breaking news
Tollywood
-
సందీప్ కిషన్ సిగ్మా.. ఐటమ్ సాంగ్ రిలీజ్
సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన చిత్రం సిగ్మా. ఈ మూవీలో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమా గాంధీ జయంతి రోజున థియేటర్లలో సందడి చేయనుంది.ఇటీవలే సిగ్మా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ నుంచి సులోచన అంటూ సాగే క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు కృష్ణ చైతన్య లిరిక్స్ అందించగా.. శృతి రంజని ఆలపించారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. . ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా.. ఎన్ వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్ చేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ కీలక పాత్రలు పోషించారు. -
విజయ్ దేవరకొండ రణబాలి.. రిలీజ్‌పై ఫుల్ క్లారిటీ
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ అక్టోబర్ 16 విడుదల కానుంది. ఇప్పుడికే విడుదలైన టీజర్ ఏందయ్యా సామీ ఫుల్ సాంగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు.దసరా బరిలో నిలిచిన ఈ మూవీ రిలీజ్ డేట్‌పై మైత్రి మూవీ మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 16న రణబాలి గ్రాండ్ రిలీజ్ కానుందని ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు. ఈ పోస్టర్లో విజయ్ దేవరకొండ తిలకం పెట్టుకుని కనిపించారు. ఈ లేటేస్ట్ పోస్టర్ విజయ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాకు ఈ అజయ్, అతుల్ సంగీతమందించారు. 16TH OCTOBER, 2026 🔥A warrior called RANABAALI.His OATH for his motherland. His FIGHT for his people.#Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26.#NeverForget#RanabaaliOnOct16th@TheDeverakonda @iamRashmika @Rahul_Sankrityn @MythriOfficial #ArnoldVosloo… pic.twitter.com/1Xw8y3850y— Mythri Movie Makers (@MythriOfficial) September 25, 2026 -
'హీరో పెళ్లానికి నేను నచ్చలేదట.. తాప్సీ షాకింగ్ కామెంట్స్'
హీరోయిన్ తాప్సీ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సరసన కనిపించింది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ.. గాంధారీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు చేస్తోన్న బ్యూటీ తన కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఓ చేదు సంఘటనను షేర్ చేసింది.ఓ సినిమాకు తీసుకున్న తనను సడన్‌గా వద్దని చెప్పారని తాప్సీ గుర్తు చేసుకుంది. నాకు ఎలాంటి స్పష్టమైన కారణం చెప్పకుండానే తొలగించారని తెలిపింది. నన్ను ఎందుకు తీసేశారని నేను పదేపదే అడుగుతుండటంతో అసలు కారణం చెప్పారని వెల్లడించింది. అయితే ఆ తర్వాత హీరో భార్యకు తాను నచ్చలేదని తొలగించారని తెలిసి షాకయ్యానని పేర్కొంది. ఆమెకు నేనేందుకు నచ్చలేదో నాకు మాత్రం తెలియదని తాప్సీ తెలిపింది. ఇది అత్యంత దారుణంగా అనిపించిందని తాప్సీ అన్నారు. అయితే ఆ నటుడి.. అతని భార్య పేరును కానీ వెల్లడించలేదు.తెలుగు, తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన తాప్సీ.. 'చష్మే బద్దూర్' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పింక్, థప్పడ్ వంటి సినిమాలతో తనకంటూ స్టార్ ఇమేజ్‌ని అక్కడ క్రియేట్ చేసుకుంది. ఝుమ్మంది నాదం మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ 2022లో చివరిగా ‘మిషన్ ఇంపాజిబుల్’లో మెరిసింది. -
ఈ అవార్డు మా ఆవిడదే : సుకుమార్
‘పుష్ప’ చిత్రం జాతీయ స్థాయిలో ఎంతగా సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజా 72వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం సైతం ఆ సంగతి మరోసారి కళ్ళకు కట్టింది. గతంలో ‘పుష్ప-1’ చిత్రానికి అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ అవార్డు వస్తే, ఈసారి అవార్డుల్లో ‘పుష్ప-2’ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్) రచయితగా దర్శకుడు సుకుమార్ అవార్జు అందుకున్నారు.అవార్డుల ప్రదానం అయిపోయిన వెంటనే, సుకుమార్‌తో ఫోటోలు దిగేందుకు యువతీ యువకుల నుంచి పెద్దల దాకా ఎంతోమంది క్యూ కట్టారు. శ్రీమతి తబితా సుకుమార్‌తో సహా ఈ కార్యక్రమానికి వచ్చిన సుకుమార్, డిజైనర్ త్సాహంగా కనిపించారు.’ సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ, “మా సినిమాను దేశ వ్యాప్తంగా ఎంతమంది ఇష్టపడ్డారో ఇక్కడ చూస్తుంటే మరోసారి అర్థమైంది. అందరి కష్టంతో రూపొందిన ఓ భారీ సినిమాకు వాణిజ్య విజయంతో పాటు పురస్కారాలు సైతం రావడం ఎప్పుడూ ఆనందమే ఇస్తుంది” అన్నారు సుకుమార్.‘తొలి జాతీయ అవార్డు అందుకున్న ఆనందం పంచుకోమ’ని కోరగానే… “నాకు మాటలు లేవు. గతంలో ‘పుష్ప’కు అవార్డులు వచ్చాయి. అయితే, ఇది నాకు వ్యక్తిగతం గా వచ్చిన తొలి నేషనల్ అవార్డు కూడా కావడంతో నా కన్నా నా శ్రీమతికి ఎక్కువ సంతోషాన్నిచ్చింది. ఈ అవార్డు ప్రదానోత్సవానికి ఆవిడను వెంట బెట్టుకొని రావడమే కాదు… రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకొని, వేదిక దిగాక ఆ అవార్డు మా ఆవిడ చేతిలోనే పెట్టాను. ఆమె కళ్ళల్లో ఆనందం కోసమే ఈ శ్రమంతా. అందుకే, ఈ అవార్డు నాది కాదు… నన్ను సహించి, భరించి, నిత్యం నన్ను ప్రోత్సహించే మా ఆవిడది” అని వ్యాఖ్యానించారు సుకుమార్.మరి, ‘పుష్ప-3’ మాటేమిటి? అదే అడిగితే, “తప్పకుండా ఉంటుంది. ముందుగా రామ్ చరణ్ సినిమా చేస్తాను. అది డిసెంబర్లో మొదలవుతుంది. ఆ తరువాత అల్లు అర్జున్‌తో ‘పుష్ప-3’ పట్టాలెక్కుతుంది” అని వివరం పంచుకున్నారు సుకుమార్. జనం చుట్టూ మూగి ఫోటోలు అడుగుతుంటే, ఓపికగా అందరికీ ఫోటోలిస్తున్న సుకుమార్‌ను దగ్గర నుంచి చూస్తూ తబిత సుకుమార్ ఆనందంతో ఉప్పొంగి పోవడం వేదిక వద్ద కనిపించింది. ‘పుష్ప-2’ చిత్రానికే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో శీతల్ ఇక్బాల్ చంద్ శర్మ, దీపాలీ నూర్ లు సైతం అవార్డులు అందుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన దీపాలీ నూర్ ప్రత్యేకంగా వారిని సుకుమార్‌కు పరిచయం చేయగా, వారు ఆయనతో ఫోటోలు దిగారు. -గుజరాత్‌లోని ఏక్తా నగర్ నుంచి ఆర్. జయ -
పచ్చబొట్టుతో శ్రుతి.. చీరలో అందంగా ప్రియాంక
అమెరికా ట్రిప్ వేసిన 'స్పిరిట్' తృప్తి దిమ్రిచీరలో అందంగా మెరిసిపోతున్న ప్రియాంక మోహన్నవ్వుతూ మాయ చేస్తున్న మాళవిక మోహనన్'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ప్రమోషన్లలో సితారపచ్చబొట్టు, బ్లాక్ రోజ్‌తో శ్రుతి హాసన్ గ్లామర్ View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Yukti Thareja (@realyukti) View this post on Instagram A post shared by SHANVI (@shanvisri) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
గంగూభాయి కతియావాడి కాంబో.. మరోసారి రిపీట్..!
గంగూభాయి కతియావాడి మూవీ అందరికీ గుర్తుంటే ఉంటుంది. ఆలియా భట్ ప్రధానపాత్రలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ.. ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ కాంబో మరోసారి రిపీట్ కానుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మరో చిత్రం లవ్ అండ్ వార్. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.(ఇది చదవండి: 'నన్ను అవమానించినా ఫర్వాలేదు..':..యాంకర్ రష్మీ స్ట్రాంగ్ కౌంటర్)తాజాగా అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో అలియా ఇంతకుముందెన్నడూ కనిపించని లుక్‌లో మెరిసింది. స్లిట్ స్కర్ట్, ప్రత్యేకమైన హెడ్‌పీస్‌తో కుర్చీలో కూర్చుని కనిపించింది. ఈ పాత్రలో అలియా పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించనుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో సంజయ్ లీలా భన్సాలీ తన గత చిత్రాలకు భిన్నంగా ఆధునిక ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాద జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. SANJAY LEELA BHANSALI - ALIA BHATT REUNITE – ALIA'S FIRST LOOK IN 'LOVE AND WAR' – 21 JAN 2027 RELEASE... The last time #SanjayLeelaBhansali and #AliaBhatt came together, they delivered a National Award-winning film and a smash-hit led by a female protagonist.Now, the… pic.twitter.com/Ori5zVU5kS— taran adarsh (@taran_adarsh) September 25, 2026 -
'నన్ను అవమానించినా ఫర్వాలేదు..':..యాంకర్ రష్మీ స్ట్రాంగ్ కౌంటర్
టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌గా రాణిస్తూనే కొన్ని సినిమాలు కూడా చేసింది. నటనతో పాటు తనవంతుగా సమాజం కోసం ప్రశ్నిస్తూనే ఉంటోంది. ముఖ్యంగా మూగజీవాల కోసం తన వంతు ప్రయత్నంగా ఏదో ఒక రూపంలో పోరాడుతోంది. అయితే ఏదైనా మంచిపని చేసేవారిపైనే విమర్శలు వస్తుంటాయి. అలా రష్మీపై కూడా చాలామంది ట్రోల్స్ చేస్తుంటారు. అలాంటి వారికి తనదైన స్టైల్లోనే కౌంటరిస్తుంది. తాజాగా రష్మీ మరో ఘాటుగా విమర్శించింది. నన్ను ఏమన్నా ఫర్వాలేదు కానీ.. మీరు ప్రశ్నించకపోతే మూగజీవాల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ట్వీట్ చేసింది. ఇంతకీ తన ట్వీట్లో ఏం రాసుకొచ్చిందో మనం కూడా తెలుసుకుందాం.రష్మీ ట్వీట్లో రాస్తూ...'నన్ను అవమానించండి.. నన్ను కించపరచండి..నన్ను దూషించండి.. నేను వాటిని పట్టించుకోను.. కానీ మీరు అధికారులను ప్రశ్నించడం ప్రారంభించకపోతే..ఆ డబ్బు ఎక్కడికి వెళ్తోంది? జంతు సంరక్షణ కేంద్రాలు ఎందుకు అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి? ప్రభుత్వ పశువైద్య ఆసుపత్రులలో ఎందుకు సరైన సదుపాయాలు లేవు? వీధి కుక్కలకు, పిల్లులకు ఎందుకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, టీకాలు వేయడం లేదు? ఆవులు, గేదెల యజమానులకు ఎందుకు సరైన మార్గదర్శకాలు జారీ చేయడం లేదు? వన్యప్రాణులు మానవ నివాసాల్లోకి ఎందుకు ప్రవేశిస్తున్నాయి? ఇక తర్వాతి తరానికి చూడటానికి పచ్చదనం ఏమైనా ఉంటుందా? వినియోగం గురించి మర్చిపోండి.. నన్ను విమర్శించడం వల్ల మీకు ఎలాంటి సహాయం అందదు.. అందుకే మీ శక్తిని, సమయాన్ని తెలివిగా ఉపయోగించండి.'ట్రోల్స్ చేసేవారికి గట్టిగానే ఇచ్చిపడేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Shame me Degrade me Abuse me I really don't care But if you don't start questioning the authorities the real question Where is the money going ?Why are animal shelters in such terrible conditions?Why are govt vet hospitals not well equipped?Why are the street dogs and…— rashmi gautam (@rashmigautam27) September 25, 2026 -
'కళ్యాణం కమనీయం జీవితం' మూవీ రివ్యూ
టైటిల్: 'కళ్యాణం కమనీయం జీవితం' నటీనటులు: ఖాన్ దురాని, సాహితీ అవంచ , ఉదయ్ పులిమి, విషిక, సత్యానంద్ లంక, కాకినాడ నాని, ధనలక్ష్మి బల్ల తదితరులునిర్మాతలు: పైలా ప్రసాదరావు, కిషోర్ గుండాలదర్శకత్వం: రవి లోకిరెడ్డిసంగీతం: శ్రీమురళి కార్తికేయవిడుదల: 25, సెప్టెంబర్ 2026కథేంటంటే.. జెన్ జీ యువతి సునయన ఇద్దరి యువకులతో క్లోజ్‌గా మూవ్ అతుంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి? నిజమైన ప్రేమ ఎవరిది? అనేది ఆమెకు అర్థం కాదు. సముద్ర తీరాన కూర్చొని దాని గురించే ఆలోచిస్తుండగా.. ఒక భిక్షగాడు వచ్చి ఓ కథ చెబుతాడు. అది కల్యాణ్–కమనీయ అనే దంపతుల కథ. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట జీవితంలోకి రాహుల్ అనే వ్యక్తి ప్రవేశిస్తాడు. అతడి ప్రతీకారం, గతం, కుట్రల కారణంగా ఆ దాంపత్య జీవితంలో అనూహ్యమైన సమస్యలు మొదలవుతాయి. ఒక అందమైన ప్రేమకథ క్రమంగా అనుమానాలు, బాధలు, మోసాలు, సంఘర్షణలతో నిండిపోతుంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. కల్యాణ్–కమనీయ కథకు సునయన జీవితానికి ఉన్న సంబంధం ఏమిటి? గతంలో జరిగిన సంఘటనలు వర్తమానంలో సునయన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయి? రాహుల్ అసలు ఎవరు? అతడి గతం ఏమిటి? చివరకు సునయన తన జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నదే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రేమ, పెళ్లి, అనుమానం, మోసం, ప్రతీకారం... ఈ అంశాల చుట్టూ ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే వీటన్నింటినీ ఒక జెన్‌జీ యువతి జీవితంతో ముడిపెట్టి చెప్పే ప్రయత్నమే ‘కళ్యాణం కమనీయం జీవితం’. ప్రేమకథకు ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను జోడించి దర్శకుడు రవి లోకిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా గతంలో జరిగిన కథను ప్రస్తుత తరానికి చెందిన యువతి జీవితంతో అనుసంధానం చేయడం కథలో ఆసక్తిని పెంచే అంశం. సినిమా కథనంలో ప్రేక్షకుడికి కొన్ని ప్రశ్నలు రేకెత్తించే విధంగా కథను ముందుకు తీసుకెళ్లడం దర్శకుడి ప్రయత్నంగా కనిపిస్తుంది. సినిమా టైటిల్ తగ్గట్లుగానే ప్రేమ అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే బంధం మాత్రమే కాదని, దాని వెనుక నమ్మకం, కుటుంబం, గతం, భావోద్వేగాలు ఉంటాయని ఈ కథతో చెప్పే ప్రయత్నం చేశారు. ఒకవైపు జెన్‌జీ ప్రేమకథ, మరోవైపు కల్యాణ్–కామిని దాంపత్య జీవితంలోని విషాదం, వాటి మధ్య రాహుల్ పాత్ర చుట్టూ నడిచే సస్పెన్స్ సినిమాకు ప్రత్యేకమైన నేపథ్యాన్ని అందిస్తాయి.అయితే కథలోని ట్విస్టులు మరింత బలంగా రాసుకొని, కొన్ని కీలక సన్నివేశాలను మరింత ఆసక్తికరంగా మలిచి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. కల్యాణ్ పాత్రలో ఖాన్ దురాని మెప్పించాడు. ప్రేమ, బాధ, సంఘర్షణ వంటి భావోద్వేగాలను పలికించే సన్నివేశాల్లో అతడి నటన కథకు అనుగుణంగా సాగుతుంది. ప్రత్యేకంగా ప్రేమలో ఉన్న వ్యక్తిగా, అలాగే సంబంధాల్లో వచ్చే సమస్యలను ఎదుర్కొనే వ్యక్తిగా పాత్రలోని ఎమోషన్‌ను చూపించే ప్రయత్నం చేశారు. అయితే కథలోని కీలక మలుపులు హీరో పాత్రను మరింత బలంగా ఎలివేట్ చేసి ఉంటే అతడి పాత్రకు మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. సాహితి అవంచ పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ప్రేమ, కుటుంబం, భావోద్వేగాల మధ్య సతమతమయ్యే పాత్రలో ఆమె కనిపిస్తుంది. సహజమైన నటనతో పాత్రకు సరిపోయేలా కనిపించారు. హీరోతో కెమిస్ట్రీ కూడా కథకు అవసరమైన స్థాయిలో ఉంటుంది. జెన్‌జీ యువతి సునయన పాత్రలో నటించిన నటితో పాటు సత్యానంద్ లంక, కాకినాడ నాని, సోనీ రెడ్డి, ధనలక్ష్మి బల్ల తదితరులు తమ పాత్రల పరిధిలో నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శ్రీమురళి కార్తికేయ సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. సినిమాట్రోగఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
అవార్డుల ఆనందంలో ఆటపాటలు!
విజయం ఎవరికైనా ఆనందాన్నిచ్చే అనుభూతి, ఓ తీపి జ్ఞాపకం. సినిమా విషయంలో వాణిజ్య విజయంతో పాటు... పురస్కారాల గుర్తింపు దక్కితే అది మరపురాని ఆనందానుభూతి, మరింత మధుర జ్ఞాపకం. ఆ అవార్డు ఏకంగా జాతీయ పురస్కారమైతే, ఇక చెప్పేదేముంది! తాజా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మన తెలుగు సినిమా ఏకంగా 9 అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ నేషనల్ అవార్డులు గెలుచుకున్న మన తారలు, దర్శక, నిర్మాతల ముఖాల్లోనే కాదు... మాటల్లో, చేతల్లోనూ ఆ ఆనందం చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీద నుంచి జాతీయ అవార్డులు అందుకుని హైదరాబాద్‌కు ఇంటి ముఖం పట్టినవారు వడోదరా విమానాశ్రయంలో ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. హైదరాబాద్ విమానం ఎక్కేందుకు చాలా సమయం ఉండడంతో ఆటపాటలతో గడుపుతూ కనిపించారు.పెద్దలు ఆడిన పిల్లల ఆట కథ..ఉత్తమ బాలల చిత్రం కేటగిరీలో నేషనల్ అవార్డు గెలుచుకున్న ‘35... చిన్న కథ కాదు’ టీమ్, అలాగే ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్స్ ఉత్సాహంగా కనిపించాయి. యువతరానికి చెందిన ఈ టీమ్‌లు రెండూ మరింత పిన్న వయస్కులైపోయి, ఎయిర్‌పోర్ట్‌లోని ప్లే జోన్ వద్ద ఆటపాటల్లో పోటీపడుతూ సందడి చేశాయి. ‘35... చిన్న కథ కాదు’ సినిమా దర్శకుడు ఈమని నందకిశోర్, ఆ చిత్ర నటుడు – నిర్మాత విశ్వదేవ్ రాచకొండ, ఆ చిత్రం నుంచే ఉత్తమ బాలనటుడిగా నిలిచిన అరుణ్‌దేవ్ పోతుల, అలాగే ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రాన్ని అందించిన నటి నిహారిక కొణిదెల, ఆ చిత్రానికే ఉత్తమ మేకప్ విభాగంలో జాతీయ అవార్డు అందుకున్న పసుపులేటి రవికుమార్ అందరూ కలసి రెండు జట్లుగా ఏర్పడి బంతులను దూరం నుంచి బాస్కెట్లోకి విసిరే ఆట ఆడారు.అప్పుడు ‘రుద్రవీణ’... ఇప్పుడు ‘కమిటీ కుర్రోళ్లు’అందరూ తమ తమ వయసు మర్చిపోయి సినిమాల టైటిల్స్ – అందులోని హీరో, హీరోయిన్ల పేర్లతో ‘అంత్యాక్షరి’ ఆటలో కూడా పాల్గొన్నారు. క్యూలో నిల్చొని, విమానంలోకి అడుగు పెడుతున్న ఆఖరి క్షణం వరకు ఆ ఆటలు, ఆనందాల సందడి కొనసాగింది. నటి నిహారిక తల్లి పద్మజ సైతం ‘అంత్యాక్షరి’ గేమ్‌ను ఆస్వాదిస్తూ.. కుమార్తెను సపోర్ట్ చేస్తూ, ఆటలో పాలుపంచుకుంటూ కనిపించారు. కాస్తంత దూరంలో కూర్చున్న నిహారిక తండ్రి నాగబాబు సైతం అవార్డు విజేతల ఆనంద క్షణాలను చూసి, చిరునవ్వులు చిందించారు. ‘ఒకప్పుడు కె. బాలచందర్ దర్శకత్వంలో అన్నయ్య చిరంజీవి నటించిన ‘రుద్రవీణ’ చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ చిత్ర నిర్మాతగా నేను జాతీయ అవార్డు అందుకున్నాను. కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ మా అమ్మాయి ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్ర నిర్మాతగా జాతీయ అవార్డు అందుకున్న క్షణాలు నాకెప్పటికీ మర్చిపోలేని ఆనందక్షణాలు. తండ్రినైన నాకే ఈ వయసులో ఇంత ఆనందంగా ఉంటే.. కెరీర్ తొలి రోజుల్లోనే జాతీయ అవార్డ్ అందుకున్న ఆ పిల్లలకు ఇంకెంత ఆనందంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు. బాధ్యత మరువని మహిళా నిర్మాత!ప్రజాదరణ పొందిన ఉత్తమ పాపులర్ చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న ‘కల్కి’ చిత్ర నిర్మాత సి. అశ్వినీదత్, భార్య, సినీ నిర్మాణంలో వారసురాలిగా ఎదిగిన కుమార్తె స్వప్నాదత్, అలాగే ‘కల్కి’ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తల్లి జయంతి రెడ్డి విమానాశ్రయంలో కనిపించారు. తల్లితండ్రులను జాగ్రత్తగా ఎస్కలేటర్ ఎక్కించడం నుంచి లగేజ్ తీసుకొస్తూ... వారు ప్రశాంతంగా ఓ పక్కన కూర్చొని నిరీక్షించే ఏర్పాట్లు చేయించడం దాకా అన్నిటినీ స్వప్న దత్ దగ్గరుండి చూసుకోవడం గమనార్హం. పెద్ద వయసు తల్లితండ్రుల పట్ల పిల్లలకు ఉండాల్సిన ప్రేమతో పాటు బాధ్యతకు ఆ సన్నివేశం ఓ ప్రత్యక్ష ఉదాహరణగా అనిపించింది.ఒకప్పుడు నంది అవార్డుల్లాగే ఇప్పుడు ‘మహానటి’ (జాతీయ ఉత్తమ నటి, ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం), ‘కల్కి’ (నేషనల్ బెస్ట్ పాపులర్ ఫిల్మ్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైనింగ్) లాంటి చిత్రాలతో... వరుసగా జాతీయ అవార్డులు ఇంటికి క్యూ కడుతున్నట్టు ఉన్నాయే అంటే తండ్రీ కూతుళ్లు హాయిగా నవ్వేశారు.మరోపక్క ఎస్వీ రంగారావు నటించిన ప్రసిద్ధ తెలుగు పౌరాణిక చిత్రం ‘యశోద కృష్ణ’ (1975) తమిళ అనువాదం మొదలు తాజాగా జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలు బోధించే చిత్రంగా జాతీయ అవార్డు, అదే చిత్రంలో నటించిన హీరో ధనుష్‌కు ప్రత్యేక ప్రశంసగా నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన ‘కెప్టెన్ మిల్లర్’ వరకు అయిదు దశాబ్దాలుగా పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తున్న ప్రసిద్ధ చిత్ర నిర్మాణసంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ అధినేత టి.జి. త్యాగరాజన్, తన శ్రీమతితో కలసి సేద తీరుతూ కనిపించారు.ఆత్మీయ చర్చల్లో ఆ దర్శక త్రయం..నటీనటులు, నిర్మాతలే కాదు... ప్రముఖ దర్శకులు సైతం పిచ్చాపాటీ కబుర్లు, సినీ విశేషాల గురించి ఆత్మీయంగా సంభాషిస్తూ కనిపించారు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ‘పుష్ప-2’ చిత్రానికి నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సుకుమార్, అలాగే ఉత్తమ సంభాషణల రచయితగా ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి నేషనల్ అవార్డు గెలుచుకున్న మరో యువ దర్శకుడు వెంకీ అట్లూరి, నేషనల్ అవార్డుల తుది సెంట్రల్ జ్యూరీలోని ఏకైక తెలుగువాడైన దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఎయిర్‌పోర్ట్‌లోని లాంజ్‌లో నిలబడి, మనసు విప్పి మాట్లాడుకున్నారు. సుకుమార్, వెంకీ అట్లూరి... ఇద్దరికీ ఇదే తొలి జాతీయ అవార్డు. ‘గతంలో నేను తీసిన ధనుష్ ‘వాత్తి’ (తెలుగులో ‘సార్’ - 2023) చిత్రానికి సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్‌ను జాతీయ అవార్డు (పాటలు) వరించింది. కానీ, నాకు వ్యక్తిగతంగా మాత్రం ఇదే ఫస్ట్ నేషనల్ అవార్డ్’ అని వెంకీ అట్లూరి వ్యాఖ్యానించారు.తోటి దర్శకులతో సాగిస్తున్న సుదీర్ఘ సంభాషణలో తన తాజా హిట్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సాధించిన విజయం, ఆ చిత్ర ఆలోచన, అందులోని కథాకథనం, లభించిన ప్రశంసలు, కొందరి పసలేని విమర్శలు, చివరకు బాక్సాఫీస్ వసూళ్ల వివరాలను తెలియజేస్తూ, వెంకీ తన మనసులోని మాటలు పంచుకున్నారు. దర్శకుడు సుకుమార్ సైతం ఉత్తమ సాహిత్యం, వార్తా నివేదనంలో తమ ప్రత్యేకతను నిలుపుకొన్న కొన్ని ప్రత్యేక పత్రికలు – మ్యాగజైన్లు, వాటి పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం, దర్శకుడిగా తొలి చిత్రం ‘ఆర్య’ నాటి నుంచి నేటి దాకా తన వెన్నంటి నిలిచిన జర్నలిస్టులు... ఇలా అనేక అంశాలను తన మాటల్లో గుర్తు చేసుకున్నారు. జ్యూరీ సభ్యుడైన దర్శకుడు వి.ఎన్. ఆదిత్య సైతం వాళ్లందరి మాటలతో జత కలుపుతూ.. తన అనుభవాలను పంచుకున్నారు. మొత్తానికి, నేషనల్ అవార్డులు తెచ్చిపెట్టిన విజయానందం, ఆ స్నేహశీలత, సంతోషం మన విజేతలందరిలో అణువణువునా తొణికిసలాడింది. తెలుగు సినీ పరిశ్రమంటే... నిత్యం ఏదో ఒక వివాదం, అనైక్యత, అసమ్మతి మాత్రమే అనిపించే వర్తమానంలో... ఇలా సినీ పరిశ్రమ వర్గీయుల ఏకతాటిపైకి వచ్చి, ఆనందంగా గడపడం వస్తున్న మార్పుకు శుభసూచన.-గుజరాత్‌లోని ఏక్తానగర్ నుంచి ఆర్. జయ -
'మందు తాగి వినాయకుడి ముందు చిందులా? ఒక్కడికైనా మంత్రాలు వచ్చా?'
పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ గత ఒకటి రెండు రోజులుగా మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్న ఈమె.. అర్థరాత్రి డీజేలతో హోరెత్తిస్తూ వినాయక నిమజ్జనాలు చేయడమేంటి? సాయంత్రం 7-8 గంటల్లోపే చేసుకోవచ్చుగా అని ఓ వీడియో పోస్ట్ చేసింది. దీంతో ఈమెని ట్రోల్స్ చేస్తూ విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. దీంతో మరో వీడియో పోస్ట్ చేసిన రేణు దేశాయ్.. సంచలన వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: మూడో వ్యక్తి మా మధ్య పుల్ల పెట్టాడు.. ధనుష్‌తో గొడవపై వడివేలు)'నేను మాట్లాడేది నాకు ఇబ్బంది అయిందని కాదు. ఎందుకంటే నేను 18వ అంతస్తులో ఉంటున్నా. నాది సౌండ్ ప్రూఫ్ బెడ్ రూం. బయట ఎంత పెద్ద శబ్దం వచ్చినా నాకు ఎలాంటి సౌండ్ వినిపించదు. ప్రస్తుతం సిటీలో చాలామందికి వైరల్ జ్వరాలు వస్తున్నాయి. నా కూతురితో పాటు ఎంతోమంది ఇళ్లల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలాంటి టైంలో రాత్రి 11-12 గంటల వరకు డీజేలు మోగిస్తే ముసలివాళ్లు, పిల్లలు ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసా?''చాలామంది మేం ఉదయం ఉద్యోగాలు చేసుకుంటాం. రాత్రి నిమజ్జనం చేసుకుంటామని అంటున్నారు. చేసుకున్నా సరే రాత్రి 6-7 గంటల్లోపు పూర్తి చేసుకోండి. రాత్రిపూట మందు తాగి, దేవుడి విగ్రహం ముందు పిచ్చిపిచ్చిగా చిందులు వేయడమేనా మీ సనాతన ధర్మం? పోనీ ఈ డ్యాన్సులు చేసేవాళ్లకు ఒక్క వినాయక మంత్రమైనా వచ్చా? ఈ నవరాత్రుల్లో నిష్టగా చదవాల్సిన ‘గణపతి అథర్వశీర్ష’ గురించి ఎంతమందికి తెలుసు? డ్యాన్సులు చేయాలనే కోరిక ఉంటే క్లబ్బులకు వెళ్లి ఎంజాయ్ చేయండి. పవిత్రమైన పూజల ముసుగులో రోడ్లపై ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు''సనాతన సంప్రదాయాల ప్రకారం పూజలు, క్రతువులు, నిమజ్జన కార్యక్రమాలు ఏవైనా సరే సూర్యాస్తమయానికి ముందే పూర్తి కావాలి. మానవుల అంత్యక్రియలే సాయంత్రం ఆరు గంటల దాటితే చేయరు. అలాంటిది దేవుడి నిమజ్జనాన్ని రాత్రిపూట ఎలా చేస్తారు? ఒక నిమిషం ముందు వరకు భక్తిశ్రద్ధలతో కొలిచిన మట్టి, పీవోపీ విగ్రహాలను ఆ తర్వాత నిర్లక్ష్యంగా నీళ్లలోకి విసిరేయడం చూస్తుంటే బాధ కలుగుతోంది. ఈ మూర్ఖత్వం మానేయండి. గణేశ్ ఉత్సవాలను లోకమాన్య తిలక్ ప్రారంభించింది ప్రజల్లో ఐక్యత సాధించడానికే తప్ప డీజే పార్టీలు చేసుకోవడానికి కాదు. నేను గర్వించదగిన సనాతనిని, రెండు దశాబ్దాలుగా గణపతిని ఆరాధిస్తున్నాను. ప్రశ్నించినందుకు ఒక మహిళ అయిన నాపై అసభ్యకరమైన కామెంట్లతో ట్రోలింగ్ చేయడమేనా మీ సనాతన ధర్మం?' అని ట్రోలర్స్‌ని రేణు దేశాయ్ గట్టిగా ప్రశ్నించింది.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' నెగిటివిటీపై స్పందించిన హీరో నాని) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
'ది ప్యారడైజ్ మూవీ.. తీవ్ర మనోవేదనకు గురయ్యా'
నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్లపరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజే ఏకంగా రూ.88 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓ జాతి మనుగడ కోసం చేసిన పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా ఈ మూవీ నటించిన టాలీవుడ్ నటుడు రెమో రహీమ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన సీన్లను ఎడిటింగ్‌లో తీసేశారంటూ మనోవేదనకు గురయ్యారు. నేను చేసిన సీన్ దాదాపు ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉందని తెలిపారు. కానీ రన్‌టైమ్ నిడివి కారణంగా.. తాను చేసిన ఓ చిన్న క్లిప్ మాత్రమే ఉంచారని ఆవేదన చెందారు. తాను ఎంతో కష్టపడి చేసిన సీన్స్ తొలగించడం తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.రెమో రహీమ్ తన పోస్ట్‌లో రాస్తూ.. 'సినిమాల్లో నటించడం వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఎంతో ప్రాణం పెట్టి చేసిన సీన్లు ఎడిటింగ్‌లో కట్ అయినప్పుడు ఆ బాధ, నిరాశ వర్ణనాతీతం. ఒక నటుడిగా ఈ పరిస్థితిని ఎదుర్కోవడం నిజంగా చాలా మానసిక వేదనను కలిగిస్తుంది. నేను చాలా బాధపడుతున్నా. నా ట్రక్ సీన్ వాస్తవానికి 5 నుంచి 7 నిమిషాల నిడివి ఉంటుంది. కానీ సినిమా నిడివి కారణంగా కుదించాల్సి వచ్చింది' అని రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Remo Raheem Actorr (@remoraheem_actor) -
‘అనుమాన పక్షి’ మూవీ రివ్యూ
టైటిల్: అనుమాన పక్షినటీనటులు: రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సిసిల్, అనన్యా, చరిత్, బ్రహ్మాజీ, రాశి, అజయ్, మస్త్ అలీ తదితరులునిర్మాణ సంస్థ: చిలక ప్రొడక్షన్స్నిర్మాతలు: రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్రచన, దర్శకత్వం: విమల్ కృష్ణసంగీతం: శ్రీచరణ్పాకాలఎడిటర్ : చోటా కె. ప్రసాద్విడుదల తేది: సెప్టెంబర్ 25, 2026‘డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. చాలా గ్యాప్ తీసుకొని ‘అనుమాన పక్షి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి కూడా నవ్వులు పూయించే కథనే నమ్ముకున్న ఆయన.. కామెడీతో పాటు కథ, కథనం విషయంలో ఎంతవరకు మెప్పించాడు? ‘ది ప్యారడైజ్’ లాంటి భారీ సినిమాతో పోటీకి దిగిన ఈ ‘అనుమాన పక్షి’ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వైజాగ్‌కు చెందిన యూట్యూబర్ సన్నీ(రాగ్ మయూర్)కి అనుమానాలు ఎక్కువ. ఇంటి గుమ్మానికి దిష్టి బొమ్మ పెడితే ఎక్కడ తెగి తనపై పడుతుందో అనే అనుమానంతో.. దిష్టిబొమ్మనే పెట్టించుకోడు. బట్టల్ని ఎవరికైనా దానం చేస్తే.. ఏదైనా చేతబడి చేస్తారనే అనుమానంతో ఇంట్లో ఉండే పాత చీరలు, కర్టెన్స్‌తో కూడా బట్టలు తయారు చేసుకుంటాడు.ఇలా తన అనుమానాలతో చుట్టూ ఉన్న అందరికీ పిచ్చెక్కిస్తుంటాడు. ఇతని అనుమానం వల్లే.. వర్మ(ప్రిన్స్)ని తన ప్రియురాలు రమ్య దూరం పెడుతుంది. వర్మ వార్నింగ్ఇవ్వడంతో రమ్యతో మాట్లాడి మళ్లీ కలిసేలా చేస్తానని చెబుతాడు. అదే సమయంలో తనకు కశ్మీర్ నుంచి ఓ ఫోన్ కాల్ వస్తుంది. దీంతో తన స్నేహితుడితో పాటు వర్మని కూడా తీసుకొని కశ్మీర్‌కి వెళ్తాడు. అక్కడ సన్నికి కన్యాకుమారి(మెరిన్ ఫిలిప్) పరిచయమై ప్రేమలో పడతాడు. అంతా సాఫీగా సాగుతుందనకుంటున్న సమయంలో వర్మ ఊహించని రీతిలో మరణిస్తాడు. అదే సమయంలో అక్కడికి విశాఖ సీఐ వాసు (అజయ్), అతడి భార్య సుజాత (రాశి) వస్తారు. వర్మ మృతికి అసలు కారణం ఏంటి? ఈ సమస్య నుంచి సన్నీ ఎలా బయటపడ్డాడు? అసలు కన్యాకుమారి ఎవరు? ఆమెతో సన్నీ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సాధారణంగా కామెడీ సినిమా అంటే కథ ఎలా ఉన్నా.. కనీసం కొన్ని సన్నివేశాలైనా ప్రేక్షకులను నవ్విస్తాయి. కానీ ‘అనుమాన పక్షి’ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. కామెడీని ప్రధాన బలంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా.. కనీసం ఒక్క సీన్లో కూడా ప్రేక్షకుడి ముఖంపై చిరునవ్వు తీసుకురాలేకపోయింది.సన్నివేశాల్లో సహజత్వం లేకపోవడం, కామెడీ టైమింగ్ ఒక్క చోట కూడా వర్కౌట్ కాకపోవడంతో సినిమా అంతా బోర్ కొట్టిస్తుంది. కొన్ని చోట్ల నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు కూడా ప్రేక్షకుడికి మరింత ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇక దర్శకుడు విమల్ కృష్ణ అసలు ఏ పాయింట్‌తో ఈ కథను తెరకెక్కించాడన్నది కూడా స్పష్టంగా అనిపించదు. కథలో బలం లేకపోవడం ఒక ఎత్తయితే.. దాన్ని ఆసక్తికరంగా నడిపించే కథనం కూడా కనిపించదు. ఫలితంగా కామెడీ సినిమా కాస్తా.. కామెడీ లేని సినిమాగా మారిపోయింది. కనీసం ఒకట్రెండు సన్నివేశాల్లో అయినా నవ్విస్తే పర్వాలేదనిపించేది. కానీ సినిమా మొత్తం వెతికినా అలాంటి సందర్భం ఒక్కటి కూడా కనిపించదు. నిడివి కేవలం 111 నిమిషాలే అయినా.. ఫస్టాఫ్ చూసేసరికే నీరసించిపోతాం. ఇక సెకండాఫ్‌లో అయిన కాస్త కామెడీ ఉంటుందా అంటే.. అది మరింత చిరాకుగా ఉంటుంది. కామెడీ చిత్రం కాబట్టి కథ లేకపోయినా పర్లేదు కానీ మరీ కామెడీ లేకుండా చేస్తా ఎలా? డీజే టిల్లు లాంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడేనా ఈ సినిమా తెరకెక్కించింది? అనే అనుమానంతో థియేటర్స్‌ని నుంచి బయటకు వస్తాం. ఎవరెలా చేశారంటే.. ఇన్నాళ్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన రాగ్ మయూర్ తొలిసారి సోలో హీరోగా చేసిన సినిమా ఇది. సన్నీ పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానంలోనే లోపం ఉండడంతో అతని నటన హైలెట్ కాలేదు. ఇక వాసు పాత్రలో అజయ్ కామెడీ చేసే ప్రయత్నం చేశాడు కానీ.. అది ఒక్క చోట కూడా వర్కౌట్ కాలేదు. ప్రిన్స్ పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. హీరోగా చేసిన ఆయన ఇలాంటి పాత్ర ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కాలేదు. రాశి కూడా అంతే.. సెకండాఫ్‌లో ఒకటి రెండు సీన్లలో కనిపిస్తుంది. బ్రహ్మాజీ, మెరిన్ ఫిలప్తో పాటు మిగిలిన నటీనటులలో ఒకరు కూడా తమ నటనతో ఆకట్టుకోలేకపోయారు. ఈ తప్పంతా పూర్తిగా దర్శకుడిది అనే చెప్పాలి. సాంకేతికంగా కూడా ఈ సినిమా గొప్పగా లేదు. శ్రీచరణ్ పాటలే కాదు నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకోలేకపోయింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
దయచేసి ఎవరూ తప్పుగా అనుకోవద్దు: సంపూర్ణేష్ బాబు
నాని ది ప్యారడైజ్‌లో బిర్యానీ పాత్రలో మెప్పించిన నటుడు సంపూర్ణేశ్ బాబు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనను అమానించేలా జర్నలిస్ట్ ప్రశ్నలు అడిగారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. జర్నలిస్ట్ తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వివాదంపై నటుడు సంపూర్ణేశ్ బాబు కూడా స్పందించారు.నన్ను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టుకి.. నాకు మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లే అలా మాట్లాడారని సంపూర్ణేశ్ తెలిపారు. మా మధ్య స్నేహం వల్లే అలా అతను ఫ్లో లో అడిగారని వెల్లడించారు . ఈ విషయాన్ని దయచేసి ఎవరూ కూడా తప్పుగా తీసుకోవద్దని అన్నారు. ఈ మేరకు సంపూ ఓ వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడినట్లే.అసలేం జరిగిందంటే?ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంపూర్ణేష్ బాబును సీనియర్ జర్నలిస్ట్ కొన్ని ప్రశ్నలు అడిగారు. ‘సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. హీరో అయ్యేంత నీలో ఏముంది? అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చావు? ఎందుకు అంత దురద? ‘ది ప్యారడైజ్’లో అవకాశం రావడం నీ కెరీర్లో ఊహించని మలుపు. ఇలాంటి సినిమాల్లో నీకు ఎవరు అవకాశం ఇస్తారు?’ అంటూ ప్రశ్నించారు.జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ అన్న గారి ఇంటర్వ్యూ ఇష్యూ పై నా క్లారిఫికేషన్ pic.twitter.com/dL0W5IrToq— Sampoornesh Babu (@sampoornesh) September 25, 2026 -
చిరంజీవి కాకా.. ఫుల్ జోష్‌లో మూవీ టీమ్
మెగాస్టార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కాకా. ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడం మరో విశేషం. ఇప్పటికే ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ మరింత జోరు పెంచారు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనుల కూడా మొదలు పెట్టేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియో పంచుకున్నారు.కాకా మూవీ డబ్బింగ్ పనులు దివ్యమైన పూజా కార్యక్రమంతో మొదలయ్యాయని తెలిపారు. ఈ మూవీ షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయని వెల్లడంచారు. ఒక సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పడానికి పూర్తి వేగంతో మా టీమ్ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్త జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. కాగా.. ఈ మూవీలో కదిరి కాళీదాస్ పాత్రలో మెగాస్టార్ కనిపించనున్నారు. The dubbing works of #KAAKA commence with a divine pooja ceremony. 🎙️✨With the shoot and post-production progressing simultaneously, the team is working at full speed to set THE BLOODY BENCHMARK 🪓🔥Worldwide Grand Release on January 13th, 2027❤️🔥A @dirbobby Film 💥… pic.twitter.com/gkwkWUaRGV— KVN Productions (@KvnProductions) September 25, 2026 -
'ప్యారడైజ్' నెగిటివిటీపై స్పందించిన హీరో నాని
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ప్యారడైజ్'. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ చిత్రానికి చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. ఇస్తున్నారు. ఇప్పుడు వీటిపై నాని స్వయంగా స్పందించాడు. ట్రోల్స్, మూవీపై వస్తున్న నెగిటివిటీ గురించి ట్వీట్ చేశాడు.(ఇదీ చదవండి: ప్యారడైజ్ సినిమా రివ్యూ)'మీ అందరి స్పందన, ప్రేమని చూశాను. మీ ఫన్నీ ట్రోల్స్ ఎంజాయ్ చేశాను. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తమ దానిలా దగ్గరకు తీసుకోవడం నా మనసుని తాకింది. అదే టైంలో విమర్శకులు, రివ్యూయర్లు ఎత్తిచూపిన లోపాల నుంచి కూడా నేను నేర్చుకున్నాను. అన్నింటికీ థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకేం చేయలేను''మీకు ఓ ప్రత్యేకమైన అనుభూతి అందించాలనే ఉద్దేశంతో 'ద ప్యారడైజ్' సినిమాని కష్టపడి తీశాం. ఇప్పుడు ఇది పూర్తిగా మీది. మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు లేదా జడ్జ్ చేయొచ్చు. సినిమాపై మీరు చూపించిన ఉత్సాహం, నాపై మీరు చూపించిన ఆప్యాయత నన్ను ఎంతో సంతోషపడేలా చేశాయి' అని నాని ట్వీట్ చేశాడు.బానిసలుగా బతుకుతున్న ఓ తెగకు హీరో ఎలా గుర్తింపు తీసుకొచ్చాడు? ఈ క్రమంలోనే ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? అనే స్టోరీ లైన్‌తో ఈ సినిమా తీశారు. తొలిరోజు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ రూ.88 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలు అధికారికంగా ప్రకటించుకున్నారు.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' ఫలితం.. చిరంజీవితో సినిమా సంగతేంటి?) -
'ప్యారడైజ్' ఫలితం.. చిరంజీవితో సినిమా సంగతేంటి?
'ప్యారడైజ్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. తొలిరోజు ఏకంగా రూ.88 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి తొలి ఆట నుంచే ఎక్కువగా నెగిటివ్, మిక్స్డ్ రివ్యూస్ వినిపించాయి. దీంతో ఈ మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. తర్వాత చిరంజీవితో కలిసి పనిచేస్తాడా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ సంగతేంటి?(ఇదీ చదవండి: ప్యారడైజ్ సినిమా రివ్యూ)తెలంగాణలోని గోదావరిఖనికి చెందిన శ్రీకాంత్ ఓదెల.. సుకుమార్ దగ్గర పనిచేశాడు. 'దసరా'తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. కంటెంట్ పరంగా ఇది పర్లేదనిపించింది. 'ప్యారడైజ్'కి వచ్చిన హైప్‌కి బ్లాక్‌బస్టర్ కొట్టేస్తారేమోనని అంతా అనుకున్నారు. కానీ డీసెంట్‌గా ఉందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఫస్టాప్ అదరగొట్టినప్పటికీ సెకండాఫ్ విషయంలో చిన్న చిన్న తప్పిదాలు కనిపించాయని అంటున్నారు.అయితే 'ప్యారడైజ్' షూటింగ్ జరుగుతున్న టైంలోనే నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా చిరంజీవి హీరోగా ఓ సినిమాని ప్రకటించారు. ఫుల్ యాక్షన్ కథతో దీన్ని తీయబోతున్నట్లు హింట్ కూడా ఇచ్చారు. మరి 'ప్యారడైజ్'కి మిశ్రమ స్పందన వినిపిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే సందేహాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం 'ప్యారడైజ్' ప్రమోషన్స్‌లో మాట్లాడిన నాని.. సంక్రాంతి తర్వాతే చిరు-శ్రీకాంత్ మూవీ షూటింగ్ మొదలవుతుందని అన్నాడు. మరి చిరు కోసం శ్రీకాంత్ ఓదెల ఎలాంటి కథ సిద్ధం చేశాడో? దీని గురించి అప్డేట్ ఎప్పుడిస్తారనేది చూడాలి?(ఇదీ చదవండి: ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్) -
24ఏళ్ల కుర్రాడిలా మహేశ్.. క్లీన్ షేవ్ అంటూ..
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదీ చదవండి: గానమే ఈమెకు గుర్తింపు తెచ్చింది.. ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదగానే..24 ఏళ్ల కుర్రాడిగా..కాగా.. ‘వారణాసి’లో మహేశ్‌బాబు పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమాలోని ఓ కీలక ఎపిసోడ్లో మహేశ్ 24 ఏళ్ల కుర్రాడిగా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను మహేశ్ పూర్తి చేసినట్లు సమాచారం. త్వరలోనే డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించనున్నారని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ ‘రంభ ఊర్వశి మేనక’..ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ లుక్‌లో..ఇదిలా ఉంటే.. తాజాగా మహేశ్‌బాబు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపించారు. క్లీన్ షేవ్‌తో ఉన్న ఆయనను చూసిన అభిమానులు ‘వారణాసి’లోని యంగ్ లుక్‌పై వస్తున్న వార్తలను గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు.. కెమెరా వైపు చూస్తూ మహేశ్ నవ్వుతూ, ‘గడ్డం లేదు బాస్.. ఇప్పుడు ఏం చేద్దాం?’ అన్నట్టుగా సైగ చేశారు. దీంతో మహేశ్ కొత్త లుక్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఈ క్లీన్ షేవ్ లుక్ ‘వారణాసి’లోని 24 ఏళ్ల యువకుడి పాత్ర కోసమేనా? అనే చర్చ అభిమానుల్లో మొదలైంది. Babu gestures..🤣🤣🤣❤️❤️❤️❤️#MaheshBabu #Varanasi pic.twitter.com/ZGINIwlqR4— Vajrang (@UrsVajrang) September 25, 2026 -
గానమే గుర్తింపు తెచ్చింది.. ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదగానే..
సినీ పాటలకు తన అద్భుతమైన గొంతుతో ప్రాణం పోసిన గాయని వైకోం విజయలక్ష్మి. చూపు లేకపోయినా సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ‘అంగు వాన కొనిలు’ పాటకు ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌గా 72వ జాతీయ చలనచిత్ర అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. అయితే ఈ అవార్డు వెనుక ఆమె జీవితంలో ఎన్నో సవాళ్లు ఉన్నాయని కొంతమందికే తెలుసు. చూపు లేకపోవడం, ఇతరుల నుంచి ఎదురైన అసహనకరమైన ప్రశ్నలు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులు.. ఇలా ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు. ఆమెకు ఎదురైన పలు అనుభవాలు గతంలో పంచుకున్నారు.సంగీతమే ప్రపంచంవైకోం విజయలక్ష్మి పుట్టుకతోనే చూపు సమస్య ఉంది. దీంతో ఆమె చూపు అంతంత మాత్రమే. అయినప్పటికీ చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. తల్లిదండ్రులు మురళీధరన్, విమల ఆమెను సంగీతంలో ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచే కేజే ఏసుదాస్, ఎంఎస్ సుబ్బులక్ష్మి, బాలమురళీకృష్ణ వంటి దిగ్గజాలను వింటూ పెరిగారు. రెండేళ్ల వయసులోనే పాటలు నేర్చుకోవడం ప్రారంభించిన ఆమె.. క్రమంగా ప్రొఫెషనల్ సింగర్‌గా ఎదిగారు. మలయాళంతో పాటు పలు భారతీయ భాషల్లో పాటలు పాడారు. ఆమె కెరీర్లో ‘కాట్టే కాట్టే’ పాట కీలక మలుపుగా నిలిచిందని గతంలో విజయలక్ష్మి తెలిపారు.‘నన్ను ఎందుకు టెస్ట్ చేస్తారు?’చూపు కనిపించకపోవడంపై కొందరు అడిగే ప్రశ్నలు తనకు చాలా బాధ కలిగిస్తాయని విజయలక్ష్మి తెలిపారు. ముఖ్యంగా తనను గుర్తుపట్టగలదా? అని వాయిస్‌తో పరీక్షించడం ఆమెకు నచ్చదట. ఎవరైనా వచ్చి ‘నేను ఎవరో తెలుసా?’ అంటూ తనను పరీక్షించేలా మాట్లాడితే కోపం వస్తుందని ఆమె చెప్పినట్లు ఓ కథనంలో తెలిసింది. ‘చూపు లేదనే కారణంతో తనను ప్రత్యేకంగా చూడటం, సాధారణ విషయాల్లో కూడా తనను పక్కన పెట్టడం బాధ కలిగిస్తుంది. తాను చూడలేననే కారణంతో ఇతరులు నన్ను దూరం చేస్తున్నట్లు అనిపిస్తుంది.’ అని ఆమె తెలిపారు. అయితే శబ్దం, స్పర్శ ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ తన కెరీర్‌ను కొనసాగించడం విశేషం.ఇదీ చదవండి: పెళ్లైనా .. ఆయనపై క్రష్ తగ్గట్లేదు: రష్మికచూపు కోసం అమెరికాకు కూడా..తన చూపును తిరిగి పొందేందుకు విజయలక్ష్మి ఎన్నో ప్రయత్నాలు చేశారు. 2019లో చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. అయితే ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా చికిత్స ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. తన సమస్య రెటీనాకు సంబంధించినదా? మెదడుకు సంబంధించినదా? అనే విషయంలో వైద్యుల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆమె గతంలో వెల్లడించారు.భర్తతో విడాకులువిజయలక్ష్మి వ్యక్తిగత జీవితంలోనూ కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. తన మాజీ భర్త తన సంగీతానికి సహకరించలేదని, తాను పాటలు పాడే సమయాలపై కూడా ఆంక్షలు పెట్టేవారట. సంగీతమే తన జీవితంలో ఎంతో ముఖ్యమైన సమయంలో అలాంటి పరిమితులు ఎదురవడంతో చివరకు ఆ బంధం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నరట. ముఖ్యంగా ఈ నిర్ణయం తన తల్లిదండ్రులు చెప్పడం వల్ల తీసుకున్నది కాదని, తన జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని తానే తీసుకున్నానని విజయలక్ష్మి స్పష్టం చేశారు.‘నా నిర్ణయాలు నావే’తన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది తనదేనని విజయలక్ష్మి చెబుతున్నారు. తల్లిదండ్రులు ఎప్పుడూ తనకు అండగా ఉన్నప్పటికీ.. తన జీవితాన్ని ఎలా కొనసాగించాలనే విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు తనకే ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక తాజాగా ‘అంగు వాన కొనిలు’ పాటకు జాతీయ అవార్డు రావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మరోసారి మార్మోగింది. ఈ పాటలోని ‘అడ్డంకులను దాటి ఎదుగు.. ప్రపంచాన్ని జయించు’ అనే భావం తనకు ఎంతో బలాన్నిస్తుందని విజయలక్ష్మి తెలిపారు. తన జీవితంలో ఎదురైన ఎన్నో అడ్డంకులను దాటి ఇంతదూరం వచ్చానని ఆమె పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ ‘రంభ ఊర్వశి మేనక’.. -
రష్మికతో విజయ్ ఈ మేకింగ్ వీడియో చూశారా?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడికే విడుదలైన టీజర్ ఏందయ్యా సామీ ఫుల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్రం బృందం తాజాగా ఏందయ్య సామీ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.కాగా ఈ చిత్రం1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదీ చదవండి:తొలిరోజు ‘ది ప్యారడైజ్’ విధ్వంసం.. దుమ్మురేపుతున్న కలెక్షన్స్ -
ఉపాసనకు రాముని ప్రతిమ
బెంగళూరు: అయోధ్య ఆలయంలో మూలవిరాట్టు విగ్రహాన్ని చెక్కిన మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ ప్రముఖ సినీ నటుడు రామ్‌చరణ్ భార్య ఉపాసనకు కూడా శ్రీరాముని విగ్రహాన్ని అందించారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా ఖాతాలో వీడియో ద్వారా పంచుకున్నారు. తాతయ్య కోసం అరుదైన విగ్రహాన్ని చెక్కి ఇచ్చిన శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇదొక దైవ సన్నివేశం, శ్రీరాముని లీలగా నమ్ముతున్నానని తెలిపారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) ఇదీ చదవండి: అపోలో హాస్పిటల్స్ డైరెక్టరుగా ఉపాసన -
తొలిరోజు ‘ది ప్యారడైజ్’ విధ్వంసం.. దుమ్మురేపుతున్న కలెక్షన్స్
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేచురల్ స్టార్ నాని సినిమా ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి థియేటర్లలో మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. అయినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం జోరు చూపిస్తోంది. ఫస్ట్ డే వసూళ్లతో నాని కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచినట్లు తెలుస్తోంది. ‘ది ప్యారడైజ్’ తొలి రోజు ఇండియాలో రూ.88 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం..దేశవ్యాప్తంగా 47 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో నాని గత చిత్రాలు ‘దసరా’, ‘హిట్: ది థర్డ్ కేస్’ ఫస్ట్ డే వసూళ్లను ఈ మూవీ అధిగమించిందట. గతంలో నాని నటించిన ‘దసరా’ ఫస్ట్ డే దాదాపు రూ.23.20 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించగా.. ‘హిట్: ది థర్డ్ కేస్’ రూ.21 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. వీటితో పోలిస్తే ‘ది ప్యారడైజ్’ భారీ ఓపెనింగ్ నమోదు చేసిందనే చెప్పాలి. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంభ ఊర్వశి మేనక’..కాగా.. ‘ది ప్యారడైజ్’లో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, సంపూర్ణేశ్ బాబు, రాఘవ్ జుయల్, ఈశ్వరీ రావు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. కీర్తి సురేశ్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరిసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు.ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి మరో ముగ్గురు ఎంట్రీ! ‘నీకు అసలు తెలుగు వచ్చా..?’ -
రోజాతో కలిసి నటించడం సంతోషం
ప్రేమకు కత్తదనమే కానీ పాత అనే పదానికి తావే ఉండదు. అదే విధంగా స్వచ్ఛమైన ప్రేమకు వయసు బేధం ఉండదు. ప్రేమ అనేది మోహం కాదు బలం. అలాంటి ప్రేమ ఇతివృత్తంగా రూ పొందిన తాజా చిత్రం లెనిన్ పాండియన్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక యువకుడు పోలీస్ కానిస్టేబుల్‌గా బాధ్యతలను నిర్వహిస్తాడు. అయితే అతనికి ఆ వృత్తిలో తగిన గౌరవం లభించదు. పై అధికారుల నుంచి చాలా అవమానాలను ఎదుర్కొంటుంటాడు. దీంతో భార్య తండ్రి అతన్ని చిన్న చూపు చూస్తాడు. మరో పక్క ఒక వయసు మళ్లిన దంపతుల విలువైన భూమిని ఒక స్వార్థపరుడు పొందాలని వారిని బెదిరిస్తుంటాడు. అదే సమయంలో ఈ వృద్ధ దంపతులు ప్రేమగా పెంచుకుంటున్న మేకను అక్రమ మట్టి దందా వ్యక్తులు లారీలో గుద్ది చంపేస్తారు. దీంతో ఆ వృద్ధ దంపతులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా, అవమానాలు, ఛీత్కారాలే ఎదురౌతాయి. ఆ తరువాత కోర్టు గుమ్మం ఎక్కిన వారికి న్యాయం లభించిందా? వారికి నిజాయితీకి మారుపేరైన పుత్రుడైన పోలీస్ కానిస్టేబుల్‌కు సంబంధం ఏమిటి? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం లెనిన్ పాండియన్. ఇందులో సీనియర్ సంగీత దర్శకుడు, గీత రచయిత, గాయకుడు గంగై అమరన్, ప్రముఖ నటీమణి, రాజకీయ నాయకురాలు రోజా వృద్ధ దంపతులుగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరికోసం ఒకరు జీవించే పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ద్వారా నడిగర్ తిలకన్ శివాజీ గణేషన్ మనవడు దర్శన్ గణేశన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. నటి ప్రియా రావ్, సుబ్బు పంజు, జార్జ్ మరియన్, అడుగళం నరేన్, అర్చనా రవిచంద్రన్, బోస్ వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై టీజీ త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్ అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. డీడీ బాలచంద్రన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఎందరో స్టార్ హీరోల సరసన నటించిన రోజాతో కలిసి నటించడం సంతోషంగా ఉందని గంగై అమరన్ మీడియాతో పేర్కొన్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ ‘రంభ ఊర్వశి మేనక’..
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ జానర్లో నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీలోకి వచ్చేసింది. ‘రంభ ఊర్వశి మేనక’ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈరోజు(సెప్టెంబర్ 25) నుంచి ఈ సినిమాను ఓటీటీలో వీక్షించొచ్చు. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.ఇదీ చదవండి: గిన్నిస్‌కి ఎక్కిన ‘రాకా’.. ఈ రికార్డో ఏంటో తెలుసా!చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అల్లరి నరేష్ సరసన సురభి హీరోయిన్. రాశి సింగ్, విష్ణుప్రియ భీమనేని, ప్రిషా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. వెన్నెల కిశోర్, రచ్చ రవి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన అల్లరి నరేష్ అభిమానులు, ఫాంటసీ కామెడీ సినిమాలను ఇష్టపడేవారు ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చుకథ ఏంటంటే?మంతెన సూర్యనారాయణ అలియాస్ సూరి (అల్లరి నరేశ్) కుటుంబం నాటకాలు వేస్తూ బతుకుతుంటుంది. వీళ్ల ఇంట్లో ఓ మ్యాజిక్ బుక్. దానిపై సరిగ్గా గీతలు గీస్తే స్వర్గం నుంచి రంభ, ఊర్వశి, మేనక వస్తారని చిన్నతంలో సూరికి తెలుస్తుంది. దీంతో ఏ పనిచేయకుండా ఊరంతా అప్పులు చేసి సదరు పుస్తకంపై 15 ఏళ్లుగా గీతలు గీస్తూనే ఉంటాడు. ఓ సందర్భంలో సూరికి తన తల్లి ప్రాణాంతక వ్యాధి బారిన పడిందని తెలుస్తుంది. అదే టైంలో ప్రేమించిన చిన్ని(సురభి) తండ్రితో ఓ చిక్కొచ్చి పడుతుంది. మరోవైపు ఓ రాత్రి చేసిన పనివల్ల నిజంగానే రంభ-ఊర్వశి-మేనకలు సూరి కోసం దిగివస్తారు. వీళ్ల రాకతో సూరి జీవితం ఎలా మారింది? ఎస్సై అప్పలనాయుడితో సూరికి గొడవేంటి? చివరకు ఏం జరిగిందనేది మిగతా స్టోరీ. ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి మరో ముగ్గురు ఎంట్రీ! ‘నీకు అసలు తెలుగు వచ్చా..?’ -
బిగ్‌బాస్‌లోకి మరో ముగ్గురు ఎంట్రీ! ‘నీకు అసలు తెలుగు వచ్చా..?’
బిగ్‌బాస్‌లో గొడవలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. బజర్ విషయంలో త్రిగుణ్ నిర్ణయం గొడవలు దారి తీసింది. మరో పక్క ఝాన్సీ లెటర్ విషయంలో తీసుకున్న ఆలోచన హౌస్‌లో కొత్త టెన్షన్‌ని తీసుకొచ్చింది. ఇంతలోనే ఆడియన్స్‌కి కొత్త ట్విస్ట్ ఎదురైంది. అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది. అసలు ప్రేక్షకులకూ, అటు హౌస్‌మేట్స్‌కు ఎదురైన ఆ ట్విస్ట్ ఏంటి.? ఒకసారి చూద్దాం..ఇదీ చదవండి: పెళ్లైనా .. ఆయనపై క్రష్ తగ్గట్లేదు: రష్మికనరేశ్కు అన్యాయం జరిగిందంటూ..బిగ్‌బాస్ హౌస్‌లో టాస్క్ సందర్భంగా బజర్ విషయంలో మరోసారి రచ్చ జరిగింది. నరేశ్ బజర్ కొట్టేలా అవకాశం ఇవ్వాలని రాంప్రసాద్ తన టీమ్‌తో మాట్లాడతాడు. అయితే సైరన్ మోగిన తర్వాత గార్డెన్ ఏరియాలో ఝాన్సీ బజర్ కొట్టగా.. లివింగ్ ఏరియాలో నరేశ్, వంశీ మధ్య పోటీ నెలకొంది. లివింగ్ ఏరియా సంచాలకుడిగా ఉన్న త్రిగుణ్ తొలుత నరేశ్ బజర్ కొట్టాడని ప్రకటించాడు. దీంతో నరేశ్ టీమ్ సంబరాలు చేసుకుంది. కానీ అమన్, రోహిత్, చరణ్ మాత్రం వంశీ బజర్ కొట్టాడని త్రిగుణ్‌కు చెప్పారు. దీంతో త్రిగుణ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. బిగ్‌బాస్ అడిగినప్పుడు వంశీ బజర్ కొట్టాడని త్రిగుణ్ చెప్పడంతో నరేశ్ మండిపడ్డాడు. తన పేరును ప్రకటించిన తర్వాత సడన్‌గా నిర్ణయం ఎలా మార్చుకుంటావంటూ ప్రశ్నించాడు. నరేశ్‌కు అన్యాయం జరిగిందంటూ సుధీర్, ముకేశ్ కూడా త్రిగుణ్‌తో వాదించారు. దీంతో బజర్ వ్యవహారం హౌస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.లెటర్ కోసం నరేశ్‌ను టార్గెట్ చేసిన ఝాన్సీఆ తర్వాత ఝాన్సీ, వంశీ బజర్ మోగించడంతో ఇద్దరికీ బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఝాన్సీ విజయం సాధించింది. అనంతరం బిగ్‌బాస్ ఝాన్సీకి కాల్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ‘మీ నాన్న రాసిన లెటర్ మీ కోసం వచ్చింది. అది మీకు దక్కాలంటే నరేశ్ ఇంటి నుంచి వచ్చిన లెటర్‌ను దూరం చేయాలి. లేదంటే రాంప్రసాద్‌కు వచ్చిన ఫొటోను వదులుకోవాలి’ అని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ఝాన్సీ నరేశ్ లెటర్‌ను దూరం చేసేందుకు నిర్ణయించుకుంది. ‘నరేశ్‌కు టెన్షన్ ఇస్తా’ అంటూ అతడి లెటర్‌ను వదులుకుంది. మరోవైపు తన తండ్రి రాసిన లెటర్‌ను చదివిన ఝాన్సీ భావోద్వేగానికి గురైంది.ఇదీ చదవండి: ‘ఎందుకింత దురద..? ఏం చూసుకొని సినిమాల్లోకి వచ్చావ్..?’ఆడియన్స్ అనుకునేలోపే.. !ఇక హౌస్‌మేట్స్‌కు ఒక్కొక్కరిగా వారి ఆటతీరుపై మెసేజ్‌లు రావడంతో.. అవి ఆడియన్స్ నుంచి వచ్చినవని అందరూ భావించారు. కానీ బిగ్‌బాస్ అసలు ట్విస్ట్ ఇచ్చాడు. అగ్నిపరీక్షలో పోరాడి బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడానికి ప్రయత్నించిన మిథిలేష్, అపూర్వ, రామకృష్ణలను హౌస్‌మేట్స్‌కు పరిచయం చేశాడు. ముగ్గురినీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా చేశాడు. అయితే వీరిలో ఎవరు హౌస్‌లోకి వెళ్లాలనేది హౌస్‌మేట్సే నిర్ణయించాలి అని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. దీంతో మిథిలేష్, అపూర్వ, రామకృష్ణలు తమను ఎందుకు హౌస్‌లోకి తీసుకోవాలో వివరించారు. ఈ క్రమంలో త్రిగుణ్, రాంప్రసాద్, ముకేశ్‌లతో వారికి వాగ్వాదం జరిగింది. తెలుగు మాట్లాడడంపై త్రిగుణ్‌తో వారితో వార్కి దిగాడు. ఈ తరుణంలో నీకు అసలు తెలుగు వచ్చా వస్తే పద్యం పాడు అంటూ మిథిలేష్‌పై త్రిగుణ్ రెచ్చిపోయాడు. మాటామాటా పెరగడంతో హౌస్‌లో మరోసారి వేడి వాతావరణం కనిపించింది.ఇదీ చదవండి: రజినీకాంత్ ‘జైలర్2’ పాటకు.. డేవిడ్ భాయ్ డ్యాన్స్ మాత్రం..ముగ్గురిలో ఎవరు? హౌస్మేట్స్ ఓటింగ్..వాదనలు ముగిసిన తర్వాత బిగ్‌బాస్ ముగ్గురినీ బయటకు పంపించాడు. అనంతరం హౌస్‌మేట్స్‌కు కీలక నిర్ణయం అప్పగించాడు. మిథిలేష్, అపూర్వ, రామకృష్ణల్లో ఎవరిని హౌస్‌లోకి తీసుకోవాలని అనుకుంటున్నారో వారికి ఓటు వేయాలని చెప్పాడు. బిగ్‌బాస్ సూచనల మేరకు హౌస్మేట్స్ తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి.. ఆ ఓట్లను బిగ్‌బాస్ చెప్పిన బాక్స్‌లో వేశారు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
కథలు రాస్తున్నాను: ఫరియా అబ్దుల్లా
‘‘సిగ్మా’ నా తొలి తమిళ సినిమా. లైకా వంటి పెద్ద నిర్మాణ సంస్థలో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. యాక్షన్ అడ్వెంచరస్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఇందులో రేడియో జాకీగా చేశాను. ఈ సినిమాలో మంచి భావోద్వేగాలు పలికించే అవకాశం దొరికింది’’ అని ఫరియా అబ్దుల్లా తెలిపారు. సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన చిత్రం ‘సిగ్మా’. జేసన్ సంజయ్ దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ పై తెలుగు–తమిళ భాషల్లో సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ అక్టోబరు 2న విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్ చేస్తోంది. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ– ‘‘సిగ్మా’ కథని జేసన్ జూమ్ కాల్లో చెప్పారు. కథ మొత్తం విన్న తర్వాత ‘మీ వయసు ఎంత?’ అని అడిగాను. 24 ఏళ్లు అని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. తను స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సార్ అబ్బాయి అయినప్పటికీ అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోతారు. డైరెక్టర్‌గా తొలి సినిమా అయినప్పటికీ ఎంతో క్లారిటీగా తీశారు. సందీప్ కిషన్నాకు ఎప్పటి నుంచో తెలుసు. మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయాలనుకున్నాం. ‘సిగ్మా’తో కుదిరింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. మా మూవీ ట్రైలర్‌ని డైరెక్టర్ రాజమౌళిగారు రిలీజ్ చేసి, మంచి కమర్షియల్ ఎంటర్టైనర్లా ఉంది అని చెప్పారు. ‘సిగ్మా’లాంటి మంచి సినిమాతో తమిళ్లో పరిచయం కావడం సంతోషంగా ఉంది. తమిళ్లో మరికొన్ని కథలు విన్నాను. నాకు దర్శకత్వం చేయాలని ఉంది. ప్రస్తుతం కథలు రాస్తున్నాను. నేను దర్శకత్వం వహించే సినిమాలో నేనే నటిస్తాను’’ అని పేర్కొన్నారు. -
ఇరుముడి ప్రభంజనం.. 'ఆర్ఆర్ఆర్'పై కన్నేసినట్టేనా?
మాస్‌రాజా రవితేజ నటించిన ఇరుముడి చిత్రం థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ మంచి జోరు చూపిస్తోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే 3.4 మిలియన్ వ్యూస్ సాధించింది. 11 దేశాల్లో టాప్-10లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా 5.6 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.దీంతో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా ఇరుముడి నిలుస్తుందంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం మొదలైంది. అయితే ఆ స్థాయి అంచనాలకు ప్రస్తుతానికి ఎలాంటి ఆధారం లేదనే చెప్పాలి. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియన్ సినిమాల పరంగా రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికీ భారీ రికార్డుతో ముందుంది. ఈ సినిమా ఇప్పటి వరకు 45 మిలియన్లకు పైగా వాచింగ్ అవర్స్ సాధించింది. ఆ తర్వాత స్థానంలో జవాన్, గంగూబాయ్, యానిమల్ వంటి చిత్రాలు ఉన్నాయి.ఇక సౌత్ సినిమాల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ తర్వాత స్థానంలో విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రం నిలిచింది. కాబట్టి ఇరుముడి ప్రస్తుత ఓటీటీ జోరు ఖచ్చితంగా చెప్పుకోదగ్గదే అయినప్పటికీ, ఆర్ఆర్ఆర్ స్థాయి రికార్డును అధిగమించాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇరుముడి చిత్రానికి నార్త్‌తో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి కూడా భారీ ఆదరణ రావడం విశేషం. కానీ ఇప్పుడే నంబర్-1 అంటూ తేల్చేయడం మాత్రం తొందరపాటనే చెప్పాలి. రాబోయే రోజుల్లో ఇరుముడి అదే వేగాన్ని కొనసాగిస్తుందా? నార్త్, ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి మరింత వ్యూయర్షిప్ వస్తుందా? అన్నదే కీలకమైన అంశం అని చెప్పొచ్చు. -
బుల్లితెర భామ జ్యోతిపూర్వాజ్ పోజులు.. బీచ్‌లో శ్రీలీల హోయలు...!
బుల్లితెర భామ జ్యోతిపూర్వాజ్ స్టైలిష్ పోజులు..బంగారంలా మెరిసిపోతున్న జయం రవి సతీమణి ఆర్తి..కలర్‌ఫుల్ డ్రెస్‌లో బాలీవుడ్ నటి ఇషితా దత్తా..బీచ్‌లో హీరోయిన్ శ్రీలీల హోయలు..బ్లాక్‌డ్రెస్‌లో హీరోయిన్ శృతిహాసన్ అందాలు... View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by JyotiPoorvaj (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) View this post on Instagram A post shared by Aarti (@aarti.ravi) -
ఫ్రైడే ఓటీటీల్లో సందడి.. ఒక్కరోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. వినాయక చవితి సందడి దాదాపు ముగిసింది. ఈ సినిమాల విషయానికొస్తే నాని హీరోగా వచ్చిన ది ప్యారడైజ్ సినీ ప్రియులను అలరిస్తోంది. అయితే ఈ మూవీ తొలిరోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ ఫ్రైడే రాగ్ మయూర్ అనుమాన పక్షి, కల్యాణం కమనీయం జీవితం లాంటి చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే పలు కొత్త సినిమాలు ఈ శుక్రవారం సందడి చేయనున్నాయి. తెలుగు హారర్ థ్రిల్లర్ అగధ మూవీ, మలయాళ సినిమా మ్యాంగో పచ్చా కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు పలు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారంలో అలరించేందుకు వచ్చేస్తున్నాయి. మరికొన్ని చిత్రాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్.. ది ఫైనల్ ప్రాబ్లమ్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 25 యునాబాంబర్ (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 25 ది గాడ్ ఫాదర్ కోడా- ది డెత్ ఆప్ మైఖేల్ కర్లోన్(హాలీవుడ్)- సెప్టెంబర్ 25ది బ్రెడ్ విన్నర్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 26అమెజాన్ ప్రైమ్ వీడియో.. డోంట్ బి షై(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 25 ఫోటోగ్రాఫర్(తమిళ సినిమా)- సెప్టెంబర్ 25 రంభ ఊర్వశి మేనక(తెలుగు సినిమా)- సెప్టెంబర్ 25(రూమర్ డేట్)జియో హాట్‌స్టార్.. హుంకార్ ది రోర్ (హిందీ సిరీస్)- సెప్టెంబర్ 25 మ్యాంగో పచ్చా(మలయాళ మూవీ)- సెప్టెంబర్ 25జీ5 బకైతీ సీజన్-2(హిందీ సిరీస్)- సెప్టెంబర్ 25 అగధ(తెలుగు సినిమా)- సెప్టెంబర్ 25 హాయ్(తమిళ మూవీ)- సెప్టెంబర్ 25సోనీ లివ్..హబీబీ(తమిళ సినిమా)- సెప్టెంబర్ 25అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్.. రైజ్ అండ్ ఫాల్ సీజన్-2 (హిందీ సిరీస్)- సెప్టెంబర్ 26సన్‌నెక్ట్స్..అంగీకారం(తమిళ మూవీ)- సెప్టెంబర్ 25లయన్స్ గేట్ ప్లే..దిస్ టెంప్టింగ్మ్యాడ్నెస్(హాలీవుడ్)- సెప్టెంబర్ 25 -
'ఏషనాగుల కట్టమీద'.. కొరియోగ్రాఫర్ జంట అద్భుతమైన డ్యాన్స్..!
టాలీవుడ్లో ఇప్పుడుంతా ది ప్యారడైజ్ ఫీవర్ నడుస్తోంది. నాని హీరోగా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కొందరు ఆడియన్స్ నాని నటనపై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరేమో కథలో ఎమోషన్స్ పండలేదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే సినిమా కథ, కథనం ఎలా ఉన్నప్పటికీ.. ఈ మూవీలోని సాంగ్స్ మాత్రం ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.ముఖ్యంగా ఏషనాగుల కట్టమీద సాంగ్ రిలీజయ్యాక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిలియన్ల వ్యూస్‌తో పాటు రీల్స్ చేస్తూ ఆడియన్స్ ఊగిపోయారు. తాజాగా ఈ పాటకు హూక్స్టెప్తో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్, ఆయన సతీమణి జ్యోతిరాజ్ తమ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఈ పాటకు కొరియోగ్రఫీ ఆట సందీప్ మాస్టర్ అందించడం మరో విశేషం. వీరిద్దరు దంపతులు ఫుల్ ఎనర్జీతో ఏషనాగుల కట్టమీద పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
గిన్నిస్‌కి ఎక్కిన ‘రాకా’.. ఈ రికార్డో ఏంటో తెలుసా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’. సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే ఈ మూవీ ప్రపంచ రికార్డు సాధించి వార్తల్లో నిలిచింది. ఏకంగా 37 మంది ఒకేసారి మోషన్ క్యాప్చర్ చేయించుకోవడం ద్వారా ‘రియల్ టైమ్ మోషన్-క్యాప్చర్’(Most People Motion-Captured in Real-Time) విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఈ రికార్డును అధికారికంగా ధృవీకరించారు. అయితే అసలు ఏంటి ఈ రికార్డ్ అని చాలా మంది సోషల్ మీడియాకు పని చెప్తున్నారు. అదేంటో తెలుసుకుందాం..రండి..!ఇదీ చదవండి: ‘ఎందుకింత దురద..? ఏం చూసుకొని సినిమాల్లోకి వచ్చావ్..?’ఒకేసారి 37 మంది..సాధారణంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఒకరు లేదా కొంతమంది నటుల యాక్టింగ్‌ను రికార్డు చేసేందుకు ఉపయోగిస్తుంటారు. కానీ ‘రాకా’ కోసం ఏకంగా 37 మంది యాక్టర్స్ యాక్టింగ్‌ని ఒకే సమయంలో క్యాప్చర్ చేశారు. ఇందులో నాలుగేళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల వ్యక్తి వరకు వివిధ వయసుల వారు కూడా ఉండడం గమనార్హం. అందరి కదలికలను ఒకరికొకరు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ట్రాక్ చేయడం ఈ ప్రక్రియలో ప్రధాన సవాలుగా నిలిచింది.92 కెమెరాలతో భారీ సెటప్ఈ రికార్డు కోసం మేకర్స్ ఏకంగా 92 ఆప్టికల్ మోషన్ క్యాప్చర్ కెమెరాలను ఉపయోగించారట. క్యాప్చర్, కాలిబ్రేషన్, నెట్వర్కింగ్, సింక్రనైజేషన్‌తో పాటు రియల్ టైమ్ విజువలైజేషన్, ఫేషియల్ క్యాప్చర్ వంటి టెక్నాలజీలను కూడా ఈ సెటప్‌లో భాగం చేశారని తెలిసింది.ఇదీ చదవండి: దేబ్జానీపై హాస్యనటుడు బ్రహ్మానందం ప్రశంసలు..!మోషన్ క్యాప్చర్ అంటే?నిజ జీవితంలో ఒక నటుడు చేసే యాక్టింగ్‌ని టెక్నాలజీ ద్వారా రికార్డు చేసి, వాటిని డిజిటల్ లేదా CGI క్యారెక్టర్‌కు అందించడమే మోషన్ క్యాప్చర్. ‘రాకా’లో మాత్రం ఒకరిద్దరి కదలికలు కాకుండా 37 మంది యాక్టింగ్‌ని ఒకేసారి రికార్డు చేశారు. ఈ స్థాయిలో మోషన్ క్యాప్చర్ చేయడానికి ప్రత్యేకమైన పైప్‌లైన్, వర్క్‌ఫ్లోను చిత్రబృందం సిద్ధం చేసింది. ఇందుకోసం అవసరమైన ప్రత్యేక పరికరాలను లాస్ ఏంజెల్స్ నుంచి తీసుకొచ్చి సొంత మోషన్ క్యాప్చర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు దర్శకుడు అట్లీ వెల్లడించారు.బన్నీ, అట్లీ చేతికి గిన్నిస్ సర్టిఫికెట్ఈ రికార్డుకు సంబంధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను అల్లు అర్జున్, అట్లీ అందుకున్నారు. సినిమా విడుదలకు ముందే ఇలాంటి అరుదైన ఘనత సాధించడం ‘రాకా’పై అంచనాలను మరింత పెంచింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు దీపికా పదుకొణె కీలక పాత్రలో కనిపించనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్.ఇదీ చదవండి: ఆయన సొంతమైనా క్రష్ తగ్గట్లేదు: రష్మిక HISTORY MADE 🏆 A global triumph that takes Indian cinema to the world stage! 🌎#Raaka sets a Guinness World Record for the “Most People Motion-Captured in Real-Time”, with 37 performers captured simultaneously! Mr. Allu Arjun and Mr. Atlee received the Guinness World Records… pic.twitter.com/BuozZNET6K— Sun Pictures (@sunpictures) September 21, 2026 -
మరోసారి ఆస్పత్రికి రామ్ చరణ్.. ఎందుకంటే?
మెగా హీరో రామ్ చరణ్ మరోసారి ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవల తన మణికట్టు గాయానికి సర్జరీ చేయించుకున్న చెర్రీ.. కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రికి చేరుకున్నారు. సర్జరీ సమయంలో వేసిన రాడ్లను వైద్యులు తొలగించారు. ఇప్పుడు ఆయన మరో 8 నుంచి 10 వారాల పాటు ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ చేయించుకోనున్నారు. అంటే దాదాపు రెండు నెలలకు పైగా సమయం పట్టే ఛాన్స్ ఉంది. పూర్తిగా కోలుకున్న తర్వాత నెక్ట్స్ మూవీ షూటింగ్లో పాల్గొనే అవకాశముంది.ఈ ఏడాది పెద్ది మూవీతో అలరించిన రామ్ చరణ్ ఓ మాదిరి సక్సెస్ అందుకున్నారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది. ఈ మెగా హీరో తన తదుపరి ప్రాజెక్ట్ సుకుమార్ డైరెక్షన్లో చేయనున్నారు. ఈ గాయం నుంచి కోలుకున్నాకే సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు రామ్ చరణ్. #RamCharan underwent a planned follow up procedure at Ganga Hospital, Coimbatore, following his wrist injury.His cast and wrist rods have been successfully removed. The procedure was performed by Dr. Praveen under the guidance of Dr. Rajasekaran and Dr. Sabhapathi.He will now… pic.twitter.com/SZplxopFL2— Vamsi Kaka (@vamsikaka) September 24, 2026 -
శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో టాలీవుడ్ హీరోయిన్ పూజలు
ఇటీవల తిరుమలలో అద్భుతమైన డ్యాన్స్‌తో అలరించిన టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి. తనలో కూచిపూడి నృత్యం చేసే టాలెంట్ కూడా ఉందని నిరూపించింది. డింపుల్ డ్యాన్స్‌కు భక్తులతో పాటు ఫ్యాన్స్ సైతం ఫిదా అయిపోయారు. తాజాగా ఈ బ్యూటీ శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. హీరోయిన్ డింపుల్ హయాతి గల్ఫ్ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత అభినేత్రి 2, గద్దలకొండ గణేశ్, యురేకా, ఖిలాడీ, రామబాణం, దిల్ మార్, భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీస్ చేసింది. ప్రస్తుతం శర్వానంద్ 'భోగి'చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. టాలీవుడ్లో ఈ ముద్దుగుమ్మకు అంతగా కలిసిరాలేదు. Actress #DimpleHayathi spotted seeking divine blessings at the historic Sri Kalahasteeswara Swamy Temple. ✨🙏 Always beautiful to see our stars connect with their spiritual side ❤️#Bhogi #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/UjHtYHZBku— Telugu FilmNagar (@telugufilmnagar) September 24, 2026 -
పెళ్లైనా .. ఆయనపై క్రష్ తగ్గట్లేదు: రష్మిక
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర బృందం ప్రకటించింది.మరోవైపు ఇటీవల ‘ఏందయ్య సామీ’ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలోని ఓ క్లిప్‌ను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విజయ్‌పై తన ప్రేమను మరోసారి చాటుకుంది. ‘అతను నాకు పూర్తిగా సొంతమైనా.. తనపై క్రష్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇదేంటో మరి’ అంటూ రష్మిక చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. జీవితాంతం నా దగ్గరే ఉంటావుదీనికి విజయ్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ‘నేను ఎంతో అదృష్టవంతుడిని. జయమ్మను మిస్ అయినా.. నువ్వు మాత్రం జీవితాంతం నా దగ్గరే ఉంటావు’ అంటూ రిప్లై ఇచ్చాడు. వీరిద్దరి సోషల్ మీడియా సంభాషణ చూసిన అభిమానులు సంబరపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌లోనూ విజయ్-రష్మిక జోడీపై ఆసక్తి పెరుగుతోంది.ఇక ‘రణబాలి’ కథ 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇందులో విజయ్ దేవరకొండ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్-రష్మిక పెళ్లి తర్వాత కలిసి వస్తున్న తొలి చిత్రం కావడంతో ‘రణబాలి’పై మరింత ఆసక్తి నెలకొంది. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.ఇదీ చదవండి: ‘ఎందుకింత దురద..? ఏం చూసుకొని సినిమాల్లోకి వచ్చావ్..?’ -
‘ఎందుకింత దురద..? ఏం చూసుకొని సినిమాల్లోకి వచ్చావ్..?’
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ఇందులో నటించిన పలువురు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. అలాంటి వారిలో సంపూర్ణేష్ బాబు కూడా ఉన్నారు. ‘బిర్యాని’ అనే విభిన్నమైన పాత్రలో కనిపించిన ఆయన.. తనదైన నటనతో మెప్పించారు.‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో.. అయితే ప్రస్తుతం సంపూర్ణేష్ బాబుకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంపూర్ణేష్ బాబును సీనియర్ జర్నలిస్ట్ కొన్ని ప్రశ్నలు అడిగారు. ‘సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. హీరో అయ్యేంత నీలో ఏముంది? అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చావు? ఎందుకు అంత దురద? ‘ది ప్యారడైజ్’లో అవకాశం రావడం నీ కెరీర్లో ఊహించని మలుపు. ఇలాంటి సినిమాల్లో నీకు ఎవరు అవకాశం ఇస్తారు?’ అంటూ ప్రశ్నించారు.సంపూర్ణేష్ పై ప్రశంసలు..ఈ ప్రశ్నలకు సంపూర్ణేష్ బాబు ఎలాంటి అసహనం వ్యక్తం చేయకుండా ఎంతో ప్రశాంతంగా సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదని, పేద కుటుంబం నుంచి వచ్చారని ఇలా ప్రశ్నించడం అవసరమా?’ అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సంపూర్ణేష్ బాబు మాత్రం ప్రశ్నలు ఎంత కఠినంగా ఉన్నా ఓర్పుగా ఇంటర్వ్యూను ఎదుర్కొన్న తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాల్లో రాణించేందుకు నేపథ్యం కంటే ప్రతిభ, పట్టుదల ముఖ్యమని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు.. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’లోనూ కొత్త తరహా పాత్రలో కనిపించారు. ఇదీ చదవండి: కుటుంబ బంధాలపై బిగ్‌బాస్ ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టికున్న ఝాన్సీ -
‘ది ప్యారడైజ్’ వచ్చేది ఈ ఓటీటీలోకే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
నాని ‘ది ప్యారడైజ్’ నేడు(సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘దసరా’తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. అయితే రిలీజ్ తర్వాత మాత్రం ఆ అంచనాలకు తగ్గట్లుగా లేదనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సినిమాలో ప్రధానంగా ఎమోషన్ మిస్ అయిందని పలు న్యూస్ వెబ్‌సైట్స్ తమ రివ్యూల్లో పేర్కొన్నాయి.కొంతమంది కావాలని నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే నాని అభిమానులు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఇది పక్కన పెడితే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు అధికారికంగా బయటకు వచ్చాయి. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో తో పాటు నెట్ ఫ్లిక్స్ కూడా భారీ స్థాయిలో పోటీపడ్డాయి. అయితే చివరకు రూ. 50 కోట్లకు పైగా వెచ్చించి.. నెట్ఫ్లిక్ ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకుంది.(చదవండి: ది ప్యారడైజ్ మూవీ రివ్యూ )స్ట్రీమింగ్ అప్పుడేనా..?థియేటర్స్‌లో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాతే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఒప్పందంతో రైట్స్ అమ్ముకున్నారట నిర్మాత. ఈ లెక్కన చూస్తే.. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20-22 తేదీల మధ్య ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అయ్యే అవకాశం ఉంది. ఇందులో నానికి జోడీగా కయాదు లోహర్ నటించగా.. సోనాలి కులకర్ణి, 'కిల్' ఫేమ్ రాఘవ్ జూయల్, సంపూర్ణేష్ బాబు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక చాలా కాలం తర్వాత డైలాగ్ కింగ్ మోహన్‌బాబు ఈ చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించాడు. -
కుటుంబ బంధాలపై బిగ్‌బాస్ ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టికున్న ఝాన్సీ
బిగ్‌బాస్ ఇంట్లో ఈ వారం టెమ్టేషన్స్, ఎమోషన్స్ రెండూ తారాస్థాయికి చేరినట్లు తాజా ప్రొమో చూస్తే అర్థమవుతోంది. లివింగ్ రూం హౌస్‌లో ముందుగా బజర్ నొక్కింది వంశీ అని త్రిగుణ్ చెప్పగా, నొక్కింది నేనే అని నరేశ్ వాదించాడు. ‘నేను చెప్పినా వినకపోతే నేనేం చేస్తా?’ అంటూ నరేశ్ ప్రశ్నించగా, ‘నేను చూసిన దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటా’ అని త్రిగుణ్ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.ఆమె ఎవరిని ఎంచుకుంటుంది?ఇక కెప్టెన్సీ కంటెండర్‌గా మారేందుకు ఝాన్సీ, వంశీకి ఇచ్చిన టాస్క్ కూడా ఆసక్తికరంగా సాగినట్లు ప్రొమోలో కనిపించింది. అయితే అసలు ట్విస్ట్ తరువాతే వచ్చింది. ఝాన్సీని పిలిచిన బిగ్‌బాస్.. ‘నీ మనసుకు దగ్గరైన టెమ్టేషన్ నీ చేతికి అందే ముందు నీకు రెండు ఆప్షన్లు ఇస్తున్నా’ అని చెప్పాడు. మొదటి ఆప్షన్‌గా నరేశ్‌కు అతని తమ్ముడు రాసిన ఉత్తరాన్ని అందకుండా చేయాలని, రెండో ఆప్షన్‌గా రాంప్రసాద్‌కు వారి కుటుంబంతో దిగిన ఫోటోను దూరం చేయాలని బిగ్‌బాస్ సూచించాడు. ఈ రెండు ఆప్షన్లు విన్న వెంటనే ఝాన్సీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఎవరిని ఎంచుకుంటుంది? నరేశ్ లేఖనా? రాంప్రసాద్ ఫోటోనా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
డ్యుయల్ రోల్లో అదరగొట్టిన శర్వానంద్
శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జార్జ్ క్రిష్’. మానస వారణాసి హీరోయిన్. జనవరి 14న విడుదల కానుంది. శ్రీను వైట్ల బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ బూస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దీనిలో శర్వానంద్ భిన్నమైన గెటప్స్‌తో కనిపించి ఆకట్టుకున్నాడు. చర్చిలో ఫాదర్‌గా స్వామీజీగా తనదైన ఛార్మింగ్ స్టైల్‌తో అలరించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఫస్ట్ వీడియోతోనే సినిమాపై ఆసక్తి నెలకొంది. 'నారీ నారీ నడుమ మురారి' మూవీ హిట్ తర్వాత శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. -
నాని 'ప్యారడైజ్'.. ప్రేక్షకులు ఏమంటున్నారు?
నాని 'ప్యారడైజ్' సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. బుధవారం రాత్రి ప్రీమియర్లు పడ్డాయి. విడుదలకు ముందు విపరీతమైన హైప్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. దాన్ని నిలబెట్టుకుందా? చూసిన ప్రేక్షకులు అసలేమంటున్నారు? సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీకి కారణమేంటి? చూస్తున్నవన్నీ నిజమైనా అభిప్రాయాలేనా?(ఇదీ చదవండి: ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్)ఏ సినిమాపై అయినా విపరీతమైన అంచనాలు ఉన్నప్పుడు దాన్ని అందుకోవడం కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఏ మాత్రం అటుఇటైనా అడ్డంగా బోల్తా కొట్టేయడం గ్యారంటీ. 'ప్యారడైజ్' విషయంలో ఇప్పుడు అదే జరిగిందని ఆడియెన్స్ అంటున్నారు. స్టోరీ పరంగా కొత్తగా ఏం లేనప్పటికీ టేకింగ్ పరంగా ఏమైనా మ్యాజిక్ జరుగుతుందేమోనని ఆశపడితే అలాంటిదేం లేదని కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఫస్టాప్ పర్లేదనిపించినప్పటికీ సెకండాఫ్ మరీ దారుణంగా ఉందని అంటున్నారు.మరికొందరు అయితే 'ప్యారడైజ్'.. బిర్యానీ కాదు కిచిడీ, పులిహోర అని ఘోరమైన విమర్శలు చేస్తున్నారు. వందలాది రూపాయల టికెట్ కొని ఎంతో ఆశతో థియేటర్‌కి వెళ్లి ఉసూరుమన్న చాలామంది సోషల్ మీడియా వేదికగా తన కోపాన్ని వెళ్లగక్కుతున్నారు.(ఇదీ చదవండి: ప్యారడైజ్ సినిమా రివ్యూ)నాని కష్టాన్ని మెచ్చుకుంటున్న ప్రేక్షకులు.. మోహన్ బాబు విలనిజం బాగుందని అంటున్నారు. కాయదు పాత్రని వ్యాంప్ తరహాలో డిజైన్ చేయడం కొందరికి తెగ నచ్చేయగా.. మరికొందరు 'పెద్ది'లో జాన్వీ పాత్రతో పోలుస్తున్నారు. ఇద్దరినీ అందాల ప్రదర్శన కోసమే తీసుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ నుంచి తీసుకొచ్చి రాఘవ్ జుయల్‌తో చేయించిన విలనీ మరీ కామెడీగా ఉందని ఏకిపారేస్తున్నారు.బిర్యానీ అనే పాత్రలో నటించిన సంపూర్ణేశ్ బాబు.. 'ప్యారడైజ్' కోసం రెండేళ్ల పాటు ఇదే లుక్ మెంటైన్ చేస్తే సరైన సీన్ గానీ సరైన ఎలివేషన్ గానీ పడలేదని అంటున్నారు. అనిరుధ్.. పాటల్లో తప్పితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో మెప్పించలేకపోయాడని.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎందుకనో పూర్తిగా దృష్టి పెట్టి ఈ మూవీ తీయలేదా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా నాని.. మాస్ సినిమాలు తగ్గించి గతంలో చేసినట్లు ఫీల్ గుడ్ లేదా కామెడీ మూవీస్ చేయాలని సగటు సినీ ప్రేక్షకులు, అతడి అభిమానులు కోరుతున్నారు.సోషల్ మీడియాలో 'ప్యారడైజ్' విషయంలో కనిపిస్తున్నదంతా చాలావరకు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా చూసినవాళ్లలో పాజిటివ్స్ చెప్పినవాళ్లు ఒకరో ఇద్దరో ఉండగా.. మిగిలిన వాళ్లు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. వీకెండ్ అయ్యేసరికి ఈ మూవీ అసలు ఫలితం ఏంటనేది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: సుకుమార్ శిష్యులిద్దరిదీ ఒకే కథ.. ప్చ్) -
సుకుమార్ శిష్యులిద్దరిదీ ఒకే కథ.. ప్చ్!
ఒకే గురువు దగ్గర శిష్యరికం. దాదాపు ఒకే తరహా నేపథ్యం. తొలి సినిమాతోనే మాంచి సక్సెస్‌తో పాటు దర్శకులుగానూ ప్రత్యేక ముద్ర. కానీ రెండో అడుగులో మాత్రం ఘోరమైన తడబాటు!. కారణం.. ‘భారీ’ అంచనాలేనా?. ఇలా ఇద్దరు యువ దర్శకుల కెరీర్ ఒకే పాయింట్ దగ్గరికి వచ్చి ఆగింది. పైగా ఈ ఇద్దరూ ఈ ఏడాది తమ రెండో సినిమాలతోనే చేదు ఫలితాన్ని చవిచూడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.సుకుమార్ శిష్యుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బుచ్చిబాబు సనా.. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సంచలనం సృష్టించారు. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా తెరకెక్కిన ‘ఉప్పెన’ భారీ విజయాన్ని అందుకోవడంతో బుచ్చిబాబుపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. తొలి సినిమాతోనే రా అండ్ రస్టిక్ ట్రీట్మెంట్తో ఆకట్టుకున్నారనే గుర్తింపు వచ్చింది.ఆ తర్వాత బుచ్చిబాబుకు ఏకంగా రామ్‌చరణ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. భారీ బడ్జెట్, స్టార్ హీరో, పాన్ ఇండియా స్థాయి అంచనాలతో ‘పెద్ది’ తెరకెక్కింది. దీంతో ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు స్థాయి మరింత పెరుగుతుందని అందరూ భావించారు. కానీ ‘పెద్ది’ అంచనాల మేరకు అలరించలేకపోయింది. రామ్‌చరణ్ నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ.. కథనం, కొన్ని సన్నివేశాలు, పాత్రల చిత్రీకరణపైనా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో వాటిని తొలగించాల్సి వచ్చింది.మాస్ ముద్రే దెబ్బేసిందా?ఇదే సమయంలో సుకుమార్ మరో శిష్యుడు శ్రీకాంత్ ఓదెల కూడా అదే పరీక్షను ఎదుర్కొన్నారు. నానితో ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం ‘దసరా’. తెలంగాణ నేపథ్యంలో బొగ్గు గనుల గ్రామీణ వాతావరణం, మాస్ ట్రీట్మెంట్, ఎమోషన్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాతోనే శ్రీకాంత్ ఓదెల తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని చూపించారు.‘దసరా’ తర్వాత సహజంగానే ఆయన రెండో సినిమాపై అంచనాలు పెరిగాయి. అందులోనూ మరోసారి నానితోనే జతకట్టి భారీ స్థాయిలో ‘ది ప్యారడైజ్’ తెరకెక్కించారు. ఈసారి కథ, స్కేల్, యాక్షన్ విషయంలో మరింత పెద్ద ప్రయత్నం చేశారు. ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ ఆసక్తి నెలకొంది.అయితే సినిమా విడుదలైన రోజే ప్రేక్షకుల స్పందన పూర్తిగా ఏకపక్షంగా లేకుండా తీర్పు వచ్చేసింది. అంత భారీతనాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడనే విమర్శ బలంగా వినిపిస్తోంది. కథా.. కథనం, ట్రీట్మెంట్పై చాలామంది ప్రేక్షకులు పెదవి విరిచేస్తున్నారు. ముఖ్యంగా హీరో-విలన్ల కాన్ఫ్లిక్ట్నే సరిగ్గా హ్యాండిల్ చేయకపోయాడనే రీమార్క్ వినిపిస్తోంది. దీంతో ‘దసరా’తో వచ్చిన స్థాయి స్పందనను రెండో సినిమాతో శ్రీకాంత్ ఓదెల అందుకోలేకపోయారనే చర్చ మొదలైంది.ఇక్కడే సుకుమార్ శిష్యుల కథలో ఆసక్తికరమైన పోలిక కనిపిస్తోంది. ఇద్దిరిపైనా గురువు ప్రభావం ఉందని, ఆ తాలుకా ప్రభావంతో కథ చెప్పే విధానాన్ని తమదైన శైలిలో చూపించారు. కానీ రెండో సినిమాకు వచ్చేసరికి హీరోల స్థాయి, బడ్జెట్, అంచనాలు అన్నీ భారీగా పెరిగాయి. ఆ స్థాయికి తగ్గట్టుగా ప్రేక్షకుల్ని మెప్పించడంలో ఘోరంగా తడబడ్డారు.. ప్చ్!. -
దేబ్జానీపై హాస్యనటుడు బ్రహ్మానందం ప్రశంసలు..!
బిగ్‌బాస్ సీజన్10లో కంటెస్టెంట్ల ఆట ఒకవైపు ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు కొందరి మాటతీరు.. ప్రవర్తన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అలాంటి వారిలో దేబ్జానీ మోదక్ ఒకరు. బెంగాలీ నేపథ్యంలో నుంచి వచ్చిన ఆమె తెలుగులో మాట్లాడే విధానం.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, తనదైన శైలిలో స్పందించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హౌస్‌లో అందరితో మాట్లాడే మాటలు, తోటి కంటెస్టెంట్లతో కలిసిపోయే విధానం హౌస్‌మేట్స్‌కే కాకుండా బయట ప్రేక్షకులకూ ముచ్చటగా అనిపిస్తోంది. గత నాలుగైదు ఎపిసోడ్ల నుంచి దేబ్జానీ పేరు మార్మోగుతోంది. ఆమె ఆడిన తీరు ఒక ఎత్తు అయితే.. ఆమె మాట్లాడే మాటలు ఒకెత్తు. దీంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో మీమ్స్, పాత వీడియోలు వైరల్ చేస్తున్నారు. అలా ఓ సందర్భంలో టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మనందం ఆమె మాట్లాడే తెలుగుపై ప్రశంసలు కురిపించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.బృహ్మనందం ఆమెని ప్రశంసిస్తూ..ఓ సందర్భంలో.. శ్రీముఖి దేబ్జానీ కోసం చెప్తూ.. ‘ఆమెకు తెలుగు మాట్లాడడం సరిగా రాకపోయినా తెలుగు పాటలు బాగా పడుతుంది సార్’ అని బ్రహ్మనందంకి పరిచయం చేస్తారు. బ్రహ్మనందం ఆమెని ప్రశంసిస్తూ.. ‘దేబ్జానీ నిన్ను చూస్తుంటే జల్సీగా ఉంది. తెలుగు తెలీదు. మేము ఏం మాట్లాడుతున్నాం అసలే అర్థం కాదు. కానీ నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు’ అంటూ ఆమెను పొగడ్తల వర్షం కురిపించారు. అనంతరం దేబ్జానీ తెలుగులో పాడిన పాటను విని అబ్బా.. చాలు.. బాగా పాడావు, చాలా సంతోషం తల్లి అంటూ నవ్వులు పూయించారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.దేబ్జానీ విషయానికి వస్తే..దేబ్జానీ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. తండ్రి అపూర్బా మోదక్ వ్యాపారవేత్త.. తల్లి మితా మోదక్ గృహిణి. ఈమెకు నందిని మోదక్ అనే చెల్లెలు ఉంది. అనుకోకుండా ఓ సీరియల్లో అవకాశం రావడంతో అలా బుల్లితెరపై అడుగుపెట్టి బెంగాలీ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్10లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి తన మాటలతో అటు హౌస్‌మేట్స్‌తో పాటు ఇటు ఇప్పటి ప్రేక్షకులకూ దగ్గరవుతున్నారు.ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: దేబ్జానీకి పెళ్లిచూపులు.. త్రిగుణ్‌ని ఏడిపించేశారు #debjani after bb only I have seeing her , beforely i hv never seen her serial or any other programs,after bb I felt lyk she is genuine,she won't win but I want to be her until finale #BiggBossTelugu10 pic.twitter.com/iZxPw8MBRY— Butterfly 🦋🦋 (@sparkles_jiya) September 22, 2026 -
7 సినిమాలు చేస్తున్నా.. రోజుకు ఎంత సంపాదిస్తానంటే?
'మీది మొత్తం 1000 అయింది. రెండు లివర్స్ ఎక్స్ట్రా' అనే ఒక్క మాటతో సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయిన కుమారి అంటీ.. ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా వచ్చిన ఫేమ్‌తో 'పాంచాలి పంఛభర్తృక' అనే సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ, మరోవైపు బిజినెస్ చేసుకున్న ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సంపాదన, యాక్టింగ్ కెరీర్, బిగ్‌బాస్ ఛాన్స్ గురించి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్’ మూవీ రివ్యూ)'నేను హైదరాబాద్ రాకముందు ఊళ్లో మెషీన్ కుట్టేదాన్ని. పొలం పనులు చేసేదాన్ని. ఆరోజుల్లో రోజుకి రూ.50 ఇచ్చేవాళ్లు. ఏదైనా చేయాలని నా భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చి 2011లో ఈ బిజినెస్ మొదలుపెట్టాను. ఫేమస్ కాకముందే నేను ఎక్కువ గిరాకీ చేసేదాన్ని. 'మీది మొత్తం 1000 అయింది. రెండు లివర్స్ ఎక్స్ట్రా' అనే మాట వైరల్ అయిన తర్వాత మా హోటల్‌కి ఎక్కువమంది జనాలు వచ్చారు. దీంతో మరికొందరు నా షాపు దగ్గరకు రావటానికి భయపడ్డారు. యూట్యూబ్ వల్ల నా హోటల్ గురించి జనాలకు బాగా తెలిసింది. కానీ సెలబ్రిటీలు ఏడెనిమిదేళ్ల ముందే వచ్చేవారు. సుడిగాలి సుధీర్ సినిమా షూటింగ్ మా హోటల్లోనే జరిగింది. మేమున్న ప్రాంతంలో ఏ మూవీ షూటింగ్ జరిగినా మ దగ్గర నుంచి ఫుడ్ తీసుకెళ్లేవాళ్లు''కరోనా కంటే ముందే నా హోటల్ ఫేమస్. నా దగ్గరకు వచ్చేవాళ్లు ఎక్కువగా నాన్ వెజ్ అడుగుతుంటారు. ఫేమస్ కాకముందు నా హోటల్‌కి 1500 మంది వరకు వచ్చేవాళ్లు. ఇప్పుడు 1000 మంది వరకు వస్తున్నారు. రోజుకి రూ.20 వేల కౌంటర్ సేల్ అవుతోంది. దానికి తగ్గట్లే ఖర్చులు కూడా ఉంటాయి. ఆదాయం ఎంతుందో ఖర్చులు కూడా దానికి తగ్గట్లే ఉన్నాయి. ప్రస్తుతం నేను ఏడు సినిమాల్లో నటిస్తున్నాను. అన్నీ చిన్న చిన్న పాత్రలే. గతేడాది నాకు బిగ్‌బాస్ షో నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కానీ అప్పుడు వెళ్లలేదు. ఈసారి అవకాశమొస్తే అస్సలు వదులుకోను' అని కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్) -
'ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్
నాని 'ప్యారడైజ్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతానికైతే మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కొందరికి నచ్చగా మరికొందరికి నచ్చలేదు. మూవీ ఫలితం సంగతి పక్కనబెడితే ఇందులో కొన్ని అంశాలు.. ప్రేక్షకుల్ని అలరించాయి. వాటిలో కేసీఆర్, ఎన్టీఆర్‌ని పోలిన పాత్రలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వీటి గురించే సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.1980ల్లో ప్యారడైజ్ ప్రాంతంలో జరిగే కల్పిత కథతో 'ప్యారడైజ్' సినిమా తీశారు. ఇందులో గుర్తింపు కోసం పోరాడే సవారీ తెగకు అండగా నిలబడే ఎమ్మెల్యే శంకరన్నగా ప్రియదర్శి నటించాడు. అయితే ఈ పాత్రని చూస్తున్నంతసేపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే గుర్తొస్తారు. ఈ సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయించాయి.అలానే సీనియర్ ఎన్టీఆర్‌గా పి.విజయ్ కుమార్ నటించారు. గతంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో నటించింది ఈయనే. కేసీఆర్‌ని పోలిన పాత్రకు స్క్రీన్ స్పేస్, డైలాగ్స్ ఉన్నాయి గానీ ఎన్టీఆర్ రోల్ జస్ట్ అలా కనిపించి వెళ్లిందంతే. సవారీలు నివసించే ప్రాంతానికి ఎమ్మెల్మే శంకరన్న పాత్ర ముఖ్యమంత్రిని తీసుకొస్తారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ అనే పేరు ఎక్కడా ఉపయోగించలేదు. కానీ పాత్రలు చూస్తే ఎవరికైనా అవి ఎవరనేది అర్థమైపోతుంది. ఇలా సినిమాలో ఈ రెండు పాత్రల్ని చూపించి సర్ప్రైజ్ చేశారని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: నాని 'ప్యారడైజ్' సినిమా రివ్యూ) -
‘షో’ సారీ నాని!
సాక్షి, హైదరాబాద్: తన తాజా సినిమా ప్యారడైజ్ ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో అభిమానులతో కలిసి చూడాలన్న హీరో నాని విజ్ఞప్తికి నగర పోలీసులు నో చెప్పారు. శుక్రవారం శోభాయాత్ర నేపథ్యంలో ఆ షోకు బందోబస్తు కల్పించలేమని బుధవారం స్పష్టం చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలని ఉందని నాని బుధవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డిని ‘ఎక్స్’ద్వారా అభ్యర్థించారు. దీనిపై స్పందించిన సీఎం, స్థానిక పోలీసుస్టేషన్లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు డీజీపీనీ ఆయన ట్యాగ్ చేశారు. డీజీపీ నగరంలో గణేశ్ నిమజ్జన వేడుకలు ముమ్మరంగా జరుగుతుండటం వల్ల ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ పరిసర ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉందని సమాధానం ఇస్తూ నగర కొత్వాల్ సజ్జనర్‌ను ట్యాగ్ చేశారు. పూర్వాపరాలను పరిశీలించిన నగర పోలీసులు ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ రావడానికి నానికి అనుమతివ్వలేదు. ‘ది ప్యారడైజ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ -
జార్జ్ క్రిష్‌కి జోడీ ఫిక్స్
హీరో శర్వానంద్–దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జార్జ్ క్రిష్’. ఏటీవీ సమర్పణలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మానస వారణాసి హీరోయిన్గా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘ఈ సినిమాలో లవ్ స్టోరీకి ప్రాధాన్యత ఉంటుంది. మానస పాత్ర కథలో కీలకం. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సంక్రాంతి పండగ సీజన్లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మామూవీ అలరించేలా ఉంటుంది. 2027 జనవరి 14న మా సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
మండాడికి కమల్‌హాసన్ అభినందనలు
సుహాస్, సూరి, మహిమా నంబియార్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మండాడి’. మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ఈ నెల 10న రిలీజ్ చేసింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. వంద కోట్ల వసూళ్లు సాధించి, ఇంకా దూసుకుపోతున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ యూనిట్‌ని నటుడు కమల్‌హాసన్ అభినందించారు. కమల్ని కలిసిన వారిలో సూరి, సుహాస్, రవీంద్ర విజయ్, దర్శక, నిర్మాతలున్నారు. -
‘ది ప్యారడైజ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : ది ప్యారడైజ్నటీనటులు: నాని, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులునిర్మాణ సంస్థ: SLV సినిమాస్ నిర్మాత: చెరుకూరి సుధాకర్రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెలసంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: సిహెచ్ సాయిఎడిటింగ్: నవీన్ నూలివిడుదల తేది: సెప్టెంబర్ 24, 2026ఒకప్పుడు నాని అంటే క్లాస్ ఎంటర్టైనింగ్ సినిమాలు గుర్తొచ్చేవి. పక్కింటి అబ్బాయి తరహా పాత్రలతో అలరించేవాడు. కానీ ‘దసరా’తో తన రూట్ మార్చాడు. మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూ తనలోని వయెలెంట్ యాంగిల్‌ని చూపిస్తున్నాడు. అలా ఇప్పటి వరకు చూడని మాస్ అవతారంతో ‘ది ప్యారడైజ్'అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘దసరా’ తర్వాత నాని–శ్రీకాంత్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల రిలీజ్ అయిన పాటలు, టీజర్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఇలా భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? నాని చేసిన మాస్ ప్రయోగం ఫలించిందా? శ్రీకాంత్ ఓదెల మరోసారి తన మార్క్ చూపించాడా? రివ్యూలో చూద్దాం. (The Paradise Movie Telugu Review)కథేంటంటే..ఈ సినిమా కథ 1947లొ మొదలై 80లలొ ముగుస్తుంది. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినా..హైదరాబాద్‌లోని ప్యారడైజ్ ప్రాంతం మాత్రం సంపన్న వర్గానికి చెందిన శికంజ మాలిక్(మోహన్ బాబు) ఆధీనంలో ఉంటుంది. అక్కడ నివసించే సవారీ జాతి వాళ్లకు గుర్తింపు ఉండదు. తమను భారతీయులుగా గుర్తించాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఆ జాతికి చెందిన సమ్మక్క(సోనాలి కులకర్ణి).. శికంజ మాలిక్‌కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటారు. ఆమె కొడుకే జడల్(నాని). చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన కారణంగా మాలిక్‌తో పాటు తల్లిపై కోపం పెంచుకుంటాడు. హత్యానేరంపై జైలుకెళ్లి 14 ఏళ్ల తర్వాత తిరిగివస్తాడు. శికంజ మాలిక్‌ని చంపడమే తన లక్ష్యం. మరి జడల్ లక్ష్యం నెరవేరిందా? ప్యారడైజ్‌లో శికంజ మాలిక్ కొడుకు(రాఘవ్ జుయల్)సృష్టించిన విధ్వంసం ఏంటి? అసలు జడల్..తన తల్లిపై ఎందుకు కోపంగా ఉన్నాడు? గుర్తింపు కోసం తన తల్లి చేస్తున్న పోరాటాన్ని ఎప్పుడు అర్థం చేసుకున్నాడు? తల్లి చేస్తున్న ఈ పోరాటంలోకి జడల్ ఎలా వచ్చాడు? చివరకు సవారీలకు గుర్తింపు వచ్చిందా రాలేదా? ఈ కథలో బిర్యానీ(సంపూర్ణేష్ బాబు), సుబ్బు(కయాదు లోహర్) పాత్రలు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ మధ్యకాలంలో ది ప్యారడైజ్ సినిమాకు వచ్చినంత హైప్ మరే సినిమాకూ రాలేదనే చెప్పాలి. టీజర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి అమాంతం పెరిగింది. అయితే కొండంత రాగం తీసి.. ఏదో పాట పాడినట్టు ఆ స్థాయి అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోవడం ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది. ది ప్యారడైజ్ కథలో కొత్తదనం కనిపించదు. సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు కోసం ఓ వర్గం చేసే పోరాటం.. ఆ వర్గాన్ని ఓ బలమైన వ్యక్తి అణచివేయడం.. ఆ అణచివేత నుంచి ఓ కథానాయకుడు ఎదగడం.. చివరకు తన వర్గానికి గుర్తింపు తీసుకురావడం.. ఈ తరహా కథలు తెలుగు తెరపై చాలానే చూశాం. పాత సీసాలో కొత్త సారా అన్నట్టుగా కథలో కొత్తదనం లేకపోయినా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనదైన ట్రీట్మెంట్తో దానికి కొత్త రూపు ఇవ్వాలని ప్రయత్నించాడు. కథలోని ప్రపంచాన్ని, పాత్రలను, అక్కడి పరిస్థితులను ఆయన నిర్మించిన విధానం బాగుంది కానీ.. అయితే ముఖ్యమైన ఎమోషన్ మిస్సయింది. ధురంధర్ తరహాలో ఈ సినిమాను చాప్టర్లుగా విభజిస్తూ కథనాన్ని ముందుకు నడిపాడు. మొత్తం 6 చాప్టర్లు ఉంటాయి. అందులో మొదటి చాప్టర్లో సవారీ జాతి నేపథ్యాన్ని,అణచివేతకు గురైన తీరుని చూపించారు. ఇది కొంతవరకు ఆసక్తికరంగానే సాగుతుంది. ఇక రెండో చాప్టర్లో హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. అయితే ఆమె తండ్రిపై ప్రేమలో చేసే ఒక పని.. లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. ఎమోషనల్గానూ అంతగా ఆకట్టుకోలేదు. చాప్టర్ 3లో మదర్ సెంటిమెంట్‌ని చూపించారు. ఒకవైపు కథను ఎమోషనల్‌గా నడిపిస్తూనే మరోవైపు శృతిమించిన వయెలెన్స్‌ని చూపించారు. సినిమా ప్రారంభం నుంచే రక్తం ఏరులైపారుతుంది. తలలు ఎగిరిపడుతుంటాయి. రక్తపు మడుగులో బొర్లుతుంటారు. అయినప్పటీకీ ఆయా సీన్లు అంతగా ఆకట్టుకోలేవు. ఇంటర్వెల్ సినిమా మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిన పెంచుతుంది. ఫస్టాఫ్ చూసిన తర్వాత ఇంకేదో ఉంటుదని.. ఇప్పుడు ఏదో మిస్ అయ్యామనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం చాలావరకు గాడీ తప్పింది. చెప్పడానికి కథ పెద్దగా లేకపోవడంతో చాలా వరకు సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఎమ్మెల్యే శంకర్రావు( కేసీఆర్‌ను పోలిన పాత్ర) ఎపిసోడ్ మాత్రం థియేటర్స్‌లో ఈలలు వేయిస్తుంది. అయితే ఆ కథకు ఆ పాత్రకు పెద్దగా సంబంధం ఉండదు. ఆ తర్వాత కథను ఎమోషనల్‌గా నడిపించే అవకాశం ఉన్నా.. మళ్లీ నరుకుడు పద్దతినే ఎంచుకున్నాడు దర్శకుడు. విపరీతమైన హింస సన్నివేశాలను జోడించాడు. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే..జడల్ జమానా పాత్రలో నాని జీవించేశాడు. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపించింది. తన శక్తికి మించిన పాత్రను చేసి మెప్పించే ప్రయత్నం చేశాడు. నాని కెరీర్లోనే ఇది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇక 'శికంజ మాలిక్' పాత్రలో మోహన్ బాబు తనదైన గాంభీర్యం, డైలాగ్ డెలివరీతో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమాకు ప్లస్ అయింది. చాలా కాలం తర్వాత మోహన్ బాబు ఇలాంటి పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇక శికంజ మాలిక్ కొడుకుగా రాఘవ్ జుయల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కయాదు లోహర్ పాత్ర నిడివి తక్కువే అయినా గుర్తిండిపోయే పాత్ర చేసింది. ఇక హీరో తల్లి సమ్మక్కగా సోనాలి కులకర్ణి తనదైన నటనతో ఆకట్టుకుంది. సంపూర్ణేష్ బాబు కొత్త తరహా పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు.అయితే దర్శకుడు అతన్ని పూర్తిగా వాడుకోలేకపోయాడనిపిస్తుంది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. యాక్షన్ సీన్స్‌కి ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవల్. ఇక పాటల గురించి తెలిసిందే. రిలీజ్‌కి ముందే సూపర్ హిట్ అయ్యాయి. ఏష నాగుల పాటలకి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. మిగిలిన పాటలన్నీ ఆకట్టుకునేలానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు అద్భుతంగా ఉంది. ప్యారడైజ్ వరల్డ్‌ని అద్భుతంగా రీక్రియేట్ చేశారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
స్టార్ హీరోలపై మానస వారణాసి కన్ను..!
ఓ హీరోయిన్‌కు హిట్ వస్తే వరుస అవకాశాలు రావడం, రెమ్యూనరేషన్ పెరగడం సహజం. అయితే మానస వారణాసి మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. సంతోష్ శోభన్‌తో చేసిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో మానస కనిపించనుంది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. లవ్ స్టోరీతో పాటు శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ సినిమాలో ఉండనుందని సమాచారం. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం మానస వారణాసి టూ టైర్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. కానీ రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్, జూ.ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ ఎప్పుడు దక్కుతుందా అని ఎదురుచూస్తోంది. మానసను చూడగానే స్టార్ హీరోయిన్ మెటీరియల్ అని అంటారు. పైగా అందాల పోటీల రాణిగా కూడా నిరూపించుకుని వచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మరే అవకాశం లేకపోలేదు. కానీ పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తే మానస కెరీర్ మరింత వేగంగా టేకాఫ్ అయ్యే అవకాశం ఉంది. అయితే రష్మిక తరహాలో ఆమెకు కూడా వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తాయా అనేది రానున్న రోజుల్లో చూడాలి. -
అక్కినేని కోడలు శోభిత స్టన్నింగ్ లుక్స్.. గ్రీన్ శారీలో సాక్షి బ్యూటీ...!
బ్లాక్ డ్రెస్‌లో రష్మిక పోజులు...రెడ్ శారీలో శ్రియా శరణ్ అందాలు..ఆరెంజ్ కలర్లో మెరిసిపోతున్న నమ్రతా..హీరోయిన్ దుషారా విజయన్ గ్లామరస్ పిక్స్..ఈవెంట్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత..గ్రీన్ శారీలో మెరిసిన సాక్షి అగర్వాల్.. View this post on Instagram A post shared by Suta | Sarees & Blouses (@suta_bombay) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by Khushi Kapoor (@khushikapoor) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ది ప్యారడైజ్ రిలీజ్.. నాని సతీమణి ఎమోషనల్ పోస్ట్
నాని ది ప్యారడైజ్ రిలీజ్ వేళ ఆయన సతీమణి అంజనా ఆసక్తికర పోస్ట్ చేసింది. మీ సినిమా చూడటానికి కాలేజీ ఎగ్గొట్టి మరి మరి వెళ్లామని గుర్తు చేసుకుంది. 2009లో మీ సినిమా విడుదలైన రోజు మొదటి షో పడలేదని తెలిపింది. ఒక కొత్త దర్శకుడికి సమయానికి సినిమా విడుదల చేయడం కూడా ఎంత కష్టమో అని ఆరోజే తనకు తెలిసిందని రాసుకొచ్చింది.అంజనా తన పోస్ట్‌లో రాస్తూ..'2009 నాకు ఇంకా గుర్తుంది. మీ సినిమా చూడటానికి మేము ఇద్దరం కాలేజీ ఎగ్గొట్టాం. కానీ ఆ రోజు ఉదయం షో కూడా పడలేదు. ఒక కొత్త దర్శకుడికి సమయానికి సినిమా విడుదల చేయడం కూడా ఎంత కష్టమో అని ఆరోజు నేను అనుకున్నా. ఆ సంగతి ఇప్పటికీ నాకు ఇంకా గుర్తుంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత.. మీరు ఒక్కో సినిమాతో సంపాదించుకున్న నమ్మకం వల్ల 'ప్యారడైజ్' మూవీకి జనం తరలిరావడం చూస్తుంటే మా అందరికీ చాలా భావోద్వేగంగా అనిపిస్తోంది. ఈ ప్రయాణం ఒక్క రోజులో నిర్మించింది కాదు.. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ప్రతి సినిమా మీరు బిడ్డలా భావించడాన్ని నేను చూశా. సినిమా ఎప్పటికీ మీ బిడ్డే. ఈ రోజు రాత్రి 'ప్యారడైజ్' తన తొలి అడుగులు వేస్తోంది. ఏది జరిగినా.. అంతా మంచే జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది ఆంతే.. మరెవ్వరూ లేనంతగా మేము మీకు అండగా ఉన్నాం' అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Anjana Yelavarthy (@anjuyelavarthy) -
మీ ప్రయాణం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం: రామ్ చరణ్
తన తండ్రి మెగాస్టార్ సినీ జర్నీపై తనయుడు రామ్ చరణ్ స్పందించారు. చిరంజీవి ట్వీట్‌కు మెగా హీరో రిప్లై ఇచ్చారు. సినిమా రంగంలో మీ ప్రయాణం మొదలుపెట్టి 48 ఏళ్లు అయ్యింది నాన్న అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. మీరు మన కుటుంబం, జీవితంలోనూ ప్రతీదీ మార్చేసిన ఆ రోజు మాకు ప్రతిరోజూ గుర్తొస్తుందన్నారు. మీరు చేసిన ప్రతీపనికి.. అలాగే మీకు నిరంతరం ప్రేమను, మద్దతు అందిస్తున్న ప్రేక్షకులకు నేను కృతజ్ఞురాడిని అంటూ ట్వీట్ చేశారు. మీ ప్రయాణం మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని.. సినిమా రంగంలో 50 ఏళ్లు అద్భుతమైన వేడుకను జరుపుకునే ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నానని పోస్ట్ చేశారు.మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 48 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన హీరోగా రిలీజైన తొలి సినిమా ప్రాణం ఖరీదు. ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. అభిమానుల ప్రేమ, మద్దతు వల్లే తాను ఈ రోజు ఇక్కడున్నాని చిరు భావోద్వేగానికి గురయ్యారు. మీరంతా ఎప్పటికీ కలిసుండాలని తన అభిమానులకు సూచించారు. 48 years since you began your journey in cinema, Nanna ❤️Every day, we think of that day that changed everything for you and our family. I am grateful for everything you have done and to the audience for the constant love and support they have given you.Your journey will… https://t.co/C8DMJ4L4Vp— Ram Charan (@AlwaysRamCharan) September 23, 2026 -
ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఎవరో తెలుసా?
ఎవరికైనా సరే చిన్నప్పటి రోజులు మళ్లీ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఎలాంటి కల్లాకపటం లేని ఆ పసిపిల్లాడిగా ఉన్న రోజులు మన జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు. ఆ రోజులు ఎలాగు తిరిగిరావని మనందరికీ తెలుసు.. కానీ చిన్ననాటి జ్ఞాపకాలు మన కళ్లముందు కనిపిస్తే ఎలా ఉంటుంది. బాల్యంలోని అరుదైన ఫోటోలు దొరికితే మన ఆనందానికి అవధులుండవు. మన జీవితంలో అన్నింటికీ మించిన అమూల్యమైన దశ మన బాల్యం. అందుకే ఆ రోజులంటే మనకు చాలా ఇష్టం. ఆ రోజుల నాటి ఫోటోలు కనిపిస్తే ఇప్పుడు ఆగుతామా? వెంటనే సోషల్ మీడియాలో పెట్టేస్తాం. తాజాగా మన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా అదే పనిచేశాడు. రెండు జడలతో క్యూట్‌గా ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు. ది ప్యారడైజ్ రిలీజ్ వేళ ఆ ఫోటో మరింత స్పెషల్‌గా మారింది. తాజాగా ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన చిన్ననాటి ఫోటోను ఆయన షేర్ చేశారు. రెండు జడలతో క్యూట్‌గా పిక్‌ను పంచుకున్నారు. జడల్ పుట్టుక, పోరాటం కల్పితం కావచ్చు... కానీ అతని జడలు, రూపం నా చిన్ననాటి నుండి ప్రేరణ పొందాయి... నేను పెరిగేకొద్దీ ఈ సినిమాలో చాలా సన్నివేశాలు నా చిన్ననాటి జ్ఞాపకాలతో ప్రభావితమయ్యాయని రాసుకొచ్చారు. నాకు ఐదారు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అమ్మ జడలు వేసి కట్టేది... నేను పెద్దయ్యాక.. కమర్షియల్ సినిమాలో 70ఎంఎం తెరపై జడలతో ఒక హీరో ఎలా కనిపిస్తాడో అని ఎప్పుడూ ఊహించుకునేవాడిని... ఇక ఇప్పుడు జడల్తో ఉన్న నా హీరో నాని అన్నను మీకు పరిచయం చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఈ ఫోటో కేవలం నా చిన్ననాటిది కాదు.. ఈ చిత్రం నా ప్యారడైజ్.. మీ అందరికీ ది ప్యారడైజ్‌లోకి స్వాగతం అంటూ పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Jadal's birth and battle might be fictional...but his braids & look were inspired from my childhood... Alot of the scenes in the film are influenced by my childhood as i grew up...Amma❤️ used to grow and tie Jadal until i turned 5 or 6 years... and as i grew older i always… pic.twitter.com/ZRs2ieAs0W— Srikanth Odela (@odela_srikanth) September 23, 2026 -
పోలీసులకు జానీ మాస్టర్ భార్య ఫిర్యాదు
కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ భార్య సుమలత పోలీసులను ఆశ్రయించారు. తనపై కొందరు డ్యాన్సర్లు దాడికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ బంజారాహిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘు మాస్టర్ తరఫున లేడీ డాన్సర్స్ తనను కొట్టారని ఫిర్యాదులో పేర్కొంది. అయితే మినిట్స్ బుక్ విషయంలో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. సుమలత దౌర్జన్యంగా మినిట్స్ బుక్ లాక్కోవడంతో అడ్డుకున్నామని రఘు మాస్టర్ వర్గం లేడీ డాన్సర్స్ చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కాగా.. ఇవాళ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సుమలత కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఆమెకు మెజారిటీ డ్యాన్సర్స్ మద్దతు లేకపోవడంతో సుమలత వర్గాన్ని తొలగించారు. దీంతో తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా సుమలత తన పదవిని కోల్పోయింది. ఈ నిర్ణయంతో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.సుమలత, రఘు మాస్టర్ సభ్యులతో ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశమైంది. ఈ మీటింగ్‌కు మొత్తం 225 మంది డాన్సర్స్ హాజరయ్యారు. ఈ భేటీలో సుమలతకు కేవలం 11 మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. రఘు మాస్టర్‌కు 214 మంది మద్దతు ప్రకటించడంతో సుమలత కార్యవర్గాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చేనెల అక్టోబర్ 11న డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని సమావేశంలో వెల్లడించారు. -
‘ది ప్యారడైజ్’ మూవీ ఫస్ట్ రివ్యూ: ఆ సీన్లకు థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
‘ది ప్యారడైజ్’.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి స్పందన రావడంతో పాటు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రిమియర్స్పడబోతున్నాయి. అసలు ఈ సినిమా కథేంటి? సెన్సార్ సభ్యులను సైతం భయపట్టిన సన్నివేశాలు ఏంటి? ఇప్పటివరకు ఈ సినిమా గురించి బయటకు వచ్చిన టాక్ ఎలా ఉంది? ఫస్ట్రివ్యూలో చూద్దాం.సెన్సార్ టాక్.. ఈ చిత్రానికి సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. తీవ్రమైన రక్తపాతం, రా అండ్ రస్టిక్ యాక్షన్ దృశ్యాల కారణంగా 18 ఏళ్ల పైబడిన వాళ్లు మాత్రమే సినిమా చూడాలంటే ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. నాని సైతం ఈ సినిమాకు చిన్న పిల్లలను తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశాడు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో వయెలెన్స్ ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. సినిమా మొత్తం చూసి సెన్సార్ సభ్యులు ఈ మధ్యకాలంలో ఇలాంటి వయెలెన్స్ చిత్రం చూడలేదని చెప్పారట. మొత్తం 21 మార్పులు సూచించారట. అలాగే కొన్ని అభ్యంతరకరమైన డైలాగులను మ్యూట్ చేశారు. సెన్సార్ తర్వాత ఈ సినిమా రన్ టైమ్ 2.45 గంటలకు ఫైనల్ చేశారు. (చదవండి: ‘ది ప్యారడైజ్’కి పెట్టింది ఎంత? రావాల్సింది ఎంత?)ప్యారడైజ్ కథేంటి?ఇప్పటివరకు వచ్చిన టాక్ ప్రకారం.. ఈ సినిమా కథ ఇలా సాగుతుందట. 1984 కాలంలో సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ పరిసర ప్రాంతల్లో నివసించే సంచార జాతీ సవారీలకు గుర్తింపు ఉండదు. వాళ్లు అసలు జనాభ లెక్కల్లో ఉండరు. అలా బాగా అణచివేతకు గురైన సవారీల జాతికి చెందిన యువకుడే జడల్ జమానా(నాని). మొదట్లో అందరిలా బతికే జడల్.. శికంజ మాలిక్(మోహన్ బాబు), అతని కొడుకు(రాఘవ్ జుయల్) తన జాతిపట్ల చూపించే వివక్షను తట్టుకోలేక ఎదురు తిరుగుతాడు. తన జాతి గుర్తింపు కోసం జడల్ చేసిన పోరాటం ఏంటి? అణచివేతకు గురైన ఒక సమూహానికి, ఒక నియంతృత్వ శక్తికి మధ్య జరిగే సుదీర్ఘ పోరాటమే ఈ సినిమా మిగతా కథ.హైలెట్స్ ఇవే!ఈ సినిమా సినిమా ప్రధానంగా నాలుగు భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయట. అవి సినిమాకే హైలెట్ అని చిత్రబృందం చెబుతోంది. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే ఊహించని విధంగా ఉంటుందట. కథ ప్రారంభం అయినా కాసేపటికే అందరూ ప్యారడైజ్ ప్రపంచంలోకి వెళ్లడం ఖాయం అంటున్నారు. ఇక చివరి 40 నిమిషాలు అయితే మరింత ఆసక్తికరంగా సాగుతుందట. భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు చాలా సర్ప్రైజులు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. (చదవండి: ది ప్యారడైజ్.. నాని, మోహన్ బాబు, కీర్తి సురేశ్.. పారితోషికం ఎంతెంత?)నాని కెరీర్ బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఇచ్చాడట. అలాగే అనిరుధ్ బీజీఎం అదరగొట్టేసినట్లు తెలుస్తోంది. యాక్షన్ మాత్రమే కాదు ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయట. సినిమా పూర్తయిన తర్వాత బరువైన హృదయంతో బయటకు వస్తారట. ఇక వయెలెన్స్ విషయానికొస్తే..ఇంతకు ముందు తెలుగు తెరపై చూడని భయంకరమైన సన్నివేశాలు ఉన్నాయట. సలసలకాగే ఆయిల్ లో పడి కాలడం, మహిళలతో బలవంతంగా బట్టలు విప్పించడం మహిళలను వేలంలో అమ్మడం.. నాని తనకి తాను దిష్టి తీసుకునే క్రమంలో శరీరం అంతా రక్తసిక్తం కావడం లాంటి సన్నివేశాలు స్ర్కీన్‌పై చూస్తుంటే కాస్త ఇబ్బందిగా, భయంకరంగానే ఉంటాయట. (చదవండి: ది ప్యారడైజ్ మూవీ స్పెషల్.. థియేటర్స్‌లో సర్వపిండి!)తల్లి, కొడుకు ఎమోషన్ ఈ సినిమాకు మరో ప్రధాన బలమని చెబుతున్నారు. మొత్తంగా ఇప్పటివరకు వచ్చిన టాక్ అయితే సినిమా హిట్ అన్నట్లుగానే ఉంది. మరి ఇందులో నిజమెంత? ఈ వయెలెంట్ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. -
జానీమాస్టర్ భార్యకు షాక్..!
టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ భార్య సుమలత కార్యవర్గాన్ని రద్దు చేసింది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా సుమలత తన పదవిని కోల్పోయింది. ఈ నిర్ణయంతో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ సుమలత, రఘు మాస్టర్ సభ్యులతో ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశమైంది. ఈ మీటింగ్‌కు మొత్తం 225 మంది డాన్సర్స్ హాజరయ్యారు. ఈ భేటీలో సుమలతకు కేవలం 11 మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. రఘు మాస్టర్‌కు 214 మంది మద్దతు ప్రకటించడంతో సుమలత కార్యవర్గాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చేనెల అక్టోబర్ 11న డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని సమావేశంలో వెల్లడించారు. -
‘ది ప్యారడైజ్’కి పెట్టింది ఎంత? రావాల్సింది ఎంత?
మరికొన్ని గంటల్లో(సెప్టెంబర్ 24 రిలీజ్..23న ప్రీమియర్స్) ది ప్యారడైజ్ మూవీ థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు వచ్చినంత హైప్ ..మరే చిత్రానికి రాలేదు. ప్రమోషన్స్ కోసం వదిలిన ప్రతి కంటెంట్ సూపర్ హిట్ అయింది. అందుకే ఈ చిత్రానికి ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు అయిన ఖర్చు ఎంత? ఇప్పటివరకు వచ్చింది ఎంత?నాని కెరీర్లో అత్యధిక బడ్జెట్.. సినిమా సినిమాకి బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నాడు నాని. ‘దసరా’కి రూ.70 కోట్లకు పైగా ఖర్చు అయింది. అప్పటివరకు అదే అత్యధిక బడ్జెట్.. ఆ తర్వాత సరిపోదా శనివారం, హిట్ 3.. ఇలా వరుసగా బడ్జెట్ పెంచుకుంటూనే వస్తున్నాడు. ఇక ప్యారడైజ్‌కి అయితే ఆయన రేంజ్‌కి మించిన బడ్జెట్ పెట్టారు. ఈ సినిమాకు రూ. 150 కోట్లకు పైగా ఖర్చు చేశారట నిర్మాత సుధాకర్ చెరుకూరి. ముందుగా అనుకున్న బడ్జెట్‌కి మించి ఖర్చు చేశారట. అయినా కూడా నిర్మాత హ్యాపీగానే ఉన్నాడు. మీడియాతో మాట్లాడుతూ..వాయిదా పడినా.. ఖర్చు పెరిగినా ఏమాత్రం భయపడలేదని చెప్పాడు.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా.. రెమ్యునరేషన్ ఎవరికెంత?)నాన్ థియేట్రికల్ రైట్స్ ఎంతంటే..?ఈ సినిమాకు ముందుగానే బిజినెస్ అయింది. నాన్ థ్రియేట్రికల్ రైట్స్ కింద మొత్తంగా రూ. 80-100 కోట్ల వరకు నిర్మాతకు వచ్చాయట. అందులో ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ నుంచే రూ. 50 కోట్ల వరకు ఉన్నాయట. నెట్‌ఫ్లిక్స్ ఈ భారీ మొత్తం చెల్లించి ఓటీటీ రైట్స్ దక్కించుకుంది. ఇక ఆడియో రైట్స్ కింద రూ. 15 కోట్ల వరకు వచ్చింది. ఈ మొత్తం ఒక్క ఆయా షేర్ పాట నుంచే సదరు ఆడియో కంపెనీకి వచ్చిందట. అలాగే ఓవర్సీస్లోనూ మంచి బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఆడియో, శాటిలైట్, ఓటీటీ..ఇలా మొత్తంగా రూ. 100 కోట్ల వరకు నిర్మాతకు వచ్చినట్లు తెలుస్తోంది.థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రే ఈవెన్ టార్గెట్ ఎంత?ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ నాని కెరీర్లోనే అత్యధికంగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 75 కోట్లకు పైగా అమ్ముడవగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ. 100 కోట్ల మేర జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే భారీగానే వసూలు చేయాలి. బయ్యర్లు పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే (బ్రేక్ ఈవెన్) సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వరకు షేర్ వసూలు చేయాలి. గ్రాస్ రూపంలో చెప్పాలంటే ఇది సుమారు రూ.200 కోట్లకు సమానం. సినిమాకు వచ్చిన బజ్‌ని బట్టి చూస్తే.. తొలి రోజు రూ. 60 కోట్లకు వరకు వసూలు చేసే అవకాశం ఉంది. హిట్ టాక్ వస్తే మాత్రం తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ది ప్యారడైజ్.. అదే జరిగితే నాని కెరీర్లోనే బెస్ట్..!
నాని హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఈ రోజు సాయంత్రం నుంచే థియేటర్లలో అలరించనుంది. స్పెషల్ ప్రీమియర్ షోలతో జడల్ జమానా షురూ కానుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ క్రేజ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. మొదటి రోజు రూ. 18.16 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఈ మూవీకి 6,849 షోలతో దాదాపు 8.50 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లో తెలంగాణలో రూ. 9.14 కోట్లు కాగా.. ఆంధ్రప్రదేశ్ రూ.5.63 కోట్లు, కర్ణాటక రూ.2.01 కోట్లు, తమిళనాడు రూ.68.54 లక్షలు, మహారాష్ట్ర రూ. 20.61 లక్షలు సాధించింది.ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ శాక్నిల్క్ డేటా ప్రకారం ఈ మూవీ మొదటి రోజే రూ.60 కోట్లకు గ్రాస్ పైగా వసూళ్లు సాధిస్తుందని అంచనా వేసింది. ఇదే జరిగితే నాని కెరీర్లోనే ది బెస్ట్ ఓపెనింగ్ వసూళ్లు సాధించిన చిత్రంగా ది ప్యారడైజ్ నిలవనుంది. నాని సినిమాల మొదటి రోజు వసూళ్లుసరిపోదా శనివారం- రూ.24.11 కోట్లుదసరా- రూ.38 కోట్లుహిట్: ది థర్డ్ కేస్- రూ.43 కోట్లుది ప్యారడైజ్- రూ.50-60 కోట్లు(అంచనా) -
‘ది ప్యారడైజ్’ మూవీ స్పెషల్.. ఇంటర్వెల్లో సర్వపిండి!
సినిమా థియేటర్‌కు వెళ్లామంటే ఇంటర్వెల్లో పాప్‌కార్న్, సమోసా తినడం చాలామందికి అలవాటే. రేట్లు కాస్త ఎక్కువగా ఉన్నా.. సినిమా మధ్యలో ఏదో ఒకటి కొనుక్కుని తినాల్సిందే. ఇన్నాళ్లూ థియేటర్ అంటే పాప్‌కార్న్, సమోసాలే గుర్తొచ్చేవి. ఇకపై ఆ జాబితాలో తెలంగాణ సంప్రదాయ వంటకం సర్వపిండి కూడా చేరబోతోంది. నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా సందర్భంగా మైత్రీ థియేటర్స్ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా.. అసలైన స్థానిక రుచిని సింగిల్ స్క్రీన్ థియేటర్ల క్యాంటీన్లలోకి తీసుకొచ్చింది. దీంతో సినిమా చూడటంతో పాటు తెలంగాణ సంప్రదాయ రుచిని ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది.(చదవండి: 'ప్యారడైజ్' సినిమా.. కొడితే కుంభస్థలం లేదంటే మాత్రం?)హైదరాబాద్‌లోని మైత్రీ విమల్, మైత్రీ శివగంగ థియేటర్స్‌లో సర్వపిండిని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. స్థానిక వంటకాలకు పెద్దపీట వేస్తూ మైత్రీ థియేటర్స్ తీసుకున్న ఈ నిర్ణయం సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని పంచుతోంది.ఇక ప్యారడైజ్ సినిమా విషయానికొస్తే.. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ో తెరకెక్కిన చిత్రమిది. కయాదు లోహర్ హీరోయిన్‌ా నటించగా..మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజు ముందుగానే అంటే సెప్టెంబర్23 ప్రీమియర్స్ షోలు పడనున్నాయి. Bringing the Taste of Telangana to Your Favourite Single Screens! ❤️🔥Mythri Theatres brings Telangana’s much-loved Sarvapindi to Mythri Vimal & Mythri Shiva Ganga, making it a special part of the interval experience for #TheParadise. 🌾❤️ pic.twitter.com/Xa2YhB8GUj— Mythri Theatres (@MythriTheatre) September 23, 2026 -
'ప్యారడైజ్'.. నాని కోరిక తీరడం కష్టమే
నాని హీరోగా చేసిన 'ప్యారడైజ్' సినిమా.. బుధవారం(సెప్టెంబరు 23) సాయంత్రం ప్రీమియర్లతో రిలీజ్ కానుంది. అయితే తన చిత్ర ప్రీమియర్ షోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని థియేటర్లో అభిమానులతో కలిసి చూడాలనుకుంటున్నానని.. ఈ మేరకు తనకు అనుమతి కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పోలీసులని ఉద్దేశించి ట్విటర్లో విజ్ఞప్తి చేశాడు.(ఇదీ చదవండి: నిజానికి మోసపోయింది నేనే: నటి అంబిక)అయితే ప్రీమియర్ సందర్భంగా అవసరమైన అన్ని భద్రతా నిబంధనలు, ప్రోటోకాల్స్ పూర్తిగా పాటిస్తామని నాని స్పష్టం చేశాడు. ఈ విషయంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. చిత్ర బృందం సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెట్టుకోవాలని.. ప్రజల భద్రత, జనసమూహ నియంత్రణని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.ఇక రేవంత్ రెడ్డి ట్వీట్‌పై స్పందించిన హైదరాబాద్ సిటీ కమీషనర్ సీవీ ఆనంద్.. ప్రస్తుతం గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ పరిసర ప్రాంతాల్లో భారీగా వాహనాలు, ప్రజల రద్దీ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో విగ్రహాల నిమజ్జనం జరుగుతున్నందున, అదనపు పోలీసు బలగాలని ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా అనే అంశంపై హైదరాబాద్ నగర పోలీసులతో సంప్రదించాల్సి ఉందన్నారు. గతంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనని ఈ సందర్భంగా ప్రస్తావించారు.దీనిపై స్పందించిన నాని.. గణేష్ నిమజ్జన ఏర్పాట్ల ప్రాధాన్యతని తాము పూర్తిగా అర్థం చేసుకున్నామని.. పోలీసు శాఖపై ఎలాంటి అదనపు భారం పడటం లేదా ప్రజలకు అసౌకర్యం కలగడం తమ ఉద్దేశం కాదని అన్నాడు. పోలీసు శాఖ తుది నిర్ణయాన్ని తాము పూర్తిగా గౌరవిస్తామని స్పష్టం చేశాడు. భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటే, పరిస్థితిని అర్థం చేసుకుని ప్రీమియర్‌కు రాకపోవడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. చూస్తుంటే ప్రీమియర్ల బంతి పోలీసులు చేతిలో ఉంది. ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే నాని కోరిక నెరవేరడం కష్టమే.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా.. కొడితే కుంభస్థలం లేదంటే మాత్రం?)Thank you for your prompt response, Hon’ble Chief Minister @revanth_anumula Garu.We completely understand the importance of public safety, especially with the Ganesh Nimarjanam arrangements. We would not want to add any burden to the police department or cause any inconvenience… https://t.co/AoDTphdFuO— Nani (@NameisNani) September 23, 2026 -
'ప్యారడైజ్' సినిమా.. కొడితే కుంభస్థలం లేదంటే మాత్రం?
హీరో నాని.. పక్కా ప్లానింగ్‌తో ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేవాడు. అలాంటి ఇతడి ప్లానింగ్‌ని డిస్ట్రబ్ చేసిన మూవీ 'ప్యారడైజ్'. ఇతడితో గతంలో 'దసరా' మూవీ చేసిన శ్రీకాంత్ ఓదెల దీనికి దర్శకుడు. ఇప్పటికే మార్చి, ఆగస్టులో వస్తుందని చెప్పి వాయిదాలు వేశారు. ఈసారి అలాంటిదేం లేకుండా ఎలాగైనా సరే థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ 'ప్యారడైజ్'.. నానితో పాటు మిగతా వాళ్లకు ఎందుకంత కీలకం? అసలు జనాలు దీని గురించి ఏమనుకుంటున్నారు?నాని చాలావరకు కొత్త దర్శకులతోనే కలిసి పనిచేస్తుంటాడు. అలా సుకుమార్ సహాయకుడు శ్రీకాంత్ ఓదెలకు అవకాశమిచ్చి 'దసరా' చేశాడు. మాస్ లుక్‌లో నాని ఆకట్టుకున్నాడు. ఇది మరీ సూపర్ మూవీ అనిపించుకోలేదు గానీ కాస్త డిఫరెంట్‌గా ఆకట్టుకుంది. మళ్లీ ఇదే దర్శకుడితో నాని కలిసి పనిచేస్తున్నాడనేసరికి ఏంటా అంత నమ్మకం అని మాట్లాడుకున్నారు. సరిగ్గా అలాంటి టైంలో 'ప్యారడైజ్' గ్లింప్స్ వదిలారు. ఇది చూసి అంతా షాకయ్యారు.(ఇదీ చదవండి: నిజానికి మోసపోయింది నేనే: నటి అంబిక)రెండు జడలతో నాని లుక్, కాకుల రిఫరెన్స్, డార్క్ విజువల్స్, అనిరుధ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇలా గ్లింప్స్ దెబ్బకు ఒక్కసారిగా 'ప్యారడైజ్'పై బీభత్సమైన హైప్ ఏర్పడింది. ఇదంతా ఏడాది క్రితం అంటే గతేడాది మార్చి టైంలో జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత అంటే ఈ ఏడాది మార్చి 26న సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఘనంగా ప్రకటించారు. కానీ ఫెర్ఫెక్షన్ కోసం శ్రీకాంత్ ఓదెల పట్టుబట్టడం లాంటి వాటితో షూటింగ్ ఆలస్యమైంది. అనుకున్న టైంకి రిలీజ్ కాలేదు. కట్ చేస్తే ఆగస్టు 21న అని మరోసారి ప్రకటించారు. ఈ తేదీని కూడా అందుకోలేక మళ్లీ వాయిదా వేశారు.ఫైనల్‌గా సెప్టెంబరు 24న 'ప్యారడైజ్' మూవీ థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. ఈసారి కూడా రిలీజ్ కష్టమే అనే మాటలు వినిపించాయి. కానీ చివరి నిమిషం రీషూట్స్ లాంటివి ఓ పక్క చేస్తూనే మరోవైపు మూవీ ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. ఈ కారణంగా ట్రైలర్ ఏం రిలీజ్ చేయలేదు. కానీ ఆయా షేర్, యేషనాగుల పాటలు బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో కావాల్సినంత హైప్ అయితే ఉంది. కంటెంట్‌తో మెప్పించడమే ఇక మిగిలుంది.సినిమా మొదలైనప్పుడు ఏకంగా 8 భాషల్లో రిలీజ్ ఉంటుందని ఘనంగా ప్రకటించుకున్నారు. కానీ వాయిదాల కారణమో ఇంకేంటో తెలీదు గానీ ప్రస్తుతానికైతే తెలుగులో తప్పితే మిగతా చోట్ల పెద్దగా బజ్ లేదు. అయినా సరే బెంగళూరు, ముంబై, కొచ్చీ అని తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు. టీమ్ అంతా తెగ కష్టపడుతున్నారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న స్టార్ డైరెక్టర్ కూతురు)ఇప్పటివరకు నాని అంటే మిడ్ రేంజ్ సినిమాలు చేసే హీరోగానే పేరుంది. ఇప్పుడొచ్చే 'ప్యారడైజ్' గనక బ్లాక్‌బస్టర్ హిట్ అయితే ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలున్న టాప్ లీగ్‌లోకి వెళ్లే అవకాశముంటుంది. బుధవారం (సెప్టెంబరు 23) సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా పడే ప్రీమియర్లతో నాని భవితవ్యం ఏంటనేది తెలుస్తుంది. గురువారం(సెప్టెంబరు 24) నుంచి రెగ్యులర్ షోలు ప్రదర్శితం కానున్నాయి.'దసరా'తో హిందీలోనూ కొంత మార్కెట్ ఏర్పరుచుకున్న నాని.. 'ప్యారడైజ్'తో దాన్ని నిలబెట్టుకోవాలి లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. అలానే ఇప్పటివరకు నాని కెరీర్లో వచ్చిన చిత్రాలన్నింటికీ బడ్జెట్ అదుపులో ఉండేది. 'ప్యారడైజ్'కి మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువే పెట్టేశారు. ఈ మూవీకి లాభాలు రావాలంటే బీభత్సమైన టాక్ వచ్చి థియేటర్లు రెండు మూడు వారాలైనా కళకళాలాడిపోవాలి. మరి అలా జరుగుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురుచూడాలి?(ఇదీ చదవండి: నాని స్పెషల్ రిక్వెస్ట్‌కు స్పందించిన సీఎం రేవంత్) -
జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో గూస్ బంప్స్ మూమెంట్
గుజరాత్లో మంగళవారం జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. ఎంతోమంది సినీ ప్రముఖులు, తారలు అవార్డు విజేతల జాబితాలో ఉన్నప్పటికీ కేవలం మూడే మూడు సందర్భాల్లో అవార్డు విజేతలు ముగ్గురికీ సభికులు తమంతట తాముగా గౌరవ సూచకంగా లేచి నిలబడి మరీ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.తరగని మమ్ముట్టి క్రేజ్యాభై సంవత్సరాల సుదీర్ఘ సినీ జీవితంతో వివిధ భాషల సినీ ప్రేమికులను అలరించిన కన్నడ నటుడు అనంత నాగ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తున్న సంగతి వేదికపై నుంచి ప్రస్తావించినప్పుడు ముందు వరుసల్లోని అవార్డు విజేతలతో సహా సభాంగణంలోని అందరూ లేచి నిలబడి, స్టాడింగ్ ఒవేషన్ ఇచ్చారు.ఇదీ చదవండి: ఎక్కువ సినిమాలు చేయడం సక్సెస్ కాదు: హీరోయిన్ నిధి అగర్వాల్జాతీయ ఉత్తమ నటుడిగా మలయాళ నటుడు మమ్మూట్టి (చిత్రం - భ్రమయుగం) పేరును ప్రకటించి, వేదికపై ఆహ్వానించినప్పుడు సభా ప్రాంగణంలో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఇప్పటికి కెరీర్లో నాలుగోసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకుంటున్న మమ్ముట్టిని సినీ ప్రియులు ఎంతగా అభిమానించారంటే, అప్రయత్నంగా అందరూ లేచి నిలబడి, కరతాళ ధ్వనులు చేశారు. జాతీయ స్థాయిలో మమ్మట్టికి ఉన్న ప్రత్యేక ఆకర్షణకు ఇదో ఉదాహరణ.అంధ గాయనికి అసాధారణ గౌరవందేశవ్యాప్తంగా మిగతా ఇద్దరు దిగ్గజాలలాగా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు లేనప్పటికీ, అరుదైన ఆ గౌరవం అందుకున్న ఆ అవార్డు విజేత వేరెవరో కాదు దృష్టిలోపం ఉన్న అత్యద్భుత మలయాళ గాయని వైకోమ్ విజయలక్ష్మి. ‘ఏ.ఆర్.ఎం.’లో పాడిన ‘అంగు వాన కోనిలు…’ పాటకు గాను ఆమె జాతీయ ఉత్తమ సినీ నేపథ్య గాయనిగా ఎంపికయ్యారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వ సినీ పురస్కారాలతో సహా ఇప్పటికే పలు అవార్డులు గెలుచుకున్న ఈమెకు ఇదే తొలి జాతీయ అవార్డు.ఇదీ చదవండి: నిజానికి మోసపోయింది నేనే: నటి అంబికసినిమా కోసం వైకోమ్ విజయలక్ష్మి పాడిన పాటను తెరపై చూపుతూ, కంటిచూపు లోపం ఉన్న ఆమెను సహాయకులు వేదిక మీదకు తీసుకు వస్తుండగా… ప్రేక్షకులు స్వచ్ఛందంగా తమకు తాము లేచి నిలబడి మరీ, ఆగకుండా నిమిషం పాటు కరతాళ ధ్వనులు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రపతి సైతం ఆ గాయనీమణిని అక్కున చేర్చుకొని, మరీ అవార్డు అందించడం, ప్రత్యేకంగా అభినందనలు చెప్పడంతో సభికుల మనసు ఆర్ద్రమైంది.అతి సామాన్యురాలైనప్పటికీ, చెదరని ఆత్మ విశ్వాసంతో అంగ వైకల్యాన్ని జయించి, ప్రపంచానికి తన సత్తా చాటిన వైకోమ్ విజయలక్ష్మికి గుజరాత్ లాంటి సుదూర ప్రాంతంలో జనమంతా లేచి నిలబడి, అభినందన పూర్వక కరతాళ ధ్వనులు చేయడం అసాధారణ అంశం. - గుజరాత్‌లోని ఏక్తానగర్ నుంచి ఆర్. జయRenowned singer #VaikomVijayalakshmi receives the prestigious #NationalFilmAward for #BestFemalePlaybackSinger from the Hon'ble President of India, Smt. Droupadi Murmu, to a heartfelt standing ovation from the audience at the #72ndNationalFilmAwards ceremony! 🌟@nfdcindia pic.twitter.com/1diDs4Me7Q— PIB in KERALAM (@PIBTvpm) September 22, 2026 -
నాపై ఇంతటి ప్రేమని ఊహించలేదు: ఫాహద్ ఫాజిల్
‘‘తెలుగు వారి నుంచి నాకు ఇంత ప్రేమ వస్తుందని, ప్రత్యేకించి హైదరాబాద్‌లో నాపై ఇంతటి ప్రేమ దొరకుతుందనుకోలేదు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. కార్తికేయ, శోభుగారు గొప్ప నిర్మాతలు. ఈ చిత్రం నాకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది. ఈ సినిమాని కుటుంబంతో కలిసి చూడండి.. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అని ఫాహద్ ఫాజిల్ చెప్పారు.శశాంక్ యేలేటి దర్శకత్వంలో ఫాహద్ ఫాజిల్ హీరోగా, బేబి సారా, సౌరభ్ సచ్దేవ్ ఇతర పాత్రలుపోషించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించిన ఈ సినిమాని అక్టోబరు 2న రిలీజ్ అవుతోంది. మంగళవారం నిర్వహించిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు శశాంక్ యేలేటి మాట్లాడుతూ– ‘‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ట్రైలర్ అందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. మా మూవీ చాలా కొత్తగా ఉంటుంది’’ అని తెలిపారు. శోభు యార్లగడ్డ మాట్లాడుతూ– ‘‘ఫాహద్‌ని తెలుగులో హీరోగా పరిచయం చేస్తుండటం హ్యాపీ. అలాగే శశాంక్ని ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం.సారాని చూసి అందరూ సర్ప్రైజ్ అవుతారు’’ అని పేర్కొన్నారు. ‘‘శోభుగారితో ప్రయాణం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. మా సినిమాని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ఎస్ఎస్ కార్తికేయ తెలిపారు. ‘‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో వచ్చి మా మూవీ చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు బేబి సారా. -
ఇరుముడి స్థాయిలో తెల్లకాగితం హిట్ అవుతుంది: కోన వెంకట్
హర్ష్ రోషన్ , నక్షత్ర జంటగా నటించిన సినిమా ‘తెల్లకాగితం’. నందు సవిరిగాన కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ సినిమాకు రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. కె. శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స పతాకంపై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హీరో సాయిదుర్గా తేజ్, దర్శక–నిర్మాత హరీష్ శంకర్, రచయిత కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘రోషన్ మంచి సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ ఉంటాడు. నందు అద్భుతమైన రైటర్. ఇలానే మంచి కథల్ని రాస్తూ ఉండు అని నందుకి చెబుతూనే ఉంటాను. నేల మీద నడిచే కథ ఇది. ‘ఇరుముడి’ స్థాయిలో ఈ చిత్రం హిట్ అవుతుంది. ఈ సినిమాతో దర్శక–నిర్మాతలకు మంచి విజయం లభించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. మరో అతిథి సాయిదుర్గా తేజ్ మాట్లాడుతూ– ‘‘తెల్ల కాగితం’ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ చూసి, పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు. ‘‘తెల్లకాగితం’ సినిమా రోషన్‌కి ఓ మైల్స్టోన్ మూవీగా నిలిచిపోవాలి. ఈ బ్యానర్లో నేను ఓ సినిమా చేస్తాను’’ అని తెలిపారు హరీష్ శంకర్. ‘‘తెలిసీ తెలియని ఒక వయసులో చేసే తప్పుల్ని ఆధారంగా చేసుకుని, ‘తెల్ల కాగితం’ సినిమాని తీశాం’’ అని చెప్పారు హర్ష్ రోషన్ . ‘‘మీ (ఆడియన్స్) లైఫ్, మీరు చేసిన తప్పులు, మీరు చెప్పుకోలేని వన్నీ ‘తెల్లకాగితం’ సినిమాలో ఉంటాయి. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు దర్శకుడు రమేష్ బండ్రెడ్డి. ‘‘తెల్లకాగితం’ సినిమా రిలీజ్‌కు ముందు చిన్న సినిమా. రిలీజ్ అయ్యాక పెద్ద చిత్రం అవుతుంది’’ అని చె΄్పారు రైటర్ నందు. ‘‘ఈ చిత్రంలో ఆశ అనే పాత్రలో నటించాను. అమాయకత్వంతో కూడిన ఇలాంటి మంచి పాత్ర ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుంది’’ అని పేర్కొన్నారు నక్షత్ర. -
రాత్రివేళ యాక్షన్
రామ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘రాపో 23’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణపోతినేని ఈ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్తయింది. ముఖ్యంగా రాత్రివేళ సాగే యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించారు మేకర్స్. ‘‘ఏకంగా ఒక కిలోమీటర్ మేర విస్తరించిన భారీ స్ట్రెచ్‌లో ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు.యాక్షన్ కొరియోగ్రాఫర్ కెవిన్ మాస్టర్ ఈ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేయగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరునావుక్కరసు (తిరు) ఈ ఫైట్స్‌ను చిత్రీకరించారు. దర్శకుడిగా రామ్పోతినేని ఊహించిన ప్రత్యేకమైన విజన్‌కు అనుగుణంగా ఈ సినిమాకు డిఫరెంట్ విజువల్ టెక్స్చర్ను అంది స్తన్నారు. ఈ మూవీకి స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రోడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
ఎదురుదెబ్బల నుంచి ఎదుగుదల వరకు.. చిరు, నాని చెప్పిన సక్సెస్ సీక్రెట్స్
వ్యక్తిత్వ వికాసం గురించి పుస్తకాల్లో చదివిన విషయాలకంటే.. స్వయంగా జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల నుంచి చెప్పే మాటలకు మరింత విలువ ఉంటుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, హీరో నాని తమ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను అభిమానులతో పంచుకున్నారు.చిరంజీవి తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాని కోసం కష్టపడటం, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగడం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, అవమానాలు, ఎదురుదెబ్బలు ఎదురైనా తనపై తాను నమ్మకాన్ని కోల్పోలేదని చెప్పారు. అనుకూల పరిస్థితుల్లోనే కాదు.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడటం నేర్చుకున్నానని వెల్లడించారు. ఆయన చిరంజీవిగా తన పేరును మార్చుకొని నేటికి సరిగ్గా 48 ఏళ్లయింది. అప్పటి నుంచి ఈ 48 ఏళ్ల సుదీర్గ సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, మరెన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. తనపై విమర్శలొచ్చినప్పుడు ఎలా నిలబడాలో తెలుసుకున్నారు. అవన్నీ తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు.మరోవైపు నాని కూడా తన కెరీర్ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. మనం ఎదుగుతున్న కొద్దీ ప్రశంసించే వారితో పాటు కిందకు లాగాలని చూసేవాళ్లు కూడా ఉంటారని చెప్పారు. పెరుగుతున్న కొద్దీ నెగెటివిటీ కూడా పెరుగుతుంది. దానిని పట్టించుకోకుండా లక్ష్యం వైపు వేగంగా ముందుకు సాగాలని సూచించారు. తన కెరీర్ ప్రారంభం నుంచి నెగెటివిటీకి దూరంగానే ఉన్నాను. అలానే నా కెరీర్‌ని ఇలా నిర్మించుకున్నాను. అందరూ అలానే ఆలోచించాలని కూడా నాని అన్నారు.ఇలా ఒకే సమయంలో అటు చిరంజీవి, ఇటు నాని తమ జీవిత అనుభవాల నుంచి నేర్చుకున్న విషయాలను తమ అభిమానులతో పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరి మాటలు అభిమానుల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. -
పుష్ప మూవీ ఎఫెక్ట్.. ప్రభుత్వానికి నాని రిక్వెస్ట్
టాలీవుడ్ హీరో నాని తెలంగాణ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. ఓ సినిమా హీరోగా తాను ప్రేక్షకులతో కలిసి నా మూవీ ఆస్వాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్లో అభిమానులతో కలిసి మూవీ చూసేందుకు అనుమతించాలని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అన్ని రకాల నిబంధనలు, భద్రతా చర్యలు పాటిస్తామని హీరో ట్వీట్ చేశారు. నా అభ్యర్థనను సీఎం, సినిమాటోగ్రఫి మంత్రి పరిశీలిస్తారని ఆశిస్తున్నట్లు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజ్ సమయంలో జరిగిన సంఘటన వల్లే నాని ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అనుమతి కోరినట్లు తెలుస్తోంది. పుష్ప-2 రిలీజ్ టైమ్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా.. ఆమె కుమారుడు తేజ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఆ కుటుంబానికి అల్లు అర్జున్ అండగా నిలిచారు.నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ సినిమా రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఒకరోజు ముందుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈనెల 23న సాయంత్రం ఆరు గంటల నుంచే ది ప్యారడైజ్ హంగామా షురూ కానుంది. ప్రీమియర్ షో (సెప్టెంబర్ 23) కోసం ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లోని థియేటర్‌కు వచ్చి వీక్షించేందుకు నాని సిద్ధమవుతున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో మోహన్ బాబు, సంపూర్ణేశ్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషించారు.Hon’ble Chief Minister Shri @revanth_anumula Garu, Hon’ble Minister of Cinematography Shri @KomatireddyKVR Garu & the respected officials of @TelanganaCOPs.This is a request from a fan of cinema and, more importantly, someone who has enjoyed cinema at its very best from a very…— Nani (@NameisNani) September 22, 2026 -
పుష్పలో ఆ రోల్ నేనే చేయాల్సింది: శివాజీ ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ నటుడు శివాజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప మూవీ గురించి ఆయన మాట్లాడారు. కోర్టు మూవీ హీరో నటించిన తెల్లకాగితం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన పుష్ప సినిమా గురించి కామెంట్స్ చేశారు. ఆ మూవీలో కీలక పాత్రపై ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ పాత్ర రాసిపెట్టి ఉంటే వాళ్లకే దక్కుతుందన్నారు.పుష్ప చిత్రంలో సునీల్ పోషించిన రోల్ మొదట తనకే వచ్చిందని శివాజీ వెల్లడించారు. మంగళ శీను పాత్ర నేను చేయాల్సిందని తెలిపారు. కానీ మనం ఎంత అనుకున్నా.. విధి ఒకటి రాసి పెట్టి ఉంటుందని శివాజీ అన్నారు. అది సునీల్ ఖాతాలోకి వెళ్లాలని రాసిపెట్టి ఉందన్నారు. అందుకే సునీల్ మంగళం శీనుగా మిమ్మల్ని అలరించాడని తెలిపారు. ఆ క్యారెక్టర్లో సునీల్ అద్భుతంగా నటించారని కొనియాడారు. అలా మంగళం శ్రీను పాత్ర వెనుక ఉన్న అసలు నిజాన్ని రివీల్ చేశారు.ఈ సందర్భంగా తెల్ల కాగితం సినిమాతో తనకున్న అనుబంధాన్ని శివాజీ గుర్తుచేసుకున్నారు. రాజమండ్రి నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ తన వద్దకు వచ్చిందన్నారు. ఈ కథ వినగానే విపరీతంగా నచ్చడంతో తానే స్వయంగా నిర్మించాలని కూడా భావించినట్లు చెప్పారు. ఒక చిన్న టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మూవీ హీరో హర్ష్ రోషన్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలవాలని కోరుకుంటున్నట్లు శివాజీ తెలిపారు.పుష్ప సినిమాలో మంగళం శ్రీను క్యారెక్టర్ నేను చేయాల్సింది..- #Shivaji #Thellakaagitham #HarshRoshan #Nakshatra #Tollywood #TeluguCinema #Tupaki Follow👉@tupaki_official pic.twitter.com/6hTHPgoVp5— Tupaki (@tupaki_official) September 22, 2026 -
తిరుమలలో తెలుగు హీరోయిన్ అద్భుతమైన డ్యాన్స్
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు దర్శించుకుంటూనే ఉంటారు. అయితే తొలిసారి ఓ హీరోయిన్.. అద్భుతమైన కూచిపూడి నృత్యం చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం జరిగిన నాదనీరాజనంలో హీరోయిన్ డింపుల్ హయాతి నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.విజయవాడకు చెందిన డింపుల్.. గల్ఫ్ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత అభినేత్రి 2, గద్దలకొండ గణేశ్, యురేకా, ఖిలాడీ, రామబాణం, దిల్ మార్, భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీస్ చేసింది. అయితే వీటిలో ఏవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు పెద్దగా పేరు రాలేదు. ప్రస్తుతం శర్వానంద్ 'భోగి'లో కీలక పాత్ర చేస్తుంది. సినీ కెరీర్ పక్కనబెడితే ఈమెలో సంప్రదాయ కూచిపూడి కళాకారిణి ఉందనే సంగతి తిరుమల వేదికగా తెలిసింది. View this post on Instagram A post shared by TPT warriors (@tirupati_warriors) View this post on Instagram A post shared by Tollywood Lens (@tollywoodlens) -
నా ఫ్రెండ్ చేతిలో దారుణంగా మోసపోయా: తమన్
టాలీవుడ్ మ్యూజిక్ స్టార్ డైరెక్టర్లలో ఎస్ఎస్ తమన్ ఒకరు. తన బీజీఎంతో అభిమానులను అలరిస్తూ ఉంటారు. ముఖ్యంగా బోయపాటి సినిమాలకు తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంటారు. తన టాలెంట్‌తో తెలుగు ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ సినిమాలకు సైతం పని చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తమన్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన ఫ్రెండ్ చేతిలో దారుణంగా మోసపోయానని వెల్లడించారు.తమన్ మాట్లాడుతూ..'అల్లు అర్జున్ సరైనోడు మూవీ తర్వాత నాకు కాస్తా గ్యాప్ వచ్చింది. అదే సమయంలో నా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఆ టైమ్‌లోనే నేను ఒక ఫ్రెండ్ నమ్మి కొంత డబ్బు పెట్టుబడి పెట్టాను. చివరికీ అతను నన్ను మోసం చేశాడు. దీంతో చాలా ఇబ్బందులు పడ్డా. ఆ దెబ్బకు ఆర్థికంగా జీరోకు పడిపోయా. అప్పటిదాకా నేను సంపాదించుకున్న డబ్బులు మొత్తం పోగొట్టుకున్నా. ఆ సమయంలో నా దగ్గర బియ్యం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. కానీ అలాంటి టైమ్‌లోనే నేను పడిపోకుండా మరింత బలంగా నిలబడ్డా. ఆ పరిస్థితుల్లో మహానుభావుడు, భాగమతి, తొలిప్రేమ సినిమాల అవకాశాలు నన్ను మళ్లీ నిలబెట్టాయని' అన్నారు. కాగా.. ప్రస్తుతం తమన్.. వెంకీ- త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఆదర్శకుటుంబం చిత్రానికి సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. -
నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్
పుష్ప సినిమాలతో టాలీవుడ్లో ఓ మార్క్ క్రియేట్ చేసిన సుకుమార్ జాతీయ అవార్డ్ అందుకున్నారు. గుజరాత్‌లోని కేవాడియాలో జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. పుష్ప-2 చిత్రానికి గానూ ఉత్తమ స్క్రీన్ ప్లే(ఒరిజినల్) విభాగంలో ఈ అవార్డ్ దక్కించుకున్నారు. కమిటీ కుర్రోళ్లు చిత్రానికి గానూ నిహారిక కొణిదెల అవార్డ్ స్వీకరించారు.ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కల్కి, కమిటీ కుర్రోళ్లు, 35... చిన్న కథ కాదు, లక్కీ భాస్కర్ లాంటి తెలుగు చిత్రాలకు కూడా అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370, యామీ గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది. ఉత్తమ నటుడి కేటగిరీలో మమ్ముట్టి (మలయాళ చిత్రం: భ్రమయుగం) కార్తీక్ ఆర్యన్ (హిందీ చిత్రం: చందు ఛాంపియన్) అవార్డులు స్వీకరించారు. ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్ పెరియసామి (తమిళ చిత్రం: అమరన్), ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా రణదీప్ హూడా (హిందీ చిత్రం: స్వాతంత్య్ర వీర్ సావర్కర్), ఉత్తమ సినీ గ్రంథంగా కన్నడ పుస్తకం ‘నానిరువుడే నిమగాగి... నాడిరువుడే ననగాగి’ (రచయిత కె. ప్రదీప్ కుమార్ శెట్టి), ఉత్తమ సినీ విమర్శకుడిగా సంజీవ్ శ్రీవాస్తవ (హిందీ జర్నలిస్ట్) అవార్డులు అందుకున్నారు.72nd National awards presentation event Red carpet #sukumar #Tabithasukumar#NationalFilmAwards pic.twitter.com/baDyDljqzc— venubikki (@venubikki) September 22, 2026 -
వామికా విశ్వరూపం.. మృణాల్ చీర కడితే
గ్లామర్ విశ్వరూపం చూపించిన వామికా గబ్బిచీరకట్టులో మెరిసిపోతున్న మృణాల్ ఠాకుర్బీచ్ సైడ్ బికినీలో అదరగొట్టేసిన ప్రగ్యా జైస్వాల్చీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న ఇవానాసముద్రంలో సర్ఫింగ్ బల్లపై ప్రియా వారియర్వైట్ డ్రస్‌లో ఏంజెల్లా కేతిక శర్మ(ఇదీ చదవండి: రాత్రయితే ఆ విషయాలు మాట్లాడొద్దని నా భార్యకు చెప్పా:తమిళ హీరో) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
'డియర్ ఆస్ట్రోనాట్'.. డేవిడ్ థామస్ ఫస్ట్ లుక్
యువన్ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, మనస్విని భాగ్యరాజా సమర్పణలో కార్తీక్ భాగ్యరాజా దర్శకత్వం వహించిన సినిమా ‘డియర్ ఆస్ట్రోనాట్’. ఈ చిత్రం నుంచి గౌతమ్ మీనన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో డేవిడ్ థామస్‌గా గౌతమ్ కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి అయింది. అక్టోబర్‌లో సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.‘డియర్ ఆస్ట్రోనాట్’.. అంతరిక్షంలో ప్రయాణించాలనే ఓ యువతి కథ. చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, నక్షత్రాల మధ్య విహరించాలని కలలు కనే ఒక మహిళ స్టోరీతో దీనిని తెరకెక్కించారు. అసాధారణమైన కలని సాకారం చేసుకోవడానికి ఆమె సాగించే ప్రయాణాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించబోతున్నారు. ఆకాశాన్ని అందుకోవాలనే ఆమె ఆశయం వెనుక ఉన్న సవాళ్లు, పట్టుదల, ఆశ, భావోద్వేగాలను ఇందులో గొప్పగా చిత్రీకరించారు. -
రాజమౌళి సమర్పణ.. ఫహాద్ తెలుగు సినిమా ట్రైలర్ రిలీజ్
మలయాళ సినిమాలతో తెలుగులోనూ బోలెడంత గుర్తింపు తెచ్చుకుని 'పుష్ప' సినిమాలో విలన్‌గా చేసిన ఫహాద్ ఫాజిల్ హీరోగా చేసిన స్ట్రెయిట్ తెలుగు మూవీ 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'. శశాంక్ యేలేటి దర్శకుడు కాగా రాజమౌళి సమర్పణలో కార్తికేయ నిర్మించాడు. అక్టోబరు 02న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంటూ మూవీపై అంచనాలని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: కన్నతల్లి 'ఆవేదన'.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)అల్లావుద్దీన్ స్టైల్లో మాయలు, మంత్రాలు తెలిసిన ఓ చిన్న పాప.. హీరో జీవితంలోకి ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? అనే విషయాల్ని ట్రైలర్లో కామెడీగా చూపించారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. మరి మలయాళంలో ఇప్పటికే హిట్స్ అందుకున్న ఫహాద్‌కి తెలుగులో హీరోగా ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి?(ఇదీ చదవండి: రాత్రయితే ఆ విషయాలు మాట్లాడొద్దని నా భార్యకు చెప్పా:తమిళ హీరో) -
ఆలస్యంగా ‘ఆదర్శ కుటుంబం’.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం..AK47’ . ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 2 న రిలీజ్ చేయడానికి మేకర్స్ ముందుగానే ప్లాన్ చేశారు.దానికి తగ్గట్లుగానే రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు సడెన్‌గా విడుదల తేదిని మార్చేశారు. తొలుత ప్రకటించిన తేదీ కంటే వారం ఆలస్యంగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.ప్రేక్షకులకు సంపూర్ణ వినోదానుభూతిని అందించాలనే ఉద్దేశంతో చిత్ర విడుదలను వారం రోజుల పాటు వాయిదా వేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ.. హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో టీజర్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. #AadarshaKutumbam will be taking a little more time to deliver the entertainment and experience we have promised you. The film will now release worldwide on 9th OCT ❤️We know the wait has been a little longer than expected and we sincerely apologise for the delay 🙏First… pic.twitter.com/ydePAw6ElS— Naga Vamsi (@vamsi84) September 22, 2026 -
మగాళ్లు మెచ్యూర్ అవ్వరా?.. తెల్లకాగితం ట్రైలర్ వచ్చేసింది
కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ తెల్ల కాగితం. ఈ సినిమాకు రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నక్షత్ర హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే టీనేజ్ ప్రేమకథగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తెలిసి తెలియని వయసులో చేసే ప్రేమ వల్ల ఎలాంటి ఇబ్బందులు పడతారనే కోణంలో ఈ కథను రూపొందించినట్లు ట్రైలర్లో అర్థమవుతోంది. పాఠశాలలో మొదలైన లవ్ చివరికీ ఏమైందనేదే ఈ తెల్లకాగితం స్టోరీగా ట్రైలర్లో చూపించారు. ఒక్క చిన్న తప్పు.. తెల్లటి కాగితం లాంటి మీ జీవితాన్ని నాశనం చేస్తుంది అనే డైలాగ్ కథపై ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీమందించారు. ఈ మూవీ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. -
'ది ప్యారడైజ్‌లో సుబ్బు రోల్.. మీ మైండ్ బ్లాంకే'
నాని హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ చిత్రానికి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈనెల 23న సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలతో జడల్ జమానా షురూ కానుంది. ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించనుంది.ఈ సందర్భంగా ది ప్యారడైజ్ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది కయాదు బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన రోల్ గురించి ప్రస్తావించింది. తన పాత్రకు సంబంధించి చాలా సర్ప్రైజ్లు ఉంటాయని తెలిపింది. అవీ చూశాక ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయమని చెప్పింది. డ్రాగన్ మూవీ చూశాకే నన్ను శ్రీకాంత్ ఎంపిక చేశారని తెలిపింది. తన సుబ్బు పాత్రకు సంబంధించిన సర్ప్రైజ్లు తెరపై చూస్తేనే ఆనందిస్తారని చెప్పుకొచ్చింది. ఇది తన కెరీర్లోనే చాలా పెద్ద ప్రాజెక్ట్ అని కయాదు లోహర్ రివీల్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్ లేకుండానే ది ప్యారడైజ్ మూవీని రిలీజ్ చేయడం విశేషం. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేస్తున్నాయి. థియేటర్లలోనూ పూనకాలు తెప్పించేలా పాటలు ఉన్నాయి. -
‘ది ప్యారడైజ్’లో ‘ధూం ధూం తఃతః’ మంత్రం.. ఎవరీ దేవత?
ది ప్యారడైజ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు, రా స్టేట్మెంట్.. ఇలా ప్రమోషనల్ కంటెంట్‌లో కనిపించిన ప్రతి చిన్న అంశాన్ని అభిమానులు, నెటిజన్లు డీకోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘ది ప్యారడైజ్’లోని కాకులు, ‘ఆయా షేర్’ పాటలో వినిపించే ఓ మిస్టీరియస్ బీజీఎం మధ్య ఉన్న లింక్‌పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.ఒక్క బీజీఎంతో కథపై కొత్త చర్చ..నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ ఈ నెల 24న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఒక రోజు ముందుగానే.. అంటే సెప్టెంబర్ 23న ప్రీమియర్స్ జరగనున్నాయి. దీంతో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ‘ఆయా షేర్’ పాట ప్రమోషన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటకు మంచి స్పందన రావడంతో పాటు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు అదే పాటలో వినిపించే ‘ధూం ధూం తఃతః’ అనే బీజీఎం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.‘ధూం ధూం తఃతః’.. ధూమావతి మంత్రమేనా?‘ఆయా షేర్’ పాటలో వినిపించే ‘ధూం ధూం తఃతః’ అనే బీజీఎం.. ‘ధూం ధూం ధూమావతి తఃతః’ అనే మంత్రాన్ని పోలి ఉందంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ బీజీఎంకు, సినిమాలో కాకులకు ఇస్తున్న ప్రాధాన్యానికి ఏదైనా సంబంధం ఉందా? అనే చర్చ మొదలైంది.సినిమా ప్రమోషనల్ కంటెంట్‌లో మొదటి నుంచీ కాకులు పదేపదే కనిపిస్తున్నాయి. అంతేకాదు.. ‘ది ప్యారడైజ్’ నుంచి విడుదలైన రా స్టేట్మెంట్లోనూ కాకుల ప్రస్తావనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.‘చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాశిర్రు గానీ.. గదే జాతిల పుట్టిన కాకుల గురించి బైంగన్ బి రాయలే.. గిది కడుపుమండిన కాకుల కథ.. జమానా జమానాకెళ్లి నడిచిన శవాల కథ.. అమ్మ రొమ్ములో పాలు లేక రత్తం పోసి పెంచిన ఓ జాతి కథ..’ అనే డైలాగ్‌తో విడుదలైన ఈ రా స్టేట్మెంట్.. సినిమాలో కాకులకు ఉన్న ప్రాధాన్యంపై మరింత ఆసక్తిని పెంచింది. ఇప్పుడు ఇదే డైలాగ్‌ను ‘ఆయా షేర్’లోని ‘ధూం ధూం తఃతః’ బీజీఎంతో లింక్ చేస్తూ నెటిజన్లు తమదైన రీతిలో కథను అంచనా వేస్తున్నారు.ధూమావతి దేవికి.. కాకులకు ఉన్న సంబంధమేంటి?హిందూ తాంత్రిక సంప్రదాయంలోని దశ మహావిద్యల్లో ధూమావతి దేవిని ఏడో మహావిద్యగా పరిగణిస్తారు. ‘ధూమావతి’ అనే పేరు పొగతో కూడినది, పొగమయమైనది అనే అర్థాలను సూచిస్తుంది. ఇతర దేవతలతో పోలిస్తే ఆమె రూపం కూడా భిన్నంగా ఉంటుంది.సాధారణంగా ధూమావతి దేవిని వృద్ధ వితంతువు రూపంలో, అలంకారాలు లేకుండా, చేతిలో చాటతో ఉన్నట్లుగా చిత్రిస్తారు. ఆమెకు సంబంధించిన ప్రతీకల్లో కాకికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ధూమావతి దేవి ప్రస్తావన వచ్చినప్పుడు కాకి ప్రతీక కూడా గుర్తుకు వస్తుంది.‘ప్యారడైజ్’లోనూ అదే థీమ్నా?ఇక్కడే నెటిజన్ల థియరీ ఆసక్తికరంగా మారుతోంది. ఒకవైపు సినిమాలో కాకులకు ఇస్తున్న ప్రాధాన్యం.. మరోవైపు ‘కడుపుమండిన కాకుల కథ’ అంటూ వచ్చిన రా స్టేట్మెంట్.. దీనికి తోడు ‘ఆయా షేర్’లో వినిపించే ‘ధూం ధూం తఃతః’ బీజీఎం.. ఇవన్నీ కలిపి చూస్తే ధూమావతి దేవికి సంబంధించిన ఏదైనా ప్రతీకాత్మక అంశం సినిమాలో ఉండొచ్చా? అనే చర్చ జరుగుతోంది.ఇది నిజమైన క్లూనా?అయితే ఈ అంశాల మధ్య ఉన్న సంబంధాన్ని చిత్రబృందం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా నెటిజన్ల విశ్లేషణ, అభిమానుల థియరీగానే చూడాలి. సినిమా విడుదలైన తర్వాతే కాకులు, ధూమావతి దేవి, ‘ధూం ధూం తఃతః’ బీజీఎం మధ్య అసలు కనెక్షన్ ఏంటి? అనేది స్పష్టమవుతుంది.అయితే విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్‌లోని చిన్న చిన్న అంశాలను పట్టుకుని ప్రేక్షకులు ఇంతలా విశ్లేషణలు చేయడం మాత్రం ‘ది ప్యారడైజ్’పై ఉన్న ఆసక్తిని చెప్పకనే చెబుతోంది. నిజంగానే ఇవన్నీ కథలో భాగమా? లేక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కావాలనే ఇలాంటి క్లూస్ వదిలారా? అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.ధూమావతి దేవి ఎవరు? ధూమావతి దేవి హిందూ శాక్త సంప్రదాయంలోని దశ మహావిద్యల్లో ఏడో మహావిద్యగా ప్రసిద్ధి. సాధారణంగా ఆమెను వృద్ధురాలైన, వితంతువు రూపంలో, గుర్రాలు లేని రథంపై కూర్చున్న దేవతగా చిత్రిస్తారు. రథంపై కాకి చిహ్నం ఉండటం లేదా కొన్ని సంప్రదాయాల్లో ఆమె కాకిపై కూర్చున్నట్లుగా చూపించడం ప్రత్యేకత.‘ధూమావతి’ అనే పేరు ఎలా వచ్చింది?సంస్కృతంలోని ‘ధూమ’ అంటే పొగ. అందుకే ధూమావతిని సాధారణంగా ‘పొగతో కూడినది’ లేదా ‘పొగ స్వరూపిణి’గా అర్థం చేసుకుంటారు. అగ్ని పూర్తిగా ఆరిపోయిన తర్వాత మిగిలే పొగ, బూడిద వంటి భావనలకు ఆమె రూపం ప్రతీకగా భావించబడుతుంది. ఇది క్షయం, శూన్యత, అంతం, వైరాగ్యం వంటి భావాలను సూచిస్తుందని తాంత్రిక సంప్రదాయంలో వివరణలు ఉన్నాయి.ధూమావతి ఎలా ఆవిర్భవించింది?ధూమావతి ఆవిర్భావానికి సంబంధించిన కథనాలు ఒకే విధంగా లేవు. ముఖ్యంగా రెండు ప్రసిద్ధ పురాణ-తాంత్రిక కథనాలు కనిపిస్తాయి.సతి దహనం నుంచి ధూమావతి: దక్ష యజ్ఞంలో సతి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నప్పుడు, ఆ దహన ప్రక్రియ నుంచి వెలువడిన పొగలోంచి ధూమావతి అవతరించిందని ఒక కథనం చెబుతుంది. అందుకే ఆమెకు ‘ధూమావతి’ అనే పేరు వచ్చిందని వివరణ.శివుడిని మింగిన సతి కథ: మరో కథనం ప్రకారం సతికి తీవ్రమైన ఆకలి వేస్తుంది. శివుడు ఆహారం ఇవ్వకపోవడంతో కోపంతో ఆమె శివుడినే మింగుతుంది. అనంతరం శివుడిని బయటకు విడుదల చేసిన తర్వాత, ఆమె వితంతువు రూపమైన ధూమావతిగా మారుతుందని ఈ కథనం వివరిస్తుంది. 🤯మీకు తెలుసా?#MovieSecretsWithAnjiShette - Day 1#TheParadise మూవీ థీమ్ సాంగ్‌లో మారుమోగే పవర్ఫుల్ మంత్రం వెనుక అసలు కథ ఇదేదశ మహావిద్యల్లో ఐదవ రూపమైన "ధూమావతి" అమ్మవారి మంత్రం🔥శత్రు సంహారానికి ప్రతీకగా నిలిచే అమ్మవారి మంత్రం వింటే గూస్ బంప్స్🔥#Nani #Paradise pic.twitter.com/Plz4yiK02I— Anji Shette (@AnjiShette) September 21, 2026 -
నా కాళ్లపై ఎందుకు పడతారు?.. అనిల్ రావిపూడి తీవ్ర అసహనం
టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆయన ఓ మూవీ లాంచింగ్ ఈవెంట్‌కు రాగా.. అక్కడే ఉన్న ఓ అభిమాని అనిల్ కాళ్లకు నమస్కరించబోయాడు. ఇది చూసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. నా కాళ్లపై ఎందుకు పడతారంటూ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి ఇలాంటి పనులు చేయవద్దని అక్కడున్న వారందరికీ దండం పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే అనిల్ రావిపూడి ఈ ఏడాది మనశంకరవరప్రసాద్‌గారుతో హిట్ కొట్టారు. సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. మళ్లీ వచ్చే ఏడాది మరో ఫుల్ ఫన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకటేశ్, కల్యాణ్ రామ్‌తో కలిసి జనవరి 12న విడుదల మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కృతిశెట్టి, కీర్తి సురేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే మూవీ సెట్లో కృతిశెట్టి బర్త్ డే వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. నా కాళ్ళ మీద ఎందుకు పడతారా ?డైరెక్టర్ #AnilRavipudi సీరియస్ 😡🤬#Tollywood #Issues pic.twitter.com/o5dXSDb9vU— Anchor Chandu 😎 (@Actor_Chandu_) September 22, 2026 -
సస్పెన్స్ ఎంటర్టైనర్గా ‘మిస్ కాళికా మిస్సింగ్’
వినీత్ చంద్ర, డాలీషా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం‘మిస్ కాళికా మిస్సింగ్’. సత్య ధనేకుల దర్శకత్వంలో రామకృష్ణ, పదిమల యమున సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఎస్తేర్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ ,ఆలీ ,జ్యోతి, నాగ మహేష్, గుండు సుదర్శన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ర్మాతలు రామకృష్ణ, యమునలు మీడియాతో మాట్లాడుతూ.. ‘పూర్తి సస్పెన్స్ తో సాగే ఎంటర్టైన్మెంట్ చిత్రమిది. మునుపెన్నడు చూడని కథనం తో ఈ మూవీ చిత్రీకరణ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ పరంగా ఈ చిత్రం డెఫినెట్ గా మంచి మార్కులు తెచ్చుకుంటుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది . అక్టోబర్ నెలలో ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’అన్నారు. -
'రక్తం అమ్ముకుంటానని అన్నారు'.. మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్
మెగాస్టార్ సినీ ప్రస్థానం మొదలై సరిగ్గా నేటికి 48 ఏళ్లు. ఈ రోజు ఆయన ప్రాణం ఖరీదు మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత దశాబ్దాలుగా వెండితెరపై స్టార్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాకా మూవీలో నటిస్తున్నారు. తన కెరీర్లో ఎన్నో బ్లాక్‌బస్టర్స్ కొట్టిన చిరంజీవి.. నాలుగు దశాబ్దాలకు పైగా అభిమానులను ఇంకా అలరిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా అభిమానులతో మెగా యూత్ ఫోర్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన చిరు తన జర్నీ గురించి వారితో ప్రస్తావించారు.మన జీవితంలో సమయం చాలా విలువైనదని మెగాస్టార్ అన్నారు. డబ్బులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ.. గడిచిపోయిన సమయం తిరిగి రాదన్నారు. మనం ఎలా ఎదగాలో అనుక్షణం ఆలోచించాలని.. మనకున్న సమయాన్ని మరింత చక్కగా వినియోగించుకోవాలని సూచించారు. అతను ఎలా పైకొచ్చాడు? ఎలాంటి ఆలోచనా విధానం, ఆచరణలు పాటించాడన్నది చూడాలన్నారు. మనం ఎంచుకున్న రంగంలో క్రమశిక్షణ అలవరుచుకుంటే రాణించడం చాలా సులభమని తెలిపారు. నా కెరీర్లో ప్రతి క్షణాన్ని వినియోగించకున్నానని.. అవే నాకు పునాదిరాళ్లుగా నిలిచియన్నారు.ఎన్ని కోట్ల పాకెట్స్ అమ్మాలి?తాను బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం అమ్ముకుంటున్నానని కొందరు అన్నారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. అయితే నా పారితోషికంతో పోలిస్తే ఎన్ని కోట్ల పాకెట్స్ అమ్మితే ఆ డబ్బుకు సమానం అవుతుందని అన్నారు. ఇంత మూర్ఖంగా ఎలా మాట్లాడాతారో తెలియదన్నారు. నేను ఎవరి దగ్గర చేయి చాచకుండా బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నానని చిరు వెల్లడించారు. ఇందులో నా శ్రమ కన్నా అభిమానుల సహకారం ఎన్నోరెట్లు ఉందని తెలిపారు. మీ జీవితంలో ఎదురయ్యే అవమానాలను పట్టించుకుంటూ కూర్చొంటే ముందుకు వెళ్లలేరని.. లక్ష్యం దిశగా మన అడుగులు వేయాలని అభిమానులకు సూచించారు.సమయ పాలన తప్పనిసరి..చిరంజీవి మాట్లాడుతూ..' ప్రస్తుతం కాకా మూవీలో కదిరి కాళిదాస్‌గా నటిస్తున్నా. రోజూ తెల్లవారుజామున నాలున్నర్రకే నిద్రలేస్తా. ఆ తర్వాత గంట వ్యాయామం చేస్తా. మేకప్ వేసుకుని ఉదయం 8 గంటలకు నేరుగా కోకాపేటలోని సెట్స్‌లో ఉంటా. నేను ఉదయం పది గంటలకు సెట్‌కు వచ్చినా నన్ను ఎవరూ అడగరు. కానీ నాకే క్రమశిక్షణ లేకపోతే.. మిగిలిన టీమ్‌కు ఎలా ఉంటుంది. నా డైరెక్టర్స్ అంతా ఉదయం ఏడు గంటలకే ఫుల్ టీమ్‌తో రెడీగా ఉంటారు. అమెరికా అధ్యక్షుడికైనా.. ఇక్కడి కార్మికుడికైనా ఉన్నది 24 గంటలే. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మెగా యూత్ ఫోర్స్ మరింత బలోపేతం కావడానికి మీ సహాయ సహకారాలు కావాలి. అభిమానులు నా నుంచి ఏమి కోరుకుంటారో అది ఇవ్వడానికి సిద్ధమవుతా. మిమ్మల్ని వీలైనంత వరకూ అలరించడంపైనే దృష్టి పెడతా. మన అనుబంధం ఇలాగే కొనసాగాలి' అని అన్నారు.అభిమానులు కలిసుండాలి..మెగాస్టార్ మాట్లాడుతూ..'తాను అదృష్టాన్ని నమ్మనని.. కేవలం నా కష్టాన్నే నమ్ముకుంటా. ఆ నమ్మకం సడలినప్పుడు అద్దం ముందు నిలబడి నీకంటే గొప్పవాడు ఎవడూ లేడు అని నన్ను నేను పొగుడుకుంటా. నీరసం వస్తే నాలో నేను ఉత్సాహం నింపుకొంటా. ప్రకృతికి నువ్వు ఏది ఇస్తే.. అది కొన్ని రెట్లు ఇస్తుంది. దయచేసి సమయం వృథా చేసుకోవద్దు. అభిమానుల మధ్య సఖ్యత ఉండాలి. హీరోలందరూ బాగున్నారని మేసేజ్ ఇవ్వగలిగితే అభిమానులు కలిసి ఉంటారు. అలా చేసింది మొదట తానేనని అందరికీ తెలుసు. నా తోటి హీరోలందరూ నాతో చాలా బాగుంటారు. చిరంజీవి అభిమానులంటే అందరికీ గర్వకారణంగా ఉండాలి' అని అన్నారు. -
ప్రశ్న విని పగలబడి నవ్విన హీరోయిన్
అనీశ్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేశ్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఎదురైన ఓ వింత ప్రశ్న నవ్వులు పూయించింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇంతకంటే మంచి రియాక్షన్ ఉండదు..‘యాక్టర్‌గా మీ హిస్ట్రియానిక్స్(నటన, హావాభావాలు)పై ఎలా కామెంట్ చేస్తారు?’ అంటూ ఓ జర్నలిస్ట్ అనస్వర రాజన్‌ను ప్రశ్నించాడు. ఈ ప్రశ్న విన్న వెంటనే ఆమె ఒక్కసారిగా అవాక్కై.. ఆ తర్వాత నవ్వడం మొదలుపెట్టింది. పక్కనే ఉన్న సాయి అనీష్ కూడా నవ్వడంతో అక్కడి వాతావరణం సరదాగా మారిపోయింది. అనస్వర రియాక్షన్‌కు ప్రేక్షకులు కూడా చప్పట్లతో స్పందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అనస్వర సహజమైన రియాక్షన్‌ను మెచ్చుకుంటున్నారు. అసలు ఆ ప్రశ్న ఎందుకు అడిగారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ‘ఆ ప్రశ్నకు ఇంతకంటే మంచి రియాక్షన్ ఉండదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.సినిమాల విషయానికి వస్తే..ఇక అనస్వర రాజన్ ఇప్పటికే ‘సూపర్ శరణ్య’తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. తన సహనటి మమిత బైజుతో తనకున్న స్నేహం గురించి కూడా ఆమె ఇటీవల మాట్లాడింది. మమిత సినిమాలు మంచి విజయం సాధిస్తుండటంపై సంతోషంగా ఉందని, తామిద్దరం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటామని తెలిపింది. ‘ఇట్లూ అర్జున’తో పాటు అనస్వర ‘కాకా’ సినిమాలోనూ నటిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవికి కుమార్తెగా కనిపించనుంది. సంక్రాంతి సందర్భంగా 2027 జనవరి 13న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. #AnaswaraRajan Laughter Therapy will make the Journalist go sleepless in trauma for years. Silly Questions! pic.twitter.com/uvgWxiT20K— Star Talkies (@startalkies_ofl) September 21, 2026 -
Bigg Boss 10: నేను ఎలిమినేట్ కావాల్సిన వాడినే..!
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి నిష్క్రమించిన ఒక రోజు తర్వాత, నటుడు కృష్ణుడు జియోహాట్‌స్టార్‌లో జరిగిన ఒక లైవ్ ఇంటరాక్షన్‌లో తన ప్రయాణం గురించి మాట్లాడాడు. ఓటింగ్, దురదృష్టం లేదా తోటి కంటెస్టెంట్లను నిందించకుండా, వీక్షకుల తీర్పును హుందాగా కృష్ణుడు అంగీకరించాడు. తాను ఎలిమినేట్ కావాల్సిన వాడినే అని నిష్కపటంగా ఒప్పుకున్న అతను, ఈ విషయంలో తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, హౌస్‌లో గడిపిన సమయం జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అనుభవమని అభివర్ణించాడు. తరచుగా తింటూ, నిద్రపోతూ కనిపించాడనే విమర్శలకు స్పందిస్తూ, హౌస్‌లో ఆహారం పరిమితంగా ఉండేదని, సరైన అల్పాహారం ఉండేది కాదని, కంటెస్టెంట్లు సాధారణ భోజనంతోనే ఉండాల్సి ఉంటుందని వెల్లడించాడు.రోహిత్‌తో తనకు ఏర్పడిన భావోద్వేగ బంధం గురించి కూడా కృష్ణుడు మాట్లాడాడు. తమ మధ్య మొదట్లో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, క్రమంగా ఇద్దరూ స్నేహితులయ్యామన్నాడు. ఎలిమినేషన్ సమయంలో రోహిత్ భావోద్వేగంతో స్పందించిన తీరు తనను ఎంతగానో కదిలించిందని, తమ బంధం ఇంటి బయట కూడా కొనసాగుతుందని నమ్ముతున్నట్లు తెలిపాడు. రోహిత్‌ను ఒక వ్యూహాత్మక ఆటగాడిగా అభివర్ణిస్తూ, కాలంతో పాటు అతను మరింత ప్రశాంతంగా, నిలకడగా మారాడని కృష్ణుడు చెప్పాడు. అయితే, రోహిత్ ఏకాగ్రత కోల్పోకూడదని చెబుతూనే, శాలినితో అతనికి పెరుగుతున్న సంబంధం అతని ఆటను దెబ్బతీస్తుందని కూడా హెచ్చరించాడు.బలమైన పోటీదారులలో త్రిగుణ్, రోహిత్‌ల పేర్లను ప్రస్తావించిన కృష్ణుడు, "పరిపూర్ణ బిగ్ బాస్ ఆటగాడు" గా త్రిగుణ్‌ను ఎంచుకున్నాడు. తన టాప్ 5 కంటెస్టెంట్లుగా త్రిగుణ్, రోహిత్, అమన్, ముఖేష్, ఝాన్సీలను అతను అంచనా వేశాడు. సుధీర్ సృష్టితో ప్రేమాయణం నెరపటానికి ప్రయత్నిస్తున్నాడని కృష్ణుడు ఆరోపించడమే కాకుండా, ముఖేష్‌ను ఈ సీజన్ "ఉమెన్ ట్రాక్ విన్నర్" అని సరదాగా పిలవడం ద్వారా కొత్త చర్చకు ఆజ్యం పోశాడు. -
రణబాలి.. ఏందయ్య సామీ ఫుల్ సాంగ్ వచ్చేసింది..
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమి చిత్రీకరణ పూర్తిచేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మరో అప్డేట్తో అభిమానులను ఉత్సాహపరిచింది. సినిమాలోని ఏందయ్యా సామీ ఫుల్ సాంగ్‌ని విడుదల చేసింది. కాగా ఈ చిత్రం1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. విజయ్, రష్మిక పెళ్లి తరువాత వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. -
చాలా డబ్బులు నష్టపోతావని చెప్పారు..అయినా నో చెప్పా : ఐశ్వర్య లక్ష్మి
ప్రస్తుతం ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది సినీ తారలకు, అభిమానులకు ఓ ముఖ్యమైన వారధిగా మారింది. తమ సినిమా అప్డేట్స్తో పాటు పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు దీని ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఒక్క పోస్ట్పెట్టి..లక్షల రూపాయలు సంపాదించే తారలు కూడా ఉన్నారు. అయితే హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. ఏడాది క్రితం ఆమె సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పింది. ఇప్పటివరకు ఆమె మళ్లీ నెట్టింట్లోకి అడుగుపెట్టలేదు. ఇక ఎప్పటికీ సోషల్ మీడియాలోకి రానని చెబుతోంది ఈ టాలెంటెడ్ హీరోయిన్. మానసిక ప్రశాంతత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె సోషల్ మీడియాను ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో వివరించింది. ‘నేను ఇన్‌స్టాగ్రామ్‌ని వదిలేస్తానని అస్సలు ఊహించలేదు. కొన్నాళ్లు దూరంగా ఉండి..తిరిగి వద్దామనుకున్నా. కానీ ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. అసత్యప్రచారాలు ఎక్కువైపోయాయి. ఏఐ సాయంతో ఎడిట్ చేస్తున్న అసభ్యకరమైన పోస్టులు చూసి విసిగిపోయా. సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వల్ల సంతోషంగా ఉంటున్నా. ఇప్పుడు ఒక వ్యక్తిగా నాకు చాలా స్వేచ్ఛ దొరికినట్లు అనిపిస్తోంది. మళ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ని క్రియేట్ చేసుకోండి.. లేదంటే చాలా డబ్బులు నష్టపోతారని నా మేనేజర్లు చెప్పినా.. నేను అంగీకరించలేదు. డబ్బు కంటే మానసిక ప్రశాంతత విలువైనదని.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వల్ల నేను హ్యాపీగా ఉండగల్గుతున్నానని వారితో చెప్పాను. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నప్పుడు ప్రతి కామెంట్ చదివేదాన్ని. దాని వల్ల ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా ఉందని అనిపించేది. నన్ను ఎవరూ ఇష్టపడరనే భావన మొదలైంది. కామెంట్స్ మనకు తెలియకుండానే నెగెటివిటీని సృష్టిస్తాయి.అందుకే నేను సోషల్ మిడియాను దూరం పెట్టా. సినిమాల ద్వారనే ప్రజలు నన్ను గుర్తుపెట్టుకోవాలి’ అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. -
ఆరోజు మొదలై.. నేటికి 48 ఏళ్లు.. చిరంజీవి పోస్ట్ వైరల్
అప్పుడెప్పుడో చిరంజీవి కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’. అయితే.. ఆ తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ ముందుగా విడుదలైంది. కె.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు నరసింహ అనే పాత్రను పోషించారు. అయితే చిరంజీవి హీరోగా నటించిన ‘ప్రాణం ఖరీదు’ విడుదలై నేటికి 48 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు‘ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ. ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం. నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే..చిరంజీవి హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కాకా. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ఇటీవలే ప్రకటించి గ్లింప్స్‌ను విడుదల చేశారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. మరో పక్క ‘విశ్వంభర’ సినిమాలోనూ నటిస్తున్నారు. 22 సెప్టెంబర్ 1978ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను.ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త… pic.twitter.com/5wBJnXl3MP— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2026 -
72nd National Film Awards: ఆ డోమ్ లో… 1000 మంది అతిథుల మధ్య…
భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యున్నత గౌరవంగా పరిగణించబడే జాతీయ చలనచిత్ర పురస్కారాల మహోత్సవం నేడు (సెప్టెంబర్ 22, మంగళవారం) గుజరాత్‌లోని ఏక్తా నగర్ (కెవాడియా)లో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో పాటు ఇతర నాయకులు, ఉత్తరాది - దక్షిణాది సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.గుజరాత్ లోని ఏక్తానగర్ లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' సమీపంలోని 'బస్ బే' (బస్ టెర్మినల్) ప్రాంతంలో ఈ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. అందుకోసం భారీ ఏర్పాట్లకు సోమవారం సైతం తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ ఘనమైన వేడుకను విజయవంతం చేసి, చిరస్మరణీయంగా నిలిపేందుకు వివిధ రంగాలకు చెందిన 500 మందికి పైగా సాంకేతిక నిపుణులు, కళాకారులు, కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.వాటర్ ప్రూఫ్… సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ గుడారం‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ - సర్దార్ పటేల్ భారీ విగ్రహం వద్ద అతిథుల కోసం 1,000 మంది కూర్చునే ఏర్పాట్లతో, ఎయిర్ కండిషన్డ్ జర్మన్ డోమ్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ'కి సరిగ్గా పక్కనే 1,000 మంది కూర్చునే వీలుండే ఈ పెద్ద, హై-టెక్ డోమ్ నిర్మాణం అవుతోంది. ఈ ఆధునిక 'జర్మన్ అల్యూమినియం స్ట్రక్చరల్ డోమ్' పూర్తిగా వాటర్ ప్రూఫ్. అంతే కాకుండా, సెంట్రల్ ఎయిర్-కండిషన్డ్. కూర్చొనే వసతితో పాటు వేడుకలో అద్భుతమైన అనుభూతిని అందించడానికి, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, ఆధునిక లైటింగ్ సిస్టమ్‌తో పూర్తిగా సన్నద్ధం చేస్తున్నారు. అలాగే, అతిథులకు ప్రత్యేకంగా గుజరాతీ వంటకాలతో విందు చేయనున్నారు.సాయంత్రం 4 గంటలకే అవార్డులుజాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రధాన కార్యక్రమం మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. ముందుగా, లాంఛనప్రాయంగా దీప ప్రజ్వలన, జాతీయ గీతాలాపనతో ప్రధాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో, సుమారు 75 నిమిషాల పాటు జరిగే ప్రధాన ప్రోటోకాల్ సమావేశంలో, వివిధ విభాగాలలోని విజేతలకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేస్తారు.లేజర్ షో వెలుగులు… సాంస్కృతిక జిలుగులు…సాయంత్రం అయిదుంబావు గంటల నుండి 6 గంటల మధ్య సభికులు, సినీ ప్రముఖులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. అనంతరం అవార్డు విజేతలందరితో అధికారిక గ్రూప్ ఫోటో దిగుతారు. ప్రధాన కార్యక్రమం ముగిసిన తర్వాత, సాయంత్రం 6:30 గంటలకు నర్మదా నదీ తీరంలో అతిథుల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రత్యేక థీమ్ ఆధారిత లేజర్, లైట్ అండ్ సౌండ్ షో (దృశ్యవాణి కార్యక్రమం) కూడా ఉంటుంది.— గుజరాత్ లోని ఏక్తా నగర్ నుంచి ఆర్. జయ -
‘కంటెస్టెంట్‌గా పనికిరావు.. బయటకెళ్లి..’
బిగ్‌బాస్ ఇంట్లో మూడో వారం నామినేషన్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్ల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతుండగా.. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే ఈరోజు ఎపిసోడ్లో నామినేషన్స్ మరింత రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. ‘నువ్వా.. నేనా’ అన్నట్లుగా కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగినట్లు ప్రోమోలో కనిపించింది.అసలు నువ్వు కంటెస్టెంట్‌గానే పనికిరావు..గేమ్‌ను సీరియస్‌గా తీసుకోని వాళ్లే బజర్ మోగిన తర్వాత కూడా బోర్డుపై రాస్తారంటూ ముఖేశ్ వ్యాఖ్యానించాడు. దీనికి స్పందించిన చరణ్.. ‘ఈ విషయాన్ని నేను ఆడియన్‌గా బయట నుంచి చూశా’ అని చెప్పాడు. దీంతో ముఖేశ్ మరింత ఫైర్ అయ్యాడు. ‘అసలు నువ్వు కంటెస్టెంట్‌గానే పనికిరావు.. వెళ్లి ఆడియన్‌గానే ఉండు పో’ అంటూ ఘాటుగా బదులిచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.మాట్లాడే దమ్ము లేదా..మరోవైపు షాలిని, వర్షిణి మధ్య కూడా వివాదం తారస్థాయికి చేరినట్లు ప్రోమోలో కనిపించింది. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ముఖేశ్ మధ్యలో కలగజేసుకోవడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ‘ఏంటి.. ముఖేశ్‌తో మాట్లాడే దమ్ము లేదా?’ అంటూ షాలినిని వర్షిణి ప్రశ్నించింది. దీనికి షాలిని కూడా గట్టిగానే స్పందించింది. ఇలా ఒకవైపు ముఖేశ్-చరణ్ మధ్య మాటల యుద్ధం.. మరోవైపు షాలిని-వర్షిణి మధ్య వివాదంతో మూడో వారం నామినేషన్స్ మరింత హాట్‌గా మారాయి. మరి ఈ గొడవలు ఎక్కడి వరకు వెళ్తాయి? ఎవరు ఎవరిని నామినేట్ చేయబోతున్నారు? నామినేషన్స్‌లో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకోనున్నాయి? అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే. -
సుమ కొంగుపట్టి అదిపోయే స్టెప్పులేసిన రాఘవ్.. ఎవరీ నటుడు?
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్న ఆయన.. ఈవెంట్లో తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు.సుమ కొంగు పట్టుకుని ‘ఏష నాగుల..’ పాటకు రాఘవ్ వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన డ్యాన్స్ చూసిన నెటిజన్లు ‘అదేం ఎనర్జీ సామీ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లో విలన్‌గా కనిపించనున్న రాఘవ్‌లోని మరో కోణాన్ని ఈ ఈవెంట్ ప్రేక్షకులకు చూపించింది.డ్యాన్స్‌తో గుర్తింపు..రాఘవ్ జుయల్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటివరకు పెద్దగా పరిచయం లేకపోయినా.. హిందీ టెలివిజన్, బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితుడే. ముఖ్యంగా అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. మంచి డ్యాన్సర్‌గానే కాకుండా యాంకర్, ప్రజెంటర్, నటుడిగానూ తనదైన ముద్ర వేశారు.2009లో ప్రసారమైన ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ మొదటి సీజన్లో పాల్గొనడం ద్వారా రాఘవ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. తన ప్రత్యేకమైన డ్యాన్స్ మూవ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘క్రాకడైల్’ వంటి పవర్ఫుల్ మూవ్స్‌తో పాటు ‘క్రాక్ రోచ్’ తరహా స్లో మోషన్ డ్యాన్స్‌ను కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఈ విభిన్నమైన స్టైల్ కారణంగానే రాఘవ్ జుయల్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.విలన్‌గా మరో కోణం..డ్యాన్స్ మాత్రమే కాకుండా నటన, యాంకరింగ్‌లోనూ రాఘవ్ తన ప్రతిభను చాటుకున్నారు. 2014లో వచ్చిన ‘సోనాలి కేబుల్’ సినిమాతో నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు చిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపించారు. 2020లో వచ్చిన ‘అభయ్’ వెబ్ సిరీస్‌లో విలన్ పాత్రలో నటించి తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.ఆ తర్వాత ‘కిల్’, ‘యుధ్ర’, ‘భాయ్ తేరా స్టార్ మేరా’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న విలన్ పాత్రపై ఆసక్తి నెలకొంది. మరోవైపు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమాలోనూ రాఘవ్ జుయల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. డ్యాన్స్ షోతో కెరీర్‌ను ప్రారంభించి.. యాంకర్‌గా, నటుడిగా ఎదిగిన రాఘవ్ జుయల్.. ఇప్పుడు వరుసగా సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు.CHHOTA MAALIK BRINGS THE SWAG! 🔥🕺@TheRaghav_Juyal & @ItsSumaKanakala dance to Yeshanagula at the #TheParadise Grand Pre-Release Event ❤️🔥⚡GRAND RELEASE WORLDWIDE ON 24⋆09⋆26 pic.twitter.com/m4lbcyApWb— THE PARADISE (@TheParadiseOffl) September 21, 2026 -
నా దగ్గరకి రావడానికే భయపడతారు: మోహన్ బాబు
నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీ మరో రెండు రోజుల్లో బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు వచ్చేస్తోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా నిన్న( సోమవారం) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు పోషించిన విలన్ పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తన పాత్రపై స్వయంగా మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు సినీ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారాయి.నా వద్దకు రావడానికే భయపడతారు..ఓ సందర్భంలో విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూనే.. ‘ఈ కేరింతలు, చప్పట్లు అన్నీ ‘ప్యారడైజ్’ సినిమా కోసమేనని నాకు అర్థమవుతోంది. అయితే సెప్టెంబర్ 24న థియేటర్లలో ఆ సినిమా చూసిన తర్వాత ఎవరూ నా దరిదాపుల్లోకి కూడా రారు. నా వద్దకు రావడానికే భయపడతారు. ఎందుకంటే ఆ చిత్రంలో నా పాత్ర అంత భయంకరంగా, అత్యంత క్రూరంగా ఉంటుంది" అని పేర్కొన్నారు. ఈ సినిమాలో తన రోల్ సరికొత్త తరహాలో ఉండబోతోందని ఆయన స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్’ చిత్రంతో తాను చూపించబోయే భీకర విలనిజం గురించి మోహన్‌బాబు ఇచ్చిన హింట్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది. #TheParadise సినిమా చూశాక ఎవరు నా దగ్గరలోకి కూడా రారు.#Mohanbabu #ShikanjaMaalik#Nani @SLVCinemasOffl pic.twitter.com/mChC4fBuRe— SZN (@Suzenbabu) September 21, 2026 -
వినాయకుడి లడ్డూని రూ.కోటికి పాడిన రాజమౌళి..!
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఫహాద్ ఫాజిల్. శశాంక్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించారు. సారా పాలేకర్, సౌరభ్ సచ్దేవ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఫహాద్ ఫాజిల్, సారా పాలేకర్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, ఎస్ఎస్ కార్తికేయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు విషయాలపై ఆసక్తికరంగా ముచ్చటించారు.మీ సంగతి అక్టోబర్ 2న చెప్తా..అనంతరం కార్యక్రమంలో వినాయకుడి లడ్డూ వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఎస్ఎస్ రాజమౌళి ఏకంగా రూ.కోటి బిడ్ వేసి లడ్డూను సొంతం చేసుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దీనిని వేలంపాటలో సొంతం చేసుకున్నారు. అనంతరం ఆ లడ్డూని మాయం చేయడంతో ‘మీ సంగతి అక్టోబర్ 2న చెప్తా’ అని రాజమౌళి సరదాగా నవ్వులు పూయించారు.రాజమౌళి విషయానికి వస్తే..రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ‘వారణాసి’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడిగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు మహేశ్‌బాబు. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. దాదాపు 120 దేశాల్లో ‘వారణాసి’ని రిలీజ్ చేయనున్నారు. ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో భగ్గుమన్న నామినేషన్స్.. ‘నేను నీ వెంట పడ్డానా..?’ SS Rajamouli bid ₹1cr for a laddu.Watch the funny promotional clip 🤣#DontTroubleTheTrouble pic.twitter.com/zrUld7XEHk— Mr SP (@Lonely_prabh) September 21, 2026 -
ఈ స్టార్ జంట తీరే వేరు
తొలి సంధ్య వేళ లో, తొలి పొద్దు పొడుపులో, తెల్లవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం. ఎగిరొచ్చే కెరటం సింధూరం. సూర్యోదయాన్ని ప్రము ఖ గీత రచయిత జాలాది ఎంత అద్భుతంగా వర్ణించారో కదూ ! నిజంగా వేకువ వేళలో సముద్ర తీరాన ప్రకృతి అందాలు మనసు ను పులకరింప చేస్తాయి. తద్వారా ఉత్తేజం ఉరకలేస్తుంది. అలాంటి రమణీయ ప్రకృతిని ఆస్వాదించడానికి ప్రేమికులు మనసు పడతారు. అలాంటి అనుభూతిని నటి నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు పొందుతుండటం విశేషం. వీళ్లూ ప్రేమికులే కదా ! ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులు అయినా, ఈ స్టార్ జంట తీరే వేరు. పెళ్లికి ముందు ఆ తరువాత కూడా తనదైన శైలిలో జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. ఇందుకు స్వదేశం, విదేశం అనే తేడా ఉండదు. మనసు ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడికి వెళ్లి అందాలను ఆరాధిస్తుంటారు. ఆ దృశ్యాలను తమ సామాజిక మాధ్యమాల్లో పొందుపరుస్తుంటారు. ఇదే ఈ జంట ప్రత్యేకకత. అలా ఇటీవల ఈ సంచలన జంట వేకువజామున సాగర తీరానికి వెళ్లి సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ, తమ ప్రేమను ఒకరికొకరు వ్యక్తం చేసుకున్నారు. వారి రొమాంటిక్ భంగిమలను కెమెరాలో బంధించి తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. మొత్తానికి నటి నయనతార, తన భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ఇలా మరోసారి వార్తల్లో కెక్కారు. -
బిగ్‌బాస్‌లో భగ్గుమన్న నామినేషన్స్.. ‘నేను నీ వెంట పడ్డానా..?’
బిగ్‌బాస్ సీజన్ 10లో నామినేషన్స్ ప్రక్రియ మొదలవడంతో హౌస్‌లో మరోసారి వేడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే కంటెస్టెంట్ల మధ్య విభేదాలు ఉండగా.. నామినేషన్స్ ప్రక్రియతో అవన్నీ ఒక్కసారిగా బయటకొచ్చాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పాటు మాటలతో యుద్ధానికి దిగారు. ముఖ్యంగా సృష్టి-సుధీర్ గొడవ ఈ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది. అసలు ఇంత గొడవపడటానికి కారణం ఏంటి? నిన్నటి ఎపిసోడ్లో ఏం జరింగింది. చూద్దాం రండి.!అన్నం పెట్టేవాడికే చెత్త వేయడం ఏంటి?స్టార్ ఆఫ్ ది వీక్‌గా ముకేశ్ ఉండటంతో అతడిని ఎవరూ నామినేట్ చేయకూడదని బిగ్‌బాస్ స్పష్టం చేశారు. అయితే ముకేశ్ కారణంగా ఝాన్సీ టెన్షన్‌కు గురైందని భావిస్తే ఆమెను నామినేట్ చేయవచ్చని తెలిపారు. ఇక నామినేషన్స్‌లో భాగంగా కంటెస్టెంట్లకు ఎన్వలప్స్ ఇచ్చి.. అందులో ఎన్ని ఓట్లు ఉంటే అంతమందిని నామినేట్ చేయాలనే టాస్క్ పెట్టారు. రాంప్రసాద్, చరణ్ ముందుగా పోటీ పడగా ఇద్దరికీ ఎన్వలప్స్ వచ్చాయి. కెప్టెన్‌గా ఉన్న ఝాన్సీ.. రాంప్రసాద్‌కు నామినేషన్ ఛాన్స్ ఇచ్చింది. దీంతో ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం అతడికి వచ్చింది. రాంప్రసాద్ మొదట వంశీని నామినేట్ చేశాడు. ఫుడ్ పెట్టే సమయంలో పెద్దగా అరవడం తనకు నచ్చలేదని కారణం చెప్పాడు.అయితే ఇక్కడే మరో వివాదం మొదలైంది. వర్షిణి ఏడ్చిన విషయాన్ని వంశీ ప్రస్తావించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మానిటర్‌గా ఉన్న దేబ్జానీ కూడా ఈ విషయంలో కలగజేసుకోవడంతో వంశీ-దేబ్జానీ మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో రాంప్రసాద్.. ‘ఇది నా నామినేషన్’ అంటూ గట్టిగా చెప్పి వంశీపై చెత్త వేశాడు. దీనిపై త్రిగుణ్ స్పందిస్తూ.. అన్నం పెట్టిన వాళ్ల మీదే చెత్త వేస్తున్నారంటూ సెటైర్ వేశాడు. అయితే అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రాంప్రసాద్ కౌంటర్ ఇచ్చాడు.ఇదీ చదవండి: 10వేల మందికి అదిరిపోయే ట్రీట్! నాని ఫ్యాన్స్‌కు పండగే..సృష్టి వర్సెస్ సుధీర్.. హౌస్‌లో మరో రచ్చఇక ఎపిసోడ్లో అసలు హీట్ సృష్టి, సుధీర్ మధ్య జరిగిన గొడవతో వచ్చింది. త్రిగుణ్ తనను మానిప్యులేట్ చేశాడని సుధీర్ ఆరోపించాడు. గతంలో జరిగిన గొడవలన్నీ క్లియర్ అయ్యాయని.. ఇక తనకు ఫ్రీడమ్ వచ్చిందని సుధీర్ చెప్పడంతో సృష్టి తీవ్రంగా స్పందించింది. ‘నేను నీ వెంట పడ్డానా?’ అంటూ సుధీర్‌పై సృష్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా కోపంలో కొడతా, పళ్లు రాలగొడతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ గొడవతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆ తర్వాత సృష్టి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.షాలినిని టార్గెట్ చేసిన వర్షిణిఇక మరోవైపు వర్షిణి, దేబ్జానీ మధ్య పోటీ జరిగింది. నామినేషన్ చేసే అవకాశం వర్షిణికి రావడంతో ఆమె షాలినిని టార్గెట్ చేసింది. షో కోసమో లేక ప్రోమోలో కనిపించడం కోసమో ఏదో చేయాలనే ఉద్దేశంతోనే షాలిని వ్యవహరిస్తోందని.. ఆమెది ఫేక్ పర్సనాలిటీ అని వర్షిణి ఆరోపించింది. కేవలం కంటెంట్ కోసమే కొన్ని విషయాలు చేస్తోందని చెప్పింది. దీనిపై షాలిని కూడా గట్టిగానే స్పందించింది. వర్షిణితో వాదనకు దిగింది. అనంతరం వర్షిణి తనకు వచ్చిన మరో నామినేషన్ అవకాశాన్ని సుధీర్‌కు ఇచ్చింది. దీంతో సుధీర్ అమన్‌ను నామినేట్ చేశాడు.ఝాన్సీని టార్గెట్ చేసిన చరణ్చరణ్ తన నామినేషన్లో ఝాన్సీని టార్గెట్ చేశాడు. ఆమె తనతో మనస్ఫూర్తిగా ఉండటం లేదని ఆరోపించాడు. తనతో మాట్లాడుతున్న సమయంలో నిద్ర వస్తోందని చెప్పి వెళ్లిపోయి.. మరో టీమ్‌తో మాత్రం సరదాగా మాట్లాడిందని చెప్పాడు. అంతేకాకుండా గేమ్‌లో ఎవరు తనకు సపోర్ట్ చేశారనే విషయాన్ని ఇతరులకు చెప్పడం కూడా తనకు నచ్చలేదని తెలిపాడు. చివరగా రైతులకు సంబంధించిన కండువా, షర్ట్‌ను నామినేషన్స్ రోజే ధరించడం కూడా తనకు నచ్చలేదని చెప్పడంతో ఝాన్సీపై చరణ్ పెట్టిన నామినేషన్ ఆసక్తికరంగా మారింది.దేబ్జానీ నామినేషన్లో త్రిగుణ్చివరగా దేబ్జానీ.. త్రిగుణ్‌ను నామినేట్ చేసింది. ఇలా ఒక్కో నామినేషన్‌తో హౌస్‌లో ఉన్న పాత గొడవలు, మనస్పర్థలు బయటకు రావడంతో 14వ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా సృష్టి-సుధీర్ మధ్య జరిగిన గొడవ.. వర్షిణి-షాలిని వాగ్వాదం.. రాంప్రసాద్-వంశీ నామినేషన్ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఇదీ చదవండి: కదిలిస్తే.. కన్నీరే.. ఇదే హీరోయిన్ కయాదు జర్నీ -
హీరోకి అనుమానం ఎక్కువ: రాగ్ మయూర్
‘‘డీజే టిల్లు, ‘జాతి రత్నాలు’ చిత్రాలు ఊహించని విజయాలు సాధించాయి. అలాగే మా ‘అనుమాన పక్షి’ కూడా ఊహించని విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అని రాగ్ మయూర్ చెప్పారు. రాగ్ మయూర్ హీరోగా ‘డీజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అనుమాన పక్షి’. చిలకా ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో రాగ్ మయూర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో హీరోకి అనుమానాలు ఎక్కువ.తన అనుమానాలతో చుట్టూ ఉన్న అందరికీ పిచ్చెక్కిస్తుంటాడు. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్తో మొదలై, మిస్టరీ జానర్లోకి వెళ్లి, థ్రిల్లర్‌లా టర్న్ తీసుకుంటుంది. హారర్ టచ్‌తో పాటు సందేశం కూడా ఉంది. ఈ సినిమాలోని హీరో క్యారెక్ట రైజేషన్‌కు నేనే సూట్ అవుతానని, నన్ను నమ్మి అవకాశం కల్పించారు విమల్. ఇక నేను నటించిన ‘గరివిడి లక్ష్మి’ అక్టోబరు 17న రిలీజ్ కానుంది. ‘అంతా భ్రాంతియేనా’ అనే సినిమా చేశాను’’ అని చెప్పారు. -
దీపు లుక్ విడుదల
‘జనవరి 12 విడుదల’ సినిమా నుంచి హీరోయిన్ కృతీ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. సోమవారం (సెప్టెంబరు 21) కృతీ శెట్టి బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాలోని దీపు పాత్రలో కృతీ శెట్టి నటిస్తున్నట్లు వెల్లడించి, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. వెంకటేశ్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జనవరి 12 విడుదల’. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అర్చన, జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. -
ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు: సూర్య–జ్యోతిక
‘‘మా మనసులోని మరో ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం. మా పై మీరు కురిపించిన ప్రేమ, సానుకూలంగా స్పందించిన తీరుకి ముగ్ధులమయ్యాం’’ అంటూ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక సోమవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. పెళ్లయి 20 ఏళ్లయిన సందర్భంగా ఈ నెల 16న ఈ ఇద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవడం, మరో 20 ఏళ్లకు పైగా ఈ ప్రేమ ప్రయాణాన్ని ఇలానే సాగించాలనుకుంటున్నామని పేర్కొనడం తెలిసిందే. ఇలా మళ్లీ పెళ్లి చేసుకోవడాన్ని చాలామంది స్వాగతించారు... ఆశీర్వదించారు. వారందరూ చూపించిన ప్రేమను, ఈ వేడుక బాగా జరగడానికి కారకులైన వారిని ఉద్దేశించి సూర్య–జ్యోతిక సోమవారం తమ మనోభావాలను ఈ విధంగా పంచుకున్నారు. ‘‘స్కాట్‌ల్యాండ్‌లో మా వివాహ వేడుకను మరపురానిదిగా చేసిన మా బృందానికి ధన్యవాదాలు. మాకు జీవితంలో మరచిపోలేని అనుభూతిని బహుమతిగా ఇచ్చినందుకు వేడుక నిర్వాహకురాలు లిసాకు ధన్యవాదాలు. మా సీక్వెల్ మ్యారేజ్ ఆహ్వాన పత్రికను ఎప్పటికీ మా కాఫీ టేబుల్‌పై ఉంచేంత అద్భుతంగా చేసిన డారియాకి థ్యాంక్స్. ఇక డయానే అందించిన పువ్వుల అందాన్ని ఏ ఫొటో కూడా క్యాప్చర్ చేయలేదు. ఆ కోట గోడల మధ్య రాజకుటుంబీకుల్లా ఉన్నామనే అనుభూతిని బ్లెయిర్క్వాన్ కోటలోని రోజ్, ఆమె టీమ్ అందించారు.వారు ఇచ్చిన ఆతిథ్యం ఎంత బాగుందంటే వీడ్కోలు చెప్పేటప్పుడు మేం కన్నీళ్లు పెట్టుకుంటామని ఊహించలేదు. మా అందమైన క్షణాలను వీడియోలో అద్భుతంగా చిత్రీకరించిన జోవాన్‌కి, అంకిత భావంతో ఫొటోలు తీసిన డెల్, జేకి థ్యాంక్స్. స్కాట్‌ల్యాండ్‌లోని పొగమంచుతో నిండిన పర్వత ప్రాంతాలు, సరస్సులను మా ప్రేమకు తీపి గుర్తుగా ఎంచుకున్నాం. మాకు కలిగిన అనుభూతికి మించిన గొప్పదేదో మా ఇంటికి తీసుకొచ్చాం. మాకు గొప్ప అనుభూతిని మిగిల్చిన మంచి మనసున్న వ్యక్తులను కలవడం వల్ల మా హృదయాలు ఎప్పటికీ స్కాట్‌ల్యాండ్ జ్ఞాపకాలకు దూరం కావు’’ అంటూ సూర్య–జ్యోతిక తమ సీక్వెల్ వివాహం తాలూకు అనుభూతిని పంచుకున్నారు. -
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సినీ ప్రముఖుల సందడి
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవానికి దేశం నలుమూలల నుంచి వివిధ భాషల సినీ ప్రముఖులు మంగళవారం జరిగే గుజరాత్‌లోని ఏక్తానగర్‌కు తరలివచ్చారు. ఏక్తానగర్‌కు నేరుగా ఫ్లయిట్ లేకపోవడంతో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు పలువురు హైదరాబాద్ మీదుగా అక్కడకు ప్రయాణించారు. దాంతో, ఆదివారం, సోమవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం సినీ రంగ ప్రముఖులు, అవార్డుల జ్యూరీ సభ్యులతో కళకళలాడింది.2024వ సంవత్సరానికి గాను ఇస్తున్న 72వ జాతీయ అవార్డుల్లో ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ జ్యూరీకి సారథ్యం వహించిన ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు జయరాజ్ సోమవారం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఉత్సాహంగా అందరితో కలసి ఫొటోలు దిగుతూ కనిపించారు. జ్యూరీ సభ్యులందరితో కలసి ఆయన స్వయంగా సెల్ఫీలు దిగారు. అలాగే సెంట్రల్ జ్యూరీకి తెలుగు నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య, సుప్రసిద్ధ డ్యాన్స్ మాస్టర్ కళ, సినిమాపై ఉత్తమ రచనల్ని ఎంపిక చేసిన జ్యూరీకి నేతృత్వం వహించిన ప్రముఖ మలయాళ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ఎ. చంద్రశేఖర్ కనిపించారు. అలాగే, నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ జ్యూరీలో పనిచేసిన కన్నడ దర్శకురాలు తృప్తి, తమిళ దర్శకుడు ఈపీ గణేశ్‌బాబు, ప్రిలిమినరీ సౌత్ జ్యూరీలో సభ్యులైన తెలుగువారు ఎం.ఎస్.ప్రసాద్, ప్రశాంతి హారతి తదితరులు విమానాశ్రయంలో పరస్పరం పలకరించుకుంటూ, జ్యూరీ సభ్యులుగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ను చుట్టుముట్టిన కెమెరాలు అత్యుత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపికైన ‘కల్కి’ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్, ఆ చిత్ర నిర్మాత సి.అశ్వినీదత్, ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు వి. విజయేంద్ర ప్రసాద్ తదితరులు అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాగే, ప్రముఖ తమిళ సినీ పీఆర్వో డైమండ్ బాబు తదితరులు ఎయిర్‌పోర్ట్‌లో అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కనిపించారు. వడోదరా విమానాశ్రయంలో దిగి బయటకు రాగానే, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ను స్థానిక టీవీ మీడియా ప్రతినిధులు గుర్తుపట్టి అవార్డుల ప్రదానోత్సవం గురించి ఆయన అభిప్రాయాలను రికార్డు చేశారు.రాష్ట్రపతి కాన్వాయ్ రావడంతో..వడోదరా విమానాశ్రయం నుంచి అవార్డుల ప్రదానోత్సవం జరిగే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ – సర్దార్ పటేల్ విగ్రహం ఉన్న ఏక్తానగర్ (కేవడియా) వరకు దారి పొడుగునా నేషనల్ అవార్డుల ప్రదానోత్సవం తాలూకు కటౌట్లు కనిపించాయి. మూడు రోజుల గుజరాత్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం సోమవారం సాయంత్రమే కేవడియాకు తన కాన్వాయ్‌లో రావడంతో ఆమెకు దారి ఇవ్వడం కోసం పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను ఆపేయడం కనిపించింది. రాష్ట్రపతి సుదీర్ఘ కాన్వాయ్ శరవేగంతో దూసుకుపోయిన చాలా సేపటి తర్వాత వాహనాలను ఆ దారిలో అనుమతించ లేదు. ఫలితంగా, సినీ ప్రముఖులు ప్రయాణిస్తున్న వాహనాలు సైతం రోడ్డు పక్కనే ఆగి, నిరీక్షించక తప్పలేదు. -గుజరాత్‌లోని ఏక్తా నగర్ నుంచి ఆర్.జయ -
దర్శకుడిగా మారిన హీరో కార్తికేయ.. ‘కమ్‌బ్యాక్’ గ్లింప్స్ రిలీజ్
‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో కార్తికేయ గుమ్మకొండ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. తన పుట్టినరోజు సందర్భంగా ‘కమ్‌బ్యాక్’ అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాతో హీరోగా నటించడంతో పాటు తొలిసారి దర్శకుడిగానూ కార్తికేయ మెగాఫోన్ పట్టారు. కార్తికేయ హీరోగానే కాకుండా టాలీవుడ్ హీరో నానీ నటించిన 'గ్యాంగ్ లీడర్’, తమిళ నటుడు అజిత్‌తో ‘వలిమై’ వంటి చిత్రాల్లో నటించి విలనిజంతోనూ మెప్పించాడు. కథానాయకుడిగా రెండేళ్ల విరామం తర్వాత సరికొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆయన సతీమణి లోహితా రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో కార్తికేయ బాక్సర్‌గా పవర్ఫుల్ లుక్‌లో కనిపించారు. ‘బాక్సింగ్ వరల్డ్‌లో తన పేరు వినిపించి మూడేళ్లవుతోంది. ఇట్ ఫీల్స్ లైక్ సూసైడ్ మిషన్’ అంటూ సాగే వాయిస్ ఓవర్ గ్లింప్కు ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. బాక్సింగ్ ప్రాక్టీస్, స్కిప్పింగ్ సన్నివేశాలతో గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది. విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.సరస్వతి శుక్లా సమర్పిస్తున్న ఈ చిత్రానికి జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీ, కళ్యాణ్ సూర్యప్రకాష్ ఎడిటింగ్ అందిస్తున్నారు. సూర్య ఆకెళ్ల క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. -
ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేశాం.. తగలబడిపోవాల్సిందే: నాని
నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీ బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు వచ్చేస్తోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో నాని ఆసక్తికర కామెంట్స్ చేశారుఈవెంట్లో నాని మాట్లాడుతూ..'ఈ సినిమా కోసం మా టీమ్ అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. మా సవారీ గ్రూప్ అంతా ఇక్కడే ఉన్నారు. ఈ నెల 24న మా కష్టాన్ని మీరంతా చూస్తారు. ఈ సినిమాకు కాసర్ల శ్యామ్ సాంగ్స్ అద్భుతంగా రాశారు. శ్రీకాంత్ ఓదెల ప్రతి ఒక్కరితో పని చేయించారు. ఈ మూవీతో శ్రీకాంత్ సక్సెస్ కొట్టబోతున్నారు. సంపూ బిర్యానీ పాత్రలో ఇరగదీశారు. ఈ సినిమా సెట్లో సోనాలి, రాఘవ్ నా ఫేవరేట్ యాక్టర్స్. ఈ మూవీ కయాదు అద్భుతంగా చేసింది. సుబ్బు పాత్ర మీ గుండెల్లో నిలిచిపోతుంది. మోహన్‌బాబు గురించి మాకు బాగా తెలుసు. ఆయన కటౌట్ ఏంటనేది ప్యారడైజ్ మరోసారి గుర్తుచేస్తుంది. అనిరుధ్ ఈ మూవీ కోసం తన ప్రాణం పెట్టేశాడు' అని అన్నారు. ఈనెల 23 ప్రీమియర్ షో నుంచే థియేటర్స్ ఊగిపోతాయని నాని ధీమా వ్యక్తం చేశారు. మీ నెగెటివిటీ కూడా పాజిటివ్‌గా మారిపోవాలని ఫ్యాన్స్‌కు సూచించారు. మనం ఓడిపోతే చూద్దామనుకునేవాళ్లు ఉంటారు..కానీ నేను గెలుస్తాననే నమ్మేవాళ్లకోసం నేను కష్టపడుతూనే ఉంటానని తెలిపారు. నా నమ్మకం మీద మీ అందరికీ నమ్మకముందని నాకు తెలుసని అన్నారు. సినిమా మొదలైనప్పుడే జడలకు.. మీకు ఓ లాక్ పడుతుందన్నారు. దర్శకుడు శ్రీకాంత్ మాటల్లో చెప్పాలంటే తగలబడిపోతాదన్నారు. చివర్లో ఈ మూవీలోని డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు హీరో నాని. -
ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఫౌజీ లేటేస్ట్ అప్డేట్..!
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ఫౌజీ. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పారు నిర్మాత మైత్రి రవి. ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని ఆయన ప్రకటించారు.ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న రిలీజ్ కావడం లేదని మైత్రి రవి వెల్లడించారు. నాని ది ప్యారడైజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ మూవీ వేరే లెవెల్ అని..బాహుబలి తర్వాత ప్రభాస్‌ను మీరెప్పుడు ఇలా చూడలేదని అన్నారు. అందుకే మరింత ఆలస్యం కానుందని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. #Fauzi Postponed 👍#Prabhas pic.twitter.com/GSgAGudrvb— Balcony Talks (@BalconyTalks_) September 21, 2026 -
ది ప్యారడైజ్.. ఏపీలో టికెట్ ధరల పెంపునకు అనుమతి
నాని ది ప్యారడైజ్ మూవీకి ఏపీలోనూ టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించింది. టిక్కెట్లతో పాటు స్పెషల్ ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇచ్చారు. సెప్టెంబరు 23న వేయనున్న స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర రూ.400(మల్టీప్లెక్స్‌ల్లో), రూ.300( సింగిల్ స్క్రీన్‌లో)గా నిర్ణయించారు. దీంతో పాటు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు ఒక్కో టికెట్ ధరపై మల్టీప్లెక్స్‌లలో రూ.75, సింగిల్ స్క్రీన్‌లో రూ.50 పెంచుకునేందుకు అనుమతించారు. అంతేకాకుండా రోజుకు ఐదు షోలను ప్రదర్శించేందుకు అనుమతి లభించింది.ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించింది. ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అంజనా అంజనా అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ సైతం రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తుండగా.. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
నాని ది ప్యారడైజ్.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది
నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలోని సాంగ్స్‌కు ఇప్పటికే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు మాస్ సాంగ్స్ మాత్రమే రిలీజ్ కాగా.. తాజాగా రొమాంటిక్ పాట విడుదల చేశారు. అంజానా అంజానీ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి కిట్టు విస్సాప్రగత లిరిక్స్ అందించగా.. ఈ పాటను అనిరుధ్ రవిచందర్, సుబ్లాషిణి ఆలపించారు. -
గరివిడి లక్ష్మి.. థియేటర్లకు వచ్చేస్తోంది..!
నిజజీవిత కథలు, సంఘటనలు స్ఫూర్తిగా రాబోతున్న మరో మూవీ 'గరివిడి లక్ష్మి'. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 'నల్లజీలకర్ర మొగ్గ' అని సాగే ఓ పాటని రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 90ల కాలంలో దాదాపు 15 ఏళ్లలో ఏకంగా 10 వేలకు పైగా ప్రోగ్రామ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష్మీ అనే ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో లక్ష్మీ పాత్రలో ఆనంది కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 17న విడుదల చేయనున్నట్లు ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నరేశ్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేక్షక మహాశయులందరికీ విజ్ఞప్తి 📢అక్టోబర్ 17న, మీ అభిమాన థియేటర్లలో మా గరివిడి లక్ష్మి ఆడి పాడి అలరించబోతోంది ❤️❤️❤️#GarividiLakshmi GRAND RELEASE IN THEATRES ON 17th OCTOBER 2026 💥#GarividiLakshmionOct17th @peoplemediafcy @vishwaprasadtg @anandhiactress @smayurk… pic.twitter.com/G4Y0aStFxQ— People Media Factory (@peoplemediafcy) September 21, 2026 -
45 ఏళ్ల వయసులో పెళ్లి కొడుకైన పాపులర్ సింగర్
ప్రముఖ ప్లేబ్యాక్సింగర్ 45 ఏళ్ల వయసులో ఒక ఇంటి వాడయ్యాడు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డుఅందుకున్న నరేష్ అయ్యర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. దీంతో హితులు, సన్నిహితులు నూతన దంపతులకు శుభాకాంక్షల అందించారు. మహారాష్ట్రలోని అయ్యప్ప విష్ణు ఆలయంలో ఈ వేడుక జరిగింది. నరేష్ , ఆయన భార్యకు అభినందనలు తెలుపుతూ ఆలయ అధికారిక పేజీలో షేర్ చేసిన పోస్ట్‌తో వీరి పెళ్లికబురు అభిమానులకు అందించారు. ఆ పోస్ట్‌లో వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు ఉండటం విశేషం. ఈ అందమైన కొత్త అధ్యాయం మా ఆలయంలో ప్రారంభం కావడం మాకు ఎంతో గౌరవప్రదం. ఆ దేవుని దివ్య ఆశీస్సులు నూతన దంపతులకు జీవితాంతం ప్రేమ, సంతోషం, సామరస్యం, శ్రేయస్సును ప్రసాదించుగాక." అని ఆలయ బృందం తన సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటించింది. ఇంతకుమించి వివాహానికి సంబంధించిన ఇతర వివరాలేవీ వెల్లడి కాలేదు. ద్వారా అనేకమంది అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.“Munbe Vaa” singer Naresh Iyer gets married at 45! 💍♥️✨The voice behind one of our most-loved melodies has started a beautiful new chapter. 🥹🧿Wishing him a lifetime of happiness! 🤍 pic.twitter.com/F0F3iGpDk5— 𝑩𝒖𝒕𝒕𝒆𝒓𝒇𝒍𝒚🦋 (@buttu_iam27) September 16, 2026ఇదీ చదవండి: అయోధ్య విరాళాల గోల్మాల్, సిట్ సంచలన నివేదికకాగా 2006లో వచ్చిన 'రంగ్ దే బసంతి' చిత్రంలోని 'రూబరూ' (Roobaroo) పాటకు గాను నరేష్ అయ్యర్ ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 'అన్వర్' చిత్రంలోని 'కన్నినిమ నీలే' (Kanninima Neelae) పాటతో మలయాళ ప్రేక్షకులలో బాగా ప్రాచుర్యం పొందారు. 'ఉస్తాద్ హోటల్'లోని 'మెల్ మెల్ మెల్' (Mel Mel Mel) , 'సెకండ్ షో'లోని 'స్వప్నం' (Swapnam) లాంటి ప్రజాదరణ పొందిన పాటలను కూడా ఆయన పాడారు. 'హార్ట్‌బీట్' (Heartbeat) చిత్రంతో నరేష్ మలయాళంలో గాయకుడిగా అరంగేట్రం చేశారు. View this post on Instagram A post shared by Ayyappa Vishnu Temple Powai (@ayyappavishnutemple)ఇదీ చదవండి: లగ్జరీ హోటల్లో ‘ ‘రోచీ’: పరువుపోయింది, తుకారం ముండే కాస్త చూస్తారా? -
అల్లు అర్జున్ రాకా.. రిలీజ్‌కు ముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాకా రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. అట్లీ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఒకేసారి 37 మంది నటులపై 'రియల్ టైమ్ మోషన్-క్యాప్చర్' నిర్వహించి ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల నుంచి అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ సర్టిఫికేట్ అందుకున్నారు. కాగా బన్నీ- అట్లీ కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ రాకా. వీరిద్దరి కలయికలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో ప్రముఖ టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్(బబ్లూ) కీలకపాత్ర పోషిస్తున్నారు.కాగా.. ఈ సినిమాలో దీపిక పదుకొణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాకుండా జాన్వీ కపూర్ నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని మాఫియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో బన్నీ డ్యూయల్ రోల్ చేయనున్నారని స్పష్టమవుతోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. HISTORY MADE 🏆 A global triumph that takes Indian cinema to the world stage! 🌎#Raaka sets a Guinness World Record for the “Most People Motion-Captured in Real-Time”, with 37 performers captured simultaneously! Mr. Allu Arjun and Mr. Atlee received the Guinness World Records… pic.twitter.com/BuozZNET6K— Sun Pictures (@sunpictures) September 21, 2026 -
ఇరుముడి వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద మరో రికార్డ్
ఇటీవలే రిలీజైన రవితేజ ఇరుముడి సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. తండ్రి, కూతురి సెంటిమెంట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే కలెక్షన్స్‌తో అదరగొట్టింది. ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు. తాజాగా ఈ చిత్రం మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీకి వచ్చినప్పటీ.. వసూళ్ల పరంగా ఇంకా రాణిస్తోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ కనిపించింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ చిత్రంలోని సాంగ్స్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. #Irumudi grosses a HISTORIC 250 CRORES+ WORLDWIDE 💥💥A film that touched generations 💥A story that united the audience ✨A celebration that lives beyond the screen ❤️🔥#Irumudi becomes a historic chapter in cinema ✨MASS MAHARAJA @RaviTeja_offl’s BOXOFFICE RAMPAGE 💥💥A… pic.twitter.com/k249Z7bBuP— Mythri Movie Makers (@MythriOfficial) September 21, 2026 -
నాని ది ప్యారడైజ్.. సెన్సార్ భారీ కట్స్.. ఊహించని రన్‌టైమ్!
నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. మరో నాలుగు రోజుల్లో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు భారీగానే కట్స్ చెప్పారు. దాదాపు 21 సీన్స్ మార్పులు, చేర్పులు సూచించారు. మార్పుల అనంతరం ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్రం రన్ టైమ్ రెండు గంటల 54 నిమిషాల 4 సెకన్లపాటు ఉండనుంది. ఇందులో మితిమీరిన వయొలెన్స్ సీన్స్ ఉండడం వల్లే భారీ కట్స్ చెప్పినట్లు తెలుస్తోంది.కాగా.. ఈ మూవీని 1984–85 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినట్లు నాని వెల్లడించారు. అసలు ఉనికి లేని ఒక జాతి తమ ఉనికి కోసం చేసే తిరుగుబాటు కథాంశంతో రూపొందించినట్లు ఆయన తెలిపారు. సవారీలు అనే తెగకు ఎలాంటి ఐడెంటిటీ ఉండదు.. వాళ్లు ఎవరినైనా చంపినా కేసు ఉండదు.. వాళ్లను చంపినా ఎవరూ పట్టించుకోరు.. ఆ జాతి తమ మనుగడ కోసం చేసిన యుద్ధమే ది ప్యారడైజ్ స్టోరీ అని నాని రివీల్ చేశారు. -
థియేటర్లలో ది ప్యారడైజ్.. ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. ప్రస్తుతం ప్రజలంతా వినాయక చవితి వేడుకలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పల్లెల్లో పండుగ సందడి ముగిసినా.. నగరాల్లో ఇంకా కొనసాగుతోంది. ఇక వారంలో సినీ ప్రియులను అలరించేందుకు నాని ది ప్యారడైజ్ అంటూ దూసుకొస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ హైప్ ఉంది. దీంతో పాటు రాగ్ మయూర్ అనుమాన పక్షి ఒక్క రోజు గ్యాప్‌లోనే థియేటర్లలో విడుదల కానుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే పలు కొత్త సినిమాలు ఈ వారంలో సందడి చేయనున్నాయి. తెలుగు హారర్ థ్రిల్లర్ అగధ మూవీ, బాలీవుడ్ నుంచి పరిణీతి చోప్రా ఎంట్రీ ఇస్తోన్న వెబ్ సిరీస్ షాక్ ట్రస్ట్ నో వన్ అలరించనుంది. అంతేకాకుండా హిందీ మూవీ హుంకార్ ది రోర్, మ్యాంగో పచ్చా లాంటి మలయాళ చిత్రం ఓటీటీకి రానున్నాయి. వీటితో పాటు పలు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారంలో అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్..మినర్వా అకాడమీ(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 22హెబియస్ కార్పస్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 23మై శ్యాడ్ డెడ్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 24బ్లడీ లెగాసీ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- సెప్టెంబర్ 24షాక్ ట్రస్ట్ నో వన్(హిందీ సిరీస్)- సెప్టెంబర్ 24ది డిఫరెంట్ వరల్డ్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 24ది ఫైనల్ ప్రాబ్లమ్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 25యునాబాంబర్ (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 25అమెజాన్ ప్రైమ్ వీడియో..ది లవ్ హైపోథసిస్(హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 23డోంట్ బి షై(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 25జియో హాట్‌స్టార్..హుంకార్ ది రోర్ (హిందీ మూవీ)- సెప్టెంబర్ 25మ్యాంగో పచ్చా(మలయాళ మూవీ)- సెప్టెంబర్ 25జీ5బకైతీ సీజన్-2(హిందీ సిరీస్)- సెప్టెంబర్ 25అగధ(తెలుగు సినిమా)- సెప్టెంబర్ 25ఆపిల్ టీవీ..బ్రదర్స్-(హాలీవుడ్ చిత్రం)- సెప్టెంబర్ 23అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్..రైజ్ అండ్ ఫాల్ సీజన్-2 (హిందీ సిరీస్)- సెప్టెంబర్ 26 -
అనుమాన పక్షి రిలీజ్ ట్రైలర్.. కొత్త డేట్ ఇదే..!
రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ హీరో, హీరోయిన్లుగా వస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ అనుమాన పక్షి. ఈ చిత్రానికి విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక, రాజేశ్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 25న థియేటర్లలో రిలీజ్ కానుంది.ఇప్పటికే ఓ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొదటి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్రైలర్లో కొత్త తేదీని రివీల్ చేశారు. కాగా.. ఈ మూవీలో ప్రిన్స్, రాశి, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. -
10వేల మందికి అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన నాని..! ఫ్యాన్స్‌కు పండగే..
నేచురల్ స్టార్ నాని తన ఫ్యాన్స్‌తో తనకున్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన భారీ ఫ్యాన్స్ మీట్ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న నాని అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు 10 వేల మంది ఫ్యాన్స్ హాజరైన ఈ ఈవెంట్లో నాని వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. అభిమానులను కలుసుకోవడంతో పాటు వారితో ఫొటోలు దిగుతూ ఉత్సాహపరిచారు. వంటకాలతో భోజనం..అంతేకాదు.. కార్యక్రమానికి వచ్చిన అభిమానుల కోసం నాని ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వెజ్, నాన్-వెజ్ వంటకాలతో వారికి ఘనంగా భోజనం పెట్టించారని సమాచారం. కాగా ‘ది ప్యారడైజ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఈ ఫ్యాన్స్ మీట్‌కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఫ్యాన్స్ కోసం నాని తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ప్యారడైజ్ స్టోరీ రివీల్..తాజాగా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హీరో నాని. ప్రమోషన్లలో భాగంగా ప్రెస్‌మీట్ నిర్వహించగా..ఈ మూవీ కథ లైన్ ఏంటో చెప్పేశారు. ఈ మూవీని 1984–85 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినట్లు నాని వెల్లడించారు. అసలు ఉనికి లేని ఒక జాతి తమ ఉనికి కోసం చేసే తిరుగుబాటు కథాంశంతో రూపొందించినట్లు ఆయన తెలిపారు. సవారీలు అనే తెగకు ఎలాంటి ఐడెంటిటీ ఉండదు.. వాళ్లు ఎవరినైనా చంపినా కేసు ఉండదు.. వాళ్లను చంపినా ఎవరూ పట్టించుకోరు.. ఆ జాతి తమ మనుగడ కోసం చేసిన యుద్ధమే ది ప్యారడైజ్ స్టోరీ అని నాని రివీల్ చేశారు. Natural Star @NameisNani with fans ❤️#TheParadise pic.twitter.com/dNf8kNXO64— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) September 21, 2026 -
‘ఎనిమిది గంటలు నీటిలో ఉండడానికి.. నేను చేపనా..’
రష్మిక మందన్న నటిస్తున్న ఆసక్తికరమైన చిత్రాల్లో 'మైసా' ఒకటి. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2026 నవంబర్ 27న విడుదల కానుంది. ఇందులో ఈశ్వరి రావు, రాహుల్ రవీంద్రన్, సముద్రఖని, రావు రమేష్, శివ కందుకూరి, కార్తిక్ రంజిని, తారక్ పొన్నప్ప, నిధి సింగ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మరో రెండు వారాల షూటింగ్ ఉంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.సుమారు 8గంటలు కిందే ఉండమన్నారు..‘మైసా’ కోసం నా లైఫ్‌నే ఇచ్చేశాను. కథ అద్భుతంగా అనిపించింది. డైరెక్టర్ నాతో చాలా రిస్కీ స్టంట్స్ చేయించారు. అండర్ వాటర్‌లో ఫైట్ ఉంది అని డైరెక్టర్ చెప్పారు. నాకు ఈత వచ్చుకదా అని సరే చెప్పా. తీరా చూస్తే.. సుమారు 8గంటలు కిందే ఉండమన్నారు. అదేలా నేను ఏమైనా చేపనా అలా ఉండడానికి అనిపించింది. కథకు తగ్గట్లుగా నిజంగా చేయాలంటే ఎంత కష్టమో అప్పుడే తెలిసింది’ అని చెప్పారు. ఇదే క్రమంలో ఓ అభిమాని మీకు తెలంగాణ భాష వచ్చేసింది అక్కా అని చెప్పగా.. ‘నేను ఏ రకంగా మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదు. పోనిలే మాట్లాడింది మీకు అర్థం అవుతుంది కదా’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.రణబాలి విషయానికి వస్తే.. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమి చిత్రీకరణ పూర్తిచేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఇటీవలే ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. విజయ్, రష్మిక పెళ్లి తరువాత వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదీ చదవండి: కదిలిస్తే.. కన్నీరే.. ఇదే హీరోయిన్ కయాదు జర్నీ #GirlFriend Movie కోసం నా ఎమోషన్ మొత్తం ఇచ్చేశా..#Mysaa Movie కోసం నా లైఫ్‌నే ఇచ్చేశా.:- Actress #RashmikaMandanna pic.twitter.com/DSOXzS9pWC— Milagro Movies (@MilagroMovies) September 20, 2026 -
కృష్ణుడు ఎలిమినేట్.. ‘నీలో మా నాన్న కళ్లు చూసుకున్నా అన్నా..’
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆదివారం ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగింది. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన పాటలతో నాగార్జున స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చారు. ప్రేక్షకులతో ముచ్చటించిన నాగ్.. వారికి ఎవరు నచ్చుతున్నారు? ఎవరి ఆట ఎలా ఉంది? అనే విషయాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయనకు, తనకు ఎంతో ఇష్టమైన చేనేత వస్త్రాలను ధరించినట్లు నాగార్జున తెలిపారు. ప్రతి ఒక్కరూ చేనేతను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ప్రేక్షకులను కోరారు. ఇది ఇలా ఉంటే అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది?. అంతలా ఎమోషనల్ ఎందుకు అయ్యారో ఒకసారి తెలుసుకుందాం.. రండి!ఇదీ చదవండి: ‘పదో తరగతి చదివి.. ఇప్పుడు డైరెక్టర్లు అయ్యాం..’పాటలు.. డ్యాన్సులతో సందడిహౌస్లో వినోదం మొదలైంది. ఝాన్సీ ‘చెమ్కీల అంగీలేసి’ పాట పాడగా.. త్రిగుణ్, అమన్ తమదైన స్టైల్లో బిగ్‌బాస్‌పై పాట పాడి అలరించారు. అనంతరం ముకేశ్, దేబ్జానీ కలిసి ‘ఎవరెవరో’ పాటకు రొమాంటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. వర్షిణి, చరణ్ ‘వస్తున్నాయ్ ఫీలింగ్స్’ పాటకు డ్యాన్స్ చేసి ఎపిసోడ్లో సందడి చేశారు.కృష్ణుడికి ఎండ్ కార్డ్..ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. చివరి రౌండ్లో సృష్టి, కృష్ణుడు మాత్రమే మిగలగా.. వారిలో కృష్ణుడి జర్నీకి ఎండ్ కార్డ్ పడింది. ‘నీ కోసం స్టేజ్‌పై వెయిట్ చేస్తుంటా.. వచ్చేయ్’ అంటూ నాగార్జున చెప్పడంతో కృష్ణుడు ఇంటి సభ్యులకు వీడ్కోలు పలికారు. బయటకు వెళ్తూ కృష్ణుడు మాత్రం తన ఎలిమినేషన్‌పై బాధపడటం లేదని చెప్పారు. గత వారం తాను చాలా లోగా ఉన్నానని, సరిగ్గా ఆడలేకపోయానని అంగీకరించారు. ‘నేను ఆడలేనందుకు బాధపడటం లేదు. నేను వెళ్లిపోతానని మీకు ముందే చెప్పాను. నేను ట్రై చేశా.. కానీ ఆడలేకపోయాను. అందరూ బాగా ఆడండి. స్ట్రాంగ్ గేమ్ ఆడాలంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండాలి. ఇక్కడ చాలా మంది ఉన్నారు’ అని కృష్ణుడు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చారు.ఇదీ చదవండి: నన్ను బతికుండగానే చంపేశారు కదరా.. నటి భావోద్వేగం..కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్కృష్ణుడు బయటకు వెళ్తున్న సమయంలో రోహిత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ‘మీ కళ్లు మా నాన్నలాగే ఉంటాయి అన్నా. మీరు వెళ్లిపోతుంటే ఆ కళ్లను చూసే ఛాన్స్ కూడా నాకు ఉండదు’ అంటూ రోహిత్ ఏడ్చాడు. అది చూసిన కృష్ణుడు కూడా ఎమోషనల్ అయ్యారు. తనకంటే చిన్నవాళ్లను అర్థం చేసుకోవడంలో కొన్నిసార్లు విఫలమయ్యానని కృష్ణుడు చెప్పారు. ‘నేను కూడా అలా రియాక్ట్ అయ్యి ఉండాల్సింది కాదు. నేను కూడా ఫీల్ అవుతున్నా. కోపంలో కంట్రోల్ చేసుకోలేకపోయాను. మీ అందరికంటే పెద్దోడ్ని అయినా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను’ అంటూ కృష్ణుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆరోగ్యం గురించి కృష్ణుడు ఏమన్నాడంటే..ఎలిమినేషన్ అనంతరం స్టేజ్‌పైకి వచ్చిన కృష్ణుడు నాగార్జునతో తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. ‘నేను చేసిన మిస్టేక్ ఏంటంటే.. గత ఎనిమిది రోజులుగా షుగర్ తినడం మానేశాను. ఇలా అయితే హెల్త్‌కు బెనిఫిట్ అవుతుందని అనుకున్నాను. కానీ వీక్ అవుతానని అనుకోలేదు. అది రివర్స్ అయ్యింది. నేను కనీసం పది కేజీల స్వీట్స్ తింటాను. సడెన్‌గా షుగర్ మానేయడంతో వీక్ అయిపోయాను. దాని ఎఫెక్ట్ చాలా చూపించింది’ అని కృష్ణుడు తెలిపారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. బయటకు వెళ్లిన తర్వాత కూడా మెల్లగా షుగర్‌ను తగ్గించుకుంటూ రెండు నెలల్లో పూర్తిగా మానేయాలని సూచించారు.వచ్చే వారం..బిగ్‌బాస్ తెలుగు 10లో వచ్చే వారం కంటెస్టెంట్లకు మరో ఆసక్తికరమైన టాస్క్ ఎదురుకానుంది. ‘Temptation vs Tension’ పేరుతో జరగనున్న ఈ గేమ్‌లో కంటెస్టెంట్లకు ఎలాంటి ఛాలెంజ్‌లు ఎదురవుతాయి? ఎవరెవరు టెంప్టేషన్స్కు లొంగుతారు? ఎవరెవరు ఒత్తిడిని తట్టుకుని నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే వారం ఈ గేమ్ హౌస్‌లో కొత్త గొడవలకు, ట్విస్టులకు కారణమయ్యేలా కనిపిస్తోంది. ఇలా కృష్ణుడి ఎలిమినేషన్‌తో ఒకవైపు భావోద్వేగం.. మరోవైపు పాటలు, డ్యాన్సులతో ఆదివారం ఎపిసోడ్ సాగింది. ఇదీ చదవండి: ‘రామాయణ’ ఈ వెర్షన్లో 30 నిమిషాల నిడివి తగ్గింపు! -
ఎమోషన్... థ్రిల్
దినేష్ తేజ్, దశ్విక .కె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం. ‘తత్వం’. అర్జున్ కోల దర్శకత్వంలో వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా అర్జున్ కోల మాట్లాడుతూ – ‘‘మన చుట్టూ జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ కథను తయారు చేసుకున్నాను. వంశీగారి ‘అన్వేషణ’ సినిమా తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. ఈ చిత్రంలోని ఓ ట్విస్ట్ ప్రేక్షకులకు షాకింగ్‌గా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘మంచి ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా ఇది’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: చేతన్ భరద్వాజ్. -
స్టైలిష్ లుక్‌లో నమ్రతా.. ఫ్రెండ్స్‌తో ఆషిక రంగనాథ్ చిల్..!
లేహ్‌లో హీరోయిన్ శ్వేతాబసుప్రసాద్ చిల్..స్టైలిష్ లుక్‌లో మహేశ్ బాబు సతీమణి నమ్రతా..ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తోన్న ఆషిక రంగనాథ్..శారీలో హీరోయిన్ తమన్నా అందాలు..అనంతిక సనిల్‌కుమార్ నేచురల్ లుక్స్.. View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
ట్రైలర్ లేకుండానే ది ప్యారడైజ్.. స్టోరీ లైన్ చెప్పేసిన నాని..!
నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. మరో నాలుగు రోజుల్లో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హీరో నాని. ప్రమోషన్లలో భాగంగా ప్రెస్‌మీట్ నిర్వహించగా..ఈ మూవీ కథ లైన్ ఏంటో చెప్పేశారు. ఈ మూవీని 1984–85 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినట్లు నాని వెల్లడించారు. అసలు ఉనికి లేని ఒక జాతి తమ ఉనికి కోసం చేసే తిరుగుబాటు కథాంశంతో రూపొందించినట్లు ఆయన తెలిపారు. సవారీలు అనే తెగకు ఎలాంటి ఐడెంటిటీ ఉండదు.. వాళ్లు ఎవరినైనా చంపినా కేసు ఉండదు.. వాళ్లను చంపినా ఎవరూ పట్టించుకోరు.. ఆ జాతి తమ మనుగడ కోసం చేసిన యుద్ధమే ది ప్యారడైజ్ స్టోరీ అని నాని రివీల్ చేశారు.ఈ సినిమాలో ఒకట్రెండ్ ఎపిసోడ్స్‌ను శ్రీకాంత్ మరింత ఎక్స్ట్రీమ్గా తీశాడని అన్నారు. నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్స్ అవేనని పంచుకున్నారు. యాక్షన్ సీన్స్ ఒక కమర్షియల్ మాస్ సినిమాలో ఇలా ఉంటాయా అని థియేటర్లలో ఆడియన్స్ షాక్ అవుతారని అన్నారు. తాను మేకప్ వేసుకోవడానికి గంటన్నర పడితే.. జడల వల్ల రోజంతా వెనుకకు ఆనుకోవడానికి కూడా టైమ్ ఉండేది కాదని వెల్లడించారు. కొన్నిసార్లు ఏకంగా 36 గంటల పాటు షూట్ చేశామని.. లోపల స్కాల్ప్ అంతా ఎర్రబడి గాయాలయ్యాయని తాను పడ్డ కష్టాన్ని వివరించారు. జడల వల్ల ఎన్నో గాయాలు అయినా ప్రతీ షాట్ నేనే చేశా... థియేటర్లలో ప్రతీ ఫైట్, ప్రతీ పంచ్ పూనకాలు తెప్పిస్తుందని హైప్ పెంచేశారు నాని. -
రష్మిక యాక్షన్ మూవీ.. టీజర్ వచ్చేసింది
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా లీడ్ రోల్లో వస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ మైసా. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌లో రష్మిక లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను' అనే రష్మిక డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమైంది. ఈ టీజర్ చూస్తుంటే తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే మహిళ పాత్రలో రష్మిక కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'యుద్ధానికి ఆయుధమంటే భయం కానీ.. ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు' అనే డైలాగ్ మైసాపై మరింత ఆసక్తి పెంచుతోంది. రష్మిక ఫైట్ సీన్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బేజోయ్ సంగీతమందిస్తున్నారు. No fear to hold.No truth to hide.Just ONE promise to keep.#Mysaa – A DAUGHTER’S PROMISE.#MysaaTeaser out now ❤️🔥-- https://t.co/kUg5j4XxA0IN CINEMAS WORLDWIDE ON 27.11.26. 💥@iamRashmika @RawindraPulle @jakes_bejoy @unformulafilms @TSeries @tseriessouth pic.twitter.com/AJCj8izHPY— UnFormula Films (@unformulafilms) September 20, 2026 -
ది ప్యారడైజ్ ప్రీమియర్ షో.. టికెట్ ధర ఎంతంటే?
నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. మరో నాలుగు రోజుల్లో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ది ప్యారడైజ్ టీమ్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్‌లో మొదటి నాలుగు రోజులు రూ.48 పెంచుకోవచ్చని తెలిపింది. మల్టీప్లెక్స్‌లో రూ.94 అదనంగా వసూలు చేసేందుకు ఓకే చెప్పింది. ఆ తర్వాత 28వ తేదీ నుంచి అక్టోబరు 3 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.23, మల్టీప్లెక్స్‌ల్లో రూ.45 పెంచుకోవచ్చని వెసులుబాటు కల్పించింది.అంతేకాకుండా తెలంగాణలో ఈనెల 23న సాయంత్రం 6:30 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. ప్రతి రోజు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా పర్మిషన్ వచ్చేసింది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీకి చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్ ఎల్ఎల్పీ రూ.కోటి అందజేసింది. -
మెగాస్టార్ విశ్వంభర.. రిలీజ్ డేట్ వైరల్..!
మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రాల్లో విశ్వంభర ఒకటి. ఈ ఏడాది సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. బింబిసార ఫేమ్ వశిష్ఠ తెరకెక్కించిన ఈ సోషల్ ఫాంటసీ చిత్రం రిలీజ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. చిరు మరో మూవీ కాకా.. వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుండగా.. విశ్వంభరపై మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు.అయితే ఇటీవల ఓటీటీ డీల్ కుదిరినట్లు వార్తలొచ్చాయి. దీంతో మరోసారి విశ్వంభర రిలీజ్‌పై చర్చ మొదలైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో టాక్ వినిపిస్తోంది. ఇదే ఏడాదిలోనే విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రానుందని లేటేస్ట్ టాక్ వైరలవుతోంది. వచ్చేనెల దసరాకు టైమ్ సరిపోనందున వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.అయితే దసరా తర్వాత నవంబర్‌లో విశ్వంభర రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ఈ ఏడాదిలోనే విశ్వంభర చూసే ఛాన్స్ మెగా ఫ్యాన్స్‌కు దక్కనుంది. రాబోయే రోజుల్లోనైనా రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వస్తుందేమో వేచి చూడాల్సిందే. కాగా..విశ్వంభరలో చిరు సరసన త్రిష హీరోయిన్గా చేసింది. ఈ చిత్రంలో సురభి, ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషించగా.. కీరవాణి సంగీతమందించారు. -
ఏజ్ ఉంది.. ఓపిక ఉంది.. అన్ని నేనే చేశా : నాని
స్టార్ హీరోల సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తెరపై హీరో ఎంత రిస్క్ తీసుకున్నట్లు కనిపించినా.. వాస్తవానికి కొన్ని యాక్షన్ సీన్లను డూప్‌ల సాయంతో పూర్తి చేయడం సాధారణమే. ముఖ్యంగా ప్రమాదకరమైన ఫైట్లు, హై-రిస్క్ స్టంట్స్ ఉన్నప్పుడు హీరోలకు బదులుగా డూప్‌లు రంగంలోకి దిగుతుంటారు. కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం తన సినిమాల విషయంలో ఈ పద్ధతికి వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడట. తనకు డూప్‌తో సన్నివేశాలు చేయించడం అసలు ఇష్టం లేదని చెబుతున్నాడు.నాని నటించిన భారీ మాస్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’ ఈ నెల 24న విడుదల కాబోతుంది.మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాలోని యాక్షన్ సీన్లను డూప్‌తో చేశారా? లేక మీరే చేశారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. నాని ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.‘నాకిప్పుడు ఏజ్ ఉంది.. ఓపిక ఉంది..అందుకే అన్నీ నేనే చేశాను. 50 ఏళ్లు దాటిన తర్వాత డూప్‌ని పెడతానేమో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం నా సినిమాల్లో డూప్‌ని పెట్టడం నాకు నచ్చదు. నా సినిమాలో ఒక్క డూప్ షాట్ కనిపించినా ఎంజాయ్ చేయలేను. సినిమా చూస్తున్నప్పుడు ఆ షాట్ నాది కాదనుకోండి.. సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూనే.. ఆ సీన్ రాగానే ‘అబ్బా.. డూప్ షాట్’ అనుకుంటా. దాన్ని నేను ఓన్ చేసుకోలేను. ప్రశంసలు కూడా తీసుకోలేను. ఎవరైనా ‘నాని బాగా చేశావ్’ అంటే.. ‘ఆ నాలుగు డూప్ షాట్లు తప్పితే’ అని నా మనసు నాకు చెబుతూనే ఉంటుంది. అందుకే చిన్న చిన్న లెగ్ షాట్స్ కూడా నేనే చేస్తా. ఒక్కోసారి అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలాంటి సీన్లను డూప్‌తో చేద్దామని అనుకుంటారు. కానీ నేను ముందుగానే వాళ్లకు చెబుతా.. నా సీన్లన్నీ నేనే చేస్తానని చెప్పి క్యారవ్యాన్‌లోకి వెళతా. అయితే ఈ కసి, ఓపిక మరో పదేళ్ల తర్వాత కూడా ఇలాగే ఉంటుందో లేదో చెప్పలేను. ప్రస్తుతానికి మాత్రం సినిమాల్లో డూప్ లేకుండా వీలైనంత వరకు అన్ని సన్నివేశాలను నేనే చేయాలని అనుకుంటున్నాను’అని నాని చెప్పుకొచ్చాడు. -
చిరు లీక్స్.. కాకాలో మెగాస్టార్ రోల్ ఇదే..!
చిరంజీవి హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కాకా. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.అయితే మెగాస్టార్ అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించి లీక్స్ చేస్తుంటారు. గతంలో చాలాసార్లు టైటిల్స్ లీక్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తుంటారు. తాజాగా కాకాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని లీక్ చేశారు. ఈ మూవీలోని తన పాత్ర పేరును బయట పెట్టేశారు. ఇటీవల ఓ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి తన రోల్ వెల్లడించారు.కాకాలో తాను కదిరి కాళీదాస్ పాత్రలో కనిపించనున్నట్లు చిరు వెల్లడించారు. తన పక్కనే ఉన్న యాంకర్ స్రవంతిని చూపిస్తూ.. తన ఊరి పేరునే తన క్యారెక్టర్లో పెట్టుకున్నానని నవ్వుతూ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. కాకా… కదిరి కాళిదాస్ ❤️🔥❤️🔥❤️🔥#KAAKA - JAN 13th Sankranthi 2027🔥#KAAKAOnJan13 pic.twitter.com/tfaa5Nmadk— Kaaka (@KaakaMovie) September 20, 2026 -
శోభిత కొత్త సినిమా.. కోడలిపై నాగార్జున ప్రశంసలు
అక్కినేని కోడలు శోభిత ధూళిపాల నటిస్తోన్న లేటేస్ట్ మూవీ వెట్టువం. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి వరల్డ్ ఆఫ్ వెట్టువం పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ప్రాచీన యుద్ధ కళలను చూపించారు. ఈ సీన్స్ కోసం నటీనటులు యుద్ధ కళలు నేర్చుకున్నారని వెల్లడించారు. దాదాపు ఐదు నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచేసింది.ఈ మూవీ శోభిత రోల్ మరింత ఇంట్రెస్టింట్‌గా ఉండనుందని ఈ వీడియోలో చూస్తే అర్థమవుతోంది. ఇది వీక్షించిన హీరో నాగార్జున.. కోడలిపై ప్రశంసలు కురిపించారు. శోభిత పడుతున్న కష్టాన్ని ప్రశంసించారు. ఈ మూవీ కోసం ఆత్మరక్షణ కళలను నేర్చుకున్న శోభితన ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ సినిమా కోసం శోభిత చాలా కష్టపడినట్లు కనిపిస్తోంది.. వెట్టువం వీడియో చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని నాగ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాగా.. ఈ సినిమాలో శోభిత రాధి అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
వినాయక నిమజ్జనంలో దిల్ రాజు సతీమణి మాస్ డ్యాన్స్..వీడియో వైరల్
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనోత్సవాలు భక్తుల కోలాహలం మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాలు సందడిగా మారాయి. డప్పు చప్పుళ్లు, డీజే పాటలు, నృత్యాలతో యువత, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు కూడా నిమజ్జన వేడుకల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దిల్ రాజు కూడా తన కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం నిమజ్జన కార్యక్రమంలో ఆయన సతీమణి తేజస్వినితో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తీన్మార్ పాటకు దిల్ రాజు తన సతీమణితో కలిసి స్టెప్పులు వేస్తూ కనిపించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఆయన ఉత్సాహంగా నృత్యం చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.నిన్న గణేశ్ నిమజ్జనం వేడుకల్లో నిర్మాత #DilRaju జోష్ pic.twitter.com/gP4if8uslS— Rajesh Manne (@rajeshmanne1) September 20, 2026దిల్ రాజు వైఫ్ తేజస్విని తీన్మార్ డాన్స్ 🔥💃ఫుల్ మాస్ ఎనర్జీ… అదిరిపోయిందిగా! 🔥😍#Tejaswini #TeenmaarDance #DilRaju pic.twitter.com/jXjJvDqK0l— Janya Digital Media (@janyamedia1) September 19, 2026 -
‘పదో తరగతి కలిసి చదివాం.. ఇప్పుడు డైరెక్టర్లు అయ్యాం..’
అనీష్, అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. మహేశ్ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 30న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన లేడీ డైరెక్టర్ మానస శర్మ దర్శకుడు మహేష్ ఉప్పాల గురించి మాట్లాడే సమయంలో బాగా ఎమోషనల్ అయ్యారు.చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ..చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ స్నేహం గురించి మాట్లాడుతూ... ‘నేను, మహేశ్ పదో తరగతి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మేం క్లాస్మేట్స్. పదో తరగతిలో ఉన్నప్పుడు ఫిల్మ్ మేకర్స్ అవ్వాలని అనుకున్నాం. ఈ రోజు నేను రాకాస డైరెక్టర్ని. మహేశ్ కూడా ‘ఇట్లు అర్జున’ దర్శకుడు అయ్యాడు. నిజంగా నా జీవితంలో అత్యంత హ్యాపీ మూమెంట్ ఇదే. నేను 'రాకాస' కూడా ఇంతలా ఎమోషనల్ అవ్వలేదేమో అని కన్నీరు పెట్టుకున్నారు. ఇదీ చదవండి: మూగవాడిగా హీరో.. ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుంది -
సినిమా పండుగకు సిధ్ధం.. వేదిక మారింది.. ప్రత్యేకత ఎంటంటే?
భారతీయ సినీ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జాతీయ చలనచిత్ర అవార్డులు చరిత్రలో తొలిసారిగా మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. ఇక నుంచి నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానాన్ని దేశరాజధాని ఢిల్లీకే పరిమితం చేయడం లేదు. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వేదికను మారుస్తున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తాజా అవార్డుల ప్రదానం గుజరాత్‌లోని నర్మదా జిల్లా ఏక్తా నగర్ (కేవడియా) లో ఈ సెప్టెంబర్ 22, మంగళవారం జరగనుంది.1970లో ఓసారి మద్రాసులో...1954లో తొలి జాతీయ అవార్డుల నాటి నుంచి ఇప్పటివరకు అనేక దశాబ్దాలుగా ఢిల్లీ వేదికగానే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం సాగుతూ వచ్చింది. ఒకే ఒక్కసారి 1969వ సంవత్సరానికి సంబంధించిన 17వ జాతీయ అవార్డుల ప్రదానం మాత్రం మద్రాసులో జరిగింది. 1970 నవంబర్ 21న మద్రాసులోని యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో ఆ ఉత్సవాన్ని చేశారు. అయితే, ఆ తర్వాత గత 55 ఏళ్ళలో నేషనల్ అవార్డుల ప్రదానోత్సవం వేదికను మార్చే ప్రయత్నం జరగలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు తొలిసారిగా ఈ ఏడాది వేదిక మారుతోంది. ఏటేటా రాష్ట్రపతి చేతుల మీదుగా సాగే ఈ ప్రదానోత్సవం... ఈసారీ అదే సంప్రదాయాన్ని మాత్రం కొనసాగించనుంది. ఈ నెల ద్వితీయార్ధంలో గుజరాత్ పర్యటనలో ఉండనున్న భారత రాష్ట్రపతి ఈ 72వ జాతీయ అవార్డులను విజేతలకు అక్కడే అందజేయనున్నారు. 2024వ సంవత్సరానికి గాను నేషనల్ అవార్డు విజేతల పేర్లను మొన్న జూలైలో ప్రకటించిన సంగతి తెలిసిందే.విగ్రహం వద్దే వేదికకై ఏర్పాట్లునర్మదా తీరంలో 2018లో ఏర్పాటైన 597 అడుగుల వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ)తో గుజరాత్‌లోని ఏక్తా నగర్ కొంతకాలంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహ నిర్మాణంగా రికార్డులకెక్కిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ దగ్గర ఈ అవార్డుల ప్రదానోత్సవం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 2024వ సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు గాను అందించనున్న తాజా నేషనల్ అవార్డ్స్ ఉత్తమ చిత్రంగా ‘ఆర్టికల్ 370’ ఎంపికైంది. ఉత్తమ నటిగా యామీ గౌతమ్ (‘ఆర్టికల్ 370’), ఉత్తమ నటుడి కేటగిరీలో మమ్మూట్టి (‘భ్రమయుగం’), కార్తీక్ ఆర్యన్ (‘చందు ఛాంపియన్’)లు సంయక్తంగా విజేతలయ్యారు. ఈసారి నాన్ ఫీచర్ కేటగిరీలో ఉత్తమ దర్శకుడి అవార్డు ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ – ఏక్తా కా ప్రతీక్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ ఎల్. రాయ్‌కి రావడం విశేషం. ఇప్పుడు సరిగ్గా అదే ప్రాంతంలో జాతీయ అవార్డుల ప్రదానం జరగడం గమనార్హం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, తుళు, మరాఠీ, గఢ్వాలీ సహా వేర్వేరు భాషల్లో రూపొందించిన చిత్రాలు అవార్డులను అందుకోనున్నాయి. సంథాలీ భాషలో రూపొందిన ఓ సినిమాకి తొలిసారిగా నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు దక్కడం విశేషం.మార్పు ఎందుకంటూ విమర్శలు‘అవార్డుల ప్రదాన వేదికను ఢిల్లీ నుంచి మారిస్తే మార్చారు కానీ, గుజరాత్‌కి మార్చడమేమిట’ని జాతీయ అవార్డుగ్రహీత – సినీ దర్శకుడు రాహుల్ డోలకియా సహా పలువురు ఇప్పటికే విమర్శించారు. అయితే, ఇక నుంచి ఏటేటా వేర్వేరు నగరాల్లో ఉత్సవం జరపాలన్నది సరికొత్త విధాన నిర్ణయమనీ, అందులో భాగంగా ఈ ఏడాది గుజరాత్‌తో ఆ మార్పుకు శ్రీకారం చుట్టామనీ, రాబోయే సంవత్సరాల్లో వేరే నగరాలూ ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఆతిథ్యమిస్తాయనీ అధికార వర్గాలు వివరిస్తున్నాయి. దేశమంతటినీ ఒకే తాటి మీదకు తెచ్చేందుకు ఈ ప్రయత్నం ఉపకరిస్తుందనీ చెబుతున్నాయి. ఆ వాదనపైనా రాజ్ ఠాక్రే లాంటి రాజకీయ నేతలు కొందరు విమర్శించారు. ‘ఒకవేళ దేశ రాజధాని బయట అవార్డుల ప్రదానం చేయాలనుకుంటే, బొంబాయి మొదలు భారతీయ సినిమాను ఇవాళ ప్రపంచ పటంపై నిలుపుతున్న హైదరాబాద్ సహా దక్షిణాది నగరాలు ఎంచుకోవాల్సింద’ని ఆయన ధ్వజమెత్తారు. కాగా, ప్రముఖ నటుడు పరేశ్ రావల్ లాంటి మరికొందరు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. ‘భారతదేశంలో గుజరాత్ అంతర్భాగమే కదా! అదేమీ పాకిస్తాన్ కాదు. అలాంటప్పుడు గుజరాత్లో ఎందుకు అవార్డుల ప్రదానోత్సవం చేయకూదు?’ అని ఘాటుగా జవాబిస్తున్నారు.జాతీయ అవార్డులకు... అలా శ్రీకారం!1953లోజాతీయ ఫిల్మ్ అవార్డులు ఇవ్వడం ఆరంభమైంది. 1953లో నిర్మాణమైన ఉత్తమ చలన– చలన చిత్రాలకు గాను 1954లో తొలిసారిగా ఈ అవార్డుల ప్రదానం చేశారు. నిజానికి, ఉత్తమ ప్రమాణాలను గుర్తించి, ప్రోత్సహిస్తూ ఇలా ప్రభుత్వమే సినిమాలకు అవార్డులు ఇవ్వడమనేది అప్పటికి ఇంకా ఏ దేశంలోనూ లేదట. అప్పటికే, అంతర్జాతీయ సినీ ప్రపంచంలో ‘ఆస్కార్ అవార్డులు’ పేరొందాయి. కానీ, అవి ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కావు. అలాగే, అప్పటికే ‘నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఆఫ్ బ్రిటన్’ కూడా ఉన్నాయి కానీ, అవి కూడా అక్కడి ప్రభుత్వం ఇచ్చే అవార్డులేమీ కావు. వెరసి, ఒక దేశ ప్రభుత్వం సినీ రంగాన్ని గుర్తించి, గౌరవించి అవార్డులివ్వడమనే సంస్కృతికి మనమే శ్రీకారం చుట్టినట్టయిందన్న మాట.అప్పట్లో తొమ్మిది అవార్డులే!చలనచిత్ర విచారణ సంఘం (ఫిల్మ్ ఎంక్వైరీ కమిటీ) ఇచ్చిన సిఫార్సు దృష్ట్యా ఈ అవార్డులను కేంద్ర సర్కార్ ఏర్పాటు చేసింది. అయితే ఆచరణ రీత్యా ఆ సిఫార్సుకు కొన్ని మార్పులు చేర్పులు చేసింది. అప్పట్లో జాతీయ అవార్డులంటే అఖిల భారత స్థాయిలో అంతా కలిపి తొమ్మిదే తొమ్మిది అవార్డులుండేవి. జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం, ఉత్తమ డాక్యుమెంటరీలకు రాష్ట్రపతి బంగారు పతకాలు ఇచ్చేవారు. అలాగే, ఉత్తమ బాలల చిత్రానికి ‘ప్రధానమంత్రి పతకం’ అందించేవారు. అవే కాకుండా, పై మూడు విభాగాల్లోనూ రెండేసి చొప్పున ప్రశంసా పత్రాలు అందజేసేవారు. అంతే!ఆ వేదికపైనే చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీతొట్ట తొలి జాతీయ అవార్డుల ప్రదానోత్సవమే మరో కీలక ఘట్టానికి కూడా వేదికైంది. ఆ తొలి అవార్డుల్లో భాగంగానే ఉత్తమ బాలల చిత్రానికి ప్రధానమంత్రి పతకం అందిస్తామని ప్రకటించారు కానీ, వచ్చిన ఎంట్రీలేవీ తగిన ప్రమాణాలతో లేవు. ‘ఖేలా ఘర్’ అనే బెంగాలీ సిని మాకు ప్రశంసా పత్రం మాత్రం బహూకరించి, సరిపెట్టాల్సి వచ్చింది. ఇలా లాభం లేదని, బాలల చిత్రాలనుప ప్రోత్సహించడం కోసం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి డాక్టర్ బి.వి. కేస్కర్ ఆ అవార్డుల ప్రదానోత్సవం వేదికపైనే ‘చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ’ అనే రిజిస్టర్డ్ సంస్థను ్ర΄ారంభించనున్నట్టు ప్రకటించారు.రెండో ఏడాది నుంచి ప్రాంతీయ భాషల్లోనూ...జాతీయ అవార్డులు ఆరంభమైన రెండో ఏడాదే ప్రాంతీయ భాషలకూ ప్రత్యేకంగా అవార్డులివ్వడం ప్రారంభించారు. జాతీయ స్థాయి ఉత్తమ చిత్రానికి ఇచ్చే రాష్ట్రపతి బంగారు పతకంతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లోని ఉత్తమ చిత్రాలకు రాష్ట్రపతి రజత పతకం అందించే విధానాన్ని ప్రవేశపెట్టారు. అలా ప్రాంతీయ భాషా చిత్రాలకూ జాతీయ గుర్తింపు ఇవ్వడం ప్రారంభించగానే... ఆ ఏడాదికి తెలుగులో వాహినీ వారి ‘పెద్ద మనుషులు’ రాష్ట్రపతి రజత పతకం అందుకుంది. అలాగే, స్వీయ నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్స్పై హీరో ఎన్టీఆర్ నిర్మించి, నటించిన ‘తోడుదొంగలు’, అక్కినేని – భానుమతి నటించిన భరణీ పిక్చర్స్ వారి ‘విప్రనారాయణ’ చిత్రాలకు ప్రశంసా పత్రాలు లభించాయి. ఆ తర్వాత ఎప్పటికప్పుడు కొత్త కేటగిరీలలో అవార్డులను ప్రవేశపెట్టడంతో, అవార్డుల జాబితా అంతకంతకూ విస్తరించింది.దక్షిణాన అందరి కన్నా ముందే... ఆంధ్రప్రదేశ్! కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్రాలలో మున్ముందుగా అడుగులు వేసింది... హిందీ చిత్రపరిశ్రమకు కేంద్రమైన బొంబాయి నగరం ఉన్న మహారాష్ట్ర. 1962 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం ఇలా రాష్ట్ర స్థాయి సినిమా అవార్డులతో మరాఠీ చిత్రపరిశ్రమను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. ఆ వెంటనే రెండేళ్ళకు దక్షిణాదిలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుల పేరిట 1964 నుంచి ఉత్తమ తెలుగు చలనచిత్రాలకు అవార్డులిచ్చి, అభినందించడం ఆరంభించింది. అప్పటికి దక్షిణాది భాషా చిత్ర పరిశ్రమలన్నీ మద్రాసులోనే ప్రధానంగా కేంద్రీకృతమై ఉన్నాయి. అయినప్పటికీ, తమిళనాడు తదితర రాష్ట్రాలన్నిటి కన్నా మున్ముందుగా తెలుగు రాష్ట్రమే ఈ రకమైన ప్రాంతీయ అవార్డుల సంస్కృతికి శ్రీకారం చుట్టడం విస్మరించరాని విశేషం. తమిళనాడు సైతం 1967 నుంచి తమ రాష్ట్రంలో ఫిల్మ్ అవార్డులను ఇవ్వనారంభించింది.మన తెలుగు మెరుపులుఒకప్పుడు జాతీయ అవార్డులకూ, తెలుగు సినిమాకూ చుక్కెదురు. మహా అయితే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే తప్ప తెలుగు సినిమాలు పెద్దగా జాతీయ స్థాయిలో కనిపించేవి కావు. జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు లాంటివి మనకెప్పుడూ అందని ద్రాక్షలుగానే ఉండేవి. తెలుగు నటి శారద లాంటి వాళ్ళు మలయాళం (‘తులాభారం’–1968, ‘స్వయంవరం’– 1972) నుంచి తెలుగు (‘నిమజ్జనం’–1977) దాకా వేర్వేరు భాషా చిత్రాల్లో నటనతో మూడు సార్లు ‘జాతీయ ఉత్తమ నటి’ అవార్డు అందుకోవడం ఒక్కటే కాస్త ఊరటగా ఉండేది.ఆనాడు ‘శంకరాభరణం’... ఇటీవల ‘బాహుబలి’కె. విశ్వనాథ్ ‘శంకరాభరణం’ 1979వ సంవత్సరానికి గాను తొలిసారిగా జాతీయ స్థాయిలో స్వర్ణకమలం (ప్రత్యేక విభాగంలో) సాధించింది. ఆ 27వ జాతీయ అవార్డుల్లో ‘అత్యధిక ప్రజాదరణ, పూర్తి స్థాయి వినోదం, కళాత్మక విలువలు నిండిన చిత్రం’గా ‘శంకరాభరణం’ స్వర్ణకమలాన్ని సాధించింది. జాతీయ అవార్డులు మొదలయ్యాక ఉత్తమ చిత్రాల కేటగిరీలో ఒక తెలుగు సినిమా స్వర్ణకమలం సాధించడం అదే ప్రథమం. అయితే, విచిత్రం ఏమిటంటే, ఆసారి జ్యూరీకి సారథి సాక్షాత్తూ తెలుగు దర్శక – నిర్మాత ఎల్వీ ప్రసాద్. అయినప్పటికీ, కారణాలేమో కానీ, అన్ని అర్హతలూ ఉన్న ‘శంకరాభరణం’ కన్నా ఓ సాధారణ హిందీ చిత్రం (‘శోధ్’)కి ఆయన జ్యూరీ పెద్దపీట వేయడం శోచనీయం. ‘శంకరాభరణం’ తర్వాత 63వ జాతీయ అవార్డుల్లో మన తెలుగు ‘బాహుబలి–1’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. దర్శకుడు రాజమౌళి తొలిసారిగా పూర్తి స్థాయిలో తెలుగు సినిమాను జాతీయ ఉత్తమ చిత్రం కేటగిరీలో అగ్రస్థానంలో నిలిపారు. అలా ‘శంకరాభరణం’ తర్వాత రెండోసారి స్వర్ణకమలం సాధించిన మన సినిమా ‘బాహుబలి’ అయ్యింది. ‘శంకరాభరణం’ చిత్రానికి 4 జాతీయ అవార్డులొస్తే, ఆపైన వచ్చిన బి. నరసింగరావు ‘దాసి’ (1988) చిత్రం 36వ జాతీయ అవార్డుల్లో ఏకంగా 5 (ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, ఉత్తమ కళాదర్శకుడు) పురస్కారాలు గెలుచుకుంది. ఒక తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో అన్ని అవార్డులు రావడం అదే ప్రథమం. తర్వాత రోజుల్లో నటి విజయశాంతి 1990వ సంవత్సరానికి గాను 38వ జాతీయ అవార్డుల్లో ‘కర్తవ్యం’ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు జాతీయ ఉత్తమ నటిగా నిలిచారు.సంస్కృతంలో తెలుగు వారికి స్వర్ణకమలం!తెలుగు సినిమా కాక΄ోయినప్పటికీ, ఓ తెలుగు నిర్మాత నిర్మించిన చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా స్వర్ణకమలం సాధించడం ఒకే ఒక్కసారి జరిగింది. అది జి.వి. అయ్యర్ దర్శకత్వంలో వచ్చిన సంస్కృత చిత్రం ‘భగవద్గీత’. 1992వ సంవత్సరానికి గాను ఇచ్చిన 40వ జాతీయ అవార్డుల్లో దేశమంతటిలోకీ అత్యుత్తమ చిత్రంగా ‘భగవద్గీత’ నిలిచింది. అంతటి ఘనత సాధించిన ఆ చిత్రాన్ని నిర్మించింది మన తెలుగువాడైన ప్రముఖ ΄ారిశ్రామికవేత్త, సినీ నిర్మాత టి. సుబ్బరామిరెడ్డి కావడం విశేషం.పెరుగుతున్న తెలుగు గాలి!జ్యూరీల్లో తెలుగు వారికి పెరిగిన ప్రాధాన్యం సహా అనేక కారణాల వల్ల ఇటీవల జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా మునుపటి కన్నా మెరుగైన ఫలితాలే సాధిస్తోంది. ఆ మధ్య 2018వ సంవత్సరానికి గాను 66వ జాతీయ అవార్డుల్లో నటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో నటనకు గాను కీర్తీ సురేశ్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అటుపైన 2021వ సంవత్సరానికి గాను 69వ జాతీయ అవార్డుల్లో ‘పుష్ప–1’తో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సాధించి, సంచలనం సృష్టించారు. తెలుగు నుంచి ఆ అవార్డును అందుకొన్న తొట్ట తొలి నటుడనే రికార్డు సృష్టించారు.ఇప్పుడు 2024వ సంవత్సరానికి గాను ఈ సెప్టెంబర్ 22న ప్రదానం చేయనున్న తాజా 72వ జాతీయ అవార్డుల్లో మన తెలుగు సినిమా ఏకంగా 9 అవార్డులతో మెరిసిపోతోంది. జాతీయ స్థాయిలో సకుటుంబ వినోదం అందించి, ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా ప్రభాస్ ‘కల్కి’, ఉత్తమ బాలల చిత్రంగా ‘35... చిన్న కథ కాదు’, ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్ళు’, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా దర్శకుడు సుకుమార్ (‘పుష్ప–2’), ఉత్తమ సంభాషణల రచయితగా మరో దర్శకుడు వెంకీ అట్లూరి (‘లక్కీ భాస్కర్’) అవార్డు విజేతల్లో ఉన్నారు. ఇంకా ఉత్తమ బాల నటుడు (అరుణ్ దేవ్ పోతుల – ‘35... చిన్న కథ కాదు’), ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ (నితిన్ జిహానీ చౌధరీ – ‘కల్కి’), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ (దీపాలీ నూర్, శీతల్ శర్మ ‘పుష్ప2’), ఉత్తమ మేకప్ (పి. రవికుమార్ ‘కమిటీ కుర్రోళ్ళు’) కేటగిరీల్లోనూ మన తెలుగు సినిమా జెండా ఎగరేసింది. -ఆర్. జయ -
మూగవాడిగా హీరో.. ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుంది
అనీష్, అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. మహేశ్ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 30న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో అనీష్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నేను చేసిన అర్జున పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. ఇందులో యాక్షన్ కొత్తగా ఉంటుంది. అర్జున మాటలు మీకు వినిపించక΄ోవచ్చు. తన ప్రేమ గట్టిగా కనిపిస్తుంది’’ అన్నారు. ‘‘అర్జున పాత్రను అనీష్ చాలెంజ్‌గా తీసుకుని చేశాడు. మానసతో కలిసి ఈ కథను ఇష్టపడి రాశాను. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు మహేష్ ఉప్పల. ‘‘నేను దర్శకుడిగా ఉన్నప్పుడు సీన్ గురించి మాత్రమే ఆలోచించేవాడిని. ఇప్పుడు బడ్జెట్ గురించి కూడా ఆలోచిస్తున్నాను’’ అని తెలిపారు వెంకీ కుడుముల. ‘‘ఈ చిత్రంలోని కీర్తి పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ, చేశాను’’ అని చెప్పారు అనస్వర. ‘‘ఈ చిత్రంలో మూగవాడైన అర్జున పాత్రలో అనీష్ నటించాడు. ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది’’ అని అన్నారు దర్శకురాలు మానసా శర్మ. -
కొత్త బిజినెస్‌లోకి చిరంజీవి.. ప్రపంచ రికార్డ్ బద్దలయ్యేలా ప్లాన్!
మెగాస్టార్ చిరంజీవి కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టనున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్లో పలు అత్యాధునిక మల్టీప్లెక్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో కలిసి చిరంజీవి ఓ భారీ మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ఏషియన్ సునీల్‌తో కలిసి హైదరాబాద్‌లో ఈ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ తెరను ఏర్పాటు చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇప్పటికే పలువురి హీరోలతో..ఇప్పటికే మహేశ్‌బాబుతో ఏఎంబీ సినిమాస్, అల్లు అర్జున్‌తో ఏఏఏ సినిమాస్, రవితేజతో ఏఆర్టీ సినిమాస్, విజయ్ దేవరకొండతో ఏవీడీ సినిమాస్ వంటి మల్టీప్లెక్స్ ప్రాజెక్టులను ఏషియన్ సునీల్ తీసుకొచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నారనే వార్త ఆసక్తి రేపుతోంది. ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్‌లో మరో అత్యాధునిక మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. చిరంజీవి–ఏషియన్ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదీ చదవండి: పాండా అంటూ ట్రోలింగ్.. బిగ్‌బాస్ వినాయకుడు ఎలిమినేట్..? -
పాండా అంటూ ట్రోలింగ్.. వినాయకుడు ఎలిమినేట్..?
బిగ్‌బాస్ సీజన్ 10లో ఎలిమినేషన్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే చైత్ర హౌస్ నుంచి బయటకు వెళ్లగా.. ఇప్పుడు తదుపరి ఎలిమినేషన్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి కృష్ణుడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో చైత్ర తర్వాత కృష్ణుడే బయటకు వెళ్తాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కృష్ణుడి ఆటపై అసంతృప్తి..నిన్నటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ కృష్ణుడు, సృష్టిల ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత వీకెండ్లో వారు ఎలా ఆడారో ప్రేక్షకుల్లా కూర్చొని చూడాలని చెబుతూ ఇద్దరినీ స్టోర్ రూంలో కూర్చోబెట్టాడు. దీంతో పాటు ప్రేక్షకులు సైతం కృష్ణుడుని అన్ సేఫ్‌లోనే ఉంచారు. దీంతో కృష్ణుడి ఆటతీరుపై బిగ్‌బాస్ కూడా ఫోకస్ పెట్టాడనే చర్చ మొదలైంది.నెటిజన్లు మీమ్ వీడియోలు..మరోవైపు హౌస్‌లో కృష్ణుడి ఆట కూడా పెద్దగా హైలైట్ కావడం లేదనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో దేబ్జానీ.. కృష్ణుడిని పాండాతో పోలుస్తూ చేసిన కామెంట్ కూడా వైరల్‌గా మారింది. ఆ మాటను ఆధారంగా చేసుకుని నెటిజన్లు మీమ్ వీడియోలు రూపొందిస్తున్నారు. దీంతో కృష్ణుడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా కనిపిస్తోంది.వినాయకుడి నిమార్జనానికి వేళైంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.గతంలో చైత్ర విషయంలోనూ..గతంలో చైత్ర విషయంలోనూ ఇలాంటి చర్చే మొదలై.. చివరకు ఆమె ఎలిమినేట్ అయింది. ఇప్పుడు అదే తరహాలో కృష్ణుడి పేరు వినిపిస్తుండటంతో ఈసారి ఏం జరుగుతుందన్న ఆసక్తి పెరిగింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చ నిజమైన ఎలిమినేషన్ ఫలితమా? లేక కేవలం ప్రేక్షకుల అంచనా మాత్రమేనా? అనేది తెలియాలంటే ఎలిమినేషన్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.(ఇదీ చదవండి: ఒకేసారి రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్.. డోంట్ మిస్)#Debjani ee #Krishnudu konchem #Panda laaga unnadu 🤣🤣🤣#BiggBossTelugu10 pic.twitter.com/gOlYGi5I9n— Naresh Bandari (@BiggBossAddict) September 10, 2026 -
సమవర్తి మా టీమ్‌కి ఓ సాహసం: సత్యదేవ్
‘‘నేను ఇప్పటిదాకా ఎవర్నీ చాన్స్ ఇవ్వమని అడగలేదు. అందుకు నా మొహమాటమే కారణం. అయితే మోహమాటాన్ని వదలిపెట్టి నాతో సినిమా చేయమని నేను అడిగిన తొలి వ్యక్తి దర్శకుడు అజయ్’’ అని సత్యదేవ్ అన్నారు. సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘సమవర్తి’. గానవి లక్ష్మణ్ హీరోయిన్గా నటించారు. అజయ్ నాగ్. వి దర్శకత్వంలో శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘నేను డ్రీమ్‌గా భావించిన షాట్స్, సీన్స్‌ను నాతో అజయ్ చేయించాడు. దక్షిణ భారతదేశంలో ఎన్ని అడవులున్నాయో అన్నింట్లో మేం షూటింగ్ చేశాం. మాకు ఇదొక గ్రేట్ అడ్వెంచర్ అనిపించింది. థియేటర్స్‌లో మీకూ అదే ఫీల్ కలిగిస్తుంది’’ అన్నారు.‘‘ఈ చిత్రంలో స్పెషల్ క్యారెక్టర్ చేశాను’’ అని తెలిపారు శ్రీకాంత్. ‘‘నా ఆరంభం’ సినిమా తర్వాత సత్యదేవ్ అన్న పిలిచి మరీ ‘సమవర్తి’కి చాన్స్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. షూటింగ్లో గాయపడ్డారు కూడా. శ్రీకాంత్‌గారు చేసిన క్యారెక్టర్‌తోనే సినిమా ్రపారంభం అవుతుంది’’ అని చెప్పారు అజయ్ నాగ్ .వి.‘‘తెలుగు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మార్చే చిత్రం ఇది’’ అన్నారు శశిధర్. ‘‘ఈ టీమ్‌లోని ప్రతి ఒక్కరి కెరీర్లో గుర్తుండిపోయే విజయం లభిస్తుంది’’ అని తెలిపారు శివచరణ్ రెడ్డి. -
ప్రచారంలో ఉన్నట్లు రీషూట్స్ చేయలేదు: దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
‘‘నేను అనుకున్న షాట్ వచ్చేంతవరకు వందసార్లైనా తీస్తాను. ఈ విషయంలో మా ప్యారడైజ్’ టీమ్‌ను ఇబ్బంది పెట్టాను (నవ్వుతూ). కానీ ఒకసారి ఓకే అయిన తర్వాత రీషూట్ జోలికి వెళ్లను’’ అని శ్రీకాంత్ ఓదెల చెప్పారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ ఓదెల చెప్పిన సంగతులు.. ⇒ ‘దసరా’తో నాకు దర్శకుడిగా జీవితం ఇచ్చిన వ్యక్తి నానీగారు. ఆ సినిమా రిలీజ్‌కు ముందే రిజల్ట్‌తో సంబంధం లేకుండా మరో మూవీ చేద్దామని నానీగారు అన్నారు. ‘ది ప్యారడైజ్’లో జడల్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. నానీగారికి జడలు వేద్దామని నా టీమ్‌తో అంటే వద్దన్నారు. కానీ కథని, క్యారెక్టర్ని నమ్మి నానీగారు ఒప్పుకున్నారు. మోహన్‌బాబుగారు ఇందులో మెయిన్ విలన్. ఆయన, నానిమధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి. ⇒ ‘ది ప్యారడైజ్’ని 171 రోజులు షూట్ చేశాం. నేను అనుకున్నట్లు సినిమా తీయడానికి, టార్గెట్ రీచ్ కావడానికి కాస్త ఆలస్యమైంది. దీంతో యూనిట్ అందరి కాల్షీట్స్ మళ్లీ సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అంతేకానీ ప్రచారంలో ఉన్నట్లు రీ షూట్స్ చేయలేదు. బౌండ్ స్క్రిప్ట్‌లో మార్పులు చేయలేదు. షూటింగ్ ప్లాన్ బాగానే ఉన్నా, ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యానేమో అనిపించింది. నెక్ట్స్ టైమ్ ఇచ్చిన మాటపై నిలబడాలనుకుంటున్నాను.. అంటే చెప్పిన టైమ్‌కి సినిమాను రిలీజ్ చేయడం, అనుకున్న టైమ్‌లో షూట్ పూర్తి చేయడం వంటివి. ⇒ ‘ది ప్యారడైజ్’లో బిట్ సాంగ్స్‌తో కలిపి ఆరు పాటలున్నాయి. నా చిన్నప్పుడు ఆటోలో వెళ్తున్నప్పుడు ‘ఏషనాగుల..’ పాట వినేవాడిని. ‘దసరా’ చిత్రానికే ఈ పాట పెడదామనుకున్నా. ‘ది ప్యారడైజ్’కు కుదిరింది. ⇒ నా దర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీ చేయాలని ఉంది. అలాగే చిరంజీవిగారితో సినిమా కచ్చితంగా ఉంటుంది. ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత మా ఫ్యామిలీతో టైమ్ గడపాలి. ఆ తర్వాత నా నెక్ట్స్ మూవీ గురించి చెబుతాను. -
విశ్వక్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్
నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం #‘కల్ట్’. గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, కార్తికేయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ కాకరాల మరో నిర్మాత. #‘కల్ట్’ సినిమాను అక్టోబరు 30న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.‘‘ఈ చిత్రంలో విశ్వక్ సేన్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ అప్పీల్‌తో కూడిన కథ ఉన్న ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, స్పానిష్ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
అక్టోబరులో పూర్తి
మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘వారణాసి’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. రాజమౌళి దర్శకత్వంలో కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇందులో రుద్ర, శ్రీరాముడు.. ఇలా రెండు పాత్రల్లో కనిపించనున్నారు మహేశ్‌బాబు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, విలన్ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తుండగా, ప్రకాష్‌రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని తెలిసింది. ‘వారణాసి’లో తన వంతు షూట్‌ను పూర్తి చేయడానికి మహేశ్‌బాబు 15 రోజులు షూటింగ్లో పాల్గొంటే సరిపోతుందట. అక్టోబరు కల్లా మొత్తం చిత్రీకరణ పూర్తవుతుందని ఇటీవల ఓ కార్యక్రమంలో ఎస్ఎస్ కార్తికేయ పేర్కొన్నారు. -
ఆ నలుగురు సేఫ్.. ఆ ఇద్దరు వరస్ట్.. వీకెండ్ హైలెట్స్ ఇవే..!
బుల్లితెర రియాలిటీ షో అప్పుడే రెండో వారం చివరికి వచ్చేసింది. ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది. ఈ వారం నేను చాలా ఎంజాయ్ చేశానని నాగ్ అన్నారు. అయితే ఈ వారంలో ఇద్దరు హౌస్‌లో ఉన్నట్లు అనిపించలేదని తెలిపారు.ఆ ఇద్దరు కృష్ణుడు, సృష్టి అని తెలియజేస్తూ ఓ వీడియోను చూపించారు. ఈ వారంలో వాళ్లిద్దరు హౌస్‌లో ఎలా ఉన్నారో కళ్లకు కట్టినట్లు వీడియోలో కనిపించింది. దీంతో వాళ్లద్దరినీ స్టోర్ రూమ్‌కు పంపించారు. అదే క్రమంలో సింగర్ ఝాన్సీపై ప్రశంసలు కురిపించారు. హౌస్‌లో నువ్వే తొలి మహిళ కెప్టెన్ అని కొనియాడారు. ఆటను వందశాతం ఎఫర్ట్‌తో ఆడుతున్నావని అన్నారు.హౌస్‌మేట్స్‌ను తమ లైఫ్‌లో జరిగిన సీక్రెట్ విషయాన్ని చెప్పాలని నాగ్ అడిగారు. దీనికి కంటెస్టెంట్స్ తమ జీవితంలోని జరిగిన సంఘటలను రామ్ ప్రసాద్, త్రిగుణ్, వంశీ తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ తర్వాత హౌస్‌లో మానిపులేటర్, పప్పెట్స్ ఎవరంటూ నాగ్ హౌస్‌మేట్స్‌ను అడిగారు.సుధీర్‌ను వర్షిని మానిపులేట్ చేస్తోందని చరణ్ అన్నారు. ఆ తర్వాత గేమ్‌లో రూల్స్ చదవకుండా గేమ్ ఆడతావా అని చరణ్‌ను నాగ్ ప్రశ్నించారు. ఇది మళ్లీ రిపీట్ చేయొద్దని సూచించారు. ఆ తర్వాత రామ్ ప్రసాద్‌ను మానిపులేటర్ ఎవరని అడగ్గా.. వంశీని త్రిగుణ్ కంట్రోల్ చేస్తున్నారని అన్నారు. దీనికి ఆడియన్స్ పోల్ నిర్వహించగా.. త్రిగుణ్ చేతిలో వంశీ పప్పెట్ అని తేలిపోయింది. రోహిత్ సైతం వంశీ, త్రిగుణ్‌నే ఎన్నుకున్నారు.సంచాలక్‌గా ఇద్దరు ఫెయిల్..సంచాలక్‌గా రామ్ ప్రసాద్ ఫెయిల్ అయ్యావంటూ నాగ్ అన్నారు. దీనికి అవును సార్ అంటూ రామ్ ప్రసాద్ తన తప్పును అంగీకరించారు. ఆ తర్వాత హౌస్‌లో చరణ్‌ను రోహిత్ మానిపులేట్ చేస్తున్నారని వర్షిని చెప్పింది. దీనికి ఆడియన్స్ పోల్ నిర్వహించగా.. అవుననే ఎక్కువమంది ఓటేశారు.ఆ తర్వాత వర్షినిని సంచాలక్‌గా సరిగ్గా వ్యవహరించలేదని నాగ్ అన్నారు. సంచాలక్‌గా మీ నిర్ణయం కరెక్ట్‌గా లేదని.. అందుకే ఈ వారంలో నువ్వు సంచాలక్‌గా ఉండడానికి వీల్లేదని నాగార్జున చెప్పేశారు. గేమ్‌లో భాగంగా షాలిని, వర్షిణి మధ్య జరిగిన ఫైట్‌లో షాలినిదే తప్పని నాగ్ తేల్చేశారు. ఈ వారంలో ముకేశ్, దేబ్జానీ, ఝాన్సీ, శాలిని సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. ఆ తర్వాత త్రిగుణ్, కృష్ణుడు, సృష్టి, సుధీర్, వర్షిణి, రోహిత్ అన్‌సేఫ్‌గా మిగిలారు. -
వీకెండ్ ఎంటర్టైన్మెంట్.. ఆ ఇద్దరిపై నాగ్ సీరియస్..!
ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతోంది. కెప్టెన్సీ రేస్ ముగియడంతో ఎలిమినేషన్ ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఈ వీకెండ్ ఎపిసోడ్లో కొంతైనా క్లారిటీ వచ్చే అవకాశముంది. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో నాగార్జున కంటెస్టెంట్స్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.హౌస్‌లో సృష్టి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వగా.. ఆట బాగా ఆడితే తానే కిస్ ఇస్తానంటూ కౌంటరిచ్చాడు. ఈ వీక్‌లో కృష్ణుడు, సృష్టి ఆటతీరుపై నాగ్ అగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లిద్దరిని వెనకవైపు కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చాడు. మీరిద్దరు కేవలం ప్రేక్షకుల్లాగే వీక్షించాలని నాగ్ అన్నారు. ఈ ప్రోమోలో నాగ్ ఎంట్రీ అదిరిపోయింది. నాని మూవీ ది ప్యారడైజ్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ప్రోమో ఇవాల్టి ఎపిసోడ్‌పై బిగ్‌బాస్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచుతోంది. -
బీచ్‌కి రావాలంటే అమ్మాయి ఉండాల్సిందే.. బోల్డ్‌గా ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్
ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డానీ’. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్ల మీద రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్‌జీ గోగణ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ రొమాంటిక్ క్రైమ్ డ్రామా నుంచి ఫస్ట్ స్ట్రైక్ ను తాజాగా విడుదల చేశారు.‘నువ్వు బీచ్‌కి ఎప్పుడూ ఒంటరిగా వస్తావా?’.. అని అమ్మాయి అడగడం.. ‘నేను బీచ్‌కి రావాలంటే కచ్చితంగా అమ్మాయి ఉండాల్సిందే’ అని హీరో చెప్పే డైలాగ్.. ఆ తర్వాత వచ్చే బోల్డ్ డైలాగ్, బీచ్‌లో అమ్మాయి అందాలు ఇలా అన్నీ కూడా యూత్ ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ టీజర్‌ని గమనిస్తే కావాల్సినంత యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా ఉందని అర్థం అవుతోంది. బోల్డ్, రా అండ్ రస్టిక్‌గా ‘డానీ’ రానుందని ఈ ఫస్ట్ స్ట్రైక్ చెప్పకనే చెబుతోంది.కళ్యాణ్‌జీ గోగన–ఆశిష్ గాంధీ కాంబినేషన్లో వచ్చిన ‘నాటకం’, ‘కళింగ’ చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ కాంబో మరోసారి ‘డానీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో సినిమాపై ఆసక్తి, క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది.డానీ ఫస్ట్ స్ట్రైక్ లోని విజువల్స్, కెమెరా వర్క్ టాప్ నాచ్‌లో ఉంది. సాయి కార్తీక్ బీజీఎం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీకి ఖుషి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏకే ఆనంద్ కెమెరామెన్‌గా, మణికాంత్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర అప్డేట్లను మేకర్స్ ప్రకటించనున్నారు. ఇక అక్టోబర్ లో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. -
'ఈ నగరానికి కొత్త పోరడొచ్చినాడే'.. ఇట్లు అర్జున టీజర్ చూశారా?
అనీశ్, అనస్వర రాజన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఇట్లు అర్జున. ఈ మూవీతోనే అనీశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లవ్ ఎంటర్టైనర్కు మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మొదటి సినిమాగా దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ టీజర్ చూస్తే భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ టీజర్లో సన్నివేశాలు కామెడీతో పాటు థ్రిల్ పంచేలా ఉన్నాయి. ఈ మూవీ అక్టోబర్ 30న థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. Arjun & Keerthi welcomes you to their world filled with love, silence & a hint of madness ❤️🔥#ItlluArjuna Teaser Out Now!— https://t.co/UlrwGqDjQITHIS OCTOBER 30th, 𝘩𝘪𝘴 𝘭𝘰𝘷𝘦 𝘸𝘪𝘭𝘭 𝘣𝘦 𝘩𝘦𝘢𝘳𝘥 𝘪𝘯 𝘵𝘩𝘦𝘢𝘵𝘦𝘳𝘴 𝘸𝘰𝘳𝘭𝘥𝘸𝘪𝘥𝘦 🫶💥A @MusicThaman Musical… pic.twitter.com/ZmNVv1RAZu— What Next Entertainments (@WhatNextEnts) September 19, 2026 -
‘కోకో కొకొరొకో..నేనో నాటుకోడి’.. ఈ పాట విన్నారా?
తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ముగ్గురు కోతులు’.కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్షిక పాశం హీరోయిన్గా నటించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా మాస్ ఆడియెన్స్‌కి నచ్చే మంచి ఐటం నంబర్‌ను విడుదల చేశారు.నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కో కో కొకొరొకో’ అంటూ సాగే స్పెషల్ ఐటం సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ముగ్గురు కోతులు’ చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.‘కోకో కొకొరొకో’ అంటూ సాగే ఈ పాటకు జగదీష్ అందించిన సాహిత్యం ఎంతో క్యాచీగా ఉంది. సుహాస్ ఇచ్చిన బాణీ అయితే శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. లాస్య ప్రియ ఆలపించిన పాట కుర్రకారుకి ఇన్ స్టంట్‌గా ఎక్కేసేలా ఉంది. ఈ సాంగ్‌లో ముగ్గురు హీరోలు, వారితో పాటు స్టెప్పులు వేసిన నటీమణి, ఆమె అందాలు హైలెట్ కానున్నాయి. వినోద్, రఘు, సాయి కంపోజ్ చేసిన ఈ పాట థియేటర్లో బ్లాస్ట్ కానుంది. -
‘ఇరుముడి’.. ఇంకాస్త ఆగితే బాగుండేది!
ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా రెండు వారాలకు మించి ఆడడం లేదు. అది కూడా హిట్ టాక్ వస్తేనే. ఇక యావరేజ్ టాక్ వస్తే.. మూడు రోజులకే థియేటర్స్ నుంచి ఖాలీ చేస్తున్నారు. అలాంటిది ‘ఇరుముడి’ నెల రోజులుగా థియేటర్స్‌లో రన్ అవుతూ.. రవితేజ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా కోసం థియేటర్స్‌కి వెళ్తున్నారు. అంతలోనే ఓటీటీలోకి వదిలేశారు మేకర్స్. ఫలితంగా ఈ చిత్రం ఓ మంచి రికార్డును కోల్పోయింది.100 కోట్ల రికార్డు మిస్శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఇరుముడి చిత్రం ఆగస్ట్ 21న థియేటర్స్‌లో విడుదలైంది. తొలి రోజే హిట్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి థియేటర్స్ అన్ని నిండిపోయాయి. అలా నాలుగు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇక మొత్తంగా రూ. 240 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అందులో ఒక్క నైజాం ఏరియా నుంచే రూ.90 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇంకో వారం ఆగితే రూ. 100 కోట్ల క్లబ్లో చేరేది. కానీ అంతలోనే ఓటీటీలో రిలీజ్ చేశారు. ఫలితంగా నిన్నటి నుంచి ఈ సినిమాకు టికెట్స్ పెద్దగా తెగడం లేదు. ఇంట్లోకి వచ్చిన సినిమా కోసం థియేటర్స్‌కి వెళ్లడం కష్టమే. వారం రోజుల తర్వాత ఓటీటీలోకి వదిలితే.. రూ. 100 కోట్ల కలెక్షన్స్ ఈజీగా వచ్చేవని సినీ పండితులు అంటున్నారు. అలా అయితే నైజాంలో రూ.100 కోట్లు కలెక్షన్స్ సాధించిన అతి కొద్ది సినిమాల జాబితాలో ఇరుముడి కూడా చేరేది.రూ. 250 రికార్డు కోల్పోయిందిఇరుముడి చిత్రం మరో రికార్డును కూడా కోల్పోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 240 కోట్లు వసూలు చేసింది. ఈ వారం కూడా తెలుగులో పెద్ద సినిమాలేవి రిలీజ్ కాలేదు. విడుదలైన చిన్న చిత్రాలేవి హిట్ టాక్ని సంపాదించుకోలేదు. అలా చూస్తే.. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి చిత్రం హవానే కొనసాగేది. ఈ నెల 24 వరకు అయితే కచ్చితంగా ఈ సినిమా థియేటర్స్‌లో ఆడేది. ఆ తర్వాత ప్యారడైజ్ రిలీజ్ అవుతుంది కాబట్టి.. ఈ సినిమాని పక్కన పెట్టేవారు. ఈ వారంలో ఓవరాల్‌గా రూ. 10 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం అయితే మెండుగా ఉంది. కానీ సడెన్‌గా ఓటీటీలో రిలీజ్ చేయడంతో.. ఇప్పుడు ఆ స్థాయి కలెక్షన్స్ రావడం కష్టమే. అలా వస్తే..రూ. 250 కోట్ల క్లబ్లో కూడా ఈ చిత్రం నిలిచేది. మొత్తంగా ఇరుముడి ఓ రెండు రికార్డులను అయితే కోల్పోయింది. -
‘ది ప్యారడైజ్’లో ‘సమ్మక్క’.. అంచనాలు పెంచేసిన నాని
ది ప్యారడైజ్.. ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ జరుగుతుంది. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, గ్లింప్స్, టీజర్ ..ప్రతీది సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కి ఇంకో నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం అంతా ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. నాని వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీయడమేకాకుండా..సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.ఇది ‘సమ్మక్క’ కథ..తాజాగా ఓ ఇంటర్వ్యూలో నానికి సినిమా టైటిల్‌పై ప్రశ్న ఎదురైంది. ‘ఒకవేళ ది ప్యారడైజ్ చిత్రానికి మరో పేరు పెట్టాల్సి వస్తే..ఏం పెడతారు?’ అని యాంకర్ అడిగింది. దానికి నాని వెంటనే ‘సమ్మక్క’ అనే టైటిల్ ఈ కథకు వందశాతం సెట్ అవుతుందని చెప్పారు.(ఇదీ చదవండి: ‘రాకా’.. ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..)సమ్మక్క ఎవరు?నాని నోటి నుంచి సమ్మక్క అనే పేరు రావడంతో.. అసలు సమ్మక్క ఎవరు? భారీ యాక్షన్ కథకు ఆ టైటిల్ ఎందుకు పెట్టాలనుకున్నారనేదానిపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నాని తల్లి పెరు ‘సమ్మక్క’ అట. ఇది తల్లి కొడుకు కథ అని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా సార్లు చెప్పారు. తల్లి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని కూడా చెప్పాడు. అందుకే నాని ఈ కథకు ‘సమ్మక్క’ అనే టైటిల్ సరిపోతుందని చెప్పాడు. (ఇదీ చదవండి: ‘పీరియడ్స్ వస్తే నరకం.. నొప్పి భరించలేక కార్వాన్లో..’) తల్లి కొడుకు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయట. ఈ సినిమాలో నాని తల్లిగా మరాఠి నటి సోనాలి కులకర్ణి నటిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె లుక్, క్యారెక్టర్ డిజైన్ గురించి ఇప్పటి వరకు ఏ విషయం బయటకు రాలేదు. ఇప్పుడు నాని చేసిన కామెంట్స్‌తో ఆ పాత్రను ఎలా చూపిస్తారనే అనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగింది. -
బన్నీ ‘రాకా’.. ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే..
అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాకా’. పాన్ వరల్డ్ మైథలాజికల్ విజువల్ వండర్ గా రూపొందుతోంది. అయితే రాకా నుంచి బిగ్ అప్డేట్ త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ అప్డేట్పై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న‘ఇరుముడి’.. పల్లెల్లో ఏకంగా తెరలు)37 అనే క్రిప్టిక్ పోస్టర్‌ను..ఇటీవలే 37 అనే క్రిప్టిక్ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్చ్ షేర్ చేయడంతో అభిమానుల్లో ఇంతటి ఆసక్తి నెలకొంది. అయితే ఈ నెల 21న అట్లీ పుట్టినరోజు కావడంతో ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. దీన్ని చూస్తుంటే హాలీవుడ్ రేంజ్లో ఓ సరికొత్త విజువల్స్‌తో వేరే ప్రపంచాన్ని పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోనే కీలక పాత్రలో కనిపించనుంది. ఈమెకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసినట్లు టాక్. రష్మిక మందన్న నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. వీటిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా ఈ సినిమా 2028లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. Get ready to witness a global triumph! ✨ #Raaka pic.twitter.com/IWAskqz7Lw— Sun Pictures (@sunpictures) September 18, 2026 -
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ నేచురల్ మిస్టిక్ హారర్ థ్రిల్లర్ ‘అగధ’. ‘మా ఊరి పొలిమేర’ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్‌తో..‘అగధ’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 25 నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇంటి నుంచే ఈ మిస్టిక్ థ్రిల్లర్‌ను చూసే అవకాశం దక్కింది. రెండు గంటల 17 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు హీరోహీరోయిన్లు, ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్కు ప్రశంసలు దక్కాయి. హారర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘అగధ’ ఓటీటీ ప్రీమియర్ ఆసక్తికరంగా మారింది.కథ ఏంటంటే..మహిమ (ఉల్కా గుప్తా) ఒకానొక సందర్భంలో తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఓ గుహను చూస్తుంది. ఆ గుహ వద్ద ఓ వింత ఘటన జరుగుతుంది. ఆ సమయంలో ఆమె స్నేహితుడు బబ్లూ మరణిస్తాడు. ఆమె ప్రేమికుడు సింహా (శ్రవణ్ రెడ్డి) మాత్రం కనిపించడు. ఇంకో వైపు మహాదేవి (కామాక్షి భాస్కర్ల) ఊర్లోని ప్రజల సమస్యలను తీరుస్తూ ఉంటుంది. ఆత్మలకు మోక్షం కలిగిస్తుంటుంది. ఇక కొన్ని రోజులకు మహిమ ఆత్మహత్య చేసుకుంటుంది. తన సోదరి మహిమ మరణంతో మహాదేవి సొంత ఊరికి వస్తుంది. తన ఇంటికి, కుటుంబ సభ్యులకు సమస్య ఉందని మహాదేవి తెలుసుకుంటుంది. ఈ క్రమంలో సింహా నుంచి మహాదేవి తెలుసుకున్న అంశాలు ఏంటి? ఈ షికావో గుహ వద్ద ఏం జరిగింది? అసలు ఈ అగధ ఎవరు? మహాదేవి కుటుంబాన్ని ఈ అగధ ఎందుకు చంపుతోంది? చివరకు అగధను మహాదేవి ఏం చేస్తుంది? ఈ కథలో హరిణి (జోవికా విజయ్ కుమార్) పాత్ర, బాబా (షిజు) కారెక్టర్ ఏంటి? అన్నదే కథ. ఇదీ చదవండి: ‘పీరియడ్స్ వస్తే నరకం.. నొప్పులు భరించలేక..: శ్రుతిహాసన్ View this post on Instagram A post shared by Zee 5 Telugu (@zee5telugu) -
ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న‘ఇరుముడి’.. పల్లెల్లో ఏకంగా తెరలు
మొన్నటి వరకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ‘ఇరుముడి’ ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. థియేటర్లలో సినిమా మిస్ అయినవారు ఇంటి వద్దే చూస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తుండడంతో వైరల్‌గా మారుతున్నాయి.ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు.. ముఖ్యంగా పల్లెల్లో ‘ఇరుముడి’ని ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. వీధుల్లో పెద్ద స్క్రీన్లు పెట్టి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సినిమాను చూస్తున్న వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా కొన్ని గ్రామాల్లో వెండి తెరపై సినిమాను ప్రదర్శించడం విశేషంగా మారింది. థియేటర్లకు వెళ్లలేకపోయిన ప్రేక్షకులు ఇలా తమ గ్రామాల్లోనే సినిమాను చూసే అవకాశం రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘ఇరుముడి’ ఓటీటీలోనే జోరు చూపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి గ్రామల్లో ప్రదర్శనల వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.200 కోట్లకు పైగా కలెక్షన్లుకాగా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన సినిమా 'ఇరుముడి'. తండ్రి కూతురు అనుబంధంతో తెరకెక్కిన స్టోరీకి అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని జోడించారు. గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. తెలుగులో విశేషాదరణ దక్కించుకుంది. దీంతో బాక్సాఫీసులో రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ చిత్రం సెప్టెంబరు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదీ చదవండి: బిగ్‌బాస్ తొలి కెప్టన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా Vizianagaram district devada village lo irumudi movie grama prajalu inkaa aadharisthunnaru. Vinayaka chavithi sandharbam gaa committee members ilaa grama prajaliki chupisthunnaru🙏🙏🙏#irumudimovie #mythrimoviemakers#gvprakash#raviteja#sivanirvana pic.twitter.com/xPBhrmbrlJ— 𝗥𝗔𝗝𝗔𝗦𝗔𝗔𝗕 (@RAJU_BHAI_LUV) September 18, 2026 -
బిగ్‌బాస్ తొలి కెప్టెన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా ప్రకటించిన ప్రముఖ సంస్థ
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ రేసు ఆసక్తికరంగా సాగింది. ఓవైపు కంటెస్టెంట్లు కెప్టెన్ అయ్యేందుకు పోటీపడుతుండగా.. మరోవైపు హౌస్‌లో నవ్వులు పూయించేలా కామెడీ స్కిట్ చేశారు. రాంప్రసాద్, నరేశ్, వంశీ, రోహిత్, అమన్ కలిసి ‘ఛత్రపతి’ సినిమాలోని ‘ఓ సూరీడు’ కామెడీ సీన్‌ను రీక్రియేట్ చేశారు. మరి నిన్నటి ఎపిసోడ్లో ఝాన్సీ కెప్టెన్ ఎలా అయిందో ఒకసారి చూద్దాం రండి!ఓ సూరీడు.. అదిరిపోయిన స్కిట్స్కిట్లో వంశీ ప్రభాస్ పాత్రలో కనిపించగా.. రాంప్రసాద్ చిన్న పిల్లాడు సూరీడుగా అలరించాడు. నరేశ్ రౌడీ కాట్రాజ్ పాత్రలో నటించాడు. అమన్ వంశీ ఫ్రెండ్‌గా కనిపించగా.. ఝాన్సీ సూరీడు తల్లి పాత్రలో నటించింది. సినిమా సీన్‌ను హౌస్మేట్స్ తమదైన శైలిలో రీక్రియేట్ చేయడంతో స్కిట్ మొత్తం నవ్వులు పూయించింది. స్కిట్ పూర్తయ్యాక బిగ్‌బాస్ కూడా మంచి మార్కులే ఇచ్చాడు. స్కిట్ బాగుంది.. కానీ నరేశ్ కాట్రాజ్ పాత్రలో కండలు మరీ ఎక్కువగా చూపించాడంటూ సరదాగా కామెంట్ చేశాడు. అలాగే రాంప్రసాద్‌ను ఉద్దేశించి సూరీడు మరీ పసిపిల్లాడిలా అయిపోయాడంటూ జోక్ చేశాడు.ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..‘చిక్కకు దొరకకు’.. కెప్టెన్సీ టాస్క్ఆ తర్వాత కెప్టెన్సీ రేసులో ఉన్న ముకేశ్, షాలిని, ఝాన్సీ, రాంప్రసాద్, త్రిగుణ్‌లకు బిగ్‌బాస్ ‘చిక్కకు దొరకకు’ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో మిగిలిన పది మంది గార్డులుగా వ్యవహరించాలి. ఈ ఐదుగురు పోటీదారులు జైలులో ఉండాలి. గార్డుల నుంచి తప్పించుకుని గోడ దాటి సేఫ్ జోన్లోకి చేరుకోవాల్సి ఉంటుంది. సేఫ్ జోన్లోకి చేరుకోలేని పోటీదారులు కెప్టెన్సీ రేసు నుంచి ఎలిమినేట్ అవుతారు. ఈ టాస్క్‌లో వంశీ, రోహిత్ హెడ్ గార్డులుగా వ్యవహరించారు. టాస్క్ ప్రారంభానికి ముందు ఐదుగురు పోటీదారులు తాము ఎందుకు కెప్టెన్ కావాలనుకుంటున్నారో వివరించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరూ కెప్టెన్ అయితే హౌస్‌లో ఏం చేస్తారో చెప్పారు. ఇదీ చదవండి: మహిళల అభివృద్ధికి సినీ సెలబ్రిటీల సంచలన నిర్ణయంబయట ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు తమ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినట్టుగానే.. హౌస్‌లోని కంటెస్టెంట్లు కూడా తాము కెప్టెన్ అయితే ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ హామీలు ఇచ్చారు. దీంతో వారి చిన్నపాటి ‘కెప్టెన్సీ మేనిఫెస్టో’ ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత గార్డులు తమ నిర్ణయం ప్రకారం చివరికి రాంప్రసాద్, ఝాన్సీలను కెప్టెన్సీ పోటీలో నిలిపారు. దీంతో వీరిద్దరి మధ్య చివరి పోటీ ఆసక్తికరంగా మారింది.ఝాన్సీనే కొత్త కెప్టెన్రాంప్రసాద్, ఝాన్సీలకు బిగ్‌బాస్ ‘పవర్ ఆఫ్ కెప్టెన్సీ’ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌కు త్రిగుణ్ సంచాలకుడిగా వ్యవహరించాడు. ఇద్దరు పోటీదారుల ముందు ఇనుప నెట్‌ను ఏర్పాటు చేశారు. పట్టకర్రతో ఆ నెట్‌ను తొలగిస్తూ లోపలికి వెళ్లాలి. అక్కడ ఉన్న పెట్టెలోని కీని తీసుకుని.. అందులో ఉన్న చిన్న మూటను తీసుకోవాలి. ఆ మూటలో ఉన్న ‘C’ అనే లెటర్‌ను జెండాకు అతికించి.. ఆ తర్వాత కెప్టెన్ జెండాను ఎగరేయాలి. ఈ టాస్క్‌లో రాంప్రసాద్పై ఝాన్సీ విజయం సాధించింది. దీంతో బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా ఝాన్సీ నిలిచింది. కెప్టెన్‌గా ఎంపికైన ఝాన్సీకి వైట్ గోల్డ్ సంస్థ.. లక్ష విలువైన గోల్డ్ కాయిన్ బహుమతిగా అందించింది. అనంతరం ఝాన్సీ కోసం ప్రత్యేకంగా కెప్టెన్సీ గదిని కూడా బిగ్‌బాస్ ఓపెన్ చేశాడు. అయితే ఆ రూంలో కెప్టెన్‌కి మాత్రమే ప్రవేశం ఉంటుందని గుర్తుచేశాడు.ఇదీ చదవండి: ‘ఆయా షేర్’ రీల్స్ కోసం లక్ష జడలు కొన్నారు: నాని -
కిరణ్ అబ్బవరం నిర్మాణంలో మరో సినిమా.. ఆసక్తిగా టీజర్
కిరణ్ అబ్బవరం హీరోగా మాత్రమే కాదు.. నిర్మాతగానూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇప్పటికే తన బ్యానర్లో తిమ్మరాజుపల్లి టీవీ సినిమాతో నిర్మాతగా మారారు. తాజాగా తన క ప్రొడక్షన్స్ నిర్మాణంలో మరో సినిమా వచ్చేస్తోంది. ఈ సారి థ్రిల్లర్ జానర్లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కుష్లు మద్దాల, రెహ్మాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టస్వామి కీలక పాత్రల్లో వస్తోన్న థ్రిల్లర్ మూవీ హతః. ఈ సినిమాకు అనుష్ గోరాక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లోని సన్నివేశాలు చూస్తుంటే హారర్ థ్రిల్లర్‌గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని దీపావళి కానుకగా నవంబరు 6న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా.. ఈ సినిమాకు జేసిన్ జార్జ్ సంగీతమందిస్తున్నారు. -
పెద్ది, ఇరుముడి కాదు.. ఆస్కార్ బరిలో ఊహించని సినిమా..!
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు మనదేశం నుంచి ఊహించని చిత్రం ఎంపికైంది. దాదాపు 30కి పైగా సినిమాలు పోటీపడగా..ఇండియా నుంచి ఓ చిన్న మూవీ జాక్‌పాట్ కొట్టేసింది. మరాఠీలో తెరకెక్కించిన గోంధాల్ మూవీ ఎంపికైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని 99వ అకాడమీ అవార్డులకు గానూ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ ఎంపిక చేసింది.ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్‌లో మై వాపస్ ఆవుంగా, బోర్డర్ 2, ధురందర్, 120 బహదూర్, సింగ్ గీతం, పెద్ది, ఇరుముడి, లాంటి సినిమాలు కూడా పోటీపడ్డాయి. ఈ చిత్రాలను వెనక్కి నెట్టి గోంధల్ అర్హత సాధించింది. ఈ లిస్ట్‌లో గోంధాల్ తర్వాత స్థానంలో ఇక్కీస్, అంఘ్ సినిమాలు నిలిచాయని జ్యూరీ వెల్లడించింది. గోంధాల్ మూవీ భారతీయ సంస్కృతిని చక్కగా చూపించారని..సినిమాటోగ్రఫీ, సంగీతం అద్భుతంగా ఉన్నాయని జ్యూరీ సభ్యుల్లో ఒకరు అన్నారు.ఈ చిత్రం ఒక రాత్రంతా జరిగే జానపద ప్రదర్శన అయిన సాంప్రదాయ మహారాష్ట్ర గోంధాల్ ఆచారం నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంతో దర్శకుడు సంతోష్ దావఖర్ అరంగేట్రం చేశారు. ఇది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. అక్కడ స్పెషల్ జ్యూరీ గుర్తింపుతో సిల్వర్ పీకాక్ అవార్డును గెలుచుకుంది. గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ పరిమిత వసూళ్లు మాత్రమే సాధించింది. కాగా.. 99వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14, 2027న జరగనుంది. -
కెప్టెన్సీ పోరు.. షాలిని వర్సెస్ వర్షిణి.. హౌస్‌లో మాటల యుద్దం..!
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ రేస్ నడుస్తోంది. హౌస్‌లో నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు కంటెస్టెంట్స్ శతవిధాల పోటీపడుతున్నారు. ఈ రేసులో ఐదుమంది పోటీలో నిలిచారు. వీరికి బిగ్‌బాస్ టాస్క్‌లు పెట్టి పరుగులు పెట్టించాడు. పదిమంది కంటెస్టెంట్స్‌ను గార్డ్స్‌గా పెట్టగా.. మిగిలిన ఐదుగురు వాళ్లను దాటుకుంటూ వెళ్లి లక్ష్యాన్ని చేరుకోవాలి.ఈ టాస్క్‌లో షాలిని, వర్షిణి మధ్య మాటల యుద్ధం జరిగింది. షాలినిని వయసులో నువ్వు చిన్నదానివంటూ వర్షిణి అనడంతో మాటమాట పెరిగింది. దీంతో కాసేపు వీరిద్దరి మధ్య మాటలతో బిగ్‌బాస్ హౌస్ హోరెత్తింది. ఈ ప్రోమో చూస్తుంటే కెప్టెన్సీ రేసు కోసం కంటెస్టెంట్స్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాల్టి ఎపిసోడ్లో కెప్టెన్సీ ఎవరినీ వరిస్తుందో తెలియాలంటే మీరూ కూడా బిగ్‌బాస్ చూసేయాల్సిందే. -
శ్రీనందు లేటేస్ట్ మూవీ.. మగాళ్ల కోసమేనా?
టాలీవుడ్ హీరో శ్రీనందు, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మూవీ మగాళ్లు జిందాబాద్. ఈ సినిమాకు నారా ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రసాద్ భాస్కర్ల, చైతన్య వంగవరపు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ టైటిల్ చూస్తుంటే మగాళ్ల జీవితాల నేపథ్యంలోనే కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నట్లు పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ చిత్రంలో వైవా హర్ష, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాలా, మదిన్ ఎస్కే సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. -
‘సీక్రెట్ సోల్జర్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: సీక్రెట్ సోల్జర్నటీనటులు:నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్, హర్షిత బండ్కమూరి, కమల్ కామరాజు, తులసి, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్.నిర్మాణ సంస్థ: మూన్ లైట్ డ్రీమ్స్రచన, దర్శకత్వం: అక్కి విశ్వనాధ రెడ్డిసంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతుఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్విడుదల తేది: సెప్టెంబర్ 18, 2026కథేంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన మీరావలి అలియాస్ వలి (నిహాల్ కోదాటి), పృథ్వి (సూర్య శ్రీనివాస్) ప్రాణ స్నేహితులు. వలికి దేశభక్తి ఎక్కువ. అయినా కూడా మతం కారణంగా అందరూ అతని దేశ భక్తిని అనుమానిస్తుంటారు. దీంతో తన దేశభక్తిని చాటేందుకు ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటాడు. కానీ అది చేజారిపోతుంది. దీంతో ‘రా’(Raw)లో చేరాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే.. ఇతనిపై ఉగ్రవాది అనే ముద్రపడుతుంది. ఇండియా కి సంబధించిన ఓ కీలక ఇన్ఫర్మేషన్ లీక్ చేయడంలో వలి పాత్ర ఉందని అనుమానిస్తారు. ‘రా’ అధికారులు తమదైన శైలీలో విచారణ చేపట్టగా.. సంచలన విషయాలు తెలుస్తాయి. అవేంటి? కీలకమైన డిఫెన్స్ సమాచారం లీకేజీ వెనుక ఉన్న కుట్రదారులు ఎవరు? వారి లక్ష్యం ఏంటి? దేశం కోసం వలి ఏం చేశాడు? వలికి సంబంధించిన కీలక సమాచారం తెలిసిన తర్వాత పృథ్వి ఏం చేశాడు? ఇద్దరు మిత్రులు ఈ మిషన్‌లో ఎలా భాగమయ్యారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. స్నేహం, దేశభక్తి.. ఈ రెండు ఎమోషన్స్‌తో తెరకెక్కిన చిత్రమే సీక్రెట్ సోల్జర్. ఇండియా కి సంబధించిన ఓ కీలక ఇన్ఫర్మేషన్ లీకైన సంఘటనకు, నెల్లూరులో చాలా సాదాసీదాగా బతికే ఇద్దరు కుర్రాళ్లకి లింక్ ఏమిటి? ఆ సమస్యను పరిష్కరించగలిగారా లేదా? అనేది ఈ సినిమా కథ. దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి ఈ స్పై యాక్షన్ డ్రామాను చాలా డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. స్పై డ్రామా సినిమాల్లో కనిపించే హంగులేవి ఇందులో కనిపించవు.ఫస్టాఫ్ అంతా ఇద్దరు స్నేహితుల చుట్టూనే తిరుగుతుంది. విభిన్నమైన నేపథ్యలు ఉన్న ఈ ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఊర్లో సాదాసీదాగా తిరిగే ఈ ఇద్దరు కుర్రాళ్లు.. డిఫెన్స్ సమాచారం లీకేజీ ఇష్యూలోకి ఎలా వచ్చారనేది సహజంగా చూపించారు.ఇక సెకండాఫ్ మొత్తం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఉగ్రవాదుల మిషన్‌ని అడ్డుకునేందుకు ‘రా’టీమ్ చేసే ప్రయత్నాలు..ఇందులో స్నేహితులిద్దరూ భాగమయ్యే తీరు, వాళ్లు చేసే సాహసాలు అన్ని ఆకట్టుకుంటాయి. అయితే దర్శకుడు హీరో క్యారెక్టర్ని తీర్చిదిద్దిన విధానం బాగోలేదు. ఒక స్పైగా అతన్ని చూపించి.. శత్రువుల చేతుల్లో ఎప్పుడూ ఓ పావులాగే మారేలా చేశారు. ఆ పాత్ర చేసే సాహసాల కంటే శత్రువులు వేసిన ఎత్తుగడలే గొప్పగా చూపించారు. అలాగే దేశభద్రతకు సంబంధించిన సున్నితమైన విషయాలను శత్రువులు తస్కరించే తీరు కూడా మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే కొంతమంది గూఢచారుల జీవితాలు ఎలా ముగుస్తాయి? వాళ్లకు దక్కే గుర్తింపు ఎలా ఉంటుంది? అనేది ఇందులో చూపించిన తీరు బాగుంది. కథను మరింత బలంగా రాసుకొని.. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. దేశభక్తి ఎక్కువగా ఉన్న వలి పాత్రలో నిహాల్ కోదాటి చక్కగా నటించాడు. ఇక ధనవంతుడి కొడుకుగా సూర్య శ్రీనివాస్ ఒదిగిపోయాడు. వీరిద్దరు స్నేహబంధం ఈ సినిమాకు ప్లస్ అయింది. నిజమైన ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎలా ఉంటారు? ఎలా మాట్లాడుకుంటారు? ఆపద వస్తే ఎలా ఆదుకుంటారు? అనేది చాలా సహజంగా చూపించారు. హర్షిత బండ్లమూరి, శిరీష నూలుతో పాటు రఘుబాబు, తులసి, వడ్లమాని శ్రీనివాస్, శ్రీకాంత్ అయ్యంగార్, కమల్ కామరాజు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీ రివ్యూ
టైటిల్: పిఠాపురంలో అలా మొదలైందినటీనటులు: డా. రాజేంద్రప్రసాద్, పృధ్విరాజ్ ,కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, తదితరులునిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, FM మురళీ (గోదారి కిట్టయ్య)దర్శకత్వం: మహేశ్ చంద్రవిడుదల తేది: సెప్టెంబర్ 18, 2026కథేంటంటే..పిఠాపురం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ప్రెసిడెంట్ వీర రాఘవ(రాజేంద్రప్రసాద్), స్కూల్ మాస్టర్ విశ్వనాథం(కేదార్ శంకర్), భూస్వామి బంగారయ్య(పృథ్వీ)..ముగ్గురు మంచి స్నేహితులు. వీరి కూతుళ్లు అంజని(ప్రత్యూష), కీర్తన(శ్రీలు), గీత(రిహానా)కూడా చిన్నప్పటి నుంచి కలిసే ఉంటారు. పదో తరగతి తర్వాత ఇంటర్ చదివేందుకు పిఠాపురం వెళ్తారు. ముగ్గురు ఒకే కాలేజీలో జాయిన్ అవుతారు. అక్కడ కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ముగ్గురు ముగ్గరు అబ్బాయిలతో ప్రేమలో పడతారు. టాపర్‌గా నిలిచే గీత.. డిగ్రీ చదువుతుండగానే పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. గీత..జల్సాలకు అలవాటు పడి..ప్రియుడు ఆకాశ్ మాటలు విని గోవాకు పారిపోతుంది. ఇలా ఇద్దరు స్నేహితులు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో తన ప్రేమ విషయం నాన్నకు చెప్పేందుకు అంజని భయపడుతుంది. చివరకు తన ప్రేమ విషయాన్ని నాన్న వీర రాఘవకు చెప్పేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తల్లిదండ్రుల ప్రేమను కాదని ప్రియుడుతో వెళ్లాలనుకున్న గీత, కీర్తన..పెరెంట్స్‌ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలకున్న అంజన.. వీరిలో ఎవరి నిర్ణయం మంచిదైంది? తల్లిదండ్రుల పెంపకం.. పిల్లల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ప్రేయసి రావే, చెప్పాలని ఉంది, ఆలస్యం అమృతం లాంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ టాలీవుడ్ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు చంద్ర మహేశ్. చాలా కాలం తర్వాత తన పేరును మహేశ్ చంద్రగా మార్చుకొని ‘పిఠాపురంలో అలా మొదలైంది’అనే సినిమా తీశాడు. బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు కావడం.. టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో ‘పిఠాపురంలో అలా మొదలైంది’సినిమాపై కొంత అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలతో సినిమాకు వెళ్తే మాత్రం కొంత నిరాశ తప్పదు. అలా అని తీసిపారేసే సినిమా అని చెప్పలేం. పాత తరహా కథాంశాన్నే ఎంచుకున్నప్పటికీ, నేటి యువతకు, తల్లిదండ్రులకు ఒక మంచి అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, ఇచ్చిన సందేశం బాగుంది. అయితే దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాల రొటీన్‌గా ఉన్నాయి. బ్రహ్మానందం వాయిస్ ఓవర్‌తో ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ కథ ప్రారంభం అవుతుంది. ముగ్గురు యువతులు..వారి పెరెంట్స్ చుట్టూ కథ తిరుగుతుంది. ఫస్టాప్ మొత్తం స్కూల్ డేస్.. కాలేజీ.. కొత్త పరిచయాలతో అమ్మాయిల్లో వచ్చే మార్పులు..లవ్ ట్రాక్..ఇలా సాగుతుంది. అయితే ఆయా సన్నివేశాలన్నీ రొటీన్‌గానే ఉంటాయి. ఇంటర్వెల్ సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్ ఇంట్లో నుంచి పారిపోయిన గీత, కీర్తనలకు ఎదురైన సమస్యలు చూపించారు. ఆ సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతాయి. అయితే ఈ తరహా కథలను ఆల్రెడీ చూసేయడంతో కొత్తగా అనిపించదు. క్లైమాక్స్‌తో అందరు కలవడం.. పెళ్లి తంతు, పెరెంట్స్ భావోద్వేగాలు అన్ని ఆకట్టుకుంటాయి. అలాగే రాజేంద్ర ప్రసాద్ చెప్పే మాటలు కూడా ఆలోచింపజేస్తాయి.ఎవరెలా చేశారంటే.. ప్రెసిడెంట్ వీరరాఘవ పాత్రకి రాజేంద్ర ప్రసాద్ న్యాయం చేశాడు. ఆయన అనుభవం ఈ పాత్రకు చాలా ఉపయోగపడింది. ఇక స్ట్రిక్ట్ ఫాదర్‌గా కేదార్ శంకర్ బాగా నటించాడు. బాగా డబ్బున్న తండ్రిగా పృథ్వీ మెప్పించాడు. ముగ్గురు యువతులుగా చేసిన రిహానా, శ్రీలు, ప్రత్యూష తమ క్యారెక్టర్ల పరిధి మేరకు చక్కని అభినయం కనబరిచారు. గ్లామర్ పరంగానే కాకుండా ఎమోషనల్ సన్నివేశాల్లోనూ మెప్పించారు. సాంకేతిక విషయాలకొస్తే.. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను ఇంకాస్త క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
మహిళల అభివృద్ధికి సెలబ్రిటీల సంచలన నిర్ణయం
మహిళల అభివృద్ధికి సెలబ్రిటీలు పెద్దపేట వేస్తున్నారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవలను పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబరు 17 వరకు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరుతో కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో పాల్గొనేందుకు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున భాగమవుతున్నారు.1000మంది మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్నిన్న( సెప్టెంబర్ 17) నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూనే సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. 1000మంది మహిళలకు ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ దశగానే బాలీవుడ్ యాక్టర్స్ సైతం అడుగులు వేశారు. తాజాగా ముంబైలోని లాల్బాడ్చా రాజాను దర్శించుకున్న రణ్వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఆసక్తి కరమైన విషయాలను పంచుకున్నారు.‘సేవా సంకల్ప్ అభియాన్‌లో పాల్గొని 1000మంది బాలికలను చదివిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ పనిని వినాయకుడు నా వెనుక ఉండి నడిపిస్తాడని నమ్ముతున్నాను’ అని రణ్వీర్ తెలిపారు. అలియా భట్, రణ్‌బీర్ కపూర్ కూడా ముంబైలోని 20 పాఠశాలలను డెవలెప్మెంట్ చేసే బాధ్యతలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. (ఇదీ చదవండి: రష్మికతో విజయ్ ‘ఎందయ్యా సామి’ సాంగ్ వచ్చేస్తోంది..!) Ranveer Singh has already shaken up the others lobby with Dhurandhar. 🫡And today, once again, by seeking Ganpati’s blessings on Narendra Modi’s birthday, he has slapped again others lobby right in the face Ranveer: Mera pichla saal kafi accha gaya mere liye aur mere… pic.twitter.com/LjQ9xHgq9v— NIKs (@Neeteshx5) September 17, 2026 -
జాంబీల ప్రపంచంలోకి ఉపేంద్ర ఎంట్రీ
తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘జాంబీ రెడ్డి2’. 2021లో విడుదలైన ‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్‌గా రూపొందిస్తున్నారు. సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆరోజు(సెప్టెంబర్ 18) ఉపేంద్ర పుట్టినరోజు కావడంతో ఈయనకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ని చిత్రం బృందం విడుదల చేసింది. పోస్టర్లో ఆయన చెట్టుకు తలకిందులుగా వేలాడుతున్న ఫొటో సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.కాగా బాలనటుడిగా అందరి ప్రశంసలు పొంది ‘జాంబీ రెడ్డి’తో హీరోగా పరిచయమయ్యాడు తేజ సజ్జా. అతని పుట్టినరోజు(ఆగస్టు23)న పీపుల్స్ మీడియా అభిమానులకు ‘జాంబీ రెడ్డి నెక్ట్స్ లెవల్’ అంటూ ‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్ రోబోతోందటూ ప్రకటించింది. మూవీ అప్డేట్ వచ్చిన నుంచి సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ 2027లో ప్రేక్షకులను పలకరించనుంది. తెలుగు, తమిళం, హిందీ, తదితర భాషల్లో విడుదల కానుంది. Wishing the Real Star @nimmaupendra a very Happy Birthday 💥#ZombieReddy2 NXT LVL will unleash a whole new flavour of madness, menace & mass with his never-before-seen avatar ❤️🔥🧟♂️Superhero @tejasajja123 @Suparn @PrasanthVarma #ShanayaKapoor @vishwaprasadtg #KrithiPrasad… pic.twitter.com/pSPSdlozwY— People Media Factory (@peoplemediafcy) September 18, 2026 -
‘హీరో నానినే.. నా ఇన్స్పిరేషన్’
ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది.(ఇదీ చదవండి: నటనకు ప్రాణం పెట్టిన తారలు.. కోట్లలో కలెక్షన్లు)డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ ‘టైటిల్ విని మా నిర్మాతలు ఈ సినిమా ని ఒకే చేశారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కు మంచి ఆదరణ వచ్చింది. చాలా కష్టపడి ఈ సినిమాని తీర్చిదిద్దాం’ అని అన్నారు. ఖాన్ దురాని మాట్లాడుతూ.. ‘ ఈ సినిమాని సెప్టెంబర్ 18 బదులు సెప్టెంబర్ 25 కి రిలీజ్ చేస్తున్నాం. పారడైజ్ కి పోటీ వెళ్తున్నారా అని చాలామంది అడిగుతున్నారు. మేము ఎవ్వరికీ పోటీ వెళ్లడం లేదు. మొన్న జరిగిన ఈవెంట్ లో కూడా చెప్పా నాని అంటే నాకు చాలా ఇష్టం. ఆయనే నా ఇన్స్పిరేషన్’ అని అన్నారు. (ఇదీ చదవండి: రష్మికతో విజయ్ ‘ఎందయ్యా సామి’ సాంగ్ వచ్చేస్తోంది..!) -
రష్మికతో విజయ్ ‘ఎందయ్యా సామి’ సాంగ్ వచ్చేస్తోంది..!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. అజయ్-అతుల్ సంగీతం అందించిన ‘ఎందయ్యా సామి’ పాటను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ పాట అందుబాటులోకి రానుంది.రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ రణబాలిగా, రష్మిక మందన్న జయమ్మగా కనిపించనున్నారు. 1854–1878 మధ్య బ్రిటిష్ పాలనలో దక్షిణ భారతంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల నేపథ్యంలో కథ సాగనుంది. 130 రోజుల పాటు షూటింగ్ జరిపిన ఈ మూవీ అక్టోబర్ 16, 2026న దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


