బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన నటి | Bigg Boss Namratha Gowda Reacts to Marriage Rumours | Sakshi
Sakshi News home page

సీక్రెట్‌గా పెళ్లి చేసుకోను, ఇప్పట్లో ఆ ఆలోచనే లేదు!

Feb 19 2026 1:38 PM | Updated on Feb 19 2026 1:44 PM

Bigg Boss Namratha Gowda Reacts to Marriage Rumours

కన్నడ సీరియల్‌ నటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ నమ్రత గౌడ పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం ఊపందుకుంది. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కార్తీక్‌ మహేశ్‌తోనే ఏడడుగులు వేయనుందని గాసిప్‌. రియాలిటీ షో ముగిసిన తర్వాత కూడా ఇద్దరూ తరచూ జంటగా కనిపించడంతో ఇది నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. కానీ, తన పెళ్లి వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటోంది నమ్రత.

రహస్యంగా పెళ్లి చేసుకోను
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టింది. నా రిలేషన్‌షిప్‌, పెళ్లి గురించి ఏవేవో ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాబట్టి దానిపై మీ అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుంటే ఆ విషయం అందరికీ చెప్తాను. దాన్ని రహస్యంగా ఉంచాల్సిన పని లేదు. నా పెళ్లి చీర కోసం ఏదో కొత్త రంగు సృష్టిస్తున్నారట. ఇది మరీ విడ్డూరంగా ఉంది. 

మా మధ్య ఉన్నది స్నేహమే
ఏదేమైనా ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు అని కుండబద్ధలు కొట్టింది. కాగా కన్నడ బిగ్‌బాస్‌ పదో సీజన్‌లో నమ్రత, కార్తీక్‌ పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య ఉన్న చనువు చూసి ప్రేమాయణం నడుపుతున్నారని అభిమానులు ఫీలయ్యారు. అయితే తమ మధ్య ఉన్నది స్నేహమే అని ఈ జోడీ గతంలోనే క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ఫ్యాన్స్‌ మాత్రం వీరి చనువు చూస్తుంటే ఫ్రెండ్‌షిప్‌లా లేదని అభిప్రాయపడ్డారు.

చదవండి: తల్లి కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగే హీరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement