breaking news
viral video
-
మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్
హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మియాపూర్-హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక మహిళను రైల్వే పోలీస్ కానిస్టేబుల్ విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా, ఆమె జుట్టును పట్టుకొని నేలపై ఈడ్చుకుంటూ వెళ్లడం గమనార్హం. అయితే మహిళను కొట్టడం వెనుక కారణాలు ఏంటనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే సదరు మహిళను రైల్వే కానిస్టేబుల్ ఈడ్చుకెళుతున్న సమయంలో భర్త, కూతురు ఆమెను వదిలేయాలంటూ కానిస్టేబుల్‌ను వేడుకున్నారు. కానీ మాట వినిపించుకోని కానిస్టేబుల్ వాళ్లను నెట్టివేసి ఆమెను తన వాహనం వద్దకు ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.ఇదీ చదవండి: టీ20 క్రికెట్లో షఫాలీ వర్మ అరుదైన ఫీట్ -
మధుకర్ మహా మాయగాడు నందు కేసులో కొత్త ట్విస్ట్..!
-
ఆఫీసులో కుక్కల హల్చల్.. ట్రెండింగ్‌లో వీడియో
నిరసనలు పలు రకాలు.. సమస్యను బట్టి వినూత్నంగా, వెరైటీగా చేపట్టేవి మరికొన్ని. కానీ వీధికుక్కల బెడదపై చేపట్టిన ఈ నిరసన మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అధికారులెంతకూ పట్టించుకోవడం లేదంటూ ఏకంగా కుక్కలనే నగర పంచాయతీ కార్యాలయంలోకి తీసుకొచ్చి అధికారి టేబుల్‌పై వదిలేశారు. అంతేకాదు.. కరెన్సీ నోట్లతో దండ వేసి మరీ తమ నిరసనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్‌గా మారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాడ్ నగర్ పంచాయతీ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువసేన జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రాంధవే ఆధ్వర్యంలో కార్యకర్తలు ఈ నిరసన చేపట్టారు. చిన్న సంచుల్లో తీసుకొచ్చిన వీధికుక్కలను కార్యాలయంలోకి తీసుకెళ్లి చీఫ్ ఆఫీసర్ ధీరజ్ భామ్రే టేబుల్‌పై వదిలారు. దీంతో అవి అక్కడి నుంచి అటూ ఇటూ పరుగులు తీయడం వీడియోలో కనిపించింది.Yuva Sena district chief Vikram Randhave reportedly released 4–5 stray dogs inside the Niphad Nagar Panchayat chief officer’s office to protest the growing stray dog menace and alleged inaction by the civic body. 💀😭 pic.twitter.com/0wgQpHP00l— Ghar Ke Kalesh (@gharkekalesh) September 16, 2026నిఫాడ్ పట్టణంలో వీధికుక్కల సంఖ్య పెరిగిపోయిందని, వాటి వల్ల చిన్నారులు, వృద్ధులు, మహిళలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్యకర్తలు ఆరోపించారు. పలువురు కుక్కకాటుకు గురయ్యారని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. గణేశ్ ఉత్సవాల సమయంలో మండపాలకు వచ్చే ప్రజల్లోనూ వీధికుక్కల కారణంగా భయాందోళన నెలకొందని తెలిపారు.వీధికుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించడంతోపాటు వాటిని పట్టుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని రాంధవే డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకుండా టెండర్ ప్రక్రియలపైనే అధికారులు దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే మరోసారి ఇదే తరహాలో అధికారుల కార్యాలయంలో కుక్కలను తీసుకొచ్చి నిరసన చేపడతామని హెచ్చరించారు.ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలోనూ వీధికుక్కల సమస్యను నిరసిస్తూ ఓ వ్యక్తి కుక్క మాస్క్ ధరించి ప్రజావాణికి హాజరైన ఘటన వైరల్‌గా మారింది. తాజాగా నిఫాడ్‌లో కార్యకర్తలు ఏకంగా కుక్కలనే అధికారుల కార్యాలయంలోకి తీసుకురావడంతో ఈ నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.Khandwa, Madhya Pradesh - In a highly unusual form of protest, the Leader of the Opposition in the Khandwa Municipal Corporation, Deepak Rathore, arrived at the district Collectorate during a public hearing accompanied by a man wearing a dog mask. The demonstration was aimed at… pic.twitter.com/fkUih3zv4F— NextMinute News (@nextminutenews7) August 19, 2026ఇదీ చదవండి: మొసలిని ఇంటికి తెచ్చాడు.. అమ్మ మాటతో వెనక్కి వెళ్లాడు -
క్యాష్ కొడితేనే పెళ్లి భోజనం!
మన దగ్గర పెళ్లి తంతు పూర్తవగానే.. కళ్లు చూసేది భోజనాల వైపే. కానీ దక్షిణ కొరియాలో మాత్రం అలా డైరెక్ట్‌గా భోజనానికి వెళ్లడానికి వీల్లేదు. డైనింగ్ రూమ్‌కి ముందుండే సెక్యూరిటీ గార్డు.. ద్వారపాలకుడిలా అమాంతంగా ఆపేస్తాడు. భోజనం చేయడానికి వీల్లేదని నిర్దయగా చెప్పేస్తాడు. ‘కానుక ఇచ్చుకో .. కంచం పుచ్చుకో’ అని హుకుం జారీ చేస్తాడు. అదీనూ ఏదో ఒక గిఫ్ట్ కాదూ.. కచ్చితంగా క్యాషే ఇవ్వాలని ఆర్డర్ వేసేస్తాడు. క్యాష్ ఇచ్చి.. రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాతనే టోకెన్ ఇస్తాడు. దక్షిణ కొరియాలో ఉన్న ఈ వింతైన వివాహ సంస్కృతి గురించి తాజాగా ఓ భారతీయ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. కవర్లో క్యాష్ ఉంటేనే భోజనం అనే ఈ సంస్కృతిని కొరియన్ల భాషలో ‘చుగిగుమ్’ అని పిలుస్తారు. పెళ్లికి వచ్చిన అతిథులు ముందుగా ఓ ప్రత్యేకమైన డెస్క్ వద్ద తమ క్యాష్ కవర్‌ను అందించి తమ పేరు నమోదు చేసుకుంటారు. ఆ తరువాతే వివాహ వేడుకలోపా ల్గొంటారు. అయితే ఎన్నో ఏండ్లుగా వస్తున్న ఈ ఆచారం వెనుక ఒక గొప్ప ఆలోచన ఉంది. గిఫ్ట్స్ రూపంలో కాకుండా డబ్బులు ఇవ్వడమే.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న జంటకు తోడ్పాటునిస్తుందన్నదే ఆ ఆలోచన. అంటే వారిచ్చే డబ్బే వారి కొత్త ఇంటికి అవసరమైన వస్తువులు, ఇతర ఖర్చులు వంటి వాటికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకే తమకు నచ్చిన వస్తువు కొనడం కంటే, అవసరానికి తగ్గట్టు ఖర్చు చేసుకునే అవకాశం ఇవ్వడం కొరియన్ల సంస్కృతిలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చుగిగుమ్లో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఎవరు తమ పెళ్లికి ఎంత ఇచ్చారో గుర్తుంచుకోవడం. భవిష్యత్తులో అతిథుల ఇంట్లోనూ పెళ్లి జరిగినప్పుడు తగిన మొత్తంలో తిరిగి ఇవ్వాలనే సామాజిక ఆనవాయితీ కూడా ఉంది. అయితే కాలంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతిలో ఇప్పుడిప్పుడే మార్పులు ప్రారంభమయ్యాయి. అంటే డిజిటల్ పేమెంట్ల ద్వారా కూడా కానుకలు పంపే పద్ధతి నెమ్మదిగా విస్తరిస్తోందంట. ఏది ఏమైన ప్పటికీ ఈ గమ్మత్తైన ఆచారం వివాహం జరిపే కుటుంబాలకు, వివాహం చేసుకుంటున్న దంపతులకు ఆర్థిక తోడ్పాటుని అందిస్తూ.. అండగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by Brut India (@brut.india) (చదవండి: గాఢంగా నిద్రపోతే... 3.76 లక్షలు!) -
అధికారులపై గొడ్డలి పట్టిండు
-
అందాల పోటీ ముగిశాక ఆ బ్యూటీల జీవితం ఎలా ఉంటుందో తెలుసా..!
అందాల పోటీల్లో పాల్గొనడం మిస్ యూనివర్స్ ఇండియా వేదికపై నడవడం తదితరాలన్నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది. కానీ ఈ అందాల భామ ఉమంగా కుమావత్‌కు ల్యాప్‌టాప్, మీటింగ్‌లు వంటి కార్పొరేట్ జీవితంలోకి తిరిగి వచ్చేసింది. జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2026 జాతీయ ఫినాలేలో పోటీపడిన కొద్ది వారాలకే, ఈ ఇంజనీర్ బెంగళూరు గూగుల్ కార్యాలయంలో యథావిధిగా తన డ్యూటీలోకి వచ్చేసింది. View this post on Instagram A post shared by Umanga Kumawat (@umanga_kumawat) ఉమంగా ఆ పోటీల్లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించగా, 52 మంది ఫైనలిస్టులలో టాప్ 20 లోకి ప్రవేశించారు. ఆగస్టు 23న జరిగిన ఫినాలేలో కేరళకు చెందిన కజియా లిజ్ మెజియా టైటిల్‌ని గెలుచుకుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న, ఉమంగా బెంగళూరులోని గూగుల్ క్యాంపస్ నుంచి ఒక నిమిషం నిడివి గల వీడియోకి "నా జీవితంలో ఒక రోజు" అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. ఈ వీడియోలో జిమ్ సెషన్, ఈమెయిల్స్, భోజనం, కాఫీ విరామాలు, పనితో కూడిన ఒక సాధారణ పనిదినం కనిపిస్తుంది. తన రోజు ఉదయం 9.30కి ఎలా మొదలవుతుందో కనిపిస్తుంది. తాను కూడా అందిరిలా ఆఫీస్‌కి బయలు దేరే ముందు ఏం ధరించాలో అని నిర్ణయించుకోవడంతోనే పని ప్రారంభమవుతుందని అంటోంది. ఇక్కడ ఉమంగా బ్లాక్కలర్ జత ధరించి ఉదయం 10.30 గంటకలకి కంపెనీ వెల్నెస్ సెంటర్‌కి వెళ్లడం వీడియోలో చూడొచ్చు. ట్రెడ్‌మిల్‌తో మొదలుపెట్టి, ఆ తర్వాత స్ట్రెచింగ్‌లు, కాళ్ళ వ్యాయామాలు చేస్తుంది. ఆ తర్వాత దుస్తులు సరిచేసుకుని పనిలో నిమగ్నమవ్వడం, మధ్యాహ్నం 12:30 గంటల కల్లా, ల్యాప్‌టాప్ తెరిచి, నోట్‌బుక్, పత్రాలు పరచుకుని తిరిగి కార్పొరేట్ జీవితంలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత 2.10 కల్లా ఒక గిన్నెడు నూడుల్ సూప్, ఆకుకూరలతో సింపుల్‌గా కానిస్తుంది. అక్కడ గూగుల్ క్యాంటిన్లో బిర్యానీ, పండ్లు, డెజర్ట్ ఉన్నా.. వాటి జోలికిపోదామె. ఇక మళ్లీ 3 గంటల కల్లా డెస్క్ వద్దకు వచ్చేస్తుంది సాయంత్రం 4:30 గంటల ప్రాంతం కల్లా నిశబ్దంగా ఉండే లాంజ్‌లోకి వెళ్తుంది. ఇక సాయంత్రం 5.30 గంటలకు కాఫీ బ్రేక్ తీసుకుంటుంది. ఇక పనిగంటలు ముగియగానే ఎలివేటర్వైపు వెళ్లిపోతుంది. చాలామంది అందాల పోటీల్లో పాల్గొనేవారు గ్లామర్ ప్రపంచం వైపుకే వెళ్లిపోతారు. ముఖ్యంగా మోడలింగ్, సినిమాలు లేదా ప్రజలతో మమేకమయ్యే వృత్తులను ఎంచుకుంటే ఉమంగా మాత్రం తన కార్పొరేట్ ఉద్యోగం తోపాటు తనకు నచ్చిన అభిరుచులతో మమేకమవుతుందామె. View this post on Instagram A post shared by Umanga Kumawat (@umanga_kumawat) ఇదీ చదవండి: 'ఆటో డ్రైవర్ కూతురు బంగారం'..! ఒకటి, రెండు కాదు ఏకంగా..) -
పెళ్లి కూతురిని చూసి పెళ్లి కొడుకు షాక్
-
బాత్రూం వస్తుందని జంప్ అయ్యాడు!.. ఆపై ట్విస్ట్
హైప్రొఫైల్ హిట్ అండ్ రన్ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టిన ఘటనలో కల్యాణ్ బైన్స్లాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ తర్వాత కూడా అతడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, అతని ప్రయత్నం ఫలించకపోగా.. మళ్లీ పోలీసులకు దొరికిపోయాడు. మరోవైపు.. కల్యాణ్, సహ నిందితులకు శిక్ష పడేంత వరకు తన పోరాటం ఆగదని బాధితురాలు చెబుతోంది. సెప్టెంబర్ 13న గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ సియా ప్రాణాలతో బయటపడింది. చిన్న ఉల్లంఘటనకు చలాన్లు వేసే ట్రాఫిక్ వ్యవస్థ.. ఈ ఘటనను తేలికగా తీసుకోవడాన్ని ఆమె భరించలేకపోయింది. ఆ యాక్సిడెంట్ వీడియోను నెట్టింట పోస్ట్ చేసి.. తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో పోలీసులు సుమోటోగా కేసు విచారణ చేపట్టారు. అయితే తప్పంతా ఆ బైకర్దేనని.. ఆమె దగ్గరకు వచ్చి కట్లు కొట్టిందని నిందితుడు కల్యాణ్ ఆరోపించాడు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన కల్యాణ్.. తన లాయర్‌తో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈలోపు.. నిన్న ఉదయం రాజస్థాన్‌లోని దౌసా సమీపంలో దాక్కున్న అతడిని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు అయితే ఆ సమయంలో బాత్రూంకు వెళ్లాలని చెప్పి కల్యాణ్ రోడ్డు పక్కకు వెళ్లాడు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు చేజ్ చేయగా.. కొంత దూరం వెళ్లాక కిందపడిపోయి స్వల్పంగా గాయపడ్డాడు. పోలీసులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించి తిరిగి అదుపులోకి తీసుకున్నారు. కల్యాణ్‌తో ఓ వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు.Kalyan Bainsla from the Gurugram Hit n Run case arrested and made to kneel like a dog in front of his car…Gaanv todo saale ki! pic.twitter.com/1S40RXGx7k— Roop Darak (@RoopDarak) September 15, 2026వీడియో వైరల్.. కేసులో కీలక మలుపుసెప్టెంబర్ 13న గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై మహిళా బైకర్ శివానీ చౌహాన్ అలియాస్ సియాను కారు ఢీకొట్టిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె తన స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన మారుతి సుజుకి సియాజ్ ఆమె బైక్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి శివానీ రోడ్డుపై పడిపోయి కొంత దూరం వరకు జారుకుంటూ వెళ్లారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేసు వెలుగులోకి వచ్చింది. వీడియోలోని దృశ్యాలను పరిశీలించిన పోలీసులు తొలుత ర్యాష్ డ్రైవింగ్, గాయపర్చిన కేసుగా నమోదు చేశారు. అయితే దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాస్త ఉంటే తన ప్రాణం పోయేదని అటు సియా సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో సీసీటీవీ, వైరల్ వీడియోలను విశ్లేషించిన అనంతరం భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 109 కింద హత్యాయత్నం ఆరోపణను చేర్చారు. అలాగే మహిళను వెంబడించడం, ఆమె మర్యాదకు భంగం కలిగించే చర్యలకు సంబంధించిన సెక్షన్లను కూడా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. మీడియా ముందుకొచ్చి.. ఆపై ఫోన్ స్విచ్ఛాఫ్ఘటన వీడియో వైరల్ అయిన తర్వాత కల్యాణ్ బైన్స్లా మీడియా ముందుకు వచ్చి తన వాదన వినిపించాడు. ఇది కావాలని చేసిన దాడి కాదని, ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పాడు. అయితే అనంతరం అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. అతడు గురుగ్రామ్ నుంచి పాల్వాల్ మీదుగా రాజస్థాన్ వైపు వెళ్లినట్లు గుర్తించి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. చివరకు దౌసా–రాజ్‌గఢ్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కారులో మరో వ్యక్తిఈ ఘటనలో కల్యాణ్‌తో పాటు అతడి బంధువు లవ్నిష్ కూడా కారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనం కల్యాణ్ స్నేహితుడి పేరుతో ఉన్నట్లు సమాచారం. అయితే ఆర్మీలో పని చేస్తున్న ఆ స్నేహితుడికి.. మీడియాలో వార్త వచ్చాకే జరిగిన ఘటన గురించి తెలిసింది. అరెస్ట్ మాత్రమే సరిపోదు: సియా మరోవైపు బాధితురాలు బైకర్ సియా (శివానీ చౌహాన్) ఈ ఘటన ప్రమాదం కాదని ఆరోపించారు. తనను కారు అడ్డుకోవడానికి ప్రయత్నించిందని, తాను వేగం పెంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ కారు తన బైక్‌ను ఢీకొట్టిందని ఆమె చెబుతున్నారు. కారులో నలుగురు ఉన్నారని.. వాళ్లంతా మద్యం సేవించారని.. అందరిపైనా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. నిందితుల అరెస్ట్‌తో కేసు ముగియదని శివానీ స్పష్టం చేశారు. నిందితులకు శిక్ష పడే వరకు తాను సంతృప్తి చెందబోనని చెప్పారు. మరోవైపు కల్యాణ్‌ను కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కేసులో సీసీటీవీ ఫుటేజీ, వైరల్ వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల వాదనలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. This isn't hit and run... it's hit and kill 🖐️Car No: HR 30Y 4949In Gurugram, first a female bike rider was harassed by 4 louts sitting in a Verna car, they made vulgar vulgar gestures When the girl stopped them from doing so and told them to leave, the beasts rammed her… pic.twitter.com/W1141MIGSJ— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 14, 2026 ఇదీ చదవండి: సెక్యూరిటీ రీజన్.. నిరాశగా వెనుదిరిగిన అభిమానులు -
చిన్నారిని ఎత్తుకున్న వ్యక్తిపై ఒక్కసారిగా పడిన పాము
ముంబై: మహారాష్ట్రలోని అంబోలి జలపాతం వద్ద ఓ వ్యక్తి చిన్నారిని ఎత్తుకుని వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ పాము అతడిపై పడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.జలపాతం వద్ద సందర్శకులు తిరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారిని చేతుల్లో పట్టుకున్న వ్యక్తి ముందుకు వెళ్తుండగా పాము అకస్మాత్తుగా పై నుంచి అతడి మీదకు పడింది. ఊహించని పరిణామంతో అక్కడున్నవారు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.పాము తనపై పడిన వెంటనే ఆ వ్యక్తి తీవ్రంగా స్పందించినట్లు వైరల్ దృశ్యాల్లో కనిపిస్తుంది. అతడి చేతుల్లో చిన్నారి ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అయితే పాము కిందపడిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది.వర్షాకాలంలో జలపాతాలు, అడవులను సందర్శించే సమయంలో పాములు, ఇతర వన్యప్రాణులు కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రకృతి ప్రాంతాల్లో రాళ్లు, చెట్లు, పొదల సమీపంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు.అంబోలి జలపాతం వద్ద జరిగిన ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలపై స్పష్టత లేదు. అయితే చిన్నారితో ఉన్న సమయంలో పాము అకస్మాత్తుగా పడటం సందర్శకుల్లో భద్రతపై మరోసారి ఆందోళన కలిగించింది.జలపాతంలో పైనుంచి పామూ పడింది.. వైరల్ వీడియోమహారాష్ట్రలోని అంబోలి జలపాతం వద్ద కుటుంబంతో సరదాగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా పైనుంచి భారీ పాము పడిందిచిన్నారిని ఎత్తుకుని ఉన్న వ్యక్తి పక్కనే పాము పడటంతో అక్కడున్నవారు హడలిపోయి కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఇది కోబ్రా అనిపిస్తుంది pic.twitter.com/cUXm49jM7A— basker reddy (@chicagobachi) September 15, 2026 -
ది ప్యారడైజ్ క్రేజ్.. ఈసారి ఏకంగా వినాయకుడే వెలిశారు
నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ఒక రికార్డు సృష్టించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాంన్నటాయి.వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వాడవాడలా గణేషుడి మండపాలు వెలిశాయి. అయితే ఈ ది ప్యారడైజ్ మూవీ విడుదల కాకముందే అభిమానులు తమదైన స్టైల్లో సంబరాలు నిర్వహించుకుంటున్నారు. విశాఖపట్నంలో ‘ది ప్యారడైజ్’ థీమ్‌ను తలపించేలా ఏకంగా వినాయకుడి విగ్రహాన్ని రూపొందించి పూజలు నిర్వహించారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ( సమంత సీమంతం వేడుక.. అసలెందుకు ఇంత స్పెషల్?)ట్రైలర్ లేకుండానే ది ప్యారడైజ్కాగా ఇటీవల‘ది ప్యారడైజ్’ సినిమాకు ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్‌కి ట్రైలర్ ఉండదు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం టీమ్ మొత్తం కలిసి పనిచేయాలి. ప్రేక్షకులను గ్రాంటెడ్‌గా తీసుకోవడం లేదు. మీకు ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. దీనికోసం నాలుగైదు రోజులు శ్రీకాంత్, అనిరుధ్ అందరూ దానిపై పనిచేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని నాని చెప్పుకొచ్చారు. దీంతో ట్రైలర్ లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా రాబోతోందనే ఆసక్తి నెలకొంది. ఇదీ చదవండి: ’మండాడి‘పై రజినీకాంత్ రివ్యూ.. నటుడు ఎమోషనల్#TheParadise గణేష్ ….. pic.twitter.com/qGruzAux4L— Rajesh Manne (@rajeshmanne1) September 14, 2026 -
బోబా టీని ఆస్వాదించే గణేశుడు..!
గణేశుడు కేవలం భారత్‌లోనే కాదు విదేశాల్లో సైతం వివిధ రూపాల్లో పూజలందుకుంటాడు. ఆయనకు ఎల్లలు లేవు..సర్వత్రా ఆయనే పలు రకాల పేర్లతో పిలిపించుకుంటూ పూజలందుకునే మహాగణపతి. అలాంటి లంబోదరుడుని బ్యాంకాక్‌లో భక్తులు ఎలా ఆరాధిస్తారో వింటే విస్తుపోతారు. మనమంతా వినాయకుడికి మోదకాలు, లడ్డూలు సమర్పిస్తే బ్యాంకాక్ వాసులు మాత్రం బొజ్జ గణపయ్యకు ఏం సమర్పిస్తారో తెలిస్తే షాకవ్వుతారు. థాయ్ కంటెంట్ క్రియేటర్ ప్రియా పింగ్ దీని గురించి షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. బ్యాంకాక్‌లోని యూనియన్ మాల్ వెలుపల ఉన్న గణేశ్ ఆలయంకి సంబంధించిన వీడియోని పంచుకున్నారు. అక్కడ భక్తులు వినాయకుడికి బోబాటీని సమర్పిస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వినాయకుని ఆలయం వద్ద ఉంచిన అనేక బబుల్ మిల్క్ టీ కప్పులను చూడొచ్చు. ఆ ఆలయం వద్ద సమర్పించాలనుకుంటున్న బబుల్ టీ బ్రాండ్ల మెనూ కూడా ఉంటుంది. భక్తులు తమకు నచ్చినది ఎంచుకుని గణనాథుడికి సమర్పిస్తే చాలు. కొందరు ఒకేసారి పదికిపైగా బోబా కప్పులను సమర్పిస్తుండటం కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. కోరిక నెరవేరితే ఎక్కువ కప్పుల బోబా టీని సమర్పిస్తుంటారట. అది ఒక్కోసారి 200 పై చిలుకు బోబా టీలు కూడా కావొచ్చట. ప్రజలు తాము ఆస్వాదించే దాన్నే దేవుడికి సమర్పించడం అనేది థాయి సంప్రదాయానికి సంబంధించిన ఒక నమ్మకమని చెబుతోంది కంటెంట్ క్రియేటర్ ప్రియ. View this post on Instagram A post shared by Piya Ping (@piya_pu)(చదవండి: శ్రీ గణేశాయ ధీమహి’ పాటకు రాధికా మర్చంట్ నృత్యం..!) -
‘శ్రీ గణేశాయ ధీమహి’ పాటకు రాధికా మర్చంట్ నృత్యం..!
అంబానీ కుటుంబం సోమవారం గణేశ్ చతుర్థి వేడుకలను అంగరంగ వైభవంగా రుపుకుంది. నిజానికి అంబానీ ఇంట గణేశ్ నవరాత్రుల్లో అత్యంత ప్రత్యేకం. అక్కడ విఘ్న వినాయకుడు 'యాంటిలియా చా రాజా'గా పూజలందుకుంటాడు. ఇక ఈ వేడుకల్లో భాగంగా శంకర్ మహదేవన్ పాడిన ప్రసిద్ధ భక్తిగీతం ‘శ్రీ గణేశాయ ధీమహి’ పాటకు అంబానీల చిన్న కోడలు, అనంత్ అంబానీ సతీమణి రాధికా మర్చంట్ అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఆమె సుందరమైన ప్రదర్శన, గణేశుని దివ్య రూపాలు, జ్ఞానం, విశ్వవ్యాప్త ఉనికిని కీర్తించే ఈ సంస్కృత భక్తిగీతానికి లయబద్ధంగా చేసిన రాధికా నృత్యం అక్కడున్న వారందరీ దృష్టిని అమితంగా ఆకర్షించింది. కాగా, 2005లో వచ్చిన ‘విరుద్ధ్’ చిత్రంలోనిది ఈ గీతం. దీనికి అజయ్-అతుల్ సంగీత ద్వయం సంగీతం అందించగా, శంకర్ మహదేవన్ ఆలపించారు. అందరీ మనసులను హత్తుకునే ఈ పాట అర్థం ఏంటో సవివరంగా చూద్దామా..!.‘శ్రీ గణేశాయ ధీమహి’ అంటే..‘శ్రీ గణేశాయ ధీమహి’ అనే పదబంధానికి అర్థం గణేశుడిని ధ్యానిద్దాం లేదా గణేశుడి దివ్య రూపాన్ని మననం చేసుకుందాం అని అర్థమట. ఈ పాట వినాయకుడి విభిన్న గుణాలను, రూపాలను వర్ణించే సంస్కృత ప్రార్థన. ఇందులో ఏకదంత, వక్రతుండ, గజానన అంటూ వినాయకుడిని కీర్తిస్తూ సాగే అద్భుతమైన గీతం. ఈ పాటతో ఆయన్ను జ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని, ఆశీర్వాదాలను అందించమంటూ ప్రార్థిస్తారు భక్తులు. ఈ గీతం కేవలం అడ్డంకులు తొలగించే వాడికంటే గొప్పవాడిగా వర్ణిస్తూ వినాయకుడి గుణాలను చాటే భక్తిపాట. View this post on Instagram A post shared by Loveleen Ramchandani (@loveleen_makeupandhair) ఇదీ చదవండి: అత్యంత విలక్షణమైన గణేశ్ ఆలయం..! ఆ రూపంలోనే పూజలందుకుంటాడు..) -
గురుగ్రామ్ హిట్ అండ్ రన్ నిందితుడి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయిన ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని దౌసా నుంచి డ్రైవర్ కల్యాణ్ బైన్స్లాను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం అతడిపై హత్యాయత్నం అభియోగాన్ని నమోదు చేసినట్లు సమాచారం.హర్యానా గురుగ్రామ్‌కు చెందిన సియా.. స్పోర్ట్స్ బైక్ రైడర్. ఆమె ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్‌పై వెళ్తుండగా ఆదివారం గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. మరోవైపు కల్యాణ్ ఆ సమయంలో తెల్లటి సెడాన్ కారును నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కసారిగా కుడివైపునకు మళ్లిన కారు.. హెల్మెట్ ధరించి బైక్‌పై వెళ్తున్న సియాను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోగా.. బైక్ కొంతదూరం జారుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.సీసీటీవీ ఆధారంగా హత్యాయత్నం కేసుప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు ఫుటేజీల్లో కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించి దౌసాలో అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేరానికి గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.‘జాలిపడితే.. ఎందుకు ఆపలేదు?’ ప్రమాదం తర్వాత కల్యాణ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు ఆ యువతి మహిళో, పురుషుడో తెలియదని, ఘటనలో ఒకవైపు కథనం మాత్రమే బయటకు వచ్చిందని చెప్పాడు. ఆమెపై తనకు చాలా బాధ కలిగిందని పేర్కొన్నాడు. అదే సమయంలో అతని లాయర్.. కేవలం వ్యూస్, ఫాలోవర్స్ కోసమే ఆ మహిళా బైకర్ ఇలా చేస్తోందని ఆరోపించాడు. అయితే కల్యాణ్, అతని లాయర్ వ్యాఖ్యలపై సియా తీవ్రంగా స్పందించింది. “నాపై నిజంగా జాలిపడితే.. ప్రమాదం జరిగిన వెంటనే ఎందుకు ఆపలేదు? నేను గాయపడ్డానా లేదా అని చూడటం నీ బాధ్యత కాదా?” అని ప్రశ్నించింది. ప్రమాదం తర్వాత కారు ఆపకుండా వెళ్లిపోయిన తీరును సీసీటీవీ ఫుటేజీలు స్పష్టంగా చూపిస్తున్నాయని పేర్కొంది. అలాగే అతని లాయర్ పైనా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.I don’t think Gurgaon is safe for girls anymore. The guy hit her intentionally as you can see in this clip, he asked her to Stop but she didn’t for her safety. So he hit and run her so badly. https://t.co/eyWEwXt3bn pic.twitter.com/bNdtEw5aSl— LUCK7773 (@Luck_7773) September 15, 2026‘చనిపోయి ఉండొచ్చు’ఈ ప్రమాదంలో తనకు మరింత తీవ్ర గాయాలు అయ్యే అవకాశం ఉందని సియా తెలిపింది. “నా ఎముకలు విరిగి ఉండొచ్చు. అక్కడికక్కడే చనిపోయి ఉండొచ్చు. అదృష్టవశాత్తూ అలా జరగలేదు” అని చెప్పింది. ప్రమాదం తర్వాత ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్లిపోవడం తనను మరింత బాధించిందని పేర్కొంది. సియా తండ్రి రోషన్ చౌహాన్ కూడా నిందితుడికి శిక్ష పడే వరకు తమ కుటుంబం వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.మళ్లీ బైక్ నడుపుతా..గురుగ్రామ్ హిట్ అండ్ రన్ ఘటనలో గాయపడిన బైకర్ సియా మళ్లీ బైక్ నడుపుతానని, అయితే రోడ్లపైకి ఒంటరిగా వెళ్లాలంటే భయంగా ఉంటుందని తెలిపింది. ఆ కారు నడుపుతున్న వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని.. అంటే ఉద్దేశపూర్వకంగా కారు దగ్గరకు వెళ్లడం, కట్ కొట్టడం నేను చేయలేదు. రోడ్లపై నా భద్రత నేను చూసుకుంటా. ప్రమాదానికి ముందు కారు తనను పదేపదే వెంబడిస్తూ బైక్‌కు దగ్గరగా వచ్చిందని, దీంతో భయపడి కారు నుంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించానని చెప్పింది. అనవసరంగా సమస్యను ఎందుకు సృష్టించుకుంటాను? అని సియా అంటోంది. అయినా కారు వేగంగా వచ్చి తన బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయిందని వివరించింది. ఈ ఘటన తనను తీవ్రంగా భయపెట్టిందని, ముఖ్యంగా మహిళా బైకర్లు రోడ్లపై ప్రయాణించాలంటే ఆందోళన కలిగించేలా ఉందని సియా పేర్కొంది.VIDEO | Delhi: "I am not interested in 'pinching' a car driver; my own safety on the road is paramount, why would I try to cause unnecessary trouble?" says Siya, woman biker who was hit by a car in Gurugram.(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/rUpg6NAzVs— Press Trust of India (@PTI_News) September 15, 2026ఇదీ చదవండి: జై హింద్ అనలేదని ట్రాన్స్ఫర్ చేశారా? -
పట్టాలపై ప్రియుడితో ఎన్నారై యువతి.. క్షణాల్లో ఘోరం!
న్యూయార్క్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టాలపై కూర్చున్న ఓ జంటను రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో భారత సంతతికి చెందిన మలైకా చిత్రే (24)తో పాటు నేపాలీ-అమెరికన్ నవమ్ కౌల్ (24) ఉన్నారు. బలవన్మరణమా? లేదంటే మత్తులో అక్కడికి చేరారా?.. వీళ్లు పట్టాలపై ఎందుకు కూర్చున్నారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.లోయర్ మన్‌హాటన్‌లోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్వే స్టేషన్లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సౌత్ వింగ్ వైపు వెళ్తున్న నంబర్ 4 రైలు పట్టాలపై ఉన్న ఇద్దరినీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. ఇద్దరూ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటన తర్వాత రైలులో ఉన్న సుమారు 100 మంది ప్రయాణికులను బయటకు తరలించారు.ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో..మలైకా చిత్రే న్యూజెర్సీలోని డేటన్కు చెందినవారు. అకాడియా ఫార్మాస్యూటికల్స్‌లో ఆపరేషన్స్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. నవమ్ కౌల్ సైరేవిల్లేకు చెందినవారు కాగా.. బ్లూమ్‌బర్గ్‌లో ఫైనాన్షియల్ డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ రట్జర్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులే. దాదాపు ఒకే సమయంలో అక్కడి నుంచి పట్టాలు పొందారు.ఈ విషాదంతో వాళ్ల సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నవమ్ ఎంతో స్నేహపూర్వకంగా, సరదాగా ఉండేవాడని స్నేహితులు గుర్తుచేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు దాదాపు మూడు దశాబ్దాల క్రితం నేపాల్ నుంచి అమెరికాకు వలస వచ్చినట్లు తెలిపారు. మలైకా తెలివైన, చురుకైన విద్యార్థినిగా తమకు తెలుసని ఆమె కుటుంబానికి సమీపంలోని పొరుగువారు చెప్పారు. ఇంత చిన్న వయసులో ఇద్దరూ ఇలా ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.A tragic situation in Manhattan. Recent Rutgers graduates Navam Kaul and Malaika Chitre were killed after being struck by a southbound 4 train at Spring Street around 3:15 a.m. Sunday.Reports say Kaul went onto the tracks first and Chitre climbed down after him, apparently…— Shadab Chow 🇺🇸 (@tonyinmycity97) September 15, 2026వైరల్‌గా మారిన వీడియో..ఈ ఘటనకు ముందు ఓ వ్యక్తి తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్‌గా మారింది. అందులో మలైకా, నవమ్ ఇద్దరూ పట్టాలపై ప్రశాంతంగా కూర్చున్నట్లు కనిపిస్తోంది. రైలు వస్తున్న సమయంలోనూ వారు అక్కడే ఉన్నారు. అయితే రైలు డ్రైవర్ మాత్రం.. మలైకా నవమ్ను తన వైపునకు లాగుతున్నట్లు, ఆమె నవ్వుతున్నట్లు కనిపించిందని చెప్పినట్లు సమాచారం.ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. వారిలో ఒకరు ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయి ఉండొచ్చని, ఆమెను కాపాడేందుకు మరొకరు పట్టాలపైకి వెళ్లి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రైలు డ్రైవర్ వారిని గమనించి అత్యవసర బ్రేకులు వేసినా.. అప్పటికే రైలు సమీపంలోకి రావడంతో ఆపడం సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు.మత్తులో ఉన్నారా?ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు మద్యం లేదంటే ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉండి ప్రమాదాన్ని గుర్తించలేకపోయారా? అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే ఆత్మహత్య కోణాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేదని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఆ యాక్సిడెంట్‌తో స్పాట్లోనే చనిపోయేదాన్ని! -
రియల్ ఎస్టేట్ ఢమాల్.. అసలు కారణాలు ఇవే..!
-
నో టాబ్లెట్, నో ఇంజెక్షన్.. భవిష్యత్ మొత్తం 'V ప్యాచెస్' వ్యాధుల చికిత్సకు కొత్త టెక్నాలజీ
-
‘నాపై అంత జాలి ఉంటే..’ కల్యాణ్‌కు బైకర్ సియా కౌంటర్
రోడ్డుపై వెళ్తున్న ఓ యువతి బైక్‌ను కారు ఢీకొట్టడం.. ఆమె కిందపడిపోయినా వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోవడం.. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. గురుగ్రామ్‌లో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. తనను కారు కావాలనే వెంబడించి ఢీకొట్టారని బైకర్ ‘రెబల్ వీల్స్ సియా’ ఆరోపిస్తుండగా.. నిందితుడి తరఫు న్యాయవాది మాత్రం తప్పంతా బైకర్లదేనని అంటున్నాడు.గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆదివారం ఈ ఘటన జరిగింది. సియా తన ఏప్రిలియా ఆర్ఎస్ 457 స్పోర్ట్స్ బైక్‌పై తోటి బైకర్లతో కలిసి వెళ్తోంది. ఆ సమయంలో తెల్లరంగు సెడాన్ తమను వెంబడించిందని ఆమె చెబుతోంది. కారులోని వారు తనకు దగ్గరగా వచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తించారని, దూరంగా ఉండాలని తాను సూచించినా.. బైక్‌ను ఆపాలని సైగలు చేశారని ఆమె ఆరోపించింది. చివరకు కారు పక్క నుంచి వచ్చి తన బైక్‌ను ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయానని తెలిపింది.‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని’ప్రమాదంపై తొలిసారి స్పందించిన సియా.. నిందితుడు కల్యాణ్ బైన్స్లా చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ‘నాపై జాలిపడుతున్నానని చెబుతున్నారు. నిజంగా జాలిపడితే ప్రమాదం తర్వాత ఎందుకు ఆపలేదు?’ అని ప్రశ్నించింది. తనను కారు చాలా దూరం వెంబడించిందని చెబుతూ.. ‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని. ఎముకలు విరిగిపోయేంత తీవ్ర గాయాలు కూడా అయ్యుండొచ్చు’ అని పేర్కొంది.కారు తనను వెంబడించలేదన్న వాదనను కూడా ఆమె ఖండించింది. ‘నా జుట్టు కనిపించింది.. నా దగ్గరకు వచ్చారు.. ఆపాలని సైగ చేశారు. అలాంటప్పుడు బైక్‌పై మహిళ ఉందో లేదో తెలియదని ఎలా చెబుతారు?’ అని ప్రశ్నించింది. ప్రమాదానికి సంబంధించిన రెండు వీడియోల్లోనూ కారు తన బైక్ వైపు లేన్ మార్చి ఢీకొట్టిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపింది.This isn't hit and run... it's hit and kill 🖐️Car No: HR 30Y 4949In Gurugram, first a female bike rider was harassed by 4 louts sitting in a Verna car, they made vulgar vulgar gestures When the girl stopped them from doing so and told them to leave, the beasts rammed her… pic.twitter.com/W1141MIGSJ— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 14, 2026కొత్త వీడియో.. మరో కోణంలో ఢీకొట్టిన దృశ్యంఈ ఘటనకు సంబంధించి సియా వెనుకే వస్తున్న మరో బైకర్ రికార్డు చేసిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో కారు సియా బైక్ వైపు వచ్చి ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. కారు తమను చాలా దగ్గరగా వెంబడించిందని, డ్రైవర్ కిటికీ దించి ఆపాలని సైగ చేశాడని ఆ బైకర్ ఆరోపించాడు. ప్రమాదం తర్వాత కారు వెళ్లిపోవడంతో తాను దాన్ని వెంబడించి డ్రైవర్ ముఖాన్ని కెమెరాలో రికార్డు చేశానని చెప్పాడు. ప్రమాదం కారణంగా సియాకు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అయితే రైడింగ్ గేర్ ధరించి ఉండటంతో తీవ్ర గాయాలు తప్పాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. బైక్ మాత్రం దెబ్బతింది.‘కారులో నలుగురు.. మద్యం మత్తులో ఉన్నారు’సియా సోదరుడు కూడా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రమాదం జరిగిన వెంటనే తనకు సియా ఫోన్ చేసి.. ఎవరో కారుతో ఢీకొట్టి వెళ్లిపోయారని చెప్పిందన్నాడు. కారులో నలుగురు ఉన్నారని, వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించారని ఆమె చెప్పినట్లు వెల్లడించాడు. కారులోని వారు అసభ్యకరమైన సైగలు చేశారని కూడా ఆరోపించాడు. సియా తండ్రి ఈ ఘటనను సాధారణ ప్రమాదంగా చూడలేమని, ఇది హత్యాయత్నంగా భావిస్తున్నామని అన్నారు. రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్ కూడా లేదని.. అలాంటి సమయంలో ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.‘తప్పంతా బైకర్లదే’.. నిందితుడి తరఫు వాదనగురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్యాణ్ బైన్స్లా బాడీబిల్డర్, జిమ్ ట్రైనర్. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ‘ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్’, ‘ఇండియన్ రగ్బీ టీమ్ సభ్యుడు’గా రాసుకున్నాడు. హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్ బైన్స్లా తరఫు న్యాయవాది మాత్రం పూర్తిగా భిన్నమైన వాదన వినిపించారు. కారులో నలుగురు ఉన్నారని.. వారిలో బంధువులు కూడా ఉన్నారని చెప్పారు. బైకర్లు రోడ్డుపై అడ్డంకిగా మారుతున్నారని, వారి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కారు ఫుట్‌పాత్‌ను తప్పించుకునే క్రమంలో కొంచెం ఎడమవైపు వెళ్లిందని.. అదే సమయంలో యువతి కుడివైపు రావడంతో ఢీకొట్టిందని న్యాయవాది చెప్పారు. ప్రమాదం తర్వాత ఆపకపోవడానికి కారణం అక్కడ గుమిగూడిన వారు దాడి చేస్తారనే భయమేనని, ఆ పరిస్థితుల్లో కారు వెళ్లిపోయిందని తెలిపారు. సియా సోషల్ మీడియాలో ఫాలోవర్లు, వ్యూస్ కోసం ఘటనను ప్రచారం చేస్తోందని కూడా ఆరోపించారు. ఆమె బైక్ వేగం గంటకు 140–170 కిలోమీటర్ల వరకు ఉందని వాదించారు.కారు ఎవరిది?ప్రమాదానికి ఉపయోగించిన కారు హరియాణాలోని పల్వాల్‌కు చెందిన మనీష్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తాను ఆ సమయంలో కారులో లేనని మనీష్ స్పష్టం చేశాడు. తాను ఆర్మీలో పనిచేస్తున్నానని, ఘటన జరిగిన సమయంలో అసోంలో విధుల్లో ఉన్నానని చెప్పాడు. ఆదివారం తన కుటుంబానికి చెందిన కారును ఓ స్నేహితుడు తీసుకెళ్లాడని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాతే ప్రమాదం విషయం తనకు తెలిసిందని వివరించాడు.పోలీసుల దర్యాప్తుకల్యాణ్ బైన్స్లా మాత్రం తాను కావాలనే బైకర్‌ను ఢీకొట్టలేదని చెబుతున్నాడు. బైకర్ అధిక వేగంతో వెళ్తుండగా, తాను కారు మలుపు తిప్పే సమయంలో ఢీకొన్నట్లు అతడి వాదన. ప్రమాదం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడానికి బైకర్ల గుంపు దాడి చేస్తుందనే భయమే కారణమని కూడా అతడి తరఫున వాదన వచ్చింది. అయితే మహిళా బైకర్ మాత్రం కారు తనను ఉద్దేశపూర్వకంగా వెంబడించి ఢీకొట్టిందని ఆరోపిస్తోంది. ఈ రెండు వాదనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గురుగ్రామ్ పోలీసులు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వైరల్ వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, కారు వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది? కారు ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ఢీకొట్టిందా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: బీజేపీ బిగ్ విక్టరీ -
సెకన్లలోనే భారీ చెట్టెక్కిన యువతి.. వైరల్‌గా మారిన వీడియో
హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ పూజా గులేరియా చెట్టుపైకి అత్యంత సులభంగా ఎక్కుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎలాంటి నిచ్చెన, ఇతర సహాయం లేకుండానే ఆమె కొన్ని సెకన్లలో చెట్టు పైభాగంలోని కొమ్మ వరకు చేరడం వీడియోలో కనిపించింది. ఆమె వేగం, శరీర సమతుల్యతను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.పూజా గులేరియా హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్. తన ప్రాంతంలోని జీవన విధానం, పరిసరాలు, బహిరంగ కార్యకలాపాలకు సంబంధించిన దృశ్యాలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటారు. ఆమెకు 3 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. చెట్టెక్కుతున్న ఆమె తాజా వీడియో వైరల్ కావడంతో మరోసారి ఆమె పేరు చర్చలోకి వచ్చింది.ఈ వీడియోను నిఖిల్ సైనీ అనే ఎక్స్ యూజర్ సెప్టెంబర్ 13న షేర్ చేశారు. పూజా చెట్టుపైకి ఎక్కిన తీరును ప్రశంసించిన ఆయన.. జిమ్‌కు క్రమం తప్పకుండా వెళ్లే పలువురు పురుషులు, ప్రొఫెషనల్ క్రీడాకారిణులు కూడా ఇంత సులభంగా చెట్టెక్కలేకపోవచ్చని వ్యాఖ్యానించారు. పూజా శారీరక సామర్థ్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.పూజా ఇంత సులభంగా చెట్టెక్కడం ఎలా సాధ్యమవుతోందన్నది వీడియో చూసినవారిలో ఆసక్తిని పెంచింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాల్లో ప్రకృతితో మమేకమైన జీవన విధానంలో వివిధ రకాల శారీరక, బహిరంగ కార్యకలాపాలు సాధారణంగా కనిపిస్తాయి. పూజా కంటెంట్‌లోనూ హిమాచలీ జీవనశైలి, బయట చేసే కార్యకలాపాల దృశ్యాలు కనిపిస్తాయి.వీడియో చూసి ఎవరైనా చెట్టెక్కేందుకు ప్రయత్నించడం ప్రమాదకరం. చెట్టు ఎత్తు, కొమ్మల బలం, నేల పరిస్థితులను అంచనా వేయకుండా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే గాయాలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పూజా గులేరియా చెట్టెక్కిన ఈ వీడియో ఆమె చురుకుదనం, శారీరక సమతుల్యతపై సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీస్తోంది.She is Pooja Guleria, a Himachali content creator with 3 lakh+ followers was looking at her latest reel and how effortlessly she climbs that tree! Pretty sure even men who go to the gym regularly and pro athlete women would struggle to do this so easily . Quite talented! pic.twitter.com/pmnPYlMLe3— Nikhil saini (@iNikhilsaini) September 13, 2026 -
కావాలని మహిళా బైకర్ ను ఢీ కొట్టిన కారు వైరల్ అవుతున్న వీడియో
-
Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్‌కు థ్యాంక్స్ చెప్పిన యువరాజు
పెద్దల నుంచి సామాన్యుల వరకు.. ఎవరినైనా గౌరవించే తీరు ప్రత్యేకమే. అలాంటి ఓ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చేసిన ఈ చిన్న పని.. ఆయన వినయానికి నిదర్శనంగా నిలిచింది.18వ బ్రిక్స్ సదస్సు కోసం భారత్‌కు వచ్చిన ఆయన.. సెప్టెంబర్ 12న ఢిల్లీ నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానాశ్రయానికి బయలుదేరేందుకు కారులో నుంచి దిగిన షేక్ ఖలీద్.. అక్కడున్న అధికారులకు వీడ్కోలు చెబుతున్నారు. ఇంతలో తనను తీసుకొచ్చిన డ్రైవర్‌కు మాత్రం చెప్పకుండా వెళ్లిపోతున్నానని గుర్తించారు.వెంటనే వెనక్కి తిరిగిన ఆయన.. కారు వద్దకు వెళ్లి డ్రైవర్‌తో చేతులు కలిపారు. కాసేపు అతడితో మాట్లాడి మరీ వీడ్కోలు చెప్పారు. ఆ డ్రైవర్ భారతీయుడని ఏఎన్ఐ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘చిన్న పని.. పెద్ద మనసు!’యువరాజు చేసిన ఈ చిన్న పనిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. హోదా, స్థాయి చూడకుండా డ్రైవర్‌ను ప్రత్యేకంగా పలకరించడాన్ని ఆయన వినయానికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. ‘ఇదే అసలైన క్లాస్’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు యూఏఈ వ్యవస్థాపకుడు షేక్ జాయెద్ విలువలను ఈ ఘటన గుర్తుచేస్తోందని పేర్కొన్నారు.భారత్ పర్యటనలో భాగంగా షేక్ ఖలీద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇంధన సరఫరాలు, వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక సహకారం, విద్య, పర్యాటకం తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన భేటీలో భారత్–యూఏఈ బంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపైనా చర్చించారు.18వ బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. ‘బిల్డింగ్ రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ’ అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సుకు 13 మంది ప్రపంచ నేతలు, 17 ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి.అయితే అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, కీలక చర్చల మధ్య.. ఒక భారతీయ డ్రైవర్‌కు స్వయంగా వెనక్కి వెళ్లి వీడ్కోలు చెప్పిన అబుదాబి యువరాజు తీరు మాత్రం ప్రత్యేకంగా నిలిచింది.#WATCH | Delhi: Crown Prince of Abu Dhabi, Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan departs from India after BRICS Summit 2026. pic.twitter.com/cw3XPOlTTz— ANI (@ANI) September 12, 2026 -
వెంబడించి మరీ.. లేడీ బైకర్‌పైకి కారు!
రోడ్డుపై ఓ లేడీ బైకర్‌ను కొందరు ఆకతాయిలు వెంబడించారు. తనను వెంబడించొద్దని.. దూరంగా ఉండాలని ఆమె వాళ్లకు సున్నితంగానే చెప్పింది. అయినా పట్టించుకోకుండా వెంటపడ్డారు. చివరకు కారుతో ఆమె బండిని ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఆమె కింద పడిపోగా.. బైక్ కొద్దిదూరం ముందుకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆదివారం ఈ ఘటన జరిగినట్లు బాధిత బైకర్ సియా వెల్లడించింది. ఆమె తన బైకింగ్ గ్రూప్‌తో కలిసి ఏప్రిలియా ఆర్ఎస్ 457పై వెళ్తుండగా.. ఓ కారు వెనుక నుంచి వెంటపడటం మొదలుపెట్టిందని తెలిపింది. కారులో ఉన్నవారు దూకుడుగా ప్రవర్తించడంతో.. కొంత దూరం పాటించాలని తాను కోరినట్లు చెప్పింది. అయితే వారు బైక్ ఆపాలని చెప్పారని, మద్యం మత్తులో ఉన్నట్లుగా కనిపించారని తెలిపింది.కారు తనను పక్కకు రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించానని సియా తెలిపింది. వెనుక వస్తున్న తన స్నేహితుడు కూడా కారును అడ్డుకునేందుకు ప్రయత్నించాడని చెప్పింది. అయినప్పటికీ కారు డ్రైవర్ బైక్‌కు ముందుగా వచ్చి కట్ చేయడంతో ఢీకొట్టిందని ఆరోపించింది. దాంతో సియా బైక్‌పై నుంచి కిందపడిపోగా.. ఆమె స్పోర్ట్స్ బైక్ కొంత దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లింది.ఈ మొత్తం ఘటన ఆమె బైక్‌కు అమర్చిన యాక్షన్ కెమెరాలో రికార్డైంది. ప్రమాదం తర్వాత సియా స్నేహితుడు కారును వెంబడించి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆపేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్‌ను ప్రశ్నించగా.. తన తప్పేమీ లేదంటూ అక్కడి నుంచి కారుతో వెళ్లిపోయినట్లు సియా తెలిపింది.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సియా.. గురుగ్రామ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరింది. వాహనం నంబర్‌తో పాటు ఆర్సీ యజమాని వివరాలను కూడా వెల్లడించింది. వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ, గురుగ్రామ్, హరియాణా పోలీసులను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.Caught on Cam: Gurugram Woman Biker Thrown Off Aprilia After Car Rams Her for Asking to Keep Distance#Gurugram - A woman motorcyclist in Gurugram has alleged that a car rammed into her sports bike and fled after she asked the driver to keep a distance. The incident, recorded on… pic.twitter.com/Mq3xdfq83o— Siraj Noorani (@sirajnoorani) September 14, 2026 -
కాంగ్రెస్ లోనే... కాంగ్రెస్ తోనే కృతజ్ఞత మా రక్తంలోనే ఉంది
-
గన్నవరం సీఐ అక్రమార్జన రూ.20 కోట్లు
సాక్షి, టాస్క్ ఫోర్స్: కంచే చేను మేసిన చందంగా ప్రజలను రక్షించాల్సిన పోలీస్ అధికారి భక్షకుడిగా మారి లంచాల పేరుతో జలగలా పీడిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారని కృష్ణా జిల్లా గన్నవరం సీఐ బీవీ శివప్రసాద్‌పై తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షుడు తాతేపాముల నాగయ్య రుషి ఆరోపించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గన్నవరం పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసులు, ఇతర వ్యవహారాల్లో దోచుకో, దాచుకో.. అన్నట్టుగా సీఐ శివప్రసాద్ వైఖరి ఉందని ఆ వీడియోలో పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు, దళితులు న్యాయం కోసం వెళ్తే కనీసం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సీఐగా ఇక్కడ చార్జ్ తీసుకున్న రెండేళ్లలోనే ఆయన రూ.20 కోట్లు దండుకున్నారని, సాక్ష్యాధారాలతో సహా అవినీతిని నిరూపిస్తానని ఆయన చాలెంజ్ విసిరారు. ఫోర్జరీ సంతకం విషయమై ముస్తాబాదకు చెందిన ఓ ఆడబిడ్డను సీఐ అన్యాయంగా బెదిరించి అవతలి వారికి న్యాయం చేసేలా వ్యవహరించారన్నారు. చిక్కవరంలో ముగ్గురు బాలురు చెరువులో పడి మృతిచెందిన ఘటనలో బాధ్యులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించినా సీఐ పట్టించుకోలేదన్నారు. పిల్లల చావుకు కారణమైన వారి వద్ద సీఐ డబ్బులు తీసుకుని కథ ముగించేశారని ఆరోపించారు. ఆత్కూరులో ఓ వ్యక్తి దగ్గర బిల్డింగ్‌కు డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు. అక్రమార్జనతో భారీ భవనాలు అక్రమార్జనతో సీఐ కాకినాడ, నున్నలో భారీ బిల్డింగ్లు కడుతున్నారని, ఒక ఇల్లును కబ్జా చేశారని నాగయ్య రుషి తీవ్ర ఆరోపణలు చేశారు. న్యాయం కోసం స్టేషన్ మెట్లు ఎక్కిన పేదలను దోచుకుతింటున్న సీఐపై ఏసీబీ, సీబీసీఐడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశి్నంచారు. చిన్నచిన్న కేసుల్లో కూడా సీఐ ప్రజల నడుములు ఇరగ్గొడుతున్నారని, కానీ గత రెండేళ్లలో ఒక గంజాయి కేసునూ ఆయన నమోదు చేయలేదన్నారు. ఉండవల్లికి చెందిన సింగవరపు వెంకటేశ్వరరావు ప్రతిరోజు సీఐని ఎందుకు కలుస్తున్నాడని, ఇలాంటి గంజాయి విక్రయదారులకు సీఐ అండగా ఉంటున్నారని ధ్వజమెత్తారు. -
ఫ్రీ బస్సు.. పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. వైరల్ అవుతున్న వీడియో
-
బార్బెక్యూలో బీఫ్ : కెనడాలో చిక్కుల్లో భారతీయ మహిళ
కెనడాలో ఒక ప్రవాస భారతీయ మహిళ ఓవర్ యాక్షన్ నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తన ఇంట్లో అద్దెకి ఉంటున్న వ్యక్తిపై అనుచితంగా ప్రవర్తించిన వైనం కలకలం రేపింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కెనడాలోని సరీ నగరంలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది అంటే.కెనడాలో నివసిస్తున్న రాజ్ తివానా అనే భారతీయ మహిళ, తన అద్దెదారుడితో వాగ్వాదానికి దిగింది. ఆ ఇంట్లోని తోటలో తన స్నేహితుడితో కలిసి బార్బెక్యూలో బీఫ్ వండడాన్ని తివానా అభ్యంతరం చెప్పడంతో వివాదం షురూ అయింది. తన ఇంటిని, గోడల్ని పాడు చేస్తున్నారని ఆరోపిస్తూ వారితో గొడవకు దిగింది. అక్కడితో ఆగలేదు ఒక కర్ర ముక్కను తీసుకుని గ్రిల్ పైనుంచి ఆహారాన్ని తోసేసింది. ఆ తరువాత ఇంట్లోకి చొరబడి మరీ ఆమె రాయితో దాడిచేసింది. మస్కిటో బ్యాట్‌తోనూ ఎటాక్ చేసింది. తన యూనిట్ నుంచి వెళ్లిపోమని పదేపదే దూషించడం, అతడిపై ఎటాక్ చేయడం లాంటివి వీడియోలు రికార్డైనాయి. దీంతో బాధితుడు తన యజమానురాలు పదేపదే వేధిస్తోందని, తన పనుల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ వరుస వీడియోలను పోస్ట్ చేశాడు. ఇదీ చదవండి: జొమాటో కస్టమర్ల నెత్తిన పిడుగు, భారీ షాకిచ్చిందిగా! An Indian woman in Canada clashed with her tenant after objecting to him using a barbecue in the garden with a friend on her property. After a video of their altercation went viral, the man shared a series of clips alleging that the incident was part of a larger pattern of… pic.twitter.com/vGMtZnVSmZ— Hate Detector 🔍 (@HateDetectors) September 12, 2026తన గదిని ఖాళీ చేసి వెళ్లాలని వేడుకుంటున్నావినలేదంటూ మరో వీడియో షేర్ చేశాడు. ముందస్తు సమాచారం లేకుండానే లోపలికి వచ్చి తాళాలు మార్చేయడమే కాకుండా, చివరకు అతని ఇంటి ప్రధాన తలుపునే పూర్తిగా తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకో వీడియోలో కొంతమంది పురుషులు ఆ ప్రాంగణంలోకి ప్రవేశించడం, ఘర్షణ పడటం కూడా రికార్డైంది. అతని ఫిర్యాదు మేరకు ఈ సంఘటనకు సంబంధించి తివానాను అరెస్టు చేసినట్టు కూడా ఈ వీడియోల ద్వారా తెలుస్తోంది.ఇదీ చదవండి: నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్Landlord and tenant disputes in Canada are rampant specifically in Punjabi dominated areas and properties; however this incident between Raj Tiwana and her tenant has turned the conversation exceedingly factional; entire incident is being seen from a highly racists point of view… pic.twitter.com/YKQnx07R0v— Arshdeep Singh Saini (@the_lama_singh) September 12, 2026అయితే ఈ ఘటనలో అసలు వివాదానికి కారణాలపై స్పష్టత లేదు. అలాగే దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసులు నమోదు చేసిన అభియోగాలు తదితర అంశాలపై క్లారిటీ లేదు. ఇదీ చదవండి : రూ. 250లతో చెట్టు కింద ఉచిత స్కూలు: KBC 18 కంటెస్టెంట్ ఇంట్రస్టింగ్ స్టోరీ -
యూఏఈ క్రికెటర్‌పై నేపాల్ ఆటగాళ్ల దౌర్జన్యం!
ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్‌లో నేపాల్, యూఏఈ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ రసాభాసగా మారింది. ఆటగాళ్ల మధ్య జరిగిన మాటల యుద్ధం ఘర్షణకు దారి తీసింది. కౌలలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో యూఏఈ 314 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ సందీప్ లమిచానే వేశాడు. అయితే ఓవర్ ప్రారంభానికి ముందే నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. స్ట్రైక్‌లో ఉన్న తనిష్ సూరిని ఉద్దేశించి వికెట్ల వెనుక కీపింగ్ చేస్తున్న ఆసిఫ్ షేక్ చికాకు తెప్పించేలా వ్యాఖ్యలు చేయడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన తనిష్ సూరి ఆసిఫ్ షేక్‌తో మాటల యుద్ధానికి దిగాడు. ఇది గమనించిన సందీప్ లమిచానే ఒక్కసారిగా తనిష్ సూరివైపు దూసుకొచ్చాడు.అప్పటికే అక్కడికి చేరుకున్న మాజీ కెప్టెన్ రోహిత్ పౌడెల్, అర్జున్ కుమాల్లు తనిష్‌ను పక్కకు నెట్టేశారు. చూస్తుండగానే గొడవ పెద్దది కావడంతో తనిష్ లెగ్ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అంపైర్లు విశ్వనాథన్ కాళిదాస్, తబారక్ దార్ జోక్యం చేసుకొని ఆటగాళ్లకు సర్దిచెప్పారు. దీంతో వివాదం ముగిసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే 44 పరుగుల తేడాతో యూఏఈని చిత్తు చేసిన నేపాల్ టైటిల్‌ను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ (102) సెంచరీతో మెరవగా, గుల్సన్ ఝా (52) అర్థసెంచరీ సాధించాడు. యూఏఈ బౌలర్లలో ఇబ్రార్ అహ్మద్ 4 వికెట్లు తీయగా, కుజైమా తన్వీర్ రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 49.1 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా (100 నాటౌట్) సెంచరీ చేయగా, షోయబ్ ఖాన్ (52) హాఫ్ సెంచరీ సాధించాడు. నేపాల్ బౌలర్లలో కరన్ కేసీ 3 వికెట్లు తీయగా, లలిత్ రజ్బన్షీ రెండు వికెట్లు పడగొట్టాడు.🚨 This is the El Clásico of Associate Nations, baby! 🥶 Another heated argument between Nepal and UAE in the final of the ACC Men’s Premier Cup 2026! pic.twitter.com/Rd0QAPca78— Sports Janta Party (@SportJantaParty) September 12, 2026 ఇదీ చదవండి: ఫుట్‌బాల్ చరిత్రలో విచిత్రమైన గోల్ అంటే ఇదే! -
ఫుట్‌బాల్ చరిత్రలో విచిత్రమైన గోల్ అంటే ఇదే!
క్రీడల్లో విచిత్రాలు అరుదుగా జరుగుతుంటాయి. అయితే ఫుట్‌బాల్ ఆటలో తాజాగా జరిగిన ఒక సంఘటనకు తప్పకుండా ఆ విచిత్రాల్లో చోటు ఇవ్వాల్సిందే. సాధారణంగా ఫుట్‌బాల్‌లో ఆటగాళ్లు గోల్ కొట్టే ప్రయత్నం చేస్తే గోల్‌కీపర్లు వాటిని సమర్థంగా అడ్డుకోవడం చూస్తుంటాం. బ్రెజిల్ సెకండ్ డివిజన్ ఫుట్‌బాల్ లీగ్‌లో భాగంగా స్పోర్ట్ రెసిఫే, నోవోరిజోంటినో జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నోవోరిజోంటినో జట్టు బంతిని తాకకుండానే ఆట మొదలైన తొలి నిమిషానికే 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడానికి రెసిఫే డిఫెండర్ అలిసన్ కాసియానో, గోల్ కీపర్ కైక్ ఫ్రాంకాకు పాస్ ఇచ్చాడు.కానీ గోల్ కీపర్ తన పొజిషన్లో లేకపోవడంతో బంతి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. దీంతో చేసేదేం లేక నోవోరిజోంటినో జట్టుకు గోల్ ఇవ్వాల్సి వచ్చింది. వాస్తవానికి ఇది పాత మ్యాచ్ అయినప్పటికీ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చినట్లు మార్కా పత్రిక తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను ఒకసారి చూసేయండి.ఇక అక్టోబర్ 3న భారత్, బ్రెజిల్ మధ్య స్నేహపూర్వక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఐదుసార్లు ఫిఫా చాంపియన్ అయిన బ్రెజిల్‌తో మ్యాచ్ కావడంతో భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఆన్లైన్లో టికెట్లు పెట్టిన కొద్ది గంటల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి.మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల ధరలు రూ.999 నుంచి రూ 15 వేల వరకు ఉన్నాయి. స్టేడియం సామర్థ్యం 67వేలు కాగా.. అందులో 70 శాతం సీట్లను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. బ్రెజిల్‌తో మ్యాచ్‌కు ముందే భారత్ సెప్టెంబర్ 26న బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పనామాతో మ్యాచ్ ఆడనుంది. బ్రెజిల్‌తో మ్యాచ్ అనంతరం అక్టోబర్ 6న ఇదే కోల్‌కతా వేదికగా ఉరుగ్వేతో తలపడనుంది.Meanwhile in Brazil a team took the lead without even touching the ball 😂 pic.twitter.com/rJlab2tUY2— Pulse Sports Nigeria (@PulseSportsNG) September 11, 2026Read: రేపు ఫైనల్.. ఎనిమిదో టైటిల్‌పై కన్నేసిన భారత్ -
భార్య.. భర్త.. ప్రియుడు.. ముగ్గురూ మంచోళ్లే!
వివాహేతర సంబంధాల మోజులో నేరాలు ఘోరాలు జరుగుతున్న రోజుల్లో.. భర్తను చంపే భార్యలు, భార్యలను హతమార్చే భర్తలు, ప్రేమ పేరుతో బ్లాక్మెయిల్ చేసే ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. కానీ దీనికి పూర్తి భిన్నంగా.. ఒక భార్య తనకు భర్త వద్దని, ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో ఆ భర్త తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కథలో ట్విస్టులు మాత్రం సినిమాను మించి ఉన్నాయి!..ఈవీవీ డైరెక్షన్లో వచ్చిన కన్యాదానం చిత్రంలో.. తన స్నేహితుడి ప్రేమను నిలబెట్టేందుకు భార్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపిస్తాడు హీరో. ఆ క్లైమాక్స్‌ను ఏమాత్రం తీసిపోని రేంజ్లో జరిగిన ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటే.. ఆమె మాత్రం అతను వద్దని తెగేసి చెప్పింది. దీంతో ఆ సినిమాలో శ్రీకాంత్ చేసినట్లే.. ప్రియుడి వద్దకే భార్యను చేర్చాడా భర్త. లక్నోకు చెందిన ప్రాంతీయ రక్షక్ దళ్ (PRD) జవాన్ విక్కీకి సొనాలీతో ఏడాది క్రితం వివాహమైంది. అయితే పెళ్లికి ముందే సొనాలీకి తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇద్దరూ స్కూల్ టైం నుంచే స్నేహితులు. ఆ స్నేహం కాస్తా వాళ్లతో పాటే పెరిగి ప్రేమగా మారింది. అయితే అతనితో వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదు. బలవంతంగా విక్కీకి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆమె తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. భర్తను మోసం చేయొద్దని.. సుఖంగా కాపురం చేసుకోమని ఆ ప్రియుడు ఆమెకు హితబోధ చేస్తూ వచ్చాడు. అయితే ఆమె మాత్రం అలా ఉండలేనంటూ తెగేసి చెప్పింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న సొనాలీ అత్తింటి నుంచి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త విక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సమీప జిల్లాలకు సమాచారం పంపి గాలింపు చేపట్టారు. చివరకు..సొనాలీ హర్దోయ్‌లో ఓ వ్యక్తితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. అతను తన ప్రియుడని చెప్పడంతో అంతా కంగుతిన్నారు. బుధవారం పోలీసులు ఇద్దరినీ లక్నోకు తీసుకొచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడించారు. గంటల తరబడి నచ్చజెప్పినా సొనాలీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భర్తతో ఒక్క క్షణం కూడా ఉండటం తనకు ఇష్టం లేదని, తన చిన్ననాటి ప్రియుడితోనే జీవితాంతం ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేసింది. ఆ సమయంలో ప్రియుడు.. భర్త వద్దకే వెళ్లిపోవాలంటూ సూచించడం గమనార్హం.అయితే భార్య మాటలు విన్న విక్కీ కొంతసేపు షాక్‌కు గురైనా.. చివరకు ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. “ఇందులో బలవంతం ఏమీ లేదు. ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో వారితోనే ఉండు” అని చెప్పాడు. అనంతరం ఇరువర్గాల అంగీకారంతో అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత సొనాలీ, ఆమె చిన్ననాటి ప్రియుడు స్థానిక ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేశారు. ఈ సమయంలో ఆమె భర్త విక్కీ స్వయంగా భార్యను ప్రియుడికి అప్పగించాడు.పెళ్లి తర్వాత కూడా చిన్ననాటి ప్రేమను కొనసాగించిన సొనాలీ.. చివరకు తన ప్రియుడినే ఎంచుకుంది. అయితే ఈ ప్రేమకథలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలు బయటపడితే గొడవలు, దాడులు, హత్యలు, బ్లాక్‌మెయిలింగ్‌ల వరకు వెళ్లే ఘటనలు చూస్తుంటాం. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు.. భర్త బలవంతం చేయకుండా భార్య నిర్ణయాన్ని గౌరవించాడు. అంతేకాదు.. ఆమె చేయిని ప్రియుడి చేతిలో పెట్టి దగ్గరుండి పెళ్లి జరిపించాడు. ఆ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది.In #Lucknow's Malihabad, a PRD (Prantiya Rakshak Dal) jawan arranged his wife's marriage to her lover. His wife had run away from home, and upon discovering she was having an affair, the husband deemed it appropriate to have her married to the man rather than create a dispute. pic.twitter.com/9SC6Vdq05m— Siraj Noorani (@sirajnoorani) September 11, 2026 -
వానల్లేకున్నా.. గంగమ్మ గర్జన! బిహార్‌లో 47 లక్షల మంది విలవిల!
వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నా.. బిహార్‌ను వరద కష్టాలు మాత్రం వీడటం లేదు. గంగమ్మ ఉగ్రరూపంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఊళ్లు, రహదారులు, పంట పొలాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజల దైనందిన జీవనం అస్తవ్యస్తమైంది. వరద ఉధృతిని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న సోషల్ మీడియా వీడియోలు పరిస్థితి తీవ్రతను చాటుతున్నాయి. నీటమధ్య చిక్కుకున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుండగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నా పలు ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.భాగల్పూర్ జిల్లా సుల్తాన్‌గంజ్ వద్ద గంగానది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. సెప్టెంబర్ 11 ఉదయం అక్కడ నీటిమట్టం 36.62 మీటర్లకు చేరింది. ఇది ప్రమాద స్థాయి కంటే 2.12 మీటర్లు ఎక్కువ. అయితే ఈ ఉదయం అక్కడ నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ పలు చోట్ల నదీ రక్షణ కట్టలు దెబ్బతినడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.వర్షం తక్కువైనా.. వరద ఎలా?ఈసారి బిహార్ వరదలకు ఒకే కారణం లేదని అధికారుల వివరణ, తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. ఆసక్తికరంగా.. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు బిహార్‌లో సాధారణం కంటే 27 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 1 నాటికి వర్షపాతం లోటు దాదాపు 30 శాతంగా ఉంది. అంటే కొద్దిరోజుల క్రితం వరకు రాష్ట్రం వర్షాభావ పరిస్థితినే ఎదుర్కొంది. ఆ తర్వాతే ఒక్కసారిగా నదుల్లో ప్రవాహం పెరగడంతో వరద పరిస్థితి తలెత్తింది. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి గంగా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, వారాణసి పరిసర ప్రాంతాలతో పాటు ఎగువ గంగా పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల నీరు గంగలోకి చేరి దిగువకు ప్రవహించింది. దీంతో బిహార్‌లో గంగానది నీటిమట్టం వేగంగా పెరిగింది.అంతేకాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన నీటి ప్రవాహం, బిహార్‌లో అక్కడక్కడ కురిసిన వర్షాలు కూడా పరిస్థితిని తీవ్రం చేశాయి. గంగా నీటిమట్టం పెరగడంతో దానిలో కలిసే చిన్న, పెద్ద నదుల నీరు వెనక్కి నిలిచే బ్యాక్‌వాటర్ ప్రభావం ఏర్పడింది. దీంతో ఇప్పటికే నీటితో నిండిన ప్రాంతాల్లో ముంపు మరింత పెరిగింది.నేపాల్ వర్షాల పాత్ర ఎంత?బిహార్ వరదల ప్రస్తావన వచ్చినప్పుడల్లా నేపాల్ పేరు ముందుకు వస్తుంది. కారణం.. ఉత్తర బిహార్‌లోని అనేక ప్రధాన నదులు నేపాల్ హిమాలయ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ రాష్ట్రంలోకి రావడమే. కోసి, గండక్, బాగ్మతి వంటి నదులకు ఎగువ పరీవాహక ప్రాంతాలు నేపాల్‌లో ఉన్నాయి. అక్కడ భారీ వర్షాలు కురిస్తే దిగువ ప్రాంతాలకు ఒక్కసారిగా భారీగా నీరు చేరే అవకాశం ఉంటుంది.ఆగస్టు చివరి వారంలో నేపాల్‌లోని కొన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు నమోదయ్యాయి. దీంతో ఆ ప్రాంతాల నుంచి వచ్చే నదుల్లోనూ ప్రవాహం పెరిగింది. దీనికి తోడు.. ఈసారి గంగా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలు, అక్కడి నుంచి వచ్చిన వరదనీరు ముంచెత్తాయి.బిహార్‌కే వరద ముప్పు ఎందుకింత?బిహార్ భౌగోళిక స్వరూపమే ఆ రాష్ట్రాన్ని వరదలకు అత్యంత సున్నితంగా మారుస్తోంది. ముఖ్యంగా ఉత్తర బిహార్ హిమాలయాల నుంచి వచ్చే నదులు విస్తారమైన మైదాన ప్రాంతాల్లోకి ప్రవేశించే ప్రాంతం. కొండ ప్రాంతాల్లో వేగంగా ప్రవహించే నదులు మైదానాల్లోకి వచ్చిన తర్వాత ప్రవాహ వేగం తగ్గుతుంది. దీంతో అవి తీసుకొచ్చే ఇసుక, మట్టి, సిల్ట్ నదీ పడగలో పేరుకుపోతాయి. దీంతో నదుల నీటిని మోసుకెళ్లే సామర్థ్యం తగ్గి, భారీ ప్రవాహం వచ్చినప్పుడు నీరు ఒడ్డులను దాటి బయటకు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గంగా, కోసి, గండక్, బాగ్మతి, బుడి గండక్, ఘాఘ్రా, మహానంద, పున్పున్ వంటి నదులు బిహార్‌లోని వివిధ ప్రాంతాలకు వరద ముప్పును కలిగిస్తుంటాయి. ముఖ్యంగా కోసి నది తరచూ తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం, భారీగా సిల్ట్ పేరుకుపోవడం వల్ల ఉత్తర బిహార్‌లో వరద సమస్య తీవ్రంగా ఉంటుంది. అందుకే కోసిని చాలాకాలంగా ‘బిహార్ దుఃఖదాయిని’గా పిలుస్తారు.#WATCH | Bhagalpur, Bihar: Over 90 panchayats and several urban areas in the Bhagalpur area remain severely flooded. NH-80 on the Bhagalpur-Patna route has been shut near Bhavnathpur for five days as floodwater flows nearly two feet deep across the road. Floodwaters have also… pic.twitter.com/nuVuW3LYNa— ANI (@ANI) September 12, 2026రక్షణ కట్టలకూ గండంఅదే సమయంలో వరదనీరు గ్రామాలు, పట్టణాలు, పంట పొలాల్లోకి చేరకుండా నదుల వెంట నిర్మించే ఎత్తైన కట్టలను రక్షణ కట్టలు అంటారు. బిహార్‌లో దశాబ్దాలుగా ఇలాంటి కట్టలపై ఆధారపడి వరద నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. అయితే నదుల్లో నీటిమట్టం భారీగా పెరిగినప్పుడు ఈ కట్టలపై నీటి ఒత్తిడి కూడా పెరుగుతుంది. తాజా వరదల్లో భాగల్పూర్లో పలు ప్రాంతాల్లో రక్షణ కట్టలు దెబ్బతినడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఒకచోట కట్ట తెగితే పెద్ద మొత్తంలో నీరు ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాలు, రహదారులు, పొలాల్లోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంటుంది.లక్షల మందిపై ప్రభావంతాజా అధికారిక సమాచారం ప్రకారం 15 జిల్లాల్లో 46.88 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. 88 బ్లాకులు, 561 గ్రామ పంచాయతీల్లో ముంపు పరిస్థితులు నెలకొన్నాయి. రహదారులు, ఇతర రవాణా మార్గాలు దెబ్బతినడంతో అనేక ప్రాంతాల్లో పడవలే ప్రజలకు ప్రధాన రవాణా మార్గంగా మారాయి. భాగల్పూర్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ వరదనీటిలో చిక్కుకున్న వారిని తరలించేందుకు పడవలను ఉపయోగిస్తున్నారు. తాజాగా వరదనీటిలో ఒక వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు మరో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన కూడా చోటుచేసుకుంది.The floods in Bihar should now be declared a national disaster, and immediate assistance should be provided to Bihar. pic.twitter.com/H2YlFNH6HW— Sameera Jain (@SameeraJain6) September 7, 2026సహాయక చర్యలు ముమ్మరంవరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. దాదాపు 33 రెస్క్యూ బృందాలు, సుమారు 700 ప్రభుత్వ పడవలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.వరద ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కమ్యూనిటీ కిచెన్లు పనిచేస్తున్నాయి. పొడి రేషన్, పాలిథిన్ షీట్లు తదితర సహాయ సామగ్రిని పంపిణీ చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం బోటు అంబులెన్సులను కూడా వినియోగిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 1,194 కమ్యూనిటీ కిచెన్లు పనిచేస్తున్నాయి.ఇప్పుడేం జరుగుతోంది?కొన్ని ప్రాంతాల్లో గంగానది నీటిమట్టం స్వల్పంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నా.. పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. సుల్తాన్‌గంజ్‌లో నీటిమట్టం తగ్గుముఖం పట్టినా ప్రమాద స్థాయికి రెండు మీటర్లకు పైగా ఎగువన ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రక్షణ కట్టలపై నీటి ఒత్తిడి కొనసాగుతోంది.ప్రతి ఏటా వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం మాత్రమే కాకుండా.. నదుల్లో పేరుకుపోయే సిల్ట్ నిర్వహణ, రక్షణ కట్టల బలోపేతం, వరద ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, నదుల ప్రవాహ మార్గాలపై శాస్త్రీయ అధ్యయనాలు, దీర్ఘకాలిక వరద నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని తాజా పరిస్థితి మరోసారి గుర్తుచేస్తోంది.వైరల్ ఫెర్రీ వీడియో సంగతేంటి?ఇక భారీగా ప్రయాణికులతో నిండిన ఫెర్రీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో సుమారు 200 మంది ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వీడియో ప్రస్తుత బిహార్ వరదలకు సంబంధించినదా? పాతదా? లేదా ఏఐ సాయంతో రూపొందించిందా? అనేది క్లారిటీ లేదు. అయితే జులై చివరి వారంలోనే ఓ యూట్యూబ్ చానెల్లో ఈ వీడియో అప్లోడ్ కావడం గమనార్హం. అయితే ప్రస్తుత వరద పరిస్థితుల్లో రోడ్డు మార్గాలు దెబ్బతినడంతో పడవలపై ప్రజలు ఆధారపడుతున్న విషయం మాత్రం వాస్తవం.This is not an ocean; this is the Mighty Ganges in Bihar. pic.twitter.com/ecSUSLCahb— Magadh Updates (@magadh_updates) September 11, 2026ఇదీ చదవండి: దుర్మార్గులు: ఇన్స్టాగ్రామ్ ఓపెన్ కావట్లేదని.. -
కళ్లల్లో కారం కొట్టి ఎస్బీఐలో భారీ చోరీ... వీడియో వైరల్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలో చోరీ యత్నం కలకలం రేపింది. సినీ ఫక్కీలో బ్యాంక్ కస్టమర్లా ఎంట్రీ ఇచ్చిన ఒక నిరుద్యోగి క్యాష్ కౌంటర్ వద్ద గలాటా సృష్టించాడు. బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం చల్లి, రూ. 4 లక్షల నగదుతో పరారు కావడానికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.పోలీసుల సమాచారం ప్రకారం నిందితుడిని 28 ఏళ్ల సూరజ్ భోజ్‌రాజ్ బోర్కర్‌గా గుర్తించారు. ఇతను B.Sc పూర్తి చేసి నిరుద్యోగిగా ఉన్నాడు. సాధారణ వినియోగ దారుడిలా నటిస్తూ బ్యాంక్‌లోకి ప్రవేశించి, క్యాష్ కౌంటర్ వద్దకు చేరుకున్నాడు. అనంతరం ఒక్కసారిగా బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం పొడి చల్లడంతో అక్కడంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో రూ. 4 లక్షల నగదుని తస్కరించి అక్కడినుంచి ఉడాయించాడు. కానీ బ్యాంక్ సిబ్బంది, అక్కడే ఉన్న కొందరు పోలీసులు నిందితుడిని వెంటాడారు. బ్యాంక్‌కు సుమారు కిలోమీటర్ దూరంలో, ఘటన జరిగిన 30 నిమిషాల్లోనే అతడిని పట్టుకున్నారు.ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్ महाराष्ट्र,नागपुर इनसे मिलिए,इनका नाम है सूरज भगवा कपड़ा पहन कर उसका भी इज़्ज़त डूबा दिए,दरअसल इसने SBI बैंक में चोरी की प्लानिंग की और लालमिर्च का पाउडर कर्मचारियों के आँख में झोंक दिया,कम से कम 4.5 लाख लेकर फरार हुआ था लेकिन कुछ ही देर में धर लिया गया pic.twitter.com/fXzOd3DUJ4— Anvi Yadav (@Yadavanviroyal) September 11, 2026 పోలీసులు అతని వద్ద నుండి దొంగిలించిన రూ. 4 లక్షల పూర్తి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతను ఉద్యోగం లేకపోవడం వల్లే ఈ దోపిడీకి ఒడిగట్టాడని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేరానికి గల ఖచ్చితమైన కారణాలు, ఇందులో ఇంకెవరి పాత్ర ఉంది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఇదీ చదవండి: బసంతి పులావ్-చేపల ప్రసాదాన్ని స్వీకరించిన బెంగాల్ సీఎం -
‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై క్లారిటీ.. వైరల్‌గా నానీ వీడియో!
నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాను సెప్టెంబరు 24న థియేటర్లలోకి తీసుకున్నట్టు చిత్రబృందం తెలిపింది. విడుదల విషయంలో ఎలాంటి మార్పూ లేదని ఇటీవలే మళ్లీ ప్రకటించింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి.హాయ్ నాన్న ప్రమోషన్స్‌లో..ఈ నేపథ్యంలో గతంలో ‘హాయ్ నాన్న’సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నానీ కేసీఆర్ స్టైల్లో మాట్లాడుతూ కాసేపు అలరించాడు. ఇప్పుడీ వీడయో ‘ది ప్యారడైజ్’ మూవీ ఎట్టి పరిస్థితిల్లో అనుకున్న సమయానికే వస్తుందని చెప్తూ అభిమానులు వీడియోను మరోసారి వైరల్ చేస్తున్నారు.ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..‘తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయితీ పెట్టాలని ఉంది. అలాంటిది ఏం జరగదిక్కడ. సినిమా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితిలో అనుకున్న సమయానికే వస్తుంది. ఆ రోజు థియేటర్ల దగ్గర దావత్ చేసుకోవాలి’ అని నాని కేసీఆర్ స్టైల్లో చెప్పి నవ్వులు పూయించాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. Trailer cut has already been done and it is all set to air. The news of NO TRAILER is just a speculation. Team hasn't confirmed it yet either. #TheParadise pic.twitter.com/x04iEv8KAX— The Cine Gossips (@TheCineGossips) September 11, 2026 -
అమ్మ చివరి చూపు దక్కలేదు.. కృష్ణుడి పాదాల చెంత కన్నీళ్లు!
దాదాపు రెండేళ్లుగా ఆయన జైల్లోనే ఉన్నారు. నమోదైన అభియోగాలపై ప్రభుత్వం ఇప్పటిదాకా ఆధారాల్లేవీ చూపించలేకపోయింది. అయితే చావు బతుకుల మధ్య తన తల్లి.. ఆ కొడుకును చూసేందుకు అర్జీ పెట్టుకుంది. అధికారుల మనసు కరగలేదు. చివరకు.. ఆ తల్లి అంత్యక్రియల కోసం పెరోల్ విషయంలోనూ దుర్మార్గంగా వ్యవహరించింది. పాపం.. కన్నతల్లిని చివరిసారి చూసే అవకాశం కూడా దక్కకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సరాసరి గుడిలోకి వెళ్లి శ్రీకృష్ణుడి విగ్రహం పాదాలను తాకుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బంగ్లాదేశ్‌లో జైల్లో ఉన్న హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన తల్లి సంధ్యా రాణి ధర్ గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. తన కుమారుడిని చివరిసారైనా చూడాలని కోరుకున్నారు. అయితే అందుకు జైలు అధికారులు అంగీకరించలేదు. చివరకు ఆమె మరణించాక అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. అయితే ఆవేదనతో ఆయన పెరోల్ టైం పూర్తికాకముందే మళ్లీ జైలుకు వెళ్లిపోయారు. ఆ మధ్యలో ఆయన దేవుడి సన్నిధిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సంధ్యా రాణి కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమెను చిట్టగాంగ్‌లోని పుండరీక ధామ్‌కు తీసుకొచ్చారు. తన తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకున్న చిన్మయ్ కుటుంబ సభ్యులు.. ఆమెను చివరిసారిగా చూసేందుకు ఆయనకు పరోల్ ఇవ్వాలని బుధవారం అధికారులను కోరారు. అయితే అనారోగ్యంతో ఉన్న బంధువును చూసేందుకు ఖైదీకి పరోల్ ఇచ్చే నిబంధన లేదని అధికారులు కుటుంబానికి తెలిపారు. ఆ తర్వాతి రోజే సంధ్యా రాణి కన్నుమూశారు.ఆమె మరణంతో చిన్మయ్ కుటుంబం మరోసారి అధికారులను ఆశ్రయించింది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయనకు పరోల్ ఇవ్వాలని కోరింది. ఈసారి చిట్టగాంగ్ జిల్లా యంత్రాంగం మానవతా దృక్పథం అని పేర్కొంటూ ఐదు గంటలు మాత్రమే అనుమతి ఇచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు చిట్టగాంగ్ సెంట్రల్ జైలు నుంచి చిన్మయ్‌ను బయటకు తీసుకొచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్మయ్ నేరుగా హతజారీ ప్రాంతంలోని పుండరీక ధామ్‌కు వెళ్లారు. అక్కడ తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అదే సమయంలో ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహం ముందు ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ విగ్రహం పాదాలను తాకారు. జైలులో ఉన్న సమయంలో తల్లి అనారోగ్యం, ఆమెను చూడలేకపోయిన బాధ ఆయనలో ఎంతగా ఉందో ఈ దృశ్యాలు చెప్పకనే చెప్పాయి. తల్లి అంత్యక్రియలు పూర్తయ్యాక చిన్మయ్ తిరిగి జైలు బాట పట్టారు. పరోల్ సమయం రాత్రి 9 గంటల వరకు ఉన్నప్పటికీ.. రాత్రి 8.03 గంటలకే చిట్టగాంగ్ సెంట్రల్ జైలుకు చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.Heartbreaking 💔…!Hindu monk Chinmoy Krishna Das Taken into custody again In BANGLADESHHe was out on parole for few hours to see his dead mother…… pic.twitter.com/WMKX7sy68J— Mamta Painuly Kale (@mamta_kale) September 11, 2026ఒకవైపు తల్లి మరణం.. మరోవైపు ఆమెను బతికుండగానే చివరిసారి చూడలేకపోయిన బాధ.. కేవలం ఐదు గంటల్లోనే అంత్యక్రియలు పూర్తి చేసి మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి.. చిన్మయ్ పరోల్ దృశ్యాలను మరింత భావోద్వేగంగా మార్చాయి.ఆరు క్రిమినల్ కేసులుబంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల హక్కుల కోసం గళం వినిపించిన చిన్మయ్ కృష్ణ దాస్ 2024 నవంబర్ 25న అరెస్టయ్యారు. చిట్టగాంగ్‌లో జరిగిన ఓ ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టైన తర్వాత ఆయనను కోర్టులో హాజరుపర్చగా బెయిల్ నిరాకరించి జైలుకు పంపారు.ఆయన అరెస్టు తర్వాత చిట్టగాంగ్ కోర్టు వద్ద జరిగిన ఆందోళనల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ప్రభుత్వ న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలిఫ్ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులోనూ చిన్మయ్‌ను నిందితుడిగా చేర్చారు. దీనిపై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.ఇవే కాకుండా హత్యాయత్నం, విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడం, విధ్వంసం తదితర ఆరోపణలతో ఆయనపై మరికొన్ని కేసులు నమోదయ్యాయి. మొత్తంగా చిన్మయ్‌పై ఆరు క్రిమినల్ కేసులు కొనసాగుతున్నాయి. వీటిలో నాలుగు కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. మిగిలిన కేసుల కారణంగా ఆయన జైలు నుంచి విడుదల కాలేకపోతున్నారు. దేశద్రోహం కేసులో లభించిన బెయిల్‌పైనా స్టే కొనసాగుతోంది.బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీల హక్కులు, భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వరుస దాడులు, హత్యలు, ఈ మధ్యలోనే చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు, ఆయనపై కొనసాగుతున్న కేసులు, తాజాగా తల్లి బతికుండగానే పరోల్ దక్కకపోవడం వంటి పరిణామాలు వాస్తవ పరిస్థితుల్ని బయటపెడుతున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, మైనారిటీల భద్రత అంశాన్ని భారత్ పలుమార్లు ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదీ చదవండి: ఆల్ టైం హైకి చేరితో భారత్ పరిస్థితి ఏంటి? -
మిరాకిల్.. బస్సులో పడి బతికిపోయాడు!
అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు అనేది సామెత. కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు గానీ, చూసినప్పుడు గానీ అదృష్టం అనే మాట తప్పకుండా వస్తుంది. అదృష్టం అనేది ఎప్పుడు ఎవరి ఎలా వరిస్తుందో ఊహించలేం. విలువైన డబ్బు రూపంలో రావొచ్చు లేదా అమూల్యమైన ప్రాణాలు నిలబడడం కావొచ్చు.. మరేదైనా అవొచ్చు. ఘోర విపత్తులు, భారీ ప్రమాదాలు జరిగినప్పుడు కొంతమంది ప్రాణాలతో బయటపడుతుంటారు. అదృష్టవశాత్తు బతికి బట్టకట్టామని ప్రమాదాల నుంచి బయటపడిన వారు చెబుతుంటారు. ఇలాంటి ఘటన గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. దీని కంటే ఈ వీడియోను ఒకసారి చూడండి.A bus driver in Colombia accidentally left the door open. Seconds later, a speeding motorcyclist collided with the bus and was flung straight through the open doorway instead of crashing into its side. Sometimes, a mistake becomes a miracle! pic.twitter.com/TGKwaHznF8— Harsh Goenka (@hvgoenka) September 9, 2026అసలేం జరిగిందో అర్థం కాలేదా? రహదారిపై ఓ బస్సు వేగంగా వెళులోంది. డ్రైవర్‌గా ఏమరుపాటుగా బస్సు తలుపును తెరిచివుంచాడు. కొద్ది నిమిషాల తర్వాత తెరివుంచిన తలుపులోంచి ఓ వ్యక్తి అమాంతంగా మెరుపు వేగంతో బస్సులోకి వచ్చి పడ్డాడు. ఏం జరిగిందో తెలియక బస్సు డ్రైవర్ అవాక్కయ్యాడు. తెలిశాక గర్వంగా ఫీలయ్యేవుంటాడు!ఈ సంఘటన కొలంబియాలోని బూగా నగరంలో ఆగస్టు 30న జరిగిట్టు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. హెల్మెట్ లేకుండా అతివేగంతో బైకుపై దూసుకొచ్చిన ఓ వ్యక్తి రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా మినీ బస్సును ఢీకొట్టాడు. నేరుగా తలుపు వద్ద బస్సును ఢీకొననడంతో అతడు ఎరిగి బస్సులోపలికెళ్లి పడ్డాడు. బస్సు డ్రైవర్ ఏమరుపాటుగా తలుపు తెరిచివుంచడం బైకర్ పాలిట లక్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన రెండు సీసీటీవీల ఫుటేజీ వైరల్ కావడంతో దీని గురించి ప్రపంచమంతా తెలిసింది.తాజాగా ఈ వీడియోను మన దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయాంక ఎక్స్‌లో షేర్ చేశారు. కొన్నిసార్లు పొరపాటు కూడా అద్భుతంగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియోపై నెటిజనులు సరదా కామెంట్లు పెడుతున్నారు.పొరపాటుతో మిరాకిల్!కొలంబియా అధికారులు పౌరులను ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కేవలం ప్రజా ప్రయోజన ప్రకటన మాత్రమే అంటూ ఓ నెటిజన్ సరదా వ్యాఖ్య పెట్టారు. అతడు చాలా అదృష్టవంతుడు ఎందుకంటే సురక్షితంగా బస్సులో దేన్ని గుద్దుకోకుండా సీట్ల మధ్యలో పడ్డాడని మరో నెటిజన్ పేర్కొన్నారు. కొన్నిసార్లు మనం తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల కూడా మంచి జరుగుతుందని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమని ఇంకొకరు అన్నారు. దేవుడు సర్వత్రా ఉన్నాడనడానికి రుజువు ఈ అద్భుత ఘటన అని ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: మడతపెట్టే ఐఫోన్‌పై పేలుతున్న మీమ్స్ -
రోబోట్ ను తోసేశాడు... రివర్స్ లో తన్ని తరిమింది! అంతా షాక్!
-
ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాన్ని కాదని యోగ టీచర్‌గా!
సురక్షితమైన, స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామంది యువత డ్రీమ్ అలాంటి ఉద్యోగాన్ని వద్దనుకోవడానికి చాలా గట్స్ ఉండాలి. తీరా ఆ నిర్ణయం భవిష్యత్తులో బాధను కలిగించకుండా ఉంటుందా అనే సందేహాం సదా వెంటాడుతుంటుంది. అయినా సరే ఇంతటి భయానక నిర్ణయం తీసుకుంది ఈ మహిళ. అది కూడా దేని కోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు.ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్నిగ్ధా బోస్ సురక్షితమైన స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని కాలదన్నుకుంది. ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా మంచి జీతం ఆర్జించే ఉద్యోగాన్ని వదులకుందామె. అసలు ఈ నిర్ణయాన్ని చాలామంది తప్పుబట్టారు, వెర్రి నిర్ణయంగా అభివర్ణించారు. అయితే ఆ ఉద్యోగంలో తను పనిచేస్తున్నట్లుగా అనిపించలేదని, నిరంతరం ఒత్తిడి, మానసిక అలసట, సొంత శరీరంలో అనుసంధానం కావడానికి సమయమే లేనట్లుగా అనిపించిందని చెబుతుంది. ఏదో ఉక్కిరిబిక్కిరిగా అనిపించి ఆ ఉద్యోగం వదిలేసినట్లు పేర్కొంది స్నిగ్ధా. ఆ తర్వాత మీరట్‌లో యోగాకి సంబంధిచిన 'తులా వెల్నెస్ స్టూడియోని నడుపుతున్నట్లు తెలిపింది. తనకు ఆర్థిక భద్రత కంటే వ్యక్తిగత శ్రేయస్సే ముఖ్యమనిపించిందని అంటోంది. ఇలా తనలా ఉద్యోగం మానేసేంత సౌలభ్యం అందరికీ ఉండకపోవచ్చు. అలాగే తనలా చేయాల్సిన పనిలేదు కూడా. ఒత్తిడితో ఉద్యోగం చేస్తూ కూడా ఆరోగ్యాన్ని చూసుకోచ్చు. ఒక పక్క ఉద్యోగం, అలాగే శారీరక బలం పెంపొందిచుకునేలా చురుగ్గా ఉండే ప్రయత్నం చేయొచ్చని అంటోంది. చెప్పాలంటే జీవితాన్ని మార్చకుండానే ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయొచ్చని, కానీ తనకు ఆ అవకాశం ఉంది కాబట్టి మానసిక ఆరోగ్యమే ప్రధానంగా భావించి, ఇలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నా అని సోషల్ మీడియా వేదికగా తన స్టోరీని పంచుకుంది స్నిగ్ధా. అంతేగాదు నెటిజన్లు కూడా మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న స్నిగ్ధ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ..తమ అనుభవాల్ని పంచుకున్నారు. మరొక యూజర్ తాను కూడా ఎస్బీఐలో ఉద్యోగం మానేసి తనకు నచ్చి గోల్ప్ క్రీడపై ఫోకస్ పెట్టి అంతర్జాతీయ క్రీడాకారిణిగా దూసుకుపోతున్నా అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Snigdha | Certified Yoga & Pranayam Instructor (@tulaa_wellness) (చదవండి: అర ఎకరం..ఏడాదికి రూ. 80 లక్షలు!) -
Viral: బామ్మ జంప్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే! వైరల్ అవుతున్న వీడియో
-
సైనిక విన్యాసంలో పేలిపోయిన చైనా ట్యాంక్!
బంగ్లాదేశ్‌లో సైనిక విన్యాసం విషాదాంతంగా మారింది. ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో భాగంగా ట్యాంక్ నుంచి కాల్పులు జరుపుతుండగా అకస్మాత్తుగా అందులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఓ సైనిక అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన ట్యాంక్.. చైనాకు చెందిందిగా తెలుస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 9) చట్టోగ్రామ్‌లోని హాత్హజారీ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫైరింగ్ రేంజ్లో సైనిక విన్యాసం కొనసాగుతున్న సమయంలో ట్యాంక్ నుంచి గోలాలు(మందు గుండు బాల్స్) ప్రయోగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన అధికారికి తొలుత అత్యవసర చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్లో ఢాకాలోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ (సీఎంహెచ్)కు తరలించారు. బంగ్లాదేశ్ సైన్యం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ (ఐఎస్పీఆర్) ఈ ప్రమాదంపై ప్రకటన చేసింది. అసలు ఏం జరిగింది?ట్యాంక్ నుంచి కాల్పులు జరుపుతున్న సమయంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ట్యాంక్‌లోని మందుగుండు సామగ్రి కారణమా? లేదంటే ట్యాంక్‌లోని ఫైరింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.చైనా తయారీ ట్యాంక్..!ప్రమాదానికి గురైన ట్యాంక్ చైనాకు చెందినదిగా తెలుస్తోంది. అది టైప్–59 అని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లోనూ ఇదే తరహా ట్యాంక్ కనిపిస్తోంది. అయితే బంగ్లాదేశ్ ఆర్మీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ట్యాంక్ మోడల్‌ను వెల్లడించలేదు. టైప్–59ను బంగ్లాదేశ్ ఆర్మీ చాలాకాలంగా వినియోగిస్తోంది. పాత ట్యాంకులను చైనా సాయంతో ఆధునికీకరించి ‘డుర్జోయ్’గా కూడా అప్‌గ్రేడ్ చేసింది.Bangladesh Army’s Chinese-origin Type 59 tank reportedly exploded during a firing exercise, killing 2 crew members and injuring an officer.Made in China. Used in Bangladesh. Deadly outcome. pic.twitter.com/Gn0FRx5ul4— Shadow IND (@ShadowIND_IN) September 9, 2026దశాబ్దాలుగా బంగ్లా ఆర్మీలో..చైనాలో తయారైన టైప్–59.. సోవియట్ కాలం నాటి టీ–54 ట్యాంక్ ఆధారంగా అభివృద్ధి చేసిన ప్రధాన యుద్ధ ట్యాంక్. బంగ్లాదేశ్ ఆర్మీ చాలా కాలంగా ఈ తరహా చైనా తయారీ ఆర్మర్డ్ వాహనాలను వినియోగిస్తోంది. పాతబడుతున్నప్పటికీ వాటిని పూర్తిగా తొలగించకుండా.. ఆధునికీకరణ, అప్గ్రేడ్ల ద్వారా మరికొంతకాలం సేవల్లో కొనసాగిస్తోంది. అందులో భాగంగా 40 టైప్–59 ట్యాంకుల అప్‌గ్రేడ్, మరో 58 టైప్–69ఐఐజీ ట్యాంకుల ఆధునికీకరణకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టినట్లు అక్కడి రక్షణ రంగ నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే బంగ్లాదేశ్ ఆర్మీకి ఇవి కేవలం పాత ట్యాంకులు మాత్రమే కాకుండా.. ఇప్పటికీ దాని ఆర్మర్డ్ ఫ్లీట్‌లో భాగంగా ఉన్న కీలక ప్లాట్ఫారమ్లన్నమాట!.దర్యాప్తు ప్రారంభంఈ ఘటనపై బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ఈ ప్రమాదంపై విచారణ ప్రారంభించినట్లు చెబుతోంది. అయితే పేలుడు ఎలా సంభవించింది? ఫైరింగ్ సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా? మందుగుండు సామగ్రికి సంబంధించిన సమస్య ఏమైనా ఉందా? ట్యాంక్ పనితనం వంటి అంశాలను దర్యాప్తు అధికారులు పరిశీలించనున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. ఫీల్డ్ ఫైరింగ్ వంటి సైనిక శిక్షణ కార్యక్రమాల్లో అనుకోని ప్రమాదాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి చూపించింది.ఇదీ చదవండి: మిడిల్ఈస్ట్లో పాక్‌కు బిగ్ టెస్ట్ -
బిగ్‌బాస్‌లో ఛాన్స్మిస్.. రాజకుమారి పరిస్థితి ఇదా..?
బిగ్‌బాస్ సీజన్ 10 తెలుగులో బిగ్‌బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ రాజకుమారి దయాన. కామన్ మ్యాన్ కేటగిరీలో పోటీ చేసిన ఆమె.. తనదైన ఆటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫిజికల్ టాస్కుల్లో వెనకడుగు వేయకుండా పోరాడిన తీరు.. జడ్జీలతో పాటు ఆడియన్స్‌ను కూడా మెప్పించింది. దీంతో బిగ్‌బాస్ మెయిన్ హౌస్‌లో ఆమెకు చోటు ఖాయమని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా ఆ అవకాశం దక్కలేదు. ( ఇదీ చదవండి: ఇక రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్)పిల్లలతో ఉన్న ఓ వీడియో..ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ అవకాశం కోసం తన వ్యక్తిగత జీవితంలోని విషయాలను బయటపెట్టారంటూ కొందరు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ‘సింపతీ స్టార్’ అంటూ విమర్శలు చేయడంపై రాజకుమారి దయాన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన పిల్లలతో ఉన్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తాను ఎదుర్కొంటున్న బాధను చెప్పుకొచ్చారు.‘సింపతీ స్టార్’ అంటూ రాబందుల కన్నా దారుణంగా..‘హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసరికి నా పిల్లల పరిస్థితి చూసి చాలా బాధేసింది. ‘సింపతీ స్టార్’ అంటూ రాబందుల కన్నా దారుణంగా నన్ను పొడుచుకు తిన్నారు. నేను ఏం తప్పు చేశాను? నాకే అర్థం కావట్లేదు అండి. నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. కానీ నా గురించి మాట్లాడిన మాటలు, నాపై వేసిన నిందలు అన్నీ వింటుంటే… ఒక మనిషిగా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. బయటికి ధైర్యంగా కనిపించినంత మాత్రాన మనసులో బాధ ఉండదని కాదు కదా. నేను కూడా ఒక మనిషినే అండి. నాకూ బాధ ఉంటుంది… నాకూ కన్నీళ్లు వస్తాయి. ఒక్కసారి నా పరిస్థితిని కూడా ఆలోచించండి’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. View this post on Instagram A post shared by rajakumari_dayana 46 (@rajakumari_dayana) -
‘‘మీరంతా సల్లబడేటట్టు చేస్తా.. జాగ్రత్త’’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత 2 వారాలుగా పలు సమస్యలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో ఓ పోలీసు అధికారి నిరసన చేస్తున్న విద్యార్థులను తీవ్రంగా హెచ్చరిస్తూ కనిపించారు. క్యాంపస్‌లో అదనపు పోలీసు బలగాలను మోహరిస్తానని ఆయన హెచ్చరించారు.“ఇంకా బలగాన్ని రప్పిస్తాను.. మీరంతా సల్లబడేటట్టు చేస్తా. మేము గోరఖ్‌పూర్ పోలీసులమని గుర్తుంచుకోండి” అని పోలీసు అధికారి హెచ్చరించినట్లు వీడియోలో వినిపిస్తోంది. వీడియోలో పోలీసు అధికారి చేయి పైకెత్తి పిడికిలి బిగిస్తూ ఆగ్రహంగా మాట్లాడటం కనిపించింది. విద్యార్థులతో ఆయన వాగ్వాదానికి దిగిన సమయంలో కొన్ని అసభ్య పదాలు కూడా వినిపించాయి.ఈ ఘటనపై గోరఖ్‌పూర్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. బహిష్కరణకు గురైన కొందరు విద్యార్థులు విశ్వవిద్యాలయ ప్రాక్టర్తో సమావేశమైన సమయంలో పరిస్థితి అదుపు తప్పిందని పోలీసులు తెలిపారు. కొంతమంది విద్యార్థులు ఆగ్రహానికి గురై ప్రాక్టర్పై దాడి చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు పేర్కొన్నారు.అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని ప్రాక్టర్ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారని తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని గోరఖ్‌పూర్ పోలీసులు తెలిపారు.పోలీసు అధికారి వ్యవహారంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. నిరసన చేస్తున్న వారు విద్యార్థులని, నేరస్థులు కాదని గుర్తుంచుకుని సంయమనం పాటించాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు.విద్యార్థుల నిరసనలు ఎందుకు?విశ్వవిద్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలతో విద్యార్థుల ఆందోళన తీవ్రతరమైంది. ఆగస్టు 25 నుంచి విద్యార్థులు క్యాంపస్‌లో నిరసన చేస్తున్నారు. 4 రోజుల క్రితం వారు నిరాహార దీక్ష కూడా ప్రారంభించారు. విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణ సంస్థకు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. డిగ్రీలు, మార్కుల పట్టాలు తీసుకునేందుకు కూడా విద్యార్థుల నుంచి రుసుములు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించకపోయినా విద్యార్థుల నుంచి విద్యార్థి సంఘం రుసుము వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో మెరుగైన భోజనం, ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రధానమంత్రి ఉషా పథకం కింద విశ్వవిద్యాలయంలో చేపడుతున్న పనుల కేటాయింపులో పారదర్శకత ఉండాలని వారు డిమాండ్ చేశారు. బహిష్కరించిన విద్యార్థులను తిరిగి చేర్చుకోవాలని కూడా కోరుతున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు.Chaos at Gorakhpur University as students on hunger strike erupt in protest.A Sub-Inspector arrives on the spot and threatens students: I’ll call so much force that I’ll cool you down. This is Gorakhpur Police.@myogiadityanath It’s 2026, and students are still being threatened… pic.twitter.com/pcL3h3LqUx— Voice of Hindus (@Voiceofhindus) September 9, 2026 -
అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు
-
ఏ బౌలర్‌ను వదల్లేదు.. భీకర ఫామ్‌లో ఇషాన్ కిషన్!
టీమిండియా వికెట్ కీపర్, ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇప్పటికే డబుల్ సెంచరీతో బీభత్సం సృష్టించిన ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును ప్రదర్శిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో వన్డే తరహా బ్యాటింగ్‌తో అలరించిన ఇషాన్ 98 బంతుల్లో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతడికి తోడు శిఖర్ మోహన్ (52) అర్థసెంచరీతో చెలరేగాడు. 41 ఓవర్లు ముగిసేసరికి ఈస్ట్‌జోన్ 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఈస్ట్‌జోన్ ఇప్పటికే 533 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.త్రిపురానాను దంచికొట్టాడు..ఫిఫ్టీ మార్క్ సాధించిన తర్వాత త్రిపురానా వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో వరుసగా 4,6,6, 4 బాదడంతో పాటు సింగిల్ సహా మొత్తం 17 పరుగులు పిండుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ బాదే క్రమంలో ఏ బౌలర్‌ను విడిచిపెట్టని ఇషాన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును కనబరుస్తూ ప్రతీ బౌలర్‌ను చితక్కొడుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులకు ఆలౌటైన ఈస్ట్‌జోన్, ఆ తర్వాత సౌత్‌జోన్‌ను 336 పరుగులకే కట్టడి చేసి తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉండడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ దులీప్ ట్రోఫీ టైటిల్ అందుకోనుంది.4,6,6,4 BY ISHAN KISHAN - He smashing everyone in Duleep Trophy final 🥶 pic.twitter.com/lKPAA2awOY— Johns. (@CricCrazyJohns) September 9, 2026Read: ఆరేళ్లుగా ఎదురుచూపులు.. 50వేల టికెట్లు హాంఫట్! -
అసలు గేమ్ ఇదేనా..? అడ్డంగా దొరికిపోయింది.. ఇక నందన చాప్టర్ క్లోజ్!
-
ఈస్ట్‌జోన్‌దే టైటిల్!.. చరిత్ర సృష్టించనున్న వైభవ్!
దులీప్ ట్రోఫీని ఈసారి ఈస్ట్ జోన్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫైనల్లో సౌత్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్‌జోన్‌కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్‌కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఏ జట్టు ఆధిక్యంలో నిలిస్తే వారికే దులీప్ ట్రోఫీ దక్కనుంది. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ 13 సంవత్సరాల తర్వాత టైటిల్ అందుకోనుంది. ఇదే సమయంలో జట్టులో సభ్యుడిగా ఉన్న వైభవ్ సూర్యవంశీ కూడా చరిత్ర సృష్టించనున్నాడు. వైభవ్ సూర్యవంశీ వయసు 15 ఏళ్లు కావడంతో, అత్యంత పిన్న వయస్సులో దులీప్ ట్రోఫీ నెగ్గిన జట్టలోని ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటికే టోర్నీలో సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ సాధించి అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచిన వైభవ్, కప్‌ను ఈస్ట్‌జోన్ సొంతం చేసుకుంటే మాత్రం పైన చెప్పుకున్న ఘనత కూడా వైభవ్ ఖాతాలో చేరనుంది.డ్యాన్స్ చేసిన వైభవ్..ఇక మ్యాచ్‌లో సౌత్‌జోన్ ఇన్నింగ్స్ సందర్భంగా త్రిపురానా విజయ్ వికెట్ పడినప్పుడు వైభవ్ సూర్యవంశీ డ్యాన్స్ మూమెంట్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 708 పరుగులు చేసిన ఈస్ట్‌జోన్‌కు పోటీ ఇచ్చే క్రమంలో సౌత్‌జోన్ తరఫున ఆ జట్టు కెప్టెన్ తిలక్ వర్మతో పాటు దేవదత్ పడిక్కల్, సీవీ మిలింద్ కాస్త ప్రతిఘటించారు. తాను ఒక ఎండ్‌లో పాతుకుపోయినప్పటికీ, మరో ఎండ్‌లో మాత్రం వరుసగా వికెట్లు పడడంతో వైభవ్ ఉబ్బితబ్బియయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన త్రిపురానా విజయ్ కెప్టెన్‌తో ఏర్పడిన సయన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఖురేషీ వేసిన ఆఫ్‌స్టంప్ బంతిని తిలక్ వర్మ కట్‌షాట్ ఆడాడు. తనవైపు వచ్చిన బంతిని అభిజిత్ సర్కార్ వేగంగా అందుకొని అంతే వేగంతో వికెట్ కీపర్ ఇషాన్ వైపు విసిరాడు. అప్పటికే తిలక్ సింగిల్ తీయాలా వద్దా అనే డైలమాలోనే ముందుకు పరిగెత్తాడు. దీంతో కాస్త లేటుగా రనప్ అందుకున్న త్రిపురానా విజయ్ స్ట్రైక్ ఎండ్‌కు చేరేలోపే ఇషాన్ వికెట్లను గిరాటేయడంతో అతడు రనౌట్ అయ్యాడు. విజయానికి చేరువ కావడంతో సంతోషం పట్టలేని వైభవ్ చిన్న డ్యాన్స్ మూమెంట్ ఇవ్వడం కెమెరాలకు చిక్కింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్ 708 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (270) డబుల్ సెంచరీ సాధించగా, కుమార్ కుషాగ్ర (101) సెంచరీ చేశాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్థసెంచరీలు సాధించారు. సౌత్‌జోన్ బౌలర్లలో త్రిపురానా విజయ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం సౌత్‌జోన్ 107.3 ఓవర్లలో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ (99) ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకోగా, పడిక్కల్ (62) అర్థసెంచరీ సాధించాడు. ఈస్ట్‌జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా, షమీ, ఖురేషి, శిఖర్ మోహన్ తలా 2 వికెట్లు పడగొట్టారు.Excellent reflex catch and run out ⚡️Top-fielding efforts bring wickets for East Zone 👌South Zone are 322/8 Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/FKDmQcDYG3— BCCI Domestic (@BCCIdomestic) September 9, 2026Read: ‘పూటుగా తాగి పీడకలనుకొని మరిచిపోతా’ -
‘‘అందుకోసం రూ.450 ఖర్చు పెట్టా.. చెప్పలేనంత ఆనందం’’
కాలేజీకి వెళ్తున్న ఓ యువతి ఆటోలో ప్రయాణిస్తుండగా.. రెడ్ సిగ్నల్ వద్ద ఓ వ్యక్తి చిన్న ట్రాక్టర్ వంటి బొమ్మ వాహనాలను విక్రయిస్తున్నాడు. ఆటో డ్రైవర్ తన కుమారుడి కోసం ఆ బొమ్మ ధర అడిగాడు. విక్రేత రూ.550 చెప్పడంతో డ్రైవర్ నిరాశ చెందాడు. బొమ్మ కొనలేకపోవడంతో డ్రైవర్ వెనక్కి తగ్గడాన్ని గమనించిన యువతి అతడికి సాయం చేయాలని నిర్ణయించుకుంది.ఆమె విక్రేతతో బేరమాడి అదే బొమ్మను రూ.450కు కొనుగోలు చేసి డ్రైవర్‌కు ఇచ్చింది. డ్రైవర్ కృతజ్ఞతలు చెప్పడం కంటే తన కుటుంబం గురించి యువతితో చెప్పుకున్నాడు. తన కుమారుడు “నాన్నా.. నువ్వు నా కోసం ఎప్పుడూ ఏమీ తీసుకురావు” అని తరచూ చెబుతుంటాడని డ్రైవర్ తెలిపాడు. డ్రైవర్ తన కుటుంబ ఫొటోలను కూడా ఆమెకు చూపించాడు.ఈ అనుభవం తనను ఎంతో కదిలించిందని యువతి తెలిపింది. ఆమె ఖర్చు చేసిన డబ్బులో ఇదే అత్యంత సంతృప్తినిచ్చిన ఖర్చు అని పేర్కొంది. ఈ విషయాలను తనకు ఎదురైన మంచి అనుభవంగా ఆ యువతే చెప్పింది. ఆమె పేరు తన్వీ చంద్ర (Tanvi Chandra). ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసి మొత్తం ఘటనను వివరించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా, పలువురు యువతి చేసిన పనిని ప్రశంసించారు. View this post on Instagram A post shared by Tanvi Chandra- UGC,Lifestyle (@10viiee) -
పాక్‌తో కయ్యానికి కాలు దువ్విన ఆఫ్గన్ క్రికెట్ బోర్డు!
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల మధ్య శత్రుత్వం అంతకంతకూ పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. తాజాగా టీమిండియాతో సిరీస్ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ఒక ప్రచార వీడియోను రూపొందించిది. ఆ వీడియోల పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), గిల్గిట్ బాల్టిస్తాన్లను భారతదేశ సరిహద్దులో భాగంగా చూపించింది. ఈ వీడియోను ఏసీబీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది."మా దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ ఇది. ఘనమైన చరిత్ర, సంస్కృతి, ఉమ్మడి అభిరుచి కలిగిన రెండు దేశాలను ఏకం చేసే సిరీస్ ఇది. ఇవి కేవలం మ్యాచ్‌లు కాదు. స్వదేశంలోని లక్షలాది మంది ప్రజల ఆశలు, గర్వాన్ని మోసుకుంటూ ఆఫ్గన్ జట్టు మైదానంలోకి అడుగుపెట్టనుంది."అని రాసుకొచ్చింది.ఇప్పటికే ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినగా, తాజాగా ఆఫ్గన్ క్రికెట్ బోర్డు చేపట్టిన చర్య అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఈ మ్యాప్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై పాకిస్థాన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్యలకు దిగలేదు. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఈ విషయాన్ని లేవనెత్తేందుకు ఇస్లామాబాద్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.నిత్యం సరిహద్దు ఘర్షణలు, వైమానిక దాడులతో సహా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ తాజా వివాదం తలెత్తింది. దేశంలో జరుగుతున్న ఘోరమైన దాడులకు కారణమని పాకిస్తాన్ ఆరోపిస్తున్న తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ (TTP)కు ఆఫ్ఘన్ తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తున్నారని ఇస్లామాబాద్ పదేపదే ఆరోపిస్తోంది. సాంస్కృతిక, క్రీడా వేదికలతో సహా సాఫ్ట్ పవర్ ద్వారా ఇటువంటి ఘర్షణలు మరింతగా వ్యక్తమయ్యే అవకాశం ఉందని భారత్ తెలిపింది. ఇక భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య జరగనుంది. మ్యాచ్‌లన్నీ ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. తొలి వన్డే ఈ నెల 13న, రెండో టీ20 15న, మూడో టీ20 17న జరగనున్నాయి.A series the nation has been eagerly awaiting. 🤩A series that will once again bring together two nations with deep-rooted history, culture, and a shared passion for the game.🤜🤛These are more than just matches. They are encounters of passion, excitement, and significance,… pic.twitter.com/Q8h7MYX1yf— Afghanistan Cricket Board (@ACBofficials) September 6, 2026Read: నిప్పులు చెరిగిన షమీ.. సౌత్‌జోన్ కకావికలం -
Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?
-
చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్
కొన్ని సినిమాలు కథ, కథనంతోనే కాదు.. పాటలతోనూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలా పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిత్రాల్లో ప్రభాస్, త్రిష జంటగా నటించిన ‘పౌర్ణమి’ ఒకటి. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ‘భరత వేదముగ’ పాటకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు.ఇదీ చదవండి: వినాయకుడు ఫైర్.. దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్ఆకట్టుకునేలా..తాజాగా ఈ పాటకు ఓ చైనా యువతి అద్భుతంగా నాట్యం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మీరా వాంగ్ అనే యువతి షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో భారతీయ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన దుస్తులు ధరించి ‘భరత వేదముగ’ పాటకు ఎంతో అందంగా డ్యాన్స్ చేశారు. ఆమె హావభావాలు, నృత్య భంగిమలు ఆకట్టుకునేలా ఉండటంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తెలుగు సినిమా పాటకు చైనా యువతి ఇంత అందంగా నాట్యం చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ సంస్కృతి, సంగీతం సరిహద్దులు దాటి ఆకట్టుకుంటోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇదీ చదవండి: ఏపీలో చిరంజీవి కూమార్తె సుస్మితకు పదవి A Chinese woman performed the iconic #Pournami song in Shanghai yesterday! ❤️#Prabhas #Trisha pic.twitter.com/u0U42dO503— Milagro Movies (@MilagroMovies) September 8, 2026 -
వారెవ్వా వైభవ్ సూర్యవంశీ!.. ఇషాన్‌ను ఒప్పించి మరీ!
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విమర్శించిన వాళ్లకు ఆటతో పాటు నాయకత్వ నైపుణ్యాలతోనూ అదిరిపోయేలా కౌంటర్ ఇస్తున్నాడంటూ కొనియాడుతున్నారు. కాగా రెడ్‌బాల్ క్రికెట్లో అంతగా అనుభవం లేనప్పటికీ పదిహేనేళ్ల వైభవ్‌కు బీసీసీఐ కీలక బాధ్యతను అప్పగించిన సంగతి తెలిసిందే.అపుడే వైస్ కెప్టెన్‌గానా?ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2026 టోర్నీలో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్‌కు వైభవ్‌ను డిప్యూటీగా నియమించింది. దీంతో చిన్న వయసులోనే, అనుభవం లేని వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా ఎలా నియమిస్తారని భారత మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.అయితే, వైభవ్ అటు ఆటగాడిగా రాణిస్తూనే.. తన నాయకుడిగానూ తానేం తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. సెంట్రల్ జోన్‌తో సెమీ ఫైనల్లో ఇషాన్ గైర్హాజరీలో వైభవ్ ఒకరోజు మొత్తం కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది.708 పరుగులకు ఆలౌట్ఇక టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ సౌత్ జోన్‌తో తలపడుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో.. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 708 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఈ క్రమంలో మంగళవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా సౌత్ జోన్ తమ బ్యాటింగ్ మొదలుపెట్టింది.సందిగ్దంలో జట్టుఈ నేపథ్యంలో ఆరో ఓవర్లో ఈస్ట్ జోన్ పేసర్ ముకేశ్ కుమార్ వేసిన రెండో బంతిని సౌత్ జోన్ ఓపెనర్ రికీ భుయ్ బౌండరీ దిశగా తరలించే ప్రయత్నం చేశాడు. అయితే, లెంగ్త్‌ను తప్పుగా అంచనా వేసిన రికీ షాట్ ఆడటంలో విఫలం కాగా.. వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రా బంతిని క్యాచ్ పట్టి.. అప్పీలు చేశాడు.ఇషాన్‌ను ఒప్పించిన వైభవ్అయితే, ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దీంతో రివ్యూకు వెళ్లాలా? వద్దా? అన్న సందేహంలో ఉన్న కెప్టెన్ ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లిన వైభవ్ సూర్యవంశీ.. ‘రివ్యూ తీసుకో.. పర్లేదు’ అంటూ సలహా ఇచ్చాడు. కానీ మిగతా ఆటగాళ్లు మాత్రం బంతి ముందుగా బ్యాట్‌ను తాకిందా? లేదంటే ప్యాడ్‌కు తాకిందా? అనే సందేహంలో ఉన్నారు.అయితే, ఇషాన్ కిషన్ వైభవ్ మాట మీద నమ్మకంతో రివ్యూకు వెళ్లగా.. రికీ భుయ్ అవుటైనట్లు తేలింది. దీంతో ఈస్ట్ జోన్ సంబరాలు అంబరాన్నంటాయి. వైభవ్ సూర్యవంశీని ఇషాన్, ముకేశ్‌తో పాటు మిగతా జట్టు సభ్యులందరూ అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దులిప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ తొలి ఇన్నింగ్స్‌లో 37 బంతులు ఎదుర్కొని 44 పరుగులు చేశాడు.చదవండి: IND vs AUS: భారత జట్టులో మార్పులు🗣️ Take it...take itVaibhav Sooryavanshi 🤝 ReviewThe vice-captain urges the captain to take the review, and it turns out to be successful 🙌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/MmtESDSnMy— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2026 -
ఆ హైజాక్ ఘటన..మా అమ్మ ఫ్లైట్ జర్నీలకు బ్రేక్ వేయలేదు!
ఒక్కోసారి కొన్ని ప్రయాణాలు భయానక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఎంతలా అంటే ఓ పట్టాన తేరుకోలేం. ఇంకోసారి అలాంటి జర్నీలు చేసే సాహసం కూడా చేయం. కానీ ఈ మహిళ టీనేజ్ వయసులో భయానక హైజాకింగ్ ఘటన ఎదుర్కొంది. క్షణం, క్షణం ఉత్కంఠ రేపే ఆ ఘటనలు బతికున్నంత వరకు మర్చిపోని విషాదం అది. అయినా..అది తన జర్నీలకు బ్రేక్ వేయలేదంటూ తన కథను సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. నెటిజన్లు ఆమె స్టోరీని అద్భుతమైన స్ఫూర్తిదాయక కథ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ రోహన్ శర్మ తన తల్లి అద్భుతమైన కథను ఇన్స్టాగ్రామ్ వీడియోలో పంచుకున్నారు. పాన్ ఆమ్ ఫ్లైట్ 73 హైజాక్ ఘటన జరిగి 40 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పుకొచ్చారు. తన తల్లికి 15 ఏళ్ల వయసున్నప్పుడు సెలవుల తర్వాత ఢిల్లీ నుంచి ఒంటరిగా అమెరికాకు వెళ్తుండగా ఈ దురుదృష్టకర ఘటనను ఎదుర్కొందని తెలిపాడు. ఇన్నేళ్లయినా..ఆ భయనాక క్షణాలు తనను ఇంకా వెంటాడుతూనే ఉన్నా..విమానా ప్రయాణాలు ఆపలేదని ధీమాగా చెబుతున్నాడు. ఆ విషాద ఘటన తన అమ్మకు ప్రపంచాన్ని చూడాలనే కలను దూరం చేయలేకపోయిందని అంటున్నాడు. కరేబియన్‌లో స్కూబా డైవింగ్ చేయడం, స్విస్ ఆల్ప్స్లో స్కీయింగ్ చేయడం, పోర్చుగల్ జలాల్లో ఈత కొట్టడం వరకు ప్రతి సాహసాన్ని ఆస్వాదిస్తోంది. పైగా కోలుకోవడం అంటే మర్చిపోవడం కాదని జీవించడం అని నిరూపించిందని గర్వంగా చెబుతున్నాడు. అంతేగాదు తను ఆ గాయం తనని నిర్దేశించకూడదని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది అందువల్లే ఈ సాహసకృత్యాలను చేయగలిగింది, మంచి అనుభవాల్ని సంపాదించుకుందని చెబుతున్నాడు. ఇక ఆమె తల్లి కూడా ఆనాటి విషాద దృశ్యాలు తన మనసులో గాఢంగా ముద్రపడిపోయాయని, అవి ఇంకా వెంటాడుతూనే ఉన్నాయన్నారామె. తనలా నాటి పరిస్థితులను ఎదుర్కొన్నవాళ్లు కోలుకున్నారా లేదా అని ఆలోచిస్తుంటానని చెబుతోందామె. అయితే తాను టీనేజ్ వయసులో ఎదుర్కొన్న ఆ గాయాన్ని తనను శాసించకూడదని అనుకున్నా కాబట్టి ఇవన్నీ చేయగలిగానని అంటోందామె. అలాగే ఆ భయానక సంఘటనను గుర్తుచేసుకుంటూ.. తనెలా బయటపడిందో పంచుకుంది. ‘పాన్ ఆమ్ ఫ్లైట్ 73 హైజాక్‌కు గురైంది. ప్రయాణికులు సుమారు 16 గంటల పాటు బందీలుగా ఉంచారు. హైజాకర్లు కాల్పులు జరపడానికి ముందు ప్రయాణికులను విమానం మధ్యలోకి తీసుకువెళ్లారని, ఇంతలో మరో ప్రయాణికురాలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరవడంతో దానిగుండా తాను బయటపడినట్లు తెలిపింది. అయితే లోపల కాల్పుల శబ్దానికి బిగుసుకుపోయి విమానం రెక్కపై ఉండిపోయానని, ఇంతలో సన్‌షైన్ అనే ఫ్లైట్ అటెండెంట్ విమానం రెక్కపై నుంచి నెమ్మదిగా కిందకు దించిందంటూ నాటి విషాదాన్ని కళ్లకు కట్టినట్లు వివరించింది’. అయితే తాను శారీరకంగా ఎలాంటి గాయాలవ్వకుండా సురక్షితం బయటపడ్డప్పటికీ..ఆ ఘటనలో సుమారు 21 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 100 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించింది. అది నిజంగా ఎవ్వరి జీవితాన్ని అయినా ప్రభావితం చేసే భయానకమైన బాధకర ఘటనగా అభివర్ణించిందామె. అయితే తాను దాన్నుంచి బయటపడి ధైర్యంగా ముందుకు సాగాలనుకున్నా..కాబట్టి విమాన ప్రయాణాలకు బ్రేక్ పడలేదని నవ్వుతూ చెబుతుంది. అంతేగాదు ఇలాంటి అనుభవం పొందిన వాళ్లు ఎవ్వరైనా తెలుసుకోవాల్సింది ఏంటో తన అనుభవంతో గొప్ప పాఠాన్ని నేర్పిందామె. నెటిజన్లు కూడా హ్యాట్సాఫ్ మేడం..అద్భుతమైన కథ అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Rohan Sharma (@rohabits) (చదవండి: ఏఐ టూత్ బ్రెష్..దెబ్బకు నోటి సమస్యలకు చెక్!) -
కసితీరా బాదిన అభిషేక్.. గిల్‌పై ప్రతీకారం!
భారత వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ టీమిండియా తరఫున ఓపెనింగ్ చేయడంతో పాటు డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం చూశాం. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరు పంజాబ్ క్రికెట్ లీగ్‌లో ప్రత్యర్థులుగా మారిపోయారు. షేర్-ఇ- పంజాబ్ టీ20లీగ్‌లో అభిషేక్ శర్మ అమృత్సర్ సూర్మన్స్కు కెప్టెన్‌గా ఉండగా, గిల్ ఫజిల్కా ఫాల్కన్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. సోమవారం రాత్రి ఈ రెండు జట్లు తలపడగా, అభిషేక్ శర్మ బౌలింగ్‌ను గిల్ చితక్కొట్టాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో అభిషేక్ శర్మ బౌలింగ్‌కు రాగా, అప్పటికే గిల్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక అభిషేక్ బౌలింగ్‌లో తొలి బంతికి సిక్సర్ కొట్టిన గిల్, మూడో బంతిని బౌండరీ, ఐదో బంతిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఓవర్లో వైడ్ సహా 16 పరుగులు వచ్చాయి. చివరి బంతికి కూడా సిక్సర్ కొట్టి అభిషేక్‌కు సెండాఫ్ ఇవ్వాలనుకున్నప్పటికీ, సీన్ రివర్స్ అయింది. అభిషేక్ వేసిన ఆఖరి బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో గిల్ గాల్లోకి లేపగా, బౌండరీ లైన్ వద్ద ఉన్న నమన్ ధిర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో గిల్ (35 బంతుల్లో 67) ఇన్నింగ్స్‌కు తెరపడింది. గిల్‌తో పాటు ప్రాన్షు ప్రతాప్ (40), సన్వీర్ సింగ్ (40) రాణించడంతో ఫజిల్కా ఫాల్కన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం అమృత్సర్ ఇన్నింగ్స్ సమయంలో తన వంతు రావడంతో అభిషేక్ రెచ్చిపోయాడు. సహజ్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ ఆరంభించిన అభిషేక్ (15 బంతుల్లోనే 49; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఈ దెబ్బకు అమృత్సర్ సూర్మన్స్ 6 ఓవర్లలో 79 పరుగులు చేసింది. అభిషేక్ ఔటైనప్పటికీ, రాహుల్ కుమార్ (35 బంతుల్లో 53 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్‌లో గిల్ (67 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ, అభిషేక్ (49) సుడిగాలి ఇన్నింగ్స్‌తో టీమిండియా కెప్టెన్‌ను డామినేట్ చేశాడు. ఈ విజయంతో అమృత్సర్ సూర్మన్స్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.Abhishek Sharma doing what he does best in the latest round of Sher-E-Punjab T20 League 🔥🔥 pic.twitter.com/UoxZsJxbOn— Cricbuzz (@cricbuzz) September 8, 2026SHUBMAN GILL vs ABHISHEK SHARMA 😍- Incredible battle at Sher-E-Punjab T20 league, The quality of the league. pic.twitter.com/LrTXT8cXgt— Johns. (@CricCrazyJohns) September 8, 2026Read: తిలక్ వర్మ జట్టు నుంచి తీసేస్తే.. శతక్కొట్టి ఘాటు కౌంటర్! -
ఏఐ టూత్ బ్రెష్..దెబ్బకు నోటి సమస్యలకు చెక్!
ఎటు చూసినా ఏఐ సాంకేతికత హవానే. ప్రతిదానిలో ఏఐ ఫీచర్లతో మోత మోగించేస్తూ..పనులన్నీ చిటికెలో అయిపోయేలా వస్తున్నాయి అన్ని గాడ్జెట్లు. తాజాగా రోజువారీ దినచర్యలో నిత్యకృత్యమైన బ్రెషింగ్లో కూడా ఈ ఫీచర్ వచ్చేసింది. దంతాల క్లీనింగ్ కోసం డెంటిస్ట్ దగ్గరకు వెళ్లక్కర్లేకుండా చక్కగా పళ్లు తళతళ మెరిసేలా స్వయంగా క్లీన్ చేసుకునే ఏఐ టూల్ బ్రెష్ వచ్చేసింది. దీని పనితీరు చూస్తే మైండ్‌బ్లాక్ అయిపోవడం ఖాయం. ఇంతలా క్లీన్ చేస్తుందా అని కచ్చితంగా నోరెళ్లబెడతారు. అందుకు సంబంధించిన వీడియోని ఓ జంట నెట్టింట పంచుకుంది. మరి ఆ ఏఐ టూత్ బ్రెష్ విశేషాలేంటో సవివరంగా చూద్దామా మరి..!.కంటెంట్ క్రియేటర్లైన ఓ జంట "దిఆలివ్ట్రీఫ్యామిలీ" అనే పేరుతో ఓ వీడియోని నెట్టింట షేర్ చేశారు. ఆ వీడియోలో అంతర్నిర్మిత కెమెరా, టార్చ్‌తో కూడిన ఏఐ ఫాసింగ్ క్లీనింగ్‌తో కూడిన టూత్ బ్రెష్ పని తీరు గురించి పంచుకున్నాడు. డైసన్ అనే కంపెనీ ఏఐ సాంకేతికతో కూడిన ఈ ఆధునిక బ్రష్‌ని రూపొందించింది. వాళ్లు ఆ బ్రెష్‌ని ఎలా ఉపయోగించుకోవాలో ఎలా ఛార్జ్ చేయాలి వంటి వాటితో సహా..ఉపయోగించే విధానం కూడా పంచుకున్నారు. టూత్ పేస్ట్‌ని బ్రెష్‌పై పెట్టి నోటిలో పెట్టగానే ప్రతిదీ వీడియో తీస్తూ..పళ్ల సందుల్లో ఇరుక్కుపోయిన ఆహారాన్ని క్లీన్ చేస్తుంది. ఎక్కడ చిన్న మెతుకు ఇరుక్కుపోయినా వదలదు. అది కూడా తక్కువ టైంలోనే సమర్థవంతంగ పంటి సమస్యల బారిన పడకుండా అద్భుతంగా క్లీన్ చేయడం స్పష్టంగా వీడియోలో చూడొచ్చు. అలాగే ఈ బ్రష్‌ని డిజైన్ చేసిన సంస్థ సైతం ఇది దంతాల మధ్య ఉన్న ఖాళీలను లక్ష్యంగా చేసుకుని పాచిని తొలగించే ఏకైక బ్రెష్గా అభివర్ణించింది. ఇది జెట్ వాషింగ్, లిక్విడ్ వాషింగ్, మౌత్ వాష్ వంటి క్లీనింగ్ పద్ధతులను అందిస్తుంది. సాధారణంగా ఫాసింగ్ అనేది కాస్త సమయం ఎక్కువ తీసుకునే పద్ధతి. అందరూ దీన్నిచేయలేరు కూడా. అదే సాంకేతికతో కూడిన అత్యాధునిక ఈ టూత్‌బ్రెష్‌తో జస్ట్ ఓ మూడు నిమిషాల్లో పళ్లన్నీ శుభ్రపడాయి. పాచి, పసుపు గార వంటి ఇబ్బంది లేకుండా తళతళ మెరిసిపోయేలా చేస్తుంది. దీని ఫీచర్స్ చూస్తుంటే..నోటి ఆరోగ్యానికి బెస్ట్ టూత్ బ్రెస్ట్గా తెలుస్తోంది. అదీగాక నోటి సంరక్షణ పద్ధతులపై జరుగుతున్న పరిశోధనల్లో నోటిలో మలినాలు ఎలా పేరుకుపోతాయో, అలాగే పళ్ల మధ్య ఉండే ఖాళీల్లో మలినాలు ఎలా చేరుకుంటాయో వెల్లడించింది. వీటిని క్లీన్ చేయడం చాలా మంది ప్రజలు మర్చిపోతున్నట్లు సర్వేలో తేలింది కూడా. అలాంటి తరుణంలో ఈ సరికొత్త ఫీచర్లున్న టూత్ బెస్ట్ అందరికీ ఆమోదయోగ్యకరమైనదని అంగీకరించవచ్చు. పైగా దీని ధర కూడా కేవలం రూ. 47 వేలు. అందరు కొనలేకపోయినా..సామాన్యుడు కూడా కొనేలా త్వరలో తక్కవ ధరలో లభించేవి కూడా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం లేకపోలేదనే చెప్పొచ్చు. View this post on Instagram A post shared by W Ken | Lynsay | Chung Family (@theolivetreefamily)(చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!) -
Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో
-
రీల్ స్టంట్ : 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్‌లోకి..కట్ చేస్తే!
సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి ప్రజల ప్రాణాలమీదికి తీసుకొస్తున్నా,తీరు మారడం లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీలో ఒక యువకుడు డేంజరస్ స్టంట్ చేస్తూ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రాస్‌ల్యాండ్స్ పోలీస్ పోస్ట్ సమీపంలో ఉన్న పహుంజ్ డ్యామ్ వద్ద ఈ సంఘటన జరిగింది. రక్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వాయి గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ కుమారుడు, 38 ఏళ్ల పుష్పేంద్ర కుమార్ (32) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి సమీపంలోని పహూజ్ డ్యామ్‌ను చూడటానికి వెళ్లాడు ఇన్‌స్టారీల్ కోసం ఒక స్టంట్ చేయాలను పూనుకున్నాడు. స్నేహితులు వీడియో రికార్డ్ చేస్తుండగా, పుష్పేంద్ర డ్యామ్‌లోని వ్యూ పాయింట్ వద్ద ఉన్న బాండ్రీ వాల్ ఎక్కి దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి డ్యామ్‌లోకి దూకాడు.Jhansi - A young man suffered fractures in both legs after he jumped from a 30-foot-high dam in Jhansi while trying to shoot a social media reel. The incident took place at Pahuj Dam. Pushpendra Kumar Manauriya, 32, a resident of Parwai village under Raksa police station, had… pic.twitter.com/HpowlS0MO7— NextMinute News (@nextminutenews7) September 7, 2026డ్యామ్‌లో నీళ్లు ఎక్కువగా ఉంటాయని భావించి దూకినప్పటికీ, ఆ ప్రదేశంలో నీరు చాలా తక్కువగా ఉండటంతో నేరుగా నేలను బలంగా తాకాడు. ధఋఃథక్ష అతడి రెండు కాళ్లు తీవ్రంగా విరిగిపోయాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్నేహితులు, స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పుష్పేంద్రను డ్యామ్ నుంచి బయటకు తీసి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్‌లో సింగర్ హఠాన్మరణంనోట్ : సోషల్ మీడియాలో వ్యూస్‌కోసం లేనిపోని సాహసాలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు గతంలో చాలా చూశాం. ఇప్పటికే ఇలాంటి స్టంట్లు చేసి, తల్లితండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని నిపుణులు పలు హెచ్చరికలు చేశారు. కొన్ని సెకన్ల రీల్ లేదా వైరల్ వీడియోల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టవద్దని, ఇటువంటి ప్రమాదకరమైన స్టంట్లు చేయవద్దని పోలీసులు, ప్రజలకు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్ -
బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్
-
రెస్ట్ తీసుకోమన్నా వినలేదు; నొప్పిని భరిస్తూనే డబుల్ సెంచరీ
చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్ 128 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు నిదీశ్ వేసిన బంతి పొత్తి కడుపు కింద భాగంలో బలంగా తాకింది. బంతి బలంగా తాకడంతో నొప్పితో విలవిల్లాడిపోయిన ఇషాన్ స్క్వేర్ లెగ్ రీజియన్ దిశగా పరిగెత్తి అక్కడే కూర్చుండిపోయాడు. ఫిజియో వచ్చి ఇషాన్ గాయాన్ని పర్యవేక్షించాడు. అదే సమయంలో ఫిజియోతో వచ్చిన డాక్టర్ ‘రెస్ట్ తీసుకో’ అని సలహా ఇచ్చాడు. కానీ ఇషాన్ మాత్రం తాను బ్యాటింగ్ కంటిన్యూ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేసిన ఇషాన్ డబుల్ సెంచరీ మార్క్ కూడా అందుకున్నాడు. 270 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన మరో 30 బంతుల్లో 250 మార్క్‌ను చేరుకున్నాడు. ఆ తర్వాత నొప్పి తిరగబెట్టడంతో ఇషాన్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి ఇషాన్‌తో మాట్లాడాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. మరి మిగతా మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ అందుబాటులో ఉంటాడా? ఉండడా అనే ప్రశ్న అభిమానులను తొలిచేస్తుంది. ఏది ఏమైనా డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పినా వినకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ఇషాన్ బ్యాటింగ్ కొనసాగించి అందరి మన్ననలు పొందాడు.అయితే స్కోరు కార్డుపై మాత్రం ఇషాన్ రిటైర్డ్ హర్ట్ అయినట్లు ప్రదర్శించడంతో అతడు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఈస్ట్‌జోన్ 650 పరుగుల మార్క్‌ను దాటడంతో తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశం లేకపోలేదు. 13 ఏళ్ల తర్వాత ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు చేరడం గమనార్హం. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఈస్ట్‌జోన్ తాజాగా టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈస్ట్‌జోన్ 650 పరుగుల మార్క్‌ను దాటడంతో సౌత్‌జోన్ అంత స్కోరు చేయాలన్నా రెండు రోజులు పడుతుంది. ఇప్పటికే రెండు రోజుల ఆట ముగియడం, మరో మూడు రోజులు ఉండడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఈస్ట్ జోన్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉంది.Ishan Kishan brings up his 2️⃣0️⃣0️⃣ in style 💯💯 🙌What a magnificent knock from the East Zone captain so far 👏👏Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/2NaE6qG4VK— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026Doctor: rest loIshan: century laga deta hu 💀🙏Ishan Kishan during a Duleep Trophy match, sarcastically noting an apparent injury with "oops🤕" before adding he recovered quickly and is batting well. pic.twitter.com/5eZraPJVix— CricketIndian_🚩🇮🇳 (@CricketIndian_) September 7, 2026 That moment when Ishan Kishan reached 2️⃣5️⃣0️⃣ 👏👏Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/6YJYiwNtjV— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026చదవండి: భారత్‌తో టీ20 సిరీస్ ముంగిట చెలరేగిన ఆఫ్గన్ బౌలర్ -
మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..!
మేనకోడలు అంటే ఏ మేనమామకు ఇష్టం ఉండదు. అందుకేనేమో అడిగి అడగంగానే కొనిస్తాడు కాబట్టే కవులు మామయ్యను చందమామతో పోల్చి మరి చెబుతుంటారు. అలానే ఇక్కడొక మామయ్య తన ముద్దులు మేనకోడలు చిరుకోరికను నెరవేర్చేందుకు ఎంత రిస్క్ చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వేలు, లక్షలు కాదు ఏకంగా కోట్లు ఖర్చు పెట్టి మరి ఏం కొనిచ్చాడో తెలిస్తే విస్తుపోతారు. ఈ వింత ఘటన అబుదాబిలో చోటు చేసుకుంది. షేక్ అల్ మన్సూరి అనే చిన్నారి తన మేనమామతో కలిసి అబుదాబి ఇంటర్నేషనల్ హంటింగగ్ అండ్ ఈక్వెస్ట్రియన్ ఎగ్జిబిషన్ (ADIHEX) 2026కు హాజరైంది. ఆ కార్యక్రమంలో డేగల ఔత్సాహికులు, పెంపెకందారుల కోసం అత్యంత ఖరీదైన వేలం నిర్వహిస్తుంది. అయితే ఈ వేలంలో అత్యంత రికార్డు స్థాయిలో ఓ అరుదైన డేగను కొనుగోలు చేశాడు ఓ వ్యక్తి. నిజానికి బూడిదరంగు, నలుపు వంటి డేగలను చూస్తాం గానీ తెలుపు రంగు డేగలు అత్యంత అరుదు. అలాంటి అత్యంత అరుదైన తెల్లటి ఫాల్కన్ జాతి డేగ వేలంలో ఏకంగా రూ. 3.85 కోట్లకు అమ్ముడైపోయింది. దీన్ని తన మేనకోడలు కోసం వెచ్చించాడట. ఆమెకు డేగలంటే అమితమైన ఇష్టమని, అందులోనూ ఈ తెలుపు రంగు డేగ అంటేచాలా ఇష్టమని అందుకే ఇంత డబ్బు వెచ్చించినట్లు తెలిపాడు. ఈ అరుదైన డేగ అమెరికాలోని మార్క్ మెగ్లిచ్ ఫాల్కన్ ఫార్మ్‌కు చెందినది. దాని ఆకర్షణీయమైన స్వచ్ఛమైన తెల్లని ఈకలు, విలక్షణమైన శారీరక లక్షణాలు కారణంగా ఇది ఎల్లప్పుడు అందరి దృష్టిని ఆకర్షించే డేగగా చెప్పొచ్చు. ఇది సుమారు కిలోగ్రాము బరువు, పొడవు, వెడల్పుల్లో దాదాపు 16.5 అంగుళాల కొలతతో ఉంటుంది. ఇక ఆ చిన్నారి మన్సూరిని ఈ డేగలపై ఆసక్తి ఎలా పెరిగిందని అడిగితే..అందుకు తన మామయ్యే కారణమని చెబుతుండటం విశేషం. View this post on Instagram A post shared by علي الجابري🇦🇪 (@ali.aljabri2) (చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!) -
మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!
ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మెహిందీ పెడుతూ ఎంత ఆదాయం గడిస్తుందో నెట్టింట వీడియో రూపంలో షేర్ చేసింది. భారత్‌లో మెహిందీ పెట్టే స్కిల్‌ని ఎలా చూస్తారు..అదే అమెరికాలో అయితే ఎలా ఉంటుందో పోలుస్తూ చెప్పుకొచ్చింది వీడియోలో. అంతేగాదు పార్ట్‌టైంగా చేస్తున్న ఈ సరదా స్కిల్‌తో తాను ఎంత మేర ఆర్జిస్తుందో కూడా పంచుకుంది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించి మెహిందీ స్కిల్‌పై చర్చలు రేకెత్తించింది. అమెరికాలో పూర్తి స్థాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రియాం కజైన్ ఈ పోస్ట్ పంచుకుంది. తన ఉద్యోగానికి, అభిరుచికి మధ్య చక్కటి సమతుల్యతను పాటిస్తూ..ప్రొఫెషనల్ మెహిందీ ఆర్టిస్ట్‌గా ఎలా కొనసాగుతుందో చెప్పుకొచ్చింది. కోడింగ్ ద్వారా నెలవారీ ఖర్చులు తీరుతుండగా, మెహిందీ పనితో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నట్లు పేర్కొంది. తన డిజైన్ పనికి గంటకు సుమారు రూ. 9 వేల నుంచి పదివేల దాకా ఛార్జ్ చేస్తుందట. అంతేగాదు నిర్ణీత గంటల రుసుము తోపాలు ఒక్కోసారి 20 శాతం వరకు టిప్ రూపంలో అదనపు మొత్తాన్ని కూడా ఆర్జిస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాదు పెళ్లిళ్ల సీజన్లో అయితే మెహిందీ పెట్టే పూర్తి స్థాయి బుకింగ్‌ని బట్టి ఒక్క రోజుకి దాదాపు రూ. 1 లక్ష దాక సంపాదించొచ్చని తెలిపింది. తనకు అమెరికా వచ్చిన తర్వాతే కళాకారులకు ఎంత విలువ ఉంటుందో అర్తమైందని అంటోంది. భారత్‌లో మెహిందీ ఆర్టిస్ట్ వృత్తిని అంత గొప్ప పనిగా చూడరు, అంతగా గౌరవించరని వాపోయింది. కానీ ఇక్కడ తనను కళాకారిణిగా గౌరవిస్తారని అంటోంది. అంతేగాదు తనకు ఏదో ఒక చిన్న పనిచేస్తున్నట్లు అనిపించదని చెబుతోంది. అయినా ఏపని చిన్నిది, పెద్దది అని ఉండదు, పని అంటే పనే అని నొక్కి చెబుతోంది. ఇక అలాగే అమెరికాలో జీవన వ్యయాలు కూడా అధికంగానే ఉంటాయని ఒప్పుకుందామె. నెటిజన్లు కూడా ఆమె మాటలకు మద్దతిస్తూ..ఔను ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాన్ని తప్ప మరే ఏ ఇతర ఉద్యోగాన్నీ అంతగ గౌరవించరంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Priyancka Jaiin (Creating Wings Co.) (@priyancka.jaiin) (చదవండి: అద్భుతమైన క్రిమ్సన్ చీరలో నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!) -
క్వార్టర్స్ చేరిన అల్కరాజ్కు ఊహించని షాక్!
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గాయం నుంచి కోలుకున్న అల్కరాజ్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్‌లో మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ అల్కరాజ్ 6-4, 6-3, 6-4తో అమెరికాకు చెందిన 20వ సీడ్ టామీ పాల్‌ను వరుస సెట్లలో మట్టికరిపించాడు. రెండు గంటల 20 నిమిషాల పాటు సాగిన పోరులో అల్కరాజ్ 33 విన్నర్లు సంధించి ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 8వ ర్యాంకర్ బెంజమిన్ షెల్టన్‌ను ఎదుర్కోనున్నాడు. ఇక షెల్టన్ మూడో రౌండ్లో 6-2, 6-3, 6-4తో స్టిఫానోస్ సిట్సిపాస్‌ను వరుస సెట్లలో ఖంగుతినిపించి అల్కరాజ్తో పోరుకు సిద్ధమయ్యాడు.Photo Credit: Twitterఅయితే క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ తాను తలపడబోయే ప్రత్యర్థిని తప్పుగా ఊహించడం ఆసక్తి రేపింది. టామీ పాల్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత అల్కరాజ్ సెట్ (యూఎస్ ఓపెన్‌లో మ్యాచ్‌లు జరిగే ప్రదేశం)కు వెళ్లాడు. 2003 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఆండీ రాడిక్ క్వార్టర్స్‌లో అల్కరాజ్ ఎదుర్కోబోయే చాలెంజర్ గురించి ప్రశ్న అడిగాడు. "మీరు షెల్టన్ లేదా సిట్సిపాస్లో ఒకరితో క్వార్టర్స్ ఆడనున్నారు. మరి ఇద్దరిలో ఎవరితో ఆడడం మీకు ఇష్టం" అని ప్రశ్నించాడు. అయితే ఆండీ రాడిక్ ప్రశ్న పూర్తి కాకముందే.. అతడి ముందు ఉన్న పేపర్‌ను పరిశీలించిన అల్కరాజ్.. "ఓరి దేవుడా, ఇది నేను ఊహించలేదు. మెద్వెదెవ్ లేదా టియాఫోల్లో ఒకరితో తలపడతానని భావించాను. కానీ ఇక్కడ వేరే పేర్లున్నాయి.’’ అని పేర్కొన్నాడు. Photo Credit: Twitterతాను ఒకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా తన పరిస్థితి తయారైందని అల్కరాజ్ చెప్పడంతో స్టూడియోలో ఉన్నవారంతా గొల్లుమని నవ్వారు. అల్కరాజ్, ఆండీ రాడిక్ వీడియో సంభాషణ వైరల్‌గా మారింది. ఇక ఫ్రాన్స్‌కు చెందిన టియాఫో డానిల్ మెద్వదెవ్‌ను ఓడించి క్వార్టర్స్‌లో అలెక్స్ మిచెల్సెన్తో పోటీకి సిద్ధమయ్యాడు.టామీ పాల్‌ను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన కార్లోస్ అల్కరాజ్ కొన్ని రికార్డులు సాధించాడు. యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్స్ చేరడం అల్కరాజ్కు ఇది ఐదో సారి. హార్డ్ కోర్టుపై అల్కరాజ్కు ఇది వరుసగా 18వ విజయం కాగా, యూఎస్ ఓపెన్‌లో ఇది వరుసగా 11వ విజయం. ఓవరాల్‌గా అల్కరాజ్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరడం ఇది 15వ సారి.Undeniable.Carlos Alcaraz dispatches Paul 6-4, 6-3, 6-4 to reach the quarterfinals! pic.twitter.com/9BycpgCDQZ— US Open Tennis (@usopen) September 6, 2026 Alcaraz didn't know he was playing Shelton or Tsitsipas next at the US Open:Carlos: "I thought.. I thought.. Oh my God I thought I was playing Medvedev or Tiafoe. Oh my God." 😭😭😭“You gonna watch the match?"Carlos: "For sure I'm gonna watch it." 😭 pic.twitter.com/P4eRQBzOkp— The Tennis Letter (@TheTennisLetter) September 6, 2026Read: సాత్విక్-చిరాగ్ జోడీకి వైఎస్ జగన్ అభినందనలు -
టీచర్స్‌డే.. ఐటెం సాంగ్!
టీచర్స్ డే వేడుకల్లో.. అదీ పెద్ద సంఖ్యలో విద్యావేత్తలు, మేధావులు హాజరైన కార్యక్రమంలో అమ్మాయిలు చేసిన ఓ డ్యాన్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీచర్స్ ఐకాన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండగా.. దేశాన్ని ఊపేసిన ఓ ఐటెం సాంగ్‌కు వాళ్లు హుషారుగా ఊగిపోయారు. ఆ వీడియోనే ఇప్పుడు నెట్టింట రచ్చకు కారణమైంది.డెహ్రాడూన్‌లోని జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సెప్టెంబర్ 5న నిర్వహించిన కార్యక్రమం వీడియో ఎక్స్‌లో వైరల్ అయ్యింది. మొత్తం 46 మంది ఉపాధ్యాయులను సత్కరించిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అయితే ఎంచుకున్న పాటపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. డర్టీ పిక్చర్ చిత్రంలోని ‘ఊ లా లా.. ఊ లా లా.. తూ హై మేరీ ఫ్యాంటసీ’ అంటూ ఆ అమ్మాయిలు హుషారుగా స్టెప్పులేశారు. అది చూసి అక్కడే ఉన్న కొందరు కుర్రాళ్లు వాళ్లను ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే టీచర్స్ డే వేడుకలకు ఇలాంటి పాట సరిపోతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. మరోవైపు కొందరు మాత్రం దీనిపై వస్తున్న విమర్శలను అతిగా స్పందించడం అని కొట్టిపారేస్తున్నారు. కళాశాల కార్యక్రమాల్లో విద్యార్థులు తమకు నచ్చిన పాటలకు సరదాగా డ్యాన్స్ చేయడం సాధారణమేనని, దీనిని సంప్రదాయాలకు వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. యువత వేడుకలను చూసే దృక్పథంలో వచ్చిన మార్పుగా మరికొందరు అభివర్ణిస్తున్నారు.ఈ వీడియో వైరల్ కావడంతో టీచర్స్ డే వేడుకల్లో సంప్రదాయ విలువలకే ప్రాధాన్యమివ్వాలా? లేదంటే విద్యార్థుల ఆధునిక శైలికీ చోటివ్వాలా? అనే చర్చ మొదలైంది. ఒక చిన్న నృత్య ప్రదర్శన కాస్తా సంప్రదాయం, ఆధునికత మధ్య సోషల్ మీడియాలో వాదనకు దారితీసింది.Dr. Sarvepalli Radhakrishnan be like "Thank god, i didn't live long enough to see this"pic.twitter.com/ypB3p27XaH— Keh Ke Peheno (@coolfunnytshirt) September 7, 2026 -
సంజూను కూరలో కరివేపాకులా తీసేశాడు!
కేరళ క్రికెట్ లీగ్ 2026లో టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్‌కు ఘోర అవమానం ఎదురైనట్లు తెలుస్తోంది. శనివారం టోర్నీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రజంటేషన్ వేడుకలో శాంసన్‌తో చేతులు కలపడానికి భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నిరాకరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో నిజమెంత? ఏఐ వీడియోనా అనేది పక్కనబెడితే శ్రీశాంత్ చర్య మాత్రం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.విషయంలోకి వెళితే.. ప్రజంటేషన్ సందర్భంగా అప్పటికే శాంసన్ వెళ్లి స్టేజీపై ట్రోఫీ పక్కనే నిల్చున్నాడు. ఈలోగా స్టేజీ మీదకు వచ్చిన శ్రీశాంత్ శాంసన్ వైపు కన్నెత్ని కూడా చూడలేదు. అటుపై శాంసన్ పక్కనే నిల్చున్న మిగతా అధికారులకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ శాంసన్‌తో షేక్ హ్యాండ్ కాదు కదా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట క్షణాల్లో వైరలయ్యాయి. అయితే దీనిపై అటు శ్రీశాంత్ కానీ.. ఇటు సంజూ కానీ ఇప్పటివరకైతే స్పందించలేదు. అయితే అభిమానులు మాత్రం కామెంట్లతో రెచ్చిపోయారు. "సంజూ శాంసన్‌ను శ్రీశాంత్ కూరలో కరివేపాకులా తీసేశాడు.. ఇది దారుణ అవమానం" అని పేర్కొన్నారు.ఇక కేరళ క్రికెట్ లీగ్ 2026 టైటిల్‌ను త్రిసూర్ టైటాన్స్ ఎగరేసుకుపోయింది. శనివారం రాత్రి కాలికట్ గ్లోబల్స్టార్స్తో జరిగిన ఫైనల్లో త్రిసూర్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కాలికట్ గ్లోబల్‌స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అఖిల్ స్కారియా (45), అశ్విన్ ఆనంద్ (40) రాణించారు. త్రిసూర్ బౌలర్లలో అబ్దుల్ రమీస్ 3 వికెట్లు తీయగా, ఆనంద్ జోసెఫ్, శరత్ ప్రసాద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన త్రిసూర్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అహమ్మెద్ ఇమ్రాన్ (69) అర్థసెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, సంజీవ్ సతీషన్ (29) రాణించాడు. కాలికట్ బౌలర్లలో జోస్ పెరైల్, అఖిన్ సతార్, ఇన్బుల్ అఫ్తాబ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. మహ్మద్ అజారుద్దీన్ (11 మ్యాచ్‌ల్లో 596 పరుగులు) టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలవగా, నిఖిల్ మాలిక్ (11 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ భారత జట్టులో టీ20, వన్డేల్లో కొనసాగుతున్నాడు. జింబాబ్వే, ఇంగ్లండ్ సిరీస్‌కు దూరంగా ఉన్న శాంసన్ అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.Any problems between Sreesanth and Sanju Samson?👀There seems to be some talk about a possible ego clash following Sreesanths recent interview.Only they know whats really happening🤷♂️#SanjuSamson @BCCI pic.twitter.com/ndNri2Tabm— Morvin Edward (@morvinedward) September 6, 2026చదవండి: 'అందని ద్రాక్ష పుల్లన'.. అతడి విషయంలో నిజమైంది! -
చేతులతో ఎందుకు తినాలంటే..? ఆర్థికవేత్త అద్భుతమైన వివరణ ఇదే..
భారతీయులు ఆహారాన్ని ఎందుకు చేతులతో తింటారంటూ చాలాసార్లు విదేశీయలు ప్రశ్నిస్తూ..మన సంస్కృతిని అవమానిస్తుంటారు. పైగా మన విధానాన్ని నాగరికత లేని వ్యక్తిగా అభివర్ణిస్తూ తిట్టిపోస్తుంటారు. ఇలాంటివి మనం చాలాసార్లు చూశాం కూడా. దీనికి ప్రముఖ ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ చాలా అద్భుతమైన సమాధానమిచ్చారు. మరోసారి ఆ ప్రశ్న లేవనెత్తే ఛాన్సే లేకుండా గట్టి కౌంటరిచ్చారు. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.ఫ్లోరిడాకు చెందిన అకా అనే వ్యక్తి ఒక దక్షిణాది వివాహం లేదా సాంప్రదాయ పెళ్లి భోజనాలకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. అందులో ఒక జంట చేతులతో భోజనం చేయడం కనిపిస్తోంది. ఆ వీడియో చూపిస్తూ..నిజంగా అడుగుతున్నా..వారంతా ఎందుకు చేతులతో తింటున్నారు అని ప్రశ్నించాడు. ఇది నవంబర్ 2025లో వైరల్ అయిన పోస్ట్. ఇది మన భారత ప్రముఖ ఆర్థివేత్త సంజీవ్ సన్యాల్ దృష్టికి వచ్చింది. ఆయన ఈ వీడియోని రీట్వీట్ చేస్తూ..ఇలా సమాధానమిచ్చారు. ఇదొక సింపుల్ టెస్ట్ అని. మీరు తాకి పదార్థాన్ని తినే ధైర్యం లేకపోతే స్పూన్లు, కత్తులు వంటి ఇనుప ఆయుధాలను ఉపయోగించండి పర్లేదు. కానీ అలా తింటే గనుక ఆ ఆహారాన్ని తినొచ్చా లేదా అని మీ నోరు నిర్ణయించడం కష్టం అవుతుంది అని అద్భుతంగా రిప్లై ఇచ్చారు. ఆయన చేతి స్పర్శ తినే పదార్థం మధ్య ముడిపడి ఉన్న రుచిని, తినాలనే అనుభూతిని హైలెట్ చేస్తూ చెప్పారు. నిజంగానే మనం టచ్ చేయగానే బాగుంది తినొచ్చు అనిపించి..సులభంగా తినగలం. పైగా చేయి తాకడంతోనే రుచి కూడా అధికమవుతుది. అదే కత్తులు, స్పూన్లు వాడితే నోట్లో పెట్టుకునేంత వరకు రుచిని చెప్పలేరని స్పర్శతో ఆహారానికి ఉన్న సంబంధాన్ని హైలెట్ చేసింది. కాగా, నెటిజన్లు ఆర్థికవేత్త సన్యాత్ అద్భుతమైన రిప్లైకి ఫిదా అవుతూ ..చాలా చక్కటి పాయింట్‌ని చెప్పారు సార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్ట్‌లు పెట్టారు. It is a simple test..... if you cannot bear to touch it, and need metal instruments, then it is probably a bad idea to put it in your mouth. https://t.co/omWQcETPDi— Sanjeev Sanyal (@sanjeevsanyal) September 5, 2026 (చదవండి: సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూ..12 వేల అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగు!) -
సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూ..12 వేల అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగు!
శారీరకం మానసికంగా ఉండే వైకల్యం ఎల్లప్పుడూ మన గమనాన్ని ఆపలేవు. అవి బలమైన సంకల్పం ముందు ఓడిపోతాయి. అందుకు ఉదాహరణ అనురాగ్ రావత్. ఒకప్పుడూ అతను ఎలా బతుకుతాడు, అతడి జీవితం ఎలా ఉంటుంది అని సందేహం వ్యక్తం చేసిన వాళ్లే ఆశ్చర్యపోయాలా స్ఫూర్తిదాయకంగా జీవిస్తున్నాడు.సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తున్న రావత్ భారతదేశంలో రెండోసారి ఎత్తైన ప్రదేశంలో పరుగును పూర్తి చేసి, తన ఫిట్నెస్ ప్రయాణంలో మరో అద్భుతమై మైలురాయిని అందుకున్నాడు. అతని ఘనతను ప్రశంసిస్తూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇలా ఉంది. “సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూనే, 12,500 అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసి, భారతదేశంలో ఒక వ్యక్తి దేశానికి ప్రపంచవ్యాప్త కీర్తిని తీసుకురావడం ఇది రెండోసారి” అని యూజర్ పేర్కొన్నాడు పోస్ట్‌లో. రావత్ మారథాన్లు, ఫిట్నెస్ ఛాలెంజ్‌లు, సాధారణ వ్యాయామాల్లో పాల్గొంటూ తన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకునేవాడు. అది కాస్తా కాలక్రమేణా అతని పోస్ట్‌లకు రెండు లక్షలకు పైగా ఫాలోవర్లతో కూడిన ఆన్లైన్ కమ్యూనిటీని నిర్మించుకోవడానికి దారితీసింది. కాగా, రావత్‌కు రెండేళ్ల వయసులో సెరిబ్రల్‌పాల్సీ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఆయన తన తండ్రి స్ఫూర్తితో సైన్యంలో చేరాలని కలలు కంటూ పెరిగాడు కానీ ఎనిమిదో తరగతితోనే చదువు మానేయక తప్పలేదు. చదువు మానేయడం రావత్‌కు చాలా కష్టంగా అనిపించినా తప్పలేదు. దాంతో అంతా అతడి భవిష్యత్తు ఎలా ఉంటుందా అని అనుకున్నారు. చివరికి తనకంటూ ఒక మార్గాన్ని నిర్మించుకుని అందరూ తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు. అంతేగాదు రావత్ వీడియోలు చిత్రీకరించడం, ఎడిట్ చేయడం స్వయంగా నేర్చుకుని, పరుగు, జిమ్ వర్కౌట్లు, ఫిట్నెస్ ఛాలెంజ్‌లు, తోసహా తన దైనందిన జీవితానికి సంబంధించి ప్రతీ కంటెంట్‌ను పంచుకునేవాడు. అప్పటి నుంచే అతని జర్నీ యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అతన కంటెంట్ తన సామార్థ్యాలపై దృష్టిని సారిస్తోంది. పైగా ఆ వ్యాధి తన సామార్థాలను ఆపలేదు, పరిమితులను విధించలేదు అని చెబుతున్నట్లుగా ముందుగా సాగుతున్నాడు రావత్. నెటిజన్లు కూడా నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు మాకు స్ఫూర్తివి. వదిలేయడం అనేది రక్తంలోనే లేదు అనడానికి నువ్వే నిదర్శనం అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by _अनुराग_रावत_🇮🇳 (@_the_distinctive_) (చదవండి: 104 ఏళ్లకు బెయిల్... 105లో స్వేచ్ఛ) -
నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట
-
వైరలవుతున్న అల్కరాజ్ బనియన్ .. ఇదేం కర్మరా దేవుడా!
స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ప్రస్తుతం యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టైటిల్ వేటలో దూసుకెళ్తున్నాడు. నాలుగు నెలల పాటు మణికట్టు గాయం కారణంగా ఆటకు దూరమైన అల్కరాజ్ యూఎస్ ఓపెన్ ద్వారా పునరాగమనం చేశాడు. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌కు చేరిన అల్కరాజ్ టైటిల్ గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. టోర్నమెంట్లో అల్కరాజ్ ధరించిన బనియన్ (Nike OutFit) వైరల్‌గా మారింది. అతడి బనియన్ కారణంగా సోషల్ మీడియాలో అల్కరాజ్ "నిపుల్గేట్" (Nipplegate) ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది.విషయంలోకి వెళితే యూఎస్ ఓపెన్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన అల్కరాజ్ జులపాల జుట్టుతో పాటు వేషదారణను కూడా పూర్తిగా మార్చేశాడు. మొదటి రెండు రౌండ్ల మ్యాచ్‌లకు అల్కరాజ్ నైక్ (Nike) బ్రాండ్‌కు చెందిన లూజ్-ఫిట్టింగ్ బ్రౌన్ కలర్ ట్యాంక్ టాప్ ధరించాడు. Photo Credit: Twitterమ్యాచ్ సమయంలో అతను కోర్టులో వేగంగా కదులుతున్నప్పుడు ఆ లూజ్ జెర్సీ పక్కకు జరిగి, అతని కుడి వైపు రొమ్ము భాగం (Nipple) పదే పదే బయటకు కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. "లవ్ యూ కార్లోస్, కానీ నీ రొమ్ము భాగాన్ని కప్పి ఉంచేలా టైట్ బనియన్ వేసుకొని బరిలోకి దిగు" అని మాజీ టెన్నిస్ క్రీడాకారిణి, కామెంటేటర్ యూజినీ బౌచర్డ్ ఎక్స్ వేదికగా ఫన్నీ కామెంట్ చేసింది.తన ఔట్ఫిట్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్, కామెంట్లను అల్కరాజ్ సీరియస్‌గా తీసుకున్నట్లుగా అనిపించింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో అల్కరాజ్ బ్రౌన్ ట్యాంక్ టాప్ కింద వైట్‌కలర్ అండర్ షర్ట్ ధరించడం కనిపించింది. మ్యాచ్ సమయంలో వేగంగా కదిలినప్పటికీ అతడి రొమ్ము భాగం కనిపించలేదు. Photo Credit: Twitterఇక మ్యాచ్ అనంతరం ఫ్రెస్ కాన్ఫరెన్స్‌లో అల్కరాజ్ మాట్లాడుతూ తన ఔట్ఫిట్పై సరదాగా స్పందించాడు. “ఇటీవల నా రొమ్ము భాగం నాకే ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా అనిపించింది. అందుకే కనీసం ఒక్క మ్యాచ్‌కైనా వాటిని దాచేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇన్నర్‌వేర్ రూపంలో రెండో షర్ట్ ధరించడం చాలా సౌకర్యంగా అనిపిస్తోంది. ఇకపై దీనినే కొనసాగిస్తాను” అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఇది పూర్తిగా తన సొంత నిర్ణయమేనని, నైక్ సంస్థ దీనికి కారణం కాదని అల్కరాజ్ మరోసారి స్పష్టం చేశాడు. No more wardrobe malfunctions for Carlos Alcaraz 😂 pic.twitter.com/BDEfGRs4Pf— TNT Sports (@tntsports) September 5, 2026 Cue the Carlos Alcaraz break of serve! pic.twitter.com/SB8YyFHLCK— US Open Tennis (@usopen) August 31, 2026 Quem será que ganhou esse sorriso do Carlitos 😍.. pic.twitter.com/ytqhNRiY7F— Central Carlos Alcaraz (@AlcarazCentral) September 4, 2026చదవండి: బంతి వేయడానికి 100 కి.మీ. పరిగెత్తిన ఇంగ్లండ్ బౌలర్ -
మళ్లీ భగ్గుమన్న కంగనా రనౌత్.. దిమ్మతిరిగిపోయేలా కౌంటర్
సినీనటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో తన ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకుంటారు. జన్మాష్టమి సందర్భంగా కంగనా ఆన్లైన్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తాను మనాలీలోని తన ఇంట్లో ఉన్నానని, పండుగ సందర్భంగా ప్రత్యేక భోగ్ తయారు చేస్తున్నానని ఆ వీడియోలో వెల్లడించారు. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. దీనిపై ఎక్స్‌లో ఓ వ్యక్తి స్పందిస్తూ.. కంగనా వంట చేస్తున్న పాత్ర నల్లగా ఉన్నప్పటికీ, ఆమె గ్యాస్ వెలిగించలేదని వ్యాఖ్యానించారు. దీనిని గమనించిన కంగనా వెంటనే ఆ వ్యక్తికి కామెంట్లోనే ఘాటుగా సమాధానం ఇచ్చారు.కంగనా ఏమన్నారు?కంగనా వంట చేస్తున్న పాత్ర అప్పటికే నల్లగా ఉన్నప్పటికీ, గ్యాస్ స్టవ్ వెలిగించడం మర్చిపోయారని ఎక్స్‌లో ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. దీనికి కంగనా స్పందిస్తూ.. “ఇది హల్వా కాదు, భోగ్. ఇందులో చాలా పదార్థాలను విడివిడిగా తయారు చేసి, ఈ దశలో అన్నింటినీ కలుపుతారు. ఆ తర్వాత దాన్ని సెట్ చేసి ముక్కలుగా కోస్తారు. తల్లిదండ్రులకు, ఈ గ్రహానికి భారంగా ఉన్న వ్యక్తుల నుంచి వంట నైపుణ్యాలను ఆశించలేం. మీరు తినడంపైనే దృష్టి పెట్టండి. వంట గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు. Gas तो जला लो टंगना ड्रामेबाज़ 😁ओर कड़ाई देखो कितना काला है 😂🤣🤣 pic.twitter.com/OOWzM7lvjs— Queen 👸 (@Queen510619151) September 4, 2026కంగనా ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్కంగనా ఇటీవల ఏసిన వ్యాఖ్యలు కొంతమంది యువ హిందూ మహిళలు బాధ్యత లేకుండా స్వేచ్ఛను ప్రదర్శిస్తున్నారని కంగనా వ్యాఖ్యానించారు. వారిని ‘జనరేషన్ గట్టర్’ అని పేర్కొనడం వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలపై యోగా గురువు స్వామి రామ్‌దేవ్ విమర్శలు చేశారు. ఇది ‘చెడిపోయిన మనస్తత్వానికి’ నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీనిని కంగనా తీవ్రంగా తప్పుబట్టారు. తనపై ఉన్న ఎస్సీ కేసును గమనించాలని రామ్‌దేవ్‌కు సూచించారు.రాఖీ సందర్భంగా వీరిద్దరి మధ్య బహిరంగ వివాదం ముగిసింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కంగనా రామ్‌దేవ్ విలేకరులతో మాట్లాడుతున్న వీడియోను పంచుకున్నారు. తనతో ఉన్న వివాదాన్ని ముగించి, దాన్ని సంభాషణగా మార్చుకోవాలని కోరుకుంటున్నట్లు రామ్‌దేవ్ అందులో చెప్పారు. రాఖీ సందర్భంగా తనకు వద్ద ఓ బహుమతి ఉందని, శుభదినాన ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతానని కూడా ఆయన తెలిపారు.కంగనా పోస్ట్ చేస్తూ.. “పండుగ రోజు.. తప్పులు, పొరపాట్లన్నింటినీ క్షమించేందుకు ఉద్దేశించినది. నా సోదరుడు బాబా రామ్‌దేవ్ జీ వివాదం కాదు, సంభాషణ ఉండాలని చెప్పడం చాలా మంచిగా అనిపించింది” అని చెప్పారు. ఆమె రామ్‌దేవ్ ఆప్యాయతను స్వీకరిస్తూ.. “ఈ రక్షాబంధన్ రోజున ఆయన పంపిన స్వీట్లు, పెద్ద సోదరుడి ప్రేమ రెండింటినీ స్వీకరిస్తున్నాను. చాలా ధన్యవాదాలు. భగవంతుడు మీకు దీర్ఘాయువు ప్రసాదించాలి” అని పేర్కొన్నారు.కంగనా గతంలో కృతి సనన్, ఆమె వైరల్ అయిన ప్రకటనపై కూడా విమర్శలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. “మహిళగా ఉండటానికి ఇది అద్భుతమైన సమయం. మన అలమారాల్లో అనేక రకాల దుస్తులు ఉన్నాయి. నేటి మహిళ ప్రపంచ మహిళ. కాక్టెయిల్ డ్రెస్‌ల నుంచి లెహంగా చోళీల వరకు, జీన్స్ నుంచి చీరల వరకు, బికినీల నుంచి సల్వార్ కమీజ్ వరకు.. ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న ఇన్ని ఆప్షన్లలో మీ సోదరుడికి బికినీ లేదా లోదుస్తులతో రాఖీ ఎందుకు కట్టాలి? మీకు ఉన్న అన్ని స్టైలింగ్ ఆప్షన్లు ఏమయ్యాయి? హా హా.. ఆ ప్రకటన ఉద్దేశపూర్వకంగానే అసహజంగా కనిపిస్తోంది” అని విమర్శించారు. -
తగ్గని ‘ఇరుముడి’ ఫీవర్.. ట్రాక్టర్లతో పోటెత్తిన ప్రేక్షకులు
శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన చిత్రం ‘ఇరుముడి’ . ఈ సినిమాకు తొలిరోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్‌ను సైతం షేక్ చేస్తోంది. ఈ సినిమాలో రవితేజ తన పాత్రలో ఒదిగిపోయాడు. జీవీ ప్రకాశ్ అందించిన మ్యూజిక్ సైతం సినిమాకు ప్రాణం పోసింది. తండ్రీకూతురు సెంటిమెంట్‌కి అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని జోడించి తీసిన ఇరుముడిని చూసిన చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.ఇదీ చదవండి: బిగ్‌బాస్ తొలి కంటెస్టెంట్.. రైతుబిడ్డ ఝాన్సీఈ సినిమా వచ్చి చాలా రోజుల అవుతున్నా ఇంకా ఇరుముడి ఫీవర్ నడుస్తూనే ఉంది. పల్లె నుంచి పట్నం వరకు చిన్న, పెద్దా అని తేడా లేకుండా థియేటర్లకు క్యూ కడుతున్నారు. . అయితే ఈ సినిమాను చూసేందుకు గ్రామల నుంచి ప్రేక్షకులు ట్రాక్టర్లతో థియేటర్లకు తరలివెళ్లారు. ఇందులో వృద్ధులు, మహిళలే అధికంగా ఉండడం విశేషం. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.200 కోట్లకు పైగా..మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' (Irumudi Movie) బాక్సాఫీస్ వద్ద కేవలం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించింది. రవితేజ తన సుదీర్ఘ సినీ కెరీర్లో రూ.200 కోట్ల మార్కును అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఇందులో ప్రియా భవానీ శంకర్, బేబి నక్షత్ర కీలక పాత్రలు పోషించారు.ఎక్కువ మంది చదివింది: కీర్తి సురేశ్, నాని డ్యాన్స్ వైరల్.. ఈసారి క్రాస్ ఓవర్ వీడియో IRUMUDI: టాలీవుడ్‌కి గత వైభవాన్ని గుర్తు చేస్తున్న రియల్ బ్లాక్‌బస్టర్ #IRUMUDI 🔥గ్రామాల నుంచి ట్రాక్టర్లలో తరలివస్తున్న ప్రేక్షకులు… 3వ వారంలోనూ అదే జోష్, అదే సందడి 'ఇరుముడి' సినిమాని థియేటర్లలో ఒక పండగలా జరుపుకుంటున్నారు ❤️@RaviTeja_offl pic.twitter.com/oDRifTpyGd— H A N U (@HanuNews) September 4, 2026 -
కీర్తి సురేశ్, నాని డ్యాన్స్ వైరల్.. ఈసారి క్రాస్ ఓవర్ వీడియో
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మరో చిత్రం కావడంతో అంచానాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్‌లు, టీజర్ అభిమానులను అలరించాయి. ముఖ్యంగా ఇటీవలే వచ్చిన ఏషనాగుల పాట ఇప్పటికీ ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు చాలా మంది రీల్స్ చేస్తూ సోషల్‌మీడియాలో రీపోస్ట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో హీరోయిన్ కీర్తి సురేశ్, నాని ఇదే సాంగ్‌ను దసరా సినిమాలోని చమ్కీల సాంగ్‌తో మిక్స్ చేసి ఈ రెండు పాటలపై క్రాస్ ఓవర్ వీడియో చేశారు. అదికాస్త సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ50 మిలియన్లు దాటిన ఏషనాగుల..తాజాగా రిలీజైన మాస్ సాంగ్ ఏషనాగుల ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పాట గురించే టాక్ వినిపిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే యూట్యూబ్ వేదికగా 50+ మిలియన్ వ్యూస్ దాటిన తొలి తెలుగు పాటగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ సెప్టెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!
పోలీసుల కంటపడకుండా చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడు.. పోలీసులు వెంటపడటంతో ఊహించని పని చేశాడు. ఏకంగా చెరువులోకి దిగి నీళ్ల కింద దాక్కున్నాడు. పోలీసులు వెనక్కి వెళ్లిపోతారని భావించాడు. కానీ.. పోలీసులు అంత ఈజీగా వదులుతారు. అతగాడి జాడను అవలీలగా పట్టేశారు. నీళ్లలోకి దిగి అతడిని పట్టుకున్నారు. కర్ణాటకలో జరిగిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన దిలీప్ అలియాస్ కారియా (19)పై మొత్తం 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో రెండు హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ఓ కేసులో కోర్టు విచారణలకు హాజరుకాకపోవడంతో అతడిపై మూడు సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.ఈ క్రమంలో దిలీప్ భద్రావతి న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తనను పట్టుకునేందుకు వస్తున్నారని గమనించిన దిలీప్.. అక్కడి నుంచి పరుగులు తీశాడు. కొద్దిసేపటికి ఓ నీటి ప్రవాహం వద్దకు చేరుకుని.. ఎక్కడ దాక్కోవాలో తెలియక ఏకంగా నీళ్లలోకి దిగిపోయాడు.పోలీసులు చుట్టుపక్కల ఎంత వెతికినా తొలుత దిలీప్ కనిపించలేదు. దీంతో అతడు తప్పించుకున్నాడని భావించే పరిస్థితి ఏర్పడింది. కానీ పోలీసుల కంటికి నీళ్లలో కలుపు మొక్కలు కదలడం, నీటి అడుగు నుంచి గాలి బుడగలు పైకి రావడం కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించారు.అంతే.. అసలు విషయం బయటపడింది. దిలీప్ నీళ్ల అడుగునే దాక్కుని ఉన్నాడు. వెంటనే ఎస్సై రమేశ్, పోలీస్ సిబ్బంది ప్రసన్న నీళ్లలోకి దిగి అతడిని బయటకు లాగారు. అక్కడికక్కడే చేతులకు బేడీలు వేసి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!” అంటూ ఖాకీలతో ఆ దిలీప్ చమత్కరించాడు.Hide and Seek : Cops dive into a pond to nab a rowdy sheeter hiding under weeds in ShivamoggaPolice in Shivamogga district have arrested a rowdy sheeter who was hiding in a pond to evade arrest despite three non bailable warrants issued against him by the court.The accused,… pic.twitter.com/6K0DBzRTUA— Imran Khan (@KeypadGuerilla) September 4, 2026 -
ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి!
సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం.. ప్రేమ పేరిట ఆకర్షణ.. ఇవన్నీ యువతపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయో చెప్పేందుకు ఈ ఘటన మరో ఉదాహరణ. తమకు నచ్చిన వ్యక్తి కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో కొందరు హద్దులు దాటుతున్నారు. క్షణికమైన కోరిక కోసం తీసుకునే నిర్ణయాలు.. చివరికి జీవితాన్నే మార్చే పరిణామాలకు దారితీస్తున్నాయి. తమ ప్రేమను నిరూపించుకోవాలనే తాపత్రయంలో ఓ యువతి చేసిన పని ఇప్పుడు ఆమెను కటకటాల వెనక్కి నెట్టింది.ప్రియుడి మనసులో చోటు కోసం ఓ యువతి వెంపర్లాడింది. అతనికి ఉన్న ఖరీదైన బైక్ కలను నెరవేర్చాలని అనుకుంది. ఈ క్రమంలోనే ఆ కాలేజీ విద్యార్థినిని దొంగగా మారి.. తండ్రి పరువు తీసేసింది. తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. స్థానికంగా కాలేజీ చదువుతున్న ఓ యువతి.. ఓ అబ్బాయిని ఇష్టపడుతోంది. అతను కూడా ఆమెతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఖరీదైన బైక్ ఎప్పటికైనా కొనుక్కోవాలని అతను తరచూ ఆమెకు చెబుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఓరోజు తన తండ్రి స్నేహితుడైన హెచ్. తమిళ్‌సెల్వన్ ఇంటికి వెళ్లింది. అక్కడ అల్మారాలో బంగారం ఉన్న విషయం గుర్తించింది. వాళ్ల కళ్లు గప్పి.. 9 సవర్ల బంగారు నగలను చోరీ చేసింది.ఆపై ఆ నగలను స్థానిక దుకాణంలో రూ.2.5 లక్షలకు విక్రయించింది. ఆ వచ్చిన డబ్బుతో తన ప్రియుడు జనగన్ శివకు ఓ కాస్ట్లీ బైక్ కొనిచ్చింది. అంతేకాదు.. సంతోషంగా ఆ సర్ప్రైజింగ్ క్షణాలను వీడియోగా తీసి సోషల్ మీడియాలోనూ పంచుకుంది. ఇంట్లో బంగారు నగలు కనిపించకపోవడంతో తమిళ్‌సెల్వన్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానంతో.. స్నేహితుడి కూతురిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. విచారణలో తానే బంగారం తీసుకున్నట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు ఆమె ప్రియుడు జనగన్ శివ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.ప్రియుడికి బైక్ కొనివ్వాలన్న కోరికతో మొదలైన వ్యవహారం.. చివరకు దొంగతనం, అరెస్టు వరకు వెళ్లింది. క్షణికమైన ప్రేమ, ఆకర్షణ కోసం తీసుకున్న ఓ నిర్ణయం.. ఇప్పుడు ఆ యువతి జీవితానికే చేదు అనుభవంగా మారింది. ఇప్పుడీ కేసు.. ఆమె బైక్ కొనిచ్చిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.தந்தையின் நண்பர் வீட்டில் 9 சவரன் நகையைத் திருடி விற்று காதலனுக்கு புதிய பைக் வாங்கிக்கொடுத்த கல்லூரி மாணவி..!#Gold | #GoldTheft | #Bike | #Love | #PolimerNews pic.twitter.com/gcz136ETHK— Polimer News (@polimernews) September 4, 2026VIDEO CREDITS: Polimer News -
బొమ్మను చూసి అమ్మే అనుకుని..
ఆవు బొమ్మను చూసిన ఓ లేగదూడ అమాయకంగా దాని దగ్గరకు వెళ్లింది. డెయిరీ వ్యాన్‌పై ఉన్న ఆవు ఫొటోలోని నిండైన పొదుగు నుంచి పాలు తాగేందుకు ప్రయత్నించింది. అది బొమ్మ అని తెలియక.. ఆకలితో, అమ్మ కోసం వెతుకుతున్నట్టుగా వ్యాన్‌ను అనుసరించిన దృశ్యం చూపరులను కదిలించింది. నిజం తెలియని ఆ చిన్న ప్రాణి, తల్లి కోసం పడిన తపన ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎంతో సహజసిద్ధంగా కారులో నుంచి వీడియో తీస్తున్నట్లు ఉంది. అయితే ఇది ఏఐ వీడియో.అయినప్పటికీ ఈ వీడియో చూస్తూ చాలామంది నవ్వుతూనే.. భావోద్వేగానికి లోనయ్యారు. బంధం అంటే ఇదేనేమో.. తల్లిని వెతికే మనసు అనేది ఇలానే ఉంటుంది కదా అని భావోద్వేగానికి లోనవుతున్నారు.. దాంతో ఈ వీడియో వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో అత్యంత పవిత్రమైన తల్లి- బిడ్డ మధ్య ఉండే బంధం ఉండటంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లి స్పర్శ అనేది బిడ్డకు ధైర్యాన్ని, రక్షణ ఇచ్చేది కావడం ఒకటైతే, భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి వీడియోను వీక్షకులు అమితంగా ఇష్టపడుతూ తెగ వైరల్ చేస్తున్నారు. The ancients called it physis, the nature that precedes reason! Before we learn to speak, we learn to seek.A calf saw a cow image and without knowing the illusion from reality, walked towards it seeking milk.It is what Aristotle meant by saying: " Some bonds are not taught by… pic.twitter.com/UZDizeT3Kv— WireClicks (@Wireclicks) September 4, 2026 -
మోకాళ్ల లోతు వరదనీటిలోనే పెళ్లి.. వైరల్ వీడియో
మోకాళ్ల లోతు వరద నీటిలో కూడా ఓ జంట పెళ్లి చేసుకున్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక కాథలిక్ చర్చిలో ఫిలిప్పీన్స్ జంట ఇపుటు నెట్టింట హల్చల్ చేస్తున్నారు. తీవ్రమైన వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నప్పటికీ లీన్ లీజా గలాంగ్, గిల్బర్ట్ చికో అనే జంట పెళ్లి వేడుక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వినూత్న వివాహానికి ఆసక్తికర వివరాలు ఇలా ఉన్నాయి.ఫిలిప్పీన్స్‌లోని ఇటీవలి భారీ రుతుపవన వర్షాలు చాలా ప్రాంతాలను ప్రభావితం చేస్తున్న తరుణంలో ఈ అసాధారణ వివాహం జరిగింది. మనీలాకు ఉత్తరాన ఉన్న బులాకాన్ ప్రావిన్స్‌లోని హగోనోయ్ పట్టణంలో గల 'సెంట్ జాన్ ది బాప్టిస్ట్ పారిష్' చర్చిలో సెప్టెంబర్ 1న ఈ పెళ్లి జరిగింది.గత నెల రోజులుగా ఈ చర్చి ప్రాంతం నీట మునిగి ఉంది. నీటి మట్టం పెరుగుతుండటంతో పెళ్లి వాయిదా వేసుకోవాలని చర్చి వర్గాలు సూచించినప్పటికీ, ఆ జంట వెనక్కి తగ్గలేదు. వధువు తన వెడ్డింగ్ గౌన్ తడిసిపోతున్నా మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ అల్తార్ (వేదిక) వద్దకు చేరుకోవడం విశేషం.నిజానికి ఈ జంట డిసెంబర్లో పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే మిడిల్ ఈస్ట్‌లో ఉద్యోగం చేసే వరుడు చికో, బాస్కెట్‌బాల్ ఆడుతూ కాలుకి గాయం కావడంతో అను అనుకోకుండా ముందుగానే ఇంటికి తిరిగి వచ్చాడు. మళ్లీ ఉద్యోగానికి వెళ్లేలోపు పెళ్లి ముగించుకోవాలని ఈ సమయాన్ని ఎంచుకున్నారు.ఇదీ చదవండి: నిన్నగాక మొన్న ప్రేమ పెళ్లి.. వాటర్ ట్యాంక్‌లో శవంగా నవవధువుపెళ్లి దుస్తులు పాడవకుండా ఉండటానికి ప్రత్యేక రవాణా వాహనంలో చర్చి ప్రాంగణం వరకు వచ్చారు. అతికొద్ది మంది కేవలం 15 మందిలోపు బంధువుల సమక్షంలో ఫాదర్ ఈ వివాహాన్ని త్వరితగతిన పూర్తి చేశారు. నడుము లోతు నీళ్లలోనే ఒక చిన్నారిని ఉంగరాలను తీసుకెళ్లాడు.ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియో LOVE, WATER… AND CHAOS 💍🌊One couple’s romantic wedding shoot ended with the bride and groom falling straight into the river. Another couple in the Philippines went through with their ceremony in a flooded church, wading through waist-deep water to say “I do.”#Wedding… pic.twitter.com/9NP0w4gEPy— Unit News (@Unit_News) September 3, 2026 వేడుక సమయంలో తమ పెళ్లి బట్టలు తడిసినా ఫర్వాలేదని, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తాము ఆ సందర్భానికి తగినట్లే దుస్తులు ధరించామని చికో తెలిపారు "ఎంతటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా, పరస్పర ప్రేమ ముందు వరదలు కూడా బలాదూర్" నెటిజన్లు ఈ జంటను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. -
వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియో
భారతదేశంలో కేక్‌లు, ఐస్‌క్రీమ్‌లు, బేకరీ ఉత్పత్తులలో విరివిగా ఉపయోగించే 'టూటీ ఫ్రూటీ' (Tutti Frutti) తయారీ విధానానికి సంబంధించిన ఒక వీడియో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. దీని తయారీలో పాటిస్తున్న శుభ్రతా ప్రమాణాలు, కాలుష్య పూరిత వాతావరణం చూసి నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.'పాయల్ కుష్వాహా' అనే నెటిజన్ ఎక్స్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఎంతో శుభ్రమైన పద్ధతిలో టూటీ ఫ్రూటీని తయారు చేస్తున్న వీడియో ఇది అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఇది చూశాక చాలా మందికి టూటీ ఫ్రూటీ ఇష్టమైనదిగా మారిపోతుంది అంటూ క్యాప్షన్ పెట్టారు. మురికి నీళ్లలో, ఎలాంటి రక్షణ పద్దతులను పాటించకుండా, ఒంటిపై ఒక నిక్కరు మాత్రమే వేసుకుని కార్మికులు పనిచేయడం, ఇతర ప్రక్రియకు సంబంధించి, ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.కేక్‌లు, డెజర్ట్‌లలో టూటీ ఫ్రూటీని చూడగానే తమ పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తయారీ వాతావరణం, అపరిశుభ్రతను చూసి తీవ్ర అసహ్యానికి గురయ్యారు. ఇకపై తినడానికి ఇది భయపడాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.Guys, Aap sabhi ke liye bahut hi hygienic tarike se tuti furti banai ja rahi hai, video dekhne ke baad kafi logo ka fruti favourite ban jayega pic.twitter.com/rvCsvE8GiW— Payal Kushwaha (@payalpixel) September 3, 2026 కాటన్ క్యాండీ, ఐస్ గోలా, స్ట్రీట్ ఫుడ్స్ తయారీ వీడియోలు గతంలో చాలానే వైరల్ అయ్యాయి. తాజా వీడియో కూడా ఆహార భద్రతా ప్రమాణాలు (Food safety standards), అసంఘటిత చిన్న తరహా పరిశ్రమలలో పరిశుభ్రత లోపాన్ని ఎత్తిచూపుతోంది. మరోవైపు ఈ వైరల్ వీడియో ప్రామాణికత, ఎక్కడిది లాంటి వివరాలపై స్పష్టతలేనప్పటికీ, లేదా అందులో చూపించిన ఫ్యాక్టరీ వాతావరణంపై ఇప్పటివరకు ఏ ప్రముఖ టూటీ ఫ్రూటీ తయారీ సంస్థ గానీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు గానీ అధికారికంగా స్పందించలేదు. -
సీఏ వదిలేసి దోసె వ్యాపారం..నెలకు రూ. 12 లక్షలు!
ఒక్కోసారి మనం ఒకటి అనుకుంటే..విధి మరోలా తలుస్తుంది. పైగా ఆ దారిలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఇస్తుంది. తీరా సక్సెస్ అందుతుందా లేదా అనే ఉత్కంఠ మధ్యలో పడేసి కుంగిపోయేలా చేస్తుంది. అయినా ఓపికతో స్ట్రాటజీ మారుస్తూ ముందుకెళ్లే వాడు కచ్చితంగా సక్సెస్ అందుకుంటాడు అనే మాటకు ఈ యువకుడే ఉదాహరణ.బెంగళూరుకి చెందిన గణేశ్ సీఏ చదువుని మధ్యలో వదిలేసి అమ్మ చేసే సాధారణ దోసెనే వ్యాపారంగా మార్చాడు. అది మొదట్లో రోజుకి రూ. 20ల నష్టంతో విపరీతమైన నష్టాలు చవిచూసింది. ఎందుకుంటే ఆకర్షణీయమైన ఫుడ్‌ట్రక్‌లు, మోమోలు, పిజ్జా రోల్స్ వంటి ఆధునిక ఫుడ్ బ్రాండ్ దెబ్బకు కుదేలైపోయాడు. దాంతో చెల్లి స్వప్న సాథే తట్టుకోలేక వదిలేద్దాం అని చెప్పినా.. గణేశ్ మాత్రం ఎలాగైన సక్సెస్ అందుకోవాలని మొండిగా ముందుకు సాగాడు. అతడి కుటుంబం అతడు సీఏ చేసి మంచి వృద్ధిలోకి రావాలనుకుంటే ఇదేంటి వ్యాపారం అది ఇది అంటాడని మొత్తుకునేవారు. అయినా ఎవ్వరి మాట లెక్క చేయకుండా నష్టాలు వచ్చినా..సరే మొండిగా వ్యాపారం చేసుకుంటూ వచ్చేవాడు. ఆ తర్వాత అతడి అచంచలమైన ఓర్పు అతనికి ఓ ఆలోచన మెరుపులా తట్టింది. ఇప్పుడంతా సోషల్ మీడియాదే హవా కాబట్టి తాను చేసే వ్యాపారం గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటే అనే ఆలోచన కలిగింది.అదే అతడికి విజయానికి పెట్టుబడిగా మారింది. తాను రూ. 50 వేల రూపాయలు అప్పు చేసి తన తల్లి చేసే బెన్నె దోసె వంటకాన్నే వ్యాపారంగా మార్చినట్లు నెటిజన్లతో పంచుకున్నాడు. అలాగా ప్రతి ఉదయం, తన తల్లి, చెల్లి స్వప్న తాజా పిండిని సిద్ధం చేస్తుండగా, గణేష్ రుచికరమైన దోసెలను తయారు చేయడం వంటి వన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించగానే అటు ఫాలోవర్లు, అమ్మకాలు రెండూ పెరిగాయి. అలా చూస్తుండగానే వ్యాపారం మంచి ఊపందుకుని నెలకు లక్షల్లో ఆదాయం ఆర్జించే రేంజ్‌కు చేరుకుంది. అంతేగాదు ఆ పాత బండి కూడా శాశ్వత రెస్టారెంట్‌గా మారిపోయింది. పైగా రోజుకి దాదాపు 400 మంది దాక దుకాణానికి వస్తుంటారు, అలాగే రోజుకి సుమారు 40 వేలకు పైగా ఆదాయం రావడం మొదలైంది. అంటే నెలకు దగ్గర దగ్గర రూ. 12 లక్షలు పై చిలుకు. ఏ పనైనా మొదలుపెట్టగానే సక్సెస్ రాదు, నాలుగైదు సార్లు కిందపడితే గానీ..అనుభవం రాదు, అప్పుడే గెలుపు పాదాక్రాంతం చేసుకోగలలం అని గణేశ్ సక్సెస్ స్టోరీ చెబుతోంది కదూ..!. View this post on Instagram A post shared by benne (@thee.benne) (చదవండి: ఎంపీ సుప్రియా సూలే ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! 50 ఏళ్ల వయసులోనూ..) -
‘నన్ను టార్గెట్ చేస్తే.. మళ్లీ కొడతా’ : స్వతంత్ర భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరిగిన నీట్ (NEET) నిరసనలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్త తండ్రిపై దాడి చేసిన కేసులో నిందితుడు స్వతంత్ర భరద్వాజ్ తన వైఖరిని సమర్థించుకుంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అతని ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో సీజేపీ అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది.అయితే ఈ సందర్భంగా స్వతంత్ర భరద్వాజ్ మాట్లాడుతూ సీజేపీ నిరసనలతో విద్యార్తుల గుంపు తనపై దాడి చేసి కొట్టి చంపేలా (Lynching) ప్రవర్తించడంతో, తనను తాను రక్షించుకోవడానికే తన చేతికి ఉన్న లోహపు కడా (Iron Bracelet)తో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ తలపై కొట్టానని తెలిపాడు.“I Cracked His Head. Still Never Went Jail.” Then He Named Powerful Politicians As Protection #SwatantraBhardwaj is heard allegedly claiming that he attacked the father of a protester, causing severe head injuries that required around 60 stitches. pic.twitter.com/sdydrSQzlm— Genzdigest (@genzdigest) September 3, 2026పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ వ్యాఖ్యలు వైరల్"నేను అతని(నిషు ఆజాద్ తండ్రి) పుర్రె పగలగొట్టాను, చావు బతుకుల మధ్య అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనికి 60 కుట్లు పడ్డాయి... నిజానికి నాపై సెక్షన్ 307 (హత్యాయత్నం) పడాలి, కానీ పోలీసులు నన్ను అరెస్ట్ కూడా చేయలేదు, రాత్రంతా తిరుగుతూనే ఉన్నాను ఒక్క రోజులోనే విడుదలయ్యాను. కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్ , మోదీ కూడా నాకు అన్నయ్యలే. అందరి మద్దతు ఉంది" అంటూ గర్వంగా మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అయితే ఇది వివాదాస్పద మవ్వడంతో, ఆ మాటలను సరదాగా అన్నానని మాట మార్చాడు. అంతేకాదు పాడ్‌కాస్ట్‌లో తన మాటల్ని వక్రీకరిస్తున్నారంటూ మాట మార్చడంతోపాటు, ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా కామెంట్ చేయడం వైరల్‌గా మారింది. మళ్లీ తనను చుట్టుముట్టి దాడి చేసేందుకు ప్రయత్నిస్తే, చేతి కడియంతో మళ్లీ కొడతానని హెచ్చరించడం కలకలం రేపింది.ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలుకాగా స్వతంత్ర భరద్వాజ్ వ్యాఖ్యలకు నిరసనగా సీజేపీ భీమ్ ఆర్మీ నిరసన చేపట్టింది. CJP ప్రతినిధి సౌరవ్ దాస్, కో-కన్వీనర్ అశుతోష్ రాంకాతో పాటు భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. భరద్వాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, అతనిపై హత్యాయత్నం, SC/ST చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట భారీ ధర్నా చేపట్టారు. ఫలితంగా భరద్వాజ్‌పై హత్యాయత్యం కేసు నమోదైంది. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని సీజేపీకి పోలీసులు హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: సీజేపీకీ భారీ ఊరట : ఇన్ఫ్లూయెన్సర్పై హత్యాయత్నం కేసు -
ఇంగ్లీష్‌లో అనర్గళంగా మట్లాడాలనుకుంటే..ఆమె ఇంటర్వ్యూ చూడాల్సిందే!
చాలామంది ఇప్పుడు సునాయాసం ఆంగ్ల భాష నేర్చుకుంటున్నారు. ఏఐ పుణ్యమా అని మొబైల్లోనే ఈజీగా నేర్చుకుంటున్నారు. కానీ మంచి పదజాలంతో సందర్భానికి అనుగుణమైన పద ప్రయోగంతో ఆకట్టుకునేలా నైపుణ్యం సాధించాలంటే ఆంగ్ల భాషపై మంచి పట్టు ఉండాలి. స్పోకెన్ ఇంగ్లీష్ మాదిరిగా పొడి పొడి పదాలతో కాకుండా చాలా శక్తిమంతమైన ఇడియమ్స్తో అనర్గళంగా మాట్లాడుతుంటే ఎవ్వరైన ఫిదా అవ్వుతారు. అంతేగాదు మన పనులను కూడా సునాయాసంగా చక్కబెట్టేయగలుగుతాం. ఇప్పుడిదంతా ఎందుకంటే బాలీవుడ్ ప్రసిద్ధ నటి, మాజీ కేంద్ర మంద్రి బిజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ ఇటీవలి ఇంటర్యూపై అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. అంతేగాదు ఆమె అనర్గళమైన ఆంగ్లభాష ప్రసంగంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆంగ్ల భాష మెరుగుపరుచుకోవాలంటే ఆమె ఇంటర్వ్యూ చూస్తే చాలు కొత్త పదాలు నెన్నో నేర్చుకోవచ్చు, నిజంగా ఆమె ఓ ఆంగ్ల మాస్టర్ క్లాస్ అని అభివర్ణిస్తున్నారు అంతా. ఆమె ఇటీవల బర్ఖాదత్ షో 'వీ ది విమెన్'లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ, దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ మధ్య జరిగిన సంభాషణ అశేష ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. ఆమె అనర్గళంగా మాట్లుడుతున్న ఆంగ్లభాష శైలి అందర్నీ అటెన్షన్‌తో వినేలా చేయడమే కాదు..ఎంతో స్పష్టంగా, కచ్చితంగా వ్యక్తపరుస్తున్న విధానం ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. ముఖ్యంగా ఆమె ఉపయోగించే పదజాలం, ఆత్మవిశ్వసంతో మాట్లుడుతున్న తీరు..ఆంగ్లభాష నేర్చుకోవాలనుకునే వారికి గొప్ప పాఠం అని అంటున్నారు నెటిజన్లు. కాగా, జర్నలిస్ట్ బర్ఖా దత్ ఆధ్వర్యంలో లండన్‌లో అంతర్జాతీయంగా తొలిసారిగా జరిగిన'వీ ది విమెన్' ఫెస్టివల్లో కరణ్‌జోహార్, స్మృతిల మధ్య జరిగిన సంభాషణ ఇది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై లుక్కేయండి మరి. Smriti Irani & Ekta Kapoor speak to Karan Johar: 'Kyuki' this is what success looks like. #wethewomen #openingdoors… https://t.co/B1RBTUIz8A— barkha dutt (@BDUTT) December 9, 2017(చదవండి: సన్యాసం కోసం..రూ. 47 కోట్ల కంపెనీ అమ్మకానికి! క్లయింట్‌ని వెతికిపెట్టినవారికి బంపరాఫర్) -
భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
-
రోడ్డుపై ఈము.. పోలీస్ పరుగులు! చివరికి ఏం జరిగిందంటే?
అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అటువంటిదే ఈ ఘటన కూడా. రోడ్డుపైకి వచ్చిన ఓ భారీ ఈము పక్షి.. ఓ పోలీస్ అధికారిని పరుగులు పెట్టించింది. ఈమును పట్టుకునేందుకు అధికారి చేసిన ప్రయత్నం కాసేపు సరదా ఛేజింగ్‌గా మారింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో నాష్డేల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈము పక్షి రోడ్డుపైకి వచ్చి అటూ ఇటూ సంచరించడంతో వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో సమాచారం అందుకున్న ఓ యువ పోలీస్ అధికారి అక్కడికి చేరుకున్నాడు. రోడ్డుపై నుంచి ఈమును పక్కకు పంపించేందుకు ప్రయత్నించగా.. అది ఆ అధికారిని పరుగులు పెట్టించింది. అధికారి ఎంత వేగంగా పరుగెత్తినా ఈము ఏమాత్రం దొరకకుండా ఉరకలు తీసింది. దీంతో అక్కడ కొద్దిసేపు సరదా ఛేజింగ్ కనిపించింది. ఎట్టకేలకు అధికారి ఆ పక్షిని రోడ్డుకు దూరంగా పంపించడంలో విజయవంతమయ్యాడు.అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోషల్ మీడియాలో ‘క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్’ అని పేర్కొంటూ పోస్ట్ చేశారు. రోడ్డుపై ఈము ఉండటం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డుపైకి వచ్చిన పశువులు, కంగారూలను పోలీసులు తరలిస్తుంటారు. అయితే ఈము కోసం ట్రాఫిక్ నిర్వహించాల్సి రావడం మాత్రం అరుదైన అనుభవమని అధికారులు పేర్కొన్నారు.ఈ వీడియోకు దాదాపు 90 వేల వ్యూస్ రావడంతో నెటిజన్లు కూడా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ‘అది తిరిగి పోలీస్‌ను వెంటాడితే అసలు వేగం తెలుస్తుంది’ అంటూ కొందరు సరదాగా స్పందించారు. మరికొందరు ఈ ఘటనను 1932లో ఆస్ట్రేలియాలో జరిగిన ‘ఈము వార్’తో పోల్చారు. అప్పట్లో పంటలను నాశనం చేస్తున్న ఈములను నియంత్రించేందుకు సైన్యం చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించకపోవడంతో ఆ ఘటన చరిత్రలో నిలిచిపోయిందని గుర్తుచేసుకున్నారు.అయితే, ఈ ఘటన సరదాగా కనిపించినప్పటికీ రోడ్డుపైకి వచ్చే పెద్ద జంతువులు వాహనదారులకు ప్రమాదకరంగా మారవచ్చు. అలాంటి పరిస్థితుల్లో డ్రైవర్లు వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ఉండాలి. పక్షులను, జంతువులను భయపెట్టకుండా దూరంగా వెళ్లి, అవసరమైతే పోలీసులకు సమాచారం ఇవ్వడం మంచిదని మరికొందరు వారి వారి అభిప్రాయాలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. View this post on Instagram A post shared by ABC News (@abcnews) ఇవి కూడా చదవండి: సన్యాసం కోసం..రూ. 47 కోట్ల కంపెనీ అమ్మకానికి! -
భారత బౌలర్ దెబ్బకు స్టోక్స్ ఫ్యూజులు ఔట్!
టీమిండియాలో చోటు కోల్పోయిన లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం కౌంటీ చాంపియన్‌షిప్‌లో బిజీ అయ్యాడు. అకీబ్ నబీ, రాహుల్ చాహర్, కుల్దీప్ యాదవ్‌తో పాటు చాహల్ కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో నార్తాంప్టన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్ డుర్హమ్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. చాహల్ ఖాతాలో అలెక్స్ లీస్, బెన్ స్టోక్స్, కాసే అల్డ్రిడ్జ్, మాథ్యూ పాట్స్ ఉన్నారు.ఈ నాలుగింటిలో స్టోక్స్‌ను బురిడీ కొట్టించిన తీరు మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పొచ్చు. చాహల్ వేసిన రిప్పర్ అనూహ్య టర్న్ తీసుకొని ఔట్‌సైడ్ వెళ్లి స్టంప్స్‌ను ఎగురగొట్టింది. చాహల్ వేసిన మ్యాజిక్ బంతికి స్టోక్స్ ఫ్యూజులు కదిలాయని చెప్పొచ్చు. ఏం జరిగింది అన్న తరహాలో స్టోక్స్ తల గోక్కుంటూ క్రీజు వీడడం కెమెరాలకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇటీవలే టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్ ఎంపిక చేసిన ఐదుగురు భారత బెస్ట్ బౌలర్ల జాబితాలో చాహల్ చోటు దక్కించుకున్నాడు. బుమ్రా మిస్ అయిన జాబితాలో చాహల్ నాలుగోస్థానం పొందగా, వెటరన్ భువనేశ్వర్ కుమార్ తొలి స్థానం దక్కించుకోవడం విశేషం.మ్యాచ్ విషయానికొస్తే చాహల్ దెబ్బకు డుర్హమ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ బెడింగ్హమ్ (81) టాప్ స్కోరర్ కాగా, మయాంక్ అగర్వాల్ (36) పర్వాలేదనిపించాడు. చాహల్ 4 వికెట్లు తీశాడు. అనంతరం ఆటను ప్రారంభించిన నార్తంప్టన్ షైర్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. లూయిస్ మెక్‌మనస్ (18), లూయిస్ కింబర్ (4) క్రీజులో ఉన్నారు. సైఫ్ జయీబ్ (52), జేమ్స్ సేల్స్ (69) అర్థసెంచరీలతో రాణించారు. బెన్ స్టోక్స్ మూడు వికెట్లు పడగొట్టాడు.46.3 | WHAT A BEAUTY 😵💫Yuzi Chahal with an absolute peach to dismiss Ben Stokes 🤯Durham 187/6.Watch live 👉 https://t.co/obDgNotzBX pic.twitter.com/0RKBVz0Gxq— Northamptonshire CCC (@NorthantsCCC) September 3, 2026Read: వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ప్రత్యేక నిఘా! -
వరదలో కొట్టుకుపోయే పరిస్థితి.. దుపట్టాతో రక్షించిన వధువు!
ఓ వైపు భారీ వరద..మరోవైపు అందులో చిక్కుకున్న ఓ బైకర్.. క్షణక్షణానికి పెరుగుతున్న వరద ఉధృతి. ఏ క్షణమైనా కొట్టుకుపోయే పరిస్థితి. అలా ప్రాణభయంతో గజగజలాడుతున్న వ్యక్తిని ఓ నవ వధువు తన దుపట్టానే తాడుగా మార్చి సాయం చేసి అతడి ప్రాణం కాపాడింది.హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లా భటియాత్ ప్రాంతంలోని కకీరా–తునుహట్టి రోడ్డుపై ఒక్కసారిగా వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. ఆ సమయంలో ఓ బైకర్ నీటి ప్రవాహంలో చిక్కుకుని ముందుకు కదల్లేక ఇబ్బంది పడుతున్నాడు. అదే సమయంలో అటుగా కారులో ఓ వెళ్తున్న ఓ కుటుంబం అతడిని గమనించి వెంటనే వాహనాన్ని ఆపింది. కారులోని వ్యక్తి బైకర్ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించినా వరద జోరు వల్ల కుదరలేదు.దీంతో కారులోని నవ వధువు ముందుకొచ్చి తన దుపట్టాని తాడు చేసి బైకర్‌కు ఇచ్చింది. కారులో మరో మహిళ కూడా వీరికి సాయం చేసింది. ఎట్టకేలకు ఆ బైకర్ ప్రాణాలను కాపాడారు. ఈ మొత్తం సంఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బైకర్‌ను కాపాడిన యువతులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇవీ చదవండి: ప్రశ్నిస్తేనే సమాధానం.. లైంగిక ఆరోగ్యంపై యువత మాట్లాడాలి! -
మీడియాతో మాట్లాడుతుండగా ఉద్యమకారుడిపై దాడి
పుణే: పండుగల సమయంలో అధిక శబ్దంతో కూడిన డీజే సిస్టమ్స్, లౌడ్‌స్పీకర్ల వినియోగాన్ని వ్యతిరేకిస్తున్న నగరానికి చెందిన ఉద్యమకారుడు విద్యానంద్ బాపట్‌పై గురువారం ఉదయం ఓ వ్యక్తి దాడి చేశాడు. తిలక్ రోడ్ ప్రాంతంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో బాపట్‌పై దాడి జరిగింది. రోడ్డుపై విలేకరులకు తన అభిప్రాయాన్ని చెబుతున్న సమయంలో ఓ వ్యక్తి బాపట్‌ను చెంపపై కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఘటన అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని బాపట్‌ను పోలీసు వ్యాన్‌లో అక్కడి నుంచి తీసుకెళ్లారు. “దాడి చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. బాపట్ భద్రత దృష్ట్యా ఆయనను వ్యాన్‌లో తీసుకెళ్లాం” అని ఓ పోలీసు అధికారి తెలిపారు. దాడి చేసిన వ్యక్తి గుర్తింపు, దాడికి గల కారణం సహా మరిన్ని వివరాలు తెలియరాలేదు.లౌడ్స్పీకర్లు, అధిక శబ్దంతో కూడిన డీజే వ్యవస్థలలను బాపట్ వ్యతిరేకిస్తుండడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయనకు పెరుగుతున్న ప్రజా మద్దతు ఒక వ్యవస్థీకృత పౌర ఉద్యమంగా రూపుదిద్దుకుంటోంది. పండుగల సమయంలో పెద్ద శబ్దంతో సంగీతం, డీజేలకు వ్యతిరేకంగా బాపట్ ప్రచారం చేస్తున్నారు. అధిక శబ్దం వల్ల స్థానికులకు ఇబ్బందులు కలగడంతో పాటు వారి ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రభావం పడుతుందని ఆయన వాదిస్తున్నారు.రాబోయే గణేశ్ ఉత్సవాల కోసం పుణే మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన ఇటీవల సన్నాహక సమావేశానికి హాజరైన తర్వాత బాపట్ వెలుగులోకి వచ్చారు. ఆ సమావేశంలో యాంప్లిఫైడ్ డీజే సంగీతం, అధిక శబ్దంతో కూడిన స్పీకర్లపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని ఆయన కోరారు. ఆయన డిమాండ్‌పై స్థానికంగా ఉన్న పలు గణేశ్ మండళ్ల ప్రతినిధులతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనలు, నినాదాల మధ్య పోలీసులు చివరకు ఆయనను భవనం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ ఘర్షణకు సంబంధించిన వీడియోలు త్వరలోనే వైరల్ కావడంతో బాపట్ పేరు విస్తృతంగా చర్చలోకి వచ్చింది. -
దేవుడా..నా దొంగతనం సక్సెస్ కావాలి
-
వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు
-
మా వెనుక శేఖర్ మాస్టర్.. సుమలత మాకు అవసరం లేదు, మాకు రఘు మాస్టర్ బెస్ట్
-
డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్
-
‘సీఎం సార్ ప్లీజ్ ఒక్క ఫొటో’.. కేరళలో రొనాల్డో సోదరి
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో భారత పర్యటనకు వచ్చింది. 'CR7' బ్రాండ్ డైరెక్టర్ అయిన ఎల్మా అవీరో కేరళ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ (V.D. Satheesan)తో భేటీ అయ్యారు. కోజికోడ్‌లో బాబీ చెమ్మనూర్ ఇంటర్నేషనల్ జ్యువెల్లర్స్ షోరూమ్ "స్పార్కిల్ డైమండ్ ఫెస్ట్" కార్యక్రమానికి హాజరైన ఆమె, తాను బస చేసిన హోటల్లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఇద్దరు కలిసి ఫొటోలకు ఫోజులివ్వడాన్ని ఎల్మా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. విషయం ఏంటని ఆరా తీస్తే.. కేరళ ముఖ్యమంత్రి సతీషన్ రొనాల్డోకు పెద్ద అభిమాని అని తెలిసింది. వ్యక్తిగత పనిమీద భారత్‌కు వచ్చిన ఎల్మా అవీరో కేరళలో రొనాల్డోను విపరీతంగా అభిమానిస్తారన్న విషయం తెలుసుకున్నారు. కోజికోడ్ ప్రైవేట్ కార్యక్రమం ముగించుకున్న ఆమె కేరళ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరారు. స్వతహాగా రొనాల్డోకు వీరాభిమాని కావడంతో ముఖ్యమంత్రి వీడీ సతీషన్ ఎల్మాకు స్వాగతం పలికారు. రొనాల్డోకు కేరళలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, తాను కూడా రొనాల్డోకు వీరాభిమానినని సతీషన్ వెల్లడించారు. కేరళలో ఫుట్‌బాల్‌కు ఇంత ఆదరణ ఉందన్న విషయం తనకు తెలియదని, తన సోదరుడు రొనాల్డోకు ఫ్యాన్ బేస్ ఉండడం ఆశ్చర్యపరిచిందని, ఈ విషయాన్ని రొనాల్డోతో పంచుకుంటానని ఎల్మా అవేరో చెప్పుకొచ్చింది. అనంతరం సతీషన్‌ను.. ‘సీఎం సార్.. ప్లీజ్ ఒక్క ఫొటో’ అని ఎల్మా అడిగింది. దీనికి అంగీకరించిన కేరళ సీఎం ఆమెతో ఫొటోలకు ఫోజిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియా క్లబ్ అల్ నస్ర్‌కు ఆడుతూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం 978 గోల్స్‌తో ఉన్న రొనాల్డో 1000 గోల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక పోర్చుగల్ తరఫున ఈ ఏడాది ఫిఫా ప్రపంచకప్‌లో ఆడిన రొనాల్డో జట్టును ఫైనల్ చేర్చడంలో విఫలమయ్యాడు. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఫిఫా ప్రపంచకప్ ఆడిన రొనాల్డో ప్రస్తుత వయసు 41 కావడంతో అతడు తన చివరి ఫిఫా ప్రపంచకప్ ఆడేసినట్లే. ఫిఫా ప్రపంచకప్పుల్లో ఇప్పటివరకు 11 గోల్స్ కొట్టిన రొనాల్డో వరుసగా ఆరు ప్రపంచకప్పుల్లో గోల్స్ కొట్టిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు.Had a warm interaction with @Cristiano Ronaldo's sister, Elma Aveiro, during her visit to Keralam. Shared with her the boundless passion and love Malayalis have for football and for Cristiano. She graciously promised to convey the warm wishes and affection of Keralam’s football… pic.twitter.com/h39BOrQKix— V D Satheesan (@vdsatheesan) September 2, 2026 Had a warm interaction with @Cristiano Ronaldo's sister, Elma Aveiro, during her visit to Keralam. Shared with her the boundless passion and love Malayalis have for football and for Cristiano. She graciously promised to convey the warm wishes and affection of Keralam’s football… pic.twitter.com/h39BOrQKix— V D Satheesan (@vdsatheesan) September 2, 2026Read: విరాట్ కోహ్లి రికార్డ్‌ను సమం చేసిన సౌతాఫ్రికా స్టార్ -
35 ఏళ్ల వయసులో ఇరగదీస్తున్నాడు; ట్రోల్ చేసినోళ్లకు హెచ్చరిక
దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో షమీ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో షమీ తీసిన మూడు వికెట్లు తీయగా.. అందులో క్రీజులో పాతుకుపోయిన హర్ష్ దూబేని అద్భుత రీతిలో కాట్ అండ్ బౌల్డ్‌గా పెవిలియన్ చేర్చడం విశేషం. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1లో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్ 46వ ఓవర్ షమీ యార్కర్ బాల్ వేశాడు. హర్ష్ దూబే డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా, బంతి ఎడ్జ్ అయి షమీ వైపు దూసుకొచ్చింది. అప్రమత్తమైన షమీ ఎలాంటి పొరపాటు చేయకుండా ఒంటిచేత్తో క్యాచ్ అందుకోవడంతో హర్ష్ దూబే షాక్ తిన్నాడు. Photo Credit: BCCI Twitterఅప్పటికే హర్ష్ దూబే 51 బంతుల్లో 24 పరుగులతో క్రీజులో నిలదొక్కుకున్నాడు. హర్ష్‌దూబే వెనుదిరిగిన వెంటనే సెంట్రల్ జోన్ ఆలౌటైంది. షమీ 56 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో సెంట్రల్ జోన్ 50.2 ఓవర్లలో 158 పరుగులకు ఇన్నింగ్స్‌ను ముగించింది. 35 ఏళ్ల వయసులోనూ సూపర్ ఫిట్నెస్తో అదరగొడుతున్న షమీని జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో షమీ నుంచి ఇలాంటి ప్రదర్శన రావడం అభినందించాల్సిన విషయం.గతేడాది విజయ్ హజారే ట్రోఫీలోనూ షమీ అంచనాలకు మించి రాణించాడు. ఏడు ఇన్నింగ్స్‌లు కలిపి 15 వికెట్లు పడగొట్టాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 సీజన్లో షమీ బెంగాల్ తరఫున ఏడు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలోనూ షమీ ఏడు మ్యాచ్‌ల్లోనే 37 వికెట్లు పడగొట్టి సెలెక్టర్లకు హెచ్చరికలు పంపాడు.షమీ భారత్ తరఫున చివరిసారి 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటినుంచి షమీ మళ్లీ జాతీయ జట్టుకు ఆడలేదు. 2023లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో షమీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో 24 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇంత మంచి ప్రదర్శన చేసినప్పటికీ, గాయాలు అతడిని తరచూ ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు అదే గాయాల సాకుతో టీమిండియా మేనేజ్మెంట్ షమీని పూర్తిగా పక్కనబెట్టేయడం గమనార్హం.Brilliant reflexes 👌Mohd. Shami pulls off a fantastic one-handed-catch off his own bowling to dismiss Harsh Dubey 🙌#DuleepTrophy | #CZvEZScorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/G7ZYgbpmi7— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026Read: కెప్టెన్‌గా శార్దూల్ ఠాకూర్‌పై వేటు -
నిజంగానే క్యాచ్ అందుకున్నానా?.. షాకైన గ్లెన్ ఫిలిప్స్!
న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతం చేశాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్-2026లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ట్రింబాగో నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ట్రినిడాడ్ వేదికగా టాస్ గెలిచిన ట్రింబాగో నైట్‌రైడర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.షిమ్రన్ హెట్మెయిర్ విధ్వంసకర శతకంవర్షం అంతరాయం కలిగించిన కారణంగా ఈ మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించగా.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అమెజాన్ వారియర్స్ ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనర్లలో గ్లెన్ ఫిలిప్స్ డకౌట్ కాగా.. మాథ్యూ నందు 13 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన షాయీ హోప్ (16) నిరాశపరచగా.. కెప్టెన్ షిమ్రన్ హెట్మెయిర్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు.కేవలం 43 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్సర్లు బాది హెట్మెయిర్ 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో రొమారియో షెఫర్డ్ (7 బంతుల్లో 27 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ట్రింబాగో ఆదిలో కష్టాలు ఎదుర్కొంది. ఓపెనర్లలో కొలిన్ మున్రో 22 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. సునిల్ నరైన్ (1) పూర్తిగా విఫలమయ్యాడు.ఒంటిచేత్తో అద్భుతండ్వేన్ ప్రిటోరియస్ బౌలింగ్‌లో నరైన్ బంతిని గాల్లోకి లేపగా.. డీప్ మిడ్ వికెట్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ అనూహ్య రీతిలో.. రెప్పపాటులో ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. అయితే, తాను నిజంగానే బంతిని అందుకున్నానా? అన్నట్లుగా ఫిలిప్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కాసేపు నిశ్చేష్టుడైపోయాడు.Glenn Phillips! Stop That! 🤯🤯🤯A crazy one-handed catch from Phillips! 🇹🇹 x 🇬🇾#CPL26 #TKRvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport #OmegaXL pic.twitter.com/eFHMjjWf6U— CPL T20 (@CPL) September 1, 2026ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘నిజంగానే నువ్వు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడివి. ఈ విషయాన్ని మరోసారి నిరూపించావు’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పూరన్, హేల్స్ మెరుపులు వృథాఇక మ్యాచ్ విషయానికొస్తే.. ట్రింబాగో కెప్టెన్ నికోలస్ పూరన్ (16 బంతుల్లో 43), అలెక్స్ హేల్స్ (24 బంతుల్లో 55) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. జోషువా డా సిల్వ (5 బంతుల్లో 13 నాటౌట్) వారికి సహకారం అందించాడు.ఈ క్రమంలో నిర్ణీత 16 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి ట్రింబాగో నైట్ రైడర్స్ 172 పరుగులు చేయగలిగింది. కానీ డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఫలితంగా అమెజాన్ వారియర్స్ తొమ్మిది పరుగుల తేడాతో జయభేరి మోగించింది. సెంచరీ వీరుడు షిమ్రన్ హెట్మెయిర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.చదవండి: ‘నువ్వెంత కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’ -
ఇంటర్నెట్ కట్.. పాక్ నుంచి మరో మీమ్ వైరల్
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కాలంలో.. వినూత్న ఆవిష్కరణలు, ప్రయోగాలు నిత్యకృత్యంగా మారాయి. అయితే కొత్తదనం ఎంత ఆసక్తికరంగా ఉన్నా.. భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఊహించని పరిణామాలు తప్పవు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ ఘటన అందుకు ఓ ఉదాహరణ.పాకిస్తాన్లో టెక్నాలజీ ప్రయోగం కాస్తా.. పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టే ఘటనగా మారింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక్కసారిగా తెగిపోవడంతో రిమోట్ కంట్రోల్‌తో నడుస్తున్న ఓ ఆటోమేటిక్ కారు అదుపు తప్పి నేరుగా పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయి నవ్వులు పూయిస్తోంది.ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీని ప్రదర్శిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి జర్నలిస్టు మహ్మద్ ఆలిజా కారులో ముందు సీట్లో కూర్చొని దాని ప్రత్యేకతలను వివరిస్తున్నారు. అబ్బొట్టాబాద్కు చెందిన టెక్నాలజీ ఔత్సాహికుడు ఇహ్సాన్ జాఫర్ రూపొందించిన ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీపై రిపోర్టు చేసేందుకు తాను అక్కడికి వెళ్లినట్లు ఆలిజా వెల్లడించారు.కారు ముందుకు కదులుతుండగా.. ఒక్కసారిగా రిమోట్ ద్వారా నియంత్రించే స్టీరింగ్ స్పందించడం ఆపేసింది. పరిస్థితిని గమనించిన ఆలిజా వెంటనే హ్యాండ్‌బ్రేక్ వేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కారు వేగంగా ముందుకు దూసుకెళ్లి అక్కడే ఉన్న పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది.కనెక్షన్ కట్.. కారు కంట్రోల్ ఔట్!ఈ కారును ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్ల సాయంతో రిమోట్‌గా నియంత్రిస్తున్నట్లు ఆలిజా తెలిపారు. అయితే ప్రయోగం జరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ తెగిపోవడంతో కారు నియంత్రణ కోల్పోయిందని చెప్పారు. అదృష్టవశాత్తూ ఘటన జరిగిన సమయంలో అక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే కారు రద్దీగా ఉండే రోడ్డుపై అదుపు తప్పి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని ఆలిజా పేర్కొన్నారు. అయితే పోలీసులు ఎలా స్పందించారో అనేది మాత్రం ఆయన వివరించలేదు.A Pakistani innovator was demonstrating a driverless car he developed when it lost control and crashed directly into a police vehicle in Islamabad.The car is remotely controlled over the internet through an app or computer.Source: ProPakistani, Khabrain News pic.twitter.com/bUVuesS4cH— Planet Report HQ (@PlanetReportHQ) August 31, 2026ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం వెనుక టెక్నాలజీని రూపొందించిన యువకుడిని విమర్శించడం తన ఉద్దేశం కాదని ఆలిజా స్పష్టం చేశారు. కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, ప్రయోగాలు చేయడం అవసరమేనని.. అయితే వాటిని ప్రజల్లోకి తీసుకురాకముందు పూర్తిస్థాయిలో పరీక్షించి భద్రతను నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకించి ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్లపై ఆధారపడే రిమోట్ డ్రైవింగ్ వ్యవస్థల్లో కనెక్షన్ తెగిపోయినప్పుడు వాహనాన్ని సురక్షితంగా నిలిపే ప్రత్యామ్నాయ వ్యవస్థలు తప్పనిసరిగా ఉండాలని ఈ ఘటన స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు.పాక్ నుంచి మరో మీమ్!ఈ తరహా ఘటనలను నెట్టింట ఎలా ట్రోలింగ్ చేస్తారో తెలియంది కాదు. గతంలో పాక్ నుంచి ఎన్నో ఇలాంటివి మీమ్స్ రూపంలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు పాక్ టెక్నాలజీ నాసిరకంగా ఉంటుందని ఎద్దేవా చేస్తుండగా.. మరికొందరు ఈ ఘటనను సరదాగా తీసుకుని మీమ్స్ చేస్తున్నారు. “పోలీసులను చూడగానే పాకిస్థాన్‌లో ఏఐ కూడా కంగారుపడుతుంది” అంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్య వైరల్‌గా మారింది. మొత్తంగా.. ఇంటర్నెట్ కనెక్షన్ పోవడంతో పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టిన ఈ రిమోట్ కారు వీడియో పాకిస్థాన్‌లో నవ్వులు పూయిస్తోంది.ఇదీ చదవండి: నేపాల్ వరదలకు ఆమె కన్నీరే కారణమా? -
ఏడు రోజుల్లో ఐదు కిలోలు .? నో జిమ్..జస్ట్ ఇలా చేస్తే చాలు..
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవన విధానంలో వ్యాయామలు, స్ట్రిక్ట్ డైట్‌ని అనుసరించడం అతి పెద్ద సవాలు చాలామందికి. పైగా కొన్ని రోజులు చేసి, ఆ తర్వాత స్కిప్ చేసేస్తుంటారు. నిలకడగా చేయాలంటే సమయం ఉండక ఇబ్బంది పడుతుంటారు. అదీగాక ప్రస్తుతం చాలామటుకు ఉద్యోగాలు గంటలు గంటలు పనిచేసే డెస్క్ ఉద్యోగాలే. బాగా తినకపోయినా..లావుగానే ఉండటం, పోనీ వర్కౌట్లు చేద్దామా అంటే సమయం కుదరక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ల కోసం సులభంగా ఎంజాయ్ చేస్తూ చేసే వ్యాయామాలు నెట్టింట ట్రెండ్‌గా మారాయి. వాటిని వర్కౌట్లు అనేకంటే అందమైన డ్యాన్స్ అనొచ్చు. చూడటానికే కాదు, చేయడానికి కూడా చాలా అనువైనవి, సులువైనవి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటా వర్కౌట్లు అంటే..జస్ట్ నాలుగు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో కనిపిస్తున్న వర్కౌట్లు చేస్తే ఒక్క వారంలో ఐదు కిలోలు తగ్గడం ఖాయం అట. ప్రస్తుతం ఈ వ్యాయామాలు జపాన్‌లో బాగా ట్రెండ్‌గా మారింది. డంబెల్క్ కూడ పక్కనే పడేసి ఇవి ప్రయత్నించండి అని పిలుపునిస్తున్నారు. పైగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే శరీరానికి మంచి కదలిక, కొలస్ట్రాల్‌ని కరిగించి ఫిట్‌గా ఉండేందుకు బెస్ట్ వర్కౌట్లు కూడా అని అంటున్నారు. చాలామంది నెటిజన్లు దీన్ని కొట్టిపారేస్తున్నా..జస్ట్ నాలుగు నిమిషాలు ఎంజాయ్‌చేస్తూ వేగంగా చేసేవి ప్రయత్నిస్తే నష్టమేమి ఉండదు కదా అని అడుగుతున్నారు. పైగా ఏ వ్యాయామమైనా..ఆరోగ్యకరమైనదే తప్ప హానికరం అంటూ ఉండదు. పైగా ఇవి కష్టతరమైనవి కాదు ఎవ్వరైనా సులభంగా ఆడుతూ పాడుతూ చేసేవే కదా ట్రై చేస్తే పోలే అని సపోర్టు చేస్తూ మాట్లాడటం విశేషం. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని చూసి..చకచక నాలుగే నాలుగు నిమిషాల్లో చేసి స్లిమ్‌గా మారిపోండి మరి..!.영상은 길이는 고작 4분.일주일동안 매일 루틴으로 하면 -5kg이 빠진다는 일본 다이어트 영상.지금 일본에서 엄청난 유행임.마운자로 집어 던지고 이거하자.부작용 따위 없다. pic.twitter.com/J5ewOHbnui— rrace🇰🇷 (@junssi1982) August 31, 2026 (చదవండి: శ్వాసకోశ ఆరోగ్యం కోసం ఆయుర్వేద ధూమపానం..!) -
ఇక్కడ ఊపిరే ఓ సవాల్.. భారత్‌లో అద్భుత గ్రామం!
ఊపిరి పీల్చుకోవడమే కష్టమైనంత పలుచని గాలి.. అడుగు బయటపెడితే గడ్డకట్టించే చలి.. కళ్లెదుట ఎక్కడ చూసినా మంచుకొండలే.. చెట్లు కనిపించవు.. శీతాకాలంలో దాదాపు ఆరు నెలలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అయినా అక్కడ మనుషులు నివసిస్తున్నారు. ఇళ్లలో సంబరాలు చేసుకుంటున్నారు. పశువులను పెంచుతున్నారు. జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఏ సైన్స్ ఫిక్షన్ కథ కాదు.. హిమాలయాల ఒడిలో సముద్ర మట్టానికి 15,050 అడుగుల ఎత్తులో ఉన్న కొమిక్ గ్రామం కథ!ఆకాశానికి దగ్గరగా కొమిక్..హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితి లోయలో ఉన్న కొమిక్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మానవ నివాస ప్రాంతాల్లో ఒకటి. సముద్ర మట్టానికి సుమారు 4,587 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ చిన్న బౌద్ధ గ్రామంలో దాదాపు 100 మంది నివసిస్తున్నారు. గ్రామ ప్రవేశద్వారం వద్దే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారుబుల్ రోడ్డుతో అనుసంధానమైన గ్రామమని తెలిపే బోర్డు కనిపిస్తుంది. మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాల మధ్య తెల్లని మట్టి, రాతి ఇళ్లు.. నీలాకాశం కింద నిశ్శబ్దంగా కనిపించే ఈ గ్రామం ఫొటోల్లో చూస్తే స్వర్గంలా అనిపిస్తుంది. కానీ అక్కడ నివసించే వారికి మాత్రం ప్రతి రోజు ఓ సవాలే.ఆక్సిజన్ కూడా విలాసమే!సముద్ర మట్టంతో పోలిస్తే కొమిక్లో ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువ. అక్కడికి కొత్తగా వెళ్లే వారికి పలుచని గాలితో శరీరం ఇబ్బంది పడుతుంది. కొందరిలో ఆక్సిజన్ సాచురేషన్ గణనీయంగా పడిపోవచ్చు. అయితే తరతరాలుగా అక్కడే నివసిస్తున్న స్థానికులు ఈ వాతావరణానికి అలవాటు పడిపోయారు. అక్కడి ప్రజల జీవితం ప్రకృతితో నిరంతర పోరాటమే. తీవ్రమైన చలి కారణంగా చెట్లు, చాలా మొక్కలు కూడా పెరగడం కష్టం. నీరు గడ్డకట్టేంత చలి ఉంటుంది. శీతాకాలంలో పరిస్థితులు మరింత దారుణంగా మారతాయి.One of the world's highest village with motorable roads, #Komic is a hidden gem of Himachal Pradesh where simplicity and resilience flourish amidst breathtaking views. #Komic #HimachalPradesh #Spiti @incredibleindia pic.twitter.com/hnUqmpDkq5— Dhanraj Nathwani (@DhanrajNathwani) March 27, 2025ఆరు నెలలు ప్రపంచానికి దూరం!భారీ మంచు కారణంగా స్పితి లోయలోని పర్వత మార్గాలు మూసుకుపోతాయి. ఫలితంగా కొమిక్ సహా ఈ ప్రాంతంలోని గ్రామాలు సంవత్సరంలో దాదాపు ఆరు నెలల పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి దాదాపు పూర్తిగా వేరుపడతాయి. ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు కూడా పరిమితమే. పాఠశాలలు, ఆసుపత్రులు వంటి కీలక సౌకర్యాలు దూరంగా ఉంటాయి. అయినా స్థానికులు తమకు తామే ఏర్పాట్లు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొమిక్ ఇళ్ల నిర్మాణం కూడా అక్కడి వాతావరణానికి తగ్గట్టుగానే ఉంటుంది. మట్టి, రాళ్లతో నిర్మించే ఇళ్ల గోడలు దాదాపు రెండు అడుగుల మందంతో ఉంటాయి. ఇళ్లకు తెల్లని రంగు వేయడం ద్వారా పగటి సూర్యకాంతిని ప్రతిబింబింపజేసి లోపల వెచ్చదనాన్ని కొంతమేర కాపాడుకుంటారు. చుట్టుపక్కల చెట్లు లేకపోవడంతో ఇంధనం కూడా సమస్యే. యాక్‌లు, ఆవులు, గాడిదల ఎండిన పేడను ఇంధనంగా ఉపయోగిస్తారు. రాత్రి వేళ పశువులను కూడా తీవ్ర చలి నుంచి రక్షించేందుకు ఇళ్లలోనే ఉంచుతారు.నీరు గడ్డకట్టినా.. జీవితం ముందుకు!చలికాలంలో నీరు గడ్డకట్టడం సాధారణమే. ఇలాంటి పరిస్థితుల్లో స్థానికులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక పద్ధతులను అవలంబిస్తారు. పాత్రలు కడగడానికి కూడా కట్టెల సాయంతో నీటిని వేడి చేసుకునే ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక్కడి జీవితం మనకు సాధారణంగా అనిపించే ఎన్నో విషయాల విలువను గుర్తుచేస్తుంది. నీరు, వేడి, ఆక్సిజన్.. మనకు సహజంగా లభించే ఇవన్నీ కొమిక్ ప్రజలకు విలువైన వనరులే. కొమిక్ చుట్టుపక్కల ప్రాంతం ప్రకృతి అందాలతోనే కాదు.. కోట్ల సంవత్సరాల చరిత్రతోనూ ఆశ్చర్యపరుస్తుంది. సమీపంలోని లాంగ్జా గ్రామంలో లభించే సముద్ర జీవుల శిలాజాలు.. ఈ ప్రాంతంలో ఒకప్పుడు టెథిస్ సముద్రం ఉండేదని సూచిస్తున్నాయి. అంటే నేడు మంచుకొండలు కనిపిస్తున్న ఈ ప్రాంతం.. కోట్ల సంవత్సరాల క్రితం సముద్రంలో భాగంగా ఉండేదన్నమాట!. ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీసు..కొమిక్కు సమీపంలోని హిక్కిమ్ గ్రామం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీసుల్లో ఒకటికి ప్రసిద్ధి చెందింది. పరిమిత కనెక్టివిటీ ఉన్నప్పటికీ దశాబ్దాలుగా ఈ పోస్టాఫీసు ఈ మారుమూల ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తోంది. కొమిక్లో జనాభా తక్కువ. ఇళ్లు కూడా కొద్దే. కానీ అక్కడి ప్రజల మధ్య బంధం మాత్రం బలంగా ఉంటుంది. గ్రామంలోని ఒక ఇంట్లో వేడుక జరిగితే.. అది ఒక్క కుటుంబానిదిగా ఉండదు. ఊరంతా కలిసి సంబరాల్లో భాగమవుతుంది.ప్రకృతి ఎంత కఠినంగా ఉన్నా.. మనుషుల మధ్య ఆప్యాయత మాత్రం ఆ చలిని జయిస్తుంది. మంచుకొండల మధ్య.. ఆకాశాన్ని తాకే ఎత్తులో.. ఆక్సిజన్ తక్కువగా ఉన్నా ఆశలు మాత్రం ఎక్కువగా ఉన్న గ్రామం కొమిక్. ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ చిన్న గ్రామం.. ప్రకృతి ఎంత కఠినమైనా మనిషి జీవించాలనే పట్టుదల ముందు అది కూడా ఓడిపోతుందని నిరూపిస్తోంది.First snowfall in #Spiti valleyWorld highest moterable #Komic village pic.twitter.com/qVAFIrcgjc— Ajay Banyal (@iAjay_Banyal) October 17, 2021 -
Nepal: ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఖాయం..
-
Viral Video: హైవేపై ‘ఫ్యామిలీ’ భోజనం
జాతీయ రహదారి మధ్యలో కూర్చుని ఒక కుటుంబం భోజనం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియో రహదారి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు, హైవేను పిక్నిక్ స్పాట్‌గా మార్చారంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, ఈ పోస్ట్ చేసిన ఆ కుటుంబ సభ్యులలో ఒకరిని సంప్రదించిన మీడియా.. అసలు నిజాన్ని వెలుగులోకి తెచ్చింది.శివ ప్రకాష్ మాట్లాడుతూ, ఆగస్టు 12న 'హరియావలి అమావాస్య' సందర్భంగా ఈ వీడియో రికార్డ్ అయినట్లు తెలిపారు. తాను తన కుటుంబంతో కలిసి మేనాల్ జలపాతాలకు వెళ్లామని.. చిత్తూరుగఢ్లోని తమ ఇంటికి తిరిగి వస్తుండగా హైవే పక్కన ఉన్న ఒక 'లే-బై' (లే-బై అంటే వాహనాలు ఆపే స్థలం) వద్ద దాదాపు 15 నిమిషాల పాటు ఆగామని చెప్పారు.ఆ రోజు కుండపోత వర్షం కురుస్తోంది. ఆ కుటుంబంలో చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. సమయం సాయంత్రం 4:30 దాటింది, అందరికీ తీవ్రమైన ఆకలి వేసింది. భోజనం చేయడానికి ఏదైనా హోటల్ లేదా సురక్షితమైన ప్రదేశం ఉందా అని స్థానిక గ్రామస్తులను అడగ్గా.. ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే హైవే పక్కనే ఉన్న ఒక 'లే-బై' గురించి వారు చెప్పారు.An Indian family proudly having lunch on a newly inaugurated expressway,as if trespassing onto public infrastructure and turning it into a picnic spot is some achievement. What’s even more disturbing is the sense of pride they seem to take in such blatant disregard for basic… pic.twitter.com/8NQY5WZW0H— Ritik (@ThenNowForeve) August 29, 2026ఆకలితో ఉన్న చిన్న పిల్లలు, వృద్ధుల కోసం గ్రామస్తుల సూచన మేరకు కేవలం 15 నిమిషాలు మాత్రమే అక్కడ ఆగి భోజనం చేశామని, వెంటనే తమ ప్రయాణం కొనసాగించామని శివ తెలిపారు. తాను ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, కొందరు దీనిని వక్రీకరించి హైవే మధ్యలోనే కుటుంబం కూర్చున్నట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వీడియో వైరల్ అయిన తర్వాత నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు. వర్షం కురుస్తున్న సమయంలో పిల్లలు, వృద్ధులతో ప్రయాణిస్తున్నప్పుడు ఆకలి వేయడంతో ఇలా జరిగిందని.. ఎవరి ప్రాణాలకూ ప్రమాదం తలపెట్టాలనే ఉద్దేశం తమకు లేదని శివ స్పష్టం చేశారు. -
Viral Video: వరదల్లో మృత్యువుతో పోరాడుతున్న వ్యక్తికి ఏనుగు అండ
-
విపత్తు మిగిల్చిన విషాదం..! పాపం ఆ పసివాడు..
నేపాల్ జలప్రళయం అంతులేని విషాదాన్ని మిగల్చడమే కాదు ఎందరో చిన్నారులను అభాగ్యులగా మార్చేసింది. ఆ విషాదం గడిచి నాలుగురోజులైన దాని తాలుకు బాధకర దృశ్యాలు ఇంకా వెన్నాడుతూనే ఉండటం బాధకరం. అందుకు సంబంధించిన ఓ హృదయ విదారక వీడియో అందర్నీ కంటతడిపెట్టిస్తోంది. నేపాల్ భారీ వరదల తాలుకా ఓ వీడియో అందరీ హృదయాలను కదిలిస్తోంది. ప్రస్తుతం అక్కడంతా తమ వాళ్ల ఆచూకీ కోసం పడిగాపులు పడుతున్న ఘోషే కనిపిస్తుంది. ఎటు చూసినా శవాల దిబ్బ, బురదతో కలిసి శోక సంద్రాన్ని తలపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు పసివాళ్లు కనిపిస్తున్న తీరు చూస్తే గుండెతరక్కుపోతుంది. వరద ప్రభావిత ప్రాంతాల గుండా ఆ బాలుడు తన చెల్లిని వీపుపై మోస్తూ నీరసంగా నడుస్తూ కనిపిస్తాడు. అతడు ఆమెను ఓదార్చేలా దగ్గరకు పట్టుకున్నట్లుగా ఆ పరిసర ప్రాంతాల్లో కలయతిరగడం చూస్తే..ప్రకృతి విపత్తు మిగిల్చే విషాదం ఇంత భయానకంగా ఉంటుందా అనిపిస్తుంది. ఆ చిన్నారి తన తల్లిదండ్రుల ఆచూకీ కోసం తిరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ అధికారులు వరద బాధితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నేపాల్ వరదలతో అతలాకుతలమైన తరుణంలో బయటకు వచ్చిన ఈ వీడియో ప్రకృతి విపత్తు ఇద్దరు చిన్నారులకు ఎలాంటి కష్టాలను మిగిల్చిందనే దానిపై అందరి దృష్టికి తీసుకొచ్చింది. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్నారి నిజంగానే పేరెంట్స్ ఆచూకీ కోసమే తిరుగుతున్నాడా లేక ఇంకేదైనా కారణమా అన్నది నిర్థారణ కావాల్సి ఉంది. కాగా, నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోని చూసి నెటిజన్లు చిన్నారులు అంత నిస్సహాయంగా తిరుగుతుంటే సాయం చేయడం మానేసి వీడియో తీస్తున్న వ్యక్తి ఎవరు అంటూ తిట్టిపోస్తున్నారు. మరికొందరు..తోబుట్టువుల అనుబంధాన్ని చాటిచెప్పడమే కాదు ఆ చిన్న భుజాలు ఎంత పెద్ద బాధ్యతను మోస్తున్నాయి. వారి కళ్లను చూస్తుంటేనే బాధంతా అర్థమైపోతోంది అంటూ పోస్టులు పెట్టారు. Heartbreaking Visual from Nepal 💔Little boy caring his younger sister 🥹 and finding their parents 😭.Look at the pain and scratches on their faces. 💔💔💔 pic.twitter.com/oREDLzii6g— Jeet (@JeetN25) August 30, 2026(చదవండి: ఆ చీరే మా ప్రాణాలను రక్షించింది..! నేపాల్ జలప్రళయంలో ఓ అద్భుతం..) -
నేపాల్ జలప్రళయంలో అద్భుతం.. చెక్కుచెదరని వండర్ హౌస్..
-
పెను విషాదంలోనూ చెల్లెలి కోసం ఓ అన్న పోరాటం
-
అమెరికాలో పెను విధ్వంసం.. వరదల్లో 20 మంది గల్లంతు!
అమెరికాలోని ప్రసిద్ధ గ్రాండ్ కేనియన్ నేషనల్ పార్క్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. కేవలం అరగంటలో కురిసిన భారీ వర్షంతో ఉప్పొంగిన వరద ప్రవాహానికి భారీ బండరాళ్లు, ఇనుప నిర్మాణాలు, ఇతర శిథిలాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు, ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.శనివారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు బ్రైట్ ఏంజెల్ క్రీక్‌లో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. ఆ నీరు కొలరాడో నదిలోకి దూసుకెళ్లడంతో మార్గంలోని ఫుట్‌బ్రిడ్జ్‌లు ధ్వంసమయ్యాయి. వరద ప్రవాహం కారణంగా అక్కడి భౌగోళిక స్వరూపమే మారిపోయినట్లు అధికారులు తెలిపారు. కొన్ని వీడియోల్లో కొత్తగా నదీ ప్రవాహం ఏర్పడినట్లు కనిపిస్తోంది. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం.. కేవలం 30 నిమిషాల్లో భారీ వర్షపాతం నమోదైంది. గ్రాండ్ కేనియన్ ప్రాంతంలో భూభాగం చాలా నిటారుగా ఉండటంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా ఒక్కసారిగా దిగువకు ప్రవహించింది. దీంతో వరద వేగం అనూహ్యంగా పెరిగింది.62 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపువరదల అనంతరం ఫాంటమ్ రాంచ్ నుంచి ఇప్పటివరకు 62 మందిని హెలికాప్టర్ల ద్వారా తరలించినట్లు నేషనల్ పార్క్ సర్వీస్ వెల్లడించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి మరణాలు లేదా గాయాలు నమోదైనట్లు అధికారులు చెప్పలేదు. అయితే 20 మందికి పైగా వ్యక్తుల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన కొనసాగుతోంది.UGC videos show hikers and campers scrambling for cover as heavy rain and strong winds hit the Phantom Ranch area of #GrandCanyon National Park, with swollen waterways and debris seen floating on the Colorado River. Other footage shows people awaiting rescue and a helicopter… pic.twitter.com/x2lu0ZkFMb— ShanghaiEye🚀official (@ShanghaiEye) August 31, 2026ఒక బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రైట్ ఏంజెల్ క్యాంప్‌గ్రౌండ్‌లో ఉన్న సమయంలో వర్షం ప్రారంభమైంది. సుమారు 50 మంది హైకర్లు క్రీక్‌లో నీటి మట్టం క్రమంగా పెరగడాన్ని చూశారు. అనంతరం భారీ శిథిలాలు, నిర్మాణాలు వరదలో కొట్టుకురావడంతో వారిని హెలికాప్టర్ల ద్వారా అక్కడి నుంచి తరలించారని అన్నారు. మరోవైపు.. బ్రైట్ ఏంజెల్ క్యాంప్‌గ్రౌండ్, ఫాంటమ్ రాంచ్, నార్త్ కైబాబ్ ట్రైల్‌లోని కొన్ని ప్రాంతాలను అధికారులు మూసివేశారు. కొలరాడో నదిపై రాఫ్టింగ్ కార్యకలాపాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక సోమవారం వరకు మరిన్ని ఉరుములు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మరోసారి ఆకస్మిక వరదలు, శిథిలాల ప్రవాహం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.FLOOD DANGER 🚨: Dozens of hikers were evacuated from Grand Canyon National Park after parts of the canyon were hit by devastating flooding. Officials say the flooding caused significant damage throughout parts of the park.#flood #arizona #monsoon #grandcanyon pic.twitter.com/SqA0XWkGrC— FOX Weather (@foxweather) August 30, 2026 -
చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు
-
నవ్వుతో నెట్టింట గెలిచాడు! ఎన్నో మీమ్స్, రీల్స్‌కి కేరాఫ్ అడ్రస్!!
ఆ నవ్వు ప్రపంచాన్నే చుట్టేసింది.. ఎన్నో మీమ్స్, రీల్స్‌కి కేరాఫ్ అడ్రస్ అయింది.. కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది.. కానీ.. ఆ నవ్వు వెనుక ఓ బతుకు పోరాటం ఉంది.. పేదరికం కారణంగా మూడో తరగతితోనే చదువుకు దూరమైన ఓ బాలుడి కథ ఉంది.మొబైల్ లేకున్నా షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ.. ప్రస్తుతం అరుణ్ షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తూ, సినీ పరిశ్రమలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. నటనపై ఆసక్తితో, తన కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం కష్టపడుతున్నాడు. 15 నుంచి 20 నిమిషాల నిడివితో కూడిన 20 షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. సొంత మొబైల్ లేకున్నప్పటికీ ఇతరుల మొబైల్, కెమెరాలు వాడి తన, ఇతరుల చానళ్లలో షార్ట్ ఫిల్మ్స్ పోస్ట్ చేస్తున్నాడు. సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నానని అరుణ్‌కుమార్ ‘సాక్షి’తో తెలిపాడు.అయితే, అదే నవ్వు..అతడి జీవితానికి కొత్త దారిని చూపించింది. లారీ క్లీనర్‌గా చిరుజీవితం గడుపుతున్న బాలుడిని సోషల్ మీడియా స్టార్‌గా చేసింది. మధ్యలో ఆగిపోయిన చదువును మళ్లీ కొనసాగించాలనే అతడి ఆశకు ఊపిరిపోసింది. ఆ నిష్కల్మషమైన నవ్వునే తన కలలకు మెట్లుగా చేసుకుని ముందుకెళ్లేలా చేసింది. అతడే అరుణ్‌కుమార్. రీల్స్ చివర్లో అతడి నవ్వును చూస్తే చాలు.. మనసుకు ఎంతో హాయి అనిపిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మాదారం గ్రామానికి చెందిన బచ్చల లక్ష్మీసమ్మయ్య, రాజేశ్వరిల కుమారుడు అరుణ్‌కుమార్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మూడో తరగతితోనే ఆపేశాడు. చదువుకోవాలనే ఆశ ఉన్నా, కుటుంబ పరిస్థితులు అతన్ని కూలి పనుల వైపు నడిపించాయి. అదే గ్రామానికి చెందిన తన బావ నెహ్రూ లారీపై క్లీనర్‌గా పని చేశాడు. ఆ సమయంలో భూపాలపల్లిలో లారీలో నుంచి బొగ్గు అన్లోడ్ చేసే క్రమంలో టీ తాగుతుండగా నెహ్రూ వేసిన ఓ జోక్‌కు అరుణ్‌కుమార్ తనివితీరా నవ్వాడు. ఆ నిష్కల్మషమైన, గుండెల్లోంచి వచ్చిన నవ్వు నెటిజన్లను ఎంతగా ఆకట్టుకుందంటే, ఆ వీడియో కొద్ది కాలంలోనే వైరల్ అయిపోయింది. మీమ్స్, రీల్స్‌లో ఎక్కడ చూసినా అరుణ్ నవ్వే దర్శనమివ్వడం మొదలైంది. తన నవ్వు తెచ్చిన గుర్తింపు అరుణ్ జీవితానికి కొత్త దిశను చూపించింది. బావ నెహ్రూ ప్రోత్సాహంతో చదువుకోవాలనే తన పాత కలని గుర్తుచేసుకున్నాడు. ఓపెన్ స్కూలింగ్ ద్వారా పరీక్షలు రాసి, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాడు. - భూపాలపల్లి -
నేపాల్ అంతటా హృదయవిదారక దృశ్యాలే!
నేపాల్‌ను భీకర వరద కుదిపేసిన నాలుగు రోజుల తర్వాత కూడా అక్కడి పరిస్థితి హృదయవిదారకంగానే ఉంది. ఇంకా రెండు వేల మందికి పైగా ఆచూకీ తెలియరావాల్సి ఉండగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నదులు, బురద, శిథిలాల నుంచి వరుసగా మృతదేహాలు బయటపడుతుండటంతో ఆస్పత్రులు, మార్చురీలు నిండిపోయాయి. నేపాల్ ఆకస్మిక వరదలు మహా విషాదాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది. బోటె కోషి వరదల ఉధృతికి కొట్టుకుపోయిన మృతదేహాలు త్రిశూలి, నారాయణి నదుల వెంట దిగువ ప్రాంతాలకు చేరుతున్నాయి. ఒక్క చిత్వన్లోనే శనివారం ఉదయానికి 233 మృతదేహాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. నౌవల్పరాసి తూర్పులో మరో 158, గోర్ఖాలో 48, నౌవల్పరాసి పశ్చిమలో 47 మృతదేహాలు వెలుగుచూశాయి. వందలాది మంది జాడ తెలియరాకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆస్పత్రుల్లో స్థలం లేక.. నేపాల్-టిబెట్ పరిసరాల్లోని ఆస్పత్రుల్లో మార్చురీల సామర్థ్యం 350 మృతదేహాలుగా తెలుస్తోంది. ఈ తరుణంలో సామర్థ్యం మించిపోవడంతో మృతదేహాలను ఇతర భవనాలకు తరలిస్తున్నారు. మృతదేహాలను భద్రపరిచేందుకు భారత్పూర్ సహా పలు ప్రాంతాల్లో తాత్కాలిక కేంద్రాలను(బాడీ మేనేజ్మెంట్ సెంటర్లు) ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల టెంట్ల కింద కూడా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమ్యూనిటీ హాళ్లు, పోలీస్ ప్రాంగణాలు, ఇతర భవనాలను తాత్కాలిక మార్చురీలుగా మార్చేసినట్లు అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే కోల్డ్ స్టోరేజీ కొరత, హఠాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలు మృతదేహాలను భద్రపరచడం అధికారులకు మరో పెద్ద సవాలుగా మారాయి. ఎవరో గుర్తించడమే కష్టం..చాలా మృతదేహాలు బురద, శిథిలాల్లో తీవ్రంగా దెబ్బతినడంతో ముఖాలను చూసి గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో అధికారులు మృతదేహాల ఫొటోలు తీస్తూ, శరీరంపై ఉన్న గుర్తులు, దుస్తులు, టాటూలు, ఆభరణాలు, వేలిముద్రలు నమోదు చేస్తున్నారు. అవసరమైన చోట డీఎన్ఏ నమూనాలను కూడా సేకరించి కుటుంబ సభ్యులతో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు.బంధువుల కోసం ఆర్తనాదాలు..కళ్లెదుటే అయినవాళ్లు కొట్టుకుపోతుంటే.. నిస్సహాయంగా చూస్తున్న ఉండిపోయిన వాళ్లు అధికారులను బతిమాలుకుంటున్నారు. వాళ్ల ఆచూకీ చెప్పాలంటూ కన్నీళ్లతో వేడుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం నేపాల్‌లో వందలాది మంది ఇంకా గల్లంతై ఉండగా, మొత్తం విపత్తులో 2,000కుపైగా మంది ఆచూకీ తెలియడం లేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. తాత్కాలిక బాడీ-మేనేజ్మెంట్ సెంటర్ల వద్ద తమ వారి కోసం కుటుంబ సభ్యులు ఫొటోలు, మొబైల్ చిత్రాలు పట్టుకుని తిరుగుతున్నారు. మృతదేహాలపైనా దోపిడీ..ఈ విపత్తు వేళ కొందరి అమానవీయ ప్రవర్తన కూడా వెలుగులోకి వచ్చింది. వరదలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం నుంచి చెవిపోగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటన నేపాల్‌లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అయినా ఆ తతంగం ఆగడం లేదని తెలుస్తోంది. మరోవైపు నదుల్లో కొట్టుకొస్తున్న మృతదేహాలతో పాటు వస్తువులు, బ్యాగులు కూడా కనిపిస్తున్నాయి. వాటి నుంచి నగదు, నగల కోసం కొందరు పడవల్లో పరుగులు తీస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎటు చూసినా విషాదం, ఆర్తనాదాలు, మృతదేహాలే కనిపిస్తున్న దారుణ పరిస్థితి నెలకొంది.ఇదీ చదవండి: ఆ సరస్సు నీటి రంగు మారింది.. చైనా వార్నింగ్ -
లంచగొండి ఆఫీసర్‌కు చుక్కలు చూపించిన జనం!
దేశవ్యాప్తంగా ఆహార భద్రత తనిఖీలు ముమ్మరంగా సాగుతున్న వేళ.. ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైడ్‌కు వెళ్లిన అధికారి లంచం తీసుకున్నాడని ఆరోపిస్తూ జనం భలే శిక్ష విధించారు. అక్కడ తప్పు జరగలేదని ఆ అధికారి బుకాయించే యత్నం చేయగా.. అది కరెక్ట్ అయితే నిరూపించమంటూ ఒత్తిడి చేశారు. దీంతో ఆ అధికారి నీళ్లు మింగాల్సి వచ్చింది. తుకారాం ముండే ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలో ఫుడ్ సేఫ్టీ విషయంలో ఆయన నేతృత్వంలో జరుగుతున్న సోదాలు.. తీసుకుంటున్న చర్యలు.. కంట్రోల్లో ఉండాలంటూ కోర్టులు ఆదేశిస్తూ ఆయన వ్యవహరిస్తున్న తీరూ.. ఇవన్నీ నిత్యం వార్తల్లో నిలుస్తున్నవే. అలాంటి రాష్ట్రంలోనే తాజాగా జరిగిన ఓ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఛత్రపతి సంభాజీనగర్‌లో వైజాపూర్ ఏరియాలో ఓ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారికి చేదు అనుభవం ఎదురైంది. తనిఖీల్లో పట్టుబడిన ఎక్స్పైరీ(కాలం చెల్లినవి) బిస్కెట్లను అధికారితోనే తినిపించేందుకు స్థానికులు ప్రయత్నించడం నెట్టింట వైరల్ అయ్యింది. ఓ దుకాణదారుడిని కాపాడే క్రమంలో ఆయన లంచం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జనం ఈ పని చేయబోయారు. స్థానికంగా ఓ దుకాణంలో తినుబండారాలు తిన్న రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురైంది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌డీఏ అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు నేపథ్యంలో ఓ అధికారి దుకాణాన్ని తనిఖీ చేయడానికి వెళ్లగా.. అప్పటికే చిన్నారి తిన్నట్లు చెబుతున్న స్నాక్ మిక్స్‌ను దుకాణం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.CHHATRAPATI SAMBHAJINAGAR — An FDA officer was cornered and forcibly fed expired biscuits by an angry crowd in the Vaijapur area of Maharashtra. pic.twitter.com/Pq5rUfBenO— Truth India Live (@Truthindialive) August 29, 2026అయితే తనిఖీల్లో కొన్ని ఎక్స్పైరీ బిస్కెట్ ప్యాకెట్లు బయటపడ్డాయట. వాటిని తమ వాహనంలో పెట్టిన అధికారులు.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన జనం.. ఆ అధికారి చుట్టూ చేరారు. దుకాణానికి సీజ్ వేయకుండా ఎందుకు వెళ్లిపోతున్నారంటూ నిలదీశారు. దానికి ఆ అధికారి తనిఖీల్లో ‘అంతా సవ్యం’గానే ఉందని చెప్పాడు. దీంతో వాహనం నుంచి ఆ బిస్కెట్లను తీసుకున్న స్థానికులు ‘బిస్కెట్లు సురక్షితమే అయితే మీరే తినండి’ అంటూ నోట్లో కుక్కేందుకు ప్రయత్నించారు. దాంతో నమల్లేక.. మింగలేక.. కక్కలేక ఆ అధికారి పడ్డ అవస్థలు పడ్డ వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ప్రస్తుతం FDA కమిషనర్ తుకారాం ముండే నేతృత్వంలో ఆహార భద్రతపై భారీ స్థాయిలో తనిఖీలు, దాడులు జరుగుతున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లు, డెయిరీలు, క్యాంటీన్లు, ఫుడ్ డెలివరీ సంస్థలు సహా వివిధ ఆహార వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలు గుర్తిస్తే లైసెన్సులు సస్పెండ్ చేయడం, నోటీసులు ఇవ్వడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ తరుణంలో ఆహార భద్రతను కాపాడాల్సిన అధికారులపై ఇలాంటి ఆరోపణలు రావడం, అదే సమయంలో ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికారిని అవమానించే స్థాయికి వెళ్లడం కలకలం రేపింది.ఇదీ చదవండి: ఆ పుస్తకం చదవాల్సిన అవసరం ఏమొచ్చింది? -
Video: భయానక దృశ్యం.. క్షణాల్లో కొట్టుకుపోయిన గ్రామం
నేపాల్‌ను వరదలు వణికిస్తున్నాయి.. వరద బీభత్సానికి సంబంధించిన భయానక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో విరుచుకుపడిన వరద.. ఓ నదీ తీర గ్రామాన్ని క్షణాల్లో ముంచెత్తింది. భారీగా వచ్చిన బురదతో కూడిన వరదనీళ్ల ధాటికి ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి.భోటేకోశి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా ఉధృతమైంది. నదులు పొంగిపొర్లడంతో నీరు, బురద జనావాసాల్లోకి దూసుకెళ్లాయి. చూస్తుండగానే ఓ నదీ తీర ప్రాంతం మొత్తం బురదగా మారిపోయింది. ఆ తర్వాత వరద ప్రవాహం దిగువ ప్రాంతాల వైపు కొనసాగింది. ఈ భారీ విపత్తులో 1,400 మందికి పైగా ఆచూకీ గల్లంతవ్వగా.. 392 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.ఈ వరదల తాకిడికి వందల సంఖ్యలో వంతెనలు ధ్వంసమయ్యాయి. దాదాపు 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో సహాయక, గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. హిమానీనదం నుంచి మంచు విరిగిపడటం వల్లే ఈ ఆకస్మిక వరద సంభవించి ఉండొచ్చని అంచనా. ఒక దశలో త్రిశూలి నదిలో నీటి మట్టం కేవలం అరగంటలోనే 9 మీటర్ల వరకు పెరిగినట్లు ఖాట్మండులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్ నిపుణులు తెలిపారు.Bright daylight, clear skies, and then suddenly a tsunami like wave crashes into a village. These scenes from Nepal today are beyond horrific. Everything feels like a doomsday scene.95+ people reported killed and 500+ still missing. Prayers for everyone #Nepal 🙏 https://t.co/0aIccVPsd8 pic.twitter.com/zSOXpiA0nK— Nikhil saini (@iNikhilsaini) August 26, 2026రాసువా జిల్లాలో సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేపాల్‌లో 290 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది. ఇప్పటివరకు 84 మంది భారతీయులను రక్షించినట్లు తెలిపింది. ఆచూకీ తెలియని వారిలో కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన పలువురు, త్రిశూలి-1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు.ఇదీ చదవండి: యుగాంతం రేంజ్లో ముప్పు?.. నేపాల్‌కు చైనా మరో డెడ్లీ వార్నింగ్! -
నదిలో కొట్టుకుపోతున్న మృతదేహాన్ని లాగి.. చెవిదుద్దులు చోరీ
కాఠ్మాండు: చైనా, నేపాల్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ ఆకస్మిక వరదల వేళ బాధితులకు సాయం చేయాల్సిందిపోయి చోరీలకు పాల్పడ్డారు ఇద్దరు యువకులు. నారాయణి నదిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారు చెవిదుద్దులు చోరీ చేశారు. వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.వరదలో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహాన్ని జుట్టు పట్టుకునిలాగిన ఇద్దరు వ్యక్తులు బంగారు చెవిదుద్దులను తీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ అరెస్టులు జరిగాయి. నేపాల్ పోలీసులు ఆ 41 సెకన్ల వీడియోను తమ ఖాతాలోనూ పోస్ట్ చేశారు.వీడియోలో ఆ ఇద్దరు వ్యక్తులు చెక్క పలకలు, మహిళ జుట్టు ఉపయోగించి నీటిలో నుంచి ఆమె మృతదేహాన్ని బయటకు లాగడం కనిపించింది. తర్వాత ఆమె రెండు చెవుల నుంచి చెవిదుద్దులను తీసి పక్కన పెట్టారు. ఈ ఘటన జరుగుతుండగా పలువురు చుట్టూ నిలబడి వీడియోలు చిత్రీకరించారు.తర్వాత చిత్వన్ పోలీసులు దర్యాప్తులో ఈ ఘటనకు సంబంధించిన మృతదేహం భారీ వరద కారణంగా నారాయణి నదిలోకి కొట్టుకుపోయినట్లు గుర్తించారు. వీడియో ఆధారంగా పోలీసులు 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేశ్ చౌదరీని గుర్తించారు. నేపాల్ మీడియా సంస్థ ఖబర్‌హబ్ పోలీసులను ఉటంకిస్తూ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం భరత్పూర్ మహానగరపాలక సంస్థ-1లోని పోఖరా బస్ పార్క్ సమీపంలో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడటం లేదా ఎలాంటి అమానవీయ చర్యలకు పాల్పడటాన్ని సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: నార్వే రాజు హరాల్డ్-5 ఇకలేరుకాగా, నేపాల్‌లో గత కొన్నేళ్లలో సంభవించిన అత్యంత ప్రాణాంతక వరద విపత్తుల్లో ఈ ఘటన ఒకటి. నేపాల్-టిబెట్ సరిహద్దును ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కొన్ని వందల మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. వారి కోసం సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. సరిహద్దు మార్గానికి వెళ్లే రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ప్రాంతంలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి భూకంపనలు లేదా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండవచ్చని కూడా అది తెలిపింది.मृतकको कानको मुन्द्रा चोरी गर्ने व्यक्तिहरु नियन्त्रणमा लिएको सम्बन्धमा । pic.twitter.com/pnPlnQPn9j— Nepal Police (@NepalPoliceHQ) August 27, 2026 -
Viral : వరద నీటిలో సైతం దూసుకెళ్లిన వందే భారత్ ఎక్సప్రెస్
-
భారత వంటకాల రుచి దెబ్బకు..మరో రెసిపీని ట్రై చేసే ఛాన్సే లేదు!
భాతీయ వంటకాల రుచి పడిపోవని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఆహా ఇదేమి రుచి తినరా మైమరచి..అంటూ లొట్టలేసుకుంటూ విదేశీయులు సైతం ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా మన వంటకాల కోసం మన భారత్‌లో పర్యటించేవాళ్లు కూడా ఉన్నారు. ఇదెంతా ఎందుకంటే మన వంటకాల టేస్ట్‌కి ఫిదా అవ్వుతూ ఓ అమెరికన్ వ్యక్తి తన ఆవేదనంత గక్కేశాడు. స్వతహాగా మాంసహార ప్రియుడినైనా తాను భారతీయ వంటకాల దెబ్బకు..మరో రుచి చూడలేకపోతున్నానంటూ బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఇదేంటి మన వంటకాల టేస్ట్ నచ్చలేదా? అని తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఈ అమెరికన్ వ్యక్తి మన వంటకాల తోపాటు మన వెటకారం కూడా వంటబట్టించుకుని మరి ఇలా వ్యగ్యంగా చెబుతున్నాడు. ఇంతకీ ఏంటంటే అసలు కథ..!.స్నాక్ మాస్టర్ జనరల్‌గా అభివర్ణించే స్నాక్ డిటెక్టివ్ ఎడ్ నాథన్సన్ అనే అమెరికన్ వ్యక్తి భారతీయ వంటకాలు గురించి సోషల్‌మీడియా వేదికగా ఇలా చెప్పుకొచ్చాడు. ఆ వంటకాలు తన రుచి మొగ్గలను పాడు చేశాయట. భారతీయ వంటకాల్లోని అద్భుత రుచి, విభిన్నమైన రెసిపీల మాధుర్యానికి మరో వంటకం టేస్ట్ నాథన్సన్కి తెలియడం లేదట. మన వంటకాల రుచి ఆ రేంజ్లో ఉందని, అందులో ఉపయోగించే 47 మసాలాలే ఇందుకు కారణం అని అంటున్నాడు. ఆ కారణంగానే అతడి నాలుకు మరో టేస్ట్‌ని క్యాచ్ చేయలేక వాటి జోలికే పోవడం లేదంటూ చమత్కరిస్తున్నాడు. భారత వంటకాల రుచితో తనకు గొప్ప చిక్కొచ్చి పడిందంటూ వ్యగ్యంగా పొగడ్తల జల్లు కురిపిస్తున్నాడు. ఇది అక్షరాల మిగతా వంటకాల రుచి పాడుచేస్తోందని ఆరోపణలు చేస్తున్నాడు. తాను సుమారు నాలుగైదు ఏళ్ల నుంచి భారతీయ ఆహారం ఆస్వాదిస్తున్నట్లు వెల్లడించారు. ఒకరోజు స్వర్గంలోంచి దేవుడే తనను ఆహ్వానిస్తూ..ఈ భారతీయ వంటకాల రుచి చూడమన్నాడని ఆసువుగా కథ కూడా చెప్పేస్తున్నాడు. అంతేగాదు అస్సలు ఈ వంటకాలు టేస్ట్ చూడాలని దిగారో..మళ్లీ వెనక్కి వెళ్ల మరో వంటకం వైపుకి చూడను కూడా చూడరని శపథం చేసి మరి చెబుతున్నాడు. ఇంకా.. మన రెసిపీ పేర్లు ప్రస్తావిస్తూ ఇలా చెప్పాడు. పారీ పూరీ తిన్నారో..మళ్లీ మళ్లీ తినాలనే కోరిక చావను కూడా చావదు, ఆ చికెన్ కర్రీ టేస్ట్ చేశారో..మదిలో గుర్తుకొచ్చినప్పుడల్లా నోటిలో నీళ్లూరిపోతుంటాయని, ఇక ఆ కాలీఫ్లవర్ చూస్తే..భారతీయ వంటకం గోబీ మంచూరియన్ మనసుని తాకుతుందని..అందువల్ల నాలుకని కట్టడి చేయడం అసాధ్యం అంటూ ఇండియన్ వంటకాలపై ప్రేమనంత ఒలకపోశాడు నాథన్సన్. అంతేగాదు తాను స్వతహాగా మాంసాహార ప్రియుడినైనా తనని శాకాహార వంటకాల వైపుకి మళ్లేలా చేసిందని అంటున్నాడు. అంతేగాదు తొలిసారిగా భారతీయ వంటకాలను ట్రై చేసే ముందు ఓసారి ఆలోచించుకోండి. లేదంటే దాని రుచికి బానిసైపోతారు, మళ్లీ దాన్నుంచి బయటపడటం అంత ఈజీ కాదు సుమీ అని హాస్యంగా హెచ్చరిస్తున్నాడు నాథన్సన్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Ed Nathanson (@ed_nathanson) (చదవండి: మేఘాలయ ‘అహింసా పట్టు’ చీరలో కంగనా రనౌత్..! ప్రత్యేకత ఇదే) -
నేపాల్‌లో భారీ వరద బీభత్సం.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు!
-
"కొడుకా ఎక్కడున్నావురా నాన్నా”.. తండ్రి ఆరాటం కంటతడి పెట్టిస్తోంది!
-
కరెంట్ పోల్ ఎక్కిన తాగుబోతు.. గంటపాటు టెన్షన్
-
బ్యాంక్ అకౌంట్లో పొరపాటున రూ.68 కోట్లు జమ.. ఖాతాదారునికి షాకిచ్చిన బ్యాంక్
-
చావు తప్పి కన్ను లొట్టపోవడమంటే ఇదే.. మహిళకు వింత అనుభవం
ముంబైలో ఓ యువతి పదో అంతస్తు నుంచి దూకిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ‘చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు’ అన్న చందంగా.. నేలను తాకాల్సిన ఆమె భవనం పక్కనే ఉన్న చెట్టుపై పడటంతో ప్రాణాలతో బయటపడింది. ‘బతికితే బలుసాకు తినవచ్చు’ అన్న సామెతను గుర్తు చేసేలా.. మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఆమెకు ఆ చెట్టే ప్రాణరక్షకంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. మహారాష్ట్ర ముంబైలోని భాండూప్ వెస్ట్ తుల్షెట్పాడ ప్రాంతంలోని సన్‌షైన్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రతీక్ష హివ్రాలే(26) సన్‌షైన్ బిల్డింగ్‌లోని పదో అంతస్తు ఫ్లాట్ కిటికీ నుంచి దూకినట్లు పోలీసులు తెలిపారు. పదో అంతస్తు నుంచి కిందకు దూకిన ఆమె నేరుగా నేలను తాకకుండా.. భవనం పక్కనే ఉన్న చెట్టుపై పడింది. దీంతో చెట్టుపై సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయి వేలాడుతూ కనిపించింది. ఆమె పరిస్థితిని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.A woman fell from the 10th floor of a residential building at #Bhandup , #Mumbai, but was miraculously saved as she stuck to a tree. Later on, the fire brigade rescued her safely and had her admitted to a hospital. pic.twitter.com/WdhAiGj80o— Hiren Antani (@HirenAntani) August 26, 2026సమాచారం అందిన వెంటనే ఉదయం 9.32 గంటలకు ముంబై ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుక్ ల్యాడర్ సహాయంతో చెట్టు వద్దకు చేరుకున్న సిబ్బంది.. ఎంతో జాగ్రత్తగా ప్రతీక్షను కిందకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను ప్రైవేట్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆమె ఎడమ కాలికి గాయం అయినట్లు తేలింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం సియాన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.చదవండి: నేపాల్‌కు అత్యవసర సాయం పంపిన భారత్పోలీసుల వివరాల ప్రకారం ప్రతీక్షకు నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే ఆమె పదో అంతస్తు నుంచి ఎందుకు దూకింది? అసలు ఏం జరిగింది? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా ప్రస్తుతం పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయలేకపోయారు. వైద్యుల నుంచి మెడికల్ ఎండార్స్మెంట్ తీసుకున్నారు. ఆమె కోలుకుని స్పృహలోకి వచ్చిన తర్వాత వాంగ్మూలం నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
కంగనా-కృతి వార్‌లోకి కేంద్ర మంత్రి.. ఏం చెప్పారంటే?
నటి కృతి సనన్ నటించిన నగల యాడ్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఈ యాడ్‌ను బీజేపీ ఎంపీ.. నటి కంగనా రనౌత్ విమర్శించడం, నటి కృతి సనన్ విమర్శలకు ఘాటు సమాధానం ఇవ్వడం, ఆ వెంటనే రాహుల్ గాంధీ కృతికి మద్దతు ప్రకటించడం, రాహుల్‌ను టార్గెట్ చేస్తూ కంగనా సెటైర్లు ఇలా రాజకీయ వివాదం నడిచింది. దీంతో సదరు జ్యువెలరీ బ్రాండ్ ఆ యాడ్నే తొలగించి.. క్షమాపణలు చెప్పింది. అయితే తాజాగా ఈ వివాదంపై.. కంగనా తీరుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. యాడ్‌లో రాఖీ కట్టే సమయంలో కృతి సనన్ ధరించిన దుస్తులపై కంగనా రనౌత్ విమర్శలు చేశారు. సంప్రదాయ పండుగకు సంబంధించిన ప్రకటనల్లో ఇలాంటి దుస్తుల వినియోగంపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు కంగనా వ్యాఖ్యలను సమర్థించగా.. మరికొందరు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలను విమర్శించారు. అయితే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై కీలక వ్యాఖ్యలు చేస్తూ.. ఒకరికి తమ అభిప్రాయం చెప్పే హక్కు ఉన్నట్లే, ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకించే హక్కు కూడా ఇతరులకు ఉంటుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.ఓ న్యూస్‌చానెల్ పాడ్‌కాస్ట్‌లో ఈ వివాదంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును ప్రశ్నించగా.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఒక వైపుకే పరిమితం చేయలేమని అన్నారు. ‘‘మీకు నచ్చిన విధంగా మాట్లాడే స్వేచ్ఛ ఉంటే.. ఆ వ్యాఖ్యలతో విభేదించే లేదా వాటిని వ్యతిరేకించే హక్కు ఇతరులకు ఎందుకు ఉండకూడదు?’’ అని రిజిజు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు స్థానం ఉంటుందని.. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు ప్రశ్నించడం కూడా అదే స్వేచ్ఛలో భాగమని పేర్కొన్నారు.ఆంక్షలు విధించలేను, కానీ..బీజేపీ ఎంపీగా ఉన్న కంగనా రనౌత్ చేసే వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఆమెకు సభా నిబంధనలు, విధానాలపై సూచనలు చేయగలనని రిజిజు తెలిపారు. అయితే పార్లమెంట్ వెలుపల వ్యక్తిగత అభిప్రాయాల విషయంలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదని చెప్పడం తన పరిధిలో లేదని స్పష్టం చేశారు.‘గట్టర్ జనరేషన్’ వ్యాఖ్యలపైనా స్పందనఇటీవల జెన్ జీ నిరసనల సమయంలో కంగనా చేసిన ‘గట్టర్ జనరేషన్’ వ్యాఖ్యలపైనా రిజిజు స్పందించారు. ఆమె మొత్తం యువతను ఉద్దేశించి అలా మాట్లాడలేదని.. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన దివంగత తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొందరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారని వివరించారు. ప్రధానిని లేదా ఆయన కుటుంబ సభ్యులను అవమానించే భాషను తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. అయితే ప్రభుత్వాన్ని విమర్శించడం, రాజకీయంగా వ్యతిరేకించడం ప్రజాస్వామ్యంలో భాగమని అన్నారు.అబ్బాయిలు, అమ్మాయిలకు ఒకే ప్రమాణంవిమర్శలు, అభిప్రాయాల విషయంలో యువతీ యువకులకు వేర్వేరు ప్రమాణాలు ఉండకూడదని రిజిజు పేర్కొన్నారు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందేనని అన్నారు. మనుస్మృతిపై జరుగుతున్న చర్చపైనా రిజిజు స్పందించారు. ఓ మత గ్రంథంలోని కొన్ని అంశాలను వ్యతిరేకించినంత మాత్రాన ఎవరినీ మత వ్యతిరేకిగా పరిగణించకూడదన్నారు. భారతదేశం మనుస్మృతి ఆధారంగా కాకుండా రాజ్యాంగం ప్రకారం నడుస్తోందని స్పష్టం చేశారు. ప్రజలకు ఒక నమ్మకాన్ని సమర్థించే హక్కు ఉన్నట్లే.. దానిని ప్రశ్నించే హక్కు కూడా ఉందన్నారు.“ఎవరైనా ఒక విషయాన్ని నమ్మవచ్చు.. మరొకరు దానిని వ్యతిరేకించవచ్చు. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి” అని రిజిజు పేర్కొన్నారు. అయితే దేశ సమగ్రతకు భంగం కలిగించేలా, హింసను ప్రోత్సహించేలా చేసే వ్యాఖ్యలకు మాత్రం చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.స్విమ్మింగ్ మీమ్స్‌పై రియాక్షన్అరుణాచల్ ప్రదేశ్‌లో తాజాగా ఓ నదిలో కిరెన్ రిజిజు ఈత కొట్టారు.అయితే ఆ వీడియోపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. రాహుల్ గాంధీలా చేయాలని చూసి బోల్తా పడ్డారంటూ కొందరు కామెంట్లు చేశారు. ఈ ట్రోలింగ్‌పై పాడ్‌కాస్ట్‌లో కిరెన్రిజిజు స్పందించారు. అరుణాచల్‌లో నదుల్లో ఈత కొట్టడం.. స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టినట్లు కాదని, ట్రోల్ చేసేవాళ్లుక అది అర్థం కాదని అన్నారాయన. తాను అక్కడి బిడ్డనని, అక్కడి నేలా నీరు తనకు అలవాటేనని చెప్పారు. పార్లమెంట్ మళ్లీ కొలువుదీరుతుందా?పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇంకా అధికారికంగా ముగియలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అవసరమైతే ఇదే సెషన్లో మరోసారి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. పార్లమెంట్‌ను ఎప్పుడు సమావేశపరచాలన్నది ప్రభుత్వ నిర్ణయమని.. రాష్ట్రపతికి ప్రభుత్వం సిఫార్సు చేస్తే సభను తిరిగి పిలవొచ్చని చెప్పారు. అయితే ప్రత్యేక సమావేశం ఉంటుందా అన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ‘‘నా వ్యాఖ్యలను రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు’’ అంటూ రిజిజు చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులపై(డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులు) ప్రభుత్వం మరోసారి ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.అరుణాచల్ చిన్నారికి రిజిజు భరోసా‘మమ్మల్ని చైనీస్ అని పిలవొద్దు.. మేము భారతీయులం’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన అరుణాచల్‌ప్రదేశ్ చిన్నారి టింకిల్‌తో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వీడియో కాల్లో మాట్లాడారు. ‘‘ఇప్పుడు మొత్తం భారత్ నిన్ను ప్రేమిస్తోంది’’ అంటూ చిన్నారిని రిజిజు అభినందించారు. ఆమె తల్లిదండ్రుల గురించి అడిగి.. ధైర్యంగా మాట్లాడినందుకు ప్రశంసించారు. ఇటానగర్‌కు చెందిన టింకిల్.. తనను చైనీస్ అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చేసిన వీడియో వైరల్ అయింది. ఈశాన్య ప్రాంత ప్రజలను రూపం ఆధారంగా వేరే దేశస్థులుగా భావించే ధోరణిపై మరోసారి చర్చ మొదలైంది. రిజిజు కూడా ఈశాన్య ప్రజలు భారతదేశంలో అంతర్భాగమని, వారి గుర్తింపును గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పినట్లుగా ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదీ చదవండి: మేకెదాటు వివాదంలో కొత్త ట్విస్ట్.. సాలిడ్ వార్నింగ్ -
దుమ్మెత్తిపోసుకున్న జడ్డూ, సిరాజ్.. ఏం జరిగిదంటే?
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రసకందాయంలో పడింది. ఆటకు మరో రోజు మిగిలి ఉన్న సమయంలో టీమిండియా మరో విజయం దిశగా అడుగులు వేస్తోంది. నాలుగో రోజు ఆటలో లంచ్ విరామం తర్వాత రెండో సెషన్లో జడేజా, సిరాజ్‌ల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. లంక రెండో ఇన్నింగ్స్ 31వ ఓవర్లో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. జడేజా బౌలింగ్‌లో పసిందు సూరియబండార డీప్ ఫార్వర్డ్ దిశగా స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. బంతి బౌండరీకి వెళ్లనప్పటికీ, అక్కడే ఉన్న సిరాజ్ వెనక్కి పరిగెత్తి క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతడికి చాలా దూరంలో పడింది. క్యాచ్ పట్టడం కష్టమని తెలిసినా కూడా జడేజా మాత్రం సిరాజ్ చర్యపట్ల అసహనం వ్యక్తం చేస్తూ గట్టిగా అరిచాడు. దీంతో సిరాజ్‌కు చిర్రెత్తుకొచ్చి.. ‘అరె జడ్డూ బాయ్.. నువ్వు నా ఏరియాలో నిలబడి ఫీల్డింగ్ చెయ్యు.. అప్పుడు నీకే క్లారిటీ వస్తుంది’ అని నవ్వుతూనే కౌంటర్ ఇచ్చాడు. దీనికి ప్రతిచర్యగా జడేజా మాత్రం ‘సరే వదిలెయ్’ అన్నట్లుగా తలూపాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాటలు అరుచుకున్నప్పటికీ కాసేపటికే ఇద్దరూ కూల్ అయ్యారు. మ్యాచ్ విషయానికొస్తే.. బుధవారం నాలుగో రోజు ఆటలో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దాటికి లంక టాపార్డర్ కుదేలు కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన పసిందు సూరియబండారా (80) జట్టును ఆదుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ సొనాల్ దినుష శతకం (103)తో చెలరేగాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిద్ కృష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. డెబ్యూ ఆటగాడు సారాంశ్ రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే లంకను ఫాలో ఆన్ ఆడించేందుకు టీమిండియా మొగ్గు చూపింది. లంక తమ రెండో ఇన్నింగ్స్‌లోనూ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రోజు ముగిసేసరికి 5 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కించుకున్న లంక 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంతకముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.pic.twitter.com/jFfDPp6M6B— crictalk (@crictalk7) August 26, 2026Read: 27 ఏళ్లకే కెరీర్ క్లోజ్; ప్రతీకార చర్యకు మాజీ క్రికెటర్ సిద్ధం! -
తిరుపతిలో దారుణం.. కుప్పకూలిన 4 అంతస్తుల భవనం
-
దొంగల భయంతో ఆస్పత్రికి నగలు తెస్తే..
ఆస్పత్రిలో లక్షల విలువైన నగల సంచి మాయమైంది. దొంగతనం కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నర్సు, ఆయమ్మలు.. సిబ్బంది ఇలా అందరినీ ప్రశ్నించారు. ఆపై సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు ‘దొంగ’ ఎవరన్నది తెలిసి ఖాకీలు సైతం అవాక్కయ్యారు. అది రెండు కాళ్ల మనిషి కాదు.. నాలుగు కాళ్ల కుక్క ఆ సంచిని నోట కరుచుకుని ఆస్పత్రి నుంచి దౌడు తీసింది.మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్ జిల్లా ఆస్పత్రిలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కయాంపూర్కు చెందిన లతాబాయి తన కుమారుడికి చికిత్స చేయించేందుకు ఆస్పత్రికి వచ్చింది. ఇంట్లో నగలు ఉంచి రావడం సురక్షితం కాదని భావించి సుమారు రూ.4 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను తన వెంట తీసుకొచ్చింది. ఆమె వద్ద ఉన్న సంచిలో బంగారు మంగళసూత్రం, చెవి దుద్దులు, బంగారు పూసలు, వెండి పట్టీలు తదితర ఆభరణాలతో పాటు సుమారు రూ.2 వేల నగదు, కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అయితే ఆగస్టు 24న తెల్లవారుజామున ఆ బ్యాగు కనిపించకుండా పోయింది.సంచి మాయమైన విషయాన్ని గుర్తించిన లతాబాయి వెంటనే కోత్వాలి పోలీసులను ఆశ్రయించింది. ఆస్పత్రిలోనే ఎవరో నగలను దొంగిలించి ఉంటారని అనుమానించారు. దీంతో పోలీసులు ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడం మొదలుపెట్టారు. అయితే తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో రికార్డైన దృశ్యాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. సర్జికల్ వార్డులోకి ఓ వీధి కుక్క వచ్చింది. అక్కడ ఉన్న సంచిని వాసన చూసి.. నోట కరుచుకుని మెల్లగా బయటకు వెళ్లిపోయింది. సంచిలో ఉన్న ఆహార పదార్థాల వాసనకు ఆకర్షితమైన కుక్క దాన్ని తిండి సంచిగా భావించి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఇక అక్కడి నుంచి మొదలైంది పోలీసుల ‘డాగ్ ట్రాకింగ్ ఆపరేషన్’. ఆస్పత్రి పరిసరాల్లోని సీసీ కెమెరాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ కుక్క ఎటువైపు వెళ్లిందో పోలీసులు పరిశీలించారు. చివరకు.. కుక్కను, అది తీసుకెళ్లిన సంచిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదృష్టవశాత్తూ అందులోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, ఇతర వస్తువులు కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం వాటిని లతాబాయికి అప్పగించారు. తన విలువైన వస్తువులను తిరిగి అందించిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. సోసల్ మీడియాలో ఆ కుక్క వీడియో చూసి.. ‘‘అరేయ్ చింటూ బ్రో.. ఏంట్రా ఇది’’ అంటూ ఫన్నీ కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో దొంగతనం జరగకపోయినా.. ఆస్పత్రిలోకి వీధి కుక్క ఎలా ప్రవేశించింది? రోగులు, వారి వెంట వచ్చే వారి భద్రతకు తీసుకుంటున్న చర్యలేంటి? అనే ప్రశ్నలు మాత్రం తలెత్తాయి.🚨 STRAY DOG TURNS THIEF IN MANDSAUR!A stray dog was caught on CCTV carrying away a bag containing jewellery worth ₹4 lakh and nearly ₹2,000 cash from Mandsaur District Hospital.Police traced its route and recovered everything. The belongings were later returned to the… pic.twitter.com/MjYAzeQfCH— Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2026 ఇదీ చదవండి: వైరల్ కావాలనే ఆశతో గర్ల్‌ఫ్రెండ్‌తో అలా.. -
రీల్స్ పిచ్చి పట్టాలపై రోటి.. వైరల్ అవుతున్న వీడియో
-
అంపైర్లతో గొడవ.. లంక ఆటగాడికి షాకిచ్చిన ఐసీసీ
కొలంబో వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతు రెండో టెస్టు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. ఇప్పటికే జైస్వాల్, అసితా ఫెర్నాండో వివాదంపై సీరియస్ అయిన ఐసీసీ వారిద్దరికి జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. తాజాగా ఈ జాబితాలో శ్రీలంక బౌలర్ ప్రబాత్ జయసూరియా కూడా చేరిపోయాడు. రెండో రోజు ఆట చివర్లో వెలుతురు మందగించడంతో తాము ఆడలేమంటూ జయసూరియా అంపైర్లతో వాదనకు దిగాడు. కానీ అంపైర్లు ఆటను కొనసాగించడానికే మొగ్గు చూపారు. అంపైర్లతో వాదన జరిగిన మరుక్షణమే ప్రబాత్ ఔటయ్యాడు. దీంతో పెవిలియన్ వెళుతూ బౌండరీ లైన్ వద్ద కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొడుతూ, గ్లౌజులను విసిరేశాడు. ప్రబాత్ జయసూరియా చర్యలు ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో చర్యలకు ఉపక్రమించింది.‘‘అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు, మైదాన పరికరాలు ఇతర వస్తువులను దుర్వినియోగం చేయడం ఐసీసీ నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుంది. ప్రబాత్ జయసూరియా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినట్లు తేలింది. అందుకే క్రమశిక్షణా చర్య కింద ఒక డీమెరిట్ పాయింట్ విధిస్తున్నాం. గత రెండేళ్లలో అతడికి ఇదే మొదటి ఉల్లంఘన కావడంతో ప్రస్తుతం డీమెరిట్ పాయింట్‌తో సరిపెడుతున్నాం’’ అని చెప్పుకొచ్చింది. అనంతరం ప్రబాత్ జయసూరియ తన తప్పును అంగీకరించడంతో విచారణ అవసరం లేదని ఐసీసీ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పేర్కొన్నాడు.అసలేం జరిగిందంటే?భారత్ తొలి ఇన్నింగ్స్‌ను రెండో రోజు 503/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు ఆటకు కొన్ని ఓవర్లు మాత్రమే మిగిలి ఉండగా.. కొలంబోలో వెలుతురు మందగించింది. లంక తొలి వికెట్ కోల్పోవడంతో నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన ప్రబాత్ జయసూరియా వెలుతురు సరిగా లేదని, ఆడడంలో ఇబ్బంది ఎదురవుతుందని అంపైర్లకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అంపైర్లు లైట్ మీటర్‌తో వెలుతురును పరిశీలించారు. అయితే ఆటను నిలిపివేయకుండా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై శ్రీలంక బ్యాటర్లు జయసూర్య, కమీల్ మిశ్రా ఇద్దరూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినప్పటికీ అంపైర్లు తమ నిర్ణయం ప్రకారమే ఆటను కొనసాగించారు. ఈ క్రమంలో ఔటైన తర్వాత మైదానం వీడుతున్న సమయంలో ప్రభాత్ జయసూర్య పలుమార్లు అంపైర్ల వైపు కోపంగా చూస్తూ వెళ్లాడు. పెవిలియన్‌కు చేరుకున్న తర్వాత కోపంతో తన గ్లౌజులను విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.Nightwatchman sent packing! 🚶➡️ Manav Suthar strikes to pick up the wicket of Prabath Jayasuriya and wrap up the day on a high! 💥 Watch #SLvIND, 2nd Test, Day 3, Tomorrow, 9 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/pAKsoOncyK— Sony Sports Network (@SonySportsNetwk) August 24, 2026🚨Prabath Jayasuriya has been sanctioned by the ICC for breaching the Code of Conduct during the 2nd Test vs India.• Breached Article 2.2 pic.twitter.com/R6d4b8qPsD— TheWicketReport (@WicketReport) August 25, 2026Read: లంక కెప్టెన్‌ను ట్రాప్ చేసిన సర్ఫరాజ్; ఏం జరిగిందంటే? -
బిచ్చగత్తె ఇంట్లో నోట్ల కట్టలు.. చనిపోయాక బయటపడ్డ రహస్యం
-
ఈ వీడియో చూస్తే కన్నీరు రావాల్సిందే..
-
Viral Video: గుట్టలు గుట్టలుగా చాక్లెట్లు.. ఎగబడిన జనం
కాన్పూర్‌లోని పంకి పారిశ్రామిక ప్రాంతంలో ఓ చెత్తకుప్పలో గడువు ముగిసిన చాక్లెట్లు కోసం జనం ఎగబడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీగా జనం ఓ చెత్త డంపింగ్ ప్రదేశం వద్ద గుమిగూడారు. గడువు ముగిసిన చాక్లెట్లు, టాఫీల కోసం ప్రజలు ఎగబడటం చర్చనీయాంశంగా మారింది. చాక్లెట్లు, టాఫీలు పడేసినట్లు సమాచారం అందగానే పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కొందరు నేలపై పడిన స్వీట్లను చేతులతో ఏరుకుంటుండగా.. మరికొందరు బ్యాగులు, సంచులతో వచ్చి వీలైనన్ని చాక్లెట్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.ఓ ఫ్యాక్టరీ యజమాని గడువు ముగిసిన చాక్లెట్లు, టాఫీల బ్యాచ్‌ను అక్కడ పడేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం స్థానికంగా వ్యాపించడంతో కొద్దిసేపటికే అక్కడ భారీగా జనం చేరుకుని చాక్లెట్లను తీసుకెళ్లారు. అయితే ప్రజలు తీసుకెళ్లిన చాక్లెట్లను నిజంగానే తినేందుకు ఉపయోగించనున్నారా? లేక మరేదైనా అవసరానికి తీసుకెళ్లారా? అనేది వీడియోలో స్పష్టంగా తెలియడం లేదు. అయితే ఈ ఘటన ఆహార భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. వాటిని తినడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.यूपी के कानपुर से एक वीडियो सामने आया है। पनकी इंडस्ट्रियल एरिया में डंपिंग साइट के पास किसी ने बड़ी मात्रा में एक्सपायरी चॉकलेट, टॉफी और बिस्किट फेंके जिसे देख देखकर वहां लोगों की भीड़ जुट गई और कई लोग सामान को बैग, बोरे और डिब्बों में भरकर ले जाते दिखाई दिए। pic.twitter.com/4NKFNVQYON— Yogesh Mishra (@iYogeshMishra) August 25, 2026కాగా, గడువు ముగిసిన, విక్రయించేందుకు అనర్హమైన ఆహార పదార్థాలను బహిరంగంగా పడేయకుండా.. నిర్దేశిత విధానంలో నాశనం చేయాల్సి ఉంటుంది. అవి తిరిగి ప్రజల చేతుల్లోకి వెళ్లకుండా నియంత్రిత పద్ధతిలో వాటిని నిర్వీర్యం చేయడం అవసరం. ఈ ఘటనలో మాత్రం చాక్లెట్లను బహిరంగ ప్రదేశంలో పడేశారు. దీంతో ప్రజలు వాటిని తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇదీ చదవండి: వైరల్ అవ్వాలని.. 3,400 ముద్దులు!! -
వైరల్ అవ్వాలని.. 3,400 ముద్దులు!!
సోషల్ మీడియాలో వైరల్ కావాలని ఏదో ఒకటి తుంటరి పని చేసేవాళ్లు ఎక్కువైపోయారు. అదే తరహాలో ఇక్కడో యువకుడు చేసిన వింత స్టంట్ చివరకు ఊహించని తీరానికి చేరింది. తన స్నేహితురాలి పెదాలతో కారు నిండా ముద్దులతో నింపేసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఏకంగా మిలియన్ల వ్యూస్ సాధించడంతో సంబురపడిపోయింది. ఇంతటితో ఆగితే.. మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటుంది.. అసలు కథలోకి వెళ్దాం పదండి..గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలో లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులతో పూర్తిగా నిండిపోయిన స్విఫ్ట్ కారు కనిపించింది. ఆ కారును నగర రహదారిపై వేగంగా నడుపుతున్నట్లు కూడా వీడియోలో కనిపించడంతో పోలీసులు దృష్టి సారించారు. వాహనం వివరాలను సేకరించి దాని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాని యజమానిని కూడా విచారణకు పిలిచారు.విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ట్రెండ్‌ను అనుసరించి వీడియోను వైరల్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్టంట్ చేసినట్లు ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. తన మహిళా స్నేహితురాలే కారుపై దాదాపు 3,400 లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులు వేసిందని చెప్పాడు. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు మూడున్నర గంటలు పట్టిందని, లిప్‌స్టిక్ కోసం రూ.800–900 వరకు ఖర్చయిందని వివరించాడు. కారును మొత్తం ముద్దుల గుర్తులతో నింపి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు చెప్పాడు.యువకుడు అనుకున్నట్లుగానే వీడియో సోషల్ మీడియాలో దూసుకెళ్లింది. దాదాపు 55 లక్షల(5.5M) మంది వీడియోను వీక్షించినట్లు అతడు తెలిపాడు. అయితే అదే వైరల్ వీడియో అతడిని పోలీసుల వద్దకు తీసుకెళ్లింది. మధ్యప్రదేశ్ బోఫాల్‌లో జరిగింది ఈ ఘటన. ఆ కారు ఓనర్ పేరు ఆదిత్య సికర్వార్.స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అభిషేక్ రఘువంశీ మాట్లాడుతూ.. సుమారు రెండు రోజుల క్రితం ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పటేల్‌నగర్–సిటీ సెంటర్ ప్రాంతంలో లిప్‌స్టిక్ గుర్తులతో ఉన్న స్విఫ్ట్ కారు వేగంగా వెళ్తున్నట్లు వీడియోలో కనిపించిందన్నారు. వీడియో ఆధారంగా వాహనాన్ని గుర్తించి థాటీపూర్లో పట్టుకున్నట్లు చెప్పారు.ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వివిధ మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కింద ఆదిత్యకు సుమారు రూ.5,500 చలాన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. తన తప్పును అంగీకరించిన ఆదిత్య.. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే కారుపై ఉన్న వేలాది లిప్‌స్టిక్ గుర్తులను స్వయంగా శుభ్రం చేసుకున్నాడు. తన మహిళా స్నేహితురాలే ఈ ఆలోచన ఇచ్చిందని ఆదిత్య చెప్పాడు. తాను కారు పార్క్ చేసి వెళ్లిన సమయంలో ఆమె కారుపై ముద్దుల గుర్తులు వేసిందని వివరించాడు. సోషల్ మీడియాలో ఇలాంటి ట్రెండ్ నడుస్తుండటంతో వీడియో చేస్తే వైరల్ అవుతుందని భావించామని, అనుకున్నట్లుగానే భారీగా వ్యూస్ వచ్చాయని తెలిపాడు. అయితే ఈ వీడియో కారణంగా ట్రాఫిక్ పోలీసుల నుంచి చర్యలు ఎదురవుతాయని ఊహించలేదని చెప్పాడు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తానని, ఇలాంటి స్టంట్‌ను పునరావృతం చేయబోనని పోలీసులకు హామీ ఇచ్చాడు.వైరల్ కోసం చేసిన వింత ప్రయోగం.. లక్షల వ్యూస్ తెచ్చిపెట్టినా, చివరకు చలాన్‌తో పాటు పోలీస్ స్టేషన్లో కారు కడిగే పరిస్థితిని తెచ్చిపెట్టింది. Love was in the air… and all over the car! 3,400 kisses got Gwalior's "Kissing Car" 5.5 million views and a ₹5,500 challan. He wanted to make a "reelationship" go viral. Traffic Police made sure it came with a "fine ending" @GargiRawat pic.twitter.com/d2GwGeHbUS— Anurag Dwary (@Anurag_Dwary) August 25, 2026 ఇదీ చదవండి: ఓనం హిందువుల పండుగ కాదా? -
నా అందంపై సలహాలు వద్దు.. డెన్మార్క్ ప్రధాని సీరియస్..
-
తొలి అడుగుల నుంచి.. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వరకు..!
చేతులు పట్టుకుని నడిపించిన ఆ తల్లిదండ్రులనే మనం పెద్దయ్యాక వాళ్లను మనం దగ్గరుండి చూసుకుంటుంటే కలిగే సంతోషం అంత ఇంత కాదు. ఒకప్పడు వాళ్లను గట్టిగా పట్టుకుని నడిచిన మనం ఇవాళ చిన్నపిల్లలుగా మారి మన ఆసరాతో వెళ్తుంటే వాళ్లకళ్లల్లో కనిపించే దృశ్యానికి మాటల్లేవ్ అంతే. అలాంటి భావోద్వేగ దృశ్యమే నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ని నాన్సీ గుప్తా అనే అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆమె తన తల్లిదండ్రలును తొలిసారిగా విమానంలో తీసుకువెళ్తోంది. ఆ అనుభూతులని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తొలిసారి తన పేరెంట్స్ విమానం ఎక్కడంతో వారి ముఖాల్లో కనిపిస్తున్న సంతోష దృశ్యాలను కెమెరాలో బంధించింది. విమానం కిటికి కుండా దుప్పటిలా పరుచుకుని తేలుతూ కనిపిస్తున్న మేఘాలను చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతూ తిలకిస్తూ..సంబరపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె తల్లి కిటికీలోంచి చూస్తూ సంతోషంతో చిరునవ్వు చిందిస్తున్న దృశ్యం మనసుని తాకుతుంది. చిన్నప్పుడు నడక నేర్పించిన తల్లిదండ్రలను ఇవాళ ఆకాశంలోకి విహరించేలా చేస్తే కలిగే అనుభూతికి మించింది ఏం ఉంటుంది. అలాంటి ఆనందాన్ని తానుపొందుతున్నా అన్నట్లుగా చివర్లో నవ్వుతూ తన సెల్పీని తీసుకుంటూ కనిపిస్తుంది నాన్సీ గుప్తా. ఈ వీడియోకి "మొదటి అడుగుల నుంచి మొదటి విమాన ప్రయాణం" వరకు అని క్యాప్షన్ జోడించి మరి ఇలా రాసుకొచ్చింది. ఏళ్లు గడిచే కొద్దీ..తల్లిదండ్రులు, పిల్లల మధ్య మారుతున్న పాత్రల గురించి ఈ క్షణం ఎలా చెబుతోందో చెప్పారు. ఆవేళ తనను చేయిపట్టుకుని నడిపించారు, ఇవాళ వాళ్లను తొలిసారిగా విమానంలో తీసుకువచ్చా. ఇదంతా చూస్తుంటే జీవితం ఒక వలయంలా పూర్తి అవుతోందనిపిస్తోంది అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చిందామె. నెటిజన్లు కూడా ఇది ఒక అందమైన పరిపూర్ణమైన క్షణం అని, చాలా భావోద్వేగ భరితంగా ఉంది అంటూ పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Nancy Gupta🍀 (@nancy.gupta18) -
YouTubersకు మైండ్ బ్లాక్.. చైనా కొత్త App!
-
సెప్టెంబర్ 2 నుంచి BRS బిగ్ ప్లాన్.. కాంగ్రెస్ పై ప్రశ్నల వర్షం
-
సెంచరీ సెలబ్రేషన్.. కండల ప్రదర్శనపై జురెల్ స్పందన!
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీతో మెరిశాడు. టెస్టుల్లో ఏడో స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో వచ్చి సెంచరీ బాదిన రెండో భారత బ్యాటర్‌గా జురెల్ రికార్డులకెక్కాడు. సెంచరీ చేసిన వెంటనే గాలిలోకి పిడికిలి బిగించిన జురెల్, ఆ తర్వాత హెల్మెట్ తీసేసి కండలను ప్రదర్శించడం హైలైట్‌గా నిలిచింది. అయితే అతడి ఎడమ చేతి బైసిప్స్పై పచ్చబొట్టు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జురెల్ చేతిపై ఉన్న టాటూ ఏంటా అని అభిమానులు ఆరా తీయగా.. ‘జై జవాన్.. జై కిసాన్’ అని రాసి ఉండడం కనిపించింది.సెంచరీ చేయగానే సెలబ్రేషన్స్‌లో భాగంగా జురెల్ కండలు చూపించాడనుకుంటే మాత్రం పొరపాటే అవుతుంది. నిజానికి అతను ప్రదర్శించిన పచ్చబొట్టు వెనుక చిన్న కథ దాగుంది. తాజాగా మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కండలను ప్రదర్శించడం వెనుక దాగున్న అసలు విషయాన్ని ధ్రువ్ జురెల్ పంచుకున్నాడు.‘కండల ప్రదర్శన ఊరికే చేయలేదు. మా తాత రైతు, తండ్రి సైనికుడు. వారి మూలాలను ఎప్పటికీ మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే కండల ప్రదర్శనతో సెలబ్రేషన్ చేసుకున్నా. ఆ టాటు వెనుక ఉన్న అర్ధం కూడా అదే’ అని జురెల్ చెప్పుకొచ్చాడు. సెంచరీ తర్వాత తాను చేసిన సెలబ్రేషన్స్ కూడా తన కుటుంబానికి అంకితం చేశానని జురెల్ పేర్కొన్నాడు.జురెల్ గతంలోనూ భారత్ తరపున హాఫ్ సెంచరీ లేదా సెంచరీ చేసిన సందర్భాల్లో తన తండ్రికి నివాళిగా ఆర్మీ సెల్యూట్ చేసేవాడు. ఇప్పుడు టాటూను చూపిస్తూ చేసిన కొత్త రకమైన సెలబ్రేషన్ చేయడం వెనుక, తన కుటుంబ నేపథ్యం ముడిపడి ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. ప్రస్తుతం లంక జట్టు మరో 495 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, జురెల్ శతకాలతో చెలరేగగా, గిల్, పంత్ అర్ధసెంచరీలతో రాణించారు.HUNDRED MOMENT OF DHRUV JUREL! 💯🇮🇳DHruv Jurel’s 2nd Test century — and both times, Mohammed Siraj was at the non-striker’s end to celebrate with him. Truly special!🥹❤️pic.twitter.com/9Fo8bBKIHu— Cricket Apna 🇮🇳 (@cricketapna1) August 24, 2026 "जय जवान, जय किसान"🗣️ My grandfather was a farmer and my father, a soldier.🫡Dhruv Jurel reveals the reason behind the special celebration and the tattoo on his arm after reaching his 💯 👌#TeamIndia | #SLvIND | @dhruvjurel21 pic.twitter.com/pQlM1r84hN— BCCI (@BCCI) August 24, 2026చదవండి: నిరాశపరిచిన భారత్.. సెమీస్ చేరకుండానే ఇంటిబాట -
ఉద్యోగినిపై స్కూల్ పిల్లల దాడి! వైరల్ విడియో
-
స్కూల్లో ఉద్యోగినిని చితగ్గొట్టిన జెన్ ఆల్ఫా పిల్లలు.. మామూలుగా కాదు
కోల్‌కతా: ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగినిని జెన్ ఆల్ఫా (2010 నుంచి 2024 మధ్య కాలంలో జన్మించిన) విద్యార్థులు కొందరు చితకబాదారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా బమన్గోలా ప్రాంతంలోని జగ్దలా హైస్కూల్లో ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) జారీ విషయంలో ఓ పాఠశాల విద్యార్థికి, నాన్ టీచింగ్ మహిళా సిబ్బందికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.గతంలో పాఠశాలలో చదివిన ఓ విద్యార్థి తన పేరులో సరిచేసిన అక్షరక్రమంతో టీసీ ఇవ్వాలని తమను కోరినట్లు నాన్ టీచింగ్ సిబ్బంది తెలిపారు. అయితే అధికారిక పాఠశాల రికార్డుల ప్రకారమే ఆ పత్రాన్ని జారీ చేయగలమని చెబుతూ ఆమె నిరాకరించారు.దీంతో కొంతమంది విద్యార్థులు గదిలోకి ప్రవేశించి తనపై భౌతికంగా దాడి చేశారని బాధితురాలు ఆరోపించారు. తాత్కాలిక ప్రధానోపాధ్యాయుడు అమిత్ హల్దర్, మరో సహాయ ఉపాధ్యాయుడు ఈ దాడికి విద్యార్థులను ప్రేరేపించారని ఆమె పేర్కొన్నారు. ఘటన అనంతరం చికిత్స కోసం ఆమెను బమన్గోలా ప్రాంతంలోని ముడిపుకూర్ గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.మరోసారి ఉద్రిక్తతఆసుపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధిత మహిళ ఉద్యోగి మద్దతుదారులు ప్రతీకారంగా తాత్కాలిక ప్రధానోపాధ్యాయుడిపై, మరో ఉపాధ్యాయుడిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరో ఇద్దరు ఉపాధ్యాయులు నోని రాయ్, బిమల్ పాల్‌పై కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.అంతేకాకుండా, తాను పాఠశాలలో నియమితురాలినైనప్పటి నుంచి పాఠశాలలో పలు ఆర్థిక అవకతవకలను గుర్తించినట్లు ఆమె ఆరోపించారు. ఇందులో టీచర్-ఇన్-చార్జ్ (టీఐసీ) ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన మధ్యాహ్న భోజన పథకంలోని అవకతవకలు కూడా ఉన్నాయని తెలిపారు.ఆరోపించిన అవినీతికి వ్యతిరేకంగా తాను ప్రశ్నించినప్పుడు, తాత్కాలిక టీఐసీ తనను లైంగికంగా వేధించారని, అనుచిత ప్రతిపాదనలు చేశారని ఆమె ఆరోపించారు. అయితే హల్దర్ ఈ ఆరోపణలన్నింటినీ పూర్తిగా నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. Wtf! Class 11 students in Malda, West Bengal, allegedly assaulted a female teacher after a dispute over low marks in a test 🤯 pic.twitter.com/htpdMr4uPB— Lakshay Mehta (@lakshaymehta08) August 23, 2026 -
ఆమె కళ్లలో వెలుగు.. ఓ దేశాంతర ప్రేమకథ మొదలు
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా పుడుతుందో చెప్పలేం. విహారయాత్రకు వచ్చిన విదేశీ మహిళా టూరిస్టులు.. మన దేశానికి చెందిన టాక్సీ డ్రైవర్లతో ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం లాంటివి మీరు విని చూసే ఉంటారు. ఇప్పుడు కూడా అలాంటి ఓ స్టోరీనే సోషల్ మీడియాలో కనిపించింది. ఓ తైవాన్ నటుడు, హోటల్లో పనిచేసే భారతీయ మహిళతో ప్రేమలో పడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ వీళ్లెవరు? ఎప్పుడు ఎలా ప్రేమలో పడ్డారు? వీళ్ల కథేంటి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)తైవాన్‌కు చెందిన నటుడు, మోడల్ చెంగ్ చాంగ్ ఫాన్ గతేడాది నవంబరులో మన దేశానికి వచ్చాడు. ఓ హోటల్లో దిగిన సందర్భంగా హోటల్లో పనిచేసే ఓ అమ్మాయి.. భారతీయ సంప్రదాయం ప్రకారం అతడికి హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఆహ్వానించింది. సరదాగా తీసుకున్న వీడియోని చెంగ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. కట్ చేస్తే ఆరు నెలలు తిరిగేసరికి వీరిద్దరూ ప్రేమికులు అయ్యారు. సన్నిహితంగా ఫొటోలకు పోజులిచ్చేంత చనువుగా మారిపోయారు. దానికి తోడు చెంగ్.. భారతీయ మహిళల గురించి పెట్టిన సుధీర్ఘ పోస్ట్ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని విషయం చెప్పకనే చెప్పినట్లయింది.'భారతీయ మహిళల్లో అత్యంత అందమైన విషయం మన కళ్లకు కనిపించేది మాత్రమే కాదు. మనకు అనిపించేది కూడా. వారు తమ ప్రేమని బహిరంగంగా వ్యక్తపరుస్తారు, ఎంతో శ్రద్ధ చూపిస్తారు, మనస్ఫూర్తిగా నవ్వుతారు. తమలోని సున్నితత్వాన్ని అలానే కాపాడుకుంటారు. భారతీయ మహిళలు అతిథులని ఆహ్వానించే విధానంలో ఒక ప్రత్యేకమైన ఆప్యాయత ఉంటుంది. వారి నిజాయితీ, ఆత్మీయత కారణంగా ఒక అపరిచితుడు కూడా కొంతసేపటికి ఆత్మీయుడు అయిపోతాడు''ఆమె కళ్లలోని ఆ వెలుగు గురించి చెప్పాలి. ఆమె నవ్వినప్పుడు, తన ఇంటి గురించి మాట్లాడినప్పుడు లేదా ఏదైనా చిన్న విషయం ఆమెని సంతోషపరిచినప్పుడు కనిపించే ఆ వెలుగు ఎంతో నిజాయితీగా ఉంటుంది. ప్రపంచం కొంత సున్నితంగా, అందంగా ఉందనిపించేలా చేస్తుంది. మీరు దాన్ని చూడొచ్చు లేదా చూడకపోవచ్చు. నేను చూశాను. అనుభూతి చెందాను. నేను ఆ హోటల్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అలా అనుభూతి చెందాను. చాలా కాలం తర్వాత దేవుడు నా వైపు ఉన్నట్టుగా అనిపించింది' అని చెంగ్ రాసుకొచ్చాడు.ఈ క్యాప్షన్ చూసిన ఎవరికైనా చెంగ్ చాంగ్.. సదరు యువతితో ప్రేమలో ఉన్నాడని అర్థమవుతోంది. కాకపోతే అధికారికంగా వీళ్లు ఆ విషయాన్ని బయటపెట్టలేదు. చూస్తుంటే త్వరలో పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ చెబుతారేమో అనిపిస్తుంది. ప్రస్తుతానికి అమ్మాయి ఎవరు ఏంటనేది తెలియట్లేదు. చెంగ్ చాంగ్ విషయానికొస్తే.. ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో పనిచేసిన ఇతడు 2020లో వచ్చిన 'క్రెవింగ్ యూ' సిరీస్‌లో నటించాడు. 2022లో రిలీజైన 'ఆరెంట్ యూ నథింగ్' అనే ఆల్బమ్ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు.(ఇదీ చదవండి: న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న తెలుగు హీరో) View this post on Instagram A post shared by Cheng. 范成章 (@chengchangfan) View this post on Instagram A post shared by Cheng. 范成章 (@chengchangfan) -
ఇప్పటికీ మేఘన నా కూతురే.. కొడుకు వివాదంపై జోగిరమేష్ రియాక్షన్
-
వీల్‌చైర్‌లో మహిళ పుల్ అప్స్..! వీడియో వైరల్
దివ్యాంగులు చూపే అసాధారణ ప్రతిభ, పట్టుదల ఎవ్వరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారికంటే మెరుగ్గా అద్భుతంగా డేరింగ్ ఫీట్లు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. తమ శారీరక పరిస్థితికి మించి చేసి ఆదర్శంగా నిలుస్తుంటారు. అలాంటి సూమర్వుమన్ ఈ మహిళ.ఒక దివ్యాంగురాలు జిమ్‌లో సవాలుతో కూడిన వ్యాయామానికి సిద్ధమవుతుంది. పలువురు మహిళలు ఆమె వీల్‌చైర్‌ను పుల్అప్ బార్ దగ్గర ఉంచడానికి సహాయం చేస్తారు. ఆమె ఆ తర్వాత చాలా అలవోకగా ఆ పుల్ అప్స్ చేస్తుంది. నిజానికి అక్కడున్న మహిళలు ఆ వ్యాయామాన్ని పూర్తి చేయగలదో లేదా అని అనుమానంగా చూస్తారు. కానీ ఆమె చాలా సునాయాసంగా వీల్‌చైర్‌లోనే కూర్చొని పుల్ అప్స్ చేస్తుంటుంది. మొదట్లో సంకోచించినప్పటికీ..విజయవంతంగా ఆ వ్యాయామాన్ని పూర్తి చేయడమే గాక ఇంకా కొనసాగించాలనే ఉత్సుకతత కనిపిస్తుంటుంది. వీడియో చివర్లో ఆమె తన లక్ష్యాన్ని పంచుకోవడం విశేషం. తాను ఏడాది ముగిసేలోపు 10 పుల్ అప్లు చేయడమే తన లక్ష్యం అని చెప్పింది. ఈ వీడియోక్లిప్ ఆమె బలాన్ని మాత్రమే కాకుండా, ఆమె చుట్టూ ఉన్న మహిళలు మద్దతుగా నిలబడం అందర్నీ తెగ ఆకర్షించింది. నెటిజన్లు ఇది పూర్తిగా నివ్వెరపరిచే విషయం, నిజంగా ఆమె ‘సూపర్‌వుమన్’ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abril Alfaro (@abrilalfarox) (చదవండి: ట్రావెల్ వీడియోల్లో ఇంత కిక్ ఉందా? ఏడాదికి రూ.85 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్నే..) -
ఇకనుండి భారత్ లో నేరుగా మొబైల్‌కే శాటిలైట్ ఇంటర్నెట్!
-
పోలీసుల అదుపులో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్
ఇంగ్లండ్ క్రికెట్ జట్టును మరోసారి ఆఫ్‌ఫీల్డ్ వివాదం వెంటాడుతోంది. ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ డెర్బీలోని ఓ నైట్‌క్లబ్ వెలుపల పోలీసుల చేతికి చిక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్స్ చేతులకు బేడీలు వేసి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు అందులో కనిపించాయి. అయితే కార్స్‌ను అరెస్టు చేయలేదని, ఎలాంటి అభియోగాలు నమోదు చేయకుండానే విడుదల చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) దర్యాప్తు ప్రారంభించింది.Durham bowler Brydon Carse, who is in England squad for second Test, was released without charge after a nightclub incident while celebrating victory over Derbyshire@willis_macp has the details ⤵️https://t.co/4YXyQWChe5 pic.twitter.com/zFKA3lgPVi— Telegraph Cricket (@TeleCricket) August 23, 2026డర్హామ్ తరఫున కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆడిన అనంతరం జట్టు సభ్యులు విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు డెర్బీలోని నైట్‌క్లబ్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన స్వల్ప నిడివి వీడియోలో కార్స్‌ను పలువురు పోలీసులు చుట్టుముట్టి ఉండగా, అతడి చేతులు వెనుకకు ఉంచి బేడీలు వేసినట్లు కనిపించింది. డర్హామ్ సహచరుడు మాథ్యూ పాట్స్ కూడా కార్స్‌తో మాట్లాడుతున్నట్లు వీడియోలో ఉంది.ఘటనాస్థలంలో బెన్ స్టోక్స్ఈ ఘటన సమయంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా అక్కడే కనిపించడం మరింత చర్చకు దారితీసింది. డర్హామ్ తరఫున అదే మ్యాచ్‌లో ఆడిన స్టోక్స్.. డెర్బీషైర్‌పై జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులకు ఐదు వికెట్లు తీసి డెర్బీషైర్‌ను 84 పరుగులకే కుప్పకూల్చడంలో అతడు ప్రధాన పాత్ర పోషించాడు.అయితే నైట్‌క్లబ్‌లో జరిగిన ఘటన ఇంగ్లండ్ జట్టు అధికారిక కార్యక్రమంలో భాగం కాదని తెలుస్తోంది. కార్స్ కూడా ఆ సమయంలో ఇంగ్లండ్ జాతీయ జట్టు విధుల్లో లేడు. పాకిస్తాన్‌తో తొలి టెస్టులో తుది జట్టులో చోటు దక్కకపోవడంతో అతడిని డర్హామ్ తరఫున కౌంటీ మ్యాచ్ ఆడేందుకు విడుదల చేశారు.ఈసీబీ దర్యాప్తుఘటనపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పందిస్తూ.. డెర్బీలో జరిగినట్లు సమాచారం అందిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు కార్స్‌పై తదుపరి చర్యల విషయమై స్పష్టత వచ్చే అవకాశం లేదు. అతడు ప్రస్తుతం పాకిస్తాన్‌తో లార్డ్స్‌లో జరగనున్న రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టులో కొనసాగుతున్నాడు.ఆగస్టు 27 నుంచి లార్డ్స్‌లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ విజయం సాధించినప్పటికీ కార్స్ తుది జట్టులో ఆడలేదు. గత యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన అతడికి రెండో టెస్టులో అవకాశం లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే తాజా ఘటన తర్వాత అతడి ఎంపికపై ఇంగ్లండ్ మేనేజ్మెంట్ నిర్ణయం కీలకం కానుంది.వరుస వివాదాలుకార్స్ ఘటన ఇంగ్లండ్ క్రికెట్లో ఇటీవల చోటుచేసుకున్న ఆఫ్‌ఫీల్డ్ వివాదాల పరంపరలో మరొకటిగా మారింది. గతంలోనూ నైట్‌క్లబ్‌లు, మద్యం, ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు ఇంగ్లండ్ జట్టుకు ఇబ్బందులు తెచ్చాయి. తాజాగా కార్స్ ఘటన నేపథ్యంలో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రవర్తనపై ECB నిబంధనలు మరోసారి చర్చకు వచ్చాయి.కార్స్‌కు గతంలోనూ క్రమశిక్షణకు సంబంధించిన సమస్య ఎదురైంది. 2017 నుంచి 2019 మధ్య క్రికెట్‌కు సంబంధించిన బెట్టింగ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అంగీకరించడంతో 2024లో అతడిపై సస్పెన్షన్ విధించారు.ప్రస్తుతం కార్స్‌పై ఎలాంటి క్రిమినల్ అభియోగాలు లేవు. పోలీసులు అతడిని ఘటనాస్థలంలో తాత్కాలికంగా అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేసినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. చదవండి: జో రూట్ ప్రపంచ రికార్డు -
ఆమె అందరిలాంటి బామ్మ కాదు..! 44 ఏళ్ల వయసులో ఎంటెక్, పీహెచ్డీ..
కొందరు వృద్ధాప్యానికి వ్యతిరేకంగా చురుకుగా యువతలా ఉండేలా ప్రయత్నం చేయడం కాదు..ఆ వయసులో చేసే సాహాసాలను చేస్తుంటారు. యువతలా యాక్టివ్‌గా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. పైగా భావితరాలకు ఓ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ బామ్మ. ఈమె అలాంటి ఇలాంటి బామ్మ కాదు.!.ఆషు జైన్ అనే బామ్మ అందరిలాంటి బామ్మ కాదామె. డెహ్రాడూన్‌కు చెందిన ముగ్గురు పిల్లల తల్లి. ఆమె ఒకప్పుడు అల్లికలు అల్లుతూ మనవళ్లను చూసుకుంటూ గడిపింది. కానీ ఇప్పుడామె జిమ్‌లో డెడ్‌లిఫ్ట్, జుంబా, హైరాక్స్ రేసుల వంటివి సునాయాసంగా చేస్తుంటుందామె. జీవిత చరమాంకంలో ఎలా ఫిట్నెస్తో ఉండొచ్చో చూపిస్తూ..తనలాంటి వాళ్లకు ఆదర్శంగా నిలుస్తోందామె.సాధారణ బామ్మలా కాదు..ఆమె పిల్లలు చదువుకోమని ప్రోత్సహించడంతో 44 ఏళ్ల వయసులో తిరిగి చదువుని ప్రారంబించింది. అలా ఆమె ఎంటెక్, ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్డీ పూర్తి చేసింది. అదే క్రమశిక్షణ ఫిట్‌నెస్‌లో కూడా సాగింది. ఫిట్నెస్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు, నొప్పి లేకుండా ట్రెక్కింగ్, నృత్యం చేయడం, మనవరాలిని ఎత్తుకోగలగడం తదితరాలని అంటోంది ఈ బామ్మ. ఇది కేవలం స్వేచ్ఛకు సంబంధించినది కాదని అంటోంది. అంతేగాదు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తన నాలుగేళ్ల జిమ్ అలవాట్లను కూడా ఆమె షేర్ చేసుకున్నారు. అందుకు తనకు ఉపకరించిన టిప్స్‌ను కూడా పంచుకున్నారు. అవేంటంటే..కొత్తగా ఫిట్నెస్ మొదలుపెడితో చిన్నగా ప్రారంభించమని అంటోంది. చిన్నపాటి లక్ష్యాలతో సాగితే..ఆ తర్వాత పునరావృతం చేసే సంఖ్య పెంచుకుంటూ పోవచ్చని అంటోంది. ఇప్పటికే ఉన్న అలవాట్లకు రోజువారీ అలవాట్లను అనుసంధానించండి. ముందుగా ఏ రోజుకారోజు సన్నద్ధమవ్వడం వంటివి చేయాలి. రేపుచేసే వ్యాయామాలకు కావాల్సిన విధంగా రెడీ అయ్యి ఉండటం. నిలకడగా చేసేలా చూసుకోండి ఒక్కోసారి ఆటంకాలు రావడం, క్రమశిక్షణాయుతంగా చేయలేకపోవడం జరిగినా..నిలకడగా కొనసాగేలా కేర్ తీసుకోవాలిపరిపూర్ణంగా చేయడం కంటే నిలకడగా..సాగిపోవడమే అసలైన ఫిట్నెస్ మంత్ర.అలాగే ఆమె హైరాక్స్ కోసం ఎలా సన్నహామవుతుందో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఓర్పుతో కూడిన ఫంక్షనల్ వ్యాయామాలతో కూడిన గ్లోబల్ ఫిట్నెస్ రేస్. ఈ ఏడాది ప్రారంభంలోనే రెండో హైరాక్స్ను పూర్తి చేశారామె. ఆమె రోజు ఉదయం నాలుగు గంటలకు నీరు, ప్రార్థన, నానబెట్టిన నట్స్‌తో ప్రారంభమవుతుంది. ఆమె శిక్షణలో ప్రత్యేకమైన స్ట్రెంగ్త్, డెడ్‌లిఫ్ట్, రన్నింగ్, జుంబా, బాల్కనీ వాక్‌లు ఉంటాయి. కాగా డబ్ల్యూహెచ్ఓ కూడా 18 నుంచి 64 ఏళ్ల వయసుల పెద్దలు 150–300 నిమిషాల మధ్యస్థ-తీవ్రతతో కూడిన ఏరోబిక్ కార్యకలాపాలు లేదా 75–150 నిమిషాల అధిక-తీవ్రతతో కూడిన ఏరోబిక్ కార్యకలాపాలు చేయాలని సూచిస్తోంది. అలాగే వారానికి కనీసం రెండు రోజులు కండరాలను బలోపేతం చేసే ప్రధాన కార్యకలాపాలు చేయాలని సిఫార్సు చేస్తోంది. ఇక్కడ ఆషు బామ్మ దినచర్య కనీస ప్రమాణాలకు మించి పోయింది. నిజంగా ఆమె ‘హైబ్రిడ్ అథ్లెట్ బామ్మ’. View this post on Instagram A post shared by Ashu Jain (@not.just.a.grandma) (చదవండి: మూడుగంటల ట్యాక్సీ ప్రయాణం..ప్రేమకథగా ఎలా మారిందంటే..!) -
అడ్డంగా బుక్కైన లోకేష్ సార్.. ఎత్తుకెళ్లి LKGలో వేయండి
-
Viral Video: పెళ్లి కూతురి మానవత్వం.. పీటలపై నుంచి లేచి వచ్చి చికిత్స
-
పెళ్లిలో అనూహ్య పరిణామం : పెళ్లి దుస్తుల్లోనే వధువు చికిత్స
కేరళలోని పనూర్లో డా. షిరీన్, డా. రిజాజ్ల వివాహ వేడుకలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. తన వివాహ వేడుకలో అనారోగ్యానికి గురైన ఇద్దరు కేటరింగ్ సిబ్బందికి ప్రథమ చికిత్స అందించేందుకు పెళ్లి వేడుకలను కాసేపు నిలిపివేయడం విశేషంగా నిలిచింది. పెళ్లి దుస్తుల్లోనే ఉన్న వధువు డా. షిరీన్ సకాలంలో వైద్యం అందించి అందరి మన్ననలు అందుకున్నారు. అంతేకాదు కొత్త పెళ్లికొడుకు, భర్త రిజాజ్ కూడా ఆమెనుకొనియాడారు కేరళమ్‌లోని కన్నూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.కన్నూర్ జిల్లా పనూర్‌కు చెందిన డాక్టర్ షిరిన్ సుబాయిర్కు డాక్టర్ రియాజ్‌తో పెళ్లి జరుగుతోంది. ఆ సమయంలో విందు వడ్డించే బృందంలో ఉన్న ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది తెలిసిన వెంటనే పెళ్లి దుస్తుల్లో ఉన్న డాక్టర్ షిరిన్ అక్కడికి చేరుకున్నారు. ఇద్దరిలో ఒకరికి ముక్కు నుంచి రక్తం వస్తుండగా మరొకరు స్పృహతప్పి పడిపోయారు. ముక్కు నుంచి రక్రస్రావం ఆగేందుకు ముందుకు వంగి ముక్కులోని మెత్తడి భాగాన్ని 15 నిమిషాలు గట్టిగా పట్టుకోవాలని, ఆ సమయంలో నోటి ద్వారా శ్వాస పీల్చుకోవాలని సూచించారు. మరో మహిళను వెల్లకిలా కాళ్లు కాస్తంత ఎత్తులో ఉంచి పడుకోవాలని సూచించారు. వారిద్దరికీ కాస్త స్వస్తత చేకూరాక, ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వారికి పురమాయించారు.ఇదీ చదవండి: 16 ఏళ్లకే 275 కిలోలు బరువు : రెండు నెలల్లో 50 కిలోలు తగ్గాడు ఇదంతా కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘ఆ సమయంలో వారికి అక్కడ ఏది అత్యవసరమో అదే చేశా. ఇందులో నా గొప్పతనమేదీ లేదు. ఎవరికైనా ఇలా చేస్తా. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడం కంటే ముందుగా ఇలాంటి చిన్నచిన్న పనులు చేస్తే, వారికి ప్రమాదం చాలా వరకు తప్పుతుంది’అని డాక్టర్ షిరీన్ అంటున్నారు. ప్రస్తుతం ఈమె ఒట్టపాలెంలోని వల్లువనాడ్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఎండీ ఫస్టియర్ చేస్తున్నారు. భర్త డాక్టర్ రియాజ్ ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఆస్పత్రిలో మెడిసిన్ పీజీ చేస్తున్నారు. ఇదీ చదవండి: మూడేళ్ల నుంచే వేధింపులు, చివరికి 70 కిలోలు తగ్గింది కానీ నరకం -
'6-7'తో మత్తెక్కిస్తోన్న చిన్నది.. క్రికెట్లో జెన్-జెడ్, జెన్-ఆల్ఫా శకం!
మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లీగ్ ప్రారంభమైన తొలి రోజునే సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్ ప్లేయర్ మేధావి బిధురి తన చర్యతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే ఆగస్టు 20న టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్ సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్, సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ మధ్య జరిగింది. మ్యాచ్‌లో మేధావి బిధురి రెండు వికెట్లతో మెరిసింది. సౌత్ ఢిల్లీ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో నిషిక సింగ్‌ను అవుట్ చేసిన తర్వాత మేధావి బిధురి జెన్-జీ తరంలో ట్రెండింగ్‌లో ఉన్న '6-7' సెలబ్రేషన్‌తో సోషల్ మీడియాను షేక్ చేసింది.ఏమిటీ 6-7 సెలబ్రేషన్?జెన్-జీ 6-7 సెలబ్రేషన్స్‌లో భాగంగా "ఆరు-ఏడు" అని చెబుతూ, చేతులు (See Saw) పైకి కిందకీ ఊపుతారు. ఈ సంజ్ఞకు ఒక నిర్దిష్టమైన అర్థం లేనప్పటికీ, ఇది జెన్ జెడ్ (2000-2012), జెన్ ఆల్ఫా (2013 నుంచి ప్రస్తుతం) వర్గాల్లో ఒక ప్రధాన ఇంటర్నెట్ మీమ్‌గా మారిపోయింది. ఇప్పుడీ ఈ ట్రెండ్ క్రీడల్లోకి కూడా ప్రవేశించింది.ఇప్పటికే మాజీ క్రికెటర్లు కెవిన్ పీటర్సన్, డేవిడ్ వార్నర్ కాసెమిరో వంటి స్టార్ ఆటగాళ్లు ఈ 6-7 సెలబ్రేషన్స్‌తో మెరిశారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, మేధావి బిధురి ధరించిన జెర్సీ నెంబర్ కూడా 67 కావడం సెలబ్రేషన్స్‌కు మరో కారణం.ఎవరీ మేధావి బిధురి?ఢిల్లీకి చెందిన మేధావి బిధురి రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్. ఢిల్లీ క్రికెట్‌తో పాటు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ లిస్ట్ క్రికెట్లో పాల్గొంది. 2024 మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలోనూ మేధావి బిధురి తన పేరును రిజిస్టర్ చేసుకుంది. 2025 ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఎడిషన్‌లో మేధావి బిధురి ఆ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో మూడు వికెట్లతో సత్తా చాటింది. 2026 సీజన్‌కు ముందే ఆమె సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్‌కు మారింది.Absolute queen behaviour 🫰Central Delhi Queens’ Medhavi Bidhuri stole the show with a sensational 2/24 against South Delhi Superstarz! 😍Watch Women's Delhi Premier League 2026 | LIVE on Star Sports & JioHotstar! pic.twitter.com/TeJG5fstGV— Star Sports (@StarSportsIndia) August 21, 2026 Meet Medhavi BidhuriGenz cricketer 🏏 Jersey no. 67>She went famous for her trending celebration 💃 >She comes as a package > She is cute>She is cricketer >She wears yellow jersey 🟡 pic.twitter.com/kBGZItEdj9— Kiara (@Kiara_X_X1) August 21, 2026Read: గిల్, జైస్వాల్ ఫామ్‌పై నజర్.. ఒక్క ఇన్నింగ్స్ చాలు! -
వైరల్ అవుతున్న వీడియో.. తండ్రిని పట్టించిన బుడ్డాడు
-
జంతర్ మంతర్ చూమంతర్ కాళీ..!
కష్టాల్లో ఉన్న మనిషికి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓ హగ్ ఇస్తే చాలూ అన్నీ ఇట్టే ఎగిరిపోతాయ్ అని శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి ఓ డైలాగ్ చెబుతాడు. కానీ ఇక్కడో ఓ కౌగిలి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. కుటుంబానికి దూరంగా ఒంటరిగా నిలిచిన ఓ సైనికుడికి ఆ ఆలింగనం ఎక్కడా లేని ధైర్యం ఇచ్చింది. అతనితో కన్నీరు పెట్టించింది. హృదయాన్ని తాకే ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.సైనిక శిక్షణ ముగింపు వేడుకలో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. తోటి సైనికులు తమ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటున్న సమయంలో.. ఒంటరిగా నిల్చున్న ఓ యువ సైనికుడి బాధను గుర్తించిన కమాండర్ అతడికి దగ్గరగా వెళ్లి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.In a touching human moment in Indonesia, one soldier stood alone during the closing ceremony of a training exercise, while his colleagues celebrated with their families and loved ones.His commander noticed the situation from a distance and approached him, embracing him as if he…— The Actual Event (@Gazawins12) August 17, 2026ఇండోనేషియా ఆర్మీకి చెందిన ఓ రిక్రూట్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఈ భావోద్వేగ ఘటన జరిగింది. ఫస్ట్ TNI AD ఎడ్యుకేషన్ (ఇండోనేషియా ఆర్మీ శిక్షణ వ్యవస్థ) ముగింపు వేడుకలో భాగంగా సైనికులు పట్టాలు అందుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుక సందర్భంగా చాలామంది సైనికులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటున్నారు. కానీ ఓ యువ రిక్రూట్ మాత్రం అందరికీ దూరంగా ఒంటరిగా నిలబడి కనిపించాడు. చుట్టూ ఉన్నవారి ఆనందాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.అక్కడే ఉన్న కమాండర్ ఆ యువ సైనికుడి పరిస్థితిని గమనించాడు. వెంటనే అతడి దగ్గరకు వెళ్లి ఎలాంటి మాటలు చెప్పకుండా ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అనుకోని ఆ ప్రేమాభిమానానికి ఆ రిక్రూట్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. కమాండర్‌ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని ఓదారుస్తూ అధికారి కొద్దిసేపు అలాగే ఆలింగనం చేసుకున్నాడు.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎడి కార్టోనో అనే వ్యక్తి.. ఆ యువ సైనికుడు తన కుటుంబాన్ని ఎంతో మిస్ అవుతున్నాడని పేర్కొన్నారు. ఇతర సైనికులు తమ కుటుంబాలతో కలిసి వేడుక జరుపుకుంటుండగా.. అతడు ఒంటరిగా నిలబడటం కమాండర్ గమనించారని తెలిపారు. ఆ ఒక్క ఆలింగనం ఆ సైనికుడికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, కుటుంబ సభ్యుల నుంచి లభించే ప్రేమను గుర్తు చేసిందని పేర్కొన్నారు.నెట్టింట ప్రశంసలుఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కమాండర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సైనిక అధికారి కేవలం ఆదేశాలు ఇచ్చే వ్యక్తి మాత్రమే కాదని.. తన సిబ్బంది భావోద్వేగాలను అర్థం చేసుకునే నాయకుడిగా ఉండాలని పలువురు వ్యాఖ్యానించారు. “అది కేవలం ఓ కౌగిలి కాదు.. ఒంటరిగా ఉన్న సైనికుడికి ఇచ్చిన భరోసా” అంటూ పలువురు స్పందించారు. మరికొందరు ఈ ఘటనలో కమాండర్ మానవత్వాన్ని, నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు. కఠినమైన సైనిక శిక్షణ మధ్య కూడా మానవత్వానికి చోటుందని చాటిచెప్పిన ఈ క్షణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకుంటోంది.జంతర్ మంతర్ చూమంతర్ కాళీ.. అని శంకర్‌దాదా చెప్పినట్టు ఇది ఏ మంత్రమో కాదు.. కానీ ఓ కౌగిలి చేసిన మ్యాజిక్. కుటుంబానికి దూరంగా ఒంటరిగా నిలిచిన ఓ సైనికుడి బాధను గుర్తించిన కమాండర్.. ఒక్క ఆలింగనంతో అతడికి ధైర్యం ఇచ్చాడు. ఆ హృదయాన్ని తాకే వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. -
నీ తల్లి కోసమైనా బతకాల్సింది కదరా!
మహారాష్ట్రలోని ఓ కొండపై చోటుచేసుకున్న విషాద ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల మీద అలిగి కొండ మీద నుంచి దూకుతానంటూ కొడుకు.. ఆ కొడుకును కాపాడేందుకు వెళ్లిన తండ్రి, వాళ్లు చనిపోవడం చూసి తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. అసలు ఈ ఘటనకు దారితీసిన కారణమేంటి?.. క్షణాల్లో మూడు ప్రాణాలను బలిగొన్న ఆ వివాదం వెనుక ఉన్న షాకింగ్ కారణాన్ని పోలీసులు వెల్లడించారు.ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) జిల్లా వాలూజ్‌లో ఘోరం జరిగింది. కొడుకును కాపాడేందుకు ప్రయత్నంలో.. కుటుంబం మొత్తం బలైంది. ఈ తీవ్ర విషాదం తిస్గావ్ ప్రాంతంలోని ఖవాడ్యా కొండపై జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసి అయ్యో పాపం అనుకుంటున్నారంతా.పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. 19 ఏళ్ల కునాల్ చంద్రగూడే ఇంట్లో తెలియకుండా ఐఫోన్ కొన్నాడు. అయితే దాని ఈఎంఐ కట్టేందుకు ఇబ్బందులు పడ్డాడు. దీంతో తండ్రికి అసలు విషయం చెప్పి.. ఈఎంఐ కట్టమని బతిమాలాడు. ఈ క్రమంలో ఒప్పుకోని తండ్రి మురళీధర్.. కొడుకును మందలించాడు. ఇదే విషయమై ఇంట్లో శుక్రవారం పొద్దున గొడవ జరిగింది. పట్టరాని కోపంతో తిస్గావ్ ప్రాంతంలోని ఓ కొండపైకి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లీదండ్రులు, మాజీ సర్పంచ్ సహా కొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతన్ని కిందకు దించే ప్రయత్నం చేశారు.మూడు గంటల పాటు కొనసాగిన బుజ్జగింపులుకునాల్ కొండ అంచున నిలబడి తీవ్ర నిర్ణయం తీసుకుంటానని బెదిరించడంతో అంతా బతిమాలడం మొదలుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు అతడిని కిందకు రావాలని నచ్చజెప్పారు. “నీ తండ్రి సంగతి వదిలేయ్.. నీ తల్లి కోసం అయినా బతుకు. నీకు మంచి భవిష్యత్తు ఉంది” అంటూ పలువురు వేడుకున్నా కునాల్ వినలేదు. అతడికి ఐఫోన్ 15 ప్రో ఇప్పిస్తామని కొందరు చెప్పినా ఫలితం లేకపోయింది. ఈలోపు కింద పోలీసులు వలతో సిద్దంగా ఉండడం గమనించి.. మరో అంచువైపు వెళ్లి దూకుతానంటూ బెదిరించాడు.చివరకు కుమారుడిని కాపాడేందుకు తండ్రి మురళీధర్ కొండ అంచు వద్దకు వెళ్లి వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కునాల్ బ్యాలెన్స్ తప్పి పడిపోతుండగా.. తండ్రిని పట్టుకుని లాగేశాడు. దీంతో కింద పడిపోతూ బలమైన గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అప్పటిదాకా అక్కడే కుప్పకూలి ఏడుస్తున్న సంగీత కూడా ఆ దృశ్యంతో షాక్ తింది. భర్త, కుమారుడు కళ్లముందే పడిపోవడాన్ని చూసిన ఆమె క్షణం ఆలస్యం కూడా చేయకుండా కొండపై నుంచి దూకింది. ఈ ఘటనలో ముగ్గురూ మృతి చెందారు.ఒక ఫోన్ కోసం మొదలైన చిన్న వివాదం.. చివరకు ఓ కుటుంబాన్నే బలి తీసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నోట్: వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేయొచ్చు!Tragic news from Chhatrapati Sambhajinagar:19-yr-old Kunal Chandgude died after jumping from Khavdya Hill following a dispute with his parents over a phone.His parents, Murlidhar (48) and Sangita, died trying to save him despite a 3-hr rescue effort by police and fire… pic.twitter.com/1doWOAx5cv— Bhavesh Gujrati (@Bhaveshlivelife) August 21, 2026ఇదే జిల్లాలో మరో విషాదం..ఇటీవల ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోనే గురువారం జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. వైజాపూర్ తాలూకాలోని ఖండాలాకు చెందిన 19 ఏళ్ల సూరజ్ సుభాష్ షిండే మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ కోసం సిద్ధమవుతున్నాడు. చదువు, భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడితో అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు రాసిన రెండు లైన్ల లేఖలో “సారీ అమ్మా, నాన్నా.. వచ్చే జన్మలో మీ కోసం కచ్చితంగా డాక్టర్ అవుతాను.. మీరు జాగ్రత్తగా ఉండండి” అని పేర్కొనడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఒకవైపు ఐఫోన్ EMI వివాదం.. మరోవైపు కెరీర్ ఒత్తిడితో నీట్ అభ్యర్థి ఆత్మహత్య.. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో వరుస విషాద ఘటనలు కుటుంబాలు, యువత ఎదుర్కొంటున్న ఒత్తిళ్లపై చర్చకు దారితీస్తున్నాయి.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comఇదీ చదవండి: 105 ఏళ్ల దోషికి సుప్రీంకోర్టు సాయం -
బుడ్డోడి తెలివితో తండ్రి అడ్డంగా బుక్!
-
ఇంట్లో దొంగతనం చేసి అక్కడే హాయిగా నిద్రపోయిన దొంగ!
-
ప్రియాంకని ఎందుకు చంపారు..? పోలీస్ విచారణలో సంచలన విషయాలు
-
టిప్పర్ బీభత్సం అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి..
-
దంచికొట్టిన సెహ్వాగ్ కుమారుడు.. అచ్చం తండ్రిలాగే..
టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందాడు వీరేంద్ర సెహ్వాగ్. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే దూకుడుగా ముందుకు వెళ్తూ బంతిని బౌండరీకి తరలించడమే అతడికి అలవాటు. ఇక సెహ్వాగ్ ట్రేడ్‌మార్క్ బ్యాక్ ఫుట్ పంచ్ షాట్‌కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారనడంలో సందేహం లేదు.అచ్చం తండ్రిలాగే..వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తాజాగా ఈ మ్యాజిక్‌ను రిపీట్ చేశాడు. తండ్రి మాదిరే బ్యాక్ ఫుట్ పంచ్ షాట్ బాది అభిమానులను ఖుషీ చేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2026లో వెస్ట్ ఢిల్లీ లయన్స్- న్యూ ఢిల్లీ టైగర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.మనీశ్ సెహ్రావత్ సుడిగాలి ఇన్నింగ్స్అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూ ఢిల్లీ టైగర్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. కెప్టెన్ హిమ్మత్ సింగ్ (35), వికెట్ కీపర్ బ్యాటర్ కేశవ్ దలాల్ సింగ్ (36)లతో పాటు పార్థ్ బాలి (36*) రాణించగా.. లోయర్ ఆర్డర్లో మనీశ్ సెహ్రావత్ మెరుపు ఇన్నింగ్స్ (8 బంతుల్లో 30*) ఆడాడు.వెస్ట్ ఢిల్లీ బౌలర్లలో తిశాంత్ డబ్లా, మయాంక్ గుసేన్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్వంత్ ఖేజ్రోలియా, మనన్ భరద్వాజ్ తలా ఒక వికెట్ తీశారు. ఇక న్యూ ఢిల్లీ విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్ట్ ఢిల్లీ ఓపెనర్లు క్రిష్ యాదవ్, ఆర్యవీర్ సెహ్వాగ్ వేగంగా ఆడారు.దంచికొట్టిన ఓపెనర్లుక్రిష్ యాదవ్ 32 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 45 పరుగులతో అదరగొట్టగా.. ఆర్యవీర్ సైతం దంచికొట్టాడు. పద్నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు బాది 22 పరుగులు రాబట్టాడు. తండ్రి మాదిరే బ్యాక్ ఫుట్ పంచ్ షాట్‌తో బంతిని బౌండరీకి తరలించి కనువిందు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన వీరూ భాయ్ అభిమానులు.. ‘అచ్చం తండ్రిలాగే.. సెహ్వాగ్ బ్రాండ్ అలాంటిది మరి’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.మెరుపు అర్ధ శతకాలుఇదిలా ఉంటే.. వన్‌డౌన్‌లో వచ్చిన నితీశ్ రాణా (23 బంతుల్లో 50), కెప్టెన్ ఆయుశ్ దోసేజా (33 బంతుల్లో 64*) మెరుపు అర్ధ శతకాలు బాదగా.. వెస్ట్ ఢిల్లీ 201 పరుగులు సాధించింది. కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్‌లో సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ వెస్ట్ ఢిల్లీకి ఆడుతుండగా.. చిన్న కుమారుడు వేదాంత్ సెహ్వాగ్ సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.చదవండి: కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Delhi Premier League T20 (@delhipremierleaguet20) -
కైలాస పర్వతం రహస్యాలను బయటపెట్టిన టిబెటన్ సన్యాసులు
-
సూపర్‌మ్యాన్ స్పీడ్.. ఉసేన్ బోల్ట్ రికార్డు బద్దలు!
ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జీవి ఏది అంటే.. ఠక్కున వచ్చే సమాధానం చిరుత. మరి మనుషుల్లో? జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ పేరు ముందుగా గుర్తొస్తుంది. వేగానికి పర్యాయపదంగా మారిన బోల్ట్.. ఒక్కసారి పరుగు మొదలుపెడితే ప్రత్యర్థులకు అందనంత దూరంలో దూసుకెళ్లేవాడు. అలాంటి పరుగుల రారాజు నమోదు చేసిన గరిష్ఠ వేగం రికార్డు బద్ధలైంది!!.ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. మనిషి సాధించలేనిది.. యంత్రం చేసి చూపించింది. చైనాకు చెందిన ‘సూపర్‌మ్యాన్’ హ్యూమనాయిడ్ రోబో బోల్ట్ గరిష్ఠ వేగాన్ని దాటి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ యూనిట్రీ రూపొందించిన రోబో.. సెకనుకు 12.66 మీటర్ల వేగంతో పరుగెత్తినట్లు సంస్థ వెల్లడించింది. అంటే గంటకు దాదాపు 45.6 కిలోమీటర్ల వేగం అన్నమాట. 2009లో బెర్లిన్‌లో జరిగిన 100 మీటర్ల పరుగులో ఉసేన్ బోల్ట్ నమోదు చేసిన గరిష్ఠ వేగం సెకనుకు 12.42 మీటర్లు. దీంతో వేగం విషయంలో బోల్ట్‌ను రోబో అధిగమించినట్లయింది.Chinese humanoid robot named “Superman”, made by Unitree Robotics, surpassed Usain Bolt’s world record (12.42 meters/second) by running at 12.66 m/s (roughly 28.3 miles/h) pic.twitter.com/xobXzUPDI5— Massimo (@Rainmaker1973) August 18, 2026ఉసేన్ బోల్ట్ 2009లో బెర్లిన్‌లో జరిగిన 100 మీటర్ల రేసును 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆ పరుగులో ఆయన గరిష్ఠంగా సెకనుకు 12.42 మీటర్ల వేగాన్ని అందుకున్నారు. ఇప్పుడు యూనిట్రీ విడుదల చేసిన వీడియోలో ‘సూపర్‌మ్యాన్’ సెకనుకు 12.66 మీటర్ల వేగంతో దూసుకెళ్లడం కనిపించింది. దీంతో బోల్ట్ గరిష్ఠ వేగం కంటే రోబో వేగం స్వల్పంగా ఎక్కువగా నమోదైంది. పరుగుల తర్వాత అది దారి తప్పి కింద పడిపోవడం గమనార్హం.నిలబడే రెండు మీటర్లు జంప్!పరుగులోనే కాదు.. జంప్‌లోనూ ‘సూపర్‌మ్యాన్’ తన సామర్థ్యాన్ని చాటింది. ఎలాంటి రన్అప్ లేకుండా నిలబడి ఉన్న చోటు నుంచే సుమారు రెండు మీటర్ల ఎత్తుకు ఎగరగలదని యూనిట్రీ తెలిపింది. ఈ రోబో కాళ్ల పొడవు సుమారు 0.85 మీటర్లు. కేవలం మూడు నెలలకు పైగా వ్యవధిలోనే దీన్ని అభివృద్ధి చేసినట్లు సంస్థ వెల్లడించింది. భవిష్యత్తులో దీని వేగం, సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉందని తెలిపింది.వైరల్‌గా మారిన వీడియోయూనిట్రీ ఆగస్టు 17న ‘సూపర్‌మ్యాన్’ సామర్థ్యాలను చూపిస్తూ వీడియోను విడుదల చేసింది. వేగంగా పరుగెత్తడం, నిలబడి రెండు మీటర్ల వరకు ఎగరడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మనిషి వేగానికి ప్రతీకగా నిలిచిన బోల్ట్ గరిష్ఠ వేగాన్ని రోబో దాటిందన్న విషయం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.18 వేల రోబోలు తయారు చేసిన యూనిట్రీచైనాలోని హాంగ్జౌ కేంద్రంగా పనిచేస్తున్న యూనిట్రీ.. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగంలో వేగంగా ఎదుగుతున్న సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే వివిధ మోడళ్లకు చెందిన సుమారు 18 వేల బైపెడల్ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. మరోవైపు యూనిట్రీ షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్లోని STAR మార్కెట్లో లిస్టింగ్‌కు సిద్ధమవుతోంది. ఐపీఓలో భాగంగా సుమారు 6.1 బిలియన్ యువాన్లు (దాదాపు 905 మిలియన్ డాలర్లు) సమీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘సూపర్‌మ్యాన్’ ప్రదర్శన సంస్థ సాంకేతిక సామర్థ్యాలపై మరింత ఆసక్తిని పెంచింది. -
వామ్మో ఏనుగు..! టూరిస్టులకు దిమ్మతిరిగే షాక్
-
ఫోక్ డాన్సర్ గుట్టు బట్టబయలు.. నా భర్త మంచోడే.. ఆమె లొంగదీసుకుంది
-
భర్తను చంపి.. అది చూసిన కొడుకును కూడా..


