అలా ఆలోచిస్తేనే ‘రిచ్‌’ అవుతారు.. కియోసాకీ హెచ్చరిక! | Rich Dad Poor Dad Robert Kiyosaki Warns on Jack Dorseys AI Layoffs | Sakshi
Sakshi News home page

అలా ఆలోచిస్తేనే ‘రిచ్‌’ అవుతారు.. కియోసాకీ హెచ్చరిక!

Feb 28 2026 1:00 PM | Updated on Feb 28 2026 1:20 PM

Rich Dad Poor Dad Robert Kiyosaki Warns on Jack Dorseys AI Layoffs

అమెరికా ఫిన్‌టెక్ దిగ్గజం .. స్క్వేర్, క్యాష్ యాప్‌లకు చెందిన బ్లాక్ (Block Inc.) కంపెనీ ఊహించని నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని సుమారు 10 వేల మంది ఉద్యోగుల్లో 40 శాతం.. అంటే 4,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని స్వయంగా కంపెనీ సీఈఓ జాక్ డార్సీ (ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు) ఇటీవల ప్రకటన చేశారు. ఇది ఆర్థిక సంక్షోభం వల్ల కాదు, కంపెనీ లాభాలు బాగున్నాయి.. షేర్లు 20-25 శాతం పెరిగాయి. కారణం ఒక్కటే.. కృత్రిమ మేధస్సు (AI)!

"ఇంటెలిజెన్స్ టూల్స్ (AI) వాడితే చిన్న టీమ్‌తోనే ఎక్కువ పని, మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయి. ఇది కంపెనీల నడిపించే విధానాన్నే మార్చేసింది" అని డార్సీ స్పష్టంగా చెప్పారు. గతంలో ప్రతి ఉద్యోగి కంపెనీకి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినా, ఇప్పుడు వాళ్ల పనిని ఏఐ చేస్తోందని అంగీకరించారు. దీంతో ఉద్యోగుల సంఖ్య 6 వేల దాటకుండా తగ్గించాలని నిర్ణయించారు.

ఈ పరిణామంపై ప్రసిద్ధ ఆర్థిక గురూ, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకీ (Robert Kiyosak) ‘ఎక్స్‌’ (ట్విట్టర్)లో ఓ శక్తివంతమైన పోస్ట్ చేశారు. "ఏఐ ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చేస్తోంది" అంటూ ఆయన హెచ్చరించారు. "ఉద్యోగిలా ఆలోచిస్తే ఏఐ మిమ్మల్ని భర్తీ చేస్తుంది. అదే వ్యాపారవేత్తలా ఆలోచిస్తే, డార్సీలా ఏఐని 'హైర్' చేసుకుని మీరు ధనికులవుతారు" అని స్పష్టంగా చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement