ధన్యవాదాలకు మించింది..!ఇలాంటి కూతుళ్లు ఉంటే.. | Daughters surprise parents with brand-new car Goes Viral | Sakshi
Sakshi News home page

ధన్యవాదాలకు మించింది..!ఇలాంటి కూతుళ్లు ఉంటే..

Mar 15 2026 10:46 AM | Updated on Mar 16 2026 3:53 PM

Daughters surprise parents with brand-new car Goes Viral

పేరెంట్స్‌ పిల్లలకు గిఫ్ట్‌ల ఇవ్వడం అనేది సర్వసాధారణం. అదే పిల్లలు పెరిగి పెద్దయ్యాక..తల్లిదండ్రులు తమ కోసం చేసిన ప్రతి పనిని గుర్తించుకుని తోచిన రీతిలో గిఫ్ట్‌ ఇచ్చే అద్భుతమైన రోజు ఎంతమంది పెద్దలకు వస్తుంది ఈ అదృష్టం. అలాంటి అదృష్టాన్నే పొందారు ఈ తల్లిదండ్రులు. అంతేకాదండోయ్‌ అమ్మో ఇద్దరూ కూతుళ్లా..?! అనే వారికి ఈ ఘటన చెంపపెట్టు. 

ఇద్దరు టీనేజ్‌ కూతుళ్లు తమ తల్లిదండ్రులకు జీవితకాలం గుర్తుండిపోయే మంచి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఏంటా సర్‌ప్రైజ్‌ అంటే..తమ తల్లిదండ్రల కళ్లకు గంతలుగట్టి మరి రోడ్డు మీదకు నడిపిస్తారు. కుటుంబ సభ్యులు చుట్టూ గుమిగూడి నవ్వుతూ..ఉంటారు. ఒకపక్క ఈ తల్లిదండ్రలుకు మనసులో ఏం జరుగుతుంది, ఏంటని ఆత్రం..ఏంటా అద్భుతమని కుతుహలంతో ఉంటారు. 

అంతే ఆ తర్వాత కూతుళ్ల గంతలు విప్పి పార్క్‌ చేసిన కొత్త కారుని చూపిస్తారు. వారి చేసిన ఆ సడెన్‌ సర్‌ప్రైజ్‌కి నోట మాట రాక భావోద్వేగం చెందుతున్న ఆ తల్లిదండ్రుల ఆనందం మాటలకందనిది. చుట్టుపక్క ఉన్న కుటుంబ సభ్యులంతా చప్పట్లతో సంతోషం వ్యక్తం చేస్తారు. 

అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్‌ చేస్తూ ‘జీవితకాలానికి ఒక చిన్న ధన్యవాదాలు’ అనే క్యాప్షన్‌ను జోడించారు. అంతేగాదు ఆ పోస్ట్‌లో మీరు మాకు ఎప్పుడు ఇది చేయలేరు అన్న మాటలు చెప్పలేదు. హాయిగా ఎరిగిపోండి అని మాత్రమే చెప్పేవారు. 

ఈ కారు మీరు మాకిచ్చిన జీవితకాల భద్రత, మద్దతు, నమ్మకానికి చిన్న పాటి ధన్యవాదాలు తెలుపుతూ ఇస్తున్నదే అంటూ పోస్ట్‌ ముగించారు. చాలామంది నెటిజన్లు ఇది కన్నీళ్లు పెట్టించే ఘటన అని, తల్లిదండ్రులకు ఇంతకు మించిన ఆనందం ఇంకొకటి ఏముంటుంది అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: నాలుగేళ్లలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 65 లక్షల రేంజ్‌..!)
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement