్రమాన్ని అది చెదరగొడుతుంది.ఇప్పుడు దానికి మరొక వివరణాత్మక వ్యాసం అవసరం. కానీ ఒకే వాక్యంలో చెప్పాలంటే, గ్రాహమ్ గ్రీన్ 1978లో ప్రచురించిన ‘ది హ్యూమన్ ఫ్యాక్టర్’ నవలలో ఇలా రాశాడు: ‘మనకు చైనీయులు అవసరమయ్యే రోజు రావచ్చు’.వ్యాసకర్త ఆర్థిక అంశాల వ్యాఖ్యత, రచయిత ‘ (‘ద మింట్’ సౌజన్యంతో) -
తొందరపాటు లేదు.. అమెరికాతో ఒప్పందంపై పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల ఎగుమతులు 820 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6 శాతం పెరిగినట్లు తెలిపింది. 2023 - 24లో ఎగుమతులు 778 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం.. 2024–25 ఏప్రిల్ - ఫిబ్రవరి మధ్య కాలంలో ఉత్పత్తుల ఎగుమతులు 395.38 బిలియన్ డాలర్ల నుంచి 395.63 బిలియన్ డాలర్లుకు చేరాయి. అలాగే సర్వీసుల ఎగుమతులు 311.05 బిలియన్ డాలర్ల నుంచి 354.90 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఎగుమతులు, దిగుమతుల పూర్తి వివరాలను వాణిజ్య శాఖ ఏప్రిల్ 15న విడుదల చేయనుంది.పరిశ్రమకు మంత్రి గోయల్ భరోసా..అమెరికా టారిఫ్‌ల విధింపు నేపథ్యంలో ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, పరిశ్రమ వర్గాలతో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితుల్లో ఇటీవల తలెత్తిన సవాళ్లను అధిగమించడంలో ఎగుమతి సంస్థలకు తోడ్పాటు అందించేందుకు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి భరోసా ఇచ్చినట్లు వాణిజ్య శాఖ తెలిపింది.ఎర్ర సముద్రం సంక్షోభం, ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తతలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, కొన్ని సంపన్న ఎకానమీల్లో వృద్ధి నెమ్మదించడం తదితర సవాళ్లు నెలకొన్నప్పటికీ ఎగుమతులు వృద్ధి చెందడం సానుకూలాంశమని ఎగుమతిదారులు, పరిశ్రమను మంత్రి అభినందించారు. వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహించే ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు ఈ సమావేశంలో తమ అభిప్రాయాలు, అంచనాలను తెలిపాయి. కష్టకాలంలో ఎగుమతి సంస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వం క్రియాశీలక చర్యలు తీసుకోవాలని కోరాయి.అమెరికాతో ఒప్పందంపై కసరత్తు..అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం విషయంలో సమతుల్యత సాధించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి చెప్పారు. దేశానికి ప్రయోజనం కలిగే విధంగా సరైన ఫలితాలను రాబట్టేందుకు ప్రభుత్వం ’వేగంగా’ పనిచేస్తోందని, ’అనవసర తొందరపాటు’ చర్యలు తీసుకోవడం లేదని మంత్రి పేర్కొన్నారు. టారిఫ్‌లపై ఇతర దేశాలు వివిధ రకాలుగా స్పందిస్తున్నాయని ఆయన చెప్పారు. ‘విశ్వసనీయమైన భాగస్వామిగా భారత్ ఎదిగింది.ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో భారత్ పెద్ద సంస్థలను ఆకర్షించే స్థితిలో ఉంది. కాబట్టి తయారీని పెంచుకునేందుకు, మరిన్ని ఉద్యోగాలను కల్పించేందుకు మనకు అవకాశాలు ఉన్నాయి‘ అని మంత్రి వివరించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని భారత్, అమెరికా నిర్దేశించుకున్నాయి. ఆ దిశగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కసరత్తు చేస్తున్నాయి. చర్చల తొలి దశ ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్‌లో ముగుస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 191 బిలియన్ డాలర్లుగా ఉంది. -
టారిఫ్‌లపై ఊరట: పుంజుకున్న ఆసియా మార్కెట్లు
చైనా మినహా మిగతా దేశాలపై విధించిన అధిక సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ప్రకటించిన తర్వాత.. ఆసియా మార్కెట్లు లాభాలబాట పట్టాయి. జపాన్ నిక్కీ 8.35% పెరిగింది. దక్షిణ కొరియా కోస్పి ఇండెక్స్ 5.38 శాతం పెరగగా, స్మాల్ క్యాప్ కోస్డాక్ 5.09 శాతం లాభపడింది.చైనా.. అమెరికన్ వస్తువులపై 84 శాతం సుంకాలను ప్రకటించిన తరువాత.. అమెరికా సుంకాలను 104 శాతం నుంచి 125 శాతానికి పెంచడంతో.. పెట్టుబడిదారులు చైనా స్టాక్‌లపై ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. గురువారం(10న) శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా భారతదేశంలో మార్కెట్లు సెలవు.ప్రతీకార సుంకాల వార్మొత్తం 75 దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించిన తరువాత.. అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్ కొనసాగుతోంది. ట్రంప్ మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. -
అమెరికా చైనా మధ్య మరింత ముదిరిన టారిఫ్ వార్
-
సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా
-
సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా
సుంకాల విదింపుపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald trump) విదిస్తున్న సుంకాలపై ప్రపంచ దేశాలకు ఊరట లభించింది. చైనా మినహా మిగతా దేశాలకు అమెరికా సుంకాల నుంచి ఊరటనిచ్చింది.కానీ చైనాకు మాత్రం 125 శాతానికి సుంకాలు పెంచిన అమెరికా. మొత్తంగా 75 దేశాలపై విదించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించింది.ఇదిలా ఉంటే అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్ కొనసాగుతోంది. ట్రంప్ మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. -
ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్ సుంకాలు?
ఔషధాల దిగుమతులపై అమెరికా త్వరలోనే భారీ సుంకం విధించనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ట్రంప్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఔషధ కంపెనీలు తమ కార్యకలాపాలను అమెరికాకు మార్చుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లను పరస్పర టారిఫ్ పాలసీ నుంచి మినహాయించింది. కానీ తాజాగా ప్రకటనతో తిరిగి ఈ విభాగాల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.‘మేము త్వరలోనే ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాన్ని ప్రకటించబోతున్నాం. వివిధ దేశాల్లో తయారీ కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు తిరిగి అమెరికా వచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగపడుతాయి. ఈ విభాగంలో యూఎస్ అతిపెద్ద మార్కెట్’ అని ట్రంప్ అన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక దిగుమతి సుంకాలను ఉదహరిస్తూ అమెరికా ఇటీవల భారతీయ వస్తువులపై 26 శాతం ప్రతీకార సుంకాలను ప్రకటించింది.దేశంలో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి లేకపోవడంపై ట్రంప్ చాలా కాలంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన సమయంలో ఫార్మా రంగాన్ని అందులో నుంచి మినహాయించారు. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాలు ప్రకటిస్తామని ట్రంప్ మార్చి 24న చెప్పారు. యుద్ధాలు, మరేదైనా అనిశ్చితులు తలెత్తినప్పుడు ఉక్కు, ఫార్మాస్యూటికల్స్ అవసరం ఉందన్నారు. స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్స్‌పై ఇప్పటికే 25 శాతం సెక్టోరల్ టారిఫ్‌లను వర్తింపజేసిన ట్రంప్ రాగిపై కూడా వీటిని అమలు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఫార్మాస్యూటికల్ ఔషధాలతో పాటు కలప, సెమీకండక్టర్ చిప్‌లతో సహా అదనపు సెక్టోరల్ లెవీలను ఆయన ప్రభుత్వం విడిగా పరిశీలించనుంది. అయితే వీటి అమలుకు ఎంత సమయం పడుతుందో మాత్రం స్పష్టతనివ్వలేదు.భారత్‌పై ప్రభావంఫార్మా దిగుమతులపై ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటిస్తే అమెరికాకు అత్యధికంగా ఔషధాలను సరఫరా చేసే దేశాల్లో ఒకటైన భారత్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. 2024లో దేశం ఔషధ ఎగుమతుల విలువ 12.72 బిలియన్ డాలర్లు. ఇది దేశంలో అతిపెద్ద పారిశ్రామిక ఎగుమతి రంగంగా మారింది. అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భారత ఫార్మా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2022లో కొన్ని సర్వేల ప్రకారం యూఎస్‌లోని వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్‌తో దాదాపు 40 శాతం మందులు ఇండియాకు చెందినవే కావడం గమనార్హం.ఇదీ చదవండి: మళ్లీ బంగారం ధరలు పైకి! తులం ఎంతంటే..ఇదిలావుండగా, తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ) అమెరికాలో ప్లాంట్లను నిర్మించకపోతే 100% వరకు పన్ను విధిస్తామని ట్రంప్ బెదిరించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనను తప్పుబట్టిన ట్రంప్ అరిజోనాలోని ఫీనిక్స్‌లో ఉన్న సెమీకండక్టర్ ప్లాంట్ కోసం టీఎస్ఎంసీ యూఎస్ యూనిట్‌కు 6.6 బిలియన్ డాలర్ల గ్రాంట్ ఇవ్వడాన్ని ఖండించారు. -
చైనాకు ట్రంప్ మరో షాక్..
-
ట్రంప్ సుంకాలపై భారత్- చైనా కలసి పోరాడాలి: చైనా పిలుపు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు చేపట్టిన సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు భారత్- చైనా(India-China)లు కలిసి పోరాడాలని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో తెలియజేశారు. ‘చైనా-భారత్‌ల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలపై(Mutual benefits) ఆధారపడి ఉన్నాయి. తాజాగా అమెరికా అనుసరిస్తున్న సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రపంచంలోని రెండు అతిపెద్ద, అభివృద్ధి చెందుతున్న దేశాలు(భారత్-చైనా) కలిసి పోరాడాలని, ఈ కష్టాలను అధిగమించాలని అని యూ జింగ్ పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన ఈ పిలుపు అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో రావడం విశేషం.అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) ఏప్రిల్ 7న చైనాపై 104 శాతం సుంకాలను విధిస్తామని ప్రకటించారు. ఇవి ఏప్రిల్ 9 నుండి అమలులోకి రానున్నాయి. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలను విధించింది. ఈ సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా చైనా.. భారత్‌కు ఈ ప్రతిపాదన చేయడానికి కారణం భారతదేశం- చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్న ఏకపక్ష సుంకాల నుండి రక్షణ పొందేందుకు పరస్పర సహకారాన్ని ఆశిస్తూ చైనా ఈ విజ్ఞప్తి చేసివుండవచ్చు.అయితే భారత్.. చైనా పిలుపుపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. భారతదేశం ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఉంది. ట్రంప్ విధించిన 26 శాతం సుంకాలకు ప్రతీకార సుంకాలు విధించకూడదని నిర్ణయించిందని తెలుస్తోంది. అలాగే భారతదేశం అమెరికా నుండి వచ్చే 23 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై సుంకాలను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అయితే చైనా.. భారతదేశాన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, ఈ సుంకాల సమస్యపై సహకారం ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చవచ్చని చైనా వాదిస్తోంది. ఒకవేళ భారత్ ఈ ప్రతిపాదన దిశగా యోచిస్తే, అది ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చు.ఇది కూడా చదవండి: Dominican Republic: నైట్ క్లబ్ పైకప్పు కూలి 79 మంది మృతి.. 160 మందికి గాయాలు -
చైనాపై మరో 50%
బీజింగ్/వాషింగ్టన్: ట్రంప్ అన్నంత పనీ చేశారు. చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం. మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్‌లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు. కానీ మంగళవారం డెడ్‌లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు. ‘‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది. చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు. ఈయూ ప్రతీకార సుంకాలు 25 శాతం బెల్జియం: అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు యూరోపియన్ కమిషన్ సోమవారం ప్రకటించింది. కొన్ని వస్తువులపై మే 16 నుంచి, మరికొన్నింటిపై డిసెంబర్ 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.భారత్‌పైనా నేటినుంచే!ప్రపంచ దేశాలపై ట్రంప్ ఇటీవల విధించిన టారిఫ్‌ల అమలులో ఆలస్యం, డెడ్‌లైన్ పొడిగింపు వంటివేమీ ఉండబోవని లెవిట్ కుండబద్దలు కొట్టారు. భారత్‌తో పాటు 70పై చిలుకు దేశాలపై ఏప్రిల్ 2న ట్రంప్ ఎడాపెడా అదనపు సుంకాలు విధించడం తెలిసిందే. అవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దాంతో భారత్‌పై 26 శాతం సుంకాలతో పాటు ఆయా దేశాలపై విధించిన టారిఫ్‌లు కూడా బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) నుంచే అమల్లోకి రానున్నాయి. ‘‘ట్రంప్ టారిఫ్‌లు పని చేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాతో చర్చల కోసం 70కి పైగా దేశాలు ఇప్పటికే ముందుకొచ్చాయి’’ అని లెవిట్ చెప్పుకొచ్చారు. అయితే అమెరికాకు లాభదాయకంగా ఉంటేనే ఏ చర్చలైనా ఫలిస్తాయని ఆమె స్పష్టం చేశారు. -
త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీ
ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న టారిఫ్‌లు టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచ టాప్ టెక్ కంపెనీ యాపిల్‌పై ఈ సుంకాల ప్రభావం భారీగా ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ఎలాగైనా కంపెనీ ఐఫోన్ ధరలు పెంచుందనే ఉద్దేశంతో వినియోగదారులు ముందుగానే కొనుగోలుకు సిద్ధపడుతున్నారు. ఐఫోన్లు అధికంగా తయారవుతున్న చైనాపై యూఎస్ ఏకంగా 54 శాతం ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీనివల్ల కంపెనీ షేర్లు ఇటీవల కాలంలో భారీగా తగ్గిపోయాయి. అదేసమయంలో త్వరలో ధరలు పెరుగుతాయని ఊహాగానాలతో ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు యూజర్లు బారులు తీరుతున్నారు.టారిఫ్‌ల అమలు తర్వాత అనూహ్యంగా వ్యయ పెరుగుదల ఉంటుందని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపు అమల్లోకి రాకముందే ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎగబడడంతో అమెరికా వ్యాప్తంగా యాపిల్ రిటైల్ స్టోర్ల వద్ద రద్దీ కనిపించింది. చైనా తయారీపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన ఈ సుంకాలు యాపిల్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.భారత్‌పైనా ప్రభావం..విదేశాలతోపాటు చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల కారణంగా యాపిల్ ఐఫోన్ ధరలు 40 శాతం వరకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్ల ధరలు భారతదేశంలో రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ సృష్టి కంటే నిర్వహణవైపే మొగ్గుఐఫోన్ రూ.రెండు లక్షలు!చైనాలో మౌలికసదుపాయాలు, ఉద్యోగులు అధికంగా ఉండడంతో అమెరికా కంపెనీలు తయారీ యూనిట్లను ప్రారంభించాయి. అందులో భాగంగా యాపిల్ సంస్థ కూడా చైనాలో తయారీని మొదలు పెట్టింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేతపట్టిన తర్వాత చైనా వంటి దేశాల్లో తయారీని ప్రారంభించిన యూఎస్ కంపెనీలు స్వదేశంలో ప్లాంట్లు పెట్టేలా తాజా సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఈ సుంకాలు యాపిల్‌ను ఇరకాటంలో పడేశాయి. కంపెనీ ఇప్పటికీ ఐఫోన్లను చైనాలో అసెంబుల్ చేస్తోంది. అమెరికా సుంకాలతో సంస్థ 54 శాతం క్యుములేటివ్ టారిఫ్ రేటును ఎదుర్కోనుంది. యాపిల్ ఈ ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించుకుంటే ప్రస్తుతం 799 (సుమారు రూ.68,000) ధర ఉన్న ఎంట్రీ-లెవల్ ఐఫోన్ 16, 1,142 డాలర్లకు (సుమారు రూ.97,000) పెరుగుతుంది. ఇది 43 శాతం పెరిగే అవకాశం ఉంది. అధునాతన ఏఐ సామర్థ్యాలు, 1 టీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్లు 2,300 డాలర్లు (సుమారు రూ.1.95 లక్షలు) చేరుకోవచ్చు. -
ఐటీ రంగానికి సవాళ్లు
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితులు, ట్రంప్ టారిఫ్‌లతో తలెత్తిన వాణిజ్య భయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో దేశీ సాఫ్ట్వేర్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నట్లు పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికితోడు యూరోపియన్ దేశాలపైనా టారిఫ్‌ల అంశం ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నట్లు వివరించారు. వెరసి ఐటీ పరిశ్రమకు అతిపెద్ద మార్కెట్లుగా నిలుస్తున్న యూఎస్, యూరప్‌లలో ప్రతీకార టారిఫ్‌లు మందగమనం లేదా ఆర్థిక మాంద్యానికి దారి చూపనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్త ఆందోళనలకు కారణమవుతున్నట్లు ఐటీ నిపుణులు విశ్లేషించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాలు నిరాశపరచవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుత ఏడాది(2025–26) ఆదాయ అంచనాలు(గైడెన్స్) నీరసించవచ్చని భావిస్తున్నారు.ఫలితాలకు రెడీఇకపై సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజాలు 2024–25 క్యూ4(జనవరి–మార్చి) ఫలితాల విడుదలకు సిద్ధపడుతున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)తోపాటు తొలి త్రైమాసిక(ఏప్రిల్–జూన్) ఫలితాలపై అంచనాలు(గైడెన్స్) ప్రకటించనున్నాయి. తొలుత టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ 10న ఫలితాలు విడుదల చేయనుంది. ఈ బాటలో విప్రో 15న, ఇన్ఫోసిస్ 17న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 22న, టెక్ మహీంద్రా 24న పనితీరు వెల్లడించనున్నాయి.ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు బాసటగా కేంద్రం చర్యలువ్యయాలు తగ్గవచ్చుఐటీ సేవలకు అతిపెద్ద విభాగం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ)తోపాటు.. కీలకమైన రిటైల్, తయారీ రంగాలలో కంపెనీల వ్యయాలు తగ్గనున్నట్లు భావిస్తున్నారు. విచక్షణాధారిత వ్యయాలపై ప్రతికూల ప్రభావం కనిపించవచ్చని చెబుతున్నారు. దీంతో సమీప భవిష్యత్‌లో రికవరీకి చాన్స్ తక్కువేనని స్పష్టం చేస్తున్నారు. రానున్న రెండు త్రైమాసికాలలో ఐటీ కంపెనీల ఫలితాలు నిరాశరపచడానికితోడు ఆదాయ అంచనాలలో కోతలకు వీలున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత టారిఫ్ వార్ కారణంగా రిటైల్, తయారీ రంగాలు డీలా పడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే సర్వైవల్ వ్యయాలు తప్పకపోవచ్చని, జెన్ఏఐకు సైతం పెట్టుబడుల కేటాయింపులు పెరగవచ్చని మరికొంతమంది నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా ఈ ఏడాది(2025–26) ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో ఆర్థిక స్థిరత్వం, ఏఐ సేవలకు డిమాండ్ వంటి అంశాలు తిరిగి ఐటీ సేవలకు సానుకూలతను తీసుకువచ్చే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. -
టాయ్ పరిశ్రమకు ‘టారిఫ్’ల ప్రయోజనం!
న్యూఢిల్లీ: ట్రంప్ టారిఫ్ వార్ సెగ అన్ని దేశాలకూ గట్టిగానే తగులుతోంది. అయితే భారత్‌తో పోలిస్తే చైనా, వియత్నాం తదితర పోటీ దేశాలపై అధిక సుంకాలు విధించడం మన టాయ్ పరిశ్రమ దీన్ని సదావకాశంగా మలుచుకోవడానికి సిద్ధమవుతోంది. ఇతర దేశాల సంస్థలతో జాయింట్ వెంచర్ల ఏర్పాటు ద్వారా తయారీ సామర్థ్యాన్ని విస్తరించేందుకు దేశీ కంపెనీలు ఇప్పటికే పని మొదలు పెట్టాయని ఎగుమతిదారులు చెబుతున్నారు. ఇతర దేశాలపై అధిక టారిఫ్‌ల ప్రభావంతో మన ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరనుందని, దీంతో ఈ వాణిజ్య యుద్ధంలో భారత్ విజయం సాధించనుందని కూడా వారు అంటున్నారు.ఆసియాలో చైనాపై 54 శాతం, బంగ్లాదేశ్‌పై 37 శాతం, థాయ్‌లాండ్‌పై 36 శాతం, ఇండోనేషియాపై 32 శాతం చొప్పున ట్రంప్ భారీగా సుంకాలను వడ్డించిన సంగతి తెలిసిందే. భారత్‌పై మాత్రం 26 శాతం టారిఫ్‌లతో సరిపెట్టారు. ‘ఇది మనకు భారీగా అవకాశాలను అందించనుంది. ఎందుకంటే వియత్నాం 6 బిలియన్ డాలర్లు, చైనా 80 బిలియన్ డాలర్ల చొప్పున ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. భారతీయ టాయ్స్‌తో పోలిస్తే వారి వస్తువులకు అధిక సుంకాలు పడతాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బడా టాయ్ సంస్థలన్నీ భారత్‌లో ప్లాంట్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తున్నాయి’ అని ప్లేగ్రో టాయ్స్ ఇండియా సీఈఓ మను గుప్తా పేర్కొన్నారు.34.8 కోట్ల డాలర్ల ఎగుమతులు..పరిశ్రమ వర్గాల గణాంకాల ప్రకారం గడిచిన మూడేళ్లుగా భారత్ నుంచి 32.6–34.8 కోట్ల డాలర్ల విలువైన టాయ్ ఎగుమతులు జరుగుతున్నాయి. అమెరికాతో వీలైనంత త్వరగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే, భారతీయ టాయ్ సంస్థలు యూఎస్‌కు తమ ఎగుమతులను పెంచేందుకు దోహదం చేస్తుందని కూడా గుప్తా అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ఇప్పుడు రంగాల వారీగా పాలసీలను రూపొందిస్తున్నాయన్నారు. కాగా, బడ్డెట్లో టాయ్ పరిశ్రమ కోసం ప్రకటించిన జాతీయ యాక్షన్ ప్లాన్ ఈ రంగానికి మరింత దన్నుగా నిలవనుందని సన్లార్డ్ గ్రూప్ ప్రమోటర్ అమితాభ్ ఖర్బందా పేర్కొన్నారు.ఇదీ చదవండి: అప్పుల కుప్పలుగా రాష్ట్రాలుఇతర దేశాల ఆధిపత్యంతో భారత్ అనేక ఏళ్లుగా నికర టాయ్స్ దిగుమతిదారుగానే కొనసాగుతోంది. గడిచిన దశాబ్దకాలానికి పైగా చైనా పైనే పూర్తిగా ఆధారపడుతూ 76 శాతం మేర టాయ్స్ దిగుమతి చేసుకుంటోంది. అయితే, ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది. 2012–13లో భారత్ చైనా నుంచి 21.4 కోట్ల డాలర్ల టాయ్స్ దిగుమతి చేసుకోగా, 2023–24లో ఇది 4.16 కోట్ల డాలర్లకు దిగొచి్చంది. అంటే దాదాపు 94 శాతం దిగుమతలు కాస్తా, 64 శాతానికి తగ్గాయి. అంతర్జాతీయ టాయ్ మార్కెట్లో భారత్ పోటీతత్వానికి ఇది నిదర్శనమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
రాజ ఫలానికి ట్రంప్ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు భారతీయ రాజ ఫలం మామిడి వెలవెలబోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మామిడి రైతులకు కొత్త కష్టం వచ్చిపడింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ ఇటీవల 26 శాతం ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అందులో మన మామిడి పండ్లు కూడా ఉన్నాయి. దీంతో ఈసారి మామిడి ఎగుమతులపై ఈ సుంకాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. దేశంలో తెలుగు రాష్ట్రాలు మామిడి ఉత్పత్తిలో ముందున్నాయి. ఇక్కడ సుమారు 7,64,500 ఎకరాల్లో మామిడి సాగవుతుండగా, ఏటా 24,45,900 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. మనదేశం నుంచి అమెరికాకు ఏటా 45,000 టన్నుల మామిడి పండ్లు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే 10 వేల నుంచి 15 వేల టన్నులు వెళ్తున్నాయి. మన బంగినపల్లి, తోతాపురి, కేసర్ వంటి రకా లను అమెరికన్లు ఎంతగానో ఇష్టపడుతారు. ఈ ఎగుమతుల విలువ రూ.150 కోట్ల నుంచి రూ.230 కోట్లు ఉంటోంది. ఇప్పు డు సుంకాల పెంపుతో ధరల పెరుగుదల అదనంగా మరో రూ.50 కోట్లకు పైగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే అమెరికా ప్రజలకు మన మామిడి చాలా ప్రియం అవుతుంది. దీంతో డిమాండ్ తగ్గే ప్రమాదం ఉంది. అసాధారణ సుంకాలు.. గతంలో అమెరికాకు మామిడి ఎగుమతిపై సుంకాలు 0 నుంచి 5 శాతం మధ్య ఉండేవి. ఇది వ్యవసాయ ఉత్పత్తులకు అనుకూలమైన వాణిజ్య ఒప్పందాల వల్ల సాధ్యమైంది. తాజాగా ఈ పన్నులను 22 శాతం నుంచి 26 శాతం వరకు పెంచారు. ఈ సుంకాలు ఎగుమతి ధరలను గణనీయంగా పెంచుతాయి. దీనివల్ల అమెరికా ప్రజలకు భారత మామిడి ఖరీదైనదిగా మారి, ఇతర ప్రాంతాల మామిడితో పోటీ పడలేకపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొత్త టారిఫ్‌ల వల్ల ఎగుమతి ధరలు పెరిగినా, ఈ లాభం రైతులకు చేరే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ఎగుమతిదారులు సుంకాల భారాన్ని రైతులపై వేసే అవకాశం ఉంది. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించదనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా మార్కెట్లో డిమాండ్ తగ్గితే ఎగుమతి పరిమాణం కూడా తగ్గుతుంది. ఈక్వెడార్, ఇండోనేషియా వంటి దేశాలు తక్కువ ధరకు మామిడిని సరఫరా చేస్తే, భారత రైతులు మార్కెట్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. ‘ఎగుమతులు తగ్గితే మా ఆదాయం తగ్గుతుంది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే తక్కువ ధరలు వస్తున్నాయి’అని జగిత్యాల జిల్లాకు చెందిన రైతు రాజేందర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలి.. అమెరికా కొత్త సుంకాల వల్ల ఏర్పడే సంక్షోభం నుంచి తమను భారత ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు, ఎగుమతిదారులు కోరుతున్నారు. తగిన శిక్షణ, రాయితీలు ఇస్తేనే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలమని చెబుతున్నారు. అమెరికా మార్కెట్లో పోటీ పడాలంటే కాయల నాణ్యత మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ సహకారం అవసరమని హైదరాబాద్‌కు చెందిన ఎగుమతిదారుడు ఒకరు పేర్కొన్నారు. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో మామిడి ఉత్పత్తి గణనీయంగా తగ్గగా, తాజాగా టారిఫ్‌ల పిడుగు మరింత కుంగదీస్తోంది. -
ప్రపంచ మార్కెట్లు కుదేల్
ట్రంప్ సుంకాల విధింపు ‘అంచనాలకు మించి’ ఉన్నాయంటూ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పేర్కొంటూ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావం చూపొచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ట్రంప్ టారిఫ్ విధించిన తర్వాత అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశాలను 60%కు పెంచింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని తెలిపింది. దీంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికా మార్కెట్లు ఢమాల్ అమెరికా స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ట్రంప్ టారిఫ్‌ల బాంబ్‌తో గత వారాంతంలో భారీ నష్టాల మూటగట్టుకున్న సూచీలు.. తాజా సోమవారమూ భారీ నష్టాలబాట పట్టాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే యూఎస్ మార్కెట్ 5% మేర కుదేలైంది. భారత వర్తమాన కాలం ప్రకారం రాత్రి 10 గంటలకు నాస్డాక్ ఒకటిన్నర నష్టంతో 15,366 వద్ద, డోజోన్స్ రెండున్నర శాతం క్షీణతతో 37,462 వద్ద, ఎస్అండ్పీ 2% పతనంతో 4,993 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఇటీవల గరిష్టం నుంచి 20 శాతానికి పైగా క్షీణించి నాస్డాక్ శుక్రవారం అధికారికంగా ‘బేర్ మార్కెట్’ జోన్లో ప్రవేశించింది. -
ఓవైపు ప్రపంచ మార్కెట్లు కుదేలు.. ట్రంప్ ఆసక్తికర ప్రకటన
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు.. ఆసియా, యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. అయినా కూడా వాణిజ్య సుంకాల విషయంలో తన నిర్ణయమే కరెక్ట్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ‘‘సవరించేదే లే..’’ అని భీష్మించుకుని కూర్చున్నారు. అయితే అమెరికా సహా ప్రపంచ దేశాల మార్కెట్లు కుదేలు అవుతున్న వేళ తాజాగా మరోసారి ఆసక్తికర ప్రకటన చేశారాయన. వాషింగ్టన్: ఆర్థిక మాంద్యం పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald rump) తోసిపుచ్చారు. ట్రూత్ సోషల్‌లో ఆయన చేసిన తాజా పోస్ట్ సారాంశం.. ‘‘ చమురు ధరలు తగ్గాయి, వడ్డీ రేట్లు తగ్గాయి. ఆహార పదార్థాల ధరలూ తగ్గాయి. కాబట్టి ద్రవ్యోల్బణం లేదు. చాలాకాలంగా అన్యాయానికి గురైన అమెరికా, ప్రతీకార సుంకాల ద్వారా సంబంధిత దేశాల నుంచి బిలియన్ల డాలర్లు తీసుకు వస్తోందని అన్నారాయన. అన్నింటికంటే.. అతిపెద్ద దుర్వినియోగదారు దేశమైన చైనా(China) మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి, ఆ దేశంపై సుంకాలను 34% పెంచినప్పటికీ.. ప్రతీకారానికి దిగొద్దన్న నా హెచ్చరికను పట్టించుకోలేదు. అమెరికా గత నాయకుల వల్లే దశాబ్దాలుగా వాళ్లు అడ్డగోలుగా సంపాదించున్నారు. ఇక.. అమెరికాను మళ్ళీ గొప్పగా తీర్చిదిద్దండి! అని పోస్ట్ చేశారాయన. ఇదిలా ఉంటే.. అమెరికా వేసిన సుంకాలకు దీటుగా స్పందించిన చైనా (China) అక్కడి నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా (USA) విధించిన సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని చైనా ఆరోపించింది. ఏకపక్షంగా, ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొంది. ఈ క్రమంలో.. వాషింగ్టన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం టారిఫ్‌లను (US tariffs) విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులకు ఇది వర్తిస్తుందని, ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయని చైనాకు చెందిన ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. ఈ పరిణామాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. చైనా భయపడిందని, తప్పు నిర్ణయం తీసుకుందన్నారు. ‘‘చైనా తప్పిదం చేసింది. వాళ్లు భయాందోళనకు గురయ్యారు. వారికి మరో మార్గం లేదు’’ అని అన్నారాయన. -
స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్
-
మార్కెట్లు పతనబాటలో..
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు అత్యధిక సమయం పతనబాటలో సాగవచ్చని పలువురు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్ష, యూఎస్ టారిఫ్‌ల ప్రభావం, ఫెడ్ గత పాలసీ మినిట్స్ వెల్లడి తదితర పలు అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. దీంతో తీవ్ర ఆటుపోట్లకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. వివరాలు చూద్దాం..ముంబై: గత వారాంతాన యూఎస్ స్టాక్స్ అత్యంత భారీ పతనాన్ని చవిచూశాయి. నేడు(7న) యూఎస్ స్టాక్ మార్కెట్లకు ‘బ్లాక్‌మండే’ ఎదురుకావచ్చని అక్కడి నిపుణులు అంచనా వేశారు. భారత్‌సహా చైనా, జపాన్ తదితర ప్రధాన దేశాలపై ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లను ప్రకటించడంతో అమెరికా ఆరి్ధక వ్యవస్థ దెబ్బతినవచ్చని, మాంద్యంలోకి జారుకోవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లలో సైతం అమ్మకాలకు తెరలేచే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020 తరువాత గత వారం యూఎస్ మార్కెట్లు 6 శాతం పడిపోయాయి. 5 లక్షల కోట్ల డాలర్లకుపైగా మార్కెట్ విలువ ఆవిరైంది. వెరసి ఈ వారం దేశీ మార్కెట్లు పతన బాటలో సాగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కాగా.. గురువారం(10న) శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది.గత వారమిలాప్రపంచ దేశాలపై యూఎస్ టారిఫ్‌ల ఎఫెక్ట్‌తో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు సైతం డీలా పడ్డాయి. ఆటుపోట్ల మధ్య సెన్సెక్స్ నికరంగా 2,050 పాయింట్లు(2.65 శాతం) పతనమై 75,365 వద్ద ముగిసింది. ఈ బాటలో నిఫ్టీ 615 పాయింట్లు(2.6 శాతం) కోల్పోయి 22,904 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.5 శాతం క్షీణించి 40,509కు చేరగా.. స్మాల్‌క్యాప్ 1.65 శాతం నీరసించి 45,867 వద్ద నిలిచింది.టీసీఎస్ రెడీగురువారం సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ ఈ ఆర్ధిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసిక(క్యూ4) ఫలితాలు విడుదల చేయనుంది. దీంతో జనవరి–మార్చి(క్యూ4) ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. కాగా.. అక్టోబర్ మొదలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మార్చి చివవి వారంలో నికర కొనుగోలుదారులుగా మారినప్పటికీ తిరిగి ఏప్రిల్‌లో అమ్మకాల బాట పట్టడం సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ పేర్కొన్నారు. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు రూ. 10,355 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం గమనార్హం! ఎఫ్‌పీఐలు ఫిబ్రవరిలో దేశీ స్టాక్స్ నుంచి రూ. 34,574 కోట్లు, జనవరిలో మరో రూ. 78,027 కోట్లు చొప్పున పెట్టుబడులు ఉపసంహరించిన సంగతి తెలిసిందే. -
చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ప్రపంచ దేశాలపై సుంకాలను ప్రకటించారు. ఆ తరువాత చైనా.. యూఎస్ఏ మీద 34 శాతం ప్రతీకార సుంకం ప్రకటించింది. దీంతో బంగారం ధర సుమారు రూ. 2,800 లేదా రెండు శాతం తగ్గింది.అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ సమయంలోనే బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని కమోడిటీ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.అమెరికా, చైనాతో సహా ఇతర దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా.. బంగారం ధరల ర్యాలీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నదని ఎస్ఎస్ వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు 'సుగంధ సచ్‌దేవా' పేర్కొన్నారు. అయితే అమ్మకాలు మాత్రమే స్థిరంగా కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్ఇండియన్ మార్కెట్లో బంగారం ధరలు రూ. 83,100 (22 క్యారెట్ 10 గ్రామ్స్), రూ. 90,660 (24 క్యారెట్ 10 గ్రామ్స్) వద్ద ఉన్నాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గుముఖం పట్టాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. -
ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్
ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' సుంకాలను ప్రకటించిన తరువాత.. యూఎస్ మార్కెట్లు కుప్పకూలాయి. రెండు సెషన్లలలోనే ఇన్వెస్టర్లు ఆరు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టపోయారు. కరోనా మహమ్మారి తరువాత స్టాక్ మార్కెట్లు ఇంతలా పతనమవ్వడం ఇదే మొదటిసారి. అయితే ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.ట్రంప్ పరస్పర సుంకాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి వెళ్తాయనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ జీడీపీ తగ్గుతుందని, ఉద్యోగాలు కూడా ఉండవని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ఈ సమయంలో కూడా అమెరికా అధ్యక్షుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.అమెరికాలో ఆర్ధిక మాంద్యం వస్తుందని అందరూ భయపడుతుంటే.. ట్రంప్ మాత్రం ఇన్వెస్టర్లు ధనవంతులు అవ్వడానికి ఇదే సరైన సమయమని చెబుతున్నారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది సువర్ణావకాశమని, చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా వారు ధనవంతులు అవుతారని ఆయన అన్నారు.పెద్ద కంపెనీలు లేదా పెద్ద వ్యాపార సంస్థలు ఎప్పుడూ టారీఫ్స్ గురించి ఆందోళన చెందవు. ఎందుకంటే అవి ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి. మరింత పెద్ద డీల్స్ మీద ఫోకస్ చేస్తాయి. ఇవే దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిస్తాయి.. సూపర్ ఛార్జ్ మాదిరిగా పనిచేస్తాయని అన్నారు.ఇదీ చదవండి: 'అమెరికాలో ఉద్యోగాలుండవు'.. నిపుణులు ఎందుకు చెబుతున్నారంటే?విదేశీ వస్తువులను వినియోగించడం తగ్గించి, స్వదేశీ ఉత్పత్తులపై ఫోకస్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సుంకాలను ప్రవేశపెట్టారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మార్చి వేయడం మాత్రమే కాకుండా.. దేశంలో ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుందని డొనాల్డ్ ట్రంప్ విశ్వసిస్తున్నారు. -
'అమెరికాలో ఉద్యోగాలుండవు'
అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ప్రకటించిన కొత్త సుంకాల ప్రభావం వల్ల.. ఈ సంవత్సరం అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశిస్తుందని 'జేపీ మోర్గాన్' అంచనా వేసింద. ఈ మాంద్యం వల్ల యూఎస్ఏలో నిరుద్యోగం రేటు 5.3 శాతానికి చేరుతుందని.. మైఖేల్ ఫెరోలి అన్నారు.డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావం.. ఉద్యోగాల మీద మాత్రమే కాకుండా, దేశ జీడీపీ మీద కూడా ప్రభావం చూపిస్తుందని జేపీ మోర్గాన్ చీఫ్ యూఎస్ ఆర్థికవేత్త 'మైఖేల్ ఫెరోలి' వెల్లడించారు. ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులు కూడా 20 శాతం తగ్గుతాయని ఆర్ధిక నిపుణులు అంచనా వేశారు. దీనివల్ల అగ్రరాజ్యంలో ఉద్యోగాలు ఉండవని చెబుతున్నారు.ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల దిగుమతులు తగ్గుతాయి. జీడీపీలో దిగుమతులు 1986 ముందు స్థాయికి చేరుకుంటుందని.. యూబీఎస్ చీఫ్ యూఎస్ ఆర్థికవేత్త జోనాథన్ పింగిల్ ఒక నోట్లో తెలిపారు. దీనివల్ల ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్ధిక నష్టాన్ని అమెరికా చూడబోతోందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: 'ఇది నీకు సిగ్గుచేటు'.. బిల్‌గేట్స్ ఎదుటే ఉద్యోగుల నిరసన (వీడియో)డొనాల్ట్ ట్రంప్ భారతదేశం మీద మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల మీద సుంకాలను విధించారు. అంతే కాకుండా మనుషులు లేని ఆస్ట్రేలియన్ దీవుల మీద కూడా 10 శాతం సుంకాలను ప్రకటించడం గమనార్హం. భారత్‌పై విధించిన సుంకాలలో 10 శాతం సుంకం ఈ రోజు (ఏప్రిల్ 5) నుంచి అమలులోకి వస్తుంది. మిగిలిన శాతం ఏప్రిల్ 10 నుంచి అమలులోకి రానుంది. -
క్యాష్యూను క్యాష్ చేసుకునేలా టారిఫ్‌లు
ట్రంప్ ప్రభుత్వం ఇటీవల సుంకాలు విధించడం ప్రపంచవ్యాప్తంగా కొన్ని రంగాలకు ప్రతికూలంగా మారితే, ఇంకొన్ని విభాగాలకు అవకాశంగా పరిణమించింది. భారత్‌లోని జీడిపప్పు వ్యాపారులకు ఈ సుంకాలు అమెరికాలో తమ మార్కెట్‌ను విస్తరించుకునేందుకు మార్గాన్ని చూపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే యూఎస్‌కు పెద్దమొత్తంలో జీడీపప్పు ఎగుమతి చేస్తున్న వియత్నాంపై 46 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 26 శాతం సుంకానికి లోబడి భారతీయ జీడిపప్పు అక్కడి మార్కెట్లో పోటీపడే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.చాలా ఏళ్లుగా వియత్నాం యూఎస్ జీడిపప్పు మార్కెట్లో ఆధిపత్యం సాగిస్తోంది. అమెరికా దిగుమతుల్లో సుమారు 90 శాతం వాటా వియాత్నాందే కావడం విశేషం. భారత్ వాటా ఈ విభాగంలో చాలా తక్కువగా ఉంది. ఇది సంవత్సరానికి 7,000-8,000 టన్నుల ఎగుమతులకు పరిమితమైంది. కొత్త టారిఫ్ విధానాలు అమెరికాలో భారతీయ జీడిపప్పు మార్కెట్‌ను విస్తరించుకోవడానికి అవకాశం కల్పించినట్లయింది. వియత్నాం కంటే భారత్‌పై విధించిన సుంకాలు 20 శాతం తక్కువగా ఉండడం ఇందుకు కారణం. దాంతో యూఎస్ మార్కెట్లో ఇండియా క్యాష్యూ చౌకగా అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇది అక్కడి మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: సుంకాల పెంపులోనూ ఎన్నో అవకాశాలుప్రాసెసింగ్ సామర్థ్యాలు పెంచుకోవాలి..ఆల్ ఇండియా క్యాష్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బోలా రాహుల్ కామత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘భారతీయ ఎగుమతిదారులకు ఈ టారిఫ్ విధానాలు స్వల్పకాలిక ప్రయోజనాలు చేకూరుస్తాయి. వియత్నాం వంటి దేశాలతో పోలిస్తే ఇండియాపై తక్కువ టారిఫ్ ఉండడం ఇందుకు కారణం. అమెరికా జీడిపప్పు మార్కెట్లో వాటాను పెంచుకునేందుకు ఇండియాతో పాటు తక్కువ సుంకాలను ఎదుర్కొంటున్న ఆఫ్రికా దేశాలు కూడా పోటీపడే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం తన ప్రాసెసింగ్ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి సారించాలి’ అని చెప్పారు. -
దోస రైతులపై సుంకాల పిడుగు
భారత ఎగుమతులపై ఇటీవల అమెరికా విధించిన 26 శాతం సుంకాలు రైతుల పాలిట శాపంగా మారనున్నాయి. ఊరగాయ దోసకాయలు(జెర్కిన్స్) భారత్ నుంచి అమెరికాకు పెద్దమొత్తంలో ఎగుమతి అవుతున్నాయి. భారత్ దిగుమతులపై యూఎస్ విధించిన టారిఫ్‌లతో ఈ పంట రైతులకు నష్టం వాటిల్లనుందని నిపుణులు చెబుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 256.58 మిలియన్ డాలర్ల(రూ.2,124 కోట్లు) విలువైన 2.44 లక్షల టన్నుల జెర్కిన్స్ను అమెరికాకు ఎగుమతి చేసింది. 2019-2020 ఏడాదిలో ఇది 1.89 లక్షల టన్నులతో రూ.173 మిలియన్ డాలర్లు(రూ.1,400 కోట్లు)గా ఉండేది.ఇప్పటికే అమెరికాలో 9 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న భారత పారిశ్రామిక రంగానికి ఈ సుంకాల పెంపు పెద్ద దెబ్బే. పెరిగిన టారిఫ్‌ల వల్ల మెక్సికో, కెనడా, టర్కీ వంటి దేశాలతో పోలిస్తే భారత జెర్కిన్స్కు పోటీ తక్కువగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. జెర్కిన్స్కు సంబంధించి యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం (యూఎస్ఎంసీఏ) కింద మెక్సికో, కెనడా సుంకం మినహాయింపుల నుంచి ప్రయోజనం పొందుతాయని ఇండియన్ జెర్కిన్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ పూవయ్య తెలిపారు. టర్కీపై భారత్ కంటే సుమారు 10 శాతం తక్కువ సుంకాన్ని విధించినట్లు చెప్పారు.99 శాతం ఎగుమతులే..భారతదేశంలో జెర్కిన్ ఉత్పత్తి దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అధికంగా ఉంది. వీటిపై అమెరికా లెవీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానాలపై ఆధారపడిన వేలాది మంది చిన్న, సన్నకారు రైతులు దీనివల్ల ప్రభావితం చెందే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే జెర్కిన్స్లో 99% పైగా ఎగుమతి అవుతున్నవే కావడం గమనార్హం.ఇదీ చదవండి: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?అమెరికా మార్కెట్లో ఇండియా ఉత్పత్తులు పోటీతత్వాన్ని కోల్పోవడంపై పూవయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాలను మునుపటి స్థాయికి పునరుద్ధరించడానికి ద్వైపాక్షిక చర్చలు జరపాలన్నారు. ఇరు దేశాలకు అనువైన విధానాలు అమలయ్యేలా పరిష్కారాలు ఆలోచించాలన్నారు. -
జనాలే లేని ద్వీపంపై పన్నులా? ట్రంప్ సుంకాలపై పెంగ్విన్స్ సెటైర్లు
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దాదాపు 1800 దేశాలను టార్గెట్ చేస్తూ పరస్పరం (రెసిప్రోకల్ టారిఫ్స్) పన్నులు విధించడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. అనేక దేశాధినేతలు తమ స్పందన వెల్లడించారు కూడా. దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యబాణాలు వెల్లువెత్తాయి కూడా. మరీ ముఖ్యంగా అయితే జనావాసాలు లేని ఒక ద్వీపంపై ట్రంప్ సుంకాలు విధించిన తీరు మరింత విస్మయ పర్చింది. దీనిపై పెంగ్విన్ మీమ్స్(penguin memes) ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి.సబ్ అంటార్కిటిక్ హిందూ మహాసముద్రంలోని హర్డ్ అండ్ మెక్‌డొనాల్డ్ దీవుల (Heard and McDonald Islands) పై ఎందుకు పన్నులు విధించారు అనేదే పెద్ద ప్రశ్న. మానవ జనాభా లేని బంజరు సబ్-అంటార్కిటిక్ ఆస్ట్రేలియన్ ప్రాంతమైన హర్డ్ , మెక్‌డొనాల్డ్ దీవుల నుండి వచ్చే అన్ని ఎగుమతులపై ట్రంప్ 10శాతం సుంకాలను విధించారు. అయితే ఈ దీవులు ఆస్ట్రేలియా భూభాగం కిందకు వస్తాయి కాబట్టి.. వాటిని టారిఫ్స్ జాబితాలో చేర్చినట్లు వైట్ హౌస్ అధికారి వివరణ ఇచ్చారు.వాస్తవానికి ఈ దీవుల్లో మనుషులు నివసించరు. దాదాపు 80 శాతం మంచుతో కప్పబడిన ఈ ప్రాంతం యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. దీవులు యాక్టివ్ అగ్నిపర్వతాలు, వివిధ సముద్ర జంతువులకు నిలయంగా ఉండటంతో అక్కడ ప్రజలు నివసించటం లేదు. దాదాపు దశాబ్ధకాలం నుంచి ఆ ప్రాంతాన్ని ఎవ్వరూ సందర్శించలేదని తెలుస్తోంది. ఈ ప్రాంతం పెంగ్విన్లు, సీల్స్కు ఆవాస ప్రాంతంగా ఉంది. The penguin wore a suit. But didn’t escape the Trump tarifs on the Heard og McDonald Islands. Maybe it didn’t say thank you? pic.twitter.com/aaPr1ufCr0— Christopher Arzrouni (@CArzrouni) April 3, 2025 ఓవల్ ఆఫీసులో ఉక్రెయిన్ నాయకుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్థానంలో పెంగ్విన్‌ను అమెరికా అధ్యక్షుడు ,ఉపాధ్యక్షుడు వాన్స్‌తో ఇటీవల జరిగిన వివాదాస్పద సమావేశానికి ఉటింకిస్తూ ఒక మీమ్ ఉంది. జెలెన్స్కీ ప్లేస్‌లో పెంగ్విన్‌ను ఉంచారు. మరొక మీమ్ యుఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో స్థానంలో చక్రవర్తి పెంగ్విన్‌ను చూస్తున్నట్లు ఉంది. "పెంగ్విన్లు సంవత్సరాలుగా మనల్ని చీల్చి చెండాడుతున్నాయి" అని మొదిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మాజీ కమ్యూనికేషన్స్ చీఫ్‌గా 11 రోజులు పనిచేసిన ఆంథోనీ స్కారాముచ్చి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చమత్కరించారు. ఈ సుంకాల జాబితాలో రష్యా లేదనే వాస్తవాన్ని ప్రస్తావిస్తూ. "ట్రంప్ పుతిన్‌పై కాదు పెంగ్విన్లపై సుంకాలను విధించారు" అంటూ అమెరికా సెనేట్ డెమోక్రటిక్ నాయకుడు చక్ షుమర్ పోస్ట్ చేశారు,Outstanding memes capturing the absurdity of Trump’s tariff on penguin inhabited Heard & McDonald Islands #owngoal #PowerToThePenguins pic.twitter.com/AETymaLFdC— Eddie Lloyd (@worldzonfire) April 4, 2025 ; చదవండి: ట్రంప్ సుంకాల మోత, సోషల్ మీడియాలో మీమ్స్ హోరు మాములుగా లేదు!మరోవైపు ట్రంప్ సుంకాల దెబ్బతో అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 2020లో కోవిడ్ మహమ్మారి తర్వాత మళ్లీ ఇపుడు స్టాక్స్ తీవ్రంగా నష్టపోతున్నాయి. -
ప్రతీకార సుంకాల ప్రభావంపై అధ్యయనం
అమెరికా ప్రతీకార సుంకాలతో భారత్‌పై ప్రడే ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖతోపాటు, ఆర్థిక శాఖ ప్రకటించాయి. దేశీ పరిశ్రమ, ఎగుమతిదారులు సహా భాగస్వాములు అందరితో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు, వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్టు వాణిజ్య శాఖ తెలిపింది. అమెరికా కొత్త వాణిజ్య విధానం ఫలితంగా ఏర్పడే కొత్త అవకాశాలపైనా అధ్యయనం చేస్తున్నట్టు ప్రకటించింది.పరస్పర ప్రయోజనకరమైన, బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) త్వరగా అంగీకారానికి వచ్చేందుకు భారత్–అమెరికా వాణిజ్య బృందాలు చర్చిస్తున్నట్టు తెలిపింది. అమెరికాతో సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని భారత్ గౌరవిస్తుందని.. రెండు దేశాల ప్రయోజనాల విషయంలో అమెరికాతో కలసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్టు వాణిజ్య శాఖ పేర్కొంది. ఢిల్లీలో ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. ‘ట్రంప్‌నకు అమెరికాయే ప్రథమం. మోదీకి భారతే ప్రథమం. అమెరికా మోపిన ప్రతీకార సుంకాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నాం’ అని చెప్పారు. భారత్ నుంచి వచ్చే ఫార్మా, సెమీకండక్టర్, ఇంధన ఉత్పత్తుల దిగుమతులను టారిఫ్‌ల నుంచి అమెరికా మినహాయించగా, మిగిలిన దిగుమతులపై 10 శాతం బేసిక్ డ్యూటీకి అదనంగా 26 శాతం సుంకాలు మోపింది.ఇదీ చదవండి: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?భారత్‌పై సుంకాల మోతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్ ప్రకటించారు. -
యాపిల్‌కు టారిఫ్‌ల దెబ్బ.. ధరల పెంపునకు అవకాశం
విదేశాలతోపాటు చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు ప్రపంచ టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాల కారణంగా యాపిల్ ఐఫోన్ ధరలు 40 శాతం వరకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్ల ధరలు భారతదేశంలో రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.చైనాలో మౌలికసదుపాయాలు, ఉద్యోగులు అధికంగా ఉండడంతో అమెరికా కంపెనీలు తయారీ యూనిట్లను ప్రారంభించాయి. అందులో భాగంగా యాపిల్ సంస్థ కూడా చైనాలో తయారీని మొదలు పెట్టింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేతపట్టిన తర్వాత చైనా వంటి దేశాల్లో తయారీని ప్రారంభించిన యూఎస్ కంపెనీలు స్వదేశంలో ప్లాంట్లు పెట్టేలా తాజా సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఈ సుంకాలు యాపిల్‌ను ఇరకాటంలో పడేశాయి. కంపెనీ ఇప్పటికీ ఐఫోన్లను చైనాలో అసెంబుల్ చేస్తోంది. అమెరికా సుంకాలతో సంస్థ 54 శాతం క్యుములేటివ్ టారిఫ్ రేటును ఎదుర్కోనుంది. యాపిల్ ఈ ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించుకుంటే ప్రస్తుతం 799 (సుమారు రూ.68,000) ధర ఉన్న ఎంట్రీ-లెవల్ ఐఫోన్ 16, 1,142 డాలర్లకు (సుమారు రూ.97,000) పెరుగుతుంది. ఇది 43 శాతం పెరిగే అవకాశం ఉంది. అధునాతన ఏఐ సామర్థ్యాలు, 1 టీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్లు 2,300 డాలర్లు (సుమారు రూ.1.95 లక్షలు) చేరుకోవచ్చు.యాపిల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త ఫీచర్లకు ఆదరణ అంతంతమాత్రంగా ఉండటంతో ఇప్పటికే ప్రధాన మార్కెట్లలో ఐఫోన్ అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. అధిక ధరలు డిమాండ్‌ను మరింత తగ్గిస్తాయి. ఇది చైనా వెలుపల ఎక్కువ ఫోన్లను తయారు చేసే, టారిఫ్‌ల వల్ల తక్కువ ప్రభావితమయ్యే శామ్సంగ్ వంటి ప్రత్యామ్నాయ కంపెనీ ఉత్పత్తుల వైపు వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రూ.44 కోట్ల విలువైన గోల్డ్ కార్డు ప్రదర్శించిన ట్రంప్అమెరికా ప్రభుత్వం నుంచి యాపిల్ గతంలో టారిఫ్‌ల నుంచి మినహాయింపులను పొందగలిగినప్పటికీ, ఈసారి అటువంటి సౌలభ్యం లేదని ఇప్పటికే అధికార వర్గాలు స్పష్టతనిచ్చాయి. వియత్నాం, ఇండియాలోనూ యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. అయితే వియత్నాంపై 46 శాతం సుంకాన్ని, భారతదేశంపై 26 శాతం సుంకాన్ని విధించారు. ఇవి చైనా సుంకాల కంటే తక్కువగానే ఉన్నాయి. అయితే కంపెనీ ఇండియా వంటి దేశాల్లో ఉత్పత్తిని పెంచుతుందా లేదా అనే విషయంపై ప్రకటన రావాల్సి ఉంది. -
భారత్‌కు స్టీల్ దిగుమతుల ముప్పు
అమెరికా దిగుమతి సుంకాలతో అంతర్జాతీయ వాణిజ్యం మార్పులకు లోనుకానుందని సెయిల్ ఛైర్మన్ అమరేందు ప్రకాశ్ పేర్కొన్నారు. యూఎస్‌లో కీలకమైన స్టీల్ ఉత్పత్తుల తయారీ రాత్రికి రాత్రి సాధ్యపడదన్నారు. సుంకాల నేపథ్యంలో భారత్‌కు చౌక స్టీల్ దిగుమతుల ముప్పు ఎదురుకావొచ్చని చెప్పారు. అన్ని స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లను యూఎస్ ఇప్పటికే అమలు చేస్తుండగా, ఈ నెల 2 నుంచి అన్ని రకాల దిగుమతులపైనా ప్రతీకార సుంకాల విధింపును ప్రకటించడం గమనార్హం.‘సంప్రదాయంగా స్టీల్ ఆసియా దేశాల నుంచి యూఎస్, యూరప్‌కు ఎగుమతి అవుతుంటుంది. కొంత స్టీల్ యూరప్ నుంచి యూఎస్‌కు వెళుతుంటుంది. ప్రతీకార సుంకాలు అమల్లోకి వస్తే ఆయా ఎగుమతులు లాభసాటి కావు. దాంతో యూరప్‌కు చైనా, దక్షిణ కొరియా, జపాన్ ఎగుమతి చేసే స్టీల్ ప్రపంచ దేశాలను ముంచెత్తుతుంది. ఇది భారత్‌కు కూడా రావొచ్చు’ అని సెయిల్ ఛైర్మన్ తన అభిప్రాయాన్ని తెలిపారు. అమెరికాకు భారత్ స్టీల్ ఎగుమతులు పెద్దగా లేకపోవడంతో టారిఫ్‌ల ప్రభావం మనపై తక్కువే ఉంటుందన్నారు.ఇదీ చదవండి: భారత్‌లోకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు‘అమెరికాలో కీలకమైన స్టీల్ ఉత్పత్తుల తయారీ రాత్రికి రాత్రి సాధ్యపడదు. దీంతో తాము ఉత్పత్తి చేయలేని వాటి దిగుమతులను అమెరికా కొనసాగిస్తుంది. అక్కడ తయారీ యూనిట్ల ఏర్పాటుకు కొంత సమయం తీసుకుంటుంది’ అని వివరించారు. దేశీ స్టీల్ పరిశ్రమను చౌక దిగుమతుల నుంచి కాపాడేందుకు సుంకాల విధింపు అవసరమని అభిప్రాయపడ్డారు. స్టీల్ ఉత్పత్తుల దిగుమతులపై 12 శాతం సేఫ్‌గార్డ్ డ్యూటీని వాణిజ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ గత నెలలో సిఫారసు చేయడం గమనార్హం. దీనిపై ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
ట్రంప్ సుంకాల మోత, సోషల్ మీడియాలో మీమ్స్ హోరు మాములుగా లేదు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దాదాపు అన్ని దేశాలపై నా టారిఫ్స్ కొరడా ఝుళిపింఆడు. దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై "రెసిప్రోకల్ టారిఫ్స్" (Reciprocal Tariffs) విధించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని.. అయితే కనీసం 10శాతం పన్నులు(Tariffs) చెల్లించాల్సింది ఉంటుందని ప్రకటించారు. భారత్ నుంచి దిగుమతి వస్తువులపై 26శాతం, చైనా నుండి వచ్చే వస్తువులపై 34 శాతం పన్ను విధించారు. దీంతో చైనా మొత్తం పన్నుల శాతం 54 శాతానికి చేరింది. ఇక సౌత్ కొరియాపై 25 శాతం యూరోపియన్ యూనియన్ నుండి వచ్చే వస్తువులపై 20 శాతం పన్ను విధించారు. యూకే వచ్చే వస్తువులపై 10 శాతం పన్ను విధించారు. ట్రంప్ తాజా ప్రకటనపై పలు దేశాధినేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు కూడా. మరోవైపు ట్రంప్ వడ్డింపులపై సోషల్‌మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి, వృద్ధికోసం దాని మిత్రదేశాలు సహా దాదాపు అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలను విధించారు ట్రంప్. ఎవరూ ఆపలేని ఆర్థిక యుద్ధం జరుగుతోందంటూ జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించి, సుంకాలను ప్రకటించిన వెంటనే #TrumpTariffs , #TradeWar ఎక్స్( X)లో ట్రెండింగ్ షురూ అయింది. Happy Liberation Day! Thanks Trump for ensuring that we become liberated from our money. I personally will miss being able to buy food. So when Trump said he was going to make America great again, I guess he meant he was gonna take us back to the Great Depression? #trumptariffs— Meredith (@meralee727) April 2, 2025 చదవండి: రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?"విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు! మన డబ్బు నుండి మనం విముక్తి పొందేలా చేసినందుకు ట్రంప్ ధన్యవాదాలు. ఇకనాకు బువ్వ ఉండదు. అమెరికా గ్రేట్ ఎగైన్ అంటే మనల్ని తిరిగి మహా మాంద్యంలోకి తీసుకెళ్లడం అని అనుకున్నాడనుకుంట’’ అని ఒకరు ట్వీట్ చేశారు. జపాన్ ఎగుమతులపై 24 శాతం సుంకాలు విధించినందుకు ట్రంప్‌ను విమర్శిస్తూ,"సరైన మనస్సు గల జపనీస్ వ్యక్తి అమెరికన్ కారును ఎందుకు కొనుగోలు చేయాలి?" అని ప్రశ్నించారు.Happy Liberation Day! Thanks Trump for ensuring that we become liberated from our money. I personally will miss being able to buy food. So when Trump said he was going to make America great again, I guess he meant he was gonna take us back to the Great Depression? #trumptariffs— Meredith (@meralee727) April 2, 2025 చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఅంతేకాదు ఈ సుంకాల నుండి రష్యాను మినహాయించినందుకు నెటిజన్లు ట్రంప్‌ను కూడా ఎగతాళి చేశారు. "ట్రంప్ రష్యాపై విధించిన సుంకాలు లేదా ఆర్థిక చర్యలు లేవు. నాకు ఎందుకు ఆశ్చర్యంగా ఉంది" అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నవ్వుతూ ఉన్న జిఫ్‌ను ట్విట్ చేశాడు. "ట్రంప్స్టర్స్ శుభవార్త! మీ కిరాణా సామాగ్రికి ఎంత మిగులుతుందో గుర్తించడం కష్టం.. ఎందుకంటే మిగతాటికి ఖర్చులు మరింత భారం అవుతాయి కనుక’’ అంటూ మరొక యూజర్ ట్రంప్ సుంకాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. -
అమెరికాపై ప్రతిచర్యలు తప్పవు: చైనా
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించిన నేపథ్యంలో చైనా స్పందించింది. యూఎస్ తన సుంకాల విధానాలను వెంటనే రద్దు చేయాలని కోరింది. దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రతిచర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.కొన్నేళ్లుగా ఇరుదేశాలతో వాణిజ్య చర్చల్లో కుదిరిన ప్రయోజనాలను, అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా చాలా కాలంగా ఎంతో లాభం పొందిందనే వాస్తవాన్ని అమెరికా విస్మరించిందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సరఫరా గొలుసులను దెబ్బతీసే వాణిజ్య యుద్ధానికి దిగుతున్న నేపథ్యంలో చైనా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పింది. తన హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు ప్రతిచర్యలు తప్పవని హెచ్చరించింది.ఇదీ చదవండి: ప్రతీకార సుంకాలపై భారత ఫార్మాకు ఊరట!ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్‌పై చైనా విధించిన 20% సుంకాల కంటే అదనంగా చైనాపై 34% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ బుధవారం ప్రకటించారు. దాంతో మొత్తం సుంకాలు 54%కు పెరిగినట్లయింది. అమెరికా ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ ప్రచారం చేసినట్టుగానే చైనాపై 60% సుంకాలు విధింపునకు సమీపంలోకి చేరింది. చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే తక్కువ విలువ కలిగిన ‘డ్యూటీ ఫ్రీ(సుంకాలు మినహాయింపు)’ వస్తువులను అమెరికాలోకి అనుమతించే వాణిజ్య విధానాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. -
ప్రతీకార సుంకాలపై భారత ఫార్మాకు ఊరట!
అమెరికా తాజాగా విధించిన ప్రతీకార సుంకాల నుంచి భారత ఫార్మా పరిశ్రమకు మినహాయింపు ఇస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మొత్తం యూఎస్‌లో వినియోగించే జనరిక్ ఔషధాల్లో 40 శాతం కంటే ఎక్కువగా భారత్‌లో తయారవుతున్న ఉత్పత్తులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాల విధింపు నిర్ణయం అమెరికాలోనూ ఔషధాల సంక్షోభాన్ని తీసుకొస్తుందేమోననే ఆందోళనలతో ఈమేరకు వెనక్కి తగ్గుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భారతదేశం తయారు చేస్తున్న జనరిక్ మందుల పాత్రను నొక్కి చెబుతుంది.ఈ సుంకాల మినహాయింపు భారత ఔషధ ఎగుమతులకు ప్రయోజనం చేకూరుస్తుండగా, ఇతర రంగాల్లో అమెరికా ఎగుమతులు పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా సుంకాలకు అనుగుణంగా భారత్ యూఎస్ వస్తువులపై సుంకాల్లో మార్పులు చేస్తే వాణిజ్య అడ్డంకులు తొలగిపోయి దేశంలో అగ్రరాజ్య ఎగుమతులు ఏటా 5.3 బిలియన్ డాలర్లు పెరుగుతాయనే అంచనాలున్నాయి. ఇది రెండు దేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్య సంబంధాలను పెంపొందిస్తుందనే వాదనలూ లేకపోలేదు.భారత్‌పై సుంకాల మోతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్ ప్రకటించారు.ఇదీ చదవండి: యూఎస్ సుంకాలు.. భారత్‌పై ప్రభావం ఎంత?టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్ ఏర్పాటుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించే టారిఫ్‌ల సంబంధ పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖతో పాటు వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఇందులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతీకార టారిఫ్‌ల పరిణామాలను ఎదుర్కొనే వ్యూహాలపై వాణిజ్య, పరిశ్రమల శాఖ కసరత్తు చేసినట్లు వివరించాయి. -
ట్రంప్ టారిఫ్స్: మనుషుల్లేని దీవులపై 10 శాతం సుంకం
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) దాదాపు అన్ని దేశాలపైన సుంకాలు విధించారు. మనుషులున్న దేశాలు లేదా ప్రాంతాలపై సుంకాలు విధిస్తే సరే అనుకోవచ్చు.. కానీ మనుషులే లేని దీవులపై కూడా సుంకాలు విధించడం చర్చనీయాంశమైంది.ట్రంప్ సుంకాలు విధించిన ప్రాంతాల జాబితాలో.. ఆస్ట్రేలియా ప్రభుత్వం అధీనంలో ఉన్న హియర్డ్ ఐలాండ్, మెక్‌డొనాల్డ్ దీవులు కూడా ఉన్నాయి. నిజానికి ఈ దీవులు పెంగ్విన్ పక్షులు, సీల్స్, వివిధ పక్షి జాతులకు మాత్రమే నిలయం. ఈ దీవులపై ట్రంప్ సుంకాలను విధించారు.. కానీ ఎందుకు విధించారనే సంగతి చెప్పలేదు.ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు సుమారు 4100 కిమీ దూరంలో ఉన్న ఈ హియర్డ్ ఐలాండ్, మెక్‌డొనాల్డ్ దీవులు 1947 నుంచి ఆస్ట్రేలియా భూభాగంగా ఉన్నాయి. భూమిపై అత్యంత మారుమూల ఉన్న ఈ ప్రాంతాల్లో జనావాసం ఉండదు. ఈ దీవులను సముద్రం ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేక నౌకలను ఉపయోగించి ప్రయాణం చేయడానికి దాదాపు రెండు వారాలు పడుతుంది.ఎవరూ నివసించని దీవులపై ట్రంప్ ప్రభుత్వం 10 శాతం సుంకం విధించడంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు పెంగ్విన్ పక్షుల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తారా? అని ఒకరు కామెంట్ చేస్తే.. అమెరికా ఇప్పుడు చేపలపై కూడా సుంకాలు విధిస్తోందని మరొకరు కామెంట్ చేశారు.భారత్‌పై 26 శాతంప్రపంచంలోని చాలా దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్ భారతదేశం మీద కూడా 26 శాతం సుంకం ప్రకటయించారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాలలో తాము సగం మాత్రమే విధిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. భారత్ మామీద 52 శాతం సుంకం విధించింది. మేము ఇండియాపై 26 శాతం సుంకం విధిస్తున్నామని ఆయన అన్నారు. అమెరికా అత్యధిక సుంకం విధించిన దేశాలలో కంబోడియా (49 శాతం) ఉంది.Trump administration has put a 10 percent tariff on the Heard and McDonald Islands….which has a population of 0 people and is inhabited only by penguins. pic.twitter.com/oSx7LyU0b3— MaineWonk (@TheMaineWonk) April 2, 2025 -
యూఎస్ సుంకాలు.. భారత్‌పై ప్రభావం ఎంత?
అమెరికా తాజాగా భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై 26 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఇరుదేశాల వాణిజ్య సంబంధాలు గణనీయంగా ప్రభావితం చెందుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా వస్తువులపై భారత్ అధిక సుంకాలు విధించడంపై ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇదివరకే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కొత్త టారిఫ్‌లు ప్రధానంగా భారతీయ ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, ఐటీ సర్వీసులు వంటి కీలక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ప్రభావం ఎలాగంటే..ఆటోమొబైల్స్: దేశం మొత్తం వాహన ఎగుమతుల్లో గణనీయమైన భాగం అమెరికాకు వెళ్తోంది. దాంతో ప్రస్తుత సుంకాల వల్ల భారతీయ ఆటోమొబైల్ ఎగుమతులు సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. అధిక సుంకాలతో భారతీయ వాహనాలు యూఎస్‌లో ఇతర కంపెనీ ఉత్పత్తులతో పోటీపడే అవకాశం తగ్గుతుంది. దాంతో దేశీ తయారీదారులు ఇతర ప్రాంతాల్లో తమ ఉత్పత్తులు విక్రయించేందుకు మార్గాలను అన్వేషించాల్సి వస్తుంది.ఫార్మాస్యూటికల్స్: జనరిక్ ఔషధాల ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న భారత ఫార్మాస్యూటికల్స్‌కు యూఎస్ సుంకాలు అవరోధంగా నిలుస్తాయి. భారత్ ఫార్మా రంగానికి అమెరికాలో గణనీయ మార్కెట్ ఉంది. అలాంటిది ఈ ప్రతీకార సుంకాలతో భారత ఎగుమతులు తగ్గి ఫార్మా కంపెనీల లాభాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అమెరికాకు ఎగుమతి చేసే జనరిక్ ఔషధాల ధరలు పెంచేందుకు ఈ సుంకాలు అవకాశం కల్పిస్తాయి. దాంతో యూఎస్‌లో స్థానికంగా పోటీపడే వీలుండదని నిపుణులు చెబుతున్నారు.ఐటీ సేవలు: ప్రధానంగా అమెరికాలో భారత ఐటీ సర్వీసులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. యూఎస్ ఆధారిత కాంట్రాక్టులే ఇండియన్ ఐటీ కంపెనీలను అధికంగా ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. కరోనా తర్వాత చాలా మంది ఐటీ సిబ్బందికి లేఆఫ్స్ ప్రకటించిన కంపెనీలు ఇటీవలే పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేసేలా ట్రంప్ సుంకాలతో కంపెనీల రెవెన్యూ తగ్గే అవకాశం ఉంటుంది. దాంతో మళ్లీ లేఆఫ్స్ తప్పవని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్..విస్తృతంగా, విచ్చలవిడిగా విధించే సుంకాలు వాణిజ్య అసమతుల్యతకు దారితీయవచ్చు. ఇవి భారతదేశ ఎగుమతి ఆదాయాలను తగ్గిస్తాయి. వాణిజ్య లోటును పెంచుతాయి. పూర్తిగా అమెరికాపైనే ఆధారపడి పని చేస్తున్న భారతీయ కంపెనీలు ఆర్థిక అనిశ్చితిలోకి వెళ్లవచ్చు. సుంకాల తీవ్రతను తగ్గించేందుకు, పరస్పర ప్రయోజనాలను పొందడానికి భారత్ ఇప్పటికే అమెరికాతో వాణిజ్య చర్చలు ప్రారంభించింది. సమతుల్య వాణిజ్య సంబంధాలను పెంపొందిస్తూ, ఆర్థిక అంతరాయాలను తగ్గించేలా ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. -
టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించే టారిఫ్‌ల సంబంధ పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖతో పాటు వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఇందులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతీకార టారిఫ్‌ల పరిణామాలను ఎదుర్కొనే వ్యూహాలపై వాణిజ్య, పరిశ్రమల శాఖ కసరత్తు చేసినట్లు వివరించాయి.ప్రస్తుతం భారత్‌లో అమెరికా దిగుమతులపై సగటున టారిఫ్‌లు 7.7%గా ఉండగా, ఆ దేశానికి మన ఎగుమతులపై సగటున సుమారు 2.8 శాతమే. ప్రస్తుతం 190 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలనేది ఇరు దేశాల లక్ష్యం. ఈ దిశగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చిస్తున్నాయి.ఇదీ చదవండి: ఏడాదిలో రూ.1.33 లక్షల కోట్ల సమీకరణభారత్పై సుంకాల మోతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్ ప్రకటించారు. -
సుంకాల మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
-
‘విముక్తి’ తీరుతెన్నులెలా?!
‘అమెరికా విముక్తి దినం’గా ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన రోజు రానేవచ్చింది. ఇన్నాళ్లూ ‘అన్యాయమైన సుంకాల’తో ‘అధ్వాన్నమైపోయిన’ అమెరికాకు ఏప్రిల్ 2 (బుధవారం) నుంచి విముక్తి లభించి, లక్షల కోట్ల డాలర్లు ఆర్జించి పెట్టగల ప్రతి సుంకాల మోత మోగబోతున్నదని దేశ ప్రజలను ఆయన ఊరిస్తున్నారు. విలక్షణమైన ప్రకటనలతో ఏకకాలంలో తన భక్త గణాన్నీ, ప్రత్యర్థులనూ రంజింపజేయటం ట్రంప్ ప్రత్యేకత. అయితే ఆయన విధించబోయే సుంకాల రంగు, రుచి, వాసన ఆ రెండు వర్గాలకూ అంతుబట్టడం మాట అటుంచి... కొమ్ములు తిరిగిన ఆర్థికవేత్తల అవగాహనకే అందటం లేదు. ట్రంప్ చర్య వల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుందని మాత్రం ఆర్థికవేత్తలు జోస్యం చెబుతున్నారు. ఆడం స్మిత్, డేవిడ్ రికార్డో వంటి 18, 19 శతాబ్దాల నాటి స్వేచ్ఛా మార్కెట్ ఆర్థికవేత్తల ఆలోచనల్నించి బయటికొస్తేనే ట్రంప్ అర్థమవుతారని ఆర్థిక నిపుణులు కొందరి వాదన. ట్రంప్ ఒక మాట మీదవుంటే కాస్తయినా అర్థమయ్యే వారు. కానీ ఆయన రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఒకసారి మిత్ర దేశాలకైనా, వేరే దేశాలకైనా ఒకటే నిబంధన అంటారు. మరోసారి తద్విరుద్ధంగా మిత్ర దేశాలతో చర్చించి పరిష్కరించుకుంటామంటారు. ఆ మాటెలావున్నా తొలిసారి అధ్యక్షుడైనప్పుడు 2018–19 మధ్య ట్రంప్ చైనాపై విధించిన ప్రతి సుంకాల ప్రభావం ద్రవ్యోల్బణంపై పెద్దగా లేదుగనుక, ఇప్పుడూ ఉండకపోవచ్చని కొందరి మాట.ట్రంప్ ప్రకటించబోయే ప్రతి సుంకాల తీరుతెన్నులెలావుంటాయో ఆయన సన్నిహిత సలహా దారులకు సైతం ఇంతవరకూ తెలియదు. ప్రతి సుంకాలు మధ్యస్థంగా, పరస్పరం చర్చించి పరిష్క రించుకునే విధంగా ఉంటాయని అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బిసెంట్ గత నెలలో తెలిపారు. కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలతో విడివిడిగా చర్చించి ఒప్పందానికొస్తామని అన్నారు. మన వంతుగా ఎలాంటి చర్యలుంటాయో ప్రభుత్వం ఇంతవరకూ వెల్లడించలేదు. కానీ భారత్ తరఫున ట్రంప్ ఇప్పటికే ఒకటి రెండు ప్రకటనలు చేశారు. అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించటానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ పక్షం రోజులనాడు చెబితే దానిపై విపక్షాలు పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఇంతవరకూ ఆ విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, అమెరికాకు చెప్పింది కూడా లేదని ప్రభుత్వం వివరించింది. మంగళవారం మరోసారి ఆయన అదే తరహాలో మాట్లాడారు. భారత్ గణనీయంగా సుంకాలు తగ్గించబోతున్నట్టు ‘కొద్దిసేపటి క్రితమే’ తనకు సమాచారం అందిందన్నారు. దీనిపై మన ప్రభుత్వం స్పందించలేదు. కానీ యూరప్ నుంచి అమెరికాకు పెను సవాల్ ఎదురుకాబోతున్నదని యూరోపియన్ యూనియన్ (ఈయూ) చేసిన ప్రకటన సూచిస్తోంది. ‘అమెరికా ప్రతి సుంకాలు ఏ స్థాయిలోవున్నాయో తెలిసిన వెంటనే ఏం చేయాలన్న అంశంలో పకడ్బందీ ప్రణాళిక సిద్ధమైంద’ని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ తెలియజేశారు. యూరప్ నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై 2,800 కోట్ల డాలర్ల మేర సుంకాలు విధించినట్టు గత నెలలో ట్రంప్ ప్రకటించిన వెంటనే, ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే మోటార్ సైకిళ్లు, బోట్లు, మద్యం వగైరాలపై ఈయూ సైతం భారీ సుంకాలు విధించింది. అయితే అదే సమయంలో అమెరికా నుంచి వచ్చే కార్లపై 2.5 శాతం మేర సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికా– ఈయూల మధ్య వార్షిక వాణిజ్యం లక్షన్నర కోట్ల డాలర్లు. యూరప్‌తో సాగుతున్న వాణిజ్యంపై అమెరికాలో 10 లక్షల ఉద్యోగాలు ఆధారపడివున్నాయి.ఈ ‘విముక్తి’ సుంకాల రగడ పర్యవసానంగా మనతోపాటు అమెరికా, యూరప్, లండన్, జపాన్, హాంకాంగ్ తదితర ప్రపంచమార్కెట్లన్నీ పల్టీలు కొడుతున్నాయి. అన్నిచోట్లా అమెరికా షేర్లు పతనమవుతున్నాయి. చాలామంది ఈ సుంకాలెలా ఉండబోతున్నాయో తెలిసేవరకూ వేచి చూసే ధోరణిలో ఉండబట్టి కొంత నిలకడ కనబడుతోంది. కానీ ట్రంప్ అన్నంతపనీ చేస్తే ప్రపంచ మార్కె ట్లకు బుధవారం శాపగ్రస్త దినం కావడం ఖాయం. సుంకాలు పెంచటంవల్ల అమెరికాకు దిగుమ తయ్యే సరుకుల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఏటా అమెరికా 3 లక్షల కోట్ల డాలర్ల సరుకును దిగు మతి చేసుకుంటుంది. సరుకుతో నిమిత్తం లేకుండా అన్నిటిపైనా 20 శాతం అదనంగా సుంకం విధి స్తామని ట్రంప్ చెబుతున్నారు. ఈ లెక్కన ఏటా 60,000 కోట్ల డాలర్ల ఆదాయం లభిస్తుంది. కానీ ఈ భారాన్ని చివరకు దేశ పౌరులే మోయాల్సివుంటుందని, అది భారమవుతుందని ట్రంప్ గ్రహించటం లేదు. ఇప్పటికే జీవనవ్యయం పెరిగి, బ్యాంకుఖాతాలు ఖాళీ అవుతూ, ఉద్యోగాలు కోల్పోయే స్థితి వుండగా, ప్రతి సుంకాలతో ఇది మరింత విషమిస్తుంది. మాంద్యం ముంచుకొస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరుస్తానని, ఉద్యోగాల విషయంలో శ్వేతజాతి అమెరికన్ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దుతానని ట్రంప్ ఇచ్చిన హామీని నమ్మి జనం ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ అందుకు విరుద్ధంగా అమలులో ఉన్న అంతర్జాతీయ అమరి కను ధ్వంసం చేసే పనిలో ట్రంప్ బిజీగా ఉన్నారు. ఆయన చర్యలు దేశాన్ని 1930నాటి ఆర్థిక మాంద్యం రోజులకు తీసుకెళ్లినా ఆశ్చర్యం లేదని పలువురి మాట. 1930 జూలైలో నాటి అధ్యక్షుడు హెర్బర్ట్ హూవర్ స్మూట్–హాలీ ట్యారిఫ్ చట్టాన్ని తీసుకురావటంతో అమెరికా దిగుమతులు 67 శాతం పడిపోయి ఆ దేశ ఆర్థికవ్యవస్థ కళ్లు తేలేసింది. ఇప్పుడు ట్రంప్ అలాంటి దుస్సాహసానికి దిగబోతున్నారు. పర్యవసానాలెలావుంటాయో చూడటం తప్ప ప్రపంచంలో దీన్ని నివారించగల వారెవరూ లేరు. -
ఫార్మాకు చేదు మందు?
సాక్షి బిజినెస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలపై ఇతరత్రా రంగాల్లాగే భారత ఫార్మా కంపెనీలకూ టెన్షన్‌గానే ఉంది. ఎందుకంటే మన ఫార్మా కంపెనీల ఎగుమతుల్లో దాదాపు మూడో వంతు వాటా అమెరికాదే ఉంటోంది. గత ఆర్థిక సంవత్సరం ఆ దేశానికి భారత ఫార్మా ఎగుమతులు 16 శాతం పెరిగి దాదాపు 9 బిలియన్ డాలర్లకు చేరాయి. అక్కడి నుంచి దిగుమతయ్యే ఔషధాలు సుమారు 800 మిలియన్ డాలర్లే. అమెరికాకు మన చౌక ఔషధాల అవసరం ఎంత ఉందో, మనకూ కీలకమైన అమెరికా మార్కెట్ అవసరం అంతగానూ ఉందని పరిశీలకులు చెబుతున్నారు.దీంతో సుంకాల వడ్డింపనేది ఎవరికి లాభదాయకం, ఎవరికి నష్టదాయకమనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గతంలోలాగే ఫార్మా మీద టారిఫ్‌పై ఇరు దేశాలు మళ్లీ సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు. అమెరికా హెల్త్‌కేర్ వ్యవస్థలో మన జనరిక్స్‌కి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మినహాయింపుల కోసం భారత్ ప్రయత్నించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాయి. సవాళ్ల మధ్య అవకాశాలు.. వాస్తవానికి చైనాలాంటి దేశాలపై ప్రధాన దృష్టితో టారిఫ్‌లను ప్రతిపాదించినప్పటికీ అమెరికాకు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న మన ఫార్మాపైనా ప్రభావం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా నుంచి ఔషధాల దిగుమతులపై భారత్ 10% సుంకాల వరకు విధిస్తుండగా, మన ఎగుమతులపై అక్కడ టారిఫ్‌లు లేవు. ఒకవేళ ప్రతీకారంగా మనలాగే టారిఫ్ విధించినా సుమారు 10% స్థాయిలోనే ఉంటుందని భావిస్తున్నారు.గ్లాండ్ ఫార్మా, అరబిందో, డాక్టర్ రెడ్డీస్, జైడస్, లుపిన్లాంటి ఫార్మా కంపెనీల ఆదాయాల్లో అమెరికా వాటా సుమారు 50–37% వరకు ఉండటంతో వాటిపై టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఒకవేళ భారాన్ని కస్టమర్లకు బదలాయించకపోతే వివిధ కంపెనీల స్థూల లాభంపై సుమారు 12% వరకు ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అదే 50% బదలాయిస్తే, ఇది 7% దాకా ఉండొచ్చు. మొత్తం మీద ఆదాయనష్టంతో పాటు మిగతా దేశాలతో పోటీపడి మార్కెట్‌ను నిలబెట్టుకోవడం కష్టంగా మారుతుంది. దేశీ ఫార్మాకు కాస్త కలిసి వచ్చే అంశాలూ ఉన్నాయి. అమెరికా మీదే ఆధారపడకుండా మన కంపెనీలు ఇతర మార్కెట్లకూ విస్తరించవచ్చు. అలాగే, అంతర్జాతీయంగా ఇతర దేశాల కంపెనీలతో దీటుగా పోటీపడేలా ఆర్అండ్డీ సామర్థ్యాలను పెంచుకోవచ్చు. అమెరికాపై ఎఫెక్ట్ .. ఫార్మా దిగుమతులపై టారిఫ్‌లతో అమెరికాకూ కొన్ని ప్రతికూలతలు తప్పవు. భారతీయ జనరిక్స్‌పై సుంకాల వడ్డింపు వల్ల, ఫార్మా కంపెనీలు ఔషధాల రేట్లను పెంచితే, అమెరికా వినియోగదారులకు మందుల ఖర్చులు పెరిగిపోతాయి. ఇక, మన ఫార్మాపై అమెరికా భారీగానే ఆధారపడుతోంది. టారిఫ్‌లతో సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడి, ఔషధాలకు కొరత నెలకొనవచ్చు. ఫలితంగా పేషెంట్లకు చికిత్స విషయంలో సమస్యలు ఏర్పడవచ్చు. అటు అమెరికాకూ కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయి. టారిఫ్‌తో ఇతర దేశాల ఫార్మా కంపెనీలు అమెరికాలోనూ తయారీ కార్యకలాపాలు చేపట్టే పరిస్థితి ఏర్పడవచ్చు. దీంతో, దేశీయంగా తయారీకి, ఉపాధి కల్పనకు ఊతమిస్తుంది. అలాగే దిగుమతి చేసుకునే ఔషధాల నాణ్యతపరమైన సవాళ్లకు చెక్ పెట్టేలా, దేశీయంగా తయారీ ప్రమాణాలపై అమెరికా మరింత నియంత్రణ సాధించవచ్చు. -
సుంకాల మోత వేళ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్: ప్రతీకార సుంకాల విధింపు వేళ(reciprocal tariffs) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కీలక ప్రకటన చేసే సమయంలో వాణిజ్య భాగస్వాముల పట్ల తాను మరింత దయతో వ్యవహరిస్తానని ప్రకటించారాయన. అయితే కచ్చితంగా ఎలాంటి పరస్పర సుంకాలు విధించబడతాయనేది మాత్రం మంగళవారం రాత్రికల్లా లేదంటే బుధవారం పొద్దునే ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు.జనవరిలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ తన అధికారాన్ని ఇష్టానుసారం ఉపయోగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు జరిపే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాల విధింపు(Tariffs) తప్పదని, ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటించిన ఆ ప్రతీకార టారిఫ్‌ల డెడ్‌లైన్ ఏప్రిల్ 2 దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి సంస్థల్లో గుబులు, గందరగోళం నెలకొన్నాయి. ఏయే రంగాలపై ఎంతెంత వేస్తారు, ఏయే రంగాలను వదిలేస్తారు అనే అంశాలపై చర్చ నడుస్తోంది. అయితే..తాజాగా.. ‘‘మీరు రెండు రోజుల్లో చూడబోతున్నారు.. మేం చాలా దయతో ఉంటాం’’ అని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. కొన్ని దేశాలకు ఊరట దక్కుతుందా? అనే చర్చ మొదలైంది. మరోవైపు టారిఫ్‌లపై బేరసారాలు చేసేందుకు అవకాశం దొరకవచ్చని, కొన్నాళ్లయినా సుంకాలు వాయిదా పడొచ్చేమోనని భారత్ ఇంతకాలం భావిస్తూ వచ్చింది. కానీ, సుంకాల ప్రకటన అనుకున్న తేదీకే ఉంటుందని ట్రంప్ చెప్పడంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. అయితే.. భారత్‌ను ఆయన ప్రత్యేక మిత్రపక్షంగా భావిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌కు ప్రత్యేక ఊరట ఏమైనా దక్కుతుందేమో చూడాలి. అయితే.. ఇదీ చదవండి: భారత ఎగుమతులపై ప్రతీకార టారిఫ్‌లు ఏ స్థాయిలో ఉండొచ్చంటే..పరస్పర సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని వైట్‌హౌజ్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ అంటున్నారు. అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న సుంకాలను ప్రస్తావిస్తూ.. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు నిలిపివేయాల్సిన అవసరం ఉందని లీవిట్ అభిప్రాయపడ్డారు.సుంకాల మోత ఎందుకంటే.. అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయని, అవరోధాలు ఏర్పరుస్తున్నాయనేది ట్రంప్ ఆరోపణ. దీని వల్ల 1 లక్ష కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంటోందని, దీనితో అమెరికన్ పరిశ్రమలు, వర్కర్లపైనా ప్రతికూల ప్రభావం పడుతోందనేది ఆయన వాదన. అందుకే ప్రతీకార సుంకాల విధింపు తప్పదని అంటున్నారు.ట్రంప్ ప్రకటన కంటే ముందే..మరోవైపు ట్రంప్ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా చైనా, కెనడా, యూరోపియన్ యూనియన్ నుంచి ప్రతిఘటన తప్పదని అంటున్నారు. మరోవైపు.. ట్రంప్ సుంకాల ప్రకటన చేయకముందే ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. టారిఫ్ వార్‌ను ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలు ఒక అడుగు ముందుకు వేశాయి. దక్షిణ కొరియా-జపాన్-చైనా దేశాలు ప్రాంతీయ వాణిజ్యం ప్రొత్సాహం దిశగా ఒక ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఆదివారం చర్చలు జరిపాయి. -
ట్రంప్ టారిఫ్‌ల టెన్షన్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార టారిఫ్‌ల అమలుకు డెడ్‌లైన్ అయిన ఏప్రిల్ 2 దగ్గరపడటంతో ఎగుమతి సంస్థల్లో గుబులు, గందరగోళం నెలకొంది. ఏయే రంగాలపై ఎంతెంత వేస్తారు, ఏయే రంగాలను వదిలేస్తారు అనే అంశాలపై అందరిలోనూ అయోమయం నెలకొంది. వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు జరిపే దేశాల జాబితాలో భారత్‌ని కూడా అమెరికా చేర్చడంతో ... టారిఫ్‌లపై బేరసారాలు చేసేందుకు అవకాశం దొరకవచ్చని, కొన్నాళ్లయినా సుంకాలు వాయిదా పడొచ్చేమోనని ఆశాభావం నెలకొంది. ఈ నేపథ్యంలో టారిఫ్‌లు, ఏయే రంగాలపై ప్రభావం పడొచ్చనే అంశాలను ఒకసారి చూస్తే.. – న్యూఢిల్లీఅమెరికా ప్రణాళిక ఏంటంటే..వివిధ దేశాలతో తమకున్న వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు వాటి నుంచి తమకు వచ్చే దిగుమతులపై అమెరికా సుంకాలను విధించడం / పెంచడం వంటి చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన ప్రతిపాదన ఇది. అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయని, అవరోధాలు ఏర్పరుస్తున్నాయనేది ట్రంప్ ఆరోపణ. దీని వల్ల 1 లక్ష కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంటోందని, దీనితో అమెరికన్ పరిశ్రమలు, వర్కర్లపైనా ప్రతికూల ప్రభావం పడుతోందనేది ఆయన వాదన.2021–22 నుంచి 2023–24 మధ్య కాలంలో భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశంగా ఉంది. భారత్ ఎగుమతుల్లో 18 శాతం, దిగుమతుల్లో 6.22 శాతం, అన్ని దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్యంలో 10.73 శాతం వాటా అమెరికాది ఉంది. 2023–24లో భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 119.71 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో భారత్ నుంచి 77.51 బిలియన్ డాలర్ల ఎగుమతులు, అమెరికా నుంచి 42.19 బిలియన్ డాలర్ల దిగుమతులు ఉన్నాయి. దీంతో వాణిజ్య మిగులు భారత్ పక్షాన సుమారు 35.31 బిలియన్ డాలర్లుగా నమోదైంది.భారత ఎగుమతులపై ప్రతీకార టారిఫ్‌లు ఏ స్థాయిలో ఉండొచ్చంటే..ప్రస్తుతానికి టారిఫ్‌లను ఏ విధంగా విధిస్తారనేది, అంటే ప్రోడక్టు స్థాయిలోనా, లేదా రంగాలవారీగానా, లేదా దేశ స్థాయిలోనా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..అమెరికా నుంచి దిగుమతులపై భారత్ విధించే సుంకాలు, నిజానికి ఆరోపిస్తున్న దానికంటే చాలా తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. అమెరికా గానీ సహేతుక వాణిజ్య విధానాన్ని అవలంబిస్తే, పెద్దగా అవాంతరాలు లేకుండా భారత పరిశ్రమలు ఎగుమతులను కొనసాగించవచ్చని, ఇరు దేశాల మధ్య మరింత సమతూకమైన, స్థిరమైన విధంగా వాణిజ్య బంధం బలోపేతం కావచ్చని పేర్కొన్నారు. నాలుగు స్థాయిల్లో టారిఫ్‌ల ప్రభావాలను జీటీఆర్ఐ అంచనా వేసింది.దేశ స్థాయిలో: భారత్ నుంచి అన్ని ఎగుమతులపై ఒకే రకంగా టారిఫ్‌లు విధించడం: ఒకవేళ ఈ విధానాన్ని అమలు చేస్తే మన ఎగుమతులపై అదనంగా 4.9 శాతం భారం పడుతుంది. ప్రస్తుతం అమెరికా ఉత్పత్తులపై మన దగ్గర టారిఫ్‌లు సగటున 7.7 శాతంగా ఉండగా, మన ఎగుమతులపై అక్కడ సగటున 2.8 శాతంగా ఉంటోంది. ఆ విధంగా రెండింటి మధ్య 4.9 శాతం వ్యత్యాసం ఉంది.వ్యవసాయం, పరిశ్రమల స్థాయిలో: ఈ విధానాన్ని అమలు చేస్తే వ్యవసాయోత్పత్తులపై అదనంగా 32.4 శాతం, పారిశ్రామికోత్పత్తులపై 3.3 శాతం భారం పడొచ్చు. ప్రస్తుతం అమెరికాకు భారత వ్యవసాయోత్పత్తులపై 5.3 శాతం సుంకాలు ఉండగా, అక్కడి నుంచి దిగుమతులపై అత్యధికంగా 37.7 శాతంగా (వ్యత్యాసం 32.4 శాతం) ఉంటోంది. మరోవైపు పారిశ్రామికోత్పత్తుల విషయానికొస్తే.. అమెరికా నుంచి దిగుమతులపై సగటున 5.9 శాతం, మన ఎగుమతులపై కేవలం 2.6 శాతం (వ్యత్యాసం 3.3 శాతం) ఉంటోంది.రంగాల స్థాయిలో: వివిధ రంగాల్లో ఇరు దేశాల ఉత్పత్తులపై టారిఫ్‌ల మధ్య వ్యత్యాసాలు వివిధ రకాలుగా ఉన్నాయి. రసాయనాలు..ఫార్మాలో 8.6 శాతం, ప్లాస్టిక్స్‌లో 5.6 శాతం, టెక్స్‌టైల్స్‌పై 1.4 శాతం, వజ్రాలు.. బంగారం మొదలైన వాటిపై 13.3 శాతం, ఇనుము..ఉక్కుపై 2.5 శాతం, మెషినరీ .. కంప్యూటర్స్‌పై 5.3 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 7.2 శాతం, ఆటోమొబైల్స్ .. ఆటో విడిభాగాలపై 23.1 శాతం వ్యత్యాసం ఉంటోంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే, సదరు రంగంపై ప్రభావం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. భారత్ ఎగుమతులు 30 కేటగిరీలుగా ఉంటున్నాయి. ఇందులో వ్యవసాయంలో ఆరు, పరిశ్రమల్లో 24 ఉన్నాయి.వ్యవసాయం⇒ అత్యధికంగా చేపలు, మాంసం, ప్రాసెస్డ్ సీఫుడ్‌పై ప్రభావం ఉంటుంది. దాదాపు 2.58 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులపై టారిఫ్‌ల వ్యత్యాసం 27.83 శాతం ఉంటోంది. ⇒1.03 బిలియన్ డాలర్లుగా ఉంటున్న ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, కోకో ఎగుమతులపై ఏకంగా 24.99 శాతం మేర టారిఫ్‌లు పెరగొచ్చు. దీంతో అమెరికాలో భారతీయ స్నాక్స్ ఖరీదు మరింత పెరగొచ్చు. ⇒ చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలపై వ్యత్యాసం (1.91 బిలియన్ డాలర్ల విలువ) 5.72 శాతంగా ఉంటోంది. బియ్యం మొదలైన ఎగుమతులపై ప్రభావం పడొచ్చు.⇒ 181.49 మిలియన్ డాలర్ల విలువ చేసే డెయిరీ ఉత్పత్తులపై ఏకంగా 38.23 శాతం టారిఫ్ వ్యత్యాసం ఉంటోంది. దీంతో నెయ్యి, వెన్న, పాల పొడిలాంటివి రేట్లు పెరిగి, మన మార్కెట్ వాటా పడిపోవచ్చు.⇒ 199.75 మిలియన్ డాలర్ల విలువ చేసే వంటనూనెల ఎగుమతులపై 10.67 శాతం మేర టారిఫ్ పెరగవచ్చు.⇒ సుమారు 19.20 మిలియన్ డాలర్ల ఎగుమతులే అయినప్పటికీ ఆల్కహాల్, వైన్లపై అత్యధికంగా 122.10 శాతం సుంకాలు విధించవచ్చు.పారిశ్రామిక ఉత్పత్తులు⇒ 12.72 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటున్న ఫార్మా ఉత్పత్తులకు సంబంధించి టారిఫ్ వ్యత్యాసం 10.90 శాతం మేర ఉంటోంది. ఇది విధిస్తే, జనరిక్ ఔషధాలు, స్పెషాలిటీ డ్రగ్స్ రేట్లు పెరిగిపోతాయి.⇒ 14.39 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎలక్ట్రికల్, టెలికం, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులపై 7.24 శాతం టారిఫ్‌లు పడొచ్చు.⇒ మెషినరీ, బాయిలర్, టర్బైన్, కంప్యూటర్ ఎగుమతుల విలువ 7.10 బిలియన్ డాల ర్లుగా ఉంటోంది. వీటిపై 5.29 శాతం టారిఫ్‌ల పెంపు అవకాశాలతో భారత్ నుంచి ఇంజనీరింగ్ ఎగుమతులపై ప్రభావం ఉండొచ్చు.⇒ 5.71 బిలియన్ డాలర్ల విలువ చేసే రసాయనాల ఎగుమతులపై (ఫార్మాను మినహాయించి) 6.05 శాతం, 1.71 బిలియన్ డాలర్ల సెరామిక్, గ్లాస్, స్టోన్ ఉత్పత్తులపై 8.27 శాతం, 457.66 మిలియన్ డాలర్ల ఫుట్‌వేర్‌పై 15.56 శాతం ఉండొచ్చు. టెక్స్టైల్స్, ఫ్యాబ్రిక్స్, కార్పెట్లు మొదలైన వాటి ఎగుమతులు 2.76 బిలియన్ డాలర్లుగా ఉండగా వీటిపై సుమారు 6.59 శాతం; 1.06 బిలియన్ డాలర్లుగా ఉన్న రబ్బర్ ఉత్పత్తులపై (టైర్లు, బెల్టులు సహా) 7.76 శాతం; పేపర్ .. కలప ఉత్పత్తులపై (969.65 మిలియన్ డాలర్లు) 7.87 శాతం మేర టారిఫ్‌ల ప్రభావం ఉండొచ్చు.పెద్దగా ప్రభావం / అసలు ప్రభావమే ⇒ ఉండని రంగాలు3.33 బిలియన్ డాలర్ల విలువ చేసే ముడి ఖనిజాలు, పెట్రోలియం ఎగుమతులపై టారిఫ్‌లు మైనస్ స్థాయిలో (మైనస్ 4.36) ఉంటున్నాయి కాబట్టి, కొత్తగా విధించడానికేమీ ఉండకపోవచ్చు.⇒ అలాగే, 4.93 బిలియన్ డాలర్ల గార్మెంట్స్ ఎగుమతులపై, వ్యత్యాసం మైనస్ 4.62 శాతంగా ఉంది కాబట్టి టారిఫ్‌ల భారం ఉండకపోవచ్చు. -
మార్కెట్‌కు గణాంకాలే కీలకం
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ ఈ వారం ప్రధానంగా గణాంకాలపై ఆధారపడనుంది. దేశ, విదేశీ తయారీ, సర్వీసు రంగ గణాంకాలు ఈ వారంలో విడుదలకానున్నాయి. దీనికితోడు పలు దేశాలపై యూఎస్ ప్రభుత్వ తాజా టారిఫ్‌లు బుధవారం(2)నుంచి అమల్లోకి రానున్నాయి. వెరసి ఈ వారం మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా నేడు(31న) స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఇతర వివరాలు చూద్దాం.జీడీపీ ఎఫెక్ట్ గత కేలండర్ ఏడాది(2024) చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో యూఎస్ జీడీపీ అంచనాలకు అనుగుణంగా నెమ్మదించింది. తుది అంచనాల ప్రకారం వార్షిక ప్రాతిపదికన వృద్ధి 3.1 శాతం నుంచి 2.4 శాతానికి మందగించింది. అయితే కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ తెరతీస్తున్న టారిఫ్‌లు ఆర్థిక వ్యవస్థకు మరిన్ని సవాళ్లు విసరనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బిజినెస్ ప్రణాళికలు, కన్జూమర్ వినియోగం తదితరాలపై ప్రతికూల ప్రభావం చూపే వీలున్నట్లు పేర్కొన్నారు. వెరసి ఈ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రసరించనున్నట్లు అభిప్రాయపడ్డారు. సుంకాలపై కన్ను ఈ వారం అమల్లోకిరానున్న ట్రంప్ సుంకాల(టారిఫ్‌లు)పై ప్రపంచవ్తాప్తంగా ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నట్లు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సే పేర్కొన్నారు. వీటితోపాటు గణాంకాలను సైతం పరిగణనలోకి తీసుకోనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలియజేశారు. మార్కెట్ ప్రభావిత అంశాలు కరవుకావడంతో గణాంకాలు, కీలక వాణిజ్య దేశాలపై యూఎస్ టారిఫ్‌లకు ప్రాధాన్యత ఏర్పడినట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా సైతం వివరించారు. అయితే గతేడాది క్యూ4 జీడీపీ నీరసించిన నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లపై కఠినంగా వ్యవహరించకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. హెచ్ఎస్బీసీ పీఎంఐ బుధవారం మార్చి నెలకు హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పీఎంఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం 56.3 నుంచి 57.6కు బలపడింది. అయితే శుక్రవారం(4న) విడుదలకానున్న మార్చి సర్వీసుల రంగ ఇండెక్స్ తొలి అంచనాలలో 59 నుంచి 57.7కు బలహీనపడింది. కాంపోజిటల్ పీఎంఐ సైతం 58.8 నుంచి 58.6కు స్వల్పంగా వెనకడుగు వేసింది. ఇక విదేశీ మారక నిల్వల వివరాలు సైతం 4న వెల్లడికానున్నాయి. ఇక ప్రపంచ దేశాలలో చైనా ఎన్బీఎస్, కైగ్జిన్ తయారీ గణాంకాలు మార్చి నెలకు సోమవారం(నేడు), మంగళవారం(1న) విడుదలకానున్నాయి. ఈ బాటలో ఫిబవ్రరి నెలకు యూరో దేశాల రిటైల్ ధరల ద్రవ్యోల్బణ రేటు 1న వెల్లడికానుంది. ఫిబ్రవరిలో కన్జూమర్ ధరల రేటు తొలి అంచనాల ప్రకారం 2.3 శాతంగా నమోదైంది. ఇదేరోజు యూఎస్ ఫిబ్రవరి ఐఎస్ఎం తయారీ ఇండెక్స్, ఉపాధి కల్పన గణాంకాలు విడుదలకానున్నాయి. 3న యూఎస్ ఐఎస్ఎం సర్వీసుల పీఎంఐ వెల్లడికానుంది. వారాంతాన(4న) వ్యవసాయేతర ఉపాధి, నిరుద్యోగిత గణాంకాలు వెల్లడికానున్నాయి. ఇతర అంశాలు టారిఫ్‌లు, గణాంకాలతోపాటు.. ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో పలు ఇతర అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు వివరించారు. గతేడాది(2024) అక్టోబర్ నుంచీ అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఉన్నట్టుండి గత వారం నికర పెట్టుబడిదారులుగా స్టాక్స్ కొనుగోలు చేశారు. అయితే వారాంతాన(28న) తిరిగి భారీగా అమ్మకాలు చేపట్టారు. దీంతో ఎఫ్‌పీఐల పెట్టుబడులు లేదా అమ్మకాలకు ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఇదేసమయంలో డాలరు ఇండెక్స్ బలహీనపడటం, దేశీ కరెన్సీ ఒక్కసారిగా బలపడటం మార్కెట్లకు జోష్నిచి్చనట్లు పేర్కొన్నారు. దిగుమతుల బిల్లుపై ప్రభావం చూపే ముడిచమురు ధరలు వెనకడుగు వేస్తున్నప్పటికీ బంగారం ధరలు మెరుస్తుండటం కొంత ప్రతికూలమేనని తెలియజేశారు.గత వారమిలా.. గత వారం(24–28) దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య నికరంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 509 పాయింట్లు(0.7 శాతం) పుంజుకుని 77,415 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 169 పాయింట్లు(0.7%) బలపడి 23,519 వద్ద నిలిచింది. అయితే తిరిగి చిన్న షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం నీరసించింది. స్మాల్‌క్యాప్ మరింత అధికంగా 1.4% క్షీణించింది. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2024–25)లో సెన్సెక్స్ 3,764 పాయింట్లు (5.1%) ర్యాలీ చేయగా.. నిఫ్టీ 1,192 పాయింట్లు (5.3 శాతం) లాభపడింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్‌క్యాప్ 5.6%, స్మాల్ క్యాప్ 8 శాతం చొప్పున ఎగశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 25,90,547 కోట్లు పెరిగి 4,12,87,647 కోట్ల(4.82 లక్షల కోట్ల డాలర్లు)కు చేరింది.ఎఫ్‌పీఐల కొనుగోళ్లుకొద్ది నెలుగా అమ్మకాలకే అధికంగా ఆసక్తి చూపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల పెట్టుబడులవైపు దృష్టి మరల్చారు. వెరసి గత ఆరు సెషన్లలో నికరంగా రూ. 31,000 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. పలు కంపెనీల షేర్లు అందుబాటు ధరల్లోకి రావడంతో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇటీవల మార్కెట్లు భారీ నష్టాల నుంచి బయటపడి 6 శాతం పుంజుకోడం గమనార్హం. కాగా.. తాజా పెట్టుబడుల ప్రభావంతో మార్చి నెలలో ఎఫ్‌పీఐల నికర అమ్మకాలు రూ. 3,973 కోట్లకు పరిమితమయ్యాయి! ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, జనవరిలో మరింత అధికంగా రూ. 78,027 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
అమెరికాతో పాతబంధం ముగిసింది.. ప్రతిచర్య తప్పదు: మార్క్ కార్నీ
ఒట్టావా: అమెరికా-కెనడా మధ్య ఆర్థిక, భద్రత, మిలిటరీ సంబంధాల శకం ముగిసిందంటున్నారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ(Mark Carney). ఆటో ఉత్పత్తులపై సుంకాలు విధింపుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసిన నేపథ్యంలోనే కార్నీ ఇలా ఘాటుగా వ్యాఖ్యానించారు.ఆటో ఉత్పత్తులపై 25శాతం సుంకాలు విధిస్తానంటూ ట్రంప్(Trump Tariffs) తాజాగా వ్యాఖ్యానించారు. వచ్చే వారం నుంచి ఇది అమల్లోకి రానుండగా.. ఈ నిర్ణయం ఐదు లక్షల మంది ఉద్యోగులు పని చేసే కెనడా ఆటో పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో తన ఎన్నికల ప్రచారాన్ని సైతం పక్కన పెట్టి మరీ కార్నీ ఒట్టావా చేరుకుని కేబినెట్ భేటీ నిర్వహించారు. ట్రంప్ ఆటో టారిఫ్‌లను అన్యాయంగా అభివర్ణించిన కార్నీ.. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల ఆర్థిక, భద్రత, మిలిటరీ సంబంధాల శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. అలాగే.. ట్రంప్ ఆటో టారిఫ్‌లకు కెనడా ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్ కార్నీ కెనడాకు ప్రధాని అయ్యారు. సాధారణంగా కెనడా ప్రధాని బాధ్యతలు చేపట్టాక అగ్రరాజ్య అధ్యక్షుడితో ఫోన్ కాల్ మాట్లాడడం ఆనవాయితీగా వచ్చేది. అయితే కార్నీ దానిని బ్రేక్ వేశారు. ఇప్పటిదాకా ఆయన ట్రంప్‌తో మాట్లాడకపోవడం గమనార్హం. ట్రంప్‌తో మాట్లాడడానికి తనకేమీ అభ్యంతరాలు లేవని.. అయితే తన దేశానికి తగిన గౌరవం ఇస్తేనే అది జరుగుతుందని కార్నీ ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రాబోయే రెండు, మూడో రోజుల్లో ఇరు దేశాల అధినేతలు మాట్లాడుకోవచ్చని వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి.ఇదీ చదవండి: కెనడా ప్రధాని మార్క్ కార్నీ.. అసలు ఎవరీయన? -
భారత్‌పై యూఎస్ దూకుడుగా వ్యవహరిస్తుందా..?
