మెస్సీ.. మెస్సీ.. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఇదే పేరు వినిపిస్తోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం ది గోట్ టూర్‌లో భాగంగా భారత్‌కు చేరుకున్నాడు.
శనివారం తెల్లవారుజామున 2.26 గంటలకు కోల్‌కతా విమానాశ్రయంలో అడుగుపెట్టిన మెస్సీకి ఘన స్వాగతం లభించింది.
తమ ఆరాధ్య ఆటగాడిని చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు.


