పద్దెనిమిది ఏళ్ల తర్వాత...  | Vishwambhara: Mega Star Chiranjeevi Welcomes Trisha - Sakshi
Sakshi News home page

పద్దెనిమిది ఏళ్ల తర్వాత... 

Published Tue, Feb 6 2024 12:02 AM

Mega Star Chiranjeevi Vishwambhara: Trisha makes a grand entry - Sakshi

పద్దెనిమిదేళ్ల తర్వాత స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు హీరో చిరంజీవి, హీరోయిన్‌ త్రిష. చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ ఫిల్మ్‌ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ ఈ భారీ బడ్జెట్‌ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ఓ హీరోయిన్‌ పాత్రలో త్రిష నటిస్తున్నట్లుగా యూనిట్‌ పేర్కొంది.

ఈ సినిమా కోసం 13 సెట్లను నిర్మించారు మేకర్స్‌. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్‌లో చిరంజీవి, త్రిషలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, ఓ పాటను కూడా చిత్రీకరించే పనిలో ఉందట చిత్రబృందం. అలాగే ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి మరో హీరోయిన్‌గా నటిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. ‘విశ్వంభర’ని సంక్రాంతి పండగకి జనవరి 10న విడుదల కానుంది. ఇక 2006లో వచ్చిన ‘స్టాలిన్‌’ చిత్రం తర్వాత చిరంజీవి, త్రిష కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న చిత్రం ‘విశ్వంభర’యే కావడం విశేషం.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement