ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్ పర్యటన సందర్బంగా కొన్ని వీడియోలు, ఫోటోలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి. ఒమన్‌లో ప్రధాని మోదీకి అక్కడి అత్యున్నత పౌర గౌరవం గార్డ్ ఆఫ్ హానర్ లభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో ప్రధాని ఎడమ చెవికి ఒక చిన్న, రత్నం లాంటి పరికరం అందరి దృష్టినీ ఆకర్షించింది. అది ఇయర్ రింగ్ అని కొందరు, ట్రాన్సలేటర్ కొందరు ఇలా ఆన్‌లైన్‌లో పలు ఊహాగానాలకు దారితీశాయి. అసలు ఇదేంటి? తెలుసుకుందాం.
ప్రధాని మోదీ తన ఇటీవలి పర్యటనల్లో బాగంగా జోర్డాన్, ఇథియోపియా తర్వాత ఒమన్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్బంగా ఆయనకు ఒమన్ రక్షణ వ్యవహారాల మంత్రి డిప్యూటీ పీఎం సయ్యద్ సాహిబ్ బిన్ తారిక్ అల్ సయీద్ ఘనస్వాగతం పలికారు. రిసెప్షన్ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ అయిన వెంటనే ప్రధాని కొత్త స్టైల్ అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి అయితే, నిశితంగా పరిశీలిస్తే ఆ వస్తువు చెవిపోగు కాదని, రియల్ టైం ట్రాన్సలేషన్‌కు ఉపయోగించే పరికరమని తేలింది. అధికారులు వివిధ భాషలలో సంభాషించేటప్పుడు కమ్యూనికేషన్‌కు సహాయం చేయడానికి అంతర్జాతీయ, దౌత్య కార్యక్రమాలు, చర్చల సందర్భంలో ఇలాంటి డివైస్‌లను ఉపయోగిస్తారు. అరబిక్ ఒమన్ అధికారిక భాష. స్థానికులతో సంభాషించేటపుడు ఎప్పటికప్పుడు, మనకు తెలిసిన భాషలో అది తర్జుమా చేసి వినిపిస్తుంది. ఇటీవల భారత్ పర్యటన్ సందర్బంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇలాంటి ట్రాన్స్ లేటర్లు వినియోగించడం గమనార్హం.
Prime Minister @narendramodi arrived in Muscat, Oman, a short while ago. He was warmly received by the Deputy Prime Minister for Defence Affairs His Highness Sayyid Shihab bin Tarik Al Said at the airport. pic.twitter.com/TUj7szjzgN
— PMO India (@PMOIndia) December 17, 2025
> కాగా అధికారిక కార్యక్రమాలు,మోదీ పర్యటనల సమయంలో అక్కడి వారితో మమేకమవుతూ, తన వస్త్రధారణ, తనదైన శైలితో అందరి దృష్టిని ఆకర్షించడం ప్రధానికి అలవాటు. అలా మోదీ ధరించిన టైలర్డ్ జాకెట్లు , విలక్షణమైన రంగుల పాలెట్లు చర్చల్లో నిలిచాయి. గతంలో ఆయన పేరుతో ఎంబ్రాయిడరీ చేయబడిన బంధ్‌గలా సూట్ కూడా ఇందులో ఒకటి.


