అమెజాన్ సర్వీసుల్లో అంతరాయం | AWS Outage Disrupts Services For Thousands of US Users, Affects Websites And Gaming Platforms | Sakshi
Sakshi News home page

అమెజాన్ సర్వీసుల్లో అంతరాయం

Oct 20 2025 6:57 PM | Updated on Oct 20 2025 9:05 PM

Amazon Web Services down widespread outage in the US

అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)లోని వివిధ ప్లాట్‌ఫామ్‌ల్లో అంతరాయాలు ఏర్పడినట్లు యూఎస్‌ వినియోగదారులు తెలిపారు. ఈ అంతరాయం కారణంగా చాలా మంది వెబ్‌సైట్‌లను, అమెజాన్‌తో కనెక్ట్ చేసిన గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు.

డౌన్ డిటెక్టర్ ప్రకారం, సోమవారం తెల్లవారుజామున 3:44 గంటల నాటికి 5,852 మంది వినియోగదారులు AWSతో సమస్యలనున్నట్లు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యలు ఎక్కువగా యుఎస్-ఈస్ట్-1 ప్రాంతంలో (77%) కేంద్రీకృతమై ఉన్నాయి. తరువాత యుఎస్-వెస్ట్-1 (13%), యుఎస్-వెస్ట్-2 (10%) ప్రాంతాల్లో నమోదయ్యాయి. అమెజాన్ (.com) వినియోగదారులు కూడా పెద్ద సంఖ్యలో సమస్యలను నివేదించారు. తెల్లవారుజామున 3:44 గంటల నాటికి 14,000 మందికి పైగా వినియోగదారులు అంతరాయం గురించి తెలిపారు.

ఇదీ చదవండి: సెలవున్నా స్టాక్‌ మార్కెట్లు పని చేస్తాయ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement