ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ 2025 అక్టోబర్ నెలలో 14,000 కంటే ఎక్కువ తొలగింపులను ప్రకటించింది. ఈ ప్రభావం క్లౌడ్ సర్వీసెస్, గ్రోసరీ, రిటైల్, ప్రకటనలకు సంబంధించిన విభాగాలపై మాత్రమే కాకుండా.. ఇంజినీర్ బృందాలపై కూడా పడింది.
అమెజాన్ తొలగింపులలో 1,800 మంది ఇంజినీర్లు ఉన్నారని.. న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్ లేఆఫ్స్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో మొత్తం ఉద్యోగుల తొలగింపులు 4,700 కంటే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇందులో 40 శాతం ఇంజినీర్లే ఉన్నట్లు.. వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) ఫైలింగ్‌ల ద్వారా అమెజాన్ వెల్లడించింది. కాగా జనవరి 2026లో కూడా మరోసారి ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి: అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ!
కంపెనీ ఖర్చులను తగ్గించడంలో భాగంగానే.. అమెజాన్ ఈ ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం పెరగడం వల్ల.. మరిన్ని ఉద్యోగాల కోతలకు దారితీసే అవకాశం ఉందని 2025 జూన్‌లో సంస్థ సీఈఓ ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 15.5 లక్షలు.


