అర్థరాత్రి రద్దీగా ఉండే నగరాల్లో కూడా అర్థరాత్రి మహిళలు ఒంటరిగా ప్రయాణించాలంటే బిక్కు బిక్కుమంటూ వెళ్లాల్సిందే. క్యాబ్ సేవలు అందించే సంస్థలకు చెందిన ఆటో,క్యాబ్, బైక్ డ్రైవర్లు మర్యాదగానే ఉంటారు. అయినా కూడా సురక్షింగా గమ్య స్థానానికి చేరేదాకా మనసులో బెరుకు తప్పదు. తాజాగా బెంగళూరులో రాపిడో ఆటోలో అర్ధరాత్రి ఇంటికి ప్రయాణిస్తున్న ఒక మహిళకు అనుభవం నెట్టింట విశేషంగా నిలిచింది.
రాత్రి 12 గంటలకు అర్థరాత్రి, ఒంటరిగా ఉన్నప్పటికీ తన ప్రయాణంలో తాను ధైర్యంగా గడిపిన క్షణం గురించి వివరించిన వీడియోను షేర్ చేసింది. నిజంగా ఆటోలు కనిపించిన ఒక నోట్‌ను ఆమెలోఆనందాశ్చర్యాల్ని నింపింది. వాహనం లోపల అతికించిన చేతితో రాసిన నోట్‌ను చూపించడానికి కెమెరాను అటు తిప్పింది. అక్కడ ఇలా ఉంది: "నేను ఒక తండ్రిని, సోదరుడుని కూడా. మీ భద్రత ముఖ్యం. హాయిగా ప్రశాంతంగా కూర్చోండి."అని ఒక నోట్‌లో రాసి ఉండటం విశేషం. అంటే ఆ సమయంలో ఒంటరిగా ప్రయాణించే మహిళల మనస్సుల్లో చెలరేగే భావాలను, భయాలను అర్థం చేసుకుని భయపడకండి.. నేనూ ఒక బిడ్డకు తండ్రినే, ఒక సోదరికి అన్నయ్యను కూడా..భయపడకుండా కూర్చోండి, నా వలన మీకెలాంటి ప్రమాదం ఉండదు అని ధైర్యం చెప్పడం బాగా ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి: చిలుకను కాపాడబోయి : తనువు చాలించిన వ్యాపారవేత్త
ఈ వీడియోను లిటిల్ బెంగళూరు స్టోరీస్ "పీక్ బెంగళూరు" అనే శీర్షికతో పోస్ట్ చేసింది . దీంతో నెటిజన్ల నుండి హృదయపూర్వక స్పందనలు వచ్చాయి. "గత 20 సంవత్సరాలుగా నాకు ఈ నగరం తెలుసు! ఇది అందరికీ అత్యంత సురక్షితమైన నగరం." ‘‘మేము కోరుకుంటున్నది , మనం చేయవలసినది ఇదే" అంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి చిన్ని చిన్న విషయాలు చాలు. నగరంలోని మహిళలకు అర్థరాత్రి ప్రయాణం సురక్షితంగా అనిపించేలా చేయడంలో సహాయపడతాయి’’ అని మరొకరు కామెంట్ చేశారు. శభాష్..భయ్యా..ఇలాంటి భరోసానే కావాల్సింది అంటూ మరికొందరు ఆటో డ్రైవర్‌ను కొనియాడారు.


