మహేశ్‌బాబు చేతులమీదుగా టీజర్‌.. అదిరిపోయేలా విజువల్స్‌ | Nagabandham movie Teaser released by mahesh babu | Sakshi
Sakshi News home page

అదిరిపోయే రేంజ్‌లో 'నాగబంధం' టీజర్‌

Feb 15 2026 11:13 AM | Updated on Feb 15 2026 12:10 PM

Nagabandham movie Teaser released by mahesh babu

పాన్‌ ఇండియా చిత్రం ‘నాగబంధం’ టీజర్‌ వచ్చేసింది. అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘పెద్ద కాపు’ ఫేమ్‌ విరాట్‌ కర్ణ హీరోగా నటిస్తుండగా  నభా నటేష్‌, ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా తాజాగా మహేష్‌బాబు చేతులమీదు టీజర్‌ను రిలీజ్‌ చేశారు.

భారతదేశ చరిరత్రలో ఎన్నో పురాతనమైన రహస్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని నాగబంధం సంప్రదాయంతో ముడిపడి కాలగర్భంలో కలిసిపోయాయి. ఇదే కథను ఒక అద్భుతంలా తెరపై ఆవిష్కరించారు. 1750 నేపథ్యంలో భారీ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 2026 వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement