ప్రధాని అవుతావు: ప్రియాంక గాంధీకి బాబా దీవెనలు, వీడియో వైరల్‌ | Will Be PM Baba Blessing Goes Viral Priyanka Gandhi Assam Visit | Sakshi
Sakshi News home page

ప్రధాని అవుతావు: ప్రియాంక గాంధీకి బాబా దీవెనలు, వీడియో వైరల్‌

Feb 19 2026 7:24 PM | Updated on Feb 19 2026 7:35 PM

Will Be PM Baba Blessing Goes Viral Priyanka Gandhi Assam Visit

కాంగ్రెస్ ఎంపీ , స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్ ప్రియాంక గాంధీ వాద్రా గురువారం అస్సాంకు రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్బంగా  అక్కడ ఆసక్తికర సన్నివేశంచోటు చేసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ పరిణామం కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

కామాఖ్య ఆలయానికి వెళ్ళినప్పుడు ఆమెకు బాబా (సన్యాసి) ఆశీర్వాదం లభించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రియాంక గాంధీ గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడినుంచి నేరుగా ప్రార్థనలు  నగరంలోని కామాఖ్య ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు  చేశారు. అస్సాం నాగరికత, సంస్కృతిని గౌరవిస్తూ, లక్షలాది మంది ప్రజల విశ్వాసంతో ముడిపడి వున్న కామాఖ్య దేవిఅమ్మవారి ఆశీర్వాదం పొందడానికి  వచ్చాననీ ప్రియాంకతెలిపారు. ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత సంతోషంగా అనిపించిందన్నారు. 

ఆలయ సందర్శన సమయంలో నాగ సాధువుతో క్లుప్తంగా సంభాషించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ తలపై చేయి వేసి "హమారా బేటీ ప్రధాన మంత్రి బనేగా (మా కూతురు ప్రధాన మంత్రి అవుతుంది)"  అంటూ దీవించారు. దీంతో ఆమె చిరునవ్వుతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.దీనికి  సంబంధించిన వీడియో తెగ వైరల్‌అవుతోంది.

అనంతరం ప్రియాంక గాంధీ ఎంపీ గౌహతిలోని రాజీవ్ భవన్ (కాంగ్రెస్ భవన్)కు బయలుదేరి వెళ్లారు. బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీలు మరియు అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. మహిళా కాంగ్రెస్ మరియు NSUIతో సహా ఇతర ప్రతినిధులతో కూడా  భేటీ కానున్నారు. 

ఇదీ చదవండి: 60 సెకన్లలో కేరళ ట్రూ స్టోరీ : ఒట్టపాలెం కథ కావాలి స్ఫూర్తి!

అస్సాం అభ్యర్థుల స్క్రీనింగ్‌ను రాహుల్ గాంధీ పర్యవేక్షిస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఎన్నికల ప్రచారం ముమ్మరం కావడంతో రాహుల్ గాంధీ రాష్ట్రంలో అనేక తదుపరి సందర్శనలు చేసే అవకాశం ఉందని అస్సాం కాంగ్రెస్ నాయకులు  తెలిపారు. కాగా రానున్న  అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా  అధికార పీఠారన్ని నిలబెట్టుకోవాలని అధికార బీజేపీ యోచిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది.  అభ్యర్థుల ఎంపికలో తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ  కాంగ్రెస్‌ మధ్య హోరీ హోరీ పోటీ జరగనుంది.

ఇదీ చదవండి : పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్‌: షాకింగ్‌ విషయాలు వెల్లడి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement