వధువుపై కోట్ల రూపాయల నగదు వర్షం..! ఎక్కడంటే.. | Money Rain At Punjabi Wedding Goes Viral | Sakshi
Sakshi News home page

వధువుపై కోట్ల రూపాయల నగదు వర్షం..! ఎక్కడంటే..

Feb 18 2026 10:05 AM | Updated on Feb 18 2026 10:49 AM

Money Rain At Punjabi Wedding Goes Viral

కొన్ని విలాసవంతమైన పెళ్లిళ్లు తమ విలాసవంతమైన జీవితాన్ని, డాబు, దర్పం చూపిస్తున్నట్లుగా ఉంటాయి వేడుకలు. కావాలనుకుంటే..అట్టహాసంగా చేసుకోవచ్చు..అత్యంత లగ్జరీయస్‌గా వేడుక చేసుకోవచ్చు తప్పులేదు. కానీ డబ్బులను పూల వర్షంలా కురిపిస్తూ చేసుకోవడం అంటే..! ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించాలి. ఎందుకంటే ఆ సొమ్ము సామాజిక కార్యక్రమాలకు ఖర్చుపెడితే ప్రయోజనం, పరమార్థం ఉంటుంది. 

పైగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఆ నూతన దంపతుల మంచి ఆశీర్వాదాలు దక్కుతాయి, మేలు జరుగుతుంది కూడా. ఇలాంటి మంచిపనులు ఏదో ఒకనాటికి మనకు చేరిమేలు చేకూరుస్తాయనే కదా మన పురాణాలు నొక్కి చెబుతున్నాయి. కానీ కొందరు తమ స్వలాభానికి, సంతోషానికే ప్రాధాన్యత చూపిస్తూ వేడుకలు నిర్వహించి విమర్శలపాలవ్వుతారు. అలాంటి పనే చేసింది ఈ వరుడి కుటుంబం. 

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్‌లో జరిగిన వివాహ వేడుక అందర్నీ విస్తుపోయేలా చేసింది.వధువుపై డబ్బులు వర్షం కురిపిస్తూ..వరడు కుటుంబం ఆహ్వానం పలికింది. మొత్తం కుటుంబసభ్యులు ఆమెపై నోట్లకట్లను కురిపించారు. మొత్తం అక్షరాల రూ. 8.5 కోట్ల నగదును కురిపించినట్లు సమాచారం. 

ఆ తర్వాత వరుడు ఆమె చేతిని పట్టుకుని నవ్వుతూ కనిపించాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు..అతిగా ఉందని, పేదలకు, నిస్సహాయులకు ఆ డబ్బుని ఉపయోగించి ఉంటే బాగుండేదంటూ విమర్శించారు. కానీ కొందరూ..ఈ తంతు చూస్తే..అతడి కుటుంబం ఆమెని బాగా చూసుకుంటుందని ఆశిస్తున్నా, అయినా ఇది వారి డబ్బు..కాబట్టి నచ్చినట్లు ఖర్చుపెట్టుకుంటారని సపోర్టు చేస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: మోటివేషనల్ రీల్స్ చూస్తున్నారా..? అయినప్పటికీ లైఫ్‌..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement