విజయ్‌-త్రిష వ్యవహారం.. ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు | Khushboo Sundar Reacts To Vijay And Trisha Controversy | Sakshi
Sakshi News home page

విజయ్‌-త్రిష వ్యవహారం.. ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు

Mar 10 2026 5:09 PM | Updated on Mar 10 2026 5:33 PM

Khushboo Sundar Reacts To Vijay And Trisha Controversy

గతకొన్ని రోజులుగా నటుడు, టీవీకే అధినేత విజయ్‌ , నటి త్రిషకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్‌ అవుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లడంతో ఆ వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ అంశంపై సీనియర్‌ నటి,రాజకీయ నాయకురాలు ఖుష్భూ సుందర్‌ స్పందించారు. అది వాళ్ల పర్సనల్‌ విషయం అని, అది ప్రజలను ప్రభావితం చేయనంతవరకు ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. 

తాజాగా ఆమె ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ.. ‘ఈ అంశం(త్రిష-విజయ్‌ల రిలేషన్‌)తో ప్రజలకు ఏమి సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు. ఇది వారి వ్యక్తిగత జీవితం. అది ప్రభావితం చేస్తే, మనం దాని గురించి మాట్లాడవచ్చు. వారి వ్యక్తిగత జీవితానికి ప్రజలతో సంబంధం లేదు. ప్రజలు దీనిని ఎందుకు పెద్ద విషయంగా చూస్తున్నారు? వారు తమకు నచ్చినట్లుగా జీవితాన్ని కొనసాగిస్తారు. దాని వల్ల ప్రజలు ఏ విధంగానూ ప్రభావితం కారు’ అని ఖుష్భూ అన్నారు.

త్రిష అంశం విజయ్‌ రాజకీయ జీవితంపై ప్రభావితం చూసే అవకాశం ఉందా అనే ప్రశ్నలు బదులుగా.. ‘ప్రజలు తెలివైన వాళ్లు. ఎవరికి, ఎందుకు ఓటు వేయాలో వాళ్లకు బాగా తెలుసు. పర్సనల్‌ లైఫ్‌ దానిని ప్రభావితం చేస్తుందని నేను అనుకోను. ఆయన నాయకుడైనా కాకపోయినా.. మనలాగే ఒక మనిషి. ప్రజల వ్యక్తిగత జీవితంతో అతనికి కూడా ఎలాంటి సంబంధం ఉండదు’ అని ఖుష్భూ చెపుకోచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement