Trisha
-
సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు
సినిమాలకు సంబంధించిన వ్యక్తి.. ప్రభుత్వంలో ఉంటే పలు నిర్ణయాలు ఇండస్ట్రీకి కలిసొచ్చేలా ఉంటాయి. విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కోలీవుడ్‌కి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు తమిళనాడులో ఆ ట్రెండ్ మొదలైంది. ఎన్నాళ్లుగానో లేని స్పెషల్ షోలకు అనుమతి లభించింది. త్రిష హీరోయిన్గా నటించిన మూవీతోనే దీనికి శ్రీకారం చుట్టడం విశేషం.(ఇదీ చదవండి: టాలీవుడ్‌కి బిగ్‌షాక్.. ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది)తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమకు తొలిసారి ఊరట లభించింది. సూర్య, త్రిష జంటగా నటించిన 'కరుప్పు' మూవీకి మే 14,15 తేదీల్లో ఉదయం 9 గంటల స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు విజయ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తమిళనాడులో చాన్నాళ్ల నుంచి స్పెషల్ షోలు లేవు. దీంతో ఈ నిర్ణయంపై నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్టర్స్.. సీఎం విజయ్‌కి థ్యాంక్స్ చెప్పింది. తెలుగులో ఈ చిత్రం 'వీరభద్రుడు' పేరిట రిలీజ్ కానుంది. విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమిళనాడులో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 2 వరకు రెండు రోజుల పాటు మొత్తం 5 షోలు వేయనున్నారు.సూర్య,త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన 'కరుప్పు' సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించాడు. ట్రైలర్ అయితే పర్లేదనిపించేలా ఉంది. కోర్టులో సామాన్యులకు న్యాయం అందకుండా చేసే ఓ అవినీతి లాయర్ భరతం పట్టేందుకు దేవుడే దిగివస్తే ఏం జరిగింది అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత రెండు మూడు సినిమాలతో బాగా డీలాపడిపోయిన సూర్య.. ఇది హిట్ అవ్వడం చాలా కీలకం. మరి ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
సూర్య 'వీరభద్రుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'తెలుగోళ్ల దేవుడైతే క్షమాపణ అడగొచ్చు'.. వీరభద్రుడు ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కరుప్పు. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేశారు. కంగువ', 'రెట్రో' డిజాస్టర్స్ తర్వాత వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూస్తుంటే లాయర్, కోర్టు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మన న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను చూపించే లక్ష్యంగా ఈ కథ ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో త్రిష న్యాయవాదిగా కనిపించనుంది. 'దేవుడే దిగొచ్చినా కోర్ట్ ప్రోసీజర్ని మార్చలేడా? వచ్చాను కదరా.. పిచ్చకొట్టుడు కొడతా' అనే డైలాగ్ సూర్య ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. 'అయ్యో వచ్చింది తెలుగోళ్ల దేవుడైతే క్షమాపణ అడగొచ్చు.. కానీ వచ్చింది భద్రుడు.. వీరభద్రుడు.. ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు పడేస్తాడు' అనే డైలాగ్స్ చూస్తే ఫుల్ యాక్షన్ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీనే విలన్‌గా పాత్రలో కనిపించనున్నారు. -
హీరోయిన్ త్రిషకు షాకింగ్ కౌంటర్ : డా.శివరంజని పోస్ట్ వైరల్
అనేక ట్విస్ట్స్ అండ్ టర్న్స్ మధ్య ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ బాధ్యతలు చేపట్టారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంప్రదాయ చీరకట్టులో హాజరైన నటి త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీలం రంగు పట్టుచీరలో, కొప్పున మల్లెలతో కనిపించడమే కాదు, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆనందబాష్పాలతో నిండిన కళ్లతో భావోద్వేగానికి లోనవుతున్న వీడియో సంచలనం రేపింది. ఆ తరువాత తన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. ప్రేమ ఎప్పుడూ గొప్పదే అంటూ ఆమె చేసిన ఇన్‌స్టా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో విజయ్-త్రిష మధ్య ప్రేమానుబంధంపై రకరకాల వాదనలు, పుకార్లు హాట్ టాపిక్‌గా మారాయి.అయితే చిన్నపిల్లల వైద్యురాలు, ఓఆర్ఎస్పై అలుపెరుగని పోరాటం చేసిన హైదరాబాద్‌కు చెందిన డా. శివరంజని ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా త్రిష పోస్ట్‌కు కౌంటర్‌గా ఆమె షేర్ చేసిన ఫోటో చర్చకు దారి తీసింది. ‘ప్రేమ ఎప్పటికీ గొప్పది కాదు. ద్రోహం. విచ్ఛిన్నమైన కుటుంబాల నిశ్శబ్దం బాధాకరం. ముఖ్యంగా పిల్లలకు’ అని అర్థం వచ్చే పిక్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. View this post on Instagram A post shared by Dr Sivaranjani Santosh (@drsivaranjanionline) నెటిజనుల స్పందనవావ్..ఎంత అద్భుతమైన సమాధానం, వావ్. మీపై గౌరవం పదివేల రెట్లు పెరిగింది అంటూ ఆమెను కొనియాడగా, మహిళలు ఆమెనే ఎందుకు నిందిస్తున్నారు, దీనికి ఆ వ్యక్తి ( విజయ్) బాధ్యుడు కాదా? నిజం ఏమిటంటే, ప్రతీ వివాహం శాశ్వతంగా నిలవాలని లేదు. కొన్నిసార్లు విడిపోవడమేమంచిది. ఆరోగ్యకరం కూడా. అందుకే చాలా జంటలు సమాజం కారణంగా కలిసి జీవిస్తాయి. వారు తమలో నింపుకున్న ద్వేషం చాలా లోతుగా పాతుకుపోయి, చాలాసార్లు దానిని పిల్లలకు కూడా అందిస్తారు అని మరొకరు కమెంట్ చేశారు.చిన్నప్పుడు నేను దీనిని అనుభవించాను. అది నా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది, ఇప్పటికీ నన్ను ప్రభావితం చేస్తూనే ఉంది! ఈ విషయాన్ని గట్టిగా చెప్పినందుకు ధన్యవాదాలు అని మరొకరు సమాధానం ఇవ్వడం విశేషం.ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను‘ప్రతి ఒక్కరూ వివాహేతర సంబంధాన్ని సాధారణీకరించి, దాన్ని గొప్పగా కీర్తిస్తుండటం అత్యంత అసహ్య కరమైన విషయం. పిల్లలు మోయబోయే బాధ గురించి ఎవరూ ఆలోచించడం లేదు. పిల్లలు తమ తల్లికి చాలా గట్టిగా అండగా నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లూ భార్య వెన్నెముకలా నిలబడింది, అకస్మాత్తుగా మరో స్త్రీ వచ్చింది. ఇది ఇద్దరి వ్యక్తుల తప్పే. అతను ఎన్నికల్లో గెలిచి ఉండవచ్చు, కానీ తన పిల్లల ముందు ఓడిపోయాడు.ఆమెను వేడుకకు తీసుకువచ్చి, పిల్లలను, భార్యను అవమానించడం అత్యంత ఘోరమైన విషయం.’ ఇది మరో స్పందన.ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?ఒక పిల్లల వైద్యురాలిగా, విడిపోయిన లేదా, విచ్ఛిన్నమైన కుటంబాలలోని పిల్లలు అనుభవించే మానసిక క్షోభ, ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఆమె వ్యాఖ్యలు చేశారని, పిల్లలపై ఆమెకున్న ప్రేమకు ఇది నిదర్శనం అంటున్నారు మరికొందరు. ఇదీ చదవండి: అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్, స్పెషల్ ఏంటంటే? -
విజయ్ సీఎం అయ్యాక త్రిషకు 12 కోట్ల బంపర్ ఆఫర్..?
-
విజయ్ తో లవ్ రూమర్స్.. దిమ్మతిరిగే పోస్ట్ చేసిన త్రిష
-
విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్
తమిళనాడు ముఖ్యమంత్రిగా హీరో విజయ్.. ఆదివారం ఉదయం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు విజయ్ భార్య పిల్లలు రాలేదు. తల్లిదండ్రులు మాత్రమే వచ్చారు. వీళ్లతో పాటు హీరోయిన్ త్రిష కూడా ఆకుపచ్చని చీరలో దర్శనమిచ్చింది. విజయ్ మాట్లాడుతున్నప్పుడు ఈమె ఎమోషనల్ అవుతూ కనిపించింది. ఇకపోతే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత త్రిష పెట్టిన తొలి పోస్ట్ ఆసక్తికరంగా అనిపిస్తోంది.విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం పట్టుచీర కట్టుకొచ్చిన త్రిష.. ఈ చీరని ఎంతో ప్రేమతో డిజైన్ చేశారని చెప్పుకొచ్చింది. ఈ ఫొటోలని షేర్ చేసి 'ప్రేమ ఎప్పుడూ గొప్పదే' అనే క్యాప్షన్ పెట్టింది. ఇది విజయ్‌ని ఉద్దేశించే పెట్టిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫొటోలు వైరల్ అవుతున్నాయి.స్టార్ హీరో విజయ్, త్రిష కలిసి తమిళంలో పలు సినిమాలు చేశారు. అయితే విజయ్ తన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకోవడానికి త్రిషనే కారణమనే కామెంట్స్ చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే విజయ్-త్రిష కలిసి కనిపించడం, ఎన్నికల ఫలితాల తర్వాత త్రిష.. విజయ్ ఇంటికి వెళ్లడం, తాజాగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరవడం లాంటివి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయాయి.(ఇదీ చదవండి: సీఎంగా విజయ్ ప్రమాణం.. త్రిష స్పెషల్ విషెస్) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan)🥺❤️🫂 @trishtrashers getting emotional during CM Joseph Vijay sir’s speech was truly a heart-touching moment ❤️🥹#trishakrishnan #Trisha #vijay #cmvijay #thalapathy #trishaforever #southqueentrisha #ladysuperstartrisha #wonderingwomen pic.twitter.com/3Ofr1zDl4P— Trisha😻Sushma (@Trishkrish_583) May 10, 2026 -
జాక్ పాట్ కొట్టేసిన త్రిష.. రూ. 12 కోట్లు ఆఫర్!
ఊహించనివి జరగడమే ఆశ్చర్యం. అలాంటి ప్రచారమే ఇప్పుడు కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. అదీ నటి త్రిష గురించి. ఈ సంచలన నటి పేరు ప్రజల్లో ఒక జపంలా మరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా త్రిష నటనకు గుడ్‌బై చెప్పబోతున్నారు. రాజకీయ రంగప్రవేశానికి దారులు తెరుసుకుంటున్నాయి వంటి ఆసక్తికరమైన ప్రచారం జోరుందుకున్న విషయం తెలిసిందే. అయితే తాను సినిమాలకు ఎప్పటికీ దూరం కానని, హీరోయిన్ అవకాశాలు రాకపోయినా, ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో జీవితాంతం నటిస్తూనే ఉంటాను అని ఆమె ఇటీవల తన ఇన్‌స్టాలో పేర్కొన్నారు. అదే విధంగా ఇటీవల ఒక తెలుగు చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. కాగా తాజాగా మరో క్రేజీ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేంటంటే నటుడు కమలహాసన్, రజనీకాంత్ కలిసి సుదీర్ఘ కాలం తరువాత కలిసి నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ, క్రేజీ చిత్రాన్ని నెల్సన్ దర్శకత్వంలో రెడ్‌జెయింట్ మూవీస్ సంస్థపై ఇన్బన్ ఉదయనిధి నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో సాంగ్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. మరో రెండు నెలలో ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో నటి త్రిషను హీరోయిన్గా నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. అంతే కాకుండా ఈ చిత్రంలో నటించడానికి ఆమెకు రూ. 12 కోట్లు పారితోషికం అందించడానికి సిద్ధం అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక నిజయం అయితే త్రిష క్రేజ్ మరోసారి మారుమోగడం ఖాయం. కాగా ఇంతకు ముందు నటుడు కమలహాసన్‌కు జంటగా మన్మధన్ అన్బు, తూంగావనం, థక్లైఫ్ చిత్రాల్లో త్రిష నటించారు. అదే విధంగా నటుడు రజనీకాంత్‌తో కలిసి పేట చిత్రంలో నటించారు. ఇప్పుడు వీరిద్దరితో కలిసి నటిస్తే ఆ క్రేజే వేరుగా ఉంటుంది. -
విజయ్ కోసం త్రిష.. ఐస్ బ్లూ సారీలో సడెన్ ఎంట్రీ!
-
దేవుడు-లాయర్‌గా సూర్య.. కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్
తమిళ హీరో సూర్య హిట్ కొట్టి చాలాకాలమైపోయింది. గత రెండు చిత్రాలు 'కంగువ', 'రెట్రో' అయితే ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. వాటితో కాస్త భిన్నంగా చేద్దామని ప్రయత్నించాడు. కానీ వర్కౌట్ కాకపోయేసరికి మళ్లీ కమర్షియల్ రూట్లోకి వచ్చేశాడు. అలా చేసిన సినిమానే 'కరుప్పు'. తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో ఈ గురువారం(మే 14) థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి)ట్రైలర్లోనే దాదాపు స్టోరీ ఏంటనేది చెప్పేసే ప్రయత్నం చేశారు. ఓ కోర్టు. అందులో విలన్(ఆర్జే బాలాజీ), హీరోయిన్(త్రిష) లాయర్స్‌గా పనిచేస్తుంటారు. న్యాయం అంటూ ఎవరొచ్చినా సరే తిప్పించుకుంటూ ఉంటారు. దీంతో దేవుడు అయిన హీరో(సూర్య) లాయర్‌గా వస్తాడు. అటు సామాన్యులకు న్యాయం చేయడంతో పాటు విలన్ బెండు ఎలా తీశాడనేది కథలా అనిపిస్తుంది.సూర్య, త్రిష హీరోహీరోయిన్లు కాగా.. దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీనే విలన్‌గానూ చేశాడు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ప్రస్తుతానికైతే తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు. రేపో ఎల్లుండో తెలుగు ట్రైలర్ కూడా వదులుతారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలు, హీరో విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తదితర విషయాల వల్ల సూర్య సినిమాపై కనీస బజ్ లేకుండా పోయింది. మరి ఇదైనా సూర్యకు సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి?(ఇదీ చదవండి: విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్) -
ఐయామ్ హ్యాపీ.. నా మద్దతు ఎప్పటికీ విజయ్ కే
-
సీఎంగా విజయ్ ప్రమాణం.. త్రిష స్పెషల్ విషెస్
కోలీవుడ్ హీరో విజయ్‌కు హీరోయిన్ త్రిష శుభాకాంక్షలు తెలిపింది. విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణం స్వీకారం సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. విజయ్‌కు నా మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని త్రిష వెల్లడించింది. చెన్నైలోని నెహ్రు స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారానికి హీరోయిన్ త్రిష కూడా హాజరైంది. ఈ కార్యక్రమంలో త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.విజయ్‌తో త్రిష రిలేషన్..ఎన్నికల ముందు నుంచే త్రిష- విజయ్ రిలేషన్లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. విజయ్ భార్య సంగీత కూడా విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. అంతేకాకుండా ఇద్దరు కలిసి జంటగా పెళ్లికి హాజరుకావడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే త్రిష బర్త్ డే రోజున ఎన్నికల ఫలితాలు రావడం.. విజయ్ అత్యధిక సీట్లు గెలవడంతో ఆనందం మరింత రెట్టింపైంది. త్రిషకు విజయ్ బర్త్ డే గిఫ్ట్ అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మరింత కాలం వేచి చూడాల్సిందే. -
సీఎంగా విజయ్.. సందడి మొత్తం త్రిషదే
ఎట్టకేలకు తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారరం చేశాడు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ఇందుకు వేడుకైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అందరికంటే స్పెషల్ అట్రాక్షన్‌గా మాత్రం త్రిష నిలిచింది.పద్దతిగా చీరలో.. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి త్రిష కచ్చితంగా వస్తుందని అంతా భావించారు. అనుకున్నట్లే కాస్త ముందుగానే త్రిష తన తల్లితో కలిసి కార్యక్రమానికి హాజరైంది. పద్దతిగా చీరకట్టులో త్రిష వచ్చిన త్రిష.. పార్టీ కార్యకర్తలను, అభిమానులను నవ్వుతూ పలకరించింది. అప్పటికే వేదిక దగ్గరకు వచ్చిన విజయ్ తల్లిదండ్రులను కలిసింది. విజయ్ తల్లి..త్రిషను హత్తుకొని పలకరించింది. స్టేజ్ ముందు ఏర్పాటు చేసిన మొదటి వరుసలోని కుర్చీల్లో విజయ్ తల్లిదండ్రులతో కలిసి త్రిష కూర్చుంది. ఇక విజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో త్రిష ముఖం సంతోషంతో మరింత మెరిసిపోయింది.ಗ್ಯಾಂಡ್ ಲುಕ್ ನಲ್ಲಿ @actorvijay ಅವರ ಪ್ರಮಾಣವಚನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನಟಿ ತ್ರಿಷಾ#Trisha #Oath #Vijay #tamilnaduelectionresults2026 pic.twitter.com/jySoXvqb3d— Anand Hunashal (@ana_hunashal) May 10, 2026త్వరలోనే పెళ్లి?విజయ్-త్రిష రిలేషన్లో ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరు మాత్రం ఆ విషయాన్ని ఇప్పటివరకు అధికారింగా ప్రకటించలేదు. కానీ విజయ్ సతీమణి సంగీత విడాకులు కోరుతూ.. ఓ నటితో తన భర్త రిలేషన్లో ఉన్నారని ఆరోపణలు చేసినప్పటి నుంచి త్రిష పేరు బయటకు వచ్చింది. సంగీత ఆరోపణలను ఇద్దరూ స్పందించకపోవడం.. పైగా ఓ ఫంక్షన్‌కి కలిసి వెళ్లడంతో పరోక్షంగా రిలేషన్లో ఉన్నామనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు విజయ్ సీఎం అయ్యాడు. ఇక త్వరలోనే త్రిషను పెళ్లి చేసుకొని తమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించాలని విజయ్ భావిస్తున్నాడట. కొన్నాళ్ల పాటు పాలనపై దృష్టి పెట్టి.. అంతా సెట్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. మరి వీరిద్దరు వివాహ బంధంలోకి ఎప్పుడు అడుగుపెడతారో చూడాలి. Tamil Nadu: Actor Trisha Krishnan at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/VmvDUqIjIq— ANI (@ANI) May 10, 2026 -
బ్లాక్ బ్లేజర్లో సీఎం విజయ్... బ్లూ కాంజీవరంలో త్రిష
చెన్నై: ఆరు దశాబ్దాల ద్రవిడ రాజకీయాల ఆధిపత్యానికి తెరదించుతూ, చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. వెండితెర ‘దళపతి’ విజయ్ అధికారికంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ చారిత్రక ఘట్టం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. విజయ్ సరికొత్త ప్రొఫెషనల్ లుక్, ప్రముఖ నటి త్రిష సంప్రదాయ చీరకట్టుతో ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన ఫ్యాషన్ వేడుకగా మారి, నెట్టింట వైరల్‌గా అవుతోంది.ప్రొఫెషనల్ లుక్‌లో ముఖ్యమంత్రి విజయ్తన సాధారణ దుస్తులకు భిన్నంగా, విజయ్ పర్ఫెక్ట్ వైట్ షర్ట్, దానికి నప్పే క్లాసిక్ బ్లాక్ బ్లేజర్, ప్యాంట్‌తో అత్యంత హుందాగా కనిపించారు. ఈ మోనోక్రోమ్ స్టైల్ తమిళనాడు రాజకీయ రంగానికి పర్ఫెక్ట్ కార్పొరేట్ పొలిటికల్ టచ్ ఇచ్చింది. తన సిగ్నేచర్ హెయిర్ స్టైల్, సాల్ట్ అండ్ పెప్పర్ గడ్డంతో విజయ్ అచ్చమైన కొత్త ముఖ్యమంత్రిగా అదరగొట్టారు.బ్లూ కాంజీవరం చీరలో మెరిసిన త్రిషవిజయ్ చిరకాల స్నేహితురాలు, సహనటి త్రిష ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులలో ఒకరు. సముద్రపు నీలం రంగు (టర్కోయిజ్) కాంజీవరం చీరలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్నని బంగారు అంచు ఉన్న ఆ చీరకు మ్యాచింగ్‌గా గోల్డ్-బీజ్ బ్రోకేడ్ బ్లౌజ్ ధరించారు. మధ్యలో కెంపు ఉన్న డైమండ్ చోకర్, దానికి తగ్గ కమ్మలు ఆమె అందాన్ని పదింతలు చేశాయి. దక్షిణ భారత సంప్రదాయం ఉట్టిపడేలా జుట్టును ముడివేసి, మల్లెపూలు పెట్టుకుని త్రిష అద్భుతంగా ముస్తాబయ్యారు.నెట్టింట ట్రెండ్ అవుతున్న ‘గిల్లీ’ జోడీఈ ప్రమాణస్వీకారోత్సవంలో త్రిష ఉత్సాహంగా పాల్గొనడం, ఆమె చిరునవ్వు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆన్-స్క్రీన్‌లో సూపర్ హిట్టయిన ‘గిల్లీ’ జోడీ, ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఇలా కలిసి కనిపించడంతో అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ఇది కూడా చదవండి: విజయ్ నమ్మకం.. కీర్తన బాధ్యత -
విజయ ప్రమాణ స్వీకారంలో తిష సందడి
-
విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా త్రిష (ఫొటోలు)
-
సూర్య అభిమానులు ఫుల్ ఖుషీ...ఎందుకో తెలుసా?
వైవిధ్య భరత పాత్రల్లో నటించాలని తపించే అతికొద్ది మంది నటుల్లో సూర్య ఒకరు. ఈయన ఏ చిత్రం చేసిన తన పాత్రలో కచ్చితంగా కొత్త దనాన్ని చూపిస్తుంటారు. అలా నటించిన కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొంది ఉండకపోవచ్చు. అయితే సూర్య నటన మాత్రం అందరూ కొనియాడతారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కరుప్పు. నటి త్రిష నటించిన ఈ చిత్రాన్ని నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో సూర్య విభిన్న గెటప్పులతో కనిపించడంతో చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చిత్ర ఆడియో విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతోంది. కాగా త్వరలోనే చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. ఇక ఆయన అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్న కరుప్పు చిత్రం ఈనెల 14వ తేదీన తెరపైకి రానుంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రం విడుదల అవుతుందా అన్న సందేహం వ్యక్తం అవుతున్న తరుణంలో నిర్ణయించిన తేదీలోనే చిత్రం విడుదలవుతుందని దర్శకుడు ఆర్జే బాలాజీ స్పష్టంగా పేర్కొన్నారు. ఇకపోతే సూర్య కథానాయకుడిగా నటించిన మరో చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. నటి మమితా బైజు నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై అందర్నీ ఆకట్టుకుంటోంది. కాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటించడంతో సూర్య అభిమానులకు డబల్ ధమాకా కావడంతో యమ ఖుషీ అవుతున్నారు. -
విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ అన్నట్లు తయారైంది. లేటెస్ట్ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ 107 సీట్లు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో 11 సీట్లు అవసరమున్న నేపథ్యంలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది. విజయ్ పలుమార్లు గవర్నర్‌ని కలుస్తున్నా ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ మాత్రం పోవట్లేదు. మరోవైపు విజయ్-త్రిష బంధం గురించి సోషల్ మీడియాలోనూ రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నటి రాఖీ సావంత్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: రష్మికని పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్)'నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి త్రిష నాకు తెలుసు. ఎంతో కష్టపడి ఆమె ఈ స్థాయికి వచ్చింది. విజయ్‌తో కలిసి పనిచేయాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం రాలేదు. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడితో ఒక్క పాటైనా చేయాలని కలలుకన్నాను. కానీ ఛాన్స్ రాలేదు. కనీసం విజయ్-త్రిష మెహందీ వేడుకలో అయినా డ్యాన్స్ చేస్తాను. పెళ్లి చేసుకుంటే ఇద్దరినీ ఒకేసారి కలిసి ఫొటో దిగుతాను' అని రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది.ముఖ్యమంత్రి అయ్యే పనిలో విజయ్ కిందామీద పడుతుంటే రాఖీ సావంత్ మాత్రం త్రిషని అతడు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ వైరల్ అయ్యే పనిలో ఉంది. ఇప్పుడే కాదు గతంలో బిగ్‌బాస్ షోలో పాల్గొన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఏం జరిగినా సరే దానిపై కామెంట్ చేస్తూ ట్రెండ్ అవ్వాలని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా విజయ్-త్రిషపై అలానే ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది.(ఇదీ చదవండి: నిశ్చితార్థ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన అషురెడ్డి) -
త్రిష లేకుండా ఉండుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది
-
త్రిష ఆశలు గల్లంతేనా?
తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకుని సంచలనానికి తెర తీసినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం టీవీకే అధినేత విజయ్‌కు పూటకో తలనొప్పి ఎదురవుతోంది. ఫలితాలు వెల్లడై ఐదు రోజులు గడుస్తున్నా.. సీఎంగా ప్రమాణం చేయకపోవడంతో ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు. పూర్తి బలం(118)తో రావాలంటూ గవర్నర్ తేల్చి చెప్పేయడంతో మద్దతు కూడగట్టే పనిలో మునిగిపోయారు. ఈలోపు.. మరో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. విజయ్‌కు గతంలో పలువురు నటీమణులతో సంబంధాలు ఉన్నట్లు ఉధృతంగా ప్రచారం జరిగింది. అయితే వాటిని ఆయనో, అవతలి తారలో కొట్టిపారేస్తూ వచ్చారు. ఎన్నికలకు కొద్దిరోజులు ముందు.. నటి త్రిషతో ఆయన ప్రైవేట్ టిప్‌కు వెళ్లడం.. చిన్న ‘క్లూ’తో ఆ విషయం బయటకు రావడంతో తమిళనాట సంచలన చర్చ నడిచింది. ఈలోపు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెక్కడంతో ఆ బంధం అఫీషియల్‌గానే బయటపడింది. ఆపై..విజయ్‌తో కలిసి ఓ వివాహ వేడుకకు త్రిష హాజరు కావడం, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాడే ఆమె పుట్టినరోజు కావడం.. ఫలితాల్లో విజయ్ విక్టరీ.. ఆమె స్వయంగా ఇంటికి వెళ్లి విజయ్ను అభినందించడం.. ఇటు త్రిషకు బర్త్‌డే విషెస్ చెప్పే క్రమంలో తారాలోకం విజయ్ ప్రస్తావన తేవడం.. వెనువెంట చర్చనీయాంశాలుగా మారాయి. ఒకవైపు వీళ్ల వ్యక్తిగత జీవితం గురించి చర్చ నడుస్తున్న వేళ.. అనూహ్యంగా త్రిష రాజకీయ అరంగేట్రం టాపిక్ తెరపైకి వచ్చింది.విజయ్ అత్యధిక మెజారిటీతో పెరంబూర్‌లో గెలిచారు. అదే సమయంలో తిరుచ్చి ఈస్ట్‌లోనూ విజయం సాధించారు. రెండింటిలో తిరుచ్చి ఈస్ట్‌కే ఆయన రాజీనామా చేస్తారని టీవీకే వర్గాలు వెల్లడించాయి. అయితే త్రిష టీవీకేలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని.. విజయ్ ఖాళీ చేసే స్థానంలో నటి త్రిషను పోటీ చేయిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రతిపాదన టీవీకే పార్టీ సమావేశంలోనూ జరిగిందని.. ఆమెకు ఏకంగా డిప్యూటీ సీఎం చేయబోతున్నారనే మరో గాలి వార్త చక్కర్లు కొట్టింది.అయితే త్రిషకు రాజకీయాలంటే ఇష్టమే. గతంలో ఏకంగా సీఎం అవ్వాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రకటించారు. అందుకు సంబంధించిన క్లిప్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అంతేకాదు.. విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. ఆయనకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. వీటికి తోడు నాలుగు పదుల వయసులో ఉన్న త్రిషకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె దాదాపుగా రాజకీయాల వైపు వెళ్లవచ్చని అంతా భావించారు.కానీ, ఆమెకు నిరాశే ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ పార్టీకి సంఖ్యా బలం తక్కువగా ఉంది. దీంతో.. చిన్న పార్టీల మద్దతు కోరారు. దళిత వాదంతో పుట్టికొచ్చిన విడుదల చిరుతైగళ్ కట్చి పార్టీ ఈ ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గింది. వామపక్షాలకు దగ్గరగా ఉండడంతో.. ఈ పార్టీ కూడా విజయ్‌కు షరతుల్లేకుండా బయటి నుంచి మద్దతు ఇవ్వొచ్చని అంతా భావించారు. కానీ, ఆఖరి నిమిషంలో వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ పెద్ద మెలికే పెట్టారు.తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని, తన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని, దళిత సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది వీసీకే. వీటితో పాటు విజయ్ వదిలేసే తిరుచ్చి ఈస్ట్‌ను కూడా తమకే వదిలేయాలని టీవీకే ముందు మొత్తం నాలుగు డిమాండ్లు ఉంచింది. వీటిలో మంత్రి పదవితో పాటు ప్రత్యేక చట్టం డిమాండ్లకు విజయ్ ఇప్పటికిప్పుడు సుముఖంగానే ఉన్నట్లు.. మిగతా రెండింటి విషయంలోనే ఆయన తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీసీకే మద్దతు టీవీకేకు ఎంతో కీలకం. ఒకవేళ.. మిగతా రెండు డిమాండ్లకు గనుక విజయ్ అంగీకరిస్తే త్రిష ఆశలు గల్లంతైనట్లేనన్న చర్చ ఇటు తమిళ రాజకీయాలు, అటు సినీ రంగంలోనూ జోరుగా నడుస్తోంది. -
అప్పుడేమో త్రిషపై వివాదాస్పద కామెంట్స్.. ఇప్పుడేమో ఇలా..!
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నోటిదూలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. గతంలో త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. చాలా సినిమాల్లో విలన్ పాత్రలు చేసిన మన్సూర్ ఎక్కువగా రేప్ సీన్స్‌లో నటించానని తెలిపారు. విడయ్ హీరోగా వచ్చిన లియో మూవీలో త్రిషతోను అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నానని వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పలువురు సినీ ప్రముఖులు మండిపడ్డారు. చిరంజీవి, ఖుష్బూతో సహా పలువురు సినీతారలు త్రిషకు మద్దతుగా నిలబడ్డారు. ఆ తర్వాత ఈ వివాదంపై మన్సూర్ కోర్టుకు వెళ్లారు. త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా వేశాడు. అక్కడి అతనికే కోర్టు షాకిచ్చింది. లక్ష రూపాయలు జరిమానా కట్టాలంటూ పిటిషన్ కొట్టవేసింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. త్రిషను మెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని సమర్థించుకున్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే ఎలక్షన్ టైమ్‌లో విజయ్‌కు మద్దతుగా మన్సూర్ నిలిచారు. తొక్కిసలాట టైమ్‌లో విజయ్ను వెనకొసుకొచ్చారు. ఇప్పుడు విజయ్ గెలిచాక మన్సూర్ స్పందించారు. వెంటనే విజయ్ను ఆహ్వానించి సీఎం చేయాలని గవర్నర్‌ను కోరారు. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయవద్దని విజయ్‌ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొబెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించకండి.. రాష్ట్రంలో ఏదీ సక్రమంగా పనిచేయడం లేదు. వెంటనే విజయ్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టండని మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. అప్పుడు త్రిషపై వ్యాఖ్యలతో వివాదానికి కారణమైన మన్సూర్.. ఇప్పుడు విజయ్‌కు మద్దతుగా నిలవడం విశేషం. Don’t create unrest in the state. Nothing is functioning properly in the state. Quickly invite @TVKVijayHQ and make him sit in the CM’s chair! 🙏— Actor Mansoor Ali Khan pic.twitter.com/oM5aRntwkB— Arun Vijay (@AVinthehousee) May 8, 2026 -
'విజయ్ గెలుపునకు.. త్రిషకు సంబంధమేంటి?..' నటి ఆగ్రహం
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే పోటీ చేసిన తొలిసారే ఏకంగా వందకు పైగా సీట్లు సాధించారు. ఇక విజయ్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా ఓకే కానీ.. విజయ్ గెలిచిన తర్వాత త్రిష పేరు కూడా అదే రేంజ్లో వైరలవుతోంది. ఫలితాల రోజు త్రిష బర్త్ డే కావడంతో.. ఈ గెలుపును ఆమెకు పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చాడంటూ తెగ మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా వీరద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని కూడా టాక్ వినిపిస్తోంది. విజయ్ విజయం తర్వాత సీఎం టాపిక్ కంటే..వ్యక్తిగత విషయాలపైనే ఎక్కువ ఫోకస్ నడుస్తోంది.విజయ్- త్రిష పర్సనల్ లైఫ్‌పై వస్తున్న వార్తలపై నటి గాయత్రి శంకర్ స్పందించారు. విజయ్ గెలవడానికి త్రిషనే కారణమని అభినందిస్తున్న వారిని విమర్శించింది. ఒకవేళ పురుషుడి స్థానంలో మహిళ ఉంటే సమాజం ఇలాగే స్పందిస్తుందా అని ప్రశ్నించారు. ఒక నటి తన సహనటుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినట్లయితే ఏ సమాజం ఇలాంటివీ సహించదని ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది. త్రిష స్థానంలో పురుషుడు ఉంటే ఈ విషయాన్ని జోక్‌గా తీసుకునేవారు కాదని.. యావత్తు పురుష సమాజం ఆగ్రహంతో రగిలిపోయేదని అన్నారు. ఆమెను అంతులేకుండా దూషించేవారని గాయత్రి అభిప్రాయపడ్డారు. గెలవడం సంగతి అటుంచితే.. ఆమె తన ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడానికే భయపడిపోయేదని గాయత్రి విమర్శించారు. కాగా.. గాయత్రి శంకర్ 'సూపర్ డీలక్స్', 'విక్రమ్' వంటి చిత్రాలతో కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. -
అలా చేశాడంటే.. విజయ్ పతనం ఖాయం..!
సినిమాలు వేరు.. రాజకీయం వేరు.. అవును ఇది ముమ్మాటికీ నిజమే. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రూవ్ అయింది కూడా. సినీ గ్లామర్‌తో పాలిటిక్స్‌లో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అధికారం చేపట్టలేకపోయారు. తమిళనాడులోనూ కమల్ హాసన్, విజయ్ కాంత్ లాంటి వాళ్లు కూడా నెగ్గలేకపోయారు. కానీ ఊహించని విధంగా దళపతి విజయ్ మాత్రం సక్సెస్ అయ్యాడు. అధికారం కోసం మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా అత్యధిక సీట్లు గెలిచాడు. దీంతో ఒక్కసారిగా విజయ్ పేరు మార్మోగిపోతోంది.ఈ నేపథ్యంలో త్రిష పేరు కూడా హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నికల ముందే వీరిద్దరిపై రూమర్స్ వచ్చాయి. విజయ్ భార్య సంగీత సైతం విడాకుల పిటిషన్ వేయడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని టాక్ వినిపించింది. విజయ్-త్రిష కలిసి పెళ్లికి హాజరు రావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా విజయ్ గెలిచాక త్రిష నేరుగా ఇంటికెళ్లి మరి అభినందనలు తెలిపింది. దీంతో త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. విజయ్ పోటీ చేసిన ఓ స్థానంలో నిలబడుతుందని తమిళనాట హల్చల్ చేస్తోంది. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. పాలిటిక్స్‌లోకి త్రిష ఎంట్రీ ఇస్తే విజయ్ పతన ఖాయమని అంటున్నారు. అదేలాగో తెలుసుకుందాం.త్రిష ఎంట్రీతో విజయ్‌కి దెబ్బ..రాజకీయాల్లో సీఎం కుర్చీ అనేది అంత ఈజీ కాదు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. పాలిటిక్స్‌లో వ్యక్తిగత విషయాలను తీసుకురాకపోవడమే మంచింది. త్రిషతో రిలేషన్ ఉన్నంత మాత్రాన ఆమెను రాజకీయాల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ అదే జరిగితే విజయ్‌పై చెడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది. ఎందుకంటే విజయ్‌కు మాత్రమే తమిళ ప్రజలు ఓటేశారు. అంతేకానీ త్రిషను చూసి కాదు. ఆమెను తీసుకొస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ఇదంతా పాలన ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో బీజేపీ నేత నాగేంద్రన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. అప్పట్లో త్రిషకు మద్దతు లభించినా.. ఆమెను విజయ్ రాజకీయంగా ప్రమోట్ చేస్తే మాత్రం ప్రజా వ్యతిరేకతకు కారణమవుతుంది. ఈ విషయంలో విజయ్ చాలా అప్రమత్తంగా ఉండాలి.వ్యక్తిగతం వేరు.. రాజకీయ జీవితం వేరుతిరుచ్చి ఈస్ట్ స్థానానికి విజయ్ రాజీనామా చేయాల్సిందే. ఆ నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యం ఉన్న ప్రాంతం కావడం విశేషం. అక్కడ విజయ్ను చూసి మాత్రమే ఓటేశారు. అదే స్థానంలో త్రిషను నిలబెడితే ఆదిలోనే విజయ్‌కు దెబ్బపడే అవకాశముంది. అధికారం చేపట్టిన పార్టీ తొలి ఉపఎన్నికలోనే ఓడిపోతే ఆ ప్రభావం పాలనపై పడుతుంది. ఈ ప్రయోగం విఫలమైతే.. అది కేవలం ఒక సీటు ఓటమి మాత్రమే కాదు.. విజయ్ రాజకీయ పతనానికి సంకేతంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ద్రవిడ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని విజయ్ ముందుకెళ్లాలి. రాజకీయాలతో పర్సనల్ లైఫ్‌ను ముడిపెట్టకుండా పాలన సాగిస్తే విజయ్‌కే మంచిదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
విజయ్ రాజీనామా డిప్యూటీ సీఎంగా త్రిష?
-
విజయ్ కు తోడుగా త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్ బై ?
-
'వాట్ ఏ గిఫ్ట్'.. త్రిషకు రాధికా, ఛార్మి బర్త్ డే విషెస్..!
తమిళనాడులో విజయ్ గెలుపు తర్వాత ఆమెపైనే అందరి దృష్టి పడింది. ఎన్నికల ముందు నుంచే ఆమెపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. విజయ్‌తో రిలేషన్లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయినా తాను ఎక్కడా స్పందించకుండా సైలెంట్‌గానే ఉండిపోయింది. తాజాగా ఎన్నికల్లో విజయ్ విజయంతో అందరు త్రిష పేరునే జపిస్తున్నారు. ఫలితాల రోజే త్రిష బర్త్ డే కావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ విజయం త్రిషకు విజయ్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ సైతం విజయ్- త్రిష రిలేషన్ కన్ఫామ్ చేసింది. త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. వాట్ ఏ గిఫ్ట్ అంటూ రాసుకొచ్చింది. టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి సైతం త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. దర్శకుడు పూరి జగన్నాధ్, త్రిషతో దిగిన ఫోటోను షేర్ చేసింది. మీ ప్రత్యేకమైన రోజున ప్రత్యేక వేడుక.. మీరు మా అదృష్ట దేవత.. ఈ పుట్టినరోజు చరిత్ర పుస్తకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నా చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఛార్మి పోస్ట్ చేసింది. టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు కూడా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. డబుల్ సెలబ్రేషన్ అంటూ పోస్ట్ చేసింది.కాగా.. త్రిష తన పుట్టినరోజు ఉదయాన్ని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఆమె చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లారు. టీవీకే విజయం సాధించడంతో విజయ్ను ప్రత్యేకంగా కలిశారు. దీంతో విజయ్-త్రిష రిలేషన్‌పై అభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే విజయ్ సతీమణి విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో జూన్ 15న విచారణకు రానుంది. కాగా.. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ స్థాపించిన టీవీకే 108 స్థానాలను గెలిచింది. -
హాట్‌టాపిక్‌గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..!
త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం.. సరిగ్గా అదే సమయానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అదీగాక ఇవాళ త్రిష పుట్టిన రోజు కూడా కావడం ఈ సందర్శన మరింత హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ నటి త్రిష కలియుగ దైవమైన ఆ తిరుపతి వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చిన విధానం అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. త్రిష అజా ఫ్యాషన్స్‌కు చెందిన వైట్‌సూట్‌తో అలరించింది. దీని ధర రూ. 12000 పైనే పలుకుతుందట. వినెక్‌తో కూడిన ఐవరీ కలర్ చేనేత వస్త్రం. ముఖ్యంగా ఈ వేసవి వేడికి ఆహ్లాదకరమైన హాయినిచ్చే కాటన్ కూడా ఇది. దీనికి తేలికపాటి ఫ్లోరల్ దుపట్టా ఈ డిజైనర్‌వేర్‌ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆలయాన్ని సందర్శించిన అనంతరం, త్రిష కృష్ణన్ చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, తమిళనాడు,పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల రోజు త్రిష ఆమె ఆలయ సందర్శన రెండూ ఏకకాలంలో జరగడం కూడా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అదీగాక పోల్ ట్రెండ్స్ ప్రకారం, విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) సంచలన విజయాన్ని నమోదు చేయడం విశేషం.తిరుమల ఆలయం విశిష్టత..ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో ఉన్న వెంకటేశ్వర ఆలయం, వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది అత్యంత సంపన్నమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. పైగా శేషాచలం కొండలపై ఉన్న అత్యంత ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం. కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన ప్రముఖ క్షేత్రం. ఏడు కొండలపైన కొలువైన శ్రీనివాసుడు, కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటూ, ప్రపంచంలోనే అత్యధిక భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రంగా అలరారుతోంది. ఇక్కడ మూలవిరాట్టు స్వయంభూగా వెలిశారని భక్తుల నమ్మకం.#WATCH | Andhra Pradesh: Actor Trisha Krishnan had the darshan of Lord Sri Venkateswara Swamy at Tirumala Tirupathi Devasthanam earlier this morning. pic.twitter.com/mhiaHMOu5l— ANI (@ANI) May 4, 2026 (చదవండి: 46 దేశాలు పర్యటించా..కానీ భారత్ పర్యటన..!) -
విజయ్ విజయం త్రిష సంచలన కామెంట్స్
-
విజయ్ సీఎం.. డిప్యూటీ సీఎంగా త్రిష..!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తొలిసారి సింగిల్‌గా బరిలోకి దిగి మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్తున్నారు. ఊహించని విధంగా అధికార డీఎంకేతో పాటు ఏఐడీఎంకే పార్టీలకు గట్టి షాకిచ్చాడు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి చూపు తమిళనాడుపై పడింది. ద్రవిడ రాజకీయాల్లో పోటీ చేసిన తొలిసారే సంచలనం సృష్టించిన విజయ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్‌కు అభినందనలు చెబుతున్నారు. హీరోయిన్ త్రిష సైతం ఇంటికి వెళ్లి విజయ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే త్రిష గురించి నెట్టింట చర్చ మొదలైంది. త్రిష సైతం రాజకీయాల్లో అడుగుపెట్టనుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. త్రిష ఏకంగా డిప్యూటీ సీఎం కానుందని మరో టాక్ వైరలవుతోంది. విజయ్ పోటీచేసిన రెండు స్థానాల్లో గెలిస్తే.. ఒక్కచోట రాజీనామా చేయాల్సిందే. అదే సమయంలో విజయ్ రాజీనామా చేసిన స్థానంలో త్రిష పోటీ చేస్తారని లేటేస్ట్ టాక్. అలా ఎన్నికల్లో గెలిచి హీరోయిన్ త్రిష ఏకంగా డిప్యూటీ సీఎం అవుతారని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. హీరో విజయ్ తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్‌లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు ఎన్నికల ముందు త్రిష- విజయ్‌పై రూమర్స్ పెద్దఎత్తున వైరలయ్యాయి. విజయ్ భార్య విడాకుల పిటిషన్ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. విజయ్- త్రిష ఓ పెళ్లికి హాజరు కావడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఏదేమైనా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపుతో ఒక్కసారిగా అందరి దృష్టి త్రిషపై పడింది. తమిళనాట త్రిష ప్రయాణం ఎలా ఉండనుందో మరికొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.ఇక త్రిష సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవి సరసన విశ్వంభరలో కనిపించనుంది. -
దళపతి విజయ్ ఇంటికి చేరుకున్న హీరోయిన్
-
విజయ్ ఇంటికి చేరుకున్న త్రిష..
-
టీవీకే విజయ్ నివాసానికి నటి త్రిష
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. అసెంబ్లీ ఫలితాల్లో టీవీకే ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్ నివాసానికి చేరుకున్న నటి త్రిష.. ఎన్నికల్లో విజయంపై విజయ్‌కు త్రిష అభినందనలు తెలిపారు. ఇవాళ త్రిష బర్త్‌డే.. ఉదయం తిరుమలలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తిరుమల నుంచి నేరుగాచెన్నైకు వెళ్లిన త్రిష.. విజయ్‌కు విషెస్ చెప్పారు.త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం.. సరిగ్గా అదే సమయానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.#WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan arrives at the residence of TVK chief Vijay, in Chennai. TVK is currently leading in 106 seats of the total 234 in the state. pic.twitter.com/Sezg1xgYDQ— ANI (@ANI) May 4, 2026ఆదివారం రాత్రి తన తిరుమల పర్యటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన త్రిష.. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా, సామాన్య భక్తురాలిలా ఆమె శాంతియుతంగా పూజలు నిర్వహించారు. కాగా, చెన్నైలోని విజయ్ ఇంటికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. విజయ్ ఇంటి దగ్గర బాణాసంచా పేల్చి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చెన్నైలోని విజయ్ నివాసంలో కుటుంబసభ్యులు సంబరాలు చేసుకున్నారు. -
టాలీవుడ్ రీఎంట్రీలో త్రిషకు 'సినిమా' కష్టాలు
త్రిష.. తెలుగులో చాలా సినిమాలు చేసిన స్టార్ హీరోయినే. కానీ గత పదేళ్లలో టాలీవుడ్లో నటించలేదు. చేసిన ఒక్క మూవీ 'విశ్వంభర' కూడా ఎప్పుడో రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ టీమ్, ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్‌లో త్రిష)'వర్షం'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష.. తర్వాత చిరంజీవి, మహేశ్, ప్రభాస్, పవన్ కల్యాణ్, రవితేజ తదితర స్టార్ హీరోలతో కలిసి నటించింది. 2016లో చివరగా 'నాయకి' మూవీ చేసింది. ఆ టైంలో ఇక ఈమె కెరీర్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ '96' అనే తమిళ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చింది. అనంతరం పొన్నియిన్ సెల్వన్ లాంటి భారీ బడ్జెట్ మూవీస్ చేసింది. ఈ క్రమంలోనే చిరంజీవి 'విశ్వంభర' కోసం ఈమెని హీరోయిన్గా తీసుకున్నారు.2023లో విశ్వంభర చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి సెట్స్ మీదే ఉన్న ఈ మూవీ ఎప్పుడొస్తుందో తెలియట్లేదు. తాజాగా జూలైలో రిలీజ్ కావొచ్చని రూమర్స్ వచ్చాయి గానీ త్రిష పుట్టినరోజు విషెస్ చెబుతూ వదిలిన పోస్టర్లో డేట్ ఏం లేదు. అంటే ఇంకా విడుదల తేదీ ఫిక్స్ కాలేదనమాట. చూస్తుంటే త్రిషకు టాలీవుడ్ రీఎంట్రీ విషయంలో సినిమా కష్టాలు చాలానే ఉన్నాయనిపిస్తోంది.పీరియాడిక్ ఫాంటసీ అడ్వెంచర్ కథతో తీసిన 'విశ్వంభర'లో త్రిష హీరోయిన్ అయినప్పటికీ ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా తదితర హీరోయిన్లు కూడా ఇతర పాత్రల్లో నటించారు. వశిష్ఠ దర్శకుడు కాగా కీరవాణి సంగీతమందించారు. యువీ క్రియేషన్స్ రూ.400 కోట్ల బడ్జెట్ పెట్టేసింది గానీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతోనే రిలీజ్ ఎప్పుడో దర్శకనిర్మాతలు కూడా చెప్పలేకపోతున్నారు.(ఇదీ చదవండి: త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందా?)Team #Vishwambhara wishes the gorgeous @trishtrashers a very Happy Birthday ❤️Her portrayal of ‘Avani’ will be elegant and enchanting ✨MEGA MASS BEYOND the UNIVERSE 🌟In Cinemas Soon 💫MEGASTAR @KChiruTweets @trishtrashers @DirVassishta @AbhishekOfficl @UV_Creations… pic.twitter.com/HbP8PgeMm9— UV Creations (@UV_Creations) May 4, 2026 -
త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందా?
సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు అవినాభావ సంబంధముంది. ఎందుకంటే స్టార్స్‌గా చెలామణీ అయిన చాలామంది.. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అక్కడాఇక్కడా అని కాకుండా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి స్టార్ హీరో దళపతి విజయ్ చేరబోతున్నాడు. తమిళనాడులోని అధికారం చేజిక్కుంచుకునే దిశగా విజయ్ టీవీకే పార్టీ ఆధిక్యం చూపిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో టీవీకే హవా బలంగా కనిపిస్తోంది. ఇదే టైంలో త్రిష, రాజకీయ రంగప్రవేశంపై కూడా చర్చ జరుగుతోంది.(ఇదీ చదవండి: దళపతి విజయ్‌కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)టీవీకే అధికారం దక్కించుకోవడం దాదాపు ఖాయం! అదే జరిగితే హీరో విజయ్ ముఖ్యమంత్రి అవుతారు! ఇకపోతే ఎన్నికలు జరగడానికి ముందు విజయ్ విడాకుల వ్యవహారం చర్చనీయాంశమైంది. అదే టైంలో త్రిషతో కలిసి జంటగా విజయ్ ఓ పెళ్లికి హాజరవడం వీళ్ల గురించి వినిపించిన రూమర్స్ నిజమేనేమో అనే సందేహాలు కలుగజేసింది. ఒకవేళ విజయ్ అధికారం దక్కించుకుంటే త్రిష కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుందా అనిపిస్తుంది.ఎందుకంటే గతంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రిష.. సరదాగానే అన్నప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకొచ్చింది. మరి సీఎం కాకపోవచ్చు గానీ విజయ్ తలుచుకుంటే ఈమెకు కచ్చితంగా ఏదో ఒక పదవి ఇవ్వకపోడా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి త్రిష మనసులోనూ రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఏమైనా ఉందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది.ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే గెలవడం దాదాపు ఖాయంలానే కనిపిస్తుంది. చిత్రం ఏంటంటే ఈరోజే త్రిష పుట్టినరోజు కూడా. తిరుమల వెళ్లి ఉదయమే వేంకటేశ్వర స్వామిని ఈమె దర్శించుకుంది. అయితే విజయ్ కోసమే ఈమె తిరుమల వెళ్లిందని, ప్రత్యేక పూజలు కూడా చేసిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్‌లో త్రిష)Happy birthday to the Chief Minister of Tamil Nadu. #Trisha 🔥🥶#HBDTrisha ❣#HBDSouthQueenTrisha 💥 pic.twitter.com/SvSkDR7nm1— CricFDFS (@lokiMSD93) May 4, 2026 -
తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్‌లో త్రిష
తమిళనాడులో ఊహించని అధికార మార్పు దాదాపు ఖాయంలానే కనిపిస్తుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్‌లోనూ డీఎంకే పార్టీకే మరోసారి అధికారం దక్కొచ్చని చాలామంది అంచనా వేశారు. విజయ్ టీవీకే పార్టీ కొన్ని సీట్లు గెలుచుకోవచ్చని భావించారు. కానీ ప్రస్తుతం ఊహించనవి జరుగుతున్నాయి. టీవీకే పార్టీ ఈ స్టోరీ రాసే సమయానికి 100 సీట్లకు మించి ఆధిక్యంలో కొనసాగుతోంది. కానీ ట్రెండింగ్‌లో మాత్రం త్రిష ఉంది.(ఇదీ చదవండి: విజయ్‌కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)విజయ్, త్రిష కలిసి పలు సినిమాలు చేశారు. అయితే సరిగ్గా ఎన్నికల ముందు విజయ్ విడాకుల వ్యవహారం బయటకు రావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. విజయ్-త్రిష రిలేషన్లో ఉన్నారనే రూమర్స్ వచ్చాయి. సరిగ్గా ఆ టైంలో ఓ పెళ్లికి వీళ్లిద్దరూ కలిసి వెళ్లడం హాట్ టాపిక్ అయిపోయింది.నేడు(మే 04) ఎన్నికల ఫలితాల లెక్కింపు మాత్రమే కాదు. త్రిష పుట్టినరోజు కూడా. ఈ క్రమంలోనే ఆమె తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. అయితే విజయ్ కోసమే ఆమె తిరుపతి వెళ్లిందని మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేయించిందని అంటున్నారు. ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్.. త్రిష గురించి చేసి ట్వీట్ వైరల్ అవుతోంది.'ఆ తిరుమల వేంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది. కంగ్రాట్స్ త్రిష' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. విజయ్‌ని ఉద్దేశించే ఇతడు ఈ ట్వీట్ చేశాడని మాట్లాడుకుంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఏకంగా సీఎం కావాలని ఉందని చెప్పింది. అప్పుడు సరదాగానే అని ఉండొచ్చు. కానీ వినిపిస్తున్న రూమర్స్, విజయ్ అధికారం చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తుండటంతో త్రిష కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏమైనా ఎంట్రీ ఇస్తుందా అని కూడా మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఇదేం చిత్రం.. ఇంట ఓడి రచ్చ గెలుస్తున్నాడు!) -
తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ.. తిరుమలలో త్రిష ప్రత్యేక పూజలు (ఫొటోలు)
-
ట్రెండింగ్: తమిళనాడు రిజల్ట్.. తిరుమలలో హీరోయిన్ త్రిష
ప్రముఖ హిరోయిన్ త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం.. సరిగ్గా అదే సమయానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవాళ ఆమె (మే 4, సోమవారం) ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.ఆదివారం రాత్రి తన తిరుమల పర్యటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన త్రిష.. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా, సామాన్య భక్తురాలిలా ఆమె శాంతియుతంగా పూజలు నిర్వహించారు.తమిళనాడు ఎన్నికల ఫలితాల రోజే త్రిష తిరుమలకు వెళ్లడంతో.. ఆమె విజయ్ పార్టీ విజయం కోసమే ఈ మొక్కులు చెల్లించుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి కావడంతో.. ఆయన సన్నిహితురాలైన త్రిష పర్యటనపై అభిమానులు పలు కామెంట్లు చేస్తున్నారు. -
త్రిష షాకింగ్ ట్వీట్.. ఇలా అవమానిస్తారా?
సినిమాల్లో నటించడమే కాదు దాన్ని ప్రమోషన్స్‌లో పాల్గొనడం కూడా హీరోహీరోయిన్ల బాధ్యత. ఇప్పుడు చాలా మంది ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటున్నారు. షూటింగ్ అయిపోయిందా.. ప్యాకప్ చెప్పేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లలో చాలా మంది ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటున్నారు. అందులో త్రిష కూడా చేరిందని మొన్నటి వరకు ప్రచారం సాగింది. సూర్య హీరోగా నటించిన ‘కరుప్పు’(తెలుగులో వీరభద్రుడు) మూవీలో త్రిష హీరోయిన్గా చేసింది. మే 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రిష హాజరుకాకపోవడంతో..ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. మూవీ ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటుందని కొంతమంది నెటిజన్స్ విమర్శిస్తూ కామెంట్ చేశారు. అయితే అసలు విషయం ఏంటంటే.. అసలు ఆడియో లాంచ్ ఈవెంట్‌కి త్రిషకు ఆహ్వానమే అందలేదట. ఈ విషయాన్ని త్రిష పరోక్షంగా చెబుతూ.. ‘కరుప్పు’ టీమ్‌పై సెటైర్లు వేసింది.త్రిష లుక్ వైరల్కరుప్ప మేకర్స్ తాజాగా త్రిషకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఆమె 'ప్రీతి' అనే లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. 37 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో త్రిష కోర్టు రూమ్‌లో సీరియస్ లాయర్‌గా, మరో సీన్లో ఆకుపచ్చ చీరలో డ్యాన్స్ చేస్తూ మెరిశారు. 43 ఏళ్ల వయసులోనూ మరింత అందంగా కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. త్రిష ఇంత యంగ్‌గా ఎలా ఉందంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.నేను కూడా మర్చిపోయా.. అయితే ఓ అభిమాని త్రిష లుక్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. ‘కరుప్పు సినిమాలో త్రిష ఉందన్న విషయమే మర్చిపోయాను. ఆమె ఏజ్ రివర్స్ గేర్‌లో వెళ్తోంది" అని ట్వీట్ చేశారు. దానికి త్రిష ఇలా రిప్లై ఇచ్చింది. "ధన్యవాదాలు. నేనూ మర్చిపోయాను. కనీసం ఇప్పటికైనా వారు ఇలా గుర్తు చేసినందుకు సంతోషంగా ఉంది’ అని వ్యంగ్యంగా పేర్కొంది. ఇన్విటేషన్ మిస్ అయిందేమోదీనిపై సూర్య అభిమాని స్పందిస్తూ.. ‘ఆడియో లాంచ్‌కే రాని మీకు ఇంత వెతకారం అవసరమా?’ అని ప్రశ్నించారు. దానికి త్రిష బదులిస్తూ.. ‘నా ఇన్విటేషన్ బహుశా మెయిల్లో ఎక్కడో మిస్ అయ్యి ఉంటుందిలే’ అంటూ తనను ఆ వేడుకకు తనను ఆహ్వానించలేదనే విషయాన్ని పరోక్షంగా చెప్పింది. ఆడియో లాంచ్ పోస్టర్లలో ఆమె పేరున్నప్పటికీ, పిలవకుండా పోస్టర్లు వేస్తే ఎలా వస్తారని ఆమె మద్దతుదారులు వాదిస్తున్నారు.‘చెత్త ప్రొడక్షన్ హౌస్.. ఒక స్టార్ హీరోయిన్ని ఇలా అవమానిస్తారా?’, ‘సూర్య ఈ విషయంపై స్పదించాలి’ అని కామెంట్ చేస్తున్నారు. Thank you ☺️ Even I forgot.Good to know they set a reminder now atleast😅 https://t.co/vAgpPJiJJ9— Trish (@trishtrashers) May 1, 2026 -
అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటా: త్రిష
ఇటీవల సెంటర్ ఆఫ్ ది మీడియాగా మారిన నటి త్రిష.. చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ హాట్‌టాపిక్‌గా మారారు. దీంతో ఆమె సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. రెండు దశాబ్దాలకు పైగా దక్షిణాది ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న త్రిష.. కోలీవుడ్‌లోని అతి కొద్దిమంది మోస్టెస్ట్ బ్యాచిలర్ నటీమణుల్లో ఒకరు. ఈ విషయం కూడా ఈమెను వార్తల్లో నిలబెట్టడానికి ఒక కారణం కావచ్చు. నటుడు, తమిళగ వెట్రికళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఫ్రెండ్ కావడంతో ఈమె రాజకీయాల్లోనూ ఎక్కువగా నానుతున్నారు. దీంతో త్రిష రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్నారని, సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారని ప్రచారం జోరుగా సాగింది. అయితే నటనకు స్వస్తి చెప్పడం లేదని చెప్పే విధంగా ఇటీవలే ఒక తెలుగు చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. ఈమె మిత్రులతో కలిసి ఎంజాయ్ చేసే ఫొటోలు తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. త్రిష రాత్రి వేళ మేలుకుని ఉంటారనే ప్రచారం ఉంది. ఇటీవల త్రిష తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో గంట నిద్ర కోల్పోతే, దాని నుంచి రికవరీ అవడానికి 4 రోజులు పడుతుంది. ఈ ప్రకారం లెక్కలు కడితే 2062 సంవత్సరంలోనే నేను ప్రశాంతంగా జీవిస్తాననే భావన కలుగుతోంది అని పేర్కొన్నారు. దీంతో త్రిష మాటల్లో అర్థం ఏమిటి ? అనే చర్చ జరుగుతోంది. త్రిషకు సరిగా నిద్ర పట్టడం లేదా, ఆమె మానసిక రుగ్మతకు లోనౌతున్నారా..? వంటి ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తున్నారు. -
నటి త్రిషకు వార్నింగ్.. రంగంలోకి దిగిన పోలీసులు
ఇటీవల సినీ సెలబ్రిటీ ఇళ్లలో బాంబు బెదిరింపు కాల్స్ అధికం అవుతున్నాయనే చెప్పాలి. రెండు రోజుల క్రితం స్థానిక పోయస్ గార్డెన్‌లోని నటుడు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో బాంబు పెట్టినట్లు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు ఆగంతకుడి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో హుటాహూటిన పోలీసులు తమ టీమ్‌తో పాటు పోయస్ గార్డెన్‌కు వెళ్లి సర్చింగ్ చేశారు. కొన్ని గంటల పాటు నటుడు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అయితే ఎక్కడ బాంబులు పెట్టిన జాడ తెలియకపోవడంతో అది బాంబు బూచి అని తెలిసింది. తాజాగా స్థానిక తేనాంపేటలోని నటి త్రిష ఇంట్లో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో స్థానిక తేనాంపేట పోలీసులు, బాంబు స్క్వాడ్ నిపుణులు, డాగ్స్‌తో పాటు నటి త్రిష ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబులు కనిపించకపోవడంతో తప్పుడు సమాచారం ఇచ్చిన ఆగంతకుడి కోసం గాలిస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇలాంటి ఫేక్ కాల్స్ చేసిన వారిని పట్టుకునేపనిలో ఉన్నారు. -
ప్రాణం తీసిన స్నానం సరదా
సాక్షి, పాడేరు: సరదాగా స్నానం చేసేందుకు జలపాతంలో దిగిన ముగ్గురు గిరిజన యువతులు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతిచెందారు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. హుకుంపేట మండలం మారుమూల బూర్జ పంచాయతీ జంబువలస గ్రామానికి చెందిన గిరిజన యువతులు సాలెపు త్రిష (17), సాలెపు పవిత్ర (16), సాలెపు రత్నకుమారి(16) అంజలి కలిసి అనంతగిరి మండలం వాలాసి పంచాయతీలోని ములగుమ్మి జలపాతం వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. గ్రామంలో ఇటుకల పండుగ కావడంతో నలుగురు యువతులు జలపాతం వద్ద ఉత్సాహంగా గడిపారు. త్రిష, పవిత్ర, రత్నకుమారి జలపాతంలోకి దిగి స్నానాలు చేస్తుండగా, అంజలి ఒడ్డున పెద్ద బండరాయిపై నిల్చుని సెల్ఫోన్లో వారిని ఫొటోలు తీస్తోంది. అయితే, త్రిష, పవిత్ర, రత్నకుమారి ప్రమాదవశాత్తూ జారి జలపాతంలో పడిపోయారు. ముగ్గురూ నీటిలో మునిగి మృతిచెందారు. వారు మునిగిపోయారనే కంగారులో అంజలి బండరాయి నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న జంబువలస గ్రామానికి చెందిన గిరిజనులంతా జలపాతం వద్దకు చేరుకుని ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన అంజలిని అనంతగిరి మండలంలోని లుంగపర్తి పీహెచ్‌సీకి తరలించారు. మృతిచెందిన త్రిష హుకుంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసింది. రత్నకుమారి అనంతగిరి మండలం బీంపోల్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతూ పదో తరగతి పరీక్షలు రాసి ఇటీవలే స్వగ్రామానికి వచ్చింది. ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన ముగ్గురు గిరిజన యువతులు మృతిచెందడంతో జంబువలస గ్రామంలో విషాదం నెలకొంది.వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మి జలపాతంలో ప్రమాదవశాత్తూ పడిపోయి ముగ్గురు యువతులు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముగ్గురు యువతుల మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవలే ఇంటర్మీడియెట్, టెన్త్ పరీక్షలు రాసి మంచి భవిష్యత్తు కోసం కలలు కంటున్న విద్యార్థినులు ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. ఈ కష్టకాలంలో మృతుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. -
భార్యతో విడాకులు.. త్రిషపై రూమర్స్.. విజయ్ షాకింగ్ కామెంట్స్
-
అతన్ని పెళ్లి చేసుకున్నా.. పిల్లల్ని కూడా కన్నాను : త్రిష పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఇప్పుడు నెట్టింట ఎక్కువగా వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్, టీవీకే అధినేత విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. విజయ్‌తో త్రిష రిలేషన్‌తో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ఓ ఫంక్షన్‌కి హాజరవ్వడంతో.. ఈ పుకార్లు ఇంకా ఎక్కువైయ్యాయి. త్వరలో పెళ్లి చేసుకుంటారని..ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి..రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ కూడా త్రిష ఇకపై నటించబోదని చెప్పడంతో మరోసారి త్రిషపై నెట్టింట చర్చ జరిగింది. దీనిపై త్రిష తనదైన శైలీలో స్పందించింది. చిత్రా లక్ష్మణ్ వాఖ్యలకు కౌంటర్‌గా ‘అవును నేను సినిమాలు మానేసి, ఒక ధనవంతుడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని, నిన్నటికి రెండేళ్లు నిండిన నలుగురు కవలలను పెంచుతున్నాను. మీ ఊహాగానాలకు ఇది సరిపోతుందా? ఈ రోజు వార్తలు రాసుకోవడానికి ఇది సరిపోతుందా లేదా ఇంకా ఏదైనా జోడించమంటారా?’ అని త్రిష ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌తో ఆమె సినిమాలు మానేసిందనేది పుకారు మాత్రమేనని తేలిపోయింది. త్రిష సినీ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అమె ‘కరుప్పు’(తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తోంది. తెలుగులో చిరంజీవి సరసన నటించిన విశ్వంభర రిలీజ్‌కు రెడీ అవుతుంది. దేవిధంగా మలయాళంలో మోహన్‌లాల్ కు జంటగా రామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇవన్నీ గత ఏడాది, అంతకు ముందు ఏడాది అంగీకరించిన చిత్రాలు అన్నది గమనార్హం. -
రూమర్స్ వేళ ప్రేమ గురించి త్రిష కొటేషన్
కొద్దిరోజులుగా నటి త్రిష పేరు నెట్టింట వైరల్ అవుతుంది. టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నారంటూ కోలీవుడ్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ఆపై తమిళనాడు బీజేపీ నేత నాగేంద్రన్ త్రిషపై నోరుపారేసుకుని ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఒక నటితో విజయ్ సహజీవనం చేస్తున్నాడని ఆయన సతీమణి సంగీత సంచలన ఆరోపణలు చేయడంతో త్రిష పేరును కొందరు తెరపైకి తీసుకొచ్చారు. అలా తన ప్రేమేయం లేకుండానే త్రిషకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.త్రిష పట్ల ఇప్పటికీ రూమర్స్ వస్తున్న సమయంలో ప్రేమకు సంబంధించిన ఓ కోటేషన్‌ను సోషల్‌మీడియాలో త్రిష పోస్టు చేశారు. 'ప్రతిదీ ప్రేమ కాదు. కానీ, ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదు' అని చెబుతూనే ‘ఫ్యాక్ట్’ (వాస్తవం) అని పేర్కొన్నారు. దీంతో నెట్టింట ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. తనపై రూమర్స్ వస్తున్న సమయంలో ఇలాంటి కొటేషన్‌ను ఆమె ఎందుకు షేర్ చేశారని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
పెయిన్‌తోనే విజయ్, త్రిషలపై కామెంట్ చేశా: సముద్రఖని
టీవీకే అధినేత విజయ్, త్రిష వివాదానికి సంబంధించి వైరల్ అయిన తన వ్యాఖ్యల వివాదంపై నటుడు, దర్శకుడు సముద్రఖని తాజాగా స్పందించారు. తాను నటించిన ‘కార్మేని సెల్వం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. విజయ్‌పై తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, సందర్భానికి సంబంధం లేకుండా వాటికి వక్రీకరణలు చేశారని ఆయన అన్నారు. తాను నిజాయితీగా మాట్లాడానని, ఎవరినీ అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన ఆలోచనలను వ్యక్తం చేసినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేశారని క్లారిటీ ఇచ్చారు. 'పాత వీడియోలో నేను మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి మొదటి నుంచి కాకుండా మధ్యలో వీడియో రికార్డ్ చేశారు. అయితే, తను రికార్డ్ చేస్తున్నాడు కదా అని నేను మాట్లాడటం ఆపలేదు. విజయ్ మొదట సపోర్ట్ ఇచ్చింది నేనే.. కాబట్టే కాస్త నాకు పెయిన్గానే ఉంటుంది.' అని వివరించారు.ఏం జరిగిందంటే..?విజయ్, త్రిష ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇదే అంశం గురించి సముద్రఖని కొందరితో చర్చిస్తన్న వీడియో వైరల్ అయింది. వారిద్దరి తీరుపై సముద్రఖని తన అసంతృప్తిని బయటపెట్టారు. 'ఇదేమైనా ఆటా..? వ్యక్తిగత విషయాలను ఇలా బయటపెట్టాలా..? ఎవరి మీద పగ తీర్చుకుంటున్నారు..? అంతా సవ్యంగ జరుగుతున్న సమయంలో ఇలాంటివి అవసరమా..? ఈ కారణంతో పార్టీలోని కొందరు సపోర్టర్స్ వెళ్లిపోతున్నారు' అని ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ వీడియో కాస్త వైరల్ అయింది. -
'అలా చేయడం చాలా అసహ్యాంగా ఉంది'.. మంచు విష్ణు పోస్ట్ వైరల్
తమిళనాడు రాజకీయాలపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్ చేశారు. పాలిటిక్స్‌లోకి హీరోయిన్లను లాగడం చాలా అసభ్యకరంగా ఉంటుందని అన్నారు. ఇది కేవలం తమిళనాడులో మాత్రమే కాదని.. ఎక్కడ జరిగినా సమంజసం కాదన్నారు. నటులు ఉంటే కేవలం రాజకీయాల్లో పావుగా వాడుకునే వస్తువులు కాదని ట్వీట్ చేశారు. వారికి కుటుంబం, గౌరవం, పర్సనల్ లైఫ్ అనేవి కూడా ఉంటాయన్నారు. ప్రజా చర్చ అనేది ప్రాథమిక గౌరవానికి, ముఖ్యంగా మహిళల పట్ల గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదని సూచించారు. మన భారతీయ సంస్కృతి, దాని మూలాల్లోనే మహిళలను శక్తిగా గౌరవిస్తామని రాసుకొచ్చారు. అలాంటి శక్తిగా భావించే మహిళలను వారిని వార్తా శీర్షికల కోసం అవమానించేలా ఉండకూడదని పోస్ట్ చేశారు. ఇక నుంచేనా మనం మంచిగా ప్రవర్తిద్దామని హితవు పలికారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.విజయ్- త్రిష ఎపిసోడ్‌పైనే..ఇటీవల కోలీవుడ్‌లో విజయ్-త్రిష వ్యవహారం అనూహ్యంగా తెరపైకొచ్చింది. విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో త్రిష గురించి చర్చ నడుస్తోంది. త్రిష- విజయ్‌ల మధ్య రిలేషన్ ఉందని ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరు ఓ పెళ్లికి హాజరు కావడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిషకు అండగా పలువురు కోలీవుడ్ నటీనటులు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. అది వారి వ్యక్తిగత జీవితమని.. మనం కేవలం సినిమాల గురించి మాత్రమే చర్చించాలని ఓ సీనియర్ నటుడు అన్నారు. తాజాగా మంచు విష్ణు సైతం ఈ విషయంతో త్రిషకు మద్దతుగా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. Reading about the political campaigns in my Tamil Nadu. Felt It’s in extremely poor taste to drag actresses into political narratives. Not just in TN but anywhere. Actors are not political punching bags. They are individuals with families, dignity, and a life beyond the…— Vishnu Manchu (@iVishnuManchu) March 17, 2026 -
త్వరలోనే విజయతో పెళ్లి.. హింట్ ఇచ్చిన త్రిష తల్లి
-
త్వరలోనే విజయ్‌తో పెళ్లి.. ఇలా హింట్ ఇచ్చిన త్రిష తల్లి!
టీవీకే పార్టీని స్థాపించి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్‌కి ఆయన సతీమణి సంగీత భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. విజయ్‌తో విడాకులు ఇప్పించాలంటూ ఆమె కోర్టు మెట్లు ఎక్కడం.. ఒక నటితో ఆయన సహజీవనం చేస్తున్నాడని ఆరోపించడంతో త్రిష పేరు బయటకు వచ్చింది. విజయ్ సహజీవనం చేస్తున్నది త్రిషతోనే అని తమిళ మీడియా కోడై కూసింది. అది నిజమే అన్నట్లుగా త్రిష, విజయ్ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరై, తమ బందాన్ని బహిరంగం చేశారు. అప్పటి నుంచి విజయ్, త్రిషల పెళ్లిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగానే పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇదంతా పుకార్లే అని అంతా భావిస్తున్న తరుణంలో త్రిష తల్లి చేసిన ఓ పని.. మరోసారి వీరిద్దరి పెళ్లిపై చర్చకు దారి తీసింది.అలా హింట్ ఇచ్చిందా?త్రిష,విజయ్ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరైనప్పటి నుంచి వీరిద్దరి పెళ్లిపై నెట్టింట రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. కొంతమంది అయితే ఏఐని ఉపయోగించి పెళ్లి వీడియో క్రియేట్ చేసి..సోషల్ మీడియాలో వదిలారు. ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అలా విజయ్ అభిమాని ఒకరు ఏఐ టెక్నాలజీతో విజయ్, త్రిషల పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులంతా హాజరైనట్లు వీడియో క్రియేట్ చేశాడు. అది నెట్టింట తెగ వైరల్ అయింది. ఆ వీడియోకి త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టారు. దీంతో విజయ్‌తో పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ..ఆమె లైక్ కొట్టిన పోస్ట్‌ని వైరల్ చేస్తున్నారు. ఎన్నికల తర్వాత పెళ్లివిజయ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా తమిళనాడు ఎన్నికలపైనే పెట్టాడు. పొత్తుకు బీజేపీ ఆసక్తి చూపుతున్నా.. ఈ సారి ఒంటరిగానే బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత త్రిషను అధికారికంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ విషయంపై ఇరు కుటుంబాలలో చర్చలు కూడా జరిగాయట. ఇక సంగీత విషయానికొస్తే.. ఓ అభిమానిగా పరిచయం అయితే ఈమెను.. విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 1999లో వీరిద్ద వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే గత కొంతకాలంగా విజయ్, సంగీత వేరు వేరుగా ఉంటున్నారు. -
విజయ్- త్రిష ఎపిసోడ్‌పై మరో కొత్త పుకారు!
కోలీవుడ్‌లో విజయ్- త్రిష ఎపిసోడ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విజయ్ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై పలువురు నటీనటులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదం తర్వాత విజయ్- త్రిష జంటగా పెళ్లిలో కనిపించడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వరుస కథనాలొచ్చాయి.అయితే అందరూ అనుకుంటున్నట్లుగానే ఈ జంట పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం త్రిష తల్లి ఉమా కృష్ణన్ అలా చేయడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. విజయ్- త్రిష కృష్ణన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పేర్కొంటూ అభిమానులు ఓ రీల్ రూపొందించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఆసక్తిగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక భారీ ప్రకటన వెలువడుతుందని వీడియోను పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన త్రిష మదర్ ఉమా కృష్ణన్ ఆ వీడియోను లైక్ కొట్టింది.ఈ రీల్‌కు త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టడంతో వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రిష, విజయ్‌ల బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఉమా కృష్ణన్ కూడా ఆసక్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది చూసిన కొందరు త్రిష అభిమానులు సైతం ఉమా కృష్ణన్ పొరపాటున ఈ రీల్‌కు లైక్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా త్రిష మదర్ 'థగ్ లైఫ్' మూవీ రిల్స్‌కు లైక్స్ కొట్టారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా విజయ్- త్రిష పెళ్లిపై క్లారిటీ రావాలంటే తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. -
'ఇతరుల జీవితాల్లోకి చూడడమే వారి పని'.. త్రిష వ్యవహారంపై ఖుష్బు కామెంట్స్
కోలీవుడ్‌లో విజయ్- త్రిష వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. విజయ్ భార్య విడాకుల పిటిషన్ తర్వాత అందరి దృష్టి ఒక్కసారిగా త్రిషపై పడింది. అంతేకాకుండా వీరిద్దరు జంటగా ఓ వివాహా వేడుకకు హాజరు కావడంతో మరించ చర్చకు దారితీసింది. ఆ తర్వాత తమిళ నటుడు, దర్శకుడు పార్తీబన్ త్రిషను ఉద్దేశించి అనుచిత కామెంట్స్ చేశారు. అతని కామెంట్స్‌పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ తర్వాత క్షమాపణలు కోరాడు. అయితే తాజాగా విజయ్, త్రిషలపై వస్తోన్న వార్తలపై నటి ఖుష్బూ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె త్రిష గురించి మాట్లాడారు. ఆమె చాలా హుందాగా ఉంటుందని తెలిపారు. త్రిష గురించి తెలియనివారు చేసే కామెంట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వారికి మనం స్పందించాల్సిన పనిలేదని తెలిపారు. నాకు త్రిష గురించి బాగా తెలుసని.. తను చాలా సెన్సిటివ్ పర్సన్ అని ఖుష్బూ వెల్లడించారు. దురదృష్టవశాత్తూ మనం తుమ్మినా కూడా నిందించే రోజుల్లో ఉన్నామని అన్నారు. తనకు తెలిసిన వారిలో త్రిష అత్యంత సౌమ్యురాలైన వ్యక్తి అని ఖుష్బూ తెలిపారు. పెళ్లికి కలిసి వెళ్లడం అనేది వారి వ్యక్తిగతమని.. దానివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఆమె అన్నారు.ఖుష్బూ మాట్లాడుతూ.. 'దురదృష్టవశాత్తు మనం తుమ్మినా కూడా నిందను మరొకరిపై వేయాలనుకునే కాలంలో ఉన్నాం. నాకు తెలిసినంత వరకు త్రిష అత్యంత హుందాగా ఉండే మహిళ. అత్యంత సౌమ్యురాలైన వ్యక్తి. కొందరు తమ సమస్యలను పట్టించుకోకుండా.. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసి ఆనందించే వ్యక్తులు ఉంటారు. ఇతరులపై కామెంట్స్ చేస్తూ ఒక రకమైన వికృత ఆనందాన్ని పొందుతారు. వారిలో 99.9 శాతం మంది ఎవరో కూడా మనకు తెలియదు. ఎవరైనా సరే ఇతరులు చేసే వ్యాఖ్యలకు మనం బాధ్యులు కాదు. వాటికి స్పందిస్తూ మన సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. ఎయిర్‌పోర్టుల్లో ఫోటోగ్రాఫర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కల్చర్ ముంబయిలో మాత్రమే ఉండేదని.. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు చెన్నైకి కూడా పాకిపోయింది" అని అన్నారు.Trisha is most DIGNIFIED WOMEN I've ever met & most GENTLEST SOUL:- Actress #Kushboo #Trisha #Trishakrishnan pic.twitter.com/BVZHqZPYJK— Milagro Movies (@MilagroMovies) March 17, 2026 -
బిగ్‌బాస్ దివి గ్లామరస్ లుక్.. బ్లూ శారీలో త్రిష అందాలు..!
యోగాసనాలు చేస్తోన్న నటి పూనమ్ బజ్వా..బీచ్‌లో చిల్ అవుతోన్న నటాషా స్టాంకోవిచ్..ఫ్యామిలీతో అనసూయ వాకింగ్ టైమ్..బిగ్‌బాస్ దివి లేటేస్ట్ గ్లామరస్ లుక్..బ్లూ శారీలో హీరోయిన్ త్రిష అందాలు... View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష
నటి త్రిష పేరు వార్తల్లో మారుమోగుతోంది. ఏ న్యూస్ పేపర్ చూసిన, ఏ సామాజిక మాధ్యమాలు చూసిన త్రిష గురించే పోస్టులు కనిపిస్తున్నాయి. చివరికి రాజకీయ వర్గాల్లోనూ త్రిష సెంటర్ పాయింట్‌గా మారారు. ఆ మధ్య నటుడు విజయ్, త్రిష గురించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆయన త్రిషకు క్షమాపణ కూడా చెప్పారు. ఆ తర్వాత అనూహ్యంగా నటుడు విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు ఎక్కడం తీవ్ర సంచలనానికి గురిచేసింది. అందులో తన భర్త ఒక నటితో సంబంధం పెట్టుకోవడమే తను విడాకులు కోరడానికి కారణం అని కూడా సంగీత పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ విజయ్, త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకలో పాల్గొనడం పెద్ద చర్చకు దారి తీసింది.అలాంటి పరిస్థితుల్లో మరో సీనియర్ నటుడు పార్థిబన్ కూడా నటి త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఆయన వ్యాఖ్యలను నటి త్రిష తీవ్రంగా ఖండించింది. దీంతో పార్థిబన్ కూడా ఆమెకు క్షమాపణలు చెప్పడం ఆపై పొరపాటు అని మరో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా ఈ చర్చ జరుగుతున్న తరుణంలో నటి త్రిష గురించి మరో ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. నిజం చెప్పాలంటే ఆమె ఇటీవల నటించిన విడాముయర్చి, థక్ లైఫ్ చిత్రాలు పూర్తిగా నిరాశ పరచడంతో పాటు త్రిష నటనను ఆమె ఎంచుకున్న పాత్రల గురించి తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఈమె కొత్తగా చిత్రాలను అంగీకరించలేదు. రాజకీయాల వైపు త్రిషతెలుగులో చిరంజీవితో జంటగా నటించిన విశ్వంభర చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. మలయాళంలోనూ ఇదే పరిస్థితి. ఇక తమిళంలో సూర్యకు జంటగా నటించిన కరుప్పు చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో త్రిష కొత్తగా చిత్రాలను ఒప్పుకోవడం లేదని దానికి కారణం నటనకు స్వస్తి పలికి ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది. ఇందులో నిజం ఎంతో తెలియదు గానీ, ఆమధ్య తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, అసలు రాజకీయాలు తనకు తెలియదని నటి త్రిష పేర్కొన్నారు. అయితే, అది అప్పటి పరిస్థితిని బట్టి ఆమె అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారని కొందరు అంటున్నారు. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే త్రిష రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తి చూపుతున్నట్లు ఒక వర్గం పేర్కొంటుంది. ఇప్పటికే ప్రముఖ స్టార్‌గా వెలుగొందిన నటుడు విజయ్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం పార్టీలోనే త్రిష చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. -
విజయ్-త్రిష వ్యవహారం.. ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు
గతకొన్ని రోజులుగా నటుడు, టీవీకే అధినేత విజయ్ , నటి త్రిషకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లడంతో ఆ వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ అంశంపై సీనియర్ నటి,రాజకీయ నాయకురాలు ఖుష్భూ సుందర్ స్పందించారు. అది వాళ్ల పర్సనల్ విషయం అని, అది ప్రజలను ప్రభావితం చేయనంతవరకు ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాజాగా ఆమె ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ.. ‘ఈ అంశం(త్రిష-విజయ్‌ల రిలేషన్)తో ప్రజలకు ఏమి సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు. ఇది వారి వ్యక్తిగత జీవితం. అది ప్రభావితం చేస్తే, మనం దాని గురించి మాట్లాడవచ్చు. వారి వ్యక్తిగత జీవితానికి ప్రజలతో సంబంధం లేదు. ప్రజలు దీనిని ఎందుకు పెద్ద విషయంగా చూస్తున్నారు? వారు తమకు నచ్చినట్లుగా జీవితాన్ని కొనసాగిస్తారు. దాని వల్ల ప్రజలు ఏ విధంగానూ ప్రభావితం కారు’ అని ఖుష్భూ అన్నారు.త్రిష అంశం విజయ్ రాజకీయ జీవితంపై ప్రభావితం చూసే అవకాశం ఉందా అనే ప్రశ్నలు బదులుగా.. ‘ప్రజలు తెలివైన వాళ్లు. ఎవరికి, ఎందుకు ఓటు వేయాలో వాళ్లకు బాగా తెలుసు. పర్సనల్ లైఫ్ దానిని ప్రభావితం చేస్తుందని నేను అనుకోను. ఆయన నాయకుడైనా కాకపోయినా.. మనలాగే ఒక మనిషి. ప్రజల వ్యక్తిగత జీవితంతో అతనికి కూడా ఎలాంటి సంబంధం ఉండదు’ అని ఖుష్భూ చెపుకోచ్చింది. -
పర్సనల్ లైఫ్ జడ్జ్ చేయడానికి మీరెవరు?.. విజయ్- త్రిష వివాదంపై స్టార్ డైరెక్టర్
కోలీవుడ్‌లో విజయ్- త్రిష పేర్లే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా త్రిష పేరు తెరపైకొచ్చింది. ఇటీవల వీరిద్దరు జంటగా ఓ వివాహానికి కూడా హాజరు కావడంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే త్రిషపై కోలీవుడ్ దర్శకుడు పార్తిబన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత దర్శకుడు తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.తాజాగా విజయ్- త్రిష వివాదంపై ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్ స్పందించారు. మనం కేవలం నటీనటుల సినిమాల గురించి మాత్రమే చర్చించాలని సూచించారు. వారి వ్యక్తిగత జీవితాలపై చర్చించే హక్కు.. వారిని జడ్జ్ చేసే రైట్ మనకు లేదన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఈ వివాదం కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ హాట్ టాపిక్‌గా మారింది..విక్రమ్ భట్ తన పోస్ట్‌లో రాస్తూ.. ' విజయ్- త్రిషల వ్యక్తిగత జీవితాలపై చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ నిజమో, కాదో నాకు తెలియదు. ఒకవేళ అవి నిజమైతే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. వారిద్దరూ ఎంతో హుందాగా ఉన్నారు. ఏ విషయాన్ని దాచిపెట్టడం లేదు. ఇప్పుడు వాళ్లను ఎంతోమంది జడ్జ్ చేస్తున్నారు. ఆ ఇద్దరి గురించి మాట్లాడేవారంతా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. నటీనటుల సినిమాలు మాత్రమే మనం చూడాలి. వారి పర్సనల్ లైఫ్ గురించి మనకు అవసరం లేదు' అని రాసుకొచ్చారు.కాగా.. ఇటీవల రూ.30కోట్ల చీటింగ్ కేసు విషయంలో విక్రమ్ భట్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విక్రమ్, అతడి భార్య శ్వేతాంబరి భట్‌లకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ దంపతులు దాదాపు రూ.30 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
దళపతి విడాకుల కేసు క్లోజ్..! భార్యకు రూ.250 కోట్ల భరణం..?
-
త్రిషపై అనుచిత కామెంట్స్.. సారీ అంటూ పోస్ట్
కోలీవుడ్ స్టార్ విజయ్ విడాకుల వివాదం తెరపైకి వచ్చాక అనూహ్యంగా హీరోయిన్ త్రిష పేరు వైరలవుతోంది. విజయ్‌కు అమెతో రిలేషన్ ఉందంటూ ఆయన భార్య సంగీత ఆరోపించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇదిలా ఉండగా కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు త్రిషపై అనుచిత కామెంట్స్ చేశారు. ఓ ఈవెంట్లో పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.ఇది కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై హీరోయిన్ త్రిష కూడా అదేస్థాయిలో ఇచ్చిపడేసింది. ఆ నటుడికి అసలు బుర్రనే లేదంటూ ఎద్దేవా చేసింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో పార్తిబన్ స్పందించారు. ఈ మేరకు ఆయన క్షమాపణలు కోరారు. ఇప్పుడు జరిగిన దానికి నేనే సారీ చెప్పడం తప్ప వేరే మార్గం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వివాదానికి ఇకపై ఫుల్స్టాప్ పడినట్లే.అసలేం జరిగిందంటే..తాజాగా ఓ మూవీ ఈవెంట్లో యాంకర్ మాట్లాడుతూ.. త్రిష గురించి అభిప్రాయం చెప్పాలని పార్తిబన్‌ని అడిగింది. 'పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని అన్నాడు. అయితే పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు.. త్రిషని అవమానించేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన సరదాగానే అన్నాడని, మిగతా వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు.పార్తిబన్ విషయానికొస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, పొన్నియన్ సెల్వన్ 2 తదితర సినిమాల్లో నటించాడు. తెలుగులోనూ 'రచ్చ'లో చరణ్ తండ్రిగా చేశాడు. ఇతడు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే తెలుగు మూవీ త్వరలోనే థియేటర్లలోకి రానుంది. నటి సీతని 1990లో పెళ్లి చేసుకున్న పార్తిబన్.. 2001లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. -
నటుడు పార్తిబన్ పరువు తీసేసిన త్రిష.. ట్వీట్ వైరల్
హీరోయిన్ త్రిష రీసెంట్ టైంలో పెద్దగా సినిమాలు చేయలేదు. అయినా సరే సోషల్ మీడియా అంతా ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. విజయ్‌తో ఈమె రిలేషన్లో ఉందనే రూమర్సే దీనికి కారణం. ఎక్కడా ఈ విషయాన్ని అధికారికం చేయనప్పటికీ.. దాదాపు అందరూ వీళ్లిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. తమిళ నటుడు పార్తిబన్ కూడా వీళ్ల బంధం గురించి పరోక్షంగా అర్థం వచ్చేలా చిల్లర కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.శనివారం రాత్రి చెన్నైలో జరిగిన ఓ అవార్డ్ వేడుకలో నటుడు దర్శకుడు పార్తిబన్, త్రిష గురించి మాట్లాడుతూ.. ఆమె ఇంట్లో ఉంటేనే మంచిది. బయటకు వస్తే ఎక్కడలేని సమస్యలన్నీ వస్తున్నాయి అని అన్నాడు. ఈ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలోనూ గట్టిగానే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడీ విషయం కాస్త త్రిష వరకు చేరడంతో ఆమె కుడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్తిబన్‌కి అసలు బుర్ర లేదనేలా రాసుకొచ్చింది.'ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నా పేరు, ఫొటో చేర్చుతున్నామని చివరి నిమిషంలో నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. ఓ వ్యక్తి తన సహాయుకుడిని పంపించి నన్ను అడిగారు. అయితే మైక్రోఫోన్లో మాట్లాడినంత మాత్రాన అది తెలివైన వ్యాఖ్య లేదా కామెడీనో అవదు. అది కేవలం మూర్ఖత్వాన్ని ఎక్కువ వినిపించేలా చేస్తుంది. జ్ఞానం లేకుండా మాట్లాడే అసభ్య పదాలు, అవి ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాయో అనేదాని కంటే మాట్లాడిన వ్యక్తి తత్వాన్ని బయటపెడతాయి' అని త్రిష ట్వీట్ చేసింది. పార్తిబన్‌కి అసలు బుర్ర లేదు అని అర్థం వచ్చేలా త్రిష రాసుకొచ్చింది. -
త్రిషపై చిల్లర కామెంట్స్.. నోరు జారిన సీనియర్ నటుడు
తమిళనాడులో ఓవైపు ఎన్నికల హడావుడి ఉంది. మరోవైపు స్టార్ హీరో విజయ్ వైవాహిక బంధం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. రీసెంట్‌గానే ఇతడి భార్య సంగీత, కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఓ నటితో తన భర్తకు అక్రమ సంబంధం ఉందనే కారణాన్ని పిటిషన్లో పేర్కొంది. ఇదలా ఉండగానే త్రిషతో కలిసి విజయ్ ఏకంగా ఓ పెళ్లికి వెళ్లడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. వీళ్లిద్దరి మధ్య ఏముందనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇంతలోనే తమిళ నటుడు, దర్శకుడు పార్తిబన్.. త్రిషపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్)తాజాగా ఓ మూవీ ఈవెంట్లో యాంకర్ మాట్లాడుతూ.. త్రిష గురించి అభిప్రాయం చెప్పాలని పార్తిబన్‌ని అడిగింది. 'పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని అన్నాడు. అయితే పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు.. త్రిషని అవమానించేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన సరదాగానే అన్నాడని, మిగతా వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు.ఏదేమైనా పార్తిబన్ లాంటి ఓ సీనియర్ నటుడు, దర్శకుడు.. త్రిష లాంటి హీరోయిన్ గురించి పబ్లిక్‌గా ఇలా మాట్లాడటం సరికాదనే అభిప్రాయం పలువురు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది. గతంలోనూ ఈ నటుడు హీరోయిన్ల గురించి నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలో కథ ఉందా? లేదా అనేది ప్రేక్షకులు చూడటం లేదు. హీరోయిన్ డ్యాన్స్ కోసమే సినిమాలు చూస్తున్నారు. తమన్నా ఉంటే చాలు.. కథ లేకపోయినా ఫర్వాలేదు.. సినిమా హిట్టవుతుంది అని అన్నారు. తర్వాత తన మాటలపై విమర్శలు రావడంతో క్షమాపణ చెప్పుకొచ్చాడు.పార్తిబన్ విషయానికొస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, పొన్నియన్ సెల్వన్ 2 తదితర సినిమాల్లో నటించాడు. తెలుగులోనూ 'రచ్చ'లో చరణ్ తండ్రిగా చేశాడు. ఇతడు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే తెలుగు మూవీ త్వరలోనే థియేటర్లలోకి రానుంది. నటి సీతని 1990లో పెళ్లి చేసుకున్న పార్తిబన్.. 2001లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్)Parthiban attacks Trisha😝“Intha Kunthavai ah veetukullaye Kunthavaikirathu nalathu”😀pic.twitter.com/X5St5Ycnvk— Christopher Kanagaraj (@Chrissuccess) March 8, 2026 -
విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్
తమిళ స్టార్ హీరో విజయ్ గురించి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇతడి భార్య సంగీత.. కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేయడం, త్రిషతో విజయ్‌కి రిలేషనే ఉందనే రూమర్స్ ఓ వైపు చక్కర్లు కొడుతుండగానే ఓ పెళ్లికి ఆమెతోనే కలిసి రావడం లాంటివి హాట్ టాపిక్ అయిపోయాయి. అలానే విడాకులు మంజూరు అయ్యేంతవరకు తనని ఇంట్లోనే ఉండనివ్వాలని చెప్పి సంగీత మరో పిటిషన్ వేయడం, భరణంగా రూ.250 కోట్లు ఇవ్వనున్నాడనే కామెంట్స్ చర్చనీయాంశమైపోతున్నాయి. ఇలాంటి టైంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్.. తన విడాకులపై తొలిసారి స్పందించాడు.(ఇదీ చదవండి: బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయ్.. తన టీవీకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఇవ్వబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. వీటితో పాటు తన విడాకుల వ్యవహారం గురించి కూడా పరోక్షంగా విజయ్ మాట్లాడారు.'నా జీవితంలో జరుగుతున్న పలు సంఘటనల గురించి మీరు కంగారు పడకండి. వాటి గురించి ఆలోచించి మీరు సమయాన్ని వృథా చేసుకోవద్దు. వాటిని నేను పరిష్కరించుకుంటాను. నా సమస్యల గురించి ఆలోచిస్తూ మీరు ఒత్తిడికి లోనవడం నన్ను మరింతగా బాధపెడుతోంది' అని విజయ్.. తన విడాకుల గురించి ఇన్ డైరెక్ట్‌గా మాట్లాడారు. ఇప్పుడీ వ్యాఖ్యలు, వీడియో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!)Recently, there have been a few problems happening. I see that you are getting hurt while fighting for it. I’m getting hurt seeing you guys getting hurt. I’ll take care of the problems. Don’t get hurt. Nothing to worry about..- #ThalapathyVijay's speech pic.twitter.com/8QFSWVjklU— Laxmi Kanth (@iammoviebuff007) March 7, 2026 -
విజయ్ కు బిగ్ షాక్ బయటకు వెళ్లకూడదంటూ పిటిషన్
-
త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందో తెలుసా?
హీరోయిన్ త్రిష రెండు దశాబ్దాలకు పైగా సినీప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. వర్షం సినిమాతో తెలుగులో సెన్సేషన్ సృష్టించిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్ సరసన గిల్లిలో హీరోయిన్గా యాక్ట్ చేసి స్టార్ స్టేటస్ అందుకుంది. అలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. 42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయింది. అయితే ఈ బ్యూటీ దళపతి విజయ్‌తో ప్రేమాయణం నడుపుతుందని చాలాకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఇటీవల విజయ్, త్రిష జంటగా ఓ పెళ్లికి హాజరవడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే త్రిష విజయ్ కంటే ముందు వేరే హీరోలతో లవ్‌లో పడింది. ఆ కథేంలో ఇప్పుడు చూసేద్దాం..హీరోలతో లవ్త్రిష తమిళంలో పలువురు స్టార్స్‌తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో శింబుకి జోడీగా సినిమాలు చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ముదిరి ప్రేమగా మొగ్గలు తొడిగిందట. బయటకు వెళ్లినప్పుడు కూడా చేతిలోన చెయ్యేసి మరీ నడిచేవారు.. కానీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేదు. ఆ తర్వాత దళపతి విజయ్‌తో ఎక్కువ సినిమాలు చేసిన సమయంలో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, కొంతకాలానికి ఆ రూమర్స్ దానంతటవే ఆగిపోయాయి.ప్రకంపనలు రేపిన సుచీలీక్స్అనంతరం త్రిష టాలీవుడ్ హీరో రానాకు క్లోజ్ అయింది. మొదట్లో వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఒకానొక సమయంలో ఈ స్నేహం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ తర్వాతెందుకో విడిపోయారు. కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన సుచీలీక్స్ వ్యవహారంలో త్రిష-రానా క్లోజ్ ఫోటో ఒకటి బయటకు రావడం అప్పట్లో సంచలనం రేపింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తోనూ ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. త్రిష వల్లే ధనుష్- ఐశ్వర్య వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.పెళ్లి క్యాన్సిల్వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ 2015లో పెళ్లికి రెడీ అయింది త్రిష. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్‌తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో వివాహం రద్దు చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని కండీషన్ పెట్టాడని, అది నచ్చకనే అతడిని పెళ్లి చేసుకోలేదని త్రిష ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ధనుష్‌తో త్రిష అంత క్లోజ్‌గా ఉండటం నచ్చకే అతడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడని అంటుంటారు.విజయ్‌తో లవ్ఇప్పుడు మరోసారి విజయ్‌తో ప్రేమలో మునిగి తేలుతోంది త్రిష. విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది హీరో భార్య సంగీత. ఈ సమయంలో విజయ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అందరికీ తాము ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్తోంది. మరి విజయ్- సంగీత విడాకులు తీసుకున్నాక వీరు ప్రేమను పెళ్లి బంధంతో బలపర్చుకుంటారేమో చూడాలి!చదవండి: నోటికి ఎంతొస్తే అంత అనేస్తారా? బుర్రసాయి మాధవ్‌కు వరలక్ష్మి శరత్‌కుమార్ కౌంటర్ -
ట్రెండింగ్‌లో త్రిష.. ముక్కెరతో ఆషికా రంగనాథ్
సోషల్ మీడియాలో ట్రెండింగ్.. చీరకట్టులో త్రిషముక్కెర(ముక్కుపుడక)తో అందంగా ఆషికాచీరలో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ మృణాల్గ్లామర్ చూపించేస్తున్న 'బేబి' వైష్ణవి చైతన్యచుడీదార్లో చూడముచ్చటగా ప్రియాంక మోహన్డ్యాన్సుతో అదరగొట్టిన రాజశేఖర్ కూతుళ్లు View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) -
పెళ్లి వేడుకలో విజయ్, త్రిష సందడి.. ఫోటోలు వైరల్
-
పెళ్లి వేడుకలో విజయ్, త్రిష.. వీడియో వైరల్
కోలీవుడ్ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్, త్రిష కలిసి ఒక పెళ్లి వేడుకకు తాజాగా హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో వారిద్దరూ సరదాగ పలకరించుకున్నారు. వీరిద్దరి గురించి కొద్దిరోజుల క్రితం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముందుగా త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలని, తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలని ఆయన విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కొద్దిరోజల గ్యాప్‌లోనే విజయ్ సతీమణి సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. విజయ్ మరో మహిళతో సాన్నిహిత్యంగా ఉన్నారని అందుకే విడాకులు కావాలంటూ పేర్కొంది. అయితే, ఈ కథలో త్రిష పేరు ప్రధానంగా వైరల్ అయింది. ఇప్పుడు విజయ్, త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఒక పెళ్లికి వెళ్లడంతో వీడియో వైరల్ అవుతుంది.#Thalapathy @TVKVijayHQ President #Vijay and #Trisha attend #KalpathiSSuresh - #MeenakshiSuresh 's son wedding reception @actorvijay @trishtrashers pic.twitter.com/iQOQet9Z0A— Nikil Murukan (@onlynikil) March 5, 2026 -
విజయ్, రష్మిక మూడోసారి.. చిరు-త్రిష రెండోసారి.. జోడీ రిపీట్
వెండితెరపై ఓ హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కుదిరి, ఆ సినిమా హిట్ కూడా అయితే అప్పుడు ‘హిట్ పెయిర్’ అనిపించుకుంటారు. ఆ హిట్ పెయిర్ కాంబినేషన్‌కి ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న కొన్ని జోడీలు రిపీట్ అవుతున్నాయి. తొలిసారి జోడీగా నటించి, సక్సెస్ సాధించిన ఈ జంటకు సక్సెస్ రిపీట్ కావడం ఖాయం అనే అంచనాలున్నాయి. ఇక... రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం. రెండోసారి... ఈ మధ్య చిరంజీవి హీరోగా నటించిన చిత్రాల్లో ‘విశ్వంభర’ మూవీ ఒకటి. ‘బింబిసార’ మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. త్రిష మెయిన్ హీరోయిన్గా, ఆషికా రంగనాథ్ సెకండ్ హీరోయిన్గా నటించారు. చిరంజీవి, త్రిష కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్టాలిన్ ’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2006 సెప్టెంబరు 20న విడుదలై, హిట్‌గా నిలిచింది. ఆ చిత్రం తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి జోడీ ‘విశ్వంభర’ సినిమాతో రిపీట్ అవుతోంది. ‘‘స్టాలిన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి–త్రిష జోడీ ‘విశ్వంభర’తో రెండోసారీ అలరించనుంది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా ఈ మూవీ రూపొందింది. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ఫై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకుని 2025 ఆగస్టు 22న విడుదల చేసిన ‘విశ్వంభర’ సినిమా గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ వేసవిలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనుల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయింది. చందమామ కథలా సాగిపోయేటటువంటి అద్భుతమైన కథ ‘విశ్వంభర’. ముఖ్యంగా చిన్నపిల్లలకు, మరీ ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలను సైతం ఇది అలరిస్తుంది... వినోదపరుస్తుంది. ఈ వేసవికి ఈ సినిమా మీ ముందు ఉంటుంది. నాది భరోసా’’ అని చిరంజీవి పేర్కొన్న సంగతి తెలిసిందే. వందో చిత్రంలో... హీరో నాగార్జున, హీరోయిన్ టబు జోడీకి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరి పేరు చెప్పగానే ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా గుర్తొస్తుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో మొదటిసారి నటించారు నాగార్జున–టబు. 1996 అక్టోబరు 4న రిలీజైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో తమదైన నటనతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు నాగార్జున–టబు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున–టబు కలిసి నటించిన చిత్రం ‘ఆవిడా మా ఆవిడే’. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1998 జనవరి 14న విడుదలైంది. ఈ చిత్రంలోనూ మరోసారి సందడి చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ జోడీగా నటించలేదు. కానీ, ‘సిసింద్రి’ (1995) సినిమాలో మాత్రం ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌లో సందడి చేశారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున–టబు ముచ్చటగా మూడోసారి నటిస్తున్నారు. నాగార్జున కెరీర్లో 100వ సినిమాగా రూపొందుతోన్న చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్). ఈ మూవీకి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై అక్కినేని నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాగార్జున కెరీర్లో మైలురాయిలాంటి ఈ చిత్రంలో మరోసారి ఆయనకి జోడీగా టబు నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మైసూర్లో జరుగుతోంది. మూడోసారి... హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా జోడీకి పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ వంటి సినిమాల్లో జంటగా నటించిన వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. విజయ్–రష్మిక కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘గీత గోవిందం’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 ఆగస్టు 15న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ మూవీ తర్వాత వీరిద్దరూ జోడీగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 జూలై 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు విజయ్–రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’కి దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా వారి లైఫ్‌లో ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే.. రీల్ లైఫ్‌లో జోడీగా నటించిన విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా రియల్ లైఫ్‌లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడమే. ఫిబ్రవరి 26న వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరి కాంబోలో రానున్న ‘రణబాలి’ మూవీపై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న రిలీజ్ కానుంది. సెకండ్ టైమ్ హీరో శర్వానంద్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ లది హిట్ జోడీ. ‘శతమానం భవతి’ మూవీలో ఫస్ట్ టైమ్ జోడీగా నటించిన ఈ జంట సెకండ్ టైమ్ ‘భోగి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా, డింపుల్ హయతి కీలక పాత్రలో నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటిస్తున్నారు శర్వానంద్–అనుపమ. వీరిద్దరూ ఫస్ట్ టైమ్ నటించిన చిత్రం ‘శతమానం భవతి’. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ మూవీ 2017 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీలో క్యూట్ జోడీగా ఆకట్టుకున్నారు శర్వా, అనుపమ. ఈసారి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’లో నటిస్తున్నారు.1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న విడుదల కానుంది.ఈసారి భయపెడతారు ‘సామజ వరగమన’ సినిమాతో ప్రేక్షకులకు కడుపుబ్బా వినోదాలు పంచారు హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ రెబా మోనికా జాన్. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 జూన్ 29న విడుదలై, థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించింది. ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ నటించిన సెకండ్ మూవీ ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ మూవీ కోసం రెండోసారి జోడీ కట్టారు శ్రీవిష్ణు–రెబా. తొలి చిత్రంలో ప్రేక్షకులకు నవ్వులు పంచిన ఈ జంట ‘మృత్యుంజయ్’లో మాత్రం భయపెట్టనున్నారు. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ‘సాంగ్స్, కామెడీ లేకుండా హానెస్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. నా నటన కూడా సరికొత్తగా ఉంటుంది’’ అంటూ ఇటీవల శ్రీ విష్ణు తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే అదే రోజు శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘విష్ణు విన్యాసం’ మూవీ రిలీజ్ అవుతుండటంతో ఈ నెల 6కి ఈ మూవీ రిలీజ్‌ని వాయిదా వేశారు. బేబీ హిట్‌తో... ‘బేబీ’ మూవీతో ఓవర్‌నైట్ స్టార్స్ అయిపోయారు హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య. వారిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రత్యేకించి వీరి జోడీపై యూత్‌లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ‘బేబీ’తో హిట్ పెయిర్ అనిపించుకున్న ఆనంద్– వైష్ణవి జంటగా నటిస్తున్న రెండో సినిమా ‘ఎపిక్’. ‘90స్’ (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మి స్తున్నారు. కాగా ఎపిక్– ఫస్ట్ సెమిస్టర్ పేరుతో రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలాంటి అబ్బాయికి... సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ’ అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ‘బేబీ’ మూవీతో సూపర్‌హిట్ జోడీ అనిపించుకున్న ఆనంద్–వైష్ణవి కలిసి నటిస్తున్న ‘ఎపిక్’ మూవీపై మంచి క్రేజ్ నెలకొంది. రెండోసారి... ‘కోర్ట్’ సినిమాతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా. ఈ ఇద్దరూ పరిచయమైన తొలి చిత్రం ‘కోర్ట్’. ఇప్పుడు రెండోసారి జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. ప్రియదర్శి, శివాజీ, రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా 2025 మార్చి 14న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో తొలిసారి జోడీగా నటించిన హర్ష్ రోషన్–శ్రీదేవి హిట్ పెయిర్‌గా నిలిచారు. సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆడియన్స్‌లో వీరి జోడీకి ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో వీరు జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై ఫుల్ బజ్ నెలకొంది. -
ట్రెండింగ్ లో హీరోయిన్ త్రిష.. ఎందుకో తెలియదు (ఫొటోలు)
-
త్రిష, విజయపై బీజేపీ నేత.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష
-
విజయ్-త్రిష బంధంపై బీజేపీ చీఫ్ దారుణమైన కామెంట్స్
చివరి సినిమా చేసేసిన తమిళనాడు స్టార్ హీరో విజయ్.. అధికారం సాధించడమే లక్ష్యంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు ప్రచారం చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే పనిలో ఉన్నాడు. అలాంటి ఇతడిపై తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. త్రిషతో బంధాన్ని ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా)చెన్నైలో జరిగిన ప్రెస్మీట్లో భాగంగా బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రకు విజయ్ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. 'విజయ్ చాలా అమాయకుడు. ఇప్పటికీ రాజకీయాలు అర్థం చేసుకోలేకపోతున్నాడు. మొదటగా అతడు గూడు నుంచి బయటకు రావాలి. మరీ ముఖ్యంగా త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది' అని నాగేంద్రన్ ఆరోపించారు.నాగేంద్రన్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల విమర్శలు వస్తున్నాయి. విజయ్‌ని అభిమానించే వాళ్లతో అధికార డీఎంకే నాయకులు కూడా నాగేంద్రన్ కామెంట్స్‌ని ఖండిస్తున్నారు. విజయ్, త్రిష రిలేషన్ గురించి గత కొన్నాళ్లుగా రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సున్నితమైన అంశాన్ని.. నేతలు బహిరంగ వేదికలపై ప్రస్తావించడం అవమానకరమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్గా ఇన్‌స్టా ఫేమస్ భామ.. గ్లింప్స్ రిలీజ్) -
రేణూదేశాయ్ మాత్రమే కాదు... రామ్ చరణ్ కూడా!
ఇటీవల శునకాలను తుదముట్టించడాన్ని నిరసిస్తూ నటి రేణూ దేశాయ్ నిర్వహించిన ప్రెస్ మీట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తారల్లో అత్యధికులు శునకాభిమానులే. వీరు పెట్స్‌ను పెంచుకోవడం మాత్రమే కాదు వాటికి ఎంత విలువు ఇస్తారంటే తమ ఇంటిపేరు తగిలించి మరీ వాటికి నామకరణం చేసి తమ ఫ్యామిలీ మెంబర్లా కలిపేసుకుంటారు. అయితే వారి ఈ రేంజ్ శునకాభిమానానికి నోచుకునేవి స్ట్రీట్ డాగ్స్ కాదు...మంచి పేరున్న బ్రీడ్స్. ఈ నేపధ్యంలో పలు సందర్భాల్లో స్వయంగా తామే పంచుకున్న తారల పెట్ ప్రేమ గురించిన విశేషాలివి...– ఫ్రెంచ్ బుల్ డాగ్స్ తో తాను ప్రేమలో పడ్డానని తరచు చెబుతుంది సమంత. ఆమెకు హాష్ సాషా అనే రెండు పెట్స్ ఉన్నాయి. తన ప్రియమైన పెంపుడు జంతువులతో సరదాగా గడిపే క్షణాలను ఆమె తరచుగా తన అభిమానులకు అందిస్తుంది. ఇటీవల హోలీ రోజున హోలీ ఆడిన తర్వాత తన పెంపుడు జంతువులతో ఆడుకుంటున్న వీడియోను పంచుకుంది– అలాగే టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ కు సైబీరియన్ బ్రీడ్ హస్కీ పెట్ ఫ్రెండ్. ఆయన దానికి స్ట్రోమ్ దేవరకొండ అంటూ తన ఇంటిపేరు కలిసొచ్చేలా పేరు పెట్టాడు. ఆయన ప్రియురాలు, నేషనల్ క్రష్ రష్మికకు విజయ్ దేవరకొండ తో పాటు ’ఆరా’ అనే తన పెంపుడు శునకం మీద కూడా క్రష్ ఉంది–ఇక మెగాస్టార్ వారసుడు రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసనలు ఇద్దరూ పెట్ లవర్సే. మొదట్లో రామ్ చరణ్ కు బ్రాట్ అనే పిలుచుకునే బ్లాక్ల్ లాబ్రడార్ ఉండేది అయితే కొన్ని సంవత్సరాల క్రితం దానిని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఉపాసన ఆయనకు ఒక పెట్‌ను బహుమతిగా ఇచ్చారట. ప్రస్తుతం ఈ జంటకు రైమ్ అనే ముద్దుల పెట్ ఉంది. జాతి ప్రకారం ఫ్రెంచ్ బార్బెట్ లాగా ఈ రైమ్, కనిపిస్తుంది, ఈ జంట తమ పెట్స్‌తో గడిపే చిత్రాలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటుంది వీలున్నంత వరకూ వీరి పెట్ కూడా వీరితో కలిసి ప్రయాణాలు చేస్తుంది. తద్వారా విమానాశ్రయాల్లో ఫొటోలకు చిక్కి స్టార్స్ సరసన మీడియాలో పబ్లిసిటీ కూడా దక్కించుకుంటుంది. షూటింగ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తాను చేసే మొదటి పని తన పెట్ ఎలా ఉందో చూడటమే అంటాడు రామ్ చరణ్. తన పెంపుడు జంతువును చూసినప్పుడల్లా ఓదార్పు ఓ పాజిటివ్ వైబ్ తక్షణమే లభిస్తుందని దానితో ఉన్నప్పుడు తన నిజమైన భావోద్వేగాలు బయటకొస్తాయంటున్న పెద్ది... తనపెట్తో కలిసి ఈత కొట్టడం తనకెంతో ఇష్టమంటున్నాడు. – దక్షిణాది సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ దగ్గర పలు పెట్స్ ఉన్నాయి. ఆమె తన పెట్స్‌తో పాటు వీధి కుక్కల పట్ల కూడా ప్రేమను పంచుతుంది. శునకాలను ప్రేమించడం మాత్రమే కాదు, వాటిని రక్షించేందుకూ అనుష్క శెట్టి పనచేస్తుంటుంది. ఆమె పెంపుడు కుక్కలతో పాటు, బ్లూ క్రాస్ పెట్ కార్నివాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు. తన నిజమైన ఓదార్పు తన పెంపుడు జంతువులతో సమయం గడపడంలోనే లభిస్తుందని అనుష్క చెప్పింది. అదే విధంగా కాజల్ అగర్వాల్ ఎంతో ప్రేమించే పెట్ పేరు సీజర్. ఆమెకు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ఇక దానితోనే గడుపుతుంది. టాలీవుడ్ నటుడు మంచు మనోజ్‌కు జ్యూస్ అనే పెంపుడు శునకం ఉంది దానిని తరచుగా తనతో బయటకు తీసుకు వెళుతుంటాడు. బహిరంగంగా దానిపై తన ప్రేమను ప్రదర్శిస్తూ కనిపిస్తాడు. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు దగ్గర మనోజ్ షికార్లు చేస్తూన్న ఫొటోను కూడా అతను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఆయన సోదరి నటి లక్ష్మీ మంచు కూడా ’చందమామ కథలు’ అనే సినిమా ద్వారా తన పెంపుడు కుక్క జ్యూస్ ఆనంద్ మంచును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది.సిద్ధార్థకు మురికివాడలో దొరికిన కొడుకు...హీరో సిద్ధార్థ్ ఇటీవల ఓ ట్వీట్ చేశాడు.. ’నాకు ఒక కొడుకు ఉన్నాడు, అతనికి నాలుగు కాళ్లు వంకర తోక ఉన్నాయి. అతని పేరు మౌగ్లీ. ప్రస్తుతం అతనికి 10 సంవత్సరాలు, నేను అతన్ని ఒక మురికివాడలో కష్టాల నుంచి ఒకసారి రక్షించాను తను తన నిస్సారమైన ప్రేమ ఆప్యాయతతో ఎప్పుడూ నన్ను రక్షిస్తున్నాడు. అతను ఒక మంచి శునకం. ప్రపంచంలోనే అత్యంత పిరికివాడు కూడా, అయితే ఆ పిరికితనాన్ని బిగ్గరగా మొరగడం ద్వారా దాస్తుంటాడు’’ అంటూ తన పెట్ గురించిన కబుర్లు పంచుకున్నాడు. -
సంయుక్త మస్తే షేడ్స్.. మృణాల్ అక్కని చూశారా?
అక్కతో కలిసి మృణాల్ థాయ్‌లాండ్ ట్రిప్ఎర్రని చుడీదార్లో అందంగా మాళవికమస్త్ షేడ్స్ చూపించేస్తున్న సంయుక్తఖతార్లోని ఎడారిలో దివి గ్లామరస్ పోజులుబ్లాక్ డ్రస్ లో మోడ్రన్ గర్ల్‌లా భాగ్యశ్రీ బోర్సేచీరలో ఓరచూపులు చూస్తున్న హీరోయిన్ త్రిష View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) -
హీరోయిన్స్ నయనతార, త్రిషల స్నేహ బంధం... ఫోటోలు
-
గత ఏడాది ఆశాజనకంగా లేదు కానీ..: త్రిష
పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ తమ చిత్రాలు విజయవంతం కావాలనే కోరుకుంటారు. అందుకోసమే శ్రమిస్తుంటారు. అయితే జయాపజయాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. ఒక్కోసారి బాగున్న కథా చిత్రాలు కూడా ప్రజాదరణకు నోచుకోవడంలో విఫలం అవుతుంటాయి. అందుకు పలు కారణాలు ఉండవచ్చు. నటి త్రిష విషయానికే వస్తే కథానాయకిగా స్వర్ణోత్సవానికి చేరువవుతున్నారు. తమిళం,తెలుగు,కన్నడం,మలయాళం,హిందీ భాషల్లో నటించి పాన్ ఇండియా కథానాయకిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ మధ్యలో నటిగా కాస్త స్ట్రగుల్ పడి అవకాశాలకు దూరం అయ్యారు. అలాంటి తరుణంలో మణిరత్నం రూపంలో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించే అవకాశం వరించి సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఆ తరువాత విజయ్, అజిత్, కమలహాసన్ వంటి ప్రముఖ హీరోలతో జత కట్టారు. అదే విధంగా మలమాళంలో మోహన్‌లాల్, తెలుగులో చిరంజీవి వంటి ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలను అందుకున్నారు. అయితే గత ఏడాది త్రిష నటించిన చిత్రాల్లో అజిత్‌తో జంటగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మినహా ఇతర చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. ముఖ్యంగా అజిత్‌కు జంటగా నటించిన మరో చిత్రం విడాముయర్చి, కమలహాసన్‌తో కలిసి నటించిన థగ్ లైఫ్ చిత్రాలు పూర్తిగా నిరాశ పరిచాయి. కాగా ప్రస్తుతం త్రిష మార్కెట్ డల్‌గా ఉందని చెప్పక తప్పదు. కాగా ఈమె సూర్యకు జంటగా నటించిన కరుప్పు చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుంది. అదేవిధంగా తెలుగులో చిరంజీవి సరసన నటిస్తున్న విశ్వంభర చిత్రం కూడా చిత్రీకరణను పూర్తి చేసుకుని ప్రస్తుతం గ్రాఫిక్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రం కూడా మార్చి నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. అదేవిధంగా మలయాళంలో మోహన్‌లాల్ కు జంటగా రామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇవన్నీ గత ఏడాది, అంతకు ముందు ఏడాది అంగీకరించిన చిత్రాలు అన్నది గమనార్హం. దీంతో త్రిష కొత్తగా ఒప్పుకున్న చిత్రాలు లేవు. అయితే ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు సమాచారం. నాలుగు పదుల వయసు దాటిన ఈ పెళ్లి కాని నటికి తాజాగా మరో రెండు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందని, వాటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట అందుకే త్రిష కూడా గతేడాది తనకు ఏమంతగా ఆశాజనకంగా లేదని చెప్పుకొస్తుందట. అయితే, 2026లో తను నటించిన భారీ సినిమాలు రెండు విడుదల కానున్నాయి. -
శరత్ కుమార్-రాధిక క్రిస్మస్ లంచ్‌లో కోలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)
-
ఐఎన్ఐ సెట్లో పల్నాడు అమ్మాయి సత్తా
సాక్షి, నరసరావుపేట: పీజీ మెడికల్ కోర్సులకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐఎన్ఐ సెట్–2025లో పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్ బారెడ్డి శ్రీసాయి త్రిషారెడ్డి ఆలిండియా 7వ ర్యాంకు సాధించింది. ఎంతో పోటీ ఉండే ఈ ఐఎన్ఐ సెట్లో (ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్–కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్) తొలి ప్రయత్నంలోనే త్రిషారెడ్డి ఆలిండియాలో 7వ ర్యాంకుతోపాటు దక్షిణాదిలో మొదటి ర్యాంకు పొందింది. తమ కుమార్తె సాధించిన ఈ ఘనతపై ఆమె తల్లిదండ్రులు బారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, అనంత లక్ష్మిలు ఎంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.వీరి స్వస్థలం గురజాల మండలం తేలుకుట్ల కాగా వ్యాపారరీత్యా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. త్రిషా ఐదేళ్ల క్రితం నీట్ యూజీ ఎంట్రన్స్‌లో ఆలిండియా 14వ ర్యాంకు సాధించి ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసింది. ఇక ఎయిమ్స్ న్యూఢిల్లీ నిర్వహించిన జనవరి సెషన్ ఐఎన్ఐ సెట్లో దేశంలోని వివిధ ఎయిమ్స్‌లతో పాటు కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాల కోసం ఈనెల 9న పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలను శనివారం రాత్రి ఎయిమ్స్ అధికార వర్గాలు విడుదల చేశాయి. చిన్న వయస్సులోనే అత్యంత ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ఫలితాలను సాధించిన సాయి త్రిషారెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
పెట్ బర్త్ డే.. హీరోయిన్ త్రిష హంగామా (ఫొటోలు)
-
రెండు..మూడు..ఏడు..ఇంకోసారి మేజిక్!
సిల్వర్ స్క్రీన్‌పై కొన్ని జంటల మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. ఆ జంటను మరిన్ని సినిమాల్లో చూడాలనేంతగా వారి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుంది. పైగా ఈ పెయిర్ నటించిన సినిమా హిట్ అయితే... ‘హిట్ జోడీ’ అనే పేరు కూడా వస్తుంది. అలా వెండితెరపై తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు హిట్ కూడా అందుకున్న కొన్ని జంటలు మళ్లీ కలిసి నటిస్తున్నాయి. ఒకరు రెండోసారి జత కడితే... మరొకరు మూడోసారి... ఇంకొకరు ఏకంగా ఏడో సారి... ఇలా హిట్ మేజిక్‌ని రిపీట్ చేయడానికి రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం. ఎన్నాళ్లకెన్నాళ్లకు... హీరో చిరంజీవి(Chiranjeevi), హీరోయిన్ త్రిష కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్టాలిన్’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 సెప్టెంబరు 20న విడుదలై, హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు. 19 ఏళ్ల తర్వాత వీరి జోడీ ‘విశ్వంభర’(Vishwambhara) సినిమాతో రిపీట్ అవుతోంది. ‘బింబిసార’ మూవీ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విక్రమ్ రెడ్డి సమర్పణలో వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష మెయిన్ హీరోయిన్ కాగా ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా రూ΄÷ందుతోన్న ‘విశ్వంభర’ 2026 వేసవిలో విడుదల కానుంది. రెండోసారి... హీరో చిరంజీవి– హీరోయిన్ నయనతార(Nayanthara) కాంబినేషన్ రెండోసారి రిపీట్ అవుతోంది. వీరిద్దరూ తొలిసారి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 అక్టోబరు 2న రిలీజైంది. ఆ తర్వాత చిరంజీవి, నయనతార కలిసి ‘గాడ్‌ఫాదర్’ (2022) చిత్రంలో అన్నా–చెల్లెలుగా నటించారు. తాజాగా వీరిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ మూవీ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి చిరంజీవి–నయనతార సందడి చేసిన ‘మీసాల పిల్ల...’ అంటూ సాగే తొలి పాట ప్రోమోని విడుదల చేయగా అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 27 ఏళ్ల తర్వాత... కొన్ని జంటలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. హీరో నాగార్జున(Nagarjuna Akkineni), హీరోయిన్ టబు జోడీ కూడా అలాంటిదే. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు నాగార్జున–టబు. 1996 అక్టోబరు 4న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున–టబు కలిసి నటించిన రెండో చిత్రం ‘ఆవిడా మా ఆవిడే’. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1998 జనవరి 14న విడుదలైంది. ఈ చిత్రంలోనూ తమదైన నటనతో సందడి చేసిన వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. నాగార్జున కెరీర్లో 100వ సినిమాగా రూపొందుతోన్న చిత్రానికి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కింగ్ 100’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఈ చిత్రం కోసం 27 ఏళ్ల తర్వాత మరోసారి జోడీగా నటించనున్నారట నాగార్జున–టబు. నాగార్జున కెరీర్లో మైలురాయిలాంటి ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని, వారిలో టబు ఓ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. ‘సిసింద్రి’ (1995) సినిమాలో నాగార్జున– టబు ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఏడోసారి... హీరో వెంకటేశ్(Venkatesh), హీరోయిన్ మీనాలది ప్రత్యేకమైన జోడీ. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే ‘చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం, దృశ్యం, దృశ్యం 2’ వంటి అరడజను సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో వీరి జోడీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఇప్పుటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్న వీరిద్దరూ ‘దృశ్యం 3’ సినిమా కోసం మరోసారి జోడీగా నటించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘దృశ్యం’ (2014), ‘దృశ్యం 2’ (2021) సినిమాలు అద్భుతమైన హిట్స్ అందుకున్నాయి. ఈ సిరీస్‌లో రానున్న తాజా చిత్రం ‘దృశ్యం 3’. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్, మీనా జోడీగా మలయాళంలో ‘దృశ్యం 3’ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. తెలుగులోనూ రూపొందనున్న ‘దృశ్యం 3’లో వెంకటేశ్–మీనా మరోసారి జంటగా నటించి, ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం పూర్తయ్యాక ‘దృశ్యం 3’ సెట్స్‌పైకి వెళ్లనుంది. థియేటర్లలో జాతర హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల కలిసి థియేటర్లలో ‘మాస్ జాతర’ చూపించేందుకు సిద్ధం అయ్యారు. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ధమాకా’. నక్కిన త్రినాథరావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2022 డిసెంబరు 23న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రవితేజ–శ్రీలీల డ్యాన్సులు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ధమాకా’ వంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ద్వితీయ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా ‘మాస్ జాతర’ రూ΄÷ందడం.. రవితేజ–శ్రీలీల హిట్ జోడీ రిపీట్ అవుతుండటం.. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతానికి ఇప్పటికే అద్భుతమైన స్పందన రావడం... వంటి కారణాలతో ఈ చిత్రంపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. సలార్: శౌర్యాంగపర్వంలో... ‘బాహుబలి’ చిత్రం తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన ‘ది రాజా సాబ్, ఫౌజి, స్పిరిట్’ వంటి చిత్రాలు చేస్తున్నారు. ఆ తర్వాత ‘సలార్: శౌర్యాంగపర్వం’ మూవీ చేస్తారు. ప్రభాస్, శ్రుతీహాసన్ జోడీగా నటించిన తొలి చిత్రం ‘సలార్: పార్ట్ 1 సీజ్ఫైర్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ మూవీ 2023 డిసెంబరు 22న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రభాస్ యాక్షన్... ప్రశాంత్ నీల్ టేకింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘సలార్: పార్ట్ 2 శౌర్యాంగపర్వం’ రూపొందనున్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో అలరించిన ప్రభాస్– శ్రుతీహాసన్ జోడీ ద్వితీయ భాగంలోనూ అలరించబోతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారాయన. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాతే ‘సలార్: పార్ట్ 2 శౌర్యాంగపర్వం’ పై దృష్టి పెడతారట. ‘సలార్: ΄ార్ట్ 1 సీజ్ఫైర్’ చూసిన వారందరూ ‘సలార్: ΄ార్ట్ 2 శౌర్యాంగపర్వం’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోసారి... నాని హీరోగా నటించిన ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ (2019) చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ప్రియాంకా మోహన్. ఆ తర్వాత మరోసారి వీరిద్దరూ ‘సరి΄ోదా శనివారం’ (2024) సినిమాలో నటించారు. ఇప్పటికే రెండు సినిమాల్లో సందడి చేసిన ఈ జంట మరోసారి జోడీగా కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘సాహో, ఓజీ’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ్ర΄ారంభమైంది. ఈ సినిమాలో నానీకి జోడీగా ప్రియాంకా మోహన్ నటించనున్నారట. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన ‘ఓజీ’ చిత్రంలో హీరోయిన్గా నటించారు ప్రియాంక. తాజాగా నాని సినిమాలో ఆమెని హీరోయిన్గా తీసుకోనున్నారట సుజీత్. పైగా నాని–ప్రియాంక కాంబినేషన్‌కి కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండటంతో వీరు మూడోసారి నటించడం పక్కా అనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ముచ్చటగా మూడోసారి... హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా కలిసి ముచ్చటగా మూడోసారి జోడీగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘గీత గోవిందం’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 ఆగస్టు 15న విడుదలై సూపర్ హిట్‌గా నిలవడంతో ΄ాటు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ మూవీ తర్వాత విజయ్–రష్మిక నటించిన ద్వితీయ చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 జూలై 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా విడుదలైన ఆరేళ్ల తర్వాత వీరిద్దరూ మూడోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్’). గతంలో విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ ‘వీడీ 14’కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలోనే మరోసారి విజయ్–రష్మిక పెయిర్‌గా మారారు. ఇదిలా ఉంటే రీల్ లైఫ్‌లో జోడీగా నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక రియల్ లైఫ్‌లో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 3న వీరి నిశ్చితార్థం జరిగింది. 2026 ఫిబ్రవరిలో విజయ్–రష్మికల వివాహం జరగనుంది. ఎనిమిదేళ్ల తర్వాత... హీరో శర్వానంద్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటిస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి నటించిన చిత్రం ‘శతమానం భవతి’. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017 జనవరి 14న రిలీజై, సూపర్ హిట్‌గా నిలవడంతో ΄ాటు జాతీయ అవార్డు అందుకుంది. ఈ సినిమాలో క్యూట్ జోడీగా ఆకట్టుకున్న శర్వానంద్, అనుపమ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘శర్వా 38’ (వర్కింగ్ టైటిల్). సంపత్ నంది దర్శకత్వంలో లక్ష్మీ రాధా మోహ¯Œ సమర్పణలో కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1960ల కాలంలోని ఉత్తర తెలంగాణ– మహారాష్ట్రల సరిహద్దు ్ర΄ాంతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూ΄÷ందుతోంది. కాగా ఈ మూవీలో హీరోయిన్ డింపుల్ హయతి ఓ కీలక ΄ాత్ర చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్యలది క్రేజీ కాంబినేషన్ అనే చె΄్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మొదటి చిత్రంతోనే వంద కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన వీరి జోడీ రెండో సారి ప్రేక్షకులను అలరించనుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా ‘90స్’(ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాస¯Œ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఓ మధ్య తరగతి యువకుడి ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. ‘బేబీ’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఆనంద్–వైష్ణవి రెండోసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాపై యువతలో మంచి ఆసక్తి నెలకొంది. రెండోసారి... హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ రెబా మోనికాజాన్లది హిట్ పెయిర్. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘సామజ వరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 జూన్ 29న విడుదలై, ప్రేక్షకులను నవ్వించింది. ఆ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికాజాన్ కలిసి నటించిన ద్వితీయ చిత్రం ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలక΄ాటి నిర్మించారు. తొలి చిత్రం ‘సామజ వరగమన’తో నవ్వులు పంచిన శ్రీవిష్ణు, రెబా ‘మృత్యుంజయ్’తో మాత్రం భయపెట్టనున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
నా 'హనీమూన్' ఎప్పుడో మీరే ఫిక్స్ చేయండి: త్రిష
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లి చేసుకోబోతుందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే, ఈసారి నిజమనే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే త్రిష తన సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేసింది. చాలామంది అభిమానులు నా జీవితాన్ని కూడా నిర్ణయించేస్తున్నారు. ఇంకేముంది నా హనీమూన్ షెడ్యూల్ కూడా మీరే ప్లాన్ చేయండి అంటూ ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ గురించి ఆమె ఇలా సరదాగా రియాక్ట్ అయింది.చండీగఢ్ వ్యాపారవేత్తను త్రిష వివాహం చేసుకోబోతోందంటూ తమిళనాడులో వార్తలు వైరల్ అయ్యాయి. ఇరు కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలిపారని కూడా పెద్ద ఎత్తున బాలీవుడ్లో కూడా ప్రముఖ మీడియా సంస్థలు ప్రకటించాయి. తమిళం, తెలుగు పరిశ్రమలో సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత ఆమె వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ఆ కథనాల్లో పేర్కొన్నారు. చండీగఢ్‌లో ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తున్న అతని గురించి వివరాలు పరిమితంగా ఉన్నాయంటూనే రెండు కుటుంబాల మధ్య పరిచయం చాలా సంవత్సరాల నుంచే ఉందంటూ పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. దీంతో ఈ రూమర్స్‌పై నిజమనే సంకేతాలు ఇస్తున్నాయని నెటిజన్లు పేర్కొన్నారు. కానీ, తాజాగా త్రిష చేసిన పోస్ట్‌తో అదంతా ఫేక్ అని మరోసారి క్లారిటీ అయింది.2015లో వరుణ్ మణియన్ అనే బిజినెస్‌మ్యాన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తర్వాత కొన్నిరోజులకు విబేధాలు రావడంతో పెళ్లి చేసుకోలేదు. మరోవైపు వరుస సినిమాలతో త్రిష బిజీగా ఉంది. చిరంజీవి విశ్వంభరలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. -
సీఎం స్టాలిన్, త్రిష ఇంటికి బాంబు బెదిరింపు
-
తమిళనాడులో బాంబు బెదిరింపు కలకలం.. స్టాలిన్, గవర్నర్, త్రిషా సహా..
చెన్నై: తమిళనాడులో(Tamil Nadu) మరోసారి బాంబు బెదిరింపుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నివాసం, గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi)భవనం, సినీనటి త్రిష(Trisha) నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి శుక్రవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బాంబు స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Tamil Nadu CM MK Stalin and TN Governor gets bomb threat.@PramodMadhav6 with more details.#TamilNadu #FirstUp | @AishPaliwal pic.twitter.com/526VQAqbIT— IndiaToday (@IndiaToday) October 3, 2025 -
రేసులో మంత్రి దామోదర కూతురు త్రిష!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని ఆశించిన పలువురు నాయకుల ఆశలు ఆవిరయ్యాయి. రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో ఈ పదవిపై పెట్టుకున్న నాయకుల ఆశలు అడియాశలయ్యాయి. ఈ పదవి ఎస్సీ సామాజికవర్గానికి రిజర్వు అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం శనివారం జారీ చేసిన గెజిట్‌లో సంగారెడ్డి జిల్లా ఎస్సీ జనరల్‌కు కేటాయించింది. దీంతో ఈ పదవిపై దృష్టి సారించిన ఇతర సామాజికవర్గాల నాయకులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రిజర్వేషన్ అనుకూలిస్తే బరిలోకి దిగాలని ఆయా నియోజకవర్గాల్లోని పలువురు నాయకులు భావించారు. మహిళకు రిజర్వు అయినా..వారి సతీమణితో పోటీ చేయించాలని అనుకున్నారు. కానీ రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీలు సైతం..ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పలు నియోజకవర్గాల నాయకులకు ఈ జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పిస్తామని హామీలు ఇచ్చాయి. ఆ ఎన్నికల్లో ఆయా అసెంబ్లీ స్థానాల ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన నాయకులను బుజ్జగించేందుకు ఈ పదవిని ఇస్తామని చెప్పారు. మరోవైపు ఆ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీ నుంచి తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కూడా ఈ పదవికి అవకాశం కల్పిస్తామని హామీలు గుప్పించారు. దీంతో ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతల సంఖ్య పెరిగింది. తీరా ఇప్పుడు ఎస్సీ రిజర్వు కావడంతో వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.రెండు దశాబ్దాల తర్వాత ఎస్సీలకు అవకాశంఈ జెడ్పీ చైర్పర్సన్ పదవి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఎస్సీకి రిజర్వు అయింది. 2006– 2011 వరకు ఈ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ అయింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.బాలయ్య చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వు అయింది. టీఆర్ఎస్కు చెందిన ఎర్రగొల్ల రాజమణి ఈ పదవిలో కొనసాగారు. తర్వాత 2018– 2023 వరకు జనరల్ మహిళకు రిజర్వు కాగా..మంజుశ్రీరెడ్డి చైర్ పర్సన్‌గా ఉన్నారు. తాజాగా ఎస్సీ జనరల్‌కు రిజర్వు కావడంతో 20 ఏళ్ల తర్వాత ఈ సామాజికవర్గానికి అవకాశం దక్కినట్లయింది.ఆ ఆరుగురికే అవకాశం!జిల్లాలో మొత్తం 25 మండలాల్లో జెడ్పీటీసీ స్థానాల్లో ఆరు మండలాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. దీంతో ఈ ఆరు మండలాల్లో జెడ్పీటీసీలుగా విజయం సాధించిన అభ్యర్థులకే జెడ్పీ చైర్మన్ పదవి వరించనుంది. ఎస్సీ రిజర్వు అయిన స్థానాల్లో పరిశీలిస్తే.. చౌటకూర్, మునిపల్లి, మనూరు, సంగారెడ్డి, కొండాపూర్, జహీరాబాద్ మండలాల జెడ్పీటీసీ స్థానాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. దీంతో ఈ మండలాల్లో గెలుపొందిన జెడ్పీటీసీలకే చైర్మన్ పదవి దక్కనుంది. దీంతో ఈ ఆరు మండలాల ఎన్నికలు ఫోకస్ కానున్నాయి.రేసులో త్రిష రాజనర్సింహ? జెడ్పీ చైర్పర్సన్ రేసులో మంత్రి దామోదర రాజనర్సింహ కూతురు త్రిష పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆమెను బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రిష అందోల్ నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యహరించారు. తన తండ్రి విజయం సాధించడంలో ఆమె కీలకపాత్ర పోషించారు. నియోజకవర్గం అంతా తిరుగుతూ దామోదర గెలుపునకు తనవంతు ప్రయత్నాలు చేశారు. ప్రధానంగా యువత, మహిళ ఓటర్లల్లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీగా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అందోల్ నియోజకవర్గం పరిధిలోని చౌటకూర్ జెడ్పీటీసీగా కానీ, మునిపల్లి జెడ్పీటీసీగా పోటీ చేస్తారనే చర్చ స్థానికంగా జరుగుతోంది. -
కమల్ హాసన్ రికార్డ్ బ్రేక్ చేసిన చిన్నారి త్రిష...
ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో, స్వచ్ఛమైన, కల్తీ లేని భారతీయ సినిమా చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది,ఆరేళ్ల మరాఠీ బాల కళాకారిణి త్రిషా తోసర్ జాతీయ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు పొందిన మరాఠీ చిత్రం ‘‘నాల్ 2’’లో చిమి (రేవతి)గా అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు థోసర్ను జాతీయ పురస్కారం వరించింది. మళయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ వంటి సెలబ్రిటీలతో పాటు ఎందరో అతిరధ మహారధులు సాక్షిగా ఆమె ఆ పురస్కారాన్ని అందుకుంటూంటే హర్షధ్వానాలు మారుమోగాయి. ఈ చిన్నారి విజువల్స్ కూడా వేగంగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి, ఆమెను టాక్ ఆఫ్ ద సినీ సర్కిల్¯గా మార్చి చర్చనీయాంశంగా చేశాయిు.ఈ సందర్భంగా ఆమె స్పందన కూడా అందర్నీ ఆకట్టుకుంది. ‘ ఇంత గొప్ప గౌరవాన్ని స్వీకరించడానికి వేదికపైకి వెళ్ళినప్పుడు, ఆడిటోరియం మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. నా తల్లిదండ్రులు పెద్దలు అందరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు, మనస్ఫూర్తిగా గట్టిగా ఏడ్చారు. చప్పట్లు కొట్టారు, ఏమి సాధించానో నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఒక్కటి తెలుసు – ఈ అవార్డు ద్వారా, నా మహారాష్ట్ర. నా మొత్తం కుటుంబం పేరు ఉన్నత స్థాయికి చేరుకుందని. నా తల్లి చెప్పినట్లుగా, గత 70 సంవత్సరాల జాతీయ అవార్డులలో, ఈ గౌరవాన్ని అందుకున్న అతి పిన్న వయస్కురాలినని. నా ఈ విజయానికి, నా తల్లిదండ్రులకు, నా కుటుంబానికి, నా చిత్ర బృందానికి, నన్ను ఈ పాత్రకు ఎంపిక చేసిన నా దర్శకుడు సుధాకర్ యక్కంటికి ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన సీనియర్ జ్యూరీ సభ్యులందరికీ, ముఖ్యంగా, నా ప్రియమైన ప్రేక్షకులకు, ఎన్నెన్నో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ మద్దతు వల్లనే నేను ఇంత చిన్న వయస్సులో ఈ స్థానానికి చేరుకోగలిగాను. మీ ప్రేమ మద్దతు ఎల్లప్పుడూ నాతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇంతే బాధ్యత నిజాయితీతో పని చేస్తూనే ఉంటానని హామీ ఇస్తున్నాను’’ అంటూ స్పందించింది. ఈ స్పందన కూడా బాగా వైరల్ అవడంతో పాటు ఆమెను కాబోయే స్టార్ గా నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.ఈ సందర్భఃగా అభినయ లోకనాయకుడు కమల్ హాసన్ ఆ చిన్నారిని మనసారా కొనియాడారు. తాను ఒకప్పుడు సాధించిన మైలురాయిని అధిగమించినందుకు ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు . కళతూర్ కన్నమ్మ అనే తమిళ సినిమా ద్వారా జాతీయ అవార్డ్ సాధించిన కమల్ ఆ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడైన బాల నటుడిగా రికార్డ్ సృష్టించారు. ఈ రికార్డ్‌ను ఇప్పుడు త్రిష తిరగరాసింది. ఈ సందర్భంగా కమల్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఆయన స్పందించారు. ‘‘ప్రియమైన త్రిషా తోషర్, నా హర్షధ్వానాలు నీకు దక్కుతాయి. నా మొదటి అవార్డు వచ్చినప్పుడు నాకు అప్పటికే ఆరేళ్ల వయసు...నువ్వు నా రికార్డును అధిగమించావు. ఇలాగే కొనసాగండి మేడమ్. మీ అద్భుతమైన ప్రతిభతో పని చేస్తూనే ఉండండి. ఇంట్లోని మీ పెద్దలకు నా ప్రశంసలు.‘ అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఆ చిన్నారి బాల నటికి అభినయ శిఖరం లాంటి కమల్ నుంచి అందుకున్న ఈ పొగడ్త మరో అత్యున్నత పురస్కారంతో సమానం అనడంలో సందేహం లేదు. -
ఇదే నా బెస్ట్ లైఫ్.. త్రిష పోస్ట్ వైరల్ (ఫొటోలు)
-
చీరలో భాగ్యశ్రీ.. కెమెరా పచ్చబొట్టుతో త్రిష
చీరలో ఎల్లోరా శిల్పంలా అనిపిస్తున్న భాగ్యశ్రీ బోర్సేవీపుపై మూవీ కెమెరా పచ్చబొట్టుతో త్రిషసింపుల్ లుక్స్‌లో కీర్తి సురేశ్ ఎంజాయ్ మెంట్ఓనం ఫుడ్ తింటూ ఆస్వాదిస్తున్న రష్మీ గౌతమ్కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్న రకుల్ ప్రీత్డిజైనర్ డ్రస్సులో మీనాక్షి చౌదరి గ్లామర్ చూశారా? View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) -
హీరో విజయ్‌పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు!
నటి త్రిష.. తొలుత తమిళంలో జోడి అనే చిత్రంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రలో నటించారు. ఆ తర్వాత సూర్యకు జంటగా మౌనం పేసియదే చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత విక్రమ్ సరసన నటించిన సామి చిత్రం త్రిషను స్టార్ హీరోయిన్ చేసింది. అంతే ఆ తరువాత కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవలసిన ఈ బ్యూటీకి కలగలేదు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అంటూ అన్ని భాషలలో నటిస్తూ అగ్ర కథానాయకిగా మారారు. ఈ 42 ఏళ్ల చెన్నై సుందరి ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడం గమనార్హం. అదేవిధంగా కథానాయకిగా 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు. చాలామంది హీరోయిన్ల మాదిరిగానే త్రిష కెరీర్లోను చాలా ఎత్తు పల్లాలు చోటుచేసుకున్నాయి. అలా పడి లేస్తూ తన కెరీర్‌ను పదిల పరుచుకుంటూ వస్తున్న త్రిష ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె సూర్యకు జంటగా నటిస్తున్న కరుప్పు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని దీపావళి సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదే విధంగా తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న విశ్వంభర చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సమ్మర్లో బరిలోకి దిగడానికి సిద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం ఈమె చేతిలో కొత్త చిత్రాలు ఏమీ లేవు. ఇదిలా ఉంటే త్రిష త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటుడు విజయ్ త్రిషకు మంచి మిత్రుడు. అయితే స్నేహబంధం కొందరు వేరే విధంగా కూడా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి 2026లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకల్లో 25 ఏళ్ల సినీ కెరియర్ గాను నటి త్రిషకు స్పెషల్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తాను నటించిన ఒక్కో హీరో గురించి త్రిష మాట్లాడారు. నటుడు విజయ్ గురించి ఆమె మాట్లాడుతూ ఆయన నూతన పయనానికి గుడ్ లక్ అని పేర్కొన్నారు అదేవిధంగా విజయ్ కి ఎలాంటి కల ఉన్నా అది నెరవేరాలని, అందుకు ఆయన అర్హుడని, ఆయనకు తన శుభాకాంక్షలు అని అన్నారు. త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
‘విశ్వంభర’ రిలీజ్‌పై చిరు అప్డేట్.. వామ్మో అంత లేటా?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రాల్లో విశ్వంభర ఒకటి. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్ కావాల్సింది కూడా. అయితే వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తకాకపోవడంతో వాయిదా వేశారు. అప్పటి నుంచి రిలీజ్ డేట్‌పై చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు. సమ్మర్, దసరా, దీపావళి, సంక్రాంతి అంటూ నెట్టింట చర్చలు జరిగినా..మేకర్స్ మాత్రం విడుదల తేదిపై స్పందించలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం విడుదల అవుతుందని చెప్పారు. ఆలస్యానికి గల కారణాన్ని వివరిస్తూ ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశాడు(Vishwambhara Update) ‘విశ్వంభర ఎందుకు ఆలస్యం అవుతుందని చాలా మందికి అనుమానం ఉంది. ఆ జాప్యం సముచితమని నేను భావిస్తున్నాను. ఈ సినిమా సెకండాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉంది. దీన్ని అత్తుత్తమంగా మీకు అందించాలనే ప్రయత్నమే ఈ జాప్యానికి కారణం. ఎలాంటి విమర్శలకు చోటివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సినిమా చందమామ కథలా సాగిపోతుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది. దీని గ్లింప్స్‌ను ఆగస్టు 21 సాయంత్రం 6.06కు విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చేసేలా దీన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకువస్తారు. 2026 సమ్మర్లో ఎంజాయ్ చేయండి’ అని చిరంజీవి తెలిపారు.విశ్వంభర విషయానికొస్తే.. చిరంజీవి హీరోగా నటించిన సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ మూవీ ఇది. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. MEGASTAR @KChiruTweets shares a personal note to his fans and the audience about #Vishwambhara ❤️Check out the MEGA BLAST ANNOUNCEMENT now ⚡-- https://t.co/RQ9is0OQCcLet us celebrate the MEGA BIRTHDAY with #MEGABLASTTEASER out today at 6.06 PM ❤🔥MEGA MASS BEYOND… pic.twitter.com/dtJ2Jo0l1m— UV Creations (@UV_Creations) August 21, 2025 -
హిట్ కాంబినేషన్లో వెంకటేష్ సినిమా ప్రారంభం
ఈ ఏడాదిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకటేష్ కొత్త (Venky 77) సినిమాను ప్రారంభించారు. నేడు దర్శకుడు త్రివిక్రమ్‌తో వెంకీ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. మరికొద్దిరోజుల్లోనే రెగ్యూలర్ షూటింగ్ కూడా మొదలు కానుంది.వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి త్రివిక్రమ్ దర్శకత్వంలోనే వెంకీ నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్స్‌గా త్రిష, రుక్ష్మిణీ వసంత్, నిధి అగర్వాల్, మీనాక్షి చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిలో ఇద్దరు నటించనున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది.వెంకటేష్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. మీనాతో కలిసి ఓ సినిమా (దృశ్యం 3) చేయనున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత అనిల్ రావిపూడి దర్వకత్వంలోనే మరో సినిమా ఉంది. ఈ చిత్రాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి మూవీలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే వెంకటేష్ చేయబోయే సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఉంది. ఇలా వరుస సినిమాలతో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. 𝗧𝘄𝗼 𝗼𝗳 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗖𝗶𝗻𝗲𝗺𝗮’𝘀 𝗺𝗼𝘀𝘁 𝗹𝗼𝘃𝗲𝗱 𝗻𝗮𝗺𝗲𝘀 @VenkyMama & #Trivikram unite for a tale to cherish for all time ❤️#Venky77 ~ @haarikahassine Production No. 8 - #VenkateshXTrivikram was launched today with blessings and love from near and dear ones 🪔… pic.twitter.com/NvxQ3pnMPC— Haarika & Hassine Creations (@haarikahassine) August 15, 2025 -
చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. 19 ఏళ్ల తర్వాత అవార్డ్ సినిమా రీరిలీజ్
చిరంజీవి- త్రిష కలిసి నటించిన ‘స్టాలిన్’ సినిమా రీరిలీజ్ కానుంది. 2006లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఎ. ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఖుష్బూ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, ప్రదీప్ రావత్ వంటి స్టార్స్ నటించారు. ఉత్తమ సందేశాత్మక చిత్రంగా (స్పెషల్ జ్యూరీ అవార్డు) నంది పురస్కారం కూడా స్టాలిన్ అందుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీని చిరు సోదరుడు నాగబాబు నిర్మించగా గీతా ఆర్ట్స్ పంపిణీ చేసింది. ప్రస్తుతం స్టాలిన్ ఏకంగా మూడు (ఆహా, అమెజాన్, జియోహాట్‌స్టార్) ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో హీరోయిన్ అనుష్క కూడా ఒక స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది.ఆగష్టు 22న మెగాస్టార్ చిరు పుట్టినరోజు సందర్భంగా స్టాలిన్ చిత్రాన్ని 4K వర్షన్లో విడుదల చేయబోతున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ స్వామి నాయుడు ఒక పోస్టర్‌ను తాజాగా లాంచ్ చేశారు. ఈ సినిమా చాలామంది యూత్‌ను ఆలోచించేలా చేసిందని చెప్పవచ్చు. సుమారు 19 ఏళ్ల తర్వాత స్టాలిన్ రీరిలీజ్ కానున్నడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మళ్లీ త్రిష- చిరు కలిసి విశ్వంభరలో నటిస్తున్న విషయం తెలిసిందే. -
'త్రిష' మంచి మనసు.. ప్రముఖ ఆలయానికి ఏనుగు విరాళం
సౌత్ ఇండియా పాపులర్ హీరోయిన్ త్రిష మంచి మనసుతో పాటు తనలోని భక్తిని చాటుకున్నారు. తమిళనాడుకు చెందిన అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ ఆలయానికి ‘గజ’ అనే రోబో ఏనుగును ఆమె బహూకరించారు. చెన్నైకి చెందిన పీపుల్ ఫర్ క్యాటిల్ ఇండియా (పీఎఫ్‌సీఐ) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి త్రిష పనిచేస్తున్న విషయం తెలిసిందే. వారి భాగస్వామ్యంతోనే ఆమె ఈ ఏనుగును అందించారు. సంప్రదాయ మంగళవాద్యాల మధ్య 'గజ' అనే ఏనుగును అందజేసినట్లు పీఎఫ్‌సీఐ నిర్వాహకులు అధికారికంగా తెలిపారు.ఆలయంలో నిర్వహించే వేడుకల్లో గజరాజులూ భాగస్వాములవుతుంటాయి. ప్రాణమున్న మూగజీవులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చాలామందిలో ఒక వాదన ఉంది. కొన్ని సందర్భాల్లో వాటికి అసౌకర్యం కలిగినప్పుడు గందరగోళమూ సృష్టిస్తుంటాయి కూడా.. అప్పుడు భక్తులు ప్రమాదంలో కూడా చిక్కుకుంటారు. వాటి నుంచి సురక్షితంగా ఉండేందుకే ఇలా రోబో ఎనుగులు వచ్చేశాయి. ఇప్పటికే పలు ఆలయాల్లో ఇలాంటి ఎనుగులు కనిపిస్తున్నాయి. తాజాగా త్రిష అందించిన ఏనుగు 11 అడుగుల పొడవుతోపాటు 800 కేజీల బరువుతో ఉన్నట్లు సంస్థ నిర్వాహుకులు తెలిపారు. ఈ రోబో ఏనుగును తయారు చేసేందుకు సుమారు రూ.8 లక్షలు ఖర్చయిందట. ఈ రోబో ఏనుగు అయిదుగురిని మోయగలదనీ, స్విచ్ సాయంతో దాని తొండాన్ని పైకి, కిందకు కదిలించవచ్చనీ చెబుతున్నారు. దేవుడి ఊరేగింపు సమయంలో కూడా ఈ ఏనుగును ఉపయోగించుకోవచ్చు. కేరళ రాష్ట్రం త్రిశూర్‌లోని శ్రీకృష్ణ దేవాలయంలో మొదటిసారి రోబో ఏనుగులను పరిచయం చేశారు. హీరోయిన్ ప్రియమణి విరాళంగా రెండు ఏనుగులను అందించారు. నిజమైన ఏనుగులకు ఎలాంటి హాని కలగకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మెకానికల్ ఏనుగులు వచ్చేశాయని ఆలయ పూజారులు చెబుతున్నారు. -
Trisha Love Story: హింట్ ఇస్తున్నా త్రిష..!
-
స్టార్ హీరోతో రిలేషన్ .. ప్రేమపై త్రిష పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రేమలో ఉన్నారనే రూమర్ గత కొంతకాలంగా అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇద్దరు ప్రత్యేక్షంగా స్పందించకపోవడం.. కెరీర్ పరంగా బీజీ కావడంతో ఇటీవల అలాంటి పుకార్లు పెద్దగా రాలేదు.కానీ తాజాగా విజయ్ బర్త్‌డే రోజు త్రిష అతని ఫోటో షేర్ చేస్తూ విషెస్ చెప్పడం.. అదే ఫోటోకి త్రిష తల్లి లవ్ సింబల్ జోడించడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్త మరోసారి వైరల్ అయింది.తాజాగా ఈ పుకార్లపై త్రిష పరోక్షంగా స్పందించింది. ‘పూర్తిగా ప్రేమలో మునిగిపోతే..అది కొందరిని తిగమక చేస్తుంది’ అనే కొటేషన్‌ని త్రిష తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం త్రిష పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్‌తో ప్రేమను కన్ఫర్మ్ చేసిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా త్రిష వయసు ప్రస్తుతం 42 ఏళ్లు. ఆమె పెళ్లిపై గతంలోనూ పలు రూమర్స్ వచ్చినా.. త్రిష వాటిని కొట్టి పారేసింది. మొత్తానికి 42 ఏళ్ల తర్వాత తన ప్రేమ విషయాన్ని చెప్పేసిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.త్రిష కెరీర్ విషయానికొస్తే. ఇటీవల థగ్‌లైఫ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్‌కి జోడీగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవికి జోడీగా విశ్వంభర చిత్రంలో నటిస్తోంది. సూర్య ‘కరుప్పు’ చిత్రంలో కూడా త్రిషనే హీరోయిన్గా తీసుకున్నారు. విజయ్ విషయానికొస్తే.. తన చివరి చిత్రం ‘జననాయకుడు’ (జన నాయగన్)తో ప్రేక్షకులను అలరించనున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ విజయ్ జన్మదినం రోజున విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లనున్నారు. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
త్రిష ఇంట్లో దళపతి విజయ్.. ఆ రూమర్స్ నిజమేనా?
తమిళ హీరో విజయ్, హీరోయిన్ త్రిష గురించి ఏడాది క్రితం కొన్ని రూమర్స్ వచ్చాయి. వీళ్లిద్దరూ ప్రస్తుతం డేటింగ్లో ఉన్నారని, త్వరలో ఒక్కటయ్యే అవకాశాలున్నాయని కాస్త గట్టిగానే తమిళ మీడియాలో వినిపించింది. తర్వాత కొన్నిరోజులకు అంతా సైలెంట్ అయిపోయింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్రిష పెట్టిన ఫొటోనే అందుకు కారణం.దళపతి విజయ్.. ఆదివారం పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. పలువురు సెలబ్రిటీలు ఆయనకు విష్ చేశారు. కీర్తి సురేశ్ కూడా విజయ్‌కి బర్త్ డే విషెస్ చెబుతూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది. అయితే త్రిష మాత్రం 'హ్యాపీ బర్త్ డే టూ బెస్టెస్ట్' అని క్యాప్షన్ పెట్టి, విజయ్ తన పెట్ డాగ్‌తో ఆడుతుండగా, తాను పక్కనే కూర్చుని ఉన్న ఫొటోని త్రిష పోస్ట్ చేసింది. దీంతో అభిమానులకు మరోసారి సందేహాలు మొదలయ్యాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఈ ఫొటో చూస్తే విజయ్.. త్రిష ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఇది ఇప్పటి ఫొటోనా? పాత ఫొటోనా అనేది క్లారిటీ లేదు. కానీ అభిమానులు మాత్రం వీళ్లు ఇద్దరూ డేటింగ్లో ఉన్నారని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కెరీర్ విషయానికొస్తే.. విజయ్ 'జన నాయగణ్' మూవీ చేస్తున్నాడు. ఇదే ఇతడికి చివరిది. ఎందుకంటే ఇప్పటికీ రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనుంది.త్రిష విషయానికొస్తే.. 40 ఏళ్లు దాటేసినా సరే పెళ్లి చేసుకోలేదు. గతంలో ఓసారి పెళ్లి వరకు వెళ్లింది గానీ ఎందుకో అది రద్దయిపోయింది. ఇక ఈమె పని అయిపోయింది అనుకునే టైంలో '96' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చింది. తర్వాత 'పొన్నియిన్ సెల్వన్' రెండు పార్ట్స్, లియో లాంటి క్రేజీ సినిమాలు చేసింది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో నటిస్తోంది.(ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: నాగార్జున)Happy Birthday bestest🤗🧿 pic.twitter.com/K4JFdIZXjn— Trish (@trishtrashers) June 22, 2025 -
సూర్య- ఆర్జే బాలాజీ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్
హీరో సూర్య 45వ చిత్రం ఇప్పటికే ప్రారంభమైంది. తాజాగా టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. గతేడాదిలో పొల్లాచ్చి సమీపంలోని ఆనైమలై ప్రాంతంలో గల ప్రసిద్ధి చెందిన మాసానీ అమ్మన్ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. నటుడు ఆర్జే బాలాజీ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటి త్రిష హీరోయిన్గా నటించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.సూర్య- ఆర్జే బాలాజీ ప్రాజెక్ట్‌కు 'కరుప్పు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఇదొక యాక్షన్ అడ్వెంచరస్ చిత్రమని తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇదే ఏడాది చివరలో కరుప్పు విడుదల కావచ్చని సమాచారం. రేటియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించిన ఆర్జే బాలాజీ మల్టీ టాలెంటెడ్ అని తెలిసిందే. ఆయన నటుడు, గాయకుడు మాత్రమే కాదు, దర్శకుడిగానూ కొలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. నయనతారతో ‘అమ్మోరు తల్లి’ తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘వీట్ల విశేషం’ అంటూ సత్యరాజ్‌తో ఓ మూవీ తీసి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు హీరో సూర్యతోనే ఛాన్స్ దక్కించుకుని హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. -
'థగ్ లైఫ్' హిట్ సాంగ్.. వీడియో వర్షన్ వచ్చేసింది
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ సినిమా 'థగ్ లైఫ్'.. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఎ. ఆర్. రెహమాన్ అందించిన సంగీతం బాగుందన్నప్పటికీ సినిమా స్టోరీ పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. అయితే, ఈ మూవీలో సూపర్ హిట్ సాంగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రంలో శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేశారు.థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో సింగర్ చిన్మయి పాడిన 'ముత్తా ముజై' తమిళ్ వర్షన్ పాటా బాగా వైరల్ అయింది. అదే పాటను సినిమాలో మాత్రం సింగర్ ఢీ పాడింది. తెలుగు వర్షన్లో చిన్మయి ఆలపించింది. ప్రస్తుతం రెండు భాషలలో వీడియో వర్షన్‌ను విడుదల చేశారు. -
పెళ్లి చీరలో కేతిక శర్మ.. అదితీ మరీ ఇంత క్యూట్నెస్సా
క్యూట్‌నెస్‌తో మాయ చేస్తున్న అదితీ శంకర్'సింగిల్' షూటింగ్ జ్ఞాపకాలతో కేతిక శర్మకత్తితో రాణిలా రౌద్రం చూపిస్తున్న నందిని రాయ్బాలిలో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న ప్రియా వారియర్పాస్తా చేసేస్తున్న హీరోయిన్ నివేదా థామస్మే నెల జ్ఞాపకాలతో బన్నీ భార్య స్నేహారెడ్డిబికినీలో అందాలన్నీ చూపించేస్తున్న రమ్య పసుపులేటి View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Yukti Thareja (@realyukti) -
తొలిరోజే నెగిటివ్ టాక్.. 'థగ్ లైఫ్' కలెక్షన్స్ ఎంత?
కమల్ హాసన్ దిగ్గజ నటుడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ 'విక్రమ్' తప్పితే ఆయన కెరీర్లో గత కొన్నేళ్లలో సరైన హిట్ అన్నది లేదు. దీంతో 'థగ్ లైఫ్' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. భాష వివాదం వల్ల కర్ణాటకలో పూర్తిగా ఈ మూవీని రిలీజ్ చేయనని తెగేసి చెప్పాడు. దీంతో తెలుగు-తమిళ భాషల్లో నిన్న(జూన్ 5) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ దీనికి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయ్? సోషల్ మీడియాలో టాక్ ఏం నడుస్తోంది?కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో మూడు దశాబ్దాల క్రితం 'నాయకుడు' అనే సినిమా వచ్చింది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. క్లాసిక్‌గా నిలిచిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే హీరో-దర్శకుడు కలిసి ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారనేసరికి హైప్ ఏర్పడింది. 'థగ్ లైఫ్' ట్రైలర్ కూడా బాగుండేసరికి కమల్ హిట్ కొట్టడం గ్యారంటీ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ తర్వాత పూర్తిగా టాక్ మారిపోయింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)తెలుగు, తమిళంలో ఎక్కడా కూడా కమల్ 'థగ్ లైఫ్' చిత్రానికి పాజిటివ్ టాక్ రాలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. అయినా సరే తొలిరోజు ఓ మాదిరి కలెక్షన్స్ వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.17 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.కోటి షేర్ కూడా రాలేదని అంటున్నారు. కమల్-మణిరత్నం కాంబోకి ఇది చాలా తక్కువ మొత్తం అని చెప్పొచ్చు. కొన్నాళ్ల క్రితం వచ్చిన కమల్ హాసన్ 'ఇండియన్ 2' ఘోరమైన ఫ్లాప్. కానీ ఈ చిత్రానికి తొలిరోజు రూ.25 కోట్ల వరకు వచ్చాయి. 'థగ్ లైఫ్'కి మాత్రం వసూళ్లు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించట్లేదు.'థగ్ లైఫ్' విషయానికొస్తే.. రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓ గ్యాంగ్‌స్టర్. తల్లిదండ్రులు కోల్పోయిన అమర్ (శింబు) అనే కుర్రాడిని పెంచుకుంటాడు. తన నేర సామ్రాజ్యానికి కీలకంగా మారుస్తాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల శక్తిరాజు-అమర్ మధ్య గొడవలు వస్తాయి. ఒకరిని ఒకరు చంపుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంతకీ ఇలా జరగడానికి కారణాలేంటి? ఈ కథలో త్రిష పాత్రేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు) -
ఆ ఓటీటీలోకి ‘థగ్ లైఫ్’ .. స్ట్రీమింగ్ అప్పుడేనా?
కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. శింబు కీలక పాత్ర పోషించారు. త్రిష,అభిరామి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కమల్‌కు ‘నాయకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన మణిరత్నం.. ఈ సారి మాత్రం ఆ స్థాయి కథతో రాలేదని చాలా మంచి అభిప్రాయ పడుతున్నారు. మణిరత్నం మార్క్ సినిమాలో కనిపించేలేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇలా మిక్స్డ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీ వివరాలు ఆసక్తికరంగా మారాయి. (థగ్ లైఫ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)భారీ ధరకు ఓటీటీ రైట్స్38 ఏళ్ల తర్వాత కమల్-మణిరత్నం కలయికలో వచ్చిన చిత్రం కావడంతో థగ్‌లైఫ్‌పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 149 కోట్లకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అలాగే శాటిలైట్ రైట్స్‌ని స్టార్ విజయ్ టీవీ రూ. 60 కోట్లకు కొనుగోలు చేసినట్లు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి.ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడేనా.. థియేటర్స్‌లో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే ఒప్పందంలో నెట్ ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిందట. ఈ లెక్కన ఆగస్ట్ మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అయితే స్వతంత్ర దినోత్సవం(ఆగస్ట్ 15) కానుకగా ఆగస్ట్ 7న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నెటిఫిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. -
‘థగ్ లైఫ్’ మూవీ రివ్యూ
38 ఏళ్ల క్రితం ‘నాయకుడు’తో బాక్సాఫీస్‌ని షేక్ చేశారు దర్శకుడు మణిరత్నం, హీరో కమల్ హాసస్. ఆ తర్వాత ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రమే ‘థగ్ లైఫ్’(Thug Life Review). ఈ హై ఓల్టేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో శింబు కీలక పాత్ర పోషించారు. త్రిష, అభిరామి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 5) ఈ చిత్రం రిలీజైంది. దాదాపు 38 ఏళ్ల తర్వాత మణిరత్నం-కమల్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.‘థగ్ లైఫ్’ కథేంటంటే..?ఢిల్లీకి చెందిన రంగరాయ శక్తిరాజు(కమల్ హాసన్) ఒక గ్యాంగ్‌స్టర్. తన అన్న మాణిక్యం(నాజర్)తో కలిసి మరో గ్యాంగ్‌స్టర్ సదానందం(మహేశ్ మంజ్రేకర్)తో ఒక సెటిల్మెంట్కి వెళ్తాడు. అక్కడికి పోలీసులు రావడంతో కాల్పులు జరుగుతాయి. దీంతో రంగరాయ శక్తిరాజు అమర్(శింబు) అనే చిన్నారిని అడ్డుపెట్టుకొని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. తన ప్రాణాలను కాపాడినందుకు అమర్‌ని పెంచి పెద్ద చేస్తాడు. తన నేర సామ్రాజ్యానికి అమర్‌ని కీలక శక్తిగా మారుస్తాడు. కొన్నాళ్ల తర్వాత అమర్నే అనుమానిస్తాడు రంగరాయ శక్తిరాజు(Thug Life Review). అదే సమయంలో రంగరాయ శక్తిరాజే తన తండ్రిని చంపాడని అమర్‌కి తెలుస్తుంది. దీంతో రంగరాయ శక్తిరాజును చంపేందుకు ప్రయత్నిస్తాడు. మరి అమర్ ప్రయత్నం ఫలించిందా? సొంత అన్న మాణిక్యం కూడా రంగరాయ శక్తిరాజుని చంపేందుకు ఎందుకు ప్రయత్నించారు? అసలు అమర్ తండ్రిని చంపిందెవరు? చిన్నప్పుడే తప్పిపోయిన చెల్లెలు చంద్ర(ఐశ్వర్య లక్ష్మీ) మళ్లీ అమర్‌ని కలిసిందా? సొంత తమ్ముడిలా పెంచిన అమరే తన ప్రాణాలను తీసేందుకు కుట్ర చేశాడనే విషయం తెలిసిన తర్వాత రంగరాయ శక్తిరాజు ఏం చేశాడు? భార్య లక్ష్మీ(అభిరామి), కూతురు మంగ(సంజన) కోసం శక్తిరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ కథలో త్రిష పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మణిరత్నం-కమల్ కాంబినేషన్లో ఓ సినిమా అంటే అంచనాలు పెరగడం సర్వ సాధారణం. అందుకే ‘థగ్ లైఫ్’పై కమల్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా మొదటి నుంచి భారీ ఆశలు పెట్టుకున్నారు. దానికి తోడు ప్రమోషన్స్‌లో కమల్ ‘ఈ చిత్రం ‘నాయకుడు’ కంటే పెద్ద హిట్ అవుతుంది’ అని చెప్పడంతో సాధారణ ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతోనే సినిమాకు వెళ్లారు. వారి అంచనాలను అందుకోవడంలో మణిరత్నం సఫలం కాలేదనే చెప్పాలి. ఓ రొటీన్ గ్యాంగ్‌స్టర్ కథనే కమల్‌తో చెప్పించాడు. కథనంలో కూడా కొత్తదనం లేదు. సినిమా చూస్తున్నంతసేపు మణిరత్నం తెరకెక్కించిన ‘నవాబ్’ చిత్రమే గుర్తుకొస్తుంది. అందులో వచ్చే ట్విస్టులు కొంతమేర ఆకట్టుకుంటాయి. ఇందులో అదీ కూడా ఉండదు. ఓ సాధారణమైన గ్యాంగ్‌స్టర్ కథకి ఫ్యామిలీ ఎమోషన్స్‌ని యాడ్ చేసి ‘థగ్ లైఫ్’ ని తీర్చిదిద్దాడు మణి. సాధారణ కథనైనా తెరపై ఎంతో అద్భుతంగా చూపించే సత్తా ఉన్న మణిరత్నం.. ఈ కథ, అందులో రాసుకున్న పాత్రలు, వాటిని తీర్చిదిద్దిన విధానం చూస్తే నిజంగానే ఇది మణి సినిమానేనా అనే అనుమానం కలుగుతుంది. కమల్‌తో పాటు ఏ ఒక్కరి పాత్రను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా ట్విస్టులూ ఉండవు. ఊహకందేలా కథనం సాగుతుంది. అయితే ఎప్పటి మాదిరే నిజాయితీగా కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ‘ఇది యముడికి నాకు జరిగే కథ’ అని కమల్ పాత్రలో చెప్పిస్తూ సినిమాను ప్రారంభించారు దర్శకుడు. కీలక పాత్రల పరిచయం వరకు కథనం ఆసక్తికరంగానే సాగుతుంది. తన అన్న మాణిక్యం కూతురు ఆత్మహత్య చేసుకోవడం.. దానికి కారణమైన వ్యక్తిని కాల్చి చంపి శక్తిరాజు జైలుకు వెళ్లిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. అమర్ మారిపోవడం.. ఆధిపత్య పోరుతో శక్తిరాజుని చంపేందుకు చేసే కుట్ర ఇవ్వన్నీ రొటీన్‌గా ఉన్నా.. మధ్యలో వచ్చే ఫ్యామిలీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కమల్-అభిరామి మధ్య వచ్చే సన్నివేశాలను రొటీన్ కథనంతో విగిసిపోతున్న ప్రేక్షకులకు ఉపశమనం కలిగిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై కాస్త ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత రొటీన్‌గా సాగుతుంది. రివేంజ్ డ్రామా అంత ఆస్తికరంగా అనిపించదు. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. కమల్ నటన గురించి ఎం చెప్పగలం. ఎలాంటి పాత్రల్లోనైనా జీవించగలడు. రంగరాయ శక్తిరాజు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. అయితే కమల్ గతంలో అలాంటి పాత్రలు చాలా చేడయంతో తెరపై చూసినప్పుడు కొత్తగా అనిపించదు. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా కమల్ పాత చిత్రాలను గుర్తుకు చేస్తాయి. అమర్ పాత్రకు శింబు న్యాయం చేశాడు. అయితే ఆ పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. మాణిక్యంగా నాజర్ రొటీన్ పాత్రే చేశాడు. ఇక శక్తిరాజు భార్య లక్ష్మీగా అభిరామి ఉన్నంతలో బాగానే నటించింది. త్రిష పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. మణిరత్నం- కమల్ సినిమా కాబట్టే ఆ పాత్ర చేయడానికి త్రిష ఒప్పుకుందేమో. పోలీస్ ఆఫీసర్‌గా అశోక్ సెల్వరాజ్, శక్తిరాజు టీంలో కీలక వ్యక్తి పత్రాస్గా జోజు జార్జ్ తో పాటు తనికెళ్ల భరణి, ఐశ్వర్య లక్ష్మీ, మహేశ్ మంజ్రేకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఈ సినిమాకు ప్రధాన బలం ఏఆర్ రెహమాన్. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం అదిరిపోయింది. పాటలు పర్వాలేదు. రవి.కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో కట్ చేయాల్సిన సీన్లు చాలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘థగ్ లైఫ్’ కోసం భారీ రెమ్యునరేషన్.. కమల్, త్రిష, శింబు ఎంతెంత తీసుకున్నారంటే?
లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’(Thug Life). కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలక పాత్ర పోషిస్తున్నారు. త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, పంకజ్ త్రిపాఠి, సాన్య మల్హోత్రా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘నాయకుడు’ తర్వాత కమల్, మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. 38 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడంతో థగ్ లైఫ్‌పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించారు. ప్రమోషన్స్‌కి కూడా భారీగానే ఖర్చు చేశారు. అయితే బడ్జెట్లో ఎక్కువ భాగం నటీనటుల రెమ్యునరేషన్‌కే వెళ్లిందట. ఈ చిత్రానికి కమల్ నిర్మాతగా వ్యవహరించాడు. మణిరత్నం కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. దీంతో వీరిద్దరు పారితోషికాలు తీసుకోకుండా లాభాల్లో వాటాలను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఇక ఈ సినిమాకు అత్యధిక రెమ్యునరేషన్ శింబుకి ఇచ్చారట. ఈ చిత్రంలో ఆయనది చాలా కీలకమైన పాత్ర. దీంతో రూ. 40 కోట్ల పారితోషికం ఇచ్చి మరీ శింబుని ఆ పాత్రకు తీసుకున్నారట.ఇక హీరోయిన్గా నటించిన త్రిష కూడా భారీగానే తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నటించినందుకు గాను రూ. 12 కోట్ల పారితోషికం పుచ్చుకుందట. గత సినిమాతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. అలాగే ఇతర కీలక పాత్రలో నటించిన అశోఖ్ సెల్వన్, బోజు జార్జ్ కోటి రూపాయల చొప్పున పారితోషికంగా తీసుకున్నారు. ఇక మరో కీలక పాత్రలో నటించిన అభిరామి రూ. 50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్లతో కలిపి మొత్తం ఈ సినిమాకు రూ. 300 కోట్ల బడ్జెట్ అయిందట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. -
వైజాగ్ లో గ్రాండ్‌గా ‘థగ్ లైఫ్’ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
'థగ్ లైఫ్' సాంగ్స్.. దుమ్మురేపిన టాప్ సింగర్స్
నాయకుడు (1987) సినిమా తర్వాత కమల్ హాసన్, మణిరత్నం చేస్తున్న 'థగ్ లైఫ్'.. జూన్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తాజాగా తెలుగు వర్షన్ సాంగ్స్ అన్ని ఒకే వీడియోతో షేర్ చేశారు. ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఇందులో శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. విక్రమ్ తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. కమల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా థగ్ లైఫ్ నిలుస్తుందని దర్శకుడు మణిరత్నం అన్నారు. ప్రస్తుతం విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులకు సులువుగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అయితే, టాప్ సింగర్ చిన్మయి ఈ సినిమాలో అదిరిపోయే సాంగ్‌ను పాడారు. ట్రాక్ మూడో వరుసలో ఉన్న 'ముద్దు వాన' సాంగ్‌ను ఆమె పాడారు. సింగర్ మంగ్లీ కూడా ఈ చిత్రంలో సూపర్ హిట్ పాటను ఆలపించారు. థగ్ లైఫ్ పాటల ప్రారంభంలోనే 'జింగుచ్చా' అంటూ ఆమె దుమ్మురేపారు. ఈ సినిమా కోసం ప్రముఖ గాయకుడు కె.జె. యేసుదాస్ కుమారుడు విజయ్ ఒక పాట, ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ ఒక పాటతో మెప్పించారు. -
‘థగ్ లైఫ్’ మూవీ ప్రెస్మీట్లో మెరిసిన నటి త్రిష (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ‘థగ్ లైఫ్’ చిత్రం మీడియా మీట్ (ఫొటోలు)
-
కమల్ హాసన్ థగ్ లైఫ్.. 'షుగర్ బేబీ' వచ్చేసింది..!
కమల్‌హాసన్ , త్రిష జంటగా నటిస్తోన్న తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమాకు మణిశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 36 సంవత్సరాల తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో కమల్ హాసన్ జతకట్టారు. దీంతో వీరిద్దరి కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. షుగర్ బేబీ అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను అలెగ్జాండ్ర జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ ఆలపించారు. (ఇది చదవండి: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ రిలీజ్)కాగా..ఈ సినిమా జూన్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో శింబు కీలక పాత్రలో కనిపించనున్నారు. శింబు సరసన సన్య మల్హోత్రా నటించింది. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ, జోజూ జార్జ్, నాజర్, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్, అభిరామి, మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
హీరోయిన్‌తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్‌పై విమర్శలు
కోలీవుడ్ స్టార్ హీరో హీరో కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. సోషల్‌మీడియాలో ట్రైలర్‌పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రంలో శింబు, త్రిషా కృష్ణన్, ఐశ్వర్యా లక్ష్మీ, జోజూ జార్జ్, అభిరామి ఇతర కీలక పాత్రల్లో నటించారు. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ అన్నాత్తే, ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. కమల్‌హాసన్ ‘విక్రమ్’, శివ కార్తికేయన్ ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఎన్. సుధాకర్‌రెడ్డి, ఈ ‘థగ్ లైఫ్’ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై తెలుగులో విడుదల చేస్తున్నారు.ముద్దు సీనుతో వైరల్‘థగ్ లైఫ్’ ట్రైలర్లో కమల్ హాసన్(70), అభిరామి (41) మధ్య లిప్‌లాక్ సీన్ కనిపిస్తుంది. వారిద్దరి మధ్య వయసు 30ఏళ్లు గ్యాప్ ఉంది. దీంతో కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆపై త్రిషతో కమల్ చెప్పిన డైలాగ్ కూడా చాలా బోల్డ్‌గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కమల్‌కు భార్యగా అభిరామి నటించింది. ఇద్దరి మద్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం ఆపై రొమాంటిక్ సీన్ తెరకెక్కించడంతో ట్రైలర్‌పై మిశ్రమ స్పందన వస్తుంది.అయితే, కమల్ అభిమానులు కూడా వాటిని తిప్పికొడుతున్నారు. మొత్తం ట్రైలర్లో కేవలం ముద్దు సన్నివేశాలు,సన్నిహిత సన్నివేశాలను తీసుకొని వాటిపై దృష్టి పెట్టడం కరెక్ట్ కాదన్నారు. సినిమాల్లో ఇవన్నీ చాలా కామన్‌గానే ఉంటాయి. వాటిపైన దృష్టి పెట్టడం మానేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. మరొక నెటిజన్ ఇలా వ్రాశాడు.., తన వయసులో దాదాపు సగం వయసున్న హీరోయిన్లతో అలాంటి సన్నివేశాలు చేయడం సాధారణ విషయం కాదని, వాటిని ఎలా సమర్ధిస్తారని కౌంటర్ ఇస్తున్నారు.అభిరామి ఎవరు..?కేరళకు చెందిన అభిరామి తెలుగులో 'చెప్పవే చిరుగాలి'(2004) సినిమాలో నటించింది. ఆ తర్వాత అమర్ అక్బర్ ఆంటోని, మహారాజ, సరిపోదా శనివారం, భలే ఉన్నాడే, వెట్టైయన్ వంటి సినిమాల్లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు సినిమా తర్వాత 2004లో ఉన్నత చదువులకు అమెరికాకు వెళ్లిన ఆమె 2013లో తిరిగి వచ్చింది. 'విశ్వరూపం', 'విశ్వరూపం 2' సినిమాలలో హీరోయిన్ పూజా కుమార్‌కు తమిళ వెర్షన్లో డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు మళ్లీ కమల్ సరసన అభిరామి ఛాన్స్ కొట్టేసింది. -
త్రిష బర్త్ డే సెలబ్రేషన్స్.. హాలీవుడ్ స్టైల్లో మీనాక్షి
హీరోయిన్ త్రిష పుట్టినరోజు సెలబ్రేషన్స్వింటేజ్ హాలీవుడ్ స్టైల్లో మీనాక్షి చౌదరిశుభం మూవీతో బిజీ.. సామ్ క్యూట్ పోస్ట్డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో శ్రద్ధా కపూర్అందాల అపరంజి బొమ్మలా ఐశ్వర్య లక్ష్మీబ్యాక్ పోజులతో కిక్కిస్తున్న కావ్య థాపర్చీరలో హెబ్బా పటేల్ స్వీట్ పోజులు View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samyuktha Viola Viswanathan (@samyukthaviswanathan) -
డబుల్ ధమాకా
చిత్ర పరిశ్రమలోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటినప్పటికీ బిజీగా దూసుకెళుతున్నారు త్రిష. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న త్రిష పుట్టినరోజు మే 4న. ఈ సందర్భంగా డబుల్ ధమాకాలా ఆమె నటిస్తున్న ‘విశ్వంభర, థగ్ లైఫ్’ సినిమాల నుంచి లుక్స్ రిలీజ్ చేశారు మేకర్స్. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ‘విశ్వంభర’లో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఆదివారం త్రిష పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె నటించిన అవని పాత్ర లుక్‌ను రివీల్ చేశారు. అదే విధంగా కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన ‘థగ్ లైఫ్’ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించారు. ఈ మూవీ నుంచి త్రిషపోస్టర్ని, అలాగే తొలి సింగిల్ ‘జింగుచు...’ పాటను కూడా విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యంగా అందించగా, శ్రీకృష్ణ, మంగ్లీ, ఆశిమా మహాజన్, వైశాలీ సామంత్ ఆలపించారు. ఈ సినిమా జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. -
'త్రిష' జీవితాన్ని మార్చేసిన రెండు సినిమాలు ఇవే..
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ నేడు 42వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రిష తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ నటించింది. ఇటీవల కెరీర్లో లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి ఫాంలో ఉంది. అయితే, ప్రతి ఒక్కరికి జీవితాన్ని మార్చేసిన సినిమా అంటూ ఒకటి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ, బాలకృష్ణకు మంగమ్మగారి మనవడు ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సినిమా తమ జీవితాన్ని మార్చేసి ఉంటుంది. అలా త్రిష జీవితాన్ని టర్న్ చేసిన రెండు చిత్రాలు ఉన్నాయి.వర్షంతో మార్పు2004లో ప్రభాస్‌తో 'వర్షం' సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమా త్రిష కెరీర్‌నే మార్చేసింది. శైలజ అలియాస్ శైలు పాత్రలో కనిపించిన త్రిష ప్రేక్షకులను మాయ చేశారు. అలా తన అందంతో అందరినీ వర్షంలో తడిసేలా చేశారు. ఈ క్రమంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా,అతడు,ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ,బుజ్జిగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో త్రిష చేరిపోయారు.'గిల్లీ'తో భారీగా ఆఫర్లు తెలుగులో మహేశ్ బాబు- భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఒక్కడు’కు రీమేక్‌గా ‘గిల్లీ’ చిత్రం తమిళ్లో 2004లో విడుదలైంది. ఇందులో విజయ్- త్రిష జంటగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 200 రోజులకు పైగా కొనసాగింది. విజయ్ కెరీర్లో ఇది అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిస్తే త్రిషకు తమిళ్లో భారీ ఆఫర్స్‌ను తెచ్చిపెట్టింది. ఏకంగా ఆమెకు 12 సినిమా ఛాన్సులు దక్కాయి. ఆపై వాణిజ్యం ప్రకారం, ఈ చిత్రం 2004లో అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన తమిళ చిత్రంగా రజనీకాంత్ నటించిన నరసింహా ఉండేది. దానిని గిల్లీ దాటేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా రాబట్టడమే కాకుండా అనేక రికార్డ్స్‌ను అందుకుంది. బాలీవుడ్‌కు దూరంగా ఎందుకు ఉన్నానంటే: త్రిషబాలీవుడ్లో 'కట్టా మిఠా' అనే చిత్రంలో త్రిష నటించారు. అయితే, అదే ఆమె నటించిన తొలి, చివరి చిత్రంగా మారింది. ఒక భేటీలో తొలి హిందీ చిత్రం ప్లాప్ కావడంతో బాలీవుడ్లో అవకాశాలు రాలేదా..? అన్న ప్రశ్నకు త్రిష బదులిస్తూ.. తాను 2010లో కట్టా మిఠా చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యానన్నారు. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఆ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకుడని చెప్పారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందన్నారు.దీంతో బాలీవుడ్లో నటించిన తొలి చిత్రం ప్లాప్ కావడంతో అవకాశాలు రాలేదని, తాను బాలీవుడ్ నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిందన్నారు. వాస్తవానికి తాను తన కుటుంబాన్ని ముంబాయికి మార్చడానికి సిద్ధంగా లేనన్నారు. బాలీవుడ్‌కు వెళ్లాలంటే దక్షిణాదిలో చాలా మందిని వదులుకోవాలన్నారు. అలాగే బాలీవుడ్లో తన కెరీర్‌ను మళ్లీ కొత్తగా మొదలెట్టాల్సి ఉంటుందన్నారు. అంత ఆసక్తి తనకు అప్పట్లో లేదన్నారు. అందుకే హిందీ చిత్రాల్లో కంటిన్యూగా నటించలేదని త్రిష స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ కమలహాసన్‌కు జంటగా థగ్ లైఫ్ చిత్రాలతో పాటు తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. -
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్‌పై డీఎంకే నేత, మంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమకు పోటీ కేవలం డీఎంకే పార్టీ మాత్రమేనని విజయ్ ఇప్పటికే సందేశం పంపాడు. కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌పై విమర్శలు చేస్తున్నారు కూడా.. అధికార పార్టీలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టేందుకు తాను ఉన్నానంటూ విజయ్ పలు వేదికలపై చెబుతున్నారు. దీంతో డీఎంకే మంత్రి పన్నీర్ సెల్వం తాజాగా విజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా జరిగిన రాజకీయ సమావేశంలో విజయ్ పార్టీ గురించి మంత్రి పన్నీర్ సెల్వం కామెంట్స్ చేశారు. 'బ్లాక్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి మాకు అవినీతి గురించి పాఠాలు చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన తీసుకునే డబ్బు (రెమ్యునరేషన్) అంతా బ్లాక్ మనీ అని అందరికీ తెలిసిందే.' అని ఆయన అన్నారు. ఆపై వేదికపై నుంచే విజయ్ పార్టీ (TVK) అంటే ఏంటి..? దానికి సమాధానం చెప్పాలని జనసమూహాన్ని పన్నీర్ సెల్వం కోరారు. వెంటనే వారు (T-త్రిష, V- విజయ్, K- కీర్తి సురేష్) అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో మీరంతా బ్రిలియంట్స్ అంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ఇలాంటి పార్టీ అధికారంలోకి వస్తామని చెబుతుంటే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్లు కాదని ఆయన అన్నారు.రాష్ట్రాన్ని నడపటం అంటే సినిమాలో నటించడం అంత సులభం అనుకుంటున్నారా.? అని మంత్రి ప్రశ్నించారు. జయలలిత మరణం తర్వాత తమిళనాట డీఎంకే పార్టీతో స్టాలిన్ తిరుగులేని విజయాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం అక్కడ మోస్ట్ పవర్ఫుల్ లీడర్‌గా స్టాలిన్ ఉన్నారని జాతీయ స్థాయి సర్వేలు కూడా తేల్చేశాయి. తర్వాతి రెండో స్థానంలో విజయ్ పార్టీ ఉందని ఆ సర్వేలు చెప్పాయి. అక్కడ మరో ప్రత్యామ్నాయం లేదు. దీంతో 2026 ఎన్నికల్లో విజయ్‌తో స్టాలిన్‌కు గట్టిపోటీ తప్పదని తెలుస్తోంది. -
త్రిష తల్లిని చూశారా? ఈమె కంటే అందంగా ఉందిగా! (ఫొటోలు)
-
పెళ్లిని నమ్మనన్న త్రిష.. రెండు పెళ్లిళ్లు అందుకే నన్న కమల్
నిస్సందేహంగా మన దేశం గర్వించదగ్గ నటుల్లో కమల్ హాసన్(Kamal Haasan) ఒకరు. నటనాపరంగా ఆయన పోషించని పాత్రల గురించి వెదుక్కోవాల్సిందే. నిజజీవితంలోనూ ఆయన భిన్న పాత్రలు పోషించారు. ముఖ్యంగా నటీమణులతో ఆయన సంబంధాలు, ఆయన పెళ్లిళ్లు, విడాకులు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. ఎందుకంటే అత్యాధునిక తరం అని చెప్పుకునే ఈ తరం నటులు ఫాలో అవుతన్న లివ్ ఇన్ రిలేషన్ షిప్స్, పెళ్లి కాకుండా పిల్లలు వగైరాలన్నీ దాదాపు 2, 3 దశాబ్ధాల క్రితమే కమల్ చేసేశాడు..ఒక్కసారి కమల్ అనుబంధాలను పరిశీలిస్తే... 1975లో వచ్చిన మేల్నాట్టు మరుమగల్ చిత్రంలో కమల్ తనతో కలిసి నటించిన తర్వాత 1978లో డ్యాన్సర్ వాణీ గణపతిని వివాహం చేసుకున్నారు. ఒక దశాబ్దం తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత, కమల్ హాసన్ సహ నటి సారికతో సహజీవనం చేశాడు. ఆ అనుబంధం వల్ల వారికి 1986లో తమ మొదటి సంతానం శ్రుతి హాసన్ (ప్రస్తుతం టాప్ హీరోయిన్) జన్మించింది. ఆ తర్వాత వారు 1988లో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత 1991లో వారికి రెండవ కుమార్తె అక్షర హాసన్ పుట్టింది. ఈ అనుబంధం మరో పదేళ్లు పైనే కొనసాగి 2002లో, వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు, అది 2004లో మంజూరు అయ్యాయి. ఆ తర్వాత 2005 నుంచి 2016 వరకు నటి గౌతమితో కమల్ సహజీవనం చేశాడు. అందుకే తమ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తాను వివాహానికి సరిపోతానని తాను భావించడం లేదని ఇంటర్వ్యూలలో తరచుగా కమల్ చెబుతుంటాడు. ప్రస్తుతం 7 పదుల వయస్సులో కూడా కమల్ పెళ్లిళ్లు ప్రస్తావనకు నోచుకుంటున్నాయంటే... అందుకు ఆయన గత చరిత్రలో ఉన్న మలుపులే కారణం.ఈ నేపధ్యంలో సీనియర్ స్టార్ కమల్ హాసన్, నటి త్రిష కృష్ణన్(Trisha), సిలంబరసన్ టిఆర్, శింబులు నటించిన, మణిరత్నం చిత్రం థగ్ లైఫ్ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో నటీనటులంతా బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ సందర్భంగా మరోసారి కమల్ పెళ్లిళ్ల ప్రస్తావన వచ్చింది.ప్రమోషన్ కార్యక్రమం సందర్భంగా ఓ యాంకర్ పెళ్లి గురించి నటీనటులను వారి అభిప్రాయాలను అడిగారు. దీనికి 3 పదుల వయసు దాటినా, ఇంకా పెళ్లి మాట ఎత్తకుండా సినిమాల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న త్రిష....బదులిస్తూ..‘‘ పెళ్లిపై తనకు నమ్మకం లేదు’’ అంటూ స్పష్టం చేసింది. ‘‘తనకు పెళ్లి జరిగే పరిస్థితి ఉండి అది జరిగినా ఓకే’’ అని అలా కాకుండా పెళ్లి జరగకపోయినా సరే తనకు ఓకే అని త్రిష సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత పెళ్లి విషయమై కమల్‌ను ప్రశ్నించగా.. దశాబ్దం క్రితం ఎంపీ జాన్ బ్రిటాస్‌కు తనకు జరిగిన ఓ సంభాషణను ఆయన వివరించాడు.‘‘ఇది 10–15 ఏళ్ల క్రితం జరిగింది. ఎంపీ బ్రిటాస్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయన కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ ముందు నన్ను ‘‘ నువ్వు మంచి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడివి, మరి రెండు పెళ్లిళ్లు ఎలా చేసుకున్నావు? అని ప్రశ్నించాడు. దానికి మంచి కుటుంబం నుంచి రావడానికి పెళ్లికి సంబంధం ఏంటి? అని నేను ఎదురు ప్రశ్నించా. అది కాదు నువ్వు రాముడిని పూజిస్తావు అంటే ఆయన్ను అనుసరించాలి కదా అని అడిగాడు. దానికి నేనేం చెప్పానంటే..నేను ఏ దేవుడ్నీ పూజించను. అంతేకాదు నేను రాముడి జీవనశైలిని అనుసరించను. బహుశా నేను అతని తండ్రి (దశరథ) మార్గాన్ని (ముగ్గురు భార్యలు కలిగి ఉన్న) మార్గాన్ని అనుసరిస్తాను’’ అంటూ కమల్ హాసన్ బదులిచ్చాడు. విక్రమ్ సినిమా సూపర్ హిట్‌తో మరోసారి ఊపందుకుంది కమల్ హాసన్ కెరీర్... తదుపరి చిత్రం, థగ్ లైఫ్, జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది. -
చీరలో అనుపమ నవ్వుతూ.. అనసూయ మోడ్రల్ స్టిల్
చీరలో స్మైలీ పోజులతో అనుపమ పరమేశ్వరన్చీరలో కిక్కిచ్చేలా త్రిష స్టిల్స్.. మీరు చూశారా?హాట్ గా యాంకర్ అనసూయ మోడ్రన్ లుక్స్అమెరికా టూర్ లో హీరోయిన్ రుహానీ శర్మమలేసియా బట్టు గుహాల్లో తమిళ బ్యూటీ గౌరీ కిషన్బార్బీ బొమ్మలా క్యూట్ గా నచ్చేస్తున్న శ్రీముఖిహాట్ హాట్ పోజుల్లో రెచ్చిపోతున్న పూజా హెగ్డే View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by ELLE India (@elleindia) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Rajisha Vijayan (@rajishavijayan) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
రాజమౌళి, మహేష్ బాబు మూవీలో త్రిష
-
పిరికిపందల్లారా.. ఒళ్లంతా విషం నింపుకుని ఎలా బతుకుతున్నార్రా?: త్రిష
సెలబ్రిటీలను ట్రోల్ (Trolling) చేయడం ఈ మధ్య చాలామందికి ఆటవిడుపుగా మారింది. వారేం చేసినా, చేయకపోయినా.. ప్రతి చిన్నదానికి విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ట్రోలింగ్ బ్యాచ్ హీరోయిన్ త్రిష మీద పడ్డారట! ఈమె కథానాయికగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో ఆమె పాత్ర చూసి కొందరు యావరేజ్‌గా ఉందని పెదవి విరిచారు.అర్థం కావట్లే..అక్కడితో ఆగకుండా తనపై విద్వేషపూరిత కామెంట్లు చేశారు. అవన్నీ చూసి భరించలేకపోయింది త్రిష (Trisha Krishnan). ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్రోలర్స్‌కు గడ్డి పెట్టే ప్రయత్నం చేసింది. కొందరు మనుషులకు ఒళ్లంతా విషమే! మీకు నిద్రెలా పడుతుంది? ఇంత హాయిగా ఎలా బతుకుతున్నారో నాకర్థం కావడం లేదు. ఎంతసేపూ సోషల్ మీడియాకు వచ్చి అర్థంపర్థం లేని పనులు చేస్తూ అడ్డదిడ్డంగా పోస్టులు పెట్టమే మీ పనా? అవతలివారిని విమర్శిస్తేగానీ మీకు రోజు గడవదా? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయమేస్తోంది. మీ చుట్టూ ఉన్నవాళ్లు ఎలా బతుకుతున్నారో? ఏంటో? పిరికిపందల్లారా.. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అని ఇన్స్టాగ్రామ్ స్టోరీ వేదికగా అసహనం వ్యక్తం చేసింది.సినిమా..గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా విషయానికి వస్తే.. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాలో అర్జున్ దాస్, ప్రసన్న, కార్తికేయ దేవ్, ప్రభు, ప్రియ ప్రకాశ్ వారియర్, సునీల్, రాహుల్ దేవ్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. అజిత్‌తో ఇది త్రిషకు ఆరో సినిమా కావడం విశేషం. గతంలో వీరి కాంబినేషన్లో జి, కిరీడం, మంకత, ఎన్నై అరిందల్, విదాముయర్చి సినిమాలు వచ్చాయి.చదవండి: గుండు గీయించుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా? -
సూర్య కొత్త సినిమాలో హీరోయిన్ 'అనఘా రవి'కి ఛాన్స్
కోలీవుడ్ నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న రెట్రో చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంత కార్యక్రమాలు జరుపుకుంటోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయకిగా నటించారు. కాగా రెట్రో చిత్రం మే ఒకటవ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో సూర్య తన తర్వాతి ప్రాజక్ట్ 45 చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రతాపంపై ఎస్సార్ ప్రకాష్‌రాజ్, ఎస్సార్ ప్రభు నిర్మిస్తున్నారు. సాత్విక, యోగిబాబు, నట్టి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. చక్కని ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఇందులో మరో మలయాళ బ్యూటీ ఎంట్రీ ఇచ్చారన్నది తాజా సమాచారం. మలయాళంలో కథానాయకిగా మంచి పేరు సంపాదించుకున్న అనఘా రవి(Anagha Ravi) సూర్య 45వ చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఈమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. సూర్య కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రంలో తను కీలక పాత్రను పోషిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈమె తాజాగా మలయాళంలో నటించిన అళపుళ జింఖానా చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. ఈమె సూర్య చిత్రం ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారన్న మాట. మమ్ముట్టి, జ్యోతిక కలిసి నటించిన 'కాతల్' సినిమాలో అనఘా రవి వారికి కూతురిగా నటించింది. అందులో ఆమె నటనకు భారీగా ప్రశంసలు వచ్చాయి. -
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్విటర్ రివ్యూ.. ఒక్క మాటలో చెప్పేశారు
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) నేడు ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్లో మొదటి ఆట పూర్తి కావడంతో నెటిజన్లు తమ అభిప్రాయాన్ని ఎక్స్, ఇన్స్టాగ్రామ్ పేజీలలో పంచుకుంటున్నారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని ఈ మూవీని నిర్మించారు. ఇందులో అజిత్‌కు జోడీగా త్రిష మరోసారి మెరిసింది. రీసెంట్టా విడాముయార్చి సినిమాలో ఈ జోడి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే, ప్రీమియర్స్ షోల తర్వాత 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా గురించి ఎలాంటి టాక్ వచ్చిందో తెలుసుకుందాం..ఓవర్సీస్ ప్రీమియర్స్ ప్రకారం ఈ సినిమా అజిత్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చుతుంది అని అంటున్నారు. పూర్తిగా మాస్ ఎంటర్టైనర్గా ఈ మూవీని దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించాడని నెటిజన్లు తెలుపుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ కోసం ఒక బెస్ట్ సినిమాను అజిత్ ఇచ్చారంటూ కొందరు రివ్యూవర్స్ చెబుతున్నారు. వింటేజ్ మాస్ ఈజ్ బ్యాక్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. చాలామంది నెటిజన్లు చెబుతున్న మాట ఒక్కటే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కేవలం అభిమానులకు మాత్రమే అంటూ పేర్కొనడం విశేషం. సినిమా చూసిన వారందూరు కూడా పాజిటివ్ రివ్యూలే ఇస్తున్నారు. సినిమాలో అజిత్ పాత్రను దర్శకుడు చాలా చక్కగా చూపించాడని చెబుతున్నారు. అయితే, ఈ సినిమాలో త్రిష, సిమ్రాన్‌లు ఇద్దరూ కూడా పెద్దగా ప్రభావం చూపలేదని కామెంట్లతో తెలుపుతున్నారు. అసలు వారిద్దరినీ ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదంటున్నారు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఫస్ట్ హాఫ్ సినిమా మొత్తం అజిత్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకునే దర్శకుడు ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ ఒక రేంజ్లో ఉంటాయని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీన్ అజిత్ కెరీర్లోనే బెస్ట్‌గా ఉంటుందని అంటున్నారు. అయితే, ఆ తర్వాత కాస్త కథ నెమ్మదిస్తుందని తెలుపుతున్నారు. జీవి ప్రకాష్ బీజీఎమ్ బాగన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా సీన్‌కు ఎమోషనల్ కనెక్ట్ లేదని అభిప్రాయపడుతున్నారు. సినిమా మొత్తంగా అజిత్ ఫ్యాన్స్‌కు పండుగలాంటిదని తెలుపుతున్నారు. సినిమా గురించి ఒక్కమాటలో 'గుడ్ ఫర్ అజిత్ ఫ్యాన్స్.. ఒకే ఫర్ ఆడియెన్స్.. బ్యాడ్ ఫర్ అజిత్ హేటర్స్' అంటూ రివ్యూవర్స్ చెబుతున్నారు. From Overseas Premieres..#GoodBadUgly : An Out and Out Mass Entertainer..Best #AK movie in years..Mega Blockbuster.. Vintage Mass Ajith is Back! .— Ramesh Bala (@rameshlaus) April 10, 2025Fans after the movie. Tells you about the result 🔥🔥🥵💥😁 #GoodBadUglypic.twitter.com/Vrv5BJ8FV2— Trollywood 𝕏 (@TrollywoodX) April 10, 2025GOOD - For Fans 💥BAD - For Neutrals😐UGLY - For Haters😭Strictly & Only for AK Fans!#GoodBadUgly— Christopher Kanagaraj (@Chrissuccess) April 10, 2025#GoodBadUgly is an Alright Out and Out Mass Entertainer that works in parts and is a pure fan service to Ajith. After a Solid 1st half, the second half starts well with a flashback episode but has nothing much to offer after that and feels dragged till the end. A few mass…— Venky Reviews (@venkyreviews) April 10, 2025#GoodBadUgly Movie Review🍿 : - A Madness Mass Entertainer which surely satisfies all class of audience🔥- #AK 's career best intro 🌟⚡- #Ajithkumar𓃵 as Red Dragon 👌 Shoulders this Film with his terrific screen presence 🥵- #GVPrakash is the Second Hero of the film💥 He… pic.twitter.com/TmPmG0ugeX— k (@Gabbafied) April 10, 2025#GoodBadUgly Review : IT’S Thala RAMPPAGEE SHOW - 3.25/5 💥🔥Thala #AjithKumar IS PERFECTLY VINTAGE MARANAMASS 🔥🔥🔥💥💥💥💥🙌🙌🙌🙌🏆🏆🏆🏆Mainly @gvprakash BGM AND MUSIC IS SEEMAA MASSS DA 🥵🥵🥵🥵🥵🥵🔥🔥🔥🏆🏆🏆💥💥KUDOS TO DIRECTOR @Adhikravi FOR SHOWING HIS FANISM ON… pic.twitter.com/yFRV31KSzg— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) April 10, 2025Cringe title card loading 🤣😂🔥#GoodBadUgly #GoodBadUglyFromApril10 pic.twitter.com/iMdtorGBsq— VJ WARRIORS (@Vijay_fans_army) April 9, 2025#GoodBadUgly - Pakka Fanboy Sambavam 💯🔥 AK broke all his barriers and screen presence Vera level 🔥Adhik surprise elements vera level particularly climax AK Look , every fan's dream 🥵💥Don't miss the theatre experience pic.twitter.com/J40Mfbifql— Kolly Corner (@kollycorner) April 10, 2025 -
'గుడ్ బ్యాడ్ అగ్లీ' తెలుగు ట్రైలర్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) తెలుగు ట్రైలర్ వచ్చేసింది. మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిష నటించారు. ఇప్పటికే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ తమిళ్ వర్షన్ ట్రైలర్ విడుదలైంది. ఏకంగా 35 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో ఉంది. ఫ్యాన్స్‌కు నచ్చే భారీ యాక్షన్ సీన్లు ఈ మూవీలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎప్పుడూ ప్రేమే గెలుస్తుంది.. త్రిష పోస్ట్‌కు అర్థమేంటో?
త్రిష (Trisha Krishnan).. తెలుగులోనే కాదు తమిళంలోనూ టాప్ హీరోయిన్. ఈమధ్య తన హవా కాస్త తగ్గింది కానీ ఒకప్పుడు ఆమె తెరపై కనిపిస్తే విజిల్స్ పడాల్సిందే! గత కొన్నేళ్లుగా సినిమాల సంఖ్య తగ్గించేసిన ఈ బ్యూటీ ఈ ఏడాది మాత్రం చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటించిన ఐడెంటిటీ, విడాముయర్చి ఇప్పటికే రిలీజయ్యాయి. ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్, విశ్వంభర, రామ్.. సహా సూర్య 45వ సినిమాలో నటిస్తోంది.ప్రేమదే విజయంతాజాగా త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో చేతి ఉంగరాన్ని చూపిస్తూ ఓ ఫోటో షేర్ చేసింది. దీనికి 'ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది' అన్న క్యాప్షన్‌ను జోడించింది. ఆ ఫోటోలో త్రిష ఆకుపచ్చ చీర ధరించి ఉంది. ముక్కుపుడక, మల్లెపూలతో సాంప్రదాయంగా ముస్తాబైంది. చెవికమ్మలకు మ్యాచ్ అయ్యే ఉంగరం ధరించింది. ఇది చూసిన కొందరు ఎంగేజ్మెంట్ జరిగిందా? లేదా పెళ్లికి రెడీ అని హింట్ ఇస్తుందా? అని ఆరా తీస్తున్నారు.పెళ్లికి గ్రీన్ సిగ్నల్?తమిళ హీరో విజయ్‌తో త్రిష ప్రేమలో ఉన్నట్లు కొన్నేళ్లుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ జీవితాంతం కలిసుందామని ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే త్రిష.. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అల్లరి బుల్లోడు, అతడు, పౌర్ణమి, సైనికుడు, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బుజ్జిగాడు, నమో వెంకటేశా.. వంటి పలు చిత్రాలతో తెలుగువారి మనసులో స్థానం సంపాదించుకుంది. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) చదవండి: చరణ్ బర్త్‌డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ -
టాలీవుడ్ సూపర్ హిట్ జోడీలు.. మళ్లీ రిపీట్..
చిత్ర పరిశ్రమలో హిట్ జోడీకి ఉన్న క్రేజే వేరు. ఓ హీరో, హీరోయిన్ కాంబినేషన్లో సినిమా విజయం సాధిస్తే మళ్లీ ఆ కాంబో ఎప్పుడు రిపీట్ అవుతుందా? అనే ఆసక్తి ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఉంటుంది. హిట్ జోడీ రిపీట్ అవుతోందంటే ట్రేడ్ వర్గాల్లో, బిజినెస్ సర్కిల్స్‌లో ఫుల్ క్రేజ్‌తో ΄ాటు అంచనాలు ఉంటాయి. అందుకే అలాంటి హిట్ జోడీని రిపీట్ చేసేందుకు దర్శక–నిర్మాతలు కూడా తమ వంతు ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఇందుకు ఒక్కోసారి కొన్నేళ్లు కూడా పట్టొచ్చు. ప్రస్తుతం తెలుగులో రిపీట్ అవుతున్న జోడీలపై ఓ లుక్కేద్దాం...పద్దెనిమిదేళ్ల తర్వాత..హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిషల జోడీ పద్దెనిమిదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. ‘విశ్వంభర’ సినిమాలో వీరు జంటగా నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జోడీగా నటించారు. 2006 సెప్టెంబరు 20న విడుదలైన ఈ మూవీ విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైన పద్దెనిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి ‘విశ్వంభర’ కోసం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘బింబిసార’ వంటి హిట్ మూవీ తీసిన మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది. ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించింది చిత్రయూనిట్. కానీ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ కోసం ‘విశ్వంభర’ సినిమా విడుదలని వాయిదా వేశారు. అయితే మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ వేసవిలో సినిమా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. షష్ఠిపూర్తి కోసం 38 ఏళ్ల తర్వాత... నటుడు రాజేంద్ర ప్రసాద్, నటి అర్చనల జోడీ 38 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. వీరిద్దరూ ‘షష్ఠిపూర్తి’ సినిమా కోసం రెండో సారి కలిసి నటించారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన జోడీగా డైరెక్టర్ వంశీ తీసిన చిత్రం ‘లేడీస్ టైలర్’. 1986 నవంబరు 26న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన కలిసి నటించలేదు. తాజాగా పవన్ ప్రభ దర్శకత్వం వహించిన ‘షష్ఠిపూర్తి’ కోసం వీరు 38 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా నటించారు. ఈ చిత్రంలో రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంట. అయితే ఈ కథ మొత్తం రాజేంద్ర ప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో షష్ఠిపూర్తి కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ‘షష్ఠిపూర్తి’ అనే టైటిల్ పెట్టారట. రూపేష్ నిర్మించిన ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అనే విషయంపై స్పష్టత లేదు. మధ్యతరగతి యువకుడి ప్రేమకథ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన తొలి చిత్రం ‘బేబి’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2023 జూలై 14న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీలో ఆనంద్, వైష్ణవి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ప్రత్యేకించి యువతరం ఈ సినిమాకి ఫుల్ ఫిదా అయ్యారు. ‘బేబి’ తర్వాత వీరు మరోసారి జోడీగా నటిస్తున్నారు. ‘90స్’ (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్‌తో మంచి విజయం అందుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో 32వ చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోలో ‘మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు.. మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ’ అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.మాస్ జాతర రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ధమాకా’. 2022 డిసెంబరు 23న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అందులోనూ ప్రత్యేకించి రవితేజ–శ్రీలీల డ్యాన్సులు, భీమ్స్ సంగీతం ఈ సినిమాకి ప్లస్‌గా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి హిట్ జోడీ రెండేళ్ల తర్వాత ‘మాస్ జాతర’ సినిమాతో రిపీట్ అవుతోంది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా రూపొందుతోన్న ‘మాస్ జాతర’పై ఇండస్ట్రీలో అంచనాలున్నాయి. అందులోనూ రవితేజ–శ్రీలీల హిట్ జోడీ రిపీట్ అవుతుండటం కూడా ఈ సినిమాకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘మాస్ జాతర’ సినిమాకి కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండటం మరో విశేషం. వేసవి కానుకగా మే 9న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. నాలుగోసారి...నటుడు శివాజీ, నటి లయది హిట్ జోడీ. ‘మిస్సమ్మ’ (2003), ‘అదిరిందయ్యా చంద్రం’ (2004), ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ (2006) వంటి సినిమాల్లో జంటగా నటించి, హిట్స్ అందుకున్నారు. తాజాగా వీరి జోడీ నాలుగోసారి రిపీట్ అవుతోంది. వివాహం తర్వాత సినిమాలకు కొన్నేళ్లు విరామం ఇచ్చిన లయ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ప్రస్తుతం లయ, శివాజీ జోడీగా కొత్త సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతో సుధీర్ శ్రీరామ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై శివాజీ నిర్మిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ జంట నటిస్తున్న నాలుగో చిత్రంపై ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. బ్యాక్ టు బ్యాక్హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్ బ్యాక్ టు బ్యాక్ రిపీట్ అవుతోంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్’ సినిమాలో నితిన్, శ్రీలీల తొలిసారి జంటగా నటించారు. 2023 డిసెంబరు 8న విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. కానీ, నితిన్–శ్రీలీల జోడీ బాగుందనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరూ ‘రాబిన్‌హుడ్’ సినిమాలో జంటగా నటించారు. ‘భీష్మ’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మంచి వినోదాత్మక కుటుంబ కథా చిత్రం ఇదని, నితిన్ కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందినట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘రాబిన్‌హుడ్’లో తన పాత్ర, నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారంటూ శ్రీలీల కూడా స్పష్టం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా 2024 డిసెంబరు 25న విడుదల కావాల్సి ఉంది. అయితే ముందుగా ప్రకటించిన తేదీకి విడుదలకాలేదు. మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. అప్పుడు వినోదం.. ఇప్పుడు థ్రిల్లర్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన కెరీర్లో విజయవంతమైన చిత్రాల్లో ‘సామజవరగమన’ ఒకటి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెబా మోనికా జాన్ నటించారు. 2023 జూన్ 29న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించడంతో పాటు హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత ‘మృత్యుంజయ్’ మూవీ కోసం మరోసారి జోడీ కట్టారు శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్.ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ‘సామజవరగమన’తో వినోదం పంచిన శ్రీవిష్ణు, రెబా జాన్ ‘మృత్యుంజయ్’తో ప్రేక్షకులను ఏ మేర భయపెడతారో చూడాలి. మరికొన్ని జోడీలు‘సీతా రామం’ సినిమాతో సూపర్ హిట్ జోడీ అనిపించుకున్న దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ రెండోసారి నటించనున్నారట. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమాలో సాయిపల్లవి లేదా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాలకృష్ణ– ప్రగ్యాజైస్వాల్ జోడీ కూడా రిపీట్ కానుందని సమాచారం. ‘అఖండ, డాకు మహారాజ్’ వంటి సినిమాల తర్వాత ‘అఖండ 2’లో వీరిద్దరూ కలిసి నటించనున్నారట. అయితే ‘అఖండ 2’లో హీరోయిన్గా సంయుక్తని ప్రకటించారు మేకర్స్. మరి ప్రగ్యా జైస్వాల్ సెకండ్ హీరోయిన్గా కనిపిస్తారా? లేదంటే ముఖ్యమైన పాత్ర చేయనున్నారా? అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. మరికొన్ని జోడీలు కూడా రిపీట్ కానున్నాయని సమాచారం. – డేరంగుల జగన్ మోహన్ చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా -
ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు ?
-
ఈ బ్యూటీకి వయసే అవ్వదేమో స్టన్నింగ్ లుక్స్‌తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే త్రిష ఫోటోలు
-
అజిత్ 'పట్టుదల' HD మూవీ స్టిల్స్
-
విడాముయర్చి పై చాలా ఆశలే పెట్టుకున్న కోలీవుడ్
-
విజయ్ ఆ విషయంలో మారాలి : త్రిష
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమి ఉండదు. ప్రస్తుతం ఈయన ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో జననాయకన్ చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ఇది. తదుపరి రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారు. ఈ విషయం పక్కన పెడితే హీరోయిన్ త్రిష(Trisha) గురించి కూడా ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నటి 22 ఏళ్ల సినీ జీవితం తెరిచిన పుస్తకమే. వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగాను ఈమె పయనం సంచలనమే. త్రిషను పలువురు స్టార్ హీరోలతో కలిపి అనేక వదంతులు దొర్లుతుంటాయి. అలాంటివారిలో నటుడు విజయ్ పేరు వినిపిస్తుంది. విజయ్ త్రిష జంటగా మొట్టమొదటి సారిగా గిల్లీ చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో వీరు హిట్ పెయిర్‌గా ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత వరుసగా తిరుపాచ్చి, ఆది, కురువి చిత్రాల్లో జంటగా నటించారు. దీంతో వీరి మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయిందని ప్రచారం జరిగింది. అంతేకాదు విజయ్, త్రిషల మధ్య ఏదో జరుగుతుందని పదంతులు జోరందుకుంది. ఆ తర్వాత ఏమైందో గానీ వీరిద్దరూ కలిసి ఏ చిత్రంలోని నటించలేదు. అలాంటిది సుమారు 14 ఏళ్ల తర్వాత లియో చిత్రంలో మళ్లీ జత కట్టారు. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా మంచి వసూలు సాధించింది. కాగా నటుడు విజయ్ తనకు ఎప్పుడు ప్రత్యేకమే అంటూ త్రిష ఒక భేటీలో పేర్కొన్నారు. దీంతో మళ్లీ వీరిపై రకరకాల వదంతులు ప్రసారం అవుతున్నాయి. అంతేకాకుండా ఆ మధ్య తనకు రాజకీయాలంటే ఆసక్తి అని పేర్కొనడంతో ఇప్పుడు విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించడంతో ఆమె నటనకు గుడ్ బై చెప్పి ఆ పార్టీలో చేరిపోతున్నట్లు ప్రచారం హోరెత్తింది. అయితే ఈ ప్రచారాన్ని నటి త్రిష తల్లి ఉమా కృష్ణన్ ఖండించారు. కాగా తాజాగా త్రిష నటుడు విజయ్ గురించి ఒక భేటీలో మాట్లాడుతూ షూటింగ్లో నటుడు శింబు తనను టీజ్ చేస్తారని, విజయ్ మాత్రం ఒక గోడ పక్కన చోటును వెతుక్కుని మౌనంగా కూర్చుంటారని చెప్పారు. ఆయనలో తనకు నచ్చనిది ఇదేనన్నారు. దాన్ని ఆయన మార్చుకోవాలని త్రిష పేర్కొన్నారు. -
ఓటీటీకి వచ్చేసిన త్రిష మూవీ.. వారం రోజుల్లోనే ఎంట్రీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా ఉన్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పెద్దగా కనిపించట్లేదు. గతేడాది విజయ్ సరసన ది గోట్ చిత్రంలో కనిపించిన త్రిష.. ప్రస్తుతం అజిత్ కుమార్ మూవీ విదాముయార్చితో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఇదిలా ఉండగా.. త్రిష మలయాళంలో వరుస సినిమాలు చేస్తోంది. మాలీవుడ్‌లో ఐడెంటిటీ అనే మూవీలో నటించింది. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రంలో టొవినో థామస్ హీరోగా నటించారు. సంక్రాంతికి కానుకగా మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు.మలయాళంలో హిట్ టాక్ రావడంతో తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. జనవరి 24న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజైంది. ఈ మూవీకి టాలీవుడ్ ఆడియన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే కలెక్షన్ల పరంగా పెద్దగా రాణించలేకపోయింది. రూ. 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఐడెంటిటీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రూ. 18 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.వారంలోనే ఓటీటీకి..గత శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 31 నుంచే జీ5 వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ చిత్రంలో హనుమాన్ విలన్ వినయ్ రాయ్ ప్రధాన పాత్రలో నటించారు. -
జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా...
‘జోరుగా హుషారుగా షికారు పోదమా...’ అంటూ అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణకుమారి అప్పట్లో సిల్వర్ స్క్రీన్‌పై చేసిన సందడిని నాటి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకూ అంటే... జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా... అంటూ కొందరు కథానాయికలు డైరీలో నాలుగుకి మించిన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఆ హీరోయిన్లు చేస్తున్నసినిమాల గురించి తెలుసుకుందాం...రెండు దశాబ్దాలు దాటినా బిజీగా...చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా ప్రయాణం పూర్తి చేసుకున్నారు త్రిష. అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ఇప్పటికీ ఫుల్ బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అంతేకాదు.. అందం విషయంలోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష చేతిలో తెలుగు, తమిళ్, మలయాళంలో కలిపి అరడజను సినిమాలున్నాయి. ఆమె నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె.‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే మోహన్‌లాల్ లీడ్ రోల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు త్రిష. అదే విధంగా అజిత్ కుమార్ హీరోగా మగిళ్ తిరుమేని తెరకెక్కిస్తున్న ‘విడాముయర్చి’, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్ బ్యాడీ అగ్లీ’, కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం రూపొందిస్తున్న ‘థగ్ లైఫ్’, సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ‘సూర్య 45’ (వర్కింగ్ టైటిల్) వంటి తమిళ చిత్రాల్లో నటిస్తూ జోరు మీద ఉన్నారు త్రిష. తెలుగులో లేవు కానీ...తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బుట్ట బొమ్మగా స్థానం సొంతం చేసుకున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. టాలీవుడ్లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. కాగా చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ, బాలీవుడ్, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే.తమిళంలో స్టార్ హీరోలైన విజయ్, సూర్యలకు జోడీగా నటిస్తున్నారు. విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ‘జన నాయగన్’ అనే సినిమాతో పాటు, సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘రెట్రో’ మూవీస్‌లో నటిస్తున్నారు పూజా హెగ్డే. అలాగే డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే సినిమాలో నటిస్తున్నారామె. షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందిన హిందీ మూవీ ‘దేవా’. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. హిందీ, తమిళ భాషల్లో బిజీగా ఉన్న పూజా హెగ్డే తెలుగులో మాత్రం ఒక్క సినిమాకి కూడా కమిట్ కాలేదు. జోరుగా లేడీ సూపర్ స్టార్ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు నయనతార. నటిగా రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. కథానాయికగా ఫుల్ క్రేజ్‌లో ఉన్నప్పుడే దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో 2022 జూన్ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు నయనతార. వీరిద్దరికీ ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. తమిళంలో ‘టెస్ట్, మన్నాంగట్టి సిన్స్ 1960, రాక్కాయీ’ వంటి సినిమాలతో పాటు పేరు పెట్టని మరో తమిళ చిత్రం, ‘డియర్ స్టూడెంట్’తో పాటు మరో మలయాళ మూవీ, ‘టాక్సిక్’ అనే కన్నడ సినిమాతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు నయనతార. అయితే 2022లో విడుదలైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ తర్వాత మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపలేదామె.అరడజను సినిమాలతో‘చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగకుండా వచ్చేశావే... నా మనసులోకి’ అంటూ రష్మికా మందన్నాని ఉద్దేశించి పాడుకుంటారు యువతరం ప్రేక్షకులు. అందం, అభినయంతో అంతలా వారిని ఆకట్టుకున్నారామె. కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో ’(2018) సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు ఈ కన్నడ బ్యూటీ. ఓ వైపు కథానాయకులకి జోడీగా నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.వాటిలో ‘రెయిన్ బో, ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్ బో’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. అదే విధంగా ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. అలాగే విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో హీరోయిన్గా చేశారు రష్మిక. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.ఇక సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న హిందీ మూవీ ‘సికందర్’లోనూ రష్మిక కథానాయిక. అదే విధంగా నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘కుబేర’లోనూ హీరోయిన్గా నటించారు ఈ బ్యూటీ. మరోవైపు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ‘థామా’ అనే బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నారు రష్మికా మందన్నా.ఏడు చిత్రాలతో బిజీ బిజీగా...మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. ‘భీమ్లా నాయక్’ (2022) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు ఈ మలయాళ బ్యూటీ. ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు సంయుక్త. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. వాటిలో తెలుగులోనే ఐదు చిత్రాలుండగా, ఓ హిందీ ఫిల్మ్, ఓ మలయాళ సినిమా కూడా ఉంది.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’, శర్వానంద్ కథానాయకుడిగా రామ్ అబ్బరాజు డైరెక్షన్లో రూపొందుతున్న ‘నారి నారి నడుమ మురారి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ‘హైందవ’, బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాల్లో నటిస్తున్నారు సంయుక్తా మీనన్. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారామె.యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అలాగే ఆమె నటిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ మూవీకి చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా మోహన్‌లాల్ లీడ్ రోల్లో జీతూ జోసెఫ్ దర్వకత్వంలో రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు సంయుక్తా మీనన్. ఇలా ఏడు సినిమాలతో ఫుల్ బీజీ బీజీగా ఉన్నారామె. హుషారుగా యంగ్ హీరోయిన్టాలీవుడ్లో మోస్ట్ సెన్సేషన్ హీరోయిన్గా దూసుకెళుతున్నారు శ్రీలీల. ‘పెళ్లిసందడి’ (2021) సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌ని సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ (2022) సినిమాతో తెలుగులో తొలి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల వరుస చిత్రాలతో యమా జోరు మీదున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ చిత్రం ఉన్నాయి.నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాబిన్ హుడ్’, రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ‘మాస్ జాతర’, పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు శ్రీలీల. అదే విధంగా శివ కార్తికేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారామె.హిందీలోనూ...దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతా రామం’ (2022) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు మృణాళ్ ఠాకూర్. ఆ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. మృణాళ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో ‘హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ప్రభాస్ ‘కల్కి: 2898 ఏడీ’ చిత్రంలో అతిథి పాత్ర చేశారు. ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారారు. ఆమె హిందీలో ‘పూజా మేరీ జాన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2’, తుమ్ హో తో’ వంటి చిత్రాలు చేస్తున్నారు. అదే విధంగా అడివి శేష్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు మృణాళ్ ఠాకూర్.రెండు తెలుగు... రెండు హిందీ ప్రేక్షకుల హృదయాల్లో అతిలోక సుందరిగా అభిమానం సొంతం చేసుకున్న దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హిందీలో ఎంట్రీ ఇచ్చారు. యూత్ కలల రాణిగా మారారు ఈ బ్యూటీ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు జాన్వీ. ప్రస్తుతం ఆమె చేతిలో కూడా నాలుగు సినిమాలుఉన్నాయి. వాటిలో రెండు తెలుగు కాగా రెండు హిందీ మూవీస్.రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 2’ సినిమా కూడా ఉండనే ఉంది. అదే విధంగా హిందీలో ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి, పరమ్ సుందరి’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇలా నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా షూటింగ్స్ చేస్తున్న కథానాయికలు ఇంకొందరు ఉన్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
నాన్న కల నెరవేర్చింది
‘కలలు కనడం కష్టం కాదు. కాణీ ఖర్చు కాదు’ లాంటి వెటకారాల మాట ఎలా ఉన్నా.... ఆ కలలే భవిష్యత్తుని నిర్దేశిస్తాయి.వందమందిలో ఒకరిగా ప్రత్యేకతతో వెలిగిపోయేలా చేస్తాయి. ‘నా కూతురు ఆడితే పరుగులు వెల్లువెత్తాల్సిందే’ ‘మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణం... అంటూ నా కూతురు గురించి అందరూ ఘనంగా చెప్పుకోవాలి’... ఇలాంటి కలలు ఎన్నో కనేవాడు భద్రాచలానికి చెందిన రామిరెడ్డి.అయితే ఆయన కలలకు మాత్రమే పరిమితం కాలేదు. నిరంతరం తన కలల సాకారానికి ప్రయత్నించాడు. ఆ ఫలితమే స్టార్ క్రికెటర్... త్రిష గొంగడి(Trisha Gongadi). మలేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ విమెన్ అండర్ 19, టీ 20 వరల్డ్ కప్(Women World Cup)లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి రామిరెడ్డి క్రికెట్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశించినా పరిస్థితుల ప్రభావం వల్ల ఆ కల నెరవేరలేదు. దీంతో ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తూనే పట్టణంలో జిమ్ సెంటర్ నిర్వహించేవాడు. ‘మా అమ్మాయిని బాగా చదివించాలి’... అనేది సగటు తండ్రి కోరిక.రామిరెడ్డి మాత్రం అలా కాదు... ‘మా అమ్మాయిని బాగా ఆడించాలి. క్రికెట్లో స్టార్‌ని చేయాలి’ అనుకునేవాడు. సినిమాలు, కామేడీ షోలు కాకుండా టీవీలో క్రికెట్ మ్యాచ్ హైలెట్స్ ఎక్కువగా చూపించేవాడు. చిన్నప్పుడే ఇలా చేయడం వల్ల బ్రెయిన్, మజిల్స్ ఆటకు తగ్గట్టుగా మౌల్డ్ అవుతాయని ఫిటెనెస్ ట్రైనర్‌గా ఆయన బలంగా నమ్మాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ చిన్నతనం నుంచే త్రిష క్రికెట్లో ప్రతిభ కనబరిచేది. దీంతో తన కల విషయంలో మరింత పట్దుదల పెరిగింది. కూతురిని ప్రోఫెషనల్ క్రికెటర్‌గా చూడాలనే లక్ష్యంతో కుటుంబంతో సహా హైదరాబాద్‌కు మకాం మార్చాడు రామిరెడ్డి. అప్పుడు త్రిష వయసు ఏడేళ్లు. సికింద్రాబాద్‌లోని ‘సెయింట్ జాన్ ్స క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకునేది.ఎంతో ఆశ... చివరికి నిరాశ!్రపోఫెషనల్ ట్రైనింగ్‌లో ఆరితేరిన త్రిష పన్నెండేళ్ల వయస్సులో హైదరాబాద్ అండర్ 19 జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత అండర్ 19 ఇండియా తరఫున సౌత్ ఆఫ్రికాలో జరిగిన టోర్నమెంట్లో పాల్గొంది. ఆ టోర్నీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. బ్యాటింగ్‌తో పాటు లెగ్ స్పిన్నర్‌గా టోర్నీ గెలుపులో త్రిష తనవంతు పాత్ర పోషించింది. అయితే త్రిషకు ఈ టోర్నీలో ప్రత్యేక గుర్తింపు దక్కలేదు. ఆ ఫలితం ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ వేలంలో స్పష్టంగా కనిపించింది. విమెన్ ఐపీఎల్ వేలంలో త్రిషాను తీసుకునేందుకు ఐపీఎల్ యాజమాన్యాలు ఆసక్తి చూపించలేదు. దీంతో గత ఐపీఎల్ సీజన్ కు ఆమె దూరంగా ఉండాల్సి వచ్చింది. అ గెలుపులో తాను ఒకరిగా ఉండటం కంటే ‘గెలుపుకు మూలం’ అనిపించేలా ప్రదర్శన చేయాలనే పట్టుదల త్రిషలో పెరిగింది.ఇక చూస్కోండివిమెన్ ఐపీఎల్లో ఎదురైన చేదు అనుభవం ‘పవర్ హిట్టింగ్’పై పట్టు సాధించేందుకు త్రిషకు తోడ్పడింది. గత డిసెంబరులో జరిగిన అండర్ 19, టీ 20 ఏషియా కప్ టోర్నమెంట్లో వరుసగా 58 నాటౌట్, 32, 52 పరుగులు సాధించింది. ఆ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులు సొంతం చేసుకుంది. ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఐదు మ్యాచ్‌లలో బ్యాటింగ్ చేసిన త్రిష 230 పరుగులు సాధించింది. ఇందులో స్కాట్లాండ్పై చేసిన 110 నాటౌట్ సెంచరీ కూడా ఉంది. ఇందులో 13 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. ఈ సెంచరీతో అండర్ 19 టోర్నీలో తొలి సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. బౌలింగ్‌లోనూ రాణించి మూడు వికెట్లు తీసింది.అందనంత ఎత్తులో...టోర్నీలో మిగతా అమ్మాయిలకు అందనంత ఎత్తులో బ్యాటింగ్ యావరేజ్ 76.77తో త్రిష కొనసాగుతోంది. ఆమె తర్వాత రెండోస్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ డావినా పేరిన్ ఉంది. ఈ టోర్నీలో రెండుసార్లు త్రిష 40కి పైగా స్కోర్లు సాధించింది. అయితే అప్పటికే ప్రత్యర్థి జట్లు ముందుగా బ్యాటింగ్ చేయడంతో భారీ స్కోరు సాధించే అవకాశం త్రిషకు దక్కలేదు. కానీ స్కాట్ల్యాండ్తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయడంతో త్రిష బ్యాట్ నుంచి ఫాస్టెస్ట్ సెంచరీ (53 బంతుల్లో) జాలువారింది. బ్యాటింగ్ యావరేజ్‌తో పాటు మోస్ట్ రన్స్, హయ్యెస్ట్ స్కోర్ విభాగంలోనూ త్రిష టాప్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే భారత్ మహిళల అండర్ 19 జట్టు సెమీస్‌కు చేరుకుంది.ఏజెన్సీప్రాంతం నుంచి మొదలైన త్రిష విజయపరంపర అంతర్జాతీయ స్థాయిలో అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవిమెన్ వరల్డ్ కప్‌లో ఇండియాకు ఆడాలి అండర్ 19, విమెన్ టీ20లో తొలి సెంచరీ చేయడం ద్వారా వరల్డ్ రికార్డు సాధించినందుకు ఆనందంగా ఉంది. విమెన్ అండర్ 19 టోర్నీలో మంచి పెర్ఫార్మెన్స్ చూపించి ఇండియా మహిళల జట్టుకు ఎంపిక కావాలి. రాబోయే వరల్డ్ కప్ టీమిండియా స్క్వాడ్‌లో నా పేరు ఉండాలనే లక్ష్యంతోనే ఈ టోర్నీకి వచ్చాను. నా లక్ష్యానికి తగ్గట్టుగా ఆడుతున్నాను. – గొంగడి త్రిష -
హిట్ సినిమా.. వారంలోనే ఓటీటీలో తెలుగు వర్షన్
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్(Tovino Thomas), త్రిష(Trisha) కాంబినేషన్లో తెరకెక్కిన ఐడెంటిటీ(Identity Movie) సినిమా నేడు తెలుగులో విడుదలైంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన కూడా అధికారికంగా వెలువడింది. వినయ్ రాయ్, మందిరా బేడి ప్రధాన పాత్రలలో కనిపించిన ఈ చిత్రాన్ని అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ తెరకెక్కించారు. రాజు మల్లియాత్, సీజే రాయ్ నిర్మించారు. మలయాళంలో జనవరి 2న విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి కలెక్షన్స్ రాబట్టింది.'ఐడెంటిటీ' సినిమా ఓటీటీ రైట్స్‌ను జీ5 దక్కించుకుంది. అయితే, ఈ చిత్రం ఇప్పటికే మలయాళ వర్షన్ విడుదలై చాలారోజు అయింది. దీంతో తాజాగా ఓటీటీ విడుదలపై ప్రకటన చేశారు. అయితే, తెలుగులోనూ ఈరోజే (జనవరి 24) రిలీజ్ అయింది. ఇంతలోనే మరో వారం రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతుండటం విశేషం. జనవరి 31న జీ5లో మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుందని ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను పంచుకుంది.ఐడెంటిటీ చిత్రంలో స్కెచ్ ఆర్టిస్టుగా టొవినో థామస్ నటించారు. ఓ క్రైమ్‌ను చూసి త్రిష... నేరస్తుడిని పట్టుకునే క్రమంలో టొవినో థామస్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె చెబుతున్న ఆధారాలతో అతను ఎవరి స్కెచ్ వేశారు అనేది చాలా ఆసక్తిగా సినిమా ఉంటుంది. సంచలనం సృష్టించిన ఒక మర్డర్ కేసును ఓ పోలీస్ ఆఫీసర్, స్కెచ్ ఆర్టిస్ట్ కలిసి ఎలా సాల్వ్ చేశారు అనే కథతో ఈ చిత్రం ఉంటుంది. సంక్రాంతికి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ, టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు ఉండటంవల్ల అవకాశం లేకుండాపోయింది. అందుకే ఈనెల 24వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఐడెంటిటీకి ఫిదా అవుతారు. -
విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష
సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలో సంచలనాలకు చిరునామా నటి త్రిష(Trisha Krishnan) అంటారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఆమెకు సంబంధించి ఏ వార్త వచ్చినా నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. 41 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు పోటీ పడుతూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటూ భారీ హిట్లు కొడుతుంది. నటిగా 22 ఏళ్ల కెరీర్లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ మొదలగు ఐదు భాషల్లో కథానాయకిగా సత్తా చాటుతుంది. ఇప్పటికీ అజిత్, చిరంజీవి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ అగ్ర కథానాయకిగానే కొనసాగుతుంది. ఇన్ని అర్హతలు కలిగిన ఈ చైన్నె సుందరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఈమె గురించి వదంతులు చాలా కాలంగానే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల నటుడు విజయ్‌తో (Vijay) కలుపుతూ రకరకాల ప్రచారం కూడా జరిగింది. ఈమె మాత్రం విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ పలు వేదికల మీద తెలిపింది. అయితే, త్రిష త్వరలో రాజకీయ రంగ ప్రవేశం(Political Entry) చేయబోతున్నట్లు ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదేవిధంగా ఈమె చాలా కాలం క్రితమే తనకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ ఉందని పేర్కొంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. అదే విధంగా నటుడు విజయ్ పార్టీలో చేరనున్నారు అనే ప్రచారం బలంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష తన అభిమానులకు త్వరలో ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతుందని వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికీ అగ్ర కథానాయకిగా నటిస్తూ బిజీగా ఉన్న త్రిష నటనకు స్వస్తి చెబుతారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే తనకు మంచి మిత్రుడు అని చెప్పుకునే నటుడు విజయ్ కూడా కెరీర్ పరంగా మంచి పీక్‌లో ఉండగానే నటనకు స్వస్తి చెబుతూ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాగా త్రిష ఇప్పుడు నటనకు స్వస్తి చెప్పబోతున్నారనే వార్త ఎంతవరకు నిజం అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ విషయంలో ఆమె ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే, త్రిష పాలిటిక్స్‌లోకి తప్పకుండా ఎంట్రీ ఇస్తుందని తమిళనాడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
త్రిష,టొవినో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగులో విడుదల
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్(Tovino Thomas), త్రిష(Trisha) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఐడెంటిటీ(Identity Movie) చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. ఈమేరకు తాజాగా తెలుగు వర్షన్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో వినయ్ రాయ్, మందిరా బేడి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ ఈ మూవీని తెరకెక్కించారు. రాజు మల్లియాత్, సీజే రాయ్ నిర్మించారు. మలయాళంలో జనవరి 2న విడుదలైన ఈ చిత్రం తెలుగులో జనవరి 24న రిలీజ్ కానుంది.ఉత్కంఠగా సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టు కునేలా ఉందని ఇప్పటికే మలయాళ రివ్యూలు తేల్చేశాయి. దీంతో సుమారు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఐఎండీబీ రేటింగ్‌లో కూడా 9 వరకు ఉంది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రంపై మక్కువ చూపారు. అయితే, మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ‘ఐడెంటిటీ’ టైటిల్‌తోనే రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: నేనూ మనిషినే కదా.. నా ముందు ఇలాంటి పని చేయకండి: సాయిపల్లవి)ఐడెంటిటీ చిత్రంలో స్కెచ్ ఆర్టిస్టుగా టొవినో థామస్ నటించారు. ఓ క్రైమ్‌ను చూసి త్రిష... నేరస్తుడిని పట్టుకునే క్రమంలో టొవినో థామస్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె చెబుతున్న ఆధారాలతో అతను ఎవరి స్కెచ్ వేశారు అనేది చాలా ఆసక్తిగా సినిమా ఉంటుంది. సంచలనం సృష్టించిన ఒక మర్డర్ కేసును ఓ పోలీస్ ఆఫీసర్, స్కెచ్ ఆర్టిస్ట్ కలిసి ఎలా సాల్వ్ చేశారు అనే కథతో ఈ చిత్రం ఉంటుంది. సంక్రాంతికి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ, టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు ఉండటంవల్ల అవకాశం లేకుండాపోయింది. అందుకే ఈనెల 24వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఐడెంటిటీకి ఫిదా అవుతారు.టొవినో థామస్ నటించిన ఏఆర్ఎం మూవీ గతేడాది సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.120 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆయన కెరీర్లో ఈ చిత్రం ఓ ల్యాండ్‌మార్క్ అని చెప్పవచ్చు. ఇప్పుడీ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. -
థ్రిల్లింగ్ ఐడెంటిటీ
టొవినో థామస్, త్రిష, వినయ్ రాయ్, మందిరా బేడి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’. దర్శక ద్వయం అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ ఈ మూవీని తెరకెక్కించారు. రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 2న మలయాళంలో రిలీజైంది. ఈ సినిమాకు మలయాళ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది. కాగా ఈ సినిమా అదే టైటిల్‌తో తెలుగులో ఈ నెల 24న విడుదల కానుంది. మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ‘‘ఉత్కంఠగా సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టు కునేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
'96' సినిమా సీక్వెల్.. సింగపూర్, మలేషియా నుంచి కథ
ప్రస్థుతం చిత్రపరిశ్రమలో సీక్వెల్ నడుస్తోందని చెప్పవచ్చు. అయితే అన్ని చిత్రాల సీక్వెల్స్ హిట్ అవుతాయని గ్యారంటీ లేదు. బాహుబలి,పుష్ప వంటి కొన్ని చిత్రాల సీక్వెల్స్ మాత్రమే విజయం సాధించాయి. ఇండియన్–2, విడుదల-2 వంటి చిత్రాలు ఆశించిన ఫలితాలు పొందలేక పోయాయి. కాగా 2018లో తమిళ్లో విడుదలైన 96 చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రేమ్‌కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఇది పాఠశాల ప్రేమ కథా చిత్రంగా రూపొందింది. విదేశాల్లో ఉన్న త్రిష పాఠశాల స్నేహితులను కలవడానికి చైన్నెకి వస్తుంది. అప్పుడు తన చిన్ననాటి ప్రేమికుడు కూడా విజయ్‌సేతుపతి కూడా వస్తాడు. వారి మధ్య జరిగే మూగ ప్రేమే 96 చిత్ర కథ. కాగా ఏడేళ్ల తర్వాత ఈ చిత్ర సీక్వెల్‌కు దర్శకుడు ప్రేమ్‌కుమార్ సిద్ధం అవుతున్నారు. ఈయన ఇటీవల కార్తీ, అరవింద్‌స్వామి ప్రధాన పాత్రలు పోషించిన 'సత్యం సుందరం' చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. ఈ చిత్రం విడుదల సమయంలోనే 96 చిత్రానికి సీక్వెల్ చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించనున్నారని సమాచారం. ఈ చిత్ర కథ సింగపూర్, మలేషియాల్లో జరిగే విధంగా ఉంటుందని దర్శకుడు ప్రేమ్‌కుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తొలి భాగంలో త్రిష విదేశాల నుంచి చైన్నెకి వచ్చినట్లు చూపించిన విషయం తెలిసిందే. దీంతో రెండవ భాగం విదేశాల్లో జరుగుతుందని దర్శకుడు ఈసందర్భంగా చెప్పారు. అదేవిధంగా 96 చిత్ర కథను ప్రేమ ఇతివృత్తంతో రూపొందించగా, దాని సీక్వెల్ ప్రేమతో పాటు కుటుంబసమస్యలు, భావోద్రేకాలు వంటి అంశాలతో ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
అజిత్ యాక్షన్ మూవీ.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, త్రిష జంటగా నటిస్తోన్న చిత్రం విడాముయార్చి. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.#Sawadeeka 🕺💃⚡️ https://t.co/Pm5XIZtP2LHappy New Year and love you all 🎉🎉🎉Dearest AK sir #MagizhThirumeni @trishtrashers Sung by @anthonydaasan 🎙️Written by @Arivubeing ✍🏻Choreography by @kayoas13 🕺#Vidaamuyarchi #EffortsNeverFail@LycaProductions #Subaskaran…— Anirudh Ravichander (@anirudhofficial) December 27, 2024ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. సవాదికా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ప్రస్తుతానికి కేవలం తమిళ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా, ఆరవ్, నిఖిల్ నాయర్, దాశరథి, గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
నా కొడుకు జోరో కన్నుమూశాడు!
‘నా కొడుకు జోరో క్రిస్మస్ రోజున కన్నుమూశాడు అంటూ నటి త్రిష ఇన్ స్ట్రాగామ్ పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు’. నటి త్రిష ఏంటి? కొడుకు ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా? ఈ ఎవర్ గ్రీన్ హీరోయిన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 40లోనూ 20లా స్టార్ హీరో లో సరసన నటిస్తున్నారు. కాగా ఈ బహు భాషా నటి సుధకి ప్రేమికురాలు అన్ని విషయం తెలిసిందే. కాగా ఇంట్లో జోరో అనే పెంపుడు కుక్క ఉంది అంది నటి త్రిషకు ప్రియమైన నేస్తం. అలాంటి కుక్క బుధవారం మరణించింది. దీని గురించి నటి త్రిష తన ఇన్ స్ట్రాగామ్ లో పేర్కొంటూ శ్ఙ్రీ 12 ఏళ్లు నాతో కలిసి పెరిగిన నా ప్రియమైన నేస్తం నా జోరో ( పెంపుడు కుక్క), క్రిస్మస్ రోజున కన్నుమూశాడు. జోరో లేకపోతే నా జీవితమే జీరో అని నా గురించి తెలిసిన వారందరికీ తెలుసు. జోరో మరణించడంతో మా కుటుంబం శోక సముద్రంలో మునిగి పోయింది. ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యాం. దీంతో సినిమాలకు కొద్ది రోజలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.శ్రీశ్రీ అని నటి త్రిష పేర్కొన్నారు.కాగా ఈమె మరణించిన కుక్కకు అంత్య క్రియలు నిర్వహించారు. ఆ సమాధిపై పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నటి త్రిష చేసిన పోస్ట్ పలువురి హృదయాలను ద్రవింప జేసింది. -
వేకువజామున చనిపోయాడు.. త్రిష పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan) బాధపడుతోంది. తన కొడుకు చనిపోయాడని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం తాను షాక్‌లో ఉన్నానని చెప్పుకొచ్చింది. ఈ బాధ నుంచి తన ఫ్యామిలీ బయటపడేందుకు కాస్త సమయం పడుతుందని తనని తానే సముదాయించుకుంది. ఇక్కడ జొర్రో అంటే త్రిష పెంపుడు కుక్క. పేరుకే కుక్క గానీ కొడుకులా పెంచుకున్నట్లు ఇన్ స్టాలో పోస్ట్ చూస్తే అర్థమవుతోంది.'నా కొడుకు జొర్రో.. ఈ క్రిస్మస్ నాడు వేకువజామున చనిపోయాడు. నా గురించి బాగా తెలిసినవాళ్లకు.. జొర్రో నాకు ఎంతముఖ్యమనేది కూడా తెలుసు. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం. కుదుటపడటానికి కొన్నిరోజులు పడుతుంది. అప్పటివరకు అందుబాటులో ఉండను' అని హీరోయిన్ త్రిష ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)గత ఇరవైళ్లుగా దక్షిణాది భాషల్లో హీరోయిన్గా చేస్తున్న త్రిష.. ఇప్పుడు 40 ఏళ్లు దాటినా సరే స్టార్ హీరోయిన్ క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో (Viswambhara Movie) మెయిన్ హీరోయిన్ ఈమెనే. తమిళంలో అజిత్ 'విడమూయార్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాల్లో త్రిషనే హీరోయిన్. ఇది కాకుండా సూర్య, కమల్ హాసన్ (Kamal Haasan) కొత్త సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మలయాళంలోనూ రెండు మూవీస్ చేస్తోంది.ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న త్రిష.. ఇప్పుడు పెంపుడు కుక్క చనిపోయిందని పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె ఫాలోవర్స్.. త్వరలో త్రిష తిరిగి మాములు మనిషి అవ్వాలని కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కేసీఆర్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
Recap 2024: ఈ ఏడాది ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన హీరోయిన్స్ వీళ్ళే..!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నది సామెత. చిత్ర పరిశ్రమలో నటీనటులకు ఈ సామెత బాగా వర్తిస్తుంది. క్రేజ్ ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేసి అటు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించడంతో పాటు ఇటు బ్యాంక్ బ్యాలెన్స్‌లు కూడా పెంచుకోవాలి. అయితే పలువురు హీరోయిన్లు 2024ని మిస్ అయ్యారు. వారు నటించిన ఒక్క సినిమా కూడా ఈ ఏడాది విడుదల కాకపోవడం విశేషం. ఈ ఏడాది వెండితెరపై కనిపించని హీరోయిన్ల జాబితా డజనుకుపైగానే ఉంది. నయనతార, సమంత, అనుష్క, తమన్నా, త్రిష, సాయి పల్లవి, కీర్తీ సురేష్, పూజా హెగ్డే, శ్రుతీహాసన్, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, రాశీ ఖన్నా, నిధీ అగర్వాల్, మెహరీన్... వంటి పలువురు హీరోయిన్లు 2024ని మిస్ అయ్యారు. ఆ వివరాల్లోకి... 202రెండు సినిమాలతో జేజెమ్మతెలుగు చిత్ర పరిశ్రమలో జేజమ్మగా ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్నారు అనుష్క. ఆ మధ్య వరుస సినిమాలు చేసిన అనుష్క నాలుగేళ్లుగా కాస్త నెమ్మదించారు. 2020లో వచ్చిన ‘నిశ్శబ్దం’ సినిమా తర్వాత మూడేళ్ల అనంతరం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఆమె. అయితే 2024ని మాత్రం పూర్తిగా మిస్ అయ్యారు అనుష్క. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత తెలుగులో ఆమె కమిటైన చిత్రం ‘ఘాటీ’. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వేదం’ (2010) మంచి హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లోని ‘ఘాటీ’ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. నవంబరు 7న అనుష్క పుట్టినరోజు సందర్భంగా ‘ఘాటీ’ సినిమా నుంచి విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూ΄÷ందుతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ అనే సినిమా ద్వారా మలయాళ పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నారు అనుష్క. ‘ఘాటీ’, ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో 2025లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తారు అనుష్క. వచ్చే ఏడాదైనా... సౌత్‌లోని స్టార్ హీరోయిన్ల జాబితాలో సమంతది ప్రత్యేక స్థానం. అందం, అభినయంతో దక్షిణాదిలోనే కాదు... ఉత్తరాదిలోనూ తనకంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారామె. ఆ మధ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆమె ఈ మధ్య స్లో అయ్యారు. 2023లో ‘శాకుంతలం, ఖుషి’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ 2024లో మాత్రం వెండితెరపై కనిపించలేదు. అయితే ‘సిటాడెల్ హనీ–బన్నీ’ అనే వెబ్ సిరీస్ ద్వారా వెబ్ ప్రేక్షకులను మాత్రం అలరించారామె. విజయ్ దేవరకొండకి జోడీగా సమంత నటించిన ‘ఖుషి’ సినిమా తర్వాత ఆమె కమిటైన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’. తన పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాని ప్రకటించారు సమంత. అంతేకాదు... తన సొంత ప్రొడక్షన్ హౌస్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించడం విశేషం. బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. మెడలో నల్లపూసలు, చీర కట్టు, పెద్ద బొట్టుతో ఉన్న సమంత లుక్ చూస్తే ఆమె గృహిణి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఆమె చేతిలో గన్, ముఖం మీద రక్తపు మరకలు, ఆమె వెనకాల టెడ్డీ బేర్, స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్... ఇవన్నీ చూస్తే ఈ సినిమాలో మరొక కోణం కూడా ఉందని స్పష్టం అవుతోంది. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించలేదు. మరి 2025లో అయినా సమంత వెండితెర ప్రేక్షకులను అలరిస్తారా? లేదా అనేదానిపై స్పష్టత లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్ చేస్తున్నారు సమంత. డాక్యుమెంటరీతో మాత్రమే... దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ అనగానే నయనతార పేరును టక్కున చెబుతారు ఆమె అభిమానులు. ఓ వైపు హీరోలకి జోడీగా కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో దూసుకెళుతున్నారీ బ్యూటీ. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు ఎనిమిది సినిమాలు ఉన్నాయి. వాటిల్లో ఐదు తమిళ, రెండు మలయాళ, ఒకటి కన్నడ చిత్రం ఉంది. కాగా చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన ‘గాడ్ ఫాదర్’ (2022) సినిమాలో చిరంజీవి సోదరిగా నటించారు నయనతార. ఆ చిత్రం విడుదలై రెండేళ్లు దాటినా మరో తెలుగు సినిమా కమిట్ కాలేదామె. ఇతర భాషల్లో ఫుల్ బిజీగా ఉండటం వల్లనో లేకుంటే సరైన కథ కుదరకనో ఆమె తెలుగు సినిమాకి పచ్చజెండా ఊపలేదు. ఆ విధంగా దక్షిణాదిలోనే అగ్ర కథానాయికగా దూసుకెళుతున్న నయనతార కూడా 2024లో ప్రేక్షకులను పలకరించలేక΄ోయారు. ఆమె నటించిన ఏ సినిమా కూడా ఈ ఏడాది విడుదల కాక΄ోవడంతో ఆమె ఫ్యాన్స్‌కి నిరాశ తప్పలేదు. అయితే 2025లో మాత్రం దాదాపు అరడజనుకు పైగా సినిమాలతో ఆమె ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే... ఓటీటీలో ప్రసారమవుతున్న ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీతో ఈ ఏడాది నయనతార కనిపించడం ఆమె అభిమానులకు ఓ చిన్న ఊరట. ప్రత్యేక పాటతో... చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణం త్రిషది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటించి, తనకంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని సొంతం చేసుకున్నారామె. అందం, అభినయంలో ఇప్పటికీ నేటి తరం యువ హీరోయిన్లకు గట్టి ΄ోటీ ఇస్తున్నారు త్రిష. ఓ వైపు హీరోలకు జోడీగా నటిస్తూనే, మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లోనూ నటిస్తూ బిజీగా దూసుకెళుతున్న ఆమె నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది విడుదల కాలేదు. అయితే విజయ్ హీరోగా రూ΄÷ందిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ (గోట్) సినిమాలో మాత్రం ఓ ప్రత్యేక ΄ాటలో నటించారు త్రిష. అలాగే ‘బృంద’ అనే ఓ వెబ్ సిరీస్‌తో బుల్లితెర ప్రేక్షకులను పలకరించారామె. అవి మినహా 2024లో పూర్తి స్థాయిలో ఆమె ప్రేక్షకులను అలరించలేదు. అయితే వచ్చే ఏడాది పలు చిత్రాలతో తెరపై కనిపించనున్నారు. ప్రస్తుతం నాలుగు తమిళ చిత్రాలు, రెండు మలయాళ సినిమాలతో ΄ాటు తెలుగులో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు త్రిష. ‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’ కావడం విశేషం. ఇదిలా ఉంటే... 2025లో త్రిష నటించిన ఐదారు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని స్పష్టం అవుతోంది. 2023లో మూడు... ఈ ఏడాది నో నటి, గాయని, మ్యూజిక్ కం΄ోజర్... ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సొంతం చేసుకున్నారు శ్రుతీహాసన్. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా దూసుకెళుతున్నారామె. 2023లో తెలుగులో ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య (చిరంజీవి), వీరసింహారెడ్డి (బాలకృష్ణ), సలార్: పార్ట్ 1– సీజ్ఫైర్ (ప్రభాస్) ’ వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఆ మూడు సినిమాలతో గత ఏడాది హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ 2024లో మాత్రం తన అభిమానులను నిరాశపరిచారు. ఈ ఏడాది ఆమె నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు శ్రుతీహాసన్. అలాగే ‘చెన్నై స్టోరీ’లోనూ నటిస్తున్నారామె. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రెండు సినిమాలు 2025లో ప్రేక్షకుల ముందుకు వస్తాయని తెలుస్తోంది.వచ్చే ఏడాది స్ట్రయిట్ సినిమాతో... 2021లో ‘లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, ‘విరాట పర్వం’ చిత్రాలతో తెలుగు తెరపై కనిపించారు సాయి పల్లవి. ఆ తర్వాత తెలుగులో స్ట్రయిట్ సినిమా ఒప్పుకోలేదు. 2022లో ఆమె నటించిన తమిళ చిత్రం ‘గార్గీ’ తెలుగులోనూ విడుదలైంది. ఇక తమిళ చిత్రం ‘అమరన్’ తెలుగులోనూ విడుదల కావడంతో ఈ ఏడాది ఆ విధంగా తెలుగు ప్రేక్షకులను పలకరించారీ బ్యూటీ. సాయి పల్లవి నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘తండేల్’ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. సో... 2025లో స్ట్రయిట్ తెలుగు చిత్రంలో కనిపిస్తారామె. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. వచ్చే ఏడాది నాలుగు చిత్రాలతో... తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో గోపికమ్మా, బుట్ట బొమ్మగా స్థానం సం΄ాదించుకున్నారు పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్గా పరిచయమయ్యారామె. పదేళ్ల కెరీర్లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, అఖిల్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ వంటి హీరోలకి జోడీగా నటించారు పూజా హెగ్డే. ‘ఆచార్య’ (2022) సినిమాలో రామ్‌చరణ్‌తో జతకట్టిన ఈ బ్యూటీ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. అయితే ‘ఎఫ్ 3’ చిత్రంలో ఓ ΄ాటలో నర్తించారు. 2023లో ఆమె నటించిన ఒకే ఒక హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ రిలీజైంది. అయితే ఈ ఏడాది మాత్రం పూజ నటించిన ఏ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో మాత్రం రెండు హిందీ సినిమాలు, రెండు తమిళ చిత్రాలున్నాయి. 2024 గ్యాప్‌ని 2025లో భర్తీ చేయనున్నారు పూజ. వచ్చే ఏడాది నాలుగు చిత్రాల్లో పూజా హెగ్డే కనిపించే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే... తమన్నా, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, నిధీ అగర్వాల్, మెహరీన్ వంటి తారలు నటించిన ఏ భాషా చిత్రం కూడా 2024లో విడుదల కాలేదు. కీర్తీ సురేష్, రాశీ ఖన్నా, ప్రియమణి వంటి వారు 2024లో తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యారు. కానీ, ఇతర భాషల ప్రేక్షకులను అలరించారు.– డేరంగుల జగన్ -
ఆలయంలో త్రిష పూజలు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
నెటిజన్లకు ఎక్కువగా కంటెంట్స్ ఇచ్చే నటీమణుల్లో త్రిష ఒకరు అని చెప్పవచ్చు. కారణం వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఈ చైన్నె బ్యూటీ ఎప్పుడు చర్చనీయాంశమే. వృత్తిపరంగా చూస్తే 22 ఏళ్లు పూర్తి చేసింది. తన కెరీర్లో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని, జయపజయాలను చవిచూసి ఇప్పటికీ అగ్రకథానాయకి స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో స్టార్ హీరోల సరసన నటించడానికి ఏకై క ఆప్షన్‌గా వెలుగొందుతున్నారు. ఇక వ్యక్తిగతంగా త్రిష ఎప్పుడు సంచలనమే. ప్రేమ వ్యవహారంలో ఈమె గురించి పలు రకాల వార్తలు ప్రచారమవుతుంటాయి. అదేవిధంగా ఇంతకుముందే త్రిష పెళ్లి నిశ్చితార్థం వరకు వెళ్లి ఆగిపోయింది. 41 ఏళ్ల పరువాల ఈ భామ ఇప్పటికీ అవివాహితే అన్నది గమనార్హం. నటుడు విజయ్‌తో ఈమెను కలుపుతూ చాలాకాలంగా వదంతులు సామాజిక మాధ్యమాల్లో అవుతున్నాయి. తాజాగా నటి కీర్తి సురేష్ వివాహానికి నటుడు విజయ్, త్రిష చైన్నె నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లినట్లు ప్రచారం హోరెత్తుతోంది. అయితే నటి త్రిష ఇలాంటి విషయాలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. కాగా ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్న ఈమె తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఆయన 45వ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి త్రిష కోయంబత్తూరులోని ప్రసిద్ధిగాంచిన మరుదమలై మురుగన్(కుమారస్వామి) ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని, విశేష పూజలు నిర్వహించారు. అక్కడ ఆమెను చూసిన ఇతర భక్తులు సాధారణ ప్రజలు ఆమెతో ఫొటో తీసుకోవడానికి గుమిగూడారు. వారందరితో ఫొటోలు దిగిన త్రిష అక్కడి నుంచి బయల్దేరి వచ్చేశారు. ఆ ఫొటోలు, వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే నటి త్రిష దైవ దర్శనం చేసుకోవడంపై కూడా నెటిజన్లు ఇప్పుడు ఆరాలు తీస్తున్నారు. View this post on Instagram A post shared by NTC Talks (@ntctalks) -
నయన్ ను వెనక్కి నెట్టిన త్రిష.. 22 ఏళ్ళు అయిన తగ్గని క్రేజ్..
-
త్రిషకు 22 ఏళ్లు పూర్తి.. సూర్యతో కేక్ కట్ చేసిన బ్యూటీ
చిత్ర పరిశ్రమలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే తెలివైన వారి లక్షణం.. నటి త్రిష కూడా తన కెరీర్లో ఇదే చేసింది. 2002లో సూర్యకు జంటగా మౌనం పేసియదే చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత విజయ్ సరసన నటించిన గిల్లీ, విక్రమ్ జంటగా చేసిన స్వామి వంటి చిత్రాలు ఘన విజయాన్ని సాధించడంతో త్రిష క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆపై తెలుగులో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో త్రిష బహుభాషా నటిగా మారిపోయారు. ఆ తర్వాత హిందీ, కన్నడం, మలయాళం భాషల్లోనూ నటించి పాన్ ఇండియా కథానాయకిగా గుర్తింపు పొందారు. అలా ఇప్పుడు శతాధిక చిత్రాల కథానాయకిగా రాణిస్తున్న త్రిష అసలు వయసు 41 ఏళ్లు. కథానాయకి వయసు 22 ఏళ్లు. ఇప్పటికీ పలు భాషల్లో స్టార్ హీరోలతో జతకడుతూ ఆగ్ర కథానాయకిగా రాణించటం విశేషం. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో ఒకేసారి నటిస్తున్న నటి త్రిష, నటుడు కమలహాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న థగ్ లైఫ్ చిత్రంలోనూ, సూర్య సరసన ఓ చిత్రంలోనూ నటిస్తున్నారు. అదేవిధంగా తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర చిత్రంతో పాటు మలయాళంలో మోహన్ లాల్ సరసన రామ్, టోవినో థామస్ కు జంటగా ఐడెంటిటీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలా నాలుగు పదులు దాటినా అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్న త్రిష శుక్రవారంతో కథానాయకిగా 22 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఎక్స్ మీడియాలో ‘‘నేను కథానాయకిగా పరిచయమై 22 ఏళ్లు పూర్తి అయ్యాయి. ప్రేక్షకులైన మీ వల్లే ఇదంతా జరిగింది. అందుకు చాలా ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ఈ ఇకపోతే ఈమె శుక్రవారం సూర్య సరసన నటిస్తున్న చిత్ర షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ చిత్ర యూనిట్ త్రిష కథానాయకిగా 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. -
ట్రెండింగ్‌లో #JusticeforSangeetha.. అంతా త్రిష వల్లే?
ఆన్‌స్క్రీన్‌పై సూపర్ హిట్ అనిపించే జోడీలు కొన్ని ఉంటాయి. విజయ్ - త్రిష కూడా ఈ జాబితాలోకే వస్తారు. అయితే రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా వీరు జంటగానే ఉంటారంటూ ఎప్పటినుంచో రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ ఓ ప్రైవేట్ జెట్‌లో కలిసి ప్రయాణించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవగా జస్టిస్ ఫర్ సంగీత అన్న హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.భార్యకు దూరంగా విజయ్?సంగీత మరెవరో కాదు, విజయ్ భార్య. వీరిద్దరూ 1999లో పెళ్లి చేసుకోగా జేసన్ సంజయ్, దివ్య సాష అని ఇద్దరు సంతానం. గతేడాది విజయ్- సంగీత మధ్య పొరపచ్చాలు వచ్చాయని ప్రచారం జరిగింది. విజయ్ సినిమా ఈవెంట్లలోనూ కనిపించకపోవడంతో దూరం పెరిగిందని అంతా అనుకున్నారు. అయితే సంగీత వెకేషన్లో ఉండటం వల్లే విజయ్ మూవీ ఈవెంట్లకు హాజరు కాలేదన్నది మరో వాదన.ట్రెండింగ్‌లో విజయ్ -త్రిషఇప్పుడేకంగా వీరు కలిసి ట్రావెల్ చేస్తుండటంతో నెటిజన్లు విజయ్-త్రిష వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు మాత్రం.. ఏదైనా సినిమా కోసం కలిసి వెళ్తున్నారనుకోవచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు.Co-stars or power couple? Vijay and Trisha spotted boarding a private jet together. The industry is talking!#JusticeforSangeetha#AlluArjun #Delhi #AlluArjunArrest pic.twitter.com/q0NT6DQMB3— Roshan meena (@1f8be1a6f3fe4ad) December 13, 2024Exclusive footage of Vijay and Trisha sparks buzz! 🛩️👀 Work or something more? 🔥 #JusticeforSangeetha #TrishaKrishnan #ThalapathyVijay𓃵 pic.twitter.com/no2kkMUzuH— Rahul Kumar Pandey (@raaahulpandey) December 13, 2024చదవండి: Allu Arjun Arrest: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ -
స్కెచ్ వేస్తారా?
త్రిష, టొవినో థామస్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాజు మల్లియాత్, సీజే రాయ్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ కానుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.ఈ చిత్రంలో స్కెచ్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు టొవినో థామస్. ఓ క్రైమ్‌ను చూసి త్రిష... నేరస్తుడిని పట్టుకునే క్రమంలో అతని స్కెచ్ వేస్తారా? అని టొవినోకు చెబుతున్నట్లుగా టీజర్లో కనిపిస్తోంది. టొవినోకు ఆ నేరస్తుడి ముఖాకృతిని త్రిష వివరిస్తుంటారు. వచ్చే జనవరిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. -
రిపీట్ కాంబోస్‌తో ఊరిస్తున్న త్రిష..
-
45 రోజులు వర్షంలో షూటింగ్.. ఆ సినిమా మానేసి వెళ్లిపోదాం అనుకున్నా : త్రిష
‘నా కెరీర్లో ‘వర్షం’ సినిమా చాలా ప్రత్యేకం’ అన్నారు హీరోయిన్ త్రిష. ఇటీవల ఓ టీవీ షోలో తల్లి ఉమతో కలిసి పాల్గొన్నారు త్రిష. ‘మీ కెరీర్లో బాగా ఇబ్బంది పడిన సినిమా ఏంటి?’ అంటూ త్రిషని ప్రశ్నించారు యాంకర్. ఇందుకు ఆమె సమాధానం ఇస్తూ–‘‘నా కెరీర్లో ‘వర్షం’ మూవీ చాలా స్పెషల్. అలాగే ఎక్కువ ఇబ్బంది పడ్డ సినిమా కూడా అదే. నా కెరీర్ ఆరంభంలో ‘వర్షం’ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. ఈ చిత్రం కోసం దాదాపు 45 రోజులు వర్షంలో షూటింగ్ చేశాం. ఆ సమయంలో తడవడంతో జలుబు, జ్వరంతో ఇబ్బంది పడ్డాను. ఒక దశలో సినిమా మానేసి వెళ్లిపోవాలనిపించింది.అయితే ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో నా కష్టం మరచి పోయాను. తెలుగులో నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా ‘వర్షం’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... త్రిష సోలో హీరోయిన్గా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన డైరెక్ట్ చిత్రం ‘వర్షం’. తరుణ్ హీరోగా తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కిన ‘నీ మనసు నాకు తెలుసు’ (2003) చిత్రంలో శ్రియ ఓ హీరోయిన్ కాగా త్రిష మరో కథానాయికగా నటించారు. ప్రభాస్ హీరోగా శోభన్ దర్శకత్వం వహించిన ‘వర్షం’ చిత్రంలో సోలో హీరోయిన్గా నటించారు త్రిష. 2004 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘వర్షం’తో సూపర్‌హిట్ జోడీ అనిపించుకున్న ప్రభాస్–త్రిష ఆ తర్వాత ‘పౌర్ణమి’ (2006), ‘బుజ్జిగాడు’ (2008) వంటి చిత్రాల్లో నటించారు. ఇక ‘వర్షం’ తర్వాత తెలుగులో త్రిష బిజీ హీరోయిన్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, రవితేజ, గోపీచంద్, నితిన్, సిద్ధార్థ్ వంటి హీరోలకి జోడీగా నటించారు త్రిష. రెండు దశాబ్దాల కెరీర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించిన త్రిష ఇప్పటికీ బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అలాగే యువ హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష నటిస్తున్న తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె. ‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. వచ్చే ఏడాది వేసవిలో ‘విశ్వంభర’ విడుదల కానుందని టాక్. అదే విధంగా ప్రస్తుతం పలు తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు త్రిష. -
హీరో సూర్య 45వ చిత్రం ప్రారంభం..హీరోయిన్గా త్రిష (ఫొటోలు)
-
సూర్య @ 45
హీరో సూర్య 45వ చిత్రం బుధవారం ఉదయం పొల్లాచ్చి సమీపంలోని ఆనైమలై ప్రాంతంలో గల ప్రసిద్ధి చెందిన మాసానీ అమ్మన్ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఇందులో నటి త్రిష హీరోయిన్గా నటించనున్నారు. నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో నటుడు సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీల కుటుంబ సభ్యులు, నిర్మాత ఎస్ఆర్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.– సాక్షి, తమిళ సినిమా -
18 ఏళ్ల తర్వాత చిరు-త్రిష.. 38 ఏళ్ల తర్వాత రజనీ-సత్యరాజ్
‘దేవుడ దేవుడా తిరుమల దేవుడా... చూడర చూడరా కళ్లు విప్పి చూడరా...’ అంటూ ‘చంద్రముఖి’ సినిమాలో జోరుగా స్టెప్పులేశారు రజనీకాంత్. ఆ పాటలో ‘రిపీట్టే’ అని ఉంటుంది. 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్–సత్యరాజ్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఇలా లాంగ్ గ్యాప్‌తో ‘రిపీట్టే’ అంటూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం.పద్దెనిమిదేళ్ల తర్వాత... హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిషల జోడీ పద్దెనిమిదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. 2006లో విడుదలైన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన పద్దె నిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘విశ్వంభర’ సినిమాలో వీరు జంటగా నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగాలనుకున్నారు చిరంజీవి. 2025 జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు కూడా. అయితే చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘గేమ్ చేంజర్’ కోసం ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేశారు. ఇక ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘విశ్వంభర’ యూనిట్ జపాన్‌లో ఉంది. అక్కడ చిరంజీవి–త్రిషపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. 38 ఏళ్ల తర్వాత...సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’. కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ ‘కూలీ’కి దర్శకుడు. ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్–సత్యరాజ్ కలిసి నటిస్తుండటం విశేషం. 1986లో వచ్చిన ‘మిస్టర్ భరత్’లో సత్యరాజ్ తండ్రి పాత్ర చేయగా, రజనీకాంత్ ఆయన కొడుకుగా నటించారు. అయితే కావేరీ జలాల వివాదం సందర్భంగా రజనీకాంత్‌పై సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ కారణంగా అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి నటించలేదు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘శివాజీ’ (2007) చిత్రంలో సత్యరాజ్‌ని విలన్‌గా తీసుకోవాలకున్నారు దర్శకుడు శంకర్. అయితే సత్యరాజ్ ఆ అవకాశాన్ని తిరస్కరించడంతో ఆ పాత్రని సుమన్ చేశారని కోలీవుడ్ టాక్. తాజాగా ‘కూలీ’ సినిమా కోసం రజనీకాంత్–సత్యరాజ్‌లను ఒప్పించారు లోకేశ్ కనగరాజ్. ఈ మూవీలో రజనీ స్నేహితుడిగా ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రంలో తెలుగు స్టార్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘కూలీ’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇరవై ఏళ్ల తర్వాత... మలయాళ చిత్ర పరిశ్రమలో హిట్ జోడీగా పేరొందిన మోహన్ లాల్, శోభన మరోసారి కలిసి నటిస్తున్నారు. అది కూడా దాదాపు ఇరవైఏళ్ల తర్వాత కావడం విశేషం. మోహన్ లాల్ హీరోగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో ‘ఎల్ 360’ (వర్కింగ్ టైటిల్) సినిమా రూపొందుతోంది. ఎమ్. రంజిత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటిస్తున్నారు. 1985లో వచ్చిన ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు మోహన్ లాల్, శోభన. ఆ తర్వాత ఈ ఇద్దరూ యాభైకి పైగా సినిమాల్లో నటించారు. వీరిద్దరూ చివరిగా నటించిన చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’ 1994లో విడుదలైంది. ఆ తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోని వీరు (‘సాగర్ ఆలియాస్ జాకీ రీ లోడెడ్’ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించగా, శోభన అతిథి పాత్ర చేశారు) ఇరవై ఏళ్ల తర్వాత ‘ఎల్ 360’ కోసం మరోసారి తెరని పంచుకుంటున్నారు. కాగా ఇది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న 56వ సినిమా కావడం విశేషం.పాన్ ఇండియా సినిమా కోసంమలయాళ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల కాంబినేషన్ ఓ పాన్ ఇండియా సినిమాకి కుదిరింది. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు యాభైకి పైగా సినిమాలు వచ్చాయి. అయితే జోషి దర్శకత్వం వహించిన ‘ట్వంటీ 20’ (2008) చిత్రం తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి ఓ పుల్ లెంగ్త్ మూవీ చేయలేదు. అయితే మమ్ముట్టి హీరోగా నటించిన ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ (2013) చిత్రంలో మోహన్ లాల్ ఓ అతిథి పాత్ర చేశారు. కాగా పదహారేళ్ల తర్వాత వీరిద్దరూ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆంటో జోసెఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం శ్రీలంకలో ఘనంగా ప్రారంభమైంది. ‘‘మలయాళ సినిమా చరిత్రను తిరగ రాయడానికి సిద్ధంగా ఉన్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. శ్రీలంక, అబుదాబీ, అజర్ బైజాన్, లండన్, థాయ్‌ల్యాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చితో సహా పలు ప్రాంతాల్లో 150 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జరపనున్నాం’’ అని పేర్కొన్నారు మేకర్స్. 38 ఏళ్ల తర్వాత... హీరో రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ వంశీ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో ‘లేడీస్ టైలర్’కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా అర్చన నటించారు. 1986లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు. దాదాపు 38 ఏళ్ల తర్వాత ‘షష్ఠిపూర్తి’ సినిమా కోసం రాజేంద్రప్రసాద్, అర్చన కలిశారు. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీగా నటిస్తున్నారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంటగా నటిస్తున్నప్పటికీ ఈ కథ రాజేంద్రప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. రాజేంద్రప్రసాద్ భార్యగా అర్చన నటిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో షష్ఠిపూర్తి కథాంశంతో ఈ మూవీ సాగుతుంది. రూపేష్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ‘లేడీస్ టైలర్’ సినిమాకు సంగీతం అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాయే ‘షష్ఠిపూర్తి’కి కూడా స్వరాలు సమకూర్చడం విశేషం.పంతొమ్మిదేళ్ల తర్వాత... తమిళ చిత్ర పరిశ్రమలో హీరో సూర్య, హీరోయిన్ త్రిషలది హిట్ జోడీ. వీరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా తాజాగా నాలుగో సినిమా రానుందని టాక్. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మైథలాజికల్ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం త్రిషను సంప్రదించారట ఆర్జే బాలాజీ. కథ, తన పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఈ మూవీలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారని కోలీవుడ్ టాక్. ‘మౌనం పేసియదే’ (2002), ‘ఆయుద ఎళుత్తు’ (2004), ‘ఆరు’ (2005) వంటి చిత్రాల్లో నటించారు సూర్య, త్రిష. తాజాగా నాలుగోసారి ఆర్జే బాలాజీ సినిమా కోసం వీరిద్దరూ తెరని పంచుకోనున్నారట. ఈ వార్త నిజం అయితే 19 సంవత్సరాల తర్వాత వీరి జోడీ రిపీట్ అవుతుంది.టెస్ట్ మ్యాచ్‌కి సిద్ధం హీరోలు మాధవన్–సిద్ధార్థ్ క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరూ హీరోలుగా నటించిన తాజా చిత్రం ‘ది టెస్ట్’. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మీరా జాస్మిన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం కాగా, సింగర్ శక్తిశ్రీ గోపాలన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మాధవన్–సిద్ధార్థ్ ఈ సినిమాలో కలిసి నటించారు. సూర్య, మాధవన్, సిద్ధార్థ్ హీరోలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘యువ’ (2004). ఆ సినిమా తర్వాత మాధవన్–సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ‘ది టెస్ట్’. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించలేదు. అయితే 2025 ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశాలుఉన్నాయని కోలీవుడ్ టాక్.– డేరంగుల జగన్ -
నేను మనుషులను పట్టించుకోను: త్రిష
అందాల భామ నటి త్రిష. నాలుగు పదుల పరువాల సంచలన నటి ఇప్పటికీ అవివాహితనే అన్నది తెలిసిందే. కథానాయకిగా సెంచరీలు కొట్టినా పెళ్లికి మాత్రం దూరంగా ఉంటూ సోలో లైఫే సో బెటర్ అనేలా నడుపుతున్నారు. అయితే చాలా కాలం క్రితమే చైన్నె బ్యూటీ పెళ్లికి సిద్ధమయ్యారు. ఒక నిర్మాత, వ్యాపారవేత్తతో వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే అది కారణాలు ఏమైనా పెళ్లి పీటలు ఎక్కలేదు అప్పటినుంచి త్రిష నటనపైనే దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమే అంటూ అందుకు సమయం వచ్చినప్పుడు వివాహం చేసుకుంటానని చెబుతూ వస్తున్నారు. అదే విధంగా ఈ అమ్మాయి గురించి ప్రేమ వదంతులు చాలానే దొర్లాయి. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే త్రిష తాజాగా అసలు మనుషులతో పనిఏంటి అనే విధంగా తన ఎక్స్ మీడియాలో ఓ టీట్ చేశారు. అందులో తాను మనుషులను దూరంగా పెడతానని, శునకాలను ప్రేమిస్తానని అయితే నా శునకాలు మాత్రం ఇతర శునకాలను పక్కన పెడుతూ మనుషులను ప్రేమిస్తాయన్నారు. కాబట్టి మనమంతా కలిసి ప్రేమైక సమాజాన్ని స్థాపిద్దాం అని త్రిష పేర్కొన్నారు. ఈమె ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా త్రిష గురించి మరో విషయం కూడా సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈమె తన అభిమాన నటుడు విజయ్ అని చాలాసార్లు పేర్కొన్నారు. కాగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. దీంతో త్రిష ఆయన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కాగా నటుడు విజయ్ ఆదివారం ఆయన తొలిసారిగా మహానాడు కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. దీంతో ఈ కార్యక్రమంలో నటి త్రిష పాల్గొంటారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆమె మహానాడులో పాల్గొనక పోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
త్రిషకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..?
వెండితెర వెలుగులైన సినీ తారలకు దేవుళ్లు అభిమానులే. వారి అభిమానం పొందకపోతే ఎవరూ స్టార్ కాలేరు అన్నది వాస్తవం. అలా అసంఖ్యాక అభిమానులు కలిగిన నటీమణుల్లో త్రిష ఒకరు. గత రెండు దశాబ్దాలుగా తన అందం, అభినయాలతో అభిమానులను ఆరిస్తున్న అగ్ర కథానాయికగా రాణిస్తున్న నటి ఈ చైన్నె చిన్నది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో ప్రముఖ కథానాయకులు అందరితోనూ జతకట్టిన క్రెడిట్ ఈమెది. ఖట్టా మిఠా అనే హిందీ చిత్రంలో నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైయ్యారు. అలా పాన్ ఇండియా హీరోయిన్గా ముద్ర వేసుకున్నారు. ఇప్పటికీ టాప్‌స్టార్స్‌తో జతకడుతున్న త్రిష చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె అజిత్ సరసన విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలా ఒకేసారి ఒకే హీరోతో రెండు చిత్రాల్లో నటించడం అన్నది అరుదైన విషయమే. అదేవిధంగా మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న థగ్ లైఫ్ చిత్రంలోనూ త్రిష నటిస్తున్నారు. ఇకపోతే తెలుగులో చిరంజీవికి జతగా విశ్వంభర చిత్రంలో నటిస్తున్న ఈమె మలయాళంలో రామ్, ఐడెంటిటీ చిత్రాల్లో లభిస్తున్నారు. ప్రతిభకు కామా ఉంటుందేమో గాని ఫుల్స్టాప్ ఉండదు అని నిరూపించిన నటి త్రిష. ఆరంభ దశలో సామి, గిల్లి వంటి చిత్రాలకు ముందు ఆ తర్వాత అన్నట్టుగా వెలిగిన ఈమె ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి ముందు ఆ తర్వాత అన్నట్టుగా వెలిగిపోతున్నారు. అలాంటి త్రిషకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అలాంటిది ఈమె కూడా కొందరికి వీరాభిమానినేనట. ఒక భేటీలో త్రిష పేర్కొంటూ తనకు నటి అనుష్క, నిత్యామీనన్, ఇవానా, సాయి పల్లవి అంటే చాలా ఇష్టమని తాను వారికి అభిమానిని అని పేర్కొన్నారు. -
'విశ్వంభర' టీజర్ తేదీని ఫిక్స్ చేసిన మెగాస్టార్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. దసర సందర్భంగా అభిమానులకు కానుక ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. ఇదే విషయాన్ని తాజాగా ఒక పోస్టర్‌తో అభిమానులతో పంచుకున్నారు.దసర సందర్భంగా అక్టోబర్ 12న విశ్వంభర టీజర్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శనివారం ఉదయం 10:49 గంటలకు ప్రేక్షకులను విశ్వంభర ప్రపంచాన్ని పరిచయం చేయనున్నారు. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే దాదాపు పూర్తి కావస్తుంది.చిరంజీవి ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకులను మెప్పించారు. క్రేజీ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి చరిష్మాటిక్ ప్రెజెన్స్ తో మునుపెన్నడూ లేని ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించడానికి ‘విశ్వంభర’ రెడీ అవుతోంది. ఈ మూవీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ వండర్లా ఉండబోతోందని ఇప్పటికే చిత్రయూనిట్ పేర్కొంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. -
25 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
కళామతల్లిని నమ్మినవారిని ఎన్నటికీ చేయి విడువదు. ఇందుకు ఉదాహరణ నటి త్రిష. సుమారు 25 ఏళ్లుగా ఈ బ్యూటీ చెక్కు చెదరని అందాలతో కథానాయకిగా రాణిస్తున్నారు. మధ్యలో చిన్న ఆటుపోటులకు గురైనా త్రిష సినిమా కెరీర్ అధికంగా ఉన్నత స్థాయిలోనే కొనసాగుతోంది. తొలుత తమిళంలో నాయకిగా రాణించినా, ఆ తరువాత ఆమె క్రేజ్ తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల వరకూ చేరింది. అలా ఈ ఐదు భాషల్లోనూ ప్రముఖ స్టార్స్‌తో జత కట్టి అగ్రకథానాయకిగా వెలిగి పోతున్నారు. ఇదీ చదవండి: అర్థరాత్రి ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్నిజం చెప్పాలంటే పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో దర్శకుడు మణిరత్నం త్రిషకు మంచి రీఎంట్రీ ఇచ్చారనే చెప్పాలి. ఈ నాలుగు పదుల పరువాల భామ ఇప్పుడు నటుడు అజిత్ సరసన విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో పాటు కమలహాసన్‌తో కలిసి థగ్‌లైఫ్ చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా తెలుగులో చిరంజీవికి జంటగా ఒక చిత్రం, మలయాళంలో మోహన్‌లాల్, టోవినో థామస్‌తో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. త్రిష మొదట్లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ చెన్నై కిరీటాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆమె ఆ కిరీటాన్ని 1999లో గెలుచుకున్నారు. అది జరిగి 25 ఏళ్ల గడిచిన సందర్భంగా ఆ మధురమైన స్మృతులను తలచుకుంటూ తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఆ ఫొటోలను పోస్ట్ చేశారు. అందులో తన జీవితాన్ని మార్చిన రోజు అది అని పేర్కొన్నారు. -
ది గోట్ నుంచి 'విజయ్, త్రిష' మాస్ సాంగ్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ (ది గోట్). తాజాగా ఈ సినిమా నుంచి మాస్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న రిలీజ్ అయింది. భారీ అంచనాలతో థియేటర్స్‌లోకి వచ్చిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ, బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 400 కోట్లు రాబట్టింది.ది గోట్ సినిమాలో విజయ్‌తో కలిసి స్టార్ హీరోయిన్ త్రిష ఓ స్పెషల్ సాంగ్‌కు స్టెప్పులు వేశారు. వారిద్దరూ కలిసి వేసిన మాస్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పాట కూడా సినిమాకు హైలైట్‌గా నిలిచింది. అయితే, ఈ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ది గోట్ సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 3న స్ట్రీమింగ్కు రావచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.


