
'డొనాల్డ్ ట్రంప్' శుక్రవారం.. సుంకాల నుంచి గ్రాఫైట్, టంగ్‌స్టన్, యురేనియం, బంగారు కడ్డీలు, ఇతర లోహాలను మినహాయించాలని, సిలికాన్ ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త మార్పు సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికా అధికారుల సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడి ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఈ ప్రకటన తరువాత విమాన భాగాలు, జెనరిక్ ఔషధాలు, దేశీయంగా పండించలేని, తవ్వలేని లేదా సహజంగా ఉత్పత్తి చేయలేని కొన్ని ఉత్పత్తులు, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలు, కాఫీ వంటి వాటికి కూడా భవిష్యత్తులో సుంకాల నుంచి విముక్తి కలిగించే అవకాశం ఉంటుందని సమాచారం.
కొన్ని రోజుల క్రితం యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ తీర్పు వ్యాపారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. బులియన్ దిగుమతి పన్నులకు లోబడి ఉంటుందని సూచించడం కొంత గందరగోళానికి గురిచేసింది. ఆ తరువాత బంగారు కడ్డీలను సుంకాల నుంచి మినహాయించాలనే ఆలోచన తెరమీదకు వచ్చింది.
ఇదీ చదవండి: టిమ్.. యాపిల్ పెట్టుబడి ఎంత?: సీఈఓల మధ్య ట్రంప్ ప్రశ్న
సుంకాలు మాత్రమే కాకుండా.. కొన్ని ఒప్పందాల విషయంలో కూడా ట్రంప్ సంచనలం సృష్టించారు. ఇవి దేశంలోని కీలకమైన మార్కెట్లకు అంతరాయం కలిగించవచ్చని, అమెరికాలో పండించలేని లేదా ఉత్పత్తి చేయలేని వస్తువుల ధరలను పెంచుతాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ట్రంప్.. అంతరిక్షం, కొన్ని ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంలో ఉపయోగించే కీలకమైన పదార్థాలతో సహా అనేక ఖనిజాలపై పరస్పర సుంకాలను ఎత్తివేయడం మొదలుపెట్టారు.
సూడోఎఫెడ్రిన్, యాంటీబయాటిక్స్, ఇతర ఔషధాల వంటి ఫార్మాస్యూటికల్స్ వంటివన్నీ.. ఇప్పటికే వాణిజ్య శాఖ దర్యాప్తుకు లోబడి ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా సుంకాల నుంచి ఉపసమయం పొందుతున్నాయి. అయితే.. సిలికాన్ ఉత్పత్తులతో పాటు, రెసిన్, అల్యూమినియం హైడ్రాక్సైడ్‌లపై సుంకాలను విధిస్తున్నారు.