బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే? | Blood Roses Movie Review In telugu | Sakshi
Sakshi News home page

Blood Roses Movie Review In telugu: బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Feb 6 2026 10:10 PM | Updated on Feb 6 2026 10:12 PM

Blood Roses Movie Review In telugu

ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్లడ్ రోజెస్. ఈ మూవీకి ఏంజీఆర్ దర్శకత్వం వహించారు. టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో హరీష్ కమర్తి నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ  సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..

హైదరాబాద్ నగరంలో  దేవి దాస్, భజరంగి దాస్ అనే ఇద్దరు లీడర్స్ ఉంటారు. వీరిద్దరు తమ కుమారులను వచ్చే ఎన్నికల్లో నిలబెడతారు. ఆ తర్వాత సిటీలో వరుస హత్యలు జరగడం మొదలవుతుంది. అదే సమయంలో ఈ వరుస హత్యలకు దేవి దాస్ కొడుకు మదన్‌కి సంబంధం ఉందని వార్తల్లో  వస్తుంది. దేవి దాస్ కొడుకు రాజకీయ జీవితం నాశనం చేయడానికి భజరంగి దాస్ ప్లాన్ చేసాడని దేవి దాస్ కార్యకర్తలు రోడ్ మీదకి వస్తారు.  ఈ కేసును సీఐ అరుణ్ గోగోయ్ చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. పొలిటికల్ ఒత్తిడితో అరుణ్ గోగోయ్ స్పెస్పెండ్ అవుతాడు. ఈ కేసు సీబీఐకి వెళ్తుండగా  హోమ్ మినిస్టర్‌ని కమిషనర్ రిక్వెస్ట్ చేసి అధిరను ఒప్పిస్తాడు. ఈ వరుస హత్యలను వెనక ఉన్నా హంతకుడిని అధిర ఎలా పట్టుకున్నది అనేదే అసలు కథ.

ఎలా ఉందంటే..

ఈ సినిమాలో మహిళలను తక్కువ చేయొద్దని.. వాళ్లు అన్నింటిలో సమానం అని  స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాగే ప్రేమించకూడదు.. ప్రేమిస్తే మోసం చేయకూడదని అమ్మాయి పాయింట్  అనే మెసేజ్ ఇందులో చూపించారు. అలాగే 2026లో డిఫరెంట్ పాయింట్‌తో ఈ సినిమా బ్లడ్‌ రోజెస్. వరుస హత్యల నేపథ్యంలో ఈ కథ సాగడం రోటీన్‌గా అనిపిస్తుంది. కథ నెమ్మదిగా సాగడంతో ఆడియన్స్‌కు అంతగా నచ్చదు.

డైరెక్టర్ యం. జి అర్ కథ, మాటలు స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నప్పటికీ తెరపై చూపించడంలో ఫెయిల్ అయ్యారు. తాను అనుకున్న పాయింట్‌ ఆడియన్స్‌ చెప్పడంలో కాస్తా తడబాటుకు గురయ్యారు. కన్నడతో రెండు సినిమాలు చేసిన ఆయన తెలుగు ఆడియన్స్‌కు మెప్పించే ప్రయత్నం చేశారు. ఈ మూవీలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. క్రైమ్ స్టోరీలు ఇష్టపడేవాళ్లకు కొద్దిగా నచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్‌గా చూస్తే రోటీన్‌ కథే. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్.


ఎవరెలా చేశారంటే..

ఇందులో అధిర క్యారెక్టర్ చేసిన అప్సర రాణి లుక్‌ అదిరిపోయింది. ఆమెకు ఈ మూవీ తర్వాత ప్రత్యేక మార్క్ ఉంటుంది. శాండల్ వుడ్ హీరో ధర్మాకీర్తి రాజు అరుణ్ గోగోయ్ పాత్రలో ఒదిగిపోయాడు.  శ్రీలు పృథ్విరాజ్ జనని క్యారెక్టర్‌లో ఫర్వాలేదనిపించింది. క్రాంతి కిల్లి మార్టిన్ క్యారెక్టర్ అదరగొట్టేశారు. ఈ సినిమాలో సుమన్, టార్జన్, ఘర్షణ శ్రీనివాస్, రాజేంద్ర, జూనియర్ రేలంగి, జగదేశ్వరి, మాణికుమార్  మాణిక్, జ్యోతి, అనిల్ కుమార్,ధ్రువ,నరేన్ తేజ్,ప్రగ్య,నవిత, లౌక్య,హాసిని,ఆనంద్  తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement