వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఒక రాజకీయ నేత అయోధ్య రామాలయ విరాళాల నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసనకు దిగారు. నేషనల్ ఈక్వల్ పార్టీ కన్వీనర్ శశి ప్రతాప్ సింగ్ ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ హనుమంతునికి లేఖను సమర్పించారు.
వారణాసిలోని ఒక ప్రముఖ హనుమాన్ ఆలయంలో ఆయన ఈ లేఖను దేవుని సన్నిధిలో ఉంచారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణం కోసం దేశవిదేశాల నుండి భక్తులు సమర్పించిన విరాళాల సొమ్ము దుర్వినియోగం అయ్యిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో ఆయన ఈ లేఖను హనుమంతునికి అందించారు.
ఆలయ నిధుల నిర్వహణలో పూర్తి పారదర్శకతను పాటించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా జవాబుదారీతనం ఉంచాలని శశి ప్రతాప్ సింగ్ సంబంధిత అధికారులను కోరారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించి నిజానిజాలను బయటపెట్టాలన్నారు.


