ఫ్లైట్‌లో కూతుర్ని అలా చూసి.. తల్లిదండ్రులు షాక్‌! ఎందుకలా చెప్పావ్‌.. | A flight attendant told her parents she was on another flight Goes Viral | Sakshi
Sakshi News home page

ఫ్లైట్‌లో కూతుర్ని అలా చూసి.. తల్లిదండ్రులు షాక్‌! ఎందుకలా చెప్పావ్‌..

Jul 6 2026 9:53 AM | Updated on Jul 6 2026 10:11 AM

A flight attendant told her parents she was on another flight Goes Viral

అమ్మనాన్నలకు ఏ పిల్లలైనా.. మంచి సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనే ప్రయత్నిస్తారు. మంచి జాబ్‌ సాధించో లేక తాను చేస్తున్న ఆఫీస్‌కి చెప్పకుండా తీసుకువెళ్లడమే మరేదైనా నచ్చిన గిఫ్ట్‌ ఇచ్చో సంబరపడతారు. ఆ తర్వాత వాళ్ల కళ్లల్లో కనిపించే ఆనందం, గర్వం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం. అలాంటి సంతోషాన్ని పొందింది ఈ ఫ్లైట్‌ అటెండెంట్‌. 

ముందుగా ఆ మహిళా ఫ్లైట్‌ అటెండెంట్‌  తన తల్లిదండ్రలుకు తాను వేరే ఫ్లైట్‌లో ఉంటానని అబద్ధం చెబుతుంది. కానీ ఆమె తన పేరెంట్స్‌ వెళ్తున్న ఫ్లైట్‌లోనే అటెండెంట్‌గా విధులు నిర్వర్తించనుంది. కానీ అది చెప్పకుండా విమానంలో వాళ్ల రాక కోసం ఉత్కంఠభరితంగా ఆమె ఎదురు చూస్తుంది. ఇంతలో వాళ్లు రానే వస్తారు. అక్కడ కూతుర్ని అలా చూసి షాకవ్వుతారు. మరి ఎందుకు అబద్దం చెప్పావురా అని కూతుర్ని అడుగుతుంది ఆమె తల్లి. 

ఆ తల్లిదండ్రులిద్దరు డ్యూటీలో ఉన్న తమ కూతర్ని చూసి ఒక్క క్షణం  సంభ్రమాశ్చర్యలకు లోనవ్వడమే కాదు, గర్వంగా పీలవ్వుతారు. ఆమె అందుకు సంబంధించిన ఘటనను వివరిస్తూ.."తాను వాళ్ల క్యాబిన్‌ క్రూ అని గ్రహించే క్షణం కోసం ఆత్రుతగా ఎదురు చూశా. ఇది నిజంగా వెలకట్టలేనిది. తన తల్లిదండ్రల కళ్లల్లో ఆ గర్వాన్ని చూసేందుకే ఇలా చేశా. ఈ జర్నీ అత్యంత సృతృప్తినిచ్చే క్షణం ఇదే అంటూ అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ..పోస్ట్‌లో రాసుకొచ్చింది". 

అంతేగాదు ఆ పోస్ట్‌లో తన తల్లిదండ్రులు ఎప్పుడూ తాను క్యాబిన్‌ క్రూ అవ్వాలని కలలు కనేవారని, ప్రతి సుఖదుఃఖంలో తనకు అండగా నిలిచారని చెప్పుకొచ్చింది. ఈసర్‌ప్రైజ్‌ వారికోసం మాత్రేమ కాదు..అత్యంత కీలకమైన సమయంలో తనను నమ్మినందుకు కృతజ్ఞతలు చెప్పడాని ఇలా చేశా. వారు నాపై నమ్మకాన్ని కోల్పోనందు వల్లే ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానని రాసుకొచ్చింది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి ఆత్మీయ స్పందనలు వెల్లువెత్తాయి. ఇలాంటి సర్‌ప్రైజ్‌ని పేరెంట్స్‌ ఎన్నటికీ మర్చిపలేరంటూ పోస్టులు పెట్టారు. 
 

 (చదవండి: లగ్జరీ కారు యజమాని పెద్దమనసు..! ఆ ఆటో డ్రైవర్‌ కోసం..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement