మలయాళ నటి ప్రీత ప్రదీప్ త్వరలో తల్లి కాబోతోంది. ఇప్పుడు ఆమెకు తొమ్మిది నెలలు. మరికొద్ది రోజుల్లో పండంటి బిడ్డ ఆమె కుటుంబంలో భాగం కానుంది. ఈ క్రమంలో అందంగా ముస్తాబైన ప్రీత తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది. అందులో తన పొట్టపై మెహందీ ఉంది. కమలం పువ్వుపై తల్లి బిడ్డను ఎత్తుకున్నట్లుగా డిజైన్ ఉంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు మీకంతా మంచే జరగాలని కామెంట్లు చేస్తున్నారు.
నటిగా
ఇకపోతే ప్రీత- వివేక్ పెళ్లి 2019 ఆగస్టు 25న జరిగింది. పెళ్లయిన ఏడేళ్లకు తొలిసారి పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందబోతున్నారు. కాగా ప్రీత ప్రదీప్.. కురుక్కు, సండే హాలీడే, ప్రేమసూత్రం, ఉయరే వంటి పలు సినిమాలు చేసింది. అలాగే బుల్లితెరపై ఓ సీరియల్‌లో నెగెటివ్ రోల్ పోషించింది. యాంకర్, డ్యాన్సర్‌గానూ తను సుపరిచితురాలే!


