కొన్ని వివాహాలు విధి ఆడిన వింత నాటకంలా ఉంటాయి. డెస్టినీ అంటారే అలా..ఒకరితో మనకు రాసిపెట్టి ఉంటే..ఎలాగైనా..ఎన్నేళ్లైనా..మళ్లీ ఒక్కచోటుకి చేర్చి కలిపేస్తుంది.అందుకు నిదర్శనం ఈజంట. బహుశా వీళ్లిద్దరిని విధి ముడివేసిన జంట అనొచ్చేమో. కాదు కాదు.. విపత్తు ముడివేసిన జంట అనాలేమో..!.
అసలేం జరిగిందంటే..నవంబర్ 29న హునాన్ ప్రావిన్స్‌లో ఐదవ వార్షిక హాన్ శైలి సామూహిక వివాహ వేడుక సందర్భంగా 37 జంటలు వైవాహిక బంధంతో ఒక్కటికానున్నాయి. ఆ నేపథ్యంలో ఓ జంట కథ వెలుగులోకి వచ్చింది. లియాంగ్ జిబిన్, లియు జిమెయ్ అనే జంట 15 ఏళ్లక్రితం అసాధారణ పరిస్థితుల్లో ప్రారంభమైన తమ లవ్‌స్టోరీని పంచుకున్నారు.
రెండు జీవితాలను మార్చిన రక్షణ బాధ్యత..
2008లో వెంచువాన్‌లో భూకంపం సంభవించినప్పుడు 22 ఏళ్ల లియాంగ్ అత్యవసర సహాయక చర్యల కోసం సైనికుడిగా పనిచేస్తున్నాడు. అప్పటికి పది సంవత్సరాల వయసున్న లియు, ఒక కూలిపోయిన భవనం రెండొవ అంతస్తులో ఉక్కు కడ్డీలు, ఇటుకల కింద చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ ఉంది. అది చూసిన లియాంగ్ అతడి బృందం సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆమెను కాపాడారు.
ఆ తర్వాత చికిత్స కోసం తక్షణమే ఆస్ప్రతికి తరలించారు. అయితే ఆ చిన్నారి కోలుకున్నాక తన తల్లిదండ్రులతో కలిసి హునాన్‌లోని జుజౌకు వెళ్లిపోయారు. అయితే తనను కాపాడిని సైనికుడి గురించి ఏదో స్పల్ప జ్ఞాపకమే ఉందామెకు. అదీగాక ఆ ఘటన జరిగి చాలా ఏళ్లు కావడంతో అంతగా ఆ సైనికుడి ముఖం అంతగా గుర్తులేదామెకు.
అయితే 2020లో 22 ఏళ్ల లియు చాంగ్షాలో తన తల్లిదండ్రులతో భోజనం చేస్తున్నప్పుడు ఊహించని ఘటన చోటు చేసుకుంది. వాళ్ల టేబుల్‌కి సమీపంలోని మరో టేబుల్ వద్ద కూర్చొన్న వ్యక్తిని చూసి లియు తల్లి గుర్తుపట్టి పలకరించింది. "మీరు మా బిడ్డ లియుని కాపాడిన బ్రదర్ లియాంగ్ మీరేనా అని అడుగుతుంది. పదేళ్ల వయసులో ఆ అమ్మాయి కాస్తా చాలా మారిపోవడంతో గుర్తుపట్టలేక ఇబ్బందిపడతాడు లియాంగ్. ఆ ఘటన గుర్తుంది కానీ ఆ చిన్నారి రూపు రేఖలు చాలా మారిపోవడంతో పోల్చుకోలేకపోతున్నానని చెబుతాడు లియు తల్లితో".
అప్పటి నుంచి లియు ఆ సైనికుడు లియాంగ్‌తో క్రమంతప్పకుండా మాట్లాడుతూ ఉండేది. ఆమె భావల లోతుని అర్థం చేసుకుంటాడు లియాంగ్. అంతేగాదు లియుకి కూడా అతడి దృఢత్వం, విధేయత ఎంతగానో నచ్చుతాయి. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.
లియుని తన జీవితంలోని ఆశాకిరణంగా భావిస్తాడు లియాంగ్. తాను నిరుత్సాహంగా ఉన్నప్పుడల్లా లియు సానుకూలత తనను పైకి లేపుతుందని ప్రగాఢంగా విశ్వసించడమే కాదు జీవితంటే ఆశతో నిండి ఉందని గుర్తు చేస్తుంటాదామె అని భావోద్వేగంగ చెబుతున్నాడు లియాంగ్
విధి ముడివేసిన బంధం..
తమ జర్నీ గురించి చెబుతూ..విధి చాలా అద్భుతమైనది. పన్నేడేళ్ల క్రితం ఆమెను రక్షించాను. పన్నేండేళ్ల తర్వాత ఆమె నా జీవితంలోకి వచ్చింది. భలే చిత్రంగా ఉంది తలుచుకుంటుంటే అని నవ్వుతూ చెబుతున్నాడు లియాంగ్.
(చదవండి: ప్రధాని మోదీ నుంచి బాలీవుడ్ నటుల వరకు అంతా మెచ్చే పటోలా ఫ్యాబ్రిక్..! అంత ఖరీదా..?)


