వెండిపై అస్సలు తగ్గని కియోసాకి | Rich Dad Poor Dad Robert Kiyosaki Predicts Dramatic Surge in Silver Prices | Sakshi
Sakshi News home page

వెండిపై అస్సలు తగ్గని కియోసాకి

Jan 5 2026 2:09 PM | Updated on Jan 5 2026 2:50 PM

Rich Dad Poor Dad Robert Kiyosaki Predicts Dramatic Surge in Silver Prices

అంతర్జాతీయంగా, దేశీయంగా వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే రికార్డు గరిష్టాలకు చేరాయి. అయితే బంగారం, వెండి వంటి ఆస్తులపై పెట్టుబడులను ప్రోత్సహించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్‌ రాబర్ట్ కియోసాకి వెండి ధరలపై రోజుకో సంచలన అంచనా ప్రకటిస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో మరో సరికొత్త అంచనాను వదిలారు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki). ‘వెండి ధర రేపు ఔన్స్‌కు 100 డాలర్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమై, ఆల్‌టైమ్ గరిష్టాలకు‌ చేరుకుంటుంది’ అంటూ తన ‘ఎక్స్‌’ (మునుపటి ట్విట్టర్) ఖాతాలో ట్వీట్‌ చేశారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? అంటూ యూజర్లలో చర్చను రేకెత్తించారు.

ఈ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లు, మార్కెట్ విశ్లేషకుల మధ్య సందేహాలు రేకెత్తించాయి. ప్రపంచవ్యాప్తంగా లిక్విడ్‌గా ట్రేడ్ అయ్యే కమోడిటీ అయిన వెండి ధర ఒక్క రోజులో ఈ స్థాయికి చేరుకోవాలంటే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం లేదా సరఫరా అంతరాయం వంటి అసాధారణ పరిస్థితులు తలెత్తితేనే సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

కియోసాకి గత కొన్నేళ్లుగా ప్రభుత్వ రుణాలు, ద్రవ్యోల్బణం, ఫియాట్ కరెన్సీల విలువ తగ్గుదలపై హెచ్చరిస్తూ వస్తున్నారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి హార్డ్ అసెట్లలో పెట్టుబడులు పెట్టాలని ఆయన తరచుగా సూచిస్తుంటారు. అయితే, ఆయన అంచనాలు ఎక్కువగా దీర్ఘకాలిక ఆర్థిక ప్రమాదాలపై దృష్టి సారిస్తాయని, తక్షణ ధరల అంచనాలుగా భావించరాదని విమర్శకులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement