breaking news
Nagabandham Movie
-
మూడు వారాల్లోనే ఓటీటీకి నాగబంధం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విరాట్ కర్ణ, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ నాగబంధం. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. అనంత పద్మనాభ స్వామి బ్యాక్‌డ్రాప్‌లో సోషియో ఫాంటసీ కథగా వచ్చిన ఈ సినిమా గ్రాఫిక్స్ పరంగా అభిమానుల్ని ఆకట్టుకుంది. అయితే కంటెంట్ పరంగా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకరపోయింది. ఈ సినిమాలో ఫైట్స్‌తో పాటు కొన్ని సన్నివేశాలు అనవసర నిడివిని పెంచాయనే కామెంట్స్ కూడా వినిపించాయి.అయితే జూలై 3న రిలీజైన ఈ మూవీ అప్పుడే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ చిత్రం జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. అసలు కథేంటంటే..ఈ సినిమా కథంతా 1756-1962 నేపథ్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ సాగుతుంది. ఇండియన్ ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్(జగపతి బాబు) తన 30 ఏళ్ల కెరీర్లో ఎన్నో రహస్యాలను ఛేదించినా.. నాగబంధం రహస్యాన్ని మాత్రం కనిపెట్టలేకపోతాడు. దీనిపై తన శిష్యులు టెస్లా, అలీ(రిషబ్ సాహ్నీ) పరిశోధన చేస్తూ హిమాలయాలకు వెళ్తారు . అక్కడ ఎన్నో ఏళ్లుగా బంధించబడి ఉన్న బైరాగి(గరుడ రామ్) తన మంత్ర శక్తితో అలీ గతాన్ని గుర్తు చేసి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ప్రపంచాన్ని జయించాలంటే నాగ బంధాన్ని విడిపించాలని అందుకోసం బ్రహ్మ కమలం తీసుకురావాలని ఆలీని ఆదేశిస్తాడు. అలీ తన అనుచరులతో బ్రహ్మకమలం వెతుకుతూ.. అడ్డుకున్న వాళ్లను, దానికి సంబంధించిన వివరాలు తెలిసి చెప్పని వాళ్లను క్రూరంగా చంపుతుంటాడు. చివరకు ఆ బ్రహ్మకమలం శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉన్న స్వామివారి నాభిలో ఉండే పద్మంలో ఉందని తెలిసి.. ఓ ప్లాన్ ప్రకారం ఆలయం నుంచి బయటకు తీసుకురాగా.. ఓ కారణంగా అది భైరవకోన సమీపంలోని సముద్రంలో పడిపోతుంది. దాన్ని తీసుకొచ్చింది అలీ మనుషులు తులసీవనం గ్రామానికి వెళ్తారు. అక్కడ డబ్బు ఆశ చూపి రుద్ర(విరాట్ కర్ణ) సహాయంతో పడవలో భైరవకోనకు బయలుదేరుతారు. మరి ఆ స్వర్ణ కమలం అలీ మనుషులకు దొరికిందా లేదా? రుద్ర వాళ్లకు సహాయం చేశాడా లేదా? ఆ బ్రహ్మకమలానికి రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? అతను ప్రాణంగా ప్రేమించే చెల్లి మాసస(సోనియా సింగ్) చావుకు కారణం ఎవరు? పార్వతి(నభా నటేష్) ఎవరు? రుద్రతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? 1956లో ఏం జరిగింది? ముస్లిం రాజుతో కలిసి భైరాగి పన్నిన కుట్ర ఏంటి? అసలు నాగబంధం నేపథ్యం ఏంటి?చివరకు బైరాగి నాగబంధాన్ని విడిపించాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
నాగబంధంలో అనసూయ.. అరుదైన స్టిల్స్ చూశారా? (ఫోటోలు)
-
నాగబంధం రెండున్నరేళ్ల ప్రయాణం: అభిషేక్ నామా
‘నాగబంధం’ సినిమా రెండున్నరేళ్ల ప్రయాణం. ఈ చిత్రంలో మా యూనిట్ కష్టం ఎంతో ఉంది. ఇలాంటి కథని నమ్మి ముందుకొచ్చిన నిర్మాతలను, నటించిన హీరోను అందరూ సపోర్ట్ చేయాలి. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మేరకు ఫస్ట్ హాఫ్‌లో ఒక సాంగ్‌ని తీసేశాం. అలాగే క్లైమాక్స్ కూడా కొంచెం తగ్గించాం’’ అని డైరెక్టర్ అభిషేక్ నామా తెలిపారు.విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘నాగబంధం– ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 3న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో విరాట్ కర్ణ మాట్లాడుతూ–‘‘అనంత పద్మనాభ స్వామి స్క్రీన్‌మీద కనిపిస్తున్న సమయంలో కొందరు ప్రేక్షకులు చెప్పులు తీసి సినిమా చూస్తున్నారు.. వాళ్ల కళ్లల్లో నీళ్లు కనిపిస్తున్నాయి.ఇంతకంటే ఎమోషన్ ఏముంటుంది? ‘హర హర మహాదేవ’ నినాదంతో ‘నాగబంధం’ ఆడుతున్న థియేటర్స్ మార్మోగుతుంటే ఇంతకంటే గొప్ప అనుభూతి ఏముంటుంది?’’ అని పేర్కొన్నారు. ‘‘రెండున్నరేళ్ల కష్టానికి ప్రేక్షకులు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చారు. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు నభా నటేష్. ‘‘మన పిల్లలకు మన చరిత్ర, సనాతన ధర్మం, పెద్దలు చేసిన త్యాగాలను తెలియజేయాలనే ‘నాగబంధం’ తీశాం’’అని నిశిత నాగిరెడ్డి తెలిపారు. ‘‘త్వరలోనే మా తర్వాతి సినిమాని ప్రారంభించబోతున్నాం’’ అన్నారు కిషోర్ అన్నపురెడ్డి. -
సినిమా విడుదల కాకముందే రివ్యూలు ఇచ్చారు: అభిషేక్ నామా
విరాట్ కర్ణ, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం నాగబంధం. ఈ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. అనంత పద్మనాభ స్వామి బ్యాక్‌డ్రాప్‌లో సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కించారు. ఈ నెల 3న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ పరంగా అభిమానుల్ని ఆకట్టుకుంటున్నప్పటికీ కంటెంట్ పరంగా అంతగా మెప్పించలేకపోయింది. ఫైట్స్ సహా కొన్ని సన్నివేశాలు అనవసర నిడివిని పెంచాయనే కామెంట్స్ కూడా వినిపించాయి.తాజాగా నాగబంధం సనాతన జాగరణ కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ అభిషేక్ నామా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ తన రెండున్నరేళ్ల కష్టమని థియేటర్లో చూసి ఆదరించాలని దర్శకుడు సినీ ప్రేక్షకులను కోరారు. మా సినిమా విషయంలో కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు. ప్రేక్షకులు, నిజమైన సినీ విమర్శకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిడివి తగ్గించామని తెలిపారు. మరికొందరు సినిమా విడుదల కాకముందే రివ్యూలు ఇచ్చారు.. ఇదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి మీ అభిప్రాయం చెబితే మాకు ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ఈ మూవీ కల్పిత కథ కాదు. చరిత్రలో జరిగినదే తర్వాతి తరాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో పొందుపరిచామని అభిషేక్ నామా అన్నారు. మన హిందువులకి జరిగిన అన్యాయాన్ని ఈ సినిమాలో చూపించానని అన్నారు. నేను కేవలం ఒక పదిశాతం మాత్రమే ఈ సినిమాలో చెప్పానని తెలిపారు. -
'నాగబంధం' సినిమా.. ఒక్కరోజులోనే కట్ చేసిపడేశారు
సాధారణంగా కొత్త సినిమాలు రిలీజైనప్పుడు రివ్యూయర్లు గానీ ప్రేక్షకుల గానీ నిడివి విషయంలో కొన్నిసార్లు కంప్లైంట్ చేస్తుంటారు. కానీ దర్శకనిర్మాతలు మాత్రం తాము తీసిన దానిపై ప్రేమతో సీన్స్ కట్ చేయడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు మాత్రం ఆడియెన్స్ స్పందనకు తగ్గట్లు ఎడిట్ చేస్తుంటారు. ఇప్పుడు 'నాగబంధం' టీమ్ కూడా అదే చేసింది.(ఇదీ చదవండి: నేను తెలుగోడినే.. టాలీవుడ్ పట్టించుకోలేదు)ఈ సినిమాలో విరాట్ కర్ణ, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా నటించగా అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. అనంత పద్మనాభ స్వామి బ్యాక్‌డ్రాప్‌లో సోషియో ఫాంటసీ కథతో తీసిన ఈ చిత్రంలో గ్రాఫిక్స్ పరంగా అభిమానుల్ని ఆకట్టుకుంటున్నప్పటికీ కంటెంట్ ఓకే ఓకే అనిపించిందనే కంప్లైంట్స్ వచ్చాయి. ఫైట్స్ సహా కొన్ని సన్నివేశాలు అనవసర నిడివిని పెంచాయనే కామెంట్స్ కూడా వినిపించాయి.ఇప్పుడు ప్రేక్షకుల స్పందనని పరిగణలోకి తీసుకున్న చిత్రబృందం.. దాదాపు 20 నిమిషాల సన్నివేశాల్ని తొలగించినట్లు తెలిపింది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసింది. థియేటర్లలో 3 గంటల 5 నిమిషాల నిడివితో మూవీని ప్రదర్శించారు. ఇప్పుడు 2 గంటల 45 నిమిషాల నిడివితో ప్రదర్శించబోతున్నారు.(ఇదీ చదవండి: ‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
నాగబంధం vs రావు బహదూర్.. ఎవరికి ఎన్ని కోట్లు వచ్చాయ్?
ఈ వీకెండ్ భారీ బడ్జెట్ సినిమాలు కానప్పటికీ ఓ మాదిరి హైప్‌తో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలోకి నాగబంధం, రావు బహదూర్ చిత్రాలు వచ్చాయి. రెండు వేర్వేరు జానర్ మూవీస్ కావడంతో ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించారు. అందుకు తగ్గట్లే ఒకటి గ్రాఫిక్స్ పరంగా ఆకట్టుకోగా.. మరొకటి చిత్రమైన కాన్సెప్ట్‌తో వచ్చింది. మరి వీటికి తొలిరోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చాయ్?విరాటకర్ణ, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా చేసిన 'నాగబంధం' సినిమాని బ్రహ్మకమలం, అనంత పద్మనాభి స్వామి నిధి, సనాతన ధర్మం తదితర అంశాలతో తెరకెక్కించారు. స్టోరీ పరంగా వీక్ అనే టాక్ వినిపిస్తున్నప్పటికీ మూడు గంటలకు పైగా నిడివితో ప్రతి ఫ్రేమ్‌లో గ్రాఫిక్స్‌తో భారీతనం కనిపించిందని చూసినవాళ్లు అంటున్నారు. ఇక ఈ చిత్రానికి తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.3.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.(ఇదీ చదవండి: ‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఇకపోతే సత్యదేవ్ హీరోగా, వెంకటేశ్ మహా దర్శకత్వం వచ్చిన సినిమా 'రావు బహదూర్'. 1968, 1991 కాలంలో ఓ రాజ వంశానికి చెందిన ఓ వ్యక్తి జీవితం ఆధారంగా తీసిన కల్పిత కథ ఇది. అనుమానం పెనుభూతం అనే అంశాన్ని మేజర్‌గా తీసుకున్నప్పటికీ సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడంలో టీమ్ విఫలమైంది. చాలా బుర్రపెట్టి చూస్తే తప్పితే ఈ చిత్రం అర్థం కాని పరిస్థితి. ఇక ఈ సినిమాకు తొలిరోజు రూ.3.9 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు.(ఇదీ చదవండి: 'రావు బహదూర్' సినిమా రివ్యూ) -
నాగబంధం మూవీ.. ఆ క్యారెక్టర్‌పై నెటిజన్ల ప్రశంసలు.!
విరాట్ కర్ణ, నభా నటేశ్ కీలక పాత్రల్లో వచ్చిన అడ్వెంచరస్ మూవీ 'నాగబంధం'. అద్భుతమైన విజువల్స్, పురాణ నేపథ్యంగా ఈ మూవీని తెరకెక్కించారు. అభిషేక్ నామా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తొలిరోజే మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. ఈ చిత్రంలో విలన్‌గా 'అబ్దాలీ' పాత్రలో రిషబ్ సాహ్నీ నటించారు.తాజాగా అతని గురించే టాలీవుడ్లో చర్చ మొదలైంది. థియేటర్లో రిషబ్ సాహ్నీ ప్రత్యేకమైన ఇంపాక్ట్ కనిపిస్తోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్, డామినేటింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 'నాగబంధం' సినిమాలో రిషబ్ సాహ్నీ నటన ఒక్కటే హైలెట్‌గా నిలిచిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.నాగబంధం చూసిన పలువురు రిషబ్ సాహ్నీ నటనను ప్రశంసిస్తున్నారు. దర్శకులు ఇలాంటి పవర్ఫుల్ పాత్రల్లో రిషబ్‌ను మరింతగా చూపించాలంటూ ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. రిషబ్ సాహ్నీ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవల్.. అతను ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారీ ఏదో పెద్దది జరగబోతుందన్న ఫీలింగ్ కలిగిందని రాసుకొచ్చారు. అబ్దాలీ పాత్రలో ఆయన చూపించిన డామినేషన్ అద్భుతం.. ఫైటర్ తర్వాత మరోసారి తన నటనతో గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారని మరికొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ చిత్రంలో ప్రేక్షకుల మనసులో బలమైన ముద్ర వేసిన పాత్రల్లో 'అబ్దాలీ' ఒకటిగా నిలిచిందనే చెప్పొచ్చు. -
‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : నాగబంధం:ది సీక్రెట్ ట్రెజర్నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సాహ్నీ తదితరులుదర్శకుడు: అభిషేక్ నామానిర్మాణ సంస్థలు:ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డిసినిమాటోగ్రఫీ: సుందర్ రాజన్ ఎస్సంగీతం: జునైద్ కుమార్- అబేవిడుదల తేదీ: జులై 03, 2026సీనీ ప్రేక్షకులు మైండ్‌సెట్ మారిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోలు ఉంటేనే సినిమా చూసేవాళ్లు. కానీ ఇపుడు కథలో దమ్ముంటే చాలు స్టార్స్‌ని పట్టించుకోకుండా సినిమాను ఆదరిస్తున్నారు. అందుకే ఈ మధ్య కంటెంట్‌ని నమ్ముకొని సినిమాలో తీస్తున్నారు. అలా తెరకెక్కించిన చిత్రమే ‘నాగబంధం’. కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న హీరో(విరాట్ కర్ణ)ని పెట్టుకొని రూ. 100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అభిషేక్ నామా. టీజర్, ట్రైలర్ కూడా అంచనాలను పెంచేశాయి. మరి సినిమా కూడా ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఉందా? దర్శకుడిగా అభిషేక్ నామా హిట్ కొట్టాడా లేదా రివ్యూలో చూద్దాం. (Nagabandham Movie Telugu Review)కథేంటంటే..ఈ సినిమా కథంతా 1756-1962 నేపథ్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ సాగుతుంది. ఇండియన్ ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్(జగపతి బాబు) తన 30 ఏళ్ల కెరీర్లో ఎన్నో రహస్యాలను ఛేదించినా.. నాగబంధం రహస్యాన్ని మాత్రం కనిపెట్టలేకపోతాడు. దీనిపై తన శిష్యులు టెస్లా, అలీ(రిషబ్ సాహ్నీ) పరిశోధన చేస్తూ హిమాలయాలకు వెళ్తారు . అక్కడ ఎన్నో ఏళ్లుగా బంధించబడి ఉన్న బైరాగి(గరుడ రామ్) తన మంత్ర శక్తితో అలీ గతాన్ని గుర్తు చేసి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ప్రపంచాన్ని జయించాలంటే నాగ బంధాన్ని విడిపించాలని అందుకోసం బ్రహ్మ కమలం తీసుకురావాలని ఆలీని ఆదేశిస్తాడు. అలీ తన అనుచరులతో బ్రహ్మకమలం వెతుకుతూ.. అడ్డుకున్న వాళ్లను, దానికి సంబంధించిన వివరాలు తెలిసి చెప్పని వాళ్లను క్రూరంగా చంపుతుంటాడు. చివరకు ఆ బ్రహ్మకమలం శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉన్న స్వామివారి నాభిలో ఉండే పద్మంలో ఉందని తెలిసి.. ఓ ప్లాన్ ప్రకారం ఆలయం నుంచి బయటకు తీసుకురాగా.. ఓ కారణంగా అది భైరవకోన సమీపంలోని సముద్రంలో పడిపోతుంది. దాన్ని తీసుకొచ్చింది అలీ మనుషులు తులసీవనం గ్రామానికి వెళ్తారు. అక్కడ డబ్బు ఆశ చూపి రుద్ర(విరాట్ కర్ణ) సహాయంతో పడవలో భైరవకోనకు బయలుదేరుతారు. మరి ఆ స్వర్ణ కమలం అలీ మనుషులకు దొరికిందా లేదా? రుద్ర వాళ్లకు సహాయం చేశాడా లేదా? ఆ బ్రహ్మకమలానికి రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? అతను ప్రాణంగా ప్రేమించే చెల్లి మాసస(సోనియా సింగ్) చావుకు కారణం ఎవరు? పార్వతి(నభా నటేష్) ఎవరు? రుద్రతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? 1956లో ఏం జరిగింది? ముస్లిం రాజుతో కలిసి భైరాగి పన్నిన కుట్ర ఏంటి? అసలు నాగబంధం నేపథ్యం ఏంటి?చివరకు బైరాగి నాగబంధాన్ని విడిపించాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Nagabandham Movie Story)ఎలా ఉందంటే..సినిమాకు కథ అనేది గుండెకాయ అయితే, స్క్రీన్ ప్లే ఆ గుండె నుంచి వచ్చే లయబద్ధమైన శబ్దం. ఈ రెండూ సరిగ్గా కుదిరినప్పుడే వెండితెరపై మాయాజాలం సాధ్యమవుతుంది. అలా కాకుండా కేవలం కంటికి ఇంపుగా ఉండే విజువల్స్ చూపించినా, వందల కోట్ల బడ్జెట్‌తో భారీ వీఎఫ్ఎక్స్ హంగులు అద్దినా... ప్రేక్షకుడికి అసలైన 'ఎమోషన్' కనెక్ట్ అవ్వనప్పుడు ఆ హంగామా అంతా వృథా ప్రయాసగానే మిగిలిపోతుంది. ‘నాగబంధం’ విషయంలో అదే జరిగింది. విజువల్స్ బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా ఇప్పుడు ట్రెండింగ్దే. కానీ కథనం మాత్రం ఆకట్టుకునేలా సాగలేదు. అసలు కథను వదిలేసి అక్కర్లేని ట్రాక్‌లను పెట్టి.. కథను సాగదీశారు. ఈ సినిమాలో కొన్ని పాత్రలు ఎందుకు పెట్టారో తెలియదు. ఆ పాత్రలను చంపాల్సిన అవసరం ఏంటో కూడా తెలియదు. పోనీ ఆయా పాత్రలు అసలు కథతో ఏదైనా సంబంధం ఉందా అదీ లేదు. అదో సపరేట్ట్రాక్. ఇక హీరోయిన్‌తో హీరో ప్రేమలో పడిన సీన్ అయితే మరీ విచిత్రంగా ఉంటుంది. క్షణాల్లో ప్రేమ పుడుతుంది. తొలిసారే కలిసినా..అప్పుడే రొమాన్స్..పాట వరకు వెళ్తుంది. దానికి గల కారణం ఏంటో సెకండాఫ్‌లో చూపించినప్పటికీ అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. హీరో కూడా ప్రతిసారి తనకు సంబధించిన వాళ్లు చనిపోయినా తర్వాతనే ఫైట్ చేస్తాడు. ఇదే రిపీట్ అవ్వడంతో... అదేదో ముందే చేసి తనవాళ్లను రక్షించొచ్చు కదా? అనే ప్రశ్న మన మైండ్లోకి వస్తుంది. ఇక ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న సనాతన ధర్మం, హిందుత్వం టాపిక్‌పై మంచి మంచి డైలాగ్స్ పెట్టారు. కానీ తెరపై చూస్తుంటే అవి ఇరికించినట్లుగానే అనిపిస్తుంది తప్ప.. కథలో భాగంగా వచ్చాయాలనే ఫిలింగ్ కలుగదు. అలాగే ఈ చూస్తున్నంత సేపు అప్పట్లో వచ్చిన చిరంజీవి ‘అంజి’తో పాటు ఈ మధ్య వచ్చిన ‘కార్తికేయ ’, హనుమాన్, మిరాయ్ లాంటి చిత్రాలు గుర్తుకొస్తాయి. నాగబంధం నేపథ్యాన్ని తెలియజేస్తూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. నాగబంధానికి సంబంధించిన పుస్తకం, ఆ రహస్యాన్ని ప్రధానికి చేరవేసేదుందకు టెస్లా ప్రయత్నించడం.. వెంటనే అలీ వచ్చి అతన్ని చంపేయడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. హీరో ఎంట్రీ తర్వాత కథ ఫ్యామిలీ ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది. విలన్ మనుషులతో కలిసి పద్మకమలం కోసం హీరో సముద్రంలోకి వెళ్లినప్పటి నుంచి కథ ఆసక్తి పెరుగుతంది. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా లేకపోయినా..విజువల్స్, పాటలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కథనం నెమ్మదిగా సాగిందనే ఫీలింగ్ కలుగుతుంది. హారో ప్లాష్ బ్యాక్ స్టోరీ(1756) ఆకట్టుకుంటుంది. నాగబంధం రక్షణకు హీరో పాత్రకు గల సంబధం తెలియజేసే సీన్లు బాగుంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు హీరో చేసే యాక్షన్ సీన్లు అదిరిపోతాయి. ముఖ్యంగా చివర్లో పాములతో వచ్చే సీన్స్ గూస్బంప్స్ తెప్పిస్తాయి. పార్ట్ 2 ఉన్నట్లుగా ప్రకటిస్తూ కథను ముగించారు. (Nagabandham Movie Positives, Negatives)ఎవరెలా చేశారంటే.. రెండో సినిమానే అయినా విరాట్ కర్ణ నటనపరంగా అదరగొట్టేశాడు. రుద్రగా, సాధువుగా రెండు విభిన్నమైన పాత్రలను పోషించి.. వేరియేషన్ చూపించాడు. ఇక నభా నటేష్‌కి మంచి పాత్ర లభించింది. ఇందులో డ్యూయెల్ రోల్ ద్విపాత్రాభినయం చేసి తనదైన నటనతో మెప్పించింది. విలన్‌గా రిషబ్ చాలా బాగా నటించాడు. ఒకరకమైన మేనరిజంతో నడుస్తూ..నవ్వుతూనే కొన్ని చోట్ల భయం పుట్టించాడు. ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్‌గా జగపతిబాబు మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. బైరాగీగా గరుడ రామ్ అదరగొట్టాడు. హీరో మరదలుగా ఐశ్వర్య మీనన్ తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా ఉన్నంత బాగానే నటించింది. అనసూయ, మురళీ శర్మ వంటి వారు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.సాంకేతికంగా సినిమా బాగుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు అద్భుతంగా ఉంది. ఆనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌తో పాటు ప్రతీ సెట్ చాలా వాస్తవికంగా..గుర్తుపట్టేలేనంతగా ఉంది. అంతే అందంగా సినిమాటోగ్రాఫర్ తెరపై చూపించాడు. నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. ‘నమో..నమో’సాంగ్ తెరపై చూస్తే..మరింత ఆకట్టుకుంటుంది. వీఎఫెక్స్ పర్వాలేదు. ఏఐని కూడా బాగానే వాడారు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఏ మాత్రం వెనకడాలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
వందకోట్ల బడ్జెట్ అవుతుందనుకోలేదు: అభిషేక్ నామా
‘‘నాగబంధం’ సినిమా మొదలు పెట్టినప్పుడు రూ. వంద కోట్ల బడ్జెట్ అవుతుందనుకోలేదు. నలభై కోట్లతో తీయొచ్చని అనుకున్నాం. అయితే సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, మేకప్స్, కాస్ట్యూమ్... ఇలా వీటన్నిటికీ బడ్జెట్ పెరిగింది. 20 శాతం పారితోషికాలకు, 80 శాతం ప్రొడక్షన్ కు ఖర్చు చేశాం. అయితే ఫైనల్ ఔట్పుట్ చూశాక మా యూనిట్ అంతా చాలా సంతృప్తిగా, సినిమా విజయంపై ఎంతో నమ్మకంతో ఉన్నాం’’ అని డైరెక్టర్ అభిషేక్ నామా తెలిపారు.విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘నాగబంధం– ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మించిన ఈ మూవీ నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా అభిషేక్ నామా గురువారం విలేకరులతో మాట్లాడుతూ–‘‘కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో వాల్ట్ బి గదిని ఎందుకు తెరవలేదనే దానిపై ఎన్నో కథలు ఉన్నాయి. ఆ గది తెరిస్తే అందులో ఏముంటుందో ఊహిస్తూ ఒక కథ చేస్తే బాగుంటుందనిపించి ‘నాగబంధం’ కథను రాశాను.అయితే ఈ సినిమా కోసం మేము అనంత పద్మనాభస్వామి ఆలయం పేరును వాడ లేదు. నా విజన్ ను నేనే డైరెక్ట్ చేస్తే బాగుంటుందని దర్శకత్వం వహించాను. కథ మీద నడిచే సినిమా ఇది. పెద్ద హీరో ఉంటే కొన్ని అంచనాలు ఉంటాయి. అందుకే ఎలాంటి అంచనాలు లేని విరాట్ కర్ణను ఎంపిక చేశాను. ఈ సినిమాతో తనకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. నిర్మాతలు కిషోర్, నిషితగార్లు బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు.నభా నటేష్ పార్వతి అనే వేద విద్యార్థిని పాత్రలో చాలా చక్కగా నటించింది. ఈ సినిమాలో గరుడ రామ్ చేసిన పాత్ర మేకప్‌కి ఏడు గంటలు పట్టేది. జగపతిబాబుగారు అద్భుతంగా నటించారు. జునైద్, అభి కొత్తవారైనా మంచి సంగీతం అందించారు. ప్రపంచ వ్యాప్తంగా 2500కి పైగా స్క్రీన్లలో ‘నాగబంధం’ రిలీజ్ అవుతోంది. నా దర్శకత్వంలో ‘నాగబంధం 2’ సినిమా కూడా ఉంటుంది’’అన్నారు. -
నాగబంధం ప్రమోషన్స్‌లో హీరోయిన్ నభా నటేష్.. (ఫొటోలు)
-
‘నాగబంధం’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
నాగబంధం కోసం ప్రాణం పెట్టి పనిచేశారు: నిర్మాత డి.సురేశ్ బాబు
‘‘నాగబంధం’ చాలా కాస్ట్లీ సినిమా. నేను రషెస్ చూశాను. టీమ్ అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. అభిషేక్ అద్భుతంగా ఈ చిత్రం తీశారు. నిర్మాతలు రాజీ పడకుండా ఖర్చుపెట్టారు. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ చాలా చక్కగా వర్క్ చేశారు. ఈ చిత్రం చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని నిర్మాత డి.సురేశ్ బాబు పేర్కొన్నారు. విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూ పొందిన సినిమా ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. నభానటేష్, ఐశ్వర్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌కు డి. సురేశ్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విరాట్ కర్ణ మాట్లాడుతూ–‘‘మన భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇది’’ అన్నారు. ‘‘ఈ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి గొప్ప సినిమాలు మరెన్నో వస్తాయి’’ అని చె ప్పారు అభిషేక్ నామా. ‘‘మా సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు కిషోర్ అన్నపురెడ్డి. ‘‘మా చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు నిశిత నాగిరెడ్డి. ఈ ఈవెంట్లో నభా నటేష్, నటుడు అంకిత్, ఆర్ట్ డైరెక్టర్ అశోక్, మ్యూజిక్ డైరెక్టర్స్ జునైద్ కుమార్, అభే, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ మాట్లాడారు. -
పాములంటే భయం లేదు.. వాటిని చూస్తూ భోజనం
పాముని చూడగానే చాలామంది తెగ భయపడిపోతారు. మరికొందరైతే పాము అనే మాట వింటే చాలా హడలిపోతారు. కానీ టాలీవుడ్ హీరోయిన్ నభా నటేశ్ మాత్రం తనకు పాములంటే అస్సలు భయం లేదని చెప్పింది. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. ఈమె నటించిన 'నాగబంధం' సినిమా ఈ శుక్రవారం(జూలై 03) థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్)'పాములంటే నాకు అస్సలు భయం లేదు. మాది చిక్‌మగళూరు. అక్కడ మా పూర్వీకుల ఇళ్లలో పాములు ఉండేవి. చెప్పాలంటే నేను, మా తమ్ముడు భోజనం చేస్తూ వాటిని చూసేవాళ్లం. కానీ పెద్దగా పట్టించుకునేవాళ్లం మాత్రం కాదు' అని నభా నటేశ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.కన్నడ అమ్మాయి అయిన నభా.. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగులోకి హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్, మ్యాస్ట్రో, డార్లింగ్ తదితర చిత్రాలు చేసింది. వీటిలో 'ఇస్మార్ట్ శంకర్' మాత్రమే హిట్ అయింది. కరోనా టైంలో ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దాదాపు రెండు మూడేళ్ల పాటు నటనకు దూరమైంది. అనంతరం ఈమె తెలుగులో స్వయంభు, నాగబంధం అనే భారీ బడ్జెట్ మూవీస్ చేసింది. 'నాగబంధం' రెండురోజుల తర్వాత రిలీజ్ కానుండగా.. స్వయంభు కూడా మరికొన్ని నెలల్లో థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: స్టార్ హీరోలు గమనిస్తున్నారా? 95 శాతం ఫ్లాపులు, డిజాస్టర్లే) -
ఒంటిపై ఏమీ లేకుండా యాక్షన్ సీన్.. బాడీ ఫ్రీజ్ అయిపోయింది: విరాట్ కర్ణ
చిత్ర పరిశ్రమలో నాకంటూ ఒక గుర్తింపు రావాలని ఎప్పుడూ అనుకుంటుంటాను. ఒక నటుడిగా నిరూపించుకునే అవకాశం నాకు ‘నాగబంధం’తో వచ్చింది. ఈ సినిమా కోసం ఎంతగానో శ్రమించాను. షూటింగ్ సమయంలో నాకు జ్వరం ఉన్నా కూడా ఎక్కడా వెనకడుగు వేయలేదు. ప్రాణం పెట్టి పనిచేశాను’ అన్నారు నటుడు విరాట్ కర్ణ. ఆయన హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జులై 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విరాట్ కర్ణ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ఇప్పటి వరకు నేను చేసిన రెండు సినిమాలు(పెద కాపు, నాగబంధం) భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. కెరీర్ ప్రారంభంలోనే ఇంత భారీ సినిమాలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. పెదకాపు ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఒక నటుడిగా 100 శాతం కష్టపడ్డాను. ఆ పాత్రకు కావాల్సిన ప్రతిదీ చేశాను. నటుడిగా మంచి ప్రసంశలు వచ్చాయి. ఆ సినిమా కంటే ఈ సినిమాకు రెట్టింపు కష్టపడ్డాను.→ అభిషేక్ నామా ‘నాగబంధం’ కథను సిద్ధం చేసుకుని, ఆ పాత్రకు తగ్గ నటుడి కోసం వెతుకుతున్నారు. ఆ పాత్రకు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్న కొత్త వ్యక్తి అయితే బాగుంటుందని అనుకున్నారు. ఆ సమయంలో నన్ను పిలిపించి మాట్లాడారు. నాకు కథ చాలా నచ్చింది. చాలా ఎగ్జైట్ అయ్యాను. అలా నాగబంధం జర్నీ మొదలైంది. తొలుత తక్కువ బడ్జెట్‌తోనే తీద్దాం అనుకున్నాం. సినిమా డెవలప్ చెందుతున్న కొద్దీ కంటెంట్ డిమాండ్ ప్రకారం బడ్జెట్ సైజ్ పెరుగుతూ రూ. 100 కోట్ల బడ్జెట్‌కి వచ్చింది.→ నాగబంధం కథ విన్నప్పుడే నా పాత్ర ఎలా ఉండాలో ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. రుద్ర, నాగసాధు పాత్రల గురించి చెప్పినప్పుడు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఇలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నానని అనిపించింది. వెంటనే పాత్రకు తగ్గట్టుగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాను. హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. డాన్స్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాను. పాత్రకు తగ్గట్టుగా నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. → ఇందులో నాగసాధు పాత్ర మేకప్ కి ఆరు గంటల సమయం పట్టేది. తీవ్రమైన చలికాలంలో షూటింగ్ చేశాం. ఒక సన్నివేశంలో పాత్ర ప్రకారం శరీరంపై ఏమీ ఉండకూడదు. ఒక యాక్షన్ సీన్ చేస్తున్నపుడు చలికి నా శరీరం పూర్తిగా ఫ్రీజ్ అయిపోయింది. వెంటనే నన్ను కారవాన్‌కు తీసుకెళ్లి మేకప్ తొలగించి, అపోలో ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన తర్వాత అంతా నార్మల్‌గా ఉందని చెప్పారు. మరుసటి రోజే షూటింగ్‌కు వెళ్లిపోయాను.→ ఈ సినిమాలోని రుద్ర పాత్ర కోసం 20 కిలోల బరువు పెరిగాను. తర్వాత నాగసాధువుగా కనిపించడానికి మరో ఐదు కిలోలు తగ్గాను. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాను. షూటింగ్ సమయంలో ప్రతిరోజూ ఒక శివాలయానికి వెళ్లి అభిషేకం చేసేవాడిని. షూటింగ్ పూర్తయ్యాక శివమాల కూడా ధరించాను. ఆ ప్రయాణంలో ఎన్నో శివాలయాలు సందర్శించాను.→ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ పాత్ర కోసం నా వైపు నుంచి 100 శాతం కష్టపడ్డాను. ఈ సినిమాలో ఒక్క యాక్షన్ సీన్‌కూ డూప్ ఉపయోగించలేదు. అన్ని యాక్షన్ సన్నివేశాలు నేనే స్వయంగా చేశాను.→ నభా నటేష్ పాత్రకి ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో కొన్ని సస్పెన్స్‌లు ఉన్నాయి. అవి మీరు తెరపై చూసినప్పుడే తెలుస్తాయి. ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. పాటలు విజువల్‌గా చాలా గ్రాండ్‌గా ఉంటాయి.→ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పటివరకు చూసిన వారందరూ చాలా మంచి రిపోర్ట్ ఇస్తున్నారు. అభిషేక్ నామాకి మాస్ పల్స్ బాగా తెలుసు. ఆయన తీసిన ప్రతి సన్నివేశం నాకు గూస్బంప్స్ కలిగించింది. ప్రేక్షకులు కూడా థియేటర్లలో విజువల్‌గా చాలా గ్రాండ్‌గా ఎంజాయ్ చేస్తారు.→ ఇకపై సంవత్సరానికి రెండు సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాను. త్వరలోనే కొత్త సినిమాలు ప్రకటిస్తాను. -
‘నాగబంధం’ మూవీ ట్రైలర్ ఈవెంట్లో మెరిసిన నభా నటేష్ (ఫొటోలు)
-
‘నాగబంధం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘నాగబంధం’ కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది
‘‘జీవితంలో ఎన్నో కలలు, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ, ఒక గొప్ప విజన్‌ను ఆచరణలోకి తీసుకురావాలంటే దాన్ని నమ్మే నిర్మాత అవసరం. మా నిర్మాత కిషోర్గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ‘నాగబంధం’ సినిమా కోసం ఆయన ఖర్చు చేసిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది’’ అని డైరెక్టర్ అభిషేక్ నామా తెలిపారు. విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నాగబంధం–ది సీక్రెట్ ట్రెజర్’. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మించిన ఈ మూవీ జూలై 3న విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్రదర్శకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో కనిపించే విజువల్ ఎఫెక్ట్స్ కూడా మన తెలుగు సాంకేతిక నిపుణులు రూపొందించినవే కావడం నాకు మరింత గర్వంగా ఉంది. విజువల్‌గా, సాంకేతికంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక గ్రాండ్ థియేట్రికల్ అనుభూతిని అందిస్తుంది’’ అని పేర్కొన్నారు. విరాట్ కర్ణ మాట్లాడుతూ– ‘‘మన పురాతన ఆలయాలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు, చరిత్రను తర్వాతి తరాలకు తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘మన సనాతన ధర్మం, చారిత్రక అంశాలను అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రం ‘నాగబంధం’. ఇలాంటి ఎపిక్ కథలో భాగం కావడం నాకు ఆనందంగా ఉంది’’ అన్నారు నభా నటేష్. ‘‘మేమంతా అభిషేక్‌గారి విజన్‌ను నమ్మి ఈ ప్రయాణంలో భాగమయ్యాం’’ అని ఐశ్వర్యా మీనన్ పేర్కొన్నారు. కిషోర్ అన్నపురెడ్డి మాట్లాడుతూ– ‘‘నాగబంధం’ కోసం అందరూ ఎంతో అంకితభావంతో పని చేశారు. ఆ మ్యాజిక్‌ను జూలై 3న ప్రేక్షకులు థియేటర్లలో చూస్తారు’’ అని తెలి΄ారు. ‘‘ఈ సినిమా మొత్తం ప్రయాణంలో దైవానుగ్రహం మాకు అండగా నిలిచింది. ఎన్ని సవాళ్లు వచ్చినా షూటింగ్ ఆగలేదు’’ అని నిషిత నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సంగీత దర్శకులు అబి–జునైద్, కెమెరామేన్ సౌందర్ రాజన్ మాట్లాడారు. -
కొత్తోళ్లతో రూ.100 కోట్ల సినిమా.. 'నాగబంధం' ట్రైలర్ రిలీజ్
రూ.100 కోట్ల బడ్జెట్ అనగానే సాధారణంగా పేరున్న హీరోలనే పెడుతుంటారు. కానీ ఒక సినిమాలో నటించిన అనుభవమున్న విరాట్ కర్ణ అనే కుర్రాడిని పెట్టి తీసిన చిత్రం 'నాగబంధం'. అనంత పద్మనాభ స్వామి బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. వచ్చే నెల 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. భారీతనంతో ఇది ఆకట్టుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా 'అతిరథి' తెలుగు రివ్యూ)ట్రైలర్ బట్టి చూస్తే అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోని స్వర్ణపుష్పం దక్కించుకునేందుకు కొందరు విలన్స్ ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయాణంలో హీరో వాళ్లకు సాయపడాల్సి వస్తుంది. తర్వాత ఏమైంది? హిమాలయాల్లో ఉండే నాగసాధువులు ఎందుకు వచ్చారు? లాంటి అంశాలే స్టోరీలా అనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లో భారీతనం కనిపించింది. యాక్షన్, రక్తపాతం కూడా గట్టిగానే చూపించారు. నభా నటేశ్ హీరోయిన్ కాగా అభిషేక్ నామా దర్శకుడు. ఇందులో నటించిన చాలామంది కొత్తవాళ్లే. వీళ్లపై రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టేశారు. మరి తెలుగు ప్రేక్షకుల్ని ఇది ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి?(ఇదీ చదవండి: రెండేళ్ల పాటు నరకం చూశా.. తినాలని ఉన్నా తినలేకపోయా: సమంత) -
హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)
-
ట్రెజర్ హంట్ కాన్సెప్ట్ ఆధారంగా...
విరాట్ కర్ణ హీరోగా నటించిన చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ నామా దర్శ కత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మంచిన ఈ సినిమా జూలై 3న రిలీజ్ కానుంది. నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు సన్నాహాలు మొదలయ్యాయి.‘‘ఈ సినిమా కథలోని ట్రెజర్ హంట్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఈ ప్రచార యాత్రను ప్లాన్ చేశాం. ప్రతి నగరంలో జరిగే కార్యక్రమంతో ఈ సినిమా ప్రపంచం, అందులోని రహస్యాలు, సాహస అంశాలను ప్రేక్షకులకు మరింత చేరువ చేయనున్నాం.ఈ ప్రచార యాత్రలో భాగంగా తొలి కార్యక్రమాన్ని ఈ నెల 19న హైదరాబాద్‌లో నిర్వహించి, ట్రైలర్ లాంచ్ చేస్తాం. ఆ తర్వాత జూన్ 20 నుంచి 23 వరకు ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించనున్నాం. జూన్ 26న వారణాసిలో ఈ సినిమాలోని ‘వీర నాగ’ పాటను రిలీజ్ చేస్తాం. జూన్ 28న హైదరా బాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
పవర్ఫుల్ లీలావతి
విరాట్ కర్ణ హీరోగా నటించిన సినిమా ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. నభా నటేష్, ఐశ్వర్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ నామా దర్శకత్వంలో ఎన్ ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా జూలై 3న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో లీలావతి పాత్రలో అనసూయ నటించినట్లు వెల్లడించి, ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమాలో అనసూయ పాత్ర పవర్‌ఫుల్‌గా, కీలకంగా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. రిషబ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాశ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. -
నభా నటేశ్ నాగబంధం మూవీ.. మరో సాంగ్ రిలీజ్
విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ ప్రధానపాత్రల్లో వస్తోన్న మూవీ నాగబంధం. ఈ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌తో పాటు టీజర్ కూడా చేశారు. వీటికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ పతాకంపై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. సుర సుర అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. కనకవ్వ, నల్గొండ గద్దర్, అనురాగ్ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సాహితి చాగంటి ఆలపించారు. ఈ పాటను జునైద్ కుమార్, అభే కంపోజ్ చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. -
నాగబంధం విడుదలపై ప్రకటన
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం నాగబంధం.. తాజాగా ఈ మూవీ విడుదలను మేకర్స్ ప్రకటించారు. ఇందులో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాష్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బిఎస్ అవినాష్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ నామా దర్శకత్వంలో ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ పతాకంపై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారందరికీ చిత్ర యూనిట్ గుడ్‌న్యూస్ చెప్పింది. జులై 3, 2026న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, మలయాళం, కన్నడలో విడుదల కానుందని ప్రకటించారు.కొద్దిరోజుల క్రితం టీజర్ విడుదల తర్వాత ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ కోసమే రూ. 20 కోట్లు ఖర్చు చేశారట. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా విజువల్ గా అద్భుతంగా చూపించేలా డిజైన్ చేశారు. -
నభా నటేశ్ నాగబంధం.. నమోరే సాంగ్ రిలీజ్
విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ ప్రధానపాత్రల్లో వస్తోన్న తాజా నాగబంధం. ఈ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. నమో రే నమోరే అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు శ్రీ హర్ష లిరిక్స్ అందించగా.. జునైద్ కుమార్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌ను సింధూజ శ్రీనివాసన్, ఐశ్వర్య దరూరిఆలపించారు. ఈ మూవీని ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ పతాకంపై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజైన నమో రే పాటను అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రతిబింబించే భారీ సెట్లో చిత్రీకరించారు. ఆ నారాయణుడిని కీర్తిస్తూ సాగే ఈ ఆధ్యాత్మిక పాటకు వెయ్యి మంది డ్యాన్సర్స్ పాల్గొనగా.. భారతీయ నృత్య కళల వైవిధ్యం, ఐక్యతను ప్రతిబింబించేలా అద్భుతమైన విజువల్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. -
వెయ్యిమంది డ్యాన్సర్లతో నమో రే
విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘నాగబంధం’. నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ నామా దర్శకత్వంలో ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ పతాకంపై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘నమో రే’ పాటను ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘‘అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రతిబింబించే భారీ సెట్లో ఈ పాటను చిత్రీకరించాం.ఆ నారాయణుడిని కీర్తిస్తూ సాగే ఈ ఆధ్యాత్మిక పాట ఈ చిత్రానికే ఓ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వెయ్యి మంది డ్యాన్సర్స్ పాల్గొనగా, భారతీయ నృత్య కళల వైవిధ్యం, ఐక్యతను ప్రతిబింబించేలా అద్భుతమైన విజువల్‌తో ఈ పాట ఉంటుంది.జునైద్ కుమార్ – అభే సంగీత సారథ్యంలోని ఈ ‘నమో రే’ సాంగ్‌కు శ్రీహర్ష ఇమాని సాహిత్యం అందించగా, సింధుజా శ్రీనివాసన్, ఐశ్వర్య దారురి ఆలపించారు. నభా నటేష్, ఐశ్వర్యా మీనన్‌ల సాంప్రదాయ వేషధారణ, నటనతో ఈ పాట విజువల్ గ్రాండియర్లా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
హీరో నిఖిల్ కౌంటర్ ఎవరికి? ఎందుకీ కామెంట్స్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో 'ఏఐ' అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. తమ చిత్రాల్లో ఎలాంటి సీన్లు.. ఈ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించాలేదని హీరోలు దర్శకనిర్మాతలు చెప్పుకొంటున్నారు. కష్టపడి విజువల్ ఎఫెక్ట్స్ చేయించామని అంటున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. యువహీరో నిఖిల్ మాత్రం ఏఐ గురించి చెబుతూనే మరో మూవీ గురించి కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)నిఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'స్వయంభు'. నాలుగు రోజుల క్రితం టీజర్ రిలీజ్ చేశారు. ఏమంత గొప్ప రెస్పాన్స్ అయితే రాలేదు. కంటెంట్ పర్లేదు అన్నప్పటికీ ఎక్కువమంది 'బాహుబలి'తో పోల్చి చూస్తున్నారు. హీరోహీరోయిన్ పాత్రలు అలానే ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అలానే టీజర్ క్వాలిటీపైనా కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో హెచ్డీఆర్ క్వాలిటీతో ఇప్పుడు మరోసారి టీజర్ అప్లోడ్ చేశారు. ఇదే విషయాన్ని ట్విటర్లో చెప్పిన నిఖిల్.. రీసెంట్గా వచ్చిన ఓ సినిమాలా మా దానిలో ఎలాంటి ఏఐ ఉపయోగించలేదు అని అన్నాడు.మరి నిఖిల్ ఏ సినిమా గురించి అన్నాడా? అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. సరిగ్గా నిఖిల్ ట్వీట్ చేసే సమయానికి 'నాగబంధనం' మూవీ టీజర్ రిలీజైంది. మరి ఈ చిత్రంపైనే నిఖిల్ కౌంటర్ వేశాడా అనిపిస్తోంది. ఎందుకంటే రెండు కూడా విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యమున్న సినిమాలే. ఈ వేసవిలోనే థియేటర్లలోకి వస్తున్నట్లు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్.. కావాలనే నెగిటివ్ అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడా అనిపిస్తుంది. బహుశా ఇదో రకం పబ్లిసిటీ టెక్నిక్ కావొచ్చేమో? చూడాలి మరి దీని గురించి నిఖిల్ ఏమని క్లారిటీ ఇస్తాడో?(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా) -
మహేశ్‌బాబు చేతులమీదుగా టీజర్.. అదిరిపోయేలా విజువల్స్
పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’ టీజర్ వచ్చేసింది. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘పెద్ద కాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా తాజాగా మహేష్‌బాబు చేతులమీదు టీజర్‌ను రిలీజ్ చేశారు.భారతదేశ చరిరత్రలో ఎన్నో పురాతనమైన రహస్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని నాగబంధం సంప్రదాయంతో ముడిపడి కాలగర్భంలో కలిసిపోయాయి. ఇదే కథను ఒక అద్భుతంలా తెరపై ఆవిష్కరించారు. 1750 నేపథ్యంలో భారీ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 2026 వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. -
నాగబంధం టీజర్ రిలీజ్.. దర్శకుడు ఎమోషనల్ నోట్
‘పెద్ద కాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా నేడు(ఫిబ్రవరి 15) ఉదయం 11:11 గంటలకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా ఈ మూవీ టీజర్ విడుదల అయింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర దర్శకుడు అభిషేక్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ నోట్ విడుదల చేశాడు. ఈ సినిమా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపామని.. టీజర్ నచ్చితే మా కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే అవుతుందంటూ ఓ సుదీర్ఘమైన లేఖను విడుదల చేశాడు. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ మహాదేవుని ఆశీస్సులతో మా చిత్రానికి సంబంధించిన వరల్డ్ ఆఫ్ నాగబంధం ఫస్ట్ టీజర్‌ను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ చిత్రం కేవలం రాసుకున్న కథ కాదు, ఏ చరిత్ర పుస్తకాల్లోనూ రాయని గాథ. ఈ కథను పూర్తిగా తెలుసుకొని రాయడానికి ఏన్నో నెలలు పట్టింది. ఈ కథ పూర్తిగా రాసిన తరువాతే ఊపిరిపీల్చుకోగలిగాము. ఈ కథను తెరపై ఎక్కించడానికి ఎన్నో నిశ్చబ్దాలను ఎదుర్కొంటూ, ఎన్నో నిద్రలేని రాతుల్రను గడిపాము.ఒక దర్శకుడిగా చెప్పాలంటే..ఈ టీజర్ అనేది విజువల్ మాత్రమే కాదు. అది మా ఊపిరిలో దాగిఉన్న శ్వాస. చాలాకాలం మా అంతరాత్మలో దాచుకొని మీ ముందుకు నిజంలా తీసుకొస్తున్న తొలి దృశ్యరూపం. మీరు చూసే ప్రతీ ఫ్రేమ్‌లోనూ మా కష్టం ఉంది. అది మీకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది. మాకు ఈ కథపై నమ్మకం, సనాతన ధర్మంపై విశ్వాసం, సినిమాపై ఉన్న ప్రేమే మా మార్గానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లింది.అలసిపోయిన రాత్రులు గడిపాము, ప్రశ్నలతో నిండిన రోజులు చూశాం. అయినా మేము ఆ ప్రశ్నల లోతులోకి తొంగి చూసి, వాటిని ఛేదిస్తూ ముందుకు సాగాము. కథను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దామో, అంతకంటే గొప్పగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని నమ్ముతున్నాము. ఆ మహాదేవునిపై ఉన్న దైవభక్తి మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించింది.మా ప్రయాణానికి వెన్నంటే ఉంటూ వెన్నెముకగా నిలిచిన మా నిర్మాతలు నిషిత, కిషోర్ గ్లారకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారు చూపించిన స్నేహపూర్వకమైన నమ్మకమే నా ధైర్యం. వారు నాకు చ్చిన ప్రోత్సాహమే నా బలం. ఇక మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, రానా దగ్గుబాటి గారి ప్రోత్సాహం, ఆశీర్వాదాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఇచ్చిన సపోర్ట్ మాటల్లో చెప్పలేను. రాతల్లో రాయలేను. మేము కోరుకునేది ఒక్కటే స్వచ్ఛమైన మనస్సుతో ఈ టీజర్‌ను వీక్షించండి. మీ మనస్సును తాకితే మా కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే. చివరిగా మీరు చూపించే ఆదరణే మా ఆయుధం. ఆ ఆయుధమే ఈ చిత్ర విజయానికి బాటలు వేసేలా చేస్తుందని భావిస్తున్నా’ అని అభిషేక్ నామా రాసుకొచ్చాడు. "#NAGABANDHAM IS NOT JUST ANOTHER MOVIE."With a heart filled with the deepest gratitude to everyone who supported me on this unforgettable journey,I am bringing the WORLD OF NAGABANDHAM before you at 11:11 AM.Let’s celebrate our history.Let’s celebrate our Sanatana Dharma.… pic.twitter.com/s0q3Lil6TJ— ABHISHEK PICTURES (@AbhishekPicture) February 15, 2026 -
టీజర్‌కి వేళాయె!
‘పెద కాపు’ మూవీ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నాగబంధం’. నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ వేసవిలో విడుదల కానుంది.ఈ మూవీ టీజర్ మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 15న రిలీజ్ కానుంది. అయితే విశేషం ఏంటంటే... హీరో మహేశ్‌బాబు చేతుల మీదుగా ఈ టీజర్‌ను లాంచ్ చేయించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకి కెమెరా: సౌందర్ రాజన్ ఎస్, సంగీతం: అభే, జునైద్ కుమార్, సీఈఓ: వాసు పోతిని. -
పవర్ఫుల్ అబ్దాలి
విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది.ఈ సినిమాలో అబ్దాలిగా ‘ఫైటర్’ మూవీ ఫేమ్ రిషబ్ సాహ్నీ చేస్తున్న లుక్‌ని రిలీజ్ చేశారు. ‘‘ఆఫ్ఘన్ సుల్తాన్ అబ్దాలి అనే పవర్ఫుల్ పాత్రను చేస్తున్నారు రిషబ్ సాహ్నీ. 1750 బ్యాక్‌డ్రాప్‌లోని ఈ చిత్రంలో భారత్‌లో అబ్దాలీ చేసిన దండయాత్రలు, దేవాలయాల దోపిడీ, అపార సంపద కోసం అతడు చేసిన క్రూర ప్రయత్నాలను ఈ పాత్రలో చూపించనున్నాం. ఈ నెల 15న టీజర్‌ని విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
పార్వతిగా నభా నటేష్
భారతదేశంలోని పురాతన విష్ణు దేవాలయాల నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందిన చిత్రం ‘నాగ బంధం’. ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామాలో విరాట్ కృష్ణ హీరోగా నటించారు. నభా నటేష్ హీరోయిన్ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ఆమె చేసిన పార్వతి పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. సంప్రదాయబద్ధంగా కనిపించే పార్వతిగా నభా లుక్ ఆకట్టుకునేలా ఉంది. అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్యా మీనన్ మరో కథానాయికగా నటించారు. ‘‘నాగబంధం సంప్రదాయంలోని పవిత్ర రహస్యాలను అన్వేషించే కథాంశంతో పురాణాలు, సస్పెన్స్, డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. ఉత్కంఠభరితంగా సాగే కథనంతో ఈ చిత్రాన్ని రూ΄÷ందించాం. ప్రస్తుతం ΄ోస్ట్ ్ర΄÷డక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవికి తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీగా విడుదల చేయనున్నాం’’ అని దర్శక–నిర్మాతలు తెలి΄ారు. -
యంగ్ హీరో సినిమా.. క్లైమాక్స్ కోసమే రూ. 20 కోట్లతో భారీ సెట్!
యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న తాజా పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నాగబంధం డివైన్, యాక్షన్, అద్భుతమైన విజువల్ ఫీస్ట్ తో ఒక మ్యాసీవ్ సినిమాటిక్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం టీం నానక్‌రామగూడలోని రామానాయుడు స్టూడియోలో గూస్బంప్స్ పుట్టించే క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తోంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించేందుకు మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారు. కేవలం క్లైమాక్స్ కోసమే 20 కోట్లు ఖర్చు చేస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా విజువల్ గా అద్భుతంగా చూపించేలా డిజైన్ చేశారు.అద్భుతమైన యాక్షన్‌కు ప్రసిద్ధిగాంచిన థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్‌డీని టీం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఆయన బెర్త్ టేకింగ్ యాక్షన్ కొరియోగ్రఫీతో సీక్వెన్స్ ని గ్రాండ్ గా తీర్చిదిద్దితున్నారు. ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలతో ఈ సీక్వెన్ అద్భుతంగా, విజువల్‌గా మైండ్ బ్లోయింగ్ ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో నభా నటేష్ , ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ,బి.ఎస్. అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
పెదకాపు హీరో మూవీ.. ఫస్ట్ లుక్ పోస్ట్ రిలీజ్ చేసిన రానా
పెదకాపు మూవీ ఫేమ్ విరాట్ కర్ణ(Virat Karrna) హీరోగా నటిస్తోన్న చిత్రం 'నాగబంధం– ది సీక్రెట్ ట్రెజర్'(Nagabandham Movie). డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాతో దర్శకుడిగా మారిన నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. భోగి పండుగ సందర్భంగా హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) చేతుల మీదుగా విరాట్ కర్ణ పోస్టర్‌ను రివీల్ చేశారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో విరాట్ సముద్రపు యాక్షన్ సన్నివేశంలో మొసలితో ఫైట్ చేస్తున్నట్లుగా కనిపించారు. ఈ మూవీలో రుద్ర పాత్రలో విరాట్ కర్ణ కనిపించనున్నారు.కాగా.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలు నాగబంధం ద్వారా రక్షించబడుతున్నాయనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ అభిషేక్ నామా తెలిపారు. ఈ చిత్రాన్ని ఎలక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పణలో ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్‌పై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మూవీకి అభే సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే నాగబంధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. So happy to present the first look of @ViratKarrna from #Nagabandham.Already feels like an exhilarating ride :)Best wishes to my dearest #AbhishekNama garu, @nikstudiosindia and the entire team!!!@AbhishekPicture #KishoreAnnapureddy@ViratKarrna @NabhaNatesh @Ishmenon… pic.twitter.com/GXSSNYdlcg— Rana Daggubati (@RanaDaggubati) January 13, 2025


