ఆ మహిళ బ్రెయిన్‌లో 38 పరాన్న జీవులు..!కానీ సర్జరీ చేయకుండానే.. | UK Woman said with a metre long tapeworm and 38 parasites in brain | Sakshi
Sakshi News home page

ఆ మహిళ బ్రెయిన్‌లో 38 పరాన్న జీవులు..!కానీ సర్జరీ చేయకుండానే..

Jul 2 2026 12:46 PM | Updated on Jul 2 2026 1:01 PM

UK Woman said with a metre long tapeworm and 38 parasites in brain

ఒక విదేశీ మహిళ విపరీతమైన తలనొప్పితో బాధపడింది. ఆమె సాధారణ తలనొప్పి అనుకుంది కానీ..అది చూస్తుండగానే బుర్ర బద్దలైపోయేంతట విపరీతమైన నొప్పి..మూర్చ, మతిస్థిమతం వంటివి అటాక​ అయ్యి..కుప్పకూలిపోయింది. అప్పటిదాక బాగానే ఉన్న ఆమెకు ఆకస్మికంగా ఇలా ఎందుకు జరిగిందని విచారిస్తే..అసలు విషయం బయటపడింది. అలాగే వైద్య పరీక్షల్లో ఆమె బ్రెయిన్‌ స్కానింగ్‌ రిపోర్టు చూసి వైద్యులకే నోట మాటరాలేదు. అయితే ఇలాంటి సమస్య ఆ దేశంలో అత్యంత అరుదు కావడంతో ఎలా వచ్చింది అని విచారిస్తే ఆ‍శ్చర్యకరమైన విషయాలు బయటపడటమే గాక..ఆమె ఈ సమస్య నుంచి బయటపడటానికి పడరాని నరకం అనుభవించింది. ఇంతకీ ఎవారా ఆ మహిళంటే..

యూకేకు చెందిన లోరీ డెన్మాన్ అనే మహిళ విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ..మూర్చ వంటి సమస్యలు ఎదుర్కొంది. రాను రాను సమస్య మరింత దిగజారిపోయింది. ఒకరోజు ఉన్నట్లుండి కుప్పకోలిపోయింది. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి హుటాహుటినా తీసుకెళ్లగా వైద్యపరీక్షల్లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఆమె బ్రెయిన్‌ స్కానింగ్‌ రిపోర్టు చూసి వైద్యులే కంగుతిన్నారు. 

చివరికి తనకు ఈ సమస్య ఎలా వచ్చిందో తెలిసి విస్తుపోవడమే కాదు..రోజురోజుకి ఆమె మరింత దిగజారి ప్రాణాంతకంగా మారింది. అసలు ఇలా ఎందుకు జరిగిందని విచారించగా తాను భారత్‌ పర్యటకు వెళ్లానని..ఆ టూర్‌కి వెళ్లి ఇప్పటికీ మూడేళ్లు అవతుందని పేర్కొంది. అయితే ఆ తర్వాత ఒక రోజు మలవిసర్జనలో టేప్‌వామ్‌ని చూసి విస్తుపోయానని చెప్పింది. 

ఆ తర్వాత నుంచి పరిస్థతి నార్మల్‌గా ఉండటంతో లైట్‌ తీసుకున్నానని చెప్పింది. అప్పటి నుంచి తనలో ఈ బద్దెపురుగులు ఉన్నాయా అని వైద్యలును ప్రశ్నించింది లోరి. అయితే వైద్యులు పలు టెస్ట్‌లు చేసి శరరీంలో ఎక్కడ ఈ సమస్య లేదని, కేవలం బ్రెయిన్‌లోనే ఏకంగా 38 టేప్‌వార్మ్‌లు ఉన్నాయని అన్నారు. దీన్ని వైద్య పరిభాషలో ‘న్యూరోసిస్టిసెర్కోసిస్’ అని పిలుస్తారని అన్నారు. యూకేలో ఈ సమస్య చాలా అరుదని, ఈ వ్యాధి ప్రబలంగా ఉన్న ప్రాంతాల నుంచి వలస వచ్చినవాళ్లే  ఈ సమస్య బారిన పడతారని అనడంతో కంగుతింది లోరీ.

న్యూరోసిస్టిసెర్కోసిస్ అంటే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఇది పంది టేప్‌వార్మ్ వల్ల కేంద్ర నాడీ వ్యవస్థకు సోకే ఒక పరాన్నజీవి సంక్రమణ. సరిగ్గా ఉడకని ఆహారం, ముఖ్యంగా పంది మాంసం తినడం వల్ల మనుషులు ఈ వ్యాధి బారిన పడతారని అన్నారు. అలాగే టేప్‌వార్మ్ గుడ్లతో కలుషితమైన నీటి ద్వారా కూడా ఇది సంభవిస్తుందని తెలిపారు వైద్యులు

ఈ వ్యాధిని గుర్తించిన తర్వాత లోరీకి పరాన్న జీవి నిరోధక మందులు, ‍స్టెరాయిడ్లు ఇచ్చారు. అవి మొదట్లో బాగానే పనిచేశాయి. కానీ రాను రాను దుష్ప్రభావాలు చూపించడం మొదలుపెట్టింది. గందరగోళానికి గురవ్వడం, శరీరంలో తిమ్మిర్లు, జలదరింపు, బ్రాంతి వంటి మానసిక రుగ్మతలు బారినడపడింది. రోజురోజుకి పరిస్థితి మరింత దిజగారిపోయింది. చూడటానికి ఒక చిన్నపిల్ల మాదరి ప్రవర్తించడం మొదలుపెట్టింది. 

అలా ఆమె కోలుకుని యథాస్థితికి రావడానికి చాలా సమయమే పట్టింది. ప్రస్తుతం 42 ఏళ్లు ఉన్న ఆమె జీవితాంతం మూర్చ వ్యాధి మందులు వాడుతూనే ఉండాల్సి రావడం బాధకరం. అంతేగాదు ఆమెకు సర్జరీ చేయకుండానే ఆ పరాన్నజీవులను మట్టుబెట్టారు. అవి మెడిసిన్‌ ప్రభావంతో బ్రెయిన్‌లోనే గట్టిపడిపోతాయని చెప్పారు  వైద్యులు. ఇప్పుడు ఆమె పూర్తి స్థాయిలో కోలుకోవడమే కాదు.. ఆ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పిస్తోంది. పైగా తనలా ఎవ్వరూ ఏ సమస్య వచ్చినా తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తోందామె.

(చదవండి: లక్షల జీతం వదులుకుని వెయిటర్‌గా..! ఎందుకంటే..)

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement