పవర్‌ఫుల్‌ అబ్దాలి | Rishabh Sahni look from Nagabandham has been released | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ అబ్దాలి

Feb 7 2026 12:13 AM | Updated on Feb 7 2026 12:13 AM

Rishabh Sahni look from Nagabandham has been released

విరాట్‌ కర్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కిషోర్‌ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది.

ఈ సినిమాలో అబ్దాలిగా ‘ఫైటర్‌’ మూవీ ఫేమ్‌ రిషబ్‌ సాహ్నీ చేస్తున్న లుక్‌ని రిలీజ్‌ చేశారు. ‘‘ఆఫ్ఘన్‌ సుల్తాన్‌ అబ్దాలి అనే పవర్‌ఫుల్‌ పాత్రను చేస్తున్నారు రిషబ్‌ సాహ్నీ. 1750 బ్యాక్‌డ్రాప్‌లోని ఈ చిత్రంలో భారత్‌లో అబ్దాలీ చేసిన దండయాత్రలు, దేవాలయాల దోపిడీ, అపార సంపద కోసం అతడు చేసిన క్రూర ప్రయత్నాలను ఈ పాత్రలో చూపించనున్నాం. ఈ నెల 15న టీజర్‌ని విడుదల చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement