ముప్పైల్లో మెదడుకు మోయలేని ఒత్తిడి! ఎందుకంటే? | Burnout In Your 30s Causes Stress Work Life Balance | Sakshi
Sakshi News home page

ముప్పైల్లో మెదడుకు మోయలేని ఒత్తిడి! ఎందుకంటే?

Aug 15 2026 9:50 AM | Updated on Aug 15 2026 10:11 AM

Burnout In Your 30s Causes Stress Work Life Balance

లైఫ్‌

హెల్త్‌

ఇరవైల్లో వచ్చే ఒత్తిడికి, ముప్పైల్లో అనుభవించే ‘బర్నౌట్‌’కు చాలా తేడా ఉంటుంది. 20 ఏళ్ల వయసులో వచ్చే అలసట, నిస్సత్తువ కాస్త నిద్రపోతేనో లేదా ఒక వీకెండ్‌ ట్రిప్‌ వెళ్తేనో తగ్గిపోతుంది. 30 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇదే లక్షణం తీవ్రమైన, దీర్ఘకాలిక మానసిక సమస్యగా మారుతోంది. అసలు ఈ బర్నౌట్‌కు కారణాలేంటి?

బాధ్యతల ఒత్తిడి
30 ఏళ్ల వయసులో జీవితంలో ఒకేసారి అనేక బాధ్యతలు వచ్చిపడతాయి. కెరీర్‌ కోసం పాకులాట, కుటుంబ బాధ్యతలు, సామాజిక సంబంధాలు, ఆరోగ్యం కాపాడుకోవడం వంటి వాటితో మనుషులు నలిగిపోతుంటారు. దీనివల్ల ఒత్తిడికి గురవుతుంటారు. అందువల్ల ప్రతిరోజూ కాసేపు నడక, ధ్యానం లేదా నచ్చిన పని చేస్తూ శరీరానికి, మెదడుకు కాస్త సమయం ఇవ్వాలి.

దొరకని విశ్రాంతి..
20ల్లో ఏదైనాప్రాజెక్ట్‌ కోసం రాత్రుళ్లు జాగారం చేసినా శరీరం త్వరగా కోలుకుంటుంది. కానీ ముప్పైల్లోకి అడుగుపెట్టాక దశాబ్ద కాలంగా పడుతున్న కష్టం, ఒత్తిడి ఒకేసారి బయటపడతాయి. తగినంత విశ్రాంతి దొరక్కపోవడం వల్ల శరీరం, మనస్సు నిరంతరం నిస్సత్తువలోనే ఉండిపోతాయి.

ఆర్థిక ఆందోళనలు
‘30 ఏళ్లు వచ్చాయంటే జీవితంలో సెటిల్‌ అయిపోవాలి’ అనే సామాజిక ఆలోచన పెద్ద భారంగా మారుతోంది. సొంత ఇల్లు కొన్నానా? రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ఉన్నాయా? పిల్లల చదువుల సంగతి ఏంటి? అనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి. సోషల్‌ మీడియాలో తోటి వారి ప్రగతిని చూసి ‘నేను ఇంకా వెనుకబడే ఉన్నానా?’ అనే అభద్రతా భావం మానసిక ప్రశాంతతను దూరం చేస్తోంది. అందువల్ల సమాజం నిర్ణయించిన మైలురాళ్లతో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు.

జీవక్రియల్లో మార్పులు
వయసు పెరుగుతున్న కొద్దీ శారీరక శక్తి, కోలుకునే సామర్థ్యం తగ్గుతాయి. ఇరవైల్లో లాగా తక్కువ నిద్రతో సరిపెట్టుకోవడం లేదా ఆహారం సరిగా తీసుకోకపోవడం వంటివి శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. అందువల్ల ఆరోగ్యానికిప్రాధాన్యతనివ్వాలి.

విశ్రాంతి తీసుకున్నా తగ్గని విపరీతమైన అలసట... 
ఏ పనిపైనా ఆసక్తి లేకపోవడం... నలుగురిలో ఉన్నా ఏదో తెలియని నిరాశ, ఒంటరితనం... ఈ లక్షణాలు ఈ మధ్య మీలో ఎక్కువగా కనిపిస్తున్నాయా? మీరు ముప్పైలో ఉన్నారా? అయితే మీరు ‘బర్నౌట్‌’బారిన పడి ఉండవచ్చు.

విరామం లేని ‘వర్క్‌ కల్చర్‌’
స్మార్ట్‌ఫోన్లు, మెయిల్స్, వర్క్‌–ఫ్రమ్‌–హోమ్‌ సంస్కృతి వల్ల ఆఫీసు పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సరిహద్దులు చెరిగిపోయాయి. పని వేళలు ముగిసిన తర్వాత కూడా మెయిల్స్‌కు, మెసేజ్‌లకు అందుబాటులో ఉండాల్సి రావడం వల్ల మెదడు ఎప్పుడూ విశ్రాంతి పొందే స్థితిలోకి వెళ్లలేకపోతోంది. అందువల్ల పని వేళలు ముగిశాక వర్క్‌ మెయిల్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement