హైదరాబాద్ : మొయినాబాద్‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అకాడమీ (ఐఎస్‌ఏ) డాగ్ ట్రైనింగ్ సెంటర్‌లో 25వ బ్యాచ్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది.
ఎనిమిది నెలలు కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న 76 జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈసారి శిక్షణలో పలువురు మహిళా పోలీసులు సైతం హ్యాండ్లర్లుగా పాల్గొనడం విశేషం.
ఈ సందర్భంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ..నేరస్తుల అన్వేషణలో, భద్రత, నిఘా, గాలింపు, పేలుడు,మాదకద్రవ్యాల గుర్తింపులో డాగ్ స్క్వాడ్ పాత్ర కీలకమని కొనియాడారు.