ప్రతిపాదిత అమెరికా సుంకాల నుంచి భారత్‌కు కొంతమేర ఉపశమనం లభించవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై యూఎస్ విధిస్తున్న సుంకాల మాదిరిగా కాకుండా కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అమెరికా-ఇండియా మధ్య వాణిజ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని, ప్రతిష్టంభన ఏర్పడే సూచనలు కనిపించడం లేదన్నారు.కొత్త వాణిజ్య చర్యలను దశలవారీగా అమలు చేయడానికి వీలుగా అనువైన విధానాన్ని అధికారులు అన్వేషిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. ఈ ఒప్పందంలో భాగంగా గణనీయమైన వాణిజ్య పరిమాణాలు కలిగిన అధిక డిమాండ్ ఉన్న వస్తువులపై ఒక మోస్తరు సుంకం పెరుగుదలనే చూడవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికాకు భారత ఎగుమతులపై సుంకాల ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు.మరిన్ని రాయితీలు కావాలని ఒత్తిడిఅమెరికాకు అధిక పరిమాణంలో ఎగుమతి చేసే కొన్ని కీలక రంగాలపై సుంకాలను తగ్గించాలని భారత వాణిజ్య అధికారులు యూఎస్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. మరో మూడు రోజుల్లో కొత్త వాణిజ్య ఒప్పంద వివరాలను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యూఎస్‌తో చర్చలు సానుకూలంగా ఉన్నప్పటికీ అమెరికా భారత్ నుంచి మరిన్ని రాయితీలు కావాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.616 కోట్లు ఎగనామంఇతర దేశాల మాదిరి కాదు..ప్రపంచ వాణిజ్య పునర్వ్యవస్థీకరణల మధ్య అమెరికా తన టారిఫ్ వ్యూహాన్ని సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. చైనా, మెక్సికో, కెనడాల మాదిరిగా కాకుండా భారత్‌ను ప్రత్యేకంగా చూస్తూ కొంతమేర సుంకాల్లో వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది అమెరికాతో భారత్‌కు ఉన్న ప్రత్యేక వాణిజ్య సంబంధాలను హైలైట్ చేస్తుంది. దీంతో భారీగా టారిఫ్ పెంపుపై ఆందోళన చెందుతున్న భారత ఎగుమతిదారులకు ఉపశమనం లభించనుందనే వాదనలున్నాయి. -
ఐటీ షేర్లకు ఏమైంది?
ఇటీవల కొంత కాలంగా దేశీ ఐటీ దిగ్గజ కౌంటర్లలో కొనుగోళ్లకంటే అమ్మకాలే అధికంగా నమోదవుతున్నాయి. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఐటీ రంగం వెనకడుగులో ఉంది. వెరసి ఎన్ఎస్ఈ నిఫ్టీ–50లో ఐటీ బ్లూచిప్స్ వెయిటేజీ 16 ఏళ్లలోనే కనిష్టానికి పడిపోయింది. ఇందుకు పలు అంశాలు కారణమైనప్పటికీ టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితర దేశీ దిగ్గజాలు మెరుగైన పనితీరునే ప్రదర్శించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.కొత్త ఏడాదిలో యూఎస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లకు తెరతీశారు. అమెరికానే ప్రాధాన్యత అంటూ పలు దేశాలపై ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో యూఎస్ ఆర్థిక వ్యవస్థ మందగించనున్న అంచనాలు ఇటీవల బలపడుతున్నాయి. ఫలితంగా ఉత్తర అమెరికా మార్కెట్లపై అధికంగా ఆధారపడి బిజినెస్ నిర్వహించే దేశీ సాఫ్ట్వేర్ సేవల కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు పరిశ్రమ వర్గాలలో అంచనాలకు తెరలేచింది. దీంతో స్టాక్ మార్కెట్లలో కొత్త ఏడాది (2025) ఐటీ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50లో ఐటీ రంగం వెయిటేజీ తాజాగా 11.66%కి పరిమితమైంది. ఇది 16 ఏళ్ల కనిష్టం కాగా.. 2024 డిసెంబర్లో నమో దైన 13.53% నుంచి వెనకడు గు వేస్తూ వస్తోంది. 2022 మార్చిలో 17.67 శాతాన్ని తాకడం ద్వారా 25 ఏళ్ల గరిష్టాన్ని తాకిన ఇండెక్స్ ప్రస్తుతం భారీగా క్షీణించింది.2025లో వీక్..2025 జనవరి నుంచి ఐటీ ఇండెక్స్ 14 శాతానికిపైగా క్షీణించింది. దేశీయంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా తదితర టాప్–10 కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే ఇండెక్స్ ఎఫ్‌పీఐల అమ్మకాల ఒత్తిడితో ఇటీవల డీలా పడుతోంది. 2024 జనవరి–డిసెంబర్లో నిఫ్టీ 9 శాతమే బలపడగా.. ఐటీ ఇండెక్స్ 22 శాతం లాభపడింది. ఐటీ కంపెనీల ఆదాయం గత కొన్ని త్రైమాసికాలుగా సింగిల్ డిజిట్ వృద్ధికే పరిమితమవుతున్నాయి. అయినప్పటికీ రక్షణాత్మక పెట్టుబడుల రంగంగా ఇన్వెస్టర్లు భావిస్తుంటారని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ట్రంప్ టారిఫ్‌లు, అమెరికా ఫస్ట్ విధానాలు దేశీ ఐటీ కంపెనీలకు చేటు చేయవచ్చన్న ఆందోళనలు ఇటీవల పెరిగినట్లు తెలియజేశారు. మరోపక్క యూఎస్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారవచ్చన్న అంచనాలు నెలకొనడంతో ఐటీ షేర్లలో అమ్మకాలు పెరిగినట్లు విశ్లేషించారు. దీంతో రూపాయి బలహీనపడినప్పటికీ ఇన్వెస్టర్లు ఇతర రంగాలవైపు దృష్టిపెడుతున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: శామ్సంగ్ ఇండియాపై రూ.5,149 కోట్ల జరిమానాఐటీపై భరోసాగత వారం ఐటీ దిగ్గజం యాక్సెంచర్ ఫలితాల విడుదల సందర్భంగా యూఎస్ ప్రభుత్వ వ్యయాలు తగ్గడం ఆదాయంపై ప్రభావం చూపినట్లు పేర్కొంది. అయితే టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితర దేశీ దిగ్గజాలు యూఎస్ ప్రభుత్వం, ఫెడరల్ ఏజెన్సీల కాంట్రాక్టులపై అతితక్కువగా ఆధారపడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. యూఎస్ ఆదాయంలో వీటి వాటా సుమారు 2 శాతమేనని తెలియజేశాయి. అయితే యాక్సెంచర్ యూఎస్ ఆదాయంలో వీటి వాటా 16 శాతంకాగా.. అక్కడి ప్రభుత్వ కాంట్రాక్టుల ప్రభావం దేశీ దిగ్గజాలపై తక్కువేనని నిపుణులు వివరించారు.–సాక్షి, బిజినెస్ డెస్క్ -
ట్రంప్ ఎఫెక్ట్.. కేంద్రం ‘గూగుల్ ట్యాక్స్’ రద్దు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ నిర్ణయాల వల్ల చాలా దేశాలు తమ విధానాలను సమీక్షించుకోవాల్సి వస్తుంది. భారతదేశం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. టారిఫ్ బెదిరింపులు చాలా దేశాలు అమలు చేస్తున్న విధానాల్లో మార్పులకు దారితీస్తున్నాయి. అందులో భాగంగా భారత్ తాజాగా 6 శాతం ‘గూగుల్ ట్యాక్స్’ను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు నేషనల్ మీడియాలో వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి.గూగుల్, మెటా.. వంటి విదేశీ టెక్ కంపెనీలు అందించే ఆన్లైన్ అడ్వర్టైజింగ్ సేవలపై ‘గూగుల్ ట్యాక్స్’ అని పిలువబడే 6 శాతం ఈక్వలైజేషన్ లెవీని భారతదేశం తొలగించే అవకాశం ఉంది. ఫైనాన్స్ బిల్లులో సవరణల నేపథ్యంలో 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ పన్నును రద్దు చేయనున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. 2016లో ప్రవేశపెట్టిన ఈ లెవీ భారత మార్కెట్‌కు గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించే సాధనంగా ఉండేది. విదేశీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ఉనికి భారత్‌లో భౌతికంగా లేకపోయినా కేంద్ర ఖజానాకు తమ వాటాను అందించేలా ప్రత్యేకంగా ఈ లెవీని రూపొందించినట్లు సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్టనర్ తుషార్ కుమార్ తెలిపారు. ఆదాయపు పన్నుకు లోబడి ఉన్న దేశీయ సంస్థలు, సంప్రదాయ అంతర్జాతీయ పన్ను నిబంధనలకు లోబడి ఉన్న విదేశీ సాంకేతిక సంస్థల కార్యకలాపాలను సమతుల్యం చేయడమే ఈ లెవీ ప్రాథమిక లక్ష్యమని వివరించారు.గూగుల్ ట్యాక్స్‌ను కేంద్రం ఎందుకు తొలగిస్తుంది?ఈ లెవీ తొలగింపు భారతదేశం డిజిటల్ పన్నుల చట్రంలో మార్పును సూచిస్తుంది. గూగుల్, మెటా వంటి అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలపై పన్ను వివక్షాపూరితంగా ఉందని నిరంతరం అభ్యంతరం వ్యక్తం చేసిన యూఎస్‌తో వాణిజ్య ఘర్షణలను తగ్గించడానికి ఇది వ్యూహాత్మక చర్యగా పరిగణిస్తుందని కుమార్ అన్నారు. గతంలో ఈ లెవీ విదేశీ డిజిటల్ కంపెనీలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపిందనే వాదనలున్నాయి. భారతీయ వ్యాపారాలకు అందించే ఆన్లైన్ అడ్వర్టైజింగ్ సేవల ద్వారా వచ్చే ఆదాయంపై 6 శాతం పన్నును ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది. పర్యవసానంగా, ఈ ఖర్చుల భారం ప్రకటనదారులపైనే పడేది. తద్వారా భారతీయ సంస్థలకు డిజిటల్ మార్కెటింగ్ ఖర్చులు పెరిగాయని కుమార్ అన్నారు.ఇదీ చదవండి: రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..టెక్ దిగ్గజాలకు ప్రయోజనం చేకూరుతుందా?ఈక్వలైజేషన్ లెవీ రద్దుతో విదేశీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లపై పన్ను భారం తగ్గుతుంది. తద్వారా మరింత అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందించవచ్చు. గ్లోబల్ ప్లాట్ఫామ్లో డిజిటల్ అడ్వర్టైజింగ్ సేవలను పొందే భారతీయ వ్యాపారాలపై మార్కెటింగ్ ఖర్చుల భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మరింత డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది. -
భారత్‌తో వాణిజ్యంపై యూఎస్ స్పై చీఫ్ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తూ వివిధ దేశాల వాణిజ్యాలపై ప్రభావితం చూపుతున్న నేపథ్యంలో ఇండియాపై యూఎస్ వైఖరి ఎలా ఉంటుందోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలపై అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గబ్బార్డ్ తన భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య అత్యున్నత స్థాయిలో జరుగుతున్న నిర్మాణాత్మక చర్చలను ప్రస్తావించారు.న్యూఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్‌లో గబ్బార్డ్ మాట్లాడుతూ.. ఆర్థిక సంబంధాల బలోపేతానికి ఇరువురు నేతలు కట్టుబడి ఉన్నారని నొక్కిచెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న వాణిజ్య చర్చలను భారత అధికారులు వివాద అంశంగా కాకుండా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునే అవకాశంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక సమస్యల పరిష్కారాలకు ఇరు దేశాల నాయకులు ఆచరణాత్మక విధానాలకు మొగ్గు చూపుతున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: కాసులు కురిపిస్తున్న పసిడి.. ఎనిమిదేళ్లలో 200 శాతం రాబడిరక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా భారత అధికారులతో గబ్బార్డ్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాణిజ్యానికి అతీతంగా ఇంటెలిజెన్స్ సహకారం, రక్షణ, విద్య వంటి వివిధ రంగాల అభివృద్ధికి చర్చలు సాగాయి. భారత్, అమెరికాల మధ్య అభివృద్ధి చెందుతున్న భాగస్వామ్యంలో గబ్బార్డ్ పర్యటన కీలకంగా మారింది. ఇరు దేశాలకు సమ్మతంగా ఉండే వాణిజ్య ఒప్పందాన్ని సాధించడంలో ఆమె విశ్వాసంగా ఉన్నట్లు తెలిపారు. -
అమెరికా ఉత్పత్తులపై ఈయూ ప్రతీకార సుంకాలు
బ్రస్సెల్స్: అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య టారిఫ్‌ల యుద్ధం జరుగుతోంది. ఈయూకు సంబంధించిన స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెంచిన 25 శాతం టారిఫ్‌లు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అందుకు ప్రతీకారంగా ఈయూ సైతం గంటల వ్యవధిలోనే అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు ప్రకటించింది. అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక, పాడి ఉత్పత్తులపై కొత్త సుంకాలు వసూలు చేయనున్నట్లు బుధవారం ఈయూ తేల్చిచెప్పింది. 28 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు అతిత్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఒత్తిడి పెంచడంలో భాగంగానే ఈయూ సైతం టారిఫ్‌లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ వెనక్కి తగ్గితే ఈయూ దేశాలు సైతం వెనక్కి తగ్గే అవకాశం ఉంది. టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెవెన్ చెప్పారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికవ్యవస్థలపై టారిఫ్‌ల పేరిట పెనుభారం మోపడం తమకు ఇష్టం లేదన్నారు. అయితే, అమెరికా చర్యలకు ప్రతిచర్యగా తాము సైతం టారిఫ్‌లు విధించాలని నిర్ణయించినట్లు తేల్చిచెప్పారు.